ICC tournament
-
CT 2025: షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు.. ముందే!
చాంపియన్స్ ట్రోఫీ -2025 నేపథ్యంలో పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆతిథ్య హక్కులను వేరే దేశంతో పంచుకునే క్రమంలో ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంలో తప్పులేదన్నాడు. అదే విధంగా.. టీమిండియా పాకిస్తాన్‌కు రాకపోయినా... పాక్ జట్టు మాత్రం భవిష్యత్తులో భారత్‌కు వెళ్లడమే ఉత్తమమని పేర్కొన్నాడు.కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను అక్కడికి పంపబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) స్పష్టం చేసింది. రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించాలని ఐసీసీకి తెలిపింది.ఐసీసీ వార్నింగ్.. దిగి వచ్చిన పాక్అయితే, పీసీబీ మాత్రం ఇందుకు నిరాకరించింది. భారత జట్టు తమ దేశానికి రావాల్సిందేనని పట్టుబట్టింది. బీసీసీఐ సైతం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలో పరిస్థితి చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన ఐసీసీ.. టీమిండియా మ్యాచ్‌లను పాక్ వెలుపల ఆడేందుకు వీలుగా హైబ్రిడ్ విధానాన్ని ప్రతిపాదించింది. అంతేకాదు.. రెవెన్యూపరంగానూ నష్టం కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.అయితే, పాక్ మాత్రం ఇందుకు కూడా అంగీకరించకుండా పంతానికి పోయింది. ఈ క్రమంలో ఐసీసీ హెచ్చరికలకు దిగకతప్పలేదు. ఒకవేళ పీసీబీ పట్టువీడకపోతే.. వేదిక మొత్తాన్ని తరలిస్తామని హెచ్చరించింది. దీంతో దిగి వచ్చిన పాక్.. ఎట్టకేలకు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించినా.. మూడు షరతులు విధించినట్లు సమాచారం.టీమిండియా ఇక్కడికి రాకున్నా.. పాకిస్తాన్ భారత్‌కు వెళ్లాలిఅందులో ప్రధానంగా.. భవిష్యత్తులో భారత్‌లో ఐసీసీ ఈవెంట్లు నిర్వహిస్తే తాము కూడా అక్కడికి వెళ్లబోమని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ స్పీడ్‌స్టర్ షోయబ్ అక్తర్ స్పందిస్తూ.. ‘‘ఆతిథ్య హక్కులు పంచుకునేందుకు ఒప్పుకొంటే.. అధిక ఆదాయం అడగటం న్యాయమే. అయినా పీసీబీ కనీసం దీనికోసమైనా పట్టుబట్టడంలో తప్పులేదు.అయితే, భవిష్యత్తులో భారత్‌లో ఈవెంట్లు నిర్వహిస్తే ఆడబోము అనడం మాత్రం సరికాదు. మనం వారికి స్నేహ హస్తం అందించాలి. మన జట్టు ఇండియాకు తప్పకుండా అక్కడికి వెళ్లాలి. అంతేకాదు.. అక్కడ వారిని ఓడించాలి. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ విషయంలో హైబ్రిడ్ విధానం ముందుగానే ఫిక్సయినట్లు అనిపిస్తోంది’’ అని పేర్కొన్నాడు.చదవండి: రాకాసి బౌన్సర్ వేసిన ఆసీస్ బౌలర్.. ఇచ్చిపడేసిన జైస్వాల్! -
ఇప్పటికీ ఆ రికార్డు గంగూలీ పేరిటే ఉంది..!
భారత క్రికెట్‌కు దూకుడును పరిచయం చేసిన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇవాళ (జులై 8) 52వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా గంగూలీ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డు గురించి తెలుసుకుందాం.క్రికెట్ చరిత్రలో వివిధ ఫార్మాట్లలో ఇప్పటిదాకా పదుల సంఖ్యలో ఐసీసీ టోర్నీలు జరగగా.. ఓ రికార్డు నేటికీ భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పేరిటే ఉంది. అదేంటంటే.. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు.1992లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ భారత కెప్టెన్‌గా ఐసీసీ టోర్నీల్లో ఆరు సెంచరీలు చేశాడు. ప్రపంచ క్రికెట్లో కెప్టెన్‌గా (ఐసీసీ టోర్నీల్లో) ఎవరూ ఇన్ని సెంచరీలు చేయలేదు. గంగూలీ తర్వాత ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అత్యధికంగా 5 సెంచరీ చేశాడు.పాంటింగ్ తర్వాత ఐసీసీ టోర్నీల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్ల జాబితాలో కేన్ విలియమ్సన్ (3), ఆరోన్ ఫించ్ (2), స్టీఫెన్ ఫ్లెమింగ్ (2), సనత్ జయసూర్య (2) ఉన్నారు.కాగా, 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో 424 మ్యాచ్‌లు ఆడిన గంగూలీ.. 38 సెంచరీలు, 107 అర్ద సెంచరీల సాయంతో 18000 పైచిలుకు పరుగులు చేశాడు. రిటైర్మెంట్ అనంతరం గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగానూ పని చేశాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు. గంగూలీని ముద్దుగా అందరూ దాదా (బెంగాలీలో అన్న అని అర్దం) అని పిలుస్తుంటారు. -
T20 World Cup 2024: గిల్‌క్రిస్ట్‌ను అధిగమించిన డికాక్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా యూఎస్ఏతో నిన్న (జూన్ 19) జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ క్వింటన్ డికాక్ మెరుపు అర్దశతకంతో (40 బంతుల్లో 74; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ హాఫ్ సెంచరీతో డికాక్ ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ క్రమంలో అతను దిగ్గజ వికెట్‌కీపర్, బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్‌ను అధిగమించాడు. ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ల జాబితాలో శ్రీలంక ఆల్‌టైమ్ గ్రేట్ కుమార సంగక్కర అగ్రస్థానంలో ఉన్నాడు.ఐసీసీ టోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్లు వీరే..కుమార సంగక్కర (84 ఇన్నింగ్స్‌ల్లో 2855 పరుగులు)క్వింటన్ డికాక్ (53 ఇన్నింగ్స్‌ల్లో 1685 పరుగులు)ఆడమ్ గిల్‌క్రిస్ట్ (50 ఇన్నింగ్స్‌ల్లో 1636 పరుగులు)జోస్ బట్లర్ (56 ఇన్నింగ్స్‌ల్లో 1550 పరుగులు)ముష్ఫికర్ రహీం (61 ఇన్నింగ్స్‌ల్లో 1500 పరుగులు)కాగా, యూఎస్ఏతో నిన్న జరిగిన తొలి సూపర్-8 మ్యాచ్‌లో సౌతాఫ్రికా 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. డికాక్ (74), మార్క్రమ్ (46), క్లాసెన్ (36 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (20 నాటౌట్) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.అనంతరం 195 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన యూఎస్ఏ.. నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఆండ్రియస్ గౌస్ (80 నాటౌట్), హర్మీత్ సింగ్ (38) యూఎస్ఏను గెలిపించేందుకు విపలయత్నం చేశారు. సౌతాప్రికా బౌలర్లలో కగిసో రబాడ (4-0-18-3) అద్భుతంగా బౌలింగ్ చేసి యూఎస్ఏను కట్టడి చేశాడు. -
టీ20 వరల్డ్‌కప్-2024కు టీమిండియా సై.. 11 ఏళ్ల కరువు తీరుస్తారా?
టీ20 వరల్డ్‌కప్-2024కు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. అందరి కళ్లు భారత జట్టుపైనే ఉన్నాయి.వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఖరి మొట్టుపై బోల్తా పడిన రోహిత్ సేన.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తుందోనని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీమిండియా కూడా పట్టుదలతో ఉంది. గత 11 ఏళ్లగా ఐసీసీ ట్రోఫీ భారత జట్టును ఊరిస్తోంది. టీమిండియా చివరగా 2013లో ధోని సారధ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఎలాగైనా గెలిచి.. తమ 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ బలాబలాలు పై ఓ లూక్కేద్దం.బ్యాటింగే మన బలం..ఈ మెగా టోర్నీలో భారత జట్టు గ్రూపు-ఎలో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతో పాటు ఐర్లాండ్,పాకిస్తాన్, యూఎస్ఎ, కెనడా వంటి జట్లు ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. తర్వాతి మ్యాచ్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడనుంది.ఇక ఈ మెగా ఈవెంట్లో భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగే అని చెప్పుకోవాలి. భారత వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికైన మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అదరగొట్టారు. ముఖ్యంగా బ్యాటర్లు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.టీమిండియా స్టార్ విరాట్ బ్యాటర్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. అతడితో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పర్వాలేదన్పించాడు. అతడి ప్రదర్శనలలో నిలకడలేనప్పటికి.. హిట్‌మ్యాన్ తనదైన రోజు ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించగలడు.అదే విధంగా వరల్డ్ టీ20 నెం1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైశ్వాల్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్లో సత్తాచాటిన సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లు కూడా వరల్డ్‌కప్ జట్టులో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే ఆంశం..అయితే భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో టాపర్డర్, మిడిలార్డర్ బలంగా కన్పిస్తున్నప్పటికి సరైన ఫినిషర్లు జట్టులో లేరు. ఐపీఎల్ సీజన్లో ఫస్ట్ హాఫ్‌లో అదరగొట్టిన దూబేకు ఫినిషర్ రింకూ సింగ్‌కు కాదని సెలక్టర్లు చోటిచ్చారు. కానీ సెకెండ్ హాఫ్‌లో దూబే పూర్తిగా తేలిపోయాడు.ఈ క్రమంలో జట్టు మెనెజ్‌మెంట్ దూబే మిడిలార్డర్లో ఆడుస్తుందా లేదా ఫినిషర్‌గా పంపుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇదే జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ఉండడంతో ఎవరిని ఫినిషర్‌గా ఉపయోగించాలో ఆర్ధం కాక మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్లో హార్దిక్ పాండ్యా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు జడేజా కూడా తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరి జట్టు మెనెజ్‌మెంట్ ఎవరికి ఫినిషర్ రోల్ ఇస్తుందో వేచి చూడాలి.అదే మన బలహీనత..ఇక బ్యాటింగ్ విభాగంతో పోలిస్తే బౌలింగ్ యూనిట్ కాస్త వీక్‌గా కన్పిస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన మహ్మద్ షమీ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. షమీ స్ధానాన్ని యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను సెలక్టర్లు భర్తీ చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి అర్ష్‌దీప్ బంతిని పంచుకోనున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో అర్ష్‌దీప్ 19 వికెట్లు పడగొట్టినప్పటికి.. పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. అతడి ఏకానమి 10 పైనే ఉంది. ఇక వరల్డ్‌కప్ ఎంపికైన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగితా ఎవరూ ఈ ఏడాది ఐపీఎల్లో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మహ్మద్ సిరాజ్ కూడా పూర్తిగా తేలిపోయాడు. 14 మ్యాచ్‌ల్లో సిరాజ్ 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక సిన్నర్లు విషయానికి వస్తే.. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇటీవల కుల్దీప్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్బుతంగా రాణిస్తున్నాడు. అదే జోరును ఐపీఎల్లో కూడా కొనసాగించాడు. కానీ అనుహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న చాహల్ మాత్రం ఐపీఎల్లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. చాహల్ 15 వికెట్లు పడగొట్టనప్పటికి 9.41 ఏకానమితో పరుగులిచ్చాడు. అక్షర్ పటేల్‌ను బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. అక్షర్‌కు తనదైన రోజున బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా ఉంది. మరోవైపు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా బంతిని పంచుకోనున్నారు. ఇక చివరగా భారత బ్యాటింగ్‌కు బౌలింగ్ కూడా తోడైతే ఈ టోర్నీలో మన జట్టుకు తిరిగుండదు. -
పదేళ్ల నుంచి ఇంతే.. ఆశలు రేకెత్తిస్తారు, ఆఖర్లో ఉసూరుమనిపిస్తారు..!
వన్డే వరల్డ్‌కప్ 2023లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్) బోల్తా పడి 140 కోట్ల మంది భారతీయులకు గుండెకోత మిగిల్చింది. సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా చేతులెత్తేయడం భారత్‌కు ఇది కొత్తేమీ కాదు. గత పదేళ్ల కాలంలో టీమిండియా తొమ్మిది ఐసీసీ టోర్నీల్లో సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓటమిపాలైంది. ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుస వైఫల్యాల తీరును పరిశీలిస్తే.. ఆయా టోర్నీల ఆరంభాల్లో చిచ్చరపిడుగుల్లా చెలరేగిపోయే భారత క్రికెటర్లు నాకౌట్ మ్యాచ్ అనగానే ఒత్తిడికి లోనై చతికిలపడతారు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో ఇదే తంతు కొనసాగుతుంది. వరల్డ్‌కప్ 2023లోనూ సెమీస్ వరకు ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్‌లో చేతులెత్తేశారు. ఎన్నో అంచనాల నడుమ ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన భారత ఆటగాళ్లు అన్ని విభాగాల్లో స్థాయికి తగ్గట్టుగా ఆడలేక ఓడారు. ఆశలు రేకెత్తించి, ఆఖర్లో ఊసూరుమనిపించడం టీమిండియా ఆటగాళ్లకు పరిపాటిగా మారింది. ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకోని టీమిండియా నెక్స్ట్ టైమ్ బెటర్ లక్ అంటూ సర్ధి చెప్పుకోవడం తప్పించి చేసిందేమీ లేదు. అభిమానులు సైతం ఇదే అనుకుంటూ ఆటగాళ్లకు మద్దతుగా నిలుస్తుండటంతో వారిలో సీరియస్‌నెస్ కొరవడింది. విచ్చలవిడిగా డబ్బు, పబ్లిసిటీ లభిస్తుండటంతో వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టే భారత క్రికెటర్లు ఇకనైనా అలసత్వం వీడాలి. లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా గెలుపును అంత సీరియస్‌గా తీసుకోదు. ఒత్తిడిలో ఎలా ఆడాలో ఆసీస్ ఆటగాళ్ల నుంచి మనవాళ్లు ఎంతైనా నేర్చుకోవాలి. ప్రతిభ గల జట్టును బెంచ్ మార్క్‌గా పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. అభిమానులకు ఇది కాస్త ఇబ్బందికరంగానే ఉండవచ్చు కానీ అనక తప్పదు. 2013 నుంచి ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రస్తానం.. 2014 టీ20 వరల్డ్‌కప్: ఫైనల్లో ఓటమి 2015 వన్డే వరల్డ్‌కప్: సెమీస్‌లో ఓటమి 2016 టీ20 వరల్డ్‌కప్: సెమీస్‌లో ఓటమి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: ఫైనల్స్‌లో ఓటమి 2019 వన్డే వరల్డ్‌కప్: సెమీస్‌లో ఓటమి 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఫైనల్లో ఓటమి 2022 టీ20 వరల్డ్‌కప్: సెమీఫైనల్లో ఓటమి 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్: ఫైనల్లో ఓటమి 2023 వన్డే వరల్డ్‌కప్: ఫైనల్లో ఓటమి -
డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమి.. గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ ఓపెనింగ్ బ్యాటర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవకపోవడానికి గల కారణాలను విశ్లేషించాడు. ఇతర దేశాల క్రీడా సంస్కృతికి భారత్‌లో జరుగుతున్న తంతుకు మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు. క్రికెట్లో వ్యక్తి పూజపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. జట్టు కంటే ఆటగాళ్లను ఎక్కువగా ఆరాధించే అభిమానుల వైఖరిపై మండిపడ్డాడు. జట్టు ఓడిపోయినా పర్వాలేదు, తమ ఆరాధ్య ఆటగాడు రాణిస్తే చాలనుకునే మనస్తత్వాన్ని ఫ్యాన్స్ వీడాలని పిలుపునిచ్చాడు. భారత దేశంలో క్రికెటర్లు క్రికెట్ కంటే ఎత్తుకు ఎదిగిపోయారని అన్నాడు. కొందరు క్రికెటర్లు తాము ఆట కంటే గ్రేట్ అని ఫీలవ్వడానికి అభిమానుల వైఖరే కారణమని తెలిపాడు. భారత క్రికెట్లో క్రికెటర్లను ఆరాధించే సంస్కృతి పోతే తప్ప టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవలేదని అభిప్రాయపడ్డాడు. జట్టు కంటే ఆటగాడు ఎప్పుడూ ఎక్కువ కాదని, ఈ విషయంలో భారత క్రికెట్ అభిమానులు ఇతర దేశాల ఫ్యాన్స్‌ను చూసి నేర్చుకోవాలని అన్నాడు. భారత్‌లో లాగా ఇతర దేశాల్లో క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా ఆరాధించరని, వ్యక్తిగత భజన కంటే వారికి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని తెలిపాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ దేశాల్లో ఈ సంస్కృతి ఉంది కాబట్టే ఆ జట్లు విశ్వవేదికపై భారత్ కంటే మెరుగ్గా రాణిస్తున్నాయని అన్నాడు. గంభీర్ చేసిన ఈ వ్యాఖ్యలు టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలను ఉద్దేశించి చేసినవిగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో భారత జట్టు నాలుగు సందర్భాల్లో ఫైనల్‌కు చేరినా నిరాశే మిగిలింది. నిన్న (జూన్ 11) ముగిసిన డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఆసీస్ చేతిలో 209 పరుగుల తేడాతో ఓటమిపాలై, నాలుగో సారి ఐసీసీ ట్రోఫీ గెలిచే అవకాశాన్ని చేజార్చుకుంది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (121) శతకాలతో చెలరేగడంతో 469 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ 270/8 స్కోర్ వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. ఇటు సోషల్ మీడియాలోనూ భారత్ ఓటమిని జీర్ణించుకోవట్లేదు అభిమానులు. తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు ఫ్యాన్స్. Indians trying to hold ICC trophy in last 10 yearspic.twitter.com/p0iK63TzK7— Sagar (@sagarcasm) June 11, 2023 చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా తొలి రోజే ఓడిపోయింది..! -
WTC Final 2023: ఐసీసీ ఫైనల్స్‌లో కొనసాగుతున్న టీమిండియా వైఫల్యాల పరంపర
ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో టీమిండియా వైఫల్యాల పరంపర కొనసాగుతుంది. 2014 నుంచి వరుసగా నాలుగు ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో (శ్రీలంక చేతిలో) ధోని సారధ్యంలో ఓటమిపాలైన భారత్.. ఆతర్వాత కోహ్లి నేతృత్వంలో 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో (పాకిస్తాన్ చేతిలో), అదే కోహ్లి సారధ్యంలో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో (న్యూజిలాండ్ చేతిలో), తాజాగా రోహిత్ శర్మ సారధ్యంలో 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో (ఆస్ట్రేలియా చేతిలో) ఓటమిపాలైంది. 2014 నుంచి నాకౌట్ మ్యాచ్‌ల్లో టీమిండియా పరిస్థితి దయనీయంగా ఉంది. నాటి నుంచి భారత జట్టు ఆడిన 8 ఐసీసీ నాకౌట్స్‌లో ఓటమిపాలైంది. 2014 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్స్ (శ్రీలంక చేతిలో), 2015 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ (ఆసీస్ చేతిలో), 2016 టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్స్ (విండీస్ చేతిలో), 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ (పాకిస్తాన్ చేతిలో), 2019 వన్డే వరల్డ్‌కప్ సెమీస్ (న్యూజిలాండ్ చేతిలో), 2021 డబ్ల్యూటీసీ ఫైనల్స్ (న్యూజిలాండ్ చేతిలో), 2022 టీ20 వరల్డ్‌కప్ సెమీస్ (ఇంగ్లండ్ చేతిలో), తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్ (ఆసీస్ చేతిలో) మ్యాచ్‌ల్లో టీమిండియా వరుసగా పరాజయాలపాలైంది. మరోవైపు ఆసీస్ ఏమో మూడు ఫార్మాట్లలో ఐసీసీ టైటిల్స్ నెగ్గిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో టీమిండియాపై ఆస్ట్రేలియా 209 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 444 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భారత్ 234 పరుగులకే ఆలౌటై, ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. 164/3 స్కోర్ వద్ద ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. 469 పరుగులకు ఆలౌట్ కాగా.. భారత్ 296 పరుగులకే చాపచుట్టేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 270/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేయగా... భారత్ 234 పరుగులకు ఆలౌటైంది. చదవండి: టీమిండియాకు ఘోర పరాభవం.. కనీస ప్రతిఘటన కూడా లేకుండా చేతులెత్తేసారు..! -
అన్ని ఫార్మాట్ల ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో తొలి సెంచరీలు చేసింది ఎవరు..?
నిన్న (జూన్ 7) ప్రారంభమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో సెంచరీ చేయడం ద్వారా ట్రవిస్ హెడ్ చరిత్ర పుటల్లోకెక్కాడు. ఈ ఆసీస్ ఆటగాడు డబ్ల్యూటీసీ ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్లో జరిగే ఐసీసీ మెగా ఈవెంట్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా హెడ్ రికార్డుల్లోకెక్కిన అనంతరం వివిధ ఫార్మాట్ల ఐసీసీ ఈవెంట్స్ ఫైనల్స్‌లో ఎవరు శతక్కొట్టారనే విషయంపై నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. వన్డే వరల్డ్‌కప్, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్‌లో ఎవరు తొలి సెంచరీ చేశారని ఆరా తీయగా.. వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తొలి సెంచరీ క్లైవ్ లాయిడ్ (1975 వరల్డ్‌కప్, వెస్టిండీస్), ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తొలి సెంచరీ ఫిలో వాలెస్ (1998, వెస్టిండీస్) పేరిట నమోదై ఉన్నాయి. టీ20 ఫార్మాట్ విషయానికొస్తే.. ఈ ఫార్మాట్లో జరిగే ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఇప్పటివరకు ఎవరూ సెంచరీ సాధించలేదు. టీ20 వరల్డ్‌కప్‌లో 11 సెంచరీలు నమోదైనప్పటికీ అన్నీ వివిధ దశల్లో వచ్చినవే. ఇదిలా ఉంటే, ఓవల్ వేదికగా నిన్న మొదలైన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియా పటిష్ట స్థితిలో ఉంది. ట్రావిస్ హెడ్ (146 నాటౌట్), స్టీవ్ స్మిత్ (95 నాటౌట్) సత్తా చాటడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. వార్నర్ (43), ఉస్మాన్ ఖ్వాజా (0), మార్నస్ లబూషేన్ (26) ఔటయ్యారు. షమీ, సిరాజ్, శార్దూల్‌కు తలో వికెట్ దక్కింది. చదవండి: డబ్ల్యూటీసీ ఫైనల్లో గెలుపెవరిది..? ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI)ను ఆశ్రయించిన ఆసీస్ -
WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..?
భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో చాలా ఆసక్తికర గణాంకాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా అలాంటి సమాచారమే మరొకటి, నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఐసీసీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్ని ఫైనల్ మ్యాచ్‌లు (వన్డే వరల్డ్‌కప్ (12), టీ20 వరల్డ్‌కప్ (8), డబ్ల్యూటీసీ (1), ఛాంపియన్స్ ట్రోఫీ (8)) జరిగాయి.. అందులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఎన్ని ఫైనల్స్ ఆడాయి (వేర్వేరుగా, కలిసి).. వాటిలో భారత్ ఎన్ని గెలిచింది, ఆస్ట్రేలియా ఎన్ని గెలిచింది అన్న సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటి వరకు మొత్తం 29 ఫైనల్ మ్యాచ్‌లు జరగ్గా, అందులో భారత్ 10 ఫైనల్స్‌లో పాల్గొనగా.. ఆస్ట్రేలియా 11 ఫైనల్ మ్యాచ్‌లు ఆడింది. భారత ఆడిన 10 ఫైనల్స్‌లో ఐదింట గెలుపొందగా.. ఆసీస్ ఆడిన 11 ఫైనల్స్‌లో ఎనిమిదింట విజయం సాధించింది. భారత్ ఆడిన ఐసీసీ ఫైనల్స్.. 1983 వన్డే వరల్డ్‌కప్: విండీస్‌పై భారత్ గెలుపు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమి 2002 ఛాంపియన్స్ ట్రోఫీ: శ్రీలంకతో పాటు సంయుక్త విజేత 2003 వన్డే వరల్డ్‌కప్: ఆస్ట్రేలియా చేతిలో ఓటమి 2007 టీ20 వరల్డ్‌కప్: పాకిస్తాన్‌పై గెలుపు 2011 వన్డే వరల్డ్‌కప్: శ్రీలంకపై గెలుపు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ: ఇంగ్లండ్‌పై గెలుపు 2014 టీ20 వరల్డ్‌కప్: శ్రీలంక చేతిలో ఓటమి 2017 ఛాంపియన్స్ ట్రోఫీ: పాకిస్తాన్ చేతిలో ఓటమి 2021 డబ్ల్యూటీసీ: న్యూజిలాండ్ చేతిలో ఓటమి ఆస్ట్రేలియా ఆడిన ఐసీసీ ఫైనల్స్.. 1975 వన్డే వరల్డ్‌కప్: విండీస్ చేతిలో ఓటమి 1987 వన్డే వరల్డ్‌కప్: ఇంగ్లండ్‌పై గెలుపు 1996 వన్డే వరల్డ్‌కప్: శ్రీలంక చేతిలో ఓటమి 1999 వన్డే వరల్డ్‌కప్: పాకిస్తాన్‌పై గెలుపు 2003 వన్డే వరల్డ్‌కప్: భారత్‌పై గెలుపు 2006 ఛాంపియన్స్ ట్రోఫీ: వెస్టిండీస్‌పై గెలుపు 2007 వన్డే వరల్డ్‌కప్: శ్రీలంకపై గెలుపు 2009 ఛాంపియన్స్ ట్రోఫీ: న్యూజిలాండ్‌పై గెలుపు 2010 టీ20 వరల్డ్‌కప్: ఇంగ్లండ్ చేతిలో ఓటమి 2015 వన్డే వరల్డ్‌కప్: న్యూజిలాండ్‌పై గెలుపు 2021 టీ20 వరల్డ్‌కప్: న్యూజిలాండ్‌పై గెలుపు -
చరిత్ర సృష్టించిన యూఏఈ క్రికెటర్.. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు
ICC WC League Two UAE VS NEP: యూఏఈ క్రికెటర్ ఆసిఫ్ అలీ ఖాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన అసోసియేట్ దేశ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ టు 2019-23లో భాగంగా ఇవాళ (మార్చి 16) నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 41 బంతుల్లోనే శతక్కొట్టిన ఆసిఫ్.. ఆసోసియేట్ దేశాల క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. 7వ నంబర్ ఆటగాడిగా బరిలోకి దిగి 11 సిక్సర్లు, 4 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన ఆసిఫ్ మొత్తంగా 42 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో (240.48 స్ట్రయిక్‌రేట్) అజేయంగా నిలిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ఓవరాల్‌గా చూసినా ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన క్రికెటర్ల జాబితాలో ఆసిఫ్ ఖాన్ నాలుగో స్థానంలో నిలిచాడు. వన్డేల్లో వేగవంతమైన సెంచరీ రికార్డు సౌతాఫ్రికా విధ్వంసకర వీరుడు ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. ఏబీడీ 31 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇతని తర్వాత వేగవంతమైన సెంచరీ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు కోరె ఆండర్సన్ పేరిట ఉంది. ఆండర్సన్ 36 బంతుల్లో శతకం బాదాడు. ఆతర్వాత పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (37 బంతుల్లో ), ఆసిఫ్ ఖాన్, మార్క్ బౌచర్ (44 బంతుల్లో), బ్రియాన్ లారా (45), జోస్ బట్లర్ (46), విరాట్ కోహ్లి (52) 3 నుంచి 8 స్థానాల్లో ఉన్నారు. పాక్‌లో పుట్టి యూఏఈ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న 33 ఏళ్ల ఆసిఫ్.. తన కెరీర్లో 16 వన్డేలు ఆడి సెంచరీ, 3 అర్ధసెంచరీల సాయంతో 439 పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. ఆసిఫ్ ఖాన్ (101 నాటౌట్) శతక్కొట్టుడు, అర్వింద్ (94), ముహమ్మద్ వసీం (63) బాధ్యతాయుత హాఫ్ సెంచరీల సాయంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. నేపాల్ బౌలర్లు దీపేంద్ర సింగ్ (8-2-19-2) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టాడు. రాజ్‌బన్సీ (10-0-27-1), సోమ్‌పాల్ కమీ (9-1-74-1), సందీప్ లామిచ్చెన్ (10-0-80-1) వికెట్లు దక్కించుకున్నారు. అనంతరం 312 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్ 29 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 172 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. కుశాల్ భుర్టెల్ (50) హాఫ్ సెంచరీతో రాణించగా.. భీమ్ షార్కీ (62 నాటౌట్), ఆరిఫ్ షేక్ (30 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నారు. నేపాల్ ఈ మ్యాచ్ గెలవాలంటే 21 ఓవర్లలో 139 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. -
విఫలమైతే ఆటగాళ్లను తిట్టండి.. ఐపీఎల్‌పై ఆడిపోసుకోవడమేంటి..?
ఐసీసీ టోర్నీల్లో టీమిండియా వైఫల్యాలకు ఐపీఎల్‌ను కారణంగా చూపుతున్న వారికి భారత మాజీ ఓపెనర్, లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. ఈ బీజేపీ ఎంపీ.. ఐపీఎల్‌ను విమర్శించే వారికి తనదైన శైలిలో ఘాటుగా సమాధానం చెప్పాడు. మెగా ఈవెంట్లలో భారత ఆటగాళ్లు విఫలమైన ప్రతిసారి కొందరు పనిగట్టుకుని ఐపీఎల్‌ను టార్గెట్ చేస్తున్నారని, ఐసీసీ టోర్నీల్లో విఫలమైతే ఆటగాళ్లను తిట్టాలి, వారి ప్రదర్శనపై మాట్లాడాలి కానీ, ఐపీఎల్‌పై ఆడిపోసుకోవడం ఏంటని విమర్శకులను నిలదీశాడు. భారత ఆటగాళ్లు ఫెయిల్ అయిన ప్రతిసారి ఐపీఎల్‌ను తిట్టడం ఫ్యాషన్ అయిపోయిందని.. ఎందరో క్రికెటర్లకు, నాన్ ప్లేయింగ్ స్టాఫ్‌కు అన్నం పెట్టే ఐపీఎల్‌పై నిరాధారమైన నిందలు వేయడం ఇకనైనా మానుకోవాలని హెచ్చరించాడు. భారత క్రికెట్‌కు ఎంతో మేలు చేసిన ఐపీఎల్.. ఎందరో ఆటగాళ్లకు ఆర్ధిక భరోసా ఇచ్చిందని, అలాంటి కల్పవృక్షాన్ని, ఆటగాళ్లు వైఫలమైన ప్రతిసారి టార్గెట్ చేయడం సబబు కాదని శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా అన్నాడు. కాగా, ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుండి (2008) టీమిండియా.. ఐసీసీ టోర్నీల్లో పెద్దగా రాణించలేకపోతుందన్నది కాదనలేని సత్యం. 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ మినహాయించి, 14 ఏళ్ల వ్యవధిలో భారత్ ఆడిన ప్రతి మెగా టోర్నీలో దారుణంగా విఫలమైంది. దీంతో టీమిండియా మెగా టోర్నీల్లో ఇంటిదారి పట్టిన ప్రతిసారి అభిమానులు, కొందరు మాజీలు, విశ్లేషకులు ఐపీఎల్‌నే టార్గెట్ చేశారు, చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా గంభీర్ ఐపీఎల్‌ను వెనకేసుకొచ్చినట్లు మాట్లాడటం భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆటగాళ్ల వైఫల్యాలకు ఐపీఎల్ కారణం కాదని గంభీర్.. తన గుండె మీద చెయ్యేసుకుని చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరికొందరైతే.. అతను బీజేపీ ఎంపీ కాబట్టి, వారి పరోక్ష పెత్తనంతో నడిచే లీగ్‌ను వెనకేసుకు రాక, నిన్ను, నన్ను వెనకేసుకొస్తాడా అని వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్లో రాణిస్తూ, జాతీయ జట్టుకు వచ్చే సరికి చేతులెత్తేస్తున్న తన జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్, బుమ్రా, రోహిత్ లాంటి వారు గంభీర్‌కు కనబడరా అని ప్రశ్నిస్తున్నారు. -
ICC Media Rights Auction: ఎన్ని వేల కోట్లో!
దుబాయ్: క్రికెట్‌కు కామధేనువు భారత మార్కెట్ నుంచి భారీగా ఆర్జించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సిద్ధమైంది. వచ్చే ఎనిమిదేళ్లలో (2023–2031 మధ్య) జరిగే ఐసీసీ టోర్నీలను భారత్‌లో ప్రసారం చేసేందుకు ఇచ్చే హక్కుల కోసం నేడు వేలం జరగనుంది. ఐపీఎల్ వేలం ద్వారా బీసీసీఐ జాక్‌పాట్ కొట్టడంతో ఇప్పుడు అదే తరహాలో ఐసీసీ వేలం నిర్వహించనుంది. టీవీ, డిజిటల్, టీవీ అండ్ డిజిటల్ అంటూ మూడు వేర్వేరు కేటగిరీల కోసం వేలం జరుగుతుంది. నాలుగేళ్ల కాలానికి లేదా ఎనిమిదేళ్ల కాలానికి హక్కులను కేటాయిస్తారు. 2023–2031 మధ్య పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 22 ఐసీసీ ఈవెంట్లు ఉన్నాయి. వన్డే, టి20 ప్రపంచకప్‌లతో పాటు చాంపియన్స్ ట్రోఫీ, అండర్–19 వరల్డ్‌కప్‌లు కూడా ఇందులో భాగమే. హక్కులను చేజిక్కించుకునేందుకు ప్రధానంగా ఐదు కంపెనీలు బరిలో నిలిచాయి. డిస్నీ స్టార్, సోనీ, జీ, వయాకామ్, అమెజాన్ సంస్థలు వేలంలో పెద్ద మొత్తం చెల్లించేందుకు పోటీ పడనున్నాయి. మొత్తంగా ఒక్క భారత మార్కెట్ నుంచి ఐసీసీ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 32 వేల కోట్లు) ఆశిస్తోంది. చదవండి: Asia Cup- Highest Run Scorers: టోర్నీ చరిత్రలో అతడే ఇప్పటి వరకు టాపర్! కానీ కోహ్లి మాత్రం.. ICC T20 WC 2022: భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. అభిమానులకు గుడ్‌న్యూస్ -
ICC auction: అసంబద్ధ వేలంలో పాల్గొనలేం
ముంబై: భారత్‌లో ఐసీసీ టోర్నమెంట్ల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎలక్ట్రానిక్ వేలం (ఇ–వేలం) నిర్వహించేందుకు ప్రముఖ ప్రసారకర్తల నుంచి టెండర్లు ఆహ్వానించింది. అయితే ఇ–వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాల్లో అస్పష్టమైన వివరాలే ఉన్నాయని, ఇలాంటి అసంబద్ధ టెండర్ల ప్రక్రియలో పాల్గొనలేమని భారతీయ బ్రాడ్కాస్టర్లు డిస్నీ–స్టార్, వయాకామ్–18, సోనీ, జీ నెట్వర్క్ సంస్థలు ఐసీసీకి లేఖ రాశాయి. టెండర్ల పత్రాల్లో పొందుపరిచిన అంశాల్లో మరింత స్పష్టత కావాలని లేఖలో కోరింది. ఇంచుమించు నాలుగు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు కూడా ఒకే రకంగా స్పందించాయి. ‘నాలుగు ప్రసారకర్తలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఐసీసీకి లేఖ రాశా యి. అమెజాన్ సంస్థ ఇందులో ఎలా ముందుకెళుతుందో అర్థం కావట్లేదు. స్పష్టతలేని అంశాలతో ఆ సంస్థ సంతృప్తిగా ఉందా లేదో తెలియదు. అలాంటపుడు ఆ సంస్థ ఎందుకంత ఉత్సాహంగా ముందకెళుతుందో మరి! మేం అయితే ఇప్పుడున్న టెండర్ల ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నాం. బిడ్లు దాఖలు చేయలేం’ అని ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ అధికారి తెలిపారు. ఐసీసీ కమిటీ మీటింగ్‌లలో పాల్గొనే భారత క్రికెట్ నియంత్రన మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా బ్రాడ్కాస్టర్లకు మరింత సమాచారం ఇవ్వాలని ఐసీసీని కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ మీడియా హ క్కుల కోసం బీసీసీఐ నిర్వహించిన ఇ–వేలం ప్రక్రియను అనుసరించేందుకు ఐసీసీ ఆసక్తిచూపడం లేదు. -
అస్సలు గ్యాప్ లేదుగా.. ఒకటి పోతే మరొకటి
Wasim Jaffer Dig ICC About Schedule For Upcoming Tournaments 2024-2031.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఏడేళ్ల కాలంలో ఐసీసీ ఎనిమిది మేజర్ టోర్నీలను నిర్వహించడానికి ప్లాన్ చేసింది. అందుకు సంబంధించి టోర్నీ నిర్వహించనున్న దేశాల జాబితాను మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన ఏడాదికి ఒకటి చొప్పున ఐసీసీ మేజర్ టోర్నీలు జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఐసీసీని ట్రోల్ చేస్తూ సూపర్ మీమ్‌తో మెరిశాడు. చదవండి: ICC 2024-2031 Events Schedule: ఒకటి అమెరికా.. మరొకటి పాకిస్తాన్.. మూడు ఇండియాలో ''టీమిండియా కప్ కొట్టలేదని భాదపడకండి.. రానున్న ఏడేళ్లు మనవే.. అసలు గ్యాప్ లేకుండా ఐసీసీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఒకదాంట్లో కప్ కొట్టకపోయినా పర్లేదు.. మరొకటి వెంటనే వచ్చేస్తుంది. చీర్ అప్'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు.. రెండు చాంపియన్స్ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. చదవండి: ICC T20 Rankings: బాబర్ అజమ్ నెంబర్‌వన్.. టీమిండియా నుంచి ఒక్కరు లేరు -
ఐసీసీ అధికారిక భాగస్వామిగా భారత్‌పే
దుబాయ్: డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్ కంపెనీ అయిన భారత్‌పే మూడేళ్ల కాలం పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధికారిక భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మేరకు సోమవారం ఐసీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా 2023 వరకు బ్రాడ్కాస్ట్, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై వీరి కలయికను భారత్‌పే ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అలాగే అభిమానులతో ఎప్పటికప్పుడు ఎంగేజ్ అవుతూ ప్రచారాలను సైతం నిర్వహించనుంది. కాగా, ఈ మూడేళ్ల కాలంలో చాలా ముఖ్యమైన ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తోపాటు పురుషుల టీ20 ప్రపంచకప్(2021, 2022), మహిళల వన్డే ప్రపంచకప్(2022), అండర్-19 ప్రపంచకప్(2022), వుమెన్స్ టీ20 వరల్డ్‌కప్ (2022), పురుషుల వన్డే ప్రపంచకప్(2023), ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్(2023).. ఇలా మూడేళ్లపాటు ఐసీసీ షెడ్యూల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే, ఇప్పటికే భారత్‌పే తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకునే పనిలో పడింది. 11 మంది క్రికెటర్లు ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, సురేశ్ రైనా, శ్రేయస్ అయ్యర్, పృథ్వీ షా, సంజు శాంసన్, చహల్, శుభ్‌మన్ గిల్ భారత్‌పేతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాగా, భారత్‌పేను అశ్నీర్ గ్రోవర్, శాశ్వత్ నక్రానీలు 2018లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీకి దాదాపు 100 నగరాల్లో 60 లక్షల మంది మర్చంట్లు ఉన్నారు. చదవండి: పాపం రాబిన్సన్.. క్షమించమని కోరినా కనికరించలేదు -
ఐసీసీ టోర్నీల్లో కీలక మార్పులు..
దుబాయి: 2023-2031 మధ్య ఎనిమిదేళ్ల కాలానికి సంబంధించిన ఫ్యూచర్టూర్స్ ప్రోగ్రామ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించింది. బోర్డు మెంబర్లతో మంగళవారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఐసీసీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న తరహాలోనే టీ20 ప్రపంచ కప్ రెండేళ్లకోసారి నిర్వహించాలని, అయితే అందులో16 జట్లకు బదులు 20 జట్లను ఆడించాలని నిర్ణయించింది. అలాగే 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ టోర్నీని 10 జట్లకు బదులు 14 జట్లతో జరిపించాలని, ప్రస్తుతం రెండేళ్లకోసారి జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీని, నాలుగేళ్లకోసారి జరపాలని ప్రకటించింది. 2019లో చివరిసారిగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో 10 పది జట్లు మాత్రమే పాల్గొనగా, 2027, 2031 ప్రపంచకప్‌లలో ఆ సంఖ్య 14కు పెంచాలని, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యను 54కు మార్చాలని ఐసీసీ నిర్ణయించింది. వన్డే ప్రపంచ కప్ ఫార్మాట్లో 14 జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-3 జట్లను సూపర్ సిక్స్‌గా పరిగణించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్నిర్వహిస్తారని ప్రకటించింది. ఐసీసీ.. 2003 ప్రపంచకప్‌లో ఇదే పద్ధతిని అనుసరించింది. అలాగే 2024, 2026, 2028, 2030లలో జరిగే టీ20 ప్రపంచ కప్‌లను 20 జట్లతో నిర్వహించి, మొత్తం మ్యాచ్‌ల సంఖ్యని 55కి పెంచనున్నట్లు పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ ఫార్మాట్లో 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించి, ప్రతి గ్రూప్‌లో టాప్-2 జట్లను సూపర్-8గా పరిగణించి, ఆతర్వాత నాకౌట్, సెమీస్, ఫైనల్స్నునిర్వహిస్తారని తెలిపింది. వీటితో పాటు ఎనిమిది జట్లతో నిర్వహించే ఛాంపియన్స్‌ట్రోఫీని ప్రతి నాలుగేళ్లకోసారి (2025, 2029), ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్‌ను రెండేళ్లకోసారి (2025, 2027, 2029, 2031) నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఛాంపియన్స్‌ట్రోఫీని గతంలో లాగే ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించి, ఆతర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహిస్తారని పేర్కొంది. చదవండి: శవాలతో రోడ్లపై క్యూ కట్టడం చూశాక నిద్రపట్టేది కాదు.. The ICC events schedule from 2024-2031 has a lot to look forward to 🙌 The Men's events cycle 👇 pic.twitter.com/iNQ0xcV2VY — ICC (@ICC) June 2, 2021 -
కోహ్లి అన్నీ గెలిపిస్తాడు: లారా
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ ఐసీసీ టోర్నీలన్నీ గెలుస్తుందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఐసీసీ మెగా ఈవెంట్లను గెలిపించే సత్తా, సామర్థ్యం కోహ్లికి ఉంది. ఈ టోర్నీల్లో ప్రత్యర్థులందరి లక్ష్యం భారతే అవుతుంది. టీమిండియాని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. భారత్‌తో జరిగే మ్యాచ్ తమకు కీలకంగా మిగతా జట్లు భావిస్తాయి. అంత పటిష్టంగా భారత జట్టు ఎదిగింది’ అని అన్నాడు. విరాట్ సారథ్యంలో భారత్ ఇటు టెస్టుల్లో అటు వన్డేల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిందని చెప్పాడు. తాను టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల అజేయమైన రికార్డును చెరిపేసే సత్తా ఆసీస్ ఓపెనర్ వార్నర్‌తో పాటు భారత స్టార్లు రోహిత్ శర్మ, కోహ్లిలకు ఉందని అన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే స్టీవ్ స్మిత్ మేటి బ్యాట్స్‌మన్ అయినప్పటికీ... తన రికార్డును చేరుకోలేడని... వార్నర్, కోహ్లి, రోహిత్‌లాంటి అటాకింగ్ బ్యాట్స్‌మెన్ చెరిపేస్తారని చెప్పాడు. -
మళ్లీ దాయాదుల సమరం
► చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి ప్రత్యర్థి పాకిస్తాన్ ► వచ్చే ఏడాది జూన్ 1నుంచి 18 వరకు టోర్నీ లండన్: ఐసీసీ టోర్నీలో భారత్, పాకిస్తాన్ మధ్య మరో మ్యాచ్ ఖరారు అయింది. వచ్చే ఏడాది జూన్ 1నుంచి 18 వరకు ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకుంటాయి. జూన్ 4న బర్మింగ్‌హామ్‌లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ వన్డే, టి20 ప్రపంచకప్‌లలో భారత్‌తో తలపడిన 11 సార్లూ ఓడిన పాకిస్తాన్... ఒక్క చాంపియన్స్ ట్రోఫీలోనే ఆధిక్యం ప్రదర్శించింది. ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్‌లు జరగ్గా...భారత్ 1 గెలిచి 2 ఓడింది. భారత్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది. టోర్నీకి సరిగ్గా ఏడాది ముందు ఐసీసీ బుధవారం చాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ విడుదల చేసింది. 30 సెప్టెంబర్, 2015నాటికి ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లు దీనికి క్వాలిఫై అయ్యాయి. మాజీ చాంపియన్ వెస్టిండీస్ తొలి సారి ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోగా... జింబాబ్వే కూడా దూరమైంది. జూన్ 1న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. రెండు గ్రూప్‌లనుంచి టాప్-2 జట్లు సెమీస్‌లోకి అడుగు పెడతాయి. 18న ఓవల్‌లో ఫైనల్ నిర్వహిస్తారు. 2004, 2013 తర్వాత ఇంగ్లండ్ చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడో సారి. గ్రూప్ ‘ఎ’ - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ గ్రూప్ ‘బి’ - భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక