బ్రాడ్‌మన్‌ క్యాప్‌ విలువ రూ. 2 కోట్లు! | 2 lakh 60 thousand dollars for Bradmans cap | Sakshi
Sakshi News home page

బ్రాడ్‌మన్‌ క్యాప్‌ విలువ రూ. 2 కోట్లు!

Published Tue, Dec 3 2024 3:34 AM | Last Updated on Tue, Dec 3 2024 3:34 AM

2 lakh 60 thousand dollars for Bradmans cap

సిడ్నీ: భారత క్రికెట్‌ జట్టు 1947–48లో తొలిసారి ఆ్రస్టేలియా లో పర్యటించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత విదేశీ గడ్డపై మనకు ఇదే తొలి సిరీస్‌. భారత్, ఆ్రస్టేలియా మధ్య 5 టెస్టులు జరగ్గా ... ఆ్రస్టేలియా 4–0తో సిరీస్‌ను నెగ్గింది. ఈ సిరీస్‌లో క్రికెట్‌ దిగ్గజం డాన్‌ బ్రాడ్‌మన్‌ 178.75 సగటుతో 715 పరుగులు చేయగా... ఇందులో ఒక డబుల్‌ సెంచరీ సహా 4 సెంచరీలు, 1 అర్ధసెంచరీ ఉన్నాయి. 

బ్రాడ్‌మన్‌ తన కెరీర్‌లో భారత్‌పై ఆడిన సిరీస్‌ ఇదొక్కటే కావడం విశేషం. ఇప్పుడు ఈ సిరీస్‌లో బ్రాడ్‌మన్‌ ధరించిన ‘బ్యాగీ గ్రీన్‌’ క్యాప్‌ వేలానికి వచ్చింది. నేడు జరిగే ఈ వేలంలో ఈ క్యాప్‌నకు 2 లక్షల 60 వేల డాలర్లు (సుమారు రూ. 2.20 కోట్లు) పలకవచ్చని అంచనా. టెస్టు క్రికెట్‌ ఆడే ఆ్రస్టేలియా క్రికెటర్లకు ఆకుపచ్చ రంగుతో కూడిన బ్యాగీ గ్రీన్‌లను అందజేస్తారు.

సుదీర్ఘ కెరీర్‌లో చినిగిపోయి, రంగులు వెలసిపోయినా వారు దానినే ఉపయోగిస్తారు. అలాంటి క్యాప్‌లపై క్రికెట్‌ వర్గాల్లో, అభిమానుల్లో ఎంతో ఆసక్తి ఉంటుంది. ఇరవై ఏళ్ల తన టెస్టు కెరీర్‌లో 52 టెస్టుల్లోనే అనితరసాధ్యమైన 99.94 సగటుతో 6996 పరుగులు చేసిన బ్రాడ్‌మన్‌ 92 ఏళ్ల వయసులో 2001లో కన్నుమూశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement