సాక్షి, హైదరాబాద్(హిమాయత్‌నగర్): పార్ట్ టైం ఉద్యోగం కావాలని గూగుల్ సెర్చ్ చేసిన యువతి, యువకుడిని సైబర్ నేరగాళ్లు నిండా ముంచారు. మాయ మాటలు చెప్పి వారిద్దరి నుంచి లక్షలు కాజేశారు. దీంతో వారు వేర్వేరుగా గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీతం సరిపోకపోవడంతో పార్ట్‌టైం జాబ్ చేసుకునేందుకు గూగుల్లో సెర్చ్ చేశాడు.
ఓ వ్యక్తి పరిచయమై ఉద్యోగం వచ్చే వరకు ఇన్వెస్ట్ చేయమని సూచించాడు. దీంతో అతగాడు చెప్పిన విధంగా పలు దఫాలుగా రూ. 6.40 లక్షలు పెట్టుబడి పెట్టాడు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా లాభం ఇవ్వలేదు. యువతిని సైతం ఓ వ్యక్తి ఇదే తరహాలో మోసం చేశాడు. ఆమె నుంచి రూ. 2.30 లక్షలు కాజేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. తన ప్రమేయం లేకుండా భారత్ యాప్‌లో నుంచి రూ. 3 లక్షలు స్వాహా అయ్యాయని నగర వాసి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment