
లవర్స్‌పై పీహెచ్‌డి
ఈ ప్రపంచంలో ప్రేమలో పడనివాళ్లు అరుదుగా ఉంటారు. ఆ ప్రేమికులపై పీహెచ్‌డి చేస్తాడు ఓ కుర్రాడు. అసలు లవర్స్ పైనే పీహెచ్‌డి ఎందుకు చేయాలనుకున్నాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ప్రేమికులపై పీహెచ్‌డి’. ఆదిత్య, సోనాలి జంటగా కోట మునీష్ దర్శకత్వంలో లక్ష్మీశ్రీవాస్తవ నిర్మించిన గఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. కుటుంబ సమేతంగా చూసే విధంగా ఈ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించామనీ, జనవరి మొదటి వారంలో విడుదల చేస్తామనీ నిర్మాత చెప్పారు. ప్రేక్షకులకు తమ ప్రేమను గుర్తు చేసే సినిమా ఇదనీ, రమేశ్ ముక్కెర స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభిస్తోందనీ దర్శకుడు తెలిపారు.