fake phone call
-
సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?!
లాటరీలో గెలుపొందినట్టు మీకు ఫోన్ కాల్ లేదా ఇ–మెయిల్ లేదా ఎసెమ్మెస్, వాట్సప్ ల ద్వారా లింక్స్, స్క్రాచ్కార్డ్లు వచ్చాయా?! అయితే, వాటిని ఉపయోగించాలనుకునేముందు ఒక్కమాట.. ఇటీవల అధికంగా జరుగుతున్న మోసాలలో ఆన్లైన్లో లాటరీ స్కామ్ ఒకటి అనే విషయాన్ని గ్రహించండి. జాగ్రత్తగా ఉండండి. ఇటీవల ఢిల్లీ వాసికి రూ.25 లక్షల కెబిసి లాటరీ వచ్చిందని ఫోన్‌కాల్ వచ్చింది. ఆ ఫోన్‌ని రిసీవ్ చేసుకొన్న వ్యక్తి తన బ్యాంకు ఖాతా నుంచి రూ3.50 లక్షలు పోగొట్టుకున్నాడు. లాటరీ మొత్తం బ్యాంకు ఖాతాలోకి రావాలంటే ముందు టాక్స్, ఇతరత్రా ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కాలర్ మాటలను నమ్మి ఓటీపి చెప్పినందుకు తన ఖాతా నుంచి డబ్బు కోల్పోయాడు. ఇలాంటి లాటరీ మోసాలు చాలా సాధారణంగా జరుగుతుంటాయి. వాటిలో మోసగాళ్లు చెప్పేవి.. ‘వెయ్యి ఫోన్ నెంబర్లలో మీ నెంబర్ లక్కీ డిప్ ద్వారా సెలక్ట్ అయ్యింది, ఫ్రీ హాలీడే కూపన్స్ మీకోసమే, లక్కీ డిప్ ద్వారా కార్ బహుమతిగా గెలుచుకున్నారు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్‌లో మీకు ఓచర్స్ వచ్చాయి..’ ఇలా రకరకాల లాటరీ పద్ధతులతో మిమ్మల్ని ఆకట్టుకునేలా చేస్తారు నేరగాళ్లు. మోసాలకు రెండు సంకేతాలు ► మీ బహుమతిని పొందడానికి మీరు అడ్వా¯Œ ్స మొత్తం ముందే చెల్లించాల్సి ఉంటుంది. ► మీ వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని అందించమని మిమ్మల్ని మోసగాళ్లు కోరుతారు. ఇలా మోసపోయే అవకాశం ► మోసగాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి మీకు సందేశం (ఇ–మెయిల్, లేదా ఎస్సెమ్మెస్ లేదా వాట్సప్ లేదా సోషల్ మీడియా ద్వారా) పంపుతారు. ► మోసగాళ్లు తాము ప్రభుత్వ లాటరీ ఏజెన్సీల (ఆర్బిఐ లాటరీ) నుండి అప్రోచ్ అవుతున్నామని చెబుతారు. ► బహుమతి అందుకోవడానికి ఇదే మంచి సమయం ‘వెంటనే చేయండంటూ..’ మోసగాళ్లు మిమ్మల్ని ఒత్తిడి చేస్తారు. మీరు అడ్వా¯Œ ్స లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాల వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు త్వరగా చెల్లించాలని కోరుతారు. ► మోసగాళ్లు మనకు తెలిసిన సంస్థల పేర్లనే ఉపయోగిస్తారు (ఉదాహరణకు: కౌన్ బనేగా కరోడ్‌పతి లాటరీ, షాపింగ్ యాప్స్ లాటరీ మొదలైనవి) ► బహుమతిని గెలుచుకున్న ఏకైక వ్యక్తి మీరేనని మోసగాళ్లు మిమ్మల్ని నమ్మిస్తారు. అయితే ఇలాగే, వేలాది మందికి బల్క్ మెసేజ్‌లు పంపుతారని గ్రహించాలి. ► మోసగాళ్లు మీకు కాల్ చేసి మీరు విదేశీ లాటరీని గెలుచుకున్నారని చెప్పవచ్చు (ఉదాహరణకు: యూరో లాటరీ) ► నమ్మకం కలిగించడానికి మోసగాళ్లు మీకు వారి చెక్కులు/డిమాండ్ డ్రాఫ్ట్‌ల కాపీలను కూడా పంపుతారు. కొంత మొత్తాన్ని ప్రాసెసింగ్ ఫీజు లేదా కన్వీనియ¯Œ ్స ఫీజు లేదా పన్నులు లేదా జీఎస్టీ మొత్తాలు మొదలైనవాటిగా పంపమని మిమ్మల్ని అడుగుతారు. నిషేధం ఉందని గుర్తించండి... భారతప్రభుత్వం లాటరీల నియంత్రణ చట్టం 1998 లో తీసుకువచ్చింది. దేశంలో 13 రాష్ట్రాలు లాటరీలను నిషేధించాయి. ► పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ –1867 తో పాటు, అన్ని రకాల జూదం మన దేశంలో చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్‌పై (ఆ¯Œ లైన్, ఆఫ్‌లైన్ రెండూ) పందెం వేయడం చట్టవిరుద్ధం. బెట్టింగ్ గేమ్‌ల లాటరీ రెండు రకాలు ► గేమ్ ఆఫ్ ఛా¯Œ ్స. ఇవి అదృష్ట ఆధారితంగా కొనసాగేవి. ► నైపుణ్యం, విశ్లేషణాత్మక నిర్ణయం, తార్కిక ఆలోచన, శారీరక సామర్థ్యం వంటి ఆటల రూపంలో కొనసాగుతాయి. ప్రైజ్ మనీ లేదా అవార్డుల కోసం లాటరీ స్కీమ్‌లు లేదా మనీ సర్క్యులేషన్ స్కీమ్‌లలో పాల్గొనడానికి ఏ రూపంలోనైనా డబ్బు డిపాజిట్ చేయడం విదేశీ మారకపు నిర్వహణ చట్టం ప్రకారం నిషేధించబడుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రజలను హెచ్చరించింది. మోసాలకు చెక్ ఇలా! ► ఇమెయిల్/ ఎసెమ్మెస్ ద్వారా పంపబడిన చిన్న లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు ► HTTP://తో ప్రారంభమయ్యే వెబ్సైట్లపై క్లిక్ చేయండి (ఇది ప్యాడ్ లాక్ సింబల్ కలిగి ఉంటుంది) ► మెసేజ్ ఇచ్చినవారు మీ పేరుతో మిమ్మల్ని సంబోధించడం లేదని గ్రహించాలి. ► వ్యక్తిగతంగా కొనుగోలు చేసి, పోటీలో పాల్గొనకపోతే లాటరీ లేదా పోటీలో డబ్బు గెలవలేమని తెలుసుకోవాలి. ► పోటీలు, లాటరీలలో గెలుపొందిన బహుమతిని తీసుకోవడానికి మీరు ముందస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ► అధిక రాబడిని ఆశించి తెలియని వ్యక్తులు లేదా సంస్థలకు నిధులను ఎప్పుడూ బదిలీ చేయవద్దు. ► లాటరీలపై అన్ని ఇ–మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌లు, సోషల్ మీడియా సందేశాలను పట్టించుకోవద్దు. ► మీరు లాటరీని గెలుచుకున్నారని పేర్కొంc టూ యాహూ, హాట్‌మెయిల్, జిమెయిల్ నుండి వచ్చే ఇ–మెయిల్స్‌ను వదిలేయండి. ► క్యూఆర్ కోడ్, ఓటీపీ నెంబర్.. ఇస్తే మోసగాళ్లకు అందిస్తే మీ డబ్బులు పోతాయన్న నిజాన్ని గ్రహించాలి. మీరు లాటరీ మోసానికి గురయ్యారా? మీరు లాటరీ మోసానికి గురైనట్లయితే, 155260కి ఫోన్ చేయండి. లేదా ఠీఠీఠీ.ఛిyb్ఛటఛిటజీఝ్ఛ.జౌఠి.జీnకు లాగిన్ అవ్వండి. మీ బ్యాంక్ స్టేట్మెంట్లు / ఎస్సెమ్మెస్ / ఇ–మెయిల్, కొరియర్ ద్వారా స్వీకరించిన మోసగాళ్ల సంప్రదింపు వివరాలతో పాటు మీ వ్యక్తిగత గుర్తింపు వివరాల సమాచారాన్నీ ఇవ్వాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ప్రేమికులు రోజు బహుమతంటూ వల వేస్తారు..
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ చేసేందుకు ఆన్లైన్ కేటుగాళ్లు నూతన పంధాను ఎంచుకున్నారు. ప్రముఖ సంస్థ పేరుతో ఫోన్ చేసి తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే బహుమతులు గెలుచుకోవచ్చంటూ ప్రజలను బురడీ కొట్టిస్తున్నారు. ప్రేమికుల రోజును పురస్కరించుకొని తాము అడిగే సులభమైన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఎంఐ 11 టీ మొబైల్ ఫోన్ గెలుచుకోవాలంటూ గాలం వేసి, మొబైల్ ఫోన్లలో డేటాను తస్కరిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరు కూడా సైబర్ నేరగాళ్లు చెప్పే యాప్‌లను డౌన్ లోడ్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. ఇలాంటి ఫోన్ కాల్స్‌కు స్పందించి, వాళ్లు చెప్పిన విధంగా చేస్తే.. బ్యాంకు లావాదేవీలు మొత్తం సైబర్ నేరగాళ్లు చేతుల్లోకి వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రజలను బురడీ కొట్టించే క్రమంలో కేటుగాళ్లు లింకులు పంపి, వాట్సప్ గ్రూపులు ద్వారా 20 మంది స్నేహితులకు పంపాలని మెసేజ్‌లు పంపుతారని, ఇలాంటి వాటికి ప్రజలు స్పందించవద్దని సూచిస్తున్నారు. ఇటీవల కాలంలో డేటా చోరీకి సంబంధించి అనేక కేసులు నమోదవుతున్నాయని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు పేర్కొన్నారు. -
హలో ఎస్బీఐ నుంచి మాట్లాడుతున్నా..
సాక్షి, పెద్దపల్లి : హలో.. సారీ నిద్రపోయారా.. 8001628694 మీకు కూడా ఇలాంటి ఫోన్ రావొ చ్చు.. రెండురోజుల క్రితం పెద్దపల్లికి చెందిన ఓ ఉద్యోగికి ఎస్బీఐ బ్రాంచి ఆఫీసు నుంచి మాట్లాడుతున్నా..మీ ఏటీఎం కార్డు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది వాటిని క్లియర్ చేస్తాం. కాస్తా మీ అకౌంట్ నంబర్ చెప్తారా..ఈ నంబర్ కరెక్టే కదా, మీ ఏటీఎం కార్డు మరోసారి చూసుకోండి ఇదే కదా అంటూ తెలుగులో మాట్లాడిన మోసకారి క్షణాల్లో రూ.70వేలు నొక్కేశాడు. ఇది ఎక్కడో ఒకసారి విన్నమాటలు కాదు.. వందసార్లకు పైగా ఇలాంటి మాటలతోనే మోసాలు చేస్తున్నవారు.. మోసపోతున్నవారు ఇంకా ఉన్నారని జిల్లా కేంద్రం పెద్దపల్లిలోని ఓ ఉద్యోగి పట్ల రుజువైంది. పెద్దపల్లికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిని మాటల్లో పెట్టి రూ.70వేలు నొక్కేసిన వైనంపై వారు బయటకు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. అచ్చమైన తెలుగులో చాలా స్పష్టంగా మాట్లాడిన యువకుడు నమ్మకం కలిగించేలా వ్యవహరించి మూడుసార్లు ఏటీఎం కార్డు ద్వారా రూ.10, 20, 40వేలు డ్రా చేశాడు. స్థానిక ఎస్బీఐలో ఫిర్యాదు చేయగా ఇది తమ చేతుల్లో లేదని సైబర్‌నేరాలు పరిశోధన చేస్తున్న పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా సలహా ఇచ్చారు. చివరగా స్థానిక పోలీసుస్టేషన్లో ఆ నంబరుపై వచ్చిన కాల్ ఆధారంగా దర్యాప్తు చేయాల్సిందిగా బాధితులు ఫిర్యాదు చేయడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందినదని అయినా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. పోగొట్టుకున్న డబ్బు గురించి బాధపడడం మినహాయించి బాధితులు చేయాల్సింది ఏమి లేకుండా పోయింది. -
ఆకతాయి చేష్టలకు అదిరిపోయిన అటవీశాఖ అధికారులు
ఆత్మకూరు రూరల్ (కర్నూలు జిల్లా) : పనీపాటలేని పోకిరి చేసిన ఆకతాయి చేష్టలు అటవీ అధికారులకు ముచ్చెమటలు పోసేలా చేశాయి. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని వెలుగోడు నార్త్‌బీట్ అధికారులు గురువారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు అడవులు పట్టుకుని తిరిగేలా చేసిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.. ఆత్మకూరు డిఎఫ్ఓ సెల్వం సెల్ ఫోన్‌కు గురువారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. వెలుగోడు రేంజ్ పరిధిలోని నార్త్బీట్లో ఓ పులి వధించబడిందని, దాని చర్మం ఒలిచి మాంసాన్ని పాతి పెట్టారని ఆ ఫోన్‌కాల్ సారాంశం. దాంతో ఆ డివిజన్ అధికారి.. తన క్రింది స్థాయి ఉద్యోగులను యుద్ధ ప్రాతిపదికన తరలించాడు. ఫోన్‌కాల్‌లో చెప్పబడిన ప్రదేశమంతా జల్లెడ పట్టించాడు. డివిజన్ పరిధిలో రెండు పులుల వధ జరిగి వాటి చర్మాలు పట్టుబడిన సంఘటన ఇంకా తాజాగానే ఉండడంతో వచ్చిన సమాచారం ఏం ఉపద్రవం తెస్తుందో, ఎవరి ఉద్యోగానికి మంగళం పలుకుతుందో అర్థం కాని వెలుగోడు రేంజ్ సిబ్బంది తీవ్రమైన ఆందోళనల నడుమ అర్ధరాత్రి వరకు తమ అన్వేషణ కొనసాగించారు. ఇంతలో ఈ సమాచారం పాత్రికేయులకు అందడంతో డిఎఫ్వో, వెలుగోడు రేంజ్ అధికారుల సెల్ ఫోన్లకు సమాచారం కోసం నిరంతరం ఫోన్ కాల్స్ వెళుతూనే ఉన్నాయి . అయితే అలాంటిదేమీ లేదన్న సమాధానం మాటున అధికారులు తమ వెతుకులాట కొనసాగించారు. ఎట్టకేలకు వారి అన్వేషణ ఫలించింది. కాస్త రక్తపు మరకలు కలగలసిన తాజా మట్టి కుప్ప వారికి కనిపించింది. అక్కడ కచ్చితంగా ఏదో పూడ్చి పెట్టిన ఆనవాళ్ళు నిర్ధారణ అయ్యాయి. హఢావుడిగా అక్కడ తవ్వకం జరిపిన అధికారులకు వారు ఊహించిన పులి శరీర భాగాలు కాక బ్రాయిలర్ కోళ్ళ పేగులు కనపడడంతో తమను ఎవరో ఆకతాయి ఆట పట్టించారన్న విషయం అర్థమయ్యింది. అప్పటికికానీ డిఎఫ్ఓ మొదలు సహాయ బీట్ ఆఫీసర్ వరకు కొండంత బరువు తల పైనుంచి దిగిపోయిన భావనకు గురయ్యారు. పులికి సంబంధించిన అంశం కాబట్టి అటవీ శాఖ అధికారులు ఎలాంటి రిస్క్ తీసుకునేందుకు సిద్ధపడలేదు. తమకు దొరికిన బ్రాయిలర్ కోళ్ళ మాంస ఖండాలను స్థానిక పశు వైద్యాధికారి రాంసింగ్ వద్దకు తీసుకువెళ్ళి పరీక్షలు చేయించి శాస్త్రీయంగా నిర్ధారించుకున్న తరువాతే తమ పులి అన్వేషిత కార్యక్రమాన్ని ముగించారు. -
ప్రియునితో కలిసి కిడ్నాప్ డ్రామా ఆడిన యువతి
కోయంబత్తూర్: ప్రియునితో కలిసి బ్రతకాలనుకున్న ఓ యువతి కన్నతల్లి దండ్రులనే మోసగించాలనుకుంది. తన ప్రేమించిన అబ్బాయితో పలాయనం చిత్తగించేందుకు ఆమె కిడ్నాప్ డ్రామాకు తెరలేపింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ లో చోటు చేసుకుంది. దీనిలో భాగంగా రూ. 20 లక్షలు ఇస్తే మీ అమ్మాయిని సురక్షితంగా విడిచిపెడతానని ఆమె ప్రియుడు గత రాత్రి ఫోన్ లో బెదిరింపులకు దిగాడు. దీంతో కంగారు పడిన అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముందుగా ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆ యువతి ప్రియునితో కలిసి బైక్ వెళుతుండగా గాంధీపురంకు అత్యంత సమీపంలోని అవరాంపలాయం ప్రాంతంలో పోలీసులకు చిక్కింది. దీనిపై విచారించిన పోలీసులకు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. తాను ఇంటర్మిడియట్ చదువుతున్నానని, ప్రేమించిన అబ్బాయితో కలిసి బ్రతికేందుకు ఈ కిడ్నాప్ డ్రామా ఆడినట్టు తెలిపింది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టు పేల్చేస్తామని ఫోన్ కాల్
హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయానికి ఓ ఆగంతకుడి నుంచి వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్ గురువారం కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టును పేల్చివేస్తామని రాత్రి ఒంటిగంట సమయంలో ఫోన్‌కాల్ వచ్చింది. అప్రమత్తం అయిన అధికారులు క్షుణ్ణంగా తనిఖీలను నిర్వహించారు. మరోవైపు ఫోన్ కాల్‌పై అధికారులు ఆరా తీయగా, అమెరికా నుంచి దుండగుడు ఆ కాల్ చేసినట్లు గుర్తించారు. సోదాల అనంతరం అది నకిలీ ఫోన్ కాల్‌గా గుర్తించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.