సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: మా కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టండి..మీ డబ్బు రెట్టింపు అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ వద్ద ఏకంగా రూ.1.90 కోట్లు కొట్టేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో నివాసముంటున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కొంతమంది వ్యక్తులు పరిచయమై తమ కంపెనీ షేర్లు కొనుగోలు చేయాల్సిందిగా కోరారు.
అలాచేస్తే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని ఆశ చూపారు. దీంతో సదరు ఇంజనీరు అత్యాశకు పోయి కొన్ని షేర్లు కొనుగోలు చేశాడు. అయితే సైబర్‌నేరగాళ్లు చెప్పినసమయానికి అనుకున్నట్లు గానే రెట్టింపు మొత్తాన్ని ఇంజనీరు ఖాతాలో జమ చేశారు. ఇలా పలుమార్లు షేర్లు కొనుగోలు చేయగా..మంచి లాభాలు వచ్చాయి. దీంతో ఏకంగా రూ.1.90 కోట్లను పెట్టుబడిగా పెట్టారు. అయితే తిరిగి డబ్బులు రావాల్సిన గడువు ముగుస్తున్నప్పటికీ రాకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంగారెడ్డి జిల్లా పోలీసులను ఆశ్రయించగా...కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment