
నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 265 పోస్టులు
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్.. జూనియర్ ఓవర్‌మ్యాన్
కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్..
జూనియర్ ఓవర్‌మ్యాన్ (జేవో), మైనింగ్ సిర్దార్ (ఎంఎస్) ఉద్యోగాల నియామకానికి
దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు: మొత్తం పోస్టులు 265
(జేవో-197, ఎంఎస్-68)
రిజర్వేషన్ల వారీగా జేవో వేకెన్సీ: ఓసీ-100;
ఎస్సీ-29; ఎస్టీ-39; ఓబీసీ (నాన్ క్రిమిలేయర్
-ఎన్‌సీఎల్)-29
రిజర్వేషన్ల వారీగా ఎంఎస్ వేకెన్సీ: ఓసీ-35; ఎస్సీ-10; ఎస్టీ-13; ఓబీసీ (ఎన్‌సీఎల్)-10
వేతనం: నెలకు రూ.19,035 చెల్లిస్తారు.
విద్యార్హత:
1.జేవో: మైనింగ్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా, ఓవర్‌మ్యాన్స్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్.
2.ఎంఎస్: పదో తరగతి, మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్.
వయోపరిమితి: 2016 అక్టోబర్ 19 నాటికి కనీసం 18 ఏళ్లు; గరిష్టం 35 ఏళ్లు (ఓసీలకు), 40 ఏళ్లు (ఎస్సీ, ఎస్టీలకు), 38 ఏళ్లు (ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు).
దరఖాస్తు విధానం: నిర్దేశిత నమూనాలో పూర్తిచేసిన దరఖాస్తులకు గెజిటెడ్ ఆఫీసర్ అటెస్ట్ చేసిన విద్యార్హత, కుల ధ్రువీకరణ పత్రాల నకళ్లను జత చేసి కింది అడ్రస్‌కు పోస్టులో మాత్రమే పంపాలి.
గమనిక: ఒక అభ్యర్థి ఒక పోస్టు(జేఓ/ఎంఎస్)కు
మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఎంపిక విధానం: రాత పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు
పరీక్ష: గంటన్నర (90 నిమిషాల) వ్యవధిలో 100 మార్కులకు నిర్వహించే రాత పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి.. టెక్నికల్ పార్ట్. రెండు.. జనరల్ పార్ట్. టెక్నికల్ పార్ట్‌లో 70 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 70 మార్కులు, జనరల్ పార్ట్‌లో 30 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 30 మార్కులు కేటాయించారు. జనరల్ పార్ట్‌లో మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, లాజికల్ అండ్ రీజనింగ్ స్కిల్స్‌పై ప్రశ్నలు వస్తాయి. రాత పరీక్షలో అర్హత సాధించేందుకు ఓసీలు ఒక్కో పార్ట్‌లో కనీసం 20 శాతం, ఓవరాల్‌గా 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ(ఎన్‌సీఎల్)లు ఒక్కో పార్ట్‌లో కనీసం 20 శాతం, ఓవరాల్‌గా 40 శాతం మార్కులు పొందాలి.
దరఖాస్తు రుసుం: ఓసీ, ఓబీసీ (ఎన్‌సీఎల్) అభ్యర్థులు నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, సింగ్రౌలి పేరిట రూ.500ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మాత్రమే డీడీ తీయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీలకు మినహాయింపు ఇచ్చారు.
చిరునామా: జనరల్ మేనేజర్ (పీ/ఎంపీ అండ్ ఆర్), రూమ్ నంబర్-15, పర్సనల్ డిపార్ట్‌మెంట్, ఎన్‌సీఎల్ హెడ్ క్వార్టర్స్, సింగ్రౌలీ, మధ్యప్రదేశ్, 486889.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26
వెబ్‌సైట్: www.nclcil.in