Part time job
-
బైక్ ట్యాక్సీలకు ‘మహాలక్ష్మి’ గండం
హైదరాబాద్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచి్చంది’ అన్నట్లుంది తెలంగాణలో బైక్ ట్యాక్సీల పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం అమలు చేస్తుండటంతో.. దీని ప్రభావం ప్రత్యక్షంగా ఆటోలు, క్యాబ్‌లు, బైక్ ట్యాక్సీలపై పడుతోంది. మహిళలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించడం చాలా వరకు తగ్గించారు. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన వారం రోజుల్లోనే గ్రేటర్లో 5 లక్షలకు పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర బైక్ ట్యాక్సీలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాయి. బైక్ ట్యాక్సీల బుకింగ్‌లు తగ్గిపోవడంతో కస్టమర్లను ఆకర్షించేందుకు బైక్ ట్యాక్సీ కంపెనీలు ధరలను తగ్గించాయి. దీంతో బైక్ క్యాపె్టన్ల ఆదాయం సగానికి పైగా తగ్గిపోయింది. తగ్గిన ఆదాయం.. ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి అగ్రిగేటర్లు బైక్ ట్యాక్సీ సేవలను అందిస్తున్నాయి. సాధారణంగా ఈ బైక్ ట్యాక్సీలను నిరుద్యోగులు, విద్యార్థులు పార్ట్‌టైం జాబ్‌గా నడుపుతుంటారు. ప్రస్తుతం గ్రేటర్లో సుమారు 70 వేల మంది బైక్ ట్యాక్సీ క్యాపె్టన్లు ఉండగా.. వీరిలో మహిళా బైక్ క్యాపె్టన్లు 300 నుంచి 400 మంది ఉంటారు. వీరికి కిలోమీటర్ల చొప్పున ఆయా కంపెనీలు బైక్ క్యాపె్టన్లకు కమీషన్ ఇస్తుంటాయి. అయితే మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ఒక్కో క్యాపె్టన్కు రోజుకు 20కి పైగా బుకింగ్‌లు వస్తుండేవి. పెట్రోల్ ఖర్చులు పోను రోజుకు రూ.1,000 పైగానే ఆదాయం సమకూరేది. అయితే ఉచిత బస్సు ప్రయాణం అమలుల్లోకి వచ్చాక బుకింగ్‌లు చాలా వరకు తగ్గిపోయాయని ఓలా బైక్ క్యాపె్టన్ శ్రీను తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు అగ్రిగేటర్ సంస్థలు కూడా బైక్ క్యాప్టెన్ల కమీషన్లను సగానికి పైగా తగ్గించాయని ఆవేదన వ్యక్తం చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ధరలను తగ్గించాయన్నారు. గతంలో 15–25 కిలో మీటర్ల బుకింగ్‌కు కనిష్టంగా రూ.150–180 వరకు ఛార్జీ వచ్చేదని, కానీ ఇప్పుడు రూ.60–80కి మించి రావడం లేదన్నాడు. మార్గదర్శకాలు రూపొందించాలి.. సాధారణంగా వాహన అగ్రిగేటర్లే ధరలను నిర్ణయిస్తుంటారు. కంపెనీల వద్ద కస్టమర్ల డేటా నిక్షిప్తమై ఉండటంతో ఆల్గరిథం సాంకేతికతతో కస్టమర్ల డేటా, రోజు, డిమాండ్‌ను బట్టి సంస్థలు ధరలను మారుస్తుంటాయని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) రాష్ట్ర అధ్యక్షుడు షేక్ సల్లావుద్దిన్ తెలిపారు. అందుకే ఆటో, క్యాబ్, బైక్ అగ్రిగేటర్లు ధరలను ప్రభుత్వమే నిర్ణయించాలని, ఇందుకోసం విధానాలు, మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు. ఆటోలు, క్యాబ్‌ల తరహాలోనే బైక్ ట్యాక్సీలను కూడా ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావాలని కోరారు. -
Money Earnings: డబ్బు సంపాదనకు ఇన్ని మార్గాలా..!
డబ్బు సంపాదించాలని ఎవరి ఉండదు.. ఉద్యోగం, వ్యాపారం, కూలీపని, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో ఆర్జించడం.. ఇలా ఏది చేసినా డబ్బుకోసమే. మన చదువు, మనం చేసే పనినిబట్టి డబ్బు సంపాదన మారుతోంది. అయితే చదువు అయిపోయిన వెంటనే కొందరు ఉద్యోగంలో స్థిరపడుతారు. మరికొందరికి కొన్ని కారణాల వల్ల కొంచెం సమయం పడుతుంది. చదువుకున్న గ్రాడ్యుయేట్లు కేవలం ఉద్యోగం ద్వారానే కాకుండా ఎన్నో మార్గాల వల్ల డబ్బు సంపాదించవచ్చు. మన నైపుణ్యాలు, ఆసక్తులు, కెరీర్ లక్ష్యాల ఆధారంగా గ్రాడ్యుయేట్ల సంపాదన మారవచ్చు. డబ్బు సంపాదించే కొన్ని మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫుల్‌టైం ఉద్యోగం: ఇది సంప్రదాయ మార్గం. గ్రాడ్యుయేషన్ అయిన వెంటనే దరఖాస్తు చేసుకుని ఉద్యోగం సంపాదించవచ్చు. అందులోనే స్థిరపడవచ్చు. అయితే కెరీర్ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న కంపెనీలను పరిశోధించడం ముఖ్యం. స్థిరమైన ఉద్యోగం, ఉద్యోగ భద్రతతో ఎన్నో ప్రయోజనాలు, మంచి ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 2. ఫ్రీలాన్సింగ్: నిర్దిష్ట నైపుణ్యాలు (రైటింగ్, గ్రాఫిక్ డిజైన్, ప్రోగ్రామింగ్, సోషల్ మీడియా మేనేజ్మెంట్)ఉంటే ఫ్రీలాన్సర్‌గా సేవలు అందించవచ్చు. అందుకు కొన్ని ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేలా శిక్షణ ఇస్తున్నాయి. 3. కన్సల్టింగ్: నిర్ణీత రంగంలో నైపుణ్యం ఉన్న గ్రాడ్యుయేట్లు కన్సల్టెంట్లుగా మారవచ్చు. వీరు వ్యాపారాలు లేదా వ్యక్తులకు సలహాలు, సమస్యలకు పరిష్కారాలు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్ లేదా ఐటీ వంటి వివిధ రంగాల్లోని కంపెనీలను సంప్రదించవచ్చు. 4. సొంత వ్యాపారం: మంచి వ్యాపార ఆలోచనతో కొంత పెట్టుబడితో డబ్బు సంపాదించవచ్చు. ఇందులో భాగంగా ఏదైనా ఉత్పత్తులు తయారుచేయడం, వాటికి సేవలు అందించడం వంటి విభాగాల్లో వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. 5. టీచింగ్/ ట్యూటర్: సంబంధిత సబ్జెక్టులో పరిజ్ఞానం ఉన్న గ్రాడ్యుయేట్లు ఇతర విద్యార్థులకు ట్యూటరింగ్ సేవలను అందించవచ్చు. కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో వివరాలు నమోదుచేసుకుని ఈ పనిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా పాఠశాల ఉపాధ్యాయులుగా లేదా కళాశాల ప్రొఫెసర్‌గా మారవచ్చు. 6. ఆన్లైన్ కంటెంట్ క్రియేషన్: ఆన్లైన్ బ్లాగ్, యూట్యూబ్ ఛానెల్ లేదా పోడ్‌క్యాస్ట్‌ని ఏర్పాటు చేసుకోవచ్చు. మన ఛానెల్‌కు ఫాలోవర్లు పెరిగిన తర్వాత ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌లు, మార్కెటింగ్ లేదా వస్తువులు విక్రయించడం ద్వారా డబ్బు ఆర్జించవచ్చు. 7. ఆన్లైన్ కోర్సులు: ఆన్లైన్ కోర్సులు అందించే ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కోర్సులను సిద్ధం చేసి విక్రయించవచ్చు. అయితే ఈ కోర్సులు మన అధ్యయన రంగానికి, నైపుణ్యాలకు సంబంధించి ఉంటే మరీ మంచిది. 8. పెట్టుబడులు: స్టాక్‌లు, బాండ్లు, రియల్ఎస్టేట్ వంటి మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టాలి. ఆయా విభాగాల్లో ర్యాలీనిబట్టి మనకొచ్చే ఆదాయం పెరుగుతుంది. అయితే ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్నా స్పష్టమైన అవగాహన ఎంతో అవసరం. 9. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు: చదువుతున్న వారైనా, చదువు పూర్తయిన వారైనా స్థిరమైన ఆదాయ మార్గం వచ్చేంత వరకు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయవచ్చు. రిటైల్, కస్టమర్ సర్వీస్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో ఈ ఉద్యోగాల పాత్ర కీలకం. రిమోట్ వర్క్, గిగ్ ఎకానమీ ఉద్యోగాలు, మార్కెటింగ్, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ఈకామర్స్ వంటి ఎన్నో రంగాల్లో పని చేస్తూ డబ్బు సంపాదించవచ్చు. Follow the Sakshi TV channel on WhatsApp -
ఆన్లైన్ మాయగాళ్లు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: జిల్లాలో ఆన్లైన్ మోసాలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అక్షర జ్ఞానం లేని వారి నుంచి ఉన్నత విద్యాభ్యాసం చేసిన, ఉద్యోగులు.. ఆన్లైన్ మోసాల్లో చిక్కుకుంటున్నారు. నిరుద్యోగులకు, యువతకు కొందరు కేటుగాళ్లు వల వేస్తున్నారు. ఖాళీ సమయంలో పార్ట్ టైంగా ఇంటి వద్దే ఉండి ఉద్యోగం చేయండి, భారీగా సంపాదించే అవకాశం ఉంది అంటూ మాయగాళ్లు పెద్ద ఎత్తున యువత నుంచి అందిన మేరకు దోచుకొంటున్నారు. ఇలాంటి కేసులు నగరంలో ఇటీవల ఎక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఆ ప్రకటనలు నమ్మి పలువురు ప్రైవేటు ఉద్యోగులు, నిరుద్యోగులు, మోసగాళ్ల మాయలో చిక్కుకుంటున్నారు. ఊడ్చేస్తున్నారు ఇలాగే విజయవాడలోని యువతి మొబైల్‌కు.. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ అధిక డబ్బు సంపాదించవచ్చని ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్ చేస్తే చాలని, అన్నింటికి లెక్కకట్టి డబ్బులు వేస్తామని నమ్మపలకగా ఆమె అంగీకరించి బ్యాంకు ఖాతా వివరాలను పంపింది. మొదట మూడు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.150, ఆరు వీడియోలకు లైక్ చేసినందుకు రూ.300 బ్యాంకు ఖాతాలో వేశారు. ప్రీపెయిడ్ టాస్క్‌లు చేస్తే ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని మాయగాళ్లు నమ్మబలికారు. తొలుత రూ.1000 చెల్లిస్తే, తిరిగి రూ.1600 బ్యాంకు ఖాతాలో వేశారు. ఇలా విడతల వారీగా ఆమె 19 లక్షలు బ్యాంకు ఖాతాకు బదిలీ చేసి మోస పోయింది. ఇలా నగరంలో ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చనే మొయిల్లను నమ్మి మోసపోతూనే ఉన్నారు. యువతను ఆకర్షించి.. కొంత మంది యువత ప్రభుత్వ పథకాల కోసం అకౌంట్లను ప్రారంభిస్తున్నారు. ఇలాంటి వారిని కొన్ని ముఠాలు ఆకర్షిస్తున్నాయి. వారికి పార్ట్‌టైమ్ జాబ్‌లు, కమిషన్ వస్తుందని ఆశ చూపుతున్నారు. వీరి అకౌంట్లకు లింక్ అయిన ఫోన్ నంబర్లను అన్లైన్లోనే మార్చి, వారి ఫోన్ నంబర్లకు లింక్ చేసుకొని ఖాతాలను వాడుకొంటున్నారు. ఇలా పలు బ్యాంకు అకౌంట్ల నుంచి మాయ మాటలతో డబ్బులు సేకరించి, ఒక కరెంటు అకౌంట్‌కు బదిలీ చేసుకొని, దానిని క్రిప్టో కరెన్సీగా మారుస్తున్నారు. దీంతో ఆ డబ్బు ఏదేశానికి ఎక్కడికి వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. గల్ఫ్, హాంకాంగ్, బంగ్లాదేశ్, మలేషియా దేశాలకు ఉద్యోగాల కోసం ఇండియా నుంచి వెళ్లిన వారిని మాయగాళ్లు ఉపయోగించుకొంటున్నారు. యూఎస్బేస్ సర్వర్లు ఆ దేశాల నుంచి నిర్వహిస్తుండటంతో, మోసగాళ్ల ఆట కట్టించడం కూడా కష్టంగా మారింది. -
యూట్యూబ్‌లో ఒక్కో లైక్‌కు రూ.50
హైదరాబాద్: యూట్యూబ్‌లో ఒక్కో లైక్‌కు రూ.50 ఇస్తామని వల వేసి..తొలుత లాభాలు ఇచ్చి నమ్మించి..ఆ తర్వాత కొల్లగొట్టారు సైబర్‌నేరగాళ్లు. ఇలా ఆరుగురి వ్యక్తుల నుంచి దాదాపు రూ.75 లక్షల మేర లూటీ చేయడంతో వారంతా సోమవారం సిటీ సైబర్‌క్రైం పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఒక్కరోజులో ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఇంత పెద్ద మోతాదులో సైబర్ కేటుగాళ్లు డబ్బు కాజేయడంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. వివరాల్లోకి వెళితే..భరత్‌నగర్‌కు చెందిన ఓ యువకుడికి పార్ట్‌టెం జాబ్ ఉందంటూ వాట్సప్ మెసేజ్ వచ్చింది. ఇంట్లో ఖాళీగా ఉన్న ఆ యువకుడు వాట్సప్ మెసేజ్‌లో ఉన్న ఫోన్‌నెంబర్‌కు కాల్ చేసి పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగం వచ్చేలోపు తాము పంపే యూట్యూబ్ వీడియోస్‌కు లైక్ కొట్టాలన్నారు. ఒక్కో లైక్‌కు రూ.50 ఇస్తామన్నారు. కొద్దిరోజులు ఇలా లైక్ రూ.50 చొప్పున చెల్లించారు. దీంతో వీరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. ఆ తర్వాత పలు దఫాలుగా రూ.25 లక్షలు ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టుబడి పెట్టించి ఎగ్గొట్టారు. సిటీకి వలస వచి్చన రైతుకు కూడా ఇదే తరహాలో మెసేజ్ వచ్చింది ఇన్వెస్ట్మెంట్ చేస్తే తక్కువ సమయంలో కోటీశ్వరులు కావొచ్చన్నారు. దీనికి ఒప్పుకున్న రైతు నుంచి పలు దఫాలుగా రూ.25 లక్షలు కాజేశారు. షేక్‌పేట్‌కు చెందిన యువకుడికి పార్ట్‌టెం ఉద్యోగమని చెప్పి రూ.9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయించారు. యూసఫ్‌గూడ వాసి నుంచి రూ.10 లక్షలు, మలక్‌పేట వాసి నుంచి రూ.4 లక్షలు, మరో వ్యక్తి నుంచి రూ.2 లక్షలు కూడా ఇదే పంథాలో కాజేశారు. బాధితుల నుంచి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. -
చదువుకుంటూనే సంపాదించొచ్చు.. నెలకు రూ.15 వేల వరకు
పార్ట్ టైమ్ జాబ్స్.. కొన్నేళ్ల క్రితం వరకు విదేశాలకే పరిమితం. ఉన్నత విద్య కోసం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లోని యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్నట్లు చెప్పటం తెలిసిందే. ఇప్పుడు మన దేశంలోనూ పార్ట్‌టైమ్ కొలువుల కల్చర్ విస్తరిస్తోంది. ముఖ్యంగా డిజిటలైజేషన్, ఈ–కామర్స్ రంగాల విస్తరణ కారణంగా.. విద్యార్థులు చదువుకుంటూనే ఖాళీ సమయంలో కొన్ని గంటలు పనిచేసి కొంత ఆదాయం పొందేందుకు అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్న రంగాలు, అందుకునేందుకు మార్గాలు, వేతనాలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం.. మన దేశంలో ప్రస్తుతం పార్ట్ టైమ్ జాబ్స్ ట్రెండ్ మారుతోంది. గతంలో పార్ట్ టైమ్ జాబ్స్, ఫ్రీలాన్స్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. కానీ..ప్రస్తుత కార్పొరేట్ యుగంలో..అన్ని రంగాల్లోనూ పార్ట్ టైమ్ ఉద్యోగాల సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో సేవల రంగం మొదలు ఐటీ వరకూ.. పార్ట్ టైమ్ జాబ్స్ అందుబాటులోకి వచ్చాయి. అఫ్లియేట్ మార్కెటింగ్ ఇటీవల పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో వినిపిస్తున్న మాట.. అఫ్లియేట్ మార్కెటింగ్. సొంతంగా వెబ్సైట్ రూ΄÷ందించుకున్న వ్యక్తులు.. సదరు పోర్టల్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్ లింక్స్‌ను, ఉత్పత్తులను తమ వెబ్సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే అఫ్లియేట్ మార్కెటింగ్. ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ పద్ధతిలో సంస్థలు సదరు వెబ్సైట్ నుంచి ఎక్స్టర్నల్ లింక్స్‌తో తమ ఉత్పత్తులను వీక్షించిన వారి సంఖ్య ఆధారంగా పారితోషికం చెల్లిస్తున్నాయి. ఈ విధానంలోనూ నెలకు రూ.20వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. డెలివరీ అసోసియేట్స్ డెలివరీ అసోసియేట్స్ అంటే.. సంస్థల ఉత్పత్తులను వినియోగదారులకు చేరవేసే వారు. ఇవి ఎక్కువగా ఈ–కామర్స్, రిటెయిల్ రంగాల్లో లభిస్తున్నాయి. వీటికి పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్హతగా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. ఈ ఉద్యోగాలకు మొగ్గు చూపే యువత సంఖ్య కూడా పెరుగుతోంది. ముఖ్యంగా డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాల పట్ల ఆసక్తి కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు బ్యాచిలర్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారని క్వికర్జాబ్స్ నివేదిక పేర్కొంది. వీరికి సగటున రూ.15వేలు లభిస్తున్నట్లు తెలిపింది. ఆన్లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్స్ పార్ట్ టైమ్ ఉపాధి పరంగా మరో చక్కటి అవకాశం..ట్యూటర్స్‌గా పని చేయడం. సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో΄ాటు దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉండాలి. ప్రస్తుతం హోంట్యూటర్స్, ఆన్లైన్ ట్యుటోరియల్స్‌కు పప్రాధాన్యం పెరుగుతోంది. కాబట్టి వీరు ఆన్లైన్, పార్ట్‌టైమ్ విధానాల్లో నెలకు రూ.20వేల వరకు సంపాదించుకునే అవకాశముంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్లతో బీఎస్సీ, ఎమ్మెస్సీ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందడానికి ఇది చక్కటి మార్గం. ప్రస్తుతం ఎన్నో ఎడ్టెక్ స్టార్టప్ సంస్థలు ఆన్లైన్ ట్యాటర్స్కు స్వాగతం పలుకుతున్నాయి. కాపీ రైటర్ పార్ట్ టైమ్ జాబ్స్ విభాగంలో టాప్ లిస్టింగ్‌లో ఉన్న కొలువు.. కాపీ రైటర్. సోషల్ నెట్వర్క్ వెబ్‌సైట్స్‌లో ఒక సంస్థకు సంబంధించిన ప్రొడక్ట్స్, సర్వీసెస్‌కు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా రాయడం కాపీ రైటర్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. తొలుత ఒక నమూనా కాపీని అడుగుతున్న సంస్థలు..దానికి మెచ్చితే పని చేసే అవకాశం ఇస్తున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రతిపదికన రూ.800 నుంచి రూ.వేయి వరకు అందిస్తున్నాయి. డేటాఎంట్రీ టైపింగ్ స్కిల్స్, కంప్యూటర్ బేసిక్స్ ఉంటే.. ఆదాయం అందించే మరో పార్ట్ టైమ్ అవకాశం.. డేటాఎంట్రీ. బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ వంటి సేవలు అందించే సంస్థలు తమ క్లయింట్లు పంపించే రికార్డ్లను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్ టైమ్ లేదా ఆన్లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇంగ్లిష్ టైప్ రైటింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు ఇది చక్కటి అవకాశం. పీస్ రేట్, టైమ్ రేట్ విధానంలో పారితోషికం లభిస్తోంది. పీస్ రేట్ విధానంలో ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో గంటకు రూ.300 నుంచి వేయి వరకు సంపాదించుకునే అవకాశముంది. యాడ్ పోస్టింగ్ ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే..ఆన్లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ ఉంటే.. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌లో రాణించొచ్చు. ప్రస్తుతం మన దేశంలో ఆన్లైన్ యాడ్ పోస్టింగ్స్‌కు క్వికర్, ఓఎల్ఎక్స్ తదితర వెబ్‌సైట్స్ ప్రధాన ఆదాయ మార్గాలుగా నిలుస్తున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ముందే వీలుంది. ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్ ఫిజికల్‌గా ఫిట్‌గా ఉంటే ఆరోగ్య సమస్యలు రావనే ఆలోచనతో ఫిట్నెస్ కోసం మార్గాలను అన్వేసిస్తున్నారు. ఇది కూడా యువతకు పార్ట్ టైమ్ ఆదాయ వనరుగా నిలుస్తోంది.జిమ్‌లు,ఫిట్నెస్ సెంటర్స్‌లో ఉపయోగించే పద్ధతుల గురించి అవగాహన ఉండటం తప్పనిసరి.ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఈ విభాగం సరితూగుతుందని చెప్పచ్చు. పార్ట్ టైమ్ విధానంలో ఫిట్నెస్ ఇన్స్ట్రక్టర్, ట్రైనర్‌గా రోజుకు రెండు,మూడు గంటల సమయం వెచ్చిస్తే రూ.500 వరకు సం΄ాదించొచ్చు. సేల్స్ అసోసియేట్ ప్రతి రోజు నిర్దిష్టంగా ఒక సమయంలో.. స్టోర్స్‌లో సేల్స్ విభాగంలో పని చేసే వ్యక్తులనే పార్ట్ టైమ్ సేల్స్ అసోసియేట్స్‌గా పిలుస్తున్నారు. విధుల పరంగా సదరు అవుట్‌లెట్‌లోని స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ.. ఏ కోర్సు చదువుతున్న వారైనా రిటెయిల్ సేల్స్ అసోసియేట్‌గా పార్ట్ టైమ్‌గా పని చేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించే వీలుంది. క్యాబ్ డ్రైవర్స్ ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మరో పార్ట్ టైమ్ ఆదాయ మార్గం.. క్యాబ్ డ్రైవర్స్‌గా పని చేయడం. ప్రస్తుతం పలు సంస్థలు ఆటోలు, క్యాబ్‌లు, టూ వీలర్ ద్వారా సర్వీసులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో వారికి రైడర్స్ కొరత ఏర్పడుతోంది. దీంతో పార్ట్ టైమ్ అవకాశాలకు సంస్థలు స్వాగతం పలుకుతున్నాయి. లైట్ మోటార్ వెహికిల్ లైసెన్స్‌తోపాటు, పదో తరగతి ఉండాలి. నెలకు రూ.15 వేల వరకు సంపాదించే అవకాశం ఉంది. సోషల్ మీడియా అసిస్టెంట్ ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయా సర్వీసులు, ప్రాడక్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్బుక్, ట్విటర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ తదితరాల్లో వినియోగదారులను ఆకట్టుకునేలా రాయగలిగే నేర్పు ఉండాలి. సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహనతోపాటు,ఎస్ఈఓ, ఎస్ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం అవసరం. వీరు సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్ టైమ్ విధానంలో ఆదాయం పొందొచ్చు. ఐటీ రంగంలోనూ ఐటీ రంగంలో సైతం పార్ట్ టైమ్ జాబ్స్ అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. ప్రధానంగా ప్రొగగ్రామర్స్, ఫుల్ స్టాక్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్ వంటి ఉద్యోగాలు లభిస్తున్నాయి. టెక్నికల్ కోర్సులు చదువుతూ.. కోడింగ్, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలున్న వారు వీటిని సొంతం చేసుకోవచ్చు. ఎంచుకున్న జాబ్ పప్రొఫైల్,పప్రాజెక్ట్ ఆధారంగా నెలకు రూ.20వేల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఆన్లైన్ కన్సల్టెంట్ ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి..ఆన్లైన్ కన్సల్టెంట్. కంపెనీల్లో ఉన్నత స్థాయి వ్యూహాలు మొదలు ప్రొగ్రామింగ్, కోడింగ్ వరకూ.. ఆన్లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. అందుకునే మార్గాలివే ప్రస్తుత టెక్ యుగంలో ఒక్క క్లిక్‌తో వందల ఉద్యోగాల సమాచారం అందించే వేదికలు అందుబాటులోకి వచ్చాయి. వీటిల్లో జాబ్ సెర్చ్ పొర్టల్స్ ప్రధానంగా నిలుస్తున్నాయి. వీటిలో ఏ స్థాయి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నారో తెలియజేస్తే చాలు.. వాటికి సంబంధించిన సమాచారం, నిర్వర్తించాల్సిన విధులు, లభించే పారితోషికం, అవసరమైన నైపుణ్యాలు.. ఇలా అన్నీ ప్రత్యక్షమవుతున్నాయి. పలు మొబైల్ యాప్స్ కూడా పార్ట్‌టైమ్ జాబ్స్ వివరాలు అందిస్తున్నాయి. -
పార్ట్ టైం జాబ్ కావాలా అని కాల్ చేసి.. చివరికి..
సాక్షి,హిమాయత్‌నగర్: డేటా ఎంట్రీ ఉద్యోగం ఎదురు చూస్తున్న విద్యార్థికి భారీ టోకరా వేశారు సైబర్ నేరగాళ్లు. క్విక్కర్ డాట్‌కామ్‌లో రెజ్యూమ్ని చూసిన సైబర్ నేరగాళ్లు హబ్సిగూడకు చెందిన వినీత్ అనే విద్యార్థికి కాల్ చేశారు. ఇంటి వద్దనే ఉంటూ డేటా ఎంట్రీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. అందుకు గాను భారీ మొత్తంలో డబ్బు కూడా ఇస్తామన్నారు. దీనికి ఆశపడ్డ వినీత్ వారు చెప్పిన దానికి ఓకే అన్నాడు. ముందుగా రూ. 3 వేలు ప్రాసెసింగ్ ఫీజు కింద కట్టించుకున్నారు. ఆ తర్వాత 300 పేజీల డేటా ఎంట్రీ వర్క్ ఇచ్చారు. ఈ వర్క్ క్వాలిటీ చెక్ చేసేందుకు, ఓకే చేసేందుకు గాను రూ. 6 వేలు తీసుకున్నారు. ఆ తర్వాత చేసే ప్రతి వర్క్‌లో కమీషన్ 18 శాతం ఇవ్వాలంటూ ముందుగానే రూ. 13 వేలు, రూ. 20 వేలు, రూ. 30 వేలు చొప్పున తీసుకున్నారు. నెలల పాటు చేసిన వర్క్‌కు సంబంధించిన డబ్బు ఇవ్వాలని వినీత్ కోరగా.. దానికి కమీషన్ ఇస్తేనే వస్తుందన్నారు. ఇలా పలు దఫాలుగా విద్యార్థి నుంచి రూ. 10.43 లక్షలను కాజేశారు. చివరకు తాను మోసపోయానని గుర్తించిన సదరు వినీత్ గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: వైరల్‌గా మారిన క్రాంతిదాస్ ఫొటోలు.. ఇంతకీ ఆమె ఎవరు! -
పార్ట్‌టైం జాబ్‌తో నెలకు 50వేల సంపాదన.. ఎలానో తెలుసా?
ఉద్యోగం చేసి జీతం సరిపోకపోతే, అదనపు సంపాదన కోసం పలువురు పార్ట్‌టైం ఉద్యోగం చేస్తుంటారు. పార్ట్ టైం ఉద్యోగాలు కొన్ని కష్టంగా ఉంటే.. మరికొన్ని మాత్రం ఆడుతు పాడుతు చేసివిగా ఉంటాయి. పార్ట్ ఉద్యోగాలు కొన్ని.. ఫన్నీగా అనిపించినా ఆదాయం మాత్రం భారీగా ఉంటుంది. తాజాగా ఓ యువతి పార్ట్ ఉద్యోగం చేసి నెలకు రూ.50వేలు సంపాదిస్తోంది. ఆ పార్ట్ టైం ఉద్యోగం ఏంటో తెలుసా? బట్టలు సర్దడం. అదేంటని ఆశ్చర్య పోతున్నారా? మీరు విన్నది నిజమే.. విదేశాల్లో వార్డ్‌రోబ్‌లో బట్టలు సర్దుకుంటారు. వాటిని సర్దుకునే టైమ్‌లేని వాళ్లు.. ఇతరులతో ఆ పని చేయించుకొని డబ్బు ఇస్తారు. ఇంగ్లండ్‌లోని లైసెస్టర్‌కు చెందిన ఎల్లా అనే ఓ యువతి.. అదనపు డబ్బు కోసం ఓ పార్ట్ టైం జాబ్ వెతుక్కుంది. అదే వార్డ్‌రోబ్‌లో బట్టల్న సర్దడం.. కలర్లు, బట్టల రకాలను బట్టీ సర్దడం. బట్టలను అందంగా వార్డ్‌రోబ్‌లో సర్దడం కూడా ఓ రకమైన ఆర్ట్. పార్ట్‌టైం ఉద్యోగం చేస్తూ.. మంచి నైపుణ్యం సంపాదించింది ఆమె. బట్టలు సర్దడం కోసం ఎల్లా గంటకు 1500 నుంచి 2000 ఛార్జ్ వేస్తుంది. ఆమె పనితీరు కస్టమర్లకు నచ్చడంతో.. పార్ట్‌టైం ఉద్యోగంతోనే ఎల్లా వేలకువేలు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమెకు 20 మంది వరకు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఇలా బట్టలు సర్ది.. ఎల్లా ప్రస్తుతం నెలకు 50వేల దాకా ఆదాయాన్ని వెనకేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో.. ఇలా కూడా సంపాదిస్తారా! అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తే నిండా ముంచేశాడు!
సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): పార్ట్ టైం ఉద్యోగం కావాలని గూగుల్ సెర్చ్ చేసిన యువతి, యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. మాయ మాటలు చెప్పి వారిద్దరి నుంచి లక్షలు కాజేశారు. దీంతో వారు వేర్వేరుగా గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో పార్ట్‌టైం జాబ్ చేసుకునేందుకు గూగుల్‌లో సెర్చ్ చేశాడు. ఓ వ్యక్తి పరిచయమై ఉద్యోగం వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయమని సూచించాడు. దీంతో అతగాడు చెప్పిన విధంగా పలు దఫాలుగా రూ. 6.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వలేదు. యువతిని సైతం ఓ వ్యక్తి ఇదే తరహాలో మోసం చేశాడు. ఆమె నుంచి రూ. 2.30 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. తన ప్రమేయం లేకుండా భారత్ యాప్‌లో నుంచి రూ. 3 లక్షలు స్వాహా అయ్యాయని నగర వాసి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: (డ్యూటీకి వెళ్లిన భర్త తిరిగి ఇంటికి వచ్చేసరికి..) -
‘న్యూ వరల్డ్’ చైనీయుల కుట్రే..
సాక్షి, సిటీబ్యూరో: వాట్సాప్ కేంద్రంగా సాగిన ‘న్యూ వరల్డ్’ స్కామ్ వెనుక చైనా జాతీయులే ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అనేక మందిని బాధితులుగా మారుస్తున్న ఈ వ్యవహారం గుట్టును ఢిల్లీ సైబర్ క్రైమ్ యూనిట్ అధికారులు జనవరిలోనే రట్టు చేశారు. ఆ నెల 13న ఇద్దరు చైనాజాతీయులు సహా మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. ఈ స్కామ్‌లో బాధితులుగా మారిన 78 మంది బాధితులు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.. కేసులు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఢిల్లీలో జరిగిన అరెస్టుల విషయం తెలిసిన సిటీ అధికారులు అక్కడి పోలీసులను సంప్రదిస్తున్నారు. ‘నూ వరల్డ్’, ‘ఎన్‌డబ్ల్యూ రిచ్’ యాప్‌లు ప్లేస్టోర్స్‌లో లేవు. వర్క్ ఫ్రమ్ హోమ్, పార్ట్ టైమ్ ఉద్యోగాలంటూ వాట్సాప్ సందేశాల రూపంలో మాత్రమే వీటి లింకులు సర్క్యులేట్ అయ్యాయి. యూ ట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ల్లో సూచించిన అంశాలను లైక్, షేర్ చేస్తూ వాటి స్క్రీన్ షాట్స్‌ను ఈ యాప్స్‌లో పంపాల్సి ఉంటుంది. డమ్మీ డైరెక్టర్లుగా.. టాస్క్‌గా పిలిచే ఈ ఒక్కో చర్యకు రూ.6 నుంచి రూ.50 వరకు ఇచ్చేలా ప్రచారం జరిగింది. ఆపై వివిధ స్కీముల పేరు చెప్పి అందినకాడికి దండుకుని మోసం చేశారు. ఇతర దేశంలో నివసిస్తున్న చైనా జాతీయుడు యాంగ్ కింగ్ జాంగ్ కుట్రతోనే ‘న్యూ వరల్డ్’ స్కామ్‌కు బీజం పడింది. తమ దేశానికే చెందిన చౌహోంగ్ డెంగ్ దావోయోంగ్, హూ జీయాషీలను భారత్‌కు పంపిన ఇతగాడు కొన్ని షెల్ కంపెనీలను స్థాపించేలా చేశాడు. చైనీయులే ప్రధాన డైరెక్టర్లుగా ఉన్న వీటిలో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లోని వివిధ ప్రైవేట్ సంస్థల్లో అకౌంటెంట్లు, ఆఫీస్ బాయ్స్, డ్రైవర్లుగా పనిచేస్తున్న వారిని డమ్మీ డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంస్థల చిరునామాలు సైతం అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఫోన్ల నుంచి ఫొటోలు,వీడియోలు అన్నీ మాయం.. ఈ సంస్థల ముసుగులో రేజర్ పే, జాయ్ రమ్మీ, చకు టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేమెంట్ గేట్వేలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆపై వాట్సాప్ లింకుల ద్వారా క్యూక్యూ బ్రౌజర్ యాప్‌ల కేటగిరీలోకి వచ్చే ‘న్యూ వరల్డ్’ను పంపారు. క్యూక్యూ ఫ్యామిలీకి చెందిన యాప్స్‌ను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ గత ఏడాది జూన్‌లో నిషేధించింది. అయినా విదేశీ సర్వర్ల ద్వారా ఈ చైనీయులు వినియోగిస్తున్నారు. ‘న్యూ వరల్డ్’ యాప్ ద్వారా చైనీయులు నిషిద్ధ మల్టీ లెవల్ మార్కెటింగ్‌కు కూడా పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ యాప్స్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారి ఫోన్ల నుంచి కాంటాక్ట్స్, ఫొటోలు, వీడియోల సహా అనేకం సంగ్రహించినట్లు అధికారులు చెబుతున్నారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో ‘లైక్, షేర్, ఫాలో’ చేస్తున్న అంశాలు ప్రముఖులవి అంటూ యాప్స్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ ఎవరివనే దానిపై స్పష్టత ఉండట్లేదని తెలుస్తోంది. క్రిప్టో కరెన్సీ రూపంలో.. ఈ యాప్స్‌ల లావాదేవీలకు సంబంధించిన మొత్తాలు క్రిప్టో కరెన్సీ రూపంలో దేశం దాటిపోయినట్లు ఢిల్లీ సైబర్ అధికారులు గుర్తించారు. కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌహోంగ్ డెంగ్ దావోయోంగ్, హూ జీయాషీలతో పాటు 10 మంది భారతీయుల్నీ అరెస్టు చేశారు. ఈ చైనీయులు వినియోగించిన 12 బ్యాంకు ఖాతాలు, క్రిప్టో కరెన్సీ వాలెట్స్ ఫ్రీజ్ చేశారు. ఈ స్కామ్ బారినపడిన ఢిల్లీవాసుల సంఖ్య 39,781గా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో అక్కడి పోలీసులు గుర్తించారు. ఢిల్లీలో అరెస్టులు జనవరిలో జరగ్గా.. నగరంలో ఉన్న బాధితులు మాత్రం ఆదివారం వరకు ఆయా యాప్స్ వినియోగించారు. ఈ నేపథ్యంలోనే యాంగ్ కింగ్ జాంగ్ ఆదేశాలతో పనిచేసే వారు ఇంకా ఉండి ఉంటారని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాలు తెలుసుకోవడానికి ఢిల్లీ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. -
స్వచ్ఛమైన మనసు
తాగుబోతు తండ్రి ఇల్లొదిలి వెళ్లిపోయాడు.. తల్లి సంపాదన ఏ మూలకూ చాలలేదు.. సునామీ సర్వస్వమూ కోల్పోయేలా చేసింది...బతుకుబాటలో ఊరు విడిచింది...ఊరుకాని ఊరిలో ఇబ్బందులు ఎదుర్కొంది.. ఆకలి దప్పులతో అలమటించింది..చివరకు జీవితంలో నిలదొక్కుకుంది..వందలాది అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారింది. సినిమాను తలపించే ఈ సంఘటలన్నీ యాస్మిని జీవితంలో చోటుచేసుకున్నవే.అందుకే ఈరోజు కథనం ఆమె గురించే..సాక్షి, స్టూడెంట్ ఎడిషన్. దేశానికి తూర్పున, బంగాళాఖాతం మధ్యలో ఉంటాయి అండమాన్ నికోబార్ దీవులు. వీటి రాజధాని పోర్ట్బ్లెయిర్లో నివసించే దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయే యాస్మిని. 2003 వరకూ ఆమె జీవితం మామూలుగానే సాగిపోయింది. అయితే ఆ మరుసటి ఏడాది నుంచే అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మద్యానికి బానిసైన తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లాడు. ఓ ప్రభుత్వ స్కూల్లో తక్కువ వేతనానికి పనిచేసే తల్లి కుటుంబాన్ని పోషించడానికి అష్టకష్టాలూ పడేది. మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు 2004లో వచ్చిన సునామీలో యాస్మిని కుటుంబం సర్వస్వమూ కోల్పోయింది. ఇల్లు ధ్వంసమైంది. సామగ్రి కొట్టుకుపోయింది. దీంతో రోజుల తరబడి రోడ్ల మీదే గడిపారు. అప్పుడు యామిని పదోతరగతి చదువుతోంది. చదువుకుంటూ పార్ట్ టైమ్ ఉద్యోగం.. ఈ పరిస్థితుల్లో కుటుంబ భారాన్ని మోసేందుకు తల్లికి సాయంగా కష్టపడాలని నిర్ణయించుకుంది యాస్మిని. వెంటనే చిన్నపాటి జీతానికి పార్ట్ టైం ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తూనే ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది.సునామీలో ధ్వంసమైన ఇంటికి మరమ్మతులు చేయించింది. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలని, తమ్ముళ్లను బాగా చదివించాలని నిర్ణయించుకొని మంచి ఉద్యోగం, సంపాదన కోసం ముంబైకి చేరింది. అయితే,అక్కడ అంత సులభంగా ఉద్యోగం దొరకలేదు. అష్టకష్టాలూ పడి ఓ ప్రభుత్వ కార్యాలయంలో రూ.6,500కు కాంట్రాక్టు పద్ధతిలో చిన్న ఉద్యోగం సంపాదించింది. వచ్చే ఆదాయంలోనే ఇంటి ఖర్చులకు పంపేది. ఒక్కోసారి తినడానికీ డబ్బులు సరిపోక పస్తులు ఉండేది. ఆ సమయంలోనే తిండి లేని తనలాంటి వాళ్లను, అనాథలను ఎంతోమందిని చూసింది. ఆలయాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, వీధుల్లో అనేకమంది నిరాశ్రయులు దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు ఎండబెట్టుకుంటున్నారని గుర్తించింది. ఈ క్రమంలోనే ఆమెకు ఓ మంచి ఉద్యోగం వచ్చింది. దీంతో తనలాంటి వారి కడుపు నింపేందుకు నడుం బిగించింది. అనాథల ఆకలి తీరుస్తూ.. అనుకున్నదే తడవుగా ఆచరణలోకి దిగింది. మొదట తన పుట్టినరోజును, పండగలను అనాథల సమక్షంలో జరుపుకోవడం ప్రారంభించింది. దీనికోసం మురికివాడలు, రైల్వే స్టేషన్లు, అనాథాశ్రమాలకు వెళ్లేది. అక్కడిపిల్లలకు, వృద్ధులకు కావల్సిన తినుబండారాలు, దుస్తులు తీసుకెళ్లి పంచేది. కొందరిని అనాథాశ్రమాల్లో చేర్పించింది. ఇదే సమయంలో ఆమెకు ఓ పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. జీతంతోపాటుఅదనంగా కమీషనూ రావడం మొదలైంది. ఈ క్రమంలోనే ఫేస్బుక్లో కనిపించిన చిన్ననాటి స్నేహితునితో ప్రేమలో పడి, వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత దంపతులు చెన్నైకి వెళ్లి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారంవృద్ధి చెందడంతో మంచి ఇంటితోపాటు కారు కొనుగోలు చేశారు. ఈ కార్లోనే రోజూ అనాథలు, నిరాశ్రయులకు కావల్సిన ఆహార పదార్థాలు, బట్టలు, చెప్పులు, చాక్లెట్లు, మందులు కొని పంచడం మొదలుపెట్టారు. ప్రస్తుతం రోజూ నగరంలో కనీసం 30 కి.మీ ప్రయాణిస్తూ వీటిని అందజేస్తున్నారు. అనాథలు, నిరాశ్రయుల ఆకలి తీరుస్తున్నారు. యాస్మిన్ అంటే అరబిక్‌లో మల్లెపువ్వు అని అర్థం. ఇంగ్లిష్‌లోని జాస్మిన్ పదానికి ఇదే మూలం. మల్లెపువ్వు తెల్లదనం స్వచ్ఛతకు ప్రతీక. అన్నార్తుల పాలిట అన్నపూర్ణగా మారిన యాస్మిన్ మనసు కూడా స్వచ్ఛమైనదే. -
ఫుల్ టైం జాబ్.. పార్ట్ టైం క్యాబ్
ఆటోలపై ఆటమ్బాంబుల్లా పడిన క్యాబ్ సర్వీసులు నగరంలో మరెన్నో ట్రెండ్స్‌కు నాంది పలుకుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు సైతం షికారు రొటీన్ లైఫ్‌లో భాగంగా మార్చేయడం మాత్రమే కాదు.. అయిదారంకెల జీతగాళ్లను వీకెండ్స్‌లో పార్ట్‌టైమ్ క్యాబ్ డ్రైవర్లుగా మారిపోయేలా చేస్తున్నాయి. కార్పొరేట్ ఉద్యోగులు సైతం మేము కూడా అంటూ వారాంతాల్లో ప్రయాణికుల కోసం స్టీరింగ్ తిప్పుతుండడం సిటీలో లేటెస్ట్ ట్రెండ్. – ఎస్.సత్యబాబు మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేసేశారు. సరిగ్గా 5 నిమిషాల్లో... కారు ఇంటి ముంగిటకు వచ్చేసింది. దర్జాగా ఎక్కేసి గమ్యం చేరుకున్నారు. దిగిపోయాక బిల్ చెల్లించేశారు. దాంతో పాటు ఓ ఐదో పదో డ్రైవర్‌కి టిప్ కూడా విసిరేద్దామనుకుంటే మాత్రం... ఓ క్షణం ఆగి ఆలోచించాలి. ఎందుకంటే సదరు డ్రైవర్ గారు... మనకన్నా ఎక్కువ జీతం అందుకునే సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావచ్చు మరి. పార్ట్‌టైమ్ ఇన్కమ్.. ఓ ఎంఎన్సీలో టీమ్ లీడర్‌గా పనిచేసే 36 ఏళ్ల నగరవాసి మహంతికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులో పని ఉంటుంది. ఆ తర్వాత ఆయనేం చేస్తారు? క్యాబ్ డ్రైవర్ అవతారం ఎత్తుతారు. ‘జీతం నా ఇంటి ఖర్చులు, లోన్లకి సరిపోతుంది. ఇక ఇంట్లో వాళ్లు అడిగే గిఫ్ట్స్, అత్యవసర ఖర్చులకి కావాలంటే ఎవరిస్తారు? అందుకే ఈ పార్ట్‌టైమ్ జాబ్’ అని చెప్పే ఈయన సిటీలో వేళ్లూనుకుంటున్న కొత్త ట్రెండ్‌కి ఓ ఉదాహరణ. మరెందరో నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, కార్పొరేట్ ఉద్యోగులు... క్యాబ్ డ్రైవింగ్‌ను పార్ట్‌టైమ్ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కనీసం రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందే అవకాశం లభిస్తోందని వీరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్రైవింగ్ మీద ఆసక్తితో, అదనపు ఆదాయం కోసం... ఇలా విభిన్న కారణాలతో వీరు స్టీరింగ్ తిప్పుతున్నారు. చివరికి కొందరు ఉద్యోగాలు వదిలేసి మరీ దీనిని కొనసాగిస్తున్నారు. నచ్చిన సమయంలో.. నచ్చినంత సేపు ఇష్టం వచ్చిన సమయంలో, ఇష్టం వచ్చినంత సేపు పనిచేయడం.. ఎప్పుడు కావాలంటే అప్పుడు మానేయడం.. అంతా నా ఇష్టం అన్నట్టుగా పనిలో తీరిక ఉండడంతోనే ఉద్యోగులు దీని వైపు ఆకర్షితులవుతున్నారు. ‘నాకు కుదిరిన టైమ్‌లో పని చేసుకునే వెసులుబాటు ఉండడమే నేనీ పార్ట్‌టైమ్ జాబ్ ఎంచుకోవడానికి కారణమ’ని ఒక ఎంఎన్సీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న రఘునాథ్ చెప్పారు. ఈ పార్ట్‌టైమ్ జాబ్‌ను కార్పొరేట్ ఉద్యోగులే అందిపుచ్చుకోవడానికి కారణం లేకపోలేదు... ఎందుకంటే వీరే ఎక్కువగా క్యాబ్స్ ఉపయోగిస్తారు కాబట్టి. ఒకప్పటిలా డ్రైవర్ని చిన్నచూపు చూసే పరిస్థితులు లేకపోవడంతో కుటుంబసభ్యులు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పడం లేదు. ఇప్పుడిప్పుడే మన సిటీలో వేళ్లూనుకుంటున్న ఈ ధోరణి.. మరెంతో మందిని ఆకర్షించడం తథ్యంగా కనిపిస్తోంది. మెట్రోల ట్రెండ్ ముంబై, బెంగళూర్ లాంటి మెట్రో నగరాల్లో ఖరీదైన జీవనశైలిని తట్టుకోవడానికి చాలా మంది కార్పొరేట్ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఈ పంథాను ఎంచుకుంటున్నారు. ‘నేను జాబ్‌కు గుడ్‌బై చెప్పేసి క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాను. నా ప్రయాణీకులు చాలా మంది జాబ్ ఆఫర్ ఇచ్చార’ని ఎంఎన్సీలో పనిచేసిన మోహిత్(28) చెప్పారు. పని ఒత్తిడి వల్ల ఆరోగ్య సమస్యలు రావడంతో కార్పొరేట్ జాబ్‌కు గుడ్‌బై చెప్పానని, అక్కడి కంటే మిన్నగా నెలకు రూ.80 వేల వరకు ఆదాయం వస్తోందని చెప్పారు. సొంతంగా స్టార్టప్ ప్రారంభించే వరకు ఇదే తన జీవనాధారం అన్నారు. -
పార్ట్‌టైమ్ జాబ్‌లో ఒబామా కుమార్తె..!
లాస్ ఏంజెలిస్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కుమార్తె మాలియా (17) పార్ట్‌టైమ్ జాబ్‌లో చేరిందట. ఆమె హెచ్‌బీవో టీవీ చానల్లో ప్రసారమయ్యే ‘గర్ల్స్’ సిరీస్‌లో తాత్కాలిక ఉద్యోగంలో చేరిందని వార్తలు వచ్చాయి. మాలియా వచ్చే ఏడాది డిగ్రీ పూర్తయిన తర్వాత టీవీ లేదా సినిమాలను కెరీర్‌గా ఎంచుకుంటానని ఇదివరకే చెప్పింది.