Sales and Marketing
-
నచ్చితే తీస్కో..! లేదంటే మూస్కో..!! గొర్రెల పంపిణీలో ‘గోల్మాల్’..
ఆదిలాబాద్: గొల్ల, కుర్మలు, యాదవుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకం జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఆశించిన ఫలితాలు అందించడంలో విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కొక్క యూనిట్ ధర రూ.1.75లక్షలు ధర నిర్ణయించిన ప్రభుత్వం తన వాట కింద రూ.1,31,250 చెల్లించగా, లబ్ధిదారుడు రూ.43,750 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 20 గొర్రెలు, ఒక పొటెలు కొనుగోలుకు రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ. 25వేలతో గొర్రెల తరలింపు మందులు కొనుగోలు, ఇన్సురెన్స్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రభుత్వం రెండో విడత పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 3597 మంది లబ్ధిదారులు డీడీలు కట్టారు. ఒక్కొక్క లబ్ధిదారుడు రూ.43,750 చొప్పున మొత్తం రూ.15.73 కోట్ల డీడీలు చెల్లించారు. దాదాపు సంవత్సర కాలంగా ఎదురుచూడగా ఈ ఏడాది జూలైలో యూనిట్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవీ విధివిధానాలు... మొదటి విడత గొర్రెల పంపిణీలో రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల అక్రమాలు జరిగినట్లు తేలడంతో ప్రభుత్వం పంపిణీ విధివిధానాలను మరింత కఠినతరం చేసింది. గొర్రెల ఎంపికలో మండల పశువైద్యాధికారుల పాత్రను తగ్గించి జిల్లా , రాష్ట్ర స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. దీనికోసం జిల్లా పశువైద్యాధికారి పర్యవేక్షణలో జిల్లా అధికారి, రాష్ట్ర స్థాయి అధికారితో కూడిన టీంను సిద్ధం చేశారు. లబ్ధిదారులు అధికారులతో కలిసి స్వయంగా గొర్రెల విక్రయించే వారి వద్దకు వెళ్లి కొనుగోలు చేసేలా, కొనుగోలు సమయంలో ప్రత్యేకమైన ట్యాబ్‌ల్లో ఆన్లైన్లో తమ ఇష్టపూర్వకంగా గొర్రెలను ఎంపిక చేసుకున్నట్లు వాయిస్ మెసెజ్ అప్లోడ్ చేసేలా నిబంధనలు చేర్చారు. 447 యూనిట్ల పంపిణీ... ఈ ఏడాది జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ మాసాల్లో జిల్లా వ్యాప్తంగా రూ.7.80 కోట్లతో మొత్తం 447 యూనిట్లు (9387 గొర్లు) పంపిణీ చేశారు. మొత్తం 3597 మంది డీడీ కట్టగా, ఇప్పటి వరకు కేవలం 447 మందికే గొర్లు పంపిణీ చేశారు. ఇంకా 3150మందికి గొర్లు రావాల్సి ఉంది. వీరంత సంవత్సర కాలంగా ఒక్కొక్కరు రూ. 43,750 చొప్పున డీడీలు చెల్లించారు. ఎన్నికల కోడ్ వస్తుందని సర్వత్రా చర్చలు నడుస్తుండటంతో తాము కట్టిన డబ్బులు అయిన తిరిగి వస్తే చాలు అన్న పంథాలో లబ్ధిదారులు ఉన్నారు. దీంతో కొంత మంది అధికారులు, నాయకులు వీరి నిస్సహాయతను సొమ్ము చేసుకుంటున్నారు. నచ్చితే తీస్కో.. లేదంటే మూస్కో.. గొర్రెల పంపిణీలో అక్రమాలను నివారించడానికి ప్రభుత్వం కఠినమైన విధివిధానాలను రూపొందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఆగడం లేదు. పక్క రాష్ట్రంలోని కృష్ణా జిల్లా కోదాడ మండలం నుంచి మాత్రమే గొర్రెలు కొనుగోలు చేస్తున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నారు. కోదాడ మండలంలోని నాలుగు గ్రామాల్లో గొర్రెల లభ్యత ఉండగా లబ్ధిదారులను అక్కడికే పంపించి గొర్రెలను తీసుకునేలా బలవంతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ అప్పటికే అనారోగ్యంతో ఉన్నవి, చెవికి ట్యాగ్ గాయాలతో ఉన్న (పలుమార్లు ఏమార్చి ఇన్ష్యూరెన్స్ చేయబడినవి) గొర్లను కట్టబెడుతున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు.. జిల్లాలో గొర్రెల పంపిణీలో ఎలాంటి అక్రమాలు మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం, లబ్ధిదారులు స్వయంగా వెళ్లి గొర్రెలు తెచ్చుకుంటున్నారు. గొర్రెల రవాణా కోసం వినియోగించే వాహనాలకు సైతం జీపీఎస్ ట్రాకింగ్ అమర్చడం జరిగింది. లబ్ధిదారుల గ్రామాలకు గొర్రెలు చేరిన తరువాత కూడా ఫొటోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎక్కడైన అక్రమాలు జరిగినట్లు మా దృష్టికి వస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాం. –కిషన్, జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి కట్టింది రూ.43వేలు.. ఇచ్చేది రూ.90వేలే... లబ్ధిదారులు గొర్రెలను ఎంపిక చేసుకున్న తరువాత అధికారులు జీపీఎస్ ట్యాగ్ ఉన్న ఐచర్ వాహనాల్లో, ఒక్కొక్క వాహనంలో ఆరు యూనిట్ల చొప్పున గొర్రెలను లబ్ధిదారుల గ్రామాలకు తరలిస్తున్నారు. అక్కడ సర్పంచ్, గొల్లకుర్మ కమిటీ అధ్యక్షుడు, లబ్ధిదారుడు, స్థానిక పశువైద్యాధికారి సమక్షంలో ఐచర్ ఫొటోలు, గొర్రెల ఫొటోలు తీసీ ఆన్లైన్లో పెడుతున్నారు. అనంతరం రెండు, మూడు రోజుల్లో గొర్రెలు అమ్మిన వ్యక్తి బ్యాంక్ ఖాతాల్లో ప్రభుత్వం ఒక్కొక్క యూనిట్‌కు రూ.1.50లక్షలు జమ చేయడం జరుగుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ అసలు కథ ఇక్కడే ప్రారంభం అవుతుంది. ముందుగానే కుదుర్చుకున్న డీల్ ప్రకారం తన ఖాతాల్లో డబ్బులు పడగానే సదరు గొర్రెలు అమ్మిన వ్యక్తి ఒక లారీతో ఆయా గ్రామాలకు వచ్చి లబ్ధిదారులకు యూనిట్‌కు రూ.90వేలు చెల్లించి తాను ఇచ్చిన గొర్రెలను మరల లారీలో ఎక్కించుకొని వెళ్లిపోతాడు. లబ్ధిదారులే అమ్ముకుంటున్నారని వారిని బద్నాం చేసే పనులు అధికారులు చేస్తున్నప్పటికీ అధికారులు, నాయకుల అండదండలతోనే ఇదంతా జరుగుతుందని లబ్ధిదారుల వాదన. -
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
బండి కాదు..మొండి ఇది..!
సాక్షి, బిజినెస్ విభాగం: వాహన విక్రయాలు నానాటికి తగ్గిపోతుండటంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో కూరుకుపోతోంది. జూలైలో అమ్మకాలు దాదాపు రెండు దశాబ్దాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీంతో వాహన తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించేసుకుంటున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూలై మధ్యలో దేశీ ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13.18% తగ్గిపోయింది. మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టొయోటా, హోండా వంటి దిగ్గజాలన్నీ భారీగా ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. హ్యుందాయ్, ఫోక్స్‌వ్యాగన్ ఇండియా మాత్రమే ఉత్పత్తిని కాస్త పెంచుకున్నాయి. ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ గణాంకాల ప్రకారం గతేడాది ఏప్రిల్–జూలై మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల ఉత్పత్తి 87,13,476 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది అదే వ్యవధిలో సుమారు 10% పడిపోయి 78,45,675గా నమోదైంది. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తి 13,97,404 యూనిట్ల నుంచి 13% క్షీణతతో 12,13,281 యూనిట్లకు పడిపోయింది. ఈ పరిణామాలతో ఏప్రిల్ నుంచి చూస్తే ఇప్పటిదాకా ఆటోమొబైల్ రంగంలో (వాహన తయారీ సంస్థలు, విడిభాగాల తయారీ సంస్థలు, డీలర్లు మొదలైన వర్గాలు) ఇప్పటిదాకా 3.5 లక్షల ఉద్యోగాల్లో కోత పడినట్లు అంచనా. తమ పరిధిలో 15,000 మంది దాకా ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని, వందలకొద్దీ డీలర్‌షిప్‌లు మూతబడటంతో వేలమంది ఉపాధి కోల్పోయారని సియామ్ స్వయంగా వెల్లడించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఈ నేపథ్యంలో.. ఇకపై తాత్కాలిక ఉద్యోగులు, సేల్స్.. మార్కెటింగ్ విభాగంలో సర్వీసులు అందించే వారు, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డీ) విభాగాల్లో ఉద్యోగులపై ప్రతికూల ప్రభావాలు మరింతగా ఉండనున్నాయని మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇదే ధోరణి.. అంతర్జాతీయంగా కూడా ఆటోమొబైల్ రంగంలో మందగమన ధోరణులే నెలకొన్నాయని, దీనికి భారత్ మినహాయింపేమీ కాదని సీఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా తెలిపారు. దీంతో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడానికి తమ పరిధిలో తీసుకోగలిగిన చర్యలన్నీ తీసుకుంటున్నాయన్నారు. ఇందులో భాగంగానే ఉత్పత్తి తగ్గించుకోవడం, తాత్కాలికంగా ప్లాంట్లు మూసివేయడం వంటివి చేస్తున్నాయని మిశ్రా చెప్పారు. మందగమనం ఇలాగే కొనసాగితే రోజువారీ కార్యకలాపాలకు అంతగా ముఖ్యం కాకపోయినా అధిక వేతనాలు అందుకునే వారిని తొలగించడంపై కూడా కంపెనీలు దృష్టి పెట్టే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ‘తయారీ విభాగంపైనే ఎక్కువగా ప్రభావం ఉంటుంది. కంపెనీలు ఉత్పత్తిని తగ్గించడం వల్ల ముఖ్యంగా తాత్కాలిక సిబ్బందిపై ప్రభావం పడుతుంది. ఆ తర్వాత పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల విభాగంలో మధ్య స్థాయి నుంచి సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కూడా కోత పడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి‘ అని మిశ్రా చెప్పారు. పర్మనెంటు ఉద్యోగులను తొలగించడం అన్నది ఆఖర్న మాత్రమే జరగొచ్చని.. అయితే మందగమన ప్రభావాలు మరింత తీవ్రమైతే ఆయా ఉద్యోగుల బోనస్‌లు, ఇంక్రిమెంట్లు మొదలైన వాటిల్లో కోత పడొచ్చని తెలిపారు. మరోవైపు, సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లోని సర్వీస్ సిబ్బందిపై ఎక్కువగా ప్రభావం పడుతుందని టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ బిజినెస్ హెడ్ మునీరా లోలివాలా అభిప్రాయపడ్డారు. ‘వచ్చే కొద్ది నెలల్లో మందగమనానికి అడ్డుకట్ట పడగలదని ఆశిస్తున్నాం. అయితే సేల్స్, ఆర్అండ్డీ విభాగాల్లోని ఉద్యోగాల్లో కొంత మేర కోత పడే అవకాశాలు ఉన్నాయి. ఇక డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు మొదలైన వారి స్థాయిల్లోనూ ఉద్యోగాల్లో కోత ఉంటుంది. పడిపోతున్న వాహన విక్రయాల కారణంగా పరికరాల తయారీ పరిశ్రమపైనా ప్రభావం తప్పదు‘ అని ఆమె చెప్పారు. మరో 10 లక్షలకు పైగా కొలువులకు గండం.. దేశీ ఆటోమొబైల్ రంగంలో దాదాపు 3.5 కోట్ల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కానీ, గడిచిన ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిక్ వాహనాలు తదితర అంశాలపై కేంద్రం పలు నిర్ణయాలు ప్రకటిస్తుండటం వల్ల విధానాల్లో స్పష్టత లోపించడంతో ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇక రుణాల లభ్యత కూడా అంతంతమాత్రంగానే ఉండటం, వాహనాలకు డిమాండ్ పడిపోవడం ఆటోమొబైల్ రంగాన్ని మరింతగా కుంగదీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగంలో ఏకంగా 10 లక్షల దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉందంటూ ఆటోమోటివ్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) గత నెలలోనే హెచ్చరించింది. ప్రభుత్వ మద్దతు కావాలి.. ఆటోరంగంలో పెను మా ర్పుల కారణంగా ఈ పరిస్థితులు తలెత్తాయని మైఖేల్ పేజ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ మోహిత్ భారతి వ్యాఖ్యానించారు. ‘ఇదే ధోరణి మరికొంత కాలం సాగిందంటే ఆటో పరికరాల సంస్థలు, అనుబంధ సంస్థల్లోనూ ఉద్యోగాల్లో కోత తప్పకపోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గానీ తక్షణం జోక్యం చేసుకోకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆటో రంగానికి పరిస్థితులు ఆశావహంగానైతే కనిపించడం లేదు‘ అని మోహిత్ పేర్కొన్నారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని తగ్గించాలని, రిజిస్ట్రేషన్ ఫీజు పెంపు ప్రతిపాదనలను కొంత కాలం వాయిదా వేయడం ద్వారా పరిశ్రమ కోలుకునేందుకు కాస్త వెసులుబాటు కల్పించాంటూ ఆటో రంగ సంస్థలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. కారు.. బైక్ రివర్స్ గేర్..! -
మైక్రోసాఫ్ట్‌లో 4,000 ఉద్యోగాల కోత!!
అమెరికా వెలుపల ఎక్కువ కోతలకు ఆస్కారం న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘మైక్రోసాఫ్ట్’.. 4,000 వరకు ఉద్యోగులను ఇంటికి పంపనుంది. సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగాల్లో అతిపెద్ద పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు చోటుచేసుకోనుంది. సిబ్బంది తొలగింపులు ఎక్కువగా అమెరికా వెలుపల ఉంటాయని సమాచారం. సంస్థ తన భాగస్వాములకు, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడానికి కొన్ని మార్పులను చేపడుతోందని మైక్రోసాఫ్ట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ప్రస్తుతం మేం కొందరి ఉద్యోగులను గుర్తించడానికి చర్యలు తీసుకుంటున్నాం. వీరి ఉపాధి రిస్క్‌లో ఉంటుంది. ఇతర కంపెనీల మాదిరిగానే మేం కూడా ఎప్పటిలాగే వ్యాపార కార్యకలాపాలను పునఃసమీక్షించుకుంటున్నాం. దీనివల్ల కొన్ని విభాగాల్లో పెట్టుబడులు పెరగొచ్చు. అలాగే కొన్ని చోట్ల ఉపాధి తగ్గొచ్చు’ అని వివరించారు. అయితే మైక్రోసాఫ్ట్‌లో 3,000–4,000 మధ్యలో ఉద్యోగాల కోత ఉంటుందని న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన వార్తలను ఈయన నిర్ధారించలేదు. కాగా మైక్రోసాఫ్ట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,21,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. -
సవాళ్లతో కూడిన వృత్తి.. మార్కెటింగ్ మేనేజర్!
సేల్స్ అండ్ మార్కెటింగ్... ప్రపంచవ్యాప్తంగా వందల ఏళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న ప్రక్రియ. ఇది కంపెనీలో తయారు చేసిన ఉత్పత్తులను, సంస్థల సేవలను సంబంధిత వినియోగదారులకు విక్రయించే బహుముఖ వ్యాపారం. అమ్మకాలపైనే సంస్థల మనుగడ ఆధారపడి ఉంటుంది. ఇలా అమ్మకాలు సాగిస్తూ కంపెనీకి, వినియోగదారులకు మధ్య వారధిగా పనిచేసేవారే.. సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్లు. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాల మధ్య సరిహద్దులు చెదిరిపోతూ వ్యాపార సంస్కృతి విస్తరిస్తుండడంతో మార్కెటింగ్ నిపుణులకు అవకాశాలు మిన్నంటుతున్నాయి. దేశ విదేశాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఇకపై భవిష్యత్తంతా సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగానిదేనని చెప్పడం అతిశయోక్తి కాదు. కాబట్టి దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే అవకాశాలకు, ఆదాయానికి నింగే హద్దు. మార్కెటింగ్ నిపుణుల కొరత తీవ్రం నేడు అన్ని రంగాల్లో సేల్స్ మేనేజర్ల పాత్ర తప్పనిసరి. ప్రధానంగా రిటైల్, ఐటీ, హాస్పిటాలిటీ, ట్రావెల్, హెల్త్‌కేర్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో అధిక ఉద్యోగాలున్నాయి. ప్రస్తుతం నిపుణులైన మేనేజర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. డిమాండ్, సప్లై మధ్య అంతరం ఎక్కువగా ఉంది. దీనిపై జనంలో ఇప్పటిదాకా అంతగా అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు వస్తోంది. మార్కెటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకొనే యవత సంఖ్య పెరుగుతోంది. ప్రారంభంలో సేల్స్ పర్సన్‌గా పనిచేసినవారు వృత్తిలో నైపుణ్యాలను పెంచుకొని మేనేజర్ స్థాయికి ఎదగొచ్చు. కుటీర పరిశ్రమల నుంచి కార్పొరేట్ సంస్థల వరకు తమ వ్యాపారాభివృద్ధి కోసం మార్కెటింగ్ మేనేజర్లను నియమించుకుంటున్నాయి. ఈ వృత్తి మిగిలినవాటితో పోలిస్తే భిన్నమైనది. తానేం సాధించాలో మేనేజర్‌కు ముందే తెలుస్తుంది. ఇందులో పోటీ, సవాళ్లు అధికంగా ఉంటాయి. కావాల్సిన నైపుణ్యాలు సేల్స్ మేనేజ్మెంట్లో మెరవాలంటే మాతృభాషతోపాటు ఆంగ్లంపై గట్టి పట్టుండాలి. అనర్గళంగా మాట్లాడే, తప్పుల్లేకుండా రాసే నైపుణ్యం అవసరం. మాటలతో వినియోగదారులను ప్రభావితం చేసి, ఒప్పించగలిగే నేర్పు ఉండాలి. ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినే లక్షణం ముఖ్యం. సాధారణ వ్యాపార లావాదేవీలపై పరిజ్ఞానం పెంచుకోవాలి. తార్కికంగా ఆలోచించగలగాలి. ప్రజంటేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకొనేదాకా ఓపికతో పనిచేయాలి. నాయకత్వ లక్షణాలుండాలి. సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కావాలి. అర్హతలు సేల్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎంబీఏ పూర్తిచేయాలి. గతంలో మేనేజ్మెంట్ డిగ్రీ లేకపోయినా సేల్స్ మేనేజర్‌గా అవకాశాలు లభించేవి. ప్రస్తుతం సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో చేరాలంటే బిజినెస్ స్టడీస్‌లో డిగ్రీ/డిప్లొమా ఉండడం తప్పనిసరి. తగిన విద్యార్హతలతో కెరీర్లో వేగంగా ఎదగడానికి వీలుంటుంది. మార్కెటింగ్ అర్హతలు లేని సాధారణ గ్రాడ్యుయేట్లు సైతం ఈ రంగంలో స్వయం ప్రతిభతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. వేతనాలు సేల్స్ మేనేజ్మెంట్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. ప్రారంభంలో సంవత్సరానికి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వేతన ప్యాకేజీ లభిస్తుంది. సీనియారిటీ పెరిగితే ఏడాదికి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అందుకోవచ్చు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-లక్నో. వెబ్సైట్: www.iiml.ac.in/ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.iiswbm.edu/ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వెబ్సైట్: www.imt.edu/ ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్-ఢిల్లీ వెబ్సైట్: http://fms.edu/ జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వెబ్సైట్: www.xlri.ac.in/ సమర్థతను బట్టి వేతనాలు ‘‘ప్రపంచ దేశాలు తమ ఉత్పత్తుల విక్రయానికి భారత్‌నే అతిపెద్ద మార్కెట్‌గా ఎంచుకున్నాయి. ఇక్కడి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. దీంతో సేల్స్ అండ్ మార్కెటింగ్ రంగంలో ఉద్యోగావ కాశాలు పెరుగుతున్నాయి. కేవలం సబ్జెక్టు నాలెడ్జ్ మాత్రమే కాకుండా వృత్తికి అవసరమైన నైపుణ్యాలను పెంచుకోవాలి. కమ్యూనికేషన్స్కిల్స్, ఆటిట్యూడ్, బిహేవియర్ స్కిల్స్ వంటివి అవసరం. మార్కెటింగ్ రంగంలో కెరీర్ పరంగా సాధారణ స్థాయి నుంచి మేనే జింగ్ డెరైక్టర్ వరకూ ఎదగొచ్చు. నైపుణ్యం, సమర్థతను బట్టి వేతనాలు అందుతాయి’’ -వి.అంజిరాజు, అసోసియేట్ ప్రొఫెసర్, ఐపీఈ