
ఢిల్లీ: మహా కుంభమేళా సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్(Prayagraj త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం ఆయన గంగాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ప్రధాని వెంట ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఉన్నారు.

జనవరి 13న మొదలైన మహాకుంభ మేళా ఈ నెల 26న మహా శివరాత్రి రోజున ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఇవాళ మహా కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు ప్రధాని మోదీ ప్రయాగ్‌రాజ్ వచ్చారు. హెలికాప్టర్‌లో అరైల్ ఘాట్ వద్దకు.. అక్కడి నుంచి బోట్‌లో సంగమం వద్దకు చేరుకున్నారు.ప్రధాని రాక నేపథ్యంలో అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు భారీ భద్రతా మోహరించారు.

#WATCH | Prime Minister Narendra Modi to shortly take a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh
(Source: ANI/DD) #KumbhOfTogetherness pic.twitter.com/3F2guB1ElQ— ANI (@ANI) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment