న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి సారథ్యంలో భారత్ ఐసీసీ టోర్నీలన్నీ గెలుస్తుందని వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా అన్నాడు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ ‘ఐసీసీ మెగా ఈవెంట్లను గెలిపించే సత్తా, సామర్థ్యం కోహ్లికి ఉంది. ఈ టోర్నీల్లో ప్రత్యర్థులందరి లక్ష్యం భారతే అవుతుంది. టీమిండియాని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంటాయి. భారత్‌తో జరిగే మ్యాచ్ తమకు కీలకంగా మిగతా జట్లు భావిస్తాయి. అంత పటిష్టంగా భారత జట్టు ఎదిగింది’ అని అన్నాడు. విరాట్ సారథ్యంలో భారత్ ఇటు టెస్టుల్లో అటు వన్డేల్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిందని చెప్పాడు. తాను టెస్టుల్లో నెలకొల్పిన 400 పరుగుల అజేయమైన రికార్డును చెరిపేసే సత్తా ఆసీస్ ఓపెనర్ వార్నర్‌తో పాటు భారత స్టార్లు రోహిత్ శర్మ, కోహ్లిలకు ఉందని అన్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే స్టీవ్ స్మిత్ మేటి బ్యాట్స్‌మన్ అయినప్పటికీ... తన రికార్డును చేరుకోలేడని... వార్నర్, కోహ్లి, రోహిత్‌లాంటి అటాకింగ్ బ్యాట్స్‌మెన్ చెరిపేస్తారని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment