Sells
-
రూ.508 కోట్లకు బంగ్లా అమ్మేసిన ఇషా అంబానీ - సొంతం చేసుకున్న హాలీవుడ్ జంట (ఫోటోలు)
-
చిట్టి పికాసో: చిట్టి చేతులు అద్భుతం చేస్తున్నాయి!
పట్టుమని రెండేళ్లు కూడా నిండలేదు కుంచె పట్టకుని పెయింటింగ్‌ల గీసేస్తున్నాడ. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్లుగా ఈ చిట్టి చేతులు అద్భుతమైన చిత్రాలు చిత్రీస్తున్నాయి. పైగా అవి ఎంత ధర పలుకుతున్నాయో వింటే ఆశ్చర్యపోతారు. ఎవరా చిన్నారి? అంటే..?జర్మనీకి చెందిన రెండేళ్ల లారెండ్ స్క్వార్ట్ అనే చిన్నారి అద్భుతమైన చిత్రాలను సృష్టిస్తున్నాడు. వాటిలో పలు రకాల జంతువులపాలు కనిపిస్తాయి. ఆ చిన్నారి ఆర్ట్ ప్రయాణం గతేడాది సెలవులు నుంచి ప్రారంభమయ్యిందని తల్లి లిసా చెబుతోంది. తన కొడుకుకి రంగుల ప్రపంచం అంటే ఇష్టమని, ఆ అభిరుచి ఇలా కళాత్మక చిత్రాలను గీసేలా చేయించిందని అంటోంది ఆ చిన్నారి తల్లి. కొడుకు లారెంట్ పెయింటింగ్స్‌లో ఏనగులు, డైనోసార్లు, గుర్రాలు, వంటి గుర్తించదగిన జంతు బొమ్మల నైరూప్య రూపాల సమ్మేళ్లనం కనిపిస్తోందని చెబుతోంది. తన కొడుకు ప్రతిభకు ఫిదా అయ్యి.. అతడి పేరు మీదుగా పేయింటింగ్లను ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయడం మొదలు పెట్టింది లిసా. ఈ వీడియోలకు విపరీతమైన జనాధరణ ఉండటమే గాక ఏకంగా రెండు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అంతేగాదు వాటిని ఆన్లైన్లో విక్రయించడం మొదలు పెట్టింది ఆ చిన్నారి తల్లి లిసా. ఏప్రిల్‌లో జర్మనీలోని మ్యూనిచ్‌లో అతిపెద్ద ఆర్ట్ ఫెయిర్‌లో అరంగేట్రం చేసిన తర్వాత నుంచి తన కొడుకు పేయింటింగ్ కలెక్షన్లతో తమ ఇల్లు నిండిపోయింది అంటోంది. అంతేగాదు లారెంట్ ఎప్పుడెప్పుడు రెస్ తీసుకుంటాడు, ఏ సమయాల్లో చిత్రాలు గీస్తాడు వంటి వాటి గరించి కూడా సోషల్ మీడియలో షేర్ చేస్తుంది. అయితే లారెంట్.. ఆ ఆర్ట్ ఫెయిర్‌లో తను వేసిన పేయింటింగ్లను గుర్తుపట్టడం తమకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందని ఆ చిన్నారి తల్లి ఆనందంగా చెబుతోంది. ఇంతకీ ఈ చిట్టి బుడతడు లారెంట్ వేసిన పేయింటింగ్స్ ఎంతకీ అమ్ముడయ్యిందో వింటే షాకవ్వుతారు. సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతాయట. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Laurent Schwarz (@laurents.art) (చదవండి: -
పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..
ఉన్నత చదువులు చదివినా కొందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వలేరు. మంచి ఉద్యోగం రాక నానాపాట్లు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివినా అందుకు తగ్గ స్థాయిలో ఉద్యోగాల లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణాల వల్లే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు సరైన ఉద్యోగం లేక సతమతమవుతున్నారు. ఇక్కడొక పంజాబ్ వ్యక్తి కూడా అదేకోవకు చెందినవాడు. వివరాల్లోకెళ్తే..పంజాబ్‌కి చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన గత 11 ఏళ్లుగా పంజాబీ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పనిచేశారు. కానీ అక్కడ ఇచ్చే అరకొర జీతం అక్కరకు రాక నానాపాట్లు పడ్డాడు. పైగా వేతనం కూడా సకాలంలో రాకపోవడం వంటి సమస్యలతో విసుగు చెంది బతుకుదెరువు కోసం కూరగాయాలు అమ్మడం ప్రారంభించారు. ఆయన న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసిన వ్యక్తి. అంతేగాదు జర్నలిజం, పొలిటికల్ సైన్సు వంటి సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి. ఈ మేరకు సందీప్ సింగ్ మాట్లాడుతూ..సమాయానికి జీతం రాకపోవడం, ఒకవేళ వచ్చినా..ఆ అరకొర జీతంతో తాను తన కుటుంబం బతకడం కష్టంగా మారడంతో కూరగాయాలు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన తన కూరగాయాల బండిపై పీహెచ్డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటి ఇంటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముతుంటాడు. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక పక్కన ఇలా కూరగాయాలు అమ్ముతూనే చదువు కొనసాగిస్తున్నాడు సందీప్ సింగ్. అంతేగాదు తాను తన ప్రొఫెసర్ వృత్తికి బ్రేక్ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ తన ఈ ప్రోఫెసర్ వృత్తిని వదలనని ఇది తనకు ఇష్టమని చెబుతున్నాడు. పైగా డబ్బు ఆదా చేసి, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ని స్టార్ట్ చేయాలన్నది తన కోరిక అని చెప్పాడు. ఈ ఉన్నత విద్యావంతుడి కోరక నెరవెరాలని ఆశిద్దాం. ఇలాంటి ఘటనలు మన దేశంలో ఉన్న నిరుద్యోగతకు అద్దం పడుతోంది కదా!. కొంగొత్త కోర్సులు వస్తున్నట్లే అంతే స్థాయిలో ఉద్యోగాలు ఉంటే ఇలా సందీప్ లాంటి వాళ్లకు కూరగాయాలమ్మే పరిస్థితి ఏర్పడదు కదా!. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
అమానవీయం: రూ.4 లక్షల కోసం శిశువును కన్న తల్లే..
కోల్‌కతా: కోల్‌కతాలో తల్లితనానికి మచ్చ తెచ్చే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ తల్లి రూ.4 లక్షల కోసం తన 21 రోజుల శిశువును అమ్మేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పసిపాపను శిశు సంరక్షణ గృహానికి తరలించారు. కోల్‌కతాలోని నోనడంగ్ ప్రాంతంలోని రైలు కాలనీలో రుపాలీ మండల్ నివసిస్తోంది. తనకు ఇటీవలే ఓ శిశువు జన్మించింది. తన శిశువును కనీసం నెలయినా గడవక ముందే డబ్బుల కోసం ఓ మహిళకు అమ్మేసింది. ఈ విషయాన్ని రూపాలీ పొరుగింటివారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితురాలితో పాటు ఆమెకు సహకరించిన ఇద్దరు మహిళలు రూపా దాస్, స్వప్న సర్ధార్‌ను అరెస్టు చేశారు. మిడ్నాపూర్‌కు చెందిన కళ్యాణి గుహాకు పెళ్లై 15 ఏళ్లు గడిచినా పిల్లలు లేరు. దీంతో రూపా దాస్, స్వప్న సర్ధార్‌ల సహకారంతో శిశువును కొనాలని పతకం పన్నింది. ఈ వ్యవహారంలో కళ్యాణి గుహాను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర నుంచి శిశువును స్వాధీనం చేసుకుని శిశు సంరక్షణ గృహానికి తరలించారు. ఇదీ చదవండి: Delhi Payroll Cheating: కంపెనీ హెచ్ఆర్ నిర్వాకం.. నిరుద్యోగియైన భార్యకు కంపెనీ జీతం..! -
కదులుతున్న రైలులో పానీపూరీల అమ్మకం.. ఆ స్కిల్‌కి నెటిజన్లు ఫిదా!
చేయాలన్న సంకల్పం ముందు ఎలాంటి ప్రతికూల వాతావరణం అయిన అనుకూలంగా మారిపోతుంది. ఉత్సాహం, సాధించాలన్న తపన ఇవే ప్రధానం. బహుశా ఏ వ్యాపారినికైనా సక్సెస్ మంత్రం ఇదే కాబోలు. ఇక్కడొక వ్యక్తి అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ఆ వ్యక్తి కదులుతున్న రైలులో పానీ పూరీలు అమ్మి చూపించాడు. వీధి వ్యాపారి ఏ మాత్రం బెరుకు లేకుండా చాలా చక్యంగా ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులుకు సర్వ్ చేశాడు. అందులోనూ పానీపూరీలు కదులుతున్న రైలులో విక్రయించడం అంత ఈజీ కాదు. కానీ అతను నైపుణ్యం ప్రజలకు ఆ పానీ పూరీలను విక్రయిస్తూ అందరీ దృష్టిని ఆకర్షించాడు. అందుకు సంబంధించిన వీడియోన నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సైతం తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటూ అమ్ముతున్న విధానాన్ని చూసి ఫిదా అవ్వడమే గాక అతడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. When you put your business mind on the right track pic.twitter.com/Wg3sQmEgpQ — Sagar (@sagarcasm) June 21, 2023 ఈ ఘటన ముంబై లోకల్ రైల్లో జరిగింది. 14 సెకన్ల ఈ వీడియోను ఓ యువకుడు ట్విట్టర్ లో జూన్ 21న అప్ లోడ్ చేయగా.. వైరల్ గా మారింది. కనిపించిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సక్సెస్ అవుతారంటూ నెటిజన్లు ప్రశంసించారు. నోట్ : రైల్లో ఇలా పానీ పూరీ విక్రయించడం నిషేధం. తోటి ప్రయాణీకులకు ఇబ్బందికరం. దీన్ని ఎవరూ అనుకరించకూడదని మనవి (చదవండి: రెండు వేల ఏళ్ల క్రితమే పిజ్జా వంటకం ఉందంటా!) -
శ్రీరామ్ ఫైనాన్స్ నుంచి పిరమల్ ఔట్
ముంబై: యూఎస్ పీఈ దిగ్గజం టీపీజీ తదుపరి తాజాగా శ్రీరామ్ ఫైనాన్స్‌లో పిరమల్ ఎంటర్ప్రైజెస్ వాటా విక్రయాన్ని చేపట్టింది. ఓపెన్ మార్కెట్ ద్వారా శ్రీరామ్ ఫైనాన్స్‌లో గల మొత్తం 8.34 శాతం వాటాను పిరమల్ విక్రయించింది. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఎంఎఫ్, కొటక్ మహీంద్రా ఎంఎఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇన్సూరెన్స్, బ్లాక్‌రాక్, బీఎన్పీ పరిబాస్, సొసైటీ జనరాలి తదితర సంస్థలకు 3.12 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బ్లాక్‌డీల్స్ ద్వారా రూ. 1,545 ధరలో రూ. 4,824 కోట్లకు వాటాను ఆఫర్ చేసింది. సోమవారం శ్రీరామ్ ఫైనాన్స్‌లో 2.65% వాటాను ఓపెన్ మార్కెట్ ద్వారా రూ. 1,390 కోట్లకు టీపీజీ విక్రయించిన సంగతి తెలిసిందే. ఎంఎఫ్‌లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటిని కొనుగోలు చేశాయి. కాగా.. బ్లాక్‌డీల్ వా ర్తల ప్రభావంతో బుధవారం ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనా న్స్ షేరు 11.3% దూసుకెళ్లి రూ. 1,736 వద్ద నిలిచింది. ఇక మంగళవారం 6% జంప్‌చేసి రూ. 838కు చేరి న పిరమల్ ఎంటర్ప్రైజెస్ బుధవారం మరింత అధికంగా 14.2% దూసుకెళ్లి రూ.958 వద్ద ముగిసింది. పునర్వ్యవస్థీకరణతో శ్రీరామ్ గ్రూప్ చేపట్టిన పునర్వ్యవస్థీకరణ తదుపరి పిరమల్ ఎంటర్‌ప్రైజెస్‌కు గ్రూప్‌లోని పలు కంపెనీలలో షేర్లు లభించాయి. ఈ బాటలో శ్రీరామ్ ఫైనాన్స్‌లో 8.34 శాతం వాటాను పొందగా.. శ్రీరామ్ జీఐ హోల్డింగ్స్, ఎల్ఐ హోల్డింగ్స్, ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్స్‌లోనూ 20 శాతం చొప్పున వాటాలు లభించాయి. దీంతో శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో 13.33 శాతం, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 14.91 శాతం వాటాను సొంతం చేసుకుంది. -
ఎడ్యుకేషన్ లోన్ విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలా విక్రయం
న్యూఢిల్లీ: విద్యా రుణాల విభాగం హెచ్డీఎఫ్సీ క్రెడిలాను క్రిస్‌క్యాపిటల్ తదితర పీఈ దిగ్గజాల కన్సార్షియంకు విక్రయించినట్లు మార్టిగేజ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ తాజాగా పేర్కొంది. కంపెనీలో 90 శాతం వాటాను రూ. 9,060 కోట్లకు విక్రయించినట్లు వెల్లడించింది. ప్రయివేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో విలీనం నేపథ్యంలో విద్యా రుణాల సంస్థను హెచ్డీఎఫ్సీ విక్రయించింది. బీపీఈఏ ఈక్యూటీ, క్రిస్‌క్యాపిటల్ ఇన్వెస్టర్ల కన్సార్షియంకు హెచ్డీఎఫ్సీ క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను విక్రయించేందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్డీఎఫ్సీ ద్వయం తాజాగా తెలియజేశాయి. దేశ, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు విద్యార్ధులకు రుణాలందించే హెచ్డీఎఫ్సీ క్రెడిలాలో 9.99% వాటాను కొనసాగించనున్నట్లు హెచ్డీఎఫ్సీ వెల్లడించింది. -
అచ్చం అరవింద్ కేజ్రీవాల్‌లా..కానీ, చాట్ అమ్ముతూ..
మనుషులను పోలిన వాళ్లు ఏడుగురు ఉంటారని ఆర్యోక్తి. అది ఎంత వరకు నిజమో తెలియదు కానీ. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. అచ్చం ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ని పోలిన మరో వ్యక్తి చాట్ అమ్ముతూ కనిపించాడు. మద్యప్రదేశ్‌లోని గాల్వియర్‌లో కేజ్రీవాల్‌లా క్యాప్ ధరించి, ఆయన మాదిరి వేషధారణలో ఉన్నాడు. చూస్తే అరవింద్ కేజ్రీవాలే అని అనుకుంటారు. అంతలా ఉంది అతని వేషధారణ. అతను ఒక బిజీ రోడ్డుపై చాట్బండితో కనిపించాడు. తన మెనుని అక్కడే ఉన్న చెట్టుకి వేలాడదీశాడు. పైగా అతని వద్ద సమోసా, చాట్, గులాబ్ జామ్ వంటి అన్ని రకాల స్నాక్ ఐటమ్స్ ఉన్నాయి. పైగా వాటి ధర కేవలం రూ. 10 నుంచి మొదలై రూ. 30 వరకు మాత్రమే ఉంది. తాను నాణ్యతను నమ్ముతానని, తన దగ్గర మంచి నాణ్యతతో లభించే ఆహార పదార్థాలే ఉంటాయని, ఇలాంటివి మరెక్కడ ఉండవని చెబుతున్నాడు. ఈ మేరకు విశాల్ శర్మ అనే ఫుడ్ బ్లాగర్ గాల్వియర్‌లో చాట్ అమ్ముతున్న కేజ్రీవాల్ అనే క్యాప్షన్ జోడించి మరీ వీడియోని ఇన్‌స్టాగ్రాంలో పోస్ చేశాడు. అంతేగాదు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఢిల్లీలో అన్ని ఉచితంగా ఇస్తే, ఈయన నాణ్యతను నమ్మతారు కాబోలు అని వీడియోలో చమత్కరించాడు. దీంతో నెటిజన్లు బహుశా అతని వ్యాపారానికి ప్రభుత్వ లైసెన్సు లభించొచ్చు అని ఒకరూ, చాలా తక్కువ ధరలో మంచి స్నాక్స్ అందిస్తున్నాడు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by vishal sharma (@foodyvishal) (చదవండి: వీడియో: బెంజ్ కారులో వచ్చి డబ్బులు నేలకేసి కొట్టాడు.. ఆమె ఏం చేసిందో చూడండి) -
కోచింగ్ ఫీజు కోసం.. రాత్రిపూట టీ అమ్ముతూ...
ఎందరో స్ట్రీట్ లైట్ల కింద చదువుకుని చాలా ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్లను చూశాం. మరికొందరూ చదవుకుంటూ తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండి అందరికీ ఆదర్శంగా ఉంటారు. ఇంకొందరూ తమ చదువుకు అయ్యే ఖర్చు తల్లిదండ్రులను అడగకుండా స్వశక్తితో సంపాదించుకోవాలనుకుంటారు. మరికొందరూ ఇంట్లో పరిస్థితులు సహకరించక తాము అనుకున్న విద్యను అభ్యసించేందకు రకరకాల మార్గాల్లో కష్టపడుతుంటారు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడే చోటు చేసుకుంది. ఇక్కడొక విద్యార్థి కోచింగ్ ఫీజు కోసం అని రాత్రిపూట టీ అమ్ముతుంటాడు. ఆ విద్యార్థి పేరు అజయ్. అతను పగటి పూట చదువుకుంటూ రాత్రిపూట సైకిల్‌పై టీ అమ్ముతూ కోచింగ్ డబ్బులు కూడబెట్టుకుంటున్నాడు. అందుకు సంబంధించిన వీడియోని గోవింద్ గుర్జార్ అనే జర్నలిస్ట్ ట్విట్టర్లో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు స్పూర్తిదాయకం, ఇలాంటి యువతకు ఆర్థిక సాయం అందిస్తే చక్కగా చదువుకుంటారంటూ సదరు విద్యార్థిని ప్రశంసిస్తూ చేస్తూ ట్వీట్ చేశారు. #साइकल_वाली_चाय इंदौर.. हमारे आदिवासी भाई अजय से मिलोगे..! अजय दिन में पढ़ाई करता है और रात को चाय बेचता है ताकि कोचिंग,रहने,खाने का खर्चा निकल से..! सच में अजय भगवान करे कभी बड़ा आदमी बन गया तो चाय बेचने वाला ये वीडियो अजय के संघर्ष का जीता जागता सबूत साबित होगा. pic.twitter.com/N2LnR6mo2T — Govind Gurjar (@Gurjarrrrr) December 23, 2022 (చదవండి: వాట్ ఏ మాస్క్..ఎంచక్కా తీయకుండానే అలానే ఆహారం తినేయొచ్చు) -
బ్రిటన్ రాణి వాడిపడేసిన టీబ్యాగ్ ఎంతకు అమ్ముడుపోయిందంటే....
బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 బల్మరల్ కోటలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర కథనాలు ఆమె మరణాంతరం వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బ్రిటన్ రాణి వాడిపడేసి ఒక టీబ్యాగ్ గురించి ఒక కథనం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాజ కుటుంబికులుకు సంబంధించిన వస్తువులు బయటకు రావడం అనేది అసాథ్యం. అత్యంత కట్టుదిట్టమైన భద్రతల నడుమ వారు ఉపయోగించే వస్తువులు గురించి బయట వ్యక్తులకు తెలిసి ఉండే అవకాశమే అరుదు. అలాంటిది ఆమె వాడిపడేసి టీ బ్యాగ్ ఏంటీ? అది నిజంగా ఆమె ఉపయోగించినదేనా అనే సందేహాలు రావడం సహజమే. కానీ ఔను! ఇది నిజం అని చెప్పే ఆధారాలను కూడా పొందుపరిచారు. అసలేం జరిగిందంటే....70 ఏళ్లు సుదీర్ఘ పాలనతో రికార్డు సృష్టించిన క్విన్ ఎలిజబెత్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోలేక బ్రిటన్ ప్రజలు ఆమె పాలనను గుర్తు చేసుకుంటూ ఆమె ఉపయోగించని వస్తువులను విక్రయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ టీ బ్యాగ్ గురించి ఒక కథనం బయటపడింది. 1998లో విండ్సర్ కాజిల్ అనే వ్యక్తి దీన్ని అక్రమంగా బయటకు తరలించినట్లు సమాచారం. ఇది దివగంత క్వీన్ ఎలిజబెత్ 2 ఉపయోగించిన రెజీనా బ్రిటానియా టీ బ్యాగ్‌గా నివేదిక పేర్కొంది. ఇది ఇప్పుడు 'ఈబే' అనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆన్లైన్ విక్రయాల జాబితాలో ఉంచింది. ప్రస్తుతం ఈ వస్తువు ఆన్లైన్లో సుమారు రూ. 9 లక్షలకు విక్రయించబడింది. ఈ టీ బ్యాగ్‌ని యూఎస్‌కి చెందిన జార్జియా కొనుగోలు చేశారు. ఈ టీబ్యాగ్కి 'రాయల్ ఆర్ట్ఫాక్ట్'తో పాటు 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికేట్స్ ఆఫ్ అథెంటిసిటీ' జారీ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ అథెంటిసిటీ ఉందని చెప్పారు. ఇది నిస్సందేహంగా బ్రిటన్ రాణి వినియోగించిన టీ బ్యాగేనని జార్జియా చెబుతున్నారు. అలానే గతంలో 1985లో గ్రేట్ వెస్ట్రన్ రైల్వే 150వ వార్షికోత్సవం సందర్భంగా క్వీన్ ఎలిజబెత్, ప్రిన్స్ ఫిలిప్ సంతకాలతో కూడిన ఒక పుస్తకం దాదాపు రూ. 19 లక్షలకు విక్రయించబడినట్లు ఈబే కామర్స్ సంస్థ పేర్కొంది. (చదవండి: ఎలిజబెత్ 2 వివాహానికి ఖరీదైన్ డైమెండ్ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చిన నిజాం నవాబు) -
ఇల్లు అమ్మేసిన బిగ్‌బీ అమితాబ్ బచ్చన్.. ధర ఎన్ని కోట్లంటే..
Amitabh Bachchan Sells Delhi House Sopaan For 23 Crore: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తన ఇంటిని అమ్మేశారు. సౌత్ ఢిల్లీలోని ఆ ఖరీధైన బంగ్లాకు 'సోపాన్' అని పేరు. అందులో అమితాబ్ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ ఉండేవారు. హీరో కావాలని అమితాబ్ ముంబైకి వచ్చేవరకు ఆ ఇంట్లోనే ఉండేవారు. అంతేకాకుండా బచ్చన్ ఫ్యామిలీకి మొట్టమొదటి సొంతిల్లు కూడా అదే. అయితే తాజాగా ఆ ఇంటిని అమితాబ్ అమ్మేశారు. సోపాన్ను నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో అవని బడెర్ సుమారు రూ.23 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక బచ్చన్ ఫ్యామిలీకి అవని బడెర్ ఎప్పటి నుంచో తెలుసు. 'సోపాన్'కు దగ్గర్లోనే ఆయన కూడా నివసించేవారు. ఇప్పుడు ఆ ఇంటిని ఆయన సొంతం చేసుకున్నారు. అయితే సోపాన్ను అమ్మినా అమితాబ్‌కు ముంబైలోని జుహులోనే ఐదు విశాలవంతమైన బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని పేర్లున్న ఈ బంగ్లాలు ఎంతో ఖరీదైనవి. ఇక గతేడాది అంధేరిలో సుమారు రూ. 31 కోట్లు పెట్టి బిగ్‌బి ఓ డూప్లెక్స్ ఫ్లాట్‌ని కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. -
టీ పొడి కిలో రూ.99,999
గువాహటి: అస్సాంలోని డిబ్రూగఢ్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన వేలంలో ప్రత్యేక రకమైన ‘మనోహరి గోల్డ్’ టీ పొడికి కిలో రూ.99,999 ధర పలికింది. దేశంలో టీ పొడికి ఇదే అత్యధిక ధర. టీ రుచిలో ప్రత్యేకత కోరుకునే అభిరుచిగల వినియోగదారుల కోసం ఇలాంటి ప్రీమియం టీ పొడిని తయారు చేస్తామని మనోహరి టీ ఎస్టేట్ యజ మాని రాజన్ లోహియా అన్నారు. ఈ టీ పొడిని కాచినపుడు డికాక్షన్ ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుందని, సేవిస్తే మనసు తేలికపడిన భావన కలుగుతుందని, పలు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. ఈ టీపొడిని సౌరభ్ టీ ట్రేడర్స్ రికార్డు ధరకు కొనుగోలు చేసిందని వేలం నిర్వాహకులు తెలిపారు. -
ఒక్క రోజులో లక్ష స్కూటర్ల విక్రయం
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన పరిశ్రమలో మార్కెట్ లీడర్ హీరో మోటోకార్ప్ గత వారం 10వ వార్షికోత్సవం సందర్భంగా ఒక్క రోజు లక్ష యూనిట్లకు పైగా రిటైల్ చేసినట్లు తెలిపింది. ఆగస్టు 9నతో మా ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుందని.. హీరో మోటోకార్ప్‌లో ఇదొక మైలురాయి అని కంపెనీ సేల్స్ హెడ్ నవీన్ చౌహాన్ తెలిపారు. దేశీయ, గ్లోబల్ మార్కెట్లలో పండుగలు లేని సమయంలో కూడా కస్టమర్లు ఈ స్థాయిలో ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కొనుగోళ్లు జరపడం ఇదే ప్రథమమని చెప్పారు. కొత్తగా విడుదల చేసిన మాస్ట్రో ఎడ్జ్ 125, డెస్టినీ, ప్లెజర్ 110 స్కూటర్లకు అధిక డిమాండ్‌తో పాటు ఇతర బైక్స్లు రోజు వారీ సగటు కంటే రెట్టింపు అమ్మకాలు జరిపాయని తెలిపారు. చదవండి : సాఫ్ట్వేర్ సంస్థ (24)7.ఏఐ భారీ నియామకాలు -
కళాకారుడు, ఈ అదృశ్య శిల్పం కాస్ట్ ఎంతో తెలుసా?!
ఇక్కడ కనిపిస్తున్న శిల్పం ఖరీదు రూ. 13 లక్షలు. ఏంటీ వేళాకోళమా? లేనిది ఉన్నట్టు ఊహించుకోవాలా? అని కన్నెర్ర చేయకండి. నిజమే ఇక్కడ శిల్పం లేదు. అలాగని వేళాకోళమూ కాదు. ఎందుకంటే అది అదృశ్య శిల్పం! ఇటలీకి చెందిన సాల్వటోర్ గారౌ 150 సెం.మీ వెడల్పు, 150 సెం.మీ పొడవు ఉండే ఓ రాతిని ‘నేను’ అనే శిల్పంగా అభివర్ణించాడు. దేవుడికి రూపం లేన ట్లుగానే మనిషికి, అతని నిజమైన స్వభావానికీ రూపం ఉండదనే భావనతో దానిని రూపొందించాడు. అందుకే ఇదొక అదృశ్య శిల్పం. దీనిని ఓ ప్రత్యేక గదిలో నిర్దిష్ట వాతవరణంలో భద్రపరుస్తారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ శిల్పాన్ని ఓ వ్యక్తి పదమూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేశాడు కూడా. ఇదంతా వింటుంటే గతంలో 86 లక్షల రూపాయల విలువ చేసిన ‘గోడ మీద టేపుతో అతికించిన అరటిపండు’ కళాకృతి కంటే క్రేజీగా ఉంది కదూ! -
కోవిడ్ పేషెంట్ కలకలం.. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ..
సాక్షి, నల్గొండ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా వేల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్, కఠిన ఆంక్షలు అని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.అదే క్రమంలో వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్, పౌష్టికాహారాలను తీసుకోవాలని సూచిస్తోంది. ఇంతలా చర్యలు తీసుకుంటూ, అప్రమత్తం చేస్తున్నా.. కొందరు మాత్రం ఏ భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా కొందరు బయట నిర్లక్ష్యంగా తిరుగడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తూ వైరస్ వ్యాప్తికి దారులు తెరుస్తున్నారు. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ.. ఇంకొందరు అయితే కరోనా సోకి కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండకుండా.. బయట యధేచ్చగా తిరుగుతూ వారే ప్రాణాలే కాక ఇతర ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా కరోనా సోకిన ఓ మహిళ మార్కెట్లో సాఫీగా కూరగాయలు అమ్ముతోంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ క్వారెంటైన్లో ఉండకుండా బయట రోడ్లపై తిరుగుతుంది. ఇటీవల ఆమెకు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇలా బయటకు వచ్చింది. అవగాహన లేమితో కారణంగా కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతోంది. ఇది గమనించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్‌కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
అంబానీ కీలక నిర్ణయం: షేరు జంప్
సాక్షి, ముంబై: అప్పుల సంక్షోభంలో ఇరుక్కున్న అనిల్ అంబానీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన నేతృత్వంలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధాన ఆస్తిని విక్రయించారు. ప్రయివేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు అప్పు తీర్చే పనిలో భాగంగా తన వేలకోట్ల ఆస్తిని అంబానీ విక్రయించారు. బ్యాంక్‌కి బకాయి పడిన కోట్ల రూపాయల అప్పుని తీర్చేందుకు ముంబైలోని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముంబై ప్రధాన కార్యాలయం ‘రిలయన్స్ సెంటర్‌ను ’ను విక్రయించారు.ఈ పరిణామంతో స్టాక్ మార్కెట్లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరు దాదాపు 9.50శాతం ఎగియడం విశేషం. రిలయన్స్ ఇన్ఫ్రా మార్కెట్ సమాచారంలో ఈ విషయాన్ని వెల్లడించింది. యస్ బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉద్దేశించిన ఈ లావాదేవీ విలువ రూ .1200 కోట్లు అని తెలిపింది. ఈ అమ్మకంతో బ్యాంక్ ఇదే ఆఫీస్‌ని తన కార్పోరేట్ హెడ్‌క్వార్డర్స్‌గా మార్చుకోనుంది. కాగా 2021 జనవరిలోనే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం 3 ఆస్తులను విక్రయించింది. ఢిల్లీ ఆగ్రా టోల్ రోడ్ (3,600 కోట్ల రూపాయలకు) పర్బతి కోల్డామ్ ట్రాన్స్మిషన్ (900 కోట్ల రూపాయల) అమ్మిన సంగతి తెలిసిందే. (పెరుగుతున్న ఇళ్ల ధరలు, ఇంకా పెరగొచ్చు!) చదవండి : కేంద్రం యూటర్న్ : ఏప్రిల్ ఫూల్ జోకా? -
అత్యవసరాల తరలింపునకు రైల్వే పార్సిల్ వ్యాన్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్నందున అత్యవసర మందులు, పండ్లు, ఇతర వస్తువులకు పలు ప్రాంతాల్లో కొరత ఏర్పడింది. దీంతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో రైల్వే శాఖను కేంద్రం అప్రమత్తం చేసింది. ప్రత్యేకంగా పార్సిల్ వ్యాన్లను వెంటనే పట్టాలెక్కించాలని ఆదేశించింది. ఈమేరకు సికింద్రాబాద్ నుంచి హౌరాకు తొలి పార్సిల్ రైలు బయలుదేరింది. ఇందులో 92 టన్నుల సామగ్రిని తీసుకెళ్లారు. పుచ్చకాయలు, మామిడిపండ్లు, నిమ్మకాయలు, మందులు, వైద్య పరికరరాలు, ఇతర యంత్రాల విడిభాగాలు, కోడిగుడ్లు, చాక్లెట్లు, బిస్కెట్లు, చేపలు, నెయ్యి తదితరాలున్నాయి. మొత్తం 3,005 డబ్బాల్లో వీటిని తరలించారు. సాధారణంగా పార్సిల్ వ్యాన్ గంటకు 30 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ప్రస్తుతం సరుకు తొందరగా డెలివరీ కావాల్సిన పరిస్థితి ఉండటం, ట్రాక్‌పై ఇతర రైళ్లు నడవటం లేనందున ఈ రైలును గంటకు 55 కి.మీ. వేగంతో నడపటం విశేషం. దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో చాలా వస్తువులకు కొరత ఉన్న నేపథ్యం లో మరిన్ని పార్సిల్ వ్యాన్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు వ్యాపారులతో మాట్లాడి ఏర్పా ట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సరుకును తరలించే ముందు వ్యాన్లను శుభ్రం చేశారు. ఈ పనుల్లో నిమగ్నమైన సిబ్బం ది భౌతిక దూరాన్ని పాటించటమే కాకుం డా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకునేలా చూశామని రాకేశ్ పేర్కొన్నారు. శానిటైజర్, మాస్కుల తయారీ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తన సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులను రైల్వేశాఖ అందుబాటులో ఉంచుతోంది. ప్రస్తుతం లాక్డౌన్ నేపథ్యంలో ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయినా, అత్యవసర పనుల కోసం కొంతమంది సిబ్బంది విధుల్లో ఉంటున్నారు. వారందరికీ శానిటైజర్లు, మాస్కులను అందిస్తున్నారు. వాటిని ఎక్కడి నుంచో కొనుగోలు చేయకుండా సొంతంగానే తయారు చేసుకోవటంపై రైల్వే దృష్టి సారించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 17,800 మాస్కులు, 2,672 లీటర్ల శాని టైజర్‌ను సిబ్బంది తయారు చేశారు. వా టిని అన్ని డివిజన్లలో అత్యవసర విధుల్లో ఉన్న సిబ్బందికి అందజేశారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుం టూరు, గుంతకల్, నాందెడ్ డివిజన్లతోపాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న రైల్వే వర్క్‌షాపుల్లో తయారు చేశారు. వీటితో పాటు అన్ని ప్రాంతాల్లో సిబ్బంది ఎప్పటికప్పుడు చేతులు కడుక్కునేందుకు సబ్బులు, కావాల్సినన్ని నీళ్లు అందుబాటులో ఉంచారు. వారు విధిగా భౌతిక దూరాన్ని పాటించాలని అధికారులు ఆదేశించారు. -
హనన్ అను నేను
-
అపుడు జాతీయ క్రీడాకారిణి..ఇపుడు
చిరాంగ్: ఒకప్పటి ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతలు తర్వాతి కాలంలో జీవనోపాధికోసం అష్టకష్టాలు పడుతున్న వైనం పై అనేక కథనాలు వెలుగు చూశాయి. తాజాగా అసోంకు చెందిన క్రీడాకారిణి దుర్బర పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం తాజా కలకలం రేపింది. ఒకపుడు జాతీయ స్థాయిలో గెల్చుకున్న పతకాలతో ఆమె ముఖంగా కళకళలాడింది. కానీ నేడు మండుటెండలో రోడ్డు పక్కన కమలాలు అమ్ముకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమె పేరే ప్రముఖ ఆర్చర్ బులి బాసుమతారీ. ఒకపుడు ఆర్చరీ ఛాంపియన్ షిప్ పోటీలలో రెండు బంగారు, వెండి పతకాలు ఆమె సొంతం. కానీ ఇపుడు ఇద్దరు పిల్లల తల్లి అయిన బులి ఇపుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు స్ట్రీట్ వెండర్ గా మారిపోయింది. గత మూడేళ్లుగా ఈ ఆర్చర్ పేదరికంతో దీనంగా కాలం గడుపుతోంది. అస్సో చిరాంగ్ జిల్లా కు చెందిన బులి బాసుమతారీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వద్ద ఆర్చరీలో శిక్షణ తీసుకుంది. అనంతరం నేషనల్ సబ్ జూనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకుంది. ఆతర్వాత నేషనల్ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్ షిప్ 50 మీటర్ల ఈవెంట్లో రెండు స్వర్ణం పతకాలను గెలుచుకుంది. 2010లో అనారోగ్యం పాలుకావడంతో క్రీడకు దూరమైంది. అనంతరం పేదరికంతో ఆమెను ఆర్చరీ క్రీడకు మరింత దూరం చేసింది. అయితే అక్కడితో బులి ఆగిపోలేదు. హయ్యర్ సెకెండరీ స్కూలు విద్యార్థులకు ఆర్చరీ క్రీడలో శిక్షణ ఇస్తూ క్రీడా స్ఫూర్తిని చాటుకుంటోంది. అనేక పతకాలు గెలుచుకున్న తాను గత మూడేళ్లుగా కమలాలు అమ్ముకొని జీవనాన్ని సాగిస్తున్నాని బులి వాపోయింది. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతోంది. అయితే దీనిపై రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖ స్పందించింది. త్వరలోనే ఆమెను ఆర్చరీ కోచ్ నియమించనున్నట్టు మంత్రి పల్లబ్ లోచన్ దాస్ తెలిపారు. దీనికి ముందు పంజాబ్‌లో స్వల్ప కాలిక శిక్షణ ఇప్పించి అనంతరం, వచ్చే వారంలోనే ఆమెను కోచ్ గా నియమిస్తామని చెప్పారు. -
స్పైస్ జెట్.. స్పైసీ సేల్
ముంబై: బడ్జెట్ జెట్ ఎయిర్ వేస్ స్పైస్ జెట్ స్పైసీ యాన్యూల్ సేల్ ను ప్రకటించింది. రూ.737ల నుంచి ప్రారంభమయ్యే నాలుగు రోజుల అమ్మకాలను సోమవారం ప్రారంభించింది. రూ.737 (అన్నిచార్జీలు కలిసి)తగ్గింపు ధరలను దేశీయ ప్రయాణాలపై అనుమతించనుంది. ఈ రోజు మొదలయ్యే ఆఫర్ నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ అందుబాటులోఉంటుందని స్పైస్ జెట్ వెల్లడించింది. ఈ ఆఫర్ లో బుక్ చేసుకున్న టికెట్లతో జనవరి9 -అక్టోబర్ 28 , 2017 మధ్య ప్రయాణించవచ్చని తెలిపింది. 2017 స్పైస్‌జెట్ రూ మొదలు ఛార్జీల చెప్పారు. చెన్నై- కోయంబత్తూర్- చెన్నై, జమ్ము- శ్రీనగర్ - జమ్మూ, చండీగఢ్ - శ్రీనగర్ - చండీగఢ్, అగర్తలా - గౌహతి ల మధ్య దాదాపు 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయనుందని తెలిపింది. ఈ ఆఫర్ కింద కొనుగోలుచేసిన టిక్కెట్లు రద్దు చేస్తే మాత్రమే చట్టబద్ధమైన పన్నులు చెల్లించమని స్పష్టం చేసింది. అలాగే పాత రూ. 500, రూ. 1,000 కరెన్సీ కి నవంబర్ 24 అర్ధరాత్రి వరకూ తమ విమానాశ్రయం కౌంటర్లవద్ద అనుమతి ఉన్నట్టు తెలిపింది. ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనేది స్పష్టం చేయలేదు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలో టికెట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
జుకర్‌బర్గ్ భారీమొత్తంలో షేర్ల విక్రయం
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, తన దాతృత్వ సంస్థకు ఫండ్ కోసం భారీ మొత్తంలో స్టాక్‌ను విక్రయించారు. 95 మిలియన్ డాలర్ల(రూ. 637కోట్లకు పైగా) విలువ చేసే 760,000లకు పైగాఫేస్బుక్ స్టాక్ లోని షేర్లను విక్రయించినట్టు రెగ్యులేటరీకి సమర్పించిన ఫైలింగ్‌లో జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్ హోల్డింగ్స్, చాన్ జుకర్‌బర్గ్ ఫౌండేషన్ ద్వారా ఈ విక్రయం జరిపినట్టు వెల్లడించారు. 122.85 డాలర్ల నుంచి 124.31 డాలర్ల శ్రేణిలో ఈ షేర్ల ధరలు నమోదయ్యాయి. చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్ ద్వారా హెల్త్, సైన్సు, ఎడ్యుకేషన్ సమస్యల పరిష్కారానికి ఫండ్‌ను అందించడానికి జుకర్‌బర్గ్ ఇంతమొత్తంలో షేర్లను విక్రయిచడం ఇదే మొదటిసారి. తన కూతురు మాక్స్ పుట్టిన సందర్భంగా 2015లో తన కంపెనీలోని 99 శాతం షేర్లను అంటే 45 బిలియన్ డాలర్లను దానం చేసేయాలని జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిన్సిలా చాన్ నిర్ణయించారు. ప్రపంచాన్ని సంతోషంగా, ఆరోగ్యకరంగా చూసేందుకు చాన్ జుకర్ బర్గ్ ఇనీషియేటివ్‌ను ప్రారంభిస్తున్నామని కూడా పేర్కొన్నారు. మనుషుల శక్తి సామర్థ్యాలు, సమానత్వాన్ని పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు, సమానహక్కులు కల్పించి, కమ్యూనిటీస్లను అభివృద్ధి చేసేందుకు ఈ ఇనీషియేటివ్ తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రకటించిన నెలలోనే 99 శాతం ఫేస్బుక్ షేర్లను చాన్ జుకర్‌బర్గ్ ఇనీషియేటివ్‌కు ట్రాన్సఫర్ చేసినట్టు తెలిపారు. వచ్చే మూడేళ్ల తర్వాత నుంచి ఫండ్ కోసం వార్షికంగా 1 బిలియన్ వరకు షేర్లను విక్రయించనున్నట్టు కూడా వెల్లడించారు. -
పుంజుకుంటున్న యాపిల్
ప్రపంచ వ్యాప్తంగా తన ప్రాభవం కోల్పోతూ ఒబ్బందులు పడుతున్న ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కు కాస్త ఊరట లభించినట్టే కనిపిస్తోంది. అవును .. జూన్ తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలకు మించి యాపిల్ ఆదాయంలో రాణించింది. ప్రధానంగా యాపిల్ ప్రధాన ఉత్పత్తి అయిన ఐ ఫోన్ అమ్మకాలు కూడా నిపుణలు అంచనాలకు అందకుండాపోయాయి. క్వార్టర్ 3 లో యాపిల్ ఐ-ఫోన్ సేల్స్ భారీగా పెరిగాయట. వాల్ స్ట్రీట్ పండితులు సైతం ఊహించలేని స్థాయిలో విక్రయాలను నమోదు చేసింది. దాదాపు 40.4 మిలియన్ ఐ ఫోన్ల అమ్మకాలు జరిగినట్టు నివేదికలు తెలిపాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో తో పోలిస్తే 15 శాతం క్షీణించినప్పటికీ ఎనలిస్టుల అంచనాలను మించి అమ్మకాలు సాగించిందని ఈ పరిశోధన సంస్థ వివరించింది. యాపిల్ త్రైమాసిక నికర లాభం, 27 శాతం తగ్గి 7.8 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అలాగే నికర ఆదాయం 42.36 బిలియన్ డాలర్లుగా నమోదు చేసింది. అయితే విశ్లేషకులుయాపిల్ ఆదాయాన్ని 42. 09 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. దీంతో మంగళవారం నష్టాలతో ముగిసిన యాపిల్ షేర్ బుధవారం ఓపెనింగ్ లోనే 7శాతం లాభాలను నమోదు చేసింది. యాప్ స్టోర్, ఐక్లౌడ్ తమకు మంచి ఫలితాలిచ్చిందని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ లుకా మాస్ట్రీ తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఐఫోన్ 6 అమ్మకాలు బ్లాక్ బ్లస్టర్గా నిలిచాయన్నారు. ఈ ఏడాది విడుదల చేసిన చవకైన 10సెం.మీ ఐ ఫోన్ ఎస్ఈ కొనుగోలుదారుల స్థాయిని విస్తరించిందని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. అయితే సంస్థకు చైనా ప్రధాన నిరుత్సాహపరిచేదిగా ఉందని మూర్ ఇన్సైట్స్ అండ్ స్ట్రాటజీ విశ్లేషకుడు పాట్రిక్ మోర్హెడ్ చెప్పారు. తాము ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలుసాధించిందని కస్టమర్ డిమాండ్ కూడా అంచనాలను మించిందని పేర్కొంది. 2007 లో గాడ్జెట్ విడుదల నుంచి మొదటిసారి పడిపోయిందనీ, ఐఫోన్ అమ్మకాలు గత త్రైమాసికంలో 16.3 శాతం క్షీణించాయని తెలిపింది. కాగా చైనాలో ఐ ఫోన్ అమ్మకాలపై నిషేధం యాపిల్ కు పెద్ద దెబ్బ. అసలే కష్టాల్లో ఉన్న సంస్థపై ఇది మరింత ప్రభావాన్ని చూపింది. అయితే అక్కడి రెగ్యులేటరీ సంస్థతో చర్చలు జరుపుతున్నామని సంస్థ తెలిపింది. యాపిల్ ఐ ఫోన్ అమ్మకాలు ఇండియా ప్రధాన మార్కెట్ గా నిలిచి దాదాపు 51 శాతం వృద్ధిని నమోదు చేసింది. చైనాలో 33.2 క్షీణతను నమోదు చేసింది. -
ఆడబిడ్డను 'అమ్మే' సింది!
ధన్బాద్ః ముగ్గురు పిల్లలకు మాతృమూర్తి. అయినా మరోకాన్పుకు సిద్ధమైంది. నాలుగోసారి ఇద్దరు కవలపిల్లలు పుట్టారు. అప్పుడుకానీ ఆమెకు పెంచలేమన్న భయం తెలియలేదు కాబోసు.. కళ్ళుతెరవని పసిగుడ్డును బేరం పెట్టేసింది. పిల్లలు లేని ఓ మహిళకు కేవలం 7 వేల రూపాయలకు పొత్తిళ్ళలో బిడ్డను అమ్మేసింది. ఆర్థిక దారిద్ర్యం ఆమెను 'అమ్మ'కానికి పురిగొల్పింది. జార్ఖండ్ ధన్‌బాద్ ప్రాంతానికి చెందిన 40 ఏళ్ళ దులాలీ దేవి తన నవజాత శివువును పాటలీపుత్ర మెడికల్ కాలేజీ (పీఎంసీహెచ్) వద్ద ఓ పిల్లలు లేని మహిళకు 7000 రూపాయలకు అమ్మేసింది. దులాలీ దేవికి అప్పటికే ముగ్గురు సంతానం ఉండగా.. ఆమె నాలుగో ప్రసవంలో పీఎంసీహెచ్ లోని గైనకాలజీ వార్డులో ఒక ఆడ, ఒక మగ సహా ఇద్దరు కవల పిల్లలు పుట్టారు. దీంతో పుట్టిన కవలల్లోని ఆడబిడ్డను దులాలీ దేవి.. పిల్లలు లేని షహీదా కతూన్ కు 7 వేల రూపాయలకు అమ్మేసినట్లు ఛైల్డ్ వెల్ఫేర్ కమిటి (సీడబ్ల్యూసీ) ఛైర్ పర్సన్ నీతా సిన్హా తెలిపారు. ఆర్థిక అవసరాలతో దులాలీ దేవి బిడ్డను అమ్మేసిన సమాచారం తెలుసుకున్న సీడబ్ల్యూసీ జోక్యంతో... 24 గంటలు తిరిగే లోపు బిడ్డ తల్లివద్దకు చేరింది. శిశువును వెనక్కు తెప్పించిన సమయంలోనే షహీదా కనూన్ ను జూలై 21న విచారణకోసం తమ కార్యాలయానికి రమ్మని పిలిచినట్లు సిన్హా తెలిపారు. మరోవైపు పీఎంసీహెచ్ ఆసుపత్రిలో పసిపిల్లల అమ్మకాలపై ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రారంభ నివేదికల ప్రకారం తమ ఆస్పత్రిలోని సిబ్బందికి అమ్మకాలకు ఎటువంటి సంబంధం లేదని పీఎంసీహెచ్ సూపరింటిండెంట్ డాక్టర్ రంజన్ పాండే చెప్పారు. అయితే ఆస్పత్రిలో ప్రస్తుత సంఘటన ఎలా జరిగింది అన్నదానిపై విచారణకు ఆదేశించింది. తన ఐదుగురు పిల్లలను పెంచే స్థోమత లేకపోవడంతోనే బిడ్డను అమ్మే ప్రయత్నం చేసినట్లు దులాలీదేవి ఆస్పత్రి అధికారులు, సీడబ్ల్యూసీ ముందు ఒప్పుకుంది. తన భర్త ఓ రోలింగ్ మిల్లులో పని చేస్తాడని, అతడి ఆదాయం కుటుంబ పోషణకు ఏమాత్రం చాలడం లేదని.. పొట్ట గడవడంకోసమే తన బిడ్డను అమ్మకానికి పెట్టాల్సివచ్చిందని దులాలీ ఆవేదన వ్యక్తం చేసింది. -
దూసుకుపోతున్న రెడ్ మి అమ్మకాలు
స్మార్ట్ ఫోన్ల వ్యాపారాల్లో ఇటు చైనా తర్వాతే ఏ కంపెనీలైనా.. ఇటు నాణ్యతకు నాణ్యత.. అటు ధరకు ధర, అమ్మకాలకు అమ్మకాలు. ఇదే జోష్ తో ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ షియోమి అందంగా ఆకట్టుకునే విధంగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన రెడ్ మి ఫోన్లు అమ్మకాల్లో దూసుకెళ్తున్నాయట. ప్రతి నాలుగు సెకన్లకు 5 రెడ్ మి ఫోన్లు అమ్ముడు పోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కేవలం చైనాలో మాత్రమే కాక, కంపెనీకి రెండో అతిపెద్ద మార్కెట్ గా ఉన్న భారత్ మార్కెట్లో కూడా ఇంతే అమ్మకాలను నమోదుచేస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రెడ్ మీ ఫోన్ 2013 ఆగస్ట్ లో ఆవిష్కరించారు. అప్పటినుంచి మొత్తం 1100లక్షల రెడ్ మీ ఫోన్లు అమ్ముడు పోయినట్టు షియోమీ గ్లోబల్ ఆపరేషన్ల వైస్ ప్రెసిడెంట్ హ్యుగో బార ట్వీట్ చేశారు. మూడేళ్లలో ఒక సెకనుకు 1.21 యూనిట్లు అమ్మినట్టు ట్వీట్ లో పేర్కొన్నారు. అనువైన ధరలతో రెడ్ మి ఫోన్లను షియోమి మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ప్రత్యేకతల్లోను ఈ ఫోన్లు వినియోగదారులను ఆకట్టుకునే విధంగానే ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఫ్లాష్ సేల్స్ ద్వారానే తన చాలా పోన్లను అమ్మినట్టు షియోమి పేర్కొంది. షియోమి తాజాగా రెడ్ మీ నోట్ 3 ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ మెమరీ, 3జీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమరీ ఆప్షన్ లో ఈ ఫోన్ రెండు వేరియంట్లలో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. 2జీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,999. 3జీబీ ర్యామ్ ధర రూ.11,999. 1.8జీహెచ్ జడ్ హెక్సా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 650 ప్రాసెసర్, 128 జీబీ విస్తరణ మెమరీ ఈ ఫోన్ ఫీచర్లు. -
ఆ టీవీ అమ్మకాలు షురూ!
మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ లనుంచి ఇక బయటపడట్టే. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ కనిపెట్టిన దోమలను తరిమే సరికొత్త సాధనం "మస్కిటో రిపెల్లింగ్ టీవీ" అమ్మకాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. దక్షిణ కొరియా దిగ్గజం ఎల్జీ ఎలక్ట్రానిక్స్ భారత్ లో ఈ టీవీ అమ్మకాలను చేపడుతోంది. సరికొత్త మస్కిటో ఎవే టెక్నాలజీని అల్ట్రా సోనిక్ తరంగాలతో ఎల్ జీ ఈ టీవీని రూపొందించింది. ఈ తరంగాలతో దోమల చెవులు బద్దలై, ఇంట్లో నుంచి పారిపోతయాని కంపెనీ వెల్లడించింది. దీనికి సమానమైన టెక్నాలజీ ఎయిర్ కండీషనర్స్, వాషింగ్ మెషిన్స్ లో కూడా వాడటానికి చెన్నైకి దగ్గర్లోని ఓ ల్యాబోరేటరీ నుంచి సర్టిఫికేట్ పొందామని ఎల్జీ తెలిపింది. టీవీ స్విచ్ ఆఫ్ చేసినా ఈ టెక్నాలజీ పనిచేసేలా రూపొందించామని, రెండు మోడల్స్ లో ఇది లభ్యమవుతోందని కంపెనీ పేర్కొంది. ఒకటి రూ.26,500 కు, మరొకటి రూ.47,500లకు మార్కెట్లోకి తీసుకొచ్చామని ఎల్జీ ప్రకటించింది. దోమల వల్ల వచ్చే ప్రాణాంతక వ్యాధుల నుంచి అల్ప ఆదాయ వినియోగదారులను రక్షించి, ఆరోగ్యంగా ఉంచే లక్ష్యంతో దీన్ని రూపొందించామని పేర్కొంది. శ్రీలంక, ఫిలిప్పీన్స్ లో వచ్చే నెలనుంచి అమ్మకాలు చేపడతామని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ అధికారి కిమ్ సుంగ్ యేల్ తెలిపారు. లాటిన్ అమెరికాను గడగడలాడించిన జికా వైరస్ ప్రభావంతో ఈ టీవీ రూపకల్పనకు ఎల్జీ శ్రీకారం చుట్టింది. ఈ జికా వైరస్ ప్రభావం రియో నగరంలో కూడా ఉందని ఆగస్టులో జరగబోయే ఒలంపిక్స్ ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ వెల్లువెత్తిన క్రమంలో ఎల్జీ ఈ వినూత్న సాధనాన్ని వేగవంతంగా అభివృద్ధి చేసింది.