Bhavitha
-
నీట్ కౌన్సెలింగ్.. ఇలా!
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్.. సంక్షిప్తంగా నీట్–యూజీ! దేశ వ్యాప్తంగా.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పరీక్ష! కొద్దిరోజుల క్రితమే నీట్ యూజీ–2024 ఫలితాలు వెల్లడయ్యాయి. మరోవైపు ఈ పరీక్షపై వివాదం కొనసాగుతున్నా.. నీట్ కౌన్సెలింగ్‌కు సన్నాహాలు మొదలయ్యాయనే వార్తలు! ఈ నేపథ్యంలో నీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా సీట్ల భర్తీ విధానం.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సీట్ల భర్తీ తీరు, నీట్ ర్యాంకర్లు కౌన్సెలింగ్‌కు సిద్ధం చేసుకోవాల్సిన పత్రాలు తదితర అంశాలపై విశ్లేషణ..‘నీట్ యూజీ–2024 ఫలితాలపై ఆందోళనలు జరుగుతున్నా.. మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశాలు తక్కువే. కాబట్టి నీట్ ఉత్తీర్ణులు ఫలితాలపై వస్తున్న వార్తల జోలికి వెళ్లకుండా.. కౌన్సెలింగ్‌కు సిద్ధమవ్వాలి’ అంటున్నారు నిపుణులు. పెరుగుతున్న సీట్లు⇒ నేషనల్ మెడికల్ కమిషన్ గణాంకాల ప్రకారం–దేశ వ్యాప్తంగా మొత్తం 783 ఎంబీబీఎస్ కళాశాలల్లో 1,61,220 సీట్లు ఉన్నాయి. వీటిలో 331 ప్రైవేట్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీలు ఉండగా.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య 74,703. అదేవిధంగా నీట్ స్కోర్‌తోనే భర్తీ చేసే బీడీఎస్ కోర్సులో 28,088 సీట్లు, ఆయుష్ కోర్సుల్లో 52,720 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ⇒ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో.. ప్రస్తుతం 16 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,935 ఎంబీబీఎస్ సీట్లు; మరో 16 ప్రైవేట్ కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయి. రెండు మైనారిటీ కళాశాలల్లో 300 సీట్లు; స్వయం ప్రతిపత్తి కలిగిన శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 175 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి.. రెండు ప్రభుత్వ డెంటల్ కళాశాలల్లో 140 సీట్లు; 14 ప్రైవేట్ కళాశాలల్లో 1,300 సీట్లు చొప్పున ఉన్నాయి.⇒ తెలంగాణ రాష్ట్రంలో.. ఎంబీబీఎస్‌కు సంబంధించి 27 ప్రభుత్వ కళాశాలల్లో 3,790 సీట్లు; 29 ప్రైవేట్, మైనారిటీ కళాశాల్లో 4,700 సీట్లు ఉన్నాయి. బీడీఎస్‌కు సంబంధించి ఒక ప్రభుత్వ కళాశాలలో 100 సీట్లు; పది ప్రైవేట్ కళాశాలల్లో 1,000 సీట్లు; వీటికి అదనంగా సికింద్రాబాద్ ఆర్మీ డెంటల్ కళాశాలలో ఆరు సీట్లు ఉన్నాయి.పేరున్న కళాశాలలో సీటుప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఆల్ ఇండియా స్థాయిలో రిజర్వ్డ్ కేటగిరీలో రెండు లక్షల వరకు ర్యాంకు వరకూ సీట్లు పొందే అవకాశముందని అంచనా. పేరున్న ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు సొంతం చేసుకోవాలంటే మాత్రం జాతీయ స్థాయిలో 40 వేల లోపు ర్యాంకుతోనే సాధ్యమని చెబుతున్నారు.కౌన్సెలింగ్.. ఏఐక్యూ, స్టేట్ కోటానీట్ యూజీ కౌన్సెలింగ్‌ను రెండు విధానాల్లో నిర్వహించి సీట్ల భర్తీ చేపడతారు. అవి.. ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా. ఆల్ ఇండియా కోటా సీట్ల భర్తీని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. రాష్ట్ర కోటాకు సంబంధించి.. రాష్ట్రాల వైద్య విశ్వ విద్యాలయాలు కౌన్సెలింగ్ నిర్వహిస్తాయి.ఆల్ ఇండియా కోటాజాతీయ స్థాయిలోని మెడికల్ కళాశాలలను నేషనల్ పూల్‌లోకి తీసుకెళ్లినప్పటì æనుంచి ఆల్ ఇండియా కోటా పేరుతో కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ విధానం ప్రకారం.. జాతీయ స్థాయిలోని అన్ని మెడికల్, డెంటల్ కళాశాలలు, యూనివర్సిటీల్లోని 15 శాతం సీట్లకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. దీనిని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డీజీహెచ్ఎస్కు చెందిన మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ చేపడుతుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు తప్పనిసరిగా ఎంసీసీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఆల్ ఇండియా కోటా విధానంలో ఒక రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని వైద్య కళాశాలలకు కూడా పోటీ పడే అవకాశం లభిస్తుంది.స్టేట్ కోటా కౌన్సెలింగ్జాతీయ స్థాయిలో ఎంసీసీ కేవలం 15 శాతం సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. మిగతా 85 సీట్లను ఆయా రాష్ట్రాలు సొంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేస్తాయి. ప్రభుత్వ కళాశాలల్లోని 85 శాతం సీట్లు(ఆల్ ఇండియా కోటాకు కేటాయించాక మిగిలిన సీట్లు), ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా పేరుతో అందుబాటులో ఉండే 50 శాతం సీట్లను.. అదే విధంగా ప్రైవేట్ కళాశాలల్లో ప్రైవేట్–బి పేరిట ఉండే 35 శాతం సీట్లు, ఎన్ఆర్ఐ కోటాగా పిలిచే 15 శాతం సీట్లను కూడా హెల్త్ యూనివర్సిటీలే కౌన్సెలింగ్ విధానంలో భర్తీ చేస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. మైనారిటీ కళాశాలల్లో అందుబాటులో ఉండే సీట్లను కూడా ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియను కూడా హెల్త్ యూనివర్సిటీలే చేపడతాయి.ఫీజులు ఇలా⇒ ఏపీలో ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ పేరిట ఉండే కన్వీనర్ కోటాలో రూ.15 వేలు ఫీజుగా నిర్ధారించారు. ప్రైవేట్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా కేటగిరీ–బి సీటుకు రూ.12 లక్షలు; పైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(కేటగిరీ–సి) సీట్లకు: రూ.36 లక్షలుగా పేర్కొన్నారు. బీడీఎస్ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ కళాశాలలు, ప్రైవేట్ కళాశాలల్లో కేటగిరీ–ఎ కన్వీనర్ కోటా సీట్లకు ఫీజు రూ.13 వేలు; ప్రైవేట్ కళాశాలల్లోని కేటగిరీ–బి మేనేజ్మెంట్ సీట్లకు రూ.4 లక్షలు, ఎన్ఆర్ఐ కోటా సీట్లకు రూ.12 లక్షలు వార్షిక ఫీజుగా ఉంది. ⇒ తెలంగాణలో ప్రభుత్వ కళాశాలల్లో సీటుకు రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీటుకు రూ.60 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీటుకు రూ.11.55 లక్షలు–రూ.13 లక్షలుగా ఫీజు ఉంది. అదే విధంగా.. ప్రైవేట్ కళాశాలల్లో ఎన్ఆర్ఐ కోటా(సి–కేటగిరీ) సీటు ఫీజు బి కేటగిరీ సీటుకు రెండు రెట్లుగా ఉంది. బీడీఎస్ కోర్సులో.. ప్రభుత్వ కళాశాలల్లో రూ.10 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో ఎ–కేటగిరీ(కన్వీనర్ కోటా) సీట్లు: రూ.45 వేలు; ప్రైవేట్ కళాశాలల్లో బి–కేటగిరీ(మేనేజ్మెంట్ కోటా) సీట్లు: రూ.4.2 లక్షలు – రూ.5 లక్షలు చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో సి–కేటగిరీ(ఎన్ఆర్ఐ కోటా) సీటుకు బి కేటగిరీ సీటుకు 1.25 రెట్లు సమానమైన మొత్తం ఫీజుగా ఉంది. ⇒ ఈ ఫీజుల వివరాలు 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించినవిగా గుర్తించాలి. కౌన్సెలింగ్ సమయానికి వీటిలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది.ఏఐక్యు.. కౌన్సెలింగ్ విధానమిదే⇒ విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు ఇప్పటి నుంచే సంసిద్ధంగా ఉండాలి. జాతీయ స్థాయిలోని సీట్లకు పోటీ పడాలనుకునే విద్యార్థులు.. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహించే ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావాలి. ఇందుకోసం ఎంసీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉండే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి.. ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ ఐడీ, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం ఆన్లైన్ అప్లికేషన్లో ఉండే అన్ని వివరాలను నమోదు చేయాలి. ⇒ ఆ తర్వాత అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలు కనిపిస్తాయి. వాటికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలను పేర్కొంటూ.. ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేయాలి. ఆ తర్వాత రౌండ్ల వారీగా సీట్ అలాట్మెంట్ వివరాలను వెల్లడిస్తారు. ⇒ తొలి రౌండ్లో సీట్ అలాట్మెంట్ పొందిన అభ్యర్థులు సదరు కళాశాలలో చేరాలనుకుంటే.. నిర్దేశిత మొత్తాన్ని రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ⇒ తొలి రౌండ్లో సీటు వచ్చిన కళాశాలలో చేరడం ఇష్టం లేకుంటే.. ఫ్రీ ఎగ్జిట్ అవకాశం అందుబాటులో ఉంది. వీరు రెండో రౌండ్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వచ్చు. ⇒ తొలి రౌండ్ కౌన్సెలింగ్‌లోనే సీటు లభించి ఫీజు చెల్లించిన అభ్యర్థులు మరింత మెరుగైన సీటు కోసం తదుపరి రౌండ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంది.స్టేట్ కోటాకు ప్రత్యేక కౌన్సెలింగ్రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే స్టేట్ కోటా సీట్ల కౌన్సెలింగ్‌కు విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఎంసీసీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ముగిసిన తర్వాత హెల్త్ యూనివర్సిటీలు ప్రత్యేకంగా నోటిఫికేషన్ విడుదల చేస్తాయి. ఈ కౌన్సెలింగ్ కూడా పలు రౌండ్లలో జరుగుతుంది. స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించి వారికి వచ్చిన ఆల్ ఇండియా ర్యాంకు ఆధారంగా ముందుగా ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ప్రకటిస్తారు. ఈ మెరిట్ లిస్ట్‌లో చోటు సాధించిన అభ్యర్థులు నిర్దేశిత రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించి.. ఆన్లైన్లో జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. తదుపరి రౌండ్ల కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కూడా ఉంటుంది.పూర్తిగా ఆన్లైన్హెల్త్ యూనివర్సిటీలు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా ఆన్లైన్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్దేశించిన వెబ్సైట్లో లాగిన్ ఐడీ, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవడం, ఆ తర్వాత నీట్ ర్యాంకు సహా, ఇంటర్మీడియెట్ వరకూ.. అన్ని అర్హతల వివరాలను పేర్కొనడం, ఆన్లైన్ ఛాయిస్ ఫిల్లింగ్ తప్పనిసరి.ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యంనీట్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన అభ్యర్థులు ప్రభుత్వ కళాశాలలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏఎంసీ–విశాఖపట్నం, జీఎంసీ–గుంటూరు, కాకినాడ మెడికల్ కాలేజ్, కర్నూలు మెడికల్ కళాశాలలు ముందు వరుసలో నిలుస్తున్నాయి. తెలంగాణలో.. ర్యాంకర్ల తొలి ప్రాధాన్యం ఉస్మానియా మెడికల్ కళాశాల కాగా ఆ తర్వాత స్థానంలో గాంధీ మెడికల్ కళాశాల, కాకతీయ మెడికల్ కళాశాల, ఈఎస్ఐ మెడికల్ కళాశాల నిలుస్తున్నాయి.ఈ సర్టిఫికెట్లు సిద్ధంగానీట్ కౌన్సెలింగ్ ప్రక్రియ మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు ఇప్పటి నుంచే కౌన్సెలింగ్‌కు అవసరమైన పత్రాలు, సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. అవి.. నీట్ ఎంట్రన్స్ అడ్మిట్ కార్డ్, నీట్ ర్యాంక్ కార్డ్, పుట్టిన తేదీ ధ్రువపత్రం, పదో తరగతి సర్టిఫికెట్, ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సు మార్క్ షీట్, సర్టిఫికెట్, ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వర్టకు స్టడీ సర్టిఫికెట్స్(స్థానికతను నిర్ధారించేందుకు), పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్స్ ఎనిమిది. ఇలా కౌన్సెలింగ్ విధానంతోపాటు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను సిద్ధంగా ఉంచుకుంటే.. కౌన్సెలింగ్ ఎప్పుడు జరిగినా తడబాటులేకుండా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. -
అంతులేని అభిమానం సీఎం జగన్ పై విశాఖ ప్రజలు పూల వర్షం
-
రోల్‌మోడల్ స్టేట్‌గా ఏపీ.. జగనన్నకు థ్యాంక్స్
సాక్షి, విశాఖపట్నం: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించే ‘భవిత’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం పాల్గొన్నారు. పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ధిపై శిక్షణ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశంలో మాట్లాడిన యువత ఏమన్నారంటే.. వారి మాటల్లోనే మధ్య తరగతి కుటుంబం నుంచి.. అందరికీ నమస్కారం.. మాది విశాఖపట్నం పెదగంట్యాడ.. నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాను.. మా నాన్న ఫోర్క్ లిఫ్ట్ ఆపరేటర్. అమ్మ గృహిణి. నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నేను నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్ రంగంలో స్ధిరపడాలని భావించాను. సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు నేర్చుకున్నాను. మాకు అక్కడ మంచి శిక్షణ ఇచ్చారు. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ కూడా నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎన్నికయ్యాను. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో నాలుగు రౌండ్ల ఇంటర్వ్యూ జరిగింది. ఇక్కడ తీసుకున్న శిక్షణ వల్ల ఆ కంపెనీలో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. మా బ్యాచ్‌లో అనేకమంది వివిధ కంపెనీలకు సెలక్ట్ అయ్యారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్మెంట్కు సీడాప్కు అందరికీ కృతజ్ఞతలు. -దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నా.. అందరికీ నమస్కారం.. నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను.. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాప్ట్స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. ఆ తర్వాత 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూకు హాజరయ్యాను, అందులో నేను ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ.5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎగ్జిక్యూటివ్ వన్‌గా ఏడాదికి రూ.7.2 లక్షలు ప్యాకేజ్ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎం గారికి నా కృతజ్ఞతలు. ఏపీ రోల్‌మోడల్ స్టేట్‌గా ఉందని నేను నమ్ముతున్నాను. నాలాగా మరింత మంది యువత ఉపాధి, ఉద్యోగావకాశాలు పొందుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్యూ -భార్గవ్, విశాఖపట్నం ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
స్కూల్ నుంచి కాలేజీల వరకు ఇవే అడుగులు వేస్తున్నాం: సీఎం జగన్
-
భవిత ప్రాముఖ్యత అందుకోసమే.. చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నాం
-
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులు.. వివరాలివిగో..
బిజినెస్ స్కూల్స్.. మరో మాటలో చెప్పాలంటే.. మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్! పీజీ స్థాయిలో ఎంబీఏ, పీజీడీఎం ప్రోగ్రామ్‌ల ద్వారా.. మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విద్యాసంస్థలు! ఇప్పుడు ఈ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. టెక్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో ప్రత్యేకంగా టెక్నికల్ కోర్సులు బోధిస్తున్నాయి. దేశంలో.. ప్రతిష్టాత్మక బీస్కూల్స్ ఐఐఎంలు మొదలు మరెన్నో ప్రముఖ బీస్కూల్స్.. పీజీ ప్రోగ్రామ్స్ కరిక్యలంలో.. టెక్నికల్ సబ్జెక్టులకు ప్రాధాన్యం ఇస్తుండటం నయా ట్రెండ్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. బీస్కూల్స్‌లో టెక్ కోర్సుల బోధనకు కారణాలు.. వాటితో ప్రయోజనాలపై ప్రత్యేక కథనం... సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. సంక్షిప్తంగా స్టెమ్ కోర్సులుగా గుర్తింపు. వీటిని సైన్స్, ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. గత రెండు, మూడేళ్లుగా మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు సైతం ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. డేటా సైన్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌లలో స్టెమ్ కోర్సులను ప్రవేశపెడుతున్న ఇన్స్టిట్యూట్లు ప్రధానంగా.. డేటాసైన్స్, డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం.. కార్పొరేట్ ప్రపంచంలో డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం పెరగడమే! అనలిటిక్స్ ఆధారంగా బిజినెస్ వ్యూహాలు రూపొందించే మేనేజ్మెంట్ నిపుణుల అవసరం నెలకొంది. అనలిటిక్స్ నైపుణ్యాలకు టెక్ స్కిల్స్ పునాదిగా నిలుస్తున్నాయి. దీంతో మేనేజ్మెంట్ విద్యార్థులకే డేటాసైన్స్, డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్పై అవగాహన కల్పిస్తే.. కార్పొరేట్ వర్గాల నుంచి చక్కటి ఆఫర్లు లభిస్తాయని భావిస్తున్నారు. ఏఐ–ఎంఎల్ కూడా ►మేనేజ్మెంట్ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) కూడా బోధిస్తున్నారు. ఇప్పుడు అన్నింటా ముఖ్యంగా వస్తు సేవల్లో.. ఏఐ, ఎంఎల్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఒక ఉత్పత్తి లేదా సర్వీస్‌ను ఏఐ ఆధారంగా రూపొందించాలనుకుంటే.. సదరు నిర్వహణ అధికారులకు దీనిపై అవగాహన ఉండాలి. అంతేకాకుండా కంపెనీల రోజువారీ విధుల్లోనూ ఏఐ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా అకౌంట్స్, ఫైనాన్స్,ప్రొడక్షన్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో.. ఏఐ ఆధారంగా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ►ఏఐ ఆధారంగా..పని భారాన్ని తగ్గించుకోవడమే కాకుండా.. అందుకు అయ్యే వ్యయం కూడా తగ్గించుకోవచ్చు. అదే విధంగా.. సంస్థకు కీలకమైన హెచ్ఆర్ విభాగంలో సైతం నూతన నియామకాలు, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏఐ–ఎంఎల్ ద్వారా దరఖాస్తుల పరిశీలన, అర్హులను గుర్తించడం సులభం అవుతోంది. దీంతో.. మేనేజ్మెంట్ విభాగాల్లో పని చేసే వారికి సైతం టెక్నికల్ నైపుణ్యాలపై పట్టు సాధించాల్సిన ఆశ్యకత నెలకొంది. అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. ఏఐ, ఎంఎల్ వంటి టెక్ స్కిల్స్‌ను బోధిస్తున్నాయి. బిజినెస్ అనలిటిక్స్ మేనేజ్మెంట్ విభాగంలో టెక్నికల్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు.. బిజినెస్ అనలిటిక్స్‌కు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. సంస్థకు సంబంధించి రా మెటీరియల్ సేకరణ నుంచి ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ వరకూ.. అన్ని అంశాలు కంప్యూటరీకరణ జరుగుతోంది. ఒక్కో దశలో ఆయా అంశాల నిర్వహణకు సంబంధించిన విషయాలు(ఖర్చులు, నిర్వహణ వ్యయం, అనుసరించిన విధానం తదితర)ను కంప్యూటర్ ద్వారా విశ్లేషించి మేనేజ్మెంట్ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై స్పష్టతకు రావలసి ఉంటుంది. దీంతో క్షేత్ర స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు ఆవశ్యకంగా మారుతున్నాయి. దీంతో మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ బిజినెస్ అనలిటిక్స్‌ను తమ కరిక్యులంలో భాగంగా చేర్చుతున్నాయి. ప్రత్యేక ప్రోగ్రామ్‌లు సైతం ►మేనేజ్మెంట్ కోర్సుల్లో కొన్ని ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సులను బోధిస్తుండగా.. మరికొన్ని ఇన్స్టిట్యూట్లు పూర్తి స్థాయిలో ప్రత్యేక టెక్ ప్రోగ్రామ్‌లను రూపొందిస్తున్నాయి. ►ఐఐఎం–అహ్మదాబాద్.. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా 16 నెలల అడ్వాన్స్డ్ బిజినెస్ అనలిటిక్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ►ఐఐఎం–బెంగళూరు.. బిజినెస్ అనలిటిక్స్‌లో రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ►ఐఐఎం–కోల్‌కత.. ఏడాది వ్యవధిలో బిజినెస్ అనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తోంది. అదే విధంగా డేటా సైన్సెస్‌లో అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌లో సైతం ప్రవేశం కల్పిస్తోంది. ►ఐఐఎం–కాశీపూర్ కూడా అనలిటిక్స్‌లో ఎంబీఏ ప్రోగ్రామ్‌కు రూపకల్పన చేసింది. ఇతర బీ–స్కూల్స్ కూడా ► ఐఐఎంలే కాకుండా.. దేశంలోని ఇతర ప్రముఖ బీ–స్కూల్స్ కూడా మేనేజ్మెంట్ పీజీ లేదా పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయి. ► ఐఎస్బీ–హైదరాబాద్ బిజినెస్ అనలిటిక్స్‌లో హైబ్రీడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ప్రత్యేక రీసెర్చ్ కేంద్రాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో స్టెమ్ కోర్సులను అందిస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు.. సంబంధిత విభాగాల్లో ప్రత్యేకంగా రీసెర్చ్ కేంద్రాలను కూడా నెలకొల్పుతున్నాయి. ►ఐఐఎం అహ్మదాబాద్ కొద్ది రోజుల క్రితం సెంటర్ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో పరిశోధనలు నిర్వహించి.. వ్యాపారాలకు, పాలనకు, విధాన నిర్ణయాలకు సహకరించడం లక్ష్యంగా చేసుకుంది. ►ఐఐఎం–రాయ్‌పూర్ కూడా సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పేరుతో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, టెక్నాలజీ అడాప్షన్, ఆన్లైన్ సెక్యూరిటీ, డిజిటైజేషన్ స్ట్రాటజీ విభాగాల్లో పరిశోధనల కోసం ప్రత్యేక రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది. కార్పొరేట్ వర్గాలు టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కార్పొరేట్ వర్గాలు సైతం పెద్దపీట వేస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తే.. టెక్, మేనేజ్మెంట్ రెండు నైపుణ్యాలున్న వారి కోసం సంస్థలు అన్వేషణ సాగిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇన్స్టిట్యూట్లు స్టెమ్ కోర్సుల బాట పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 70 శాతం వారే టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ నిపుణులకు కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. టెక్ కంపెనీల నియామకాల్లో సైతం 70 శాతం మేరకు మేనేజ్మెంట్ విద్యార్థులే ఉంటున్నారు. ►జీమ్యాక్ సర్వే ప్రకారం–గత ఏడాది టెక్ ఆధారిత సేవలందిస్తున్న సంస్థల్లో 89 శాతం ఎంబీఏ ఉత్తీర్ణులను నియమించుకున్నాయి. ►మేనేజ్మెంట్ సంస్థల విషయానికొస్తే.. టెక్, మేనేజ్మెంట్ నైపుణ్యాలున్న విద్యార్థులను నియమించుకున్న సంస్థల సంఖ్య 60 శాతంగా నిలిచింది. టెక్.. మేనేజ్మెంట్ ► ఒకవైపు మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు టెక్ కోర్సులను అందిస్తుండగా.. మరోవైపు.. టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు సైతం మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పిస్తుండటం విశేషం. ►ఐఐటీ హైదరాబాద్.. ఎగ్జిక్యూటివ్ ఎంటెక్ ఇన్ డేటాసైన్స్ కోర్సును అందిస్తోంది. ►ఐఐటీ–ఢిల్లీ,ఐఐటీ–కాన్పూర్,ఐఐటీ–ఖరగ్‌పూర్ వంటి ప్రముఖ ఐఐటీలు, ఇతర ఎన్ఐటీలు ఎంటెక్ (సీఎస్ఈ)లో బిగ్ డేటా అనలిటిక్స్ స్పెషలైజేషన్‌తో కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ► వీటితోపాటు పలు ఇతర ఐఐటీలు, మరెన్నో ప్రముఖ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లు ఎంటెక్ స్థాయిలో డేటా అనలిటిక్స్‌ను అందిస్తున్నాయి. ప్రయోజనం ఇప్పుడు కంపెనీలన్నీ ఏఐ బాట పడుతున్నాయి. దీంతో సంస్థల స్థాయిలో సాంకేతిక విభాగాల నుంచి కార్యాలయంలో పని చేసే మేనేజీరియల్ సిబ్బంది వరకూ.. ప్రతి ఒక్కరికి వీటిపై అవగాహన ఉంటేనే సంస్థ లక్ష్యాలు నెరవేరుతాయి. వీటికి అనుగుణంగా అకడమిక్ స్థాయిలోనే టెక్ నైపుణ్యాలు అందిస్తే కెరీర్ పరంగా రాణించగలుగుతారు. అదేసమయంలో కంపెనీలకు అవసరమైన ఎంప్లాయబిలిటీ స్కిల్స్ కూడా లభిస్తాయి. టెక్ కోర్సులు–ముఖ్యాంశాలు ►ఎంబీఏ, పీజీడీఎం స్థాయిలో టెక్ కోర్సులను అందిస్తున్న ఐఐఎంలు, ఇతర ప్రముఖ బీ–స్కూల్స్. ► బిగ్ డేటా, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లకు ప్రాధాన్యం. ► కోర్సు కరిక్యులంతో పాటు ప్రత్యేక ప్రోగ్రామ్‌లకు రూపకల్పన. ►ఏఐ–ఎంఎల్, డేటా అనలిటిక్స్‌లో రీసెర్చ్ సెంటర్లను సైతం ఏర్పాటు చేస్తున్న మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లు. ►ఈ నైపుణ్యాలతో సంస్థల్లో విధుల నిర్వహణలో మరింత సమర్థంగా రాణించే అవకాశం. ►టెక్ నైపుణ్యాలున్న మేనేజ్మెంట్ విద్యార్థులను నియమించుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న టెక్ కంపెనీలు. ►టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్‌లోనూ డేటా అనలిటిక్స్, డేటా మేనేజ్మెంట్ వంటి కోర్సులు. ► ఇండస్ట్రీలో.. ఐఓటీ ఆధారిత కార్యకలాపాలు నిర్వహణ పెరగడమే ప్రధాన కారణం. డేటా అనలిటిక్స్‌కు ప్రాధాన్యం అన్ని రంగాల్లోనూ డేటా విశ్లేషణ.. ఆయా సంస్థల భవిష్యత్తు వ్యూహాలకు, మార్కెట్ ప్రణాళికలకు కీలకంగా మారింది. వీటి ఆధారంగానే ఉత్పత్తుల రూపకల్పన, నిర్వహణ తదితర కార్యకలాపాలు చేపట్టాల్సి వస్తోంది. ఇంత కీలకమైన డేటాను విశ్లేషించాలంటే.. మేనేజ్‌మెంట్‌తోపాటు డేటా మైనింగ్, డేటాసైన్స్ నైపుణ్యాలు కూడా అవసరమే. అందుకే మేనేజ్మెంట్ విద్యలోనే వీటిని అందించే విధంగా కోర్సుల రూపకల్పన జరుగుతోంది. –ప్రొ‘‘ యు.దినేశ్ కుమార్, డేటాసెంటర్ అండ్ అనలిటిక్స్ ల్యాబ్ చైర్మన్, ఐఐఎం–బెంగళూరు -
మేలుకో మహిళ.. ఈ మేటి కొలువులు నీకోసమే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. మరో చక్కటి నోటిఫికేషన్‌తో ఉద్యోగార్థుల ముందుకొచ్చింది! మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ విభాగంలోని..ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1 పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది. హోంసైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్, సోషల్ వర్క్ తదితర విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన మహిళలు ఈ కొలువులకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు అర్హతలు, ఎంపిక విధానం, విజయం సాధించేందుకు ప్రిపరేషన్ గైడెన్స్.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విభాగాల్లో ఒకటి. అంతటి కీలక విభాగంలో ఖాళీగా ఉన్న ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. అకడమిక్‌గా ఆయా సబ్జెక్ట్లపై పట్టున్న వారు ఈ పరీక్షలో విజయం సాధించడం సులభమే అంటున్నారు నిపుణులు. ► మొత్తం పోస్ట్‌ల సంఖ్య: 22 ► పోస్టుల వివరాలు: ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్–1(సూపర్వైజర్) అర్హతలు ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, అప్లైడ్ న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్, క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటిటిక్స్, ఫుడ్ సైన్సెస్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఫుడ్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్‌లలో ఏదో ఒకటి గ్రూప్ సబ్జెక్ట్‌గా బీఎస్సీ (బీజెడ్సీ) ఉత్తీర్ణత ఉండాలి. ► హోంసైన్స్/సోషల్ వర్క్/సోషియాలజీ/ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్లో.. ఉన్నత విద్య అర్హతలు ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వయో పరిమితి ►వయసు జూలై 1, 2021 నాటికి 18–42ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ప్రారంభ వేతనం ► ఏపీపీఎస్సీ భర్తీ చేయనున్న మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సబార్డినేట్ సర్వీస్‌లోని ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలను గ్రేడ్–1 హోదా పోస్ట్‌లుగా పేర్కొన్నారు. ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లనే సూపర్వైజర్లుగా కూడా పిలుస్తారు. వీరికి వేతన శ్రేణి రూ.24,440–రూ.71,510గా ఉంటుంది. ఎంపిక విధానం ఆన్లైన్ విధానం(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లో జరిగే రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక చేస్తారు. ఈ ఆన్లైన్ పరీక్షలో రెండు పేపర్లు మొత్తం 300 మార్కులకు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు–150 మార్కులకు; పేపర్ 2 హోం సైన్స్ అండ్ సోషల్ వర్క్ 150 ప్రశ్నలు–150 మార్కులకు నిర్వహిస్తారు. ► ప్రశ్నలన్నింటినీ ఆబ్జెక్టివ్ తరహా బహుళైచ్ఛిక విధానంలోనే అడుగుతారు. ► ఈ రాత పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సీబీటీ)గా నిర్వహిస్తారు. ► ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం రెండున్నర గంటలు ఉంటుంది. ► ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 తగ్గిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోస్ట్‌లకు అభ్యర్థులు రాత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అందుబాటులో ఉన్న పోస్ట్‌లు, రిజర్వ్డ్ కేటగిరీలకు కేటాయించిన పోస్ట్‌లు తదితర నిబంధనలను పరిగణనలోకి తీసుకొని.. ఆయా కేటగిరీల్లో మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. దరఖాస్తు విధానం: ► ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: నవంబర్ 18–డిసెంబర్ 8, 2021 ► అప్లికేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: సెంబర్ 7, 2021 ► ఆన్లైన్ దరఖాస్తులో సవరణ:దరఖాస్తు చివరి తేదీ నుంచి ఏడు రోజుల లోపు సవరణలు చేసుకోవచ్చు. ► వెబ్సైట్ https://psc.ap.gov.in/ రాత పరీక్షలో రాణించాలంటే ► రెండు పేపర్లుగా నిర్వహించే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రాత పరీక్షలో రాణించేందుకు అభ్యర్థులు పక్కా ప్రిపరేషన్ ప్రణాళికతో ముందుకు సాగాలి. ► పేపర్–1(జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ) అంతర్జాతీయంగా, జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలు, సమకాలీన పరిణామాలపై పట్టు సాధించాలి. తాజాగా ముగిసిన కాప్ సదస్సు, ఆయా అంశాలకు సంబంధించి ఐరాస నివేదికలు, భారత్–ఇతర దేశాల మధ్య ఇటీవల కాలంలో జరిగిన ద్వైపాక్షిక సమావేశాలు, ఒప్పందాలు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ►రాజకీయ, ఆర్థిక, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాలు, కళలు, క్రీడలు, సంస్కృతి, పాలనకు సంబంధించి జాతీయ అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించాలి. ► కరెంట్ ఆఫైర్స్‌కు సంబంధించి.. పరీక్షకు నెల రోజుల ముందు నుంచి అంతకుముందు సంవత్సర కాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి పెట్టాలి. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమకాలీన అంశాలకు సంబంధించి తాజా పాలసీలు, పథకాలు, నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాలపై గణాంక సహిత సమాచారంతో సిద్ధంగా ఉండాలి. ►మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు చెందిన పోస్ట్‌లకు పరీక్ష నిర్వహిస్తున్న∙నేపథ్యంలో.. ఏపీలో మహిళలు, చిన్నారుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వారి కోసం ప్రత్యేకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి తెలుసుకోవాలి. ► ఆంధ్రప్రదేశ్ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆధునిక భారత దేశ చరిత్రలోని ముఖ్యమైన ఘట్టాలపై పట్టు సాధించాలి. పాలిటీ, గవర్నెన్స్‌కు సంబంధించి రాజ్యాంగం, ఇటీవల కాలంలో పాలనలో చోటు చేసుకుంటున్న సాంకేతిక పరిణామాలు(ఈ–గవర్నెన్స్ తదితర), తాజా విధానాల గురించి తెలుసుకోవాలి. ఈ విషయంలోనూ ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పరిపాలన పరమైన నూతన విధానాలపై ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ► ఆర్ధికాభివృద్ధికి సంబంధించి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు.. దేశ ఆర్థిక ప్రగతి, ఆర్థికాంశాల క్రమాన్ని తెలుసుకోవాలి. ► జాగ్రఫీలో.. భారత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా సహజ వనరులు, అవి లభించే ప్రాంతాలు, అభివృద్ధికి దోహదపడే తీరుపై అవగాహన పెంచుకోవాలి. ► ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తాజా పరిణామాలు, అదే విధంగా ప్రాథమిక లక్ష్యాల గురించి తెలుసుకోవాలి. ► మెంటల్ ఎబిలిటీలో... లాజికల్ రీజనింగ్, డేటాలు, ఫ్లో చార్ట్స్, డేటా విశ్లేషణ నైపుణ్యాలు పెంచుకోవాలి. ► అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అనంతర పరిణామాలు, సమస్యలను ప్రత్యేక దృష్టితో చదవాలి. ► 2021–22 బడ్జెట్లోని ముఖ్యమైన అంశాలు, ఏపీ, ఇండియా సోషియో–ఎకనామిక్ సర్వేలు, వాటిలో పేర్కొన్న ముఖ్య వివరాలను, గణాంకాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. పేపర్–2కు ఇలా ► హోంసైన్స్, సోషల్ వర్క్ సబ్జెక్ట్ అంశాలు రెండు విభాగాలుగా ఉండే పేపర్–2లో రాణించేందుకు దృష్టి పెట్టాల్సిన అంశాలు.. ► ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ సబ్జెక్ట్‌లోని పలు రకాల ఆహార ధాన్యాలు, బలమైన ఆరోగ్యానికి దోహదం చేసే తృణ ధాన్యాలు గురించి తెలుసుకోవాలి. ► అదే విధంగా పోషకాహార పదార్థాలు, వాటి నిల్వ, వాటి వల్ల కలిగే లాభాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. ► ఆయా ఆహార పదార్థాల్లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకోవాలి. ► వయో వర్గాల వారీగా అవసరమైన ఆహార, పోషకాల వివరాలు గురించి తెలుసుకోవడం కూడా మేలు చేస్తుంది. ► ఆయా వ్యాధులకు సంబంధించి అనుసరించాల్సిన ఆరోగ్య, ఆహార నియమాల గురించి తెలుసుకోవాలి. ► శిశు అభివృద్ధికి సంబంధించి ఇమ్యునైజేషన్, మానసిక–శారీరక అభివృద్ధి, ప్రీ–స్కూల్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యం, పాపులేషన్ ఎడ్యుకేషన్‌లపై దృష్టిపెట్టాలి. ► అదే విధంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఆయా ఏజెన్సీలు/సంస్థల ఆధ్వర్యంలో అమలవుతున్న మహిళా, శిశు సంక్షేమ సేవల గురించి తెలుసుకోవాలి. ► చిన్నారులకు రాజ్యాంగ, శాసన పరంగా అందుబాటులో ఉన్న హక్కుల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. ► ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులు, వారి విషయంలో చేపడుతున్న చర్యలపై దృష్టి పెట్టాలి. ► వ్యవసాయానికి సంబంధించిన అంశాలు.. ముఖ్యంగా ఆహార ధాన్యాల డిమాండ్–సప్లయ్, సాగు ప్రణాళికలు, ప్రభుత్వ విధానాల గురించి తెలుసుకోవాలి. ► ఎక్స్టెన్షన్ వర్క్‌కు సంబంధించిన విధానాలు, పద్ధతులు, ప్రోగ్రామ్ ప్లానింగ్, నిర్వహణ, మూల్యాంకన, గ్రామాల్లో మహిళల ఆధ్వర్యంలోని స్వయంసహాయక సంస్థల ► అభివృద్ధి వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ► సోషల్ వర్క్‌కు సంబంధించి మూల భావన, పరిధి, స్వరూపం తెలుసుకోవాలి. ► భారతీయ సంస్కృతిలో మార్పు విషయంలో సోషల్ వర్క్ సిద్ధాంతం ప్రాముఖ్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. ► సోషల్ వర్క్‌లో.. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సేవలు, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు, స్థానిక సంస్థలు, కుటుంబం, శిశు సంక్షేమ చర్యలు, మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ స్వరూపం, విధులపై అవగాహన అవసరం. డిగ్రీ పుస్తకాల అధ్యయనం పేపర్–2కు సంబంధించిన విభాగాల్లోని ప్రశ్నలు డిగ్రీ స్థాయి పుస్తకాల నుంచే అడిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సిద్ధాంతాలు, మూల భావనలకు సంబంధించి డిగ్రీ స్థాయి పుస్తకాల అభ్యసనం మేలు చేస్తుంది. సంక్షేమ పథకాలు, సేవలు, సమస్యలకు సంబంధించి సమకాలీన అంశాలను నిరంతరం పరిశీలిస్తూ ఉండాలి. ఇలా ఒకవైపు బేసిక్స్, మరోవైపు సమకాలీన పరిణామాలపై అవగాహన పెంచుకుంటూ.. ప్రిపరేషన్ సాగిస్తే విజయావకాశాలు మెరుగవుతాయి. -
ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారా.. ఈ సింపుల్ ట్రిక్స్ మర్చిపోకండి
చదువు పూర్తయ్యాక ఉద్యోగం సంపాదించడం ప్రతి ఒక్కరి కల. అందుకోసం ముందు ఇంటర్వ్యూను ఛేదించాల్సి ఉంటుంది. చాలామంది ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కోవాలో తెలియక అవకాశాలను కోల్పోతుంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా.. సులభంగానే ఇంటర్వ్యూలో సక్సెస్ సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. సంస్థ గురించి ఇంటర్వ్యూకు సన్నద్ధమవుతున్న అభ్యర్థి.. ముందుగా ఇంటర్వ్యూ చేస్తున్న సంస్థకు సంబంధించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలి. ఇందుకోసం ఉద్యోగానికి దరఖాస్తు చేసినప్పటి నుంచి ఆ సంస్థ గురించి అధ్యయనం చేసి..అన్ని విషయాలపై అవగాహన పెంచుకోవాలి. దరఖాస్తు చేసిన ఉద్యోగం, నిర్వర్తించాల్సిన విధులకు సంబంధించిన అంశాలపైనా అవగాహన కలిగి ఉండాలి. మంచి వస్త్రధారణ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు వస్త్రధారణ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. ఇక్కడ తేడా వస్తే రిక్రూటర్లు అభ్యర్థిని త్వరగానే తిరస్కరించే ఆస్కారం ఉంటుంది. దరఖాస్తు చేసిన ఉద్యోగానికి తగినట్లు వస్త్రధారణ హుందాగా ఉండాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు తమ బలాలు, బలహీనతలు బేరీజు వేసుకోవాలి. అందుకు తగ్గట్టుగా ఇంటర్వ్యూకు సన్నద్ధం కావాలి. చదవండి: వీసా ఇంటర్వ్యూ.. విజయం సాధించడం ఇలా! కాస్త ముందుగానే సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి సంస్థ వద్దకు చేరుకోవడం కంటే.. కాస్త ముందుగానే అక్కడికి వెళ్లేలా చూసుకోవాలి. దాంతో అనవసరపు ఒత్తిడి దరిచేరకుండా ఉంటుంది. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి చేరుకోవడమో లేదా ఆలస్యంగా వెళ్లడమో చేస్తే గందరగోళ పరిస్థితి తలెత్తే ప్రమాదముంది. హుందాగా వ్యవహరించాలి సంస్థలోకి ప్రవేశించినప్పటి నుంచి ఇంటర్వ్యూ పూర్తయి బయటకు వచ్చే వరకూ.. ఎంతో హుందాగా వ్యవహరించాలి. గేట్ దగ్గర పలకరించే సెక్యూరిటీ దగ్గర నుంచి.. ఇంటర్వ్యూ బోర్డు సభ్యుల దాకా.. సంస్థలో ఎంతో మంది ఎదురవుతారు. వీరందరితో హుందాగా ప్రవర్తించాలి. కరచాలనం, పలకరించే సందర్భాల్లో పద్ధతిగా మసలుకోవాలి. ఇంటర్వ్యూలో మాట్లాడే సమయంలో ఉపయోగించే భాష, భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి. నిజాయితీ ముఖ్యం ఇంటర్వ్యూ చేసేవారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలియకుంటే.. ఆ విషయాన్ని వినయంగా అంగీకరించాలి. అంతేతప్ప ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. ఏదో ఒకటి చెబితే ఆ విషయాన్ని రిక్రూటర్లు సులభంగానే గుర్తిస్తారు. హావభావాలు ఇంటర్వ్యూలో హావభావాలు కూడా ముఖ్యమే. చేతులు కట్టుకొని కూర్చోకూడదు. కాళ్లు కదపడం, ముందున్న బల్లపై ఒరిగిపోవడం, ముఖానికి చేతులు అడ్డుపెట్టుకోవడం వంటి చేష్టలు అస్సలు చేయకూడదు. ప్రశాంతంగా ఉండటం, అవసరమైతే సందర్భానుసారంగా చిరునవ్వు చిందించడం అవసరం. ఇవి తీసుకెళ్లాలి ఇంటర్వ్యూకు వెళ్లేటప్పుడు జాబ్ అప్లికేషన్‌తోపాటు రెజ్యూమ్ జిరాక్స్ కాపీలను కూడా తీసుకెళ్లాలి. ఇంటర్వ్యూలో మీరు చెప్పే సమాధానాలు రెజ్యూమ్‌లో పేర్కొన్నవాటికి భిన్నంగా ఉండకూడదు. ఇంటర్వ్యూ ముగిసిన తర్వాత చివర్లో బోర్డ్ సభ్యులకు ధన్యవాదాలు తెలపడం మరిచిపోవద్దు. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఇంటర్వ్యూ గట్టెక్కి.. కోరుకున్న కొలువు సొంతమవుతుంది!! -
సాయుధ బలగాల్లో జాబ్, యువతకు శుభవార్త
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్‌ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్(ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్‌ఎస్‌ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ►ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ►వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ►తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ►ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ►జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్‌లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ►జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. బఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ►ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్‌తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్ర ర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ►ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ►ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ►ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ►ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ►తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ►కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్‌ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్‌ను గుర్తించాలి. ►గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్‌టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ►ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ►పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ►వెబ్సైట్: https://ssc.nic.in -
ఆ రెండు సబ్జెక్టులు రాకుంటే.. ఇంజనీరింగ్‌లో సాధ్యమేనా?!
బీటెక్‌లో చేరాలంటే..ఇంటర్మీడియెట్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ గ్రూప్ సబ్జెక్ట్‌లుగా.. ఉత్తీర్ణత సాధించాలనే అర్హత నిబంధన ఉన్న సంగతి తెలిసిందే! అందుకే..ఇంజనీరింగ్ లక్ష్యంగా చేసుకున్న లక్షల మంది విద్యార్థులు.. ఇంటర్ ఎంపీసీలో చేరుతుంటారు! ఆ అర్హత ఆధారంగా సదరు సబ్జెక్ట్లతో నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్‌లో.. విజయం సాధిస్తేనే ప్రస్తుతం బీటెక్‌లో అడుగుపెట్టే అవకాశం లభిస్తుంది! కానీ..తాజాగా ఏఐసీటీఈ(అఖిల భారత సాంకేతిక విద్యా మండలి).. ఇక నుంచి బీటెక్‌లో చేరాలంటే..‘ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదవడం తప్పనిసరికాదు’ అనేలా ప్రకటన చేసింది. ఇదే ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది! ఈ నేపథ్యంలో.. బీటెక్‌లో చేరేందుకు ఏఐసీటీఈ తాజాగా పేర్కొన్న అర్హతలు.. వాటì తో కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావంపై విశ్లేషణాత్మక కథనం.. ‘చిన్న ఇల్లు కట్టాలన్నా.. లేదా కొత్తగా ఒక రహదారి నిర్మించాలన్నా.. సివిల్ ఇంజనీర్లకు ఫిజిక్స్ నైపుణ్యాలు ఎంతో అవసరం. సదరు నిర్మాణం చేపట్టే ప్రదేశంలో సాంద్రత, పటిష్టత వంటివి తెలుసుకోవాలంటే.. ఫిజిక్స్ నైపుణ్యాలతోనే సాధ్యం. ఈ స్కిల్స్ లేకుండా.. సివిల్ ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమే. ఒకవేళ ఫిజిక్స్ లేకుండా.. సివిల్ ఇంజనీరింగ్ చదివినా.. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తడం ఖాయం’ – ఇది బీటెక్‌లో ఫిజిక్స్ నైపుణ్యాలపై విద్యావేత్తల అభిప్రాయం. ‘ప్రస్తుత పోటీ ప్రపంచంలో... ఇండస్ట్రీ 4.0 స్కిల్స్గా పేర్కొంటున్న ఏఐ, ఎంఎల్, ఐఓటీ, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్, కోడింగ్, ప్రోగ్రామింగ్.. ఇలా ఎందులోనైనా ప్రతిభ చూపాలంటే.. మ్యాథమెటిక్స్ నైపుణ్యాలు తప్పనిసరి. కోడింగ్, ప్రోగ్రామింగ్‌లను రూపొందించేందుకు అల్గారిథమ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, కాలిక్యులస్ వంటి వాటిలో బలమైన పునాది ఉండాలి’ –ఇది బీటెక్ ప్రవేశాల్లో మ్యాథమెటిక్స్ను ఐచ్ఛికం చేయడంపై నిపుణుల అభిప్రాయం. ...ఇలా ..ఒక్క సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అనే కాదు. ఇంజనీరింగ్‌లో సర్క్యూట్ బ్రాంచ్‌లుగా పిలిచే ఈసీఈ, ఈఈఈ, ఐటీ.. అదే విధంగా కోర్ బ్రాంచ్‌లుగా పేర్కొనే మెకానికల్, సివిల్.. అన్నింటిలోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సిద్ధాంతాల ఆధారంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఇంజనీరింగ్ స్వరూపం ఉంటుంది. రోబోటిక్స్.. ఫిజిక్స్ సూ త్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇంజనీ రింగ్‌లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లను చదవడం తప్పనిసరికాదనే ప్రకటన చర్చనీయాంశమైంది. 14 సబ్జెక్టుల జాబితా ఏఐసీటీఈ తాజాగా 2021–22 సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్ బుక్‌ను విడుదల చేసింది. ఈ హ్యాండ్ బుక్‌లో పేర్కొన్న అర్హత ప్రమాణాల ప్రకారం–బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్‌లో ప్రవేశానికి ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివుండాలనే నిబంధన తొలగించింది. అంతేకాకుండా.. 14 సబ్జెక్ట్లతో జాబి తా పేర్కొని.. ఈ సబ్జెక్ట్‌లలో ఏవైనా మూడు చదివితే.. బీటెక్‌లో ప్రవేశించేందుకు అర్హులేనని పేర్కొంది. అవి.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ, ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్, బయోటెక్నా లజీ, టెక్నికల్ ఒకేషనల్ సబ్జెక్ట్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్ గ్రాఫిక్స్, బిజినెస్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అయితే ఆయా రాష్ట్రాలు, యూనివర్సిటీలు బీటెక్ ప్రవేశాల్లో అర్హతలకు సంబంధించి తమ ఈ 14 సబ్జెక్టుల ప్రకటనకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని.. అర్హతల విషయంలో యూనివర్సిటీలకు, రాష్ట్రాలకు సొంత నిర్ణయం తీసుకునే అధికారం ఉందని ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఆ సబ్జెక్ట్‌లు ఇంటర్లో? ఏఐసీటీఈ పేర్కొన్న 14 సబ్జెక్ట్‌లు ఆయా రాష్ట్రాల బోర్డ్‌ల ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. వాస్తవానికి ప్రస్తుతం చాలా రాష్ట్రాలు తమ సొంత కరిక్యులంతో ఇంటర్మీ డియెట్ తత్సమాన కోర్సులను బోధిస్తున్నాయి. ఇంజనీరింగ్ ఔత్సాహిక అభ్యర్థుల కోసం ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ అందిస్తున్నాయి. దీంతో ఏఐసీటీఈ తాజా నిర్ణయం పూర్తిగా సీబీఎస్ఈ +2 కరిక్యులంను దృష్టిలో పెట్టుకొని∙తీసు కున్నదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐసీటీఈ బీటెక్ ప్రవేశ అర్హతలు.. ముఖ్యాంశాలు ► ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ చదవకపోయినా బీటెక్‌లో చేరే అవకాశం. ►బీటెక్ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సుల ద్వారా ఫిజిక్స్, మ్యాథ్స్ నైపుణ్యాలు అందించొచ్చని సూచన. ►ఫిజిక్స్, మ్యాథ్స్‌లో పూర్తి స్థాయి అవగాహన లేకుండా ఇంజనీరింగ్‌లో రాణించడం కష్టమంటున్న నిపుణులు. ► ఇంజనీరింగ్‌లోని దాదాపు అన్ని బ్రాంచ్‌లలోనూ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సిద్ధాంతాల ఆధారంగానే పట్టు సాధించాల్సిన ఆవశ్యకత. ►భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో, ఉన్నత విద్య, విదేశీ విద్య పరంగా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం. ► రీసెర్చ్, డెవలప్మెంట్ కోణంలోనూ సైన్స్ రంగంలో పరిశోధనలు చేసే విషయంలో ఇబ్బందులు. టెస్ట్‌ల ద్వారానే ప్రవేశాలు అర్హతల విషయంలో పలు మార్పులు చేసిన ఏఐసీటీఈ.. ప్రవేశాలు ఖరారు చేసేందుకు మాత్రం తప్పనిసరిగా ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించాలని పేర్కొంది. వాటిల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకు, మెరిట్ ఆధారంగానే బీటెక్‌లో ప్రవేశాలు కల్పించాలని స్పష్టం చేసింది. సొంతంగా ఎంట్రన్స్‌లు ప్రస్తుతం దేశంలోని ఆయా రాష్ట్రాలు ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం సొంత ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహించి.. అందులో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ ఎంట్రన్స్ టెస్ట్‌లకు అర్హత ఇంటర్ తత్సమాన కోర్సులో ఎంపీసీ ఉత్తీర్ణత. ఏఐసీటీఈ ఆయా రాష్ట్రాల విచక్షణ మేరకే తమ సూచనలు పాటించొచ్చని పేర్కొంది. సొంతంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునే రాష్ట్రాలు అర్హతల విషయంలో స్వీయ నిబంధనలు రూపొందించొచ్చని తెలిపింది. దీంతో రాష్ట్రాల స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్‌లకు ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత నిబంధన కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి.. ఈ ఏడాది ఏఐసీటీఈ సంస్కరణలు అమలు చేయడం సాధ్యం కాదని పేర్కొంది. ఇప్పటికే తేదీలు ప్రకటిం చినందున ఎంసెట్‌నే కొనసాగిస్తామని స్పష్టం చేసింది. బ్రిడ్జ్ కోర్సులతో కష్టమే బీటెక్‌లో చేరడానికి మ్యాథ్స్, ఫిజిక్స్‌లను ఐచ్ఛికం అని పేర్కొ న్న ఏఐసీటీఈ.. విద్యార్థులు వాటికి సంబంధించిన బేసిక్ నైపు ణ్యాలు పొందేందుకు బీటెక్/బీఈ మొదటి సంవత్సరంలో బ్రిడ్జ్ కోర్సులు నిర్వహించొచ్చని సిఫార్సు చేసింది. ఈ బ్రిడ్జ్ కోర్సు లతో సదరు నైపుణ్యాలు లభిస్తాయా అంటే? కాదనే సమా ధానం వినిపిస్తోంది. వీటివల్ల ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాల కాన్సెప్ట్లపై అవగాహన లభిస్తుందే తప్ప.. పూర్తి స్థాయి పట్టు సాధించడం కష్టమంటున్నారు. ఇంజనీరింగ్‌కు పునాదిగా భావించే మ్యాథ్స్‌లోని కాలిక్యులస్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ సహా పలు కీలకమైన టాపి క్స్‌ను; అదే విధంగా ఫిజిక్స్‌లో మ్యాగ్నటిజం, ఎలక్ట్రో మ్యా గ్నటిజం, థర్మో డైనమిక్స్, మెకానిక్స్ తదితర 20కు పైగా టాపి క్స్‌ను ఇంటర్లో రెండేళ్ల పాటు అభ్యసిస్తే తప్ప విద్యా ర్థులకు వాటిపై అవగాహన రావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకట్రెండు సెమిస్టర్లలో నిర్వహించే బ్రిడ్జ్ కోర్సు ద్వారా అవస రమైన నైపుణ్యాలు లభించడం కష్టమే అంటున్నారు నిపుణులు. భవిష్యత్తులో సమస్యలు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై పట్టు లేకుండా.. బీటెక్ పూర్తిచేసిన విద్యా ర్థులు.. పరిశోధనలు, ఆవిష్కరణల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారనే వాదన వినిపిస్తోంది. పర్యవసానంగా దేశంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముంది. పీజీ స్థాయిలో.. సర్క్యూట్, కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్‌పై అవగాహన లేకుంటే రాణించడం కష్టమే అంటున్నారు. ఉదాహరణకు ఫిజిక్స్, మ్యాథ్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసి.. ఎంటెక్‌లో వైర్లెస్ కమ్యూనికేషన్స్, ఆర్ఎఫ్ సిగ్నల్స్ వంటి సబ్జెక్ట్‌లలో రాణించడం ఎంతో కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విదేశీ విద్యకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఎంఎస్ కోర్సుల్లో చేరాలంటే.. పదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ వరకూ.. మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లు చదివుండాలనే నిబంధన ఉంది. అంతేకాకుండా ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశానికి ప్రామాణిక టెస్ట్‌గా పరిగణించే జీఆర్‌ఈలోనూ మ్యాథమెటిక్స్ ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. మరికొన్ని విదేశీ యూనివర్సిటీలు.. జీఆర్ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లను కూడా అర్హతగా పేర్కొంటున్నాయి. వీటికి సంబంధించి విద్యార్థులు పీజీ స్థాయిలో తాము చదవాల నుకుంటున్న స్పెషలైజేషన్స్‌కు అనుగుణంగా ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లలో స్కోర్ సాధించాల్సి ఉంటుంది. అలాంటి సందర్భంలో మ్యాథ మెటిక్స్ సంబంధిత కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు.. జీఆర్ఈ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ టెస్ట్‌లో స్కోర్ సాధించాలి. ఈ సబ్జెక్ట్ టెస్ట్‌లో కాలిక్యులస్, అల్జీబ్రా, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నైపుణ్యాలు పొందాలంటే.. ఇంటర్మీడియెట్‌లో ఎంపీసీ గ్రూప్ స్థాయిలో వీటిని అభ్యసిస్తేనే సాధ్యమనేది నిపుణుల అభిప్రాయం. జాబ్ మార్కెట్ మ్యాథ్స్, ఫిజిక్స్ లేకుండా.. బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులు జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవడం కష్టమేనని అభిప్రాయం నెలకొంది. ఉదాహరణకు.. ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆటోమేషన్ ఆధారిత కార్యకలాపాలు సాగుతున్నాయి. రోబో టిక్స్, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, కోడింగ్, 3–డి డిజైన్ ప్రింటింగ్ వంటి వాటికి ప్రధాన్యం పెరుగుతోంది. ఈ విభాగాల్లో రాణించాలంటే.. ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ కీలకం అవుతున్నాయి. వీటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లలో పట్టుతో పాటు అప్లికేషన్ నైపుణ్యాలు తప్పనిసరి. ఇలాంటి నైపుణ్యాలు ఇంటర్లో పూర్తి స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివిన వారికే లభిస్తాయని సబ్జెక్ట్ నిపుణులు అంటున్నారు. జేఈఈ పరిస్థితి ఏఐసీటీఈ తాజా నిర్ణయం అన్ని వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులో తెచ్చే ఉద్దేశమే అయినప్పటికీ.. ఎన్ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ టెస్టులైన జేఈఈ–మెయిన్స్, జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లకు అర్హత నిబం ధనల విషయంలో సూచనలు చేయకపోవడం గమనార్హం. ఎన్ఐటీలు, ఐఐటీలు.. మ్యాథ్స్,ఫిజిక్స్, కెమిస్ట్రీ తప్పనిసరి చేస్తూ ఎంట్రన్స్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాయి. కాబట్టి ఇంజనీ రింగ్‌లో చేరాలనుకునే విద్యార్థులు.. ఇంటర్మీడియెట్ స్థాయిలో ఎంపీసీనే ఎంచుకుంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ఆసక్తి ఉన్నా... ప్రోత్సాహమేది!
స్టెమ్.. (STEM - Science, Technology, Engineering, Mathematics) కోర్సులు. ఇవి నేటి టెక్నాలజీ యుగంలో ఎంతో ప్రాముఖ్యం సంతరించుకుంటున్న కోర్సులు! మరోవైపు ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ నిపుణుల కొరత నెలకొంది. ఈ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా... అందుకుతగ్గ ప్రోత్సాహం లభించట్లేదని తాజా సర్వే పేర్కొంది. అమెరికా మొదలు, అన్ని దేశాల్లోనూ ఇదే ధోరణి! మహిళా విద్యార్థుల్లో సైతం ‘స్టెమ్’ కోర్సులపై ఆసక్తి ఉన్నా.. లభించని తోడ్పాటు! తాజాగా అంతర్జాతీయంగా గ్లోబల్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ సంస్థ ఎమర్సన్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో మన దేశంలో స్టెమ్ కోర్సుల పరిస్థితి.. స్టెమ్ కోర్సులను అందిస్తున్న ప్రముఖ ఇన్స్టిట్యూట్లు, వాటి ద్వారా లభించే అవకాశాలపై ప్రత్యేక కథనం.. స్టెమ్.. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. ఇండస్ట్రీ అవసరాల పరంగా అత్యంత కీలకమైనవి. సంస్థల్లో కార్యకలాపాలు సమర్థవంతంగా సాగడానికి, కొత్తకొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి తేవడానికి స్టెమ్ నిపుణుల సేవలు తప్పనిసరి. అందుకే స్టెమ్ కోర్సుల్లో ప్రతిభ చూపిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ నెలకొంది. అదే సమయంలో ఈ కోర్సులపై ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య సైతం ఏటా పెరుగుతోంది. కానీ, స్టెమ్ కోర్సుల విద్యార్థులు రాణించేందుకు అవసరమైన ప్రోత్సాహం, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా శిక్షణ లభించడం లేదని తాజా సర్వే పేర్కొంది. పర్యవ సానంగా ఈ విభాగంలో పరిశ్రమలు స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. పెరుగుతున్న ఆసక్తి ఇటీవల కాలంలో స్టెమ్ కోర్సుల్లో చేరాలనే ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. అగ్రరాజ్యంగా భావించే అమెరికాలో 60 శాతం మంది విద్యార్థులు స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి చూపుతున్నారు. కానీ, వీరిలో 40 శాతం మంది తమకు సరైన ప్రోత్సాహకాలు లేవని పేర్కొనడం గమనార్హం. మన దేశంలోనూ స్టెమ్ల్లోని ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల పట్ల ఆసక్తి రెట్టింపు అవుతోంది. అదేవిధంగా సైన్స్, మ్యాథమెటిక్స్ కోర్సుల విషయంలో విద్యార్థులకు సరైన మార్గం నిర్దేశం లభించడంలేదు. జండర్ గ్యాప్ స్టెమ్ కోర్సుల అభ్యసనం పరంగా దేశంలో ఎదురవుతున్న మరో సమస్య.. జండర్ గ్యాప్(లింగ వివక్ష). మహిళా విద్యార్థులు నిరుత్సాహానికి గురవుతున్నారు. తాజా సర్వే ప్రకారం 41 శాతం మంది విద్యార్థినులు స్టెమ్ కెరీర్స్ పురుషుల కోసమే అనే అభిప్రాయంతో ఉన్నట్లు వెల్లడైంది. మరో 44 శాతం మంది మహిళలు సైతం ఈ రంగంలో తమకు రోల్ మోడల్స్ లేరని, దాంతో స్టెమ్ కోర్సుల్లో చేరేందుకు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి వస్తోందన్నారు. తల్లిదండ్రులు కూడా స్టెమ్ కోర్సుల్లో అమ్మాయిలను చేర్పించేందుకు వెనుకాడుతున్నారు. ఈ విషయంలో ఇంజనీరింగ్ కోర్సులు కొంత ఫర్వాలేదు. కానీ సైన్స్, మ్యాథమెటిక్స్‌తో అమ్మాయిలకు పెద్దగా ఉపయోగంలేదనే భావన నేటికీ ఉంది. స్టెమ్‌తో ఉజ్వల భవిత వాస్తవానికి స్టెమ్‌లోని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్.. ఈ నాలుగింటిలో ఏ కోర్సు పూర్తిచేసుకున్నా.. ఉజ్వల భవిత ఖాయంగా కనిపిస్తోంది. ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలనే పరిశీలిస్తే.. ఉత్పత్తి రంగం మొదలు ఐటీ, ఆటోమేషన్ వరకు.. అవకాశాలు పుష్కలం. సైన్స్, మ్యాథమెటిక్స్‌ల్లో పీహెచ్డీ స్థాయి కోర్సులు పూర్తిచేస్తే విస్తృత ఉపాధి వేదికలు అందుబాటులోకి రావడం ఖాయం. కానీ, ఈ సబ్జెక్ట్‌లలో ఈ స్థాయి నిపుణులు లేక పరిశ్రమ వర్గాలు, పరిశోధన కేంద్రాలు స్కిల్ గ్యాప్ సమస్యను ఎదుర్కొంటున్నాయి. మార్గాలు అనేకం స్టెమ్ కోర్సులు అభ్యసించేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో కోర్సులు అభ్యసించే అవకాశముంది. సైన్స్ కోర్సుల అభ్యర్థులు.. ఐఐఎస్ఈఆర్, ఐఐఎస్సీ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లలో సైన్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే రీసెర్చ్ వైపు అడుగులు వేసే వీలుంది. స్కిల్ గ్యాప్.. ప్రధాన సమస్య స్టెమ్ కోర్సుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. జాబ్ మార్కెట్లో స్కిల్ గ్యాప్ అనేది ప్రధాన సమస్యగా మారింది. అకడమిక్ స్థాయిలో సరైన సదుపాయాలు లేకపోవడం, ఇండస్ట్రీ వర్గాలు ఇన్స్టిట్యూట్లతో కలిసి నడవకపోవడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తోంది. తాజా సర్వే ప్రకారం కంపెనీలు తమ ఉద్యోగుల్లో స్టెమ్ నైపుణ్యాలు పెంపొందించేలా శిక్షణ ఇవ్వాలని 87 శాతం మంది పేర్కొనడం స్కిల్ గ్యాప్ సమస్యకు నిదర్శనంగా చెప్పొచ్చు. అక్కడా భారతీయ నిపుణులు వాస్తవానికి మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న స్టెమ్ నిపుణుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాజా గణాంకాల ప్రకారం అమెరికా మొదలు పలు దేశాల్లోని సంస్థల్లో పనిచేస్తున్న స్టెమ్ నిపుణుల్లో భారతీయుల సంఖ్య 20 నుంచి 30 శాతంగా ఉంది. ఈ నిపుణులు దేశంలోనే ఉండేలా ప్రోత్సాహకాలు అందించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి మేధో వలసలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. భవిష్యత్తుకు స్టెమ్ నిపుణులే పునాది ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిశోధనల దృష్ట్యా.. భవిష్యత్తులో స్టెమ్ నిపుణులుæ దేశ ప్రగతికి పునాదులుగా నిలవనున్నారు. అందుకు తగ్గట్టుగా స్టెమ్ విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందించాలని, స్కిల్ గ్యాప్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సైన్స్, మ్యాథమెటిక్స్ వంటి అంశాల్లో పరిశోధనలు చేసే వారికి ఆర్థిక ప్రోత్సాహకాలు మరింత పెంచాలంటున్నారు. అదే విధంగా ఇంజనీరింగ్, టెక్నాలజీకి సంబంధించి నూతన నైపుణ్యాలు అందించే విధంగా ప్రత్యేక ఇన్స్టిట్యూట్లు, కోర్సులు ప్రారంభించాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రీతో కలిసి స్టెమ్ విభాగాల్లో నెలకొన్న స్కిల్ గ్యాప్ సమస్య పరిష్కారానికి ఇన్స్టిట్యూట్లు, ఇండస్ట్రీ వర్గాలతో కలిసి పనిచేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కోర్సు ప్రారంభించే సమయంలో ఇండస్ట్రీ వర్గాలతో సంప్రదించి పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను కరిక్యులంలో చేర్చాలి. అలాగే పరిశోధనల పరంగా జాయింట్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ చేపట్టడం, వాటిలో విద్యార్థులను భాగస్వాములను చేయడం ద్వారా స్కిల్ గ్యాప్ సమస్యను అధిగమించే వీలుంది. ప్రోత్సాహకాలు అందించేలా స్టెమ్ కోర్సుల్లో చేరే మహిళా విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాలని నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లోనూ అవగాహన కల్పించి, ఆడ పిల్లలు సైతం స్టెమ్ విభాగాల్లో ముందంజలో నిలిచేలా చర్యలు తీసుకోవాలం టున్నారు. ఐఐటీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరరీ కోటా పేరుతో సీట్లు కేటాయిస్తున్నప్పటికీ.. ఇతర ఇన్స్టిట్యూట్లు, కోర్సులకు కూడా వీటిని వర్తించాలనే అభిప్రాయం వినిపిస్తోంది. స్టెమ్ కోర్సులు.. సర్వే ముఖ్యాంశాలు ♦ దేశ అభివృద్ధిలో స్టెమ్ ఉద్యోగాలే కీలకమని చెప్పిన వారు– 84 శాతం. ♦ స్టెమ్ ఎడ్యుకేషన్ ముఖ్యం అన్నవారు–96% ♦ స్టెమ్ విభాగాల్లో మహిళా రోల్ మోడల్స్ లేకపోవడం కూడా సమస్యగా ఉందని చెప్పిన వారి సంఖ్య–44 శాతం. ♦ అమెరికాలో ప్రతి పది మందిలో ఆరుగురులో స్టెమ్ కోర్సుల పట్ల ఆసక్తి. కానీ, ప్రతి పది మందిలో నలుగురు ఈ విభాగంలో సరైన ప్రోత్సాహం లేదని చెప్పారు. ఎలాంటి సందేహం లేదు స్టెమ్ కోర్సులతో అటు ఇండస్ట్రీకి, ఇటు విద్యా ర్థులకు ప్రయోజనాలు చేకూరుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య మ రింత పెరగాల్సిన అవ సరం ఉంది. ఇటీవల కాలంలో ఆసక్తి పెరుగుతున్న మాట వాస్తవమే. కానీ, మార్కెట్ అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది తక్కువనే చెప్పాలి. దీనికి పరిష్కారం ఈ కోర్సుల పట్ల విద్యార్థుల్లో ముందు నుంచే అవగాహన కల్పించడం.– ప్రొఫెసర్ ఎం.జె.స్వామి, స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, హెచ్‌సీయూ. -
ఏమిటీ సరా..?
కొద్ది రోజులుగా సరా (sarahah) యాప్ పేరు మార్మోగుతోంది. ఈజిప్ట్, సౌదీ అరేబియా దేశాల్లో విడుదలైన ఈ యాప్ అకస్మాత్తుగా భారత మార్కెట్లో హల్చల్ చే స్తూ.. చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ దీని కథేమిటో తెలుసా..? మెసెంజింగ్ యాప్ సరా యాప్ మెసేజ్ సెండింగ్, రిసీవింగ్ కోసం రూపొందించినది. అలా అని జీమెయిల్ లాంటిది కాదు. మీ ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకుంటే దాన్ని చూసి మీకు ఎవరైనా ఫీడ్ బ్యాక్ పంపించే యూనిక్ ఫీచర్‌తో వచ్చిన యాప్. ఆకాశరామన్న ఉత్తరాల్లాగా అజ్ఞాత వ్యక్తి ఫీడ్‌బ్యాక్, కామెంట్స్ ఈ యాప్ ప్రత్యేకం. ఐవోఎస్, ఆండ్రాయిడ్‌ల్లో లభిస్తుంది. ఎలా పనిచేస్తుందంటే..? మెయిల్ ఐడీ, సోషల్ మీడియా అకౌంట్ మాదిరిగానే సరా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దీన్ని ఎవరైనా చూసే విధంగా ఉంటుంది. అంతేకాక ఇతరులు లాగిన్ కావల్సిన అవసరం కూడా లేకుండా ప్రొఫైల్‌ను చూడటమే కాదు.. మెసేజ్‌లు కూడా పంపవచ్చు. అలాగే అవతలి వ్యక్తి లాగిన్ అయితే వాళ్ల మెసేజ్‌లను మీరు ట్యాగ్ చే సుకోవచ్చు. మీ ప్రొఫైల్‌ను ఆధారంగా చేసుకుని అవతలి వ్యక్తి మీకు కామెంట్స్ పంపవచ్చు. రిసీవర్ యాప్‌లోని ఇన్‌బాక్స్‌లో మీకు నచ్చిన మెసేజ్‌లు చూసుకోవచ్చు. వాటిని ఫ్లాగ్ చేసుకోవచ్చు లేదా తొలగించవచ్చు. సమాధానం కూడా ఇవ్వొచ్చు. నచ్చినవాటిని ఫేవరెట్‌గా పెట్టుకోవచ్చు. భిన్నాభిప్రాయాలు తక్కువ సమయంలో ప్రజాదరణ సంపాదించినా ఈ యాప్ పనితీరుపై మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రొఫైల్‌ను సెర్చ్ నుంచి తొలగించడం, ఆడియన్స్‌ను పరిమితం చేయడం, అనాథరైజ్ యూజర్లు మీ ప్రొఫైల్‌ను షేర్ చేయకుండా, లాగిన్ కాకుండా కామెంట్ చేయలేని విధంగా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. అంటే కేవలం లాగిన్ అయిన వారు మాత్రమే కామెంట్ పెట్టగలుగుతారు. నెగిటివ్ కామెంట్ ఇచ్చే వ్యక్తులను బ్లాక్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్లు ఉన్నా కూడా ప్రైవసీ విషయంలో ఇంకా శ్రద్ధ పెట్టాల్సి ఉందన్నది యూజర్ల అభిప్రాయం. -
దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభం
జమిలి ఎన్నికలకు నీతి ఆయోగ్ సిఫారసు దేశంలో 2024 నాటికి లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. దీనికోసం కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలాన్ని పొడిగించడమో/తగ్గించడమో చేయాలని, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇదేమంత పెద్ద విషయం కాదని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఆగస్టు 27న విడుదల చేసిన తన త్రైవార్షిక(2017–18 నుంచి 2019–20) ప్రణాళికలో పలు అంశాలను వెల్లడించింది. బార్‌కోడ్‌తో యుద్ధ వాహనాల ప్రారంభం సైన్యం అవసరాలకు అనుగుణంగా బార్‌కోడ్‌తో రూపొందించిన అత్యాధునిక బీఎంపీ–2 వాహనాలను ఆర్మీకి అందించే కార్యక్రమాన్ని రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆగస్టు 27న సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎద్దుమైలారంలోని ఆయుధ కర్మాగారంలో ప్రారంభించారు. బార్కోడ్ ఆధారంగా వాహన ఉత్పత్తికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. ట్రిపుల్ తలాక్ చెల్లదన్న సుప్రీంకోర్టు ముస్లిం సమాజంలో ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం ఇకపై కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇది చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 3:2 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది. ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ ఆగస్టు 22న 395 పేజీల తీర్పులో పేర్కొన్నారు. పునరాలోచన చేసుకునేందుకు ఆస్కారం లేని, క్షణాల్లో ఇచ్చేసే ట్రిపుల్ తలాక్ అంగీకార యోగ్యం కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ట్రిపుల్ తలాక్ ద్వారా విడాకులివ్వడం అత్యంత ఏక పక్షం, అహేతుకం, రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొంది. దక్షిణాది రాష్ట్రాల మధ్య ‘విద్యుత్’ సహకారం దక్షిణాది రాష్ట్రాలు విద్యుత్‌ను పరస్పరం ఇచ్చి పుచ్చుకునేందుకు అంగీకరించాయి. దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ కమిటీ(ఎస్ఆర్పీసీ) అధ్యక్షుడు, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు అధ్యక్షతన కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆగస్టు 22న ముగిసిన సమావేశంలో ఈ మేరకు అంగీకారం కుదిరింది. ఛత్తీస్‌గఢ్‌లో ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఛత్తీస్‌గఢ్‌లో 55 లక్షల స్మార్ట్ ఫోన్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. ఈ పథకానికి సంచార్ క్రాంతి యోజన అని పేరు పెట్టారు. ఓబీసీ ఉప వర్గీకరణకు కేంద్రం నిర్ణయం కేంద్ర జాబితాలోని ఓబీసీ(ఇతర వెనకబడిన కులాలు) ఉప వర్గీకరణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 23న నిర్ణయించింది. చైర్‌పర్సన్‌ను నియమించిన నాటి నుంచి 12 వారాల్లోపు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కాగా జాతీయ స్థాయిలో ఓబీసీ కేటగిరీలో క్రీమీలేయర్ గరిష్ట వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచారు. ఫుడ్ ప్రాసెసింగ్ పథకం పేరు మార్పు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పథకానికి ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజనగా పేరు మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఆగస్టు 23న అంగీకరించింది. రూ.6,000 కోట్లు కేటాయించిన ఈ పథకం ద్వారా 2020 నాటికి 20 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. 5.30 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. దేశంలోనే తొలి విదేశ్ భవన్ ప్రారంభం ముంబైలో ఏర్పాటుచేసిన విదేశ్ భవన్‌ను విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఆగస్టు 27న ప్రారంభించారు. దేశంలో ఈ తరహా కార్యాలయం ఏర్పాటుకావడం ఇదే ప్రథమం. విదేశీ వ్యవహారాల శాఖకు సంబంధించి మహారాష్ట్రలో ఉన్న అన్ని కీలక కార్యాలయాలు విదేశ్ భవన్లో ఉంటాయి. డేరా సచ్చా సౌధా చీఫ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రాం రహీం సింగ్‌కు సీబీఐ కోర్టు ఆగస్టు 28న 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. 2002 నాటి రెండు అత్యాచార కేసుల్లో(ఒక్కో కేసులో పదేళ్ల చొప్పున) శిక్ష విధిస్తూ న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ తీర్పు వెలువరించారు. జైలు శిక్షతోపాటు ఒక్కో కేసుకు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ.30 లక్షల జరిమానా కూడా విధించారు. వ్యక్తిగత గోప్యత.. ప్రాథమిక హక్కు వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీం కోర్టు ఆగస్టు 24న స్పష్టం చేసింది. వ్యక్తుల గౌరవప్రదమైన జీవితానికి ఈ హక్కు తప్పనిసరని తెలిపింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వానికి ఉండే హక్కుల్ని, పరిమితుల్ని గుర్తుచేసింది. డిజిటల్ ప్రపంచంలో సమాచారాన్ని భద్రపరచాల్సిన జాగ్రత్తలన్నీ సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది. సివిల్ సర్వీసెస్ అధికారులకు జోన్ల వారీ కేడర్లు సివిల్ సర్వీస్ అధికారులకు కేడర్ల కేటాయింపునకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ఖరారు చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల్లో జాతీయ సమగ్రత భావనను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. నూతన విధానం ప్రకారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న 26 కేడర్లను ఐదు జోన్లుగా విభజించారు. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు ఇకపై రాష్ట్రాలకు బదులు జోన్ల కేడర్లను ఎంపిక చేసుకోవాలి. క్రీడలు సింధుకి రజతం ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ పీవీ సింధు రజత పతకం కైవసం చేసుకుంది. గ్లాస్గో(స్కాట్లాండ్)లో ఆగస్టు 27న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నోజొమి ఓకుహార చేతిలో సింధు ఓటమి చవిచూసింది. ఈ ఛాంపియన్‌షిప్‌లో సింధు పతకం సాధించడం ఇదో మూడోసారి. 2013, 14ల్లో కాంస్య పతకాలు పొందింది. మహిళల డబుల్స్ టైటిల్‌ను చెన్ క్వింగ్ చెన్, జియో విఫాన్ (చైనా) గెలుచుకోగా పురుషుల సింగిల్స్ టైటిల్‌ను విక్టర్ ఆక్సెల్స్న్ (స్వీడన్) గెలుచుకున్నాడు. మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను మొహమ్మద్ ఆసన్, లిలియానా నట్సిర్ (ఇండోనేషియా) కైవసం చేసుకున్నారు. మేవెదర్ వరల్డ్ రికార్డులు అమెరికా స్టార్ ప్లేయర్ ఫ్లాయిడ్ మేవెదర్.. ప్రొఫెషనల్ బాక్సింగ్ కెరీర్లో అజేయంగా నిలిచిన ఏకైక వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. లాస్‌వేగాస్(అమెరికా)లో ఆగస్టు 27న జరిగిన జూనియర్ సూపర్ ఫైట్ బౌట్లో గెలుపొందడం ద్వారా ప్రొఫెషనల్ కెరీర్లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. మేవెదర్ పోటీపడిన 50 బౌట్లలోనూ ఆయనే విజేత. 49 వరుస విజయాలతో అమెరికా హెవీ వెయిట్ ప్రొఫెనల్ బాక్సర్ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును మేవెదర్ అధిగమించాడు. కాగా తాను మళ్లీ రింగ్‌లోకి దిగే అవకాశాలు లేవని మేవెదర్ ప్రకటించాడు. హామిల్టన్‌కు బెల్జియం గ్రాండ్ ప్రీ టైటిల్ బెల్జియం ఫార్ములావన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ సాధించాడు. ఆగస్టు 27న బెల్జియంలో జరిగిన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. 32 ఏళ్ల హామిల్టన్(బ్రిటన్)కు ఇది ఓవరాల్‌గా 58వ విజయం. వార్తల్లో వ్యక్తులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా దీపక్ మిశ్రా సుప్రీంకోర్టు 45వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా ఆగస్టు 28న బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ పదవీ కాలం ముగియడంతో నూతన చీఫ్ జస్టిస్‌గా దీపక్ మిశ్రా చేత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణం చేయించారు. మిశ్రా ఈ పదవిలో 13 నెలలు కొనసాగుతారు. కరెంట్ అఫైర్స్ మూడు క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా ఉత్తర కొరియా మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు అమెరికా సైనిక అధికారులు ఆగస్టు 26న పేర్కొన్నారు. పసిఫిక్ సముద్ర తూర్పు జలాల్లో ఈ ప్రయోగాలు నిర్వహించిందని తెలిపారు. మొదటి రెండు విఫలమవడంతో మూడోది ప్రయోగించినట్లు చెప్పారు. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివే అన్నారు. నేపాల్‌తో ఎనిమిది ఒప్పందాలు నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా భారత పర్యటనలో ఆగస్టు 24న ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. తమ గడ్డపై భారత వ్యతిరేక కార్యకాలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎనిమిది ఒప్పందాలు కుదిరాయి. ఇందులో మాదకద్రవ్యాల రవాణాకు కళ్లెం వేయడం, భూకంప అనంతర పునర్నిర్మాణ చర్యలతోపాటు వివిధ అంశాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన ఒడంబడికలు ఉన్నాయి. అవార్డులు 2017 క్రీడా పురస్కారాలు 2017 ఏడాదికి క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 22న ప్రకటించింది. వీటిని ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. ఇద్దరికి ‘రాజీవ్ ఖేల్‌రత్న’, ఏడుగురికి ‘అర్జున’, మరో ఏడుగురికి ‘ద్రోణాచార్య’, ముగ్గురుకి ‘ధ్యాన్‌చంద్’ పురస్కారాలు అందజేసింది. భారత పారా అథ్లెట్ దేవేంద్ర జఝరియాకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ ఖేల్‌రత్న దక్కింది. రియో పారాలింపిక్స్‌లో జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝరియా రెండు స్వర్ణాలు గెలుపొందాడు. 25 ఏళ్ల ఖేల్‌రత్న అవార్డుల చరిత్రలో ఈ పురస్కారాన్ని ఓ పారాలింపియన్ అందుకోవడం ఇదే తొలిసారి. దశాబ్ద కాలానికి పైగా భారత హాకీకి సేవలందిస్తున్న మాజీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు కూడా ఖేల్‌రత్న దక్కింది. ∙ రాజీవ్ ఖేల్‌రత్న: దేవేంద్ర జఝరియా (పారా అథ్లెటిక్స్), సర్దార్ సింగ్ (హాకీ) ∙అర్జున: జ్యోతి సురేఖ(ఆర్చరీ), సాకేత్ మైనేని(టెన్నిస్), ఖుష్బీర్ కౌర్, రాజీవ్ (అథ్లెటిక్స్), ప్రశాంతి(బాస్కెట్ బాల్), దేవేంద్రోసింగ్(బాక్సింగ్); పుజారా, హర్మన్ ప్రీత్ కౌర్(క్రికెట్); ఒయినమ్ బెంబెందేవి(ఫుట్‌బాల్), చౌరాసియా (గోల్ఫ్), సునీల్(హాకీ), జస్వీర్ సింగ్ (కబడ్డీ), ప్రకాశ్ నంజప్ప(షూటింగ్), ఆంథోనీ అమల్‌రాజ్ (టేబుల్ టెన్నిస్), మరియప్పన్ తంగవేలు, వరుణ్ భటి (పారా అథ్లెటిక్స్), సత్యవర్త్ కడియన్ (రెజ్లింగ్). ద్రోణాచార్య: డాక్టర్ ఆర్.గాంధీ (అథ్లెటిక్స్), హీరానంద్ కటారియా (కబడ్డీ), జీఎస్వీ ప్రసాద్(బ్యాడ్మింటన్), బ్రిజ్ భూషన్ మహంతి(బాక్సింగ్), రోహన్‌లాల్(రెజ్లింగ్), రాఫెల్(హాకీ), సంజయ్ చక్రవర్తి(షూటింగ్). ధ్యాన్‌చంద్: భూపిందర్ సింగ్(అథ్లెటిక్స్), సయ్యద షాహిద్ హకీం(ఫుట్‌బాల్), సుమరాయ్ టకే(హాకీ). -
జాతీయ సమైక్యత
భారతదేశం విభిన్న మతాలు, సంస్కృతులు, జాతులు, భాషలు, కులాలు, తెగలు, భౌగోళిక ప్రత్యేకతలకు నిలయం. దేశంలో ఉన్న వైవిధ్యాలు, వైరుధ్యాలు ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఈ వైవిధ్యాల వల్ల దేశంలో జాతీయ సమైక్యతతో కూడిన సమగ్ర అభివృద్ధిని సాధించడం పాలకులకు సవాలుగా మారింది. దేశంలో సామాజిక నిర్మితి మత, కుల ప్రాతిపదికపై ఉండటం వల్ల జాతీయ సమైక్యతకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. జాతీయ సమైక్యత అనేది ఒక ప్రబలమైన మానసిక భావోద్వేగం. ఒక ప్రాంతంలో కొన్నేళ్లపాటు జీవించినప్పుడు ఆ ప్రాంతం పట్ల మమకారం, ప్రేమ, అనుబంధం ఏర్పడతాయి. అలాంటి సందర్భాల్లో జాతి, మత, కుల, లింగ, ప్రాంత భేదాలు లేకుండా మనమంతా భారతీయులమనే విశాల, ఉదాత్త భావోద్వేగం కలుగుతుంది. దేశం పట్ల ఉన్న ఇలాంటి భావజాలాన్ని జాతీయ సమైక్యత అంటారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయం ప్రకారం జాతీయ సమైక్యత అనేది ప్రజాబాహుళ్య ఆలోచనల పరంపర నుంచి వెలువడే మేధో కాంతి వంటిది. జాతీయ సమైక్యత అనేది రాజకీయ, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక మనోవైజ్ఞానిక రంగాలకు సంబంధించింది. అలాగే ఆయా రంగాల్లో ప్రజలందరి మధ్య సత్సంబంధాలను ఏర్పరచే ఒక బృహత్తర కార్యభావం. జాతీయ సమైక్యతకు అవరోధాలు/సమస్యలు జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న అవరోధాలు లేదా సమస్యలను కింది విధంగా పేర్కొనవచ్చు. అవి..మతతత్వం: భారతదేశం అనేక మతాలకు నిలయం. భారత రాజ్యాంగం అన్ని మతాల పట్ల సమాన గౌరవం, తటస్థ వైఖరి కలిగి ఉంటుంది. మత స్వేచ్ఛను రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అల్ప సంఖ్యాక వర్గాలకు ప్రత్యేక హక్కులను కల్పించింది. అయితే దేశంలో పలు మతాల మధ్య గల భేదాల ఆధారంగా మతతత్వాన్ని ఒక రాజకీయవాదంగా ఉపయోగించుకోవడం వల్ల అది మతమౌఢ్యానికి దారితీసింది. చారిత్రకంగా పరిశీలిస్తే మన దేశంలో బ్రిటిష్ పాలనా కాలంలోనే మత గుర్తింపులు ప్రస్ఫుటంగా వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ వారి కాలంలో మత ప్రాతిపదికన ఏర్పాటైన సంస్థలు, ప్రత్యేక ఓటర్లు, బ్రిటిష్ వారి విభజించు–పాలించు విధానం, మహ్మద్ అలీ జిన్నా ప్రతిపాదించిన ద్విజాతి సిద్ధాంతం మొదలైన వాటి ఫలితంగా భారత్ రెండు దేశాలుగా విడిపోయింది (పాకిస్థాన్ విడిపోవడం). ఈ విభజన ఒక విషాద ఘటనగా మిగిలిపోయింది. ఈ సందర్భంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో మత ప్రాతిపదికన ప్రజలను సమీకరించే ప్రయత్నం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ప్రజల్లో మత విభజన స్పష్టంగా గోచరిస్తుంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, బిహార్, గుజరాత్, మహారాష్ట్రల్లో మతపరమైన హింస జరుగుతూనే ఉంది. ఇందిరాగాంధీ హత్యానంతరం సిక్కు వ్యతిరేక సంఘర్షణలు, అలాగే బాబ్రీ మసీదు సంఘటన, గుజరాత్లో జరిగిన మత ఘర్షణలు దేశ సమైక్యతకు సవాలుగా మారాయి. కులతత్వం భారత సమాజంలో అనేక కులాలు, ఉపకులాలు ఉన్నాయి. కులపరమైన ప్రత్యేకతలు, కుల సంఘీభావం ఉండటం సమంజసమే. అయితే అది కులతత్వంగా పరిణమించినప్పుడు జాతి సమైక్యతకు ప్రమాదంగా మారుతోంది. కుల తత్వమంటే ఒక కులం పట్ల మరొక కులం ఈర్ష్య, ద్వేషం, పక్షపాతంతో కూడిన ప్రవర్తన. అధికారం కోసం రాజకీయ పార్టీలు కులాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాయి. తద్వారా సమాజం కుల ప్రాతిపదికన విడిపోతోంది. అది దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమిస్తోంది. ఉగ్రవాదం, తీవ్రవాదం ఇటీవలి కాలంలో ఇవి అంతర్జాతీయ సమస్యలుగా పరిణమించాయి. భారత్‌తో పాటు చాలా దేశాలు ఈ సమస్యతో సతమతమవుతున్నాయి. ఉగ్రవాదం, తీవ్రవాదం పదాలకు నిర్వచనాలు వేరైనా వాటి ప్రభావం మాత్రం సమాజంపై ఎక్కువగా ఉంటోంది. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో జరుగుతున్న బాంబు పేలుళ్లు, కశ్మీర్లో నిత్యం జరిగే అల్లర్లు భారత ఐక్యతకు, సమగ్రతకు ప్రధాన సవాళ్లుగా పరిణమించాయి. నేరమయ రాజకీయాలు ఆధునిక వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి తీవ్ర సవాలుగా మారిన అంశం రాజకీయ ప్రక్రియ నేరమయం కావడం. 1993లో ఎన్ఎన్ వోహ్రా కమిటీ ఈ అంశంపై సా«ధికారిక నివేదిక ఇచ్చింది. కొందరు రాజకీయ నాయకులు, మాఫియా కుమ్మక్కై భూముల ఆక్రమణ, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ అనే స్వచ్ఛంద సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పలు వివరాలను వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన సుమారు 5380 మంది అభ్యర్థులు ఇచ్చిన అఫిడవిట్లలో 17% మందిపై నేరారోపణలు, 10% మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో 30%, మహారాష్ట్రలో 26%, బిహార్‌లో 16%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 11% మంది అభ్యర్థులపై నేరారోపణలున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ పాలనకు ఇది పెను సవాలుగా మారింది. ప్రాంతీయ తత్వం మితిమీరిన ప్రాంతీయ తత్వం దేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రమాదం. రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ప్రాంతీయ ఉద్యమాలు భాష, సంస్కృతుల పరిరక్షణకు మాత్రమే పరిమితమై ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో ఈ సమస్య సమసిపోయింది. ఆ తర్వాతి కాలంలో అంటే 1975 తర్వాత ప్రాంతీయ ఉద్యమాలు ఆర్థిక సమానత్వం కోసం వచ్చాయి. ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలు ఇతర ప్రాంతాల ఆధిపత్యానికిలోనై సాంస్కృతిక ప్రత్యేకతను కోల్పోతాయి. మొదట్లో ఈ ఉద్యమాలకు సంబంధించి వాటి న్యాయమైన సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినా తర్వాత వాటిని అణగదొక్కే యత్నం జరిగింది. దీంతో అవి శాంతిభద్రతలు, ఐక్యత, సమగ్రతలకు తద్వారా రాజ్యాంగ అమలుకు సవాలుగా మారాయి. అలాగే గిరిజనులు, దళితులు, పేద రైతులు, కార్మికులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. ఇలాంటివి దేశంలో ఏదో ఒక చోట తలెత్తుతున్నాయి. వాటిని పరిష్కరించడం లేదా అణచివేయడం వల్ల మరికొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయి. ముగింపు జాతీయ సమైక్యతకు ఎదురవుతున్న సమస్యలను విశాల దృక్పథంతో పరిశీలిస్తే వాటిలో ప్రధాన మైనవి ఆర్థిక సమస్యలని స్పష్టమవుతుంది. ఆర్థిక వెనకబాటుతనం, పేదరికం వివిధ రూపాల్లో వేర్పాటువాదానికి, భూమి పుత్రుల భావానికి దారితీస్తుంది. తద్వారా ప్రాంతీయ, ఉపప్రాంతీయ భావజాలం బలపడుతూ ఉంది. మౌలిక సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, సాంఘిక వివక్షతలు, తీవ్రవాద, ఉగ్రవాదాలకు కారణంగా మారాయి. అందువల్ల సంతులిత ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రజలు జాతీయ భావాలను పెంపొందించుకోవాలి. ఈ మేరకు విద్యను సార్వత్రికం చేయాలి. జాతీయ సమైక్యతను పెంపొందించే మార్గాలు ప్రజల్లో మత, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే కార్యక్రమాలకు రాజకీయ పార్టీలు దూరంగా ఉండాలి. జాతి, కుల, భాషా భేదాలను ప్రోత్సహించకూడదు. మత సమస్యలను పరిష్కరించేందుకు రాజ్యాంగేతర ఆందోళన పద్ధతులను అనుమతించకూడదు. రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని ఉపయోగించకూడదు. పాఠ్యాంశాల్లో మతతత్వ అంశాలను తొలగించాలి. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేయాలి. -
అత్యంత నివాసయోగ్య నగరం?
‘చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’లోచ ప్రధాని ప్రసంగం నీతి ఆయోగ్ నేతృత్వంలో ఆగస్టు 17న ‘చాంపియన్స్ ఆఫ్ ఛేంజ్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రభుత్వ చర్యలు, కార్యక్రమాలతోనే నవ భారత నిర్మాణం జరగదని, ప్రతి భారతీయుడూ మార్పు కోసం శ్రమించాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో 200 మంది యువ స్టార్టప్ వాణిజ్యవేత్తలు పాల్గొన్నారు. సాఫ్ట్ పవర్, ఇంక్రెడిబుల్ ఇండియా 2.0, విద్య– నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం–పౌష్టికాహారం, డిజిటల్ ఇండియా, 2022 నాటికి నవ భారత నిర్మాణం తదితర ఇతివృత్తాలతో ప్రజెంటేషన్ ఇచ్చారు. డిజిటల్ పోలీస్ పోర్టల్ సేవలు ప్రారంభం డిజిటల్ పోలీస్ పోర్టల్(డీపీపీ)ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆగస్టు 21న ప్రారంభించారు. నేరాలు, నేరస్థులపై నిఘా నెట్వర్క్ వ్యవస్థలు (సీసీటీఎన్ఎస్) అనే ప్రాజెక్టులో భాగంగా దీన్ని రూపొందించారు. నేరాలు, నేరస్థుల వివరాలతో జాతీయ సమాచార నిధి ఏర్పాటే సీసీటీఎన్ఎస్ లక్ష్యం. ఈ పోర్టల్ ద్వారా దేశవ్యాప్తంగా ఆన్లైన్లో ఫిర్యాదుల నమోదు, వివరాల ధ్రువీకరణ, అభ్యర్థనలు తదితర సేవలు అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు 11 శోధన సదుపాయాలను, 46 నివేదికలను రాష్ట్ర పోలీస్ విభాగాలు, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు, పరిశోధన సంస్థలు పొందొచ్చు. సీసీటీఎన్ఎస్ సమాచార నిధిలో ఇప్పటివరకు ఏడు కోట్ల నేరాలకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. బిహార్ వరదల్లో 98 మంది మృతి బిహార్‌లో వరదల వల్ల ఆగస్టు 18 నాటికి 98 మంది ప్రాణాలు కోల్పోయారు. 15 జిల్లాలకు చెందిన 93 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2.13 లక్షల మంది 504 సహాయక శిబిరాల్లో తలదాచుకున్నారు. జాతీయ రహదారులతోపాటు 124 రోడ్లు ధ్వంసమయ్యాయి. 70 మంది ఆర్మీ సిబ్బంది, 114 ఎన్డీఆర్ఎఫ్, 92 ఎస్డీఆర్ఎఫ్ బోట్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో 22 మంది మృతి ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా ఖత్‌లి వద్ద ఆగస్టు 19న పట్టాలు తప్పడంతో 22 మంది మరణించారు. 156 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అమెరికా నుంచి భారత్‌కు తొలిసారిగా ముడి చమురు దిగుమతి ప్రపంచంలో మూడో అతి పెద్ద ముడి చమురు దిగుమతిదారు అయిన భారత్ తొలిసారిగా అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. మొదటి దఫా రవాణా ఆగస్టు 8–14 మధ్య మొదలైంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కొనుగోలు చేసిన ఈ చమురు సెప్టెంబర్‌లో భారత్‌కు చేరనుంది. ప్రధాని నరేంద్ర మోదీ జూన్‌లో అమెరికాలో పర్యటించినప్పుడు ఇరు దేశాలు ఇంధన రంగంలో సహకరించుకోవాలని నిర్ణయించడంతో చమురు కొనుగోలు మొదలైంది. ఇందులో భాగంగా ఐఓసీ అమెరికా నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేసింది. దీంతో అగ్ర రాజ్యం నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాల జాబితాలో ఇప్పుడు భారత్ కూడా చేరింది. దక్షిణ కొరియా, జపాన్, చైనా, థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా, తైవాన్ ఇప్పటికే అమెరికా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాయి. పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ(ఒపెక్).. ముడి చమురు ఉత్పత్తిలో కోత విధించడంతో ధరలు పెరిగాయి. దీంతో మధ్య ప్రాచ్య దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఇతర ప్రాంతాల నుంచి చమురు కొనుగోలును ప్రారంభించాయి. కరెంట్ అఫైర్స్ అత్యంత నివాసయోగ్య నగరంగా మెల్బోర్న్ ప్రపంచంలో అత్యంత నివాసయోగ్య నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ ఎంపికైంది. ఆస్ట్రియా రాజధాని వియన్నా, కెనడాలోని వాంకోవర్, టొరంటో, కల్గరీ.. వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. మొత్తం 140 నగరాల్లో స్థిరత్వం, ఆరోగ్య సేవలు, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు తదితర 30 అంశాల ఆధారంగా సర్వే చేశారు. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలను ఆగస్టు 17న న్యూయార్క్‌లో విడుదల చేశారు. ‘బాల మేధావి’ రాహుల్ దోశి బ్రిటన్‌లోని టీవీ చానల్ 4 నిర్వహించిన చైల్డ్ జీనియస్ క్విజ్ పోటీల్లో భారత సంతతికి చెందిన రాహుల్ దోశి విజేతగా నిలిచాడు. ఆగస్టు 19న నిర్వహించిన ఈ పోటీలో రాహుల్ 162 ఐక్యూ (ఇంటలిజెంట్ కోయిషెంట్) స్కోర్ సాధించాడు. ఇది అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూల కన్నా ఎక్కువ. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త వార్షిక సైనిక విన్యాసాలు ఆగస్టు 21న ప్రారంభమయ్యాయి. తమ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతాయన్న ఉత్తర కొరియా అభ్యంతరాల మధ్యే ఈ విన్యాసాలు జరగడం గమనార్హం. వేలాది మంది సైనికులు ఈ ఉల్చి–ఫ్రీడం గార్డియన్ సంయుక్త సైనిక కసరత్తు నిర్వహించారు. దక్షిణ కొరియాలో రెండు వారాల పాటు సాగే ఈ విన్యాసాల్లో క్షేత్ర స్థాయిలో కాల్పులు, యుద్ధ ట్యాంకుల విన్యాసాలు వంటివేవీ లేకుండా కంప్యూటర్ల ఆధారంగా సాధన జరుగుతుంది. వీటిలో సుమారు 17,500 మంది అమెరికా సైనికులు, 50 వేల మంది దక్షిణ కొరియా సైనికులు పాల్గొంటారు. కాగా ఇవి రక్షణాత్మక విన్యాసాలేనని, ద్వీపకల్పంలో ఉద్రిక్తతల్ని రెచ్చగొట్టేవి కాదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జేఇన్ పేర్కొన్నారు. అమెరికాలో 99 ఏళ్ల తర్వాత సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికాలో ఆగస్టు 21న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడింది. ఒరెగాన్(పశ్చిమ తీరం)లోని లింకన్ బీచ్‌లో మొదలైన ఈ గ్రహణం 14 రాష్ట్రాల ద్వారా సాగింది. దీని వల్ల 70 కిలోమీటర్ల వెడల్పు ప్రాంతం చీకటిమయమైంది. అగ్రరాజ్యంలో దాదాపు 99 ఏళ్ల తర్వాత సంభవించిన ఈ సంపూర్ణ సూర్యగ్రహణం సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది. స్పెయిన్ ఉగ్రదాడిలో 13 మంది మృతి స్పెయిన్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం బార్సిలోనాలోని లాస్ రాంబ్లాస్‌లో ఆగస్టు 17న ఓ వ్యాను పర్యాటకులపైకి దూసుకుపోవడంతో 13 మంది మరణించారు. 50 మందికిపైగా గాయపడ్డారు. ఇది ఉగ్రవాదుల దాడి అని పోలీసులు ధ్రువీకరించారు. రోదసీలోకి చేరిన తొలి సూపర్ కంప్యూటర్ మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ (స్పేస్ బర్నో కంప్యూటర్) ఆగస్టు 16న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరింది. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 7న ఫ్లోరిడాలోని కేప్‌కెనవారాల్‌లో నిర్వహించారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన 2,900 కిలోల మానవ రహిత రవాణా వ్యోమ నౌక డ్రాగన్ ఈ సూపర్ కంప్యూటర్ను మోసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న వ్యోమగాములకు ఈ నౌక ఆహారం, ప్రత్యేక దుస్తులను కూడా తీసుకెళ్లినట్లు నాసా పేర్కొంది. సూపర్ కంప్యూటర్ను హ్యూలెట్ ఎయాకార్డ్ సంస్థ రూపొందించింది. ఇది స్పేస్ ఎక్స్‌కు సంబంధించి 12వ అంతరిక్ష ప్రయోగం. ఈ సూపర్ కంప్యూటర్ అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణంలో పనిచేయగలదా లేదా అనే అంశాన్ని పరిశోధకులు పరీక్షించనున్నారు. నౌకాదళంలోకి ఉభయచర యుద్ధనౌక నేల పైన, సముద్రంలోనూ పోరాడగల ఉభయచర యుద్ధనౌక ఆగస్టు 21న భారత నౌకాదళంలో చేరింది. ఈ అధునాతన ల్యాండింగ్ క్రాఫ్ట్ యుటిలిటీ (ఎల్సీయూ) ద్వారా యుద్ధ ట్యాంకులను, ఇతర భారీ ఆయుధ వ్యవస్థలను, సైనిక బలగాలను యుద్ధ రంగానికి రవాణా చేయొచ్చు. దీన్ని కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ యుద్ధ నౌక అండమాన్ దీవుల్లో విధులు నిర్వర్తిస్తుంది. ఈ శ్రేణికి చెందిన మరో ఆరు నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి వచ్చే రెండేళ్లలో నౌకాదశంలో చేరనున్నాయి. ఉమెన్ హెల్ప్ లైన్ 181 ప్రారంభం తెలంగాణలో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 24 గంటల హెల్ప్ లైన్ నంబర్ 181ను ఆగస్టు 19న ప్రారంభించారు. వేధింపులు, దాడులకు గురైన మహిళలు హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సాయం కోరవచ్చు. ఫోన్ చేసిన మహిళలకు సఖీ కేంద్రాలు, అంబులెన్స్, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ల ద్వారా సేవలందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆపదలో ఉన్నవారికి తాత్కాలిక వసతి కూడా కల్పిస్తారు. -
ప్రయాణం, పర్యాటకం
ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణ, పర్యాటక రంగం.. అత్యంత ప్రాధాన్యత గల పరిశ్రమగా రూపొందింది. పర్యాటక రంగ అభివృద్ధి.. రవాణా, వసతి, పర్యాటకులను ఆకర్షించడం, మార్కెటింగ్, ప్రభుత్వ నియంత్రణ తదితర అనేక అంశాలపై ఆధారపడి ఉంది. పర్యాటక రంగం.. విదేశీ మారక ద్రవ్య ఆర్జన ద్వారా సంపదను సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. స్మిత్ (1995) అభిప్రాయంలో పర్యాటక రంగ పరిశ్రమ ముఖ్య లక్షణం.. శ్రమ సాంద్రత.ఈ పరిశ్రమ ఉపాధి అవకాశాలను పెంపొందిస్తుంది. ఒకే ఆదాయ స్థాయి, పెట్టుబడి మూలధనం వద్ద వ్యవసాయం, ఆటోమొబైల్, పెట్రోకెమికల్ రంగాల్లో కల్పించే ఉపాధి కంటే ప్రయాణ, పర్యాటక రంగంలో కల్పించే ఉపాధి అధికంగా ఉంటుంది. ప్రయాణ, పర్యాటక రంగం.. నైపుణ్యం లేని, మధ్యస్థ నైపుణ్యాలున్న, పూర్తిస్థాయి నైపుణ్యాలున్న శ్రామికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి (World Travel and Tourism Council )..‘ప్రయాణ, పర్యాటక రంగ ఆర్థిక ప్రభావం–2017’ పేరుతో విడుదల చేసిన నివేదికలో 185 దేశాల్లోని పరిస్థితులను వివరించింది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక మండలి నివేదిక (2017) ఐక్యరాజ్యసమితి 2017ని ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ సస్టెయినబుల్ టూరిజం ఫర్ డెవలప్మెంట్’గా వర్ణించింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక రంగాల్లో ఒకటైన ప్రయాణ, పర్యాటక రంగం ప్రపంచవ్యాప్తంగా ఉపాధి కల్పనతోపాటు ఎగుమతుల పెంపు, సంపద సృష్టికి దోహదపడుతోంది. ఇది ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, పర్యావరణ, వారసత్వ విలువల పెంపునకు దోహదపడగలదని భావించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తీవ్రవాద కార్యకలాపాలు, రాజకీయ అస్థిరత్వ పరిస్థితులు ఉన్నప్పటికీ 2016లో ప్రత్యక్ష స్థూల దేశీయోత్పత్తి వృద్ధికి 3.1 శాతాన్ని తన వాటాగా అందించడంతో పాటు 60 లక్షల నికర అదనపు ఉద్యోగాలను సృష్టించింది. మొత్తంమీద ఈ రంగం 2016లో 7.6 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని (ప్రపంచ జీడీపీలో 10.2 శాతాన్ని) అందించడంతోపాటు 29.20 కోట్ల మందికి మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రతి 10 ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని ఈ రంగం తన వాటాగా కలిగి ఉంది. మొత్తం ప్రపంచ ఎగుమతుల్లో ఈ రంగం వాటా 6.6 శాతం కాగా ప్రపంచ సేవల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 30 శాతంగా నమోదైంది. 2017 వార్షిక నివేదిక 185 దేశాలు, ప్రపంచవ్యాప్తంగా 26 ప్రాంతాల్లో 2016లో ఈ రంగంలో జరిగిన అభివృద్ధితోపాటు వచ్చే పదేళ్లలో అభివృద్ధి అంచనాలను వెల్లడించింది. వృద్ధి దిశగా పర్యాటకం 2016తో పోల్చితే 2017లో ప్రపంచ ప్రయాణ, పర్యాటక రంగ వృద్ధి 2.1 శాతం ఉండగలదని అంచనా. 2016లో ఈ రంగం ప్రత్యక్షంగా 10.87 కోట్ల మందికి ఉపాధి కల్పించింది. మొత్తం ఉపాధిలో ఈ రంగం వాటా 3.6 శాతం. 2017–27 మధ్య కాలంలో ఈ రంగంలో సగటు ఉపాధి వృద్ధిని 2.2 శాతంగా అంచనా వేశారు. 2017లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి వృద్ధి 1.9 శాతంగా, 2027 నాటికి సగటు సాంవత్సరిక ఉపాధి వృద్ధి 2.5 శాతంగా ఉండగలదని అంచనా. గత ఆరేళ్లుగా ప్రయాణ, పర్యాటక రంగంలో వృద్ధి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును (2.5 శాతాన్ని) అధిగమించింది. 2016లోనూ ప్రయాణ, పర్యాటక రంగ వృద్ధి.. వరల్డ్ ట్రావెల్, టూరిజం కౌన్సిల్ రూపొందించిన ‘ప్రయాణ, పర్యాటకం – ఆర్థిక ప్రభావం 2017’ నివేదిక ప్రకారం మొత్తం 185 దేశాల్లోని 116 దేశాలు సాధించిన సగటు వార్షిక వృద్ధి కన్నా ఎక్కువ. ఆయా దేశాల్లో ఆర్థిక, వ్యాపార సేవలు; తయారీ, పౌర సేవలు; రిటైల్, పంపిణీ, రవాణా రంగం సాధించిన వృద్ధి కన్నా ప్రయాణ, పర్యాటక రంగం సాధించిన వృద్ధి అధికం. 2017లోనూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంపద, ఉపాధి కల్పనకు ప్రయాణ, పర్యాటక రంగం దోహదపడగలదని నివేదిక పేర్కొంది. ప్రత్యక్ష ప్రయాణ, పర్యాటక రంగ జీడీపీ వృద్ధి 2016లో 3.1 శాతం కాగా 2017లో 3.8 శాతానికి పెరగగలదని అంచనా. దీర్ఘకాలంలో ఈ రంగంలో పెట్టుబడి, అభివృద్ధి ఇదేవిధంగా కొనసాగితే ప్రయాణ, పర్యాటక రంగంలో వృద్ధి పటిష్టంగా ఉండగలదని నివేదిక స్పష్టం చేసింది. ప్రపంచ ప్రయాణ, పర్యాటక రంగ ప్రగతి – అంచనాలు 2016లో ప్రపంచ జీడీపీకి ప్రయాణ, పర్యాటక రంగం ప్రత్యక్ష వాటాగా 2,306 బిలియన్ డాలర్లను అందించగా జీడీపీలో ఈ రంగం మొత్తం వాటా 7,613.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. విజిటర్ ఎక్స్‌పోర్ట్స్ 1,401.5 బిలియన్ డాలర్లు, వ్యాపార వ్యయం 1,153.6 బిలియన్ డాలర్లు, మూలధన పెట్టుబడి 806.5 బిలియన్ డాలర్లుగా నమోదైంది. 2016లో ప్రపంచ స్వదేశీ వ్యయంలో ప్రయాణ, పర్యాటక రంగ వాటా 4.8 శాతం. కాగా లీజర్ స్పెండింగ్‌లో 2.3 శాతం, వ్యాపార వ్యయంలో 0.7 శాతం, మూలధన పెట్టుబడిలో 4.4 శాతం వాటాను ప్రయాణ, పర్యాటక రంగం నమోదు చేసుకుంది. 2017లో ప్రపంచ జీడీపీలో ప్రయాణ, పర్యాటక రంగ ప్రత్యక్ష వాటాలో వృద్ధి 3.8 శాతం. జీడీపీలో ఈ రంగం మొత్తం వాటాలో వృద్ధి 3.6 శాతంగా; మొత్తం ఉపాధికి సంబంధించి ప్రత్యక్ష వాటాలో 2.1 శాతంగా; ఉపాధిలో ఈ రంగం మొత్తం వాటాలో వృద్ధి 1.9 శాతంగా నమోదు కాగలదని అంచనా. 2017లో ప్రయాణ, పర్యాటక రంగం స్వదేశీ వ్యయంలో 3.7 శాతం. లీజర్ స్పెండింగ్‌లో 3.9 శాతం. వ్యాపార వ్యయంలో 4 శాతం. మూలధన పెట్టుబడిలో 4.1 శాతం వృద్ధిని ఈ రంగం నమోదు చేసుకుంటుందని అంచనా. 2027లో ప్రపంచ జీడీపీలో ప్రయాణ, పర్యాటక రంగ ప్రత్యక్ష వాటాలో వృద్ధి 4 శాతం, మొత్తం ఉపాధికి సంబంధించి ప్రత్యక్ష వాటాలో వృద్ధి 2.2 శాతంగా నమోదు కాగలదని అంచనా. 2027లో ప్రయాణ, పర్యాటక రంగానికి సంబంధించి స్వదేశీ వ్యయంలో వృద్ధి 3.9 శాతం, లీజర్ స్పెండింగ్‌లో 4.1 శాతం, వ్యాపార వ్యయంలో 3.7 శాతం, మూలధన వ్యయంలో ఈ రంగం 4.5 శాతం వృద్ధిని నమోదు చేసుకుంటుందని అంచనా. 2016లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం పెట్టుబడిలో ప్రయాణ, పర్యాటక రంగ పెట్టుబడి 4.4 శాతం (806.5 బిలియన్ డాలర్లు)గా నమోదైంది. 2017లో ఈ రంగం పెట్టుబడిలో 4.1 శాతం, రానున్న పదేళ్ల కాలంలో సగటున 4.5 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా. మొత్తం ఎగుమతుల్లో విజిటర్ ఎక్స్‌పోర్ట్స్ 2016లో 6.6 శాతం కాగా 2017లో ఈ మొత్తంలో 4.5 శాతం, 2017–27 మధ్య కాలంలో సగటున 4.3 శాతం పెరుగుదల ఉండగలదని అంచనా. n 2011లో ప్రపంచవ్యాప్తంగా అంతర్గత సందర్శకుల వినియోగం 4143.4 బిలియన్ డాలర్లు కాగా 2016లో 4976.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. 2017లో ఈ మొత్తం 5169.8 బిలియన్ డాలర్లుగా, 2027లో 7635.1 బిలియన్ డాలర్లుగా ఉండగలదని అంచనా. 2016లో మొత్తం ఎగుమతుల్లో విజిటర్ ఎక్స్‌పోర్ట్స్ వాటా 6.6 శాతం కాగా 2017లో విజిటర్ ఎక్స్‌పోర్ట్స్‌లో వృద్ధి 4.5 శాతంగా, 2027లో 4.3 శాతంగా ఉండగలదని అంచనా. 2011లో ప్రపంచంలోని ప్రభుత్వాల ఉమ్మడి వ్యయంలో వృద్ధి 1.4 శాతంగా, 2016లో 3.7 శాతంగా నమోదైంది. ఈ వ్యయంలో వృద్ధి 2017లో 2.6 శాతంగా, 2027లో 2.5 శాతంగా ఉండగలదని అంచనా. -
బయోటెక్నాలజీ ప్రయోజనాలు
జీవ సాంకేతిక శాస్త్రం అంటే ఏమిటి? దాని పరిధి, ప్రయోజనాలను వివరించండి? మానవాళి మనుగడకు, సంక్షేమానికి అవసరమైన ఉత్పత్తులను తయారు చేయడం కోసం సూక్ష్మజీవుల ధర్మాలను, వాటి వల్ల కలిగే ఉపయోగాలను లేదా కణాలు, వాటిలోని భాగాలను పారిశ్రామిక స్థాయిలో వినియోగించుకొనే విజ్ఞానమే జీవ సాంకేతిక శాస్త్రం. (లేదా) సూక్ష్మజీవులను లేదా వాటి శరీర భాగాలను ఉపయోగించి మానవజాతికి ఉపయోగకరమైన ఉత్పత్తులను తయారుచేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘జీవసాంకేతిక శాస్త్రం’ లేదా ‘బయోటెక్నాలజీ’ అంటారు. ఈ పదాన్ని మొదటిసారిగా కార్ల్ ఎరిక్ (1919) అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు. పరిధి: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అధిక దిగుబడినిచ్చే, వ్యాధి నిరోధకత కలిగిన వంగడాల అభివృద్ధికి, వ్యాక్సిన్ల తయారీకి, అధిక స్థాయిలో ఔషధాలు, రసాయనాలు, జీవ ఎరువులు, బయోపెస్టిసైడ్ల ఉత్పత్తికి జీవసాంకేతిక శాస్త్రం ఉపయోగపడుతుంది. జీవసాంకేతిక శాస్త్ర ప్రయోజనాలు వైద్యశాస్త్రంలో... మానవ హార్మోన్లయిన ఇన్సులిన్, పెరుగుదల హార్మోన్, ఇంటర్ఫెరాన్ వంటి వాటిని జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా వాణిజ్య పరంగా ఉత్పత్తి చేయడం. పోలియో, మశూచి, హెపటైటిస్–బి, డిఫ్తీరియా వంటి వ్యాధులను నియంత్రించే అధునాతన వ్యాక్సిన్ల తయారీ. సూక్ష్మజీవులను ఉపయోగించి విటమిన్లు ఉత్పత్తి చేయడం. సూక్ష్మజీవ నాశకాలైన పెన్సిలిన్, ఎరిథ్రోమైసిన్ వంటి యాంటీ బయాటిక్‌లను వాణిజ్య స్థాయిలో తక్కువ ధరకు ఉత్పత్తి చేయడం. వ్యాధులను గుర్తించే ఈజ్చీజnౌట్టజీఛి జుజ్టీటను ఉత్పత్తి చేయడం. ఉదా: ఎయిడ్స్ టెస్ట్ కిట్, మలేరియా టెస్ట్ కిట్, వైడల్ టెస్ట్ కిట్, గర్భనిర్ధారణ టెస్ట్ కిట్ మొదలైనవి. వ్యవసాయ రంగంలో జీవ సాంకేతిక శాస్త్రం అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ, పండ్లు, కూరగాయలు, ఇతర వంగడాలు, హైబ్రిడ్ విత్తనాలను ఉత్పత్తి చేయొచ్చు. వ్యాధి నిరోధక శక్తి కలిగిన వంగడాలను ఉత్పత్తి చేయొచ్చు ఉదా: ఆ్ట పత్తి, ఆ్ట వంకాయ. అధిక పోషక విలువలు కలిగిన పంటలు ఉత్పత్తి చేయొచ్చు. ఉదా: గోల్డెన్ రైస్ (విటమిన్–ఎ). వైరస్, కీటక, గుల్మనాశక నిరోధకతతో పాటు మంచి పోషక విలువలను కలిగిన వందలాది పరివర్తిత మొక్కలను ఉత్పత్తి చేయొచ్చు. జీవ ఎరువులు, జీవ కీటక నాశినులను, కృత్రిమ విత్తనాలను ఉత్పత్తి చేయొచ్చు. పరిశ్రమల్లో జీవ సాంకేతిక శాస్త్రం జీవ సాంకేతిక శాస్త్రం సహాయంతో వాణిజ్యపరంగా సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు వంటి వాటి నుంచి పారిశ్రామిక స్థాయిలో ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. జంతు ఎంజైమ్‌లు: లైపేజ్, ట్రిప్సిన్, రెన్నట్... వృక్ష ఎంజైమ్‌లు: పపైన్, ప్రోటియేజ్, అమైలేజ్.. సూక్ష్మజీవుల నుంచి∙లభించే ఎంజైమ్‌లు: గ్లూకోజ్, ఐసోమెరేజ్, ఆల్ఫా అమైలేజ్, ప్రోటియేజ్. ఈ ఎంజైమ్‌లను డిటర్జెంట్లు, పిండి పదార్థాలు, బీర్, వైన్, మందుల పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. ఉదా: మాంసాన్ని మృదువుగా ఉంచడానికి పపైన్ ఎంజైమ్, తోళ్లను మెత్తబరచడానికి ప్రోటియేజ్ను, జున్ను ఉత్పత్తికి రెన్నట్ను, ఆహార పదార్థాలకు రుచి తేవడానికి మోనో సోడియం గ్లుటామేట్ వంటివి వాడుతున్నారు. విటమిన్లు, హార్మోన్లు, ఆమైనో ఆమ్లాలను ఉత్త్పత్తి చేయొచ్చు. కృత్రిమ తీపి పదార్థాలను కూడా పారిశ్రామికంగా తయారు చేయొచ్చు. ఆహార రంగంలో అధిక పోషక విలువలు కలిగిన ఏక కణ ప్రొటీన్లను ( Single cell protein) ఉత్పత్తి చేయొచ్చు. ఉదా: స్పైరులినా. ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజలవణాలు, ఆవశ్యక అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభించే పుట్టగొడుగులను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేయొచ్చు. అధిక దిగుబడినిచ్చే జన్యు పరివర్తిత వంగడాలను ఉత్పత్తి చేయొచ్చు. ఉదా: ఆ్టవంకాయ, ఎఝసోయా, ఎఝ మొక్కజొన్న మొదలైనవి. నేర పరిశోధనలో జీవ సాంకేతిక శాస్త్రం D.N.A ఫింగర్ ప్రింటింగ్ సహాయంతో నేర నిర్ధారణ చేయొచ్చు. అలాగే జీవుల ఆవిర్భావం, వర్గీకరణ మొదలైన వాటి గురించి తెలుసుకోవచ్చు. పర్యావరణంలో జీవ సాంకేతిక శాస్త్రం బయోమైనింగ్, బయోరెమిడియేషన్ పద్ధతుల ద్వారా పర్యావరణాన్ని శుభ్రపర్చొచ్చు. కాలుష్యాన్ని తగ్గించే సూక్ష్మజీవులను ఉత్త్పత్తి చేయొచ్చు. బయోగ్యాస్, వర్మి కంపోస్ట్, బయోఫెర్టిలైజర్స్ వంటి పర్యావరణ హిత పద్ధతులను అభివృద్ధి చేయొచ్చు. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, ఇతర కాలుష్య కారకాల వల్ల భూమి కలుషితం అవుతోంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం జీవసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బయోరెమిడియేషన్, బయో స్క్రబ్బింగ్, బయోప్లాస్టిక్, బయోఫెర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, బయోడీజిల్, బయోగ్యాస్ వంటి వాటిని ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించొచ్చు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవసాంకేతిక శాస్త్రం ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రమాదవశాత్తు సముద్రంలో పడే ముడిచమురును విచ్ఛిన్నం చేయడానికి, ఓడరేవుల్లో చమురుతెట్టును తొలగించడానికి సూపర్‌బగ్‌గా పిలిచే సూడో మోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియాను ఉపయోగిస్తున్నారు. బయోరెమిడియేషన్: సూక్ష్మజీవులను ఉపయోగించి హానికర కాలుష్య కారకాలను నిర్వీర్యం చేయడం లేదా తొలగించడాన్ని బయోరెమిడియేషన్ అంటారు. వృక్ష ప్లవకాలు లేదా మొక్కల సాయంతో పర్యావరణంలోని కాలుష్య కారకాలను తొలగించడాన్ని ఫైటోరెమిడియేషన్ అంటారు. ఉదా: క్లోరెల్లా, యూగ్లీనా, క్లామిడోమోనాస్, సిన్డెస్మస్ తదితర శైవలాలు మురుగునీటిలోని కర్బన పదార్థాలను తొలగిస్తాయి. నీటి నుంచి కాపర్, పాదరసం, యురేనియం మూలకాలను క్లోరెల్లా తొలగిస్తుంది. రైజోపస్, ఆస్పరజిల్లస్, పెన్సిలియం, న్యూరోస్పోరా తదితర శిలీంధ్రాలు లెడ్, పాదరసం వంటి మూలకాలను తొలగిస్తాయి. పాడి, చెరకు, పండ్లరసాల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు పర్యావరణానికి హాని చేస్తాయి. ఈ వ్యర్థాల ఆధారంగా పుట్టగొడుగులు పెంచడంతోపాటు ఏకకణ ప్రొటీన్లను ఉత్పత్తి చేయొచ్చు. ఈ విధానం ద్వారా పర్యావరణానికి కలిగే హానిని నివారించొచ్చు. బయోఫెర్టిలైజర్స్: రసాయన ఎరువుల వల్ల విపరీతమైన కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల నత్రజని లోపం ఉన్న నేలల్లో రసాయన ఎరువులకు బదులుగా జీవ ఎరువులైన రైజోబియం, నాస్టాక్, అనాబినా, అజోల్లా, అజటోబ్యాక్టర్, బాసిల్లస్, సూడోమోనాస్ వంటి సూక్ష్మజీవులను జీవ ఎరువులుగా ఉపయోగించి రసాయన ఎరువుల వాడకాన్ని నివారించాలి. ఈ విధానం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించొచ్చు. ∙బయోపెస్టిసైడ్స్: రసాయన పురుగు మందుల వల్ల ఎన్నో అనారోగ్యాలు కలుగుతున్నాయి. బాక్యులో వైరస్, ట్రైకోడెర్మా, బవేరియా బస్సీనా వంటి శైవలాలను క్రిమిసంహారకాలుగా వాడుతున్నారు. ప్రమాదకర లోహాల తొలగింపునకు.. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల్లో పాదరసం, ఆర్సెనిక్, కాడ్మియం, సీసం, నికెల్ వంటి ప్రమాదకర లోహాలుంటాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులను ఉపయోగించి వీటిని నిర్వీర్యం చేయొచ్చు. ఉదా: స్టెఫెలోకోకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా భూమి, నీటిలో ఉన్న పాదరసాన్ని తొలగిస్తుంది. కొరినే బ్యాక్టీరియం ఫ్లక్కమ్ ఫేషియన్స్ అనే బ్యాక్టీరియా.. నేల/నీటి నుంచి∙ఆర్సెనిక్‌ను తొలగిస్తుంది. సూడోమోనాస్ ఆర్గ్యునోసా అనే బ్యాక్టీరియా క్రోమియాన్ని తొలగిస్తుంది. ఎశ్చర్షియాకోలై అనే బ్యాక్టీరియా ఆర్సెనిక్, ఆంటిమొనీ లోహాలను, అనే జాతి రాగి లోహాలను తొలగిస్తుంది. ఆస్పరజిల్లస్ నైగర్, ప్యూసేరియా ఆక్సీస్పోరమ్, మ్యూకర్ వంటి శిలీంధ్రాలు పర్యావరణం నుంచి ఈఈఖీని తొలగిస్తాయి. జన్యు మార్పిడి పంటల ద్వారా పర్యావరణ పరిరక్షణ సిట్రేట్ సింథటేస్ అనే ఎంజైమ్ తయారీకి కావాల్సిన జన్యువును కలిగి ఉన్న ఎఝ బొప్పాయి, ఎఝ పొగాకు, ఎఝ మొక్కజొన్న, ఎఝ వరి వంటి జన్యు మార్పిడి మొక్కలు భూమిలో అధికంగా ఉన్న అల్యూమినియాన్ని తొలగిస్తాయి. ∙నైట్రోరిడక్టేస్ అనే ఎంజైమ్ తయారీకి కావాల్సిన జన్యువును కలిగి ఉన్న జన్యు మార్పిడి పొగాకు మొక్క భూమిలో పాతిపెట్టిన మందుపాతరల్లోని ప్రమాదకర పేలుడు పదార్థం నిర్వీర్యం చేస్తుంది. ∙బయోమైనింగ్: సూక్ష్మజీవులను, అవి విడుదలచేసే ఎంజైమ్‌లను ఉపయోగించి గనుల్లో నుంచి లోహాన్ని వేరుపరిచే ప్రక్రియనే బయోమైనింగ్ అంటారు. అలాగే కొన్ని సూక్ష్మజీవులు లోహాలను కూడా కరిగిస్తాయి. దీన్ని బయోలీచింగ్ అంటారు. ఉదా: థయోబాసిల్లస్ ఫెర్రోఆక్సిడెన్స్ – ఇనుప దాతువు నుంచి రాగిని వేరు చేస్తుంది. లెప్టోస్పెరిల్లం ఫెర్రోఆక్సిడెన్స్ – ఫెర్రస్, కాపర్లను కరిగిస్తుంది. ఆస్పర్జిల్లస్, పెన్సిలియమ్ – Pb, Ni, Al, Zn లను కరిగిస్తుంది. Biosorption: అంటే సూక్ష్మజీవుల సహాయంతో నీటిలో కరిగి ఉన్న లోహాలను తొలగించడం. సాధారణంగా ఎరువులు, తోళ్లు, వస్త్రాల తయారీ పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థపదార్థాల్లో ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, లెడ్, నికెల్, మెర్క్యురి, జింక్ లోహాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల సూక్ష్మజీవులు నీటిలో ఉన్న లోహాలను తొలగించి పరిసరాలను శుభ్రపరుస్తాయి. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదులు, సరస్సుల్లో ఈ సూక్ష్మజీవులను వదిలితే అవి నీటిని శుభ్రపరుస్తాయి.∙ ఉదా: హైపోమైక్రోబియం (మాంగనీస్), గాలియోనెల్లా (fe & cu) జీవసాంకేతిక విధానాలను ఉపయోగించి బంజరు భూములు, చవుడుబారిన నేలలను సారవంతంగా మార్చొచ్చు. బయోగ్యాస్ తయారీలో సమర్థ మీథేన్ జనకæ ఆర్కిబ్యాక్టీరియాన్ని ఉపయోగించడం ద్వారా అధిక ఫలితాన్ని పొందొచ్చు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల తయారీలో కూడా బయోటెక్నాలజీ ముఖ్య పాత్ర పోషిస్తోంది. నీలి ఆకుపచ్చ శైవలాలు, బ్యాక్టీరియమ్‌లు హైడ్రోజన్ ఉత్పత్తికి తోడ్పడతాయని కనుగొన్నారు. కాలుష్య రహిత హైడ్రోజన్ వాయువును అభివృద్ధి చేసి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించొచ్చు. ప్రవీణ్ దత్తు అధ్యాపకులు, ఎల్.హెచ్.ఆర్. ్రప్రభుత్వ డిగ్రీ కళాశాల, మైలవరం. -
జాబ్ పాయింట్
ఐబీపీఎస్...పీవో/ఎంటీ 3,562 ఖాళీలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. వివిధ బ్యాంకుల్లోని 3,562 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/ మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ) ఖాళీలకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్– సీడబ్ల్యూఈ పీవో/ ఎంటీ–7 ద్వారా దరఖాస్తులు కోరుతోంది. పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్మెంట్ ట్రైనీ (ఎంటీ). మొత్తం ఖాళీలు : 3,562 (అన్ రిజర్వుడ్–1,738 +ఓబీసీ 961+ ఎస్సీ– 578 + ఎస్టీ–285). అర్హతలు : ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి : 2017 ఆగస్ట్ 1 నాటికి 20–30 ఏళ్ల లోపు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం : మూడు దశల్లో ఉంటుంది. అవి.. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. పరీక్షల విధానం: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్లో నిర్వహిస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ : మార్కులు 100; వ్యవధి గంట. విభాగం ప్రశ్నలు మార్కులు మీడియం రీజనింగ్ ఎబిలిటీ 35 35 ఇంగ్లిష్, హిందీ ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 ఇంగ్లిష్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 35 ఇంగ్లిష్, హిందీ మొత్తం 10 100 మెయిన్ ఎగ్జామినేషన్: మొత్తం 225 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్– 45 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి గంట), జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్.. 40 ప్రశ్నలు 40 మార్కులకు (వ్యవధి 35 నిమిషాలు), ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్.. 35 ప్రశ్నలు 40 మార్కులు (40 నిమిషాలు), డేటా అనాలసిస్ అండ్ ఇంటర్‌ప్రిటేషన్.. 35 ప్రశ్నలు 60 మార్కులు (వ్యవధి 45 నిమిషాలు), లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే (ఇంగ్లిష్)–2 ప్రశ్నలు 25 మార్కుల (వ్యవధి 30 నిమిషాలు)కు ఉంటాయి. రుణాత్మక మార్కులు: ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్ రెండింట్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున నెగిటివ్ మార్కు ఉంటుంది. ఇంటర్వ్యూ: మెయిన్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూలో మార్కుల ఆధారంగా తుది ఎంపిక చేపడతారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో.. చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో.. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. మెయిన్ ఎగ్జామినేషన్ కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్‌లో.. గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో.. హైదరాబాద్. నోట్: ఐబీపీఎస్ నిర్ణయాన్ని బట్టి పరీక్షల కేంద్రాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన అభ్యర్థులకు రూ.600. దరఖాస్తు విధానం: వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. www.ibps.in ముఖ్య తేదీలు: ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: ఆగస్ట్ 16, 2017 ఆన్లైన్ దరఖాస్తుల ముగింపు: సెప్టెంబర్ 5, 2017 ఆన్లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ: ఆగస్ట్ 16, 2017– సెప్టెంబర్ 5, 2017 ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్‌లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2017 ప్రి–ఎగ్జామ్ ట్రైనింగ్ : సెప్టెంబర్ 23–29, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: సెప్టెంబర్, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(ఆన్లైన్): అక్టోబర్ 7,8,14,15, 2017 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫలితాలు: అక్టోబర్, 2017 మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్, 2017 మెయిన్ ఎగ్జామినేషన్(ఆన్లైన్): నవంబర్ 26, 2017 మెయిన్ ఎగ్జామినేషన్ ఫలితాలు: డిసెంబర్, 2017 ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్లోడ్: జనవరి, 2018 ఇంటర్వ్యూ: జనవరి/ఫిబ్రవరి, 2018 ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2018 యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 696 ఖాళీలు చెన్నైలోని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (యూఐఐసీఎల్).. దేశవ్యాప్తంగా ఉన్న తన శాఖల్లోని 696 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. యూఐఐసీఎల్ భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అసిస్టెంట్ వేతనం: రూ.14,435–రూ.32,030+ నిబంధనల మేర ఇతర అలవెన్సులు. ఉద్యోగ ప్రాంతాన్ని బట్టి వేతనంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. మొత్తం పోస్టులు: 696 (అన్‌రిజర్వుడ్–414, ఓబీసీ–122, ఎస్సీ–110, ఎస్టీ–50). తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్–32(అన్‌రిజర్వుడ్–14, ఓబీసీ–6, ఎస్సీ–7, ఎస్టీ–5); తెలంగాణ–20(అన్‌రిజర్వుడ్–13, ఎస్సీ–3, ఎస్టీ–4).అర్హతలు: ఏదైనా డిగ్రీ. అలాగే స్థానిక భాషలో మంచి పట్టు (మాట్లాడగలగడం, చదవడం, రాయడం) తప్పనిసరి. వయో పరిమితి: 2017 జూలై 30 నాటికి 18–28 ఏళ్ల లోపు ఉండాలి; ఎస్సీ /ఎస్టీ కేటగిరీలకు అయిదేళ్లు, ఓబీసీ–మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంది. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీల్లోని దివ్యాంగ అభ్యర్థులకు, ఎక్స్–సర్వీస్‌మెన్ కేటగిరీకి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఇందులో టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్), టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్) దశలు ఉంటాయి. ఠి పరీక్షల (ప్రిలిమినరీ, మెయిన్) విధానం: టైర్–1 (ప్రిలిమినరీ ఎగ్జామినేషన్) ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్–30 ప్రశ్నలు, రెండో విభాగంలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్–35, మూడో విభాగంలో టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఇందులో కనీస అర్హత మార్కులు వచ్చిన అభ్యర్థుల్లో రాష్ట్ర, కేటగిరీ ప్రకారం 1:7 నిష్పత్తిలో మెరిట్ జాబితా తయారుచేస్తారు. వీరికి టైర్–2 (మెయిన్) ఎగ్జామినేషన్ ఉంటుంది. టైర్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో ఐదు విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 50 మార్కుల చొప్పున మొత్తం 250 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులోని ఐదు విభాగాలు.. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్, టెస్ట్ ఆఫ్ న్యూమెరికల్ ఎబిలిటీ. ఇందులోనూ నిర్దేశిత మార్కులతో ఉత్తీర్ణులైన వారికి స్థానిక భాషపై పరీక్ష (రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్) ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయితే ఆర్నెళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. అభ్యర్థి పనితీరు, ప్రవర్తన ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పరీక్ష కేంద్రాలు(తెలుగు రాష్ట్రాల్లో): ఆంధ్రప్రదేశ్–చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, కంచికచర్ల, ఏలూరు, విజయనగరం; తెలంగాణ–హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100; మిగిలిన కేటగిరీలకు రూ.500. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 28, 2017. వెబ్సైట్: www.uiic.co.in కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ 172 ఖాళీలు కేరళలోని కొచిలో ఉన్న కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్.. 172 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన వెలువరించింది. పోస్టు పేరు–ఖాళీలు: గ్రాడ్యుయేట్ అప్రెంటీసెస్–72(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–12, మెకానికల్ ఇంజనీరింగ్–27, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–6, సివిల్ ఇంజనీరింగ్–12, కంప్యూటర్‌సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ–8, సేఫ్టీ ఇంజనీరింగ్–3, మెరైన్ ఇంజనీరింగ్–2, నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ షిప్‌బిల్డింగ్–2) ; టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటీసెస్–100(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్–22, మెకానికల్ ఇంజనీరింగ్–28, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్–8, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్–7, సివిల్ ఇంజనీరింగ్–9, కంప్యూటర్ ఇంజనీరింగ్–6, కమర్షియల్ ప్రాక్టీస్–20). శిక్షణ వ్యవధి: ఏడాది స్టైపెండ్: గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌కు రూ.8,000; టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్–రూ.7 వేలు అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి బీఈ/ బీటెక్/డిప్లొమా. వయో పరిమితి: అప్రెంటీస్‌షిప్ నిబంధనల ప్రకారం. ఎంపిక విధానం: విద్యార్హతల మార్కుల శాతం అనుసరించి షార్ట్‌లిస్టింగ్. దరఖాస్తు విధానం: ఎన్ఏటీఎస్ (నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్)లో రిజిస్టర్ అయి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017. వెబ్సైట్: www.cochinshipyard.com ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్లో 56 ఖాళీలు ముంబై పోర్ట్ స్పోర్ట్స్ క్లబ్.. 56 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. పోస్టు పేరు: స్పోర్ట్స్ ట్రైనీ పోస్టులు: 56 (పురుషులు 54+మహిళలు 2). ఖాళీలు: అథ్లెటిక్స్–5, షటిల్ బ్యాడ్మింటన్–3, బాడీ బిల్డింగ్–2, క్రికెట్–8, ఫుట్‌బాల్–9, హాకీ–9, కబడ్డీ–7, టేబుల్ టెన్నిస్–2, వాలీబాల్–6, వెయిట్ లిఫ్టింగ్–5. నోట్: అథ్లెటిక్స్ విభాగంలో రెండు పోస్టులను మహిళలకు కేటాయించారు. మిగిలినవన్నీ పురుషులకే. అర్హతలు: సంబంధిత క్రీడా విభాగాల్లో మూడేళ్లుగా (2014, 2015, 2016) దేశం తరఫున అంతర్జాతీయ/జాతీయ పోటీల్లో పాల్గొని ఉండాలి. లేదా జాతీయ స్థాయిలో కంబైన్డ్ యూనివర్సిటీ టీమ్‌లో కానీ, యూనివర్సిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ నిర్వహించిన ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో కానీ పాల్గొని ఉండాలి. ‘ఏ’ డివిజన్ క్రికెట్ లేదా సూపర్/ఎలైట్ డివిజన్ (హాకీ, ఫుట్‌బాల్)లో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. వయో పరిమితి: 2017 ఆగస్ట్ 10 నాటికి 18–26 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపిక విధానం: క్రీడా విభాగాల్లో సాధించిన విజయాల ఆధారంగా... స్టైపెండ్: రూ.15 వేలు. ఇదికాక కిట్‌కు రూ.10 వేలు, మెడికల్ క్లైమ్ + యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ రూ.3,500 (ఏడాదికి) ఉంటాయి. ఉచిత వసతి కల్పిస్తారు. దరఖాస్తు ఫీజు: రూ.100 దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీలు పంపాల్సిన చిరునామా: జేటీ.జనరల్ సెక్రెటరీ, ముంబై పోర్ట్ ట్రస్ట్ స్పోర్ట్స్ క్లబ్, సెకండ్ ఫ్లోర్, రైల్వే మేనేజర్స్ బిల్డింగ్, రామ్‌జీ భాయ్ కమని మార్గ్, నియర్ వసంత్ హోటల్, బల్లార్డ్ ఎస్టేట్, ముంబై–400001. దరఖాస్తులు చేరడానికి చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017 www.mumbaiport.gov.in ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 300ఖాళీలు ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్(ఓఐసీఎల్)లో 300 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. ఓఐసీఎల్.. భారత ప్రభుత్వ ఆధీనంలోని పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. పోస్టు పేరు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(స్కేల్–1). మొత్తం పోస్టులు: 300(అన్‌రిజర్వుడ్–158, ఓబీసీ–77, ఎస్సీ–44, ఎస్టీ–21). విభాగాల వారీ ఖాళీలు: అకౌంట్స్–20, యాక్చురీస్–2, ఇంజనీర్స్ (ఆటోమొబైల్)–15, లీగల్–30, మెడికల్ ఆఫీసర్(ఎంఓ)–10, జనరలిస్ట్ –223. వేతనం: రూ.32,795–రూ.62,315 అర్హతలు: సంబంధిత విభాగాలను అనుసరించి డిగ్రీ/లా డిగ్రీ/ పీజీ/ ఎంకామ్/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ/ఎంబీబీఎస్/నాలుగు యాక్చురియల్ పేర్స్(ఐఏఐ/ఐఎఫ్ఓఏ)లో ఉత్తీర్ణత. వయో పరిమితి: 2017 జూలై 31 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్–2లో మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పరీక్షల (ఫేజ్–1, ఫేజ్–2) విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ విధానంలో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. మొదటి సెక్షన్లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. నిర్దేశిత మార్కులతో క్వాలిఫైడ్ అభ్యర్థుల నుంచి 1:20 నిష్పత్తిలో మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. ఫేజ్–2 (మెయిన్ ఎగ్జామినేషన్)లో 200 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో, 30 మార్కులకు డిస్క్రిప్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ వ్యవధి రెండు గంటలు. జనరలిస్ట్స్ పోస్టులకు 4 విభాగాలు, మిగిలిన పోస్టులకు 5 విభాగాలుగా ప్రశ్నపత్రం ఉంటుంది. జనరలిస్ట్స్కు టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.. ఒక్కోటి 50 మార్కులకు చొప్పున 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగిలిన పోస్టులకు టెస్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ అదనంగా నిర్వహిస్తారు. ఒక్కో విభాగానికి 40 మార్కులకు చొప్పన 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఫేజ్–2 పరీక్ష వ్యవధి గంట; డిస్క్రిప్టివ్ విధానంలో 30 మార్కులకు లెటర్ రైటింగ్, ఎస్సే ఉంటాయి. ఫేజ్–1, ఫేజ్–2 రెండు పరీక్షలు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. ఫేజ్–3 (ఇంటర్వ్యూ): మెయిన్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణుల మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అనంతరం తుది ఎంపిక చేపడతారు. దరఖాస్తు ఫీజు: రూ.600(అప్లికేషన్ ఫీ+ఇంటిమేషన్ ఛార్జెస్); ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్ మాత్రమే). దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులు ప్రారంభం: ఆగస్ట్ 18, 2017. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 15, 2017. వెబ్సైట్: www.mumbaiport.gov.in యూపీఎస్సీ...54 ఖాళీలు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 54 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. పోస్టుల పేరు–ఖాళీలు: అసిస్టెంట్ డైరెక్టర్(కెమిస్ట్రీ)–1; అసిస్టెంట్ ఇంజనీర్–3(ఎలక్ట్రికల్–1+ మెకానికల్–2); అసిస్టెంట్ ఫ్రొఫెసర్ (స్పెషలిస్ట్ గ్రేడ్–3)–37(అనాటమీ–8+ ఒబేస్ట్రిక్ అండ్ గైనకాలజీ–13+ ఆప్తాల్మాలజీ–3 + ఆర్థోపీడియాక్(స్పోర్ట్స్ ఇంజూరీ సెంటర్)–1+ పీడియాట్రిక్ కార్డియాలజీ–2+ రేడియో థెరపీ–10); అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్–6; డ్రిల్లర్ ఇంచార్జ్–5; లెక్చరర్–2 (ఎలక్ట్రికల్–1+మెకానికల్–1). వేతనం: అసిస్టెంట్ డైరెక్టర్ (కెమిస్ట్రీ), అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు–రూ.15,600–రూ.39,100; అసిస్టెంట్ ఇంజనీర్‌కు– రూ.44,900–రూ.1,42,400; అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు– రూ.56,100–రూ.1,77,500; డ్రిల్లర్ ఇంచార్జ్‌కు–రూ.9,300–34,800. అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా/ఎంఎస్సీ/ఎంబీబీఎస్/డీఎన్బీ/ఎంసీహెచ్/డీఎం/ఎండీ/ఎంఎస్. దీంతోపాటు నిబంధనల మేర ఉద్యోగానుభవం, మార్కుల శాతం ఉండాలి. వయోపరిమితి: పోస్టులను అనుసరించి నిబంధనల మేరకు. ఎంపిక విధానం: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు: రూ.25; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/మహిళలకు ఫీజు లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్ 31, 2017. వెబ్సైట్: www.upsconline.nic.in నిట్–రూర్కెలా 203 ఖాళీలు రూర్కెలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో 203 బోధన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువడింది. మొత్తం ఖాళీలు: 203 (అన్‌రిజర్వుడ్–55, ఓబీసీ–82, ఎస్సీ–40, ఎస్టీ–26). ఇందులో కొన్ని పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టుల పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్. బోధన విభాగాలు: ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ డిజైన్, ఆర్కిటెక్చర్, సైన్స్/ హ్యుమానిటీస్ అండ్ సోషియల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్. వేతనం: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ.15,600–రూ.39,100; అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులకు రూ.37,400–రూ.67,000. వీటిలో పోస్టులవారీ గ్రేడ్ పేలో మార్పులు ఉంటాయి. అర్హతలు: సంబంధిత పోస్టులు, విభాగాలను అనుసరించి పీహెచ్‌డీతో పాటు బీఈ/బీటెక్/బీ.డిజైన్/బీఆర్క్/ఎంఆర్క్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ/ పీజీడీబీఎం. నిబంధనల మేర మార్కుల శాతం ఉండాలి. ఉద్యోగానుభవం అభిలషణీయం. వయో పరిమితి: 2017 సెప్టెంబర్ 11 నాటికి ప్రొఫెసర్ పోస్టులకు 50 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు 45 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కాంట్రాక్ట్/శాశ్వత ప్రాతిపదికను అనుసరించి 30/35/40 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలు అనుసరించి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు: లేదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 11, 2017 వెబ్సైట్: www.upsconline.nic.in ఐఆర్డీఏఐ 30 ఖాళీలు హైదరాబాద్‌లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ).. 30 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ప్రకటన వెలువరించింది. పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ వేతనం: ప్రారంభ వేతనం రూ.28,150 +అలవెన్సులు. మొత్తం ఖాళీలు: 30 (అన్‌రిజర్వుడ్–16, ఓబీసీ–7, ఎస్సీ–4, ఎస్టీ–3). విభాగాల వారీ ఖాళీలు: యాక్చ్యురియల్–4, అకౌంట్స్–4, లీగల్–2, జనరల్–20. అర్హతలు : 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. యాక్చ్యరియల్ విభాగం పోస్టులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్యు ్చరీస్ ఆఫ్ ఇండియా(ఐఏఐ) పరీక్షలో తొమ్మిది పేపర్ల ఉత్తీర్ణత, అకౌంట్స్ పోస్టులకు ఏసీఏ/ ఏఐసీడబ్ల్యూఏ/ ఏసీఎంఏ/ఏసీఎస్/సీఎఫ్ఏ, లీగల్ విభాగం పోస్టులకు ఎల్ఎల్బీ తప్పనిసరి. వయో పరిమితి : 2017 సెప్టెంబర్ 9 నాటికి 21–30 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: ఫేజ్–1లో ప్రిలిమినరీ, ఫేజ్–2లో డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్, ఫేజ్–3లో ఇంటర్వ్యూ. పరీక్షల విధానం: ఫేజ్–1 ప్రిలిమినరీ ఆబ్జెక్టివ్‌లో ఆన్లైన్లో నిర్వహిస్తారు. టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నల చొప్పున 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్ష వ్యవధి గంట. ఫేజ్–2 (డిస్క్రిప్టివ్) ఎగ్జామినేషన్.. మూడు పేపర్లు ఉంటాయి. పేపర్–1లో ఇంగ్లిష్, పేపర్–2లో ఎకనమిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఇంపాక్టింగ్ ఇన్సూరెన్స్, పేపర్–3లో ఇన్సూరెన్స్ అండ్ మేనేజ్మెంట్. ఒక్కో పేపర్ 100 మార్కులకు చొప్పున 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. వ్యవధి ఒక్కో విభాగానికి గంట. ఫేజ్–3(ఇంటర్వ్యూ): ఫేజ్–2 మెరిట్ అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఫేజ్–2, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష కేంద్రాలు (తెలుగు రాష్ట్రాల్లో): ఫేజ్–1.. హైదరాబాద్, విజయవాడ; ఫేజ్–2.. హైదరాబాద్ దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ/ఎక్స్–సర్వీస్‌మెన్ రూ.100 (ఇంటిమేషన్ ఛార్జెస్); మిగిలిన అభ్యర్థులకు రూ.650(ఎగ్జామినేషన్ ఫీ+ ఇంటిమేషన్ ఛార్జెస్) దరఖాస్తు విధానం: వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 5, 2017. వెబ్సైట్: www.irdai.gov.in -
ఓటర్ నివాదం?
ఎన్నికల ప్రక్రియ ఓటర్ల జాబితా తయారీ ఎన్నికల ప్రధాన అధికారి పర్యవేక్షణలో ఓటర్ల జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులు చేస్తారు. ఇది ఎన్నికల ప్రక్రియలో మొదటి దశ. ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్రపతి పేరుతో, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు గవర్నర్ పేరుతో నోటిఫికేషన్లు జారీ అవుతాయి. వీటిని కేంద్ర ఎన్నికల సంఘమే వారి పేర్లతో జారీ చేస్తుంది. సాధారణంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవడానికి కొన్ని వారాల ముందు ఎన్నికల షెడ్యూల్‌ను ఎలక్షన్ కమిషన్ వెలువరిస్తుంది. ఆ వెనువెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకొస్తుంది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారికి సమర్పించాలి. దానికి సంబంధించి ధ్రువీకరణ ప్రమాణం కూడా చేయాలి. సాధారణంగా నామినేషన్ల పరిశీలన పూర్తయిన రెండు రోజుల్లోపు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఎన్నికల ప్రచారం రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ సిద్ధాంతాలు, విధానాలను తెలియజేస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించుకోవచ్చు. పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించిన రోజు నుంచి రెండు వారాల వరకు ఎన్నికల ప్రచారానికి సమయం ఉంటుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేయాలి. బ్యాలెట్ పత్రాలు, గుర్తులు నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఇంగ్లిష్ ఆల్ఫాబెట్ ఆర్డర్లో ఎన్నికల అధికారి రూపొందిస్తారు. బ్యాలెట్ పత్రం/ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)పై అభ్యర్థికి కేటాయించిన గుర్తుతోపాటు పేరును ఆంగ్లం, సంబంధిత ప్రాంతీయ భాష లేదా హిందీలో ముద్రిస్తారు. ఎన్నికల విధానం రహస్య ఓటింగ్ పద్ధతిని పాటిస్తారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో 1,500 మంది ఓటర్లకు మించకుండా చూస్తారు. ఎన్నికల రోజున పోలింగ్ స్టేషన్‌ను కనీసం 8 గంటలకు తక్కువ కాకుండా తెరచి ఉంచాలి. ఓట్ల లెక్కింపు ఓటింగ్ పూర్తయ్యాక ఒకటి లేదా రెండు రోజుల తర్వాత రిటర్నింగ్ అధికారి, పరిశీలకుల సమక్షంలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటించి రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేస్తారు. దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికలు – వివాదాలు – పరిష్కారం ప్రకరణ 323 (బి) ప్రకారం పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి పార్లమెంటు ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయొచ్చు. అయితే ఇప్పటివరకు అలాంటి ట్రైబ్యునల్ ఏర్పాటు కాలేదు. ప్రస్తుతం ఇలాంటి వివాదాలను సంబంధిత రాష్ట్ర హైకోర్టులోనే పరిష్కరించుకుంటున్నారు. దీనికి సంబంధించి అభ్యర్థి లేదా ఓటర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. ప్రత్యేక వివరణ ఎన్నికలు జరిగే సమయంలో అంటే ఫలితాలను ప్రకటించక ముందు ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు సంబంధించిన, ఇతర ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి తీర్పు వెలువరిస్తుంది. ఈ దశలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి వీల్లేదు. ఫలితాలు వెలువడిన తర్వాత సంబంధిత వివాదాలను హైకోర్టులోనే పరిష్కరించుకోవాలి. ఓటర్ నినాదం ‘ఓటర్‌గా ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నాను’. ఓటర్ దినోత్సవం ఏటా జనవరి 25న ఓటర్ దినోత్సవం జరుపుకుంటున్నాం. 2011 నుంచి దీన్ని ప్రారంభించారు. 7వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని 2017, జనవరి 25న జరుపుకున్నాం. ఓటర్ల ప్రతిజ్ఞ ‘ప్రజాస్వామ్యంలో విశ్వసనీయతకు కట్టుబడి ఉన్న భారత పౌరులైన మేము మా దేశంలో ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల గౌరవాన్ని నిలిపి ఉంచుతామని, ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా, మతం, వర్గం, కులం, సంఘం భాష తదితర ప్రలోభాలను పరిగణనలోకి తీసుకోకుండా, వాటికి గురికాకుండా ఓటు వేస్తామని ఇందుమూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము’. ప్రజా ప్రాతినిధ్య చట్టాలు పార్లమెంటు, రాష్ట్ర శాసన సభలో గరిష్ట సభ్యుల సంఖ్య, సీట్ల కేటాయింపులకు సంబంధించి కొన్ని నియమాలను భారత రాజ్యాంగ ప్రకరణలు 81, 170లో పేర్కొన్నారు. అయితే వాటికి సంబంధించి సమగ్ర వివరాలను పొందుపరచలేదు. సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, రిజర్వేషన్లు మొదలైన విషయాలను పార్లమెంటు ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ఇప్పటివరకు దీనికి సంబంధించి పార్లమెంటు రెండు చట్టాలను రూపొందించింది. అవి.. 1. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 2. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950 ఈ చట్టం ప్రధానంగా పార్లమెంటు, రాష్ట్ర శాసన సభల్లో సీట్ల కేటాయింపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించింది. అలాగే ఓటర్ల జాబితా రూపకల్పన, ఓటరుగా నమోదు చేసుకోవడానికి సంబంధించిన అర్హతల గురించి తెలుపుతుంది. ఈ చట్టంలో 32 సెక్షన్లు, 5 భాగాలు, 4 షెడ్యూళ్లు ఉన్నాయి. ఈ చట్టాన్ని పార్లమెంటు చాలాసార్లు సవరించింది. 2008లో ఈ చట్టానికి సమగ్ర సవరణలు చేశారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం–1951 పార్లమెంటు సభ్యులు, రాష్ట్ర శాసనసభ సభ్యుల అనర్హతల గురించి ఈ చట్టంలో పేర్కొన్నారు. కింది సందర్భాల్లో వారు సభ్యత్వం కోల్పోతారు, లేదా పోటీకి అనర్హులవుతారు. రెండేళ్లకు తక్కువ కాకుండా శిక్ష పడినవారు శిక్షా కాలంలో, శిక్ష ముగిసిన తర్వాత ఆరేళ్ల వరకు పోటీకి అనర్హులు. వరకట్న నిషేధ చట్టం, ఆహార కల్తీ మొదలైన నేరాల్లో ఆరేళ్ల కంటే తక్కువ కాకుండా శిక్ష పడినవారిని అనర్హులుగా ప్రకటిస్తారు. అవినీతి నిరోధక చట్టం, ప్రజా శాంతి చట్టం, ఇండియన్ పీనల్ కోడ్లలో పేర్కొన్న కొన్ని నేరాలకు పాల్పడి, నేరం రుజువైతే కూడా అనర్హులవుతారు. అవినీతి నేరం కింద తొలగింపునకు గురైన ప్రభుత్వ ఉద్యోగులు ఐదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. మతం, కులం, జాతి, భాష ప్రాతిపదికన ఓట్లు అడిగినప్పుడు, వాటి పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టినప్పుడు అనర్హులుగా ప్రకటిస్తారు. ఎన్నికల నిర్వహణ – ప్రవర్తన నియమావళి ఎన్నికలను సజావుగా, అవినీతి రహితంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని మార్గదర్శక సూత్రాలను రాజకీయ పార్టీలు, పౌరులకు జారీ చేస్తుంది. 1971లో 5వ సార్వత్రిక ఎన్నికల్లో మొట్టమొదటిసారి వీటిని ప్రకటించారు. వీటికి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదు. ఎన్నికలను సక్రమంగా నిర్వహించడమే ఈ ప్రవర్తన నియమావళి ముఖ్య ఉద్దేశం. డబ్బు, మద్యం తదితర బలహీనతల ఆధారంగా ఓటర్లను ప్రభావితం చేయకూడదు. కులం, మతం, ఇతర సెంటిమెంట్ల ఆధారంగా ఓట్లు అడగకూడదు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలను ప్రకటించకూడదు. నిరాధార ఆరోపణలు, గౌరవాన్ని కించపరిచే విమర్శలు చేయకూడదు. ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ వాహనాలు, సిబ్బందిని వినియోగించకూడదు. ఎన్నికల్లో పోటీకి అర్హతలు లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థులు దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. లోక్‌సభకు పోటీ చేసే వ్యక్తి ఇండిపెండెంట్ అభ్యర్థి అయితే సంబంధిత నియోజకవర్గంలోని పది మంది ఓటర్ల మద్దతు తెలపాలి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థికి ఒక ఓటరు మద్దతు సరిపోతుంది. పై షరతులు రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు కూడా వర్తిస్తాయి. లోక్‌సభ, రాజ్యసభకు పోటీ చేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు నామినేషన్ సమయంలో రూ.25,000 ధరావతు(డిపాజిట్) చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 ధరావతు చెల్లించాలి. రాష్ట్ర శాసనసభ, శాసన మండలికి పోటీచేసే అభ్యర్థి ఆ రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి. రాష్ట్ర అసెంబ్లీ, శాసన మండలికి పోటీ చేసే జనరల్, బీసీ అభ్యర్థులు రూ.10,000 ధరావతు; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 ధరావతు చెల్లించాలి. లోక్‌సభ లేదా రాష్ట్ర విధాన సభకు సంబంధించి ఒక అభ్యర్థి రెండు స్థానాలకు మించి పోటీ చేయడానికి అవకాశం లేదు. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లోపు ఎన్నికలకు సంబంధించిన వ్యయాల వివరాలను ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. డిపాజిట్ దక్కించుకోవడం (లేదా) కోల్పోవడం దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోటీ చేసిన అభ్యర్థికి పోలై చెల్లుబాటైన ఓట్లలో 1/6 వంతు వస్తే డిపాజిట్ దక్కినట్లుగా ప్రకటిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వస్తే డిపాజిట్ కోల్పోయినట్లు. వ్యయ పరిమితులు 2014 ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులు విధించింది. పెద్ద రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గంలో రూ.70 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. చిన్న రాష్ట్రాల్లో (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కిం) లోక్‌సభ నియోజకవర్గంలో, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రూ.54 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాలైతే రూ.28 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. చిన్న రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో (ఢిల్లీ మినహా) అభ్యర్థులు రూ.20 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. -
ఉన్నత విద్య ప్రక్షాళనకు..హీరా!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. ఇక కనుమరుగు కానుందా? ఏఐసీటీఈ.. అనే మాట భవిష్యత్తులో వినపడదా..? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. కారణం.. Higher Education Empowerment Regulation Agency (HEERA-హీరా) పేరుతో దేశంలోని రెండు ప్రధాన విద్యా నియంత్రణ సంస్థల (యూజీసీ, ఏఐసీటీఈ) స్థానంలో ఒకే వ్యవస్థను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ యోచనే. నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు ఉమ్మడి నియంత్రణ వ్యవస్థ రూపకల్పన దిశగా అడుగులు పడుతున్న తరుణంలో.. ‘హీరా’పై విశ్లేషణ.. శంలో ఉన్నతవిద్య పరంగా పలు రకాల నియంత్రణ వ్యవస్థలు.. ఒక్కోదాని పరిధిలో ఒక్కో కోర్సు. ఇదే క్రమంలో యూజీసీ.. ఏఐసీటీఈ. మిగతా నియంత్రణ వ్యవస్థలు (ఎంసీఐ, పీసీఐ, బీసీఐ తదితర) పరంగా... ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. యూజీసీ, ఏఐసీటీఈల మధ్య నిరంతరం ఏదో ఒక సమస్య. దీనికి పరిష్కారంగా నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వ్యవస్థే ‘హీరా’. ఒకే గొడుగు కిందకు అన్ని సంస్థలు హీరా ప్రధాన ఉద్దేశం.. దేశంలోని సాంకేతిక, సంప్రదాయ ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలు అన్నీ.. ఇకపై ఒకే నియంత్రణ వ్యవస్థకు జవాబుదారీగా ఉండటం. అదే విధంగా యూనివర్సిటీలకు అనుమతుల నుంచి ప్రమాణాలు, నైపుణ్యాల పెంపు వరకు ప్రతి అంశాన్ని హీరా పేరిట ఏర్పడనున్న కమిటీ పర్యవేక్షిస్తుంది. ఫలితంగా ఇప్పుడు ఒకే యూనివర్సిటీలో అమలవుతున్న పలు కోర్సులకు ఇటు ఏఐసీటీఈ, అటు యూజీసీ అనుమతులు తీసుకోవడమనే భారం తొలగనుంది. ఉదాహరణకు ఒక యూనివర్సిటీ పరిధిలో ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ను నెలకొల్పాలనుకుంటే ముందుగా ఇటు ఏఐసీటీఈకి, మరోవైపు సంబంధిత యూనివర్సిటీకి రెండింటికీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీంతో వివిధ సందర్భాల్లో గందరగోళం నెలకొంటోంది. ఈ క్రమంలోనే యూజీసీ, ఏఐసీటీఈ మధ్య కొంత ఆధిపత్య పోరు జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటివాటికి అడ్డుకట్ట వేసేందుకు.. అన్ని యూనివర్సిటీలు, కోర్సులను ఒకే నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి తెచ్చేవిధంగా హీరాకు అంకురార్పణ జరిగింది. ఒకే వ్యవస్థపై ఎన్నో ఏళ్లుగా.. వాస్తవానికి దేశంలో అన్ని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లకు యూజీసీ, ఏఐసీటీఈల స్థానంలో ఒకే నియంత్రణ వ్యవస్థను నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్నాయి. గతంలో యశ్పాల్ కమిటీ, నేషనల్ నాలెడ్జ్ కమిషన్ ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ప్రస్తుతం తాజాగా హరిగౌతమ్ కమిటీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో నీతి ఆయోగ్ ఆ సిఫార్సుల అమలు సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతలను తీసుకొని.. పలు సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయానికి వచ్చి ‘హీరా’ పేరుతో ఒకే నియంత్రణ వ్యవస్థ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. వ్యవస్థల వైఫల్యాలు కూడా కారణం హీరా పేరుతో ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకురావడంలో ఇప్పటికే ఉన్న నియంత్రణ వ్యవస్థలు యూజీసీ, ఏఐసీటీఈలు బాధ్యతలు నిర్వర్తించడంలో వైఫల్యం చెందడం కూడా మరో ముఖ్య కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సంస్థలు.. యూనివర్సిటీలు, కళాశాలలకు అనుమతులిచ్చేందుకే పరిమితమవుతున్నాయని.. ఆ తర్వాత వాటిపై కన్నెత్తి కూడా చూడటం లేదని, నిరంతర పర్యవేక్షణ సాగించడం లేదని, ఫలితంగా విద్యార్థులు నిపుణులుగా రూపొందలేకపోతున్నారనే వాదనలు కొన్నేళ్లుగా బలంగా వినిపిస్తున్నాయి. ఉదాహరణకు సాంకేతిక సంస్థల ఏర్పాటు, అనుమతులు, ఇతర పర్యవేక్షణాధికారాలున్న ఏఐసీటీఈనే పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేస్తున్న విద్యార్థుల్లో దాదాపు 70 శాతం మందిలో ఉద్యోగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు ఉండట్లేదు. దీనికి ప్రధాన కారణం అనుమతుల జారీకే పరిమితమవుతున్న ఏఐసీటీఈ, తర్వాత కాలంలో వాటిపై నిరంతర పర్యవేక్షణ సాగించకపోవడమే అని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. యూజీసీది కూడా ఇదే తీరు యూజీసీ.. తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ యూనివర్సిటీలకు అనుమతులు ఇవ్వడం వరకే పరిమితమవుతూ ఆపై వాటిపై నిరంతర పర్యవేక్షణలో వైఫ్యలం చెందిందనే వాదన వినిపిస్తోంది. ఫలితంగా ఆయా యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల లేమి, ఇతర సమస్యల కారణంగా పరిశోధనలు జరగకపోవడం, పర్యవసానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూనివర్సిటీలు ఆశించిన రీతిలో నిధులు పొందలేకపోతున్నాయని.. ఫలితంగా కొన్ని మూతపడే స్థితికి చేరుకున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇటీవల కాలంలో ఇబ్బడిముబ్బడిగా ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలకు అనుమతులిస్తున్న యూజీసీ.. వాటి ఏర్పాటు తర్వాత కన్నెత్తి చూడకపోవడం, ఫలితంగా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండే ఈ యూనివర్సిటీలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయనే వాదన వినిపిస్తోంది. ప్రొఫెషనల్ విద్యార్థులకు మేలు హీరా పేరుతో విద్యాసంస్థలపై ఒకే నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేయడం ప్రధానంగా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు మేలు చేయనుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అన్ని రంగాలకు చెందిన నిపుణులు ఉండే హీరాలో.. ఆయా కోర్సులకు సంబంధించి తీసుకోవాల్సిన ప్రమాణాలు, చేపట్టాల్సిన తాజా చర్యలపై నిరంతరం సమీక్షించే అవకాశం కలుగుతుంది. వాస్తవానికి ఏఐసీటీఈ, యూజీసీలు వైఫల్యం చెందడానికి మరో కారణం.. ఈ రెండు సంస్థల్లోనూ పలు నేపథ్యాలున్న వారు సభ్యులుగా ఉండటం, వారిలో కొందరికి అకడమిక్ సంబంధిత అంశాలపై అవగాహన లేకపోవడమేనని హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ పేర్కొన్నారు. యూజీసీ ఏదైనా చర్యను తీసుకోవాలంటే దానికి సంబంధించిన అకడమిక్ ఫ్యాకల్టీ సభ్యులుగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసి, వాటి నివేదికలు – సిఫార్సుల ఆధారంగా చర్యలు తీసుకుంటారు. దీనివల్ల అనవసర జాప్యం తలెత్తుతోంది. హీరాతో ఆ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. న్యాక్, ఎన్బీఏలు.. నామమాత్రమే యూజీసీ, ఏఐసీటీఈ.. తమ పరిధిలోని యూనివర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అనుసరిస్తున్న ప్రమాణాలు, చేపట్టాల్సిన సంస్కరణలపై సిఫార్సులు చేసేందుకు న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కమిటీ), ఎన్బీఏ (నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్)లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినప్పటికీ.. వాటి పనితీరు నామమాత్రంగా మిగిలిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు కమిటీలు.. ఆయా కళాశాలలకు తనిఖీలకు నిపుణులను పంపే క్రమంలో శాశ్వత ప్రాతిపదికన సంబంధిత అకడమీషియన్స్ లేకపోవడం. ఈ కారణంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన విద్యావేత్తలను ఇన్స్పెక్షన్ కమిటీల్లో తాత్కాలికంగా నియమించడం, వాటి ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంతో ఇన్స్టిట్యూట్లలో జవాబుదారీతనం తగ్గుతోంది. ఈ ఏడాది చివరికి ప్రారంభం? ఇప్పటికే హీరాకు సంబంధించిన విధివిధానాలతో నివేదిక రూపొందిన నేపథ్యంలో ఈ ఏడాది చివరికి ప్రారంభించేలా ఎంహెచ్ఆర్డీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2018–19 విద్యా సంవత్సరానికి కొత్త ఇన్స్టిట్యూట్ల అనుమతుల మంజూరు కూడా హీరా నేతృత్వంలోనే జరిగేలా చర్యలు ఊపందుకున్నట్లు సమాచారం. ఆహ్వానించదగ్గ పరిణామం ఒకే నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీనివల్ల ఇటు ఇన్స్టిట్యూట్లు, యూనివర్సిటీలకు, అటు విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. నిరంతర పర్యవేక్షణ, కరిక్యులంలో మార్పులు వంటి వాటికి అవకాశం ఉండి విద్యార్థులకు ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ అలవడతాయి. – ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్, వీసీ, జేఎన్‌యూ. -
పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం లక్ష్యాలు?
ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్ర; దేశీయ, విదేశీ పెట్టుబడులు; సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటి విషయంలో ప్రభుత్వ వైఖరిని సంబంధిత దేశ పారిశ్రామిక విధానంలో వివరిస్తారు. ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వనరులను అభిలషణీయంగా ఉపయోగించుకోవాలి. నిర్దేశిత లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. దీనికి సంబంధించి ఉత్పత్తి ప్రక్రియలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పాత్రను పారిశ్రామిక విధానం వివరిస్తుంది. స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశానికి సరైన, కచ్చితమైన పారిశ్రామిక విధానం లేదు. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం పారిశ్రామిక విధానం ఆవశ్యకతను గుర్తించి 1948, ఏప్రిల్ 6న మొదటి పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. మొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఈ తీర్మానంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పరిధిని స్పష్టంగా పేర్కొంటూ పరిశ్రమలను నాలుగు వర్గాలుగా విభజించారు. ఈ తీర్మానంతో మన దేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకొంది. మొదటి వర్గం (ప్రభుత్వ ఏకస్వామ్యం): ఈ వర్గంలోని పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మూడు రకాల కార్యకలాపాలను నిర్వహించే పరిశ్రమలను ఈ వర్గంలో చేర్చారు. అవి.. 1.దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు, ఆయుధ సామగ్రి, ఆయుధాల ఉత్పత్తి, నియంత్రణ. 2.అణుశక్తి ఉత్పత్తి, నియంత్రణ. 3.రైల్వేలు వాటి నిర్వహణ, యాజమాన్యం రెండో వర్గం (మిశ్రమ రంగం): ఇందులో ఆరు కీలక, మౌలిక పరిశ్రమలను చేర్చారు. అవి.. 1. బొగ్గు, 2. ఇనుము, ఉక్కు, 3. విమానాల ఉత్పత్తి, 4. నౌకా నిర్మాణం, 5.టెలిఫోన్, టెలిగ్రాఫ్, వైర్లెస్ పరికరాల ఉత్పత్తి, 6. ఖనిజ నూనెలు. ఈ తీర్మానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వర్గంలోని పరిశ్రమల్లో కొత్త వాటిని ప్రైవేటు రంగంలో స్థాపించడానికి వీల్లేదు. ఇకపై వీటిని ప్రభుత్వ రంగంలోనే స్థాపిస్తారు. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్న వాటిని కొనసాగించవచ్చు. అవసరమనుకుంటే పదేళ్ల తర్వాత నష్టపరిహారం చెల్లించి వాటిలో దేన్నయినా ప్రభుత్వం జాతీయం చేయొచ్చు. డో వర్గం (ప్రభుత్వ నియంత్రణ): ఈ వర్గంలో జాతీయ ప్రాముఖ్యం ఉన్న 18 పరిశ్రమలను చేర్చారు. వీటిని ప్రభుత్వం నిర్వహించనప్పటికీ వీటి నియంత్రణ, అజమాయిషీ ప్రభుత్వానికి ఉంటుంది. ప్రభుత్వ నియమ, నిబంధనలకు లోబడి వీటి ఉత్పత్తులు కొనసాగాలి. ఇందులో ఆటోమొబైల్స్, భారీ రసాయనాలు, భారీ యంత్రాలు, యంత్ర పరికరాలు, ఎరువులు, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్, పంచదార, కాగితం, సిమెంట్, వస్త్ర, ఊలు మొదలైన పరిశ్రమలను చేర్చారు. నాలుగో వర్గం (ప్రైవేటు రంగం): పై మూడు వర్గాల్లో లేని పరిశ్రమలను ఇందులో చేర్చారు. వీటిని ప్రైవేటు రంగానికి వదిలేశారు. అయితే వీటిపై ప్రభుత్వం సాధారణ అజమాయిషీ కలిగి ఉంటుంది. 1951–పారిశ్రామికలైసెన్సింగ్ విధానం (పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం) మన దేశంలో ప్రైవేటు రంగ పరిశ్రమల అభివృద్ధిని క్రమబద్ధం చేయడం, వాటిని నియంత్రించడం అనే రెండు ప్రధాన ఉద్దేశాలతో 1951, అక్టోబర్‌లో పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని (పరిశ్రమల అభివృద్ధి, క్రమబద్ధ చట్టం) పార్లమెంటు చట్టం ద్వారా రూపొందించారు. ఈ చట్టం 1952, మే 8 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం లక్ష్యాలు 1.ప్రణాళికా లక్ష్యాలు, ప్రాధాన్యతలకు అనుగుణంగా పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పత్తులు ఉండేలా చూడటం. 2.పెద్ద పరిశ్రమల పోటీ నుంచి చిన్న పరిశ్రమలను రక్షించడం. 3.ఏకస్వామ్యాలను నిరోధించడం. 4.సంతులిత ప్రాంతీయాభివృద్ధి. 5.వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం. 6.దేశీయ మార్కెట్లో సప్లై, డిమాండ్ల మధ్య సహ సంబంధాన్ని తీసుకురావడం. 7.సామాజిక మూలధనాన్ని అభిలషణీయంగా ఉపయోగించుకోవడం. ఈ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమలు ప్రారంభంలో 37 ఉండగా, తర్వాత కాలంలో 70కి పెంచారు. ఇందులోని పరిశ్రమలు రిజిస్టర్ చేసుకొని లైసెన్స్ పొందాలి. 1953లో రూ.1 లక్ష కంటే ఎక్కువ పెట్టుబడి కలిగిన పరిశ్రమలను దీని పరిధిలోకి తెచ్చారు. అయితే లైసెన్సింగ్ అ«థారిటీపై పరిపాలన పరమైన భారం, ఒత్తిడి మూలంగా 1956లో ఈ నిర్ణయాన్ని ఉపసంహరించారు. 1956లో విద్యుత్‌ను ఉపయోగించి, 50 మంది శ్రామికులతో ఉత్పత్తిని చేపట్టే పరిశ్రమలు (లేదా) విద్యుత్‌ను వాడకుండా 100 మంది శ్రామికులతో ఉత్పత్తిని నిర్వహించే పరిశ్రమలను ఈ చట్టం పరిధిలోకి చేర్చారు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే పరిశ్రమల పెట్టుబడి పరిమితిని 1960లో రూ.10 లక్షలకు పెంచారు. ఈ పరిమితిని 1963లో రూ.25 లక్షలకు పెంచారు. 1970లో రూ. కోటికి పెంచారు. 1978లో రూ.3 కోట్లకు పెంచారు. ఆ తర్వాత పెట్టుబడి పరిమితిని రూ.5 కోట్లకు పెంచారు. 1988–89లో ప్రభుత్వం లైసెన్సింగ్ విధానంలో విప్లవాత్మక నిర్ణయాన్ని ప్రకటించింది. దీని ప్రకారం అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో రూ.15 కోట్లు, వెనుకబడిన ప్రాంతాల్లో రూ.50 కోట్లకు పైబడిన పెట్టుబడి గల పరిశ్రమలు మాత్రమే లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. లిబరలైజేషన్ పాలసీ (సరళీకృత విధానం)లో భాగంగా లైసెన్స్‌ల రద్దు వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. రెండో పారిశ్రామిక విధాన తీర్మానం–1956 1956, ఏప్రిల్ 30న భారత ప్రభుత్వం రెండో పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది. 1956 నాటికి మన దేశంలో అనేక రాజకీయ, ఆర్థిక మార్పులు సంభవించాయి. 1956 నాటికి మొదటి పంచవర్ష ప్రణాళికను పూర్తి చేసుకోవడం, రెండో ప్రణాళికలో భారీ, మౌలిక పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వడం, సమ సమాజ స్థాపనను లక్ష్యంగా నిర్ణయించుకోవడం మొదలైనవి 1956 పారిశ్రామిక విధాన తీర్మాన ప్రకటనకు కారణమయ్యాయి. మూడు జాబితాలు: 1956 పారిశ్రామిక విధాన తీర్మానంలో పరిశ్రమలను ఎ, బి, సి అనే మూడు జాబితాలుగా వర్గీకరించారు. జాబితా–ఎ: ఇందులో 17 పరిశ్రమలను చేర్చారు. దేశ రక్షణ, తత్సంబంధ పరిశ్రమలు దీనిలో ఉన్నాయి. వీటిలో ఆయుధాలు, అణుశక్తి, విమాన రవాణా, రైల్వే రవాణా పరిశ్రమలు ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఉంటాయి. మిగతా 13 పరిశ్రమలను ఈ తీర్మానం తర్వాత నుంచి ప్రభుత్వమే స్థాపిస్తుంది. అప్పటికే ప్రైవేటు రంగంలో ఉన్నవి కొనసాగవచ్చు. అవసరమైతే వీటిని ప్రైవేటు రంగంలో కూడా నెలకొల్పే అవకాశం కల్పించారు. ఈ తీర్మానంలో పరిశ్రమలను జాతీయం చేసే ప్రతిపాదన లేదు. జాబితా–బి: అన్ని రకాల ఖనిజాలు, లోహాలు, యంత్ర పనిముట్లు, మిశ్రమ లోహాలు, ఎరువులు, రబ్బరు, బొగ్గు తదితర 12 పరిశ్రమలను ఇందులో చేర్చారు. ప్రభుత్వం నూతన సంస్థలను స్థాపించి తన భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అయితే ప్రైవేటు రంగం కొత్త సంస్థలను స్థాపించడానికి, ఉన్న వాటిని విస్తృతం చేసుకోవడానికి ఏ ఆటంకం ఉండదు. జాబితా–సి: ఎ, బి జాబితాల్లో లేని పరిశ్రమలను ఇందులో చేర్చారు. ఈ జాబితాలోని పరిశ్రమల అభివృద్ధి ప్రైవేటు రంగం చొరవపై ఆధారపడి ఉంటుంది. పారిశ్రామికీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఈ జాబితాలోని పరిశ్రమలను ప్రభుత్వం ప్రోత్సహించడమే కాకుండా నియంత్రిస్తుంది. 1970, 1973, 1975ల్లో పారిశ్రామిక విధాన తీర్మానాలను ప్రకటించినా, వాటికి 1956 తీర్మానమే ప్రాతిపదికగా నిలిచింది. ఈ తీర్మానాల్లో మౌలిక మార్పులు లేకుండా కేవలం కుటీర, చిన్నతరహా పరిశ్రమల నిర్వచనాల్లో, లైసెన్సింగ్ విధానంలో, విదేశీ మూలధనం విషయంలో స్వల్ప మార్పులు చేశారు. జనతా ప్రభుత్వ పారిశ్రామిక విధానం–1977 1977లో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం, తన శైలిలో 1977 డిసెంబర్ 23న నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. గాంధేయ విధానానికి అనుగుణంగా దీన్ని రూపొందించారు. చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధికి ఇందులో అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నూతన పారిశ్రామిక విధానం–1991 1980 నుంచి మొదలైన సరళీకృత విధానం, నిర్ణయాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా 1991, జూలై 24న దీన్ని ప్రకటించారు. ప్రపంచ మార్కెట్‌తో భారత ఆర్థిక వ్యవస్థను అనుసంధానం చేసి, విదేశీ పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, యంత్ర సామగ్రి దిగుమతులను పెంచి, వేగవంతమైన అభివృద్ధిని సాధించడం ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశం. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ లక్ష్యాలకు అనుగుణంగా ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ పారిశ్రామిక విధాన తీర్మానంలో లైసెన్సింగ్ విధానంలోని నిబంధనలను గణనీయంగా సడలించారు. 1991 పారిశ్రామిక విధాన తీర్మానం ప్రధాన లక్ష్యాలు సాధించిన ఆర్థిక ప్రగతి ఫలాలను ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఉపయోగించడం. ఆర్థిక ప్రగతికి ఆటంకం కలిగించే అంశాలను సరిచేయడం. ఉత్పత్తి, ఉద్యోగితల్లో సుస్థిర వృద్ధిని నిలుపుకోవడం. అంతర్జాతీయంగా ఎదురయ్యే పోటీని తట్టుకోవడం. అక్కెనపల్లి మీనయ్య ఎకనామిక్స్ (హెచ్‌వోడీ)– రిటైర్డ్ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ -
ఆలోచనకు అండాదండ
ఆలోచనకు అండాదండ స్టార్టప్ సంస్థలు, ఎంటర్ప్రెన్యూర్ ఔత్సాహికులు.. ఇటీవల విస్తృతంగా వినిపిస్తున్న మాటలు. ముఖ్యంగా.. యువత వినూత్న ఆలోచనలు, విభిన్న వ్యాపార అంశాలతో స్వయం ఉపాధి(స్టార్టప్స్) దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇందుకు తోడ్పడే చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు అకడమిక్ స్థాయి నుంచే నైపుణ్యాలు అందించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) కొత్త స్టార్టప్ పాలసీని రూపొందించింది. ఆ వివరాలు.. ఇదీ ఉద్దేశం సరికొత్త ఆలోచనలను ప్రోత్సహించడం, స్వదేశీ ఉత్పత్తులను పెంచడం, అందులో యువతను భాగస్వాములు చేసి స్వయం ఉపాధి దిశగా వారు అడుగులు వేసేలా చూడడం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్టార్టప్ ఇండియా’ లక్ష్యం. ఇదీ పరిస్థితి ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్ల విద్యార్థులు మినహా దేశంలో చాలామంది యువతకు ‘స్టార్టప్’ గురించి పెద్దగా పెద్దగా అవగాహన లేదు. స్టార్టప్స్ ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహాలపై మరికొందరిలో అయోమయం. ఇదీ కార్యాచరణ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్, ప్రధానంగా ఏఐసీటీఈ పరిధిలో దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు స్టార్టప్స్‌పై పూర్తి అవగాహన కల్పించడం. అందుకుతగ్గట్లు విధానపరంగా మార్పుచేర్పులు. తొలి దశలో రూ. 433.53 కోట్ల నిధుల కేటాయింపు. 2025 నాటికి లక్ష సాంకేతిక స్టార్టప్స్ ఏఐసీటీఈ స్టార్టప్ పాలసీ ప్రధాన లక్ష్యం.. 2025 నాటికి జాతీయ స్థాయిలో కనీసం లక్ష సాంకేతిక(టెక్నాలజీ) ఆధారిత సంస్థలు నెలకొల్పేలా చూడటం. తద్వారా పది లక్షల మందికి ఉపాధి కల్పించడం. విద్యా సంస్థలు, విద్యార్థులు ఆసక్తి చూపేలా కరిక్యులం, బోధన విధానం, అకడమిక్ స్ట్రక్చర్‌లో మార్పులను ఏఐసీటీఈ నిర్దేశించుకుంది. ఆన్–క్యాంపస్ స్టార్టప్స్ స్టూడెంట్ డ్రివెన్ ఆన్–క్యాంపస్ స్టార్టప్స్ రూపొందడం పాలసీలో ప్రధానంగా పేర్కొనాల్సిన అంశం. ఇందుకోసం విద్యార్థులు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను లక్ష్యంగా ఎంచుకునేలా ఇన్స్టిట్యూట్స్ ప్రోత్సహించాలి. ప్రస్తుత కరిక్యులం, పెడగాగీలో మార్పులు చేసి స్టార్టప్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం దక్కేలా కొత్త కరిక్యులం తీసుకురావాలి. కొత్త కరిక్యులం ఇలా వ్యాపార అవకాశాలను గుర్తించడం.. ఐడియా జనరేషన్, ఐపీఆర్/పేరెంటింగ్ ‘లా’స్, స్టార్టప్ ఫైనాన్స్, స్టార్టప్ ఏర్పాటు –మనుగడ కోణంలో సదరు వ్యక్తులకు ఉండాల్సిన సహజ కమ్యూనికేషన్ స్కిల్స్ అంశాల సమ్మిళితంగా స్టార్టప్ కోర్స్ కరిక్యులం ఉండాలి. టీబీఐల ఏర్పాటు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ప్రత్యేకంగా టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (టీబీఐ)లు ఏర్పాటు చేయాలి. స్టార్టప్ ఆలోచనలకు.. ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా అనుమతి లభించే విధంగా టీబీఐలు తోడ్పడాలి. యాక్సలరేటర్స్ ఔత్సాహిక యువతకు ప్రాక్టికల్ నైపుణ్యాలు అందించేందుకు యాక్సలేటర్స్ విధానాన్ని పేర్కొన్నారు. దీనిప్రకారం.. స్టార్టప్ యాక్సలరేటర్స్, మెంటార్స్, ఇతర నిపుణుల నేతృత్వంలో నిర్దిష్ట ప్రోగ్రామ్‌లను రూపొందించడం, మంచి వ్యాపార ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడం చేయాలి. గుర్తింపు లభించేలా జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్లాట్‌ఫామ్ రూపొందించడం ఔత్సాహికులకు కలిసొచ్చే మరో ముఖ్య విధానం. ఔత్సాహిక విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్‌ను ఈ ప్లాట్ఫామ్లో ఇన్స్టిట్యూట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి తన ఆలోచనతో రూపొందించిన స్టార్టప్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు సైతం చూసే అవకాశం లభిస్తుంది. ప్రత్యేక సబ్జెక్ట్‌లు కరిక్యులం మార్పులపరంగా బీటెక్ ప్రోగ్రామ్‌లో ఏడాదికో నిర్దిష్ట కోర్సులను బోధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు... బీటెక్ మూడో సంవత్సరంలో బేసిక్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు ఉండాలని పేర్కొంది. సంవత్సరాలవారీగా బేసిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అకౌంటింగ్ అండ్ బుక్ కీపింగ్, బేసిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూరియల్ మార్కెటింగ్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ వంటి అంశాలను వారంలో గరిష్టంగా నాలుగు గంటల వ్యవధిలో బోధించాలి. స్పెషలైజేషన్‌గా స్టార్టప్ స్ట్రీమ్ స్టార్టప్ స్ట్రీమ్‌ను ఒక స్పెషలైజేషన్‌గా ఎంచుకునే అవకాశం కల్పించడం మరో ముఖ్యాంశం. బీటెక్, బీఆర్క్, పీజీడీఎం, ఎంటెక్, ఎంబీఏ, బీ ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లలో.. ‘స్టార్టప్ : లాంచింగ్ అండ్ సస్టెయినింగ్’ పేరుతో ఇన్స్టిట్యూట్లు స్పెషలైజేషన్ సబ్జెక్ట్‌ను ఆఫర్ చేయాల్సి ఉంటుంది. వేసవి/శీతాకాల ఇంటర్న్‌షిప్ స్టార్టప్ లాంచింగ్ అండ్ సస్టెయినింగ్ స్పెషలైజేషన్ విద్యార్థులు.. ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, పూర్వ విద్యార్థులు నెలకొల్పిన స్టార్టప్ సంస్థల్లో వేసవి లేదా శీతాకాల ఇంటర్న్‌షిప్ చేయడం తప్పనిసరి. దీనివల్ల వారికి ఆర్థిక నిర్వహణ అంశాలపై ప్రాథమిక అవగాహన లభిస్తుంది. ఐడియా ల్యాబ్స్ ఏర్పాటు ప్రతి ఇన్స్టిట్యూట్లోనూ ఐడియా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలి. బీటెక్ తృతీయ సంవత్సర విద్యార్థులకు అవకాశం కల్పించి, వారి వ్యాపార ఆలోచనలను సంబంధిత నిపుణులు పరిశీలించేలా చూడటం, కార్యాచరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించడం, ఐపీఆర్‌లను దాఖలు చేయడం వంటివి ఈ ఐడియా ల్యాబ్స్ నిర్వహించాలి. మూక్ నమోదు తప్పనిసరి విద్యార్థులు తప్పనిసరిగా స్టార్టప్ మేనేజ్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోర్సును మాసివ్లీ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్) విధానంలో అభ్యసనం చేయాలి. స్టార్టప్‌పై అవగాహన కలిగేందుకు ఇది ఉపయుక్తం. ఇందుకోసం ఐఐటీలు, ఇతర ప్రముఖ విద్యాసంస్థలు అందిస్తున్న మూక్స్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఏంజెల్స్, వీసీస్.. ఇన్‌స్ట్రక్టర్స్‌గా స్టార్టప్ ఏర్పాటులో అత్యంత కీలకమైనది నిధుల సమీకరణ. నిధుల సమీకరణ కోసం ఎలా వ్యవహరించాలి..? అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లను పార్ట్ టైం కోర్స్ ఇన్‌స్ట్రక్టర్స్‌గా రప్పించే ఏర్పాట్లు చేయాలి. స్టార్టప్–ఫెస్ట్ ఔత్సాహిక యువత, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఫండింగ్ ఏజెన్సీలను అనుసంధానం చేసేలా.. ప్రతి ఇన్స్టిట్యూట్ స్టార్టప్ ఫెస్టివల్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రేరణకు వెబ్‌పోర్టల్ ఔత్సాహికులకు ప్రేరణ లభించేలా ఏఐసీటీఈ ప్రత్యేక వెబ్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురానుంది. తద్వారా విద్యార్థులు మెంటార్స్‌తో అనుంసధానమై సలహాలు, సూచనలు తీసుకునే అవకాశం లభించనుంది. ఈ వెబ్‌పోర్టల్‌లో సబ్జెక్ట్ నిపుణులు, పరిశోధకులు, ఫ్యాకల్టీ, ట్రైనర్స్ వివరాలు అందుబాటులో ఉంటాయి. జాతీయస్థాయి ప్రోగ్రామ్ ఇన్స్టిట్యూట్ స్థాయిలో స్టార్టప్ ఫెస్టివల్స్‌ను నిర్వహించడమే కాక .. ఏఐసీటీఈ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యేక యాక్సలరేషన్ ప్రోగ్రామ్ నిర్వహించనుంది. ఇది నాస్కామ్ 10000 స్టార్టప్స్ ప్రోగ్రామ్ మాదిరిగా ఉంటుంది. దీనిద్వారా ఎంపికైన 50 స్టార్టప్ సంస్థలకు ఏడాదికి రూ. 25 లక్షలు చొప్పున ఏంజెల్ ఫండ్స్ లభిస్తాయి. ఆలోచన మంచిది స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ప్రముఖ ఇన్స్టిట్యూట్లలోనే సాధ్యం అనుకుంటున్న పరిస్థితులున్నాయి. అలాంటిది ఏఐసీటీఈ అనుబంధ కళాశాలల్లో ఔత్సాహికులను ప్రోత్సహించే విధానం తీసుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. ఇన్స్టిట్యూట్లు తప్పనిసరిగా చొరవ చూపేలా చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఉద్దేశం నెరవేరుతుంది. – ప్రొఫెసర్ వి.వెంకట రమణ, కో ఆర్డినేటర్, టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్, హెచ్‌సీయూ -
సామాజిక ఉద్యమాలు
మహిళా ఉద్యమాలు ప్రాచీన కాలంలో స్త్రీలు.. పురుషులతో సమానంగా హక్కులు కలిగి ఉన్నారని తెలుస్తోంది. వేద కాలంలో గార్గి, మైత్రేయి వంటి ఎందరో మహిళలు పురుషులతో సమానంగా విద్యనభ్యసించారు. స్త్రీలకు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేదని రుగ్వేద శ్లోకాల ద్వారా తెలుస్తోంది. అయితే తర్వాతి కాలంలో స్త్రీల పరిస్థితి క్రమంగా దయనీయంగా మారుతూ వచ్చింది. మధ్యయుగం నాటికి మతం, సంప్రదాయాల పేరిట బాల్య వివాహాలు, సతీసహగమనం, దేవదాసీ వ్యవస్థ, పునర్వివాహాలను అంగీకరించకపోవడం వంటి ఎన్నో దురాచారాలు ఆవిర్భవించాయి. సతీసహగమనం భర్త మృతి చెందినప్పుడు అతని మృతదేహం తో పాటు భార్య కూడా చితిమంటలో కాలి మరణించడం సతీసహగమనం. దీన్ని స్వచ్ఛందంగా కాకుండా బలవంతంగా చేయించేవారు. ఈ దురాచారం బెంగాల్లో ఎక్కువగా ఉండేది. దయాభాగ విధానం అమల్లో ఉండటం దీనికి కారణంగా చెబుతారు. దయాభాగ విధానం ప్రకారం మరణించిన భర్త ఆస్తిపై వితంతువుకు హక్కు ఉంటుంది. ఈ అడ్డును తొలగించుకునేందుకు సతీసహగమనాన్ని ఉపయోగించుకున్నట్లు భావిస్తున్నారు. భర్త చనిపోయిన పరిస్థితిలో భార్య మానసిక స్థితిని అంచనా వేయకుండా, ఆమె మౌనాన్ని అంగీకారంగా భావించి, బలవంతంగా సహగమనం చేయించేవారు. 1815–1828 మధ్య ఒక్క బెంగాల్లోనే 8,000 మందికి పైగా మహిళలు ఈ దురాచారానికి బలయ్యారు. జౌహర్ ఓడిపోయిన రాజుల కుమార్తెలు, భార్యలు, బంధువర్గంలోని స్త్రీలు సామూహికంగా, స్వచ్ఛందంగా అగ్నిలోకి దూకి మరణించడాన్ని జౌహర్ అంటారు. గెలిచిన రాజులు, సైన్యం చేతిలో లైంగిక దాడులకు గురవకుండా, తమ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఇలా చేసేవారు. ఈ ఆచారం రాజపుత్రుల్లో ఎక్కువగా ఉండేది. మధ్యయు గంలో రాణి పద్మావతి జౌహర్ ప్రముఖమైంది. పరదా పద్ధతి మధ్యయుగంలో ఈ ఆచారం ఎక్కువగా ముస్లింలు, హిందూ కులీనులు, కొన్ని జాతుల్లో కనిపించేది. స్త్రీలు తాము బయటకు కనిపించకుండా తెర వెనుక ఉండేవారు. లేదా మేని ముసుగు ధరించేవారు. దీనివల్ల బయటకు వెళ్లడానికి, స్వేచ్ఛగా ఇతరులను కలవడానికి అవకాశం ఉండేది కాదు. స్త్రీల విద్యాభ్యాసానికి ఇది ముఖ్య అవరోధంగా ఉండేది. దేవదాసీ వ్యవస్థ దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇది పదో శతాబ్దంలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఈ ఆచారం ప్రకారం కన్యలకు దేవుని విగ్రహంతో వివాహం జరిపిస్తారు. వారు దేవుణ్ని సేవిస్తూ, నృత్యాలు చేస్తూ జీవితాంతం కన్యలుగా ఉండేవారు. తర్వాతి కాలంలో ఈ వ్యవస్థను పక్కదారి పట్టించి, వారిని వేశ్యలుగా మార్చారు. బాల్య వివాహాలు చాలా చిన్న వయసులోనే బాలికకు వివాహం జరిపించాలనే దురాచారం భారతీయ సమాజంలో ఉండేది. మూడేళ్లు, ఐదేళ్ల వయసులోనే వివాహాలు జరిపించేవారు. ఇది బాలికల విద్యాభ్యాసానికి అవరోధంగా నిలిచేది. పసి వయసులోనే వితంతువులుగా మారి, దుర్భర జీవితాన్ని అనుభవించేవారు. చిన్నతనంలోనే గర్భం దాల్చడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తేవి. స్త్రీవాద ఉద్యమాలు భారతదేశంలో స్త్రీవాద ఉద్యమాలను మూడు దశలుగా విభజించొచ్చు. మొదటి దశ (బ్రిటిష్ పాలనా కాలం–1915): ఈ దశలో ఐరోపా వలస పాలకులు మూఢాచారాల గురించి బహిరంగంగా మాట్లాడటంతోపాటు వాటి నిర్మూలనకు కొన్ని చట్టాలు చేశారు. స్త్రీల అణచివేతను, మూఢాచారాలను తొలగించేందుకు సంఘ సంస్కర్తలు ప్రయత్నించారు. రెండో దశ (1915–1947): ఈ దశలో స్త్రీలు తమ కోసం ప్రత్యేకంగా సంస్థలను ఏర్పాటు చేసుకున్నారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. మూడో దశ (స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు): ఈ దశలో స్త్రీవాద ఉద్యమాల దృక్పథం, పోరాట పద్ధతుల్లో ఎంతో వైవిధ్యాన్ని గమనించవచ్చు. స్త్రీవాద ఉద్యమాలను కొందరు స్వాతంత్య్ర పూర్వదశ, అనంతర దశగా విభజించారు. స్వాతంత్య్ర పూర్వ దశ: ఈ దశలో స్త్రీవాద ఉద్యమాలను రెండు దశలుగా విభజించొచ్చు. అవి.. సాంఘిక సంస్కరణ ఉద్యమం, స్వాతంత్య్ర ఉద్యమం. సాంఘిక సంస్కరణ ఉద్యమంలో స్త్రీలను అణచివేస్తున్న మూఢాచారాల తొలగింపునకు సంఘసంస్కర్తలు ప్రయత్నించారు. ఇదే సమయంలో మరోవైపు స్త్రీలు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. దేశంలో సంఘసంస్కరణలకు ఆద్యుడు రాజా రామ్మోహన్రాయ్. సతీసహగమన నిషేధం, కులీనుల్లో బహు భార్యత్వ నిర్మూలన, స్త్రీల హక్కులకోసం ఆయన కృషి చేశారు. ఆయన కృషి వల్ల అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ సతీసహగమన నిషేధ చట్టం (1829, డిసెంబరు 4) చేశారు. వితంతు పునర్వివాహాలు జరిపించేందుకు ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఎంతో కృషి చేశారు. ఆయన 1855 జనవరిలో వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ కరపత్రం ప్రచురించారు. ఆయన కృషి ఫలితంగా ప్రభుత్వం 1856, జూన్ 25న స్త్రీ పునర్వివాహాన్ని చట్టబద్ధం చేసింది. మొదటి వితంతు వివాహాన్ని విద్యాసాగర్ 1856, డిసెంబర్ 7న జరిపించారు. దక్షిణ భారతదేశంలో వితంతు వివాహాలకు కందుకూరి వీరేశలింగం పంతులు కృషి చేశారు. ఆయన 1881, డిసెంబర్ 11న వితంతు వివాహం జరిపించారు. పునర్వివాహం విషయంలో మహదేవ్ గోవింద రనడే, విష్ణుశాస్త్రి పండిట్, గోపాల్ దేశ్‌ముఖ్ వంటి ఎందరో సంస్కర్తలు కృషి చేశారు. దేశవ్యాప్తంగా బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం (మహారాష్ట్ర) సభ్యులు బాల్య వివాహాల నిషేధానికి, వితంతు వివాహాలకు, స్త్రీ విద్యాభ్యాసానికి కృషి చేశారు. బ్రహ్మ సమాజ సభ్యుడు కేశవచంద్రసేన్ బాల్యవివాహాల నిర్మూలనకు కృషి చేశారు. ఆయన కృషి వల్ల శారదా చట్టం (1929) వచ్చింది. దీని ప్రకారం బాలికల వివాహ వయసు 14 ఏళ్లు, బాలుర వివాహ వయసు 18 ఏళ్లు. స్త్రీ విద్యకు మొదట్లో మిషనరీలు కృషి చేశాయి. 1818లో లండన్ మిషనరీ.. బెంగాల్‌లోని చిన్సురాలో బాలికల పాఠశాలను నెలకొల్పింది. అగ్రవర్ణాల్లో బాలికల విద్యపై అపోహ తొలగించేందుకు గౌరీ మోహన్ విద్యాలంకార్ 1822లో ‘స్త్రీ శిక్షా విధాయక్’ పేరిట కరపత్రం ప్రచురించారు. 1849 మేలో కలకత్తాలో జేఈడీ బెతూనీ ఒక పాఠశాలను ప్రారంభించారు. అది 1879 నాటికి మహిళా పాఠశాలగా మారింది. పియరీ చరణ్ సర్కార్ బెంగాల్‌లోని బర్సాత్‌లో బాలికల కోసం మొదటి ఉన్నత పాఠశాలను ప్రారంభించారు. ఇది తర్వాతి కాలంలో కాళీకృష్ణా బాలికా ఉన్నత పాఠశాలగా మారింది. సంఘసంస్కర్తల కృషి వల్ల ఎందరో స్త్రీలు విద్యావంతులై, తమ హక్కుల కోసం పోరాడే చైతన్యం పొందారని చెప్పొచ్చు. మహిళా సంఘ సంస్కర్తలు మహిళా సంఘ సంస్కర్తలకు సంబంధించి మొదటగా చెప్పుకోదగినవారు సావిత్రీబాయి పూలే, పండిత రమాబాయి. సావిత్రీబాయి పూలే మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. తన భర్త జ్యోతిబా పూలేతో కలసి స్త్రీల అభ్యున్నతికి పాటుపడ్డారు. ప్రముఖ సంఘ సంస్కర్త గోవింద రనడే భార్య రమాబాయి.. ‘ది హై క్యాస్ట్ హిందూ ఉమెన్’ పుస్తకంలో స్త్రీల అణచివేత, మతం, వలసవాదం మొదలైన అంశాలను విమర్శించారు. పుణెలో సేవా సదన్ సంస్థను స్థాపించి, స్త్రీల అభ్యున్నతికి కృషి చేశారు. ఎన్నో స్త్రీ పాఠశాలలు, వితంతు ఆశ్రమాలను స్థాపించారు. రమా బాయి పుణెలో ఆర్య మహిళా సమాజ్ను, బాంబేలో శారదా సదన్‌ను ఏర్పాటు చేశారు. బెంగాల్ రచయిత్రి రసుందరీ దేవి.. ‘అమర్ జీవన్’ పేరిట 1876లో ఆత్మకథ రాశారు. ఆత్మకథను రాసిన తొలి భారతీయ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఇందులో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడంతోపాటు స్త్రీలు చైతన్యవంతులు కావాలని సూచించారు. 19వ శతాబ్దం చివరి నాటికి మహిళలు తమ కోసం ప్రత్యేక సంస్థలను ఏర్పాటు చేసుకోగలిగే స్థాయికి ఎదిగారు. అలాంటి వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరి స్వర్ణకుమారీ దేవి ఒకరు. ఆమె 1882లో కలకత్తాలో లేడీస్ సొసైటీని స్థాపించారు. స్త్రీల విద్యాభ్యాసం, వితంతు వివాహాలను ప్రోత్సహించడంతో పాటు, పేద స్త్రీలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవసరమైన శిక్షణను ఈ సొసైటీ ఇచ్చేది. భారతి అనే పత్రికను కూడా స్వర్ణకుమారి నడిపారు. దీనికి ఎడిటర్‌గా పనిచేసి, తొలి భారతీయ మహిళా ఎడిటర్‌గా ఆమె గుర్తింపు పొందారు. జాతీయ కాంగ్రెస్ మూడో సమావేశంలో సామాజిక సమస్యలపై అధ్యయనం కోసం 1887లో ఎం.జి.రనడే ‘నేషనల్ కాన్ఫరెన్స్’ను స్థాపించారు. ఇందులో మహిళా విభాగం (ఇండియన్ ఉమెన్ కాన్ఫరెన్స్) 1904లో ఏర్పడింది. దీని శాఖలు దేశ వ్యాప్తంగా విస్తరించాయి. కులం, మతం, వర్గం, పార్టీలనే భేదం లేకుండా దేశంలోని మహిళలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు, వారి నైతిక, ఆర్థికాభివృద్ధికి స్వర్ణకుమారీ దేవి కుమార్తె సరళాదేవి చౌధురాణి 1910లో ‘భారత స్త్రీ మండల్’ సంస్థను ప్రారంభించారు. లాహోర్, అమృత్సర్, హైదరాబాద్, ఢిల్లీ, కరాచీ వంటి చాలా నగరాల్లో ఈ సంస్థ శాఖలు ప్రారంభమయ్యాయి. ఈ సంస్థ కొంత కాలమే మనుగడ సాగించినప్పటికీ జాతీయ స్థాయిలో స్త్రీలకు ప్రాతినిధ్యం వహించిన మొదటి సంస్థగా చెప్పొచ్చు. స్త్రీలకు రాజకీయ హక్కులు! స్త్రీలకు రాజకీయ హక్కులు, వ్యక్తిగత చట్టాల్లో సవరణలు ప్రాతిపదికన 1917–1945 మధ్య కాలంలో స్త్రీ వాద ఉద్యమాలు జరిగాయి. 1917లో అనీబిసెంట్, మార్గరెట్ కజిన్స్ వంటి ఐరిష్ మహిళలు ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ను స్థాపించారు. వీరు స్వదేశంలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం సాగించారు. భారతదేశంలో కూడా మహిళల ఓటు హక్కు కోసం పోరాడారు. 1917 జాతీయ కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ, ముస్లింలీగ్‌లు మహిళల ఓటు హక్కు డిమాండ్‌ను సమర్థించాయి. సరోజినీ నాయుడు ‘మాంటేగ్’ను కలసి, స్త్రీలకు ఓటు హక్కు కల్పించేందుకు సహాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. పార్లమెంటు కమిటీ లింగ ఆధారిత అనర్హతను తొలగించినా, మహిళలకు ఓటు హక్కు నిర్ణయాన్ని రాష్ట్ర శాసనసభల విచక్షణకు వదిలేసింది. భారత్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి స్వదేశీ సంస్థానం ట్రావెన్కోర్–కొచ్చిన్ సంస్థానం. ఇది 1920లో మహిళలకు ఓటు హక్కు కల్పించింది. 1921లో మద్రాస్, బాంబేలు ఓటు ఓటుహక్కు ఇచ్చాయి. అయితే కొన్ని పరిమితులు విధించాయి. 1926లో కమలాదేవి చటోపాధ్యాయ్ మద్రాస్ శాసన మండలికి పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓడిపోయారు. ముత్తులక్ష్మీ రెడ్డిని మద్రాస్ ప్రభుత్వం శాసనమండలి సభ్యురాలిగా నియమించింది. -
రాష్ట్రపతి.. బిల్లును పూర్తిగా తిరస్కరించడం?
కాంపిటీటివ్ గైడెన్స్ ఇండియన్ పాలిటీ భారత రాజ్యాంగం ప్రకారం డిజ్యూర్ సార్వభౌమాధికారిగా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ట్రపతి పదవీ కాలంలో రాష్ట్రపతి ప్రథమ పౌరునిగా ఉంటే... పదవీ విరమణ తర్వాత హోదా క్రమంలో ఎన్నో స్థానాన్ని పొందుతారు? 5వ స్థానం భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వం గురించి తెలిపే అధికరణలు? ఆర్టికల్–52 నుంచి ఆర్టికల్–151 వరకు భారతదేశంలో మూడు ప్రభుత్వాంగాలు ఏ సూత్రంపై పనిచేస్తాయి? చెక్స్, బ్యాలెన్స్ విధానంలో భారతదేశానికి ప్రధాన కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి అని తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–53 రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి చెల్లించాల్సిన డిపాజిట్ మొత్తం? రూ.15,000 రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టాన్ని ఎప్పుడు చేశారు? 1952 రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో అతని అభ్యర్థిత్వాన్ని ఎంతమంది ప్రతిపాదించాలి, ఎంతమంది బలపర్చాలి? 50, 50 రాష్ట్రపతి ఎన్నికను సవాల్ చేయాలంటే నియోజకగణంలోని ఎంత మంది సభ్యులు బలపరచాలి? 20 ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి ఎన్నిక వివాదాలకు సంబంధించిన మార్గదర్శకాలను రాజ్యాంగంలో చేర్చారు? 11వ సవరణ, 1961 రాష్ట్రపతి భవన్ రూపశిల్పులు? హెర్బర్ట్ బేకర్, ఎడ్వర్ట్ లుట్టియాన్స్ రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–61 రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను దీర్ఘకాలం వాయిదా వేయడం? ప్రోరోగ్ రాష్ట్రపతి.. బిల్లును పూర్తిగా తిరస్కరించడం? నిరపేక్ష వీటో ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్–108 ప్రస్తుతం లోక్‌సభలో ఆంగ్లో–ఇండియన్ సభ్యులు? జార్జ్ బకెర్, రిచర్డ్ హే భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారు? ఆర్టికల్–123 రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ దురుద్దేశ కారణాలతో ఉంటే న్యాయ సమీక్ష చేయొచ్చని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? కూపర్ కేంద్ర ప్రభుత్వం 1970 రాష్ట్రపతి వద్ద ఉండే నిధి? ఆగంతుక నిధి రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారం కల్పించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్? ఆర్టికల్–72 ఆర్థిక సంఘం, కాగ్ తమ నివేదికలను ఎవరికి సమర్పిస్తాయి? రాష్ట్రపతికి ఉరిశిక్షను అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే విధించాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది? బచన్ సింగ్ కేసు భారత రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు అని తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–53 (2) రాజ్యాంగంలోని ఏ భాగం రాష్ట్రపతి అత్యవసర అధికారాల గురించి తెలుపుతోంది? 18వ భాగం జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్? ఆర్టికల్–352 రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ‘ఆర్టికల్ 356’ను మృత పత్రంగా పేర్కొన్నవారు? డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎన్నిసార్లు విధించారు? మూడుసార్లు (1962, 1971, 1975) ఎమర్జెన్సీ కాలంలో జరిగిన అకృత్యాలపై (1975–77) జనతా ప్రభుత్వం నియమించిన కమిషన్? షా కమిషన్ అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేయకుండా మార్గదర్శకాలను కల్పించిన రాజ్యాంగ సవరణ? 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978 రాష్ట్రపతి పాలనను దుర్వినియోగం చేయకుండా సుప్రీంకోర్టు్ట ఏ కేసులో మార్గదర్శకాలు ఇచ్చింది? ఎస్.ఆర్. బొౖమ్మై కేసు (1994) ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్? ఆర్టికల్ –360 అమెరికా అధ్యక్షుడికి ఉండి, భారత రాష్ట్రపతికి లేని వీటో? క్వాలిఫైడ్ వీటో రెండుసార్లు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించినవారు? హిదయతుల్లా (1969, 1983) మొదటి రాష్ట్రపతి ఎన్నికల్లో (1952) బాబూ రాజేంద్రప్రసాద్‌పై పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి? కె.టి. షా హిందూ కోడ్ బిల్లులో సవరణల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన రాష్ట్రపతి? బాబూ రాజేంద్రప్రసాద్ అతి తక్కువ కాలం రాష్ట్రపతిగా పనిచేసినవారు? జాకీర్ హుస్సేన్ (1967–69) ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని ఇందిరాగాంధీ ఎప్పుడు జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా పిలుపునిచ్చారు? 1969 రాష్ట్రపతి ఎన్నిక తన ఎన్నికపై వచ్చిన వివాదంపై సుప్రీంకోర్టుకు స్వయంగా హాజరై తన వాదనను వినిపించిన రాష్ట్రపతి? వి.వి.గిరి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, స్పీకర్‌గా, రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి? నీలం సంజీవరెడ్డి ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ సైనిక చర్య ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది? జ్ఞానీ జైల్‌సింగ్ (1984) అత్యధికంగా నలుగురు ప్రధానమంత్రుల ప్రమాణ స్వీకారం ఏ రాష్ట్రపతి కాలంలో జరిగింది? ఆర్. వెంకట్రామన్ (1987–92)