ఉన్నత చదువులు చదివినా కొందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వలేరు. మంచి ఉద్యోగం రాక నానాపాట్లు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివినా అందుకు తగ్గ స్థాయిలో ఉద్యోగాల లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణాల వల్లే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు సరైన ఉద్యోగం లేక సతమతమవుతున్నారు. ఇక్కడొక పంజాబ్ వ్యక్తి కూడా అదేకోవకు చెందినవాడు.
వివరాల్లోకెళ్తే..పంజాబ్‌కి చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పీహెచ్‌డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన గత 11 ఏళ్లుగా పంజాబీ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పనిచేశారు. కానీ అక్కడ ఇచ్చే అరకొర జీతం అక్కరకు రాక నానాపాట్లు పడ్డాడు. పైగా వేతనం కూడా సకాలంలో రాకపోవడం వంటి సమస్యలతో విసుగు చెంది బతుకుదెరువు కోసం కూరగాయాలు అమ్మడం ప్రారంభించారు. ఆయన న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన వ్యక్తి. అంతేగాదు జర్నలిజం, పొలిటికల్ సైన్సు వంటి సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి.
ఈ మేరకు సందీప్ సింగ్ మాట్లాడుతూ..సమాయానికి జీతం రాకపోవడం, ఒకవేళ వచ్చినా..ఆ అరకొర జీతంతో తాను తన కుటుంబం బతకడం కష్టంగా మారడంతో కూరగాయాలు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన తన కూరగాయాల బండిపై పీహెచ్‌డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటి ఇంటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముతుంటాడు. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
ఒక పక్కన ఇలా కూరగాయాలు అమ్ముతూనే చదువు కొనసాగిస్తున్నాడు సందీప్ సింగ్. అంతేగాదు తాను తన ప్రొఫెసర్ వృత్తికి బ్రేక్ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ తన ఈ ప్రోఫెసర్ వృత్తిని వదలనని ఇది తనకు ఇష్టమని చెబుతున్నాడు. పైగా డబ్బు ఆదా చేసి, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ని స్టార్ట్ చేయాలన్నది తన కోరిక అని చెప్పాడు. ఈ ఉన్నత విద్యావంతుడి కోరక నెరవెరాలని ఆశిద్దాం. ఇలాంటి ఘటనలు మన దేశంలో ఉన్న నిరుద్యోగతకు అద్దం పడుతోంది కదా!. కొంగొత్త కోర్సులు వస్తున్నట్లే అంతే స్థాయిలో ఉద్యోగాలు ఉంటే ఇలా సందీప్ లాంటి వాళ్లకు కూరగాయాలమ్మే పరిస్థితి ఏర్పడదు కదా!.
(చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!)
Comments
Please login to add a commentAdd a comment