టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే.. ఏ జట్టుపై అయినా విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు.
బ్రాడ్‌మన్ 1930-1948 మధ్యలో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు చేయగా.. విరాట్ 2011-2024 మధ్యలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు. అడిలైడ్ టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్‌మన్ రికార్డు బద్దలవుతుంది.
బ్రాడ్‌మన్- ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు
విరాట్ కోహ్లి- ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు
జాక్ హాబ్స్- ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు
సచిన్ టెండూల్కర్- శ్రీలంకపై 9 సెంచరీలు
వివియన్ రిచర్డ్స్- ఇంగ్లండ్‌పై 8 సెంచరీలు
సునీల్ గవాస్కర్- ఇంగ్లండ్‌పై 7 సెంచరీలు
కాగా, విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి టెస్ట్‌ల్లో 30వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 81వ సెంచరీ.
ఇదిలా ఉంటే, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.
పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడగా.. బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ నడ్డి విరిచాడు.
Comments
Please login to add a commentAdd a comment