Don Bradman
-
బ్రాడ్‌మన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న ఓ ఆల్‌టైమ్ రికార్డుపై కన్నేశాడు. అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే.. ఏ జట్టుపై అయినా విదేశాల్లో అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా అవతరిస్తాడు. బ్రాడ్‌మన్ 1930-1948 మధ్యలో ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌పై 11 సెంచరీలు చేయగా.. విరాట్ 2011-2024 మధ్యలో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు. అడిలైడ్ టెస్ట్‌లో విరాట్ మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్‌మన్ రికార్డు బద్దలవుతుంది.బ్రాడ్‌మన్- ఇంగ్లండ్‌పై 11 సెంచరీలువిరాట్ కోహ్లి- ఆస్ట్రేలియాపై 10 సెంచరీలుజాక్ హాబ్స్- ఆస్ట్రేలియాపై 9 సెంచరీలుసచిన్ టెండూల్కర్- శ్రీలంకపై 9 సెంచరీలువివియన్ రిచర్డ్స్- ఇంగ్లండ్‌పై 8 సెంచరీలుసునీల్ గవాస్కర్- ఇంగ్లండ్‌పై 7 సెంచరీలుకాగా, విరాట్ కోహ్లి ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో అజేయ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఇది అతనికి టెస్ట్‌ల్లో 30వ సెంచరీ కాగా.. ఓవరాల్‌గా 81వ సెంచరీ.ఇదిలా ఉంటే, డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో తడబడ్డా రెండో ఇన్నింగ్స్‌లో విజృంభించి ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి సెంచరీలతో విరుచుకుపడగా.. బుమ్రా ఎనిమిది వికెట్ల ప్రదర్శనతో ఆసీస్ నడ్డి విరిచాడు. -
రూ. 2 కోట్ల 12 లక్షలకు...
సిడ్నీ: క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్‌కు ఊహించినట్లుగానే వేలంలో భారీ ధర పలికింది. 1947–48లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆయన ధరించిన ఈ క్యాప్‌పై వేలంలో పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఆసక్తి కనబరిచారు. స్వదేశంలో బ్రాడ్‌మన్‌కు ఇదే చివరి సిరీస్ కాగా... ఐదు టెస్టుల ఈ పోరులో 4 సెంచరీలు సహా బ్రాడ్‌మన్ ఏకంగా 715 పరుగులు సాధించడం విశేషం. పది నిమిషాల పాటు సాగిన వేలంలో చివరకు ఒక వీరాభిమాని 2 లక్షల 50 వేల డాలర్లకు (సుమారు రూ.2.12 కోట్లు) దీనిని సొంతం చేసుకున్నాడు. ఆ వ్యక్తి వివరాలను నిర్వాహకులు వెల్లడించలేదు. దాదాపు 77 ఏళ్ల క్రితం వాడి రంగులు వెలిసిపోయి, కాస్త చినిగిపోయిన ఈ టోపీ లోపలి భాగంలో బ్రాడ్‌మన్ పేరు రాసి ఉంది. ఇన్నేళ్ల తర్వాత కూడా బ్రాడ్‌మన్ విలువ ఏమిటో ఈ వేలం ధర చూపించింది. ఈ బ్యాగీ గ్రీన్ క్యాప్‌కు ఆసక్తికర నేపథ్యం ఉంది. భారత్‌తో సిరీస్ ముగిశాక బ్రాడ్‌మన్ క్యాప్‌ను భారత జట్టు మేనేజర్ పంకజ్ గుప్తాకు బహుమతిగా అందజేశారు. ఈ సిరీస్‌లో భారత జట్టు వికెట్ కీపర్, ఆ తర్వాత తన మేనకోడలిని పెళ్లాడిన ప్రబీర్ కుమార్ సేన్‌కు పంకజ్ గుప్తా ఇచ్చారు. అదే క్యాప్ ఇప్పుడు వేలానికి వచ్చింది. -
బ్రాడ్‌మన్ క్యాప్ విలువ రూ. 2 కోట్లు!
సిడ్నీ: భారత క్రికెట్ జట్టు 1947–48లో తొలిసారి ఆ్రస్టేలియా లో పర్యటించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విదేశీ గడ్డపై మనకు ఇదే తొలి సిరీస్. భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 టెస్టులు జరగ్గా ... ఆ్రస్టేలియా 4–0తో సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 178.75 సగటుతో 715 పరుగులు చేయగా... ఇందులో ఒక డబుల్ సెంచరీ సహా 4 సెంచరీలు, 1 అర్ధసెంచరీ ఉన్నాయి. బ్రాడ్‌మన్ తన కెరీర్లో భారత్‌పై ఆడిన సిరీస్ ఇదొక్కటే కావడం విశేషం. ఇప్పుడు ఈ సిరీస్‌లో బ్రాడ్‌మన్ ధరించిన ‘బ్యాగీ గ్రీన్’ క్యాప్ వేలానికి వచ్చింది. నేడు జరిగే ఈ వేలంలో ఈ క్యాప్‌నకు 2 లక్షల 60 వేల డాలర్లు (సుమారు రూ. 2.20 కోట్లు) పలకవచ్చని అంచనా. టెస్టు క్రికెట్ ఆడే ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఆకుపచ్చ రంగుతో కూడిన బ్యాగీ గ్రీన్‌లను అందజేస్తారు.సుదీర్ఘ కెరీర్లో చినిగిపోయి, రంగులు వెలసిపోయినా వారు దానినే ఉపయోగిస్తారు. అలాంటి క్యాప్‌లపై క్రికెట్ వర్గాల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇరవై ఏళ్ల తన టెస్టు కెరీర్లో 52 టెస్టుల్లోనే అనితరసాధ్యమైన 99.94 సగటుతో 6996 పరుగులు చేసిన బ్రాడ్‌మన్ 92 ఏళ్ల వయసులో 2001లో కన్నుమూశారు. -
బ్రాడ్‌మన్ రికార్డు సమం చేసిన కమిందు మెండిస్
శ్రీలంక యువ సంచలనం కమిందు మెండిస్ క్రికెట్ దిగ్గజాల రికార్డును సమం చేశాడు. టెస్ట్‌ల్లో తొలి 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు సెంచరీలు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్, జార్జ్ హెడ్లీ సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్, కమిందు, హెడ్లీ.. తమ తొలి 13 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశారు. ఇన్నింగ్స్‌ల పరంగా టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ఐదు సెంచరీల రికార్డు ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. వీక్స్ కేవలం 10 ఇన్నింగ్స్‌ల్లోనే ఐదు సెంచరీలు పూర్తి చేశాడు. ఆతర్వాత హెర్బర్ట్ సచ్‌క్లిఫ్, నీల్ హార్వే తొలి 12 ఇన్నింగ్స్‌ల్లో ఐదు సెంచరీలు చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేయడం ద్వారా కమిందు బ్రాడ్‌మన్ రికార్డు సమం చేశాడు. కమిందు తన కెరీర్లో తొలి 13 ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది సార్లు ఫిఫ్టి ప్లస్ స్కోర్లు చేశాడు. అలాగే తానాడిన తొలి ఎనిమిది టెస్ట్‌ల్లో కనీసం అర్ద సెంచరీ చేశాడు.న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో కమిందు మెండిస్‌తో (182 నాటౌట్) పాటు దినేశ్ చండీమల్ (116), కుసాల్ మెండిస్ (106 నాటౌట్) సెంచరీలతో కదంతక్కొడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 602 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లంక ఇన్నింగ్స్‌లో ఏంజెలో మాథ్యూస్ (88), కరుణరత్నే (46), ధనంజయ డిసిల్వ (44) కూడా రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. టిమ్ సౌథీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.ఫాస్టెస్ట్ 1000 రన్స్న్యూజిలాండ్తో రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 182 పరుగులతో అజేయంగా నిలిచిన కమిందు మెండిస్ టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కమిందు ఈ మార్కును కేవలం 13 ఇన్నింగ్స్‌లోనే తాకాడు. తద్వారా డాన్ బ్రాడ్‌మన్ సరసన నిలిచాడు. బ్రాడ్‌మన్ కూడా టెస్ట్‌ల్లో తన తొలి వెయ్యి పరుగులను 13 ఇన్నింగ్స్‌ల్లోనే రీచ్ అయ్యాడు. టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ 1000 పరుగుల రికార్డు హెర్బర్ట్ సచ్‌క్లిఫ్, ఎవర్టన్ వీక్స్ పేరిట ఉంది. వీరిద్దరు 12 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును తాకారు.చదవండి: భారత్‌తో టెస్ట్ మ్యాచ్.. బంగ్లాదేశ్ వీరాభిమానిపై దాడి.. ఆసుపత్రికి తరలింపు -
మూడు ఓవర్లలో 100 పరుగులు
క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ 1931, నవంబర్ 2వ తేదీన ఓ అరుదైన ఘనత సాధించాడు. కేవలం మూడు ఓవర్లలో 100 పరుగులు చేశాడు. అప్పట్లో ఓ ఓవర్‌కు ఎనిమిది బంతులు వేసేవారు. బ్రాడ్‌మన్ వరుసగా ఓవర్‌కు 33, 40, 27 పరుగులు చొప్పున సాధించాడు. బ్రాడ్‌మన్ ఈ 100 పరుగులను కేవలం 18 నిమిషాల వ్యవధిలో చేశాడని అంటారు. ఓ లోకల్ కౌంటీ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదైందని తెలుస్తుంది. బ్రాడ్‌మన్ మూడు ఓవర్లలో చేసిన పరుగుల్లో నాన్ స్ట్రయికర్ కేవలం రెండు సింగిల్స్ మాత్రమే తీసి స్ట్రయిక్ రొటేట్ చేశాడు. బ్లాక్ అనే బౌలర్ వేసిన తొలి ఓవర్లో బ్రాడ్‌మన్ వరుసగా 6, 6, 4, 2, 4, 4, 6, 1 పరుగులు చేశాడు. అనంతరం హోరీ బేకర్ అనే బౌలర్ వేసిన ఓవర్లో వరుసగా 6, 4, 4, 6, 6, 4, 6, 4 పరుగులు చేశాడు. తిరిగి బ్లాక్ వేసిన ఓవర్లో 1, 6, 6, 1, 1, 4, 4, 6 పరుగులు చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 14 సిక్సర్లు, 29 ఫోర్ల సాయంతో 256 పరుగులు చేసి ఔటయ్యాడు. -
బ్రాడ్‌మన్, కోహ్లిలను అధిగమించిన విలియమ్సన్
న్యూజిలాండ్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సెంచరీ సాధించడం ద్వారా టెస్ట్‌ల్లో 30 సెంచరీల మార్కును (97 మ్యాచ్‌ల్లో) తాకాడు. ఈ ఘనత సాధించే క్రమంలో దిగ్గజ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మన్, విరాట్ కోహ్లిల రికార్డులను అధిగమించాడు. టెస్ట్‌ల్లో బ్రాడ్‌మన్ (52 టెస్ట్‌లు), విరాట్ కోహ్లి (113 టెస్ట్‌లు) 29 సెంచరీలు చేయగా.. తాజా సెంచరీతో కేన్ వీరిద్దరిని దాటాడు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్లేయర్లలో కేన్, ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్‌తో (137 మ్యాచ్‌లు) సమానంగా 30 సెంచరీలు కలిగి ఉన్నాడు. యాక్టివ్ క్రికెటర్లలో అత్యధిక టెస్ట్ సెంచరీ రికార్డు స్టీవ్ స్మిత్ పేరిట ఉంది. స్మిత్ ఇప్పటివరకు 32 సెంచరీలు (107 టెస్ట్‌ల్లో) చేశాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సెంచరీల రికార్డు (యాక్టివ్ క్రికెటర్లలో) విరాట్ కోహ్లి పేరిట ఉంది. ప్రస్తుతం విరాట్ ఖాతాలో 80 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ జాబితాలో డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44), కేన్ విలియమ్సన్ (43) విరాట్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుత టెస్ట్ బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా కొనసాగుతున్న కేన్.. గత 9 టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో 5 సెంచరీలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే, సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో కేన్ విలియమ్సన్తో (112) పాటు వన్డే వరల్డ్‌కప్ సెన్సేషన్ రచిన్ రవీంద్ర (118) కూడా సెంచరీతో కదంతొక్కాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ అజేయ శతకాలతో ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. న్యూజిలాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 258 పరుగులుగా ఉంది. ఓపెనర్లు టామ్ లాథమ్ (20), డెవాన్ కాన్వే (1) ఔటయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో మొరేకీ, ప్యాటర్సన్ తలో వికెట్ పడగొట్టారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా.. న్యూజిలాండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టును ఎంపిక చేసింది. -
డాన్ బ్రాడ్‌మన్ తర్వాత ఈ పాక్ ఆటగాడే.. ఏకంగా 98.50 సగటు
పాకిస్తాన్ యువ బ్యాటర్ సౌద్ షకీల్ ప్రపంచ క్రికెట్లో సంచనాలు సృష్టిస్తున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో అజేయ డబుల్ సెంచరీ (208) బాదిన షకీల్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టే దిశగా అడుగులు వేస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో కనీసం 10 టెస్ట్ ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక యావరేజ్ (99.94) రికార్డు బ్రాడ్‌మన్ పేరిట ఉండగా.. షకీల్, బ్రాడ్‌మన్ వెనువెంటనే ఉన్నాడు. కెరీర్లో 11 ఇన్నింగ్స్‌ల తర్వాత షకీల్ సగటు 98.50గా ఉంది. డబుల్ సెంచరీకి ముందు అతని స్కోర్లు 32, 125 నాటౌట్, 55 నాటౌట్, 22, 53, 23, 94, 63, 76, 37గా ఉన్నాయి. 11 ఇన్నింగ్స్‌ల్లో షకీల్.. 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీ సాయంతో 788 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పాకిస్తాన్ మిడిలార్డర్ బ్యాటర్ సౌద్ షకీల్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంకలో డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన తొలి పాకిస్తాన్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో శ్రీలంకలో అత్యధిక స్కోర్ రికార్డు మహ్మద్ హఫీజ్ (196) పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో షకీల్.. హఫీజ్ రికార్డును తిరగరాశాడు. కెరీర్లో ఆడుతున్నది ఆరో టెస్ట్ మ్యాచే అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా బ్యాటింగ్ చేసిన షకీల్.. వ్యక్తిగత రికార్డుతో పాటు టెయిలెండర్ల సహకారంతో తన జట్టుకు అతిమూల్యమైన పరుగులు సమకూర్చాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (73/4) బరిలోకి దిగిన షకీల్.. అఘా సల్మాన్ (83), నౌమన్ అలీ (25), నసీం షా (78 బంతుల్లో 6) సాయంతో తన జట్టుకు భారీ స్కోర్ అందించాడు. షకీల్ సూపర్ డబుల్ సెంచరీతో కదం తొక్కడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 461 పరుగులకు ఆలౌటైంది. అనంతరం సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్‌మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
93 ఏళ్ల కిందటి బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్ ఓపెనర్
లార్డ్స్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఓ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 178 బంతుల్లో 24 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 182 పరుగులు చేసిన డకెట్.. 93 ఏళ్ల కిందట క్రికెట్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ నెలకొల్పిన ఓ రికార్డును బద్దలు కొట్టాడు. లార్డ్స్ మైదానంలో జరిగిన టెస్ట్‌ల్లో వేగవంతమైన 150 పరుగుల రికార్డు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉండేది. 1930లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్‌మన్ 166 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. నిన్నటి వరకు లార్డ్స్ టెస్ట్‌ల్లో ఇదే వేగవంతమైన 150గా ఉండేది. అయితే నిన్నటి ఇన్నింగ్స్‌తో డకెట్ ఈ రికార్డును బద్దలు కొట్టి నయా రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. డకెట్ కేవలం 150 బంతుల్లోనే 150 పరుగులు పూర్తి చేసి బ్రాడ్‌మన్ రికార్డుకు ఎసరు పెట్టాడు. Ben Duckett broke Don Bradman's record for the fastest Test 150 at Lord's 🔥 #ENGvIRE pic.twitter.com/ARQcLnCtYK — ESPNcricinfo (@ESPNcricinfo) June 2, 2023 ఓవరాల్‌గా ఫాస్టెస్ట్ 150 రికార్డు విషయానికొస్తే.. ఈ రికార్డు న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్ పేరిట ఉంది. మెక్కల్లమ్ 2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 103 బంతుల్లోనే 150 రన్స్ బాదాడు. ఆతర్వాత మహేళ జయవర్ధనే 111 బంతుల్లో, రాయ్ ఫ్రెడ్రిక్స్ 113 బంతుల్లో, హ్యారీ బ్రూక్ 115 బంతుల్లో 150 పరుగులు బాదారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం తడబడుతున్న ఐర్లాండ్ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 52 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసి, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 141 పరుగులు వెనుకపడి ఉంది. అంతకుముందు ఓలీ పోప్ (208 బంతుల్లో 205; 22 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో, బెన్ డకెట్ (178 బంతుల్లో 182; 24 ఫోర్లు, సిక్స్) భారీ శతకంతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ను 524/4 (82.4 ఓవర్లలో) స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తద్వారా 352 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. దీనికి ముందు స్టువర్ట్ బ్రాడ్ (5/51) ఐదేయడంతో ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌటైంది. చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్ -
కింగ్ ఈజ్ బ్యాక్.. ఆ ఇద్దరు దిగ్గజాల తర్వాత కోహ్లికే సాధ్యమైంది!
Virat Kohli Century India Vs Australia: రికార్డుల రారాజు విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్లో 75 సెంచరీలు పూర్తి చేసుకున్నాడు. తనకిష్టమైన ఫార్మాట్లో.. తనకిష్టమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై శతకంతో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ-2023 సిరీస్‌లో భాగంగా నాలుగో టెస్టులో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఉద్వేగానికి లోనైన కోహ్లి అహ్మదాబాద్‌లో నాలుగో రోజు ఆటలో భాగంగా 241 బంతుల్లో 100 పరుగులు స్కోరు చేసి దాదాపు 40 నెలలుగా ఊరిస్తున్న 28వ టెస్టు సెంచరీ సాధించాడు. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించి టెస్టుల్లో కింగ్ కోహ్లి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. దీంతో స్టేడియం మొత్తం కోహ్లి నామస్మరణతో మారుమ్రోగిపోయింది. ఈ క్రమంలో కోహ్లి బ్యాట్‌తో అభివాదం చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు. వాళ్ల తర్వాత కోహ్లికే సాధ్యమైంది కాగా ఆస్ట్రేలియాపై కోహ్లికి ఇది ఓవరాల్‌గా 16వ సెంచరీ. టెస్టుల్లో 8వది. ఈ క్రమంలో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక శతకాలు సాధించిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లి మూడో స్థానంలో నిలిచాడు. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ , ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు సచిన్ టెండుల్కర్- ఆస్ట్రేలియా మీద- 20 డాన్ బ్రాడ్‌మన్- ఇంగ్లండ్ మీద- 19 సచిన్ టెండుల్కర్- శ్రీలంక మీద- 17 విరాట్ కోహ్లి- ఆస్ట్రేలియా మీద 16* విరాట్ కోహ్లి- శ్రీలంక మీద- 16. చదవండి: WTC Final: టీమిండియాతో రేసులో దూసుకొస్తున్న లంక.. కివీస్ అద్భుతం చేస్తేనే.. Virat Kohli- Steve Smith: విరాట్ కెరీర్లో ఇదే తొలిసారి! కోహ్లి బ్యాట్ చెక్ చేసిన స్మిత్.. వైరల్ WTC- Ind VS Aus 4th Test: టీమిండియాకు ఊహించని షాక్! -
డాన్ బ్రాడ్‌మన్ రికార్డు బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్
AUS VS SA 3rd Test: సిడ్నీ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్‌లో ఆసీస్ స్టార్ ఆటగాడు, ఆ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పలు అరుదైన రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో శతకొట్టిన స్టీవ్ స్మిత్ (192 బంతుల్లో 104; 11 ఫోర్లు, 2 సిక్సర్లు).. కెరీర్లో 30వ సారి ఈ మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ రికార్డు పేరిట ఉన్న 29 శతకాల రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32) రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం స్మిత్.. మాథ్యూ హేడెన్‌తో (30) సమంగా మూడో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లలో రికీ పాంటింగ్ రికార్డు బద్దలు కొట్టే అవకాశం స్మిత్‌తో పాటు మార్నస్ లబూషేన్‌కు మాత్రమే ఉంది. ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉన్న లబూషేన్ 33 మ్యాచ్‌ల్లో 59.43 సగటున 10 సెంచరీల సాయంతో 3150 పరుగులు చేశాడు. ఆసీస్ తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా ఉన్నప్పటికీ.. వయసు పైబడిన రిత్యా వీరు మరో రెండు, మూడేళ్లకు మించి టెస్ట్‌ల్లో కొనసాగే అవకాశం లేదు. ప్రస్తుతం వార్నర్ ఖాతాలో 25, ఖ్వాజా ఖాతాలో 13 శతకాలు ఉన్నాయి. స్మిత్ శతకం సాధించిన మ్యాచ్‌లోనే ఖ్వాజా తన 13వ సెంచరీ నమోదు చేశాడు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో మూడో సెషన్ డ్రింక్స్ సమయానికి ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 475 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖ్వాజా (195) తన కెరీర్ తొలి డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు. మధ్యలో ట్రవిస్ హెడ్ (59 బంతుల్లో 70; 8 ఫోర్లు, సిక్స్) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఖ్వాజాకు జతగా మాట్ రెన్షా (5) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు తొలి రోజు డేవిడ్ వార్నర్ (10), లబూషేన్ (79) ఔటయ్యారు. సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఆసీస్ భారీ విజయాలు నమోదు చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆతిధ్య జట్టు.. రెండో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టెస్ట్ సిరీస్ తదుపరి జనవరి 12, 14, 17 తేదీల్లో ఇరు జట్లు 3 వన్డేల సిరీస్‌లో తలపడతాయి. -
ఆస్ట్రేలియా బ్యాటర్ అరుదైన ఘనత.. ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లాబుషేన్ టెస్టు క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలు రాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా లాబుషేన్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో లాబుషేన్ వెస్టిండీస్ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ సరసన నిలిచాడు. లాబుషేన్ 51 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించగా.. ఎవర్టన్ వీక్స్ కూడా ఈ మైల్‌స్టోన్‌ను 51 ఇన్నింగ్స్‌లోనే నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో 163 పరుగులు చేసిన లాబుషేన్ ఈ అరుదైన ఘనత సాధించాడు. ఇక ఈ రికార్డు సాధించిన జాబితాలో తొలి స్థానంలో ఆస్ట్రేలియా దిగ్గజం బ్రాడ్‌మన్ ఉన్నాడు. బ్రాడ్‌మాన్ కేవలం 33 ఇన్నింగ్స్‌లోనే 3 వేల పరుగుల రాయిని అందుకున్నాడు. లాబుషేన్ సెంచరీల మోత లాబుషేన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లోనూ సెంచరీలు సాధించిన లబుషేన్ తాజాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ శతకం నమోదు చేశాడు. కాగా ప్రస్తుతం టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో లబుషేన్ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. లబుషేన్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా తరఫున 30 టెస్టులు ఆడి 3010 రన్స్ చేశాడు. అందులో 10 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చదవండి: ENG vs PAK: పాకిస్తాన్ క్రికెట్లో మరో యువ సంచలనం.. అరంగేట్ర మ్యాచ్‌లోనే 7 వికెట్లు.. -
లబూషేన్, స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీలు.. పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్న హెడ్
పెర్త్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆతిధ్య ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మార్నస్ లబూషేన్ (350 బంతుల్లో 204; 20 ఫోర్లు, సిక్స్), స్టీవ్ స్మిత్ (311 బంతుల్లో 200 నాటౌట్; 16 ఫోర్లు) డబుల్ సెంచరీలతో, ట్రవిస్ హెడ్ (95 బంతుల్లో 99; 11 ఫోర్లు), ఉస్మాన్ ఖ్వాజా (149 బంతుల్లో 65; 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 598/4 స్కోర్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించిన స్టీవ్ స్మిత్.. తన కెరీర్లో నాలుగో సారి ఈ ఫీట్‌ను నమోదు చేయగా, లబూషేన్ తన 27 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడం ద్వారా స్మిత్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్ క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88వ టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. మరోవైపు ట్రవిస్ హెడ్.. ఈ ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. క్రెయిగ్ బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో 99 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన హెడ్.. పరుగు తేడాతో తన 5వ టెస్ట్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. హెడ్ ఔట్ కావడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్ ద్వారా విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ కొడుకు టగెనరైన్ చంద్రపాల్ టెస్ట్ అరంగేట్రం చేశాడు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసిన తర్వాత ఓపెనర్‌గా బరిలోకి దిగిన టగెనరైన్.. తాను ఎదుర్కొన్న తొలి బంతినే బౌండరీగా మలిచాడు. -
లబూషేన్ ద్విశతకం.. బ్రాడ్‌మన్ రికార్డును సమం చేసిన స్టీవ్ స్మిత్
రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న వెస్టిండీస్‌కు ఆసీస్ బ్యాటర్లు మార్నస్ లబూషేన్, స్టీవ్ స్మిత్ చుక్కలు చూపించారు. పెర్త్ వేదికగా నిన్న (నవంబర్ 30) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో లబూషేన్ ద్విశతకంతో (204), స్మిత్ అజేయమైన భారీ శతకంతో (189*) చెలరేగి విండీస్ బౌలర్లతో ఆటాడుకున్నారు. మ్యాచ్ తొలి రోజే సెంచరీ పూర్తి చేసుకున్న లబూషేన్ రెండో రోజు (డిసెంబర్ 1) మరింత జోరు పెంచి కెరీర్లో రెండో డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మరోవైపు 59 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన స్టీవ్ స్మిత్.. తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కెరీర్లో 29వ టెస్ట్ శతకాన్ని బాదాడు. ఈ క్రమంలో స్మిత్.. క్రికెట్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ రికార్డును సమం చేశాడు. బ్రాడ్‌మన్ తన 52 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 29 శతకాలు సాధించగా.. స్మిత్ తన 88 టెస్ట్ మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. అలాగే స్మిత్.. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన నాలుగో బ్యాటర్‌గా కూడా ప్రమోటయ్యాడు. 29 x 💯 Steve Smith showing no signs of slowing down! #MilestoneMoments#AUSvWI | @nrmainsurance pic.twitter.com/ebkgO2j8n5 — cricket.com.au (@cricketcomau) December 1, 2022 ఆసీస్ తరఫున అత్యధిక టెస్ట్ సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్ (41) టాప్‌లో ఉండగా.. స్టీవ్ వా (32), మాథ్యూ హేడెన్ (30) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. వీరి తర్వాత స్మిత్.. బ్రాడ్‌మన్‌తో కలిసి సంయుక్తంగా నాలుగో ప్లేస్‌లో ఉన్నాడు. ఓవరాల్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్.. 14వ స్థానంలో ఉండగా, సచిన్ 51 శతకాలతో అందరి కంటే ముందున్నాడు. ఇదిలా ఉంటే, విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసీస్ భారీ స్కోర్ దిశగా సాగుతుంది. లబూషేన్ ద్విశతకానికి తోడు స్మిత్ అజేయమైన భారీ శతకం, ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా (65), ట్రవిస్ హెడ్ (80 నాటౌట్) అర్ధశతకాలతో రాణించడంతో 148 ఓవర్లలో 568/3 స్కోర్ వద్ద ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. స్మిత్ డబుల్ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నాడు. -
"నన్ను డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారు.." ప్రగల్భాలు పలికిన బంగ్లా వికెట్ కీపర్
శ్రీలంకతో స్వదేశంలో జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఓ అరుదైన రికార్డు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ (105) చేసిన రహీమ్.. టెస్టుల్లో 5000 పరుగుల మైలురాయిని చేరుకున్న తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ రికార్డు సాధించానన్న గర్వంతో ఊగిపోతున్న రహీమ్ తాజాగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌లో తనను క్రికెట్ మాంత్రికుడు డాన్ బ్రాడ్‌మన్‌తో పోలుస్తారంటూ రహీమ్ ప్రగల్భాలు పలికాడు. ఈ సందర్భంగా రహీమ్ మాట్లడుతూ.. బంగ్లాదేశ్ తరఫున 5 వేల టెస్టు పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా నిలవడం గర్వంగా ఉంది. అయితే ఈ రికార్డును చాలామంది సీనియర్లు బద్దలు కొడతారు. బంగ్లా జట్టులో 8000, 10000 పరుగులు పూర్తి చేసే ఆటగాళ్లు కూడా ఉన్నారు. నేను బ్యాటింగ్ చేస్తుంటే బంగ్లాదేశీలకు బ్రాడ్‌మన్‌లా కనిపిస్తాను. అలా వారు అంటుంటే చాలా గర్వంగా ఉంటుంది అంటూ వ్యాఖ్యానించాడు. బంగ్లాదేశ్ తరఫున 81 టెస్టులు ఆడిన ముష్ఫికర్ రహీమ్ 36.8 సగటున 3 డబుల్ సెంచరీలు, 8 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5037 పరుగులు చేశాడు. మరోవైపు ఆసీస్ ఆల్‌టైం గ్రేట్ డాన్ బ్రాడ్‌మన్ 52 టెస్టుల కెరీర్లో 99.94 సగటున 29 సెంచరీల సాయంతో 6996 పరుగులు చేశాడు. ఈ క్రికెట్ దిగ్గజంతో రహీమ్‌కు పోలికేంటీ అని నెటిజన్లు బంగ్లాదేశీ వికెట్‌కీపర్‌ను తూర్పారబెడుతున్నారు. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
పాక్ వీరోచిత పోరాటం.. డబుల్ మిస్ అయినా కోహ్లిని అధిగమించిన బాబర్ ఆజమ్
PAK VS AUS 2nd Test: కరాచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్‌లో ఆతిధ్య పాకిస్థాన్ అద్భుతమైన పోరాట పటిమను కనబర్చింది. 506 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రికార్డు స్థాయిలో పరుగులు (443/7) చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (305 బంతుల్లో 96; 6 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ బాబర్ ఆజమ్ (425 బంతుల్లో 196; 21 ఫోర్లు, సిక్స్), వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ (177 బంతుల్లో 104 నాటౌట్; 11 ఫోర్లు, సిక్సర్) వీరోచితంగా పోరాడి ప్రత్యర్ధి చేతుల్లో నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. ఓ దశలో (బాబర్, రిజ్వాన్ క్రీజ్‌లో ఉండగా) పాక్ చారిత్రక విజయం సాధిస్తుందని అంతా ఊహించారు. అయితే, బాబర్ ఔట్ కావడంతో పాక్ డిఫెన్స్‌లో పడి మ్యాచ్ చేజారకుండా కాపాడుకోగలిగింది. పాక్ సారథి కళాత్మక ఇన్నింగ్స్ ఆడగా, రిజ్వాన్ చివరి దాకా క్రీజ్‌లో నిలిచి ఆసీస్ విజయానికి అడ్డుగోడలా నిలిచాడు. కాగా, ఈ మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయిన పాక్ కెప్టెన్.. ఓ అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డుల్లోకెక్కాడు. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్లు డాన్ బ్రాడ్‌మన్ (173*), రికీ పాంటింగ్ (156), టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (141)లను అధిగమించాడు. ఇదిలా ఉంటే, ఆసీస్, పాక్‌ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తాజాగా కరాచీలో జరిగిన రెండో టెస్ట్‌లోనూ అదే ఫలితం రిపీటైంది. ఈ నేపథ్యంలో ఈనెల 21 నుంచి 25 వరకు లాహోర్ వేదికగా జరిగే మూడో టెస్ట్ ఇరు జట్లకు కీలకం కానుంది. రెండో టెస్ట్ స్కోరు బోర్డు : ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 556/9 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ : 97/2 డిక్లేర్ పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్ : 148 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 443/7 చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా యుజ్వేంద్ర చహల్..! -
Ashes: స్టీవ్ స్మిత్ అరుదైన రికార్డు... బ్రాడ్‌మన్ వంటి దిగ్గజాలతో పాటుగా
Ashes Australia Vs England 4th Test: ఆస్ట్రేలియా బ్యాటింగ్ మాస్ట్రో స్టీవ్ స్మిత్ అరుదైన ఘనత సాధించాడు. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చరిత్రలో 3 వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా డాన్ బ్రాడ్‌మన్, అలెన్ బోర్డర్ వంటి దిగ్గజాలు ఉన్న ఎలైట్ గ్రూపులో చోటు దక్కించుకున్నాడు. యాషెస్ సిరీస్‌లో మూడు వేలకు పైగా పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో ఆరో స్థానంలో.. అదే విధంగా ఆసీస్ ప్లేయర్ల జాబితాలో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు ఇన్నింగ్స్‌తో ఈ ఫీట్ అందుకున్నాడు. స్మిత్ కంటే ముందు వరుసలో సర్ బ్రాడ్‌మన్(5028), హోబ్స్(3636), అలెన్ బోర్డర్(3222), స్టీవ్ వా(3173), గోవర్(3037) ఉన్నారు. కాగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 67, రెండో ఇన్నింగ్స్‌లో 23 పరుగులతో యాషెస్ సిరీస్‌లో 3002 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఐదో ఆటగాడిగా మరో రికార్డు దీనితో పాటు మరో రికార్డును కూడా స్మిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ మీద 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. బ్రాడ్‌మన్(5028), బోర్డర్(3548), గ్యారీ సోబర్స్(3214), స్టీవ్ వా(3200) తర్వాత స్టీవ్ స్మిత్ ఈ ఘనత సాధించాడు. చదవండి: Ashes: రెండేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. వరుస సెంచరీలు.. యాషెస్‌లో అన్‌స్టాపబుల్ ఖవాజా! Shot! Smith smacks Wood over the square leg boundary #Ashes pic.twitter.com/shPqKb39xu — cricket.com.au (@cricketcomau) January 8, 2022 -
ENG Vs IND: బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో రోహిత్ శర్మ
లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగోటెస్టులో రోహిత్ శర్మ సెంచరీ సాధించడం ద్వారా పలు రికార్డులు అందుకున్నాడు. విదేశాల్లో టెస్టుల్లో తొలిసారి సెంచరీ సాధించిన రోహిత్ శర్మ ఇంగ్లండ్ గడ్డపై ఒక రికార్డును అందుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రోహిత్ రెండో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ ఇంగ్లండ్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 9 సెంచరీలు నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఆసీస్ దిగ్గజ బ్యాట్స్‌మన్ డాన్ బ్రాడ్‌మన్ 11 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా 9 సెంచరీలతో రోహిత్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇక అంతకముందు టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ 8 సెంచరీల రికార్డును రోహిత్ అధిగమించాడు. ఇక మ్యాచ్‌లో నాలుగోరోజు ఆటలో టీమిండియా వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ వరుస ఓవర్లలో జడేజా(17), రహానే(0) పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం 200 పరుగుల ఆధిక్యంలో ఉన్న టీమిండియా స్కోరు 299/5గా ఉంది. చదవండి: Rohith Sharma: రోహిత్ సెంచరీ.. భార్య రితికా ముద్దుల వర్షం చెప్పాడంటే చేస్తాడంతే.. అంటున్న రోహిత్ అభిమానులు -
84 ఏళ్ల తర్వాత ఆ రికార్డు కనుమరుగు
చెన్నై: టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అరుదైన ఘనత సాధించాడు.1937లో టెస్టు క్రికెట్లో వరుసగా మూడుసార్లు 150కి పైగా రన్స్ చేసిన మొట్టమొదటి కెప్టెన్‌గా బ్రాడ్‌మన్ చరిత్ర సృష్టించగా.. 84ఏళ్ల తర్వాత 150 ప్లస్ స్కోర్లతో హ్యాట్రిక్ మైలురాయి అందుకున్న రెండో కెప్టెన్‌గా రూట్ నిలవడం విశేషం. ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. కెరీర్లో 100వ టెస్టు ఆడుతున్న రూట్ భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ సూపర్ ఫామ్‌లో రూట్ వరుసగా 228, 186 పరుగులతో చెలరేగాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదటి టెస్టులో ఇంగ్లండ్ భారీ స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. 8 వికెట్ల నష్టానికి 555 పరుగుల వద్ద రెండో రోజు ఆటను ముగించింది. కెప్టెన్ జో రూట్ డబుల్ సెంచరీ(218)తో ఆకట్టుకోగా, స్టోక్స్ 82 పరుగులతో రాణించాడు. ఇక రెండో రోజు ఆటలో భాగంగా టీమిండియా బౌలర్లు అశ్విన్ ఒక వికెట్ తీయగా, నదీం, ఇషాంత్ రెండేసి వికెట్లు కూల్చారు. ఇక 263 పరుగుల వద్ద పర్యాటక జట్టు తొలి రోజు ఆటను ముగించిన సంగతి తెలిసిందే. చదవండి: దేవుడా.. పెద్ద గండం తప్పింది పంత్ బంతి ఎక్కడుంది.. ఎటు పరిగెడుతున్నావు -
'ఇద్దరూ గొప్పే.. కానీ స్మిత్‌కే నా ఓటు'
సిడ్నీ : ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తన దృష్టిలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కంటే ఎక్కువ రేటింగ్ ఇస్తానంటూ ఆసీస్ మాజీ ఆటగాడు బ్రెట్ లీ స్పష్టం చేశాడు. జింబాబ్వే పేసర్ పోమ్మీ మబాంగ్వాతో జరిగిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న బ్రెట్ లీ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ' చూడండి.. స్మిత్, కోహ్లిలలో ఎవరు ఉత్తమం అనేది చెప్పడం కొంచెం కష్టమే.. ఎందుకంటే వారిద్దరి ఆటతీరులో లక్షణాలు చాలా దగ్గరగా ఉంటాయి. బౌలింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ ఇద్దరిలో ఎవైనా లోపాలు ఉన్నాయోమోనని చూడడానికి ప్రయత్నిస్తా.. కానీ ఈ ఇద్దరు బ్యాటింగ్‌లో నిజాయితీగా ఉంటారు. కోహ్లి టెక్నికల్ అంశంలో ఏ ఇబ్బంది ఉండదు. కెరీర్ మొదట్లో దూకుడైన ఆటతీరును కనబరిచేవాడు.. ఇప్పుడు మాత్రం అది కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే కెప్టెన్‌గా మాత్రం ఒక ఉన్నతస్థానంలో ఉంటాడు.. ఐపీఎల్ టైటిల్‌ను గెలవాలనే ఆకాంక్ష అతనిలో బలంగా ఉందని నేను అనుకుంటున్నా.(సోనూసూద్.. నువ్వు రియల్ హీరో’) ఇక స్మిత్ విషయానికి వస్తే కొన్ని సంవత్సరాల నుంచి అతని ఆటతీరు చూస్తున్నా.. కానీ గత 12 నెలల్లో అతని ఆటతీరులో ఎంతో మార్పు వచ్చింది. ఆటలో కచ్చితత్వం స్పష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు గొప్ప ఆటగాళ్లే.. అయినా ఈ సమయంలో మాత్రం నేను కోహ్లిని కాదని స్టీవ్ స్మిత్‌నే ఎన్నుకుంటాను. ఇంకా చెప్పాలంటే డాన్ బ్రాడ్‌మన్ కంటే స్మిత్ మంచి ఆటగాడిగా కనిపిస్తాడని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుందంటూ' బ్రెట్ లీ పేర్కొన్నాడు. (‘రవి భాయ్.. బిర్యానీ పంపించా తీసుకోండి’) -
బంతులే బుల్లెట్లుగా మారి...
డాన్ బ్రాడ్‌మన్ స్థాయి బ్యాట్స్‌మన్‌ను నిలువరించాలంటే ఏం చేయాలి? యాషెస్ సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ జట్టులో వ్యూహరచన జరుగుతోంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఏకంగా 974 పరుగులతో చెలరేగాడు. పైగా రాబోయే మ్యాచ్‌లు జరిగేది ఆస్ట్రేలియా గడ్డపైనే. మళ్లీ ఓటమిని ఆహ్వానించాల్సిందే అనుకుంటున్న తరుణంలో ఇంగ్లండ్ కెప్టెన్ డగ్లస్ జార్డయిన్ మదిలో ఒక ఆలోచన వచ్చింది. అతను తన ఆలోచనను చెప్పి అందరితో ఒప్పించాడు. చివరకు ఆ సిరీస్ అత్యంత వివాదాస్పదంగా నిలిచేందుకు ఆ నిర్ణయం కారణమైంది. అదే బాడీలైన్ బౌలింగ్. బంతులను బ్యాట్స్‌మెన్ శరీరానికి గురి పెట్టి గాయపర్చడమే లక్ష్యంగా సాగిన సిరీస్ చివరకు ఇంగ్లండ్‌కు కావాల్సిన ఫలితాన్ని అందించింది. అంతకుముందు సిరీస్‌లో బ్రాడ్‌మన్ అద్భుతంగా ఆడినా... లెగ్‌సైడ్ బంతులను ఆడటంలో అతను కొంత ఇబ్బంది పడినట్లు, శరీరంపైకి దూసుకొస్తే ఆడలేకపోయినట్లు ఇంగ్లండ్ ఆటగాళ్లు గుర్తించారు. తమ ప్రణాళికను అమలు చేసేందుకు కచ్చితత్వం, అమిత వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లను జార్డయిన్ ఎంచుకున్నాడు. వారిలో ముఖ్యంగా లార్వుడ్ తమ వ్యూహం ప్రకారం చెలరేగి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇలా అమలైంది... ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు టెస్టులు మామూలుగానే సాగాయి. బాడీలైన్ వాడకుండానే ఇంగ్లండ్ తొలి మ్యాచ్ నెగ్గింది (బోర్డుతో గొడవల కారణంగా బ్రాడ్‌మన్ ఈ టెస్టు ఆడలేదు). పునరాగమనం చేసిన బ్రాడ్‌మన్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో తర్వాతి టెస్టును గెలిపించి సిరీస్‌ను 1–1తో నిలిపాడు. అసలు సమరం అడిలైడ్‌లో జరిగిన మూడో టెస్టులో మొదలైంది. సాధారణంగా బ్యాట్స్‌మన్ క్రీజ్‌లో నిలబడే చోట లెగ్‌స్టంప్ పైకి ఇంగ్లండ్ బౌలర్లు అమిత వేగంగా బంతులు విసిరారు. లార్వుడ్ అయితే నిరంతరాయంగా వంద మైళ్ల వేగంతో బౌలింగ్ చేసినట్లు చెబుతారు. శరీరంపైకి దూసుకొచ్చే వీటిని ఆడాలంటే బ్యాట్స్‌మెన్‌కు అగ్ని పరీక్షే. ఆఫ్‌సైడ్ వైపు జరిగితే స్టంప్స్ లేచిపోతాయి. తప్పించుకునేందుకు వంగినా, కదలకుండా ఆగిపోయినా తీవ్రంగా గాయపడక తప్పదు. సాహసించి షాట్ ఆడితే ఆన్‌సైడ్‌లో ఉండే ఫీల్డర్ చేతుల్లో బంతి పడుతుంది. అప్పుడు లెగ్ సైడ్ నిబంధనలు ఏమీ లేవు కాబట్టి ఏకంగా 9 మంది ఫీల్డర్లను కూడా అటువైపే నిలబెట్టి ఇంగ్లండ్ ఆటగాళ్లు బౌలింగ్ చేశారు. గాయాల గేయాలు... ప్రధానంగా బ్రాడ్‌మన్‌ను అవుట్ చేయడమే ఇంగ్లండ్ లక్ష్యమైనా... ఇతర ప్రధాన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బిల్ వుడ్ఫిల్, పాన్స్‌ఫోర్డ్, అలన్ కిపాన్స్ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన ఈ అనూహ్య వ్యూహరచనకు వారి వద్ద సమాధానం లేకపోయింది. గాయాల నుంచి తప్పించుకోగలిగినా బ్రాడ్‌మన్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. ఛాతీకి కాస్త పైన తగిలిన దెబ్బతో బిల్ వుడ్ఫిల్ విలవిల్లాడిపోయాడు. బెర్డ్ ఓల్డ్‌ఫీల్డ్ తల పగిలింది. ఇక తప్పనిసరిగా వైద్య చికిత్స అవసరమైన బ్యాట్స్‌మెన్ జాబితా పెద్దదే. వీరితో పాటు బయటకు చెప్పని, కనిపించని గాయాలు ఎన్నో ఆసీస్ బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఓర్చుకున్నారు. ముదిరిన వివాదం... ఇంగ్లండ్ వ్యవహారంపై ఆస్ట్రేలియా బోర్డు తీవ్రంగా మండిపడింది. క్రికెట్ నియమాలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కి ఫిర్యాదు చేయగా... మేం అంతా చూస్తున్నాం అంటూనే లెగ్ సైడ్ బౌలింగ్ నిబంధనలకు విరుద్ధమేమీ కాదని ఎంసీసీ తేల్చింది. దాంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను రద్దు చేయాలని భావించినా... ఆర్థికపరంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉండటంతో ఆగిపోయింది. రెండు దేశాల అధినేతలు కూడా కల్పించుకోవాల్సి రావడం ఈ సిరీస్ వివాద స్థాయి ఏమిటో చూపిస్తుంది. ఎలాగైతేనేం ఇంగ్లండ్ అనుకున్న ఫలితం సాధించింది. బాడీలైన్ ప్రయోగించిన మూడు, నాలుగు, ఐదో టెస్టులను వరుసగా నెగ్గి సిరీస్‌ను 4–1తో గెలుచుకుంది. బ్రాడ్‌మన్‌ను 56.57 సగటుతో 396 పరుగులకే ఆపగలగడం ఇంగ్లండ్ సాధించిన మరో విజయం. ఇక ఆస్ట్రేలియాకు ప్రాణాంతకంగా పరిణమించిన లార్వుడ్ కేవలం 19.31 సగటుతో ఏకంగా 33 వికెట్లు పడగొట్టి విజయగర్వాన్ని ప్రదర్శించాడు. అయితే క్రికెట్ చరిత్రలో మాత్రం జార్డయిన్ రూపొందించిన వ్యూహం అత్యంత వివాదాస్పదంగా నిలిచిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ఐసీసీ లెగ్‌సైడ్ వెనుకవైపు గరిష్టంగా ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండేలా నిబంధనలు రూపొందించడంతో ఈ తరహా బౌలింగ్ మళ్లీ కనిపించలేదు. -
సున్నాతో ముగిసింది...
సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్... క్రికెట్ చరిత్రలో నిస్సందేహంగా, మరో చర్చకు తావు లేకుండా అత్యుత్తమ ఆటగాడు. నాటితరంనుంచి నేటి వరకు ఎందరు ఆటగాళ్లు వచ్చినా, ‘డాన్’ తర్వాతి స్థానాల గురించి మాట్లాడాల్సిందే తప్ప మాట వరసకు కూడా పోలిక తీసుకు రాలేని గొప్పతనం అతనిది. బ్రాడ్‌మన్ నెలకొల్పిన రికార్డులు, ఘనతలు నభూతో న భవిష్యతి. రెండు దశాబ్దాల కెరీర్లో బ్యాట్స్‌మన్‌గా బ్రాడ్‌మన్ చేసిన అద్భుతాలు మరెవరికీ సాధ్యం కానివి. అలాంటి ఆల్‌టైమ్ గ్రేట్ కెరీర్ ‘సున్నా’తో చివరి మ్యాచ్‌ను ముగించడం అనూహ్యం. మరో నాలుగు పరుగులు చేసినా 100 సగటును సాధించగలిగే స్థితిలో ఈ ఆస్ట్రేలియన్ సూపర్ స్టార్ డకౌట్‌గా వెనుదిరగడం క్రికెట్ విషాదం. బ్రాడ్‌మన్ 51 టెస్టుల కెరీర్లో అప్పటికే 6996 పరుగులు సాధించాడు. ఇందులో 29 సెంచరీలు ఉండగా...వాటిలో 2 ట్రిపుల్ సెంచరీలు, మరో 10 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్లను అలవోకగా చితక్కొడుతూ సాగించిన విధ్వంసక ఇన్నింగ్స్‌లు అభిమానుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అలాంటి అద్భుతానికి ముగింపు పలికే సమయం వచ్చింది. తన 40వ పుట్టిన రోజుకు రెండు వారాల ముందు ఇంగ్లండ్‌తో ముగిసే ఐదు టెస్టుల సిరీస్ చివరిదని బ్రాడ్‌మన్ ప్రకటించాడు. నాలుగు టెస్టులు ముగిసే సరికి 3 మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో డాన్ అప్పటికి 2 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో చివరి టెస్టుకు రంగం సిద్ధమైంది. రెండు బంతులకే... 14 ఆగస్టు, శనివారం, 1948... ఓవల్ మైదానం. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 52 పరుగులకే కుప్పకూలింది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఓపెనర్లు తొలి వికెట్‌కు 117 పరుగులు జోడించారు. సిడ్ బార్న్స్ తొలి వికెట్‌గా వెనుదిరగడంతో బ్రాడ్‌మన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. దిగ్గజ క్రికెటర్‌కు ఇదే ఆఖరి టెస్టు అని తెలియడంతో ఓవల్ మైదానం జనసంద్రమైంది. సుమారు 20 వేల మంది ప్రేక్షకులు వచ్చారు. సుదీర్ఘ కాలం తమ జట్టును చితకబాది ఊపిరాడకుండా చేసినా... ఇంగ్లండ్‌లో అతనంటే విపరీత అభిమానం, గౌరవం ఉన్నాయి. బ్రాడ్‌మన్ క్రీజ్‌లోకి వస్తుంటే అదే కనిపించింది. అందరూ నిలబడి చప్పట్లో స్వాగతం పలికారు. సాయంత్రం 5.50 అవుతోంది. ఆ రోజు ఆట ముగిసేందుకు మరో 40 నిమిషాల సమయం ఉంది. ఇంగ్లండ్ లెగ్‌స్పిన్నర్ ఎరిక్ హోలిస్ బౌలింగ్‌కు వచ్చాడు. బౌలర్‌గా అతనికి అంత పేరేమీ లేదు. అతనికిది ఏడో టెస్టు మాత్రమే. తొలి బంతిని నెమ్మదిగా వెనక్కి జరిగి డిఫెన్స్ ఆడగా, సిల్లీ మిడాఫ్ వరకు వెళ్లింది. పరుగేమీ రాలేదు. తర్వాత కొంత ఫీల్డింగ్ మార్పుతో హోలిస్ రెండో బంతిని వేశాడు. కాస్త ముందుకొచ్చి బ్రాడ్‌మన్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అనూహ్యంగా టర్న్ అయిన ‘గూగ్లీ’ స్టంప్స్‌ను తాకింది. రెండు బంతులకే డాన్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతే... స్టేడియం మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం. క్రికెట్‌ను శాసించిన దిగ్గజం ఆ తరహాలో నిష్క్రమించడం ఎవరికీ నచ్చలేదు. ప్రత్యర్థులైనా సరే అంతా అయ్యో అన్నవారే. ఇంగ్లండ్ చెత్త ప్రదర్శనతో మళ్లీ కుప్పకూలడంతో అతనికి రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. 90వ పడిలో సర్ సెంచరీ సగటు కోల్పోయి... బ్రాడ్‌మన్ కెరీర్లో ఇది 52వ టెస్టు. ఆడిన 80 ఇన్నింగ్స్‌లలో 10 నాటౌట్లు కాగా 99.94 సగటుతో కెరీర్ ముగిసింది. మరో 4 పరుగులు చేసి ఉంటే సగటు సరిగ్గా 100 పరుగులు ఉండేది. అయితే వందను అందుకోకపోయినా 99.94 మాత్రం ఎవరూ అందుకోలేని స్థాయిలో చరిత్రలో నిలిచిపోయింది. చివరి ఇన్నింగ్స్ గురించి ఆపై సాగిన చర్చను చూస్తే... నిజానికి అప్పట్లో ఇంత సూక్ష్మంగా గణాంకాల గురించి పట్టింపు ఉండేది కాదు. ఆడుతూపోతూ పరుగులు చేసేయడమే. తన సగటు ఇంత అని, నాలుగు పరుగులు చేస్తే వంద అవుతుందని స్వయంగా బ్రాడ్‌మన్‌కు కూడా తెలీదని అతని సహచరుడు, నీల్ హార్వే వెల్లడించాడు. డకౌట్ తర్వాత డాన్ కన్నీళ్లపర్యంతమయ్యాడని కథనాలు వచ్చాయి. కొన్నాళ్ల తర్వాత రిటైర్మెంట్ వేడుకలో బ్రాడ్‌మన్ ఇవన్నీ కొట్టిపారేశాడు. ‘నేను మైదానంలోకి వెళుతున్నప్పుడే అంత మంది ప్రేక్షకుల కరతాళ ధ్వనులు, చివరి మ్యాచ్ కారణంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. అలాంటి స్థితిలో నిజానికి నేను ఆడిన తొలి బంతి కూడా నాకు సరిగా కన్పించనే లేదు. అంతే కానీ డకౌట్ గురించి ఏడవ లేదు. అయినా అదే నాకు చివరి ఇన్నింగ్స్ అవుతుందని నాకు కూడా తెలీదు కదా’ అని డాన్ వెల్లడించాడు. సచిన్‌తో డాన్ -
బ్రాడ్‌మన్ తర్వాత కోహ్లినే!
రెండో వన్డే ‘టై’గా ముగియడం నా దృష్టిలో సరైన ఫలితమే. ఎందుకంటే ఇరు జట్ల బౌలర్లు కూడా తమ జట్టును గెలిపించే స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. కెప్టెన్లు ఇద్దరూ తమ బౌలింగ్ బలగాల గురించి ఆందోళన చెందుతూ ఉండవచ్చు. ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా టి20 క్రికెట్ ప్రభావం వల్ల వన్డేల్లో కూడా జోరు పెరిగింది. ఒక జట్టు 300 పరుగుల స్కోరు సాధించడం గతంలోలాగా అరుదుగా కాకుండా ఇప్పుడు చాలా సహజంగా మారిపోయింది. విరాట్ కోహ్లి బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే అతను మానవమాత్రుడిలా కనిపించడం లేదని కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. అతని మాటలు ఇప్పుడు నిజంలాగే అనిపిస్తున్నాయి. స్విచ్ వేయగానే యంత్రం పని చేయడం ప్రారంభించినట్లు కోహ్లి పరుగులు చేసేస్తున్నాడు. కోహ్లి నిలకడ గురించి చెప్పాలంటే అద్భుతం అనే మాట కూడా సరిపోదు. అయితే దీనికి మించి అతను పరిస్థితులను అర్థం చేసుకుంటూ జట్టుకు ఏది అవసరమో దాని ప్రకారం తన ఆటను మార్చుకుంటూ ఆడటమే మరింత పెద్ద విశేషం. అతను బ్యాటింగ్‌కు వెళుతున్నాడంటే చాలు కచ్చితంగా సెంచరీ సాధిస్తాడనే విషయంలో కించిత్ కూడా సందేహం కనిపించడం లేదు. గతంలో ఇలాంటి స్థితి ఒక్క సర్ డాన్ బ్రాడ్‌మన్ విషయంలోనే కనిపించేది. నాడు బ్రాడ్‌మన్ మైదానంలోకి దిగుతుంటే చూడచక్కగా స్టైల్‌గా కనిపించేది. ఇప్పుడు కోహ్లి తనదైన శైలిలో గంభీరంగా, ఆత్మవిశ్వాసంతో వెళుతుంటే ప్రత్యర్థి ఆటగాళ్లు అతని కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా చేయడం లేదు. అయితే భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మ్యాచ్‌లో మలుపులు సాగుతున్నప్పుడు మాత్రం తన భావోద్వేగాలను ప్రదర్శిస్తూ కోహ్లి మామూలు మానవుడిలా కనిపిస్తున్నాడు. వెస్టిండీస్‌ను ఈసారి 300లోపు కట్టడి చేసే బౌలింగ్ బలగం భారత్‌కు ఉందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. గత మ్యాచ్లకంటే ఈసారి మరింత మెరుగ్గా ఫీల్డింగ్ చేయాలని కూడా జట్టు భావిస్తోంది. రనౌట్‌కు అవకాశం లేకున్నా అనవసరంగా స్టంప్స్‌పైకి బంతిని విసిరే అలవాటుపై కూడా టీమ్ మేనేజ్మెంట్ దృష్టి పెట్టాల్సి ఉంది. -
బ్రాడ్‌మన్‌కు గూగుల్ ఘన నివాళి
డాన్ బ్రాడ్‌మన్.. క్రికెట్ గురించి తెలిసిన వారికి సుపరిచితమైన పేరిది. నేడు (సోమవారం) ఆయన 110వ జయంతి సందర్భంగా.. ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. తన డూడుల్ తో మరోసారి ప్రపంచానికి ఆయన్ను గుర్తు చేసింది. ప్రపంచంలోనే మేటి ఆటగాడిగా పేరొందిన బ్రాడ్‌మాన్ 1908, ఆగస్టు 27న ఆస్ట్రేలియాలో జన్మించాడు. బ్రాడ్‌మన్ 52 మ్యాచ్‌ల్లో 29 సెంచరీలు సాధించాడు. అందులో 12 డబుల్ సెంచరీలు ఉండటం మరో విశేషం. బ్రాడ్‌మన్ ఇంగ్లండ్‌పై సాధించిన 334 పరుగులు ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు. బ్రాడ్‌మన్ బ్యాటింగ్ సగటు 99.94గా ఉంది. చివరి ఇన్నింగ్స్‌లో ఆయన కనీసం 4 పరుగులు చేసి ఉంటే.. యావరేజ్ 100గా ఉండేది. కానీ డకౌట్ కావడంతో 99.94 దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. 1930 యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మన్ ఏకంగా 974 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడు బ్రాడ్‌మాన్ (961 పాయింట్లు) కావడం విశేషం. క్రికెట్లోనే అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన బ్రాడ్‌మన్‌కి సచిన్ ఆట అంటే అమితమైన ఇష్టం. మాస్టర్ బ్లాస్టర్ ఆటతీరు అచ్చం బ్రాడ్‌మన్‌ను పోలి ఉండటంతో.. సచిన్ ఆటను ఆయన ఎక్కువగా ఇష్టపడేవారు. సరిగ్గా 20 ఏళ్ల క్రితం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. బ్రాడ్‌మన్ బర్త్ డే సందర్భంగా.. సచిన్ ఆయన్ను కలిశాడు. ఇదే విషయాన్ని మాస్టర్ బ్లాస్టర్ తాజగా ట్వీట్ చేశాడు. It’s been 20 years since I met the inspirational Sir #DonBradman but that special memory is so vivid. I still recall his amazing wit, warmth, and wisdom. Remembering him fondly today, on what would have been his 110th birthday. pic.twitter.com/JXsKxKwZJm — Sachin Tendulkar (@sachin_rt) 27 August 2018 -
క్రికెట్లో అత్యంత అరుదైన సందర్భం
సాక్షి, హైదరాబాద్ : ఆగస్టు 14 క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రోజు. ఓ దిగ్గజ ఆటగాడి శకం ముగియగా.. మరో దిగ్గజ ఆటగాడు ప్రపంచానికి పరిచయమయ్యాడు. క్రికెట్ చరిత్రలో ఒకరు తనదైన ముద్ర వేయగా.. మరొకరు పరుగుల సునామీ సృష్టించారు. ఒకరు ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మాన్ అయితే మరొకరు టీమిండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. కాకతాళియమో యాదృచికమో కానీ బ్రాడ్‌మన్ వీడ్కోలు పలికిన ఆగస్టు14నే సచిన్ తన తొలి సెంచరీ సాధించడం విశేషం. 1948 ఆగస్టు 14 ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్. ఐదు టెస్టుల సిరీస్ అప్పటికే ఆస్ట్రేలియా 3-0 ఆధిక్యంలో ఉంది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను పర్యాటక జట్టు 52 పరుగులకే కుప్పకూల్చింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఓపెనర్లు మంచి శుభారంబాన్ని అందించారు. 117 పరుగుల వద్ద ఆసీస్ తన తొలి వికెట్‌ను కోల్పోయింది. అనంతరం దిగ్గజ బ్రాడ్‌మన్ ప్రేక్షకుల కరతాళ ధ్వనుల మధ్య క్రీజులోకి వచ్చాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం వారి క్యాప్‌లను తీసి గౌరవ సూచకంగా స్వాగతం పలికారు. కెరీర్లో అతని చివరి మ్యాచ్ కావడంతో ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంగ్లండ్ లెగ్ స్పిన్నర్ ఎరిక్ హొల్లీస్ బౌలింగ్‌లో తొలి బంతి ఎదుర్కొన్న బ్రాడ్‌మన్ మరుసటి బంతికే క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మైదానమంతా మూగబోయింది. దిగ్గజ ఆటగాడి కథ ముగిసింది. అప్పటి వరకు ప్రేక్షకులను అలరించిన బ్రాడ్‌మన్ బ్యాట్.. అతని చివరి మ్యాచ్‌లో మూగబోయింది. కేవలం 4 పరుగులు చేస్తే టెస్టుల్లో 100 సగటు చేసిన ఆటగాడిగా బ్రాడ్‌మన్ గుర్తింపు పొందేవాడు. కానీ ఆ అవకాశాన్ని కోల్పోయాడు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో సైతం 188 పరుగులకే కుప్పకూలడంతో ఆసీస్ ఇన్నింగ్స్,149 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. దీంతో బ్రాడ్‌మన్‌కు మళ్లీ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేవలం 52 టెస్టుల మాత్రమే ఆడిన బ్రాడ్‌మన్ 99.94 సగటుతో 6,996 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు,13 అర్థ సెంచరీలు ఉండటం విశేషం. సచిన్ మొదలెట్టాడు.. బ్రాడ్‌మన్ బ్యాట్ మూగబోయిన 42 ఏళ్ల అనంతరం1990 ఆగస్టు 14నే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తన శతకాల ఖాతాను తెరిచాడు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన టెస్టులో అద్భుతంగా రాణించిన ఈ టీనేజీ కుర్రాడు.. ఓటమి గండం నుంచి జట్టును గటెక్కించాడు. దిగ్గజ క్రికెటర్లు తడబడినా.. ఇంగ్లిష్ బౌలర్లకు ఎదురు నిలిచాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్‌కు 408 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. డెవాన్ మెక్ కల్లమ్, అంగస్ ఫ్రేసర్, ఎడ్డీ హెమ్మింగ్స్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడంలో భారత బ్యాట్స్ మెన్ తడబడ్డారు. సిద్ధు డకౌట్ కాగా.. రవిశాస్త్రి 12 పరుగులు, సంజయ్ మంజ్రేకర్ 50 రన్స్ చేసిన పెవిలియన్ చేరారు. వెంగ్ సర్కార్ కూడా 32 పరుగులకే అవుటయ్యాడు. 109 పరుగులకే 4 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిన్ అద్భుతంగా రాణించాడు. 11 పరుగులు చేసి కెప్టెన్ అజారుద్దీన్ అవుటైనా.. కపిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ముందుకు నడిపించాడు. హెమ్మింగ్స్ రిటర్న్ క్యాచ్ వదలడంతో సచిన్‌కు లైఫ్ వచ్చింది. అది మొదలు అతడు వెనుదిరిగి చూడలేదు.. 189 బంతులను ఓపికగా ఎదుర్కొన్న సచిన్ 119 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 67 రన్స్‌తో మనోజ్ ప్రభాకర్ మాస్టర్‌కు అండగా నిలిచాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో గవాస్కర్ ఇచ్చిన పాత ప్యాడ్లను కట్టుకుని సచిన్ బరిలో దిగిడం విశేషం. 17 ఏళ్ల 112 రోజుల వయసులో సెంచరీ సాధించాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు సచినే కావడం విశేషం. ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు. ఇక ప్రపంచ క్రికెట్లో సెంచరీ సాధించిన పిన్న వయస్కుడు పాక్ క్రికెటర్ ముస్తాఖ్ మహ్మద్ గుర్తింపు పొందాడు. అతడు 17 ఏళ్ల 80 రోజుల వయసులో శతకం బాదాడు. చదవండి: కోచ్, కెప్టెన్లపై బీసీసీఐ ఆగ్రహం!