Fake SMS
-
మీకు తెలుసా?.. విద్యుత్ శాఖ నుంచి మెసేజ్‌లు రావు
ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ‘డియర్ కస్టమర్.. మీ విద్యుత్ సరఫరా ఈ రోజు రాత్రి 10.38 గంటలకు నిలిచిపోతుంది. మీరు గత నెల బిల్లు చెల్లించలేదు. వెంటనే మా 998... నంబర్లో సంప్రదించండి. ధన్యవాదాలు’. విద్యుత్ శాఖ నుంచి వచ్చినట్లుగా ఉండే ఈ తరహా సందేశాన్ని నమ్మి మీరు ఫోన్ చేశారో.. మీ బ్యాంకు ఖాతాలో నగదు ఖాళీ అయినట్లే. అదేలా అనుకుంటున్నారా.. అయితే ఈ క్రింది పేరా చదవండి.. చదవండి: నేను..నాలా‘గే’ ఉంటా.. స్వలింగ సంపర్కులు, థర్డ్ జండర్స్ ప్రైడ్ వాక్ మీకు వచ్చిన సందేశంలోని నంబర్‌కు ఫోన్ చేయగానే అవతలి వ్యక్తులు అచ్చం విద్యుత్ శాఖ అధికారులుగానే మాట్లాడతారు. మీరు బిల్లు చెల్లించినట్లు చెప్పినా ఆ సొమ్ము మాకు చేరలేదంటారు. ఒక యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని రూ.10 చెల్లిస్తే బిల్లు వివరాలు తమ సిస్టంలో జనరేట్ అవుతాయంటూ నమ్మిస్తారు. అది నమ్మి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని రూ.10 చెల్లిస్తే వారికి పంట పండినట్లే. ఇక మీ ప్రమేయం లేకుండానే మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు విత్‌డ్రా అయిపోతాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా పలు నగరాల్లో ఈ తరహా మోసాలు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌లు పంపించడం, విద్యుత్ బకాయిలపై ఫోన్లో సంప్రదించడం వంటి చర్యలు విద్యుత్ శాఖ చేయదని స్పష్టం చేస్తున్నారు. -
సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?!
లాటరీలో గెలుపొందినట్టు మీకు ఫోన్ కాల్ లేదా ఇ–మెయిల్ లేదా ఎసెమ్మెస్, వాట్సప్ ల ద్వారా లింక్స్, స్క్రాచ్కార్డ్లు వచ్చాయా?! అయితే, వాటిని ఉపయోగించాలనుకునేముందు ఒక్కమాట.. ఇటీవల అధికంగా జరుగుతున్న మోసాలలో ఆన్లైన్లో లాటరీ స్కామ్ ఒకటి అనే విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి. ఇటీవల ఢిల్లీ వాసికి రూ.25 లక్షల కెబిసి లాటరీ వచ్చిందని ఫోన్‌కాల్ వచ్చింది. ఆ ఫోన్‌ని రిసీవ్ చేసుకొన్న వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి రూ3.50 లక్షలు పోగొట్టుకున్నాడు. లాటరీ మొత్తం బ్యాంకు ఖాతాలోకి రావాలంటే ముందు టాక్స్, ఇతరత్రా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కాలర్ మాటలను నమ్మి ఓటీపి చెప్పినందుకు తన ఖాతా నుంచి డబ్బు కోల్పోయాడు. ఇలాంటి లాటరీ మోసాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. వాటిలో మోసగాళ్లు చెప్పేవి.. ‘వెయ్యి ఫోన్ నెంబర్లలో మీ నెంబర్ లక్కీ డిప్ ద్వారా సెలక్ట్ అయ్యింది, ఫ్రీ హాలీడే కూపన్స్ మీకోసమే, లక్కీ డిప్ ద్వారా కార్ బహుమతిగా గెలుచుకున్నారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్‌లో మీకు ఓచర్స్ వచ్చాయి..’ ఇలా రకరకాల లాటరీ పద్ధతులతో మిమ్మల్ని ఆకట్టుకునేలా చేస్తారు నేరగాళ్లు. మోసాలకు రెండు సంకేతాలు ► మీ బహుమతిని పొందడానికి మీరు అడ్వా¯Œ ్స మొత్తం ముందే చెల్లించాల్సి ఉంటుంది. ► మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని అందించమని మిమ్మల్ని మోసగాళ్లు కోరుతారు. ఇలా మోసపోయే అవకాశం ► మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి మీకు సందేశం (ఇ–మెయిల్, లేదా ఎస్సెమ్మెస్ లేదా వాట్సప్ లేదా సోషల్ మీడియా ద్వారా) పంపుతారు. ► మోసగాళ్లు తాము ప్రభుత్వ లాటరీ ఏజెన్సీల (ఆర్బిఐ లాటరీ) నుండి అప్రోచ్ అవుతున్నామని చెబుతారు. ► బహుమతి అందుకోవడానికి ఇదే మంచి సమయం ‘వెంటనే చేయండంటూ..’ మోసగాళ్లు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మీరు అడ్వా¯Œ ్స లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాల వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు త్వరగా చెల్లించాలని కోరుతారు. ► మోసగాళ్లు మనకు తెలిసిన సంస్థల పేర్లనే ఉపయోగిస్తారు (ఉదాహరణకు: కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ, షాపింగ్ యాప్స్ లాటరీ మొదలైనవి) ► బహుమతిని గెలుచుకున్న ఏకైక వ్యక్తి మీరేనని మోసగాళ్లు మిమ్మల్ని నమ్మిస్తారు. అయితే ఇలాగే, వేలాది మందికి బల్క్ మెసేజ్‌లు పంపుతారని గ్రహించాలి. ► మోసగాళ్లు మీకు కాల్ చేసి మీరు విదేశీ లాటరీని గెలుచుకున్నారని చెప్పవచ్చు (ఉదాహరణకు: యూరో లాటరీ) ► నమ్మకం కలిగించడానికి మోసగాళ్లు మీకు వారి చెక్కులు/డిమాండ్ డ్రాఫ్ట్‌ల కాపీలను కూడా పంపుతారు. కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు లేదా కన్వీనియ¯Œ ్స ఫీజు లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాలు మొదలైనవాటిగా పంపమని మిమ్మల్ని అడుగుతారు. నిషేధం ఉందని గుర్తించండి... భారతప్రభుత్వం లాటరీల నియంత్రణ చట్టం 1998 లో తీసుకువచ్చింది. దేశంలో 13 రాష్ట్రాలు లాటరీలను నిషేధించాయి. ► పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ –1867 తో పాటు, అన్ని రకాల జూదం మన దేశంలో చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్‌పై (ఆ¯Œ లైన్, ఆఫ్‌లైన్ రెండూ) పందెం వేయడం చట్టవిరుద్ధం. బెట్టింగ్ గేమ్‌ల లాటరీ రెండు రకాలు ► గేమ్ ఆఫ్ ఛా¯Œ ్స. ఇవి అదృష్ట ఆధారితంగా కొనసాగేవి. ► నైపుణ్యం, విశ్లేషణాత్మక నిర్ణయం, తార్కిక ఆలోచన, శారీరక సామర్థ్యం వంటి ఆటల రూపంలో కొనసాగుతాయి. ప్రైజ్ మనీ లేదా అవార్డుల కోసం లాటరీ స్కీమ్‌లు లేదా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో పాల్గొనడానికి ఏ రూపంలోనైనా డబ్బు డిపాజిట్ చేయడం విదేశీ మారకపు నిర్వహణ చట్టం ప్రకారం నిషేధించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది. మోసాలకు చెక్ ఇలా! ► ఇమెయిల్/ ఎసెమ్మెస్ ద్వారా పంపబడిన చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు ► HTTP://తో ప్రారంభమయ్యే వెబ్సైట్లపై క్లిక్ చేయండి (ఇది ప్యాడ్ లాక్ సింబల్ కలిగి ఉంటుంది) ► మెసేజ్ ఇచ్చినవారు మీ పేరుతో మిమ్మల్ని సంబోధించడం లేదని గ్రహించాలి. ► వ్యక్తిగతంగా కొనుగోలు చేసి, పోటీలో పాల్గొనకపోతే లాటరీ లేదా పోటీలో డబ్బు గెలవలేమని తెలుసుకోవాలి. ► పోటీలు, లాటరీలలో గెలుపొందిన బహుమతిని తీసుకోవడానికి మీరు ముందస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ► అధిక రాబడిని ఆశించి తెలియని వ్యక్తులు లేదా సంస్థలకు నిధులను ఎప్పుడూ బదిలీ చేయవద్దు. ► లాటరీలపై అన్ని ఇ–మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌లు, సోషల్ మీడియా సందేశాలను పట్టించుకోవద్దు. ► మీరు లాటరీని గెలుచుకున్నారని పేర్కొంc టూ యాహూ, హాట్‌మెయిల్, జిమెయిల్ నుండి వచ్చే ఇ–మెయిల్స్‌ను వదిలేయండి. ► క్యూఆర్ కోడ్, ఓటీపీ నెంబర్.. ఇస్తే మోసగాళ్లకు అందిస్తే మీ డబ్బులు పోతాయన్న నిజాన్ని గ్రహించాలి. మీరు లాటరీ మోసానికి గురయ్యారా? మీరు లాటరీ మోసానికి గురైనట్లయితే, 155260కి ఫోన్ చేయండి. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnకు లాగిన్ అవ్వండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు / ఎస్సెమ్మెస్ / ఇ–మెయిల్, కొరియర్ ద్వారా స్వీకరించిన మోసగాళ్ల సంప్రదింపు వివరాలతో పాటు మీ వ్యక్తిగత గుర్తింపు వివరాల సమాచారాన్నీ ఇవ్వాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే, పేర్ల రిజిస్ట్రేషన్ కోసమంటూ హానికరమైన యాప్‌ను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ ఒకటి సర్క్యులేట్ అవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సూచించింది. ఇలాంటి యాప్‌లను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ప్రమా దమని హెచ్చరించింది. నకిలీ ఎస్ఎంఎస్లో ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని, దానిపై క్లిక్ చేస్తే హానికరమైన యాప్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో ఇన్స్టాల్ అవుతుందని తెలిపింది. అనంతరం బాధితుల ఫోన్లలోని కాంటాక్టులన్నింటికీ దానంతట అదే ఎస్ఎంఎస్ రూపంలో చేరుతుందని పేర్కొంది. ఈ యాప్ ఫోన్లలో ఉంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడం ఖాయమంది. Covid19. apk;Vaci&&Regis.apk; MyVaccin&v2. apk;Cov&Regis.apk; Vccin&Apply.apk. అనే లింక్‌లను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ వస్తున్నట్లు వెల్లడించింది. కేవలం http:// cowin.gov. in అనే అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. -
బహు‘మతులు’ పోతున్నాయ్..!!
రాయవరం, న్యూస్‌లైన్ :‘కంగ్రాట్స్.. మీ సెల్ నంబర్ మేము తీసిన లక్కీ డ్రాలో రూ.3.50 కోట్లు గెలుపొందింది. మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, వృత్తి వివరాలు మాకు ఈ మెయిల్ చేయండి.’ ఇది ఒక సెల్‌ఫోన్ వినియోగదారుడికి వచ్చిన ఎస్ఎంఎస్. ‘వావ్.. మీరు కోకా-కోలా ప్రోమో ఇండియా/లండన్ నుంచి లక్ష పౌండ్లను గెల్చుకున్నారు. మీ వివరాలను ఈ మెయిల్ చేయండి.’ ఇది మరొక వినియోగదారుడికి వచ్చిన ఎస్ఎంఎస్. ఇలా రోజూ సెల్‌ఫోన్ వినియోగదారులకు ఏవేవో బహుమతులంటూ ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. ఆ మాయలో పడితే అంతే.. బహుమతుల పేరుతో వస్తున్న మెసేజ్‌లకు ఆకర్షితులైతే చేతి చమురు వదుల్చుకోవలసిందే. మనం ఫోన్ చేసినా..మెసేజ్ ఇచ్చినా.. మెయిల్ పంపినా.. వెంటనే ‘మీ బ్యాంకు ఖాతా నంబర్ తెలపండి. మీరు గెలుపొందిన సొమ్మును ఆ ఖాతాలో వేస్తాం’ అంటూ మరో మెసేజ్ వస్తుంది. అలాగే రూ. పదివేలు ప్రోసెసింగ్ చార్జీలుగా చెల్లించండంటూ మెసేజ్ పెడుతున్నారు. రూ. కోట్లు వస్తుంటే, రూ. 10వేలు ఇస్తే పోయేదేమిటని భావించి కొందరు సొమ్ము చెల్లించి మోసపోతున్నారు. ఇలా పలువురు వినియోగదారులకు నిత్యం మెసేజ్‌లు వస్తున్నాయి. తార్కికంగా ఆలోచించే వారు ఇది మోసమని గ్రహించి ఊరుకుంటున్నారు. కొందరు మాత్రం ఏదో ఆశతో ముందుకెళ్లి చేతిచమురు వదిలించుకుంటున్నారు. డబ్బు పోగొట్టుకున్న వారు బయటకు తెలిస్తే పరువు పోతుందని మిన్నకుండిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు.. ‘వెంకటేష్ ఎవరు? నటుడా? లేక క్రికెటరా? మీ సమాధానం పంపించి మేమిచ్చే బహుమతి అందుకోండి.’ ‘జుట్టు రాలుతోందా? కంప్యూటర్ ద్వారా తక్కువ ఖర్చుతో నయం చేసుకోండి. ఈ నంబరుకు ఫోన్ చేయండి.’ ‘మీకు మీ జీవిత భాగస్వామితో ఎంత శాతం ప్రేమానుబంధం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నా రా? అయితే మీ భాగస్వామి పేరు టైపు చేసి ఈ నంబరుకు ఎస్ఎంఎస్ చేయండి.’ ... ఇలా ఒకటీ రెండూ కాదు.. పలు రకాల ఎస్ఎంఎ స్లు వినియోగదారులకు వస్తున్నాయి. అలసి ఇంటికి వచ్చి భోజనం చేసేటపుడో, నిద్రకు ఉపక్రమించేటపుడో ఇవి వస్తున్నాయి. కొన్ని ఎస్ఎంఎస్లకు స్పందిస్తే సెల్ బ్యాలెన్స్ మటుమాయం అవుతోంది. బీమా కంపెనీలూ అంతే.. ప్రైవేటు బీమా కంపెనీలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి. ‘హలో..ప్రసాద్‌గారూ ఈ రోజు 20 మంది లక్కీడీప్ విజేతలను ఎంపిక చేశాం. అందులో మీ సెల్ నంబర్ ఉంది. మీరు రాజమండ్రి వస్తే బహుమతి పట్టుకువెళ్లవచ్చు. అంటూ బీమా కంపెనీలు మెసేజ్‌లు పంపుతున్నాయి. తెలివైన వాళ్లు మేము ఏమైనా డబ్బు చెల్లించాలా? అని అడిగితే మేము ఒక బాండ్ ఇస్తాం. ప్రీమియం చెల్లిస్తే చాలని సమాధానం వస్తుంది. అలా అడగని అమాయకులు, నిరక్షరాస్యులు రాజమండ్రి, కాకినాడ వంటి నగరాలకు వెళ్లి డబ్బు నష్టపోతున్నారు. ఇది బీమా పాలసీలపెంపు కోసం ఇచ్చిన మెసేజ్ అని అక్కడికి వెళ్లాకే అర్థం అవుతోంది. మాచవరం లో ఒక కూలీకి ఇలాగే ఫోన్ రాగా రూ.వెయ్యి అప్పు చేసి రాజమండ్రి వెళ్లాడు. తీరా అక్కడ బీమా ప్రీమియం చెల్లించాలని చెప్పడంతో ఉసూరంటూ వెనుదిరిగాడు. మోసపోవద్దు.. లక్షలు, కోట్లు గెలుపొందారంటూ వచ్చే బోగస్ మెసేజ్‌లను నమ్మి మోసపోవద్దు. ఎవరికి వారు ప్రాక్టికల్‌గా ఆలోచించుకోవాలి. - గొలుగూరి వరలక్ష్మి, టెలికామ్ సలహా మండలి సభ్యురాలు, రాయవరం. అనవసర ఎస్ఎంఎస్లతో ఇబ్బందులు పడే వినియోగదారులు 1909 నంబరుకు డయల్ చేసి వాటిని నిలుపుదల చేసుకోవచ్చు. - ఎం.శివప్రసాద్‌రాజు, ఎస్డీఈ, బీఎస్ఎన్ఎల్ కార్యాలయం, రాజమండ్రి.