తల్లి ఖాతాలోంచి రూ. 90 వేలు తీసుకొని ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసిన వైనం
పెట్టిన సొమ్ము తిరిగిచ్చేందుకు రూ. 2 లక్షలకుపైగా అడగడంతో మనస్తాపం
సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య.. కరీంనగర్ జిల్లాలో విషాదం
వీణవంక (హుజూరాబాద్): సైబర్ మోసానికి ఓ విద్యార్థి బలైపోయాడు. రూ. 5 వేలు పెట్టుబడి పెడి తే రెండింతలు ఇస్తాం’ అంటూ ఫోన్‌కు వచ్చిన మె సేజ్‌కు ఆకర్షితుడై పలు దఫాలుగా కేటుగాళ్లకు రూ.90 వేల మేర ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేసి మోసపోయాడు. చివరకు మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగ ల్ గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
మహిళా సంఘం నుంచి తల్లి తీసుకున్న చిట్టీ డబ్బులతో..
బేతిగల్ గ్రామంలో నివసిస్తున్న గుమ్మడి సృజన్–ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రిషివర్థన్ (18) ఇటీవల డిప్లొమా పూర్తి చేసి బీటెక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. వారం క్రితం అతని మొబైల్‌కు కేటుగాళ్లు ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట పంపిన సందేశం చూసి ఆకర్షితుడయ్యాడు. తన తల్లి ఇటీవల మహిళా సంఘం నుంచి రూ. 90 వేల చిట్టీ పాడుకోవడంతో వచ్చిన డబ్బును ఇందుకోసం వాడుకోవాలనుకున్నాడు. వెంటనే ఆమె ఖాతాలోంచి ఆ సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు.
తొలుత రూ. 5 వేలను సైబర్ నేరగాళ్ల ఖాతాకు పంపాడు. అయితే రెట్టింపు సొమ్ము పొందాలంటే రెండో టాస్‌్కగా రూ. 23,500 పెట్టుబడి పెట్టాలంటూ వారు మెలిక పెట్టడంతో ఆ సొమ్మునూ చెల్లించాడు. మూడో టాస్‌్కలో రూ. 68 వేలు పెట్టుబడి పెడితే రీఫండ్ వస్తుందని కేటుగాళ్లు నమ్మించడంతో ఆ మొత్తం కూడా బదిలీ చేశాడు. అయితే ఆ సొమ్ముకు రెట్టింపు పొందాలంటే రూ. 2 లక్షల 6 వేలను బదిలీ చేయాలని వారు పేర్కొనడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు కుటుంబ సభ్యులకు లేఖ రాశాడు. ‘సారీ మమ్మీ.. నేను చనిపోతున్నా, రిన్నూ (తమ్ముడు) జాగ్రత్త.. డాడీ, మమ్మీ ఇన్నీ రోజులు నన్ను భరించినందుకు థ్యాంక్స్. నేను ట్రేడింగ్ (స్టాక్ మార్కెట్)లో డబ్బులు పెట్టి మోసపోయా. కంపెనీ వివరాలు నా మొబైల్‌లో ఉన్నాయి’ అంటూ లేఖలో పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment