న్యూఢిల్లీ: రాజధానిలో మరోసారి మత్తు దందా బయటపడింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ముఠాకు సంబంధించిన ఐదుగురిని అరెస్ట్ చేసిన అధికారులు.. మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.
బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో గ్రీన్ చానెల్ దాటేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ల కదలికలు అనుమానాస్పదంగా అనిపించడంతో కస్టమ్స్ అధికారులు ఆపి తనిఖీలు చేశారు. వాళ్ల దగ్గర ఉన్న ట్రాలీ బ్యాగుల నుంచి 94 ప్యాకెట్‌లలో నీట్‌గా ప్యాక్ చేసిన గంజాయి బయటపడింది.
అది ఫారిన్ గంజాయి అని, దాని విలువ రూ.47 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు.. ఆ ఐదుగురిని రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment