సైబర్‌ టాక్‌: కొనకుండానే లాటరీ వచ్చిందా?! | Special Story On Fake lottery tickets scam | Sakshi
Sakshi News home page

సైబర్‌ టాక్‌: కొనకుండానే లాటరీ వచ్చిందా?!

Published Thu, Jun 9 2022 6:33 AM | Last Updated on Thu, Jun 9 2022 7:43 AM

Special Story On Fake lottery tickets scam - Sakshi

లాటరీలో గెలుపొందినట్టు మీకు ఫోన్‌ కాల్‌ లేదా ఇ–మెయిల్‌ లేదా ఎసెమ్మెస్, వాట్సప్‌ ల ద్వారా లింక్స్, స్క్రాచ్‌కార్డ్‌లు వచ్చాయా?! అయితే, వాటిని ఉపయోగించాలనుకునేముందు ఒక్కమాట.. ఇటీవల అధికంగా జరుగుతున్న మోసాలలో ఆన్‌లైన్‌లో లాటరీ స్కామ్‌ ఒకటి అనే విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి.

ఇటీవల ఢిల్లీ వాసికి రూ.25 లక్షల కెబిసి లాటరీ వచ్చిందని ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ ఫోన్‌ని రిసీవ్‌ చేసుకొన్న వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి రూ3.50 లక్షలు పోగొట్టుకున్నాడు. లాటరీ మొత్తం బ్యాంకు ఖాతాలోకి రావాలంటే ముందు టాక్స్, ఇతరత్రా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కాలర్‌ మాటలను నమ్మి ఓటీపి చెప్పినందుకు తన ఖాతా నుంచి డబ్బు కోల్పోయాడు.

ఇలాంటి లాటరీ మోసాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. వాటిలో మోసగాళ్లు చెప్పేవి.. ‘వెయ్యి ఫోన్‌ నెంబర్లలో మీ నెంబర్‌ లక్కీ డిప్‌ ద్వారా సెలక్ట్‌ అయ్యింది, ఫ్రీ హాలీడే కూపన్స్‌ మీకోసమే, లక్కీ డిప్‌ ద్వారా కార్‌ బహుమతిగా గెలుచుకున్నారు. ఆన్‌లైన్‌ షాపింగ్‌ యాప్స్‌లో మీకు ఓచర్స్‌ వచ్చాయి..’ ఇలా రకరకాల లాటరీ పద్ధతులతో మిమ్మల్ని ఆకట్టుకునేలా చేస్తారు నేరగాళ్లు.

మోసాలకు రెండు సంకేతాలు
► మీ బహుమతిని పొందడానికి మీరు అడ్వా¯Œ ్స మొత్తం ముందే చెల్లించాల్సి ఉంటుంది.
► మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని అందించమని మిమ్మల్ని మోసగాళ్లు కోరుతారు.

ఇలా మోసపోయే అవకాశం
► మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి మీకు సందేశం (ఇ–మెయిల్, లేదా ఎస్సెమ్మెస్‌ లేదా వాట్సప్‌ లేదా సోషల్‌ మీడియా ద్వారా) పంపుతారు.
► మోసగాళ్లు తాము ప్రభుత్వ లాటరీ ఏజెన్సీల (ఆర్‌బిఐ లాటరీ) నుండి అప్రోచ్‌ అవుతున్నామని చెబుతారు.
► బహుమతి అందుకోవడానికి ఇదే మంచి సమయం ‘వెంటనే చేయండంటూ..’ మోసగాళ్లు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మీరు అడ్వా¯Œ ్స లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాల వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు త్వరగా చెల్లించాలని కోరుతారు.
► మోసగాళ్లు మనకు తెలిసిన సంస్థల పేర్లనే ఉపయోగిస్తారు (ఉదాహరణకు: కౌన్‌ బనేగా కరోడ్‌పతి లాటరీ, షాపింగ్‌ యాప్స్‌ లాటరీ మొదలైనవి)
► బహుమతిని గెలుచుకున్న ఏకైక వ్యక్తి మీరేనని మోసగాళ్లు మిమ్మల్ని నమ్మిస్తారు. అయితే ఇలాగే, వేలాది మందికి బల్క్‌ మెసేజ్‌లు పంపుతారని గ్రహించాలి.
► మోసగాళ్లు మీకు కాల్‌ చేసి మీరు విదేశీ లాటరీని గెలుచుకున్నారని చెప్పవచ్చు (ఉదాహరణకు: యూరో లాటరీ)
► నమ్మకం కలిగించడానికి మోసగాళ్లు మీకు వారి చెక్కులు/డిమాండ్‌ డ్రాఫ్ట్‌ల కాపీలను కూడా పంపుతారు. కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్‌ ఫీజు లేదా కన్వీనియ¯Œ ్స ఫీజు లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాలు మొదలైనవాటిగా పంపమని మిమ్మల్ని అడుగుతారు.

నిషేధం ఉందని గుర్తించండి...
భారతప్రభుత్వం లాటరీల నియంత్రణ చట్టం 1998 లో తీసుకువచ్చింది. దేశంలో 13 రాష్ట్రాలు లాటరీలను నిషేధించాయి.

► పబ్లిక్‌ గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ –1867 తో పాటు, అన్ని రకాల జూదం మన దేశంలో చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్‌ లేదా ప్లేయర్‌పై (ఆ¯Œ లైన్, ఆఫ్‌లైన్‌ రెండూ) పందెం వేయడం చట్టవిరుద్ధం.
  
బెట్టింగ్‌ గేమ్‌ల లాటరీ రెండు రకాలు

► గేమ్‌ ఆఫ్‌ ఛా¯Œ ్స. ఇవి అదృష్ట ఆధారితంగా కొనసాగేవి.
► నైపుణ్యం, విశ్లేషణాత్మక నిర్ణయం, తార్కిక ఆలోచన, శారీరక సామర్థ్యం వంటి ఆటల రూపంలో కొనసాగుతాయి.
ప్రైజ్‌ మనీ లేదా అవార్డుల కోసం లాటరీ స్కీమ్‌లు లేదా మనీ సర్క్యులేషన్‌ స్కీమ్‌లలో పాల్గొనడానికి ఏ రూపంలోనైనా డబ్బు డిపాజిట్‌ చేయడం విదేశీ మారకపు నిర్వహణ చట్టం ప్రకారం నిషేధించబడుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రజలను హెచ్చరించింది.

  
మోసాలకు చెక్‌ ఇలా!

► ఇమెయిల్‌/ ఎసెమ్మెస్‌ ద్వారా పంపబడిన చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్‌ చేయవద్దు
► HTTP://తో ప్రారంభమయ్యే వెబ్‌సైట్‌లపై క్లిక్‌ చేయండి (ఇది ప్యాడ్‌ లాక్‌ సింబల్‌ కలిగి ఉంటుంది)
► మెసేజ్‌ ఇచ్చినవారు మీ పేరుతో మిమ్మల్ని సంబోధించడం లేదని గ్రహించాలి.
► వ్యక్తిగతంగా కొనుగోలు చేసి, పోటీలో పాల్గొనకపోతే లాటరీ లేదా పోటీలో డబ్బు గెలవలేమని తెలుసుకోవాలి.
► పోటీలు, లాటరీలలో గెలుపొందిన బహుమతిని తీసుకోవడానికి మీరు ముందస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
► అధిక రాబడిని ఆశించి తెలియని వ్యక్తులు లేదా సంస్థలకు నిధులను ఎప్పుడూ బదిలీ చేయవద్దు.
► లాటరీలపై అన్ని ఇ–మెయిల్, టెక్ట్స్‌ మెసేజ్‌లు, సోషల్‌ మీడియా సందేశాలను పట్టించుకోవద్దు.
► మీరు లాటరీని గెలుచుకున్నారని పేర్కొంc  టూ యాహూ, హాట్‌మెయిల్, జిమెయిల్‌ నుండి వచ్చే ఇ–మెయిల్స్‌ను వదిలేయండి.
► క్యూఆర్‌ కోడ్, ఓటీపీ నెంబర్‌.. ఇస్తే మోసగాళ్లకు అందిస్తే మీ డబ్బులు పోతాయన్న నిజాన్ని గ్రహించాలి.


మీరు లాటరీ మోసానికి గురయ్యారా?
మీరు లాటరీ మోసానికి గురైనట్లయితే, 155260కి ఫోన్‌ చేయండి. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnకు లాగిన్‌ అవ్వండి. మీ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లు / ఎస్సెమ్మెస్‌ / ఇ–మెయిల్, కొరియర్‌ ద్వారా స్వీకరించిన మోసగాళ్ల సంప్రదింపు వివరాలతో పాటు మీ వ్యక్తిగత గుర్తింపు వివరాల సమాచారాన్నీ ఇవ్వాలి.

ఇన్‌పుట్స్‌: అనీల్‌ రాచమల్ల, డిజిటల్‌ వెల్‌బీయింగ్‌ ఎక్స్‌పర్ట్, ఎండ్‌ నౌ ఫౌండేషన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement