cyber criminals
-
ఉద్యోగాల ఎర.. ‘సైబర్’ వెట్టిలో చెర!!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనా స్కామ్స్టర్లు ఆన్లైన్లో విసిరిన ‘ఉద్యోగాల’ వలలో తెలంగాణ, ఏపీ సహా 150 మంది భారతీయులు చిక్కుకున్నారు. బందీలుగా మారి సైబర్ మోసాల వెట్టిచాకిరీలో విలవిల్లాడుతున్నారు. తమను కాపాడాలంటూ ఓ బాధితుడు ‘సాక్షి’ని ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది.విమాన టికెట్ పంపి మరీ..కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం రంగపేట గ్రామానికి చెందిన కొక్కిరాల మధుకర్‌రెడ్డి ఉపాధి కోసం గతంలో దుబాయ్ వెళ్లి వచ్చాడు. ‘బ్యాంకాక్‌లో రూ. లక్ష జీతంతో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం’ అంటూ ఆన్లైన్లో వచ్చిన ప్రకటనను చూసి దరఖాస్తు చేసుకున్నాడు. ఉద్యోగానికి ఎంపిక చేశామని.. వచ్చి వెంటనే విధుల్లో చేరాలంటూ ప్రకటనదారుల నుంచి విమాన టికెట్ అందడంతో గతేడాది డిసెంబర్ 18న బ్యాంకాక్ వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక ఆయన పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. మధుకర్‌రెడ్డి పాస్‌పోర్టు లాక్కున్న సైబర్ నేరగాళ్లు ఆయన్ను సైబర్ నేరాలు చేసే ‘పని’ చేయాలని హుకుం జారీ చేశారు.గత్యంతరం లేకపోవడంతో..అమెరికాలో నివసించే భారతీయుల చేత క్రిప్టోకరెన్సీ పేరిట పెట్టుబడులు పెట్టించి వారిని మోసగించడమే చైనా సైబర్ నేరగాళ్లు మధుకర్‌రెడ్డి లాంటి బాధితులకు అప్పగించిన ఉద్యోగం. కంప్యూటర్ పరిజ్ఞానం, ఇంగ్లిష్‌లో మాట్లాడగల నైపుణ్యం ఉన్న బాధితులకు ఈ పనులు అప్పగించారు. అవి రాని యువకులకు మాత్రం అమాయకులకు ఫోన్లు చేసి తీయగా మాట్లాడి (హనీట్రాప్) డబ్బు కాజేసే పనులు ఇచ్చారు. అయితే పాస్‌పోర్టులు లాక్కోవడంతో విధిలేక చైనా నేరగాళ్లు చెప్పినట్లు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఇటీవల బాధ్యతలు చేపట్టాక బ్యాంకాక్‌లో పరిస్థితులు మారడంతో స్కామ్స్టర్లు.. వారి మకాంను బ్యాంకాక్‌కు 574 కి.మీ. దూరంలోని వాయవ్య మయన్మార్‌లో ఉన్న ఇంగ్విన్ మయాంగ్ అనే చిన్న పట్టణంలోని ఓ భవంతికి మార్చారు. ఇంగ్విన్ మయాంగ్‌కు, థాయ్‌లాండ్ సరిహద్దుకు మధ్య కేవలం నది మాత్రమే అడ్డంకి.కాపాడాలని వేడుకోలు..అక్కడికి వెళ్లాక సైబర్ నేరగాళ్ల అరాచకాలు మితిమీరాయి. ఆహారం ఇవ్వకపోవడం.. తీవ్రంగా కొట్టడంతోపాటు తాగునీరు, విద్యుత్ లేని భవనంలో బాధితులను ఉంచారు. ఈ క్రమంలో ఓ ఫోన్‌ను సంపాదించిన మధుకర్‌రెడ్డి.. వాట్సాప్ కాల్ ద్వారా ‘సాక్షి’ని ఆశ్రయించి సాయం చేయాలని కోరాడు. ఉద్యోగ ప్రకటనతో తాము మోసపోయామని, తమను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 19 తర్వాత తమను కాల్చి చంపుతామని నేరగాళ్లు బెదిరిస్తున్నారని వాపోయాడు. తనతోపాటు తెలంగాణ, ఏపీ, బిహార్, రాజస్తాన్‌కు చెందిన దాదాపు 150 మందిని అక్రమంగా బంధించారని వివరించాడు. వెంటనే తమను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాడు. -
ఆ గంట.. కీలకమంట!
పట్నంబజారు: అత్యవసర పరిస్థితుల్లో ఎంతో అవసరమైన సమయంలో మనం వాడే పదం గోల్డెన్ అవర్. ఇప్పటివరకు రోడ్డు ప్రమాదాలు సంభవించేటప్పుడు మాత్రమే ఈ పదం విని ఉంటారు. ప్రమాదాలు సంభవించిన గంటలోపే క్షతగాత్రులను ఆస్పత్రికి చేర్చడం దీని ఉద్దేశం. ఇదే తరహాలో సైబర్ మోసాలకు గురయ్యే బాధితులు సైతం నేరం జరిగిన గంటలోగా ఫిర్యాదు చేయగలిగితే.. ఖాతాలో పోగొట్టుకున్న సొమ్మును తిరిగి రాబట్టుకునే వీలుంటుంది. బాధితులు చేయాల్సిందల్లా గోల్డెన్ అవర్‌లో సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేయటమే. జిల్లాలో ఇప్పటివరకు వందల సంఖ్యలో సైబర్ నేరాలు నమోదు అయ్యాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తాము మోసానికి గురయ్యామని ఎస్‌సీఆర్‌బీకి ఫిర్యాదు చేయటం ద్వారా, లేదా 1930 సైబర్ సెల్ నంబరు డయల్ చేసి ఫిర్యాదు ఇవ్వడం వలన ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెనక్కి తీసుకువచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదు చేయాలిలా..» మోసపోయామని తెలుసుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు కాల్ చేయాలి. » లేదంటే https:// cybercrime. gov. in అనే పోర్టల్‌పై క్లిక్ చేయాలి. హోం పేజీలోకి వెళ్లి ఫైల్ ఎ కంప్లైంట్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని నియమాలు, షరతులు చూపిస్తుంది. వాటిని చదివి యాక్సెప్ట్ చేసి రిపోర్ట్ అదర్ సైబర్ క్రైమ్ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత సిటిజన్ లాగిన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి పేరు, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ వంటి వివరాలు ఎంటర్ చేస్తే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్‌ను బాక్స్‌లో ఫిల్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి. తర్వాత పేజీలోకి తీసుకెళ్తుంది. అసలు ప్రక్రియ మొదలయ్యేది ఇక్కడే. » ఈ పేజీలో ఒక ఫామ్ కనిపిస్తుంది.. దానిలో జరిగిన సైబర్ మోసం గురించి క్లుప్తంగా రాయాలి. అక్కడ నాలుగు సెక్షన్లుగా విభజించి ఉంటుంది. సాధారణ సమాచారం (విక్టిమ్ ఇన్ఫర్మేషన్), సైబర్ నేరానికి సంబంధించి సమాచారం (సైబర్ క్రైమ్ ఇన్ఫర్మేషన్), ప్రివ్యూ అనే సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్లో అడిగిన వివరాలను సమరి్పస్తూ.. ప్రక్రియను పూర్తిచేయాలి. మూడు సెక్షన్లు పూర్తయ్యాక ప్రివ్యూను వెరిఫై చేయాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నాయని భావిస్తే సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. తర్వాత ఘటన ఎలా జరిగిందనేది వివరాలు నమోదుచేయాలి. నేరానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు (అకౌంట్ ట్రాన్సాక్షన్ తదితర) ఫైల్స్ వంటి ఆధారాలు, సాక్ష్యాలు అందులో పొందుపర్చాలి. వివరాలు సేవ్ చేసి నేరగాళ్ల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫిల్ చేయాలి. » అంతా వెరిఫై చేసుకున్నాక సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కంప్లైంట్ ఐడీతో పాటు ఇతర వివరాలతో కూడిన ఈ–మెయిల్ వస్తుంది. తర్వాత అధికారులు దర్యాప్తు ప్రారంభిస్తారు. ఫిర్యాదు చేయడం ఆలస్యమైతే దుండగుడు డబ్బును వేర్వేరు ఖాతాల్లో మళ్లించేస్తాడు. లేదంటే క్రిప్టో కరెన్సీగా మార్చుకునే ప్రమాదముంది. సైబర్ మోసానికి గురైతే 1930 నంబర్‌కు కాల్ చేయాలి. వెంటనే ఫిర్యాదు చేయండి.. సైబర్ మోసానికి గురయ్యేవారు వెంటనే గుర్తించాలి. తక్షణం ఫిర్యాదు చేస్తే మన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలెక్కువ. లేదంటే ఎక్కడ ఉంటారో.. వారి ఖాతాలు ఏ రాష్ట్రానికి చెందినవో.. ఇవన్నీ కనుక్కోవడం పెద్ద ప్రక్రియ అవుతుంది. డయల్ 1930కు గానీ, ఎన్సీఆర్బీ గానీ ఫిర్యాదు చేసి బ్యాంకు వాళ్లను, దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌ను సంప్రదించాలి. తద్వారా బాధితుడికి న్యాయం చేసే అవకాశం ఉంటుంది. – ఎస్.సతీష్ కుమార్, ఎస్పీ, గుంటూరు జిల్లా -
వైద్య వ్యవస్థలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అత్యధిక సైబర్ దాడులు భారత్‌పైనే జరుగుతుండగా.. అందులోనూ వైద్య వ్యవస్థలపైనే అత్యధికంగా సైబర్ దాడులకు నేరగాళ్లు తెగబడుతున్నారు. గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ నివేదిక–2025 పేరిట ప్రముఖ సైబర్ సెక్యూరిటీ చెక్‌పాయింట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ విడుదల చేసిన నివేదిక భారత్‌లో సైబర్ దాడుల తీవ్రతను వెల్లడించింది. నివేదిక ఏం చెప్పిందంటే..2023తో పోలిస్తే 2024లో ప్రపంచవ్యాప్తంగా సైబర్ దాడులు 44శాతం పెరిగాయి. ప్రపంచంలోని కీలక మౌలిక వ్యవస్థలు ఎదుర్కొంటున్న సైబర్ దాడుల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. ప్రపంచ దేశాల్లోని మౌలిక వ్యవస్థలపై సగటున వారానికి 1,847 సైబర్ దాడులు జరిగాయి. భారత్‌లో మాత్రం అంతకు మూడు రెట్లు సైబర్ దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మౌలిక వ్యవస్థలు సగటున వారానికి 3,291 సైబర్ దాడుల బారిన పడటం గమనార్హం. రెండో స్థానంలో విద్యారంగంభారత్లో వైద్య రంగమే అత్యధికంగా సైబర్ దాడుల బారినపడింది. సైబర్ నేరగాళ్లు దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య వ్యవస్థలపై సగటున వారానికి 8,614 సైబర్ దాడులకు తెగబడ్డారు. సగటున వారానికి 7,983 సైబర్ దాడులతో విద్యారంగం రెండో స్థానంలోనూ, 4,731 దాడులతో రక్షణ రంగం మూడో స్థానంలో ఉన్నాయి. 2024 మే నెలలో భారత్ అత్యధికంగా సైబర్ దాడుల బారిన పడింది. ఆ ఒక్క నెలలోనే వేలిముద్రలు, ఫేషియల్ స్కాన్లతోసహా ఏకంగా 500 జీబీ బయోమెట్రిక్ డేటా చౌర్యానికి పాల్పడ్డారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సహా దేశంలోని ప్రముఖ వైద్యసంస్థలు సైబర్ దాడులతో హడలెత్తిపోయాయి. వైద్య సంస్థల్లోని రోగుల వ్యక్తిగత వివరాలను సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు.జెన్ ఏఐని వినియోగించి..జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ద్వారా సైబర్ నేరగాళ్లు యథేచ్చగా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. జెన్ ఏఐ ద్వారా దుష్ప్రచారం, డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి సైబర్ దాడులకు పాల్పడటంతోపాటు బ్యాంకు ఖాతాల్లో నిధులు కొల్లగొట్టడం, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసేందుకు యత్నించారు. ప్రధానంగా రిమోట్ యాక్సెస్ ట్రోజన్ల ద్వారా ఫేక్ అప్డేట్లతోనే ఈ సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. మొత్తం సైబర్ దాడుల్లో 58 శాతం ప్రజల వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడినవే కావడం గమనార్హం. -
పార్ట్ టైమ్ చీటింగ్!
పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని లక్ష్యంగా చేసుకుంటూ నిండాముంచుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు.. పార్ట్‌టైమ్ జాబ్ అయినా మంచి జీతం వస్తుందని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నారు.రామగిరి మండలం గరిమేకపల్లికి చెందిన 29 ఏళ్ల నిరుద్యోగి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘పార్ట్‌టైమ్ ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం పదే పదే నగదు చెల్లింపులు చేస్తూ మొత్తం రూ.80 వేలు కోల్పోయాడు. నెల రోజులుగా ఈ తతంగం జరుగుతూనే ఉంది. అప్రూవల్ వస్తుందని.. రిజి్రస్టేషన్, వెరిఫికేషన్.. ఇలా పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఉద్యోగం మాత్రం రాలేదు. తర్వాత అంతకు ముందు టచ్‌లోకి వచ్చిన సెల్‌ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ వచ్చాయి. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.ధర్మవరం మండలం రేగాటిపల్లికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఇంటి వద్దనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగం వెతుకుతూ.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం రెండు నెలల పాటు నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని మరో రూ.50 వేలు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు.సాక్షి, పుట్టపర్తి: కష్టపడకుండా డబ్బులు రావు. అలా వచ్చినా నిలబడవు.. ఈ విషయం తెలియక చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని గూగుల్ లింక్ క్లిక్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నమ్మిస్తూ వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో లెక్క లేనన్ని లింక్‌లు నిత్యం వస్తుంటాయి. ఏ ఒక్క లింక్ క్లిక్ చేసినా.. ఆ తర్వాత ఫోన్ మన చేతిలో ఉన్నా.. ఆపరేటింగ్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు, ఫోన్ పే, గూగుల్ పే తదితర నగదు లావాదేవీల యాప్‌ల ద్వారా నగదు కాజేస్తున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో చోట సైబర్ నేరం బయట పడుతున్నా.. బలి అవుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాలను వినియోగించడం తెలీక కొందరు బలి అవుతుండగా.. డబ్బుపై అత్యాశతో ఇంకొందరు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ఆఖరికి కేటుగాళ్ల బారిన పడిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారిలో కూడా కొందరు బయటికి చెప్పకుండా నష్టపోయినట్లు తెలుసుకుని మౌనంగా ఉండిపోతున్నారు. అప్రమత్తత అవసరం సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితుల్లోనూ లింక్‌లను క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జ్ ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – వి.రత్న, ఎస్పీ, సత్యసాయి జిల్లా -
ఆన్లైన్ బుకింగ్‌పై అప్రమత్తంగా ఉండండి
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగ నున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులందరూ ఆన్ లెన్ బుకింగ్‌లపై జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) సూచించింది. ఆన్ లైన్లో హోటల్, ధర్మశాల, గెస్ట్‌హౌస్ బుకింగ్‌ల సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 45 రోజులపాటు జరిగే ఈ కుంభమేళాకు లక్షలాది మంది సందర్శకులు రాను న్నందున యాత్రికులను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు నకిలీ వెబ్సైట్లు, లింక్‌లను సృష్టించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎలాంటి రిజర్వేషన్ లేకుండానే తగ్గింపు ధరలకే వసతిని అందిస్తామంటూ మోసగాళ్లు భక్తులను ఆకర్షిస్తారని.. హోటళ్లు, ధర్మశాల, టెంట్ సిటీలకు ముందస్తు చెల్లింపులను వసూలు చేయడానికి మోసపూరిత వెబ్సైట్లు, నకిలీ బుకింగ్ లింక్‌లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని పేర్కొంది.టీజీసీఎస్బీ సూచనలు..⇒ అధికారిక మార్గాల్లోనే వసతిని బుక్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ధ్రువీకరించబడిన సంప్రదింపు నంబర్లు, వెబ్సైట్లను ఉపయోగించండి. ఈ అధికారిక వెబ్సైట్ https://kumbh.gov.in/en/ Wheretostaylist అందుబాటులో ఉంది.⇒ అసాధారణంగా తక్కువ ధరలకు వసతిని అందించే తెలియని లింక్‌లు లేదా ప్రకటనలపై క్లిక్ చేయవద్దు.⇒ తెలియని ఖాతాలకు లేదా అనధికారిక బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ముందస్తు చెల్లింపులు చేయవద్దు.⇒ అధికారికంగా క్రాస్–చెక్ చేయడం లేదా రాష్ట్ర అధికారు లను నేరుగా సంప్రదించడం ద్వారా ఏదైనా వసతి లేదా సర్వీస్ ప్రొవైడర్ ప్రామాణికతను ధ్రువీకరించుకోండి.⇒ వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.⇒ ఒకవేళ మోసానికి గురైనట్లయితే వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడం ద్వారా లేదా www. cybercrime. gov. in లో అధికారిక సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌ను సందర్శించి ఫిర్యాదు చేయండి.⇒ సైబర్ భద్రతపై మరింత సమాచారం కోసం.. tgcsb.tspolice.gov.in ని సందర్శించండి. -
సైబర్ మోసం తాళలేక విద్యార్థి ఆత్మహత్య
వీణవంక (హుజూరాబాద్): సైబర్ మోసానికి ఓ విద్యార్థి బలైపోయాడు. రూ. 5 వేలు పెట్టుబడి పెడి తే రెండింతలు ఇస్తాం’ అంటూ ఫోన్‌కు వచ్చిన మె సేజ్‌కు ఆకర్షితుడై పలు దఫాలుగా కేటుగాళ్లకు రూ.90 వేల మేర ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసి మోసపోయాడు. చివరకు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగ ల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మహిళా సంఘం నుంచి తల్లి తీసుకున్న చిట్టీ డబ్బులతో.. బేతిగల్ గ్రామంలో నివసిస్తున్న గుమ్మడి సృజన్–ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషివర్థన్ (18) ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బీటెక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. వారం క్రితం అతని మొబైల్‌కు కేటుగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్ పేరిట పంపిన సందేశం చూసి ఆకర్షితుడయ్యాడు. తన తల్లి ఇటీవల మహిళా సంఘం నుంచి రూ. 90 వేల చిట్టీ పాడుకోవడంతో వచ్చిన డబ్బును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమె ఖాతాలోంచి ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. తొలుత రూ. 5 వేలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. అయితే రెట్టింపు సొమ్ము పొందాలంటే రెండో టాస్‌్కగా రూ. 23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ సొమ్మునూ చెల్లించాడు. మూడో టాస్‌్కలో రూ. 68 వేలు పెట్టుబడి పెడితే రీఫండ్ వస్తుందని కేటుగాళ్లు నమ్మించడంతో ఆ మొత్తం కూడా బదిలీ చేశాడు. అయితే ఆ సొమ్ముకు రెట్టింపు పొందాలంటే రూ. 2 లక్షల 6 వేలను బదిలీ చేయాలని వారు పేర్కొనడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు కుటుంబ సభ్యులకు లేఖ రాశాడు. ‘సారీ మమ్మీ.. నేను చనిపోతున్నా, రిన్నూ (తమ్ముడు) జాగ్రత్త.. డాడీ, మమ్మీ ఇన్నీ రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నేను ట్రేడింగ్ (స్టాక్ మార్కెట్)లో డబ్బులు పెట్టి మోసపోయా. కంపెనీ వివరాలు నా మొబైల్లో ఉన్నాయి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు. -
సైబర్ చోర్ టెకీస్
సాక్షి, హైదరాబాద్: ‘చదువుకోకపోతే దొంగ అవుతావా?’అని చిన్నప్పుడు స్కూలుకు వెళ్లకపోతే తల్లిదండ్రులు తిట్టడం అందరికీ అనుభవమే. కానీ, మంచి చదువు చదివినవారు కూడా కొందరు ఈజీ మనీకి అలవాటుపడి నేరాల బాట పడుతున్నారు. తమకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వాడి సైబర్ నేరాలకు తెగబడుతున్నారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) నివేదిక ప్రకారం సైబర్ నేరా లు చేస్తున్నవాళ్లలో 45 శాతం మంది బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ వంటి ఉన్నత సాంకేతిక విద్య పట్టభద్రులే ఉన్నారు. వారిలోనూ 49 శాతం మంది వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్యనే ఉన్నది. సైబర్ నేరాలకు పాల్పడుతున్నవాళ్లలో మూడు శాతం మంది ప్రభు త్వ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం. ఉక్కుపాదం మోపుతున్న టీజీసీఎస్పీ సైబర్ నేరాల కట్టడి కోసం తెలంగాణ పోలీసులు టీజీసీఎస్బీని ఏర్పాటు చేశారు. ఈ నేరాల తీవ్రత దృష్ట్యా కేసుల దర్యాప్తులో అడ్డంకులను అధిగమించడంతోపాటు పక్కాగా దర్యాప్తు చేపట్టేందుకు నేరుగా టీజీసీఎస్బీ డైరెక్టర్ పర్యవేక్షణ కింద ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం ఏడు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లను (సీసీపీఎస్) ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ల పరిధిలో గత ఆరు నెలల్లో 76 సైబర్ నేరాల్లో దేశవ్యాప్తంగా 165 మంది సైబర్ నేరగాళ్లను అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులకు తెలంగాణవ్యాప్తంగా 795 సైబర్‌నేరాలతో, దేశవ్యాప్తంగా 3,357 సైబర్ నేరాలతో సంబంధం ఉన్నట్టు అధికారులు తెలిపారు. న్యూ ఢిల్లీ, గుజరాత్, ఒడిశా, అస్సాం, రాజస్థాన్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి వీరిని అరెస్టు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీస్‌లపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. కొన్ని కేసుల్లో స్థానిక పోలీసుల సహకారం సైతం ఉండటంలేదని టీజీసీఎస్బీ పోలీసులు తెలిపారు. ఏ తరహా నేరాలు ఎక్కువ? సైబర్ నేరాల్లో పార్ట్‌టైం జాబ్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ (స్టాక్ ట్రేడింగ్), డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్, హ్యాకింగ్, అడ్వరై్టజ్‌మెంట్, మ్యాట్రిమోనియల్ మోసాలు ఎక్కువ ఉంటున్నాయి. పట్టుబడుతున్న వారిలో సైబర్ మోసాలకు పాల్పడే వారితోపాటు మ్యూల్ బ్యాంక్ ఖాతాదారులు, బ్యాంకు ఖాతాలు ఇచ్చే ఏజెంట్లు, అకౌంట్ ఆపరేటర్లు, సిమ్‌కార్డులు సరఫరా చేసేవాళ్లు, బ్యాంకు అధికారులు, ట్రావెల్ ఏజెంట్లు, హ్యాకర్లు సైతం ఉన్నారు. సైబర్‌సేఫ్ తెలంగాణే మా లక్ష్యం సైబర్ నేరగాళ్ల విషయంలో అత్యంత కఠిన వైఖరితో ఉన్నాం. సైబర్‌సేఫ్ తెలంగాణే మా లక్ష్యం. ప్రజలు సైతం సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీరు సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్ లేదా 87126 72222 వాట్సప్ నంబర్లో లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీn లోనూ ఫిర్యాదు చేయవచ్చు. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీసీఎస్బీ -
సీవీ ఆనంద్ డీపీతో ఫేక్ వాట్సాప్ కాల్స్.. సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
సాక్షి,హైదరాబాద్:సైబర్ నేరగాళ్లు రోజుకో అవతారమెత్తుతున్నారు. నగర పోలీస్ కమిషనర్(సీపీ) సీవీఆనంద్ డీపీతో వాట్సాప్ కాల్ చేస్తూ ప్రజలను భయపెట్టేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. పాకిస్తాన్ దేశ కోడ్‌తో వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమతంగా ఉండాలని ప్రజలకు సీపీ సీవీ ఆనంద్ సూచించారు. ఇటీవల సైబర్ నేరగాళ్లు ఇటీవల అక్రమ కేసుల పేరిట ఫేక్ వాట్సాప్‌కాల్స్ చేస్తూ ప్రజలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం పెరిగిపోయిన విషయం తెలిసిందే. డిజిటల్ అరెస్టులతో పాటు కేసులు రిజిస్టర్ అవడం, ఫోన్ కనెక్షన్‌ను ట్రాయ్ కట్ చేయడం తదితర కారణాలు చెప్పి ప్రజలను భయపెడుతున్నారు.ఇదీ చదవండి: ట్రావెల్ బస్సులో భారీ చోరీ -
వృద్ధురాలికి సైబర్ నేరగాళ్ల టోకరా
నూజివీడు : సైబర్ నేరగాళ్లు రకరకాల పద్ధతుల్లో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన వృద్ధురాలు సైబర్ నేరగాళ్ల మోసానికి రూ.40 లక్షలు పోగొట్టుకున్నారు. నూజివీడు పట్టణంలోని ఉషాబాలా నగర్లో నివాసముండే మందపల్లి కమలాజేసుదాసుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. పెద్ద కుమార్తె బెంగళూరులో, చిన్న కుమార్తె, కుమారుడు అమెరికాలో ఉంటున్నారు. కమలాజేసుదాసు ప్రైవేటు నర్సింగ్ కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఈ నెల రెండో తేదీ మధ్యాహ్న సమయంలో 9850852151 నంబరు నుంచి ఓ మహిళ కమలా జేసుదాసుకు ఫోన్ చేసి.. తాము ముంబయి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నామని, మీ పేరిట పార్శిల్ వచ్చిందని, అందులో ఎండీఎంఏ అనే నిషేధిత డ్రగ్స్ ఉందని చెప్పింది. మీకు మరో కాల్ వస్తుందంటూ కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వెంటనే కమలాజేసుదాసుకు 7831062545 నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది.. తాము ముంబయి పోలీసులమని, మీకు డ్రగ్స్‌తో సంబంధం ఉందని, అమెరికాలో ఉన్న మీ కుటుంబ సభ్యులకూఇందులో సంబంధం ఉందంటూ భయపెట్టారు. ఈ డ్రగ్స్ ద్వారా వచ్చిన డబ్బు మీ ఖాతాలో ఉందని, మీరు ఏ తప్పూ చేయకుంటే ఆ డబ్బును తమకు ట్రాన్స్ఫర్ చేయాలని, ఏ తప్పూ లేకపోతే మీ డబ్బు మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. దీంతో భయపడిన వృద్ధురాలు ఈ నెల మూడో తేదీన రూ.20 లక్షలు, గంట తర్వాత రూ.10 లక్షలు, నాలుగో తేదీన మరో రూ.10 లక్షలు ఆర్టీజీఎస్ ద్వారా వారిచ్చిన ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసింది. అనంతరం తనకు కాల్ వచ్చిన నంబర్‌కు ఆమె ఫోన్ చేస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న కమలా జేసుదాసు.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు టౌన్ సీఐ పి.సత్యశ్రీనివాస్ కేసు నమోదు చేశారు. -
తెలివిమీరిన సైబర్ నేరగాళ్లు.. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు
నల్లగొండ జిల్లా :సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథా ఎంచుకుంటున్నారు. కొంగొత్త మార్గాల్లో అమాయకులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఎన్నో రకాల మోసాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఓ మోసమో మరోసారి వెలుగు చూసింది.ఈసారి సైబర్ నేరగాళ్ల అమాయకుల్ని మోసం చేసేందుకు ప్రజా ప్రతినిధుల్ని ఎంచుకున్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యుల పేరుతో సైబర్ నేరగాళ్ల వాట్సాప్ కాల్స్ చేశారు.ఎమ్మెల్యే వేముల వీరేశం పేరుతో డబ్బులు కావాలంటూ ఆయన సన్నిహితులకు మెసేజ్, వాట్సాప్ కాల్స్ చేశారు. సైబర్ కేటుగాళ్ల గురించి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే వీరేశం తన పేరుతో మెసేజ్‌లు,కాల్స్ వస్తున్నాయని,అలాంటి వాటికి స్పందించొద్దని కోరారు. -
15 రోజుల ఆపరేషన్.. 27 మంది సైబర్ క్రిమినల్స్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాల్లో కొల్లగొట్టిన సొమ్ము లావాదేవీలు చేసేందుకు తమ బ్యాంకు ఖాతాలను కమీషన్ల కోసం ఇస్తున్న (మ్యూల్ బ్యాంక్ ఖాతాలు) 27 మంది నిందితులను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు.టీజీసీఎస్బీ అధికారులు తొలి సారిగా చేపట్టిన అంతర్రాష్ట్ర ఆపరేషన్‌లో భాగంగా ఈ నిందితులను రాజ స్తాన్‌లోని 3 ప్రాంతాల్లో అరెస్టు చేసినట్టు బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఈ మేరకు తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీజీసీఎస్బీ ఎస్పీ దేవేందర్‌సింగ్, ఇతర అధికారులతో కలిసి ఆమె మాట్లాడారు. తెలంగాణలో 189 సైబర్ నేరాలతో వీరికి సంబంధం..‘అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి మొదటిసారిగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టాం. రాజస్తాన్‌లోని జైపూర్, జోథ్‌పూర్, నాగ్‌పూర్‌లలో 15 రోజులపాటు చేసిన ఈ ఆపరేషన్‌లో 27 మందిని అరెస్ట్ చేశాం. దేశవ్యాప్తంగా జరిగిన 2,223 సైబర్ నేరాలలో వీరు నిందితులుగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 189 సైబర్ నేరాల్లో వీరికి సంబంధం ఉంది. పట్టుబడిన వారిలో నిరుద్యోగులతోపాటు కాంట్రాక్టర్లు, వ్యాపారాలు చేస్తున్నవారు..ప్రైవేటు ఉద్యోగులు కూడా ఉన్నారు. నిందితులు అందరూ విద్యావంతులే. వీరంతా 29 మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా రూ. 11.01 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు చేసినట్టు గుర్తించాం. తెలంగాణకు సంబంధించిన 189 కేసులలో కొల్లగొట్టిన రూ.9 కోట్లు వీరి బ్యాంకు ఖాతాల ద్వారానే పలు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఈ బ్యాంకు ఖాతాలను వినియోగించి చేసిన మోసాలలో ప్రధానంగా వ్యాపార పెట్టుబడులు, ట్రేడింగ్‌తోపాటు డిజిటల్ అరెస్టు వంటి నేరాలు ఉన్నాయి’ అని శిఖాగోయల్ వెల్లడించారు. సైబర్ మోసగాళ్ల పనిపట్టేందుకు టీజీ సీఎస్బీ ఆధ్వర్యంలో ఇకపైన కూడా అంతర్రాష్ట్ర ఆపరేషన్లు కొనసాగుతాయని, ఇందుకు స్పెషల్ టీంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పట్టుబడిన 27 మంది వద్ద నుంచి 31 మొబైల్ ఫోన్లు, 37 సిమ్ కార్డులు, రెండు హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరికొన్ని కీలక విషయాలు తెలుస్తాయన్నారు. కమీషన్ల కోసం తమ బ్యాంకు ఖాతాలను, వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చి చిక్కులు కొనితెచ్చుకోవద్దని ప్రజలను శిఖాగోయల్ హెచ్చరించారు. కాగా, స్పెషల్ ఆపరేషన్‌లో పాల్గొన్న డీఎస్పీలు కేవీ సూర్యప్రకాశ్, ఫణీందర్, వేణుగోపాల్‌రెడ్డి, హరికృష్ణ, కేవీఎం ప్రసాద్, ఇన్స్పెక్టర్లు రమేశ్, ఆశిష్‌రెడ్డి, రవికుమార్, శ్రీను నాయక్, సునీల్, ఇతర సిబ్బందిని శిఖాగోయల్ ప్రత్యేకంగా అభినందించారు. -
అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్ అరెస్ట్.. 27 మందిపై 2023 కేసులు
సాక్షి, హైదరాబాద్: తొలిసారి అంతర్రాష్ట్ర సైబర్ క్రైమ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. వీరిని పట్టుకొవాడినికి స్పెషల్ ఆపరేషన్ నిర్వహించామని, రాజస్థాన్‌లో నాలుగు బృందాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. రాజస్థాన్, జైపూర్, జోధ్పూర్లలో ఈ ఆపరేషన్ నిర్వహించామని. 15 రోజుల అపరేషన్‌లో భాగంగా 27 మంది సైబర్ క్రిమినల్స్‌ను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు అందరూ విద్యావంతులేననని, మొత్తం ముప్పై ఏళ్ళ లోపు వారే ఉన్నారని తెలిపారు.ఒక్కొక్కరు పదుల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, ఈ 27 మందిపై తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులు నమోదైనట్లు శిఖా గోయల్ చెప్పారు. దేశ వ్యాప్తంగా 2023 కేసులో వీరు నిందితులుగా ఉన్నారన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్ ఫోన్స్, 37 సిమ్ కార్డ్స్, చెక్ బుక్స్లను స్వాధీనం చేసుకున్నామని ెప్పారు. నిందితులు 29 మ్యూల్ అకౌంట్లను సైబర్ క్రైమ్స్ కోసం సేకరించారని తెలిపారు. 11 కోట్లు లావాదేవీలు 29 అకౌంట్ల ద్వారా నిందితులు చేశారని, విచారణలో లావాదేవీల జరిపిన మొత్తం అమౌంట్ పెరిగే అవకాశం ఉందన్నారు.‘సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు స్పెషల్ ఆపరేషన్ చేయలేదు. స్పెషల్ ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా టీమ్‌లను ఏర్పాటు చేశాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితులు అందర్నీ పట్టుకోగలిగాం. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా టీమ్స్ బృందాలుగా డిస్పాచ్ అయ్యి నిందితులను అరెస్ట్ చేశారు. మా బృందాలు ఎప్పటికపుడు నేరస్తుల కదలికలు, లోకేషన్లపై నిఘా పెట్టీ అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది కమిషన్ కోసం ఉద్దేశ పూర్వకంగానే మ్యూల్ అకౌంట్ లను నేరస్తులకు ఇస్తున్నారునేరస్తులకు క్రిమినల్ కార్యకలాపాల కోసం అకౌంట్స్ ఇవ్వవద్దు. తెలంగాణ వ్యాప్తంగా 189 కేసులో నిందితులు రూ. 9 కోట్లు కొల్ల గొట్టారు. నిందితులను అరెస్ట్ చేయడానికి లోకల్ పోలీసుల సహకరించారు. సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్ ఇది లాస్ట్ ఆపరేషన్ కాదు. మొదటిది. నేరాలకు పాల్పడిన క్రిమినల్స్ దేశంలో ఎక్కడ ఉన్నా పట్టుకుని వస్తాం. నేరగాళ్లు సిటీలు వదిలి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్ల కొల్లగొట్టిన రూ. 114 కోట్ల రూపాయలను ఈ సంవత్సరం బాధితులకు తిరిగి ఇచ్చాం. సైబర్ నేరగాళ్లు మోసం చేస్తే వెంటనే కాల్ సెంటర్ కు పిర్యాదు చేయాలి. మ్యూల్ అకౌంట్లను ఓపెన్ చేసేముందు క్రాస్ చెక్ చేయాలని బ్యాంకర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం’ అని తెలిపారు. -
హలో.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో..
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి చేతుల్లో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు వస్తున్న ఫిర్యాదు కాల్సే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు రోజుకు సరాసరిన 1600 ఫోన్‌కాల్స్ వచ్చి నట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా ఆర్థిక మోసా లకు సంబంధించినవి 50 శాతం కాగా, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు 50 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మొత్తం 460 మంది సైబర్ నేరగాళ్లను 351 కేసుల్లో అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు.⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతి రోజూ సరాసరిన 330 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఫిర్యాదులకు 1930 కాల్ సెంటర్ సిబ్బంది సమాధానాలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఆగస్టు 31 వరకు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వారు పోగొట్టుకున్న సొమ్ములో 13 శాతం సొమ్మును సకాలంలో ఫిర్యాదు చేయడంతో టీజీసీఎస్బీ అధికారులు కాపాడారు. ఇలా మొత్తం రూ.163 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా చేశారు. -
ఆ రాష్ట్రాల్లో స్కామర్స్... మేము వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు
-
సైబర్ నేరగాళ్ల గుట్టురట్టు
-
సైబర్ నేరగాళ్లే ఎంపీడీవో ఉసురు తీశారు!
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవో ఎం.వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్య ఘటన వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రాజస్థాన్‌కు చెందిన సైబర్ నేరగాళ్ల వేధింపుల కారణంగానే ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఎంపీడీవో వెంకటరమణ అదృశ్యం, ఆత్మహత్యపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. వెంకటరమణ సెల్‌ఫోన్ కాల్ డేటా, బ్యాంక్ లావాదేవీలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా వలలో ఎంపీడీవో చిక్కుకున్నట్లు గుర్తించారని తెలిసింది. సుమారు 30మంది ఉన్న ఈ సైబర్ నేరస్తుల ముఠా ఓ యువతి న్యూడ్ వీడియోను ఆధారంగా చేసుకుని ఎంపీడీవోను ఇరుకునపెట్టినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఆయనను బెదిరించి పలుమార్లు డబ్బులు వసూలు చేసినట్లు కూడా గుర్తించారని తెలిసింది. మరింత డబ్బులు కావాలని సైబర్ ముఠా ఒత్తిడి చేయడంతో బయటకు చెప్పుకోలేక ఎంపీడీవో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్మ చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు రాజస్థాన్‌లోని బర్కత్పూర్కు చెందిన సైబర్‌ముఠా సభ్యుడిని ప్రత్యేక పోలీసు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ఎంపీడీవో అదృశ్యమైన తర్వాత ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. నరసాపురంలోని మాధవాయిపాలెం ఫెర్రీ కాంట్రాక్టర్ సీహెచ్ రెడ్డప్ప ధవేజీ ప్రభుత్వానికి రేవు నిర్వహణకు సంబంధించిన లీజు డబ్బులు బకాయి ఉండటంతోనే ఎంపీడీవో కనిపించకుండాపోయారని కూటమి నేతలు ఆరోపణలు చేశారు. కాంట్రాక్టర్ ధవేజీ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అనుచరుడని, లీజు డబ్బులు చెల్లించకుండా ప్రసాదరాజు ఒత్తిడి తెచ్చారని విమర్శించారు. అందువల్లే ఒత్తిడికి గురైన ఎంపీడీవో ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఎంపీడీవో తన కుటుంబ సభ్యులకు వాట్సాప్‌లో పెట్టిన సూసైడ్ నోట్ కథనాన్ని తెరపైకి తెచ్చారు. అయితే, ఎంపీడీవో ఆత్మహత్యకు, ఫెర్రీ వ్యవహారానికి సంబంధం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
సిమ్ కార్డులతో సైబర్ నేరం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నకిలీ, కాలం చెల్లిన ఆధార్ కార్డులలో చిన్నారుల ఫొటోలను పెట్టి తయారు చేసిన పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని వాటిని సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరి టీ బ్యూరో (సీఎస్బీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. సిమ్ కార్డుల రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 64.5 శాతం మంది కస్టమర్లు మాత్రమే డిజిటల్ కేవైసీని ఆధార్‌తో లింక్ చేసుకుంటున్నట్టు నివేదిక తేల్చింది.‘టెలికామ్ సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రాడ్స్–గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రికమండేషన్స్’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం టీజీ సీఎస్బీ కార్యాలయంలో ఐఎస్బీ ప్రొఫెసర్లతో కలిసి విడుదల చేశారు. సీఏఎఫ్ (కస్టమర్ అక్విజేషన్ ఫారమ్స్)లోని సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు.హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల్లో ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించి మొత్తం 1,600 సీఏఎఫ్ల వివరాలు విశ్లేషించినట్టు తెలిపారు. సైబర్ నేరగాళ్లు వినియోగించిన ఫోన్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్స్‌తో రియల్ టైంలో విశ్లేషించినట్టు వివరించారు. సిమ్ కార్డులు పోతే సమాచారం ఇవ్వాలి: సీఎస్బీ డైరెక్టర్సైబర్ నేరాల్లో సిమ్‌కార్డు సంబంధిత మోసాలు పెరుగు తున్నాయని, వీటిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనం అభిప్రా యపడింది. వినియోగదారుడి వివరాలు వెరిఫికేషన్‌లో చాలా లోపాలు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఓటీపీ అథెంటికేషన్లోనూ లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. ప్రజలు సిమ్ కార్డులు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా శిఖా గోయల్ సూచించారు.పోగొట్టుకున్న సిమ్ కార్డులను వినియోగించి సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అందులో మన వివరాలు ఉంటాయి కాబట్టి మనం చిక్కుల్లో పడతామని హెచ్చరించారు. అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఈ నివేదిక రూపకల్పనలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్లు మనీశ్ గంగ్వార్, డా.శ్రుతిమంత్రిలు పాల్గొన్నారు. -
+92 నంబర్‌తో కాలింగ్
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు కొత్తకొత్త మోసాలకు దారులు వెతుకుతున్నారు. వాట్సాప్ డీపీగా పోలీస్ ఉన్నతాధికారుల ఫొటోలను పెట్టుకుని, ఆ నంబర్ల నుంచి పలువురికి వాట్సాప్ వాయిస్ కాల్స్ చేస్తున్నారు. తాజాగా ఇలాంటి బెదిరింపుల వీడియో ఒకటి డీజీపీ జితేందర్ తన అధికారిక ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అనుమానాస్పద కాల్స్ వస్తే నమ్మి మోస పోకుండా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.తెలంగాణ సీఎస్, డీజీపీ పేరిట గతంలోనూ వాట్సాప్ డీపీలతో డబ్బులు డిమాండ్⇒ ఈ ఏడాది ఏప్రిల్ 30న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఫొటోను వాట్సాప్డీపీగా పెట్టిన సైబర్ నేరగాళ్లు..సీఎస్ పేరిట నలుగురు వ్యక్తులకు మెసేజ్‌లు పెట్టారు. అందులో రంజాన్ గిప్ట్ కూపన్లు పంపాలని కోరడంతో అనుమానాస్పదంగా భావించిన సదరు వ్యక్తులు సీఎస్ దృష్టికి తెచ్చారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.⇒ హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి రవిగుప్తా డీజీపీగా పనిచేసిన సమయంలో ఆయన ఫొటోను డీపీగా పెట్టిన నంబర్‌తో ఈ ఏడాది మే 21న ఓ వ్యాపారికి వాట్సాప్ కాల్ వెళ్లింది. ‘మీ అమ్మాయిని నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఆమెను విడుదల చేయాలంటే రూ.50 వేలు మొబైల్ పేమెంట్ ద్వారా పంపండి అని సైబర్ నేరగాళ్లు డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కేసు నమోదు చేశారు.⇒ ఈ ఏడాది మే 23న వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి కొందరు సైబర్‌నేరగాళ్లు ఆమె పేరిట డబ్బులు పంపాలంటూ కలెక్టరేట్ సిబ్బందితో పాటు కొందరు ప్రజలకు వాట్సాప్ మెసేజ్‌లు పంపారు. విషయం తన దృష్టికి రావడంతో కలెక్టర్ వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు..ప్రజలు, అధికారులు ఎవరూ అలాంటి మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు.+92 నంబర్‌తో వస్తే అది మోసం.. మీ వాట్సాప్‌కు పోలీసుల పేరిట బెదిరింపు కాల్స్ వస్తే అందులో ఉన్న నంబర్ ఏ సంఖ్యతో మొదలైందో గమనించాలి. ఒకవేళ అది +92 నంబర్‌తో వస్తే.. పక్కాగా అది సైబర్ నేరగాళ్లపనే అని గుర్తించాలి. వాస్తవానికి +92 కోడ్ పాకి స్తాన్ది. చాలావరకు ఈ నంబర్‌తో కాల్స్ పాకి స్తాన్ నుంచే వస్తాయని, కొన్నిసార్లు కంప్యూటర్ ప్రోగ్రామ్లతోనూ ఇలాంటికాల్స్ జనరేట్ చేయవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. అనుమానం వస్తే సంచార్ సాథీ పోర్టల్ దృష్టికి తేవాలి.. మీకు తెలియని నంబర్ నుంచి +92తో ప్రారంభమయ్యే కాల్ వచి్చ.. అందులో అవతలి వ్యక్తి మీ వ్యక్తిగత వివరాలు.. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ లాగిన్ వివరాలు లేదా ఓటీపీలు.. ఏవైనా అడిగితే చెప్పవద్దు. అలాంటి అనుమానాస్పద నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే సంచార్ సాథీ పోర్టల్ (ఠీఠీఠీ. ట్చnఛిజ్చిట ట్చ్చ్టజిజీ.జౌఠి.జీn)‘చక్షు–రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్స్’లో మోసపూరిత సమాచారాన్ని తెలియజేయాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ప్రజలకు సూచించింది. ఫేక్ వాట్సాప్‌కాల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.. పోలీస్ అధికారుల ఫొటోలను డీపీగా పెట్టుకు న్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించి న వాళ్లు పోలీసులకు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. – జితేందర్, డీజీపీ, తెలంగాణ -
మీషో కూపన్ల పేరిట సైబర్‌మోసం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ అయిన మీషో పేరిట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెర తీస్తున్నారని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీషో కంపెనీ నుంచి వచి్చందని భ్రమపడేలా ఓ ఫామ్‌ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి సైబర్ నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారు. వీటిని అందుకున్న వారిని అందులోని కార్డును స్క్రాచ్ చేయాలని సూచనల్లో పేర్కొంటున్నారు. అలా స్క్రాచ్ చేసిన తర్వాత అందులో మీరు లక్కీ కస్టమర్ కింద లక్కీ కూపన్లో కారు, బంగారం వంటి ఖరీదైన బహుమతులు గెలుచుకున్నారని ఉంటుంది. ఇలా లక్కీ డ్రా తగిలిన వారు వెంటనే మీ స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, మేం అడిగే వివరాలు నమోదు చేయాలని చెబుతారు. ఏదైనా సందేహాలుంటే మీకు ఇచ్చిన దరఖాస్తులోని నంబర్లకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు. వివరాలిస్తే అసలుకే మోసం...ఎవరైనా అమాయకులు ఈ ఉచ్చులో చిక్కితే ఇక సైబర్ నేరగాళ్లు తమ విశ్వరూపం చూపిస్తున్నారు. ఇలా స్క్రాచ్ కార్డుపై ఉన్న క్యూర్ కోడ్ స్కాన్ చేసి అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేస్తే ఇక అసలు మోసం మొదలవుతుంది. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే అనుమానాస్పద యాప్‌లు మనకు తెలియకుండానే మన ఫోన్లోకి ఇన్స్టాల్ అవుతాయి. అదేవిధంగా మనం నమోదు చేసే బ్యాంకుఖాతా, వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుంటున్న సైబర్ నేరగాళ్లు బ్యాంకుఖాతాల్లోని డబ్బులు కొల్లగొడుతున్నారు.ఇలాంటి కూపన్లు వస్తే నమ్మవద్దని, ఎలాంటి వివరాలు వారితో పంచుకోవద్దని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. గతంలో పట్టణప్రాంతాలకే పరిమితమైన ఈ తరహా మోసాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. -
సైబర్ నేరగాళ్ల మైండ్ ‘బ్లాక్’
సాక్షి, హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లకు చెక్ చెప్పడానికి కేంద్రప్రభుత్వం మరో కీలకనిర్ణయం తీసుకుంది. వీరు వినియోగించే మొబైల్ఫోన్లు బ్లాక్ చేయిస్తోంది. తాజాగా 28,200 çహ్యాండ్సెట్స్ బ్లాక్ చేయాలని ఆయా సర్విస్ ప్రొవైడర్లను ఆదేశించింది. ఈ ఫోన్లలో వాడిన 20 లక్షల ఫోన్నంబర్ల పూర్వాపరాలు మరోసారి పరిశీలించాలని స్పష్టం చేసింది. ఈ–కేటుగాళ్లు గత ఏడాది ‘గ్రేటర్’పరిధిలోని బాధితుల నుంచి ఏకంగా రూ.621 కోట్లు కాజేశారంటే సైబర్ నేరాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. డార్క్‌నెట్‌లో దొరుకుతున్న డేటా ఉత్తరాదికి చెందిన సైబర్ నేరగాళ్లు అక్కడి నుంచే దేశవ్యాప్తంగా బాధితులను టార్గెట్‌గా చేసుకుంటున్నారు. అయితే దీనికి సెల్‌ఫోన్ వినియోగదారుల వివరాలు అత్యంత కీలకం. వీరి నంబర్లతో కూడిన డేటా సైబర్ నేరగాళ్లకు డార్క్‌నెట్‌లో తేలిగ్గా దొరుకుతోంది. లక్ష మందికి సంబంధించిన ఫోన్ నంబర్లను కేవలం రూ.30 వేలకు విక్రయించేవారు అనేకమంది ఉన్నారు. ఈ డేటా వీరి వద్దకు ఎలా చేరుతోందనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు సైబర్ నేరగాళ్లు తమ ఉనికి బయటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఒకవేళ బాధితుడు పోలీస్ ఫిర్యాదు చేసినా, దర్యాప్తులో ముందుకు వెళ్లకుండా, వారికి ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఉండేలా ప్లాన్ చేశారు. బ్యాంకు ఖాతాలు, సెల్‌నంబర్లు ఇలా ఏదీ తమ పేరుతో లేకుండా చూసుకుంటున్నారు. వీరికి అవసరమైన బ్యాంకు ఖాతాలు, సిమ్‌కార్డులను సరఫరా చేయడానికి కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. ఇతరుల పేర్లతో ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలతోపాటు ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సేకరించి సైబర్ నేరగాళ్లకు ఈ ముఠాలు అందజేస్తున్నాయి. బ్యాంకు ఖాతాలు ఇచి్చనందుకు కమీషన్లు, సిమ్‌కార్డుకు అధిక రేటు వీరికి దక్కుతోంది.ఆ రెండింటితో ఉపయోగం లేక... సైబర్ నేరగాళ్లను కట్టడి చేయడానికి కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తొలినాళ్లలో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న బ్యాంకు ఖాతాలను బ్లాక్ చేసేది. ఈ విధానం పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడంతో మరో అడుగు వేసింది. సైబర్ నేరగాళ్లు వినియోగించినట్టు, వినియోగించే అవకాశమున్నట్టు ప్రాథమిక ఆధారాలు లభించిన సెల్‌ఫోన్ నంబర్లను బ్లాక్ చేయడం మొదలెట్టింది. దీంతో తెలివిమీరి వ్యవహరిస్తున్న ఆ కేటుగాళ్లు అధిక సంఖ్యలో ప్రీ యాక్టివేటెడ్ సిమ్‌కార్డులు సమీకరించడం మొదలెట్టారు. ఒక్కో నేరానికి ఒక్కో సిమ్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు. ఫోన్లు బ్లాక్ చేసేలా తాజా నిర్ణయం సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న హ్యాండ్‌సెట్స్‌ను బ్లాక్ చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఈ బాధ్యతల్ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) పర్యవేక్షించడం మొదలెట్టింది. సైబర్ నేరాల్లో బాధితులుగా మారినవారు నేరుగా, ఆన్లైన్ ద్వారా పోలీసులు లేదా సంబంధిత ఏజెన్సీలను ఆశ్రయిస్తున్నారు. లిఖిత పూర్వకంగా, 1930కు కాల్ చేయడం ద్వారా, వెబ్సైట్, యాప్‌ల్లో దాఖలవుతున్న వీరి ఫిర్యాదుల్లో తమను సంప్రదించడానికి సైబర్ నేరగాడు వినియోగించిన ఫోన్ నంబర్ వివరాలు ఉంటున్నాయి. ఈ డేటా ఆధారంగానే డీఓటీ మొబైల్ ఫోన్లు బ్లాక్ చేసేలా చర్యలు తీసుకుటోంది. సర్విసు ప్రొవైడర్ల సహకారంతో.. ఈ సెల్‌ఫోన్ హ్యాండ్సెట్లు గుర్తించడం, బ్లాక్ చేయడంలో ఆయా నెట్వర్క్ సర్విస్ ప్రొవైడర్ల పాత్ర అత్యంత కీలకం. ప్రతి సెల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్‌గా (ఐఎంఈఐ) పిలిచే ప్రత్యేక నంబర్ ఉంటుంది. ఏ కంపెనీ సిమ్ వాడుతుంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద ఈ ఐఎంఈఐ రిజిస్టర్ అవుతుంది. బాధితుల ఫిర్యాదులో ఉన్న సెల్‌నంబర్ ఆధారంగా సర్విస్ ప్రొవైడర్ల సహకారంతో డీఓటీ ఐఎంఈఐ నంబర్లను గుర్తిస్తోంది. వీటితో జాబితా రూపొందించి ఆయా సర్విస్ ప్రొవైడర్లకు పంపిస్తోంది. దీని ఆధారంగా ఈ ఐఎంఈఐ నంబర్లు ఉన్న ఫోన్లు పనిచేయకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలా ఆ హ్యాండ్సెట్ బ్లాక్ అయిపోతోంది. ఇటీవల కాలంలో నేరగాళ్లు స్కైప్ కాల్స్ చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. ఈ తరహాకు చెందిన స్కైప్ ఖాతాలను కేంద్రం బ్లాక్ చేయిస్తోంది. -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్‌కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్‌కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్‌లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
ఈ లింక్‌పై క్లిక్ చేయవద్దు
సాక్షి, హైదరాబాద్: భారత వాయుసేనలో చేరాలని యువతలో చాలా కలలు కంటుంటారు. ఇలాంటి కలల్నే తమకు అనుకూలంగా మార్చుకుని సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు తెరదీస్తున్నారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు. భారత వాయుసేనలో చేరాలంటే తాము ఇచ్చే ప్రకటనలోని లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలంటూ సామాజిక మాధ్యమాౖలెన ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఎక్స్ వంటి వాటిల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. ఇలా అభ్యర్థుల నుంచి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఆ తర్వాత దరఖాస్తు కోసమని, వెరిఫికేషన్ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలు నమ్మవద్దని వారు సూచించారు. అధికారిక వెబ్సైట్లలో మాత్రమే వివరాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు
విజయవాడలోని గుణదలకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ టెక్ట్స్ మెసేజ్ వచ్చింది. ‘ఎన్నికల సర్వేలో చురుగ్గా పాల్గొంటున్నందున మా పార్టీ నుంచి కొన్ని రీడిమ్ పాయింట్లు ఇస్తున్నాం. ఈ పాయింట్ల కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి’ అని అందులో ఉంది. పాయింట్లు వస్తాయనే ఆశతో సదరు వ్యక్తి లింక్‌ను క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేశాడు. ఆ వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును సైబర్ నేరగాళ్లు ఖాళీ చేయడంతో లబోదిబోమన్న బాధితుడు సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. విజయవాడ (స్పోర్ట్స్): కాలానికి అనుగుణంగా మోసాలకు పాల్పడటంలో ఆరితేరిన సైబర్ నేరగాళ్లు ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరుతో మోసాలకు తెగబడుతున్నారు. సర్వే అంటూ, ఓటరు కార్డు సరి చేయాలంటూ ఫోన్లు చేసి ప్రజల బ్యాంక్ ఖాతాలను లూటీ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి నేరుగా ఎవరికీ ఫోన్ కాల్ రాదనే విషయాన్ని గ్రహించాలని సూచించారు. సర్వే పేరుతో వివరాలు సేకరించి మోసాలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు రాజకీయ పార్టీలు సర్వేల పేరుతో ప్రజలకు ఫోన్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయా పార్టీల ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల స్వభావం తెలుసుకునేందుకు, ఓట్లు అభ్యర్థించేందుకు పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. దీనినే కొందరు నేరగాళ్లు సైబర్ మోసాలకు వాడుకుంటున్నారు. ఫోన్ చేసిన ఆగంతకుడు ఏదో ఒక పార్టీ సర్వే పేరుతో తియ్యని మాటలతో ముగ్గులోకి దించుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థి స్వభావంపై తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఆన్లైన్లో ఆకర్షణీయమైన గిఫ్ట్ పంపుతామని ఆశ పెడతారు. కొన్ని ప్రశ్నలు అడిగిన తరువాత మీరు గిఫ్ట్ పొందేందుకు అర్హత సాధించారని నమ్మిస్తారు. గిఫ్ట్ మీ ఇంటికి రావాలంటే మీ ఓటర్ కార్డ్, బ్యాంక్, ఆధార్, పాన్ వివరాలు చెప్పాలని అభ్యర్థిస్తారు. ఈ వివరాలన్నీ సేకరించిన తరువాత ఆయా బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును ఏఈపీఎస్ (ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్) ద్వారా ఖాళీ చేస్తారు. ఏఈపీఎస్ మోసాల్లో ఖాతాదారుడికి డబ్బులు వేరే ఖాతాకు డెబిట్ అయినట్టు కనీసం మెసేజ్ కూడా రాదు. ఖాతాలో నగదు లేకుండా అదే వ్యక్తి పేరున ఓ సిమ్ తీసుకుని సోషల్ మీడియా ఖాతాలతో పాటు బ్యాంక్ ఖాతా తెరుస్తున్నారు. వేరే వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి నేరగాళ్లు నగదును ముందుగా ఈ బ్యాంక్ ఖాతా, యూపీఐ యాప్‌లకు బదిలీ చేస్తారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే బాధితుడినే నేరగాడిగా మార్చేస్తున్నారు. సామాన్య ప్రజల పేరునే ఎక్కువగా బ్యాంకు ఖాతాలు తెరిచి నగదును ఆయా ఖాతాలకు నేరగాళ్లు బదిలీ చేస్తున్నారు. ఏదైనా ఫిర్యాదు రాగానే దాని ఆధారంగా ఆయా బ్యాంక్ ఖాతాను వెతుక్కుంటూ వెళ్లిన పోలీసులకు ముందుగా స్మార్ట్ ఫోన్ సరిగ్గా వాడటం తెలియని వ్యక్తులే తారసపడుతున్నారు. రీడిమ్ పాయింట్లు ఎరగా చూపి.. సర్వే పేరుతో నేరగాళ్లు పలు రకాల ప్రశ్నలు వేసిన అనంతరం.. సర్వేలో చురుగ్గా పాల్గొన్న మీకు కొన్ని ఎస్బీఐ రీడిమ్ పాయింట్లు ఇచ్చామని, తాము పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో మీ వివరాలు నింపాలని సూచిస్తారు. ఫామ్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగా బ్యాంక్ ఖాతాలోని నగదును మొత్తం ఖాళీ చేస్తున్నారు. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదంటూ.. ఓటర్ కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని, వచ్చే ఎన్నికల్లో మీరు ఓటు హక్కును వినియోగించుకోలేరని ఫోన్ ద్వారా ప్రజలను నేరగాళ్లు ఆందోళనకు గురి చేస్తారు. ఎన్నికల సంఘం నుంచి మాట్లాడుతున్నామని నమ్మిస్తారు. వివరాలు చెప్తే సరి చేస్తామని, ఎనేబుల్డ్ అయిన కొత్త ఓటరు కార్డుతో నిర్భయంగా ఓటు వేయవచ్చని భరోసా ఇస్తారు. వాట్సాప్‌కు పంపే లింక్ క్లిక్ చేసి గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయాలని సూచిస్తారు. పాన్, ఆధార్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఖాతా వివరాలు సేకరించి ఖాతాలోని నగదును లూటీ చేస్తారు. అప్రమత్తంగా ఉండండి ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఫోన్లు రావని ప్రజలు గ్రహించాలి. ఓటరు కార్డు ఆన్లైన్లో నమోదు కాలేదని వచ్చే ఫోన్లకు స్పందించవద్దు. సర్వే పేరుతోరాజకీయ పార్టీలు రికార్డింగ్ కాల్స్ మాత్రమే చేస్తున్నాయి. అవతలి వ్యక్తి మాట్లాడే సర్వేలకు స్పందించాల్సిన అవసరం లేదు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు చెప్పొద్దు.గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే గూగుల్ ఫామ్‌లో వివరాలు నమోదు చేయొద్దు. రానున్న రోజుల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరిగే అవకా>శం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండండి. – ఎస్డీ తేజేశ్వరరావు, ఏసీపీ, సైబర్ క్రైం, విజయవాడ -
‘చక్షు’కు చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: ‘‘హలో.. మీకు లక్కీ లాటరీలో రూ.50 లక్షలు వచ్చాయి.. ఈ మొత్తాన్ని పొందాలంటే మేం చెప్పే బ్యాంకు అకౌంట్ నంబర్‌కు రూ.లక్ష పంపండి.. మిగిలిన మొత్తం మీ సొంతం అవుతుంది..’’ ‘మీ వాట్సప్ నంబర్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేయండి.. సర్ఫ్రైజ్ గిఫ్ట్ పొందండి..’’ ‘‘హలో.. బ్యాంకు మేనేజర్‌ను మాట్లాడుతున్నాను.. మీ కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. లేదంటే మీ క్రెడిట్‌కార్డు, డెబిట్‌కార్డు బ్లాక్ అయిపోతాయి. మేం అడిగే వివరాలు చెప్పండి..’’ రోజుకో కొత్త తరహా సైబర్ మోసం...సైబర్ నేరగాళ్ల ఎత్తు ఏదైనా.. మూలం మాత్రం మన ఫోన్‌కు వచ్చే కాల్స్.. లేదంటే ఎస్ఎంఎస్లు. సైబర్ నేరగాళ్లు వివిధ ఫోన్ నంబర్ల నుంచి ఫోన్‌కాల్స్, ఎస్ఎంఎస్లు పంపి ఆర్థిక మోసాలకు పాల్పడటం ఇటీవల విపరీతంగా పెరిగింది. ఇలా ఫోన్ నంబర్లను ఉపయోగించి చేస్తున్న మోసాలను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘చక్షు’అ్రస్తాన్ని అందుబాటులోకి తెచ్చింది. మోసపూరిత ఫోన్ నంబర్ల వివరాలు ఈ వెబ్ పోర్టల్‌లో నమోదు చేస్తే.. మోసగాళ్ల పనిపడతాయి దర్యాప్తు సంస్థలు. బ్యాంకులకు సైతం ఈ అనుమానాస్పద ఫోన్ నంబర్లు పంపుతారు. ఇలా చేయడం వల్ల సైబర్ నేరగాళ్లు సదరు నంబర్‌తో తెరిచిన బ్యాంకు ఖాతాలను జప్తు చేయడంతోపాటు మరొకరు మోసానికి గురికాకుండా కాపాడతారు. సాధారణ పౌరులు సైతం సైబర్ మోసగాళ్ల సమాచారాన్ని, మోసపూరిత ఫోన్ నంబర్ల సమాచారాన్ని చక్షు పోర్టల్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తేవచ్చు. ఏమిటీ చక్షు పోర్టల్? చక్షు అంటే కన్ను అని అర్థం.. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అందిస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు పేరిట ‘రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్’కొత్త సేవా పోర్టల్‌ను కేంద్ర కమ్యూనికేషన్స్, ఎల్రక్టానిక్స్ అండ్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ప్రారంభించారు. అనుమానిత మోసపూరిత కాల్లు, సందేశాలు వివరాలు ఇందులో నమోదు చేయవచ్చు. చక్షు పోర్టల్ ఎలా వినియోగించాలి.. ♦ https://sancharsaathi.gov.in లింక్ ద్వారా సంచార్ సాథి పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. ♦ సిటిజన్ సెంట్రిక్ సర్విసెస్‌లో చక్షు ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ♦ మోసపూరిత కమ్యూనికేషన్‌కు సంబంధించిన వివరాలు, ఆ కాల్ లేదా మెసేజ్ వచ్చిన సమయం, ఇతర వివరాలు నమోదు చేయాలి. ♦ ఫిర్యాదు నమోదైన తర్వాత వెరిఫికేషన్ కోసం ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదైన ఫిర్యాదు దర్యాప్తు సంస్థలకు వెళుతుంది. ఏయే అంశాలపై ఫిర్యాదు చేయవచ్చు ♦అనధికారిక కనెక్షన్లు, మనకు వచ్చిన మోసపూరిత నంబర్లు సదరు వ్యక్తులపై ఉన్నాయా లేదా తనిఖీ చేయించవచ్చు. ♦ మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, ట్రాక్ చేయడం చేయవచ్చు. ♦ అనుమానాస్పద విదేశీ నంబర్లపై ఫిర్యాదు చేయవచ్చు. -
ప్రేమికులూ జరభద్రం!
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రేమికులపై ఫోకస్ పెట్టారు. వాలెంటైన్స్ డే దగ్గర పడుతుండడంతో డిస్కౌంట్లు, ఆఫర్లు, సర్ఫ్రైజ్ గిఫ్ట్ లు, గిఫ్ట్ కూపన్లు అంటూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. ఏటా ఈ తరహా మోసాలు షరామామూలే అయినా.. ఎప్పటికప్పుడు సైబర్ నేరగాళ్ల బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉందని సైబర్ భద్రత నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసాలకు తెరతీ స్తున్నారు. మీకు అత్యంత సన్నిహితులు వాలెంటైన్స్ డే సందర్భంగా మీకు సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపారు.. దాన్ని పొందాలంటే మేం చెప్పిన ఖాతాకు కస్టమ్స్ చార్జి కోసం కొంత మొత్తం పంపండి అంటూ వల వేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. ప్రధానంగా చేస్తున్న మోసాలు చూస్తే.. షాపింగ్ ఫ్రాడ్స్..: ఆన్లైన్ షాపింగ్, బెస్ట్ ఆఫర్స్, గిఫ్ట్‌లు, డిన్నర్లు అంటూ సోషల్‌మీడియా ఖాతాల్లో మోసపూరిత యాడ్స్ ఇస్తు న్నారు. ఈ ఆఫర్ల కోసం సంప్రదించే వారి నుంచి వ్యక్తిగత, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని మోసం చేస్తున్నారు. ఫిషింగ్ ఈమెయిల్స్.. సైబర్ నేరగాళ్లు వాలెంటైన్స్ డేకు సంబంధించి ప్రత్యేక కొటేషన్లు, మెసేజ్‌లు, ఎమోజీలు, గ్రాఫిక్ వీడియోలు అంటూ ఫిషింగ్ లింక్‌లను ఈమెయిల్స్‌కు పంపుతున్నారు. వీటిపై క్లిక్ చేసిన వెంటనే మన మొబైల్, ల్యాప్‌టాప్‌లోకి మాల్వేర్ వచ్చేలా చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ఈ విషయాలు మరవొద్దు..: ► ఆన్లైన్లో వాలెంటైన్స్ డే గిప్ట్‌లు కొనాలంటే నమ్మదగిన ఈ కామర్స్ వెబ్సైట్లనే ఉపయోగించాలి. కొత్త యాప్స్ వినియోగించాల్సి వస్తే వాటి రేటింగ్ తప్పక చూసుకోవాలి. వాలెంటైన్స్ డే ప్యాకేజీలు, గిఫ్ట్‌ల పేరిట నమ్మశక్యం కాని ఆఫర్లు ఉంటే అది సైబర్ మోసగాళ్ల అనుమానాస్పద ప్రకటనగా గుర్తించాలి. ►అనుమానాస్పద మెసేజ్‌లు,ఈ మెయిల్స్‌లోని లింక్‌లపై క్లిక్ చేయవద్దు. మీ వ్యక్తిగత, బ్యాంకు ఖాతా నంబర్లు, క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు, పిన్ నంబర్లు, సీవీవీ నంబర్లు ఎవరితోనూ పంచుకోవద్దు. -
హైటెక్ మోసాల ఆటకట్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నిందితుడి వద్ద శిక్షణ తీసుకొని, ఆపై సొంతంగా నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి తెలంగాణ సహా దేశవ్యాప్తంగా మోసాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ సైబర్ ముఠా గుట్టురట్టయింది. డేటా ఎంట్రీ జాబ్స్ పేరిట నిరుద్యోగులకు వల వేసి.. ఆపై కంపెనీ షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగల్ నోటీసులు పంపించి బాధితుల నుంచి సొమ్ము వసూలు చేసిందీ గ్యాంగ్. తెలంగాణ, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హరియాణా, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి 25కుపైగా రాష్ట్రాలలో 358 సైబర్ కేసులున్న ఈ ముఠా.. ఇప్పటివరకు సుమారు రూ.100 కోట్లకు పైగానే సొమ్ము వసూలు చేసినట్లు సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ శిల్పవల్లి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. టెలీ కాలర్గా పని చేసి.. గుజరాత్‌లోని సూరత్‌లో నకిలీ డేటా ఎంట్రీ కంపెనీలో దిండోలి ప్రాంతానికి చెందిన రాహుల్ అశోక్ భాయ్ భాస్కర్ టెలీ కాలర్గా పని చేశాడు. ఓ సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానిక పోలీసులు కంపెనీ యజమాని నితీష్ ను అరెస్టు చేసి, కాల్ సెంటర్‌ను మూసేశారు. కాల్ సెంటర్, డేటా ఎంట్రీ కార్యకలాపాలపై పట్టు సాధించిన రాహుల్.. తన స్నేహితులైన సాగర్ పాటిల్, కల్పేష్ థోరట్, నీలేష్ పాటిల్‌లను సంప్రదించి సైబర్ మోసాల గురించి వివరించాడు. ఈ నలుగురూ కలిసి సూరత్‌లో ఫ్లోరా సొల్యూషన్ పేరుతో నకిలీ కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్ పోర్టల్స్ నుంచి నిరుద్యోగుల డేటాను సేకరించి, వారికి వాట్సాప్ ద్వారా డేటా ఎంట్రీ జాబ్ సందేశాలను పంపించేవారు. ఆసక్తి కనబరిచిన వారికి జాబ్ లాగిన్ కోసం ఐడీ, పాస్వర్డ్ అందించేవారు. నకిలీ లీగల్ నోటీసులతో బెదిరింపులు.. డేటా ఎంట్రీ పని పూర్తయ్యాక ఉద్యోగికి సొమ్ము చెల్లించకుండా కంపెనీ ప్రమాణాలకు తగిన స్థాయిలో డేటా ఎంట్రీ లేదని మాయమాటలు చెబుతూ సొమ్ము చెల్లించరు. దీంతో కొంతకాలం ఎదురుచూసిన ఉద్యోగికి డేటా ఎంట్రీ చేయడం మానేస్తాడు. అప్పుడే నిందితులు రంగంలోకి దిగుతారు. కంపెనీ నిబంధనలు, షరతులను ఉల్లంఘించారని పేర్కొంటూ నకిలీ లీగర్ నోటీసులను బాధితులకు వాట్సాప్, ఈ–మెయిల్ ద్వారా పంపించి బెదిరింపులకు తెగిస్తారు. నోటీసులు రద్దు చేసుకోవాలంటే చార్జీలను చెల్లించాల్సి ఉంటుందని చెబుతారు. ఈక్రమంలో సైబరాబాద్‌కు చెందిన ఓ బాధితుడు వీరి వలలో చిక్కి రూ.6.17 లక్షలు మోసపోయాడు. ఇప్పటికే ఈ ముఠాపై సైబరాబాద్‌లో 11 కేసులున్నాయి. వేలాది బ్యాంకు ఖాతాల విశ్లేషణ.. బాధితులు పంపించిన సొమ్ము ఏ బ్యాంకు ఖాతాలు నుంచి ఎక్కడికి బదిలీ అయ్యాయో విశ్లేíÙంచారు. ఇతరత్రా సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులు రాహుల్, సాగర్, కల్పేష్, నీలేష్లు సూరత్‌లో ఉన్నట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం వారిని అరెస్టు చేసి, స్థానిక న్యాయస్థానంలో హాజరుపరిచారు. ట్రాన్సిట్ వారంట్ నగరానికి తీసుకొచ్చి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి ఆరు ఫోన్లు, ల్యాప్‌టాప్, 5 డెబిట్ కార్డులను స్వాదీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు సోమవారం కస్టడీకి పిటీషన్ దాఖలు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు. -
AP: సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్ల కన్ను
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలపై సైబర్ నేరగాళ్లు కన్ను పడింది. అమ్మ ఒడి, చేయూత, జగన్నన విద్యా దీవెన, వైఎస్సార్ కాపు నేస్తం, వాహన మిత్ర లాంటి పథకాలు వస్తున్నాయా అంటూ ఫోన్ కాల్స్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు.. ఏదైనా పథకం రాక పోతే వెంటనే డబ్బులు ఖాతాలో వేస్తామంటూ కేటుగాళ్లు లింక్ పంపిస్తున్నారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ కేంద్రంగా రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఫోన్ చేసి అమాయకుల్ని నిండా ముంచేస్తున్నారు. ఇలాంటి లాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దని, అప్రమత్తంగా ఉండాలని విశాఖ పోలీసులు తెలిపారు. -
డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని బెదిరించి రూ.16 లక్షల సైబర్ మోసం
-
పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ పై సైబర్ నేరగాళ్ల కన్ను
-
TS: వాహనదారులకు హెచ్చరిక.. ఆ వెబ్సైట్లో చలాన్లు కడితే ఇక అంతే..
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ చలాన్లను క్లియర్ చేయటానికి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల భారీ రాయితీ ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న సైబర్ మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఫేక్ వెబ్సైట్ క్రియేట్ చేసిన సైబర్ క్రిమినల్స్.. వావాహనదారులను మోసం చేస్తున్నారు. www.echallantspolice.in పేరుతో ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. ఈ సైట్లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్సైట్లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు వెల్లడించారు. పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ప్రకటించిన రాయితీ ఆఫర్‌కు వాహనదారుల నుంచి భారీ స్పందన వస్తోంది. ఈనెల 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగనుంది. చలాన్ల క్లియరెన్స్‌పై కన్నేసిన సైబర్ నేరగాళ్లు.. నకిలీ వెబ్సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తూ వాహనదారుల జేబులు కొల్లగొడుతున్నారు. నకిలీ వెబ్ సైట్లను గుర్తించిన అధికారులు సోషల్ మీడియా ద్వారా వాహనదారులను అప్రమత్తం చేశారు. నకిలీ వెబ్ సైట్లలోకి వెళ్లి డబ్బులు చెల్లించ వద్దని హెచ్చరించారు. నకిలీ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్లని గుర్తించే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు పడ్డారు. ఇదీ చదవండి: ఈ నెల 5 నుంచి టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు సమ్మె -
మీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్!
సాక్షి, హైదరాబాద్: క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. సర్ఫ్రైజ్ గిప్్టలని, పండగ ఆఫర్లు అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా మీకు ఉచిత బహుమతులు వచ్చాయంటూ వచ్చే మెసేజ్‌లను, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దని తెలంగాణ సైబర్ బ్యూరో అధికారులు హెచ్చరించారు. అదేవిధంగా నూతన సంవత్సరం పేరిట దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోన్లు, ఇతర గృహోపకరణాలపై భారీ ఆఫర్లు ఉన్నాయంటూ వచ్చే ఎస్సెమ్మెస్లలోని లింక్‌లపై క్లిక్ చేయవద్దని వారు సూచిస్తున్నారు. ఇలాంటి లింక్‌లలో సైబర్ నేరగాళ్లు ఫోన్, ల్యాప్లాప్లలోకి వైరస్‌ను చొప్పించే ప్రమాదం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరించారు. ఎలాంటి కొనుగోళ్లు చేయకుండా కూపన్లు, గిఫ్ట్‌లు రావన్న విషయాన్ని గుర్తించాలని, ఇలా మన బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీలు తీసుకుని అకౌంట్లోని డబ్బులు కొల్లగొట్టే ప్రమాదం ఉందని తెలిపారు. అనుమానాస్పద లింక్‌లు, ఎస్సెమ్మెస్‌లపై 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని లేదా cybercrime.gov.in లోనూ సమాచారం ఇవ్వాలని సూచించారు. -
ఉద్యోగం ఎర వేస్తారు...క్లిక్ చేస్తే ఊడ్చేస్తారు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవసరాలను బలహీనతగా చేసుకుని కొంతమంది సైబర్‌నేరాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో ఆకర్షణీ యమైన వేతనం, తక్కువ శ్రమ అంటూ ఇంటర్నె ట్లో ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ నోటిఫికే షన్లు ఒకటి. ఆన్లైన్ జాబ్స్ పేరిట ఇచ్చే ఉద్యోగ ప్రకటనలతో ఎంతోమందిని ఆకర్షించి వారి నుంచి తెలివిగా డబ్బులు గుంజడం, ఆపై కనిపించకుండా తప్పుకోవడం ఇటీవల సాధారణమైపోయింది. అటువంటి ఊదరగొట్టే ఉద్యోగ ప్రకటనల వెనుక మోసం దాగి ఉన్నట్లు గ్రహించాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. భారీగా ఆదాయం అంటూ ప్రకటనలు ఇస్తున్నారంటే దాని వెనుక సైబర్ నేరగాళ్లు మన వ్యక్తి గత, బ్యాంకు సమాచారం కోసం మాటు వేసి ఉన్నారని పసిగట్టాలని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నా రు. ఎక్కువగా ఉద్యోగావకాశాల కోసం, ఆన్లైన్ జాబ్స్ కోసం ఇంటర్నెట్లో వెదికేవారిని సైతం సైబ ర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసు కుంటున్నట్లు సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఉద్యోగం పేరిట మెయిల్స్ లేదా మొబైల్స్‌కు లింక్స్ పంపిస్తా రని, వాటిని ఏమాత్రం క్లిక్ చేసినా మన సమాచార మంతా వారు తెలుసుకుని అకౌంట్లలోని డబ్బుల్ని ఊడ్చేస్తారని చెబుతున్నారు. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండటం పెద్ద కష్టమేమీ కాదని వారు సూచిస్తున్నారు. ఇవీ సూచనలు.. ► ఆన్లైన్ జాబ్ ఆఫర్లో మనం చేసే పనికి సాధారణం కంటే ఎక్కువ లబ్ధి వచ్చేలా, అత్యధిక సంపాదన ఉండేలా సమాచారం ఉంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్ ఉద్యోగాల పేరిట వచ్చే ఈమెయిల్స్‌లో అక్షర దోషాలు ఉన్నా, ఎలాంటి ఫోన్ నంబర్లు లేకుండా ఉన్నా కచ్చితంగా అది మోసపూరితమైన లింక్ అని పసిగట్టాలి. ► ఆన్లైన్ ఇంటర్వ్యూలు చేస్తామంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దు. ► ఆన్లైన్ జాబ్ ఇవ్వాలంటే వ్యక్తిగత సమాచారంతోపాటు పాన్, ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు షేర్ చేయాలని కోరుతున్నారంటే అది మోసమని గ్రహించాలి. ► ఆన్లైన్లో జాబ్ ఇస్తామని ప్రకటనల రూపంలో వచ్చే వెబ్‌లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దు. -
ఓటీపీలతో రూ.6.90 లక్షలకు కుచ్చుటోపీ
పెద్దదోర్నాల: ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం మీ అకౌంట్లోకి జమ చేస్తామని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్లోని నగదు మొత్తాన్ని కాజేసిన ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండల పరిధిలోని ఐనముక్కలలో ఆదివారం వెలుగు చూసింది. ఈ ఘరానా మోసంలో గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు నగదు పోగొట్టుకున్నారు. ఎస్సై అంకమరావు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన గ్రామానికి చెందిన చిట్యాల ఆంజనేయరెడ్డి అనే యువకుడికి గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నగదు మొత్తం ఒక్కసారే అకౌంట్లో పడుతుందని, ఫోన్ పే ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మాట్లాడాలని సూచించాడు. తొలుత అకౌంట్ నుంచి కొంత మొత్తం కట్ అయి తిరిగి పడుతుందని మోసగాళ్లు నమ్మబలికారు. తనది ఆండ్రాయిడ్ ఫోన్ కాకపోవడంతో ఆ యువకుడు గ్రామానికి చెందిన లింగాల శ్రీను నంబర్ నుంచి గుర్తు తెలియని నంబర్‌కు కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడాడు. అయితే.. శ్రీను అకౌంట్లో అమౌంట్ తక్కువగా ఉందని చెప్పడంతో శ్రీను తమ్ముడు లింగాల రమేష్ నంబర్ నుంచి ఫోన్‌చేసి కాన్ఫరెన్స్ కాల్ కలిపి ముగ్గురూ సైబర్ నేరగాళ్లతో మాట్లాడారు. అతని మాటలు నమ్మిన రమేష్ తన ఫోన్‌కు వచ్చిన ఓటీపీ నంబర్లతో పాటు ఫోన్‌పేకు సంబంధించిన పాస్‌వర్డ్‌ను చెప్పటంతో లింగాల రమేష్ అకౌంట్లోని రూ.6.90 లక్షల నగదు మాయమైంది. అయితే.. మాయమైన డబ్బు నుంచి రూ.79 వేల నగదు తిరిగి బాధితుడి అకౌంట్‌కు జమ అయినట్లు ఎస్సై తెలిపారు. తమకు వచ్చిన ఫోన్ నంబర్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అది స్విచ్చాఫ్ వస్తుండటంతో తాము మోసపోయినట్టు సోదరులు గ్రహించారు. హుటాహుటిన పోలీస్ స్టేషన్‌తో పాటు స్థానిక బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితులకు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి ఫోన్లు వచ్చాయని, ఏ రాష్ట్రానికి ఫోన్ చేయాలనుకుంటే అదే భాషలతో మాట్లాడే వాళ్లతో ఫోను చేయిస్తారని, డబ్బులు వస్తాయని నమ్మకంగా ఆశ చూపి అకౌంట్లలోని డబ్బులు మాయం చేస్తారని ఎస్సై తెలిపారు. గుర్తు తెలియని నంబర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. -
అంతర్రాష్ట్ర ‘సైబర్’ ముఠా గుట్టురట్టు
అనంతపురం క్రైం: అమాయక ప్రజల కష్టార్జితాన్ని కమీషన్ల పేరుతో కాజేసే అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేసిన అనంతపురం పోలీసులు ఐదుగురు సైబర్ నేరగాళ్లను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ ముఠా 16 ఫేక్ అకౌంట్ల ద్వారా ఏపీలో రూ.35.59 కోట్ల లావాదేవీలు జరిపినట్లు తేల్చి.. రూ.14.72 లక్షలను ఫ్రీజ్ చేయించారు. ఈ 16 ఫేక్ అకౌంట్ల నుంచి మరో 172 ఫేక్ అకౌంట్లలోకి సొమ్మును మళ్లించారు. ఇలా దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీలను అంచనా వేస్తే రూ. 350 కోట్లకు పైగానే కొల్లగొట్టినట్లు పోలీసుల అంచనా. జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ స్థానిక పోలీసు కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఇలా వెలుగులోకి.. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు అగ్రహారం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తనకు జరిగిన సైబర్ మోసంపై జిల్లా పోలీసు కార్యాలయం స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గార్లదిన్నె పోలీసు స్టేషన్లో ఈ నెల 15న కేసు నమోదయ్యింది. దీంతో తీగలాగితే డొంక కదిలింది. ఐదుగురు అరెస్టు .. ఈ కేసును సవాలుగా తీసుకున్న జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాలతో ప్రత్యేక పోలీసు బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ఈ క్రమంలో నిందితులకు సంబంధించిన కొన్ని ఆధారాలు లభించాయి. ఉత్తర భారత దేశానికి చెందిన కింగ్ పిన్ను కీలక సూత్రధారిగా గుర్తించిన అనంత పోలీసులు.. కింగ్ పిన్ ముఠాలో పనిచేస్తున్న తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన మహ్మద్ సమ్మద్, వెంకటగిరికి చెందిన వెంకటాచలం, తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన సందీప్, ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అజయ్‌రెడ్డి, అనంతపురానికి చెందిన సంధ్యారాణిని అరెస్టు చేశారు. కింగ్ పిన్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. కాగా ప్రస్తుతం అరెస్టయిన ముఠా సభ్యులకు కింగ్‌పిన్ నుంచి కమీషన్ రూపంలో రూ.20 లక్షలకు పైగా అందడం గమనార్హం. వివిధ రూపాల్లో మోసాలు.. యూట్యూబ్ యాడ్స్ సబ్ స్క్రైబ్, రేటింగ్‌లకు అధిక కమీషన్లు, ఆన్లైన్ గేమింగ్, ఓటీపీ, పార్ట్ టైం జాబ్స్ ఇలా రకరకాల పేర్లతో సైబర్ నేరగాళ్లు మోసాలకు తెగబడ్డారు. వీరిపై దేశవ్యాప్తంగా నేషనల్ క్రైం రికార్డు బ్యూరో (ఎన్సీఆర్బీ) పోర్టల్‌లో 1,550 ఫిర్యాదులు నమోదయ్యాయి. రూ.350 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా దోపిడీ చేసిన సొమ్మును దుబాయ్‌లో డ్రా చేస్తున్నట్లు తేల్చారు. అప్రమత్తంగా ఉండాలి.. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిరుద్యోగ యువతను కొన్ని సైబర్ ముఠాలు లక్ష్యంగా చేసుకున్నాయి. అనవసరమైన లింకులు, వాట్సాప్ కాల్స్, మెసేజీలకు స్పందించొద్దు. ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 సైబర్ పోర్టల్, స్థానిక పోలీసు స్టేషన్లో సమాచారం ఇవ్వాలి. – కేకేఎన్ అన్బురాజన్, జిల్లా ఎస్పీ, అనంతపురం -
ఆ 10 జిల్లాల్లో సైబర్ దొంగలు
సాక్షి, హైదరాబాద్: అవి నాలుగు రాష్ట్రాల్లోని పది జిల్లాలు.. అమాయకులకు గాలం వేస్తూ దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లకు అడ్డాలు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న సైబర్ నేరాల్లో 80శాతానికిపైగా ఆ పది జిల్లాల్లో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న నేరగాళ్లు చేస్తున్నవే. ఢిల్లీ, రాజస్తాన్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ జిల్లాలు ఉన్నాయి. కేటుగాళ్లు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి త్వరగా వెళ్లేపోయే వీలున్న జిల్లాల్లో అడ్డా వేసి, సైబర్ క్రైం పోలీసులకు చిక్కకుండా మోసాలకు పాల్పడుతున్నారు. అడపాదడపా తెలంగాణ పోలీసులు మినహా మిగతా రాష్ట్రాల పోలీసులు ఈ సైబర్ దొంగలను పట్టుకోలేకపోతున్నారు. ఎక్కువగా సైబర్ నేరగాళ్లు ఏ రాష్ట్రాల్లో, ఏ జిల్లాల్లో ఉంటున్నారన్న అంశంపై ‘ఫ్యూచర్ క్రైం రీసెర్చ్ ఫౌండేషన్ (ఎఫ్‌సీఆర్‌ఎఫ్)’ఇటీవల విడుదల చేసిన తమ అధ్యయన నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. సైబర్ నేరగాళ్లకు కొత్త అడ్డాలుగా మారుతున్న ప్రాంతాల వివరాలనూ పేర్కొంది. ఆ పది జిల్లాలే ఎందుకు? సైబర్ నేరగాళ్లు ఆ పది జిల్లాల్లోనే ఎందుకు ఎక్కువగా ఉంటున్నారన్న దాని వెనుక కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఈ పది జిల్లాలు ఆయా రాష్ట్రాల్లోని కీలక పట్టణాలకు సమీపంలో ఉండటం, సైబర్ సెక్యూరిటీ పరంగా అంతగా అభివృద్ధి చెందకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనేవారు ఎక్కువగా ఉండటం వంటివి సైబర్ మోసగాళ్ల ముఠాలకు కలసి వస్తున్నాయని నివేదిక తేల్చింది. ఆయా జిల్లాల్లో సరైన ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానికుల సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ ఈ ఉచ్చులోకి సులభంగా దింపుతున్నాయని పేర్కొంది. ఈ పది జిల్లాల్లో చాలా వరకు దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోనివే. స్థానికంగా పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లను గుర్తించలేకపోవడం, అవసరమైతే అప్పటికప్పుడు రాష్ట్రాలు మార్చేయడంతో పట్టుబడటం కష్టంగా మారుతోంది. కొత్తగా సైబర్ క్రైం హాట్స్పాట్లుగా మారుతున్న ప్రాంతాలివీ.. అస్సాం (బార్పేట, ధుబ్రి, గోల్పర, మోరిగాన్, నగాన్), ఏపీ (చిత్తూర్), బిహార్ (బన్క, బెగుసరాయ్, జముయి, నలంద, పాటా్న, ససరామ్), ఢిల్లీ (అశోక్‌నగర్, ఉత్తమ్‌నగర్ వెస్ట్, న్యూఅశోక్‌నగర్, హర్కేష్ నగర్ ఓక్లా, ఆర్కే పురం, ఆజాద్పురా), గుజరాత్ (అహ్మదాబాద్, సూరత్), హరియాణా (బివాని, మనోత, హసన్‌పుర్, పల్వల్), జార్ఖండ్ (లటేహర్, ధన్‌బాద్, సంత్పాల్ పరగణా, హజారీబాగ్, కుంతి, నారాయణపూర్, రాంచీ), కర్ణాటక (బెంగళూరు), మధ్యప్రదేశ్ (గుణా), మహారాష్ట్ర (ఔరంగాబాద్, ముంబై), ఒడిశా (బాలాసోర్, ధేన్‌కనల్, జజ్‌పుర్, మయూర్భంజ్), పంజాబ్ (ఫజికా, మొహలి), రాజస్థాన్ (బిదర్కా, బర్మార్, జైపూర్), తమిళనాడు (చెన్నై, కోయంబత్తూర్), తెలంగాణ (హైదరాబాద్, మహబూబ్‌నగర్), త్రిపుర (ధలాయ్), ఉత్తరప్రదేశ్ (బులందర్‌షహర్, ఘాజియాబాద్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, సీతాపూర్, గౌతమబుద్ధ నగర్), పశ్చిమ బెంగాల్ (పుర్బ బర్దామన్, దుల్చండ్రియ, భద్రల్, దక్షిణ్ దినాజ్‌పుర్, బిర్భూమ్, బరున్పురా, కోల్‌కతా, మల్దా, బరంపూర్). ఏ రాష్ట్ర నేరగాళ్లు ఏ తరహా సైబర్ నేరాలు చేస్తున్నారు? రాజస్తాన్: సెక్స్టార్షన్ (సోషల్ ఇంజనీరింగ్ వ్యూ హాలతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ మార్ఫింగ్ చేసి మోసగించడం), ఓఎల్ఎక్స్లో ఆన్లైన్ మార్కెటింగ్ పేరిట మోసాలు, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్. జార్ఖండ్: ఓటీపీ స్కామ్‌లు (మోసపూరిత పద్ధతుల్లో ఓటీపీలు సేకరించి మోసాలు), కేవైసీ అప్డేషన్, విద్యుత్ బిల్లుల పేరిట, కౌన్ బనేగా కరోడ్‌పతి పేరిట మోసాలు. ఢిల్లీ: ఆన్లైన్ లోన్‌యాప్‌ల పేరిట వేధింపులు, ఆన్లైన్ గిఫ్ట్ పేరిట మోసాలు, మ్యాట్రిమోనియల్ మోసాలు, విద్యుత్ బిల్లులు, జాబ్, ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలు. ఉత్తరప్రదేశ్: ఫేక్ లింకులు (ఫిషింగ్), ఓటీపీ మోసాలు, సోషల్ ఇంజనీరింగ్ స్కామ్‌లు, డెబిట్, క్రెడిట్ కార్డుల పేరిట మోసాలు. -
ఫ్రీజ్ చేసిన అకౌంట్లలో రూ.100 కోట్లు
గచ్చిబౌలి : రాష్ట్రవాప్తంగా సైబర్ క్రైం పై వచ్చిన ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్లు ఉన్నాయని, వాటిని త్వరలోనే బాధితులకు అందజేస్తామని సైబర్ క్రైం బ్యూరో ఎస్పీ విశ్వజిత్ కంభంపాటి తెలిపారు. శుక్రవారం సైబరాబాద్ కమిషనరేట్‌లో సైబర్‌క్రైం బాధితులకు రికవరీ నగదును సీపీ స్టీఫెన్ రవీంద్ర చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ విశ్వజిత్ మాట్లాడుతూ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. త్వరగా ఫిర్యాదు చేస్తే ఆ నగదు వెళ్లిన అకౌంట్‌ను బ్లాక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామన్నారు. ఆలస్యమైతే నగదు చేతులు మారే అవకాశం ఉందన్నారు. దీంతో బాధితులు నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును తీసుకున్నప్పుడు ఆలస్యం అయితే క్రిప్టో కరెన్సీకి మళ్లించే అవకాశం ఉందన్నారు. అలా చేసిన తరువాత రికవరీ చేసే వీలుండదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైం ఫిర్యాదులతో ఫ్రీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో రూ.100 కోట్ల నగదు ఉందని, అన్ని జిల్లాల పోలీసు అధికారులకు సమాచారం అందించామని, త్వరలోనే బాధితులకు అందజేయనున్నట్లు తెలిపారు. డబ్బులు ఇస్తామని ఎరవేసి పాస్ బుక్, డెబిట్ కార్డు, లింక్ చేసిన ఫోన్ నెంబర్ తీసుకుని వేరే అకౌంట్లు తెరచి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, అలా సహకరించిన వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. సైబరాబాద్ డీసీపీ క్రైమ్స్ కల్మేశ్వర్ సింగన్వార్ మాట్లాడుతూ పెట్టుబడి పేరిట మోసాలకు పాల్పడిన కేసులే ఎక్కువగా ఉన్నాయన్నారు. ఆన్లైన్ వెబ్‌సైట్స్, మెసెంజర్, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దని సూచించారు. ఇన్వెస్ట్మెంట్ పేరిట మొదట అదనంగా కొంత కలిపి ఇచ్చి నమ్మకం కలిగిస్తారని తెలిపారు. ఎక్కువ మొత్తంలో డబ్బు ట్రాన్స్ఫర్ చేయగానే కంటాక్ట్‌లో లేకుండా పోతారని వివరించారు. సైబర్ నేరాలపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మూడు, నాలుగు నెలలు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినట్లు తెలిపారు. 44 కేసుల్లో రూ.2,23,89,575 రికవరీ చేసి బాధితులకు అందజేశామన్నారు. 1930 కాల్ సెంటర్ కేవలం ఫిర్యాదును మాత్రమే స్వీకరిస్తారని ఆ తర్వా కేసు ఏ పోలీస్ స్టేషన్‌కు కేటాయిస్తారో మెసేజ్ వస్తుందన్నారు. కేసు స్టేటస్‌ను ఆయా పోలీస్ స్టేషన్లలోనే అడగాలని సూచించారు. కార్యక్రమంలో సైబర్ క్రైం డీసీపీ రితిరాజ్, ఏసీపీ, సీఐలు పాల్గొన్నారు. డ్రగ్స్ పేరిట బ్లాక్ మెయిల్ మీరు తైవాన్‌కు పంపుతున్న ఫెడెక్స్ ఫార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయి. ఫోన్ నెంబర్, ఆధార్‌కార్డు వివరాలతో మీ కు ఫోన్ చేశాం. మేము సీబీఐ అధికారులం మీ పై కేసు నమోదవుతుందని ఓ మహిళను బెదిరించి రూ.10.96 లక్షలు కాజేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సదరు అకౌంట్‌ను ఫ్రీజ్ చేసిన పోలీసులు మొత్తం నగదును రికవరీ చేసి బాధితురాలికి అందజేశారు. పెట్టుబడి పేరిట మోసం గాజుల రామారం ప్రాంతానికి చెందిన యువకుడు మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. మెసేంజర్‌లో ఇన్వెస్ట్మెంట్ ప్రకటనలు చూసిన అతను మొదట రూ.1000 పంపిస్తే వెంటనే రూ.1200 వచ్చాయి. రెండో సారి రూ.9,900 పంపిస్తే రూ.12600 పంపారు. అనుమానం వచ్చి యువకుడు స్పందించకుంటే వీడియో కాల్స్ చేసి మరింత ఆశ చూపడంతో అప్పు చేసి రూ.2.92,600 పంపాడు. వెంటనే అటువైపు నుంచి ఎలాంటి స్పందనలేకపోవడం మోసపోయినట్లు గుర్తించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు రూ.1,50,000 రికవరీ చేసి అతడికి అందజేశారు. -
100 ఖాతాలు.. రూ.400 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో ఉంటూ ఇక్కడ పార్ట్‌టైమ్ జాబ్స్ పేరుతో ఎరవేసి ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్స్‌తో బాధితులను నిండా ముంచుతున్న సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న ముంబై వాసిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ–క్రిమినల్స్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్‌ను పర్యవేక్షిస్తున్న ఇతను ప్రతి లావాదేవీకి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నాడని, బ్యాంకు ఖాతాల్లో పడిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీగా మారుస్తూ విదేశాలకు తరలిస్తున్నాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. వ్యాపారం సాగక అడ్డదారి.. ముంబైకి చెందిన రోనక్ భరత్ కుమార్ కక్కడ్ వృత్తిరీత్యా డిజిటల్ మార్కెటింగ్ నిర్వాహకుడు. వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రకటనలు తయారు చేయడం, వీటిని సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేయడం చేస్తుండేవాడు. ఈ వ్యాపారం కోసం రొలైట్ మార్కెట్, బ్లాక్ వే డిజిటల్ పేర్లతో రెండు కంపెనీలు ఏర్పాటు చేశాడు. వీటి పేర్లతో కరెంట్ ఖాతాలు కూడా తెరిచాడు. కానీ వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఇందులో భాగంగా టెలిగ్రామ్ యాప్ ద్వారా వివిధ వ్యాపారాలు, స్కీమ్‌లు తదితరాలకు సంబంధించిన గ్రూప్‌లను సెర్చ్ చేశాడు. ఓ గ్రూపు ద్వారా తైవాన్‌కు చెందిన స్వాంగ్ లిన్, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఇరీన్ పరిచయమయ్యారు. 20% కమీషన్‌తో.. తొలుత భరత్‌ను సంప్రదించిన ఆ ఇద్దరూ తమకు ఇండియాలో కొన్ని వ్యాపారాలు ఉన్నాయని, అనేక మంది నిరుద్యోగులకు తాము పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఇప్పిస్తామని, వారి నుంచి అడ్వాన్సులు తీసుకుంటామని చెప్పారు. వాటికి సంబంధించిన నగదు భారీగా జమ చేయడానికి బ్యాంకు ఖాతాలు కావాలని అడిగారు. అయితే ఈ ఖాతాలను వినియోగించి సైబర్ నేరాలు చేస్తారన్న విషయం తెలిసిన భరత్.. అదే అంశం వారితో చెప్పి బేరసారాలు చేశాడు. ప్రతి లావాదేవీపైనా 20 శాతం కమీషన్ తీసుకుని సహకరించేందుకు అంగీకరించాడు. భరత్ తన రెండు ఖాతాలతో పాటు దుబాయ్‌లో ఉండే స్నేహితుడు ప్రశాంత్‌ను సంప్రదించి అక్కడి భారతీయులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలతో పాటు ఇక్కడ ఉండే వారి బంధువులవీ సేకరించాడు. ప్రశాంత్ దుబాయ్‌లోని తన కార్యాలయం ద్వారా పన్నులు లేకుండా నగదును దుబాయ్ కరెన్సీగా మార్చే వ్యాపారం చేస్తున్నాడు. క్రిప్టో కరెన్సీగా మార్చి.. దుబాయ్, భారత్‌లో ఉన్న పలువురికి చెందిన 100 బ్యాంకు ఖాతాల వివరాలు ప్రశాంత్ నుంచి భరత్‌కు, అతన్నుంచి విదేశాల్లో ఉన్న స్వాంగ్ లిన్, ఇరీన్‌కు చేరాయి. వీరు తమ వలలో పడిన వారికి ఈ ఖాతాల నంబర్లనే ఇచ్చి డబ్బు డిపాజిట్/ట్రాన్స్ఫర్ చేయించేవారు. ఆ సొమ్మును ప్రశాంత్ తన ఖాతాల్లోకి బదిలీ చేసుకుని, క్రిప్టో కరెన్సీగా మార్చి భరత్‌కు పంపేవా డు. భరత్ తైవాన్‌లో ఉండే స్వాంగ్ లిన్‌కు పంపేవాడు. బ్యాంకు ఖాతాల నిర్వహణ, కరెన్సీ మార్పిడి బాధ్యతలు భరత్‌కుమార్, ప్రశాంత్ నిర్వహిస్తుండగా, బాధితులను మోసం చేయడం లిన్, ఇరీన్ చేసేవాళ్లు. తమకు చేరిన మొత్తం నుంచి లిన్, ఇరీన్ తమ వాటా మిగుల్చుకుని మిగిలింది చైనాలో ఉండే కీలక నిందితులకు పంపేవాళ్లు. ఇలా మొత్తం ఆరు నెలల్లో రూ.400 కోట్లు కొల్లగొట్టారు. నగరంలో నమోదైన ఓ కేసు దర్యాప్తులో ఈ వ్యవహారాలు గుర్తించిన సైబర్ క్రైమ్ పోలీసులు గత వారం భరత్‌ను అరెస్టు చేసి తీసుకువచ్చారు. -
కొత్త రకం మోసం.. బ్యాంకు ఖాతాలు అద్దెకు తీసుకుని లావాదేవీలు..
సాక్షి, సిటీబ్యూరో: ‘రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ ఐటీ ఉద్యోగి పార్ట్ టైం జాబ్ వలలో చిక్కి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. కేసు దర్యాప్తులో పోలీసులు బాధితుడు లావాదేవీలు జరిపిన బ్యాంకు ఖాతా, సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఒక ఖాతాదారుడిని పట్టుకున్నారు. అయితే విచారణలో తానెవరినీ మోసం చేయలేదని, ఒక ఏజెంట్ సూచన మేరకు తన పేరు మీద కరెంట్ బ్యాంక్ అకౌంట్ తెరిచి ఇచ్చానని చెప్పాడు. ఇందుకుగాను ఆ ఏజెంట్ ప్రతి రోజు రూ.1,000 తన ఖాతాలో జమ చేస్తున్నాడని చెప్పాడు. అంతేతప్ప ఆ ఖాతాతో వారేం చేస్తున్నారో తనకేమీ తెలియదని పోలీసులకు బదులిచ్చాడు.’ ... ఇప్పటివరకు పేదలు, అనాథలు, బిచ్చగాళ్ల పేర్ల మీద ఆధార్, పాన్ కార్డులు సృష్టించి, వాటితో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్న సైబర్ నేరస్తులు.. ఈ తరహా ఖాతాల లభ్యత తక్కువయ్యే సరికి నేరస్తులు రూటు మార్చారు. నిరుద్యోగులు, యువకులను ఆకర్షించి, వారి పేర్ల మీద అకౌంట్ల తీసి, వాటిని అద్దెకు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకున్నారు. ఈ ఏజెంట్లు వివిధ మాధ్యమాల ద్వారా సేకరించిన నిరుద్యోగులను కలిసి వారి పేర్లతో బ్యాంకు ఖాతాలను తెరిస్తున్నారు. ఇందుకోసం వారికి రోజుకు రూ.500–1,000 చెల్లిస్తున్నారు. ఎలా చేస్తున్నారంటే.. భౌతికంగా మీ బ్యాంకు కిట్, సిమ్ కార్డు ఏజెంట్ దగ్గర ఉంటుంది. కానీ, మీ ఆన్లైన్ లావాదేవీలు మాత్రం విదేశాల నుంచి జరుగుతుంటాయి. ఎలాగంటే.. సైబర్ కేటుగాళ్లు సూచించినట్లుగా ఏజెంట్ మీ సిమ్‌ను కొత్త ఫోన్లో వేసి మైటీటెక్ట్స్, టీమ్ వ్యూయర్, ఎనీ డెస్క్, క్విక్ అసిస్ట్ వంటి రిమోట్ యాక్సెస్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకుంటాడు. తొలుత సైబర్ నేరస్తులు మోసం చేసిన సొమ్మును మీ ఖాతాలో వేయించుకుంటారు. సొమ్మును ఇతర అకౌంట్లకు బదిలీ చేసేటప్పుడు అవసరమైన ఓటీపీని రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా ఒకే సమయంలో ఇటు ఏజెంట్, అటు విదేశాల్లో ఉండే నేరస్తుడు చూడగలరు. దీంతో కొట్టేసిన సొమ్మును విడతల వారీగా పలు బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి, చివరగా నేరస్తుడి అసలు ఖాతాకు బదిలీ అవుతుంది. కొట్టేసిన మొత్తంలో ఏజెంట్లకు 10–20 శాతం కమీషన్ అందిస్తున్నారు. ఎక్కువగా ఈ దేశాల నుంచే.. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్, లోన్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా అద్దె బ్యాంకు ఖాతాల నుంచే జరుగుతున్నాయని రాచకొండ సైబర్ క్రైమ్స్ పోలీసు అధికారి తెలిపారు. చైనా, ఫిలిప్పిన్స్, నేపాల్ దేశాల ఎక్కువ నేరస్తులు ఉంటున్నారని పేర్కొన్నారు. ఆర్బీఐ ఏం చేయాలంటే.. ♦ ఇండియాలోని బ్యాంకు ఖాతాల నుంచి విదేశీ ఖాతాలకు నిరంతరం లావాదేవీలు జరిపే అకౌంట్లపై నిఘా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిఘా పెట్టాలి. ♦ విదేశీ అకౌంట్లకు నగదు లావాదేవీలు జరిపే సమయంలో వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ఆధారంగా కాకుండా ఐపీ ఆధారిత లావాదేవీలను అనుమతించాలి. దీంతో విదేశీ అకౌంట్లు, సైబర్ నేరస్తుల అక్రమ లావాదేవీలపై నియంత్రణ ఉంటుంది. ♦ ఎక్కువ సొమ్ము బదిలీ జరిగే బ్యాంకు ఖాతాలను పరిశీలిచేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ♦ అనుమానాస్పద విదేశీ బ్యాంకు లావాదేవీలపై సంబంధిత బ్యాంకు అధికారులను వెంటనే అప్రమత్తం చేయాలి. ఆయా లావాదేవీలపై వెంటనే నిలిపివేయాలి. ♦ విదేశీ లావాదేవీలు జరిపే ఖాతాలను ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్షించాలి. ఆయా ఖాతాదారులు, ఫోన్ నంబరు, ఇంటి చిరునామా ఇతరత్రా వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరించుకోవాలి. -
డేంజర్:వాట్సాప్‌లో పొరపాటున కూడా ఆ లింక్‌ను క్లిక్ చేయొద్దు
వాట్సప్‌లో ఓ కొత్త మోసం వేగంగా వ్యాపిస్తోంది. ఈ వాట్సాప్ పింక్ స్కామ్ ఇప్పటికే చాలా మంది వ్యక్తులను మోసగించింది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసు విభాగాలు, సైబర్ నిపుణులు ఈ మోసాలకు వ్యతిరేకంగా ఇప్పటికే హెచ్చరించారు. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం వాట్సాప్ ‘పింక్ రెడ్ అలర్ట్’తో హెచ్చరించింది. ఇంతకీ వాట్సాప్ పింక్ అంటే ఏంటి? ఈ స్కామ్ ఎలా వ్యాపిస్తోంది. మీరు బాధితులైతే ఏం చేయాలి?! తప్పనిసరిగా తెలుసుకోవాలి. పింక్ వాట్సాప్ అంటే..? స్కామర్లు ‘అదనపు ఫీచర్లతో ఉన్న పింక్ వాట్సాప్‌ను డౌన్లోడ్ చేసుకోమని వినియోగదారులకు మెసేజ్‌లు పంపుతారు.’ ఈ యాప్ నిజానికి ప్రమాదకరమైన మాల్వేర్. వాట్సాప్ పింక్‌ని డౌన్లోడ్ చేయడంతో స్కామర్లు ఫోన్ డేటాకు యాక్సెస్ పొందుతారు. దీంతో ఈ యాప్ మన ఫోన్ డేటాను పూర్తిగా దొంగిలించడానికి వీలు కల్పిస్తోంది. బ్యాంక్ వివరాలు, కాంటాక్ట్ నంబర్లు, ఫొటోగ్రాఫ్స్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని స్కామర్లు దొంగిలించి ఉండవచ్చు. అనుమానాస్పద లింక్‌ల పట్ల జాగ్రత్త తెలియని లేదా అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం మానుకోవాలి. ప్రత్యేకించి అవి కొత్త ఫీచర్లు లేదా హానికరమైన లింక్‌లపై క్లిక్ చేసేలా ఆకట్టుకునే మెసేజ్‌లు ఉంటే అనుమానించాలి. వాట్సాప్ లేదా ఏదైనా ఇతర అధికారిక సంస్థ నుండి వచ్చినట్లు క్లెయిమ్ చేసే మెసేజ్‌ను యాక్సెస్ చేస్తే ముందు దాని ప్రామాణికతను ధ్రువీకరించాలి. సమాచారం చట్టబద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ వెబ్సైట్, సోషల్‌మీడియా అకౌంట్స్, విశ్వసనీయ వార్తా సమాచారాల నుంచి చెక్ చేయాలి. పేరొందిన యాంటీ మాల్వేర్ సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా మీ మొబైల్ పరికరాన్ని సురక్షితంగా ఉంచచ్చు. ఇవి హానికరమైన యాప్‌లు లేదా లింక్‌లను గుర్తించి అడ్డుకోవడంలో సహాయపడతాయి. వాట్సాప్, ఇతర యాప్‌లను ఎప్పటికప్పుడు తాజా వెర్షన్లకు అప్డేట్ చేయాలి. సేఫ్టీ అప్డేట్ వల్ల బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి సహాయపడుతుంది. వాట్సాప్ మీ బ్యాంకింగ్ వివరాల వంటి సెన్సిటివ్ సమాచారాన్ని మెసేజ్‌ల ద్వారా ఎప్పటికీ అడగదు. తెలియని లేదా నమ్మదగని అకౌంట్స్‌తో ఎప్పుడూ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. వాట్సాప్ కూడా రెండు దశల ప్రామాణికతతో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడానికి పిన్ నంబర్ ఉంటుంది. కొత్త ఫోన్లో మీ ఫోన్ నంబర్ యాక్సెస్ అవ్వాలంటే ఈ పిన్ నెంబర్ అవసరం అవుతుంది. మీ అకౌంట్ సేఫ్టీని మెరుగుపరచడానికి వాట్సాప్ సెట్టింగ్‌లలో ఈ ఫీచర్‌ని ఇప్పుడే ప్రారంభించవచ్చు. వినియోగదారులకు వచ్చే మెసేజ్‌లు ఇలా ఉంటాయి.. ‘న్యూ పింక్’ వాట్సాప్ కొత్త ఫీచర్లతో అధికారికంగా ప్రారంభించారు. న్యూ పింక్ లుక్ కొత్త ఫీచర్లతో మీ వాట్సాప్‌ను ఇప్పుడే అప్డేట్ చేయండి. ఈ కొత్త వాట్సాప్‌ని ఇప్పుడే ప్రయత్నించండి అనే మెసేజ్‌లు వస్తుంటాయి. ఫోన్ హైజాక్ చేసిన వాళ్లు మీ కాంటాక్ట్ నుండి వచ్చే మెసేజ్‌లను కూడా డౌన్లోడ్ చేయవచ్చు. యాప్ నకిలీ వెర్షన్ వినియోగదారుల ఫోన్లను హ్యాక్ చేయడమే కాదు, ఇది యాప్‌ను డౌన్లోడ్ చేయమని మీ పూర్తి కాంటాక్ట్‌లోని జాబితాకు మెసేజ్‌లు కూడా పంపుతుంది. వాట్సాప్ పింక్ అనేది హానికరమైన మాల్వేర్. మొబైల్ ఫోన్లను యాక్సెస్ చేయడానికి ఉపయోగించే ఓ నకిలీ సాఫ్ట్వేర్. ఓటీపీలు, కాంటాక్ట్స్, బ్యాంక్ ఖాతా వివరాలు, ఇతర ఆర్థిక విషయాలతో సహా వినియోగదారుల పరికరాల నుండి పూర్తి సమాచారాన్ని దొంగిలించడానికి హ్యాకర్లు దీనిని ఉపయోగిస్తారు. వ్యక్తులు లింక్‌లు ఓపెన్ చేసినప్పుడు వారి డిజిటల్ పరికరాలలో హానికరమైన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. థర్డ్–పార్టీ యాప్ స్టోర్లు లేదా APK ఫైల్స్ నుండి ప్రోగ్రామ్‌లను డౌన్లోడ్ చేసుకోవడానికి ఆపిల్ ఫోన్లో అయితే యాక్సెస్ ఉండదు. వాట్సాప్ పింక్ స్కామ్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. థర్డ్‌పార్టీ యాప్ స్టోర్లు, ఏపీకే ఫైల్స్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. తమ అక్రమ కార్యకలాపాలకోసం హ్యాకర్లు ఫోన్ గ్యాలరీలో వ్యక్తిగత ఫొటోలను తీసి, బ్లాక్ మెయిలింగ్‌కు ఉపయోగించుకుంటున్నారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు, చట్టాన్ని అమలు చేసే అధికారులు హెచ్చరిస్తున్నారు. మీ ఫోన్లో వాట్సాప్ పింక్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటే ఇప్పుడే దానిని అన్ ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత, మీ ఫోన్‌ని బ్యాకప్ చేసి ఫార్మాట్ లేదా రీసెట్ చేయండి. మీరు ఈ వాట్సాప్ పింక్ గురించి ఇతరులకు అవగాహన కల్పించండి. తాజా స్కామ్‌లను ఎప్పటికప్పుడు తెలుసుకోండి. స్నేహితుల, కుటుంబ సభ్యులతో సమాచారాన్ని పంచుకోండి. అవగాహన పెంపొందించడం ద్వారా ఇతరుల స్కామ్‌ల బారిన పడకుండా మీరు సహాయం చేయవచ్చు. మోసానికి గురైతే బాధితులు జ్టి్ట https://www. cybercrime.gov.in/ పోర్టల్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఉచిత ల్యాప్‌టాప్‌లు ఇస్తామని మోసాలు
సాక్షి, హైదరాబాద్: విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ఇతర ప్రైవేటు వ్యక్తులతో ఉచితంగా ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తున్నట్టు ఫోన్ సందేశాలను పంపుతున్నారు. వాటిలో వివరాలు నమోదు చేయాలంటూ కొన్ని యూఆర్ఎల్ లింక్‌లను జత చేస్తున్నారు. ఇవి నిజమైనవని ఎవరైనా నమ్మి ఆ లింక్‌లను తెరిస్తే అందులో ప్రాథమిక సమాచారం, ఆధార్, ఫోన్, బ్యాంకు ఖాతా నంబర్లు.. ఇలా పూర్తి సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఫోన్లోకి మాల్వేర్ను మనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇలా వారి వలకు ఎవరైనా చిక్కితే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బులను కొల్లగొడుతున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ అధికారులు హెచ్చరించారు. ఉచిత ల్యాప్‌టాప్‌ల పేరిట వచ్చే సందేశాలను నమ్మవద్దని వారు కోరుతున్నారు. స్టే సేఫ్ ఆన్లైన్ క్విజ్ ఆన్లైన్ మోసాలపై అవగాహన.. పోటీల గడువు ఈనెల 31 సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ మోసాల బారిన పడకుండా అవగాహన పెంచేందుకు కేంద్ర హోంశాఖ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ‘స్టే సేఫ్ ఆన్లైన్..’ నేపథ్యంతో ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తోంది. పోటీలకు ఈనెల 31 వరకు గడువుందని అధికారులు పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనదలచిన వారు https://www.mygov.in/staysafeonline లింక్ పై క్లిక్ చేస్తే అదనపు వివరాలు తెలుస్తాయని వెల్లడించారు. టెలిగ్రామ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, https://t.me/ ssoindia లింక్ ద్వారా గ్రూప్‌లో చేరొచ్చు. ఈ ఆన్లైన్ క్విజ్‌లో పాల్గొనే వారికి ఒక్కొక్కరికి 10 ప్రశ్నలు ఇస్తారు.. 5 నిమిషాల వ్యవధిలో వీటికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. క్విజ్‌లో టాప్ 10లో నిలిచే విజేతలకు ఒక్కొ క్కరికి రూ.10 వేల చొప్పున నగదు పురస్కా రం ఇవ్వనున్నారు. క్విజ్‌లో పాల్గొని 50 శాతానికి పైగా మార్కులు సాధించిన వారికి డిజిటల్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. -
ఫోన్‌కు స్పందించొద్దు.. వివరాలు చెప్పొద్దు
సిద్దిపేటకమాన్: సైబర్ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సిద్దిపేట పోలీస్‌కమిషనర్ శ్వేత అన్నారు. లాటరీ, లోన్, బహుమతి పేరుతో, తక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో లాభాలు వస్తాయని వచ్చే ఫోన్‌కాల్స్‌కు ఎవరూ స్పందించకూడదన్నారు. గుర్తు తెలియని వ్యక్తులకు వ్యక్తిగత, బ్యాంక్, ఏటీఎం డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు, పిన్ నంబర్లు, ఓటీపీ వంటి వివరాలు చెప్పొద్దన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ సంవత్సరం సైబర్ మోసాల ద్వారా పోగొట్టుకున్న వాటిలో రూ.46,55,964 ఫ్రీజ్ చేశామని, త్వరలో విడతల వారీగా సంబంధిత బాధితుల ఖాతాల్లో జమవుతాయన్నారు. సిద్దిపేట పోలీసు కమిషనరేట్ పరిధిలో సోమవారం జరిగిన పలు సైబర్ నేరాలపై సీపీ తెలిపిన వరాల ప్రకారం.. ఇండియన్ బుల్స్ కంపెనీ పేరుతో.. సిద్దిపేట వన్‌టౌన్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తికి గుర్తుతెలియని ఒకరు ఫోన్‌చేసి ఇండియా బుల్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌గా పరిచయం చేసుకున్నాడు. మీకు లోన్ మంజూరైంది... లోన్ ప్రాసెసింగ్ చార్జీల నిమిత్తం కొంత మొత్తం చెల్లించాలని గుర్తు తెలియని వ్యక్తి సూచించాడు. ఆ మాటలు నమ్మిన బాధితుడు గుర్తు తెలియని వ్యక్తి సూచించిన నంబర్‌కు ఫోన్ ఫే ద్వారా రూ.10,653 పంపించాడు. తర్వాత మరిన్ని డబ్బులు పంపాలని గుర్తు తెలియని వ్యక్తి భయపెట్టడంతో అనుమానం వచ్చిన బాధితుడు జాతీయ హెల్ప్‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. లోన్‌యాప్ పేరిట.. రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ వ్యక్తి ఆన్లైన్లో లోన్ టీకాయాప్లో లోన్ తీసుకుని తిరిగి మిత్తితో సహా అసలు మొత్తం డబ్బు చెల్లించాడు. కానీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఇంకా డబ్బులు చెల్లించాలని బెదిరించడంతో బాధితుడు ఆన్లైన్లో రూ.6,100 పంపించాడు. అనంతరం సైబర్ నేరగాడు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బులు పంపించాలని లేదంటే నీ ఫొటోలు న్యూడ్‌గా ఎడిట్ చేసి వాట్సాప్, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బాధితుడిని బెదిరించాడు. అనుమానం వచ్చిన బాధితుడు వెంటనే జాతీయ హెల్ప్‌లైన్‌లో ఫిర్యాదు చేశాడు. మహిళ డీపీతో... రాజగోపాలపేట పీఎస్ పరిధిలోని ఓ మహిళ ఇన్‌స్ట్రాగామ్ ఖాతాను సైబర్ నేరగాడు హ్యాక్ చేశాడు. తాను ఆపదలో ఉన్నానని డబ్బులు పంపించాలని కోరాడు. స్పందించకపోవడంతో ఆమె డీపీ (ఫొటో)ను ఉపయోగించి వేరే ఫోన్‌నంబర్ ద్వారా వాట్సాప్ క్రియేట్ చేశాడు. మెసేజ్ పంపించగా స్పందించిన బాధితురాలు ఆన్లైన్లో రూ.5 వేలు పంపించింది. తర్వాత విచారణ చేసుకోగా గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపినట్టు సైబర్ మోసం జరిగినట్టు గుర్తించి ఫిర్యాదు చేసింది. -
డేటింగ్.. చీటింగ్
సాక్షి, హైదరాబాద్: సరదా కోసమో.. కాలక్షేపం కోసమో చేసే కొన్ని పనులు కొత్త తలనొప్పులు తెచ్చిపెడతాయనడానికి డేటింగ్ యాప్స్ వ్యవహారం ఓ ఉదాహరణ. ఏదో కాసేపు టైంపాస్ చేద్దామని కొందరు.. ఒంటరితంతో మరికొందరు ఆన్లైన్ డేటింగ్ యాప్‌ల వలలో చిక్కుతున్నారు. ఈ తరహా మోసాలకు గురవుతున్న వారిలో యువకుల నుంచి వయోవృద్ధులు వరకు ఉంటున్నారు. ఎదుటివారి బలహీనతలను అనుకూలంగా మార్చుకుంటున్న సైబర్ నేరగాళ్లు... అందమైన యువతులతో న్యూడ్ వీడియోకాల్స్ మాట్లాడిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని మాటల్లో దింపి రెచ్చగొట్టి తర్వాత వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడేలా చేస్తున్నారు. ఆ వీడియోలను రికార్డు చేసి, ఆపై సోషల్ మీడియాలో పెడతామని, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు పంపుతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో పరువు పోతుందని భావించి బాధితులు సైబర్ నేరస్తులు డిమాండ్ చేసినట్లు రూ. లక్షలు సమర్పిస్తున్నారు. లింక్‌లు పంపి.. మనకు డేటింగ్ యాప్‌లపై ఆసక్తి లేకున్నా సోషల్ మీడియాలో మన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని కూడా కొందరు సైబర్ నేరగాళ్లు ఈ తరహా లింక్‌లు పంపి రెచ్చిగొట్టి ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నారాయణగూడ ప్రాంతానికి చెందిన 78 ఏళ్ల ఓ వృద్ధుడికి వీడియోకాల్ చేసిన ఓ యువతి.. ఆ వృద్ధుడిని నగ్నంగా ఫోన్ మాట్లాడేలా చేసి దాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగింది. ఇలా రూ. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న ఆ వృద్ధుడు చివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. లాలాపేటకు చెందిన 59 ఏళ్ల బీమా కంపెనీ ఉద్యోగి సైతం రూ. 8 లక్షలు ఇదే రీతిలో పోగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ప్రజల సోషల్ మీడియా ఖాతాల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా డేటింగ్ యాప్ లింక్‌లు, వాట్సాప్ వీడియో న్యూడ్‌కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నారు. అప్రమత్తంగా ఉండటం ద్వారానే ఇలాంటి ముప్పు నుంచి బయటపడగలుగుతామని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు... ♦ మన మానసిక పరిస్థితి ఏదైనా సరే ఆన్లైన్ డేటింగ్ యాప్‌లలో అపరిచిత వ్యక్తులతో స్నేహాలు అవసరమా అన్నది ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఆన్లైన్ స్నేహాల వల్ల మోసపోయే కంటే నిజమైన స్నేహితులను, సన్నిహితులను గుర్తించడం ఉత్తమమన్నది తెలుసుకోవాలి. ♦ ఆన్లైన్ మోసగాళ్లకు సోషల్ మీడియా అనేది ప్రధాన వేదిక. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్ట్రాగాం వంటి సోషల్ మీడియా ఖాతాల్లో మనం పెట్టే వ్యక్తిగత సమాచారం, ఫాలో అవుతున్న వ్యక్తులను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు డేటింగ్ యాప్‌ల లింక్‌లు పంపి మోసాలకు తెరతీస్తున్నారు. సోషల్ మీడియాలో పరిమితికి మించి వ్యక్తిగత సమాచారం ఇవ్వకపోవడం ఉత్తమం. ♦ ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల్లో మన ఫొటోలు, వీడియోలు కేవలం స్నేహితులకే కనపించేలా ప్రొఫైల్ ప్రైవసీ ఆప్షన్లు వాడాలి. దీనివల్ల ఇతరులకు మన వ్యక్తిగత అంశాలు వెల్లకుండా నిరోధించవచ్చు. ♦ అందమైన యువతుల ప్రొఫైల్ ఫొటోలతో (ఫేక్ ప్రొఫైల్స్‌తో) కొందరు సైబర్ నేరగాళ్లు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతున్నారు. ఇలా వారి వలలో పడే అమాయకులను మోసగిస్తున్నారు. అందువల్ల అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దు. ♦ మొబైల్‌ఫోన్, ల్యాప్‌లాప్, డెస్క్‌టాప్‌లకు సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల సైబర్ నేరగాళ్లు పంపే ఫిషింగ్ లింక్స్, మాల్వేర్స్ నుంచి రక్షణ ఉంటుంది. ♦ డేటింగ్ యాప్స్ పేరిట లింక్‌లు పంపి స్నేహాలు చేసే వారిని వీలైనంత వరకు వ్యక్తిగత సమాచారం అడిగేందుకు ప్రయత్నించాలి. ప్రశ్నించడం ప్రారంభిస్తే ఫేక్‌గాళ్లు వెంటనే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు. అదేవిధంగా ఆన్లైన్లో పరిచయం అయ్యే స్నేహితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ డబ్బులు పంపవద్దు. ఏ రకమైన ఆన్లైన్ యాప్‌లోనూ డబ్బు లావాదేవీలు చేయవద్దు. -
పార్సిల్ ట్రాకింగ్ పేరిట కొత్త మోసాలు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో వస్తువులను కొనడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. అయితే మనకు వచ్చే ఆ పార్సిల్ ఎప్పుడు వస్తుందో తెలుసుకునేందుకు ట్రాకింగ్ చేయడం పరిపాటి. ఇదే అదనుగా ఆన్లైన్లో వస్తువులను కొనేవారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఆన్లైన్లో వస్తువులను ఆర్డర్ చేసేందుకు మా వెబ్‌సైట్‌ను సంప్రదించండి.. అంటూ నకిలీ యాడ్స్‌ను ఇస్తున్నారు. అదేవిధంగా ట్రాకింగ్ కోసం అంటూ ఆన్లైన్లో కొన్ని ఫేక్ కాల్ సెంటర్ నంబర్లను పెడుతున్నారు. వాటిని నమ్మి ఎవరైనా ఆ నంబర్లకు ఫోన్ చేసేందుకు ప్రయత్నిస్తే అలాంటి వారికి నకిలీ మాల్వేర్ లింకులతో కూడిన ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్‌లు పెడుతున్నారు. వినియోగదారులు ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే మన ఫోన్లోని పూర్తి సమాచారం హ్యాకర్ల చేతికి వెళ్లడంతోపాటు మన ఫోన్లను వారి నియంత్రణలోకి తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ట్రాకింగ్ పేరిట ఇచ్చే యాడ్స్‌ను నమ్మి మోసపోవద్దని, ఆయా కంపెనీల అధికారిక వెబ్సైట్ల నుంచి మాత్రమే ఫోన్ నంబర్లు తీసుకోవాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. -
సైబర్ సేఫ్టీకి 5 S సూత్రం.. పాస్‌వర్డ్‌ల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!
రోజువారీ జీవితంలో స్మార్ట్ఫోన్లలోనే సగం సమయం గడిచిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ వాడకం మొదలు ఆన్లైన్ ఆర్డర్లు, ఆన్లైన్ బ్యాంకు లావాదేవీల వరకు పని ఏదైనా ఫోన్, ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరైంది. టెక్నాలజీ వాడకంతో ఎన్ని సౌకర్యాలు ఉన్నాయో అంతేస్థాయిలో సైబర్ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే సైబర్ జమానాలో సేఫ్‌గా ఉండేందుకు తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొన్ని సూచనలు చేసింది. 5ఎస్ సూత్రాన్ని పాటిస్తే సురక్షితంగా ఉండొచ్చని పేర్కొంది. ఏమిటి ఆ 5ఎస్? స్ట్రాంగ్ అండ్ యూనిక్ పాస్వర్డ్, సెక్యూర్ నెట్వర్క్, సెక్యూర్ వెబ్‌సైట్స్ లేదా యాప్స్, సాఫ్ట్వేర్ అప్డేట్స్, సస్పీషియస్ లింక్ అలర్ట్...కలిపి 5 ఎస్‌లుగా పోలీసులు సూత్రీకరించారు. స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం సోషల్ మీడియా ఖాతాలకు, ఆన్లైన్ బ్యాంకు ఖాతాలకు, ఈ–మెయిల్స్‌కు వేర్వేరు పాస్వర్డ్లు పెట్టుకోవడం ఉత్తమం. ఒకటే పాస్‌వర్డ్‌ను అన్నింటికీ పెట్టడం రిస్క్ అని గుర్తించాలి. పాస్‌వర్డ్‌లో వీలైనంత వరకు మన పేరు, బర్త్‌డే తేదీలు, పిల్లల పేర్లు లేకుండా చూసుకోవడం ఉత్తమం. పాస్‌వర్డ్‌ను అంకెలు, క్యారెక్టర్లు, పెద్ద, చిన్న అక్షరాల మిళితంగా పెట్టుకోవాలి. పాస్‌వర్డ్‌లను ఇతరులకు షేర్ చేయవద్దు. సెక్యూర్ వెబ్‌సైట్స్, యాప్స్, సెక్యూర్ నెట్వర్క్.. మనం వాడే వెబ్సైట్లు, డౌన్లోడ్ చేసుకొనే యాప్స్ సరైనవేనా అన్నది ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలి. యాప్‌లను డౌన్లోడ్ చేసే ముందు ఆ యాప్ రేటింగ్ పరిశీలించాలి. సాఫ్ట్వేర్ అప్డేట్స్.. మొబైల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు సాఫ్ట్‌వేర్‌తో అప్డేట్ చేసుకోవాలి. సాఫ్ట్వేర్ అప్డేట్ వల్ల సైబర్ దాడుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. సరైన యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను వినియోగించుకోవాలి. సస్పీషియస్ లింక్ అలర్ట్... మనకు మెసేజ్‌లు, వాట్సాప్ సందేశాలు, ఈ–మెయిల్స్ రూపంలో వచ్చే మెసేజ్‌లలోని అనుమానాస్పద లింక్‌లపై ఎట్టిపరిస్థతుల్లోనూ క్లిక్ చేయవద్దు. చాలా తక్కువ అక్షరాలతో ఉండే లింక్‌లు చాలా వరకు అనుమానాస్పదమైనవని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అక్షర దోషాలు ఉన్న లింక్‌లు సైతం అనుమానాస్పదమైనవని తెలుసుకోవాలి. -
సైబర్ దంగల్ 2.0.. భారత్ లక్ష్యంగా దాడులకు సిద్ధమైన 160 గ్రూపులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక లాభం, వ్యక్తిగత కక్ష, ఈర్ష్య.. సైబర్ నేరాలకు, దాడులకు ప్రధానంగా ఇవే కారణాలుగా ఉంటాయి. అయితే ప్రస్తుతం సైబర్ దంగల్ 2.0 తెరపైకి వచ్చింది. రాజకీయ, మతపరమైన విభేదాలతో పాటు తమ ఉనికిని చాటు కోవాలనే ఉద్దేశంతో కూడా సైబర్ నేరగాళ్లు దాడులకు తెగబడుతున్నారు. దీన్ని నిపుణులు సైబర్ హ్యాక్టివిజంగా పేర్కొంటున్నారు. అనానిమస్ సూడాన్, హ్యాక్టివిస్ట్ రష్యా, డ్రాగన్ ఫోర్స్ మలేసియా.. ఇలా అనేక గ్రూపులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి సవాల్ విసురుతున్నాయి. వీటి టార్గెట్‌లో భారత్ సహా అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలు ఉండటం ఆందోళన కలిగించే అంశం. అటో ఎనభై...ఇటో ఎనభై... ఉక్రెయిన్–రష్యా మధ్య ప్రారంభమైన యుద్ధం నేపథ్యంలో అనేక సైబర్ నేరగాళ్ల గ్రూపులు క్రియాశీలంగా మారాయి. సైబర్ నో అనే అంతర్జాతీయ సంస్థ అధ్యయనం ప్రకారం దాదాపు 190 గ్రూపులు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశాయి. వీటిలో 160 భారత్ పైనే గురి పెట్టాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో 80 రష్యాకు మద్దతుగా మిగిలిన సగం ఉక్రెయిన్‌కు మద్దతుగా వ్యహరిస్తున్నాయి. భారత్ ఏ దేశానికి బహిరంగ మద్దతు ప్రకటిస్తే దాని వ్యతిరేక గ్రూపులు సైబర్ దాడులకు సిద్ధమయ్యాయని సైబర్ నో స్పష్టం చేసింది. అయితే భారత్ ఎలాంటి ఏకపక్ష నిర్ణయం తీసుకోకపోవడంతో అవి మిన్నకుండిపోయాయని తెలిపింది. అనేక మంది హ్యాక్టివిస్ట్లు తమ సొంత నమ్మకాలను వ్యతిరేకించే వ్యక్తులను లేదా సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్నారని, తెరపైకి రాకుండా, పెద్ద స్థాయిలో నష్టాలు కలిగించకుండా రెచ్చిపోతున్న హ్యాక్టివిస్టులు అనేక మంది ఉంటున్నారని నిపుణులు చెబుతున్నారు. నుపుర్ వ్యాఖ్యలతో దండయాత్ర.. బీజేపీ ఎంపీ నుపుర్ శర్మ గతడాది చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో హ్యాక్టివిస్టులు ఒక్కసారిగా దేశంపై దండెత్తారు. కేంద్ర ప్రభుత్వ సైట్లను లక్ష్యంగా చేసుకుని రెచి్చపోయారు. వీరికి చెక్ చెప్పడానికి దర్యాప్తు సంస్థలు ఇంటర్‌పోల్ సాయం కోరాల్సి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో భారత్‌కు వ్యతిరేకంగా ‘డ్రాగన్ ఫోర్స్ మలేసియా’, ‘హ్యాక్టివిస్ట్ ఇండోనేసియా’అనే రెండు హ్యాకర్ గ్రూపులు రంగంలోకి దిగాయి. నుపుర్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా జరిగే ఈ దాడిలో పాల్గొనాలని ఆ గ్రూపుల నిర్వాహకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓ వర్గం హ్యాకర్లకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 2 వేల వెబ్సైట్లపై ఈ రెండు గ్రూపులూ పంజా విసిరాయి. ప్రపంచంలో ఉన్న ఇతర హ్యాకర్లు, గ్రూపులు సైతం దాడులకు దిగేలా ప్రేరేపిస్తూ అందుకు అవసరమైన డార్క్‌వెబ్ యూజర్ నేమ్, పాస్‌వర్డ్స్‌ను తమ సోషల్ మీడియాల్లో షేర్ చేశాయి. భవిష్యత్తులో మరింతగా.. ఈ తరహా సైబర్ దాడులు భవిష్యత్తులో మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఈ హ్యాకర్లు తన ఆర్థిక అవసరాల కోసం మరోచోట ఎటాక్ చేస్తారు. అక్కడ ఆర్జించిన అక్రమ సొమ్మును వినియోగించి డార్క్ నెట్ నుంచి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ సృష్టిస్తారు. వీటినే మాల్‌వేర్స్‌గా మారుస్తూ సైబర్ దాడులకు దిగుతారు. వీటిని ఎదుర్కోవాలంటే ప్రతి వ్యవస్థ, సంస్థ సైబర్ సెక్యూరిటీకి ఇచ్చే ప్రాధాన్యం, బడ్జెట్ తదితరాలు పెరగాలి. పటిష్టమైన ఫైర్ వాల్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ముందే ప్రకటించి మరీ.. ఈ హ్యాక్టివిస్ట్ గ్యాంగ్‌లు తాము ఏ దేశాన్ని, ఏ కారణంగా టార్గెట్ చేస్తున్నామో ముందే ప్రకటిస్తుండటం గమనార్హం. దీనికోసం ట్విట్టర్లో ఖాతాలు, టెలిగ్రామ్‌లో గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ ఎటాకర్స్ ఎలాంటి డిమాండ్లు చేయకుండా కేవలం తమ ఉనికి చాటుకోవడం, సైబర్ ప్రపంచాన్ని సవాల్ చేయడం, భావజాలాన్ని వ్యాప్తి చేయడం కోసమే వరుసపెట్టి ఎటాక్స్ చేస్తుంటారు. వీళ్లు ప్రధానంగా డీ డాస్గా పిలిచే డిసస్టట్రి డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్ విధానంలో దాడి చేస్తున్నారు. ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా ఒకేసారి కొన్ని లక్షల హిట్స్ ఆయా వెబ్‌సైట్స్‌కు వచ్చేలా చేస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక సర్వర్ కుప్పకూలిపోతుంది. డినైల్ ఆఫ్ సర్వీసెస్ (డీఓఎస్) తరహా ఎటాక్స్ సైతం దాదాపు ఇవే తరహా నష్టాన్ని కల్పిస్తాయి. విమానాశ్రయాలు, ఓడ రేవులతో పాటు ఆస్పత్రులకు సంబంధించిన సర్వర్లు వారి టార్గెట్‌గా మారుతున్నాయి. -మావులూరి విజయ్‌కుమార్, సైబర్ నిపుణుడు -
ఇన్స్టాల్ చేసే యాప్‌తోపాటే ‘రాట్’ వైరస్.. ఫోన్ మీ దగ్గరే ఉంటుంది.. కానీ,
సాక్షి, హైదరాబాద్ : ఆకర్షణీయ సౌకర్యాలు, ముఖ్యమైన అంశాలకు సంబంధించినవి అంటూ అనేక యాప్స్‌కు సంబంధించిన యాడ్స్ ఇంటర్నెట్, సోషల్‌మీడియాల్లో రాజ్యమేలుతున్నాయి. వీటితో అవస రం ఉన్నా లేకపోయినా ఉచితం కదా అని అనేక మంది తమ స్మార్ట్‌ఫోన్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దీన్నే ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ–నేరగాళ్లు ప్రయోగిస్తున్న ఆయుధం ‘రాట్’గా పిలిచే రిమోట్ యాక్సెస్ ట్రోజన్. యాప్స్ మాటున నేరగాళ్లు ఈ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను చొప్పించడం ద్వారా డౌన్లోడ్ చేసుకున్న వారి సెల్‌ఫోన్‌ను తమ అదీనంలోకి తీసుకుని చేయాల్సిన నష్టం చేసేస్తున్నారు. అడుగడుగునా యాప్స్ వినియోగమే... ♦ స్మార్ట్ఫోన్ల వినియోగం ఎంతగా పెరిగిందో... వివిధ రకాలైన యాప్స్ వాడకం అంతకంటే ఎక్కువైంది. నిద్ర లేవడం నుంచి ఆహారం తీసుకోవడం, ఉష్టోగ్రతలు తెలుసుకోవడం, వినోదం ఇలా... ఒక్కో ఫోన్లో కనీసం 10–15 యాప్స్ ఉంటున్నాయి. వినియోగదారుడి ‘యాప్ మేనియా’ను క్యాష్ చేసుకునేందుకు సైబర్ క్రిమినల్స్ కొత్త ఎత్తులు వేస్తున్నారు. వీరు తొలుత దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ నంబర్ల డేటాను వివిధ మార్గాల్లో సేకరిస్తున్నారు. ఇలా నంబర్లు తమ చేతికొచ్చాక అసలు కథ మొదలవుతుంది. సందేశాలతో ప్రారంభమయ్యే ప్రక్రియతో.. ♦ తాము ఉచితంగా ఇస్తున్న ఫలానా యాప్‌లో ఇన్ని ఆకర్షణలు ఉన్నాయంటూ ఎస్సెమ్మెస్, వాట్సాప్ లేదా సోషల్‌మీడియాల్లో యాడ్స్ పంపిస్తారు. ఈ ‘ప్రకటన’ను చూసి ఆకర్షితులైన వారు అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే సదరు యాప్ డౌన్లోడ్ అవుతుంది. వినియోగదారుడికి తెలియకుండా, అతడి ప్రమేయం లేకుండా దీంతోపాటే సదరు క్రిమినల్ పంపిచే ట్రోజన్ కూడా అదే మొబైల్ ఫోన్లోకి దిగుమతి అయిపోతుంది. అలా జరిగిన మరుక్షణం నుంచి ఫోన్ మన దగ్గర ఉన్నప్పటికీ.. అది సైబర్ క్రిమినల్ ఆదీనంలోకి వెళ్లిపోతుంది. దూరంగా ఉన్న ఓ వ్యక్తి అక్కడ నుంచి మన దగ్గరున్న సెల్‌ఫోన్‌ను యాక్సెస్ చేస్తూ అవసరమైన విధంగా వాడగలుగుతాడు. అందుకే ఈ వైరస్‌ను రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (రాట్) అంటారు. నేరగాడి అధీనంలోకి వెళ్తే ఖాతా ఖాళీ ♦ మన ఫోన్ సైబర్ నేరగాడి ఆదీనంలోకి వెళ్లిపోయాక మనం ఫోన్లో చేసే ప్రతి చర్యనూ అతడు పర్యవేక్షించగలడు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లతోపాటు సెల్ఫోన్లో ఉన్న సమాచారం, దాని కెమెరాలను సైతం సైబర్ నేరగాడు తన ఆదీనంలోకి తీసుకోగలడు. ఇటీవల సినిమా టికెట్లు మొదలుకుని కొన్ని రకాలైన బిల్లుల చెల్లింపు వరకు అన్నీ అత్యధిక శాతం సెల్‌ఫోన్ ద్వారా జరుగుతోంది. వీటి కోసం కోసం మొబైల్ వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ వాడటం లేదా తమ డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. దీంతోపాటు లావాదేవీలకు సంబంధించి బ్యాంకు పంపే వన్ టైమ్ పాస్వర్డ్స్ సైతం సెల్‌ఫోన్‌కే వస్తుంటాయి. ఎవరైనా క్రెడిట్/డెబిట్ కార్డు వివరాలు, నెట్‌బ్యాంకింగ్ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌లను వినియోగదారుడికి తెలియకుండా తీసుకున్నా... ఓటీపీ నమోదు చేయనిదే లావాదేవీ పూర్తికాదు. వినియోగదారుడి ప్రమేయం లేకుండానే.. ♦ ఈ ఓటీపీని సంగ్రహించడానికీ సైబర్ నేరగాళ్లు ముందు పంపే యాప్‌లోని రాట్ ద్వారానే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వచ్చే ఓటీపీలను ఈ యాప్ నుంచే సంగ్రహిస్తున్నారు. కార్డుల వివరాలు అప్పటికే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ఓటీపీ నమోదుచేసి అందినకాడికి స్వాహా చేస్తున్నారు. ఓటీపీ అవసరమైన లావాదేవీలను సైబర్ క్రిమినల్స్ అర్ధరాత్రి దాటిన తర్వాత చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆ సమయంలో వినియోగదారులు నిద్రలో ఉంటారని, అతడి ప్రమేయం లేకుండానే వచ్చిన ఓటీపీని గుర్తించరని అంటున్నారు. ఉదయం లేచి జరిగింది తెలుసుకునే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఎక్కువగా బోగస్ వివరాలతో తెరిచిన ఖాతాలనో, బోగస్ చిరునామాలను పెట్టడమో చేస్తుంటారని వివరిస్తున్నారు. దీనివల్ల జరిగిన నష్టంపై ఫిర్యాదులు వచ్చినా నేరగాళ్లను పట్టుకోవడం సాధ్యం కాదంటున్నారు. సరైన గుర్తింపులేని సంస్థలు/వ్యక్తులు రూపొందించే యాప్స్‌కు దూరంగా ఉండటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. -
ఈ కాల్స్‌తో జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: వాట్సాప్ వాడకం పరిపాటిగా మారింది. ఇప్పుడు వాట్సప్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. అంతర్జాతీయ ఫోన్ నంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మోసాలకు తెరతీస్తున్నారు. ప్రధానంగా +254, +84, +63, +374 , +1(218), +1(803) ...తో ప్రారంభయ్యే నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ కాల్స్, మెజేస్‌లు నమ్మవద్దంటున్న సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నంబర్ల నుంచి వచ్చే మిస్డ్కాల్స్కు సైతం స్పందించవద్దని వారు సూచిస్తున్నారు. స్పామ్ కాల్స్‌తో సైబర్ నేరగాళ్లు అమాయకుల నుంచి బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్నారని, తర్వాత మోసాలకు పాల్పడుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా విదేశీ కోడ్‌తో ఉంటున్న ఈ నంబర్ల నుంచి వస్తున్న వాట్సాప్ సందేశాల్లో లింక్‌లను పంపుతున్న సైబర్ కేటుగాళ్లు వాటిపై క్లిక్ చేస్తే మన ఫోన్లోకి మాల్వేర్ను పంపించి, మన ఫోన్‌ను వారి కంట్రోల్‌కి తీసుకుంటున్నారు. దాని నుంచి మన బ్యాంకు లావాదేవీల వివరాలు, పాస్వర్డ్లు చోరీ చేసి డబ్బులు కొల్లగొడుతున్నట్టు వారు హెచ్చరించారు. ఇలాంటి కోడ్ నంబర్‌తో వచ్చే వాట్సాప్ కాల్స్‌ను లిఫ్ట్ చేయవద్దని, అలాంటి నంబర్లను బ్లాక్ చేయడంతోపాటు పోలీసులకు సమాచారం అందించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే ఇండియన్ సైబర్ క్రైం కో–ఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) సూచించింది. సింగపూర్,వియత్నాంలనుంచి ఆ ఫోన్లు ప్రధానంగా ఈ ఫోన్ కాల్స్ సింగపూర్,వియత్నాం, మలేషియా ప్రాంతాల నుంచి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఈ తరహా నంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ ఎక్కువగా ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య, లేదంటే తెల్లవారుజామున వస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ తరహా స్పామ్‌కాల్స్ బెడద నుంచి కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే బయటపడొచ్చని సైబర్ఇంటెలిజెన్స్ నిపుణుడు ప్రసాద్ తెలిపారు. ఈ జాగ్రత్తలు మరవొద్దు.. ♦ కొత్త కొత్త కోడ్ నంబర్లలో వచ్చే అంతర్జాతీయ ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దు. ♦ అనుమానాస్పదంగా ఉండే అంతర్జాతీయ ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేయాలి. ♦ ఫోన్‌కాల్, లేదా చాటింగ్‌లో మన వ్యక్తిగత, బ్యాంకు ఖాతా సమాచారాన్ని అడిగితే పంచుకోవద్దు. ♦ సైబర్ క్రైం పోలీసులకు లేదా సైబర్ క్రైం వెబ్సైట్లో సంబంధిత నంబర్లపై ఫిర్యాదు చేయాలి. ♦ మొబైల్‌ఫోన్, కంప్యూటర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, యాంటి వైరస్‌లను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాటినిబ్లాక్ చేయాలి.. మనకు కొత్త కొత్త కోడ్ నంబర్లతో వచ్చే స్పామ్ కాల్స్‌ను ఎప్పటికప్పుడు బ్లాక్ చేయాలి. పదేపదే ఇలాంటి కాల్స్ వస్తుంటే ఆన్లైన్ ద్వారా సైబర్ క్రైం సిబ్బంది దృష్టికి తేవాలి. అదేవిధంగా వాట్సాప్‌లో ఇతర దేశాల కోడ్ నంబర్లతో మొదలయ్యే నంబర్ల నుంచి వచ్చే వీడియో, ఆడియోకాల్స్కి ఆన్సర్ చేయవద్దు. ఆ నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లో ఉండే లింక్‌లను ఓపెన్ చేయవద్దు. – శ్రీనివాస్ , ఇన్స్పెక్టర్ -
హలో.. మీ పేరుతో ఓ పార్సిల్ వచ్చింది
‘‘మీ పేరు, చిరునామాతో ఉన్న ‘ఫెడెక్స్’ పార్సిల్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. దర్యాప్తు నిమిత్తం మీపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేస్తున్నాం. ఒకవేళ మీపై కేసు నమోదు కాకుండా ఉండాలంటే కస్టమ్స్ అధికారులతో ‘ఒప్పందం’ కుదుర్చుకోండి’’ ఇదీ హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగినికి వచ్చిన సైబర్ నేరగాళ్ల ఫోన్‌కాల్! యువతిని నమ్మించేందుకు ఆమె వాట్సాప్‌కు డ్రగ్స్ ఉన్న పార్సిల్, కస్టమ్స్ అధికారి ఐడీ కార్డు కూడా పంపించారు. దీంతో భయపడిన ఆమె... కేసు నమోదు చేయొద్దంటూ వేడుకొని ఆన్లైన్ ద్వారా రూ. లక్షలు సమర్పించుకుంది. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు దోపిడీ లకు ఇటీవల కాలంలో దర్యాప్తు అధికారుల అవతారమెత్తుతున్నారు. ముంబై, ఢిల్లీ పోలీసులమని, సీబీఐ, ఈడీ, కస్ట మ్స్ అధికారులమంటూ అమాయ కులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. భయపడి పోతున్న సామాన్యులు రూ. లక్షల్లో ముట్టజెప్పి మోసపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోద వుతున్నాయని సైబర్ పోలీసులు తెలిపారు. ఎలా చేస్తున్నారంటే.. సామాజిక మాధ్యమాలు, డేటా ప్రొవైడర్ల ద్వారా సైబర్ నేరస్తులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఫోన్ చేసి ఢిల్లీ, ముంబై కస్టమ్స్ అధికారులమని పేరు, చిరునామా చెబుతూ సంభాషిస్తారు. మీ పేరు, అడ్రస్‌తో ఉన్న పార్సిల్ కస్టమ్స్‌లో అనుమానాస్పదంగా కనిపించి నిలిపివేసినట్లు, తెరిచి చూస్తే అందులో మాదకద్రవ్యాలు, ఇతరత్రా చట్ట వ్యతిరేక ఉత్పత్తులు ఉన్నాయని గుర్తించినట్లు బెదిరిస్తారు. ఫోన్లో ఏమాత్రం బెరుకుగా మాట్లాడుతున్నట్లు అనిపించగానే బెదిరింపులు రెట్టింపు చేస్తారు. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేస్తామని వరుసగా ఫోన్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తారు. కేసు వద్దంటే స్వాహా.. అమాయకులను నమ్మించేందుకు నకిలీ పోలీసు అధి కారుల గుర్తింపు కార్డులు సైతం కేటుగాళ్లు వాట్సాప్ చేస్తారు. ఈ వ్యవహారం నుంచి బయట పడాలంటే దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకో వాలని సలహా ఇస్తారు. ఆపై కొద్దిసేపటికి మరో నకిలీ అధికారి ఫోన్ చేసి కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తారు. ఇలా బాధితులను బెది రించి రూ. లక్షల్లో నగదు కొట్టేస్తున్నారు. ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ ఈ తరహా మోసాలు ఎక్కువగా ఫెడెక్స్ పార్సిల్ సంస్థ పేరుతో జరుగుతున్నాయని సైబర్ పోలీసులు విచారణలో గుర్తించారు. రాజస్తాన్, హరియాణా, జార్ఖండ్‌కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. -
ఆన్లైన్లో మ్యాంగోస్.. పండు కోసం క్లిక్ చేస్తే పైసలు పోతాయ్!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో ఏ సీజన్ నడిచినా దానిని మోసాలకు వేదికగా మార్చుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. చివరకు మామిడి పళ్లను సైతం వదలడం లేదు. వేసవి అంటే మామిడి పళ్ల ప్రియులకు పండగే. తాజా తాజా వెరైటీలు రుచిచూడాలని తహతహలాడేవారు బోలెడుమంది. సరిగ్గా ఇదే బలహీనతను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే చాలు..మీ ఇంటికే తాజా మామిడి పళ్లు పంపుతామంటూ ఆన్లైన్లో ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తున్నారు. అందులో నకిలీ వెబ్సైట్ లింకులు పెడుతున్నారు. అవి నమ్మి ఆన్లైన్లో పళ్లు ఆర్డర్ ఇచ్చేందుకు ప్రయతి్నస్తే అప్పుడు మోసానికి తెరతీస్తున్నారు. మొదట సగం డబ్బులు పేమెంట్ చేస్తేనే ఆర్డర్ పంపుతామని, మొత్తం డబ్బులు ముందే తమ ఖాతాకు పంపితే డిస్కౌంట్ ఆఫర్లు ఉంటాయని ఊరిస్తున్నారు. ఇది నమ్మి డబ్బులు పంపిన తర్వాత ఎదురు చూపులే తప్ప..పళ్లు రావడంలేదు. చివరికి తాము మోసపోయామన్న తత్వం బోధపడుతోంది మామిడి ప్రియులకు. ఆన్లైన్ మామిడిపళ్ల పేరుతో దేశవ్యాప్తంగా ఎన్నో నకిలీ వెబ్సైట్లు ఉన్నట్టు వెలుగులోకి వస్తున్నదని కేంద్ర హోం శాఖ పరిధిలో సైబర్ నేరాలపై అప్రమత్తంచేసే పోర్టల్ ‘సైబర్ దోస్త్’వెల్లడించింది. ఈ తరహాలో దేశవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదవుతున్నందున ఆన్లైన్లో పళ్ల కొనుగోలులో జాగ్రత్త పడాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసేముందే అది నిజమైన వెబ్‌సైటా లేక నకిలీదా అన్నది నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. వీలైనంత వరకు ముందుగా డబ్బులు పంపకపోవడమే ఉత్తమమని వారు సూచిస్తున్నారు. ఒకవేళ మోసపోయినట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్లో ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. -
కర్నూలులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు
-
సింపుల్‌గా కోట్లు కొట్టేస్తున్నారు.. టాప్‌లో మహారాష్ట్ర
సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న సైబర్ నేరాలు భారత దేశంలోనూ లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నాయి. చిరు ఉద్యోగుల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ఎవరినీ సైబర్ నేరగాళ్లు వదలడంలేదు. కంప్యూటర్, ఫోన్లతోనే సింపుల్‌గా పని కానిచ్చేస్తూ ఏటా వందల కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా సైబర్ మోసగాళ్లు రూ.731.27 కోట్లు దోచేశారని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మూడేళ్లలో 2.13 లక్షల సైబర్ మోసాలు జరిగినట్లు తెలిపింది. ఏటీఎం, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ అప్లికేషన్, బ్యాంక్ సర్వర్ నుంచి కస్టమర్ల సమాచారాన్ని హ్యాకింగ్ చేయడం ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. ఈ మోసాలను అరికట్టడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజలను హెచ్చరిస్తూ అప్రమత్తం చేస్తోందని, డిజిటల్ చెల్లింపు భద్రతా నిబంధనలను అమలు చేయాలని బ్యాంకులకు సూచించినట్లు పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల సైబర్ భద్రతను మెరుగుపరిచేందుకు, సైబర్ మోసాల నిరోధం, కంప్యూటర్ భద్రతపై జాతీయ నోడల్ ఏజెన్సీ అయిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వివిధ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికం గత మూడేళ్లలో మహారాష్ట్రలో అత్యధికంగా 83,974 సైబర్ మోసాలు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో రూ.240 కోట్లు కొట్టేసినట్లు చెప్పింది. ఆ తరువాత తమిళనాడులో 18,981 సైబర్ మోసాల్లో రూ.69.84 కోట్లు దోచుకున్నారు. హరియాణలో 18,573 కేసుల్లో రూ.66.98 కోట్లు, కర్ణాటకలో 11,916 మోపాల్‌లో రూ.60.75 కోట్లు కాజేశారు. తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మోసాల సంఖ్య తక్కువగానే ఉంది. తెలంగాణలో 6,900 మోసాల్లో రూ.21.76 కోట్లు కాజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 1,885 సైబర్ మోసాల్లో రూ.5.69 కోట్లు కాజేసినట్లు పేర్కొంది. సైబర్ మోసాల కట్టడికి తీసుకున్న చర్యలు ♦ అన్ని రకాల సైబర్ నేరాలపై ఫిర్యాదులకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ప్రారంభం ♦ బాధితులకు సహాయం చేయడానికి టోల్ ఫ్రీ నంబర్ ♦ వినియోగదారుల డేటాను గోప్యంగా ఉంచాలని బ్యాంకులకు సూచన ♦ డిజిటల్ సేవల ప్రక్రియను సురక్షితంగా ఉంచడానికి నియంత్రణ చర్యలు చేపట్టాలని బ్యాంకులకు ఆదేశం ♦ సైబర్ మోసాలపై అవగాహన కల్పించేందుకు బ్యాంకులు, ఏటీఎంలలో పోస్టర్లు ♦ అన్ని లావాదేవీలకు ఆన్లైన్ హెచ్చరికలను తప్పనిసరి ♦ లావాదేవీల మొత్తంపై రోజువారీ పరిమితులు -
ఒక్క ఆధార్.. 11,000 సిమ్ కార్డులు!
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన మహేశ్వర్ (పేరు మార్చాం) ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి. ఒక రోజు నో యువర్ కస్టమర్ (కేవైసీ) అప్డేట్ చేసుకోవాలని, లేకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందని అతని సెల్‌ఫోన్‌కు సందేశం వచ్చింది. దీంతో నిజమేనని నమ్మిన మహేశ్వర్.. మెసేజ్లోని లింక్‌పై క్లిక్ చేసి, అందులో బ్యాంకు ఖాతా నంబరు, ఇతరత్రా వ్యక్తిగత వివరాలు నమోదు చేశాడు. అంతే.. ఆ తర్వాత కొన్ని సెకన్లకే తన ఖాతాలో సొమ్ము విత్‌డ్రా అయినట్టు బ్యాంకు నుంచి సందేశం వచ్చింది. అతను కంగారు నుంచి తేరుకునేలోపు ఖాతా మొత్తం ఖాళీ చేసేశారు సైబర్ నేరస్తులు. దీంతో లబోదిబోమంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో బాధితుడికి సందేశం వచ్చిన ఫోన్ నంబర్, దానికి అనుసంధానించిన గుర్తింపు కార్డును, బ్యాంకు ఖాతా వివరాలను సైబరాబాద్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సేఫ్టీ (సీఓఈసీఎస్)లో విశ్లేషించగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ మోసాలు, డేటా లీకు, నకిలీ వెబ్సైట్లు వంటి సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో ఉన్న తెలంగాణ పోలీసులకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ సేఫ్టీ (సీఓఈసీఎస్) విశ్లేషిస్తుంటుంది. ఇదే క్రమంలో కేవైసీ మోసం కేసును కూడా విశ్లేషించింది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో కేవలం ఒక్క ఆధార్ కార్డు గుర్తింపుతో 11 వేల సిమ్ కార్డులు జారీ అయినట్లు సీఓఈసీఎస్ పోలీసులు గుర్తించారు. రెండు సిమ్‌లు నేరస్తుల చేతుల్లో.. సాధారణంగా కొత్త సిమ్‌కార్డు తీసుకోవాలంటే ధ్రువీకరణ పత్రంగా ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. టెలీకమ్యూనికేషన్ విభాగం (డీఓటీ) మార్గదర్శకాల ప్రకారం ఒక్క ఆధార్ కార్డుతో గరిష్టంగా 9 సిమ్ కార్డులను జారీ చేయవచ్చు. కానీ ఈ కేసులో థర్డ్ పార్టీ ఏజెన్సీలు డీఓటీ నిబంధనలను ఉల్లంఘించి ఏకంగా 11 వేలు సిమ్ కార్డులు జారీ చేశారు. కాగా ఇందులో రెండు సిమ్ కార్డులను సైబర్ నేరస్తులు వినియోగించారని, ఈ ఫోన్ నంబర్ల నుంచే బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు టెలీకమ్యూనికేషన్ విభాగాన్ని సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి సిమ్ కార్డులను జారీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. -
డేటా చోరీ సూత్రధారి దొరికాడు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద డేటా చౌర్యం కేసులో కీలక సూత్రధారిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశ జనాభాలో 50 శాతం ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి విక్రయిస్తున్న ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. 24 రాష్ట్రాలు, 8 మెట్రో నగరాలకు చెందిన సుమారు 70 కోట్ల మంది రహస్య సమాచారాన్ని తస్కరించినట్లు పోలీసులు గుర్తించారు. రక్షణ, విద్యుత్, ఇంధన శాఖ, జీఎస్టీ, ఆర్టీవోలతోపాటు ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, ప్రవాసులు, టీచర్లు, వైద్యులు, లాయర్లు, ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, గృహిణులు.. ఇలా 104 కేటగిరీలకు చెందిన ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని నిందితుడు చోరీ చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలివే.. వెబ్ డిజైనర్ నుంచి... హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ వెబ్ డిజైనర్‌గా పనిచేసేవాడు. ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయంతో డేటా సమీకరణ, విక్రయం గురించి తెలుసుకున్నాడు. వెబ్ డిజైనింగ్ కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల వివరాలను మార్కెటింగ్ ఏజెంట్లకు, సైబర్ నేరస్తులకు విక్రయించి సొమ్ము చేసుకొనేవాడు. అప్పనంగా డబ్బు వస్తుండటంతో ప్రజలు, సంస్థల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని సైతం తస్కరించాలని నిర్ణయించుకున్నాడు. డేటా సమీకరణ కోసం ఏకంగా 4.5 లక్షల మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. ఇందులో అమీర్ సొహైల్, మదన్ గోపాల్‌లు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. విక్రయం కోసం వెబ్సైట్.. తస్కరించిన డేటాను విక్రయించేందుకు ఇన్స్పైర్ వెబ్జ్ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. కస్టమర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాడు. క్లౌడ్ డ్రైవ్ లింక్‌ల ద్వారా మాత్రమే డేటాను విక్రయించేవాడు. ఇలా గత 8–12 నెలలుగా నిందితుడు డేటా తస్కరణ, విక్రయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు వినయ్ నుంచి రెండు సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న అమీర్, మదన్‌ల కోసం సైబరాబాద్ పోలీసు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఎలా వెలుగులోకి వచ్చిందంటే.. నగరానికి చెందిన ఓ వ్యక్తి నెల క్రితం ఓపెన్ సోర్స్ వెబ్సైట్లో తన వ్యక్తిగత సమాచారం చూసి కంగుతిన్నాడు. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సమాచారం ఎలా బహిర్గతమైందో కూపీ లాగారు. 10 రోజుల క్రితం రెండు కేసులలో 16 మంది డేటా చోరీ నిందితులను పట్టుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా.. వినయ్ భరద్వాజ్ పేరు వెలుగులోకి వచ్చింది. దీంతో అతనికి నోటీసులు జారీ చేసి అరెస్టు చేశారు. ఈ డేటాతో ఏం చేసేవారంటే.. మార్కెటింగ్ బృందాలు, ఏజెన్సీలు, సైబర్ నేరస్తులు నిందితుడి నుంచి డేటాను కొనుగోలు చేసేవారు. ఉత్పత్తుల ప్రచారం, మార్కెటింగ్ కోసం బల్క్ మెసేజ్‌లు పంపించడం కోసం ఏజెన్సీలు డేటాను కొనుగోలు చేశాయి. సైబర్ నేరస్తులు కొనుగోలు చేసిన డేటాతో ప్రజలను నమ్మించి మోసాలకు పాల్పడేవారు. ఎవరెవరి డేటా లీకైంది? ఏ సంస్థ, వ్యక్తులు లీకు చేశారు? వంటి సమస్త సమాచారాన్ని ప్రజలకు ఎలా చేరవేయాలనే అంశంపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సైబరాబాద్ డీసీపీ (క్రైమ్స్) కల్మేశ్వర్ శింగేన్వర్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజల డేటా కూడా.. నిందితుడు విక్రయించిన డేటాలో తెలంగాణ, ఏపీ ప్రజల డేటా కూడా ఉంది. హైదరాబాద్‌కు చెందిన 56 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2.10 కోట్ల మంది వ్యక్తిగత వివరాలను నేరస్తుడు విక్రయానికి పెట్టాడు. పన్ను చెల్లింపుదారులు, కంపెనీ సెక్రటరీలు, ఆడిటర్లు, ఉద్యోగస్తుల డేటా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటిలో వ్యక్తుల పేరు, ఫోన్ నంబరు, చిరునామా, ఈ–మెయిల్ ఐడీలు తదితర వివరాలున్నాయి. రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారం లీక్.. ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతానికి చెందిన 2.55 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల రహస్య సమాచారాన్ని నేరస్తుడు తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఇందులో ఉద్యోగుల వ్యక్తిగత వివరాలతోపాటు ర్యాంకు, పనిచేస్తున్న చోటు, విభాగం వంటి వివరాలున్నాయి. దీంతోపాటు ఎల్ఐసీ, విద్యుత్, ఇంధన శాఖ వంటి ప్రభుత్వ సంస్థల సమాచారం కూడా ఉంది. అలాగే 1.26 లక్షల మంది ప్రవాసులు, 5 లక్షల మంది హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ)ల డేటా కూడా అంగట్లో విక్రయానికి పెట్టేశాడు. విద్యార్థుల డేటా నేరస్తుల చేతుల్లో.. విద్యాసంస్థలతోపాటు విద్యార్థుల డేటా కూడా నేరస్తుల చేతుల్లోకి చేరింది. బైజూస్, వేదాంతు వంటి ఆన్లైన్ విద్యాసంస్థలకు చెందిన 18 లక్షలు మంది విద్యార్థులు, 1.8 లక్షల మంది నీట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు, 30 లక్షల మంది సీబీఎస్ఈ (10, 12వ తరగతి), 3.5 కోట్ల మంది ఇతర విద్యార్థుల డేటాను నేరస్తులు విక్రయానికి పెట్టారు. -
అప్పనంగా డేటా ఇచ్చేస్తున్నాం!
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత సాంకేతికత యుగంలో మన పేరు, ఫోన్ నంబర్, ఇంటి చిరునామా, పాన్, ఆధార్, ఈ–మెయిల్ అడ్రస్, పాస్వర్డ్లు కేవలం సమాచారం మాత్రమే కావు. మన జీవితాలను నిర్దేశించే అంశాలు. ఇవి సైబర్ నేరగాళ్ల చేతికి వెళితే బ్యాంకు ఖాతాలో ఉన్న మన కష్టార్జితం క్షణాల్లో హాంఫట్ అవ్వొచ్చు. మన పేరిట లోన్లు తీసుకొని ఎగ్గొట్టొచ్చు. కోట్ల మంది డేటాను కొల్లగొట్టిన ముఠా గుట్టును సైబరాబాద్ పోలీసులు ఇటీవలే రట్టు చేశారు. మన డేటా లీక్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైనా ఉందని, వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తప్పనిసరిగా అవగాహన ఏర్పరుచుకోవాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. రియల్ ఎస్టేట్ అమ్మకాలని, క్రెడిట్ కార్డులని, ఇన్స్టంట్ లోన్లని, మార్కెట్లోకి కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయని, కొత్త రెస్టారెంట్లు, షాపింగ్స్ మాల్స్ ప్రారంభోత్సవాలకు విచ్చేయాలంటూ దాదాపు నిత్యం మనకు అపరిచితుల నుంచి ఫోన్‌కాల్స్ రావడం పరిపాటిగా మారింది. అయితే వారందరికీ మన పేర్లు, ఫోన్ నంబర్లు, ఇంటి అడ్రస్‌లు, ఈ–మెయిల్స్ ఎలా తెలుస్తున్నాయి. మన వివరాలు మరెవరో కాదు... అప్పనంగా మనమే ఇచ్చేస్తున్నాం! తప్పక డిలీట్ చేయించాలి.. వివిధ అవసరాలు, ప్రభుత్వ పథకాల నిమిత్తం ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌బుక్ మొదటి పేజీ, వివిధ సర్టిఫికెట్ల వంటి వాటిని ఫొటోకాపీ తీయించుకోవడం అనివార్యమవుతోంది. అయితే అలాంటప్పుడు మనం వాట్సాప్ లేదా ఈ–మెయిల్ ద్వారా పంపిన వివరాలను ప్రింట్ అవుట్ తీసుకున్న తర్వాత ఆ జిరాక్స్ సెంటర్ లేదా నెట్ సెంటర్ నుంచి డిలీట్ చేయించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. కేస్ – 01 ‘గుడ్‌మార్నింగ్ సార్. యాదాద్రి దగ్గరలో కొత్త వెంచర్ ప్రారంభం కాబోతోంది. తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు. మీ సొంత ప్రాంతానికి వెళ్లే దారిలోనే వెంచర్ ఉంది. తీసుకోండి...’ అంటూ టెలికాలర్ ఫోన్ చేసి తన పేరు, పూర్తి చిరునామా చెప్పడంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవాక్కయ్యాడు. కేస్ – 02 ‘సార్.. మీరు వాడుతున్న ఫ్యూరిఫయర్తో పోలిస్తే మా ప్రొడక్ట్ అన్ని విధాలా ఉత్తమ మైనది. మీరు సరే అంటే మా ఏజెంట్‌ను మీ ఇంటికి డెమోకు పంపుతాం. మీ చిరునామా ఇదే కదా..’ అంటూ తన ఇంటి అడ్రస్‌ను ఓ ఉత్పత్తుల సంస్థ ఉద్యోగి ఫోన్లో చెబుతుంటే ఓ ప్రైవేటు ఉద్యోగి నోరెళ్లబెట్టాడు. లాటరీలు, కూపన్ల పేరుతో డేటా సేకరణ... మనం షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు లాటరీల కోసమనో లేదా గిఫ్ట్ కూపన్లు ఇచ్చేందుకనో మన వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు. అలా అడిగిందే తడవుగా రివార్డు పాయింట్ల కోసం, డిస్కౌంట్ల కోసం, గిఫ్ట్ కూపన్ల కోసం ఆశపడి మన వ్యక్తిగత వివరాలు ఇతరులకు ఇచ్చేస్తున్నాం. ఇలా పోగేసిన డేటాను కొందరు కేటుగాళ్లు కన్సల్టెన్సీలకు 5 పైసలకు ఒక కాంటాక్ట్ చొప్పున అమ్మకానికి పెట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఆయా కన్సల్టె న్సీలు కొన్ని వేల రూపాయల ఖర్చుతోనే కోట్ల మంది సమాచారాన్ని సేకరిస్తున్నాయి. ఈ తరహా సంస్థల నుంచి సైబర్ నేరస్తులు గంపగుత్తగా డేటాను కొని ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో ఉండే వ్యక్తిగత వివరాలను కొన్ని ఆన్లైన్ సంస్థలు డేటా ఎనలిటిక్స్ టెక్నిక్‌లతో సేకరించి వివిధ కంపెనీలకు వాణిజ్య ప్రకటనలు ఇచ్చేందుకు అమ్ముకుంటున్నాయి. డేటా ప్రైవసీలో యూరోపియన్ చట్టాలు ఎంతో కఠినం.. యురోపియన్ దేశాల్లో వ్యక్తిగత సమాచారం. వివరాలకు, వ్యక్తి గత గోప్యతకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. మన వివరాలను అను మతి లేకుండా ఎవరు తీసుకున్నా... వినియోగించినా వెంటనే వారిపై జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ చట్టం కింద భారీ జరిమానాలతోపాటు జైలుశిక్షలు విధించే అవకాశం ఉంది. ఆ తరహా చట్టాలు మన దేశంలోనూ వస్తేనే వ్యక్తిగత వివరాల గోప్యతకు రక్షణ ఉంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఇవ్వొద్దు... వీలైనంత వరకు మీ ఫోన్ నంబర్, చిరునామా, ఈ–మెయిల్ ఐడీ, ఆధార్, పాన్ వంటి వివరాలను ఇతరులకు ఇవ్వొద్దు. ఇలా ఇవ్వడం వల్ల మన డేటాను ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని గ్రహించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, ఢిల్లీ -
అయ్యో! ఆర్డర్ మీది కాదా? క్యాన్సిల్ చేస్తా.. ఓటీపీ చెప్పండి చాలు..
ఇంటి లోపల మీరేదో పనిలో ఉంటారు.. ఈలోగా డెలివరీ బాయ్ వచ్చి తలుపు తడతాడు. ఆర్డర్ వచ్చిందంటాడు. మీరేమీ ఆర్డర్ ఇవ్వలేదే అనుకుంటూ అదే సమాధానం చెబుతారు. ‘లేదు.. లేదు మీ అడ్రస్‌తోనే బుక్ అయింది’ అని నమ్మబలుకుతారు. ఒకవేళ బుక్ చేయకుంటే.. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవడానికి మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది చెప్పండి చాలు అంటారు. వారిని నమ్మి మీరు ఓటీపీ చెప్పారో.. ఇక అంతే.. సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. జనంలో అవగాహన పెరిగిన అంశాల్లో కాకుండా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఇప్పటివరకు ఓఎల్ఎక్స్లో వస్తువుల అమ్మకం, కొనుగోలుకు సంబంధించిన మోసాలు ఉంటుండగా తాజాగా మీషో, క్వికర్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆన్లైన్లో వస్త్రాలు, ఇతర గృహోప కరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోళ్లకు సంబంధించి మోసాలకు తెరతీస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు పెరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇదీ మోసం తీరు.. ఆన్లైన్లో మనం ఆర్డర్ ఇవ్వకుండానే మీ ఇంటికి డెలివరీ బాయ్స్ వచ్చి మీకో ఆర్డర్ వచ్చిందంటారు. తీరా మనం ఆ ఆర్డర్ ఇవ్వలేదని చెబితే పొరపాటున మీ అడ్రస్‌తో ఈ ఆర్డర్ బుక్ అయినట్లుందని నమ్మబలుకుతారు. ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఆ డబ్బులు మా జీతంలోంచి కట్ అవుతాయని, మా కమీషన్ పోతుందని జాలి నటిస్తారు. మీ ఫోన్ నంబర్‌కు ఓటీపీ వచ్చింది దయచేసి అది చెప్పండి చాలు అని నమ్మబలుకుతారు. వారిని నమ్మి మనం ఓటీపీ చెప్పిన వెంటనే అప్పటికే మన వివరాలు సేకరించి ఉంటున్న సైబర్ నేరగాళ్లు మన ఫోన్‌ను తమ అధీనంలోకి తీసుకుని మన బ్యాంకు ఖాతాలు కొల్లగొడతారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. మనం ఆర్డర్ ఇవ్వకుండానే వస్తు్తవులు రావని గుర్తుంచుకోవాలి. మనం ఇవ్వని ఆర్డర్‌ను మనం క్యాన్సిల్ చేయాల్సిన పనిలేదు. ఆర్డర్ క్యాన్సిలేషన్ పేరిట ఎవరైనా ఓటీపీ అడిగితే చెప్పవద్దు. అది సైబర్ మోసం అని గుర్తించాలి. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోకుండా నగదు చెల్లింపులు చేయకండి. మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేముందు ఆ కంపెనీ ప్రొఫైల్, రేటింగ్ తప్పక గమనించాలి. సైబర్ మోసం జరుగుతున్నట్లు అనుమానం ఉంటే వెంటనే దగ్గరలోని సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. లేదా 1930 నంబర్‌కు కాల్ చేసి వివరాలు ఇవ్వాలి. ఏ వివరాలు ఇవ్వొద్దు.. ఆన్లైన్లో వచ్చిన ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసేందుకు ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే వివరాలు చెప్పవద్దు. మీరు ఆర్డర్ ఇవ్వకుండా వస్తువులు మీ పేరిట రావని గుర్తించాలి. ఓటీపీ, ఇతర వివరాలు, బ్యాంక్ ఖాతాల గురించి అడిగితే అది కచ్చితంగా మోసమని గ్రహించాలి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలోనూ ఆ వెబ్సైట్ నమ్మకమైనదేనా? లేదా? అని తెలుసుకోవాలి. ఆన్లైన్లో వస్తువుల కొనుగోలు, అమ్మకాల్లోనూ మోసం జరిగే ప్రమాదం ఉందన్న విషయాన్ని మరవొద్దు. –శ్రీనివాస్,సైబర్ క్రైం ఇన్స్పెక్టర్ -
లైక్,షేర్.. చీటింగ్
విజయవాడ స్పోర్ట్స్: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుని యువత విలవిల్లాడుతున్నది. అత్యాశకు పోయి రూ.లక్షలకు లక్షలు సమర్పించుకుంటుంది. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నిత్యం ఈ తరహా ఘటనలు ఎక్కడో ఓచోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో విజయవాడ సీతారామపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. వర్క్ ఫ్రం హోంలో భాగంగా ప్రస్తుతం సీతారామపురంలోని తన ఇంటి నుంచే పనిచేస్తున్నది. ఈ నెల ఐదో తేదీన తన వాట్సాప్‌కు వచ్చిన మెసేజ్‌కు ఆకర్షితురాలై వెంటనే మెసేజ్లోని వెబ్‌సైట్‌ను క్లిక్ చేసింది. వెబ్సైట్లోకి వెళ్లి వివరాలను చెక్ చేసుకుంటుండగానే సదరు కంపెనీ నుంచి ఆమెకు ఫోన్ కాల్ వచ్చింది. ‘ఇన్‌స్టా గ్రాం, యూ ట్యూబ్, ఫేస్బుక్లో వచ్చే వీడియోలు చూసి లైక్, షేర్ చేస్తే డబ్బులు చెల్లిస్తామని, ఇంట్లో కూర్చునే నెలకు లక్షలు సంపాదించవచ్చు అని ఫోన్లో చెప్పిన వ్యక్తి మాటలను నమ్మింది. యువతికి టాస్క్‌లు మొదలయ్యాయి. ఆ రోజు తన సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కాసేపు విరామం ఇచ్చి ఈజీగా వచ్చే డబ్బుల కోసం తాపత్రయపడి కష్టపడి కొత్త పని టాస్క్‌లు పూర్తి చేసింది. వెంటనే ఆమె బ్యాంక్ ఖాతాలో రూ.1,200 జమయ్యాయి. దీంతో అదే పనిగా మరుసటి రోజు టాస్క్‌లు పూర్తి చేయడంతో మళ్లీ రూ. 2 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. యువతి బానిసత్వాన్ని గ్రహించిన సైబర్ నేరగాళ్లు ఆమెను అప్పుడే అసలైన ముగ్గులోకి దించారు. ‘రూ.5 వేలు డిపాజిట్ చేసే కొన్ని పేరున్న కంపెనీల టాస్క్‌లు ఇస్తాం, ఆ కంపెనీ ప్రొడక్టస్కు రేటింగ్ ఇవ్వాలంతే.. ఇది సింపుల్ టాస్క్.. ఎక్కువ లాభాలొస్తాయి..!’ అని నమ్మించారు. రూ.5 వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేసి వెబ్సైట్ వాలెట్ చెక్ చేసుకుంది. అందులో రూ.10 వేలు జమకావడంతో ఆనందంతో విత్‌డ్రా చేసుకుందామని విఫలయత్నం చేసింది. వెంటనే కంపెనీ ప్రతినిధులను ఫోన్లో సంప్రదించింది. రూ. ఏడు వేలు డిపాజిట్ చేసి టాస్క్ పూర్తి చేస్తే మీ వాలెట్లో ఉన్న రూ.10 వేలు తీసుకొవచ్చని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ఆ విధంగానూ చేసినా డబ్బు రాలేదు. బాధితురాలు డబ్బులు డిపాజిట్ చేస్తూనే ఉంది.. తీసుకోవడానికి వీలు లేని డబ్బులు వాలెట్లో పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధంగా ఆ యువతి కేవలం 10 రోజుల్లో 14 లక్షల 13 వేల 900 రూపాయలను చెల్లించిన తరువాత సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాలో విసురుతున్న వలలో నిరుద్యోగులతో సహా ఉద్యోగులు, ఉన్నత విద్యావంతులు పడుతుండడం గమనార్హం. ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల కేంద్రంగా ఈ తరహా మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. జిల్లాలో పెరుగుతున్న ఘటనలు ఈ ఆన్లైన్ మోసాల బాధితులు రోజురోజుకీ పెరుగుతున్నారు. నిత్యం స్మార్ట్ ఫోన్‌కే అంకితమవుతున్న వ్యక్తులు ఈ సైబర్ ఉచ్చులో పడుతున్నారు. ఈ ఏడాది జనవరి మూడో తేదీ నుంచి ఫిబ్రవరి 22వ తేదీ వరకు ఈ తరహా ఘటనలపై సైబర్ పోలీస్ స్టేషన్లో 19 కేసులు నమోదయ్యాయి అప్రమత్తంగా ఉండండి.. స్మార్ట్ ఫోన్ వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. సులువుగా డబ్బులు వస్తాయని నమ్మి మోసపోవద్దు. ఈ తరహా ఘటనల్లో సైబర్ నేరగాళ్లు ప్రత్యేకంగా రూపొందించుకున్న ప్రోగ్రామింగ్ ద్వారానే వెబ్ లింక్స్‌ను తయారు చేస్తారు. డబ్బులు చెల్లింపులు యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్, నెఫ్ట్ తదితర పద్ధతుల ద్వారా సేకరిస్తారు. నేరగాళ్ల కదలికలపై నిఘా ఉంచాం. బాధితులకు న్యాయం చేస్తాం. – టి.కె.రాణా, పోలీస్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా -
సిటీ కంపెనీలకు ‘హిడెన్‌బర్గ్ బూచి’
సాక్షి, సిటీబ్యూరో: ‘హిడెన్‌బర్గ్–అదానీ గ్రూప్’ ఎపిసోడ్ దాదాపు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో ఇటీవల సైబర్ నేరగాళ్లు ఈ తరహా కార్పొరేట్ బెదిరింపులకు దిగుతున్నారు. బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థ శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బంజారాహిల్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థకు రూ.వేల కోట్ల టర్నోవర్, దేశ వ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. దీని అధికారిక ఐడీకి ఈ నెల మొదటి వారంలో ఓ ఈ–మెయిల్ వచ్చింది. అమెరికాకు చెందిన ప్రముఖ ఆడిట్ కంపెనీ పంపినట్లు అందులో ఉంది. అందులో అనేక అవకతవకలకు పాల్పడుతూ, రికార్డులను తారుమారు చేయడంతోనే మీ సంస్థకు ఇంత మొత్తం టర్నోవర్ ఉన్నట్లు తమకు తెలిసిందని బెదిరించారు. ఈ విషయం తాము సుదీర్ఘ పరిశోధన తర్వాత గుర్తించామని రాశారు. కొన్ని సందేహాలు తీర్చుకోవడానికి కంపెనీ నిర్వాహకుల వివరాలతో పాటు ఫైనాన్స్ స్టేట్మెంట్స్ తమకు పంపాలని మెయిల్లో కోరారు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉండాలంటే తక్షణం తమకు 75 వేల డాలర్లు బిట్ కాయిన్స్ రూపంలో బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తమ సంస్థకు సంబంధించిన సమస్త సమాచారం పబ్లిక్ డొమైన్‌లోనే ఉండటం, ప్రముఖ ఆడిటింగ్ కంపెనీగా చెప్తున్న వారికి ఈ విషయం తెలియకపోవడంతో అనుమానించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరో పక్షం రోజుల తర్వాత అదే ఐడీ నుంచి వీరికి మరో ఈ–మెయిల్ వచ్చింది. అందులో డిమాండ్ చేసిన మొత్తం లక్ష డాలర్లు పెరిగిపోయింది. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న నిర్వాహకులు సొంత ఐటీ టీమ్‌తో ప్రాథమిక దర్యాప్తు చేయించారు. ఈ నేపథ్యంలో దాన్ని బెంగళూరుకు చెందిన సైబర్ నేరగాళ్లు అమెరికా సర్వర్‌ను వాడి పంపినట్లు తేల్చారు. దీంతో సదరు సంస్థ జనరల్ మేనేజర్ శుక్రవారం సిటీ సైబర్ కైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. -
వచ్చేస్తున్నారు.. సైబర్ కమాండోలు
సాక్షి, హైదరాబాద్: పోలీసు కమాండోలు అంటే మనకు తెలిసిందే. ప్రత్యేక ఆపరేషన్ల కోసం శిక్షణ పొంది రెప్పపాటులో శత్రు శ్రేణులపై దాడి చేస్తారు. అదే తరహాలో ఇప్పుడు రాష్ట్రంలో సైబర్ కమాండోలు రంగంలోకి దిగనున్నారు. రోజుకో సవాల్ విసురుతున్న సైబర్ నేరస్తుల ఆటకట్టించేందుకు ఇప్పటికే శిక్షణ పొందారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మూడు డివిజన్లు, 14 విభాగాలుగా ఏర్పాటైన ఈ బ్యూరో మరో రెండు నెలల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు సిద్ధమైంది. కమిషనరేట్‌లో ఠాణా, జిల్లాలో సైబర్ సెల్స్.. రాష్ట్రంలో సైబర్ నేరాలను నియంత్రించేందుకు చేపట్టాల్సిన చర్యలు, విధివిధానాలపై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. సైబర్ నేరాలను కూకటివేళ్లతో సహా పెకిలించేలా క్షేత్రస్థాయి నుంచే సైబర్ నేరాలను నివారించేందుకు ఈ బ్యూరో పనిచేయనుంది. ఈ బ్యూరోలో ప్రధానంగా మూడు డివిజన్లు, 14 విభాగాలుంటాయి. ప్రధాన కార్యాలయం సైబరా బాద్ కమిషనరేట్‌లో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్లు సహా వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లలో ప్రత్యేకంగా సైబర్ పోలీసుస్టేషన్ ఉంటుంది. మిగిలిన జిల్లాలలో సైబర్ కో–ఆర్డినేట్ సెల్స్ ఉంటాయి. స్థానిక పోలీసుల సహకారంతో సైబర్ నేరాల నివారణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు విధులు నిర్వర్తిస్తారు. అధికారులకు విధుల కేటాయింపు.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 454 మంది అధికారులను కేటాయించింది. ఆయా పోలీసులు హ్యాకింగ్, ఫిషింగ్, సైబర్ భద్రతపై శిక్షణ పూర్తి చేసుకొని సైబర్ కమాండోలుగా సిద్ధమయ్యారు. 140 మంది వారియర్లు సైబరాబాద్ కమిషనరేట్‌లోని ప్రధాన కార్యాల యంలో, మిగిలిన 314 మంది ఇతర కమిషనరేట్లు, జిల్లా కేంద్రాల్లో విధులు నిర్వర్తించనున్నారు. సైబర్ సెక్యూరిటీబ్యూరో ప్రధాన విధులివే.. ►సైబర్ నేరాలకు పాల్పడేవారిని గుర్తించడం, ఆయా రాష్ట్రాల సహకారంతో పట్టుకోవడం ►బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికం ఆపరేటర్ల నోడల్ ఏజెన్సీలతో ఎప్పటి కప్పుడు సంప్రదింపులు జరుపుతూ నేర గాళ్లు కొల్లగొట్టిన డబ్బును స్తంభింప జేయడం. ►నకిలీ బ్యాంకు ఖాతాలు, తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఉన్న ఫోన్ నంబర్లను గుర్తించి నియంత్రించడం. ►పలుమార్లు నేరాలకు పాల్పడే అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ నిందితులను గుర్తించి పీడీ యాక్ట్‌లు నమోదు చేయడం. అంతర్రాష్ట్ర నిందితుల ఆటకట్టు రాజస్తాన్, బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి రాష్ట్రాలు సైబర్‌నేరాలకు అడ్డాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అంతర్రాష్ట్ర నేరస్తు లను పట్టుకొనేందుకు వెళ్లిన రాష్ట్ర పోలీసులకు అక్కడి పోలీసులు సహకరించకపోవడం, నేరస్తు లు పోలీసులపై కాల్పులు, దాడులు జరపడం కూడా జరిగాయి. ఈ తరహా ఆటంకాలకు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిష్కారమార్గాలను కను గొంది. ఇతర రాష్ట్రాల పోలీసు విభాగాలు, కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) వంటి సంస్థల సమన్వయంతో ఈ బ్యూరో పనిచేయనుంది. -
రూ.520కే గన్ డెలివరీ!
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా కేవలం ఫోన్ ద్వారానే కథ నడుపుతూ అందినకాడికి దండుకునే సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో తయారైన నాటు, నీటు తుపాకులను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఫేస్‌బుక్‌లోని మార్కెట్ ప్లేస్ కేంద్రంగా ప్రచారం చేసి మోసాలకు పాల్పడుతున్నారు. తుపాకీకి డబ్బు ఇప్పుడు చెల్లించాల్సిన పనిలేదని, కేవలం రూ.520 అడ్వాన్స్‌గా చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. ఇందులో బాధితులు కోల్పోతున్నది చిన్న మొత్తాలే కావడంతో ఎవరూ పోలీసుల వరకు వెళ్లి ఫిర్యాదులు చేయడం లేదు. దీన్నే అదనుగా భావిస్తున్న అనేక ముఠాలు ఈ తరహా నేరాలకు పాల్పడి అనునిత్యం రూ.లక్షల్లో కొల్లగొడుతున్నాయి. తుపాకుల ప్రచారంపై ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్ట్. (ఇన్సెట్లో) వాట్సాప్ డీపీలో ఉన్న ఫొటో వీడియో రూపంలో ప్రకటన.. ఫేస్బుక్లో ఆల్ ఇండియా డెలివరీ పేరుతో ఓ పేజ్ ఏర్పాటు చేసిన సైబర్ నేరగాళ్లు అందులో తుపాకులు, తపంచాలు, కత్తులకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఈ పేజ్ పైనే 86384 67582 అనే మొబైల్ నంబర్ కూడా ఉంటోంది. దేశవ్యాప్తంగా ఎక్కడికైనా డెలివరీ చేస్తామంటూ ఓ లింకును పెడుతున్నారు. ఈ ప్రకటనకు ఆకర్షితులైన వాళ్లు ఈ లింక్ క్లిక్ చేస్తే.. అది నేరుగా వాట్సాప్‌కు వెళ్తోంది. ఫేస్బుక్ పేజ్ పైన ఉన్న నంబర్‌తోనే పని చేసే ఈ వాట్సాప్ ఖాతాకు డిస్ప్లే పిక్చర్ (డీపీ)గా ఆయుధాలను పక్కన పెట్టుకుని పడుకున్న యువకుడి ఫొటో ఉంటోంది. ఫేస్బుక్ ద్వారా ఈ వాట్సాప్ ఓపెన్ కావడంతోనే తెరిచిన వ్యక్తి ఆ ఆయుధాల వివరాలు తెలుసుకోవాలని భావిస్తున్నట్లు సందేశం సైతం పోస్టు అవుతోంది. రకరకాల ఫొటోలు షేర్ చేసి.. ఆ వెంటనే స్పందిస్తున్న సైబర్ నేరగాళ్లు వివిధ రకాల తుపాకులకు సంబంధించిన 20–30 ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఎదుటి వారిని పూర్తిగా నమ్మించడానికి ఈ ఫొటోలు కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసినట్లు ఉండకుండా జాగ్రత్తపడుతున్నారు. చేత్తో పట్టుకుని, వాహనాలపై ఉంచి, వస్త్రాల్లో భద్రంగా కట్టి ఉంచిన తుపాకుల ఫొటోలనే షేర్ చేస్తున్నారు. వీటిని చూసిన వాళ్లు అవతలి వారి దగ్గరే అవి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇవతలి వ్యక్తి వాటి ఖరీదు చెప్పమంటూ ఆరా తీస్తే... తొలుత ఓ తుపాకీ ఎంచుకుని దాన్ని తనకు రిటర్న్ షేర్ చేయమంటూ సైబర్ నేరగాడు సూచిస్తున్నాడు. అలా చేసిన తరువాత ఆ తుపాకీ ధరను రూ.3 వేల నుంచి రూ.5 వేల మధ్య చెప్పి, ఎక్కడకు కావాలంటే అక్కడకు తెచ్చి ఇస్తామంటున్నాడు. పరీక్షించడం కోసమూ చెల్లింపులు.. తమ వద్ద ఏ తుపాకీ ఖరీదు చేసినా దాంతో పాటు పది తూటాలు ఉచితంగా ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. ఆయుధానికి పూర్తి మొత్తం ముందుగా చెల్లించాల్సిన పనిలేదని, అడ్వాన్స్‌గా కేవలం రూ.520 చెల్లిస్తే డెలివరీ చేస్తామని, ఆ తర్వాత మిగిలిన డబ్బులు చెల్లించాలని నమ్మబలుకుతున్నారు. తుపాకులపై ఆసక్తి ఉన్న వాళ్లు, తక్కువ ధరకు వస్తోందని భావించిన వారిలో కొందరు ఇది నిజమా? కాదా? అనేది తెలుసుకోవడానికి చెల్లింపులు చేస్తున్నారు. ఈ అడ్వాన్స్‌ను 89509 45896 నంబర్‌కు వాట్సాప్ చేయాలంటూ సైబర్ నేరగాళ్లు సూచిస్తున్నారు. ఆ మొత్తం పంపే వరకు సందేశాలు పంపుతూనే ఉంటున్నారు. ఒకసారి తన ఖాతాలో ఆ డబ్బు పడిన తర్వాత బాధితుల నంబర్లను బ్లాక్ చేయడం, వేరే నంబర్ నుంచి కాల్ చేసినా ఎత్తకపోవడం వంటివి చేస్తున్నారు. తాము కోల్పోయింది చిన్న మొత్తమే అనే భావనతో బాధితులూ ఫిర్యాదులు చేయట్లేదు. దీంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. ఇది మోసం కాకపోయినా నేరమే.. ఇలాంటి మోసాల్లో ఒక బాధితుడు కోల్పోయేది తక్కువే అయినా... వారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో నేరగాళ్లకు చేరేది రూ.లక్షల్లోనే ఉంటుంది. ఈ తరహా నేరాల్లో నేరగాళ్లు వినియోగిస్తున్న ఫోన్ నంబర్లు, బ్యాంకు ఖాతాలు బోగస్ వివరాలతో లింకై ఉంటాయి. అందువల్ల వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్లను పట్టుకోవడం కష్టసాధ్యం. అయితే బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం ఆ బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేయించడం ద్వారా వారిని కొంతవరకు కట్టడి చేయొచ్చు. ఇలాంటి మోసపూరిత ప్రకటనల ఉచ్చులో ఎవరూ పడకూడదు. ఇది మోసం కాకుండా నిజంగా ఆయుధాలు డెలివరీ అయినా అదీ నేరమే అవుతుంది. లైసెన్సు లేకుండా ఎవరూ ఎలాంటి ఆ«యుధాలూ కలిగి ఉండరాదు. – డి.ప్రభాకర్ నాయుడు, సైబర్ క్రైమ్ నిపుణుడు -
ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!
సాక్షి, హైదరాబాద్: కష్టపడకుండానే డబ్బు వస్తుందన్న ఆశే ఇప్పుడు పోలీస్ కేసులు కొందరి మెడకు చుట్టుకోవడానికి కారణమవుతోంది. కంటికి కనిపించకుండానే బ్యాంకు ఖాతాలు కొల్లగొడుతున్న సైబర్ కేటుగాళ్లు.. డబ్బుకు ఆశపడే కొందరిని తమ మోసాలకు పావులుగా వాడుకుంటున్నారు. ‘పారసైట్’బ్యాంకు అకౌంట్లను వాడుతూ కోట్లు కొల్లగొడుతున్నారు. పోలీసులు ఎంతో శ్రమించి ఆరా తీస్తే చివరికి అమాయకులు పట్టుబడుతున్నారు. కమిషన్ కోసం బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇస్తే కేసుల్లో ఇరుక్కోక తప్పదని సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు పాటిబండ్ల ప్రసాద్ హెచ్చరించారు. ఖాతాలు.. కమీషన్లు.. వర్క్‌ఫ్రం హోం పేరిట.. ఎవరైనా తమ వ్యాపారాలు చాలించాలనుకునే వారు తమ కంపెనీలను అమ్మేస్తున్నట్టు ప్రకటనలు ఇస్తే.. అలాంటి వారిని సైబర్ నేరగాళ్లు ఆన్లైన్లో సంప్రదిస్తున్నారు. ‘మీ కంపెనీ కరెంట్ ఖాతాను మాకు వాడుకోవడానికి ఇస్తే.. ప్రతి నెలా రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తాం’అంటూ గాలం వేస్తున్నారు. ఇదే తరహాలో సేవింగ్స్ ఖాతాలు ఉన్నవారినీ ప్రలోభ పెడుతున్నారు. డబ్బు వస్తుంటే ఎందుకు పోగొట్టుకోవాలన్న ఆశతో కొందరు ఇందుకు ఓకే అంటున్నారు. ఇలా సేకరించిన కరెంట్, సేవింగ్స్ ఖాతాలను సైబర్ నేరగాళ్లు అక్రమ సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి వాడుతున్నారు. ఇలా ట్రాన్స్ఫర్ చేసే చోట కూడా తాము చిక్కకుండా.. అమాయకులను వాడుకుంటున్నారు. ‘వర్క్‌ఫ్రం హోం.. ఇంటి దగ్గర కూర్చునే రోజూ వేలు సంపాదించండి..’అని ఆన్లైన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కమిషన్ ఆశచూపి పనికి పెట్టుకుంటున్నారు. వారికి పుష్ బటన్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. దానికి ఆటో డెబిట్, క్రెడిట్ కార్డులను జత చేస్తారు. ముందస్తుగానే తప్పుడు ఆధార్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులను వాడి వీరికి ఎస్ఎంఎస్ పంపుతారు. డబ్బులను వారు సూచించిన ఖాతాల్లో వేసేలా పుష్బటన్ యాప్‌లను వాడాలని సూచిస్తారు. మొత్తానికి.. సైబర్ నేరాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టినప్పుడు ‘పారసైట్’బ్యాంకు ఖాతాల యజమానులు, పుష్బటన్ యాప్‌ల ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన వ్యక్తులు మాత్రమే పట్టుబడుతుంటారు. అసలు సైబర్ నేరగాళ్లు తప్పించుకుంటారు. ఇలాంటి నేరాలకు సైబర్ నేరగాళ్లు ఎక్కువగా టెలిగ్రామ్ వంటి యాప్స్‌ను వేదికగా చేసుకుంటున్నారని పాటిబండ్ల ప్రసాద్ తెలిపారు. ఖాతాలు ఇచ్చి ఇరుక్కున్న 233 మంది సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు ఇటీవల ఓ అంతర్జాతీయ ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టును బయటపెట్టారు. అమాయకుల నుంచి కొల్లగొట్టిన రూ.24 కోట్లను సీజ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆరా తీస్తే.. దొరికినవారంతా అమాయకులే. డబ్బుల ఆశతో తెలిసీతెలియక సైబర్ నేరస్తులకు సహకరించినవారే. సైబర్ నేరగాళ్లు కమీషన్లు ఇస్తామనడంతో బ్యాంకు ఖాతాలు ఇచ్చినవారు, వాటి నుంచి డబ్బుల ట్రాన్స్ఫర్లు చేసినవారే. ఇలాంటి బ్యాంకు ఖాతాలను సైబర్ భద్రత నిపుణులు ‘పారసైట్’అకౌంట్లుగా పిలుస్తున్నారు. ఇలా తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చిన 233 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. సైబర్ మోసంలో వారిని పాత్రధారులుగానే పరిగణిస్తామని స్పష్టం చేశారు. కొద్దిమొత్తాలుగా చేసి.. బిట్కాయిన్లుగా మార్చి.. సైబర్ నేరగాళ్లు కొట్టేసిన డబ్బును చిన్నచిన్న మొత్తాలుగా మార్చి వాటిని తొలుత వందల బ్యాంకు ఖాతాల్లోకి పంపుతారు. తర్వాత ఆ ఖాతాల నుంచే ఆన్లైన్లో బిట్కాయిన్లుగా మార్చుతున్నారు. బిట్కాయిన్లను విదేశీ బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి సొమ్ముగా మార్చుకుంటున్నారు. ప్రధానంగా చైనాకు చెందిన పలు యాప్స్ కంపెనీలు ఈ నేరాలకు పాల్పడుతున్నాయి. అవన్నీ కూడా తమ కంప్యూటర్ సర్వర్లను హాంగ్‌కాంగ్, సింగపూర్, చైనా, ఇరాన్ వంటి దేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నాయని.. ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని సైబర్ నిపుణులు చెప్తున్నారు. మన దేశంలోని దర్యాప్తు సంస్థలు ఈ మోసాలను గుర్తించినా అసలు దోషులను కనిపెట్టడం కష్టమని అంటున్నారు. -
కాల్ చేసి స్కాన్ చేయాలని తొందరపెడుతున్నారా? ఖాతా ఖాళీ కావడం ఖాయం!
►కొండాపూర్‌కు చెందిన స్వామినాథన్ తన 3 బీహెచ్‌కే ఇంటిని నెలకు రూ.20 వేలకు అద్దెకు ఇస్తానంటూ రియల్ ఎస్టేట్ వెబ్సైట్లో యాడ్ ఇచ్చారు. రెండురోజుల తర్వాత ఒక వ్యక్తి తాను సీఐఎస్ఎఫ్ అధికారి రాజ్‌దీప్‌సింగ్ అని, తనకు పుణే నుంచి హైదరాబాద్‌కు బదిలీ అయ్యిందంటూ పరిచయం చేసుకున్నాడు. ఇంటి అద్దె అడ్వాన్స్ చెల్లిస్తానని చెప్పి తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మిగతా డబ్బు పంపిస్తానంటూ స్వామినాథన్‌ను గందరగోళానికి గురిచేసి, తాను పంపిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, పిన్ నంబర్ ఎంటర్ చేయాలంటూ తొందరపెట్టాడు. స్వామినాథన్ అలానే చేయడంతో అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.2.5 లక్షలు అవతలి వ్యక్తికి బదిలీ అయిపోయాయి. ►బల్క్ ఆర్డర్ల పేరిట ఒకేసారి 20 ఫ్రిజ్‌లు కావాలని ఓ షోరూం నిర్వాహకులకు ఒక అపరిచిత వ్యక్తి కాల్ చేశాడు. ఆన్లైన్లో డబ్బులు చెల్లిస్తానంటూ వాళ్లు పంపిన క్యూఆర్ కోడ్ ద్వారా తొలుత కొంత డబ్బు పంపాడు. ఆ తర్వాత మరోసారి డబ్బులు పంపించానని, ఆ నగదు మధ్యలో ఆగిపోయిందని చెబుతూ తాను పంపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ ఎంటర్ చేయాలంటూ కంగారు పెట్టాడు. అతడు చెప్పినట్టు చేసిన షోరూం నిర్వాహకులు రూ.10 లక్షలు పోగొట్టుకున్నారు. సాక్షి, హైదరాబాద్: నగదు లావాదేవీల్లో భాగంగా ఆన్లైన్ చెల్లింపులు పెరిగిపోయాయి. కొందరు అసలు నగదు అనే మాటే లేకుండా లావాదేవీలన్నీ ఆన్లైన్లోనే చేసేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ డబ్బులు కొల్లగొడుతున్నారు. ఆన్లైన్ పరిజ్ఞానం అంతగా లేని అమాయకుల్ని మాటలతో మభ్యపెట్టి, గందరగోళానికి గురిచేసి, కంగారు పెట్టేస్తూ బోల్తా కొట్టిస్తున్నారు. రెగ్యులర్‌గా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించే వారు కూడా కొన్నిసార్లు వీరి బారిన పడుతూ వేలు, లక్షల రూపాయలు నష్టపోతున్నారు. కేటుగాళ్లు కూర్చున్న చోటు నుంచి కదలకుండానే తమ జేబులు నింపుకుంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు అనుసరిస్తున్న సైబర్ నేరగాళ్లు.. తాజాగా క్యూఆర్ (క్విక్ రెస్పాన్స్) కోడ్ స్కానింగ్‌తో చేసే చెల్లింపులు ఆధారంగా చేసుకుని బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. సరికొత్త మోసం.. క్యూరిషింగ్ ఇటీవలి కాలంలో క్యూఆర్ కోడ్ వినియోగం గణనీయంగా పెరిగిపోయింది. జేబులో నగదు ఉండాల్సిన పనిలేదు. బ్యాంకులో డబ్బు, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. పెద్ద షోరూంలు మొదలుకుని చిన్న కిరాణా షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా చెల్లింపులు చేయడం సర్వసాధారణంగా మారిపోయింది. నగదు చెల్లింపులకే కాదు.. పెద్ద కంపెనీలు తమ వెబ్సైట్లు, బిజినెస్ కార్డులు, బ్రోచర్లు, ఇలా ప్రతి సమాచారమూ స్కాన్ చేస్తే చాలు వచ్చేలా క్యూఆర్ కోడ్ ఆప్షన్ ఇస్తున్నాయి. దీంతో సైబర్ దోపిడీగాళ్లు క్యూఆర్ కోడ్‌పై దృష్టి పెట్టారు. దీన్ని వినియోగిస్తూ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును, అది కుదరకపోతే ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని కొట్టేస్తున్నారు. ఈ సరికొత్త సైబర్ మోసాన్ని సైబర్ సెక్యూరిటీ నిపుణులు క్యూరిషింగ్గా చెబుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరించాలి క్యూఆర్ కోడ్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘సైబర్ నేరగాళ్లు క్యూఆర్ కోడ్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. నకిలీ క్యూఆర్ కోడ్లను సృష్టిస్తున్నారు. వీటిని ఉపయోగించి మన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేస్తున్నారు. అనుమానాస్పద క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసినప్పుడు మనకు తెలియకుండానే మన మొబైల్ ఫోన్లోకి కొన్ని సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అవుతుంటాయి. లేదంటే క్యూఆర్ కోడ్‌ను మనం స్కాన్ చేయగానే మనల్ని అవి అన్‌సేఫ్ (సైబర్ నేరగాళ్ల అధీనంలో ఉండే) వెబ్సైట్లలోకి తీసుకెళ్లేలా యూఆర్ఎల్ లింకులు జత చేసి ఉంటున్నాయి’అని చెబుతున్నారు. క్యూఆర్ కోడ్ మోసాలకు ఇక్కడే ఎక్కువ.. ►గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఫ్రీ రీచార్జ్ వంటి యూపీఐ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌లలో జరిగే లావాదేవీలను నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ►వెబ్సైట్లో వస్తువుల అమ్మకాల విషయంలో ఎక్కువగా ఈ తరహా మోసాలు జరుగుతున్నాయి. ►కోవిడ్ వెరిఫికేషన్ పేరిట కూడా సైబర్ నేరగాళ్లు ఫేక్ క్యూఆర్ కోడ్లను పోస్ట్ చేస్తున్నారు. ► బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పార్కింగ్ ప్రదేశాల్లో, ఇతర కంపెనీలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లపైనా నకిలీ క్యూఆర్ కోడ్ లింక్‌లు పెడుతున్నారు. ఇలా చేస్తే మేలు.. ►అపరిచితులు పంపే ఈ మెయిల్స్, వాట్సాప్, ఇతర డాక్యుమెంట్లలోని క్యూఆర్ కోడ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ స్కాన్ చేయవద్దు. ►క్యూఆర్ కోడ్ కింద రాసి ఉన్న యూఆర్ఎల్ లింక్, మనం స్కాన్ చేసిన తర్వాత వచ్చిన వివరాలు ఒకేలా ఉన్నాయా లేదా? అన్నది సరిచూసుకోవాలి. ►యూపీఐ ఐడీలు, బ్యాంక్ ఖాతాల వివరాలు అపరిచితులతో ఎట్టిపరిస్థితుల్లో షేర్ చేసుకోవద్దు. ►ఓఎల్ఎక్స్ లేదా ఇతర వెబ్సైట్లలో వస్తువుల క్రయ, విక్రయాలు చేసేటప్పుడు వీలైనంత వరకు ఆన్లైన్ చెల్లింపుల కంటే నగదు లావాదేవీలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్లైన్ చెల్లింపుల్లో తొందరపడొద్దు ఆన్లైన్ వెబ్సైట్లలో కొనుగోళ్లు చేసేటప్పుడు తొందరపడొద్దు. అవతలి వ్యక్తులు మనల్ని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని, పిన్ ఎంటర్ చేయాలని గందరగోళ పెడుతున్నట్లయితే అది మోసమని గ్రహించాలి. మనకు పంపే క్యూఆర్ కోడ్‌ను గమనించినా..మన బ్యాంకు ఖాతా నుంచే డబ్బులు కోతకు గురవుతాయని గుర్తించవచ్చు. – బి.రవికుమార్‌రెడ్డి, డీఎస్పీ, సీఐడీ సైబర్ క్రైమ్స్ -
‘పబ్లిక్ వైఫై’ వాడుతున్నారా? అయితే జర జాగ్రత్త..!
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడంతా ఇంటర్నెట్ జమానా...నెట్‌తో కనెక్ట్ కాకుండా క్షణం ఉండలేని పరిస్థితి. ఆన్లైన్ షాపింగ్ మొదలు..ఆఫీస్‌కు ఇన్ఫర్మేషన్ పంపే వరకు ఎప్పుడైనా ఎక్కడైనా..ఇంటర్నెట్ సదుపాయం తప్పనిసరి. కొన్ని సార్లు ప్రయాణంలో ఉన్నప్పుడు, బయట అనుకోని పరిస్థితుల్లో మన ఫోన్లో నెట్ బ్యాలెన్స్ లేనప్పుడు ఫ్రీ వైఫైల వైపు చూడడం పరిపాటే.. అయితే ఇకపై పబ్లిక్ వైఫైలు వాడుతున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అందుబాటులో ఉండే వైఫై వినియోగించి మనం ఈ మెయిల్, ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఓపెన్ చేయడం,, ఆన్లైన్ బ్యాంక్ లావాదేవీలు చేస్తే మనం నమోదు చేసే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లను సైబర్ నేరగాళ్లు మాల్వేర్ ద్వారా హ్యాక్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పబ్లిక్ ప్రాంతాల్లోని వైఫై వాడినట్లయితే సైబర్ నేరగాళ్లు మన వ్యక్తిగత సమాచారం సైతం కొట్టేసే ప్రమాదం ఉంటుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. వీలైనంత వరకు పబ్లిక్ వైఫై వాడకుండా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో అయితే నమ్మదగిన వీపీఎన్(వర్చువల్ ప్రైవేటు నెట్వర్క్)ను ముందుగా ఇన్స్టాల్ చేసుకోవాలంటున్నారు. వీపీఎన్ ఉండడం వల్ల మన ఫోన్లోని సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. -
వేలిముద్రలు కొట్టేసి.. బ్యాంకు ఖాతా లూటీ చేసి..
సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త తరహా మోసానికి తెర తీస్తున్నారు. తాజాగా ‘ఆధార్’ను ఆధారంగా చేసుకుని దోచుకుంటున్నారు. ‘ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏఈపీఎస్)’ మోసాలు క్రమంగా పెరుగుతున్నట్లు సైబర్ క్రైం పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాలు హరియాణా, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లో ఇటీవల పెరిగాయన్నారు. ఇవి తెలంగాణలోనూ అక్కడక్కడ వెలుగు చూస్తున్నట్టు తెలిసింది. ఇటీవలే తెలంగాణ సీఐడీ విభాగంలోని సైబర్ క్రైం పోలీసులు ఈ తరహా కేసులో నిందితుడిని బిహార్‌లో అరెస్టు చేసి నగరానికి తెచ్చారు. ఈ తరహా మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. – సాక్షి, హైదరాబాద్ ఇలా జరిగితే అప్రమత్తం కావాలి మీకు తెలియకుండానే ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ విధానంలో మీ బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు పోయినట్టు గుర్తిస్తే వెంటనే మీ ఆధార్ కార్డుతో అనుసంధానమైన మీ వేలిముద్రలను డిజేబుల్ చేసుకోవాలని సైబర్‌క్రైం పోలీసులు సూచించారు. ఆధార్ వివరాలు గుర్తు తెలియని వ్యక్తులకు ఎట్టిపరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దన్నారు. వివిధ మార్గాల్లో దొంగిలించిన వేలిముద్రలను సిలికాన్ ఫింగర్ ప్రింట్స్‌గా రూపొందించి వాటి ద్వారా ఏఈపీఎస్ విధానంలో ఆధార్ లింకై ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కొట్టేస్తున్నట్టు తెలిపారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే.. ►ఏఈపీఎస్ సదుపాయాన్ని తరచుగా వాడనట్లయితే బ్యాంకు ఖాతా నుంచి ఆ సదుపాయాన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. ►మీ బయోమెట్రిక్ దుర్వినియోగం కాకుండా ఆధార్ వెబ్సైట్లోకి (https:// resident. uidai. gov. in/ aadhaar& lockunlock) వెళ్లి ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసుకోవాలి. ►వీలైనంత వరకు ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు ఆధార్‌కార్డ్ కాపీలు ఇవ్వకూడదు. ఒకవేళ ఆధార్‌కార్డును ఏదైనా ధ్రువీకరణ కోసం వాడాల్సి వస్తే తప్పకుండా మాస్క్డ్ ఆధార్ (ఆధార్ నంబర్పూర్తిగా కనిపించకుండా ఉండేది) కాపీని వాడుకోవాలి. ►సైబర్ నేరం జరిగినట్టు గుర్తిస్తే వెంటనే 1930 నంబర్‌కు లేదా www. cybercrime. gov. in లో ఫిర్యాదు చేయాలి. ►అనధికార వెబ్సైట్లు, ఏజెన్సీల వారికి వేలిముద్రలను ఇవ్వవద్దు. మాస్క్డ్ ఆధార్ అంటే? ఆధార్ కార్డులోని మొత్తం 12 నంబర్లలో మొదటి ఎనిమిది నంబర్లు కనిపించకుండా (వాటి స్థానంలో గీగీగీ గుర్తులు ఉంటాయి) కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే దాన్ని మాస్క్డ్ ఆధార్ అంటారు. ఆధార్ వెబ్సైట్లోకి వెళ్లి మాస్క్ ఆధార్ ఆప్షన్ ఆన్ చేసి పెట్టుకుంటే మన ఆధార్‌కార్డు ఆన్లైన్లో ఎవరు డౌన్లోడ్ చేసినా పూర్తి వివరాలు కనిపించవు. దీని వల్ల ‘ఆధార్’మోసాలు జరగకుండా కాపాడుకోవచ్చు. ఏఈపీఎస్ అంటే..? ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (ఏపీపీఎస్) అంటే.. ఏటీఎంలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నగదు లావాదేవీల కోసం బ్యాంకు ఏర్పాటు (మైక్రో ఏటీఎంలుగా పేర్కొనవచ్చు) చేసేవి. ఏ బ్యాంక్ ఏజెంట్ అయినా ఆధార్ అథెంటిఫికేషన్ ద్వారా ఇతర ఏ బ్యాంకునకు సంబంధించిన నగదు లావాదేవీలనైనా ఆన్లైన్లో చేయొచ్చు. ఇందుకోసం ఖాతాదారుడి పేరు, బ్యాంక్ ఖాతాకు లింకైన ఆధార్ నంబర్, ఆధార్ నమోదు సమయంలో ఇచ్చిన వేలిముద్ర ఉంటే సరిపోతుంది. సదరు ఖాతాదారుడు ఏఈపీస్ విధానంలో నగదు తీసుకోవాలంటే సంబంధిత బాం్యక్ ఏజెంట్ దగ్గరకు వెళ్లి బ్యాంకు పేరు, ఆధార్ నంబర్, వేలిముద్ర ఇస్తే సరిపోతుంది. సరిగ్గా ఇదే అంశాన్ని కొందరు మోసగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ విభాగం వెబ్సైట్ నుంచి వేలిముద్రలను సేకరించి వాటిని సిలికాన్ షీట్ల ద్వారా నకిలీ వేలిముద్రలను తయారు చేస్తున్నారు. వీటి ద్వారా ఆన్లైన్లో డబ్బులు కొల్లగొడుతున్నారు. -
రెట్టింపు లాభం అంటూ రూ.కోట్లు కొట్టేశారు
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టండి..మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద ఏకంగా రూ.1.90 కోట్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌కు కొంతమంది వ్యక్తులు పరిచయమై తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు. అలాచేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. దీంతో సదరు ఇంజనీరు అత్యాశకు పోయి కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అయితే సైబర్‌నేరగాళ్లు చెప్పినసమయానికి అనుకున్నట్లు గానే రెట్టింపు మొత్తాన్ని ఇంజనీరు ఖాతాలో జమ చేశారు. ఇలా పలుమార్లు షేర్లు కొనుగోలు చేయగా..మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఏకంగా రూ.1.90 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే తిరిగి డబ్బులు రావాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అమెరికాలో ఉన్నా వదలట్లేదు.. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి
హైదరాబాద్: అమెరికాలో ఉంటున్న నగర వాసులను టార్గెట్ చేస్తూ వారి నుంచి రూ.లక్షలు కాజేసేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి వాట్సాప్ గ్రూపుల్లో చొరబడి వారి వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి దానికి ఢిల్లీలో ఉన్న నేరగాళ్లకు ఇస్తున్నారు. దీంతో ఈ నేరగాళ్లు నగరానికి చెందిన కొందరు యువతులతో వారికి వాట్సాప్ కాల్స్ చేయిస్తూ రుణాలు ఎగ్గొట్టారని కేసులు నమోదు చేయిస్తామని బెదిరిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లేని పక్షంలో లోన్ ఫ్రాడర్ అంటూ ప్రచారం చేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. ఓ యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సిటీ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాట్సాప్ గ్రూపుల్లోకి చొరబడి... నగరం నలుమూలల నుంచి అమెరికాలోని పలు ప్రాంతాలకు వెళ్లి విద్య, ఉద్యోగం చేస్తున్న తెలుగు వారు వాట్సాప్ గ్రూపులు నిర్వహిస్తుంటారు. తెలిసిన వారి ద్వారా ఆయా గ్రూపుల్లో యాడ్ అవుతున్న కొందరు వ్యక్తులు గ్రూపులోని యువతుల ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. ట్రూకాలర్ ద్వారా వారి పేరును గుర్తించి దాని ద్వారా ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ ఐడీలను సేకరిస్తున్నారు. వీటితో పాటు వారి ఫొటోలు, వారి ప్రొఫైల్స్‌లో ఉన్న మరికొందరి ఫొటోలు, పేర్లను తెలుసుకుంటున్నారు. ఈ సమాచారాన్ని ఢిల్లీకి చెందిన సైబర్ నేరగాళ్లకు అందజేస్తున్నారు. ఆఫీసుకు రావాలంటూ ఒత్తిడి ఈ సమాచారం ఆధారంగా ఢిల్లీ, నోయిడాలో ఉంటున్న సైబర్ నేరగాళ్లు అమ్మాయిలకు వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ప్రముఖ బ్యాంకుల పేర్లు చెబుతూ, లీగల్, రికవరీ టీం సభ్యులుగా పరిచయం చేసుకుంటున్నారు. తమ బ్యాంకులో రుణం తీసుకుని దాన్ని కట్టకుండా పారిపోయారని, ఒక్క రోజులో రుణాన్ని చెల్లించకపోతే తీవ్ర పరిమాణాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. మీకు రూ. లక్ష పెద్ద మొత్తం కాదని, ఇవ్వకపోతే మీ ఫొటోతో సహా లోన్ఫ్రాడర్ అంటూ మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్ ద్వారా పంపడమే కాకుండా, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ పేజీల్లో పోస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఇదే క్రమంలో స్నేహితులకు ఫోన్ చేసి రాధ (పేరుమార్చాం) రుణం తీసుకుంది, రెఫరెన్స్ కింద మీ పేరు ఇచ్చారు. ఆమె కడుతుందా..లేక మీరు చెల్లిస్తారా అంటూ వే«ధిస్తున్నారు. వారి ఒత్తిడి తట్టుకోలేక కొందరు రూ. లక్షే కదా అంటూ నేరగాళ్లకు పంపినట్లు కూడా పోలీసులు గుర్తించారు. యువతి ఫిర్యాదుతో వెలుగులోకి.. అమీర్‌పేటకు చెందిన ఓ యువతి అమెరికాలో ఉద్యోగం చేస్తుంది. ఆమెకు ఇటీవల ఢిల్లీ నుంచి ఓ వ్యక్తి ఫోన్ చేసి రుణం కట్టాలని తీవ్ర ఒత్తిడి చేశాడు. ఆమె ఈ తతంగాన్ని మాకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. యూఎస్‌లో నివాసం ఉంటున్న మీ పిల్లలు, స్నేహితులు, బంధువులు ఇటువంటి ఫోన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. – కేవీఎం ప్రసాద్, సైబర్‌క్రైం ఏసీపీ -
సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన గుంటూరు జిల్లా యువతి
-
వీడియో కాల్‌తో విపత్తు.. ఫోన్ లిఫ్ట్ చేశామో పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి..
సాక్షి, బెంగళూరు: సైబర్ కేటుగాళ్లు కొత్త అస్త్రంగా వాట్సాప్ వీడియో కాల్ ద్వారా వల వేస్తున్నారు. గుర్తుతెలియని లింక్‌ల ద్వారా అశ్లీల వీడియోలను పంపుతారు, వాటిని చూస్తే చాలు దీనిని అడ్డు పెట్టుకుని బ్లాక్మెయిల్ కు పాల్పడి డబ్బు గుంజేస్తారు. అందులో ఎక్కువగా ఇటీవల విశ్రాంత ఉద్యోగులు, వృద్ధులను టార్గెట్‌గా చేసుకున్నారు. పోర్న్ చిత్రాలతో ఎడిట్ చేసి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా గ్రాంలో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి పరిచయం చేసుకుని మోసానికి పాల్పడడం, లేదా నేరుగా వాట్సాప్‌లో వీడియో కాల్ చేయడం జరుగుతుంది. వీడియో కాల్చేసి మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా నగ్నచిత్రాలు చూపిస్తారు. అలా కాల్‌ను స్క్రీన్‌షాట్ లేదా రికార్డ్ చేసుకుని బ్లాక్‌మెయిల్‌కు దిగుతారు. డబ్బులు ఇవ్వకపోతే లైంగికంగా వేధించారని కేసు పెడతామని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పరువు తీస్తామని హెచ్చరిస్తారు. దీంతో ఎక్కువమంది డబ్బులు పంపించి మోసపోయారు. అలాగే వాట్సప్, ఎస్ఎంఎస్ల ద్వారా లింక్‌లను పంపి ఇదే తరహా మోసాలు జరుగుతున్నాయి. ఒకరికి రూ. 6.95 లక్షల టోపీ ఆర్పీసీ లేఔట్లో నివాసం ఉండే విశ్రాంత అధికారి వంచనకు గురై రూ.6.95 లక్షలు పోగొట్టుకున్నాడు. గత నెల 20వ తేదీన అంకితా గుప్త అనే మహిళ అతని వాట్సాప్‌కు వీడియో కాల్చేసింది. ఫోన్ తీయగానే అటువైపు నుంచి నగ్నవీడియో కనబడింది. ఈ దృశ్యాలను వంచకులు రికార్డుచేసుకుని వీడియో ఎడిట్ చేశారు. ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే యువతి నగ్నవీడియో చూడటాన్ని సోషల్‌మీడియాలో అప్లోడ్ చేస్తామని చెప్పి రూ.6.95 లక్షలు కాజేశారు. చివరకు బాధితుడు పశ్చిమ విభాగ సీఈఎన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. చదవండి: (మీరే రూల్స్ ధిక్కరిస్తారా?.. పోలీసులకు క్లాస్ పీకిన మహిళ) సైబర్‌క్రైం పోలీసుల సలహాలు ►ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్‌స్టా అకౌంట్ల ప్రొఫైల్స్ లాక్ చేయడం మంచిది. డేటాను నేరగాళ్లు సేకరించే అవకాశం ఉండదు ►గుర్తుతెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి ►గుర్తుతెలియని నంబరు నుంచి వీడియో కాల్ వస్తే జాగ్రత్త వహించాలి ►అశ్లీల వీడియోలు, ఫోటోలు చూడటం, ఆ వెబ్సైట్లలో చాటింగ్ చేయడం మంచిదికాదు. ►ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే తక్షణమే సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. యువతికి రూ.2.33 లక్షల వంచన బనశంకరి: మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో వరుని కోసం గాలిస్తున్న యువతి నుంచి మోసగాడు రూ.2.33 లక్షలు కాజేశాడు. ఉళ్లాల ఉపనగరకు చెందిన సుస్మిత (28) వరుడు కావాలని వివరాలు నమోదు చేసింది. రాజీవ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. నేను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని త్వరలో భారత్‌కు వస్తానని చెప్పాడు. ఇద్దరూ కాల్స్, చాటింగ్ చేసుకుంటూ ఉన్నారు. భారత్‌కు రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. కొద్దిరోజులకిందట ఫోన్‌చేసి తాను ఇండియాకు వచ్చానని, తన వద్ద ఉన్న విదేశీ కరెన్సీని మార్చుకోవడానికి కొంత రుసుము కావాలని చెప్పగా సుస్మిత అతని ఖాతాలకు రూ.2.33 లక్షలు పంపింది. ఇక అప్పటి నుంచి రాజీవ్ పత్తా లేడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
Hyderabad: మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కొంపముంచిన ‘చిత్రాలు’
హిమాయత్‌నగర్(హైదరాబాద్): నగరానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆమె పెయింటింగ్ చిత్రాలను కొనుగోలు చేస్తామంటూ లక్షల రూపాయిలు కాజేశారు. దీంతో బాధితురాలు శనివారం సిటీ సైబర్‌క్రైం పోలీసులను ఆశ్రయించింది. సోమాజిగూడలో నివాసం ఉండే ఆర్టిస్ట్ నగరంలోని ఓ ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేస్తోంది. ఖాళీ టైంలో పెయింటింగ్ వేసి ఆ చిత్రాలను తన ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్లో పోస్ట్ చేస్తుంటుంది. వీటిని చూసిన కేటుగాడు ఆమెతో మాట కలిపాడు. వాట్సప్ నంబర్ తీసుకుని చాట్ చేసి ఎన్ఎఫ్టీ ఇన్వెస్ట్మెంట్ వెబ్సైట్ వైపు రప్పించాడు. ఈ వెబ్సైట్లో పెయింటింగ్స్ కొనేవారు చాలా మంది ఉన్నారని నమ్మించాడు. తొలుత ఇన్వెస్ట్ చేస్తే లక్షలు వస్తాయన్నాడు. తన పెయింటింగ్స్ అమ్ముడవ్వాలనే ఆశతో ఆర్టిస్ట్ అతగాడు చెప్పిన విధంగా కొంత డబ్బు ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత దాని లాభాల కోసం ట్యాక్స్‌లు, కమీషన్ అంటూ పలు దఫాలుగా ఆమె నుంచి రూ.8లక్షలు కాజేశాడు. ఇంకా ఇంకా అడుగుతూ ఇబ్బంది పెడుతున్న క్రమంలో తాను మోసపోయానని గుర్తించి సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
5జీకి మారాలనుకుంటున్నారా? ఆ లింక్‌ను క్లిక్ చేశారంటే అంతే..
హలో మీరు 5జీకి మారాలనుకుంటున్నారా?, లింక్‌ను క్లిక్ చేయండి అంటారు. లేదా మీ 5జీ నంబర్‌ను బ్యాంకు ఖాతాకి లింక్ చేయాలి, ఓటీపీ చెప్పండి ప్లీజ్ అని అడిగితే అది మోసగాళ్ల పనేనని తెలుసుకోండి. 5జీ పేరుతో అప్పుడే సైబర్ నేరగాళ్లు సొమ్ము కాజేసే ప్రయత్నాలు ప్రారంభించారు. దేశంలో 5 జీ మొబైల్ సేవలు ప్రారంభమైన నేపథ్యంలో సైబర్ కేటుగాళ్లు అప్పుడే రంగంలోకి దిగారు. మీ నెట్‌వర్క్‌ను అప్డేట్ చేసుకోండి అని వంచనకు పాల్పడే అవకాశం ఉంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఇప్పటికే బెంగళూరు తో పాటు దేశవ్యాప్తంగా ఎంపికచేసిన కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా 5 జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడం తెలిసిందే. ప్రజలు 4 జీ నుంచి 5జీ కి అప్డేట్ కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అన్ని జిల్లాల్లో సైబర్ మోసాల పట్ల జాగృతం చేస్తున్నారు. జిల్లాకేంద్రాల్లో కరపత్రాలు ముద్రించి సార్వజనిక స్థలాల్లో పంచుతున్నారు. లింక్ ఓపెన్ చేయరాదు మొబైల్ 5 జీ నెట్‌వర్క్‌కు, బ్యాంక్ అకౌంట్ కు ఎలాంటి సంబంధం ఉండదు. సైబర్ వంచకులు బ్యాంకు ప్రతినిధుల ముసుగులో ఫోన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నంబరును 5 జీ నెట్వర్క్ కు అప్డేట్ చేస్తామంటారు. నమ్మి వారు చెప్పినట్లు చేస్తే చిక్కుల్లో పడతారని పోలీసులు హెచ్చరించారు. లింక్ పంపించి క్లిక్ చేయమంటే స్పందించరాదు. చదవండి: పులితో ఆటలా? అని అనకండి.. ముద్దులాటలు కూడా..! వైరల్ వీడియో నమ్మితే అంతే సైబర్ వంచకులు ఎయిర్టెల్, జియోతో పాటు ఇతర మొబైల్ నెట్వర్క్ కంపెనీల కాల్‌సెంటర్ల పేరుతో ఫోన్ చేస్తారు. సిమ్‌కార్డును 5 జీ కి అప్డేట్ చేస్తామని, ఓటీపీ ని చెప్పాలని నమ్మిస్తారు. ఓటీపీ చెప్పారో.. బ్యాంకు ఖాతాలో నగదు మాయం చేస్తారు. ఇటువంటి కాల్స్‌ను అస్సలు నమ్మరాదని పోలీసులు తెలిపారు. ఇటీవల వస్తున్న మొబైల్ స్మార్ట్ ఫోన్లు 5 జీ నెట్వర్క్ కు సపోర్ట్ చేస్తాయి. కానీ పాత మొబైల్స్ 4జీ నెట్‌వర్క్‌కు మాత్రమే సరిపోతాయి. ఈ నేపథ్యంలో సైబర్ వంచకులు, 4 జీ మొబైల్స్‌ను 5జీ కి అప్డేట్ చేస్తామని కాల్స్ చేయడం మొదలైంది. వాట్సాప్ మెసేజ్, లింక్‌లు పంపుతారు. వాస్తవంగా 4జి మొబైల్స్‌ని 5జీ కి అప్డేట్ చేయడం సాధ్యం కాదు. -
కొంప ముంచుతున్న అత్యాశ
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరాలపై పోలీసులు ఎంత ప్రచారం చేసినా కొందరిలో మార్పు రావటం లేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే అత్యాశ, చిన్న మొత్తంలో పొదుపు చేస్తే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని వాట్సాప్‌లలో లింకులు పంపిస్తూ సైబర్ నేరస్తులు అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరస్తుల చేతిలో చిక్కి డబ్బులు పోగొట్టుకుంటున్న వాటిలో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులే అధికంగా ఉంటున్నాయి. నేరస్తులు ఇతర రాష్ట్రీయులే.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బహుళ జాతి కంపెనీల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణులు, బ్యాంకింగ్ రంగం ఉద్యోగులు సైతం గ్రామీణ ప్రాంతాల్లో పదో తరగతి కూడా పాస్‌కాని సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోతున్నారు. ఇప్పుడు పెట్టుబడితో వారంలో డబుల్, త్రిబుల్ అవుతుందని చెప్పగానే నమ్మి మోసపోతున్నారు. సైబర్ బాధితుల్లో 60 శాతానికి పైగా ఐటీ ఉద్యోగులు ఉండటమే ఇందుకు నిదర్శనం. 200 శాతం పెరిగిన మోసాలు.. ఇతర సైబర్ నేరాలతో పోలిస్తే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 200 శాతం మేర పెరిగాయని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారి తెలిపారు. వ్యక్తిగత సమాచారాన్ని గుర్తు తెలియని వ్యక్తులకు ఇవ్వడమే మోసాలకు ప్రధాన కారణం. ఉద్యోగిణులు, ఐటీ ఉద్యోగులు, పెన్షన్‌దారులు కూడా నేరస్తులో వలలో పడిపోతున్నారు. వర్చువల్‌గా లాభాలు వచి్చనట్లు చూపించి, రూ.5 లక్షల నుంచి కోటి వరకు పెట్టుబడి పెట్టిస్తున్నారు. ఆ తర్వాత కాంటాక్ట్ కట్ చేస్తున్నారని వివరించారు. యాప్‌లలో పెట్టుబడితో లక్షల లాభం వచి్చనట్లు ఫోన్లో కనిపించినా అవి బ్యాంక్ ఖాతాలో జమ కావని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. (చదవండి: పండుగ ముగిసింది.. తిరుగు పయనం) -
కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాను వదలని సైబర్ నేరగాళ్లు
-
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
రాజస్థాన్ లో సైబరాబాద్ పోలీసులు భారీ ఆపరేషన్
-
ట్రేడింగ్ పేరుతో హాంఫట్
హిమాయత్‌నగర్: నగరానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. క్రిప్టో కరెన్సీ పేరుతో ఇద్దరి నుంచి లక్షల రూపాయిలు దండుకోగా..పర్సనల్ లోను పేరుతో మరో వ్యక్తి నుంచి లక్షలు కాజేశారు. రోజులు గడుస్తున్నా డబ్బు రాకపోవడంతో బాధితులు గురువారం సిటీ సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినర్‌కు చెందిన రోషన్‌అలీకి మూడేళ్ల క్రితం టాటాక్యాపిటల్ లోన్ డిపార్ట్మెంట్ నుంచంటూ ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. మీ ఫోన్‌నంబర్‌పై రూ.3లక్షలు పర్సనల్ లోన్ మంజూరు అయ్యిందన్నాడు. వివిధ కారణాలతో మొదట రూ.1లక్ష తీసుకున్నాడు. లోను అమౌంట్ పెరిగిందని ఆశ పెట్టి మూడేళల్లో పలు దఫాలుగా రూ.17లక్షలు కాజేశాడు. బోయినపల్లికి చెందిన రఘురాం అనే వ్యక్తి ఓ హోటల్లో మేనేజర్‌గా చేస్తున్నాడు. ఇతని ఫ్రెండ్ రఘురాంని హాంగ్‌కాంగ్‌లో ఉండే వ్యక్తికి వాట్సప్ ద్వారా పరిచయం చేశాడు. కొద్దిరోజులు ఇద్దరూ స్నేహితులుగా మాట్లాడుకున్నారు. తాము ఒక కంపెనీలో ట్రేడింగ్ చేస్తున్నామని నువ్వు కూడా పెట్టాలని కోరారు. అతగాడి మాటలకు నమ్మిన రఘురాం ఎఫ్‌టీఎక్స్ అనే ట్రేడింగ్‌లో పలు దఫాలుగా రూ.40లక్షలు పెట్టి మోసపోయాడు. మరో వ్యక్తిని క్రిప్టో కరెన్సీ పేరుతో ఆశ పెట్టి అతగాడి నుంచి రూ.7లక్షల 70వేలు దోచుకున్నారు. వీరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: మరీ ఇంత అరాచకమా.. భర్తను కాదని ప్రియుడితో జంప్.. ఆ తర్వాత..) -
బిహార్‌లో హైదరాబాద్ పోలీసులపై కాల్పులు
సాక్షి, హైదరాబాద్: సైబర్ క్రైమ్ కేసులో నేరస్తులైన కొందర్ని బిహార్ నుంచి నగరానికి తీసుకువస్తుండగా ఆదివారం సాయంత్రం అక్కడి నేరగాళ్లు సైబరాబాద్ పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. బిహార్‌కు చెందిన మిథిలేశ్ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి సైబర్ నేరాలకు పాల్పడి నగరంలోని పలువురిని నిండా ముంచాడు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఈనెల 11న బిహార్‌లోని నవాడాకు వెళ్లారు. నేరగాళ్లు అక్కడే ఉన్నట్లు గుర్తించి నలుగుర్ని అరెస్టు చేసి తీసుకు వస్తుండగా వారు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఈ ఘటనలో పోలీసులు సురక్షితంగా తప్పించుకున్నారు. కాగా, అప్పటికే పోలీసులు మిథిలేశ్ నుంచి రూ.1.22 కోట్లు నగదు, 3 లగ్జరీ కార్లు, 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చదవండి: రిక్షా డ్రైవర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళ -
చీకటి ఒప్పందాలు.. సైబర్ నేరస్తులతో బ్యాంకర్ల దోస్తీ
సాక్షి, హైదరాబాద్: ‘నగరానికి చెందిన ఓ బాధితురాలు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ మోసానికి గురైంది. తన అకౌంట్లోని సొమ్ము మాయం కాగానే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే సంబంధిత బ్యాంక్ ఖాతాను ఫ్రీజ్ చేయాలని పోలీసులు బ్యాంకు నోడల్ ఏజెన్సీకి సూచించారు. అయినా సైబర్ నేరస్తుడు బాధితురాలి అకౌంట్లోని సొమ్మును స్వాహా చేసేశాడు’.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు బ్యాంక్ అధికారులు కావాలనే అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడంలో ఆలస్యం చేశారన్న విషయం తెలిసి షాక్ గురయ్యారు. సైబర్ నేరస్తులు బ్యాంక్ అధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని, కొట్టేసిన సొమ్ములో వారికీ కమీషన్లు ఇస్తున్నారన్న నిజాలు తెలిసి విస్తుపోయారు. ఝార్ఖండ్, బిహార్ తదితర రాష్ట్రాల్లోని పలు బ్యాంక్‌లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అడ్మిని స్ట్రేటర్లు, బ్యాంకర్లు అందరూ నేరస్తులకు సహకరిస్తున్నారని సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఒకరు తెలిపారు. జీరో అకౌంట్లయిన జన్‌ధన్ ఖాతాల్లో రోజుకు రూ.లక్ష, రూ.2 లక్షల లావాదేవీలు జరుగుతున్నా పట్టించుకోవటం లేదని తెలిపారు. బ్యాంకు ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలు గుర్తిస్తే వెంటనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి దృష్టికి తేవాలి. అధికారులు వాటిని పట్టించుకోకుండా... నేరస్తులకు సహకరిస్తున్నారని ఆయన వివరించారు. చదవండి: మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నారాజ్! మ్యూల్ అకౌంట్లలోనే లావాదేవీలు.. నిరక్షరాస్యులు, పేదల గుర్తింపు కార్డులతో ఏజెంట్లు నకిలీ(మ్యూల్) అకౌంట్లను తెరిచి, పాస్‌బుక్, చెక్‌బుక్, డెబిట్ కార్డ్, ఫోన్ బ్యాంక్ కిట్ మొత్తాన్ని నేరస్తులకు అందజేస్తుంటారు. ఒక్కో ఖాతాకు రూ.25–30 వేలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ బినామీ అకౌంట్లలోనే సైబర్ మోసాల లావాదేవీలను నిర్వహిస్తున్నారు. గుజరాత్, బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి మ్యూల్ అకౌంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటి తాలూకు లావాదేవీలు మాత్రం బిహార్, ఝార్ఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల నుంచి చేస్తున్నారు. దీంతో కేసు దర్యాప్తులో సైబర్ క్రైమ్ పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాస్తవానికి ఖాతాదారుల చిరునామాలను ధ్రువీకరించిన తర్వాతే బ్యాంకులు అకౌంట్లను తెరవాలి. లేకపోతే వారి మీద కూడా ఐపీసీ 109 అబాట్మెంట్ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాచకొండ సైబర్ క్రైమ్‌లో నమోదయిన ఓ కేసులో బాధితుడి నుంచి కొట్టేసిన రూ.60 లక్షల సొమ్మును నేరస్తులు అసోంకు చెందిన ఒక ఓలా డ్రైవర్ అకౌంట్లో డిపాజిట్ చేశారు. ఆ డ్రైవర్ నగదును విత్‌డ్రా చేసి నేరస్తులకు అందించాడు. ఖాతాదారుకు ఆ లావాదేవీ మోసపూరితమైనదని తెలిసినా నేరస్తుడికి సహకరించిన నేపథ్యంలో పోలీసులు ఆ డ్రైవర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్ట్ టైం పని అని రూ.3 లక్షలు టోపీ
మైసూరు: పార్ట్ టైం పని ఇప్పిస్తామని నమ్మించి యువతి వద్ద సైబర్ మోసగాళ్లు సుమారు రూ. 3.38 లక్షలను కొట్టేశారు. మైసూరు నగరంలోని కెసరెలో ఈ ఘటన జరిగింది. ఎన్. మైత్రి బాధితురాలు. ఆమె మొబైల్ ఫోన్‌కు పార్ట్ టైమ్ పని ఉందని గుర్తు తెలియని వ్యక్తి మొబైల్ నుంచి మెసేజ్ లింక్ వచ్చింది. తరువాత ఆమె వాట్సాప్‌కు మరో మెసేజ్ వచ్చింది. మీకు పార్ట్ టైమ్ పని కోసం కొన్ని వస్తువులను పంపిస్తాము. మీరు ఇంటి వద్ద ఉండే పని చేసుకోవచ్చు, ఇందుకు కొంత రుసుము చెల్లించాలని మోసగాళ్లు చెప్పారు. వారు చెప్పిన నంబర్‌కు మైత్రి రూ.100 పంపింది. తరువాత తన బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను ఇచ్చింది. వెంటనే ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 3.38 లక్షల నగదు మాయమైంది. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్కీకి రూ.2.90 లక్షలు మోసం ఐటీ ఇంజనీర్ ఒకరు వెబ్సైట్ ద్వారా సెకెండ్ హ్యాండ్ కారు కొనాలని భారీగా డబ్బు కోల్పోయాడు. ఈ ఘటన మైసూరు నగరంలో చోటు చేసుకుంది. రామకృష్ణ నగరవాసి, టెక్కీ ఎం.మనోజ్ బాధితుడు. ఇతడు కార్‌వాలె అనే వెబ్సైట్లో తక్కువ ధరకు సెకెండ్ హ్యాండ్ కార్ల కోసం వెతికాడు. అందులో ఒక కారు నచ్చడంతో అక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేశాడు. వారు కాల్ ఎత్తకుండా, వాట్సాప్ ద్వారా సమాధానం ఇచ్చారు. వారు లింక్‌లో పంపినఒక వెబ్‌సైట్‌ను తెరిచి అన్ని వివరాలను నమోదు చేశాడు. కారును రూ.2.90 లక్షలకు అమ్ముతామని మోసగాళ్లు చెప్పారు, కారును మైసూరుకు తరలించడానికి రూ.3150 చార్జీ కట్టాలన్నారు. వారు చెప్పినట్లు మనోజ్ ఆన్లైన్లో నగదును చెల్లించాడు. తరువాత ఫోన్ చేయగా మోసగాళ్లు స్పందించలేదు. దీంతో టెక్కీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఆమె సౌందర్యమే శాపమైంది) -
కొత్త దారిలో సైబర్ మోసగాళ్లు
-
ఓటీపీతో లూటీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలికి చెందిన శ్రీనివాస్ హైటెక్ సిటీలో ఐటీ ఉద్యోగి. శనివారం ఉదయం ఆన్ లైన్ డెలివరీ బాయ్ ఫోన్ చేసి ‘సార్ మీకు డెలివరీ వచ్చింది. అడ్రెస్ ఎక్కడ అని అడిగాడు. అదేంటి నేనేమి ఆర్డర్ చేయలేదుగా డెలివరీ రావటం ఏంటని ప్రశ్నచాడు. అవునా అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను మీ ఫోన్ కి వచ్చిన ఓటీపీ చెప్పండని అడిగాడు బాయ్. సరే అని మెసేజ్లోని ఓటీపీ చెప్పాడు. అంతే క్షణాల్లో బ్యాంక్ ఖాతాలో అమౌంట్ ఖాళీ అయింద్ఙి ... ఇలా డెలివరీ బాయ్ స్కామ్ పేరిట సైబర్ నేరస్తులు లూటీ చేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఇలాంటి మోసాల కేసులు నమోదవుతున్నాయి. ఏమవుతుందో తెలియక బాధితులు ఠాణాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ లావాదేవీల్లో ఓటీపీ తెలుసుకొని సులభంగా నగదు కొట్టేస్తున్నారు సైబర్ నేరస్తులు. ఎంతో కీలకమైన ఓటీపీలను బాధితుల నుంచి చెప్పించుకునేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తున్నారు. డార్క్ వెబ్ నుంచి... సైబర్ నేరస్తులు ముందుగానే డార్క్ వెబ్ నుంచి మన ఫోన్ నెంబర్, అది అనుసంధానమై ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డ్ వివరాలు సేకరిస్తున్నారు. ఆ తర్వాత బాధితులకు ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేశారు కదా డెలివరీకి వచ్చాను మీ వీధిలోనే ఉన్నానని చెబుతున్నారు. నేను ఆర్డర్ ఇవ్వలేదని బాధితులు చెప్పగానే అయితే ఓటీపీ చెప్పండి క్యాన్సిల్ చేస్తామని నమ్మిస్తున్నారు. ఓటీపీ చెప్పగానే సెకన్లలో ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఓటీపీ ఎవరికీ చెప్పొద్దు ఓటీపీ అనేది ఆన్ లైన్ లో జరిపే లావాదేవి. అది మీకు మాత్రమే వస్తుంది. కొన్ని సెకన్లు మాత్రమే గడువు ఉంటుంది. ఎవరో పంపిస్తే ఓటీపీ రాదు. తెలియక ఓటీపీ చెప్పారంటే మీ బ్యాంక్ వివరాలు ఇతరులకు మీరే ఇచ్చినట్టు. ఎట్టిపరిస్థితుల్లో ఓటీపీ ఎవరికీ చెప్పకూడదు. – జీ శ్రీధర్, ఏసీపీ, సైబర్ క్రైమ్, సైబరాబాద్ (చదవండి: పదేళ్ల అన్వేషణకు తెర) -
సైబర్ దొంగ భలే స్మార్ట్ గురూ!
బనశంకరి: ఐటీ సీటీలో సైబర్ కేటుగాళ్లు వంచనకు కొత్తదారులు వెతుకుతున్నారు. ఇప్పటి వరకు బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఫోన్లు చేసి కేవైసీ, ఆధార్ అనుసంధానం పేరుతో ఓటీపీలు తెలుసుకొని నగదు కొల్లగొట్టేవారు. ప్రస్తుతం కొత్త పంథా అనుసరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లో థర్డ్ పార్టీ యాప్ ఇన్స్టాల్ చేయించి ఓటీపీ యాక్సెస్ లేకుండా సులభంగా మీ మొబైల్లో ఉన్న పూర్తిసమాచారం తెలుసుకుని అకౌంట్ నుంచి నగదు కొల్లగొడుతున్నారు. ఇలా సైబర్ వంచకుల బారినపడి లక్షలు పోగొట్టుకున్న బాధితులు సైబర్ క్రైం పోలీస్స్టేషన్లను ఆశ్రయిస్తున్నారు. ఫోన్‌పే, గూగుల్‌పేలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని సరిదిద్దే ముసుగులో వంచకులు మోబైల్ వినియోగదారులకు ఫోన్ చేస్తారు. ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండే థర్డ్‌పార్టీ యాప్‌లైన ఎనీడెస్క్ టీమ్వ్యూవర్హాస్క్, క్విక్‌సపోర్ట్, రిమోట్డ్రైడ్, ఏర్మిరర్, రిమోట్ కంట్రోలర్ లేదా స్క్రీన్‌షేర్ యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. దీంతో వినియోగదారులు యాప్‌లను డౌన్లోడ్ చేసుకున్న తక్షణం ఆ సెల్‌ఫోన్ ద్వారా జరిగే కార్యకలాపాలన్నీ వంచకుల చేతిల్లోకి వెళ్లిపోతాయి. దీంతో సులభంగా నెట్‌బ్యాంకింగ్ సమాచారం, పాస్వర్డ్స్, ప్రముఖ డేటా, వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరిస్తారు. బ్యాంకులో నగదు బదిలీకి ప్రయత్నిస్తారు. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీ వినియోగదారుడికి వెళ్లకుండానే వంచకులు తెలుసుకొని నగదు తమ ఖాతాలకు జమ చేస్తారు. బ్లాక్మెయిల్.. థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా స్మార్ట్ ఫోన్లను యాక్సెస్ చేసే సైబర్‌కేటుగాళ్లు మొబైల్స్‌లోని డేటా, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి తర్వాత ఫోన్ వినియోగదారులకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బు వసూలు చేస్తారు. ఇలాంటి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ముందు జాగ్రత్త చర్యలు: ఫోన్‌పే ఎలాంటి వ్యక్తిగత సమాచారం అడగదు. గూగుల్, ట్విట్టర్, ఫేస్బుక్లో ఫోన్‌పే వినియోగదారులు సహాయవాణి నెంబరు కోసం గాలించరాదు బ్యాంకింగ్ సమస్య లేదా ఏటీఎం వ్యాలిడిటి కొనసాగించే పేరుతో ఫోన్ చేసే వారికి సమాధానం ఇవ్వరాదు ప్లేస్టోర్‌లో పరిశీలించకుండా ఎలాంటి థర్డ్‌పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోరాదు మొబైల్లో పరిచయం లేని యాప్‌లను డిలిట్ చేయాలి ఎవరు ఫోన్‌చేసి అడిగినా ఓటీపీ, సీవీవీ, పిన్‌కోడ్ తెలపరాదు ప్రభుత్వం నుంచి లేదా నమ్మకమైన సంస్థ నుంచి అధికారిక యాప్ కాదా అని నిర్ధారించుకోవాలి. (చదవండి: