చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు | Earn While Studying With Part Time Jobs In Various Sectors | Sakshi
Sakshi News home page

Part Time Job: చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు

Published Tue, Nov 29 2022 2:06 PM | Last Updated on Tue, Nov 29 2022 2:06 PM

Earn While Studying With Part Time Jobs In Various Sectors - Sakshi

పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్‌ కొలువుల కల్చర్‌ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్‌ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్‌ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. 

మన దేశంలో ప్రస్తుతం పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ ట్రెండ్‌ మారుతోంది. గతంలో పార్ట్‌ టైమ్‌ జాబ్స్, ఫ్రీలాన్స్‌ జాబ్స్‌ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్‌ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. 

అఫ్లియేట్‌ మార్కెటింగ్‌
ఇటీవల పార్ట్‌ టైమ్‌ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్‌ మార్కెటింగ్‌. సొంతంగా వెబ్‌సైట్‌ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్‌ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్‌సైట్‌ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్‌ మార్కెటింగ్‌. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్‌సైట్‌ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్‌ చేయడాన్నే అఫ్లియేట్‌ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్‌సైట్‌ నుంచి ఎక్స్‌టర్నల్‌ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి.

డెలివరీ అసోసియేట్స్‌
డెలివరీ అసోసియేట్స్‌ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్‌ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్‌ మాస్టర్‌ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్‌ ఉద్యోగాలకు బ్యాచిలర్‌ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్‌జాబ్స్‌ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. 

ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ట్యూటర్స్‌
పార్ట్‌ టైమ్‌ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్‌లైన్‌ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్‌లైన్, పార్ట్‌టైమ్‌ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్‌ సబ్జెక్ట్‌లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్‌ టైమ్‌ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ సంస్థలు ఆన్‌లైన్‌ ట్యాటర్స్‌కు స్వాగతం పలుకుతున్నాయి. 

కాపీ రైటర్‌
పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ విభాగంలో టాప్‌ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్‌. సోషల్‌ నెట్‌వర్క్‌ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్‌ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్‌లైన్‌ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్‌ రేట్, పీస్‌ రేట్‌ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. 

డేటాఎంట్రీ
టైపింగ్‌ స్కిల్స్, కంప్యూటర్‌ బేసిక్స్‌ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్‌ టైమ్‌ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్‌లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్‌ టైమ్‌ లేదా ఆన్‌లైన్‌ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్‌ టైప్‌ రైటింగ్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్‌ రేట్, టైమ్‌ రేట్‌ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్‌ రేట్‌ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్‌ రేట్‌ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది.

యాడ్‌ పోస్టింగ్‌
ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్‌మెంట్‌ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్‌ వెబ్‌సైట్స్‌లో పోస్ట్‌ చేయడమే..ఆన్‌లైన్‌ యాడ్‌ పోస్టింగ్‌. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్‌ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌ రైటింగ్‌ స్కిల్స్‌ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్‌ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్‌లైన్‌ యాడ్‌ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్‌ఎక్స్‌ తదితర వెబ్‌సైట్స్‌ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది.

ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్‌
ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్‌నెస్‌ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్‌ టైమ్‌ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్‌నెస్‌ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్‌ టైమ్‌ విధానంలో ఫిట్‌నెస్‌ ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. 

సేల్స్‌ అసోసియేట్‌
ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్‌ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్‌ టైమ్‌ సేల్స్‌ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్‌ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్‌ సేల్స్‌ అసోసియేట్‌గా  పార్ట్‌ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది.

క్యాబ్‌ డ్రైవర్స్‌
ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్‌ టైమ్‌ ఆదాయ మార్గం.. క్యాబ్‌ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్‌ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్‌ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్‌ టైమ్‌ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది.

సోషల్‌ మీడియా అసిస్టెంట్‌
ప్రస్తుతం కార్పొరేట్‌ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్‌ మీడియాలోనూ షేర్‌ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్‌ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్‌ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్‌ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్‌ టైమ్‌ విధానంలో ఆదాయం పొందొచ్చు.

ఐటీ రంగంలోనూ
ఐటీ రంగంలో సైతం పార్ట్‌ టైమ్‌ జాబ్స్‌ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్‌ స్టాక్‌ డెవలపర్స్, మొబైల్‌ యాప్‌ డెవలపర్స్‌ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్‌ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్‌ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్‌ పప్రొఫైల్,పప్రాజెక్ట్‌ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. 

ఆన్‌లైన్‌ కన్సల్టెంట్‌
ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్‌లైన్‌ కన్సల్టెంట్‌. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్‌ వరకూ.. ఆన్‌లైన్‌ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. 

అందుకునే మార్గాలివే
ప్రస్తుత టెక్‌ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్‌ సెర్చ్‌ పొర్టల్స్‌ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్‌ యాప్స్‌ కూడా పార్ట్‌టైమ్‌ జాబ్స్‌ వివరాలు అందిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement