టీజీసీఎస్‌బీకి ఫిర్యాదుల మోత
టోల్‌ఫ్రీ నంబర్ 1930కు రోజుకు 1600 ఫోన్‌కాల్స్
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 31 వరకు
351 కేసుల్లో 460 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వారి చేతుల్లో డబ్బు పోగొట్టుకుంటున్న బాధితుల సంఖ్య నిత్యం పెరుగుతోంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో టోల్‌ఫ్రీ నంబర్ 1930కు వస్తున్న ఫిర్యాదు కాల్సే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) ఆధ్వర్యంలో పనిచేస్తున్న టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 31 వరకు రోజుకు సరాసరిన 1600 ఫోన్‌కాల్స్ వచ్చి నట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువగా ఆర్థిక మోసా లకు సంబంధించినవి 50 శాతం కాగా, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు 50 శాతం ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 వరకు మొత్తం 460 మంది సైబర్ నేరగాళ్లను 351 కేసుల్లో అరెస్టు చేసినట్టు అధికారులు చెప్పారు.
⇒ టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో ప్రతి రోజూ సరాసరిన 330 ఫిర్యాదులు నమోదవుతున్నాయి. టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదుల్లో 90 శాతం ఫిర్యాదులకు 1930 కాల్ సెంటర్ సిబ్బంది సమాధానాలు చెబుతున్నారు. ఈ ఏడాదిలో ఆగస్టు 31 వరకు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వారు పోగొట్టుకున్న సొమ్ములో 13 శాతం సొమ్మును సకాలంలో ఫిర్యాదు చేయడంతో టీజీసీఎస్‌బీ అధికారులు కాపాడారు. ఇలా మొత్తం రూ.163 కోట్లు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment