![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures1](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2820%29.jpg)
హీరోయిన్ సోనాక్షి సిన్హా మొత్తానికి తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించింది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures2](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%282%29.jpg)
సంజయ్ లీలా భన్సాలీ పీరియాడికల్ డ్రామా హీరామండి: ది డైమండ్ బజార్‌లో చివరిసారిగా కనిపించిన సోనాక్షి సిన్హా, సముద్రం వైపున ఉన్నతన బాంద్రా అపార్ట్‌మెంట్‌ను రూ.22.50 కోట్లకు విక్రయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures3](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%283%29.jpg)
ప్రీమియం రెసిడెన్షియల్ టవర్ (81 Aureate) 16వ అంతస్తులో 4,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందీ అపార్ట్‌మెంట్. దీన్ని 2022, మార్చి దాదాపు రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. అంటే తాజా విక్రయం ద్వారా దాదాపు 61 శాతం లాభాన్ని ఆర్జించింది
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures4](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%284%29.jpg)
ఆధునిక సౌకర్యాలతో కూడిన విశాలమైన 4-BHK అపార్ట్‌మెంట్‌ను reD ఆర్కిటెక్ట్స్‌కు చెందిన రాజీవ్ , ఏక్తా పరేఖ్ 1.5-BHKగా సొగసైన రీతిలో తీర్చిదిద్దారు.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures5](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%285%29.jpg)
ఎంతో స్పెషల్‌గా, అందంగా ఈ ఇంటిలో వాక్-ఇన్ వార్డ్‌రోబ్, ప్రత్యేక జిమ్, అందమైన కళాకృతులు, అరేబియా సముద్రాన్ని వీక్షించేలా విశాలమైన బాల్కనీ ఉన్నాయి.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures6](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%286%29.jpg)
ముఖ్యంగా గత ఏడాది (2024, జూన్ 23న ) సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకున్న ఇల్లు కూడా ఇదే.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures7](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%287%29.jpg)
ఇటీవల సోనాక్షి, జహీర్ పెళ్లి వేడుకలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఈ ఇంటిని రూ.25 కోట్లకు అమ్మకానికి పెట్టడం వార్తల్లో నిలిచింది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures8](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%288%29.jpg)
కాగా బాలీవుడ్ నటుడు శత్రుఘ్ని సిన్హా కూతురు సోనాక్షి సిన్హా.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures9](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%289%29.jpg)
ప్రారంభంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures10](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2810%29.jpg)
తరువాత బాగా బరువు తగ్గించుకుని, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన యాక్షన్-డ్రామా దబాంగ్ (2010)మూవీతో నటిగా కెరీర్ మొదలుపెట్టింది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures11](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2811%29.jpg)
ఉత్తమ డెబ్యూనటిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది. వరుస ఆఫర్లతో చాలా బిజీగా మారింది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures12](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2812%29.jpg)
ముఖ్యంగా దక్షిణాదిన రజినీకాంత్ నటించిన లింగ సినిమాతో తమిళం సినిమాకి పరిచయం అయినది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures13](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2813%29.jpg)
సహనటుడు జహీర్ ఇక్బాల్‌తో సుదీర్ఘ కాలం ప్రేమలో ఉన్న సోనాక్షీ ఎట్టకేలకు గత ఏడాది పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures14](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2814%29.jpg)
ప్రస్తుతం భర్తతో మూడు హనీమూన్లు, ఆరు టూర్లు అన్నట్టుగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది.
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures15](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2815%29.jpg)
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures16](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2816%29.jpg)
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures17](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2817%29.jpg)
![Sonakshi Sinha sells Bandra West apartment for over Rs 22 Crore.Check out The pictures18](https://www.sakshi.com/gallery_images/2025/02/5/Sonakshi%20Sinha%20sells%20Bandra%20West%20apartment%20for%20over%20Rs%2022%20Crore.Check%20out%20The%20pictures%20%2818%29.jpg)