జేఎన్‌టీయూ : జేఎన్‌టీయూ అనంతపురం ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్స్‌ట్రర్నల్ పీహెచ్‌డీ, అనుబంధ ఇంజినీరింగ్ కంగీళాశాలల్లోని రీసెర్చ్ సెంటర్లలో పీహెచ్‌డీ ప్రవేశాలకు నిర్వహించే రాత పరీక్ష ఆదివారం సజావుగా నిర్వహించినట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ఆచార్య విజయ్‌కుమార్ తెలిపారు. ఫిజిక్స్‌కు సంబంధించి 34 మంది అభ్యర్థులు, ఇంగ్లిషు 48, సీఎస్‌ఈ 696, కెమిస్ట్రి 46, ఈసీఈ 617, మేనేజ్‌మెంట్ 99, మెకానికల్ 584, సివిల్ 187, ఈసీఈ 453, మేథమేటిక్స్ 62, ఫార్మసీ 220 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని వర్సిటీ రిజిస్ట్రార్ ఎస్ . కృష్ణయ్య పరిశీలించారు.