వాషింగ్టన్: గాజాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. తాజాగా ట్రంప్.. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. అనంతరం, గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధం ముగింపు దిశగా వెళ్లాలని చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు. అనంతరం ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. యుద్ధంతో దెబ్బతిన్న పాలస్తీనాలో భూభాగమైన గాజాను అమెరికా స్వాధీనం చేసుకోవాలని భావిస్తుందని తెలిపారు. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు అని తెలిపారు. ఇదే సమయంలో భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్ పర్యటన సందర్భంగా గాజా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాను సందర్శించాలని తాను భావిస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు.. ట్రంప్ నిర్ణయంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పందించారు. గాజాపై ట్రంప్ ప్రకటన చరిత్రను మారస్తుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో, ఇరువురి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
Donald Trump just announced that the United States will be “taking over” Gaza and will “level” it to the ground.
He said Palestinians should not live there anymore.
This is GENOCIDE!!!! pic.twitter.com/dR1UcmhiTe— Morgan J. Freeman (@mjfree) February 5, 2025
ఇదిలా ఉండగా.. గాజాలో ఉద్రిక్తతల కారణంగా నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఆయా దేశాలు తీవ్రంగా ఖండించాయి. అలా చేస్తే తమ ప్రాంతంలోని స్థిరత్వం దెబ్బతింటుందని ఈజిప్టు, జోర్డాన్, సౌదీఅరేబియా, యూఏఈ, ఖతార్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్తంగా ప్రకటన చేశాయి. ఈక్రమంలోనే గాజాను స్వాధీనం చేసుకొని, అభివృద్ధి చేస్తామని ట్రంప్ ప్రకటించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment