టీ20 వరల్డ్‌కప్-2024కు కౌంట్ డౌన్ మొదలైంది. మరి కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్‌ల వేదికగా ఈ మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగనుంది. అందరి కళ్లు భారత జట్టుపైనే ఉన్నాయి.
వన్డే వరల్డ్‌కప్-2023లో ఆఖరి మొట్టుపై బోల్తా పడిన రోహిత్ సేన.. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో ఎలా రాణిస్తుందోనని అందరూ వెయ్యి కళ్లుతో ఎదురుచూస్తున్నారు. మరోవైపు టీమిండియా కూడా పట్టుదలతో ఉంది. గత 11 ఏళ్లగా ఐసీసీ ట్రోఫీ భారత జట్టును ఊరిస్తోంది.
టీమిండియా చివరగా 2013లో ధోని సారధ్యంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో ఎలాగైనా గెలిచి.. తమ 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ బలాబలాలు పై ఓ లూక్కేద్దం.
బ్యాటింగే మన బలం..
ఈ మెగా టోర్నీలో భారత జట్టు గ్రూపు-ఎలో ఉంది. ఈ గ్రూపులో టీమిండియాతో పాటు ఐర్లాండ్,పాకిస్తాన్, యూఎస్ఎ, కెనడా వంటి జట్లు ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్‌లో జూన్ 5న ఐర్లాండ్‌తో తలపడనుంది. తర్వాతి మ్యాచ్‌లో జూన్ 9న చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌తో తలపడనుంది.
ఇక ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు ప్రధాన బలం బ్యాటింగే అని చెప్పుకోవాలి. భారత వరల్డ్‌కప్ జట్టుకు ఎంపికైన మెజారిటీ ఆటగాళ్లు ఐపీఎల్-2024లో అదరగొట్టారు. ముఖ్యంగా బ్యాటర్లు ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ సీజన్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
టీమిండియా స్టార్ విరాట్ బ్యాటర్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్-2024లో విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. అతడితో పాటు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా పర్వాలేదన్పించాడు. అతడి ప్రదర్శనలలో నిలకడలేనప్పటికి.. హిట్‌మ్యాన్ తనదైన రోజు ప్రత్యర్ధి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించగలడు.
అదే విధంగా వరల్డ్ టీ20 నెం1 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, యశస్వీ జైశ్వాల్ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. మరోవైపు ఐపీఎల్‌లో సత్తాచాటిన సంజూ శాంసన్, రిషబ్ పంత్‌లు కూడా వరల్డ్‌కప్ జట్టులో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే ఆంశం.
.అయితే భారత జట్టు బ్యాటింగ్ లైనప్‌లో టాపర్డర్, మిడిలార్డర్ బలంగా కన్పిస్తున్నప్పటికి సరైన ఫినిషర్లు జట్టులో లేరు. ఐపీఎల్ సీజన్‌లో ఫస్ట్ హాఫ్‌లో అదరగొట్టిన దూబేకు ఫినిషర్ రింకూ సింగ్‌కు కాదని సెలక్టర్లు చోటిచ్చారు. కానీ సెకెండ్ హాఫ్‌లో దూబే పూర్తిగా తేలిపోయాడు.
ఈ క్రమంలో జట్టు మెనెజ్‌మెంట్ దూబే మిడిలార్డర్‌లో ఆడుస్తుందా లేదా ఫినిషర్‌గా పంపుతుందా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ఇదే జట్టులో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా ఉండడంతో ఎవరిని ఫినిషర్‌గా ఉపయోగించాలో ఆర్ధం కాక మెనెజ్‌మెంట్ తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.
ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్యా దారుణమైన ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు జడేజా కూడా తన స్దాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. మరి జట్టు మెనెజ్‌మెంట్ ఎవరికి ఫినిషర్ రోల్ ఇస్తుందో వేచి చూడాలి.
అదే మన బలహీనత..
ఇక బ్యాటింగ్ విభాగంతో పోలిస్తే బౌలింగ్ యూనిట్ కాస్త వీక్‌గా కన్పిస్తోంది. వన్డే ప్రపంచకప్‌లో అదరగొట్టిన మహ్మద్ షమీ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడం టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవాలి. షమీ స్ధానాన్ని యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను సెలక్టర్లు భర్తీ చేశారు.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లతో కలిసి అర్ష్‌దీప్ బంతిని పంచుకోనున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో అర్ష్‌దీప్ 19 వికెట్లు పడగొట్టినప్పటికి.. పరుగులు మాత్రం భారీగా సమర్పించుకున్నాడు. అతడి ఏకానమి 10 పైనే ఉంది. ఇక వరల్డ్‌కప్ ఎంపికైన బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మినహా మిగితా ఎవరూ ఈ ఏడాది ఐపీఎల్‌లో చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. మహ్మద్ సిరాజ్ కూడా పూర్తిగా తేలిపోయాడు.
14 మ్యాచ్‌ల్లో సిరాజ్ 15 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇక సిన్నర్లు విషయానికి వస్తే.. కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకున్నారు. ఇటీవల కుల్దీప్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అద్బుతంగా రాణిస్తున్నాడు. అదే జోరును ఐపీఎల్‌లో కూడా కొనసాగించాడు.
కానీ అనుహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్న చాహల్ మాత్రం ఐపీఎల్‌లో తన మార్క్‌ను చూపించలేకపోయాడు. చాహల్ 15 వికెట్లు పడగొట్టనప్పటికి 9.41 ఏకానమితో పరుగులిచ్చాడు. అక్షర్ పటేల్‌ను బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది. అక్షర్‌కు తనదైన రోజున బంతితో మ్యాచ్ స్వరూపాన్నే మార్చే సత్తా ఉంది. మరోవైపు హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా కూడా బంతిని పంచుకోనున్నారు. ఇక చివరగా భారత బ్యాటింగ్‌కు బౌలింగ్ కూడా తోడైతే ఈ టోర్నీలో మన జట్టుకు తిరిగుండదు.
Comments
Please login to add a commentAdd a comment