phd
-
అలాంటి చిల్లర కవులు ఎక్కువయ్యారు!
విద్యకు సాటి వచ్చే ధనం లేదనేది సుభాషితం. కాని నేటి వ్యాపార యుగంలో ధనం అన్ని రంగాలనూ శాసిస్తున్నట్టే... విద్య మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ దాన్ని అంగడి సరుకుగా దిగజారుస్తోంది. నేడు సాధారణ డిగ్రీలు మొదలుకొని విద్యారంగంలో అత్యున్నత అర్హతలకు సంబంధించిన పట్టాల వరకు కొనగలిగిన స్తోమత ఉన్నవారికి లభించడం ఈ దుఃస్థితికి నిదర్శనం.ముఖ్యంగా విదేశాలలోనూ, ఉత్తర భారతదేశంలోనూ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న నకిలీ విశ్వవిద్యాలయాలు విక్రయిస్తున్న ఈ డిగ్రీలను ప్రచార వ్యామోహం గల సంపన్నులు తమ పేర్లకు అలంకారాలుగా తగిలించుకొని, అవి తమ ప్రతిభాచిహ్నాలుగా చాటుకుంటున్నారు. ఊరేగింపులు, అభినందన సభలు, విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకొని అవి తమ కీర్తి కిరీటాలుగా జనాన్ని భ్రమపెడుతున్నారు. ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తనకో విదేశీ సంస్థ డాక్టరేట్‌ను ఇవ్వజూపితే ‘డాక్టరేట్ ఇంత తేలికా?’ అని నిజాయతీగా వ్యాఖ్యానించడమే కాదు, తెచ్చుకున్న ఆ డాక్టరేట్ బిరుదును ఎప్పుడూ తన పేరు ముందు, కనీసం ‘నవ్విపోదురు గాక’ పుస్తక రచయితగా కూడా ఉపయోగించలేదు. అలా ప్రలోభాలకు లొంగకుండా అర్హత లేని బిరుదులను తోకలుగా ఉపయోగించని వారు అరుదు. నకిలీ విద్యార్హతలతో ఆత్మవంచనకు, పరవంచనకు పాల్పడుతున్న పెద్దమనుషులే ఎక్కువ.డాక్టరేట్ల సంతర్పణకు కాణాచులుగా మన విశ్వవిద్యాలయాలను చెప్పుకోవాలి. పీహెచ్డీ పట్టాల కోసం పరిశోధనలు ఉద్యోగాలకో, పదోన్నతులకో అవసరం కావడంతో నాటి ప్రమాణాలు దిగజారుతున్నాయి. ఈ జాతరలో పరిశోధక విద్యార్థులు అడ్డదారులను వెతు క్కుంటుంటే పర్యవేక్షకులు వారి కోర్కెలకు అనుగుణంగా తోడ్పడి లబ్ధి పొందుతున్నారు. ‘కాదేదీ కవిత కనర్హం’ అన్నట్లు పరిశోధన ఆవశ్యకత లేని, కేవలం ‘మెథడాలజీ’ చట్రంలో ఇమిడ్చి పీహెచ్డీ పట్టాను పొందే సులభమైన, ఎందుకూ పనికిరాని అంశాన్ని పరిశోధక విద్యార్థికి సూచించడం... విద్యార్థి ఆర్థికంగా ఆశపెడితే సిద్థాంత గ్రంథాన్ని తామే అన్నీ రాసి ఇవ్వడం కొందరు పర్యవేక్షక గురువులు చేస్తున్న నిర్వాకాలు. విశ్వవిద్యాలయాల వెలుపల సిద్ధాంత గ్రంథ రచనకు ధరను మాట్లాడుకొని రాసిపెట్టడం వృత్తిగా కలిగిన నిరుద్యోగ మేధావులు కూడా ఉండడంతో కొందరు పరిశోధకులు వారు అడిగిన డబ్బిచ్చి శ్రమ పడకుండా ‘డాక్టర్లు’ అనిపించుకుంటున్నారు.తెలుగే కాదు, ఆంగ్లం, హిందీ వంటి ఇతర భాష ల్లోనూ, సాంఘిక విజ్ఞాన శాస్త్ర విభాగాల్లోనూ పరిశోధనల స్థాయి భిన్నంగా లేదు. కొందరు ప్రబుద్ధులు ఎలాగోలా ‘పీహెచ్డీ’ అనిపించుకుంటే చాలని పూర్వుల కృషిని కొల్ల గొట్టి రాసిన సిద్ధాంత గ్రంథాలకు కూడా అయ్యవార్ల ఆశీస్సులతో ఆమోద ముద్రను వేయించుకొని ‘మమ’అంటున్న సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే పరిశోధనలన్నీ కాకి బంగారం బాపతేననీ, యోగ్యతకూ నిజాయతీకి స్థానం లేదనీ అనడం కువిమర్శే అవుతుంది. విశ్వవిద్యాలయాలు వివిధ రంగాలలో– ప్రతిభామూర్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్లను, కళాప్రపూర్ణ వంటి బిరుదులనూ ప్రకటించడం ఆనవాయి తీగా వస్తోంది. అయితే వాటిని కానీ, కొన్ని ప్రామాణిక సంస్థలు ఇస్తున్న బిరుదులను కానీ విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, పుట్టపర్తి, సినారె, ఆరుద్ర వంటి దిగ్దంతులెవరూ ఎప్పుడూ, ఎక్కడా భుజకీర్తులుగా వినియోగించుకోలేదు. ఏనుగులపై ఊరేగించినా, గురుతుల్యుల చేత గండ పెండేరాలతో సన్మానింపబడినా వారు వాటిని స్వోత్కర్షగా వాడుకోలేదు. కానీ నేడు కీర్తి కాంక్షతో అభినవ కృష్ణదేవరాయలం అనుకునే కవి పోషకులు, ‘అంతా కవులము కామా’ అనుకునే చిల్లర కవులు ఎక్కువయ్యారు. చదవండి: ఇది మాయ కాక మరేమిటి?వారు ఆశ్రిత కవులకు ‘కవిరత్న’, ’కవిశేఖర’, ‘కవితిలక’ వంటి బిరుదులను ప్రదానం చేసి శాలువాలను కప్పడం... వీరు మరునాడు స్థానిక పత్రికలలో ఆ సత్కారాల గురించి ఘనంగా రాయించుకోవడం ప్రహస నమైపోయింది. ఇటీవల కొన్ని సంస్థలు ఏకంగా కొందరు స్థానిక కవులకు ‘గౌరవ డాక్టరేట్’లను కూడా ప్రదానం చేస్తున్నాయి. కొంతనయం– పద్మ పురస్కారాలను కూడా ప్రకటించడం లేదు! ఏ హక్కు, అధికారం లేకుండా ఎవరు పడితే వారు ఇలా బిరుదులనివ్వడం, ప్రతిభాశూన్యులైన కవులు కూడా వాటిని అలంకారాలుగా ప్రదర్శించడం సమాజానికి హానికరం. దీనికి నియంత్రణ అవసరం!చదవండి: ఎవరిని ఎలా పిలవాలి?ఇటీవల ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్‌కు బెంగుళూరు విశ్వవిద్యాలయం వారు ‘గౌరవ డాక్టరేట్’ను ప్రకటిస్తే ఆయన సున్నితంగా తిరస్కరించడమే గాక ‘అవసరమనుకుంటే ‘నేను థీసిస్‌ను సమర్పించి డాక్టరేట్ తీసుకుంటాను కాని ఉచితంగా కాదు’ అని వ్యాఖ్యానించడం అభినందనీయం. ఆదర్శవంతులు ముఖ్యంగా రాజకీయ, చిత్ర రంగాలకు చెందిన ప్రముఖులు ఎటువంటి ప్రలోభాలకూ లోను కాకుండా గౌరవ డాక్టరేట్ల ప్రత్యేకతను కాపాడుతారని ఆశిద్దాం.- పైడిపాలవిశ్రాంత తెలుగు ఉపన్యాసకులు -
పైసలిస్తే.. పీహెచ్డీ!
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ప్రతిష్ట మసకబారుతోంది. ఇన్నాళ్లూ ఉన్నతంగా వెలుగొందిన వర్సిటీలకు కళంకం ఏర్పడుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే రాజ్యాంగ వ్యవస్థను ధిక్కరిస్తూ 17 వర్సిటీల వైస్ చాన్సలర్ల మెడపై కత్తిపెట్టి రాజీనామాలు చేయించడంతో తిరోగమనం మొదలైంది. అది కాస్తా.. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ద్రవిడియన్ యూనివర్సిటీ అడ్డగోలుగా పీహెచ్‌డీలు మంజూరు చేసే స్థాయికి చేరుకుంది. ప్రభుత్వ పెద్దలు అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తమ అనుయాయులు కొందరికి ఇన్చార్జి వీసీ పోస్టులు కట్టబెట్టారు. ఇందులో భాగంగానే ద్రవిడియన్ వర్సిటీలో తమకు ‘స్వామి భక్తి’ ప్రదర్శించే వ్యక్తికి వర్సిటీ బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు సదరు వ్యక్తి కనుసన్నల్లో ‘పీహెచ్‌డీలో పైసా వసూల్’ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 100 రోజుల్లోనే ఏకంగా 100కిపైగా ఆఫ్ క్యాంపస్ పీహెచ్‌డీలకు ప్రొసీడింగ్ (అవార్డు) చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వాస్తవానికి యూజీసీ 2009లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం డిస్టెన్స్ పీహెచ్‌డీలను నిలిపివేసింది. కానీ, కాసులే పరమావధిగా ద్రవిడియన్ వర్సిటీ ఇన్చార్జి బాస్ అమాయక విద్యార్థుల ఆశలను అడ్డుపెట్టుకుని పనికిరాని పీహెచ్‌డీలు ఇస్తూ రూ.కోట్లలో అవినీతి దందాకు తెరతీసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – సాక్షి, అమరావతి ప్రొసీడింగ్స్ ఇవ్వాలంటే రూ.లక్ష పీహెచ్డీ అవార్డు కంటే ముందు వర్సిటీ విద్యార్థికి ప్రొసీడింగ్స్ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ద్రవిడియన్ వర్సిటీలో ఒక్కో విద్యార్థి నుంచి రూ.లక్ష వసూలు చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థికి గైడ్ ఎవరనేది చూడకుండా.. థీసిస్‌ను పరిశీలించకుండా.. జాతీయస్థాయి వర్సిటీలకు కూడా సాధ్యపడని విధంగా ప్రతిరోజూ రెండు/మూడు పీహెచ్‌డీలను ద్రవిడియన్ వర్సిటీ ఇచ్చేస్తోంది. అది కూడా యూజీసీ గుర్తించని డిస్టెన్స్ విధానంలో ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో వర్సిటీలో అక్రమ సరి్టఫికెట్లతో లైబ్రరీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలి ద్రవిడియన్ వర్సిటీలో పీహెచ్డీ మంజూరులో అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఇటీవల బహిరంగ లేఖను విడుదల చేసింది. గత ప్రభుత్వంలో పీహెచ్డీ అక్రమాలపై జస్టిస్ బి.శేషశయనరెడ్డి కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది. ఆఫ్ క్యాంపస్‌లో పీహెచ్‌డీలు ఇస్తూ విద్యార్థులను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 2009 ముందు రిజి్రస్టేషన్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఆఫ్ క్యాంపస్ పీహెచ్డీ ఇవ్వాలన్న యూజీసీ నిబంధనలకు వ్యతిరేకంగా ద్రవిడియన్ వర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.తాత్కాలిక ఉద్యోగి.. ఇన్చార్జి వీసీ ద్రవిడియన్ వర్సిటీలో 2010లో తాత్కాలిక ప్రాతిపదికన డెప్యూటీ లైబ్రేరియన్‌గా అడుగు పెట్టిన సదరు స్వామిభక్తి పరుడు ఎక్కడిక్కడ నిబంధనలకు విరుద్ధంగానే ప్రమోషన్లు పొందడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టు లేకుండానే నేరుగా డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టులోకి రావడానికి అప్పట్లోనే తెరవెనుక చక్రం తిప్పారు. ఆ తరువాత తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చిన వారిని రెగ్యులర్ చేస్తున్నట్లు వర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంతో కొందరు కోర్టుకు వెళ్లారు. వర్సిటీ తీరును తప్పుపట్టిన కోర్టు.. త్వరలోనే రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చి ఆయా పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. అయితే.. తాత్కాలిక పద్ధతిపై వచ్చిన వారిని తొలగించకుండా వర్సిటీ అధికారులు కొందరు కోర్టును తప్పుదోవ పట్టిస్తూ రెగ్యులర్ నోటిఫికేషన్‌ను తాత్సారం చేశారు. ఇదే అదనుగా స్వామిభక్తి పరుడు వర్సిటీ పెద్దలను ప్రసన్నం చేసుకుని రెగ్యులర్ ఉద్యోగిగా మారిపోయారు. అంతటితో ఆగలేదు.. నాన్‌టీచింగ్ డెప్యూటీ లైబ్రేరియన్ పోస్టు (అసోసియేట్ ప్రొఫెసర్) నుంచి ఏకంగా టీచింగ్ విభాగంలోని ప్రొఫెసర్ పోస్టులోకి వచ్చేశారు. సుమారు ఆరేళ్లు అసోసియేట్ ప్రొఫెసర్ హోదాలో పనిచేస్తేనే ప్రొఫెసర్ హోదాకు అర్హత లభిస్తుంది. కానీ.. అప్పుడెప్పుడో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసిన అనుభవాన్ని లెక్కగట్టి కేవలం వర్సిటీలోకి నాన్–టీచింగ్ ఉద్యోగిగా వచ్చిన మూడేళ్లలోనే ప్రొఫెసర్‌గా మారిపోయారు. సదరు స్వామిభక్తి పరుడిపై 2014లో హైకోర్టులో మరో కేసు నమోదైంది.అది ఇప్పటికీ విచారణలో ఉండడం గమనార్హం. వీటన్నింటినీ పట్టించుకోని ప్రభుత్వ పెద్దలు ద్రవిడియన్ వర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్లను పక్కనపెట్టి సొంత సామాజిక వర్గానికి చెందిన, అర్హత లేని వ్యక్తిని అందలం ఎక్కించడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. పైగా సదరు వ్యక్తి తనపై కేసులేమీ లేవని వర్సిటీ విజిలెన్స్ రిపోర్టు తీసుకుని వైస్ చాన్సలర్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు వర్సిటీ భోగట్టా. రాజకీయాలకు వేదికగా.. ద్రవిడియన్ వర్సిటీ ఏర్పడినప్పటి నుంచి క్యాంపస్‌లో ఎటువంటి రాజకీయ సమావేశాలు జరగలేదు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వర్సిటీ క్యాంపస్ రాజకీయాలకు అడ్డగా మారిపోయింది. స్వామి భక్తిపరుడు సీటులో కూర్చోవడంతో ఇది మరింత పెరిగింది. ఈ నెల 1వ తేదీన ఏకంగా నియోజకవర్గ స్థాయి టీడీపీ కార్యకర్తల సమావేశం క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహించి స్వామిభక్తిని చాటుకున్నారు. -
ఉత్తమ పరిశోధనలకు ఉన్నత పురస్కారాలు
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో ఉత్తమ పరిశోధనలను ప్రోత్సహించి, నాణ్యతను పెంపొందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉన్నత స్థాయి అవార్డులను ప్రవేశపెడుతోంది. ఏటా దేశవ్యాప్తంగా 10 ఉత్తమ పీహెచ్డీ పరిశోధనలు అందించిన వారిని ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో సత్కరించనుంది. నూతన జాతీయ విద్యా విధానం లక్ష్యాల్లో భాగంగా ఏటా వివిధ విభాగాల్లో అత్యుత్తమమైన పది పీహెచ్డీ థీసిస్‌లకు ఈ అవార్డు అందిస్తుంది. వ్యవసాయ శాస్త్రాల దగ్గర నుంచి వైద్య శాస్త్రాలతో సహా ఐదు విభాగాల్లో రెండు చొప్పున ఉత్తమ థీసిస్‌లకు సైటేషన్ అవార్డులు ప్రదానం చేస్తారు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం యూజీసీ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది.ఏటా సెప్టెంబర్ 5న ప్రదానంప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు కాన్వకేషన్ ద్వారా పీహెచ్‌డీలు పొందిన రీసెర్చ్ స్కాలర్లు తదుపరి ఏడాదిలో ‘సైటేషన్’ అవార్డుకు అర్హులుగా పేర్కొంది. రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల నుంచి పీహెచ్‌డీలు పొందిన వారు వర్సిటీల ద్వారా నామినేట్ అవ్వొచ్చు. ఇందుకోసం ప్రతి విశ్వవిద్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ విశ్వవిద్యాలయం నుంచి ఏటా ఐదు థీసిస్‌లను నామినేట్ చేస్తుంది. ఏటా జనవరి నుంచి మార్చి 31 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా వర్సిటీల నుంచి నామినేషన్లు యూజీసీ స్వీకరిస్తుంది. ఆగస్టు 1న విజేతలను ప్రకటిస్తారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం రోజు ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’తో విజేతలను యూజీసీ సత్కరిస్తుంది.యూజీసీ అధ్యయనం ప్రకారం దేశంలో పీహెచ్‌డీలో ప్రవేశాలు భారీగా పెరుగుతున్నాయి. 2010–11లో దేశవ్యాప్తంగా 77,798 పీహెచ్డీ ప్రవేశాలు నమోదవగా, 2017–18లో ఈ సంఖ్య 1,61,412కు పెరిగింది. ఏటా సగటున 10 శాతం వృద్ధి రేటు నమోదవుతోంది.కొత్త ఆవిష్కరణలు అవసరంకొత్త ఆవిష్కరణలు దేశ అభివృద్ధికి చాలా అవసరం. ఉన్నత విద్యా సంస్థలు కొత్త విజ్ఞానాన్ని సమాజానికి అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది డాక్టోరల్ డిగ్రీల నాణ్యతపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. భారతీయ విశ్వవిద్యాలయాలలో మంచి నాణ్యమైన పరిశోధనలను ప్రోత్సహించే ప్రయత్నంలో యూజీసీ ఏటా ‘పీహెచ్డీ ఎక్సలెన్స్ సైటేషన్’ను ప్రదానం చేయాలని నిర్ణయించింది. ప్రజాభిప్రాయం కోసం మార్గదర్శకాలను విడుదల చేశాం. – మామిడాల జగదీశ్ కుమార్, యూజీసీ చైర్మన్ -
ఇస్రో చైర్మన్ కల నెరవేరిన వేళ.. ఇకపై డాక్టర్ సోమనాథ్
గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపిన సమయంలోనూ ఆయన అంత సంతోష పడలేదేమో, చంద్రయాన్-3 సక్సెస్‌తో దేశ విదేశాల నుంచి పొగడ్తలు అందుకున్నప్పుడు కూడా ఆయన ఇంత ఆనందంగా లేరేమో.. ఆయన ఎవరో కాదు.. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్.. ఇప్పుడు ఆయన గురించి ఎందుకంటే.. ఇన్నెళ్లకు సోమనాథ్ తన కల నెరవేర్చుకున్నారట.ఐఐటీ మద్రాస్ 61వ కన్వోకేషన్ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమనాథ్ అక్కడ మెరిశారు. అతిథిగా అనుకునేరు.. కానే కాదు..61 ఏళ్ల వయసులో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చంద్రుడిపై కాలు మోపినం సంతోషంలో ఉన్నారు. యూనివర్సిటీ అధికారుల నుంచి డాక్టరేట్ పొందుతున్న సమయంలో ఆయన ముఖంలో మెరిసిన ప్రకాశవంతమైన చిరునవ్వు ఆ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. డాక్టరేట్ అందుకున్న తర్వాత సోమనాథ్ మాట్లాడుతూ.. ‘‘నాది గ్రామీణ నేపథ్యం. క్లాస్‌లో టాపర్‌ని. అయినా కూడా ఐఐటీ ఎంట్రన్స్ రాయాలనే ధైర్యం ఏనాడూ చేయలేకపోయా. కానీ, ఏదో ఒకనాడు ఇక్కడి నుంచి పట్టా పొందాలని మాత్రం కల గన్నా. నా మాస్టర్ డిగ్రీ బెంగళూరు ఐఐఎస్ నుంచి తీసుకున్నా. ఇప్పుడు పీహెచ్డీ ఐఐటీ మద్రాస్ నుంచి తీసుకోవడం గౌరవంగా ఉంది.పీహెచ్డీ అనేది కష్టమైంది. అదీ మద్రాస్ ఐఐటీ లాంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల నుంచి డిగ్రీ పొందడం ఇంకా కష్టం. నాది సుదీర్ఘమైన ప్రయాణం. ఎన్నో ఏళ్ల కింద రిజిస్టర్ చేయించుకున్నా. వైబ్రేషన్ ఐసోలేటర్స్.. నా మనసుకి దగ్గరైన టాపిక్. 35 ఏళ్ల నా కష్టానికి దక్కిన ఫలితం ఇది. ఇన్నేళ్ల నా శ్రమను పీహెచ్డీ కిందకు మార్చుకున్నా.’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇక ఇప్పటి నుంచి డాక్టర్ సోమనాథ్ అన్నమాట. -
సుధామూర్తితో కలిసి డాక్టరేట్ అందుకున్న నైనా
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, చదువుల తల్లిగా పేరొందిన నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరంలో గల ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన స్నాతకోత్సవం సందర్భంగా.. గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ నైనాకు పీహెచ్డీ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తికి కూడా గౌరవ డాక్టరేట్ అందించారు. కాగా అత్యంత పిన్న వయసులోనే పీహెచ్డీ పట్టా పుచ్చుకున్న తొలి భారతీయ వ్యక్తిగా నైనా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 22 ఏళ్ల వయసులోనే ఈ హైదరాబాదీ ఈ ఫీట్ నమోదు చేశారు. కుటుంబంతో నైనా జైస్వాల్ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాకు సంబంధించి ‘మహిళా సాధికారతలో మైక్రోఫైనాన్స్ పాత్రపై అధ్యయనం’ అనే అంశంపై నైనా జైస్వాల్ పరిశోధన చేశారు. ఈ క్రమంలో పీహెచ్డీ పట్టా అందుకుని రికార్డు సాధించారు. కాగా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా పలు జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు సాధించిన నైనా జైస్వాల్.. చదువులోనూ మేటి. ఎనిమిదేళ్లకే పదో తరగతి పూర్తి చేసిన ఆమె.. 13 ఏళ్లకే గ్రాడ్యుయేషన్, 15 ఏళ్లకు మాస్టర్స్‌లో డిగ్రీ సాధించారు. తద్వారా ఆసియాలోనే చిన్న వయసులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వ్యక్తిగా నిలిచారు. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో మోటివేషనల్ స్పీకర్‌గా రాణిస్తూ స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేస్తున్నారు. -
పీహెచ్డీ ఉన్నా కూరగాయల అమ్మకం
ప్రైవేట్ జాబ్‌లు చేసి.. అవి నచ్చక వ్యాపారం చేసినవారిని చూశాం. చాలీచాలని జీతాలకు కుటుంబాలను పోషించలేక పలు ఆదాయ మార్గాలను వెతుకున్న ప్రైవేట్ టీచర్లు, లెక్చరర్లకు సంబంధించిన వార్తలు కూడా చదివాం. అయితే తాగాజా ఓ వ్యక్తి నాలుగు మాస్టర్ డిగ్రీలు తీసుకొని.. ఏకంగా న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసి కూరగాయలు అమ్ముతున్నారు. ఈ విషయం నెట్టింట్లో వైరల్ అవుతోంది. పంజాబ్‌కు చెందిన డా.సందీప్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పని చేసేవారు. అనుకోని పరిసస్థితుల్లో ఆయన తన ఉద్యోగం మానేసి ఇల్లూఇల్లు తిరుగుతూ కురగాయలు అమ్ముతున్నారు. యూనివర్సిటీలోని లా డిపార్టుమెంట్లో 11 ఏళ్లపాటు పనిచేసిన సందీప్ సింగ్ నాలుగు మాస్టర్ డిగ్రీలు(న్యాయ శాస్త్రం, పంజాబీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్)తో పాటు లా కోర్సులో పీహెచ్డీ పూర్తి చేశారు. ఇన్నేళ్లపాటు కాంట్రాక్టు ఉద్యోగం చేసిన సందీప్ నెలవారి జీతాల విషయంలో చాలా ఇబ్బందుల ఎదుర్కొన్నారు. జీతాల తగ్గింపు, సరైన సమయానికి సాలరీ రాకపోవటం వంటివి ఆయన్ను తీవ్రంగా వెంటాడాయి. చేసేదేంలేక కూరగాయల అమ్మకాన్ని మొదలుపెట్టారు డా. సందీప్. తాను ఇల్లూ ఇల్లు తిరిగి కూరగాయలు అమ్మె బండికి వినూత్నంగా ‘పిహెచ్డీ సబ్జీవాలా’ అని పేరు పెట్టుకున్నారు. పంజాబ్‌లోని పాటియాలకు చెందిన సందీప్.. ఉద్యోగం కంటే కూడా కూరగాయలు అమ్మటం వల్లనే తాను ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నట్లు చెప్పటం గమనార్హం. మరోవైపు తాను మరో మాస్టర్ డిగ్రీ కోసం చదువకుంటూ.. కూరగాలయలు అమ్మగా వచ్చిన మొత్తంతో టీచింగ్ వృత్తిని మానుకోకుండా పిల్లలకు ట్యూషన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తానని చెప్పుకొచ్చారు. చదవండి: Punjab: వృద్ధులకు నజరానా ప్రకటించిన పంజాబ్ ప్రభుత్వం -
పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు..కానీ బతుకుదెరువు కోసం ఆ వ్యక్తి..
ఉన్నత చదువులు చదివినా కొందరూ లైఫ్‌లో తొందరగా సెటిల్ అవ్వలేరు. మంచి ఉద్యోగం రాక నానాపాట్లు పడుతుంటారు. ఉన్నత చదువులు చదివినా అందుకు తగ్గ స్థాయిలో ఉద్యోగాల లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణాల వల్లే ఎంతో మంది ఉన్నత విద్యావంతులు సరైన ఉద్యోగం లేక సతమతమవుతున్నారు. ఇక్కడొక పంజాబ్ వ్యక్తి కూడా అదేకోవకు చెందినవాడు. వివరాల్లోకెళ్తే..పంజాబ్‌కి చెందిన 39 ఏళ్ల డాక్టర్ సందీప్ సింగ్ పీహెచ్డీ, నాలుగు మాస్టర్ డిగ్రీలు చేసిన ఉన్నత విద్యావంతుడు. ఆయన గత 11 ఏళ్లుగా పంజాబీ యూనివర్సిటీ న్యాయ విభాగంలో కాంట్రాక్టు ప్రోఫెసర్‌గా పనిచేశారు. కానీ అక్కడ ఇచ్చే అరకొర జీతం అక్కరకు రాక నానాపాట్లు పడ్డాడు. పైగా వేతనం కూడా సకాలంలో రాకపోవడం వంటి సమస్యలతో విసుగు చెంది బతుకుదెరువు కోసం కూరగాయాలు అమ్మడం ప్రారంభించారు. ఆయన న్యాయశాస్త్రంలో పీహెచ్డీ చేసిన వ్యక్తి. అంతేగాదు జర్నలిజం, పొలిటికల్ సైన్సు వంటి సబ్జెక్టుల్లో మాస్టర్ డిగ్రీలు చేసిన వ్యక్తి. ఈ మేరకు సందీప్ సింగ్ మాట్లాడుతూ..సమాయానికి జీతం రాకపోవడం, ఒకవేళ వచ్చినా..ఆ అరకొర జీతంతో తాను తన కుటుంబం బతకడం కష్టంగా మారడంతో కూరగాయాలు అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆయన తన కూరగాయాల బండిపై పీహెచ్డీ సబ్జీవాలా అనే బోర్డు పెట్టుకుని మరీ ఇంటి ఇంటికి తిరుగుతూ కూరగాయాలు అమ్ముతుంటాడు. అయితే తాను ప్రొఫెసర్‌గా సంపాదించిన దానికంటే కూరగాయాలు అమ్మడం ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఒక పక్కన ఇలా కూరగాయాలు అమ్ముతూనే చదువు కొనసాగిస్తున్నాడు సందీప్ సింగ్. అంతేగాదు తాను తన ప్రొఫెసర్ వృత్తికి బ్రేక్ ఇచ్చినప్పటికీ ఎప్పటికీ తన ఈ ప్రోఫెసర్ వృత్తిని వదలనని ఇది తనకు ఇష్టమని చెబుతున్నాడు. పైగా డబ్బు ఆదా చేసి, ఎప్పటికైనా సొంతంగా ఓ ట్యూషన్ సెంటర్‌ని స్టార్ట్ చేయాలన్నది తన కోరిక అని చెప్పాడు. ఈ ఉన్నత విద్యావంతుడి కోరక నెరవెరాలని ఆశిద్దాం. ఇలాంటి ఘటనలు మన దేశంలో ఉన్న నిరుద్యోగతకు అద్దం పడుతోంది కదా!. కొంగొత్త కోర్సులు వస్తున్నట్లే అంతే స్థాయిలో ఉద్యోగాలు ఉంటే ఇలా సందీప్ లాంటి వాళ్లకు కూరగాయాలమ్మే పరిస్థితి ఏర్పడదు కదా!. (చదవండి: రాత్రికి రాత్రే చెరువు మాయం చేసిన దుండగులు! తెల్లారేసరికి అక్కడ..!) -
Najma Parveen: మోదీపై పీహెచ్డీ
నరేంద్ర మోదీ గుజరాత్ సి.ఎం. అయ్యాక, ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పీహెచ్‌డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కాని వారిలో ముస్లిం స్కాలర్లు... అందునా మహిళా ముస్లిం స్కాలర్లు దాదాపుగా లేరు. ఆ విధంగా చూస్తే మోదీపై పీహెచ్డీ చేసిన మొదటి మహిళా స్కాలర్‌గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ గుర్తింపు పొందింది. చేనేత కుటుంబంలో పుట్టి నజ్మా పర్వీన్‌ది వారణాసి దాపున ఉన్న లల్లాపుర. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. కాని వారు ఆమె చిన్నప్పుడే మరణించారు. అయినా తన చదువుకు ఆటంకం కలిగించకుండా కొనసాగించింది పర్వీన్. బెనారస్ హిందూ యూనివర్సిటీ (బి.హెచ్.యు.)లో పొలిటికల్ సైన్స్ చదివి 2014లో పీహెచ్డీ సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం ‘నరేంద్రమోడీస్ పొలిటికల్ లీడర్షిప్: యాన్ అనలిటికల్ స్టడీ’. నజ్మా పర్వీన్ తన పీహెచ్‌డీకి ఈ అంశం తీసుకున్నాక ‘నాక్కూడా భవిష్యత్తులో రాజకీయ నేత కావాలని ఉంది. అందుకే నేను భారతీయ ఆవామ్ ΄ార్టీనీ స్థాపించాను కూడా. ఆ ΄ార్టీని ఎలా రూపుదిద్దాలి అనుకున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద దృష్టి మళ్లింది. ఆయన రాజకీయాలలో ధ్రువతార వంటి వారు. 2014 నుంచి దేశంలో ఆయన సమర్థ నాయకత్వం కొనసాగింది. ట్రిపుల్ తలాక్ మీద ఆయన తెచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ నేను మొదటగా శుభాకాంక్షలు తెలియచేశాను’ అని తెలిపింది నజ్మా. పేదరికంలో ఉన్న నజ్మా పర్వీన్ చదువుకు ‘విశాల్ భారత్ సంస్థాన్’ స్థాపించిన ప్రొఫెసర్ రాజీవ్ శ్రీవాస్తవ సహకరిస్తే బి.హెచ్.యు. ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ గైడ్‌గా వ్యవహరించారు. 8 ఏళ్ల సమయం తీసుకుని 20 హిందీ, 79 ఇంగ్లిష్ గ్రంథాలు అధ్యయనం చేసి నజ్మా ఈ పీహెచ్‌డీని పూర్తి చేసింది. -
పీఎం మోదీపై పీహెచ్డీ.. నజ్మా పర్వీన్‌కు డాక్టరేట్!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ నేతలలో ప్రముఖునిగా గుర్తింపు పొందారు. మోదీని ఆదర్శంగా తీసుకునేవారు మన దేశాలో చాలామంది ఉన్నారు. వారణాసికి చెందిన నజ్మా పర్వీన్ ప్రధాని మోదీపై డాక్టరల్ స్టడీస్ పూర్తి చేశారు. ప్రధాని మోదీపై పీహెచ్డీ పూర్తి చేసిన తొలి ముస్లిం మహిళగా నజ్మా పర్వీన్ నిలిచారు. ప్రధాని మోదీ రాజకీయ జీవితానికి నజ్మా ప్రభావితురాలయ్యారు. నజ్మా మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్ కింద ‘నరేంద్ర మోదీ రాజకీయ నాయకత్వం - ఒక విశ్లేషణాత్మక అధ్యయనం’ పేరిట 2014లో దీనిని ప్రారంభించానని, 2023 నవంబరు ఒకటి నాటికి ఇది పూర్తయిందని తెలిపారు. కాశీ హిందూ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ సంజయ్ శ్రీవాస్తవ ఆధ్వర్యంలో ఈ పరిశోధన పని పూర్తయిందన్నారు. తన పరిశోధనలో ప్రధానంగా ఐదు అధ్యాయాలు ఉన్నాయన్నారు. అవి అధికారం నుండి విముక్తి, కాంగ్రెస్ వంశ పాలన, ప్రధాని మోదీ రాజకీయ జీవితం, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ప్రతిపక్షాల ఆరోపణలు-విమర్శల కాలం, ప్రజలు- మీడియా మద్దతు అని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం తనను అమితంగా ఆకట్టుకున్నదని, దేశానికి జీవితాన్ని అంకితం చేసిన రాజకీయ నేతగా మోదీ కనిపించారని ఆమె తెలిపారు. ఇది కూడా చదవండి: ఇంకా ముప్పు తప్పలేదు:నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక! -
‘అక్షర’ భారతికి ఏపీ ప్రభుత్వ సాయం
సాక్షి, అనంతపురం: కూలిపనులు చేసుకుంటూ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన సాకే భారతికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాయం ప్రకటించింది. రెండు ఎకరాల వ్యవసాయ భూమి కేటాయిస్తూ సంబంధిత పత్రాలకు సోమవారం ఆమెకు అందజేశారు. అలాగే.. ఆమెకు జూనియర్ కాలేజీ లెక్చరర్ ఉద్యోగం ఆఫర్ చేశారు జిల్లా కలెక్టర్ గౌతమి. అనంతపురం జిల్లాలోని మారుమూల గ్రామంలో పేదరికాన్ని జయించి మరీ ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసిందామె. డాక్టర్ భారతి సక్సెస్ స్టోరీ ఎంతో మందిని కదిలించింది కూడా. ఈమె డాక్టర్ భారతి.. కష్టాల్ని ఈది గెలుపు తీరాన్ని చేరింది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా శింగమనల నాగుల గుడ్డం గూడేనినికి చెందిన భారతి.. ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చేసింది. పదో తరగతి దాకా శింగనమల ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్ పామిడి జూనియర్ కాలేజీలో చదివింది. శ్రీ కృష్ణ దేవరాయ యూనివర్శిటీ నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేసింది. సాయం ఎప్పుడూ ఉంటుంది ఎల్లప్పుడూ ప్రభుత్వ సహకారం ఉంటుందని సాకేభారతికి కలెక్టర్ గౌతమి హామీ ఇచ్చారు. కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో రెండు ఎకరాల పొలం పట్టా అందజేసి.. భారతి విజయంపై సంతోషం వ్యక్తం చేశారామె. భారతి ఎన్ని అవాంతరాలు ఎదురైన వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించిన ఆమె ఎందరికో స్పూర్తిగా నిలిచారన్నారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం తరఫున భారతికి శింగనమల మండలం సోదనపల్లి గ్రామ పొలం సర్వేనెంబరు 9–12లో వ్యవసాయ యోగ్యమైన రెండు ఎకరాల భూమి భారతికి అందింఆం. అసంపూర్తిగా ఉన్న ఆమె ఇంటిని నిర్మించి ఇస్తాం. ఎస్కేయూ పరిధిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జేఎల్ పోస్టు (కెమిస్ట్రీ) ఖాళీగా ఉంది. ఆమె అంగీకరిస్తే ఆ పోస్టుకు నామినేట్ చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగం నుంచి ఆమెకు అన్నివిధాలుగా అవసరమై ప్రొత్సాహం అందిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమెకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తాం. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్, శింగనమల తహసీల్దారు ఈశ్వరమ్మ, సాకేభారతి భర్త శివప్రసాద్, కుమార్తె ప్రసూన, తదితరులు పాల్గొన్నారు. -
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్‌లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
‘నన్ను క్షమించండి’.. వాట్సప్‌లో స్టేటస్ పెట్టి పీహెచ్డీ విద్యార్థి ఆత్మహత్య!
చెన్నై: ఏం జరిగిందో ఏమో గానీ పీహెచ్డీ పట్టా తీసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి వెళ్లాలన్న తపన పడ్డ ఓ విద్యార్థి అర్థాంతరంగా జీవితాన్ని ముగించాడు. కొడుకు చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం ఇంటికి వస్తాడనే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చాడు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన పీహెచ్డీ విద్యార్థి శుక్రవారం వేలచేరిలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయు ముందు తన వాట్సాప్‌లో ఈ విధంగా స్టేటస్ పెట్టుకున్నాడు... ‘‘ఇది సరిపోదు.. నన్ను క్షమించండి’ అని రాశాడు. విద్యార్థి 32 ఏళ్ల రీసెర్చ్ స్కాలర్ సచిన్ కుమార్ జైన్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన జైన్, ఐఐటీ మద్రాస్‌లోని గిండీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎప్పటిలానే తన రెగ్యులర్ క్లాస్‌లకు హాజరయ్యాడు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో గానీ ఎవరికీ సమాచారం ఇవ్వకుండా తన నివాసానికి తిరిగి వెళ్లిపోయాడు. గంట సేపు నుంచి జైన్ ఎవరికి కనిపించకపోవడంతో అతని స్నేహితులు వెతకడం ప్రారంభించారు. క్యాంపస్ మొత్తం ఎంత సేపు వెతికిన ఆచూకి తెలియరాలేదు. దీంతో జైన్ స్నేహితులు చివరకి అతని ఇంటికి వెళ్లి చూడగా.. డైనింగ్ హాల్లో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతని స్నేహితులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే ఆసుపత్రిలోని సిబ్బంది అప్పటికే అతను మరణించినట్లు ధృవీకరించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుప్రతికి తరలించారు. -
ప్రైవేటు పీహెచ్‌డీలకు రెడ్ కార్పెట్
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు కాలేజీల నుంచి పీహెచ్డీ చేసేందుకు అనుమతించడం వివాదాస్పదమవుతోంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధమని అధ్యాపక వర్గం అంటోంది. ఈ విధానం వల్ల పీహెచ్‌డీల నాణ్యతే దెబ్బతింటుందని విద్యారంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. విద్యార్జనలో అత్యున్నత స్థాయి డిగ్రీ అయిన పీహెచ్డీ (పరిశోధన)ని యూనివర్శిటీ గుర్తింపు ఉన్న కాలేజీల్లో చేసేందుకు అనుమతిస్తూ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకూ పీహెచ్డీ కేవలం యూనివర్శిటీల పరిధిలోనే జరుగుతోంది. వర్శిటీ నేతృత్వంలోని ఫ్యాకల్టీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది. యూనివర్శిటీల్లో గత కొన్నేళ్ళుగా అధ్యాపకుల నియామకం జరగడం లేదు. దీంతో గైడ్‌గా ఉండే అధ్యాపకులకు కొరత ఏర్పడింది. పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది పెద్ద అవరోధంగా మారింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక నుంచి ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దీని ప్రకారం రీసెర్చ్‌కు అవసరమైన అన్ని మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అంతిమంగా పీహెచ్‌డీలు ఇచ్చేది యూనివర్శిటీయేనని అంటున్నారు. అయితే, వర్శిటీ పట్టాలిచ్చే ఓ కర్మాగారంగా ప్రేక్షక పాత్ర పోషించే వీలుందని నిపుణులు సందేహిస్తున్నారు. నాణ్యత ఉంటుందా...? అఫ్లియేషన్ ఉన్న ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ చేయడం వల్ల నాణ్యత ఎలా ఉంటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాకల్టిని ఎంపిక చేయడం లేదని నిపుణులు అంటున్నారు. కాలేజీల్లో ఒక్కో విభాగానికి ప్రొఫెసర్లను అర్హులైన వాళ్ళనే నియమించాల్సి ఉన్నా... నిబంధనలు సరిగ్గా పాటించడం లేదని చెబుతున్నారు. పీహెచ్‌డీల వ్యవహారంలోనూ ఇదే జరిగే వీలుందని, అర్హతలేని గైడ్ల చేత పీహెచ్డీ పర్యవేక్షణ చేయించే వీలుందనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థి పీహెచ్డీ పూర్తయ్యే వరకూ అధ్యాపకుడు అదే కాలేజీలో పనిచేయాలనే నిబంధనపైనా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీన్ని అడ్డం పెట్టుకుని కాలేజీలు అధ్యాపకులను తమ కాలేజీలోనే ఉండాలని వేధించే వీలుందని చెబుతున్నారు. ఇప్పటికే వేతనాలు సకాలంలో ఇవ్వకపోయినా కాలేజీ యాజమాన్యాలను అడిగే దిక్కు ఉండటం లేదని వాపోతున్నారు. నిపుణులైన గైడ్స్ దీనివల్ల పైవేటు కాలేజీల్లో పనిచేసేందుకు మొగ్గు చూపకపోవచ్చనే విమర్శలొస్తున్నాయి. పీహెచ్‌డీకి గైడ్‌గా ఉండే వ్యక్తికి పీహెచ్డీ పూర్తయి.. ఏవైనా జనరల్స్‌లో మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయి ఉండాలి. అయితే, యూనివర్శిటీలు పూర్తి అనుభవం ఉన్న వాళ్ళతోనే పీహెచ్డీ మార్గదర్శకత్వం ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రైవేటుకు అప్పగిస్తే ఈ తరహా నాణ్యత ఉండదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నాణ్యత దెబ్బతింటుంది ప్రైవేటు కాలేజీల్లో పీహెచ్డీ అడ్మిషన్లకు అనుమతిస్తే నాణ్యత దెబ్బతింటుంది. ఇది యూజీసీ నిబంధనలకు విరుద్ధం. విద్యార్థి పీహెచ్డీ అయ్యే వరకూ అధ్యాపకులు అదే కాలేజీలో ఉండాలనే నిబంధన కూడా అన్యాయమే. దీనివల్ల ఫ్యాకల్టితో కాలేజీల యాజమాన్యాలు వెట్టి చాకిరీ చేయించుకుంటాయి. జేఎన్టీయూహెచ్ ఈ నిర్ణయాన్ని సమీక్షించుకోవాలి. – డాక్టర్ వి బాలకృష్ణా రెడ్డి టెక్నికల్, ప్రొఫెషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అర్హత ఉన్న వారికే అవకాశం గత ఏడాది రీసెర్చ్ కేంద్రాలున్న కాలేజీలను గుర్తించాం. అదే కాలేజీలో అర్హులైన వారిని ఎంపిక చేసి పీహెచ్డీ చేసే విద్యార్థిని సూపర్ వైజ్ చేసే బాధ్యత అప్పగిస్తాం. అంతిమంగా పీహెచ్డీ ఇచ్చేది యూనివర్శిటీనే. ఇది యూజీసీ నిబంధనలకు వ్యతిరేకం కాదు. – ప్రొఫెసర్ కట్టా నర్సింహా రెడ్డి వీసీ, జేఎన్టీయూహెచ్ -
‘జింబో’ రాజేందర్‌కు ఉస్మానియా పీహెచ్డీ
సాక్షి, హైదరాబాద్: మాజీ జడ్జి, రచయిత మంగారి రాజేందర్ (జింబో) ‘పోలీసు అధికారాలు–సమన్యాయ పాలన– ఎన్కౌంటర్ మరణాలు’ అంశంపై సమర్పించిన పరిశోధన పత్రానికి ఉస్మానియా యూనివర్సిటీ పీహెచ్‌డీని ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడకు చెందిన మంగారి రాజేందర్ జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్‌గా, టీఎస్పీఎస్సీ సభ్యుడిగా పనిచేశారు. కవిత్వం, కథలతోపాటు, యాభై వరకు ‘లా’ పుస్తకాలను తెలుగులో అనువదించారు. లా సంబంధిత వ్యాసాలు రాశారు. ప్రజలకు అర్థమయ్యేలా కోర్టు తీర్పులను తెలుగులో వెలువరించారు. ‘మా వేములవాడ కథలు, జింబో’ కథలతో తనదైన ముద్ర వేశారు. -
వరంగల్‌కు చెందిన కిరణ్మయికి డాక్టరేట్
సాక్షి, వరంగల్: చెన్నైలోని ప్రతిష్టాత్మక బీఎస్ అబ్దుల్ రహమాన్ క్రీసెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేసిన పరిశోధనకు గాను వరంగల్ నగరానికి చెందిన ఠంయ్యాల కిరణ్మయికి డాక్టరేట్ లభించింది. ఎకోఫ్రెండ్లీ ఫర్ది సింథసిస్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ బెస్ట్ హిటిరోసైకిల్స్ అనే అంశంపై డాక్టర్ కార్తికేయన్ పర్యవేక్షణలో ఆమె పీహెచ్డీ పూర్తి చేశారు. కిరణ్మయి గతంలో వరంగల్ ఎల్బీ, సీకేఎం, హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో విద్యను అభ్యసించారు. -
ఈ మార్పులు మంచికేనా?
ఎక్కడైనా, ఎప్పుడైనా.... కాలాన్ని బట్టి నియమ నిబంధనల్ని మార్చాల్సిందే. కానీ, కొత్త నియమ నిబంధనలు పురోగమింపజేస్తాయా, తిరోగమింపజేస్తాయా అన్నదే కీలకం. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు సంబంధించిన డాక్టోరల్ డిగ్రీల రూల్స్‌లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చేసిన సమూలమార్పులు ఇప్పుడు అదే చర్చకు దారి తీస్తున్నాయి. ఎంఫిల్ కోర్సుల రద్దు, పీహెచ్డీ రావడానికి చేయాల్సిన కోర్స్‌వర్క్‌ను సడలించడం, నాలుగేళ్ళ డిగ్రీ కోర్స్ చేసిన వెంటనే పీహెచ్‌డీలో పేరు నమోదుకు అనుమతించడం లాంటి మార్పులపై భిన్నాభిప్రాయాలున్నాయి. యువ విద్యార్థులను మరింతగా పరిశోధన వైపు ఆకర్షించడానికే ఈ చర్య అని యూజీసీ చెబుతోంది. కానీ ఆచరణలో ఇది ప్రమాణాల క్షీణతకూ, పర్యవేక్షకుల కొరతకూ దారితీస్తుందనే వాదన బలంగా వినపడుతోంది. నిజానికి యూజీసీ 2009లో, తర్వాత 2016లో కొన్ని నియమాలు పెట్టింది. వాటి స్థానంలో కొత్తవాటిని ఈ నెల 7న వెల్లడించింది. ఈ కొత్త ‘యూజీసీ (పీహెచ్డీ కనీస ప్రమాణాలు, విధానాల) నిబంధనలు 2022’ వల్ల పీహెచ్డీ చేయడానికి అర్హత నుంచి ప్రవేశ విధానం, మూల్యాంకన పద్ధతుల దాకా అన్నీ మారనున్నాయి. మునుపటి నిబంధనల కింద అనుమతి లేని వర్కింగ్ ప్రొఫెష నల్స్ పార్ట్‌టైమ్ పీహెచ్‌డీలకు సైతం పచ్చజెండా ఊపారు. మాస్టర్స్ డిగ్రీ ఒక ఏడాది (2 సెమిస్టర్లు) చదివినా, లేక నాలుగేళ్ళ (8 సెమిస్టర్ల) బ్యాచ్‌లర్ డిగ్రీలో కనీసం 75 శాతం మార్కులు సాధించినా పీహెచ్‌డీలో చేరవచ్చు. ఎప్పటిలానే నెట్/ జేఆర్ఎఫ్ అర్హతలు, ప్రవేశపరీక్షలతో ప్రవేశాలు చేసుకో వచ్చు. అయితే పీహెచ్డీ ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశపరీక్ష చర్చను ప్రస్తావించకుండా వదిలేశారు. పీహెచ్డీ చేస్తున్నవారు తప్పనిసరిగా ప్రత్యేక జర్నల్స్‌లో కనీసం ఒక పరిశోధనా పత్రాన్ని ప్రచురించాలనీ, సదస్సుల్లో కనీసం రెండు పత్రసమర్పణలు చేయాలనీ పాత నిబంధనలు. ఆ రెండూ ఇక తీసేశారు. ఇప్పటి దాకా పరిశోధనకు ప్రవేశద్వారంగా ఉన్న ఎంఫిల్ కోర్సును ‘జాతీయ విద్యావిధానం’ సిఫార్సుకు అనుగుణంగా ఎత్తేశారు. ఇవన్నీ పరిశోధనలో నాణ్యతను దెబ్బతీస్తాయనేది విద్యావేత్తల్లో ఒక వర్గం ఆందోళన. మరో వర్గం మాత్రం తప్పనిసరి తద్దినంగా మారిన పత్రాల నిబంధనల్లో పలు లోపాలున్నాయనీ, వాటితో ప్రయోజనం లేదు గనక ఎత్తేయాలన్న నిర్ణయం సరైనదేననీ అంటోంది. అసలీ పత్రాల ప్రచురణ అంశంపై యూజీసీ చాలాకాలంగా తర్జనభర్జన పడుతోంది. పరిశోధక విద్యార్థుల నుంచి రుసుము వసూలు చేసి, పత్రాలను ప్రచురించే ‘దోపిడీ జర్నల్స్’, గ్రంథచౌర్యం పెరగడంతో సమస్య వచ్చిపడింది. విశ్వవిద్యాలయ పత్రాల్లో నూటికి 75 ‘స్కోపస్’ గుర్తింపు పొందని జర్నల్స్‌లోనే ప్రచురిత మవుతున్నాయనేది ఒక అధ్యయనం. అందుకే, ఆ తరహా జర్నల్స్‌లో, వాటి ప్రచురణకర్తలు పెట్టే సదస్సుల్లో ఇచ్చిన పత్రాలను పరిగణనలోకి తీసుకోరాదని 2019లోనే యూజీసీ ప్యానెల్ సిఫార్సు చేసింది. సామాజికంగా, ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థులకు విస్తృత సంబంధాలు, ఆర్థిక స్థోమత ఉండవు గనక అలాంటి దోపిడీ జర్నల్స్‌కు అడ్డుకట్ట వేయాల్సిందే. రిసెర్చ్ స్కాలర్లపై ఒత్తిడిని తగ్గించాల్సిందే. కానీ, ప్రత్యామ్నాయం చూడకుండా, పత్రాలే అక్కర్లేదనడం వివేకవంతమేనా? మన దగ్గర ఇప్పటికీ విద్యార్థులు ఎక్కువ, నాణ్యమైన జర్నల్స్ తక్కువ. ఇదో పెనుసమస్య. ప్రపంచ పరిశోధకుల్లో 12 శాతం మంది మనవాళ్ళే అయినా, భారత పరిశోధనా పత్రాలు 4.52 శాతమేనట. 2020 నాటి స్కోపస్ శాస్త్రీయ ప్రచురణల డేటాబేస్ తేల్చింది. ఆచరణలో లోపాలున్నా, పత్రాల ప్రచురణ ఆలోచన అసలంటూ మంచిదే. ఐఐటీల్లో పత్రాల ప్రచురణ తప్పనిసరి కాకున్నా నాణ్యమైన పరిశోధన సాగుతోందంటే ఆచార్యులు, విద్యార్థుల నిబద్ధతే కారణం. అలాంటి వాతావరణం కరవైన విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడిక పత్రాలు లేకుండానే పరిశోధనాసక్తి, ప్రమాణాలు తగ్గకుండా ఎలా చూస్తారు? అలాగే, డిగ్రీ అవుతూనే పీహెచ్‌డీలో చేరిన విద్యార్థికి పరిశోధనా జ్ఞానం ఎలా ఉంటుంది? పీజీ చేసి, ఎంఫిల్‌లో మౌలిక పరిశోధనా పద్ధతులు తెలుసుకున్నాక ఆసక్తితో పీహెచ్డీ చేయడం వేరు. పరిశోధనలో ఓనమాలు తెలియకుండా డిగ్రీ అవుతూనే పీహెచ్‌డీలోకి దిగడం వేరు. అలా దిగినా, ఆరేళ్ళ నిర్ణీత వ్యవధిలో తొలి ఏళ్ళన్నీ పరి శోధనా పద్ధతులు తెలుసుకోవడానికే ఖర్చయిపోతుంది. అలాగే, పత్రసమర్పణ, ప్రచురణ తప్పని సరి కానప్పుడు విద్యార్థులకు లోతైన అధ్యయనానికి ప్రేరణ లేకుండా పోయే ప్రమాదమూ ఉంది. పరిశోధనను సైతం మామూలు చదువులంత తేలిగ్గా తీసుకోవడం మన దగ్గరే. మొదట్లో 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. కానీ, ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. తీరా, 2017 కల్లా వాటి సంఖ్య 912. అంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యు యేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. ఇప్పటికే నాసిరకమని పేరుపడ్డ మన విశ్వవిద్యాలయ రిసెర్చ్ ప్రమాణాలు మరింత దిగజారడానికి కొత్త నిబంధనలు కారణం కాకూడదు. లోతుగా పునఃపరిశీలన చేసినా తప్పు లేదు. ప్రామాణిక పరిశోధనలకై ఒక అడుగు వెనక్కి వేసినా... ప్రగతికి అది ముందడుగే! -
అలా పీహెచ్‌డీలు చేస్తే చెల్లవు: యూజీసీ హెచ్చరిక
ఢిల్లీ: పీహెచ్డీ కోర్సుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా శుక్రవారం ఒక జాయింట్ అడ్వైజరీ రిలీజ్ చేశాయి. విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్టెక్) కంపెనీలు నిర్వహిస్తున్న పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చెల్లవని ప్రకటించింది. ఆన్లైన్ పీహెచ్డీ కోర్సులకు ఎలాంటి గుర్తింపు ఉండబోదని పేర్కొంటూ.. ఈ మేరకు ఓ పబ్లిక్ నోటీసును జారీ చేసింది కంట్రోలర్స్ ఆఫ్ హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. తమ మార్గదర్శకాల ప్రకారం.. ఎడ్టెక్ కంపెనీలు నిర్వహించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌కు గుర్తింపు ఉండబోదని స్పష్టం చేసింది. యూజీసీ రెగ్యులేషన్ 2016 ప్రకారం ప్రామాణికాలు పాటించాల్సిందేనని, అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కూడా యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. UGC advises Students and public, at large, not to be misled by advertisements for online Ph.D programmes offered by EduTech Companies in collaboration with Foreign Educational Institutes. For more details please see the attached public notice. @PMOIndia pic.twitter.com/RlP33Ziv7B — UGC INDIA (@ugc_india) October 28, 2022 విదేశీ యూనివర్సిటీల సహకారంతో.. ఆన్లైన్ పీహెచ్డీ అంటూ వచ్చే ప్రకటనలపట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటికి ఆకర్షితులు కావొద్దంటూ విద్యార్థులకు సూచించింది ఆ నోట్. పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకునేముందు యూజీసీ రెగ్యులేషన్ 2016లోబడి ఉందో క లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది. ఈ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్న పలు ఉదంతాలు ఇటీవల తెరపైకి రావడంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు యూజీసీ, ఏఐసీటీఈ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మీ స్మార్ట్ ఫోన్ రిపేర్‌కు ఇస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి -
నేనూ అమ్మ... క్లాస్మేట్స్.. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని...
‘‘చదువుకోవడం ఎప్పుడూ బాగుంటుంది... అమ్మతో కలిసి కాలేజ్‌కి వెళ్లడం, పరీక్షలకు ప్రిపేర్ అవడం ఇంకా బాగుంది’’ అంటున్నారు హైదరాబాద్‌కి చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్. పీహెచ్డీ సహా పలు డిగ్రీలు అందుకుని అటు చదువులో ఇటు క్రీడల్లోనూ పిన్న వయస్కురాలిగా ఎన్నో విజయాలు లిఖించిన నైనా... తాజాగా తన తల్లి భాగ్యలక్ష్మి తో కలిసి ఎల్ఎల్బీ లో చేరింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో ఈ తల్లీకూతుళ్లిద్దరూ ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో అమ్మకు క్లాస్మేట్గా తన అనుభవాలను పంచుకున్నారు. సివిల్ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని... ‘‘నాన్న (అశ్విన్) న్యాయవాది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఆయన్ను గమనించేదాన్ని. న్యాయ స్థానాల్లో వాదోపవాదాలు ఆసక్తిగా అనిపించేవి. అయితే ‘లా’ ను కెరీర్‌గా మలచుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ప్రస్తుతం క్రీడాకారిణిగా బిజీగా ఉన్నాను. ఎల్ఎల్బీ తర్వాత నా సివిల్ సర్వీసెస్ లక్ష్యాన్ని చేరే ప్రయత్నం ప్రారంభిస్తాను. దానికి లా చదవడం కొంత మేర ఉపకరిస్తుందని భావించాను. తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అదే చేస్తారని, తొలి మార్గదర్శకత్వం తమదే ఉండాలని మా పేరెంట్స్ అభిప్రాయం. అందుకే వీలైన అన్ని అంశాల్లో వాళ్లు ముందడుగు వేసి ఆ తర్వాత మాకు తగిన గైడెన్స్ ఇస్తుంటారు. పదకొండేళ్ల టీనేజ్‌లో మాస్ కమ్యూనికేషన్స్ చేద్దామని నిర్ణయించుకున్నాను. నాకు సహకరించడం కోసం నాన్న నా కన్నా ముందే మాస్ కమ్యూనికేషన్స్‌లో పట్టా సాధించి, ఆ తర్వాత నాకు సబ్జెక్టుల్లో శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు నేను లా చేద్దామని అనుకున్నప్పుడు మా అమ్మగారు (భాగ్యలక్ష్మి జైస్వాల్) నాకు తోడయ్యారు. మా అమ్మ ఇప్పటికే ఎంఎస్సీ మైక్రో బయాలజీ చేశారు. క్రీడల్లో బిజీగా ఉండే నాకు సపోర్ట్‌గా ఉండడానికి తాను కూడా లా విద్యార్థినిగా మారారు. ఫ్రెండ్స్‌లా ఉన్నాం... నాతోపాటు అమ్మ కూడా లా కోర్సులో జాయిన్ అవడం నాలో కొత్త ఉత్సాహం తెచ్చింది. బాగ్ లింగంపల్లిలోని ‘బి.ఆర్.అంబేడ్కర్ లా కాలేజ్’ లో మా న్యాయశాస్త్ర విద్యాభ్యాసం సాగింది. మేం ఇద్దరం తల్లీకూతుళ్లుగా క్లాస్మేట్స్గా ఉండడం చూసి అందరూ షాక్ అయ్యేవారు(నవ్వుతూ). ఇద్దరం కలిసి చదువుకోవడం, కేస్ స్టడీస్ అధ్యయనం చేయడం, పరీక్షలు రాయడం వైవిధ్యభరిత అనుభూతి అనే చెప్పాలి. అమ్మతో కలిసి చదువుతుంటే ఫ్రెండ్స్‌లా, ఇద్దరం ఈక్వల్ అన్నట్టే అనిపించింది. చదువంటే విజ్ఞానం అమ్మతో కలిసి మళ్లీ మరో కోర్సు చేసే అవకాశం వస్తే నేనైతే వెంటనే ఓకే అంటాను. నేను భవిష్యత్తులో లాయర్ అవుతానో లేదో చెప్పలేను. మా కుటుంబం దృష్టిలో... చదువు అంటే డిగ్రీలు కాదు... విజ్ఞానం సంపాదించడం, దాన్ని నిత్యజీవితంలో మన ఎదుగుదలకి ఉపయోగపడేలా చేసుకోవడం’’ అన్నారు నైనా జైస్వాల్. -
రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలకు అర్థం చెప్పాలనే... విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో భారీగా యాష్(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్ డస్ట్ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్ ఎంచుకున్నారు. ఎన్టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా.. రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్ గ్రేడ్, సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. సీబీఆర్ రేషియో ప్రామాణికంగా.. రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్ రేషియో(సీబీఆర్)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్ బేస్ కోర్స్‌కు లిక్విడ్ లిమిట్ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి. పట్నాయక్ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్ లిమిట్ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్)కు బాటమ్ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బాటమ్ యాష్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్ విద్యుత్ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్ యూనిట్ల ద్వారా క్రషర్ డస్ట్ వెలువడుతోంది. యాష్, క్రషర్ డస్ట్ పర్యావరణానికి సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో తుమ్లుక్ థిగా రైల్వే లైన్ నిర్మాణంలో బాటమ్ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్), వాల్తేర్ డివిజన్ -
భర్త ఆటో డ్రైవర్.. భార్యకు డాక్టరేట్
బంజారాహిల్స్ (హైదరాబాద్): భర్త ఆటో డ్రైవర్.. అయితేనేం అతని భార్య పట్టుదలతో డాక్టరేట్ సాధించారు. మహబూబ్‌నగర్ జిల్లా బొడ్డెమ్మ పాటలు, జనజీవన చిత్రన అనే అంశాన్ని పరిశోధనాంశంగా తీసుకుని తగిలి శ్యామల ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ సంపాదించారు. మహబూబ్‌నగర్ జిల్లా తెల్కపల్లి మండలం పెద్దూరు గ్రామానికి చెందిన శ్యామల బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఓయూ ఓరియంటల్ విభాగం తెలుగు శాఖ నుంచి డాక్టరేట్ పొందారు. శ్యామల ఆంధ్రసారస్వత పరిషత్‌లో డిగ్రీ, పీజీ పూర్తి చేశారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా బొడ్డెమ్మ ఆటలో పాటలను ముందు తరాల వారికి లిఖితరూపకంగా అందించాలనుకున్నారు. బొడ్డెమ్మ పాటలను పరిశోధనాంశంగా తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. తన పీహెచ్డీ సిద్ధాంత గ్రంథానికి సహకరించిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు పర్యవేక్షకులుగా వెంకట్‌రెడ్డి, సిల్మా నాయక్ సహకరించినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా శ్యామల భర్త చెరుకు రాంచందర్ ఆటో నడుపుతూ తనను చదివించారని ఆయన కష్టాన్ని వృథా చేయకుండా ఆయన అనుకున్న లక్ష్యాన్ని సాధించినందుకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. (క్లిక్: 80వ పుట్టినరోజు.. కేజీల విత్తనాలు) -
ఆనర్స్ డిగ్రీతో నేరుగా పీహెచ్డీ.. వివరాలు ఇదిగో..
సాక్షి, అమరావతి: డిగ్రీ ప్రోగ్రాముల్లో నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఇకపై నేరుగా పీహెచ్డీ చేయొచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అవకాశం కల్పిస్తోంది. ఆనర్స్ కోర్సులో నిర్ణీత స్కోరు పాయింట్లు సాధించి ఉంటే నేరుగా పీహెచ్డీ చేయవచ్చు. జాతీయ నూతన విద్యా విధానంలో పీహెచ్డీ ప్రవేశాలకు కొన్ని నూతన అంశాలను కేంద్ర ప్రభుత్వం చేర్చిన సంగతి తెలిసిందే. వీటిని అనుసరించి ఆనర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి పీహెచ్‌డీలో ప్రవేశానికి విధివిధానాలను యూజీసీ ఖరారు చేసింది. నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ కోర్సులో 10 స్కోరు పాయింట్లలో 7.5 పాయింట్లు సాధించిన విద్యార్థులకు నేరుగా పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వచ్చే 2022–23 విద్యా సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు 0.5 స్కోరు పాయింట్ల మినహాయింపునిచ్చింది. ఆనర్స్ కోర్సుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పరిశోధన అంశాలవైపు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. డిగ్రీ ఆనర్స్ కోర్సుల్లో 7.5 స్కోరు పాయింట్లుకన్నా తక్కువ వచ్చిన వారు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన తరువాతే పీహెచ్డీ చేసేందుకు అర్హత ఉంటుంది. సీట్ల భర్తీలోనూ మార్పులు యూనివర్సిటీల్లోని పీహెచ్డీ కోర్సుల సీట్లను భర్తీ చేసే విధానంలోనూ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రాల్లో వేర్వేరు విధానాలు అమల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల ఆయా యూనివర్సిటీలే నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. తాజా విధానాన్ని అనుసరించి ఇకపై జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా వర్సిటీల్లోని సీట్లను భర్తీ చేసుకోవచ్చు. అలా కాకుండా ఆయా వర్సిటీలు, రాష్ట్రాలు సొంతంగా భర్తీ చేసుకోవాలంటే 60:40 నిష్పత్తిలో ప్రవేశాలు కల్పించారు. యూనివర్సిటీల ప్రవేశ పరీక్షలు లేదా రాష్ట్రాల కామన్ ప్రవేశ పరీక్షల ద్వారా 40 శాతం సీట్లను భర్తీ చేస్తే మిగతా 60 శాతం సీట్లను జాతీయస్థాయి పరీక్ష ద్వారా భర్తీ చేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు, ఆనర్స్ డిగ్రీలో నిర్ణీత స్కోరు సాధించిన వారు కూడా ఈ ప్రవేశ పరీక్ష ద్వారానే పీహెచ్‌డీకి ఎంపిక కావాలి. -
స్ఫూర్తి: ముంబై మురికివాడ నుంచి... యూఎస్ యూనివర్శిటీ వరకు!
దురదృష్టం ఒక ద్వారం మూసిపెడితే, కష్టపడేతత్వం పదిద్వారాలను తెరిచి ఉంచుతుంది... అంటారు. ముంబై పేవ్‌మెంట్స్‌పై పూలు అమ్మిన సరిత మాలికి ‘యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి చేసే అవకాశం లభించింది. ఈ విజయానికి కారణం ఆమె ఇష్టపడే కష్టపడేతత్వం... సరిత మాలి తల్లిదండ్రులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని మూరుమూల ప్రాంతం నుంచి పొట్ట చేతపట్టుకొని మహానగరం ముంబైకి వచ్చారు. అక్కడి ఘడ్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగింది సరిత.స్థానిక మున్సిపల్ స్కూల్లో పదవతరగతి చదువుకుంది. ఆ తరువాత కాలేజి చదువు కొనసాగిస్తూనే ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టింది. ట్యూషన్స్ చెప్పగా వచ్చిన డబ్బులను జాగ్రత్తగా దాచుకునేది. పై చదువులకు అవి ఎంతో కొంత సహాయపడ్డాయి. ఒకసారి సెలవులలో అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లినప్పుడు, బంధువులలో ఒకరు దిల్లీలోని ‘జేఎన్‌యూ’ గురించి గొప్పగా చెప్పారు. ఆ సమయంలోనే అనుకుంది...ఆ యూనివర్శిటీలో ఎలాగైనా చేరాలని! ఆ ఉత్సాహంపై నీళ్లుపోసే మాటలు ఎదురయ్యాయి. ‘జేఎన్‌యూలో అడ్మిషన్ దొరకడం అంతేలికైన విషయం కాదు’ ‘తెలివైన విద్యార్థులు మాత్రమే అక్కడ చదువుకుంటారు’... మొదలైనవి. ఆ తెలివైన విద్యార్థి తాను ఎందుకు కాకూడదు? అని మనసులో గట్టిగా అనుకుంది సరిత. బీఏ మొదటి సంవత్సరం నుంచే ప్రవేశపరీక్షకు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది! ఆమె కష్టం వృథా పోలేదు. ప్రసిద్ధమైన యూనివర్శిటీలో ఎం.ఏ హిందీలో ఆమెకు సీటు వచ్చింది. ‘నేను మరిచిపోలేని రోజు, నా జీవితాన్ని మలుపు తిప్పిన రోజు అది. జేఎన్‌యూలో విస్తృతమైన∙ప్రపంచాన్ని చూశాను. ఎన్నో విషయాల గురించి తెలుసుకోగలిగాను’ అంటుంది సరిత. యూనివర్శిటీలో తనతో ఒక్కొక్కరూ ఒక్కోరకంగా వ్యవహరించేవారు. పేదకుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన యంగెస్ట్ రిసెర్చ్ స్కాలర్‌గా తనను స్ఫూర్తిగా తీసుకున్నవారు కొందరైతే,‘సాఫ్ట్వేర్ సైడ్ వెళ్లకుండా ఈ సాహిత్యం, కవిత్వం వల్ల ఉపయోగం ఏమిటి?’ అని తక్కువ చేసి మాట్లాడిన వారు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ, తన మాటల్లో చెప్పాలంటే ‘జేఎన్‌యూ’ సరితకు మరోప్రపంచాన్ని చూపింది. జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేసిన సరితకు తాజాగా ‘యూనివర్శిటి ఆఫ్ కాలిఫోర్నియా’లో పీహెచ్‌డి(హిందీ సాహిత్యం) చేసే అవకాశం లభించింది. ‘భక్తి ఉద్యమకాలంలో అట్టడుగు వర్గ మహిళల సాహిత్యం’ అనేది ఆమె పీహెచ్‌డి అంశం. ‘నాకు చిన్నప్పటి నుంచి చదువు అంటే ఎంతో ఇష్టం. అయితే పేదరికం వల్ల ఎన్నోసార్లు చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చినా నేను వెనక్కి తగ్గలేదు. ఏదో రకంగా కష్టపడి చదువుకున్నాను. నాకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల సహకారం మరవలేనిది. భవిష్యత్‌లో పేదపిల్లలకు నా వంతుగా సహాయపడాలనుకుంటున్నాను’ అంటుంది 28 సంవత్సరాల సరిత మాలి. -
రూ.7.5 లక్షల కోట్ల ఎఫ్‌డీఐలు
న్యూఢిల్లీ: భారత్ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 100 బిలియన్ డాలర్ల (రూ.7.5 లక్షల కోట్లు) విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆకర్షిస్తుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) పేర్కొంది. ఇటీవలి సంవత్సరాల్లో వ్యాపార నిర్వహణ సులభం కావడంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఇందుకు మద్దతుగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 శాతం వృద్ధి రేటును సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం రిస్క్ ఉందని పేర్కొంది. ఆర్థిక వృద్ధి బలోపేతానికి, వచ్చే ఐదేళ్లలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు పది అంచెల విధానాన్ని సూచించింది. మౌలిక రంగంలో పెట్టుబడులను వేగవంతం చేయడం, పీఎల్ఐ కిందకు మరిన్ని రంగాలను తీసుకురావడం, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం పెట్టుబడులు పెంచడం, అధిక కమోడిటీ ధరలను పరిష్కరించడం, ముడిసరుకులకు కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. -
పరిశోధనా? ఉపరితల శోధనా?
కార్యకారణాలేమైనా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇన్నాళ్ళకు కళ్ళు తెరిచినట్టుంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పేందుకు ఆయా రంగాల నిపుణులను వినియోగించుకోవాలని నిర్ణయించడం మంచిదే. ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా – పీహెచ్డీ పట్టా కానీ, జాతీయ అర్హతా పరీక్ష (నెట్)లో కృతార్థులై కానీ ఉంటే తప్ప అధ్యాపకులుగా పనిచేయడానికి వీలు లేదన్న షరతుకు వెసులుబాటు లభించింది. సివిల్ సర్వీసులలో లాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఆచార్య పదవుల్లోకి లేటరల్ ఎంట్రీ వచ్చినట్టయింది. ఈ కొత్త విధానంతో పాటు, కొంతకాలంగా ఉద్యోగానికీ – పీహెచ్‌డీకీ ముడిపెట్టిన ప్రహసనంపై ఇప్పుడు చర్చ రేగింది. నిజానికి డాక్టోరల్ థీసిస్ (పీహెచ్డీ) అనేది నిర్ణీత అంశాన్ని లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తితో, మనసు పెట్టి చేయాల్సిన పని. ఉద్యోగార్హత కోసం చేసే మొక్కుబడి వ్యవహారం కాదు. అలాగే, నాణ్యమైన బోధన చేయాలంటే పీహెచ్డీ చేసి తీరాలని అనుకోవడం బోడిగుండుకూ, మోకాలికీ ముడిపెట్టడమే! అద్భుతంగా పాఠం చెప్పగలిగినవాళ్ళందరూ పరిశోధకులై ఉంటారనుకున్నా, ఉత్తమ పరిశోధకులైనంత మాత్రాన అర్థమయ్యేలా పాఠం చెప్పే నేర్పు ఉంటుందనుకున్నా పొరపాటు. విధాన నిర్ణేతలు ఈ చిన్న తర్కం మర్చిపోయారు. పీహెచ్డీ చేయకున్నా, దాదాపు 40 గౌరవ డాక్టరేట్లొచ్చిన అబ్దుల్ కలామ్ ఎంత అద్భుత బోధకులో గుర్తు చేసుకోవాలి. అధ్యాపకులుగా ఎంపిక కావాలన్నా, ఇప్పటికే అధ్యాపక వృత్తిలో ఉన్నవారు ఆ పనిలోనే కొనసాగాలన్నా పీహెచ్డీ చేసి తీరాల్సిందే అని కొన్నేళ్ళ క్రితం పెట్టిన నిబంధన నిర్హేతుకమనేది అందుకే! ఒకప్పుడు ఉద్యోగానికి పీహెచ్డీ తప్పనిసరి కాదు. 2021 జూలై నుంచి యూనివర్సిటీ బోధనకు పీహెచ్డీ తప్పనిసరి చేసింది యూజీసీ. కరోనాతో తేదీని 2023 వరకు పొడిగించారు. కానీ, ఉన్నత విద్యాబోధనలో ఉండాలంటే పీహెచ్డీ సాధించాల్సిందేనని మెడ మీద కత్తి పెడితే ప్రయోజనం ఉంటుందా? ఒకప్పుడు డాక్టరేట్ అంటే అదో విశిష్ట సాధన. గౌరవ డాక్టరేట్లు, కష్టపడి పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాతో పేరు ముందు వచ్చే డాక్టర్ అనే మూడక్షరాలు సమాజంలో విశేష గౌరవం. ఆ మోజు పెరిగేసరికి పేరు లేని విదేశీ సంస్థల మొదలు ప్రైవేట్ విద్యా లయాల దాకా అనేకుల గౌరవ డాక్టరేట్లు ఇవాళ అంగడి సరుకయ్యాయి. గౌరవ డాక్టరేట్లను పేరు ముందు ఇంటి పేరులా వాడరాదన్నది విస్మరించిన వేళ అసలు డాక్టరేట్కే గౌరవం లేకుండా పోయే ప్రమాదం వచ్చింది. 1920లలో మన దగ్గర కొన్ని డజన్ల మందే పీహెచ్డీ స్కాలర్లుండేవారు. ఇవాళ అమెరికాలో ఏటా 64 వేలకు పైగా డాక్టరేట్లు వస్తుంటే, 24 వేల మంది పీహెచ్డీ స్కాలర్లతో మనం ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉన్నాం. 2010తో పోలిస్తే 2017లో పీహెచ్‌డీలో చేరేవారి సంఖ్య రెట్టింపు దాటింది. 2000 నాటికి దేశంలో డాక్టరేట్ ప్రదానం చేసే సంస్థలు 326. కానీ, 2017 కల్లా వాటి సంఖ్య 912 అయిందంటే పీహెచ్డీ ఎంత వేలంవెర్రిగా మారిందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి, నిరంతర అధ్యయనం, క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రొఫెసర్ల మార్గదర్శనం, విశ్వవిద్యాలయాల్లో పరిశోధన పత్రాల సమర్పణ – అంతా ఒక సీరియస్ జ్ఞానార్జన. కానీ, ఇవాళ పరిశోధకులకే కాదు... వారికి దిశా నిర్దేశ విధుల్లో ఉన్న చాలామందిలోనూ విషయ పరిజ్ఞానం హుళక్కి. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయ శాఖలు పీహెచ్డీ స్కాలర్లను టోకున బయటకు పంపే కర్మాగారాలయ్యాయి. అనేకచోట్ల అజ్ఞాత రచయితల సహకారం, గ్రంథ చౌర్యం, నాసిరకం పరిశోధనాంశాలు, పత్రాలతో ప్రమాణాలు నానాటికీ తీసికట్టు అయ్యాయి. నాలుగు వాక్యాలు రాయలేనివాళ్ళు, నాలుగు మాటలు సదస్సులో మాట్లాడలేనివాళ్ళూ నేడు పీహెచ్డీ పట్టాదారుల్లో ఉంటున్నారన్నది నిష్ఠురమైన నిజం. ఉద్యోగానికీ, ఉద్యమంగా చేయాల్సిన పరిశోధనకూ లింకు పెట్టడం మన విధాన నిర్ణేతల ఘోర తప్పిదం. దానివల్లే పీహెచ్డీ ప్రవేశాలు 50 శాతం పెరిగాయి. ప్రమాణాలు పాతాళానికి చేరాయి. కనీసం మూడు నుంచి అయిదేళ్ళ కఠోర శ్రమతో తపించి చేయాల్సిన పరిశోధనపై తపన లేనివాళ్ళు కూడా ఉద్యోగం కోసం వట్టి ఉపరితల శోధకులవుతున్న దౌర్భాగ్యం. ఆర్ట్స్ మొదలు సైన్స్ దాకా అనేకచోట్ల ఇదే పరిస్థితి. ఏటా 60 లక్షల మంది గ్రాడ్యుయేట్లు, 15 లక్షల మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు వస్తున్న దేశంలో నిఖార్సయిన పరిశోధక విద్యార్థుల శాతం ప్రశ్నార్థకమే. విశ్లేషణాత్మక శోధన, వర్తమాన ప్రాసంగికత లోపించి, పునరుక్తులతో, సర్వే ఆధారిత సిద్ధాంతాలుగా తూతూ మంత్రపు ఉపరిశోధనలు పెరిగిపోయాయని తాజా నివేదికల మాట. వెరసి, జ్ఞానార్జనలో సరికొత్త అంశాలు వెలికి తీయాల్సిన పరిశోధన మౌలిక లక్ష్యం, లక్షణం నిర్వీర్యమైపోతున్నాయి. మౌలిక పరిశోధన మృగ్యమై, ఎంతసేపటికీ చూచిరాతలు, ఎత్తిపోతలతోనే వివిధ శాఖల్లో పీహెచ్డీ సిద్ధాంత గ్రంథాలు సిద్ధమవుతున్నట్టు ఆరోపణ. గ్రంథ చౌర్యాన్ని కనిపెట్టే సాఫ్ట్‌వేర్‌ను కొన్నేళ్ళ క్రితం ప్రవేశపెట్టారు. కానీ, ఆ ఒక్క పనితో పీహెచ్‌డీల నాణ్యత పెరుగుతుందా? చిత్తశుద్ధి లేని పీహెచ్‌డీతో నిర్ణీత విద్యాశాఖకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాంటి వారు బోధకులైతే విద్యా ర్థులకు వచ్చిపడే విజ్ఞానం ఏముంటుంది? ఇప్పటికైనా నిష్ప్రయోజనమైన ఈ డిగ్రీల తంతును వదిలించుకొని, నిఖార్సయిన పరిశోధనలను యూజీసీ, మానవ వనరుల అభివృద్ధిశాఖ ప్రోత్సహిస్తే మేలు. ప్రహసనప్రాయంగా మారిన ‘నెట్’ లాంటి వాటి పైనా పునఃసమీక్ష అవసరం. పీహెచ్డీ లేకున్నా, అనుభవజ్ఞులైన వారి సేవలు తీసుకోవాలన్న తాజా నిర్ణయం అందుకే స్వాగతనీయం. -
ఓయూలో 14 నుంచి సెల్ట్ తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీ అనుబంధ విభాగం.. ద సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రెనింగ్ సెంటర్ (సెల్ట్)లో ఈ నెల 14 నుంచి తరగతి గది బోధనను పునఃప్రారంభించనున్నట్లు గురువారం డైరెక్టర్ డాక్టర్ సవీన్ పేర్కొన్నారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు 90145 00509కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. న్యాయశాస్త్రం పీహెచ్డీ ఫలితాలు విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ న్యాయశాస్త్రంతో పాటు గణితం, జియోలజీ పీహెచ్డీ కోర్సుల ఫలితాలను గురువారం విడుదల చేశారు. అక్టోబరులో జరిగిన వివిధ పీహెచ్డీ కోర్సుల పార్టువన్ (కోర్సు వర్క్) పరీక్ష ఫలితాలను ఉస్మానియా వెబ్సైట్లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. ఓయూ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలు ఓయూ పరిధిలో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో జరిగిన ఎల్ఎల్బీ, ఎల్ఎల్బీ ఆనర్స్, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా ఫలితాలను గురువారం విడుదల చేశారు. ఫలితాల వివరాలను వెబ్సైట్లో చూడవచ్చు. -
మీ దృష్టిలో విలువైంది ఏదో చెప్పండి
ఈరోజుల్లో మనిషి కంటే మనీకే విలువ ఎక్కువ. రిలేషన్స్ కంటే అవసరాలకే ప్రాధాన్యం ఉంటోంది. మనిషి వాస్తవంలో బతుకుతోంది తక్కువ!. స్మార్ట్ ఫోన్లో.. సోషల్ మీడియాలోనే సగం కంటే ఎక్కువ జీవితం గడిచిపోతోంది. అఫ్కోర్స్.. ఇవన్నీ చర్చించుకోవడానికి బాగానే అనిపించొచ్చు. కానీ, వాస్తవ ప్రపంచం వేరు. ఒక అంశంపై ఎవరి ఒపీనియన్ వాళ్లది. వాళ్లకు అనిపించిందే కరెక్ట్!. జనరేషన్లు ముందుకెళ్తున్నా కొద్దీ.. ఈ తీరు మరింత మొండిగా మారుతోంది. మనీ ఆల్వేస్ మ్యాటర్. లాభం వచ్చే పని ఏదైనా సరే!.. చేసుకుంటూ ముందుకెళ్లడమే!. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇండియా ఇన్ ఫ్లెక్స్ అనే ట్విటర్ పేజీ రెండు ఆప్షన్స్‌తో ఈమధ్య ఓ పోల్ నిర్వహించింది. ‘1 మిలియన్(పది లక్షల) యూట్యూబ్ సబ్ స్క్రయిబర్స్, పీహెచ్డీ పట్టా.. ఈ రెండింటిలో దేనికి ఎక్కువ విలువ ఉంటుంది?’ అని ట్విటర్ పోల్ నిర్వహించింది. దేనికి ఎక్కువ ఓట్లు వచ్చి ఉంటాయనుకుంటున్నారు. యస్.. మీరు ఊహించిందే కరెక్ట్. కింద పోల్ ఫలితం చూస్తున్నారుగా.. విద్య కంటే.. ఎంటర్టైన్మెంట్కే ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఇంకా పడుతున్నాయి కూడా!. ఇందుకు ఫేమ్, డబ్బు కారణాలు కావొచ్చు. వాళ్ల అభిప్రాయాలు వాళ్లకు ఉంటాయి. ఇంతకీ మీ దృష్టిలో విలువైంది ఏంటి?.. ఎందుకో కారణంతో సహా చెబితే మరీ మంచిది!. which of these do you think has more value today? — India in Pixels (@indiainpixels) December 11, 2021 -
AP: 13 వరకు ఇంటర్ పరీక్ష ఫీజు గడువు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ మార్చి–2022 పబ్లిక్ పరీక్షలకు ఫస్టియర్, సెకండియర్ రెగ్యులర్ విద్యార్థులు, గతంలో ఫెయిలై మళ్లీ పరీక్షలకు హాజరవ్వాలనుకొనే విద్యార్థులు డిసెంబర్ 13వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు పేర్కొన్నారు. ఈ మేరకు ఫీజుల వివరాలతో మంగళవారం బోర్డు ప్రకటన జారీ చేసింది. ఆలస్య రుసుములతో 2022 జనవరి 20 వరకు గడువు ఉందని పేర్కొంది. ఆలస్య రుసుము రూ.120తో డిసెంబర్ 23, రూ.500తో డిసెంబర్ 30, రూ.1,000తో 2022 జనవరి 4, రూ.2 వేలతో జనవరి 10, రూ.3 వేలతో జనవరి 17, రూ.5 వేలతో జనవరి 20 వరకు పరీక్ష ఫీజులను చెల్లించవచ్చునని వివరించింది. దరఖాస్తు రుసుము, పరీక్షలకు సంబంధించి ఫీజులను (పేపర్ల వారీగా, సంవత్సరాల వారీగా), ఇతర అంశాలను సర్క్యులర్‌లో పొందుపరిచింది. (చదవండి: ఏపీ నీట్ ర్యాంక్‌లు విడుదల) పీహెచ్డీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, తాడేపల్లిగూడెం: పీహెచ్డీ పార్ట్‌టైం, ఫుల్‌టైం కోర్సులు, ఎంఎస్ (బై రీసెర్చ్) కోర్సుల్లో చేరడానికి ఏపీ నిట్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. డిసెంబర్ 2021 సెషన్‌కు సంబంధించి అర్హులైన వారిని ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తులకు డిసెంబర్ 4 వరకు గడువు ఉన్నట్లు నిట్ అధికారులు మంగళవారం తెలిపారు. పార్ట్‌టైం కోర్సులో 148 సీట్లు, ఫుల్‌టైం కోర్సులో 144 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారిని రాతపరీక్ష, ఇంటర్వ్యూ పద్ధతుల్లో ఎంపిక చేయనున్నారు. మరిన్ని వివరాలు www.nitandhra.ac.in/main/లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. -
89 ఏళ్ల వయసు.. ఫిజిక్స్‌లో పీహెచ్డీ!
మనం ఏదోలా కష్టపడి చదివేసి ఒక మంచి ఉద్యోగం వస్తే చాలు అనుకుంటాం. పైగా చాలామంది కలెక్టర్ అనో లేక మంచి కంపెనీలో మంచి హోదాలో ఉండే ఉద్యోగి కావాలనో అనుకుంటారు. కానీ కొంత వరకు ప్రయత్నించి ఈలోపు మధ్యలో ఏదైన చిన్న ఉద్యోగం వస్తే సెటిలైపోడానికే చూస్తాం. దీంతో మనం మన లక్ష్యాలను మధ్యలో వదిలేస్తాం. ఇంక మనం పెద్దవాళ్లమైపోయాం ఇంకేందుకు అనుకుంటాం. కానీ కొంత మంది మంచి ఉద్యోగం చేసి రిటైరైనప్పటికీ తమ లక్ష్యాన్ని, ఆసక్తిని వదులుకోరు. అచ్చం అలానే యూఎస్‌కి చెందిన 89 ఏళ్ల వృద్ధుడు పీహెచ్డా పూర్తి చేసి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు. (చదవండి: నువ్వే స్టెప్ వేస్తే అదే స్టెప్ వేస్తా!!:వైరల్ అవుతున్న క్యూట్ వీడియో అసలు విషయంలోకెళ్లితే...యూఎస్‌కి చెందిన మాన్‌ఫ్రెడ్ స్టైనర్ 89 ఏళ్ల వయసులో పిహెచ్డి చేసి భౌతిక శాస్త్రవేత్త కావాలనే తన కలను సాధించాడు. ఈ మేరకు స్టైనర్ ఈస్ట్ ప్రొవిడెన్స్, రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో తన పరిశోధనను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించాడు. అంతేకాదు స్టైనర్‌కి తన చిన్నతనం నుంచే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్‌ల గురించి చదివి తాను కూడా వారిలా భౌతిక శాస్త్రవేత్త కావాలని అనుకునేవాడు. అయితే స్టైనర్ తల్లి, మేనమామ సూచన మేరకు 1955లో వియన్నా విశ్వవిద్యాలయం నుండి తన వైద్యా విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత స్టైనర్ యూఎస్ వెళ్లి టఫ్ట్స్ యూనివర్సిటీలో హెమటాలజీని, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బయోకెమిస్ట్రీని అభ్యసించారు. ఈ మేరకు అతను 1985 నుండి 1994 వరకు బ్రౌన్‌లోని మెడికల్ స్కూల్లో హెమటాలజీ విభాగానికి అధిపతిగా సేవలందించాడు. ఆ తర్వాత స్టైనర్ 2000లో మెడిసిన్ విభాగం నుండి రిటైర్ అయ్యాడు. అయితే స్టైనర్‌కి వైద్య పరిశోధన సంతృప్తికరంగా ఉంది, కానీ భౌతికశాస్త్రం మీద తన ఆసక్తిని కోల్పోలేదు. దీంతో స్టైనర్ 70 ఏళ్ల వయస్సులో బ్రౌన్ వద్ద అండర్ గ్రాడ్యుయేట్ తరగతులు తీసుకోవడం ప్రారంభించాడు. పైగా 2007 నాటికల్లా పీహెచ్డీ ప్రోగ్రాం చేసేందుకు కావల్సిన అన్ని అర్హతలు సంపాదించాడు. ఈ మేరకు స్టైనర్ ఫిజిక్స్ ప్రొఫెసర్ బ్రాడ్ మార్స్టన్ మాట్లాడుతూ..."స్టైనర్‌ను నా విద్యార్థిగా చేర్చుకోవడంపై మొదట చాలా సందేహించాను కానీ అతని అంకితభావానికి ముగ్ధుడునయ్యాను. ఇప్పుడతను నా పరిశోధనలకు సలహాదారుడిగా అయ్యాడు. అంతేకాదు నేను ఫిజిక్స్ పరిశోధనల్లో రాసినదానికంటే స్టైనర్ మెడికల్ సైన్స్‌లో చాలా పేపర్లు రాశాడు. యువ విద్యార్థుల్లో ఉండాల్సిన శాస్త్రీయ ఆలోచనా విధానం అభిరుచి ఇప్పటికి స్టైనర్ దగ్గర ఉంది."అని అన్నారు. అయితే స్టైనర్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీని పూర్తి చేయడం అనేది తనకు జీవితంలో అత్యద్భుతమైన విషయం అని అన్నాడు. పైగా తనకు ఉద్యోగం చేసే వయసు దాటిపోయిందని తాను కేవలం తన ప్రోఫెసర్ పరిశోధనలకు సలహదారుడిగా మాత్రమే ఉంటానని చెప్పుకొచ్చారు. (చదవండి: అమెరికా జర్నలిస్ట్‌కి 11 ఏళ్లు జైలు శిక్ష) -
ఫేక్ పీహెచ్డీ ఫ్యాకల్టీలదే హవా!
సాక్షి, కాకినాడ: ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో నకిలీ పీహెచ్‌డీలతో విద్యాబోధన యథేచ్ఛగా కొనసాగుతున్నా.. చర్యలు తీసుకోవాల్సిన వర్సిటీల అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జేఎన్టీయూ (కాకినాడ) వర్సిటీ ఏపీలోని 8 జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలో 180 అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో ఒకరిద్దరు చొప్పున ఎనిమిది జిల్లాల్లో సుమారు 200 మంది నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో విద్యాబోధన చేస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ స్థాయిలో బోధించాలంటే పీహెచ్డీ తప్పనిసరి. గుర్తింపు పొందిన వర్సిటీల్లో పీహెచ్డీ పూర్తి చేసిన అభ్యర్థిని కళాశాలల్లో నియమిస్తే నెలకు రూ.90,000 నుంచి రూ.1,20,000 వరకు వేతనం ఇవ్వాలి. ఇంత మొత్తం ఇవ్వడం ఇష్టం లేని ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ జీతానికి వచ్చే ఫేక్ పీహెచ్డీ అభ్యర్థులకు రూ.40 వేల వరకు ఇస్తూ పబ్బం గడుపుకుంటున్నాయి. ఎక్కడివీ ఫేక్ పీహెచ్‌డీలు.. కొంతమంది అభ్యర్థులు కర్నాటక, తమిళనాడు, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని వర్సిటీలకు ఎంతో కొంత సమర్పించుకుని నకిలీ పీహెచ్డీ పట్టా తెచ్చుకుంటున్నారు. తక్కువ జీతానికే పనిచేస్తామని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలను ఆశ్రయిస్తున్నారు. వారు సైతం ఖర్చు తక్కువ అవుతుందని భావించి.. అతి తక్కువ జీతాలిస్తూ వీరిని ప్రోత్సహిస్తున్నారు. కీలక ఉద్యోగాల్లో నియమిస్తున్నారు. అనుభవం లేని నకిలీ అధ్యాపకులు పాఠాలు బోధిస్తుండడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎడారిలో ఎండమావిలా మారింది. నిద్రమత్తులో వర్సిటీ యంత్రాంగం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూనివర్సిటీ అధికారులు ప్రతి ఏటా నిజ నిర్ధారణ కమిటీల పేరుతో తనిఖీలు నిర్వహిస్తున్నా.. నకిలీ పీహెచ్‌డీలపై దృష్టి సారించడం లేదు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో మచ్చుకు కొన్ని.. రాష్ట్రంలో నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి జాబితా చాంతాడంత ఉంది. ఏలూరు, తాడేపల్లిగూడెం, కాకినాడ, కృష్ణాజిల్లా చల్లపల్లి, గుంటూరు, నర్సాపురంలోని కొన్ని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే తంతు సాగుతోంది. దాదాపు 200 మంది వివిధ హోదాల్లో నకిలీ సర్టిఫికెట్లతో కొనసాగుతున్నారని తెలుస్తోంది. విచారించి చర్యలు తీసుకుంటాం.. ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో యూజీసీ, ఏఐసీటీఈ నిబంధనలు తప్పకుండా పాటించాలి. నకిలీ పీహెచ్డీ సర్టిఫికెట్లతో కళాశాలల్లో పనిచేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. విచారించి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే నిజనిర్ధారణ కమిటీలు తనిఖీ సైతం నిర్వహించాయి. – డాక్టర్ సుమలత, రిజిస్ట్రార్, జేఎన్టీయూ(కే) ఫేక్ పీహెచ్‌డీలను గుర్తించాలి.. నకిలీ పీహెచ్డీ అభ్యర్థులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు పీహెచ్డీ పూర్తి చేసిన వారి డేటా వర్సిటీ వెబ్సైట్లలో ఉంచుతున్నారు. మిగతా యూనివర్సిటీలు కూడా పాటిస్తే పారదర్శకత పెరుగుతుంది. –డాక్టర్ జ్యోతిలాల్ నాయక్, విద్యావేత్త -
ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం.. దరఖాస్తుల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయ 81వ స్నాతకోత్సవంలో భాగంగా ఈ నెల 27వ తేదీన జరిగే కార్యక్రమంలో డిగ్రీ పట్టాలను అందుకోవాలనుకునే పీహెచ్డీ అభ్యర్థులు ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్ శుక్రవారం తెలిపారు. బంగారు పతకాలు అందుకునే అభ్యర్థుల జాబితాను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడాలన్నారు. 18 వరకు డిగ్రీ సప్లిమెంటరీ, ఇన్స్టంట్ పరీక్షల ఫీజు చెల్లింపు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో డిగ్రీ కోర్సుల 1, 3, 5 బ్యాక్‌లాగ్‌లతో పాటు కోవిడ్ కారణంగా ప్రత్యేకంగా నిర్వహిస్తున్న డిగ్రీ ఇన్స్టంట్ 6వ సెమిస్టర్ పరీక్షల ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈ నెల 18 వరకు చెల్లించవచ్చునని ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొ.శ్రీరామ్ వెంకటేష్ శుక్రవారం తెలిపారు. రూ.200 అపరాధ రుసుముతో 23 వరకు, రూ.500 రుసుముతో 26, 27 వరకు, రూ.1000 రుసుముతో 28, 29 వరకు, రూ.2000 రుసుముతో నవంబరు 1, 2 వరకు, రూ.5000 అపరాధ రుసుముతో నవంబరు 3 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. వివరాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ వెబ్సైట్ చూడాలన్నారు. 26 నుంచి ఎంబీఏ పరీక్షలు ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 6 వరకు ఎంబీఏ రెగ్యులర్ 2వ సెమిస్టర్, బ్యాక్లాగ్ 1వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ తెలిపారు. పరీక్షల టైంటేబుల్‌ను ఉస్మానియా వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఓయూ దూరవిద్యలో సెమిస్టర్ విధానం ఉస్మానియా విశ్వవిద్యాలయ దూరవిద్య కేంద్రంలో వివిధ కోర్సులలో సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. ప్రస్తుతం ఎంబీఏ కోర్సుకు మాత్రమే ఉన్న సెమిస్టర్ పరీక్ష విధానాన్ని ఇతర పీజీ కోర్సులకు కూడా అమలు చేయనున్నారు. ఈ విద్యా సంవత్సరం (2021–22) ఎంసీఏ కోర్సును మూడు నుంచి రెండు సంవత్సరాలకు కుదించి సెమిస్టర్ పరీక్షను అమలుపర్చనున్నారు. రానున్న విద్యా సంవత్సరం (2022–23) నుంచి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీడీసీఏ కోర్సులకు సెమిస్టర్ పరీక్ష విధానాన్ని అమలు చేస్తామని అధికారులు వివరించారు. అందుకు అనుగుణంగా పీజీ పుస్తకాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. పీజీ తర్వాత డిగ్రీ కోర్సులకు కూడ సెమిస్టర్ పరీక్షా విధానాన్ని ప్రవేశపెట్టేయోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ విద్యా సంవత్సరానికి (2021–22) వివిధ కోర్సులలో జోరుగా అడ్మిషన్లు సాగుతున్నాయన్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశ గడువు పొడిగింపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ, బీకాం,బీఎస్సీ), పీజీ (బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ) పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి ఆలస్య రుసుము రూ. 200 తో చివరి తేదీ అక్టోబర్ 13 వరకు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను https://www.braouonline.in/లో పొందుపర్చినట్లు వెల్లడించారు. వివరాలకు 7382929570/580 లేదా విశ్వవిద్యాలయ 040–23680290/291/294/295 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు. -
నాటి టీమిండియా క్రికెటర్.. నేడు ఖగోళ శాస్త్రవేత్త
ముంబై: సాధారణంగా ఆటగాళ్లు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం వల్ల వారి విద్యాభ్యాసం సజావుగా సాగదు. క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన చాలా మంది క్రికెటర్లు చదువుకు మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే, ఇప్పుడు మనం చూపబోయే ఈ టీమిండియా మాజీ క్రికెటర్.. ఎవరూ ఊహించని స్థాయిలో ఉన్నత విద్యను అభ్యసించి ఆస్ట్రోఫిజిస్ట్ అయ్యాడు. ఈ శతాబ్దపు ఆరంభంలో(2003) టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన ఆవిష్కార్ సాల్వి.. తాజాగా ఆస్ట్రోఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేసి, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తూ.. భారత క్రికెట్ చరిత్రలో అత్యున్నత విద్యావంతుల జాబితాలో ముందువరుసలో నిలిచాడు. ఒకప్పటి టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకుని క్రికెట్ అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు. ఖగోళ భౌతిక శాస్త్రవేత్తలు నాసా లేదా ఇస్రో వంటి సంస్థల్లో పని చేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖగోళ భౌతిక శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేయాలంటే అసాధారణమైన తెలివితేటలతో పాటు ఓర్పు, సహనం ఉండాలి. అయితే అంతరిక్ష అధ్యయనాలపై మక్కువతో తాను ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్డీ పూర్తి చేశానని సాల్వి చెప్పుకొచ్చాడు. కాగా, సాల్వి.. 2003లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో అతను 2 వికెట్లు పడగొట్టాడు. అయితే కేవలం 4 వన్డేలు మాత్రమే ఆడిన సాల్వి.. తీవ్రమైన గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున ఐపీఎల్లో కూడా పాల్గొన్నారు. 39 ఏళ్ల సాల్వి పదవీ విరమణ పొందిన అనంతరం క్రికెట్ కోచ్‌గా కూడా మారాడు. 2018లో పుదుచ్చేరి జట్టు కోచింగ్ స్టాఫ్‌లో ఒకరిగా పని చేశారు. దేశవాళీ క్రికెట్లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన సాల్వి.. 50 ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో ఆడాడు. ఇదిలా ఉంటే, భారత మాజీ క్రికెటర్లలో కుంబ్లే, లక్ష్మణ్, అశ్విన్, ద్రవిడ్ లాంటి క్రికెటర్లు అత్యున్నత చదువులు చదువుకున్నారు. అయితే వారందరికంటే అత్యున్నత విద్యను అభ్యసించిన సాల్వి 'ది మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఇండియన్ క్రికెటర్'గా గుర్తింపు తెచ్చుకున్నాడు. చదవండి: వికెట్లను కాకుండా వ్యక్తులను టార్గెట్ చేయడమేంటి..? -
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హతగా పీహెచ్‌డీని తప్పనిసరి చేశారు. గతంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) లేదా స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) ఉంటే సరిపోయేది. కానీ ఈసారి ఆ రెండూ ఉన్నా పీహెచ్డీ తప్పనిసరి చేసినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కొత్త నిబంధనను యూజీసీ అమల్లోకి తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ ఉండాలి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే పీహెచ్‌డీతో పాటు, 8 ఏళ్ల టీచింగ్ అనుభవం, నిర్ణీత మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే 10 ఏళ్ల అనుభవం సహా మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై మంచి స్కోర్ సాధించి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్‌గా వెళ్లాలంటే మూడేళ్ల అనుభవంతో పాటు పైన పేర్కొన్న విధంగా అర్హతలు ఉండాలి. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయబోయే 1,195 పోస్టులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చెబుతోంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెట్, స్లెట్ ఉన్నవారికి 10 మార్కులు వెయిటేజీ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 6 వేల మంది ఎదురుచూపులు రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో భర్తీ చేయబోయే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ సహా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఏకీకృత రాత పరీక్ష, ఇంటర్వూ్య ప్రకారం పోస్టులను భర్తీ చేయా లని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుందని కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అన్ని యూనివర్సిటీల హక్కులను కాలరాసి కేంద్రీకృత పద్ధతిలో నియామకాలు చేపడితే అక్రమాలు జరగవన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో పీహెచ్డీ చేసి పోస్టుల కోసం ఎదురుచూసేవారు దాదాపు 6 వేల మంది ఉంటారని ఉన్నత విద్యామండలి అంచనా వేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారు దాదాపు 1,300 మంది ఉంటారని తెలుస్తోంది. మొత్తం పోస్టుల్లో దాదాపు సగం మేర ఆ కాంట్రాక్టు ఉద్యోగులే దక్కించుకునే అవకాశముంది. ఎందుకంటే వీరికి వెయిటేజీ ఉంటుంది. ఏకీకృత పరీక్ష పేరుతో కాలయాపన చేయకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం కాల రాస్తోందని మండిపడ్డారు. -
పీహెచ్డీ చేసి.. కల్లు కాంపౌండ్‌కు ‘మత్తు’ సరఫరా
సాక్షి, కుత్బుల్లాపూర్: ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేసిన వ్యక్తి బుద్ధి వక్రమార్గంలో మళ్లింది. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆలోచనతో అల్ఫ్రాజోలమ్ గుళికలను హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లకు మరో వ్యక్తితో కలిసి సరఫరా చేస్తున్నాడు. వీరికి సహకరించిన మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 8.50 కోట్ల విలువ చేసే 140 కిలోల అల్ఫ్రాజోలమ్ డ్రగ్‌తో పాటు రూ.50 వేల నగదు, బొలారో, ఎర్టికా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను బాలానగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు కార్యాలయంలో డీసీపీ పి.వి.పద్మజారెడ్డి సోమవారం మీడియాకు వివరించారు. బాలానగర్‌లో ముడిసరుకులు.. విజయవాడలో తయారీ మెదక్ జిల్లా శంకరంపేట్‌కు చెందిన గుడికాడి లింగాగౌడ్ (37) ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్డీ పూర్తి చేశాడు. ఇతనికి సింథటిక్ డ్రగ్ తయారీలో పరిజ్ఞానం ఉంది. అయితే కులవృత్తిలో భాగంగా కల్లు తయారీలో కొంత మత్తు పదార్థం కలపడాన్ని చూసిన లింగాగౌడ్ తనకున్న పరిజ్ఞానంతో అల్ఫ్రాజోలమ్ తయారుచేసి కల్లు కాంపౌండ్లకు విక్రయించడం మొదలుపెట్టాడు. కొండాపూర్‌లో నివాసముంటూ గౌడ్ లేబొరేటరీస్ పేరుతో గత ఐదేళ్లుగా ఈ అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అల్ఫ్రాజోలమ్ తయారీకి ఉపయోగించే ముడి పదార్థాన్ని బాలానగర్ ప్రశాంత్‌నగర్ ఇండస్ట్రీ ప్రాంతంలోని నర్మద కెమికల్స్ నుంచి కొనుగోలు చేసేవాడు. వీటిని తన స్నేహితుడు కిరణ్‌కు చెందిన విజయవాడలోని ఫార్మస్యూటికల్ పరిశ్రమకు పంపించి అక్కడా ప్రాసెసింగ్ చేయించేవాడు. కిరణ్ ఆల్ఫ్రాజోలమ్ గుళికలను తన డ్రైవర్ వినోద్ (27) ద్వారా విజయవాడ నుంచి హైదరాబాఉఉద్‌కు వాహనంలో పంపిస్తుంటాడు. ఏఆర్ కానిస్టేబుల్ సహకారం అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లింగాగౌడ్ వరుసకు బామమరిది అయ్యే మెదక్‌లో ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మదురి రామకృష్ణ గౌడ్(36) సహకారాన్ని తీసుకుంటున్నాడు. ఈ డ్రగ్ కల్లు కాంపౌండ్‌కు తరలించే సమయంలో మార్గం మధ్యలో పోలీసుల తనిఖీ లేకుండా జాగ్రత్తగా వ్యవహరం నడిపేవాడు. ఇందుకుగాను రామకృష్ణగౌడ్‌కు వచ్చిన ఆదాయంలో 30 శాతం వరకు కమిషన్ ఇస్తున్నాడు. అయితే విజయవాడ నుంచి కిరణ్ డ్రైవర్ వినోద్ వాహనంలో అల్ఫ్రాజోలమ్ తీసుకొచ్చాడని విశ్వసనీయ సమాచారం అందుకున్న బాలానగర్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, పేట్‌బషీరాబాద్ ఇన్స్పెక్టర్ రమేష్ నేతృత్వంలోని బృందం జీడిమెట్ల పైపులైన్‌న్ రోడ్డులో దాడులు చేసి బొలేరో (టీఎస్ 08 యుహెచ్ 8029), ఎర్టికా ( టీఎస్ 35 సీ 7237) వాహనాల నుంచి 139 కిలోల అల్ఫ్రాజోలమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. లింగాగౌడ్, డ్రైవర్ వినోద్‌లను అరెస్టు చేశారు. అనంతరం మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం పరిధార్ గ్రామంలోని రామకృష్ణగౌడ్ ఇంట్లో మరో కిలో అల్ఫ్రాజోలమ్ డ్రగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి కూడా అరెస్టు చేశారు. పరారీలో ఉన్న కిరణ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: పొలిమేరలో ఉన్న సమీప బంధువు ఇంటికి తీసుకెళ్లి.. ఫోన్‌కు ఓటీపీలు వస్తాయి చెప్పమ్మా అంటూ.. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్‌చేస్తూ ప్రియదర్శిని తదితరులు దాఖలు చేసిన పలు స్పెషల్ లీవ్ పిటిషన్లను బుధవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేష్రాయ్ల ధర్మాసనం విచారించింది. ‘‘పే స్కేల్స్, సర్వీస్ కండీషన్స్, క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్స్, అదర్ అడకమిక్ స్టాఫ్ ఇన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ రెగ్యులేషన్స్, 2010’’ని ఏఐసీటీఈ 2010 మార్చిలో జారీ చేసిందని కేరళ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వి.చిదంబరేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నిబంధనల ప్రకారం 2010 మార్చి 5 నుంచి సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ చేసిన వారే అర్హులని కోర్టుకు తెలిపారు. చిదంబరేష్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ‘‘2003 ఫిబ్రవరి 18 నోటిఫికేషన్ ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ (తదనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చారు) పోస్టు వచ్చిన ఏడేళ్లలో పీహెచ్డీ పొందాలి. అయితే ఇది 2010 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి పీహెచ్డీ పొందిన తర్వాత తేదీ నుంచి పోస్టు పరిగణనకు అర్హులు’’ అని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసింది. -
పీహెచ్డీ పూర్తి చేసిన డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి పీహెచ్డీ పూర్తయింది. శుక్రవారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. వర్సిటీ వీసీ ఇన్‌ఛార్జి వీసీ జయేశ్‌రంజన్ పీహెచ్డీ పట్టాను డీజీపీ మహేందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆన్లైన్ ద్వారా అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ‘‘ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలిసింగ్’’ పురస్కారం పొందడం ఆనందంగా ఉందన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై తాను పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నానన్నారు. తన పీహెచ్డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
భారతీయ విద్యార్థికి రూ.1.3కోట్ల స్కాలర్షిప్
న్యూఢిల్లీ: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)కి చెందిన ఓ విద్యార్థికి ప్లాంట్స్ సైన్స్ అంశంలో ఆస్ట్రేలియాలో పీహెచ్డీ చేసేందుకు గాను 1.3 కోట్ల రూపాయలు ఫుల్ పెయిడ్ స్కాలర్షిప్ లభించింది. ఈ రంగంలో ఇంతవరకు లభించిన అత్యధిక స్కాలర్షిప్ ఇదే కావడం విశేషం. వివరాలు.. సుమంత్ బిందాల్ అనే యువకుడు ఎల్పీయూలో వ్యవసాయ రంగంలో ప్రత్యేకంగా జన్యుశాస్త్రం, మొక్కల పెంపకంలో మాస్టర్స్ ఆఫ్ సైన్స్ చదువుతున్నాడు. ఈ క్రమంలో బిందాల్‌కు ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ(ఏఎన్‌యూ)లో పీహెచ్డీ చేయడానికి స్కాలర్షిప్ లభించింది. దీనితో బిందాల్ టమోటా మొక్కలను నాశనం చేసే ఫ్యూసేరియం అనే ఒక రకమైన ఫంగస్ గురించి పరిశోధన చేయాల్సి ఉంటుంది. ఈ ఫంగస్ వల్ల ఏటా భారతదేశంలో టమోటా రైతులు 45శాతం దిగుబడిని కోల్పోతున్నారు. (ఆస్ట్రేలియాలో సింబా) ఈ నేపథ్యంలో బిందాల్ మాట్లాడుతూ.. ‘ఈ స్కాలర్షిప్ అందుకున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఏఎన్‌యూ ప్రపంచంలోని ప్రముఖ పరిశోధనా సంస్థల్లో ఒకటి. ఇక్కడ పీహెచ్డీ చేయాలనేది నా జీవిత ఆశయం. ఇందుకు సహకరించిన నా అధ్యాపకులకు, సలహాదారులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అన్నారు. -
ఎస్వీయూలో ఇక పీహెచ్డీ ఈజీ కాదు
చిత్తూరు, యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీలో ఇకపై పీహెచ్డీ డిగ్రీ పొందటం అంత తేలిక కాదు. ఇకపై పరిశోధక విద్యార్థులు సమర్పించే సిద్ధాంత గ్రంథాన్ని మూల్యాంకనం కోసం విదేశీ యూనివర్సిటీలకు పంపనున్నారు. అలాగే ప్రీ–పీహెచ్డీ పాసు మార్కులు 50 నుంచి 55 శాతానికి పెంచారు. ఎస్వీయూలో ఇకపై అడ్మిషన్ పొందే విద్యార్థులకు ఈ నూతన నియమావళి వర్తించనుంది. 2019 గైడ్‌లైన్స్ పేరిట రూపొందించిన ఈ నూతన నియమావళికి యూఆర్సీæ ఆమోదం తెలిపింది. ఎస్వీ యూనివర్సిటీ రీసెర్చ్ కమిటీ (యూఆర్సీ) సమావేశం సోమవారం నిర్వహిం చారు. వీసీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో యూనివర్సిటీ రీసెర్చ్ గైడ్‌లైన్స్–2019కి ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఉన్న యూనివర్సిటీ గైడ్‌లైన్స్–2016 స్థానంలో ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలన్నీ ఇకపై అడ్మిషన్ తీసుకునే వారికి వర్తించనున్నాయి. ఏపీఆర్‌సెట్ ద్వారా అర్హత సాధించిన వారికి వెంటనే అడ్మిషన్ ఇచ్చి ఈ నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పటికే అడ్మిషన్ పొందిన వారు పాత నిబంధనలకు అనుగుణంగానే తమ పరిశోధనలు చేయవచ్చు. 14 సంవత్సరాల తర్వాత ఫారిన్ ఎగ్జామినర్ పీహెచ్డీ చేస్తున్న పరిశోధక విద్యార్థులు వర్సిటీకి సమర్పించిన సిద్ధాంత గ్రంథం ముగ్గురు అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపుతారు. గతంలో ఇక విదేశీ యూనివర్సిటీ అధ్యాపకుడికి, ఇద్దరు మన దేశంలోని యూనివర్సిటీల అధ్యాపకులకు మూల్యాంకనానికి పంపేవారు. దీనివల్ల ఆలస్యమవుతోందని భావించిన మాజీ వీసీ ఎస్.జయరామిరెడ్డి 2005లో విదేశీ వర్సిటీల మూల్యాంకనం రద్దు చేశారు. దీనివల్ల పీహెచ్‌డీల మూల్యాంకనం తేలిక అయింది. 14 సంవత్సరాల్లో సుమారు 5 వేల మంది పీహెచ్డీ డిగ్రీలు పొందారు. అయితే ఇటీవల కాలంలో పీహెచ్డీలలో నాణ్యత తగ్గిందని భావించిన యూజీసీ, ఏపీ ఉన్నతవిద్యామండలి విదేశీ వర్సిటీ మూల్యాం కనం తప్పని చేయాలని వర్సిటీలను ఆదేశిం చింది. ఈ నేపథ్యంలో సోమవారం ఎస్వీయూలో నిర్వహించిన యూఆర్సీలో ఫారిన్ యూనివర్సిటీ మూల్యాంకనానికి ఆమోదం తెలిపింది. ఇకపై అడ్మిషన్ పొందేవారు వర్సిటీకి సమర్పించే సిద్ధాంత గ్రంథాల్లో ఒకటి విదేశీ వర్సిటీకి, రెండు మన దేశంలో ఇతర యూనివర్సిటీలకు మూల్యాంకనానికి వెళ్లనున్నాయి. 2019 రీసెర్చ్ గైడ్‌లైన్స్ పేరిట నూతన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ఇకపై పీహెచ్డీ అడ్మిషన్ పొందేవారంతా ఈ నిబంధనలు పాటించాలి. ఇది వరకే అడ్మిషన్ పొందినవారికి ఈ నిబంధనలు వర్తించవు. ఈ నిబంధనల్లో మరికొన్ని ఇలా ఉన్నాయి.. ♦ ఇకపై అడ్మిషన్ పొందే వారు పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు మూడు సెమినార్లు ఇవ్వాల్సి ఉంది. ఒక్కో సెమినార్‌కు 50 మార్కులు(ఒక్కో సెమినార్‌కు 2 క్రెడిట్స్). ♦ ప్రీ పీహెచ్‌డీలో రీసెర్చ్మెథడాలజీ 100 మార్కులు(4 క్రెడిట్స్), సబంధిత సబ్జెక్ట్‌కు 100 మార్కులు(4 క్రెడిట్స్) ఉంటాయి. ♦ ప్రీ పీహెచ్‌డీలో పరిశోధక విద్యార్థుల పాస్ మార్కుల శాతాన్ని 50 నుంచి 55కు పెంచారు. ♦ పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్పించే లోపు 2 పరిశోధన వ్యాసాలు ప్రచురించాలి. ♦ పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం సమర్చించే సమయంలో ప్లాగరిథం(కాపీయింగ్) టెస్ట్ చేయిం చుకోవాలి. ♦ పీహెచ్డీ అడ్మిషన్ పొందేవారు యూజీసీ నెట్, ఏపీ సెట్, ఏపీ రీసెర్చ్ సెట్(ఏపీ ఆర్‌సెట్)లలో ఏదో ఒక దానిలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. ♦ వివిధ పరిశోధన సంస్థల నుంచి ఫెలోషిప్‌లకు ఎంపికైన వారు కూడా పై మూడు ప్రవేశ పరీక్షల్లో ఒకదానిలో అర్హత సాధించాలి. ♦ పీహెచ్డీ కోర్సుల్లో ఇకపై ప్రాథమిక(ప్రొవిజనల్) అడ్మిషన్ ఉండదు. ♦ పీహెచ్డీ అడ్మిషన్ పొందిన వారు తమ పరిశోధన అంశం(టైటిల్) ఖరారు చేసుకునే సమయంలో ఒకటి, ప్రీ పీహెచ్‌డీకి ముందు ఒకటి, సినాప్సిస్ సమర్పించేందుకు ముందు ఒకటి సెమినార్ ఇవ్వాలి. త్వరలో అడ్మిషన్లు ఎస్వీయూ రీసెర్చ్ నూతన గైడ్‌లైన్స్‌కు యూఆర్సీ అనుమతి రాకపోవడంతో ఏపీఆర్‌సెట్–2018లో అర్హత సాధించిన వారికి ఇప్పటివరకు అడ్మిషన్ ఇవ్వలేదు. సోమవారం నూతన నియమావళికి అనుమతి లభించిన నేపథ్యంలో ఏపీఆర్‌సెట్–2018లో అర్హత సాధించిన 150 మందికి వచ్చే వారంలో అడ్మిషన్ ఇవ్వనున్నారు. సోమవారం నిర్వహించిన యూఆర్సీ సమావేశంలో రెక్టార్ జీ.జానకిరామయ్య, రిజిస్ట్రార్ ఆర్కే అనురాధ, రీసెర్చ్ డీన్ విజయభాస్కర్‌రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. -
విదేశీ పీహెచ్‌డీలకూ అసిస్టెంట్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: టాప్–500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ పూర్తిచేసిన వారు కూడా భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి అర్హులేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాకరెలి సైమండ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, షాంఘై జియావో టోంగ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా, సోషల్ సైన్సెస్, లాంగ్వెజేస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో నియామకాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని యూజీసీ తెలిపింది. ప్రస్తుతం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. నెట్, సెట్, స్లెట్ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించడం ద్వారా రాత పరీక్ష నుంచి మినహాయింపు పొందినా, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
వర్సిటీ ప్రొఫెసర్లకు పీహెచ్డీ తప్పనిసరి
న్యూఢిల్లీ: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి పీహెచ్‌డీని తప్పనిసరి చేసినట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జవడేకర్ చెప్పారు. 2021–22 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని, జాతీయ అర్హత పరీక్ష(నెట్)లో ఉత్తీర్ణతను మాత్రమే ఇకపై ఏకైక అర్హతగా పరిగణించబోమని తెలిపారు. అయితే కళాశాలల్లో నియామకాలకు.. సంబంధిత సబ్జెక్టులో పీజీతో పాటు నెట్ లేదా పీహెచ్డీ కనీస అర్హతగా కొనసాగుతుందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. ప్రస్తుతం పీజీ పట్టా కలిగి ఉండి నెట్లో అర్హత సాధించిన వారు లేదా పీహెచ్డీ పట్టా ఉన్న వారు యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయవచ్చు. ఇటీవల సవరించిన యూజీసీ నిబంధనలను జవడేకర్ బుధవారం వెల్లడిస్తూ..తీవ్ర వ్యతిరేకత రావడంతో అకడమిక్ పెర్ఫామెన్స్ ఇండికేటర్స్(ఏపీఐ)ని రద్దుచేసినట్లు తెలిపారు. కళాశాల లెక్చరర్లకు పరిశోధనను తప్పనిసరి చేస్తూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 2021 నుంచి యూనివర్సిటీల్లో ప్రారంభ స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా కూడా పీహెచ్డీ చేసిన వారే ఉంటారని అన్నారు. -
జేఎన్‌యూలో ప్రొఫెసర్ లైంగిక వేధింపులు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ జేఎన్‌యూలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ పీహెచ్డీ విద్యార్థిని ఆరోపిస్తూ అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జేఎన్‌యూలో లైఫ్ సైన్స్ మొదటి సంవత్సరం స్కాలర్ పూజ కసానా రెండు రోజుల క్రితం హాస్టల్ విడిచి వెళ్లిపోయింది. ఆమె జాడ తెలియకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం లక్నోలో పూజని గుర్తించి, ఢిల్లీకి తీసుకొచ్చారు. తాను హాస్టల్ విడిచి వెళ్లడానికి తన మెంటర్ ప్రొఫెసర్ అతుల్ కుమార్ జోహ్రీ లైంగిక వేధింపులే కారణమని పూజ పోలీసులకు తెలిపింది. అతుల్‌ను తన ప్రవర్తన మార్చుకోవాలని ఈ మెయిల్ ద్వారా సూచించినా మార్పు రాలేదని తెలిపింది. ‘అతుల్ నువ్వు జేఎన్యూలోనే కాదు, ఇండియాలోనే బెస్ట్ గైడ్ కావచ్చు, ప్రతి ఒక్కరు నీ పర్యవేక్షణలో పీహెచ్డీ చేయాలని ఆశపడవచ్చు, కానీ చదువుకోనివారు కూడా బుద్ధిలో నీ కన్నా నూరుపాళ్లు నయం. నేను పీహెచ్‌డీని వదిలి వెళ్లడానికి నీ ప్రవర్తనే కారణం. నీకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలియదు, నీ ప్రవర్తనతో ఎన్నో సార్లు విసుగు చెందిన తర్వాతే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని పూజ ఆ మెయిల్లో పేర్కొంది. మరోవైపు పూజ ఆరోపణలపై విచారణ జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. అనుహ్యంగా గురువారం సాయంత్రం మరో 12 మంది లైఫ్ సైన్స్ విద్యార్థినిలు అతుల్‌పై ఇదే రకమైన ఆరోపణలతో ముందుకొచ్చారు. అతుల్ తమకు అసభ్యకరమైన మెసెజ్‌లు చేయడం, శరీరాకృతి మీద కామెంట్లు చేసేవాడని వారు తెలిపారు. అతుల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని స్టూడెంట్ ఫ్యాకల్టీ కమిటీ మెంబర్ ఒకరు వెల్లడించారు. దీంతో ప్రొఫెసర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. -
నీ కూతురికి అదే గతి పట్టాలి: ఓ విద్యార్థిని
సాక్షి, న్యూఢిల్లీ : 'సార్ మీకు సభ్యత, సంస్కారం లాంటివి లేవు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితి రావాలని కోరుకుంటున్నా’ అంటూ వేధింపులకు గురిచేస్తున్న ప్రొఫెసర్‌కి ఓ పీహెచ్డీ విద్యార్థిని ఈమెయిల్ చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తన నచ్చకనే వర్సీటీ నుంచి తాను పారిపోయానని చెప్పింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కి చెందిన ఓ 26 ఏళ్ల యువతి జేఎన్‌యూలో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్, పీహెచ్డీ చేస్తోంది. ఇటీవల ఆమె యూనివర్సిటీ నుంచి పారిపోయి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయంపై విద్యార్థిని తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా గైడ్‌గా ఉన్న ప్రొఫెసర్ ఎ.కె.జోరి దురుసు ప్రవర్తన వల్లే యూనివర్సీటీని వదిలి వెళ్లాలని ఆ విద్యార్థిని లేఖ సారాంశం. ‘ గౌరవనీయులైన ప్రొఫెసర్ గారికి నమస్కారం. మీరు దేశంలోనే గొప్ప గైడ్ (నిర్దేశకుడు) అని అనుకుంటున్నారు. నేను కూడా మొదట్లో ఇలానే అనుకున్నా. మీరు మాకు గైడ్‌గా ఉండడం వరంగా భావించా. కానీ తర్వాత మీ నిజస్వరూపం తెలిసింది. మీకు సభ్యత, సంస్కారాలు తెలియవు. ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు. నీ దురుసు ప్రవర్తన వల్లే నేను వర్సీటీ వదిలి వెళ్లాను. నాలాగ మరో అమ్మాయి బలి కాకుడదని అనుకుంటున్నాను. మీ కూతురికి కూడా నాలాంటి పరిస్థితే రావాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. కనీసం అప్పుడైనా అమ్మాయిల బాధ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ మెయిల్ పంపింది. కాగా ప్రొఫెసర్ ఎ.కె.జోరి తనపై వచ్చిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. తాను గత నెల 27న వరుసగా గైర్హాజరైన తొమ్మిమంది విద్యార్థులను హెచ్చరిస్తూ లేఖలు పంపాను. ‘మీరు సరిగా తరగతులకు హాజరు కావడం లేదు. ఇలా అయితే మీ పీహెచ్‌డీని పూర్తి చేయడం కష్టం. మీరు మరో ల్యాబ్‌ను చూసుకోండి’అని లేఖలో పేర్కొన్నట్లు తెలిపారు. అందరు విద్యార్థుల్లాగే రెగ్యులర్‌గా హాజరు కావాలని కోరానన్నారు. అందరితో ప్రవర్తించినట్లే ఆమెతోను వ్యవహరించానని తెలిపారు. ఆ విద్యార్థిని తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరమని ప్రొఫెసర్ ఎ.కె.జోరి అన్నారు. -
పీహెచ్డీ ఉండాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్‌డీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తప్పనిసరి చేసింది. 2021 జూలై 1 తరువాత చేపట్టే నియామకాలకు ఈ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల్లో పదోన్నతికీ పీహెచ్డీ ఉండాలని స్పష్టం చేసింది. కాంట్రా క్టు, ఔట్ సోర్సింగ్, తాత్కాలికం.. పేరేదైనా ఉన్నత విద్యా సంస్థలకు మంజూరైన పోస్టుల్లో తాత్కాలిక సిబ్బంది 10 శాతానికి మించొద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు వర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో బోధన సిబ్బంది నియామకాలకు సరికొత్త నిబంధనలు రూపొందించింది. ‘యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్స్ ఆన్ మినిమమ్ క్వాలిఫికేషన్స్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ టీచర్స్ అండ్ అదర్ అకడమిక్ స్టాఫ్ ఇన్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అండ్ మెజర్స్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ 2018’పేరుతో డ్రాఫ్ట్ మార్గదర్శకాలను అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ ప్రొఫెసర్, ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెం ట్ ప్రొఫెసర్లు, ప్రిన్సిపాల్ తదితర పోస్టుల భర్తీ, పదోన్నతుల్లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అర్హతలు, పనిదినాలు, అకడమిక్ అంశాలను అందులో పొందుపరిచింది. మార్గదర్శకాలను వెబ్సైట్లో ఉంచిన యూజీసీ.. ఆ అంశాలపై ఈ నెల 28లోగా అభిప్రాయాలు తెలపాలని వర్సిటీలు, కాలేజీలను కోరింది. అభిప్రాయ సేకరణ తరువాత తుది మార్గదర్శకాలను జారీ చేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని వివిధ వర్సిటీల్లో త్వరలో భర్తీ చేయనున్న 1,061 పోస్టులకూ ఈ నిబంధనలు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. మార్గదర్శకాల్లోని ప్రధానాంశాలు ♦ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసే వారికి పీహెచ్డీ ఉండాలి. ♦ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55 శాతం మార్కులుండాలి. అలాగే నెట్, స్లెట్, సెట్, పీహెచ్డీలలో ఒక అర్హత ఉండాలి. ♦ 1991 సెప్టెంబర్ 19కి ముందు పీహెచ్డీ చేసిన వారికి పీజీలో 50% మార్కులున్నా సరిపోతుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులున్నా చాలు. ♦ 2021 జూలై 21 తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే పీహెచ్డీ ఉండాల్సిందే. ♦ విద్యా సంస్థలో మంజూరైన మొత్తం పోస్టుల్లో తాత్కాలిక అధ్యాపకులు 10 శాతానికి మించకూడదు. ♦ పేరేదైనా తాత్కాలిక పద్ధతిలో పని చేసే అధ్యాపకులకు రెగ్యులర్ అధ్యాపకులతో సమానంగా వేతనమివ్వాలి. ♦ కనీసం 180 పని దినాలు అమలు చేయాలి. వారంలో 6 రోజుల పనిదినాలు ఉంటే.. విద్యా సంవత్సరంలో 30 వారాలు ప్రధాన బోధన కొనసాగించాలి. ♦ మిగిలిన సమయంలో 12 వారాలు ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, పాఠ్య కార్యక్రమాలు, స్పోర్ట్స్, కాలేజ్‌డే కార్యకలాపాలకు కేటాయించాలి. ♦ 8 వారాలు సెలవులు, 2 వారాలు ప్రజా సెలవులకు కేటాయించాలి. ♦ వారంలో 40 గంటలకు తక్కువ కాకుండా పనిదినాలు ఉండాలి. రోజుకు 7 గంటలు అధ్యాపకులు కాలేజీలో ఉండాలి. ♦ విద్యార్థులకు వివిధ అంశాలపై మార్గదర్శనం కోసం 2 గంటలు కేటాయించాలి. కమ్యూనిటీ డెవలప్మెంట్, సాంస్కృతిక, గ్రంథాలయ కార్యక్రమాలకు సమయమివ్వాలి. ప్రతి 15 మంది విద్యార్థులకు ఒక లెక్చరర్‌ను కోఆర్డినేటర్‌గా నియమించాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ భర్తీలో.. అకడమిక్ స్కోర్‌కు 80 మార్కులు రీసెర్చ్ పబ్లికేషన్స్‌కు 10 మార్కులు బోధన అనుభవానికి 10 మార్కులు మొత్తంగా 100 మార్కులు అకడమిక్ స్కోర్‌లో గరిష్టంగా ఇచ్చే మార్కులు ♦డిగ్రీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 15 మార్కులు ♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 13 మార్కులు ♦55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 10 మార్కులు ♦ పీజీలో 80 శాతానికి పైగా మార్కులొస్తే.. 28 మార్కులు ♦ 60 నుంచి 80 శాతం లోపు ఉంటే.. 25 మార్కులు ♦ 55 నుంచి 60 శాతం లోపు ఉంటే.. 20 మార్కులు ♦ ఎంఫిల్‌లో 60 శాతానికి పైగా మార్కులొస్తే.. 7 మార్కులు ♦ 55 నుంచి 60 శాతం లోపు మార్కులుంటే 5 మార్కులు ♦ పీహెచ్‌డీకి 30 మార్కులు ♦ నెట్, జేఆర్ఎఫ్ ఉంటే 7 మార్కులు ♦ నెట్/సెట్/స్లెట్ ఉంటే 5 మార్కులు -
పీహెచ్‌డీలో ప్రవేశాలకు కొత్త నిబంధనలు!
సాక్షి, హైదరాబాద్: యూనివర్సిటీల్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీలో (పీహెచ్డీ) ప్రవేశాలకు కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఉన్నత విద్యామండలి నియమించిన వైస్ చాన్స్లర్ల కమిటీ నిబంధనల రూపకల్పనపై కసరత్తు చేస్తోంది. వర్సిటీలు ఇష్టానుసారం ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేకుండా కమిటీ నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయనుంది. ప్రాథమిక నిర్ణయం మేరకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ+, ఏ గుర్తింపు కలిగిన యూనివర్సిటీలే ఇకపై పీహెచ్డీ ప్రవేశాలకు పరీక్షలను నిర్వహించనున్నాయి. విద్యార్థులు నిర్ణీత అర్హతలతోపాటు ప్రవేశ పరీక్షలో అర్హత సాధిస్తే పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించనున్నాయి. అయితే రాష్ట్రంలో ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి కొన్ని యూనివర్సిటీలకే న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉంది. న్యాక్ ఏ గ్రేడ్ గుర్తింపు లేని వర్సిటీలు ఇకపై పీహెచ్‌డీలో ప్రవేశాలకు సొంతంగా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి వీల్లేకుండా నిబంధనలను రూపొందిస్తోంది. ఆయా వర్సిటీలు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) జారీ చేసిన పీహెచ్డీ ప్రవేశాల నిబంధనల ప్రకారమే పీహెచ్‌డీల్లో ప్రవేశాలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు నెట్/స్లెట్/సెట్/జే ఆర్ఎఫ్/ఐసీఎస్ఎస్ఆర్ వంటి అర్హతల ఆధారంగా పీహెచ్‌డీల్లో ప్రవేశాలు చేపట్టేలా నిబంధనలను సిద్ధం చేస్తోంది. -
పరిశోధనల్లో పూర్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం తగ్గుతోంది. యూనివర్సిటీల్లో ప్రొఫెసర్ల కొరత, ఇతర వివాదాలతో ప్రవేశాలు సజావుగా జరగడం లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో ఆరేళ్లుగా ప్రొఫెసర్ల నియామకాలు తగ్గడంతో ఎక్కువగా ప్రవేశాలు చేపట్టే పరిస్థితి లేకుండా పోయింది. సమాజానికి ఉపయోగపడే పీహెచ్‌డీలు ఎన్ని ఉన్నాయో పక్కనబెడితే.. మార్గదర్శనం చేసే ప్రొఫెసర్లు లేక రాష్ట్రంలో పరిశోధనలు తగ్గుతున్నాయని విద్యావేత్తలు ఆందోళన చెందుతున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పోల్చితే పీహెచ్‌డీలు చేస్తున్న విద్యార్థుల సంఖ్యలో తెలంగాణ 12వ స్థానంలో ఉన్నా.. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే అట్టడుగున ఉండిపోయింది. తమిళనాడులో 28,684 మంది.. 2016–17 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పీహెచ్‌డీలు, ఎంఫిల్, పీజీలు చదువుతున్న విద్యార్థుల సంఖ్యపై కేంద్రం లెక్కలు తేల్చింది. ఆల్ ఇండియా సర్వే ఆన్ హయ్యర్ ఎడ్యుకేషన్ పేరుతో ఇటీవల గణాంకాలు విడుదల చేసింది. ఆ ప్రకారం దేశవ్యాప్తంగా పరిశోధనలు చేస్తున్న విద్యార్థుల్లో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 28,684 మంది విద్యార్థులు పీహెచ్‌డీలు చేస్తున్నారు. 13,227 మంది విద్యార్థులతో ఉత్తరప్రదేశ్, 10,841 మంది విద్యార్థులతో కర్ణాటక రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, రాజస్తాన్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో 5 వేల మంది చొప్పున పీహెచ్డీ విద్యార్థులున్నారు. 4 వేల నుంచి 5 వేలలోపు పీహెచ్డీ విద్యార్థులతో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 10 రాష్ట్రాల్లో పీహెచ్‌డీలు చేస్తున్న వారి సంఖ్య 1,000కి మించనేలేదు. కేరళలో 58.82 శాతం మహిళలు దేశవ్యాప్తంగా 1,41,037 మంది విద్యార్థులు పీహెచ్డీ చేస్తుండగా.. అందులో 59,242 (42.01 శాతం) మంది మహిళలే ఉన్నారు. 58.82 శాతం మంది మహిళలతో కేరళ తొలి స్థానంలో నిలిచింది. పంజాబ్‌లో 53.95 శాతం మంది, హర్యానాలో 49.54 శాతం, తమిళనాడులో 42.95, రాజస్తాన్‌లో 47.61, ఢిల్లీలో 46.39, మహారాష్ట్రలో 41.79, గుజరాత్లో 39.15, కర్ణాటకలో 38.84, అస్సాంలో 38.19, ఆంధ్రప్రదేశ్‌లో 37.24, తెలంగాణలో 34.28% మంది మహిళలు పీహెచ్డీ చేస్తున్నారు. పీహెచ్‌డీలతోపాటు మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ (ఎం.ఫిల్.) ప్రవేశాల్లోనూ రాష్ట్రంలో అదే పరిస్థితి నెలకొంది. కానీ పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో మాత్రం రెండు రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాల్లో సీన్ రివర్స్ అయింది. పీజీ కోర్సులు చదువుతున్న వారు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువగా (5,40,138 మంది) ఉండగా, మహారాష్ట్రలో 3,18,077 మంది ఉన్నారు. తమిళనాడులో 2,63,450 మంది, మధ్యప్రదేశ్‌లో 1,71,801, కర్ణాటకలో 1,69,889, తెలంగాణలో 1,66,186, ఆంధ్రప్రదేశ్‌లో 1,85,672 మంది విద్యార్థులు పీజీ చదువుతున్నట్లు కేంద్రం లెక్కలు తేల్చింది. -
పీహెచ్డీ చేసిన సమంత
చెన్నై, సాక్షి: నటి సమంత పీహెచ్డీ చేశారు. ఏమిటీ నమ్మశక్యంగా లేదా? సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్న సమంత ఏ రంగంలో ఏ సబ్జెక్ట్ మీద పీహెచ్డీ చేశారని ఆశ్చర్యపోతున్నారా? అసలు విషయం ఏమిటంటే.. ఇటీవలే యువ నటుడు అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడిన సమంత నటనకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. తెలుగులో రామ్‌చరణ్‌కు జంటగా 'రంగస్థలం' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం 'మహానటి'లో పాత్రికేయరాలిగా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. కన్నడ చిత్రం 'యూటర్న్' రీమేక్‌లోనూ నటించడానికి రెడీ అవుతున్న సమంత కోలీవుడ్‌లోనూ రెండు చిత్రాలలో నటిస్తున్నారు. అందులో ఒకటి విశాల్‌తో జత కడుతున్న 'ఇరంబుతిరై'.. మరొకటి శివకార్తీకేయన్‌తో నటిస్తున్న చిత్రం.. పొన్రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇక, విశాల్‌కు జంటగా నటిస్తున్న 'ఇరుంబుతెరై' చిత్రంలో సమంత పీహెచ్డీ చేయబోతున్నారు. సైకాలజీలో పీహెచ్డీ చేసిన డాక్టరుగా ఆమె నటిస్తున్నారు. పేరు డాక్టర్ రతీదేవి. నటనకు మంచి అవకాశం ఉన్న పాత్ర అని తెలుస్తోంది. అయితే ఈ చిత్రంలో ఎవరికి తన వైద్యం అందిస్తారన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కొత్త సంవత్సరంలో సంక్రాంతికి బరిలోకి దిగడానికి ఇరుంబుతెరై చిత్రం ముస్తాబవుతోంది. అప్పుడు డాక్టర్ రతీదేవిని పరిచయం చేస్తామని విశాల్ ట్విట్టర్లో తెలిపారు. యాక్షన్ కింగ్ అర్జున్ విలనిజం ప్రదర్శిస్తున్న ఈ చిత్రానికి పీఎస్. మిత్రన్ దర్శకుడు. విశాల్ ఫిలిం ఫాక్టరీ పతాకంపై విశాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. -
పీహెచ్డీ విద్యార్థులకు 70 వేల ఫెలోషిప్
కోల్‌కతా: ఐఐటీ, ఐఐఎస్సీలో పీహెచ్‌డీలు చేసే పరిశోధకులకు నెలకు రూ. 70వేలు ఫెలోషిప్‌లు ఇవ్వనున్నట్లు కేంద్ర ఉన్నత విద్య సెక్రటరీ కేవల్ కుమార్ శర్మ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరిగిన 67వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ఫెలోషిప్ స్కీమ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆర్థిక పరమైన కారణాల వల్లే చాలా మంది విద్యార్థులు విదేశాలకు వెళ్తుతున్నారని అటువంటి వారు స్వదేశంలోనే ఉండేందుకు ఈ నిర్ణయం దోహదపడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశోధకులకు ఐదేళ్ల పాటు ప్రతి నెలా రూ.70 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదం తెలపనుందని, వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు ఫెలోషిప్‌లు ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. -
తెలుగు వర్సిటీలో పీహెచ్డీ పేపర్ లీక్
-
పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ గైడ్‌లైన్స్!
రూపకల్పనకు ఉన్నత విద్యామండలి కసరత్తు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ(పీహెచ్డీ) ప్రవేశాల్లో కామన్ గైడ్‌లైన్స్ అమలు చేసేలా ఉన్నత విద్యా మండలి చర్యలు తీసుకుంటోంది. యూనివర్సిటీల్లో నాణ్యమైన పరిశోధనలు జరిగే దిశగా కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనివర్సి టీలో ఒక్కో విధంగా కటాఫ్ మార్కులు ఉండడం, స్థానిక ఒత్తిళ్ల కారణంగా వాటిల్లో మార్పు చేయడం వంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ‘పరిశోధనలు అంతంతే..’శీర్షికన ‘సాక్షి’లో బుధవారం ప్రచురితమైన కథనంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పందించారు. యూనివర్సిటీ వైస్ చాన్స్లర్లతో కూడిన ఉన్నస్థాయి కమిటీతో సమీక్ష నిర్వహించారు. నాణ్యమైన పరిశోధనలకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందిం చాలని నిర్ణయించారు. వివిధ రాష్ట్రాల్లో పరిశోధనలు జరుతున్న తీరు, ఈ అంశాల్లో తెలంగాణ వెనుకబడడానికి దారితీసిన పరిస్థితులపై చర్చించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పీహెచ్ డీల్‌లో ప్రవేశాలు చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చారు. వాటి ప్రకారం నేషనల్ ఎలిజిబి లిటీ టెస్టు (నెట్) లేదా స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టులో (సెట్) అర్హత సాధించినవారే పీహెచ్డీ చేసేందుకు అర్హులు. వాటిని పక్కాగా అమలు చేయడంతోపాటు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఏ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీలు మాత్రమే పీహెచ్‌డీలో ప్రవేశాలు చేపట్టేందుకు, ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు అర్హులన్న యూజీసీ నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క యూనివర్సిటీకి కూడా న్యాక్ ఏ గ్రేడ్ లేదు. ఏ గ్రేడ్ వచ్చిన తర్వాతే పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్లను జారీ చేసే అవకాశం ఉంది. అయితే ఈలోగా కామన్ గైడ్‌లైన్స్ రూపొందించడం ద్వారా భవిష్యత్తులో పక్కాగా పీహెచ్డీ ప్రవేశాలు చేపట్టవచ్చని భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. భవిష్యత్తులో యూజీసీ నిర్వహించే నెట్ మాత్రమే అమల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మాత్రం రాష్ట్రాలు నిర్వహించే సెట్లకు మంగళం పాడే అవకాశం ఉందని, ఈ దిశగా యూజీసీ చర్యలు చేపడుతోందన్న ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. -
ముగిసిన పీహెచ్డీ ఇంటర్వ్యూలు
జేఎన్టీయూ : ఎంఫిల్, పీహెచ్డీ, ఎంఎస్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలు శుక్రవారం ముగిశాయని అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. ఈఈఈ విభాగానికి సంబంధించి శుక్రవారం 63 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెక్టార్ ప్రొఫెసర్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ప్రొఫెసర్ ఎస్ వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ పి.సుజాత ఇంటర్వ్యూలు నిర్వహించారు. -
పీహెచ్డీ ప్రవేశ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఇన్చార్జ్ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ గురువారం విడుదల చేశారు. 3,049 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 2,493 మంది అభ్యర్థులు రాత పరీక్షకు హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలకు 1:2 నిష్పత్తిలో ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ .కృష్ణయ్య, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ఆచార్య డి.రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా పీహెచ్డీ రాత పరీక్ష
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్స్‌ట్రర్నల్ పీహెచ్డీ, అనుబంధ ఇంజినీరింగ్ కంగీళాశాలల్లోని రీసెర్చ్ సెంటర్లలో పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్ష ఆదివారం సజావుగా నిర్వహించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్ తెలిపారు. ఫిజిక్స్‌కు సంబంధించి 34 మంది అభ్యర్థులు, ఇంగ్లిషు 48, సీఎస్ఈ 696, కెమిస్ట్రి 46, ఈసీఈ 617, మేనేజ్మెంట్ 99, మెకానికల్ 584, సివిల్ 187, ఈసీఈ 453, మేథమేటిక్స్ 62, ఫార్మసీ 220 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్ . కృష్ణయ్య పరిశీలించారు. -
నేడు ఓయూ బంద్
హైదరాబాద్: ఉస్మానియా వర్సిటీ పీహెచ్డీ సీట్ల కేటాయింపులో అక్రమాలను నిరసిస్తూ వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో గురువారం ఏర్పాటుచేసిన పీహెచ్డీ సాధన సమితి ఆధ్వర్యంలో నేడు (3న) ఓయూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి పోలీసులను తొలగించాలని, పీహెచ్డీ సీట్ల కేటాయింపు, జాబితా విడుదలపై విచారణ జరిపించి అక్రమాలకు పాల్పడిన ప్రొఫెసర్లను తొలగించాలని, రిజర్వేషన్లు పాటించాలని, పీహెచ్డీ అర్హత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు 20% సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు పీహెచ్డీ సాధన సమితి నాయకులు తెలిపారు. -
అధ్యాపకురాలికి పీహెచ్డీ ప్రదానం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ) : జేఎ¯ŒSటీయూ ఇంజినీరింగ్ కళాశాల ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ చట్టి సన్యాసలక్షి్మకి ఆంధ్రా యూనివర్సిటీ పీహెచ్డీ ప్రదానం చేసింది. ‘స్రక్చరల్, మేగ్నేటిక్ అండ్ ఎలక్ట్రికల్ ఇన్వెస్టగేష¯Œ్స ఆ¯ŒS ఆంటిమొనో అండ్ నియోబియయ్ డొపడ్నానోక్రిస్టలీ¯ŒS నికెల్ జింగ్ ఫెర్రైట్స్’ అంశంపై దశాబ్దకాలంగా చేసిన పరిశోధనలో ప్రతిపాదించిన అంశాలను వర్సిటీ ఆమోదించినట్టు ఆమె మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్సిటీ వీసీ జి.నాగేశ్వరరావు చేతుల మీదుగా ఆమె పీహెచ్‌సీని అందుకున్నారు. వర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్ పీఎస్ బంగారురాజు నేతృత్వంలో ఆమె ఈ పరిశోధన చేశారు. ఈ నూతన ఆవిష్కరణ వల్ల మెక్రో ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో మైక్రోవేవ్ డివైజర్స్, కంప్యూటరియా మెమరీ ఎలిమెంట్స్, వైద్యరంగంలో డీప్ బై¯ŒS స్టిమ్యులేష¯ŒS వ్యాధి నిర్ధారణకు ఉపయోగపడుతుందన్నారు. మతిమరుపు లక్షణాల గుర్తింపు, సూచనలు, కేన్సర్ ట్రీట్మెంట్లో ఈ పరిశోధన దోహదపడుతుందని ఆమె వివరించారు. దశాబ్ది కాలంగా చేసిన కృషి ఫలించిందని, ఆమె భర్త, విశాఖ గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల మేథమెటిక్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేవీఎస్ శర్మ తెలిపారు. -
జూన్‌లోనే ఇంజనీరింగ్ ప్రవేశాలు!
జనవరి 1 నుంచి 31 వరకు ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపునకు దరఖాస్తులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు కాలేజీల్లో నిజనిర్ధారణ కమిటీ తనిఖీలు ఏప్రిల్‌లోగా కాలేజీలతో సంప్రదింపులు పూర్తి మే నెలాఖరులోగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు సాక్షి, హైదరాబాద్: వచ్చే విద్యా సంవత్సరంలో (2017–18) ఇంజనీరింగ్ ప్రవేశాల్లో ఆలస్యం కాకుండా ఉన్నత విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. జూన్‌లోనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టేందుకు సిద్ధమైంది. ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాల్సిన యూని వర్సిటీలను అందుకు సమాయత్తం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1 నుంచే ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు దరఖాస్తుల ప్రక్రియను ప్రారం భించాలని జేఎన్టీయూహెచ్ నిర్ణయించింది. కాలేజీల అనుబంధ గుర్తింపునకు షెడ్యూల్ ఖరారు చేయ డంతోపాటు గుర్తింపు ఇచ్చే క్రమంలో అమలు చేయాల్సిన నిబంధనలపై ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్టీయూహెచ్ ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించింది. ఈసారి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో తీసుకురావాల్సిన సంస్కరణలపైనా చర్చించింది. పీహెచ్డీ కలిగిన ప్రొఫెసర్లు ఉంటేనే కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇస్తామని తేల్చి చెప్పినట్లు తెలిసింది. ఎంటెక్ కోర్సులకు ప్రతి బ్రాంచ్‌కు పీహెచ్డీ అర్హతగల ఇద్దరు ప్రొఫెసర్లు ఉండాలని, బీటెక్‌లో ప్రతి బ్రాంచ్‌కు పీహెచ్డీ విద్యార్హతగల ప్రొఫెసర్ కచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని... లేదంటే అనుబంధ గుర్తింపు ఇవ్వబోమని స్పష్టం చేసినట్లు తెలిసింది. మంజూరైన సీట్ల మేరకు కాకుండా, కాలేజీలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఫ్యాకల్టీ ఉండే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కాలేజీల యాజమాన్యాలు కోరగా అందుకు జేఎన్టీయూహెచ్ అంగీకరించినట్లు సమాచారం. ముందుగానే తనిఖీలు... వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతులిచ్చే ముందే కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను ప్రారంభించేలా జేఎన్టీయూహెచ్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఏఐసీటీఈతో సంప్రదించిన అధికారులు వారి సూచనల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ మొదట్లో లేదా నెలాఖరులో ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను ఏఐసీటీఈ జారీ చేయనుంది. ఆ జాబితా సాంకేతిక విద్యాశాఖకు అందేలోపే అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా జేఎన్టీయూ హెచ్ చర్యలు చేపట్టింది. జాబితా అందిన వెంటనే మే నెలలో కాలేజీలకు అనుబంధ గుర్తింపు పత్రాలను జారీ చేసి ప్రవేశాలకు సిద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రూపొందించిన అనుబంధ గుర్తింపు షెడ్యూల్‌ను కాలేజీ యాజమాన్యాలకు తెలిపి అందుకు సిద్ధంగా ఉండా లని సూచించినట్లు తెలిసింది. జనవరి 1 నుంచి 31 వరకు కాలేజీల నుంచి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తులను స్వీకరిస్తామని తెలియజేసినట్లు సమాచారం. అదే నెల 25 నుంచి ఫిబ్రవరి 25 వరకు నిజనిర్ధారణ కమిటీల (ఎఫ్ఎఫ్సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో వసతులపై తనిఖీలు చేపడతామని తెలియజేసినట్లు తెలిసింది. వీలైతే తనిఖీలను ఏఐసీటీఈ బృందాలతో కలిపి చేసేందుకు ప్రయ త్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి ఏప్రిల్ నెలా ఖరులోగా కాలేజీల యాజమాన్యాలతో ఎఫ్ఎఫ్సీ నివేది కలపై చర్చలు జరిపి లోపాలను సవరించుకునేలా అవకాశం ఇవ్వను న్నట్లు తెలిసింది. అనుబంధ గుర్తింపు పత్రాలను మే మొదటి వారం నుంచి చివరిలోగా జారీ చేసి జూన్ 1కల్లా ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని నిర్ణయించినట్లు తెలియవచ్చింది. -
యాదయ్యకు పీహెచ్డీ పట్టా
గుర్రంపోడు : మండలంలోని మొసంగికి చెందిన నిర్శనమెట్ల యాదయ్యకు ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. మెకానికల్ ఇంజనీరింగ్ లేబర్ బేసెడ్ మాన్యుపాక్చరింగ్ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను పీహెచ్yీ పొందాడు. దళిత కుటుంబానికి చెందిన యాదయ్య ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థిగానే ఉంటూ ఎంతో కష్టపడి డాక్టరేట్ కావడం తనకు ఎంతో సంతోషాన్ని కల్గించిదని యాదయ్య అన్నారు. గేట్ ద్వారా ఐఐటీ గౌహతి విశ్వవిద్యాలయంలో సీటు సాధించినట్లు తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనకు, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. బస్సు సౌకర్యం కూడ లేని మారుమూల గ్రామానికి చెందిన యాదయ్యకు పీహెచ్డీ రావడం తమ గ్రామానికి గర్వకారణమని మండల టీఆర్ఎస్ నాయకుడు నిర్శనమెట్ల అశోక్ అన్నారు. -
అప్లైడ్ జియోకెమిస్ట్రీలో డాక్టరేట్ ప్రదానం
శాలిగౌరారం: మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి సుధాకర్ హైద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అప్లైడ్ జియోకెమెస్ట్రీ విభాగంలో డాక్టరేట్‌ను పొందారు. ప్రొఫెసర్ ప్రవీణ్రాజ్సక్సేనా పర్యవేక్షణలో ‘ క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అసెస్మెంట్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ ఎలాంగ్ గ్రానైట్–బసాల్ట్ కాంట్యాక్ట్(అగ్నిశిలల్లో భూగర్భ జలాల అన్వేషణ– భూగర్భ జలాల నాణ్యత) అరౌండ్ నారాయణఖేడ్, మెదక్ డిస్ట్రిక్ట్ ’ అనే అంశంపై పరిశోధన పూర్తిచేసి సమర్పించిన పరిశోధనా గ్రంథాన్ని పరిశీలించిన ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ అధికారులు సుధాకర్‌కు డాక్టరేట్(పీహెచ్డీ) పట్టాను అందజేశారు. ఈ మేరకు సుధాకర్ శనివారం ఇక్కడ విలేకరులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సుధాకర్‌ను గ్రామస్తులు, పలువురు బందువులు అభినందించారు. వ్యవసాయ కూలీ కుటుంబంలో అక్కెనపల్లి యల్లయ్య–సోమమ్మ దంపతుల ఆరుగురి కుమారుల సంతానంలో చివరి సంతానం సుధాకర్. పాఠశాల విద్యను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే అభ్యసించాడు. ఇంటర్మీడియట్‌ను నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో, డిగ్రీ నల్లగొండలోని ఎన్జి కళాశాలలో, పీజీని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివాడు. వివాహితుడైన సుధాకర్ ఒక పక్క పరిశోధన కొనసాగిస్తునే ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖలో జియాలజిస్టుగా ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. -
గోవర్ధన్‌కు పీహెచ్డీ అవకాశం
జడ్చర్ల : కావేరమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని జయప్రకాశ్‌నగర్‌కు చెందిన చీకూరి గోవర్ధన్‌కు తమిళనాడు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసేందుకు అవకాశం దక్కింది. యూనివర్సిటీలో చోటు దక్కడం చాలా అరుదని ఈ సందర్భంగా గోవర్ధన్ పేర్కొన్నారు. తనకు డాక్టర్ గోపినాథ్ సలహాలను అందిస్తారని పేర్కొన్నారు. -
యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రవేశాలు
ఎస్కేయూ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా పీహెచ్డీ ప్రవేశాలను నిర్వహించాలని ఎస్కేయూ వీసీ ఆచార్య కే. రాజగోపాల్ అన్నారు. వర్సిటీలోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇండిస్ట్రియల్, ఎక్జిక్యూటివ్ కోటాలో ఉన్న పీహెచ్డీ సీట్లు తాజా యూజీసీ మార్గదర్శకాల ప్రకారం కేటాయించాలని వీసీ ఆదేశించారు. ఎంబీఏ, కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ కోర్సుల్లో ఇండిస్ట్రియల్ కోటాలో సీట్లు ఉన్నాయి. రెక్టార్ జి.శ్రీధర్ , రిజిస్ట్రార్ వెంకటరమణ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ చింతా సుధాకర్, ప్రిన్సిపాల్ సీఎన్ కృష్ణానాయక్, డీన్స్, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
'ఆ రోజు నన్ను చూసి అందరూ నవ్విన వాళ్లే'
రాజ్‌కోట్: ఆయన తొలి రోజుల్లో చదువుల్లో అంత ఘనాపాటేం కాదు. ఒకానొక సందర్భంలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో కూడా తొలిసారి ఫెయిలయ్యాడు. అలాంటి వ్యక్తి చేతుల్లో ఇప్పుడు మూడు పీహెచ్‌డీలు. ఆ మూడు ఓ ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు అంకితాలు. ఈ రోజుల్లో ఒక్క డాక్టరేట్ ఉండటమే కష్టమవుతుండగా ఆయన మాత్రం ఏకంగా మూడు డాక్టరేట్లు పొందాడు. ఆయనే జగదీశ్ త్రివేది(49). గుజరాత్ లోని సురేంద్రనగర్ కు చెందిన ఆయన మూడు పీహెచ్‌డీలు పూర్తి చేసి ప్రముఖ నవలా రచయిత దేవ్శంకర్ మెహతా, ప్రముఖ హాస్యకారుడు షాబుద్దిన్ రాథోడ్, ప్రముఖ మత గురువు మోరారీ బాపునుకు ఈ మూడింటిని అంకితం చేశాడు. అంతేకాదు.. జగదీశ్ త్రివేది కూడా ఒక పెద్ద హాస్యకారుడు. 'నేను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో ఫెయిలయిన తర్వాత ప్రతి ఒక్కరు నన్ను ఎగతాళి చేశారు నవ్వారు. నేను సైన్స్ చదవలేనని నాకు తెలుసు. అందుకే వెంటనే ఆర్ట్స్ కు మారిపోయాను. నేను ఇంటర్ ఒకసారి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. రెండు పీహెచ్‌డీలు పూర్తి చేసి నేను డల్ స్టూడెంట్ కాదని నిరూపించాను' అని ఆయన చెప్పాడు. -
బీఫ్ తిన్నందుకే..
హైదరాబాద్: గత డిసెంబర్ నెలలో ఉస్మానియాలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ పాల్లొన్న విద్యార్ధికి ఇంగ్లీష్ అండ్ ఫారీన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఈఎఫ్ఎల్ యూ) షాక్ ఇచ్చింది. జాలీస్ కొడూరు అనే విద్యార్థి యూనివర్సిటీలో అరబిక్ లాంగ్వేజ్ లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్(ఎమ్ఏ) పూర్తి చేశారు. యూనివర్సిటీలోనే పీహెచ్ డీ ప్రవేశ పరీక్ష కోసం ధరఖాస్తు చేసుకుని హాల్ టికెట్ కోసం వెళ్లగా తనపై గత డిసెంబర్ లో పోలీసు నమోదయిందని ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి అర్హత లేదని చెప్పడంతో కంగుతిన్నాడు. గత ఏడాది ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్ లో పాల్లొన్న వారిలో 25 మంది ఈఎఫ్ఎల్ యూ విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థుల బీఫ్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, కొంతమంది విద్యార్థుల ఆదేశాలను పాటించకుండా ఫెస్టివల్ పాల్గొన్నట్లు ఈ సందర్భంగా యూనివర్సిటీ తెలిపింది. విశ్వవిద్యాలయ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ ఆర్డినెన్స్ పాస్ చేసిందని ఈఎఫ్ఎల్ యూ ప్రొఫెసర్ ప్రకాష్ కోనా తెలిపారు. జలీస్ కు మాత్రమే కాకుండా శారీరక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న మరో విద్యార్ధికి, ఫేస్ బుక్ లో యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పై అభ్యంతరకరమైన పోస్టు చేసిన విద్యార్థికి కూడా యూనివర్సిటీ హాల్ టికెట్లను జారీ చేయలేదు. తన మీద కేసు నమోదయి ఇప్పటికి ఆరునెలలు కావొస్తోందనీ.. తాను హాల్ టికెట్ తీసుకోవడానికి వెళ్లే వరకు యూనివర్సిటీ ఈ విషయం చెప్పలేదని జమీల్ వాపోయాడు. పోలీసు కేసు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు చూపలేదని తెలిపారు. -
మహిళలకు ప్రత్యేక అవకాశం!
న్యూఢిల్లీ: మహిళలకు ఎంఫిల్, పీహెచ్ డీ చేసేందుకు ఎక్కువ సమయం ఇవ్వాలంటూ గతవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన సిఫార్సులపై యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజిసి) స్పందించింది. మహిళలకు, వికలాంగ అభ్యర్థులకు కొంత అధిక సమయాన్ని ఇచ్చేందుకు అంగీకరించింది. మహిళలతోపాటు... 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు ఎంఫిల్ పేపర్లు పూర్తి చేసేందుకు ఓ సంవత్సరం అదనంగానూ, అలాగే పీహెచ్ డీ థీసిస్ సమర్పించేందుకు రెండేళ్ళు ఎక్కువ సమయం వినియోగించుకునేందుకు యూజీసీ ప్రత్యేక అవకాశం కల్పించింది. అంతేకాక ఈ రెండు డిగ్రీలు పూర్తి చేసే సమయంలో మహిళలందరూ మెటర్నిటీ, ఛైల్డ్ కేర్ సెలవును 240 రోజులపాటు వినియోగించుకునే అవకాశాన్ని కూడా కల్పించింది. అలాగే వికలాంగులు, మహిళలు వారి అధ్యయనం సమయంలో వివాహం లేదా కుటుంబ సంబంధిత కారణాలతో తమ పరిశోధనా డేటాను నిబంధనల ప్రకారం బదిలీ చేసుకొనే అవకాశాన్ని కూడా కల్పించింది. మరో ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా యూజీసీ తీసుకుంది. జూలై 11, 2009 ఎంఫిల్, పీహెచ్ డీ ప్రోగ్రామ్ కోసం నమోదు చేసుకున్న అభ్యర్థులకు డిగ్రీలను అందించే విషయంలోనూ, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా తత్సమానమైన పోస్టుల నియామకాల విషయంలోనూ.. ప్రత్యేక అవకాశాలను కల్పించింది. షరతులకు లోబడి నిర్వహించే జాతీయ అర్హత పరీక్ష (NET) విషయంలోనూ మినహాయింపును ఇచ్చింది. అలాగే రెగ్యులర్ రీతిలో పీహెచ్ డీ చేసే స్కాలర్ల థీసిస్ ను కనీసం ఇద్దరు ఎక్స్ టర్నల్ ఎగ్జామినర్స్ పరిశీలించి వుండాలి. ఓపెన్ పీహెచ్డీ లో అభ్యర్థులు తమ పరిశోధనా పత్రాలను కనీసం రెండు గుర్తింపు పొందిన జర్నల్స్ లో ప్రచురించి ఉండాలని, దీనికితోడు పీహెచ్డీ పనికి ఆధారంగా కనీసం రెండు సమావేశాలు, సెమినార్ల లో తమ అధ్యయనాలను సమర్పించి ఉండాలని చెప్పారు. -
ఆ డ్రాపవుట్ రచనలతో ఐదు పీహెచ్ డీలు
న్యూ ఢిల్లీః అతడు కేవలం పాఠశాల చదువుకూడ పూర్తి చేయలేదు. అయితేనేం రచయితగా అత్యంత ప్రతిభను ప్రదర్శించి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నాడు. ఒడిషాకు చెందిన ఆయన రచనలు ఐదుగురు పరిశోధనా విద్యార్థులకు ఆధారంగా మారాయి. కోస్లీ భాషా పండితుడు, కవి, 66 ఏళ్ళ హల్దార్ నాగ్ ఎన్నో పురాణాలకు గుర్తుగా పద్యాలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన రచనలు ప్రస్తుతం సంబల్పూర్ విశ్వవిద్యాలయ సిలబస్ లో భాగమయ్యాయి. హల్దార్ గ్రంథబాలి-2 పేరున విశ్వవిద్యాలయం వాటిని సంగ్రహించింది. హల్దార్ తన రచనలను ప్రేక్షకుల ముందు ప్రదర్శిస్తుంటాడు. తాను వల్లించిన పద్యాలను వల్లెవేస్తుంటాడు. కనీసం రోజుకు మూడు నాలుగు ప్రత్యేక కార్యక్రమాలకు హాజరౌతుంటాడు అంటూ అతడి సన్నిహితుడు, కవి నాగ్ చెప్తున్నారు. హల్దార్ రచించిన కోస్టీ భాషలోని పద్యాలు యువకులను అమితంగా ఆకట్టుకుంటాయని, ప్రతివారు కవులు అయినప్పటికీ.. కొందరు మాత్రమే వాటికి ఓ ప్రత్యేక రూపును ఇవ్వగల్గుతారని అదే వారిలోని కళను ప్రస్ఫుటింప జేస్తుందని హల్దార్ సన్నిహితుడు నాగ్ చెప్తున్నారు. కనీసం కాళ్ళకు చెప్పులు కూడ ధరించని హల్దార్... ఎప్పుడూ తెల్లని పంచె, చొక్కా వేసుకుంటాడని, పైగా అలా వేసుకోవడం తనకిష్టమని చెప్తాడు. ఒరిస్సాలోని బర్ఘర్ జిల్లాలోని ఓ పేద కుటుంబంలో 1950 లో పుట్టిన హర్దార్... కేవలం మూడో క్లాసు వరకే పాఠశాలలో చదువుకున్నాడు. ఆ తర్వాత ఎప్పుడూ అతడు బడికి హాజరు కాలేదు. పదేళ్ళ వయసులో తండ్రిని కోల్పోవడంతో కుటుంభ భారాన్ని నెత్తికెత్తుకున్న అతడు... తప్పని పరిస్థితిలో ఓ మిఠాయి దుకాణంలో పనికి (డిష్ వాషర్) చేరాడు. రెండేళ్ళ తర్వాత ఓ గ్రామపెద్ద అక్కడో హైస్కూలు స్థాపించాడు. అదే గ్రామంలో హల్దార్ పదహారేళ్ళపాటు వంటవాడిగా పనిచేశాడు. ఆ తర్వాత అక్కడ అనేక పాఠశాలలు వెలిశాయి. దీంతో హల్దార్ ఓ బ్యాంకును సంప్రదించి వెయ్యి రూపాయల లోన్ తీసుకొని ఓ చిన్న స్టేషనరీ షాప్ తో పాటు పాఠశాల విద్యార్థులకోసం తినుబండారాల అమ్మకం ప్రారంభించాడు. ఇదే సమయంలో హల్దార్ 'దోడో బర్గాచ్' (పురాతన మర్రిచెట్టు) అంటూ తన మొదటి పద్యాన్ని రాశాడు. 1990 ప్రాంతంలో అతడు రాసిన ఆ పద్యం స్థానిక పత్రికలో ప్రచురించారు. ఆ తర్వాత వరుసగా నాలుగు పద్యాలు రాసి పంపితే అవి కూడ అచ్చయ్యాయి. అనంతరం అతడి పద్యాలకు సమీప గ్రామాల్లోనూ భారీ స్పందన వచ్చింది. అక్కడే అతడి ప్రస్థానం మొదలైంది. ఆ ప్రోత్సాహం నేడు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేర్చింది. హల్దార్ నాగ్ ను ఒడిస్పాలో లోక్ కబీ రత్నగా పిలుస్తారు. ఎక్కువగా ప్రకృతి, సమాజం, పురాణాలు, మతం వంటివే అతడి పద్యాలకు ప్రధానాంశాలు. అయితే ఎన్నోసార్లు అతడి రచనలకు సమాజం నుంచి వ్యతిరేకత కూడ ఎదురైంది. నా దృష్టిలో కవిత్వం వాస్తవ జీవితానికి అద్దం పడుతుందని, ప్రజలకు సందేశాన్ని అందించేదిగా ఉండాలని హల్దార్ నాగ్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. -
లవర్స్‌పై పీహెచ్‌డి
ఈ ప్రపంచంలో ప్రేమలో పడనివాళ్లు అరుదుగా ఉంటారు. ఆ ప్రేమికులపై పీహెచ్‌డి చేస్తాడు ఓ కుర్రాడు. అసలు లవర్స్ పైనే పీహెచ్‌డి ఎందుకు చేయాలనుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమికులపై పీహెచ్‌డి’. ఆదిత్య, సోనాలి జంటగా కోట మునీష్ దర్శకత్వంలో లక్ష్మీశ్రీవాస్తవ నిర్మించిన గఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించామనీ, జనవరి మొదటి వారంలో విడుదల చేస్తామనీ నిర్మాత చెప్పారు. ప్రేక్షకులకు తమ ప్రేమను గుర్తు చేసే సినిమా ఇదనీ, రమేశ్ ముక్కెర స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ దర్శకుడు తెలిపారు. -
ఎన్నాళ్లీ నిరీక్షణ..!
అంద ని ద్రాక్షగాఓయూ పీహెచ్డీ ప్రవేశాలు ఏడాది నష్టపోయిన ఆశావహ అభ్యర్థులు ఎటూ తేల్చని అధికారులు సిటీబ్యూరో: పరిశోధనలకు నిలయమైన ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ పట్టాలు తప్పింది. ఇందుకు సంబంధించిన కటాఫ్ మార్కుల తగ్గింపు అంశం గందరగోళంగా మారిన విషయం తెలిసిందే. నెలలు గడుస్తున్నా కటాఫ్ మార్కులు తగ్గిస్తారా? లేదా? అన్న విషయంపై అధికారులు ఎటూ తేల్చడం లేదు. ఫలితంగా ఆశావహ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నాన్నారు. ఏడాదిన్నరగా నాన్చివేత గతేడాది జూలైలో పీహెచ్డీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల కాగా... ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన అర్హత పరీక్షకు 10,828 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ ఏడాది జూలైలో విడుదల చేసిన ఫలితాల్లో 6,747 మంది అర్హత సాధించారు. అయితే ఫలితాల విడుదల నాటి నుంచే కటాఫ్ మార్కుల అంశంపై విద్యార్థులకు ఆందోళన చేపట్టిన విద్యార్థులు తెలంగాణ ఉద్యమం కారణంగా చదువుపై దృష్టి సారించలేక పోయినందున కటాఫ్ మార్కులు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వర్సిటీకి రెగ్యులర్ వీసీ లేకపోవడం, ఇన్‌ఛార్జి వీసీ పట్టించుకోకపోవడంతో సమస్యను డిప్యూటీ సీఎం కడియం దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా వర్సిటీ స్టాండింగ్ కమిటీ ఎస్సీ-ఎస్టీ, బీసీ, ఓసీలకు వరుసగా 30, 35, 40కి తగ్గించామని అధికారులు పేర్కొంటుండగా, మరింత తగ్గించాలని, లేనిపక్షంలో 2011 నాటి విధానాన్నే అనుసరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఫలితాలు వెల్లడై 4 నెలలు గడిచినా అధికారులు ప్రవేశాలు మొదలుపెట్టే సాహసం చేయలేకపోతున్నారు. ఖాళీలపై కొరవడిన స్పష్టత ఓయూలో 1,088 పోస్టులకుగాను 651 మంది అధ్యాపకులు ఉన్నారు. ఇందులో 266 మంది ప్రొఫెసర్లు, 62 మంది అసిస్టెంట్, 324 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో రిసెర్చ్ గైడ్ పరిధిలో కనిష్టంగా నలుగురు.. గరిష్టంగా 8 మంది పీహెచ్డీ స్కాలర్లు పరిశోధనలు చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్ల కొరతకు తోడు కొందరికి గైడ్‌గా వ్యవహరించే గుర్తింపు లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఫలితాలు వెల్లడైన 62 సబ్జెక్టులకు, ప్రొఫెసర్ల వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో వర్సిటీ అధికారులే చెప్పలేకపోతున్నారు. మరోపక్క కటాఫ్ మార్కులు తగ్గించడంతో అర్హత సాధించినవారు 6 వేలకు పైగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంతమందికి ప్రవేశాలు దక్కుతాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. రెగ్యులర్ వీసీ లేకపోవడం, కటాఫ్ మార్కులెన్నో తేలకపోవడం ప్రవేశాలకు అడ్డంకిగా పరిణమించాయి. ఈ తరుణంలో ఇంటర్వ్యూలకు నోఫికేషన్ వేస్తే విద్యార్థులు ఆందోళన చేస్తారన్న భయంతో అధికారులు నాన్చుడు థోరణి అవలంభిస్తున్నారు. ఈ విషయమై వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేష్ కుమార్‌ను ఫోన్లో సంప్రదించగా.. ఎలాంటి స్పందన లభించలేదు. -
దేశానికే విత్తన భాండాగారం తెలంగాణ
ప్రపంచంలో రెండే రెండు రాష్ట్రాలు పూర్తిగా విత్తనో త్పత్తికి అనుకూలంగా ఉంటున్నాయని అంతర్జాతీయ వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. ఒకటి అమెరికాలోని అరిజోనా రాష్ట్రం. రెండోది భారత్‌లోని తెలంగాణ రాష్ట్రం. పుష్కలమైన సూర్య రశ్మి, పొడి వాతావరణం, గాలిలో తక్కువ తేమ, అనువైన నేలల వల్ల విత్తన పంటల సాగుకు తెలం గాణ అత్యంత అనుకూలం. రాష్ట్రంలో 84 శాతం పైగా ఉన్న సన్న, చిన్న కారు రైతుల పంటలసాగు లాభసాటిగా ఉండాలంటే ఉత్పత్తి పెంపుదల ముఖ్యం. నాణ్యమైన విత్తనం నాటితే రైతు దాదాపు సగం దిగుబడి పొందినట్లే. దేశ విత్తన అవసరాలలో 60 శాతం తెలంగాణ రాష్ట్రమే తీరుస్తోంది. ఎందు కంటే 370కిపైగా జాతీయ, అంతర్జ్జాతీయ విత్తనో త్పత్తి సంస్థల పరిశోధన కేంద్రాలు, విత్తనోత్పత్తి క్షేత్రాలు తెలంగాణలోనే ఉన్నాయి. అందుకే తెలం గాణ భారత విత్తన రాజధానిగా, విత్తన భాండాగా రంగా పేరుపొందింది. విత్తనోత్పత్తిపరంగా ఇంత ఘన చరిత్ర కలిగిన తెలంగాణలో అదే స్థాయిలో పరిశోధనలు మాత్రం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయమే దీనికి గొప్ప ఉదాహరణ. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వ్యవసాయ విద్యపై బోధన, పరిశోధన, విస్తరణ అంశాలపై నిరంతరం అధ్యయనం జరగాలనే ఉద్దేశంతో నెలకొల్పారు. తెలంగాణను భారత దేశ విత్తన భాండాగారంగా మార్చడంలో వ్యవసాయ వర్సిటీదే కీలకపాత్ర అని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాలలో ప్రకటనలు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ అటు తెలంగాణ ఉద్యమంలోను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత కూడా పలు సందర్భాలలో ఇదే విష యాన్ని గుర్తుచేసిన సంగతి తెలిసిందే. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ఉన్నత విద్యపై దాదాపు 15 కోర్సులకు పైగా పిజి, పీహెచ్డీ కోర్సులు నిర్వహిస్తున్నారు. వాటిలో ఒక విభాగమైన సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (విత్తనో త్పత్తి విభాగం)లో మాత్రం ఇంతవరకు పీహెచ్డీ కోర్సు ప్రవేశపెట్టలేదు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసా య విశ్వవిద్యాలయంలో 2002 సంవత్సరం విత్తనో త్పత్తి విభాగంలో పీజీ కోర్సును ప్రవేశపెట్టారు. కానీ ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఈ విభాగంలో పిహెచ్డీ కోర్సును మాత్రం ప్రవేశపెట్టలేదు. పొరు గురాష్ట్రాలైన తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ, కర్ణాటకలోని దార్వాడ్ వ్యవసాయ వర్సిటీలు పీజీ, పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. కానీ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ వర్సిటీలు మాత్రం పీహెచ్డీ కోర్సు చేయాలను కున్న వారికి మొండి చేయి చూపిస్తూ పరిశోధక విద్యార్థులను నిరాశపరుస్తున్నాయి. పీహెచ్డీ కోర్సును తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టాలని పరిశోధక విద్యార్థులు గతంలో అనేకసార్లు వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకు వచ్చినా ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించకపోగా తమ వినతిపత్రాలు కాగి తాలకే పరిమితమయ్యాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా వ్యవసాయ విశ్వవిద్యాల యం విత్తనోత్పత్తిలో పీహెచ్డీ కోర్సును ప్రవేశపెట్టి వర్సిటీ విద్యార్థులకు అవకాశం కల్పిస్తే తెలంగా ణను విత్తన భాండాగారంగా మార్చడంలో వర్సిటీ కీలకపాత్ర పోషించే వీలుంటుందని పలువురు వ్యవ సాయ శాస్త్రవేత్తలు, నిపుణుల అభిప్రాయం. విత్తనో త్పత్తికి తెలంగాణ ప్రాంతం అనుకూలమన్నది నిర్వి వాదాంశం. అయితే స్థానికంగా రైతే విత్తన పంట లను పండించి విక్రయించేందుకు అవకాశం కల్పిం చాలి. ముఖ్యంగా ప్రభుత్వ పరిశోధన కేంద్రాలైన వ్యవసాయ వర్సిటీలలో విత్తనోత్పత్తులపై పరిశోధ నలు విస్తృతంగా జరగాలంటే పీహెచ్డీ కోర్సులను తక్షణం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. (హైదరాబాద్‌లో 27-29 వరకు జరగనున్న జాతీయ విత్తన సదస్సు సందర్భంగా) కాటం శ్రీధర్ సాక్షి విలేకరి, హైదరాబాద్ -
ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్డీలా?
మొన్నటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థలలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు. పరిశోధనలేదు. ఈరోజు ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 విద్యాసంస్థలను పేర్కొంటే ఆ జాబితాలో మన విద్యాసంస్థ ఒక్కటీ ఉండదు. కొన్ని వాస్తవాలు అభూతకల్పనల కంటే ఆశ్చర్యకరంగా, నమ్మశక్యం కాకుం డా ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 368 ప్యూన్ (చప్రాసీ) పోస్టులు నింప డానికి ప్రకటన జారీ చేస్తే 23 లక్షల దరఖాస్తులు వచ్చినట్టూ, అందులో 250 పీహెచ్డీ చేసిన నిరుద్యోగుల నుంచి వచ్చినట్టూ వార్త. ఈ పరిస్థితి దేనికి సంకే తం? మన ఆర్థికవ్యవస్థ అనారోగ్యానికా లేక మన విద్యావ్యవస్థ దుస్థితికా లేక రెండింటికా? ఇది కేవలం ఉత్తరప్రదేశ్‌కి పరిమితమైన వ్యవహారం కాదు. దేశం అంతటా ఇదే పరిస్థితి. చదువుకు తగిన ఉద్యోగం రాదు. చదివినంత మాత్రాన ఉద్యో గానికి అవసరమైన మెలకువలు తెలియవు. చదువు వేరు. ఉద్యోగం వేరు. బతుకుతెరువు నేర్పే చదువులు చెప్పడం లేదు. ప్యూన్ ఉద్యోగానికి పీహెచ్డీ పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవడం ఏమిటి? పీహెచ్డీ చేసినవారికి ఉద్యో గాలు ఎందుకు రాలేదు? పొట్టనింపని పీహెచ్డీ విలువ ఏపాటిది? దాదాపు మూడు దశాబ్దాలుగా సగటున ఏటా ఆరు శాతం స్థూల జాతీయ ఉత్పత్తి పెరు గుదల నమోదు చేసుకుంటూ వచ్చిన దేశంలో ఉద్యోగాల సృష్టి గణనీయంగానే జరుగుతోంది. తగిన అభ్యర్థులు లభించని కారణంగా కొన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉంటున్నాయి. ఇది ఒక విచిత్రమైన స్థితి. పీహెచ్డీ చేసిన నిరుద్యోగులు ఒక వైపు, అర్హులు లేని కారణంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలు మరో వైపు. ఉద్యో గాలకు పనికి వచ్చే చదువులు (ఎంప్లాయబుల్ ఎడ్యుకేషన్) నేర్పాలనే ఇంగి తాన్ని మన విధాన నిర్ణేతలు పాటించని ఫలితం ఈ విషాదం. ఉబుసుపోక పీహెచ్డీ పట్టా తీసుకున్న తర్వాత ఉద్యోగం దొరకని యువకుడు లేదా యువతి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం, అప్పటికీ ఉద్యోగం రాకపోతే ఊరకనే ఉండటం ఎందుకని పీహెచ్‌డీకి రిజిస్టర్ చేయించుకోవడం, సమాజానికి ఎటువంటి సంబంధం కానీ ప్రయోజనం కానీ లేని అల్పమైన విషయంపైన పరిశోధన చేయడం, గైడు సహాయంతోనో, అధ్యాపకుల సహకారంతోనో థీసిస్ రాయ డం, పీహెచ్డీ పుచ్చుకోవడం మన దేశంలో రివాజు. పెద్దగా శ్రమించకుండానే పీహెచ్డీ పట్టా చేతికి వస్తుంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ, పీహెచ్డీ పూర్తయ్యేనాటికీ తేడా ఏమిటి? వయస్సు పెరుగుతుంది కానీ జ్ఞానం అంతగా పెరగదు. ఉద్యోగాలకు వివిధ సంస్థలు నిర్వహించే పరీక్షలకు హాజరవుతూ ఉంటారు. ఉత్తీర్ణులు కారు. ఇంటర్వ్యూలలో ఎంపిక కారు. ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నదని తెలిసినా తమ చదువుతో, అర్హతతో నిమిత్తం లేకుండా దరఖాస్తు చేసు కుంటారు. ప్యూను ఉద్యోగమైనా అది ప్రభుత్వ ఉద్యోగం కనుక పరవాలేదను కుంటారు. అమెరికాలో కానీ యూరప్‌లో కానీ ఒక విద్యార్థి చేతికి పీహెచ్డీ పట్టా రావాలంటే అయిదేళ్ళ కఠోర పరిశ్రమ చేయాలి. ప్రవీణుల బృందం అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. తమ థీసిస్‌లో రాసిన అంశాలనూ, చేసిన నిర్ధారణలనూ సమర్థించుకోవాలి. అటువంటి పరిశోధనలను ప్రభు త్వాలు విధాన నిర్ణాయక క్రమంలో పరిశీలనాంశాలుగా స్వీకరిస్తాయి. పీహెచ్డీ పూర్తి కాగానే అధ్యాపకులుగానో, శాస్త్రజ్ఞులుగానో ఉద్యోగాలలో చేరతారు. పరిశ్రమలకూ, విద్యాసంస్థలకూ మధ్య అనుసంధానం మన దేశంలో తక్కువ. పరిశ్రమల అవసరాలకు తగిన ప్రవీణులను విద్యాసంస్థలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. అందుకే ఎల్ అండ్ టీ వంటి సంస్థలు తమ సిబ్బందిని తయారు చేసుకోవడానికి స్వయంగా శిక్షణసంస్థలు నిర్వహిస్తున్నాయి. మీడి యా సంస్థలు సైతం విశ్వవిద్యాలయాలు ప్రదానం చేసే పట్టాలపట్ల విశ్వాసం లేక ప్రవేశ పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైనవారికి ఆరు మాసాలకు తగ్గకుండా మీడియా మెలకువలలో శిక్షణ ఇచ్చిన తర్వాతనే ఉద్యోగంలో పెట్టుకుంటు న్నాయి. ప్రభుత్వ రంగంలోని విద్యాసంస్థలే కాదు ప్రైవేటు విద్యాసంస్థలలో కూడా ప్రమాణాలు అంతంత మాత్రమే. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో ‘యాస్పైరింగ్ మైండ్స్’ అనే సంస్థ విద్యార్థుల యోగ్యతలపైన ఒక అధ్యయనం చేసింది. ఇందుకోసం 55,000 మంది ఇంజనీరింగ్ పట్టభదులను ప్రశ్నించింది. వారిలో మూడు శాతం మందికి మాత్రమే ఐటీ సంస్థలలో ఉద్యోగాలు పొందే అర్హత ఉన్నదని నిర్ధారించింది. 17 శాతం మందికి కనీసమైన ప్రావీణ్యం లేదు. 92 శాతం మందికి ప్రోగ్రామింగ్‌లో ప్రవేశం లేదు. 78 శాతం మందికి ఇంగ్లీ షులో భావవ్యక్తీకరణ సమస్య. 56 శాతం మందికి విశ్లేషణ సామర్థ్యం (ఎనలిటికల్ స్కిల్స్) లేదు. ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ దేశంలో ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించు కుంటున్నారు. అమెరికాలోనో, యూరప్‌లోనో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారికి కొంత ప్రావీణ్యం అబ్బుతుంది. స్వతహాగా తెలివితేటలు ఉండటం వల్ల వారు విదేశాలలో ఉద్యోగాలలో రాణిస్తున్నారు. అటువంటివారిని చూపించి ‘భారత యువతీయువకులలాగా మీరు కూడా సాంకేతిక ప్రావీణ్యం సంపాదించుకో వాలి’ అంటూ అమెరికా యువతకు బరాక్ ఒబామా ఉద్బోధిస్తూ ఉంటారు. విద్యే ఉపాధికి సోపానం తీరం దాటి అంతర్జాతీయ వేదికపైన పోటీలో నిలిచి గెలుస్తున్నవారికంటే దేశం లోనే నిరుద్యోగులుగా కునారిల్లుతున్న ఇంజనీరింగ్ పట్టభద్రుల సంఖ్య చాలా రెట్లు అధికం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ కళాశాలలు లేని చోట్ల కూడా ఇంజనీరింగ్ కళాశాలలను వేలంవెర్రిగా ప్రోత్సహించి లక్షలాది మంది పట్టభద్రులను తయారు చేసి వీధులలోకి వదిలిన తర్వాత ఏ ఉద్యోగం ఖాళీ ఉన్నా దర ఖాస్తుదారులలో సగానికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉంటున్నారు. కాలక్రమంలో విద్య ఉపాధికి సోపానం అన్న దృక్పథం జన సామాన్యంలో బలపడింది. ప్రతి కుటుంబం తన ఆదాయంలో 7.5 శాతం విద్యపైన ఖర్చు చేస్తున్నది. ఇది ఇతర ‘బ్రిక్స్’ దేశాలైన చైనా, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో కంటే అధికం. ఆదాయం పెరగడం, వెనకబడినవర్గాల విద్యా ర్థుల ఫీజు ప్రభుత్వాలు చెల్లించడం కారణంగా ఉన్నత పాఠశాలలో ఉత్తీర్ణులైన వారిలో 2004లో 11 శాతం మంది ఉన్నత విద్యాసంస్థలలో చేరగా 2014 నాటికి 23 శాతం మంది చేరారు. విద్యాహక్కు చట్టం ఫలితంగా అక్షరాస్యత 1991లో 54 శాతం నుంచి 2014 నాటికి 74 శాతానికి పెరిగింది. ఈ దశాబ్దం చివరికి మన దేశంలో 25 నుంచి 34 సంవత్సరాలలోపు వయస్సు గల పట్టభద్రులు 2.40 కోట్ల మంది ఉంటారు. ఇది ప్రపంచంలోని పట్టభద్రులలో 12 శాతం. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన యువకులు ఇంజనీరింగ్ చదివిన తర్వాత వ్యవసాయ పనులలో పాల్గొనకుండా, ఉద్యోగం లేకుండా రికామిగా మిగిలిపోయి అటు కుటుంబానికీ, ఇటు సమాజానికీ సమస్యగా పరిణమిస్తు న్నారు. మన విద్యావిధానంపైనా, విద్యాసంస్థల ప్రమాణాలపైనా, ఇంజనీరింగ్ పట్టభద్రుల ప్రావీణ్యరాహిత్యంపైనా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేయడం ఈ నేపథ్యంలోనే. మొన్నటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా ఆదరించిన ఐఐటీలకు ఇప్పుడు ఆదరణ అంతగాలేదు. ఆ సంస్థ లలో మునుపటి ప్రమాణాలు లేవు. అధ్యయనం లేదు. పరిశోధన లేదు. ఈ రోజు ప్రపంచంలోని అత్యుత్తమమైన 200 విద్యాసంస్థలను పేర్కొంటే ఆ జాబి తాలో మన విద్యాసంస్థ ఒక్కటీ ఉండదు. ఇంత పెద్ద దేశం, 2050 నాటికి అమె రికా, చైనాల సరసన నిలుస్తుందని ప్రవీణులు అంచనా వేస్తున్న ఆర్థిక వ్యవస్థ ప్రపంచస్థాయి విద్యాసంస్థను ఒక్కదానిని కూడా నెలకొల్పలేకపోవడం ఘోర మైన వైఫల్యం. ఇందుకు సమాజాన్నీ, ఇంతకాలం దేశాన్ని ఏలిన రాజకీయ పార్టీలనూ నిందించాలి. విపణి నియంత్రించే ఆర్థిక వ్యవస్థ (మార్కెట్ ఎకానమీ) ఉన్న దేశాలలో సైతం ప్రాథమిక విద్య, ఆరోగ్యం ప్రభుత్వ నిర్వహణలోనే ఉంటాయి. ఉన్నత విద్య మాత్రం ప్రైవేటురంగంలో ఉంటుంది. మన దేశంలో ప్రాథమిక, ఉన్నత అన్న తేడా లేకుండా ఆరోగ్య, విద్యారంగాల నుంచి ప్రభుత్వం క్రమంగా నిష్ర్క మించింది. ఇప్పుడు ఉన్నత విద్య అభ్యసిస్తున్నవారిలో 60 శాతం మంది ప్రైవేటు విద్యాసంస్థలలోనే చదువుతున్నారు. దేశంలోని 14 లక్షల విద్యాసం స్థలలో అయిదు లక్షల సంస్థలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. మూడు కోట్ల మంది విద్యార్థులు ఈ సంస్థలలో చదువుతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలూ, విశ్వవిద్యాలయాలూ కొన్ని ఫక్తు వ్యాపార సరళిలో నడుస్తున్నప్పటికీ, కొన్ని మాత్రం విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు అంకితభావంతో కృషి చేస్తు న్నాయి. విప్రో వ్యవస్థాపకుడు అజిమ్ ప్రేమ్‌జీ పేరుతో నెలకొల్పిన విశ్వ విద్యాలయం, హెచ్‌సిఎల్ వ్యవస్థాపకుడి పేరు మీద స్థాపించిన శివ్ నాడార్ విశ్వవిద్యాలయం, ఉక్కు పారిశ్రామికవేత్త జిందాల్ పేరుతో వెలసిన యూనివ ర్సిటీ, ఢిల్లీలోని అశోకా యూనివర్సిటీ ఈ కోవలోకి వస్తాయి. అయిదారేళ్ళలో వీటిలో కొన్ని ప్రపంచస్థాయి విద్యాసంస్థలుగా పరిగణన పొందే అవకాశం ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు మంచి పేరున్న విదేశీ విశ్వవిద్యాలయాలతో పొత్తు పెట్టుకున్నాయి. ఐటీ, మేనేజ్మెంట్ విద్యలో ఇప్పటికే కొన్ని సంస్థలు ఉన్నతమైన సేవలు అందిస్తున్నాయి. ప్రధాని మోదీ ప్రకటించిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ఫౌండేషన్‌కు ఈ ఏడాది కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటా యించారు. ఈ సంస్థ 62 లక్షల మందికి వివిధ రంగాలలో ఉద్యోగాలకు అవసర మైన శిక్షణ ఇస్తుంది. విద్యకు పౌరులు ఇస్తున్న ప్రాధాన్యం ప్రభుత్వాలు ఇవ్వక పోవడం మన దౌర్భాగ్యం. విద్యావిధానంలో చీటికీమాటికీ మార్పులు తీసుకు రావడం, ప్రమాణాల విషయంలో పట్టింపు లేకపోవడం, అధ్యాపకుల పని తీరును సమీక్షించాలన్న నియమంలేకపోవడం, విద్యార్థులకు నియమావళి లేక పోవడం మన విద్యావ్యవస్థను వేధిస్తున్న ప్రధానమైన సమస్యలు. అపారమైన అవకాశాలు ఆర్థికాభివృద్ధికీ, పరిశ్రమల విస్తరణకూ అవసరమైన నైపుణ్యం ప్రసాదించే విద్యాసంస్థలకు భవిష్యత్తు ఉంది. ప్రముఖ శాస్త్రజ్ఞుడు రఘునాథ్ ఎ మషేల్కర్ (ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడెమీ మాజీ అధ్యక్షడు) అన్నట్టు మన దేశంలోని వనరులను విజ్ఞతతో వినియోగించుకోగలిగితే మరో పదేళ్ళలో మన దేశం ప్రపంచంలోనే మేటి విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చెందగలదు. విద్యారంగంలో అవసరమైన సంస్కరణలు అమలు చేస్తూ, అధ్యాపకులకు మంచి జీతాలు ఇస్తూ, పరిశోధనకు పెద్దపీట వేసినట్లయితే దేశంలో ఉన్న అపారమైన అభివృద్ధి అవకాశాలను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవచ్చు. మరో రెండు దశాబ్దా లలో ప్రపంచంలోనే అతి పెద్ద జనాభా గల దేశంగా ఇండియా చైనాను అధిగ మించబోతోంది. ఆర్థికంగా కూడా చైనాను అధిగమించాలన్నా లేదా కనీసం చైనా సరసన సగర్వంగా నిలవాలన్నా శాస్త్ర, సాంకేతిక విద్యావ్యవస్థను పెంపొం దించుకోవాలి. అటు పారిశ్రామిక, సేవా రంగాలకూ, ఇటు విద్యారంగానికి మధ్య అనుసంధానం సాధించాలి. అప్పుడు పీహెచ్డీ డిగ్రీలు అంత తేలికగా చేతికి అందవు. పీహెచ్డీ నిజంగా చేసినవారికీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసినవారికీ ప్యూన్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవలసిన దుస్థితి ఉండదు. చదువు సార్థకం అవుతుంది. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
భద్రత ఉద్యోగ లక్షణం!
సర్కారులో చిన్న కొలువుకూ సై అంటున్న యువత ఉద్యోగ భద్రతకే పట్టభద్రుల పెద్దపీట ప్రైవేటు రంగంలో ఉన్నత ఉద్యోగానికే మొగ్గు ఉస్మానియా వర్సిటీ ప్రొఫెసర్ల అధ్యయనంలో వెల్లడి హైదరాబాద్: పీజీలు, పీహెచ్‌డీలు చేసినా చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం వైపే ఎక్కువగా మొగ్గుచూపుతోంది నేటి యువత. సర్కారు కొలువైతే ఉద్యోగ భద్రత ఉంటుందని భావిస్తుండటమే దీనికి కారణం. అందుకే ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాన్ని కాదని ప్రభుత్వ ఉద్యోగాలకే వారు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. అది వీలుకాకపోతే ఉన్నత స్థాయి ఉద్యోగమైతేనే ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేయడానికి ఇష్టపడుతున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు క్యాంపస్ రిక్రూట్మెంట్కు ఎంపికైన తీరు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిపై వర్సిటీ సీనియర్ ప్రొఫెసర్లు అధ్యయనం చేశారు. వారి రిపోర్టును పరిశీలిస్తే ఉద్యోగ భద్రతనిచ్చే చిన్న ప్రభుత్వ ఉద్యోగానికే యువత ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తేలింది. ఆర్థిక సంక్షోభం దెబ్బకు... 2009 లో సంభవించిన అమెరికా ఆర్థిక సంక్షోభం ప్రైవేటు ఉద్యోగాల పట్ల విద్యార్థుల్లో భయాన్ని సృష్టించినట్లు వీరి అధ్యయనంలో తేలింది. అప్పటి నుంచి ప్రైవేటు ఉద్యోగాలంటే గాలిలో దీపం అని యువత భావిస్తోంది. 2001-08 మధ్య కాలంలో యువత ఎక్కువగా ఐటీ వైపు దృష్టి సారించేది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలను వదిలి మరి సాంకేతిక కోర్సులు నేర్చుకుని ఐటీ రంగంలో అడుగుపెట్టారు. అయితే ఆర్థిక సంక్షోభం దెబ్బతో పరిస్థితి మారింది. 2009 తర్వాత ఉద్యోగాల ఎంపికలో యువత తీరు మారింది. ప్రైవేటు ఉద్యోగం కంటే ప్రభుత్వంలో చిన్న కొలువున్నా సరే చేరి పోవాలనే నిర్ణయానికి వచ్చారు. చిన్న ఉద్యోగాలకూ భారీగా పోటీ.. గ్రూప్-1, గ్రూప్-2 లాంటివే కాకుండా వీఆర్ఓ, వీఆర్ఏ వంటి చిన్న సర్కారు ఉద్యోగాలకు సైతం యువత భారీగా పోటీపడుతోంది. సర్కారు కొలువులకు చదువుకునేవారు అవసరమైన వాతావరణం ఉంటుందనే భావనతో ఎక్కువగా వర్సిటీలో చే రేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో వర్సిటీలో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వచ్చింది. కంపెనీల వర్సిటీ బాట.. మరోవైపు గత ఐదేళ్ల నుంచి అనేక కంపెనీలు ఓయూలో క్యాంపస్ రిక్రూట్మెంట్ చేపడుతున్నాయి. గతేడాది వరకు దాదాపు 40 కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొన్నాయి. కంపెనీల సంఖ్యతో పాటు ఉద్యోగాల కోసం నమోదు చేసుకునే అభ్యర్థుల సంఖ్య, కొలువులు సాధించిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తోంది. అయితే అత్యధిక శాతం మంది ఐటీ ఉద్యోగాల వైపే వెళుతున్నారు. ప్రైవేటులో చిన్న ఉద్యోగాలైతే ఆఫర్లు కాదనుకొని క్యాంపస్‌లోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు జాబ్ వచ్చినా చేరరు.. కొన్నాళ్లుగా ఓయూలో ఇంజనీరింగ్ తర్వాత ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారే ఎక్కువగా కార్పొరేట్ ఉద్యోగాల్లో చేరారు. అలా చేరని వారు ప్రైవేటు ఉద్యోగాలను కాదని నెట్, జేఆర్ఎఫ్, గ్రూప్స్ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యారు. ఇక ఆర్ట్స్ కోర్సులు చేసిన వారు ప్రైవేటులో చిన్న ఉద్యోగాలకు ఆఫర్లు వస్తున్నా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. -
కొవ్వూరు యువకుడికి పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్
పశ్చిమగోదావరి(కొవ్వూరు): పువ్వు పుట్టగానే పరిమళించినట్టే.. ప్రతిభ కూడా చిన్నప్పుడే తెలిసిపోతుందని ఈ ఘటన మరోమారు రుజువు చేసింది. చిన్నప్పుడు పాఠశాలలో ఏ పరరీక్ష నిర్వహించినా ముందుండే శేఖర్‌బాబు అదే ఆనవాయితీని కొనసాగిస్తూ.. పీహెచ్‌డీలోనూ బంగారుపతకం సొంతం చేసుకున్నారు. ఓ వైపు ఐఎఫ్ఎస్ శిక్షణలో ఉంటూనే మరోవైపు కష్టపడి పీహెచ్డీ పూర్తిచేశారు. కొవ్వూరుకు చెందిన గెడ్డం శేఖర్‌బాబు కందిసాగులో అధిక దిగుబడి నిచ్చే జన్యువును కనుగొని పీహెచ్‌డీలో గోల్డ్‌మెడల్ సాధించారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో జరిపిన ఈ ప్రయోగానికి గాను.. న్యూఢీల్లీలో శుక్రవారం ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ ఆర్.చిందంబరం చేతుల మీదుగా బంగారుపతకాన్ని అందుకున్నారు. వ్యవసాయశాస్త్రంలో పీజీ పూర్తిచేసిన అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో మూడేళ్ల పాటు పీహెచ్డీ చేశారు. చదువుకుంటున్న సమయంలోనే సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాడర్లో ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. -
ఆస్ట్రాలజీ జోస్యానికి కొత్త భాష్యం
ఒకరు రిటైర్డ్ ప్రిన్సిపాల్.. ఇంకొకరు డాక్టర్.. మరొకరు ఐటీ ప్రొఫెషనల్.. ఇలా డిఫరెంట్ వృత్తుల వారంతా ఒక చోటికి చేరారు. వీరే కాదు.. ఇంకా ఎందరెందరో.. అక్కడికి చేరుకున్నారు. వారి ఉద్యోగాలే కాదు.. ఏజ్ గ్రూప్‌లు కూడా వేర్వేరే. మరి వీరందరినీ కలిపింది ఏమిటంటే.. జ్యోతిషం. అవును గ్రహగతులే వీరందరినీ ఒక్కతాటిపైకి తెచ్చాయి. అవును వీరంతా ఆస్ట్రాలజీలో పీహెచ్డీ చేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని లయన్స్ భవన్లో ఆదివారం జరిగిన ఆస్ట్రో సదస్సులో వీరంతా పాల్గొన్నారు. ..:: దార్ల వెంకటేశ్వరరావు ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన జ్యోతిష జ్ఞానంపై ఇప్పుడు ఎందరికో ఆసక్తి పెరుగుతోంది. జ్యోతిషాన్ని ఉపాధిమార్గంగా ఎంచుకుని కొందరు శాస్త్రీయంగా ఈ విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర వృత్తుల్లో ఉన్నవారు సైతం జ్యోతిషాన్ని ప్రవృత్తిగా స్వీకరించి.. శాస్త్రాన్ని అభ్యసిస్తున్నారు. బేసిక్స్‌తో వదిలేయకుండా.. పీహెచ్డీ వరకూ చేస్తున్నారు. ‘శాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా.. మిడిమిడి జ్ఞానంతో గ్రహాల అనుగ్రహాన్ని, ఆగ్రహాన్ని అంచనా వేస్తూ చాలా మంది అమాయక జనం నుంచి వేలకు వేలు కొల్లగొడుతున్నారు. శాస్త్రాన్ని సబ్జెక్ట్‌లా చదివిన ఆస్ట్రాలజర్స్ అవసరం ఎంతైనా ఉంది’ అని అంటారు ఈ సదస్సుకు హాజరైన ఓ ఐటీ ప్రొఫెషనల్. సీరియస్ స్టడీ.. గ్రహగతులను పక్కాగా లెక్క కడితే.. భవిష్యత్తును ఈజీగా చెప్పేయొచ్చు అంటున్నారీ పీహెచ్డీ విద్యార్థులు. ‘గ్రహాలు, నక్షత్రాలు మనిషి ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. జీవితంలో ప్రతి మార్పునకు ఆస్ట్రాలజీ కచ్చితమైన సమాధానం ఇవ్వగలదు. అయితే దీన్ని చాలా మంది ఆదాయ వనరుగానే భావిస్తున్నారు కాని, ఆసక్తిగా పరిశీలించడం లేదు’ అని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఎమ్మెస్సీ మైక్రోబయోలజీ చేసిన కాత్యాయిని అందులోనే పీహెచ్డీ చేసింది. తెలుగు ఎంఏ కూడా చేసింది. ప్రస్తుతం మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ చేస్తోంది. జ్యోతిషాన్ని సైన్స్ కోణంలో చూస్తూ నూతన ఆవిష్కరణల దిశగా ఆమె ప్రయాణిస్తున్నారు. సంతాన లేమి, ఒబెసిటీ, గర్భాశయ వ్యాధులు.. వీటికి కారణాలను ఆస్ట్రోలజీ ద్వారా కనుగొనే ప్రయత్నం చేస్తున్నారామె. ‘ నా భర్త గాంధీ ఆస్పత్రిలో ఫోరెన్సిక్ విభాగాధిపతి. అలాగే ఆయన దగ్గరకు వచ్చిన సంచలనాత్మక కేసుల్లో కొన్ని స్టడీ చేశా. అలాంటి వారి మరణాల కారణాలను విశ్లేషించాను కూడా’ అని వివరించారు. ఇలా చాలామంది ఔత్సాహికులు జ్యోతిషాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. ముందుగానే గుర్తించొచ్చు సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మెడికల్ ఆస్ట్రాలజీలో పీహెచ్డీ చేస్తున్నాను. అమెరికాలో పదేళ్లు సాప్ట్వేర్ కన్సల్టెంట్‌గా పనిచేశా. అక్కడ ఇండియన్, ఫారిన్ ఆస్ట్రాలజీ సంబంధాలపై కొంత పరిశోధన చేశాను. ఇప్పుడు మెడికల్ ఆస్ట్రాలజీలో నేను చేసిన కొన్ని పరిశోధనల ద్వారా క్యాన్సర్ వ్యాధి వచ్చే సంగతి ముందుగానే గుర్తించవచ్చు. దాదాపు 200 కేసుల్లో ఇది నిరూపితమైంది. ముందుగానే గుర్తించడం వల్ల వ్యాధి నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. - రఘునాథ్ సాప్ట్వేర్ ఇంజనీర్ (టెక్ మహీంద్రా సీనియర్ ప్రాజెక్టు మేనేజర్) ఉచిత బోధన అవగాహన లేకుండా చాలామంది జోస్యం చెప్పి లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తున్నారు. ప్రతి సమస్యకు జ్యోతిషం పరిహారం చూపింది. చిన్న చిన్న రెమెడీలు కూడా చెప్పింది. దీన్ని అందరికీ పరిచయం చేసేందుకు 2000 సంవత్సరంలో జేకేఆర్ ఆస్ట్రో రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. ఇందులో ఆస్ట్రాలజీ ఉచితంగా నేర్పిస్తాం. ఫ్లోరిడాలోని యోగ సంస్కృతం యూనివర్శిటీ 2011 సంవత్సరంలో మాకు అప్లియేషన్ ఇచ్చింది. అప్పటి నుంచి పీహెచ్డీ కూడా ప్రవేశపెట్టాం. - డాక్టర్ ఎన్‌వీఆర్‌ఏ రాజ (జేకేఆర్ ఆస్ట్రో రిసెర్చ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు) -
20 నుంచి పీహెచ్డీ ప్రవేశ అర్హత పరీక్షలు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ) పీహెచ్డీ ప్రవేశ అర్హత పరీక్షల ను ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ పోస్టు గ్రా డ్యుయేట్(పీజీ) అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 53 సబ్జెక్టులకుగాను ఈ పరీక్షలు ఉంటాయని, అభ్యర్థులు ఈ నెల 10 నుంచి ఓయూ వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొన్నారు. -
ఎస్వీయూ రీసెట్ ఇప్పట్లో లేనట్టే !
నోటిఫికేషన్ విడుదలలో జాప్యం ఆసక్తి చూపని అధికారులు యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీ యూనివర్సిటీ లో ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నియామక ప్రక్రియ (రీసెట్) అటకెక్కింది. ఏడాది కాలంగా అదిగో, ఇదిగో అంటూ అధికారులు కప్పదాట్లు వేస్తున్నారు. చివరిసారిగా గత ఏడాది జూన్‌లో ప్రవేశ ప్రకటన వెలువడింది. డిసెంబర్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. అయితే ఆ నోటిఫికేషన్లో ఎక్కువ ఖాళీలను నింపలేదు. ఒక్కో అధ్యాపకుడి వద్ద ఒక ఫుల్‌టైం, ఒక పార్ట్‌టైం పీహెచ్డీ పరిశోధకులను మాత్రమే చేర్చుకున్నారు. దీంతో ప్రవేశ పరీక్షలు రాసిన వేలాది మందికి నిరాశ ఎదురైంది. ఇకపై ప్రతి ఏటా నోటిఫికేషన్ ఇస్తాం, పీజీ కోర్సులాగా అడ్మిషన్లు నిర్వహిస్తామంటూ అధికారులు చేసిన ప్రకటనలు నీటి మీద రాతల్లా మారాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. పీజీ ప్రవేశాలు పూర్తవ్వగానే నోటిఫికేషన్ ఇస్తామంటూ అధికారులు ప్రకటించారు. ఆ ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. నోటిఫికేషన్ విడుదల కోసం నాలుగైదు సార్లు సమావేశాలు నిర్వహించారు. అయి నా ఫలితం లేదు. ఈ ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. ఆది నుంచీ నిర్లక్ష్యమే ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాల విషయంలో ఆది నుంచీ అలక్ష్యమే జరుగుతోంది. గత నోటిఫికేషన్ పూర్వపరాలు పరిశీలిస్తే.. 2005లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది తర్వాత 2006లో అడ్మిషన్లు చేశారు. అలాగే 2007 ఏప్రిల్‌లో నోటిఫికేషన్ ఇచ్చి 2008 మేలో అడ్మిషన్లు జరిపారు. 2009 జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి 2010 మేలో అడ్మిషన్లు జరిపారు. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. గత ఏడాది మేలో నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్, జనవరిలో అడ్మిషన్లు ప్రక్రియ ఇచ్చారు. నిబంధనల ప్రకారం కనీసం రెండేళ్లకొకసారి నోటిఫికేషన్ ఇచ్చి సకాలంలో అడ్మిషన్లు జరపాలి. ఐఐటీలో కేంద్రియ విశ్వవిద్యాలయాలు ప్రతి ఏటా పీజీ ప్రవేశ ప్రకటనతో పాటు ఎంఫిల్, పీహెచ్డీ ప్రకటన విడుదల చేసి, పీజీ కోర్సులతో పాటే అడ్మిషన్లు నిర్వహిస్తారు. ఎస్వీయూలో కూడా ఇదే విధానాన్ని పాటిస్తామని అధికారులు చాలా సందర్భాల్లో ప్రకటించినా అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపలేదు ఖాళీల సేకరణ ఈ ఏడాది ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశ ప్రకటన విడుదల చేయడం కోసం ఎస్వీయూ అధికారులు అధ్యాపకుల నుంచి ఖాళీల వివరాలు సేకరించారు. ఇది జరిగి మూడు నెలలు పూర్తయింది. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రొఫెసర్ కింద ఆరుగురు, అసోసియేట్ కింద నలుగురు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ముగ్గురిని పీహెచ్డీ కోర్సులో చేర్చుకోవచ్చు. 2010 తర్వాత పూర్తిస్థాయి అడ్మిషన్లు జరగనందువల్ల చాలా ఖాళీలు ఉన్నాయి. వచ్చే ఏడాది 33 మంది ఉద్యోగ విరమణ ఎస్వీ యూనివర్సిటీలో వచ్చే ఏడాది 33 మంది అధ్యాపకులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి పాతిక మంది ఉద్యోగ విరమణ చేశారు. నోటిఫికేషన్ ఆలస్యమైతే వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేసే అధ్యాపకులు తమ వద్ద పరిశోధక విద్యార్థులను చేర్చుకునే అవకాశం కోల్పోతారు. ఈసారి ఎంఫిల్ ఉండదు రానున్న రీసెట్ నోటిఫికేషన్లో ఎంఫిల్ కోర్సును ఎత్తివేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు. డిగ్రీ అధ్యాపక పోస్టుల కోసం అభ్యర్థులకు నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హతలున్నాయి. గతంలో ఎంఫిల్ డిగ్రీ ఉన్నవారికి డిగ్రీ అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేది. దీనిని తొలగించారు. దీంతో ఎంఫిల్ డిగ్రీ ఉన్నా అభ్యర్థులకు కలిగే ప్రయోజనం లేదు. దీంతో ఈ కోర్సును రద్దు చేసే పనిలో అధికారుల పడ్డారు. నోటిఫికేషన్ ఇప్పుడు లేనట్టే.. ఎస్వీయూ అడ్మిషన్ల విభాగం డెరైక్టర్‌గా పి.భాస్కర్‌రెడ్డి, జాయింట్ డెరైక్టర్‌గా మునిరత్నం, డెప్యూటీ డెరైక్టర్‌గా పీసీ వెంకటేశ్వర్లు పనిచేస్తున్నారు. వీరి పదవీకాలం ఫిబ్రవరి మొదటి వారంలో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి మొదటి వారంలోపు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తిచేయడం కష్టమన్న నిర్ణయానికి అధికారులు వచ్చారు. అందువల్ల నోటిఫికేషన్ విడుదలపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఫిబ్రవరి తర్వాత వచ్చే అధికారులు చూసుకుంటారు.. తామెందుకు రిస్క్ తీసుకోవాలన్న ఆలోచనలో ప్రస్తుత అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్లే నోటిఫికేషన్ విడుదలలో ఆలస్యం జరుగుతోందన్న ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కొత్త అధికారులు బాధ్యతలు స్వీకరిస్తే వెంటనే పీజీ ప్రవేశ ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే వచ్చే జూన్ వరకు నోటిఫికేషన్ విడుదల కాకపోవచ్చు. ఇంకా ఆలస్యమైనా కావచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. -
స్టార్టప్స్‌కు సదుపాయాలెన్నో
మై క్యాంపస్ లైఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - హైదరాబాద్.. భాగ్యనగరం కీర్తికిరీటంలో మరో కలికితురాయి. బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ వంటి కోర్సులను అందిస్తూ తన విశిష్టతను చాటుకుంటోంది. ఇక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సెకండియర్ చదువుతున్న రావుల మనీశ్చంద్రరెడ్డి తన క్యాంపస్ లైఫ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారిలా.. క్యాంపస్‌లో సాధారణంగా ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తరగతులు ముగుస్తాయి. లంచ్ తర్వాత 2.30 నుంచి 5.30 గంటల వరకు ప్రాక్టికల్స్, ల్యాబ్ వర్క్ ఉంటుంది. ఫ్యాకల్టీ.. ఎంతో ఫ్రెండ్లీ ఫ్యాకల్టీలో ఎక్కువ మంది యువతే. స్టూడెంట్స్‌కు.. ఫ్యాకల్టీ మధ్య పెద్దగా వయసులో తేడా లేదు. అందువల్ల విద్యార్థులను చక్కగా అర్థం చేసుకుంటారు. ఎప్పటికప్పుడు కొత్త బోధన పద్ధతులు అమలు చేస్తారు. మేము ఫ్యాకల్టీ నుంచి ఏమి ఆశిస్తున్నామో సులువుగా గ్రహిస్తారు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు. మూస పద్ధతికి స్వస్తి బోధన వినూత్నంగా ఉంటుంది. ఒక్కో పీరియడ్ గంటన్నరపాటు ఉంటుంది. విద్యార్థులతోనే పాఠాలు చెప్పిస్తారు లేదా విద్యార్థులు ప్రశ్నలు అడిగితే ప్రొఫెసర్ సమాధానాలివ్వడం.. నిజ జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయించడం ఇలా బోధనలో వివిధ పద్ధతులను పాటిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు. ఆన్లైన్లో కోర్సులు అందించే ఎన్పీటీఈఎల్, ఎడెక్స్, కోర్సెరా ద్వారా కూడా విద్యార్థులు కోర్సులు చేస్తుంటారు. ఇంజనీరింగ్ కోర్సులతోపాటే ప్రతి విద్యార్థీ లిబరల్ ఆర్ట్స్ కోర్సులను అభ్యసించాలి. నేను ఇప్పటివరకు క్రియేటివ్ ఆర్ట్స్, వెస్ట్రన్ పెయింటింగ్, మానవ సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం, షార్ట్‌స్టోరీ రైటింగ్, ఎకనామిక్స్ బేసిక్ కాన్సెప్ట్స్ వంటివాటిని అధ్యయనం చేశాను. స్టార్టప్స్‌కు ఎంతో ప్రోత్సాహం యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ఇన్స్టిట్యూట్లో ప్రత్యేకంగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్, ఇంక్యుబేషన్ సెంటర్ ఉన్నాయి. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. ఇంక్యుబేషన్ సెంటర్ పరిధిలో ప్రస్తుతం మూడు స్టార్టప్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. స్టార్టప్ ఏర్పాటు చేసేవారికి కార్యాలయం కోసం స్థలం, కంప్యూటర్స్, ఇంటర్నెట్, ప్రింటర్స్, ఫ్యాక్స్, టెలిఫోన్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. క్యాంపస్.. కలర్‌ఫుల్ ప్రతి ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్ కూడా నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్లు వంటి మొత్తం 180 ఈవెంట్లు ఉంటాయి. నేను కల్చరల్ ఫెస్ట్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాను. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో వాక్, రోబో కాంపిటీషన్స్తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి. సాధారణ రోజుల్లోనూ ప్రముఖ వ్యక్తులు ఉపన్యాసాలుంటాయి. సదుపాయాలెన్నో.. క్యాంపస్ సదుపాయాల విషయానికొస్తే ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పిస్తారు. క్యాంపస్ అంతా మంచి స్పీడ్‌తో వై-ఫై సౌకర్యం ఉంది. క్యాంపస్‌లో రెండు భోజనశాలలున్నాయి. ఆహారం రుచికరంగా ఉంటుంది. విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ అత్యంత ముఖ్యం కాబట్టి ఆధునిక లేబొరేటరీలున్నాయి. ప్రస్తుతం వివిధ బ్రాంచ్‌లకు సంబంధించి 150 ల్యాబ్‌లు ఉన్నాయి. అయితే లైబ్రరీని మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంది. ఆన్లైన్లో చదువుకోవడానికి అందరికీ యూజర్‌నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. పీహెచ్డీ చేస్తా పరిశోధనలంటే నాకు ఎంతో ఆసక్తి. ఇప్పుడు కూడా నేను ఎక్కువ సమయం ప్రాక్టికల్స్‌కే కేటాయిస్తున్నాను. బీటెక్ పూర్తయ్యాక ఎంఎస్, పీహెచ్డీ చేయాలనుకుంటున్నా. -
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా?
ఐఐఎస్సీ నుంచి పీహెచ్డీ చే యడం ఎలా? -స్వాతి, ఖమ్మం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు, నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, అగ్రికల్చరల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సులను అందిస్తుంది. పీహెచ్డీ కోర్సుల్లో సీఎస్ఐఆర్-యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/యూజీసీ నెట్ జేఆర్ఎఫ్/ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ జేఆర్ఎఫ్/ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జేఆర్ఎఫ్; జెస్ట్, ఎన్బీహెచ్ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్ లేదా గేట్లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. వివరాలకు: www.iisc.ernet.in రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్ వివరాలు తెలియజేయగలరు? - ప్రకాశ్, నిజామాబాద్. ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్‌ను గౌరవించే ఉద్దేశంతో ఇంగ్లండ్‌లోని ట్రినిటీ కాలేజ్ ఏటా రామానుజన్ రీసెర్చ్ స్టూడెంట్‌షిప్ ఇన్ మ్యాథమెటిక్స్ అనే స్కాలర్షిప్ను అందజేస్తోంది. ఇది ప్యూర్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ విద్యార్థులకు మాత్రమే పరిమితం. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ స్టూడెంట్షిప్నకు అర్హులు. దీని కాల వ్యవధి: మూడేళ్లు. దీని కింద ఫీజు, తిరుగు ప్రయాణ చార్జీలు, ఇతర ఖర్చులను కూడా చెల్లిస్తారు. ఎంపికైన విద్యార్థులు మొదటి తొమ్మిది నెలల మాస్టర్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ మ్యాథమెటిక్స్ అనే కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఈ కోర్సును డిస్టింక్షన్లో పూర్తి చేస్తేనే పీహెచ్డీ కోర్సు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: www.trin.cam.ac.uk ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సు వివరాలను తెలపండి? -అభిషేక్, వరంగల్. రోబోటిక్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సాఫ్ట్వేర్ బ్రాంచ్‌లకు సంబంధించిన ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ చేయాలనుకునే వారు బీటెక్ (మెకానికల్)/అనుబంధ బ్రాంచ్‌లతో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోబోటిక్స్ పూర్తి చేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మైనింగ్, టూల్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి. ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) అడ్మిషన్: గేట్ స్కోర్ ఆధారంగా. వివరాలకు: www.uohyd.ac.in యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఉస్మానియా యూనివర్సిటీ కోర్సు: ఎంఈ(ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్) అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.uceou.edu ఆంధ్రా యూనివ ర్సిటీ-విశాఖపట్నం కోర్సు: కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌గా అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా వివరాలకు: www.andhrauniversity.edu.in సిస్కో సర్టిఫికేషన్ కోర్సు వివరాలు తెలపండి? - కుమార్, మిర్యాలగూడ. ప్రస్తుతం ఐటీ జాబ్ మార్కెట్లో సిస్కో సర్టిఫికేషన్‌కు ఎంతో గుర్తింపు ఉంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్ ఇలా ఏ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా దానికి సిస్కో సర్టిఫికేషన్ తోడైతే ఇటు ఇండియాలో అటు విదేశాల్లో అవకాశాల పరిధి విస్తృతమవుతుంది. కెరీర్ ఉన్నతికి మార్గం ఏర్పడుతుంది. సిస్కో సర్టిఫికేషన్ నెట్వర్క్ అసోసియేషన్ సంక్షిప్తంగా సీసీఎన్ఏగా పిలిచే సర్టిఫికేషన్.. రూటింగ్ అండ్ స్విచింగ్, సెక్యూరిటీ, సర్వీస్ ప్రొవైడర్ ఆపరేషన్స్, సర్వీస్ ప్రొవైడర్, వాయిస్ అండ్ వైర్లెస్ స్పెషలైజేషన్లలో అందుబాటులో ఉంది. ప్రతి స్పెషలైజేషన్ పూర్తి చేయడానికి పలు పరీక్షలు రాయాల్సి ఉంటుంది. వీటిలో కొన్ని సర్టిఫికేషన్స్ పొందాలంటే సంబంధిత స్పెషలైజేషన్‌లో అభ్యర్థి అప్పటికే లోయర్ లెవల్ సిస్కో సర్టిఫికేషన్‌ను పొంది ఉండాలి. సిలబస్ తదితర వివరాలకు www.cisco.com చూడొచ్చు. ఈ సర్టిఫికేషన్ ప్రక్రియ క్రమంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ల్యాబ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. దీంతోపాటు సిస్కో కెరీర్ సర్టిఫికేషన్స్, రహస్య ఒప్పందంపై సంతకం చేయాల్సి ఉంటుంది. సిస్కోతో ఒప్పందం కుదుర్చుకున్న అధీకృత కేంద్రంలో ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో బహుళైచ్ఛిక, డ్రాగ్ అండ్ డ్రాప్, ఖాళీల పూరణ పద్ధతుల్లో ప్రశ్నలు ఎదురవుతాయి. కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థులకు తమ స్కోర్ రిపోర్ట్ అందుతుంది. ల్యాబ్ పరీక్ష విషయంలో పరీక్ష పూర్తయ్యాక 48 గంటల్లోపు స్కోర్ తెలుస్తుంది. ఒకసారి సీసీఎన్ఏ సర్టిఫికేషన్ పొందితే దానికి మూడేళ్లపాటు గుర్తింపు ఉంటుంది. కాబట్టి సర్టిఫికెట్ కాల పరిమితి పూర్తి కాకముందే వృత్తి నిపుణులు మళ్లీ సర్టిఫికేషన్ పొందాలి. ఔత్సాహిక అభ్యర్థులు అధీకృత టెస్ట్ సెంటర్లను సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాలి. మన రాష్ట్రంలో ప్రముఖ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లు సిస్కో పరీక్షకు శిక్షణ ఇస్తున్నాయి. కొన్ని సంస్థలు ఆన్ లైన్లో కూడా కోచింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. -
ప్రవేశాలు
జెస్ట్ - 2015 డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నిర్వహించే జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్- 2015 ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని వివిధ పరిశోధన సంస్థలు, విద్యా సంస్థల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కల్పిస్తారు. జాయింట్ ఎంట్రెన్స్ స్క్రీనింగ్ టెస్ట్ - 2015 కోర్సు: పీహెచ్డీ, ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ విభాగాలు: ఫిజిక్స్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, న్యూరోసైన్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: డిసెంబర్ 8 వెబ్సైట్: https://www.jest.org.in/ -
బంగారు కృష్ణయ్య
పేద ఇంట్లో పుట్టి ప్రొఫెసర్‌గా ఎదిగిన కృష్ణయ్య పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకున్న వైనం ఉస్మానియా యూనివర్సిటీ: పట్టుదల...క్రమశిక్షణ... ఈ రెండింటి కలబోతే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లోని మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కృష్ణయ్య. మహబుబ్‌నగర్ జిల్లా మాడుగుల మండలంలోని దిల్వార్ ఖాన్పల్లిలోనినిరుపేద దళిత కుటుంబానికి చెందిన అరెకంటి లక్ష్మయ్య, నర్సమ్మ దంపతుల కుమారుడు కృష్ణయ్య. చిన్ననాటి నుంచి చదువంటే ఆసక్తి కనబరిచే ఆయన అనేక కష్టనష్టాలకు ఓర్చి ఉన్నత విద్యను అభ్యసించారు. హాస్టళ్లలో ఉంటూ... ఉపకార వేతనాలు...మిత్రుల సాయంతో చదువు సాగించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించారు. పీహెచ్‌డీలో గోల్డ్ మెడల్ ప్రొఫెసర్ కృష్ణయ్య ఓయూలో విధులు నిర్వహిస్తూనే ఐఐటీ చెన్నైలో పీహెచ్డీ పూర్తి చేశారు. తన పరిశోధనకు బంగారు పతకం అందుకున్నారు. ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుల్లో పీహెచ్‌డీలో బంగారు పతకం సాధించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. అనంతరం పోస్టు డాక్టరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్)ను దక్షిణ కొరియాలో పూర్తి చేశారు. సుమారు 17 ఏళ్ల బోధన అనుభవం గల ఆయన రూ.32 లక్షలతో మూడు యూజీసీ, ఏఐసీటీఈ ప్రాజెక్టులు చేస్తున్నారు. తొమ్మిది దేశాల్లో పర్యటన.. ఓయూ అధ్యాపకునిగా పని చేస్తున్న కృష్ణయ్య 25 పరిశోధన పత్రాలను సమర్పించారు. అందులో 15 అంతర్జాతీయ, పది జాతీయ స్థాయి పేపర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, ఫ్రాన్స్, చైనా, థాయ్‌లాండ్, కొరియా, సింగపూర్లలో జరిగిన అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. బోధన, పరిశోధనలో ప్రతిభకు సుదర్శన్ భట్ మెమోరియల్ అవార్డు అందుకున్నారు. ఓయూ టీచర్స్ అసోసియేషన్ (ఔటా)లో రెండు పర్యాయాలు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌తో పాటు, ఇతర పదవులు చేపట్టిన ఆయనప్రస్తుతం అడిషనల్ కంట్రోలర్‌గా కొనసాగుతున్నారు. మరోవైపు తన స్వగ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారు. కష్టపడి చదవితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చు అని చెప్పే కృష్ణయ్య జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. స్నేహితుల సహకారంతోనే పేద కుటుంబం కావడంతో ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కష్టపడి చదువుకున్నాను. ఓయూకు ప్రొఫెసర్‌ను అవుతానని కలలోనైనా అనుకోలేదు. వ్యవసాయ కుటుంబం కావడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. స్కాలర్షిప్లు, స్నేహితుల ఆర్థిక సహకారంతో చదువుల బండి సాగింది. అమనగల్లు, బీచ్పల్లిలో పది వరకు చదివా. కోఠిలో గల (నేడు బీఎన్ రెడ్డిలో) చైతన్య కళాశాలలో ఇంటర్ పూర్తి చేశా. సైఫాబాద్ సైన్స్ కళాశాలలో బీఎస్సీ చ6దువుతూ ఎంసెట్‌కు హాజరయ్యాను. ఓయూ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో సీటు సాధించాను. బీటెక్, ఎంటెక్ పూర్తి చేసి ప్రాజెక్టులో పని చేస్తుండగానే 1997లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం లభించింది. దీంతో ఉన్నత విద్య పై మరింత ఆసక్తి కలిగింది. 2012లో ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. - ప్రొఫెసర్ కృష్ణయ్య -
ఐఐఎస్ఈఆర్లో పీహెచ్డీ...
ఎంబీఏ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -చంద్రా, జడ్చర్ల. అవస్థాపన (ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగంలోని సౌకర్యాలు, వాటిని నిర్వహించడం సంబంధిత అంశాలను వివరించే కోర్సు ఎంబీఏ (ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్). సివిల్ ఇంజనీర్లకు లేదా నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగకరం. ఈ కోర్సును అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు: వెబ్సైట్: www.teriuniversity.ac.in సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్-పుణే వెబ్సైట్: www.scmhrd.edu సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ-అహ్మదాబాద్ వెబ్సైట్: www.cept.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)-పుణే నుంచి కెమిస్ట్రీలో పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలియజేయగలరు? - రక్షిత్, కోదాడ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణే.. బేసిక్ సెన్సైస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తుంది. ఇందులో బయలాజికల్/ లైఫ్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్‌లో పీహెచ్డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కెమికల్ సెన్సైస్‌లో పీహెచ్డీ చేయాలనుకుంటే ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ విభాగాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అర్హత: కెమిస్ట్రీ/ఫిజిక్స్/బయోకెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/ బయోఇన్ఫర్మాటిక్స్/ఫార్మసీలో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. కింది అర్హతల్లో తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి. సీఎస్ఐఆర్ నెట్-జేఆర్ఎఫ్ లేదా డీబీటీ-జేఆర్ఎఫ్-ఏ లేదా ఐసీఎంఆర్-జేఆర్ఎఫ్. సీఎస్ఐఆర్-ఎల్ఎస్ లేదా డీఏఈ-జెస్ట్ లేదా గేట్లో తగిన స్కోర్. ఐఐఎస్ఈఆర్ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు. వెబ్సైట్: www.iiserpune.ac.in ఐఐటీ-ఖరగ్‌పూర్ అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ లా (ఆనర్స్-ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) కోర్సు వివరాలను తెలపండి? -మధు, మహబూబాబాద్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్‌పూర్‌లోని రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, బ్యాచిలర్ ఆఫ్ లా (ఆనర్స్- ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) కోర్సును అందిస్తుంది. ఇది మూడేళ్ల కోర్సు. ఇందులో సెమిస్టర్ విధానాన్ని అనురిస్తారు. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ మెడిసిన్/తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్/ఫార్మసీ/తత్సమానం లేదా ఎంబీఏ (బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్/ మెడిసిన్/ తత్సమానం లేదా మాస్టర్స్ స్టాయిలో సైన్స్/ ఫార్మసీ/ తత్సమానం కోర్సులను చదివి ఉండాలి). ప్రవేశ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఇన్స్టిట్యూట్ జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష/ఎల్సాట్ ఇండియా/ ఎల్సాట్ గ్లోబల్ పరీక్షల స్కోర్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి తర్వాతి దశలో వరుసగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఇన్స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్ (40 మార్కులు), లాజికల్ రీజనింగ్ (20 మార్కులు), మ్యాథమెటికల్ ఎబిలిటీ (15 మార్కులు), బేసిక్ సైన్స్ (35 మార్కులు), లీగల్ ఆప్టిట్యూడ్ (60 మార్కులు), ఎస్సే (30 మార్కులు) అంశాలు ఉంటాయి. ఈ తరహా కోర్సును అందిస్తున్న ఇతర సంస్థలు: నల్సార్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.nalsarpro.org నేషనల్ లా యూనివర్సిటీ-న్యూఢిల్లీ వెబ్సైట్: www.nludelhi.ac.in నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా-బెంగళూరు వెబ్సైట్: www.nls.ac.in ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఆసక్తి. ఈ సబ్జెక్టులో పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి? - -సురేష్, మెదక్. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలను ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వివరిస్తుంది. కోర్సులో కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ ప్రణాళిక, మోడలింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి. కోర్సుల వివరాలు: ఆంధ్రా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్లో ఎంఈ కోర్సును అందిస్తుంది.అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి.. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తుంది.అర్హత: బీఈ/ బీటెక్/ సివిల్ ఇంజనీరింగ్‌లో ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.వెబ్సైట్: www.svuniversity.in కెరీర్: ఎన్విరాన్‌మెంటల్‌లో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తిచేసినవారు పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను పొందొచ్చు. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు సంస్థల సీఎస్ఆర్ విభాగాల్లోనూ అవకాశాలుంటాయి. -
మౌనంగానే ఎదిగాడు
‘మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది...’ అనే పాటలోని వాక్యాన్ని అక్షరాలా నిజం చేశాడు ఆ యువకుడు. అతడు పుట్టిన మూడేళ్లకే తల్లి కన్నుమూసింది. వేలు పట్టి నడిపిస్తాడనుకున్న నాన్న ఐదో ఏటే దూరమయ్యాడు. ఆసరాగా ఉంటారనుకున్న అన్నలూ మద్యానికి బానిసలై కాలం చేశారు.. ఓ బాలుడికి కళ్లముందే ‘నా’ అనుకున్న వాళ్లందరూ దూరమయ్యారు. బంధువులు చేరదీయలేదు.. తినడానికి తిండి లేదు.. ఒంటిమీద సరైన దుస్తులూ లేవు.. పనిచేసి సంపాదించే వయసూ కాదు.. పట్టించుకునే దిక్కులేదు. అలాంటి స్థితి నుంచి ఆ కుర్రాడు కష్టాలకు ఎదురీదాడు. దారి తెలియని వయసులోనే తనకు తానే మార్గనిర్దేశం చేసుకున్నాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ చదివే స్థాయికి ఎదిగాడు. కాలం చేసిన గాయాలను తట్టుకుని నిలిచిన ఆ యువకుడి పేరు వెంకటేశ్ చౌహాన్. ఇటీవల రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపికై ఔరా అనిపించాడు. బుధవారం జరగనున్న హెచ్‌సీయూ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టా అందుకోనున్న వెంకటేశ్‌పై ప్రత్యేక కథనం... నల్గొండ జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో 1989లో వెంకటేశ్ చౌహాన్ జన్మించాడు. చిన్నప్పుడే తల్లిదండ్రులను, రక్తం పంచుకు పుట్టిన అన్నలను కోల్పోయాడు. దీంతో కాలమే వెంకటేశ్‌ను చేరదీసింది. సమాజమే బతుకు పాఠాలు నేర్పింది. ఐదో తరగతి వరకు కూచిపూడి తండా, రామాపురంలో చదువుకున్నాడు. ఆరు నుంచి ఇంటర్ వరకు కోదాడలో విద్యాభ్యాసం సాగింది. 8వ తరగతిలో ఉండగా చేతిలో చిల్లి గవ్వ లేదు. ఆకలితో ఉన్న వెంకటేశ్ కోదాడ సమీపంలో ఉన్న అరుణాచలం ట్రాన్స్‌పోర్టు వద్ద నిల్చొని ఓ లారీని ఆపాడు. నన్ను పనిలోకి తీసుకోండన్నా, ఆకలిగా ఉందంటూ అడగడంతో వారు కాదనలేక పోయారు. క్లీనర్ నుంచి పీహెచ్డీ వరకు.. వెంకటేశ్ రాత్రంతా లారీ క్లీనర్‌గా పనిచేస్తూ, ఉదయం పాఠశాలకు వెళ్లే వాడు. 9వ తరగతిలో కోదాడలోని ఓ హోటల్లో పాత్రలను కడిగే పనికి కుదిరాడు. అలా సంవత్సరం నెట్టుకొచ్చాడు. 10వ తరగతి నుండి ఇంటర్ దాకా ఎస్టీడీ బూత్ బాయ్‌గా, పండ్లు అమ్మే వ్యక్తిగా పనిచేస్తూ వచ్చాడు. మిత్రుల సహకారంతో డిగ్రీ కోసం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో సీటు సంపాదించాడు. ఉదయం తరగతులు వినటం రాత్రి అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేయడం చేసేవాడు. ఇలా పనులు చేయగా వచ్చిన డబ్బుతోనే జీవన ప్రయాణం సాగించేవాడు. అయితే ఏనాడు చదువును అశ్రద్ద చేయలేదు. ప్రతినిత్యం బతుకు పోరాటంలో ఎదుర్కొంటున్న సమస్యల ముందు చదువు ఎప్పుడూ కష్టమనిపించలేదు. చిన్ననాటి నుంచీ ప్రథమ శ్రేణిలోనే ఉత్తర్ణుడవుతూ వచ్చాడు. ప్రొఫెసర్ సహకారంతో.. ఓ సెమినార్లో ఉపన్యాసం ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ సూర్య ధనుంజయ్‌ని కలిసి తన పరిస్థితిని వివరించాడు. చలించిన ఆ ప్రొఫెసర్ దుస్తులు, పుస్తకాలు ఇచ్చి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సిద్దం చేశారు. దాంతో వెనుతిరగకుండా 2010లో హెచ్‌సీయూ ఎంఏ తెలుగులో సీటు సాధించి కృతజ్ఞత చాటుకున్నాడు. పీజీ పూర్తికాగానే రీసెర్చ్ ఫెలోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్)కు ఎంపికై, ఎంఫిల్ అదే యూనివర్సిటీలో పూర్తి చేశాడు. హెచ్‌సీయూ ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు పర్యవేక్షణలో ‘మత్తడి కవిత సంకలనం’పై పరిశోధన పూర్తి చేశాడు. ప్రస్తుతం ఇదే యూనివర్సిటీలో పీహెచ్డీ ద్వితీయ సంవత్సర విద్యార్థిగా కొనసాగుతున్నాడు. నేడు పట్టా ప్రదానం ‘మత్తడి కవిత సంకలనం’పై చేసిన పరిశోధనకుగాను వెంకటేశ్‌కు సెంట్రల్ యూనివర్సిటీ పట్టాను అందించనుంది. ఇన్నాళ్లుగా తాను పడ్డ కష్టాలను పట్టా అందుకుని మరిచిపోతానని వెంకటేశ్ చెబుతున్నాడు. అనాథనని బాధ పడకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే.. కష్టాలు కూడా తలవంచి విజయాన్ని అందిస్తుందని వెంకటేశ్ నిరూపించాడు. చదువులోనే కాక ఉత్తమ మిమిక్రీ కళాకారుడిగా, గాయకుడిగా రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చాడు. భవిష్యత్తులో అనాథాశ్రమం స్థాపించి తనలాంటి వారికి సాయపడాలన్నదే తన లక్ష్యమని వెంకటేశ్ చెమర్చిన కళ్లతో తన గతాన్ని.. మనోగతాన్ని చెప్పుకొచ్చాడు. -
టెన్త్ నుంచి పీహెచ్డీ వరకు.. ఆన్లైన్లో సర్టిఫికెట్లు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి నుంచి పీహెచ్డీ) వరకు సర్టిఫికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇటీవల ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకు చాలామంది అభ్యర్థులు నకిలీ సర్టిఫికెట్లతో వచ్చినట్లు బయటపడింది. దీంతో వీటి నిరోధానికి చర్యలు చేపట్టాలని వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయగా, ఆయన పోలీసు విచారణకు ఆదేశించారు. మరోవైపు టీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వివిధ వర్సిటీల వీసీలతో మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. నకిలీ సర్టిఫికెట్లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ వెబ్‌సైట్‌తోపాటు తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో సర్టిఫికెట్లను ఉంచాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ నకిలీ సర్టిఫికెట్లను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 7, 8 తేదీల్లో మరోసారి అధికారులు, వీసీలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహిస్తామన్నారు. తెలంగాణకు వేరుగా ఇంటర్ పరీక్షలు కాగా రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను ఏపీతో సంబంధం లేకుండా వేరుగా ప్రశ్నపత్రాలు ఇచ్చి నిర్వహిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. -
విద్యకు వెలుగు రేఖలు..ఉపకార వేతనాలు
విద్య.. మనిషి ఉన్నతికి మార్గాన్ని చూపిస్తుంది.. వెలుగు రేఖలను సొంతం చేస్తుంది.. అటువంటి మహోన్నత అస్త్రాన్ని అందరికి చేరువ చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రోత్సాహకాలను అందజేస్తుంది.. ముఖ్యంగా విద్య, ఉద్యోగాల్లో మైనార్టీల ప్రాతినిధ్యాన్ని పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ పలు రకాల స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది.. వాటి వివరాలు.. మన దేశంలో ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్స్, జోరాస్టియన్స్ (పార్శీలు)లను మైనార్టీలుగా పరిగణిస్తారు. వీరికి పాఠశాల విద్య నుంచి పీహెచ్డీ వరకు అన్నీ రకాల కోర్సులకు స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. ట్యూషన్ ఫీజుకు మాత్రమే పరిమితం కాకుండా మెయింటెనెన్స్ ఖర్చులు, అడ్మిషన్ ఫీజులు కూడా చెల్లిస్తున్నారు. అంతేకాకుండా విద్య, ఉద్యోగాల కోసం శిక్షణ వంటి అవసరాలతోపాటు విదేశాల్లో ఉన్నత విద్యకు కూడా చేయూతనిస్తున్నారు. తక్కువ వడ్డీకి రుణాలను కూడా ఇస్త్తున్నారు. ప్రీ-మెట్రిక్ స్కాలర్షిప్ ఎవరికి: ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థుల కోసం స్కాలర్షిప్ కింద ప్రవేశ రుసుం (అడ్మిషన్ ఫీజు), ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు. ట్యూషన్ ఫీజు కింద 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ. 350, మెయింటెనెన్స్ అలవెన్స్ కింద నెలకు రూ.100, 6 నుంచి 10వ తరగతి హాస్టలర్స్‌కు నెలకు రూ.600, అడ్మిషన్ ఫీజు కింద 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏడాదికి రూ. 500 చెల్లిస్తారు. మొత్తం స్కాలర్షిప్లో 30 శాతం బాలికలకు కేటాయించారు. అర్హత: తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.లక్ష వరకు ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కంటే కుటుంబ స్థాయికి ప్రాధాన్యతనిస్తారు. వివరాలకు పాఠశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని సంప్రదించాలి. వెబ్సైట్:www.minorityaffairs.gov.in మెరిట్-కమ్-మీన్స్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కోసం ఆన్లైన్ స్కాలర్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్ (osms)ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్: www.momascholorship.gov.in పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్, మెరిట్-కమ్-మీన్స్ స్కాలర్షిప్, మౌలానా ఆజాద్ నేషనల్ ఫెలోషిప్ నిర్వహణా పథకాల కింద విద్యార్థుల బ్యాంక్ అకౌంట్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా స్కాలర్షిప్ మొత్తాన్ని జమ చేస్తారు. టోల్ ఫ్రీ నెంబర్: 1800-11-2001 పోస్ట్-మెట్రిక్ స్కాలర్షిప్ ఎవరికి: 11వ తరగతి నుంచి పీహెచ్డీ వరకు చదువుతున్న విద్యార్థుల కోసం అర్హత: తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.3 లక్షల వరకు ఉండాలి. స్కాలర్షిప్ కింద ప్రవేశ రుసుం (అడ్మిషన్ ఫీజు), ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు. స్కాలర్షిప్లో 30 శాతం బాలికలకు కేటాయించారు. మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత వివరాలను పాఠశాల ప్రిన్సిపల్ లేదా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారిని సంప్రదించాలి. వివరాలకు: www.minorityaffairs.gov.in మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌తోపాటు విద్యాభివృద్ధి కోసం కృషి చేస్తున్న సంస్థలకు సహాయాన్ని కూడా అందజేస్తుంది. వివరాలు.. మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్షిప్: మైనారిటీ వర్గానికి చెందిన బాలికల్లో విద్యను ప్రోత్సహించే ఉద్దేశంతో మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే సంస్థ) ‘మౌలానా ఆజాద్ నేషనల్ స్కాలర్షిప్ స్కీమ్’ను ప్రవేశపెట్టింది. ఈ స్కాలర్షిప్ 11వ తరగతి చదువుతున్న బాలికల కోసం ఉద్దేశించింది. స్కాలర్షిప్ మొత్తం రూ.12,000. రెండు విడతలుగా 11వ తరగతి లో రూ.6,000, 12వ తరగతితో రూ.6,000 అందిస్తారు. అర్హత: 55 శాతం మార్కులతో ఎస్ఎస్సీ (10వ తరగతి) ఉత్తీర్ణత. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. లక్షకు మించరాదు. 11వ తరగతిలో చేరినట్లు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ ధ్రువీకరించిన అడ్మిషన్ స్లిప్. చదువుతున్న ఇన్స్టిట్యూట్కు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. విద్యా సంబంధమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎన్జీవోలకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ ఇవ్వడం తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.లక్ష వరకు ఉన్న 11, 12వ తరగతుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థినిల కోసం స్కాలర్షిప్స్ వివరాలకు: www.maef.nic.in ఎన్ఎండీఎఫ్సీ రుణాలు ఎన్ఎండీఎఫ్సీ నుంచి 3 శాతం వడ్డీరేటుతో రూ. 20 లక్షల వరకు విద్యా రుణం అందజేస్తారు. అత్యధికంగా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులకు ఐదేళ్ల వరకు ఏడాదికి రూ. 2 లక్షల చొప్పున రూ. 10 లక్షలను అందజేస్తారు. ఏడాది వ్యవధి ఉండే నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) ప్రోగ్రామ్‌లకు రూ. 3 లక్షలు, విదేశాల్లో చదవాలనుకునే ఔత్సాహికులకు ఐదేళ్లపాటు ఏడాదికి రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. రూ. 50 వేలకు ఏడాదికి 5 శాతం వడ్డీ, రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు 6 శాతం వడ్డీ, రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 3 శాతం వడ్డీ విధిస్తారు. పడో ప్రదేశ్ పథకం విదేశాల్లో మాస్టర్స్, ఎంఫిల్, పీహెచ్డీ స్థాయి కోర్సులను అభ్యసించే విద్యార్థు కోసం తీసుకున్న విద్యా రుణానికి వడ్డీ సబ్సిడీ ఇస్తారు. ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) అందజేస్తున్న విద్యా రుణ పథకంతో ఈ వడ్డీ సబ్సిడీని అనుసంధానిస్తారు. ఇందుకోసం విదేశీ వర్సిటీల్లో మాస్టర్స్, ఎంఫిల్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొంది ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ. 6 లక్షలకు మించరాదు. వివరాలకు: www.minorityaffairs.gov.in ఎన్ఎండీఎఫ్సీ రుణాలు ఎన్ఎండీఎఫ్సీ నుంచి 3 శాతం వడ్డీరేటుతో రూ. 20 లక్షల వరకు విద్యా రుణం అందజేస్తారు. అత్యధికంగా టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులకు ఐదేళ్ల వరకు ఏడాదికి రూ. 2 లక్షల చొప్పున రూ. 10 లక్షలను అందజేస్తారు. ఏడాది వ్యవధి ఉండే నైపుణ్యాభివృద్ధి (స్కిల్ డెవలప్మెంట్) ప్రోగ్రామ్‌లకు రూ. 3 లక్షలు, విదేశాల్లో చదవాలనుకునే ఔత్సాహికులకు ఐదేళ్లపాటు ఏడాదికి రూ. 4 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షలు మంజూరు చేస్తారు. రూ. 50 వేలకు ఏడాదికి 5 శాతం వడ్డీ, రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు 6 శాతం వడ్డీ, రూ. 3 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు 3 శాతం వడ్డీ విధిస్తారు. మౌలానా ఆజాద్ జాతీయ ఫెలోషిప్ ఎవరికి: ఎంఫిల్, పీహెచ్డీ వంటి ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎంఫిల్‌కు రెండేళ్లు, ఎంఫిల్+పీహెచ్‌డీకి కలిపి ఐదేళ్లపాటు ఫెలోషిప్ అందజేస్తారు. ఈక్రమంలో జేఆర్ఎఫ్ అభ్యర్థులకు రూ. 16 వేలు, ఎస్ఆర్ఎఫ్ అభ్యర్థులకు రూ. 18 వేలు చెల్లిస్తారు. సబ్జెక్ట్ననుసరించి రూ. 10 వేల నుంచి రూ. 25 వేలకు కంటింజెన్సీ ఫండ్, రీడర్ అసిస్టెన్స్, డిపార్ట్మెంట్ అసిస్టెన్స్ వంటి సదుపాయాలు కూడా మంజూరు చేస్తారు. అర్హత: 50 శాతం మార్కులతో పోస్ట్‌గ్రాడ్యుయేషన్. కేవలం ఫెలోషిప్ కోసం నెట్/స్లెట్‌లో అర్హత సాధించాల్సిన అవసరం లేదు. జేఆర్ఎఫ్/ఎస్ఆర్ఎఫ్నకు మాత్రం యూజీసీ నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా 756 ఫెలోషిప్‌లు అందజేస్తారు. వీటిని రాష్ట్రాల వారీగా కేటాయిస్తారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి. ఇందులో 30 శాతం ఫెలోషిప్లను మహిళలకు కేటాయించారు. వివరాలకు: www.ugc.ac.in నయా సవేరా ఉచిత కోచింగ్ అనుబంధ పథకం ఈ పథకం కింద వివిధ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు చేయూతను అందజేస్తారు. వివరాలు.. ఉపాధి దిశగా నాలెడ్జ్ నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. ఈ క్రమంలో గ్రూప్-ఎ, బి, సి ఉద్యోగ నియామక పరీక్షల కోచింగ్ ఫీజు, స్టైపెండ్ చెల్లిస్తారు. ఈ క్రమంలో గ్రూప్-ఎ, బి సర్వీస్ పరీక్షలు, వివిధ టెక్నికల్/ ప్రొఫెషనల్ ప్రవేశ పరీక్షలు, ప్రైవేట్ ఉద్యోగాల కోసం శిక్షణ/ కోచింగ్ ఫీజు కింద రూ. 20 వేలు, నెలకు రూ. 3 వేలు (స్థానిక అభ్యర్థులకు రూ. 1500) స్టైపెండ్ చెల్లిస్తారు. గ్రూప్-సి సర్వీస్‌కు కోచింగ్ ఫీజు కింద రూ. 15 వేలు, రూ. 3 వేల స్టైపెండ్ ఇస్తారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 11,12 తరగతుల్లో సైన్స్స్ట్రీమ్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలను అందజేస్తారు. మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో అర్హత పరీక్షలో 76 శాతం మార్కులు సాధించిన విద్యార్థులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ.3 లక్షల వరకు ఉండాలి. ఎంపిక చేసిన కోచింగ్ ఇన్స్టిట్యూట్ల సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా పొందొచ్చు. వివరాలకు: www.minorityaffairs.gov.in నయీ ఉడాన్ ఈ పథకం కింద యూపీఎస్సీ/ఎస్ఎస్సీ/రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తదితర సంస్థలు పూర్తి చేసిన పరీక్షల్లో ప్రిలిమ్స్ దశను దాటిన అభ్యర్థులకు 100 శాతం ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రులు/ సంరక్షకుల వార్షికాదాయం రూ. 4.50 లక్షలకు మించరాదు. ఎంపిక చేసుకున్న సర్వీస్‌ను బట్టి ఆర్థిక సహాయం అందజేస్తారు. గెజిటెడ్ హోదా ఉన్న పోస్టులకు రూ. 50 వేలు, నాన్ గెజిటెడ్ పోస్టులకు రూ. 25 వేలు అందజేస్తారు. మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్షిప్ ఎవరికి: అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో ప్రొఫెషనల్ లేదా టెక్నికల్ కోర్సులు చదువుతున్న విద్యార్థుల కోసం దేశ వ్యాప్తంగా 20 వేల స్కాలర్షిప్లను అందజేస్తారు. ఇందుకోసం రాష్ట్ర జనాభాను ఆధారంగా తీసుకుంటారు. అర్హత: విద్యార్థులు సెకండరీ/గ్రాడ్యుయేషన్ స్థాయిలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.తల్లిదండ్రులు లేదా సంరక్షకుల వార్షికాదాయం రూ. 2.50 లక్షల లోపు ఉండాలి. ఎంపిక: మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.స్కాలర్షిప్ కింద ఆర్థిక సహాయం, మెయింటెనెన్స్ అలవెన్స్ చెల్లిస్తారు.మెయింటెనెన్స్ కింద హాస్టలర్స్‌కు నెలకు రూ. 1,000 (10 నెలలపాటు), డే స్కాలర్స్‌కు రూ. 500 (10 నెలలపాటు) అందజేస్తారు. కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ. 20 వేలు మంజూరు చేస్తారు. జాబితాలోని 85 విద్యాసంస్థల్లో కోర్సు ఫీజును పూర్తిగా రీయింబర్స్మెంట్ చేస్తారు. వివరాలకు: www.minorityaffairs.gov.in -
ఫ్యాక్షన్ గ్రామాల్లో ముందు జాగ్రత్తలు
నరసరావుపేట టౌన్ గ్రామాల్లో చోటుచేసుకుంటున్న ఫ్యాక్షన్ గొడవలు పునరావృతం కాకుండా ముందస్తుచర్యలు తీసుకోవాలని రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ అధికారులను ఆదేశించారు. శనివారం రాత్రి స్థానిక డీఎస్పీ కార్యాలయంలో నరసరావుపేట పోలీస్ డివిజన్లోని అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో గొడవలకు పాల్పడేవారు, గొడవలకు ఉసిగొల్పే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. డివిజన్లో ముఠాతగాదాలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాని చెప్పారు. సర్కిల్ పోలీస్స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు తెలుసుకొని వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. కేసుల విషయంలో అధికారులు పాటించాల్సిన, తీసుకోవాల్సిన అంశాలపై పలుసూచనలు చేశారు. సమావేశంలో ఇన్చార్జి డీఎస్పీ వెంకటయ్య, సీఐలు ఎం.వి. సుబ్బారావు, బి.కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, సంజీవ్‌కుమార్, చెంచుబాబు, శ్రీకాంత్‌బాబు, మల్లయ్య, ఎస్ఐలు లోక్‌నాథ్, రమేష్, సాంబశివరావు, కట్టా ఆనంద్, సురేష్‌బాబు, జగదీష్‌లతోపాటు డివిజన్లోని మిగిలిన స్టేషన్ల సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నేరగాళ్లపై ఉక్కుపాదం పిడుగురాళ్ల:హత్యలు, దాడులు, ఇతర నేరాలకు పాల్పడేవారు ఎంతటివారైనా సహించేంది లేదని రూరల్ జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ స్పష్టం చేశారు. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో జరుగుతున్న హత్యలు, దాడుల సంఘటనల నేపథ్యంలో శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలోని ఓఎస్డీ కార్యాలయంలో సత్తెనపల్లి, గురజాల పోలీస్డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమావేశం నిర్వహించి సమీక్షంచారు. అనంతరం ఎస్పీ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాధారణ ఎన్నికల తర్వాత పల్నాడు ప్రాంతంలో జరిగిన హత్యలు, దాడుల ఘటనలు కేవలం చిన్నచిన్న భూవివాదాల నేపథ్యంలో చోటుచేసుకున్నాయన్నారు. ఇటీవల బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో జరిగిన హత్య మాత్రమే కొంతమేర రాజకీయహత్యగా భావించాల్సి వస్తుందన్నారు. చిన్న చిన్న వివాదాలు ఘర్షణలు నివారించేందుకు త్వరలోనే ప్రీ లిటిగేషన్ కౌన్సెలింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెవెన్యూ, పోలీసు, లీగల్‌సెల్ అథారిటీ, పట్టణాల్లో మున్సిపల్ అధికారులతో ఒక కమిటీని ఏర్పాటుచేసి రెండువైపుల వారికీ నచ్చజెప్పి రాజీ చేయడం, ఒకవేళ రాజీ పడని పక్షంలో వెంటనే బైండోవర్ లేదా ఇతరత్రా కేసులు పెట్టేవిధంగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండు రోజుల్లో ఆయా గ్రామాల్లో శాంతి కమిటీల ఏర్పాటుకు నిర్ణయించినట్లు తెలిపారు. కారంపూడి మండలం చినగార్లపాడులో జరిగిన హత్య కేసుతోపాటు ఇతర కేసుల్లో నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. సమావేశంలో సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలు వెంకటేశ్వరనాయక్, ఇంజారపు పూజ, సత్తెనపల్లి, పిడుగురాళ్ల సీఐలు యు.శోభన్‌బాబు, వై.శ్రీధర్‌రెడ్డి, ఇతర సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.