న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే, పేర్ల రిజిస్ట్రేషన్ కోసమంటూ హానికరమైన యాప్‌ను సూచిస్తూ నకిలీ ఎస్‌ఎంఎస్ ఒకటి సర్క్యులేట్ అవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ–ఇన్) సూచించింది. ఇలాంటి యాప్‌లను ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుంటే ప్రమా దమని హెచ్చరించింది. నకిలీ ఎస్‌ఎంఎస్‌లో ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని, దానిపై క్లిక్ చేస్తే హానికరమైన యాప్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో ఇన్‌స్టాల్ అవుతుందని తెలిపింది.
అనంతరం బాధితుల ఫోన్లలోని కాంటాక్టులన్నింటికీ దానంతట అదే ఎస్‌ఎంఎస్ రూపంలో చేరుతుందని పేర్కొంది. ఈ యాప్ ఫోన్లలో ఉంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడం ఖాయమంది. Covid19. apk;Vaci&&Regis.apk; MyVaccin&v2. apk;Cov&Regis.apk; Vccin&Apply.apk. అనే లింక్‌లను సూచిస్తూ నకిలీ ఎస్‌ఎంఎస్ వస్తున్నట్లు వెల్లడించింది. కేవలం http:// cowin.gov. in అనే అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment