రిటైర్మెంట్‌ ప్రకటించిన వోజెస్‌ | Australia batsman Adam Voges announces international retirement | Sakshi

రిటైర్మెంట్‌ ప్రకటించిన వోజెస్‌

Feb 15 2017 1:11 AM | Updated on Sep 5 2017 3:43 AM

రిటైర్మెంట్‌ ప్రకటించిన వోజెస్‌

రిటైర్మెంట్‌ ప్రకటించిన వోజెస్‌

ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆడమ్‌ వోజెస్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో అతను తన ఆఖరి టెస్టు ఆడాడు.

పెర్త్‌: ఆస్ట్రేలియా క్రికెటర్‌ ఆడమ్‌ వోజెస్‌ (37) అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవలే దక్షిణాఫ్రికాతో అతను తన ఆఖరి టెస్టు ఆడాడు. దాదాపు రెండేళ్ల క్రితం వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడిన వోజెస్, అరంగేట్రంలోనే సెంచరీ చేసిన పెద్ద వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా రెండు డబుల్‌ సెంచరీలతో సత్తా చాటినా... ఇటీవల శ్రీలంక, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో విఫలం కావడంతో వోజెస్‌పై వేటు పడింది. 20 టెస్టుల్లో 5 సెంచరీలు సహా 1485 పరుగులు చేసిన వోజెస్‌... కనీసం 20 టెస్టులు ఆడినవారందరిలో డాన్‌ బ్రాడ్‌మన్‌ (99.94) తర్వాత అత్యధిక సగటు (61.87) కలిగిన ఆటగాడిగా రెండో స్థానంతో కెరీర్‌ ముగించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement