తెలుగు విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ, ఎంఫీల్ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ కావడం కలకలం రేపింది. రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించిన కామన్ పేపర్ లీకైంది. గురువారం పరీక్ష కేంద్రానికి వచ్చిన ఓ విద్యార్థి 50 ప్రశ్నలకు చేతిపై సమాధానాలు రాసుకొని రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.