ఐఐఎస్‌ఈఆర్‌లో పీహెచ్‌డీ...
ఎంబీఏ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్) కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -చంద్రా, జడ్చర్ల.
అవస్థాపన (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) రంగంలోని సౌకర్యాలు, వాటిని నిర్వహించడం సంబంధిత అంశాలను వివరించే కోర్సు ఎంబీఏ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్‌మెంట్). సివిల్ ఇంజనీర్లకు లేదా నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న వారికి ఈ కోర్సు ఉపయోగకరం.
ఈ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
వెబ్‌సైట్: www.teriuniversity.ac.in
సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్‌మెంట్-పుణే
వెబ్‌సైట్: www.scmhrd.edu
సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ-అహ్మదాబాద్
వెబ్‌సైట్: www.cept.ac.in
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్)-పుణే నుంచి కెమిస్ట్రీలో పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నాను. వివరాలు తెలియజేయగలరు? - రక్షిత్, కోదాడ.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, పుణే.. బేసిక్ సెన్సైస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను ఆఫర్ చేస్తుంది. ఇందులో బయలాజికల్/ లైఫ్ సెన్సైస్; కెమికల్ సెన్సైస్; మ్యాథమెటికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. కెమికల్ సెన్సైస్‌లో పీహెచ్‌డీ చేయాలనుకుంటే ఫిజికల్, ఇనార్గానిక్, ఆర్గానిక్ విభాగాల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. అర్హత: కెమిస్ట్రీ/ఫిజిక్స్/బయోకెమిస్ట్రీ/మెటీరియల్ సైన్స్/ బయోఇన్ఫర్మాటిక్స్/ఫార్మసీలో ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సును పూర్తిచేసి ఉండాలి. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీలకు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి. కింది అర్హతల్లో తప్పనిసరిగా ఏదో ఒకటి ఉండాలి.
సీఎస్‌ఐఆర్ నెట్-జేఆర్‌ఎఫ్ లేదా డీబీటీ-జేఆర్‌ఎఫ్-ఏ లేదా ఐసీఎంఆర్-జేఆర్‌ఎఫ్.
సీఎస్‌ఐఆర్-ఎల్‌ఎస్ లేదా డీఏఈ-జెస్ట్ లేదా గేట్‌లో తగిన స్కోర్.
ఐఐఎస్‌ఈఆర్ బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు.
వెబ్‌సైట్: www.iiserpune.ac.in
ఐఐటీ-ఖరగ్‌పూర్ అందిస్తున్న బ్యాచిలర్ ఆఫ్ లా (ఆనర్స్-ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) కోర్సు వివరాలను తెలపండి?
-మధు, మహబూబాబాద్.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- ఖరగ్‌పూర్‌లోని రాజీవ్ గాంధీ స్కూల్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా, బ్యాచిలర్ ఆఫ్ లా (ఆనర్స్- ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) కోర్సును అందిస్తుంది. ఇది మూడేళ్ల కోర్సు. ఇందులో సెమిస్టర్ విధానాన్ని అనురిస్తారు. అర్హత: ప్రథమ శ్రేణి మార్కులతో డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/ మెడిసిన్/తత్సమానం లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైన్స్/ఫార్మసీ/తత్సమానం లేదా ఎంబీఏ (బ్యాచిలర్ స్థాయిలో ఇంజనీరింగ్/ మెడిసిన్/ తత్సమానం లేదా మాస్టర్స్ స్టాయిలో సైన్స్/ ఫార్మసీ/ తత్సమానం కోర్సులను చదివి ఉండాలి). ప్రవేశ ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ముందుగా ఇన్‌స్టిట్యూట్ జాతీయ స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష/ఎల్‌సాట్ ఇండియా/ ఎల్‌సాట్ గ్లోబల్ పరీక్షల స్కోర్ ద్వారా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీరికి తర్వాతి దశలో వరుసగా గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్షలో ఇంగ్లిష్ (40 మార్కులు), లాజికల్ రీజనింగ్ (20 మార్కులు), మ్యాథమెటికల్ ఎబిలిటీ (15 మార్కులు), బేసిక్ సైన్స్ (35 మార్కులు), లీగల్ ఆప్టిట్యూడ్ (60 మార్కులు), ఎస్సే (30 మార్కులు) అంశాలు ఉంటాయి.
ఈ తరహా కోర్సును అందిస్తున్న ఇతర సంస్థలు:
నల్సార్ యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.nalsarpro.org
నేషనల్ లా యూనివర్సిటీ-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.nludelhi.ac.in
నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా-బెంగళూరు
వెబ్‌సైట్: www.nls.ac.in
ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ అంటే ఆసక్తి. ఈ సబ్జెక్టులో పీజీ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి?
- -సురేష్, మెదక్.
పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ అంశాలను ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ వివరిస్తుంది. కోర్సులో కాలుష్య నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ ప్రణాళిక, మోడలింగ్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ క్వాలిటీ, బయోటెక్నాలజీ తదితర అంశాలుంటాయి.
కోర్సుల వివరాలు:
ఆంధ్రా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విశాఖపట్నం.. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఎంఈ కోర్సును అందిస్తుంది.అర్హత: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ లేదా సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా కోర్సులో ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి.. ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను ఆఫర్ చేస్తుంది.అర్హత: బీఈ/ బీటెక్/ సివిల్ ఇంజనీరింగ్‌లో ఏఎంఐఈ. గేట్ లేదా పీజీఈసెట్‌లో ప్రతిభ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.వెబ్‌సైట్: www.svuniversity.in
కెరీర్: ఎన్విరాన్‌మెంటల్‌లో ఎంఈ లేదా ఎంటెక్ పూర్తిచేసినవారు పరిశోధన సంస్థల్లో చేరొచ్చు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాల్లో ఉన్నత ఉద్యోగావకాశాలను పొందొచ్చు. స్వచ్ఛంద సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు సంస్థల సీఎస్‌ఆర్ విభాగాల్లోనూ అవకాశాలుంటాయి.