ఐపీఎల్ 2025 సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా ఓంకార్ సాల్వి నియమితుడయ్యాడని తెలుస్తుంది. సాల్వి ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుత (2024-25) రంజీ సీజన్ ముగిసిన అనంతరం సాల్వి ఆర్సీబీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడని సమాచారం.
దేశవాలీ క్రికెట్‌లో సాల్వికి లో ప్రొఫైల్ మరియు ప్లేయర్ ఫేవరెట్ కోచ్‌గా పేరుంది. సాల్వికి ఐపీఎల్‌లో ఇది రెండో కమిట్‌మెంట్. గతంలో సాల్వి కోల్‌కతా నైట్‌రైడర్స్ అసిస్టెంట్ బౌలింగ్ కోచ్‌గా పని చేశాడు.
కాగా, సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు 2023-24 రంజీ సీజన్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇది రంజీల్లో ముంబైకు 42వ టైటిల్. ఈ సీజన్ ఫైనల్లో ముంబై విదర్భపై 102 పరుగుల తేడాతో గెలుపొందింది. ముంబైకు ఎనిమిదేళ్ల తర్వాత లభించిన తొలి రంజీ టైటిల్ ఇది.
సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా ముంబై ఈ ఏడాది ఇరానీ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. ముంబై ఇరానీ కప్ గెలవడం 27 తర్వాత ఇది తొలిసారి. ఇరానీ కప్ ఫైనల్లో ముంబై రెస్ట్ ఆఫ్ ఇండియాపై గెలిచింది. ముంబై ఒకే సీజన్‌లో రంజీ ట్రోఫీ, ఇరానీ కప్ గెలవడం చాలాకాలం తర్వాత ఇదే మొదలు.
ఓంకార్ సాల్వి సోదరుడు ఆవిష్కార్ సాల్వి భారత్ మహిళల క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆవిష్కార్ సాల్వి హెడ్ కోచ్‌గా ఉండగా పంజాబ్ క్రికెట్ జట్టు గత సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది.
ప్రస్తుతం 40ల్లో ఉన్న ఓంకార్ సాల్వి టీమిండియా తరఫున ఎప్పుడూ ఆడలేదు. సాల్వికి దేశవాలీ క్రికెట్‌లో కూడా అనుభవం తక్కువే. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సాల్వి కేవలం ఒకే ఒక మ్యాచ్ (2005లో రైల్వేస్ తరఫున) ఆడాడు. సాల్వి ఆథ్వర్యంలో ముంబై జట్టు ప్రస్తుత రంజీ సీజన్‌లో అద్బుత ప్రదర్శన చేస్తుంది. ఈ సీజన్‌లో ముంబై ఐదు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించి ఎలైట్ గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment