మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఓ భారీ రికార్డుపై కన్నేశాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ మరో 53 పరుగులు చేస్తే టెస్ట్‌ల్లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు.
టెస్ట్‌ల్లో భారత్ తరఫున ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్ (15,921), రాహుల్ ద్రవిడ్ (13,265), సునీల్ గవాస్కర్ (10,122) మాత్రమే 9000 పరుగుల మార్కును అధిగమించారు. టెస్ట్‌ల్లో ఈ ఏడాది పేలవ ఫామ్‌లో ఉన్న విరాట్ రేపటి నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో ఎలాగైనా ఈ రికార్డు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. టెస్ట్‌ల్లో ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సౌతాఫ్రికాపై చేసిన 46 పరుగులు.. బంగ్లాదేశ్‌పై చేసిన 47 పరుగులే ఈ ఏడాది అతనికి అత్యధికం.
ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌కు వరుణ గండం పొంచి ఉన్నట్లు తెలుస్తుంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బెంగళూరులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. వర్షం కారణంగా ఇవాళ జరగాల్సిన ప్రాక్టీస్ సెషన్ కూడా రద్దైంది.
న్యూజిలాండ్‌తో టెస్టులకు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్.
రిజర్వ్ ఆటగాళ్లు: హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
భారత్‌తో టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ టీమ్
డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, మార్క్ చాప్‌మన్, విల్ యంగ్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్(కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర, టామ్ బ్లండెల్, అజాజ్ పటేల్, బెన్ సియర్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, విలియం ఓ రూర్కే.
చదవండి: అరంగేట్రంలోనే సెంచరీ చేసిన పాక్ ప్లేయర్
Comments
Please login to add a commentAdd a comment