టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా యూఎస్‌ఏతో నిన్న (జూన్ 19) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మెరుపు అర్దశతకంతో (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే.
ఈ హాఫ్ సెంచరీతో డికాక్ ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ వికెట్‌కీపర్, బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో శ్రీలంక ఆల్‌టైమ్ గ్రేట్ కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు.
ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లు వీరే..
కుమార సంగక్కర (84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు)
క్వింటన్ డికాక్ (53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులు)
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (50 ఇన్నింగ్స్‌ల్లో 1636 పరుగులు)
జోస్ బట్లర్ (56 ఇన్నింగ్స్‌ల్లో 1550 పరుగులు)
ముష్ఫికర్ రహీం (61 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు)
కాగా, యూఎస్‌ఏతో నిన్న జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (74), మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఎస్‌ఏ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్), హర్మీత్ సింగ్ (38) యూఎస్‌ఏను గెలిపించేందుకు విపలయత్నం చేశారు. సౌతాప్రికా బౌలర్లలో కగిసో రబాడ (4-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేసి యూఎస్‌ఏను కట్టడి చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment