CoWIN App
-
నిబంధనల కోణంలోనే సోషల్ మీడియాను చూస్తాం..
న్యూఢిల్లీ: ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ మీదైనా ప్రభుత్వానికి వ్యక్తిగతంగా వ్యతిరేకత ఏమీ ఉండదని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. చట్టాలు, నిబంధనల అమలు కోణంలో మాత్రమే ప్రభుత్వానికి, సోషల్ మీడియాలకు సంబంధం ఉంటుందని ఆయన తెలిపారు. ప్లాట్‌ఫామ్‌లు కచ్చితంగా భారతీయ చట్టాలను గౌరవించాల్సిందేనని మంత్రి స్పష్టం చేశారు. కోవిన్ ప్లాట్ఫామ్లో డేటా ఉల్లంఘన జరిగిదంటూ వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. టెలిగ్రాం బాట్ ద్వారా బైటికొచ్చిన వ్యక్తిగత సమాచారమేదీ కోవిన్ డేటాబేస్లోనిది కాదని తెలిపారు. ఒక వ్యక్తికి చెందిన డేటాబేస్ నుంచి సదరు సమాచారం లీక్ అయ్యిందని, అదంతా నకిలీదేనని ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఆ సమాచారం ఎంత పాతది, ఎక్కడి నుంచి వచ్చింది మొదలైన అంశాలపై విచారణ జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. రైతుల ఆందోళన సమయంలో తాము చెప్పినట్లు చేయకపోతే ట్విటర్‌ను మూసివేస్తామని ప్రభుత్వం బెదిరించిందంటూ కంపెనీ మాజీ సీఈవో జాక్ డోర్సే చేసిన ఆరోపణలను మంత్రి ఖండించారు. ఇది పూర్తిగా అబద్ధమని స్పష్టం చేశారు. భారతీయ చట్టాలకు విరుద్ధంగా పని చేస్తున్నప్పటికీ ట్విటర్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని చెప్పారు. -
డేటా భారతంలో లీకుల భాగోతం
రకరకాల సందర్భాల్లో, డిజిటల్ వేదికల్లో మనం అందజేస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ మేరకు సురక్షితం? చాలాకాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్న సోమవారం మరోసారి ముందుకొచ్చింది. కోవిడ్ టీకాకరణకు డిజిటల్ బుకింగ్ సర్వీస్ వేదికైన ప్రభుత్వ పోర్టల్ ‘కోవిన్’ డేటాబేస్ నుంచి ప్రముఖుల వ్యక్తిగత డేటా సైతం టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చి, మనవాళ్ళ సమర్థతను వెక్కిరించింది. మలయాళ మీడియా ‘ది ఫోర్త్’ తన యూట్యూబ్ వీడియోలో చూపిన డేటా చోరీ వైనం దిగ్భ్రాంతికరం. అనేక వార్తాసంస్థలూ సదరు టెలిగ్రామ్ బాట్‌ను పరీక్షించి, లీక్ నిజమేనని నిర్ధారించాయి. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ దీనిపై విచారణ చేపట్టిందే తప్ప, కనీసం అప్రమత్తత జారీ చేయకపోవడం విచారకరం. ప్రభుత్వం అసలీ వార్తల్నే కొట్టిపారే యడం మరీ విడ్డూరం. కానీ, కోవిన్లోనే లభించే మైనర్లు, మేజర్ల సమాచారం ఈ లీకుల్లో ఉంది. ఇది అనుమానాల్ని పెంచుతోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా చట్టాల తక్షణావసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో 2018లోనే మన ఆధార్ డేటాబేస్ నుంచి భారీగా లీక్ జరిగినట్టు వార్తలొచ్చాయి. ఆ హ్యాకింగ్‌ను ప్రభుత్వం ఇప్పటి దాకా బాహాటంగా ప్రస్తావించ లేదు. ‘కోవిన్’ సంగతికే వస్తే, 2021 జూన్‌లోనూ ‘కోవిన్’ పోర్టల్ హ్యాకైంది. 15 కోట్ల మంది భారతీయుల డేటా అంగట్లో అమ్ముడైంది. అప్పుడూ మన సర్కార్ అదేమీ లేదంది. ఇక గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడూ డేటాబేస్ ‘సురక్షితంగా ఉంద’ని నేషనల్ హెల్త్ అథారిటీ వాదించింది. కానీ, అసలు గోప్యతా విధానమంటూ ఏదీ లేకుండానే ‘కోవిన్’ జనంలోకి వచ్చింది. చివరకు 2021లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించాక, తప్పక విధాన ప్రకటన చేసింది. తాజా ఉదంతంలో ‘కోవిన్’ వేదిక నుంచి ‘నేరుగా ఉల్లంఘన’ జరగలేదని ప్రభుత్వం తెలివిగా జవాబిచ్చింది. గతంలో కోవిన్‌లో కాక వేరెక్కడో చోరీ అయిన సమాచారమే ఇదంటోంది. మరి ఒకప్పుడు ఇలాంటి చోరీలే జరగలేదన్న సర్కార్... ఇప్పుడు తాజా చోరీ సమాచారం పాతదే అంటోందంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలీ వార్తలన్నీ ‘ఆధారరహితం, తుంటరి చేష్టలు’ అన్నది ఎప్పటి లానే సర్కారు వారి పాత పాట. ఒకవేళ అదే నిజమనుకున్నా, ప్రభుత్వ సంస్థల చేతుల్లోని డిజిటల్ డేటా భద్రత, సత్వరమే వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అవసరమైతే ఉంది. తాజా రచ్చ మరోసారి మనకు చెబుతున్న పాఠం అదే. ఢిల్లీలోని వైద్యసంస్థ ఎయిమ్స్ గత 8 నెలల్లో రెండుసార్లు సైబర్ దాడులకు గురైన సంగతి అంత తేలిగ్గా మర్చిపోలేం. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, అలాగే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం ఉన్న ఇతర పత్రాలకు మరింత భద్రత అవసరమని తాజా ఘటన అప్రమత్తం చేసింది. ‘వందకోట్ల సార్లు యత్నించినా ఆధార్ భద్రతను ఛేదించడం అసాధ్యమంటూ 2018లో అప్పటి ఐటీ మంత్రి పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్దారు. కానీ, మరిప్పుడు తాజా డేటా ఉల్లంఘనలో మొబైల్ నంబర్‌ను బట్టి ఆధార్ వివరాలు అంత కచ్చితంగా టెలిగ్రామ్ బాట్లో ఎలా వస్తున్నాయి? నిజానికి శరవేగంతో అన్నీ డిజిటలీకృతమవుతున్న ప్రపంచంలో కొత్త ముప్పు – వ్యక్తిగత డేటా లీకులు. అది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నదే. లక్షలాది రిటైల్ కస్టమర్లతో లావాదేవీలు నడిపే డొమినో ఇండియా నుంచి 18 కోట్ల మంది సమాచారం లీకు సహా అనేక పోర్టల్స్ నుంచి వ్యక్తిగత డేటా అంగట్లో సరుకు కావడం కొన్నేళ్ళుగా మన దేశంలో ఆనవాయితీ అయింది. 2020 నుంచి చూస్తే, అమెరికా, రష్యా, ఇరాన్‌ల తర్వాత ప్రపంచంలోనే అధికంగా 14 కోట్ల డేటా గోప్యత ఉల్లంఘనలు జరిగిన దేశం మనదే. ఇంత జరుగుతున్నా వ్యక్తిగత డేటా రక్షణపై దేశంలో ఇప్పటికీ సరైన చట్టం లేదు. భారత్‌లో 2017లో డేటా గోప్యత బిల్లు తొలిసారిగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కొత్త చట్టం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గడచిన వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకున్నా, చివరకు దాన్ని పక్కన పడేసి, 2022 డిసెంబర్లో కొత్త ముసాయిదాను తెచ్చారు. అనేక విడతల సలహా సంప్రతింపులు జరిపినా, కొత్త బిల్లు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కనే లేదు. కాగా, కేంద్రం త్వరలోనే ప్రతిపాదిత ‘డిజిటల్ ఇండియా’ చట్టాన్నీ, అలాగే సవరించిన ‘డిజి టల్ డేటా పరిరక్షణ బిల్లు 2022’నూ పార్లమెంట్లో పెడుతుందని సమాచారం. అలాగే అన్ని రకాల ప్రభుత్వ డేటా నిల్వ, అందుబాటు, భద్రతా ప్రమాణాలకు ఉమ్మడి చట్రాన్నిచ్చే ‘నేషనల్ డేటా గవ ర్నెన్స్ పాలసీ’ని ఖరారు చేస్తున్నామని అమాత్యుల మాట. భవిష్యత్తులో అవి ఊరట కావచ్చేమో. అయితే, ఇకనైనా సంస్థలు తాము సేకరించిన వ్యక్తిగత డేటాను ఒక్కసారికే, సదరు నిర్ణీత ప్రయోజనానికే వాడుకొనేలా చట్టంలో కట్టుదిట్టాలు చేయడం కీలకం. సంస్థలపైనే బాధ్యత మోపాలి. అలాగే, డేటా చోరీ అనుమానం రాగానే సంభావ్య బాధితులందరికీ సదరు సంస్థలు సమాచారమివ్వడం తప్పనిసరి చేయాలి. దానివల్ల వారు వెంటనే పాస్వర్డ్లు మార్చుకొని, సురక్షితులయ్యే వీలుంటుంది. అయినా, ప్రభుత్వం చేతిలోని ‘కోవిన్’ లాంటి వాటి నుంచే డేటా లీకవుతూ పోతే పౌరులకిక ఏం నమ్మకం మిగులుతుంది? సమస్తం డిజిటలైన వేళ ఉల్లంఘనలు తప్పవనుకున్నా, నష్టాన్ని తగ్గించడం, డేటా గోప్యతకు చట్టబద్ధ రక్షణ కల్పించడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ కనీస కర్తవ్యం. లీకైన కోట్లాది ప్రజల డేటా నేరగాళ్ళ చేతిలో పడితే ఆర్థికంగా, సామాజికంగా చెలరేగే సంక్షోభం అనూహ్యం. అందుకే, ఈ లీకుల్ని కొట్టిపారేసే వైఖరి వదిలి, సర్కార్ కఠిన చర్యలకు దిగాలి. ప్రతిదానికీ పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరించే ధోరణి మాని, వీలైనంత వరకు అతి తక్కువ డేటానే సేకరించే పద్ధతి మేలంటున్న పౌరసమాజం మాటల్నీ పట్టించుకోవాలి. -
కోవిన్ పోర్టల్.. ఫుల్ సేఫ్
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం తీసుకొచ్చిన కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన టీకా లబ్ధిదారుల డేటా లీకైనట్లు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలకు ఎలాంటి ఆధారాల్లేవని స్పష్టం చేసింది. నోడల్ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ అయిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్–ఇన్) ఈ వ్యవహారాన్ని సమీక్షిస్తోందని వెల్లడించింది. పోర్టల్‌లోని డేటా భద్రంగా ఉందని, డేటా ప్రైవసీ కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. డేటా లీక్ అంటూ జరుగుతున్న ప్రచారం ఆకతాయిల పనేనని పేర్కొంది. డేటా లీక్ వార్తలపై సెర్ట్–ఇన్ వెంటనే స్పందించిందని, కోవిన్ యాప్‌పై లేదా డేటాబేస్‌పై ప్రత్యక్షంగా దాడి జరిగినట్లు ఆధారాలు లభించలేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. టెలిగ్రామ్ యాప్‌లో ఫోన్ నెంబర్లు ఎంట్రీ చేస్తే కోవిన్ యాప్ వివరాలను చూపిస్తోందని చెప్పారు. అంతేతప్ప వ్యాక్సిన్ లబ్ధిదారుల వివరాలు లీక్ కాలేదని స్పష్టం చేశారు. కాగా, కోవిన్ పోర్టల్ నుంచి ముఖ్యమైన డేటా లీకైనట్లు తెలుస్తోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని మొత్తం డేటా మేనేజ్మెంట్ వ్యవస్థ గోప్యతపై ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ సోమవారం డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? కరోనా టీకా తీసుకున్న వారి వ్యక్తిగత డేటా కోవిన్ పోర్టల్‌లో నిక్షిప్తమైన సంగతి తెలిసిందే. టీకా లబ్ధిదారుల వ్యక్తిగత వివరాలు ఆన్లైన్ మెసెంజర్ యాప్ ‘టెలిగ్రామ్’లో కనిపిస్తున్నట్లు కొందరు ట్విట్టర్ ఖాతాదారులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా కలకలం మొదలైంది. ఈ వ్యవహారంపై కొన్ని రాజకీయ పార్టీలు స్పందించాయి. ప్రజల వ్యక్తిగత డేటాకు భద్రత లేకపోవడం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీశాయి. దాంతో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించి, వివరణ ఇచ్చింది. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఆధారిత ధ్రువీకరణ ద్వారా మాత్రమే కోవిన్ పోర్టల్‌లోని తమ వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చని పేర్కొంది. లబ్ధిదారులు మినహా ఇతరులు తెలుసుకోవడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. లబ్ధిదారుల చిరునామాలు తెలుసుకొనే వెలుసుబాటు కూడా లేదని వెల్లడించింది. -
కొవిన్ పోర్టల్‌లో డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కాగా, డేటా లీక్ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్ పూర్తిగా సేఫ్. ఇందులోని డేటాను సీక్రెట్‌గా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ-డీడీఓఎస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్‌ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఇక, ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే కొవిన్ పోర్టల్‌లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇది కూడా చదవండి: టీకా వేయించుకున్నారా? డాటా లీక్ -
కొవిన్ పోర్టల్ డేటా లీక్.. ఆర్బీఐ అప్రమత్తం!
కోవిడ్-19 వ్యాక్సిన్ టీకాలు అందించే భారత ప్రభుత్వ పోర్టల్ కోవిన్‌లో నమోదు చేసుకున్న ప్రముఖుల వ్యక్తిగత వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో లభ్యమైనట్లు కోవిన్ డేటా లీకేజీపై కేంద్ర ఐటీ శాఖ స్పందించింది. డేటా లీకేజీ అంశంపై విచారణ జరుపుతున్నట్లు వెల్లడించింది. డేటా లీకేజీ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం బ్యాంకుల్ని అప్రమత్తం చేసినట్లు జాతీయ, అంతర్జాతీయంగా ఆర్ధిక సేవల్ని అందించే సౌత్ ఏసియా ఇండెక్స్ నివేదించింది. కొవిడ్ -19 వ్యాక్సినేషన్‌కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్‌లోని (CoWIN ) సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. కోవిన్‌లో వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో వారి వివరాల్ని నమోదు చేసుకున్న ప్రముఖుల పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, జెండర్, పుట్టిన తేదీ, వ్యాక్సినేషన్ సెంటర్‌తో ఇతర వివరాలు మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ ఛానల్లో లభ్యమైనట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. Just IN:— Major data breach in India; Personal data of all vaccinated Indians have been leaked online. ☆ Leaked data has Aadhaar, voter ID, Passport numbers & mobile numbers of Indians who got covid-19 vaccines. — South Asia Index (@SouthAsiaIndex) June 12, 2023 అంతేకాదు కోవిన్ పోర్టల్‌లో అప్డేట్ చేసుకున్న విదేశీ ప్రయాణాల వివరాలు, వారి పాస్‌పోర్ట్ సమాచారం టెలిగ్రామ్ ఛానల్లో ప్రత్యక్షమైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. వ్యక్తిగత వివరాలు లీకైన ప్రముఖుల్లో యూనియన్ హెల్త్ మినిస్ట్రీ రాజేష్ భూషణ్‌తో పాటు అతని భార్య ఉత్తరాఖండ్ కోటద్వార్ బీజేపీ ఎమ్మెల్యే రితూ ఖండూరి భూషణ్‌ల ఆధార్, పుట్టిన తేదీ వివరాలు ఉన్నాయని సమాచారం. ఈ తరుణంలో డేటా లీక్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐటీ శాఖలు అప్రమత్తమయ్యాయి. విచారణను వేగవంతం చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదీ చదవండి : బైక్ ట్యాక్సీ కంపెనీలకు సుప్రీం షాక్! -
టీకా వేయించుకున్నారా? డాటా లీక్
కొవిన్ యాప్‌లో పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ అయిందని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వం అతి పెద్ద గోప్యతా ఉల్లంఘన అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టీకా పొందినవారి వ్యక్తిగత వివరాలు ఇక టెలిగ్రామ్‌లో లభ్యమయ్యేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. Cowin Portal से डाटा हुआ लीक? करोड़ों लोगों की पर्सनल डिटेल टेलीग्राम पर आई!अब तक मोदी सरकार देश की संपत्ति ही बेच रही थी, पर अब तो.... pic.twitter.com/NnCPnuT9YT— Rashtriya Janata Dal (@RJDforIndia) June 12, 2023 బాధ్యులెవరు? 'కొవిడ్ టీకా తీసుకున్నప్పుడు ఆధార్, ఫోన్ నెంబర్లు,పాస్‌పోర్టు వివరాలు,ఓటర్ ఐడీతో సహా కుటుంబ వివరాలు అన్ని నమోదు చేశారు. దేశంలో ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా అందులో ఉన్నాయి. కొవిన్ డేటా వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు ఇందులో పాలుపంచుకున్నారు? ప్రజల ముందు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?' అని సాకేత్ గోఖలే కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రియా సూలే.. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎట్టిపరిస్థితుల్లో క్షమార్హం కాని నేరం' అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేం లేదు.. కొవిన్ యాప్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునే సమయంలో కేవలం వ్యాక్సిన్ తీసుకునే తేదీని మాత్రమే సేకరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. Co-WIN portal of Health Ministry is completely safe with safeguards for data privacy. All reports of data breach are without any basis and mischievous in nature. Health Ministry has requested CERT-In to look into this issue & submit a report: Government of India pic.twitter.com/hXbTpl3FNU— ANI (@ANI) June 12, 2023 ఇదీ చదవండి:వీడియోలెందుకు తీస్తున్నావ్.. భారత్‌లో విదేశీయుడికి చేదు అనుభవం -
కోవిడ్ ఫ్రీ బూస్టర్ డోస్‌లు నిల్.. కొనుక్కోవాల్సిందే!
చైనాలో దారుణంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఇప్పటికే ప్రపంచ దేశాలన్ని అప్రమత్తమయ్యాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తు జాగ్రత్తలు జారీ చేసి ప్రజలను అప్రమత్తంగా ఉండమని సూచించింది. అందులో భాగంగా కోవిడ్ బూస్టర్ డోస్‌లను త్వరిగతిన తీసుకోమని ప్రజలను హెచ్చరిస్తోంది. ఐతే 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా అందిచ్చే కోవిడ్ బూస్టర్ డోస్‌లు ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ లేవని, కనీసం దేశ రాజధాని ఢిల్లీలో సైతం తగినంత మొత్తంలో అందుబాటులో లేవని సమాచారం అలాగే సుమారు రూ. 400లు వసూలు చేసి బూస్టర్ డోస్‌లు అందిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల వద్ద ఉన్నాయి గానీ అవికూడా రానున్న కొద్ది రోజుల్లో అయిపోయే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐతే అధికారిక లెక్కల ప్రకారం కోవిన్ వెబ్ పోర్టల్‌లో కూడా ఎన్నో బూస్టర్ డోస్‌లు అందుబాటులో లేవని స్పష్టంగా చెబుతోంది. ఐతే కొన్ని ప్రైవేట్ సెంటర్లో మాత్రం అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ మరోవైపు ప్రభుత్వం మాత్రం చైనా మాదిరిగా కేసులు పెరగకుండా ప్రజలను సత్వరమే బూస్టర్ డోస్‌లు తీసుకోమని చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, దేశంలో సాధారణ టూ డోస్ వ్యాక్సిన్‌ను ఇప్పటి వరకు 90 శాతం మంది తీసుకోగా, బూస్టర్ డోస్‌ను ఢిల్లీలో కేవలం 20 శాతం మంది తీసుకోగా, భారత్ అంతటా 30 శాతం మంది తీసుకున్నారు. ప్రజలంతా కూడా వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యంతో ధీమాగా ఉన్నారని కేంద్రం నొక్కి చెబుతోంది. అయినప్పటికీ అవగాహన డ్రైవ్‌లను నిర్వహించమని రాష్ట్రాలను కోరింది. ప్రస్తుతం భారత్‌లో కేసుల తక్కువుగానే ఉన్నాయని, సగటున 200 కంటే తక్కువగానే కేసులు నమోదవుతున్నట్లు పేర్కొంది. (చదవండి: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం!) -
తొలిరోజు 41 లక్షల మంది టీనేజర్లకు టీకా
దేశవ్యాప్తంగా 15–18 ఏళ్ల గ్రూపు వారికి సోమవారం ప్రారంభమైన కోవిడ్ వ్యాక్సినేషన్లో తొలిరోజు 41 లక్షల మందికి పైగా మొదటి డోసు టీకా వేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. 15–18 ఏళ్ల వారి కోసం జనవరి ఒకటో తేదీ నుంచి కోవిన్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, సోమవారం రాత్రి 8.30 గంటల సమయానికి 51 లక్షల మంది పేర్లు నమోదు చేయించుకున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో ఈ గ్రూపు బాలబాలికలు సుమారు 7.4 కోట్ల మంది ఉన్నట్లు అధికారుల అంచనా. ‘మహమ్మారి నుంచి యువతరాన్ని కాపాడేందుకు దేశం ఒక అడుగు ముందుకు వేసింది’అని ప్రధాని మోదీ అన్నారు. ‘టీకా వేయించుకున్న బాలలందరికీ, వారి తల్లిదండ్రులకు నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మరింతమంది టీకా వేయించుకోవాలని కోరుకుంటున్నాను’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 146.61 కోట్ల డోసుల టీకా పంపిణీ చేసినట్లయిందని ఆరోగ్య శాఖ తెలిపింది. -
ఒక్కరోజులో 2.26 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సినేషన్లో భారత్ కొత్త రికార్డు నెలకొల్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ జన్మదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం దేశవ్యాప్తంగా 2 కోట్లకుపైగా టీకా డోసులు ప్రజలకు వేశారు. కో–విన్ పోర్టల్ గణాంకాల ప్రకారం దేశంలో శుక్రవారం ఒక్కరోజే 2.26 కోట్లకుపైగా డోసులు ఇచ్చారు. అత్యధికంగా కర్ణాటకలో 26.9 లక్షల డోసులు, బిహార్‌లో 26.6 లక్షల డోసులు, ఉత్తరప్రదేశ్‌లో 24.8 లక్షల డోసులు, మద్యప్రదేశ్‌లో 23.7 లక్షల డోసులు, గుజరాత్లో 20.4 లక్షల డోసులు ఇచ్చారు. ఈ రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ ప్రధానమంత్రికి ఆరోగ్య కార్యకర్తలు, దేశ ప్రజల తరపున తాము అందజేసిన జన్మదిన కానుక అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా ట్వీట్ చేశారు. ఇప్పటిదాకా ఇచ్చిన మొత్తం కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 79.25 కోట్లకు చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో ఒక్క రోజులో కోటికిపైగా డోసులు ఇవ్వడం గత నెల వ్యవధిలో ఇది 4వసారి కావడం విశేషం. ప్రధాని మోదీకి శుభాకాంక్షల వెల్లువ.. ప్రధానమంత్రి మోదీ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, టిబెట్ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామాలు శుభాకాంక్షలు తెలిపారు. సేవా ఔర్ సమర్పణ్.. ప్రధాని మోదీ జన్మదినంతోపాటు ఆయన గుజరాత్ సీఎంగా ప్రజాజీవితంలోకి అడుగుపెట్టి 20 సంవత్సరాలవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా 20 రోజులపాటు సాగే ‘సేవా ఔర్ సమర్పణ్’ కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టారు. అక్టోబర్ 7 దాకా దేశవ్యాప్తంగా కొనసాగనుంది. ఇందులో భాగంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి సేవా కార్యక్రమాలు చేపడతారు. 14 కోట్లకుపైగా రేషన్ కిట్లు పంపిణీ చేస్తారు. రక్తదాన శిబిరాలు నిర్వహిస్తారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లో జన్మించిన నరేంద్ర మోదీ తొలుత రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో చేరారు. అనంతరం బీజేపీలో సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం ఆరంభించారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రతి భారతీయుడికి గర్వకారణం: మోదీ దేశంలో ఒక్కరోజులో 2.26 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పాల్గొన్న వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కృషి మరువలేనదని ప్రశంసించారు. -
ఒక్క రోజే కోటి వ్యాక్సినేషన్లు
న్యూఢిల్లీ: దేశంలో రికార్డు స్థాయిలో ఒకే రోజు కోటి డోసులకు పైగా వ్యాక్సినేషన్లు జరిగినట్లు ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఇప్పటి వరకూ ఒకరోజు వ్యవధిలో చేసిన అత్యధిక వ్యాక్సినేషన్ల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 62,17,06,882కు చేరుకుంది. కోవిన్ పోర్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం శుక్రవారం ఒక్క రోజులోనే 1,00,64,032 డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. కోటి డోసులు దాటడం గుర్తుండిపోదగ్గ సందర్భమని ప్రధాని మోదీ అన్నారు. వ్యాక్సినేషన్లు తీసుకొని డ్రైవ్‌ను విజయవంతం చేసిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు వ్యాక్సిన్ వేయించుకున్న పౌరులకు అభినందనలు తెలుపుతూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఈ నెల 17న ఒకే రోజు 88 లక్షల డోసుల వ్యాక్సినేషన్లు జరిగాయి. ఇప్పటి వరకూ ఒకరోజులో జరిగిన అత్యధిక వ్యాక్సినేషన్ల రికార్డు అదే కాగా, తాజా రికార్డు దాన్ని బద్దలుకొట్టింది. 18–44 వయసుల వారిలో 30,85,06,160 మంది మొదటి డోసు వ్యాక్సినేషన్ తీసుకోగా, 23,98,99,849 మంది రెండు డోసులను తీసుకున్నారు. -
గల్ఫ్‌లో టీకా సర్టిఫికెట్ల తిప్పలు
ఇండియా నుంచి గల్ఫ్ కు వెళ్లే భారతీయులకు కొత్త చిక్కు వచ్చి పడింది. కోవీషీల్డ్ టీకా తీసుకుంటే ఇబ్బంది లేదన్న ధైర్యంతో ఉన్న ప్రవాస భారతీయులకు ఊహించిన సమస్య ఎదురైంది. భారత ప్రభుత్వం కోవిన్ యాప్ ద్వారా జారీ చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ని కొన్ని గల్ఫ్ దేశాలకు చెందిన యాప్‌లు స్వీకరించడం లేదు. ఇబ్బందులు కోవిడ్ వ్యాక్సినేషన్‌కి సంబంధించి ప్రతీ దేశానికి వేర్వేరుగా యాప్‌లు ఉన్నాయి. మన ప్రభుత్వం కోవిన్ ద్వారా సర్టిఫికేట్లు జారీ చేసింది. ఇండియాలో కోవిషీల్డ్ టీకా తీసుకున్నవారు కొన్ని గల్ఫ్ దేశాల ఆరోగ్య శాఖ యాప్ లలో తమ ఆరోగ్య స్థితిని నమోదు చేసుకునే క్రమంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అక్కడి యాప్‌లు కోవిన్‌ను స్వీకరించడం లేదు. ఆర్థిక భారం గల్ఫ్ దేశాల యాప్‌లలో తలెత్తుతున్న ఇబ్బందులను నివారించేందుకు ఢిల్లీలోని గల్ఫ్ దేశాల ఎంబసీలతో కోవిడ్ టీకా సర్టిఫికేట్ అటెస్ట్ చేసుకోవాలంటే ఒక్కరికి కనీసం రూ.6,500 నుంచి రూ.8,000 ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. పైగా ‘తవక్కల్నా' యాప్‌లో ఆరోగ్య స్థితిని మోసపూరితంగా అప్డేట్ చేసినందుకు గాను అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు, విదేశీ కార్మికులతో సహా 122 మంది ఇటీవల సౌదీలో అరెస్టు అయ్యారు. ఎంబసీలు చొరవ చూపితే భారతీయ టీకా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్ పోర్టల్ ను గల్ఫ్ దేశాలు గుర్తించేలా మన ఎంబసీ అధికారులు కృషి చేయాలని గల్ఫ్‌లో ఉన్న భారతీయులు కోరుతున్నారు. కోవిన్ క్యూఆర్ స్కాన్ కోడ్ ఉపయోగించి టీకా సర్టిఫికెట్ ను నిర్ధారించేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. లేదంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప్రపంచ దేశాలకు అందుబాటులో ‘కోవిన్’
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ వ్యాక్సినేషన్‌కు టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న ‘కోవిన్’ వెబ్సైట్/యాప్‌ను ఇక అన్ని దేశాలకు అందుబాటులో ఉండేలా ఓపెన్ సోర్సింగ్ చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు. కరోనా మహమ్మారితో పోరాటంలో ప్రపంచ దేశాలకు సహకరించేందుకు భారత్ సదా సిద్ధంగా ఉంటుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్నుద్దేశించి సోమవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఏ దేశం కూడా, ఎంత శక్తిమంతమైన దేశమైనా సరే, ఒంటరిగా కరోనా వంటి మహమ్మారులపై పోరాటం చేయలేదని ఈ అనుభవం చెబుతోందన్నారు. కరోనాపై భారత్ చేస్తున్న పోరులో సాంకేతికతది కీలకపాత్ర అని, అదృష్టవశాత్తూ సాఫ్ట్‌వేర్‌కు పెద్దగా వనరుల లోటు లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమని చెప్పే ‘వసుధైక కుటుంబ’ భావన భారతదేశానిదని, ప్రస్తుత మహమ్మారి సమయంలో చాలామందికి ఈ విషయం స్పష్టంగా అర్థమైందని మోదీ వ్యాఖ్యానించారు. అదే భావనతో ‘‘కోవిడ్ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ యాప్ అయిన ‘కోవిన్’ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా ఓపెన్‌సోర్స్‌గా మారుస్తున్నాం’ అన్నారు. కెనడా, మెక్సికో, నైజీరియా, పనామా, ఉగాండా తదితర దాదాపు 50 దేశాలు తమ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ‘కోవిన్’ను వినియోగించే విషయంపై ఆసక్తి కనబర్చాయని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈఓ ఆర్ఎస్ శర్మ ఇటీవల తెలిపారు. -
పాస్‌పోర్ట్‌కు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను లింక్ చేశారా? ఎలాగో తెలుసుకోండి!
ప్రపంచ దేశాల్లో విమాన ప్రయాణాలకు మార్గం సుమగమైంది. ఇన్ని రోజులు ఎయిర్ పోర్ట్లకే పరిమితమైన విమానాలు..ఇప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. అయితే కరోనా కారణంగా ఆయా దేశాలు ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలు భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా అమలవుతున్నాయి. దేశాల్ని బట్టి ఈ ఆంక్షలు అమలవుతుండగా.. ఎక్కువ శాతం కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్న వారినే అనుమతిస్తుండగా.. వారికి వ్యాక్సిన్ పాస్ పోర్ట్‌ను తప్పనిసరి చేశాయి. మన దేశంలో మాత్రం పాస్ పోర్ట్ కు వ్యాక్సిన్ వేయించున్న సర్టిఫికెట్ ను అందిస్తే సరిపోతుంది. ఎవరైతే రెండు డోసులు వ్యాక్సిన వేయించుకుంటారో.. ఆ ప్రయాణికులు సంబంధిత పాస్ట్ పోర్ట్ పోర్టల్ లో మీరు ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఎప్పుడు వేయించుకున్నారనే సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇచ్చిన ప్రయాణికులకు మాత్రమే కేంద్రం వ్యాక్సిన్ సర్టిఫికేట్ అందిస్తుంది. మరి ఈ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను ఎలా అప్లయ్ చేయాలో తెలుసుకుందాం. ఎలా అప్లయ్ చేయాలి ♦విదేశాలకు వెళ్లే ప్రయాణికులు కోవిన్ పోర్టల్‌లో పాస్ పోర్ట్‌ను లింక్ చేయాల్సి ఉంటుంది. ♦ముందుగా ప్రభుత్వానికి చెందిన http://cowin.gov.in వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. ♦లాగిన్ అయిన వెంటనే మనం వ్యక్తిగత వివరాలు డ్యాష్ బోర్డ్ లో మనకు కనిపిస్తాయి. ♦ఆ డ్యాష్ బోర్డ్ ( హోమ్ స్క్రీన్ ) లో రెయిజ్ యాన్ ఇష్యూ (Raise an Issue) బాక్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ♦ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీరు కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ వేయించుకున్నారా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ♦అనంతరం సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి. అక్షరదోషాలు ఏవైనా ఉంటే దాన్ని ఎడిట్ చేసుకునే సౌకర్యం ఉంది. చదవండి: Realme : రూ.7వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్ ఎప్పుడో తెలుసా ? -
వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లో పాస్‌పోర్ట్ వివరాలను సమర్పించడం ఎలా?
మీరు విదేశాలకు ప్రయాణిస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కోవిన్ పోర్టల్ ద్వారా పాస్ పోర్ట్ వివరాలను కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో నమోదు చేయవచ్చు. కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో తమ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేయడానికి కోవిన్ వినియోగదారులకు కేంద్రం అవకాశం కల్పిస్తుంది. మీరు ఆన్ లైన్ లోనే ఇంట్లో నుంచే వివరాలను నమోదు చేయవచ్చు. కోవిన్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ విదేశాలకు ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. "ఇప్పుడు మీరు మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో మీ పాస్ పోర్ట్ నంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు" అని ఆరోగ్య సేతు యాప్ అధికారిక హ్యాండిల్ ట్వీట్ చేసింది. ఈ నెల ప్రారంభంలో విద్య, ఉద్యోగాలు, టోక్యో ఒలింపిక్ క్రీడల కోసం భారత బృందం విదేశాలకు ప్రయాణించేటప్పుడు వారు తమ పాస్ పోర్ట్ తో లింకు అయిన వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లను కలిగి ఉండాల్సి ఉంటుందని పేర్కొంటూ కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వినియోగదారులు తమ పాస్ పోర్ట్ వివరాలను కోవిన్ వెబ్ సైట్ (cowin.gov.in) ద్వారా జోడించవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. Now you can update your Passport number in your vaccination certificate. Login to https://t.co/S3pUooMbXX. Select Raise a Issue Select the passport option Select the person from the drop down menu Enter passport number Submit You will receive the new certificate in seconds. pic.twitter.com/Ed5xIbN834 — Aarogya Setu (@SetuAarogya) June 24, 2021 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లో పాస్ పోర్ట్ వివరాలను ఎలా సమర్పించాలి? కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి. "Raise a Issue" అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు "పాస్ పోర్ట్" ఆప్షన్ నొక్కి డ్రాప్ డౌన్ మెనూలో 'Person'ని ఎంచుకోండి. మీ పాస్ పోర్ట్ నెంబరును నమోదు చేసి వివరాలను సమర్పించండి. ఇప్పుడు మీరు కొత్త సర్టిఫికేట్ ని సెకండ్లలో పొందుతారు. ఒకవేళ వ్యాక్సిన్ సర్టిఫికేట్ పేరు పాస్ పోర్ట్ పై ఉన్న పేరు సరిపోలకపోతే మీరు పేరును ఎడిట్ చేసుకోవచ్చు. కోవిన్ అధికారిక పోర్టల్(cowin.gov.in) లాగిన్ అవ్వండి. ఇప్పుడు 'Raise an issue' ఆప్షన్ క్లిక్ చేసి సభ్యుడి పేరును ఎంచుకోండి. 'కరెక్షన్ ఇన్ సర్టిఫికేట్' అనే ఆప్షన్ మీద తట్టండి. మీరు ఏమి కరెక్షన్ కాయలని అనుకుంటున్నారో ఆ ఆప్షన్ ఎంచుకోండి. ఇప్పుడు సరైన వివరాలను నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీ వ్యక్తిగత వివరాలను ఒక్కసారి మాత్రమే సవరించగలరు అనే విషయం దయచేసి గుర్తుంచుకోండి. చదవండి: ట్విటర్ ఖాతా బ్లాక్... కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం -
ఒక్క రోజులో 85 లక్షల టీకాలు!
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన తొలి రోజే దేశం మొత్తం మీద ప్రజలకు 85.15 లక్షలకు పైగా టీకా డోసులిచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఒక్కరోజులో ఇన్ని టీకాలు ఇవ్వడం ఇదే ప్రథమమని ప్రకటించింది. జనవరి 16న ఆరంభమైన భారత కోవిడ్ టీకా కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 28.36 కోట్లమందికి పైగా టీకాలందుకున్నారని కోవిన్ పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘కోవిడ్‌పై పోరులో టీకానే మన బలమైన ఆయుధం. టీకా అందుకున్న అందరికీ శుభాకాంక్షలు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ధన్యవాదాలు. వెల్డన్ ఇండియా’ అని ప్రధాని మోదీ ప్రశంసలు గుప్పించారు. గతంలో సింగిల్డే టీకా రికార్డు ఏప్రిల్ 1న రికార్డయింది. ఆరోజు 48 లక్షల టీకా డోసులు అందించారు. . సోమ వారం అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో టీకాలివ్వగా, అనంతర స్థానాల్లో కర్ణాటక, ఉత్తరప్రదేశ్ నిలిచాయి. అందరికీ ఉచిత టీకా జూన్ 7న ప్రభుత్వమే 18 ఏళ్ల పైబడిన అందరికీ టీకాలనిస్తుందని ప్రధాని ప్రకటించారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ఆరంభమైంది. ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని కరోనాపై పోరును బలోపేతం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో దేశ యువత, మధ్యతరగతి, పేద ప్రజానికం లబ్ది పొందుతారని ఆయన ట్వీట్ చేశారు. ప్రజా భాగస్వామ్యంతోనే కోవిడ్‌పై పోరును భారత్ బలోపేతం చేస్తుందన్నారు. టీకాలపై వాస్తవాలు తెలుసుకోవాలని, అనవసర పుకార్లు నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ‘‘ప్రపంచంలో అతిపెద్ద ఉచిత టీకా కార్యక్రమం’’గా పేర్కొంటున్న ఈ వ్యాక్సిన్ డ్రైవ్‌ను కేంద్రం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ టీకా కేంద్రాల్లో 18ఏళ్ల పైబడిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. అందరం కలిసి ఉమ్మడిగా కరోనాను జయిద్దామని ప్రధాని అభిలషించారు. దేశీయ ఉత్పత్తిదారుల నుంచి 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రమే సమీకరించనుంది. మిగిలిన ఉత్పత్తిని ప్రైవేట్ ఆస్పత్రులకు ఉత్పత్తి సంస్థలు విక్రయించుకోవచ్చు. -
వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్‌కు మరో మార్గం ?
వెబ్‌డెస్క్ : కోవిన్ యాప్‌తో పాటు ఇతర ప్రైవేటు అప్లికేషన్ల ద్వారా కూడా త్వరలో వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. పేటీఎం, మేక్ మై ట్రిప్‌తో పాటు మరికొన్ని సంస్థలు వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో ప్రభుత్వానికి సహాకరించేందుకు ముందుకు వచ్చాయంటూ రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించింది. థర్డ్‌పార్టీ టీకా రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న సమస్యలు తీర్చేందుకు కేంద్రం మరో ముందడుగు వేసింది. టీకా రిజిస్ట్రేషన్ సేవల్లో ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలలో ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో పాల్గొనేందుకు పలు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపించాయి. అపోలో, మాక్స్ వంటి ఆస్పత్రులతో పాటు మేక్ మై ట్రిప్, 1 మిల్లీగ్రామ్, పేటీఎం, ఇన్ఫోసిస్ తదితర మొత్తం 15 సంస్థలు ఈ సేవలు ప్రారంభించే అవకాశం ఉందని రాయిటర్స్ పేర్కొంది. సహాయకారిగా మేక్ మై ట్రిప్ సీఈవో రాజేశ్ మాగౌ మాట్లాడుతూ వ్యాక్సిన్ బుకింగ్ చేసుకునేందుకు ప్రజలకు సహయకారిగా ఉండాలని నిర్ణయించామని, అందుకే మేక్ మై ట్రిప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సేవలకు ముందుకు వచ్చామని వివరించారు. అయితే ఈ అంశంపై స్పందించేందుకు పేటీఎం,అపోలో, మాక్స్ నిరాకరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. పేటీఎంకి వెబ్‌సైట్‌కి పది కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మేక్ మై ట్రిప్ అప్లికేషన్‌కి 1.20 కోట్ల మంది చందాదారులు ఉన్నారు. చదవండి: కోవిడ్ టీకా డోస్‌ల వృథాలో జార్ఖండ్ టాప్ -
Corona Vaccine:స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ లేకున్నా కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్
సాక్షి, హైదరాబాద్: 18004194961. ఇది కోవిడ్–19 టీకా కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు లేకున్నా ఈ నంబర్ ద్వారా టీకా కోసం కో–విన్ అప్లికేషన్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌పీ ఇండియా, జుబిలియంట్ భార తీయ ఫౌండేషన్ (జేబీఎఫ్)లు సంయుక్తంగా ఒక టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేశాయి. దేశంలోని ఏ మూల నుంచైనా 18004194961 నంబర్‌కు ఫోన్ చేయవచ్చు. టీకా వేయించుకో వాలను కునేవారికి అవసరమైన సమాచారం అందించేందుకు ఈ నంబర్‌తోనే ఓ వర్చు వల్ హెల్ప్‌డెస్క్ కూడా పనిచేస్తుంది. వినియోగదారులు తమ మాతృభాషలోనే సమాచారం వినే సౌకర్యం కూడా కల్పించారు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లిషు, కన్నడ భాషల్లో ఈ వర్చువల్ డెస్క్ సహాయం అందుతుంది. మరిన్ని భాషలను జోడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 18 ఏళ్ల పైబడ్డ వారందరూ టీకాలు వేయించుకునే అవకాశం ఉంది. అయితే ఇందు కోసం కో–విన్ యాప్‌లో వివరాలు నమోదు చేసు కోవడం తప్పనిసరి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ సౌకర్యాలు ఉన్నవారు మాత్రమే యాప్‌ను డౌన్లోడ్ చేసుకునే వీలుంది. ఈ సౌకర్యాలు లేనివారికి యాప్‌లో నమోదు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. టీకా కేంద్రాలకు వెళ్లి పేర్లు నమోదు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఇది కొంత ప్రయాసతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో హెచ్‌పీ ఇండియా, జేబీఎఫ్లు ఈ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తేవడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ వంతు సాయంగా... కరోనా కష్టకాలంలో తమవంతు సామాజిక సేవ చేసే లక్ష్యంతోనే ఈ టోల్ ఫ్రీ నంబరు, వర్చువల్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు హెచ్‌పీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కేతన్ పటేల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలో టీకా కార్యక్రమం వేగం పుంజుకునేందుకు ఈ టోల్ ఫ్రీ నంబరు ఉపయోగపడుతుందని జేబీఎఫ్ డైరెక్టర్ రాజేశ్ శ్రీవాస్తవ అన్నారు. -
ఇదేం టీకా విధానం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. టీకాల ఉత్పత్తి, సేకరణ నుంచి ప్రజలకు వయస్సుల వారీగా టీకాలను ఇవ్వాలన్న నిర్ణయం వరకు.. టీకాల ధరల నుంచి, టీకా కోసం ‘కోవిన్’యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయడం వరకు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నవారు క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది. మునుపెన్నడూ ఎరగని ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొంది. టీకా ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడమని కేంద్రాన్ని ఆదేశించింది. ‘కోవిన్’ యాప్‌లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిర్ణయం తీసుకునే ముందు డిజిటల్ ఇండియా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించింది. దేశ ప్రజలందరికీ అది సాధ్యమేనా అన్న విషయం ప్రభుత్వం ఆలోచించలేదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల సౌలభ్యం ఎంత? నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎలా రిజిస్టర్ చేసుకోగలరు? అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్‌ఎన్‌రావు, జస్టిస్ రవీంద్ర భట్ సభ్యులుగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నించింది. వాస్తవ పరిస్థితులను గమనిస్తూ, తదనుగుణంగా ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాల్లో మార్పులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దేశంలో డిజిటల్ నిరక్షరాస్యత అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం ప్రశ్నలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిస్తూ.. రెండో డోసు టీకా వేసుకోవాల్సిన వారిని గుర్తించడానికి ‘కోవిన్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కోసం కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయన్నారు. దీనిపై.. ఇదంతా సాధ్యమేనా? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే, సంబంధిత విధాన నిర్ణయ పత్రాన్ని తమ ముందుంచాలని ఆదేశించింది. కోవిడ్ టీకా నిర్వహణపై సుమోటోగా ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పంజాబ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు టీకాల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని నిర్ణయించడం, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఇప్పటికే కొన్ని బిడ్లను స్వీకరించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రం లేదా ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా టీకాలను సేకరించుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమా? లేక కేంద్రం నోడల్ ఏజెన్సీగా ఉండి టీకాలను కొనుగోలు చేసి, రాష్ట్రాలకు సరఫరా చేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. టీకా కొనుగోలు, పంపిణీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తమకు స్పష్టత కావాలని, సంబంధిత ఫైల్స్‌ను తమకు అందించాలని ఆదేశించింది. ‘45 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపించింది. 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారి విషయంలో రెండు విధానాలు అవలంబిస్తోంది. దాని ప్రకారం.. 50% టీకాలను ఉత్పత్తి సంస్థలు కేంద్రం నిర్ణయించిన ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయాలి. మిగతా 50% ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేయాలి.ఈ నిర్ణయం వెనుక హేతుబద్ధత ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం కన్నా రాష్ట్రాలకు ఎక్కువ ధర ఎందుకు నిర్ణయించారని ప్రశ్నించింది. అలాగే, టీకాలకు ధరలను నిర్ణయించే అధికారం ఉత్పత్తి సంస్థలకు ఇవ్వకుండా, కేంద్రమే దేశవ్యాప్తంగా ఒకటే ధరను నిర్ణయించాలి కదా!? అని వ్యాఖ్యానించింది. అలాగే, 45 ఏళ్లు పైబడినవారిపైనే కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందని కేంద్రం చెప్పిందని, కానీ రెండో వేవ్‌లో 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారిపైనే అది ఎక్కువ ప్రభావం చూపిందని గుర్తు చేసింది. మే 1 నుంచి మే 24 మధ్య నమోదైన కోవిడ్ కేసుల్లో దాదాపు 50% 18 – 44 వయస్సు వారిలోనే నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ద్వంద్వ ధరల విధానం వద్దు టీకా ధరల విధానాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు ఎందుకని ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వ్యాక్సిన్ల కోసం మీలో మీరే పోటీ పడండి అని వాటి మానాన వాటిని వదిలేయడం సరికాదని వ్యాఖ్యానించింది. భారత్ రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. రాష్ట్రాలను తమలో తామే పోటీ పడమని కేంద్రం వదిలేసింది అనడం సరికాదని తుషార్ మెహతా వాదించారు. రాష్ట్రాలకు అందించే టీకా ధరపై కేంద్రమే ఉత్పత్తి సంస్థలతో మధ్యవర్తిత్వం జరిపిందన్నారు. అయినా, ఇలాంటి విధాన నిర్ణయాలపై సమీక్షించే అధికారం కోర్టులకు పరిమితంగా ఉంటుందని మెహతా వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం.. ‘మేం ప్రభుత్వం.. సరైనదేదో మాకే తెలుసు అని మీరు భావించకూడదు. అవసరమైతే మేం గట్టిగా నిలదీయగలం’ అని స్పందించింది. ప్రైవేటు నుంచి సందేశాలు ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకోగానే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సందేశాలు వస్తున్నాయని, ప్రైవేటుగా టీకా తీసుకుంటే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం దాదాపు రూ. 4 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఈ కేసులో ఎమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జస్టిస్ భట్ స్పందిస్తూ.. ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు కాబట్టి.. డిమాండ్ పెరిగితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటి ధర మరింత పెరిగే ప్రమాదముందన్నారు. ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకున్నవారికి స్లాట్లు దొరకని పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. భారత్‌లో అర్హులైన వారందరికీ ఈ సంవత్సరం చివరలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫైజర్ సంస్థతో టీకాల కొనుగోలుపై చర్చలు జరుపుతున్నామని, అవి సఫలమైతే, మరింత ముందుగానే వ్యాక్సినేషన్ ముగుస్తుందని వెల్లడించింది. విమర్శించడం మా ఉద్దేశం కాదు విచారణ చివరలో.. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, ఇందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లి చర్చలు జరపడాన్ని ధర్మాసనం ప్రశంసించింది. ఎవరినీ విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని కోర్టు వివరించింది. ఈ సందర్భంగా, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ‘టీకా ఉత్పత్తి సంస్థలు పరిమితంగా ఉన్నాయి. ఈ సమయంలో టీకా ధరలపై కోర్టు ఏవైనా ఆదేశాలిస్తే.. టీకా ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలకు ఆటంకం కలుగుతుంది. అది వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని తుషార్ మెహతా అభ్యర్థించారు. దీనిపై.. దేశ సంక్షేమానికి అడ్డుతగలాలని కోర్టు భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. తమ ప్రశ్నలు, ఆందోళనలకు రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్‌తో సమాధానమివ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. థర్డ్ వేవ్‌పై ఆందోళన కరోనా మూడో వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న వార్తలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామాలపైనా దీని ప్రభావం భారీగా ఉండబోతోందన్న వార్తలను ప్రస్తావించింది. ఈ వార్తలపై శాస్త్రీయ అధ్యయనం ఏదైనా చేపట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించారా? అని ప్రశ్నించింది. రెమిడెసివిర్ వంటి కోవిడ్ ఔషధాల ధరలు ఆకాశాన్ని అంటడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కేంద్రం మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త సరళీకృత విధానం ప్రకారం.. రాష్ట్రాలు తమ టీకా అవసరాల్లో 50% ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కేంద్రం చెల్లిస్తున్న ధర కన్నా ఇది సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులు మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా వేర్వేరుగా ధరలను నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. టీకాల ద్వారా కూడా లాభాలు ఆర్జించాలని కేంద్రం భావిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. -
హిందీ, 14 ప్రాంతీయ భాషల్లో ‘కోవిన్’
న్యూఢిల్లీ: కోవిడ్ టీకా పొందేందుకు కేంద్రం తీసుకువచ్చిన కోవిన్ పోర్టల్ ప్రజలకు మరింత చేరువకానుంది. ఈ యాప్ వచ్చే వారం నుంచి హిందీ, మరో 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానుందని కేంద్రం తెలిపింది. దీంతోపాటు, దేశంలో తీవ్రంగా ఉన్న కోవిడ్–19 వేరియంట్లను త్వరితంగా గుర్తించేందుకు మరో 17 లేబొరేటరీ లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్‌పై ఏర్పాటైన ఉన్నత స్థాయి మంత్రుల 26వ సమావేశం ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ పలు కీలక అంశాలను వారికి వివరించారు. దేశంలోని కోవిడ్ వేరియంట్లను గుర్తించేందుకు కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఇన్సాకాగ్ (ఇండి యన్ సార్స్ కోవ్–2 జినోమిక్ కన్సార్టియా) నెట్‌వర్క్‌లో మరో 17 ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వీటిద్వారా మరిన్ని శాంపిళ్లను పరీక్షించేందుకు, మరింత విశ్లేషణ చేపట్టేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇలాంటి 10 ల్యాబ్‌లున్నాయన్నారు. పంజాబ్‌లో బి.1.1.7 వేరియంట్ దేశంలో సార్క్ కోవ్–2 మ్యుటేషన్లు, వేరియంట్లపై ఎన్సీడీసీ డైరెక్టర్ డాక్టర్ సుజీత్ కె.సింగ్ వారికి వివరించారు. బి.1.1.7, బి.1.617 వంటి వేరియంట్ల తీవ్రత వివిధ రాష్ట్రాల వారీగా ఎలా ఉందో తెలిపారు. బి.1.1.7 వేరియంట్ పంజాబ్, ఛండీగఢ్‌ల నుంచి ఫిబ్రవరి మార్చి మధ్యలో సేకరించిన శాంపిల్స్‌లో ఎక్కువగా కనిపించిందన్నారు. రెమిడెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు కోవిడ్–19 చికిత్సలో ఎక్కువగా వాడుతున్న ఔషధాలు.. ముఖ్యంగా రెమిడెసివిర్, టోసిలిజు మాబ్, అంఫొటెరిసిన్–బి ఉత్పత్తి, కేటాయింపుల సమన్వయానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశామని ఫార్మా సెక్రటరీ ఎస్.అపర్ణ తెలిపారు. కోవిడ్ వైద్య సూచనల్లో పేర్కొనకపోయినా ఫవిపిరవిర్ ఔషధానికి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం దేశంలో రెమిడెసివిర్ ఉత్పత్తి మూడు రెట్లు పెరిగి, నెలకు 39 లక్షల వయల్స్ నుంచి 1.18 కోట్ల వయల్స్ వరకు తయారవుతోందని తెలిపారు. అదేవిధంగా, బ్లాక్ ఫంగస్(మ్యుకోర్మైకోసిస్) బారిన పడిన వారికి ఇచ్చే అంఫొటెరిసిన్–బి ఔషధం తయారీ కూడా పెరిగిందని చెప్పారు. మే1–14 తేదీల మధ్య రాష్ట్రాలకు ఒక లక్ష వయల్స్ అంఫొటెరిసిన్–బిను అందజేశామన్నారు. పరీక్షల సామర్థ్యం పెంపు గ్రామీణ ప్రాంతాల వారికి కోవిడ్ పరీక్షలను మరింత చేరువ చేసేందుకు ఆర్టీ–పీసీఆర్ టెస్టింగ్ వ్యాన్లు, ఆర్ఏటీ టెస్ట్ కిట్లను అందుబాటులోకి తెస్తున్నామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) డీజీ డాక్టర్ బలరాం భార్గవ తెలిపారు. వీటితో ఆర్టీ–పీసీఆర్, ఆర్ఏటీ పరీక్షల సామర్థ్యం రోజుకు 25 లక్షల నుంచి 45 లక్షలకు పెరుగుతుందని వివరించారు. హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను హిందీతోపాటు 14 ప్రాంతీయ భాషల్లోకి అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. (చదవండి: తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబీకుల హర్షం) -
నకిలీ ఎస్ఎంఎస్.. హానికరమైన యాప్
న్యూఢిల్లీ: కరోనా టీకా పొందాలంటే కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు యాప్‌లో పేర్లు, వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. అయితే, పేర్ల రిజిస్ట్రేషన్ కోసమంటూ హానికరమైన యాప్‌ను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ ఒకటి సర్క్యులేట్ అవుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ–ఇన్) సూచించింది. ఇలాంటి యాప్‌లను ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ప్రమా దమని హెచ్చరించింది. నకిలీ ఎస్ఎంఎస్లో ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు పంపిస్తున్నారని, దానిపై క్లిక్ చేస్తే హానికరమైన యాప్ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లలో ఇన్స్టాల్ అవుతుందని తెలిపింది. అనంతరం బాధితుల ఫోన్లలోని కాంటాక్టులన్నింటికీ దానంతట అదే ఎస్ఎంఎస్ రూపంలో చేరుతుందని పేర్కొంది. ఈ యాప్ ఫోన్లలో ఉంటే వ్యక్తిగత సమాచారం చోరీకి గురి కావడం ఖాయమంది. Covid19. apk;Vaci&&Regis.apk; MyVaccin&v2. apk;Cov&Regis.apk; Vccin&Apply.apk. అనే లింక్‌లను సూచిస్తూ నకిలీ ఎస్ఎంఎస్ వస్తున్నట్లు వెల్లడించింది. కేవలం http:// cowin.gov. in అనే అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. -
కోవిన్ యాప్: కొత్త సెక్యూరిటీ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం ఉపయోగించే కోవిన్ పోర్టల్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్‌ను కేంద్రం జోడించింది. కోవిన్ పోర్టల్ డేటా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఉన్నాయని చాలామంది ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కొత్తగా తీసుకొస్తున్న ‘4-అంకెల సెక్యూరిటీ కోడ్ వల్ల ఈ సమాచారాన్ని తప్పుగా ఉపయోగించుకునే అవకాశాలను తగ్గించడంతోపాటు డేటా ఎంట్రీ ఎర్రర్స్ కూడా తగ్గుతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రేపటినుంచి( మే 8) నుంచి ఈ ఫీచర్ అమల్లోకి వస్తుందని తెలిపింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కోసం అపాయింట్మెంట్ను బుక్ చేసుకున్నవారు నిర్దేశిత తేదీనాడు వ్యాక్సినేషన్ కోసం వెళ్ళకపోయినప్పటికీ, వారికి వ్యాక్సినేషన్ జరిగినట్లు ఎస్ఎంఎస్ వచ్చిందన పలు ఆరోపణలో నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. కొత్తగా తీసుకొస్తున్న ఈ నాలుగు అంకెల సెక్యూరిటీ కోడ్ ద్వారా ప్రజలకు కలిగే అసౌకర్యం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ -19 వ్యాక్సిన్ పొందడానికి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న లబ్ధిదారులు ఈ టీకాను తీసుకోన్నారో లేదో కచ్చితంగా తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియలో లోపాలపై వచ్చిన ఆరోపణలపై పరిశీలన జరిపినపుడు వ్యాక్సినేటర్ పొరపాటే దీనికి కారణమని వెల్లడైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు కోవిన్ యాప్‌లో ఈ నాలుగ అంకెల భద్రతా కోడ్‌ను ప్రవేశపెట్టినట్టు చెప్పింది. నాలుగు అంకెల భద్రతా కోడ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? టీకా స్లాట్ కోసం ఆన్లైన్ బుకింగ్ చేసిన పౌరులకు మాత్రమే ఈ క్రొత్త ఫీచర్ వర్తిస్తుంది. అపాయింట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ మీద ఈ కోడ్ ముద్రించబడి ఉంటుంది. ఇది వ్యాక్సినేటర్‌కు తెలియదు. లబ్ధిదారుకు అపాయింట్మెంట్ ఖరారు అయిన తర్వాత వచ్చే ఎస్ఎంఎస్లో కూడా ఈ నాలుగు అంకెల కోడ్ ఉంటుంది. అపాయింట్మెంట్ అక్నాలెడ్జ్మెంట్ స్లిప్‌ను మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని, వ్యాక్సిన్ తీసుకునే సమయంలో చూపించాల్సి ఉంటుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పౌరులకు ఈ క్రింది సలహాలను జారీ చేసింది పౌరులు తమ అపాయింట్మెంట్ స్లిప్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఎస్ఎంఎస్ను వ్యాక్సినేషన్ కేంద్రంలో చూపించాలి. ఇందులోని నాలుగు అంకెల కోడ్ చెప్పాలి. దీన్ని వ్యాక్సిన్ డోసును ఇవ్వడానికి ముందు వెరిఫయర్/వ్యాక్సినేటర్ కోవిన్ సిస్టమ్‌లో ఎంటర్ చేస్తారు దీంతో వ్యాక్సినేషన్ స్టేటస్ సరైన విధంగా రికార్డ్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా నిర్ధారణ ఎస్ఎంఎస్ రాకపోతే టీకా కేంద్రం ఇన్‌ఛార్జిని సంప్రదించాలి. -
ఈ సైట్లు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీలు ఇట్టే చెప్తాయి...!
సాక్షి, హైదరాబాద్: దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని కేంద్రం కూడా భావించగా, ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపిన విషయం తెలిసిందే. చాలామంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఆసక్తి కనబరచగా, ఏప్రిల్ 28 నుంచి వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కేంద్రం ప్రకటించడంతో ఆ రోజు ఒక్కసారిగా చాలా మంది సైటుపై పడడంతో కోవిన్ యాప్ రిజిస్ట్రేషన్ సైట్ క్రాష్ అవ్వగా, ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం చాలా మంది ఎగబడుతున్నారు. సైట్ ఓపెన్ చేసిన వెంటనే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీ లేదు అనే సందేశం కనిపిస్తోంది. దీంతో చాలా మంది నిరాశకు గురవుతున్నారు. ఈ సమస్యకు కొంతమంది టెక్నికల్ నిపుణులు పరిష్కారాన్ని చూపారు. వీరు చూపిన పరిష్కారంతో సులువుగా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అందుకుగాను కోవిన్ యాప్‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఎక్కడ, ఎప్పుడు ఖాళీగా ఉందో చెప్పేలా వైబ్సైట్లను రూపొందించారు. అంతేకాకుండా ఈ సైట్లలో రిజిస్టర్ అయిన వారికి నోటిఫికేషన్ అలర్ట్‌లను పంపుతాయి. అందు కోసం ఈ సైట్లలో ముందుగా రిజిస్టర్ కావాల్సి ఉంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే తిరిగి కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీంతో ప్రజలు చాలా సమయం పాటు వేచి చూడాల్సిన అవసరం ఉండదు. కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ స్లాట్ ఖాళీలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాడానికి ఈ సైట్లలో రిజిస్టరవ్వండి: 1. కోవిడ్-19 వ్యాక్సిన్ ట్రాకర్ ఫర్ ఇండియా: దీనిని ఇండియాకు చెందిన అమిత్ అగర్వాల్ రూపొందించారు. ఈ వైబ్సైట్లో రిజిస్టర్ కాగానే, వ్యాక్సిన్ లభ్యత ఎక్కడ ఉందనే విషయం ఈ మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. Get email alerts when #COVID19Vaccine becomes available in a vaccination center near you. (Built with Google Sheets) 👉🏻 https://t.co/Gt5D18thvr https://t.co/EWHDC1FEQ5 pic.twitter.com/7BJbCQROgw — Amit Agarwal (@labnol) May 1, 2021 2.అండర్45.ఇన్(Under45.in): 18-44 సంవత్సరాల వయసు వారికి సమీపంలో ఉన్న టీకాల స్లాట్ల కోసం శోధించడానికి అండర్ 45.in అనే వెబ్‌సైట్‌తో ప్రోగ్రామర్ బెర్టీ థామస్ ముందుకు వచ్చారు. Alerts of vaccination slots (18-45 group) for South East Delhi (Delhi)https://t.co/LSucUAl4sS For any district, continue to use: https://t.co/VXNLXkLu8C#CovidIndia #CovidVaccineIndia #Under45 6/n — Berty Thomas (@BertyThomas) May 1, 2021 3. గెట్జ్యాబ్.ఇన్(Getjab.in): ఐఎస్బీ పూర్వ విద్యార్థులు శ్యామ్ సుందర్, అతని స్నేహితులు getjab.in అనే వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. ప్రజలకు సమీపంలోని టీకా స్లాట్ల ఖాళీలను ఈ-మెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది 4. ఫైండ్ స్లాట్.ఇన్(FindSlot.in): కోవిడ్-19 వ్యాక్సిన్ అపాయింట్మెంట్ కోసం సహాయపడే మరొక సైట్, ఫైండ్స్లాట్.ఇన్ , ఈ సైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ప్రజలు తమ నగరం ద్వారా లేదా వారి పిన్ కోడ్ ద్వారా శోధించవచ్చును. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి?
న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కోవిడ్-19 టీకా తీసుకోవడం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం నిన్న ప్రారంభించింది. రిజిస్టర్డ్ చేసుకున్న లబ్ధిదారులకు టీకాలు వేయడం మే 1 నుంచి ప్రారంభంకానుంది. ఇంకా కోవిడ్ టీకా కోసం రిజిస్ట్రేషన్ చేసుకోక పోతే కోవిన్ ఆన్లైన్ పోర్టల్(cowin.gov.in), ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ద్వారా మీ పేరు నమోదు చేసుకోవచ్చు. కోవిడ్-19 టీకా కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభించిన రోజున 1.32 కోట్లకు పైగా ప్రజలు తమ పేరును నమోదు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ తర్వాత ఏమి చేయాలి? కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత లబ్ధిదారుడు వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు నిర్ణీత తేదీ, ప్రదేశం, టీకా వేసుకునే సమయం గురించి మీ మొబైల్ కు ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ లో తెలిపిన తేదీ నాడు టీకా కేంద్రాల దగ్గరకు వెళ్లేటప్పుడు మీరు ఫోటో ఐడీని, పోర్టల్ లేదా యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న రశీదును మీ వెంట తీసుకొని వెళ్లాలి. కోవిడ్ -19 వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత, లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. వ్యాక్సిన్ అన్ని డోస్ లు తీసుకున్న తర్వాత, లబ్ధిదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు క్యూఆర్ కోడ్ ఆధారిత సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికెట్‌ను డిజి-లాకర్లో భద్రపరుచుకోవచ్చు అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఒకే మొబైల్ నంబర్ ఉపయోగించి నలుగురు వ్యక్తులు కోవిడ్ -19 టీకా కోసం నమోదు చేసుకోవచ్చు. మీరు ఉమ్మడి టీకా కోసం నమోదు చేసుకుంటే, వేర్వేరు వయసుల క్రిందకు వచ్చే టీకాలు పొందాలనుకునే వారు, అంటే 45 కంటే ఎక్కువ లేదా అంతకంటే తక్కువ(18-44 వయస్సు) గల వారు, మీరు మీ టీకా కేంద్రాన్ని జాగ్రత్తగా ఎన్నుకోవాలి. కేంద్ర ప్రభుత్వం టీకా కేంద్రాల వద్ద 45 ఏళ్లు పైబడిన లబ్ధిదారులకు మాత్రమే టీకాలు వేస్తుంది. మిగతా వారికీ మే 1 నుంచి అనేక రాష్ట్రాలు టీకా కేంద్రాలలో ఉచిత టీకాలు వేస్తున్నట్లు ప్రకటించాయి. మీ రాస్ట్రంలో అలాంటి ప్రభుత్వ టీకా కేంద్రం లేకపోతే, మీరు ప్రైవేట్ ఆసుపత్రులలో డబ్బులు చెల్లించి టీకాల కోసం వేసుకోవాల్సి ఉంటుంది. చదవండి: భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా? -
దేశంలో మూడోదశ వ్యాక్సినేషన్‌కు రిజిస్ట్రేషన్లు మొదలు
-
Cowin, Arogya Setu: కరోనా వ్యాక్సినేషన్ యాప్, పోర్టల్ క్రాష్!
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం ఉదయం నుంచి ఎదురు చూస్తున్న యువతకు నిరాశ ఎదురైంది. దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయస్సు గలవారు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో 18-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికి టీకా రిజిస్ట్రేషన్ కోసం కేంద్రం అవకాశం కల్పించింది. అయితే నేడు సాయంత్రం 4 గంటలకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కోవిన్ యాప్-పోర్టల్, ఉమాంగ్ యాప్, ఆరోగ్య సేతు యాప్ ల సర్వర్లు అన్నీ క్రాష్ అయ్యాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే వేల సంఖ్యలో లాగిన్ అవ్వడానికి ప్రయత్నించంగా సర్వర్ క్రాష్ అయ్యింది. సర్వర్లు క్రాష్ అవుతున్నాయని వినియోగదారులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వినియోగదారులు లాగిన్ అవ్వడానికి అవసరమైన వన్ టైమ్ పాస్వర్డ్(OTP) కూడా రావడం లేదని ఫిర్యాదు చేశారు. అధిక సర్వర్ లోడ్ కారణంగా సాయంత్రం 4 గంటలకు కోవిన్ సర్వర్లు డౌన్ అయ్యాయి. ఒకే సమయంలో భారీగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
వ్యాక్సిన్ కోసం ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ కోసం భారతదేశం యువత ఎదురుచూస్తోంది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా బారిన పడుతున్న కేసులలో యువత, మధ్య వయస్సు గలవారు వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు కోవిడ్-19 వల్ల మరణిస్తున్న వారిలో సైతం 20 నుంచి 45 ఏళ్ల వయసు ఉన్నవారే అధికంగా ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ విషయంలో ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైడిన అందరికీ దేశ వ్యాప్తంగా కరోనా టీకాలకు అర్హులుగా ప్రకటించింది. నేటి(ఏప్రిల్ 28) నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి ఉదయం నుంచే చాలా మంది యువత కోవిన్ యాప్, వెబ్సైట్లలో కోవిడ్19 టీకా రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తొలుత రిజిస్ట్రేషన్ సమయం చెప్పకపోవడంతో చాలా మంది అసహనం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 28న(బుధవారం) సాయంత్రం 4 గంటల నుంచి కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ లలో కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోగ్య సేతు అదికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. 18 ఏళ్లు పైబడిన వారికి దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు మే 1 నుంచి ప్రారంభం కానున్నాయి. కోవిడ్19 టీకాల కోసం కొవిన్ యాప్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ యాప్ ల ద్వారా ఆసక్తిగల వారు కరోనా టీకాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది. Registration for 18 plus to begin on https://t.co/S3pUooMbXX, Aarogya Setu App & UMANG App at 4 PM on 28th April. Appointments at State Govt centers & Private centers depending on how many vaccination centers are ready on 1st May for Vaccination of 18 plus. #LargestVaccineDrive — Aarogya Setu (@SetuAarogya) April 28, 2021 చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
Corona Vaccine: కోవిన్ పోర్టల్‌లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి?
కరోనా టీకా... ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ ఇదే. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ మే1వ తేదీ నుంచి టీకా వేస్తామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటన... వయసుతో సంబంధం లేకుండా రాష్ట్రంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీకా ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు ఎక్కడ విన్నా టీకా టాపిక్కే నడుస్తోంది. టీకా ఎలా వేయించుకోవాలి? టీకా వేయించుకునేందుకు ఏం చేయాలి? మొబైల్ యాప్లుంటాయా? ఒక కుటుంబంలో ఒక స్మార్ట్ ఫోనే ఉంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అసలు రిజిస్ట్రేషన్ ఉండాలా? నేరుగా వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళితే వేయరా? మరి చదువులేని వారు.. స్మార్ట్ ఫోన్లపై అవగాహన లేని వారి పరిస్థితి ఏంటి? వ్యాక్సిన్ కోసం ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం?... రాష్ట్ర ప్రజానీకంలో తలెత్తుతున్న ఇలాంటి సందేహాలన్నిటికీ కోవిన్ పోర్టల్ సమాధానమిస్తోంది. కోవిడ్–19 వ్యాక్సిన్ కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి? www.cowin.gov.in లింకు ద్వారా కోవిన్ పోర్టల్‌లోకి వెళ్లి అక్కడ ‘రిజిస్టర్/సైన్ఇన్ యువర్ సెల్ఫ్’అనే ట్యాబ్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ రిజస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి కోవిడ్ వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. వ్యాక్సినేషన్‌కోసం మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలా? మన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం అధీకృత మొబైల్ యాప్ లేదు. కోవిన్ పోర్టల్ ద్వారానే రిజిస్టర్ చేసుకోవాలి. ఆరోగ్య సేతు ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏ వయసు వారు కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి? ప్రస్తుతానికి 45 ఏళ్లు దాటిన వారంతా రిజిస్టర్ చేసుకోవచ్చు. మే1 తేదీకి 18 ఏళ్లు నిండిన వారంతా బుధవారం నుంచి కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేందుకు అవకాశముంది. వ్యాక్సిన్ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరా? అవసరం లేదు. ప్రస్తుతం కొన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల్లో కొన్ని స్పాట్ రిజిస్ట్రేషన్ల ద్వారా వ్యాక్సిన్లు ఇస్తున్నారు. కానీ, కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకుని వెళ్లడం ద్వారా ఇబ్బందులు లేకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నామన్న విషయం ఎలా ధ్రువీకరించబడుతుంది? మీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ నిర్ధారణ జరిగిన వెంటనే వ్యాక్సినేషన్ కేంద్రం, వ్యాక్సిన్ తీసుకోవాల్సిన రోజు, సమయం తదితర వివరాలన్నీ మొబైల్ నెంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయి. మీరు ఈ వివరాలను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అపాయింట్మెంట్ లేకుండా వ్యాక్సినేషన్ చేయరా? వ్యాక్సినేషన్ కేంద్రాల్లో చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాక్సిన్ కోసం అపాయింట్మెంట్ ఇస్తారు. అక్కడకు వెళ్లి సమయం వృధా చేసుకోకుండా ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని వెళ్లాలని ప్రభుత్వం సూచిస్తోంది. రెండోసారి వ్యాక్సిన్ తీసుకోవడం తప్పనిసరా? అవును. రెండు డోసులు తీసుకుంటేనే వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. అది కూడా రెండుసార్లూ ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండో డోస్ ఎప్పుడు తీసుకోవాలి? మొదటి డోస్ తీసుకున్న 4 నుంచి 6 వారాల్లోపు కోవాగ్జిన్, 6 నుంచి 8 వారాల్లోపు కోవిషీల్డ్ రెండో డోస్ తీసుకోవాలి. మీ అనుకూలతను బట్టి ఈ కాలపరిమితి లోపు రెండో డోస్ తీసుకోవాలి. కోవిన్ ద్వారా రెండో డోస్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అవుతుందా? అవును. రెండో డోస్ వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ కోసం కోవిన్ పోర్టల్ మీకు సాయపడుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా అపాయింట్మెంట్ సమయంలో సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి? 1075 టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు.కోవిన్ పోర్టల్ ద్వారా కూడా మీ సందేహాలు తీర్చుకోవచ్చు. అన్ని చోట్లా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తారా? లేదు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా ఇస్తారు. ప్రై వేటు ఆసుపత్రుల్లో రుసుము వసూలు చేస్తారు. వ్యాక్సిన్‌ను మనం ఎంపిక చేసుకోవచ్చా? అన్ని రకాల వ్యాక్సిన్లు శ్రేయస్కరమైనవే. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎందుకు? మీరు వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా నిర్ధారణకు, అవసరమైన చోట చూపించేం దుకు సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికెట్ ఎవరిస్తారు? మీకు వ్యాక్సిన్ ఇచ్చిన కేంద్రంలోనే సర్టిఫికెట్ కాపీ ఇస్తారు. మీరు అడిగి మరీ తీసుకోవచ్చు. ఈ సర్టిఫికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చా? కోవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతులో ఈ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్ ద్వారానే దీన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు ఏ ధ్రువపత్రాలు తీసుకెళ్లాలి? వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ఇచ్చిన ధ్రువపత్రాలనే వ్యాక్సినేషన్‌కు వెళ్లేటప్పుడు తీసుకెళ్లాలి. రెండో డోస్ ఎక్కడైనా తీసుకోవచ్చా? అవును. మన దేశంలో ఎక్కడైనా, ఏ రాష్ట్రం, ఏ జిల్లాలోనైనా రెండో డోస్ తీసుకోవచ్చు. కానీ, మీరు మొదటి డోస్ తీసుకున్న చోట మాత్రమే మీరు తీసుకోవాల్సిన వ్యాక్సిన్ (మొదటిసారి తీసుకున్నది) అందుబాటులో ఉండే అవకాశముంది. వ్యాక్సినేషన్ కారణంగా ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఎవరిని సంప్రదించాలి? మీరు వ్యాక్సిన్ వేసుకున్న కేంద్రంలో లేదా 1075 టోల్‌ఫ్రీ నంబర్, 9111–23978046 అనే హెల్ప్‌లైన్‌నంబర్ లేదా 0120–4473222 అనే టెక్నికల్ హెల్ప్‌లైన్‌నంబర్ లేదా nvoc2019@gov.in అనే ఈమెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు. చదవండి: యూకే వేరియంట్‌లాగా వేగంగా వ్యాపిస్తోంది 70 టన్నుల ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రాక -
వ్యాక్సిన్ కావాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి!
న్యూఢిల్లీ: మే 1వ తేదీ నుంచి 18 నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన వారికి కరోనా వ్యాక్సిన్ అందించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ తీసుకోవాలంటే కచ్చితంగా కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం 45 సంవత్సరాలు దాటిన వారు కొవిన్ వెబ్‌పోర్టల్‌లో పేరు నమోదు చేసుకోవాలి. కానీ, వారు ఆధార్ కార్డుతో నేరుగా వాక్సినేషన్ కేంద్రానికి వెళ్లినా వైద్య సిబ్బంది పేరు, వివరాలు నమోదు చేసుకుని వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ కేసుల భాగ పెరుగుతున్న నేపథ్యంలో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ మే 1 నుంచి టీకాలు వేయాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ కు డిమాండ్ పెరగడం వల్ల వాక్సినేషన్ కేంద్రల వద్ద జనాభా తాకిడి ఎక్కువవుతుంది కాబట్టి కోవిన్ వెబ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసినట్లు ఒక అధికారి పేర్కొన్నారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ టీకా కోసం రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 28 నుంచి కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో ప్రారంభమవుతుంది. మరోవైపు వ్యాక్సిన్ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను ప్రకటించగా, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు స్పష్టం చేశాయి. చదవండి: కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి! -
కోవిడ్-19 వ్యాక్సిన్ కోసం ఇలా రిజిస్టర్ చేసుకోండి!
దేశంలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా రాష్ట్రాలు తమకు ఎక్కువ సంఖ్యలో వ్యాక్సిన్ పంపించాలని కేంద్రాన్ని కోరుతున్నాయి. ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరికీ కరోనా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో చాలామంది వ్యాక్సిన్ తీసుకు నేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ టీకా తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా కేంద్రం అధికారిక వెబ్సైట్ కొవిన్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి రిజిస్టర్ చేసుకునేందుకు కేంద్రం అవకాశం కల్పిస్తోంది. కోవిడ్-19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ► మీ మొబైల్ నంబర్ సహాయంతో కో-విన్ 2.0 పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ►ఇప్పుడు ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు,పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ► ఒకసారి రిజిస్టేషన్ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ►ఇప్పుడు మీకు షెడ్యూల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో మీరు టీకా వేసుకునేందుకు అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు. ►ఇందులో పిన్ కోడ్ ఎంటర్ చేసి వెతికితే టీకా కేంద్రాల జాబితా కనిపిస్తోంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్ బటన్‌పై క్లిక్ చేయాలి. ► ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. స్లాట్లు లేకపోతే నేను ఏమి చేయాలి? స్లాట్ల లభ్యత లేకపోతే కొన్ని రోజుల తర్వాత మళ్లీ అపాయింట్మెంట్ స్లాట్ల కోసం ప్రయత్నించండి. నేను అపాయింట్మెంట్ ను రీ-షెడ్యూల్ చేయవచ్చా? చేయవచ్చు. కానీ, మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న ముందు రోజువరకు మాత్రమే అవకాశం ఉంటుంది. సెకండ్ డోస్ కోసం నేను మళ్ళీ నమోదు చేసుకోవాలా? మొదటి మోతాదుకు టీకాలు వేసిన తర్వాత, యూజర్ మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ కోసం ఆటో మేటిక్ గా అపాయింట్మెంట్ కోసం షెడ్యూల్ చేయబడతారు. ఒకవేళ యూజర్ మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరంలోని సమీప టీకా కేంద్రానికి నియామకాలను తిరిగి షెడ్యూల్ చేయవచ్చు. టీకా కేంద్రానికి నేను తీసుకెళ్లవలసిన పత్రాలు ఏమిటి? అపాయింట్మెంట్ నిర్ధారణ లేఖతో పాటు టీకా తీసుకునే సమయంలో ఆ వ్యక్తి కో-విన్ 2.0 పోర్టల్‌లో పేర్కొన్న ఫోటో ఐడిని తీసుకెళ్లాలి. 45 ఏళ్లు పైబడిన వారు, ఇతర వ్యాదులు ఉన్నవారు టీకా సమయంలో వైద్య ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలి. చదవండి: ఈ 8 యాప్స్ వెంటనే డిలిట్ చేయండి! -
వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి
కరోనా వ్యాక్సినేషన్ రెండో దశ ప్రారంభమయ్యింది. అర్హులు టీకా తీసుకోవాలంటే ముందుగా కో–విన్ 2.0 పోర్టల్ (http://cowin.gov.in) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని, అపాయింట్మెంట్ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏం చేయాలంటే.. 1. పోర్టల్‌లో మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. 2. ఫోన్‌కు వన్ టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై బటన్ నొక్కాలి. 3. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి ప్రవేశిస్తారు. 4. పేరు, వయసు వంటి వివరాలతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేయాలి. 5. ఒకవేళ 45 నుంచి 59 ఏళ్ల వయసుండి, వ్యాధులతో బాధపడుతూ ఉంటే గుర్తింపు కార్డుతోపాటు ఆర్ఎంపీ సంతకం చేసిన సంబంధిత ధ్రువపత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. 6. రిజిస్ట్రేషన్ బటన్ నొక్కాలి. 7. ఇప్పుడు అకౌంట్ వివరాలు కనిపిస్తాయి. 8. ఒకే ఫోన్ నంబర్‌తో ఒక్కరి కంటే ఎక్కువ మంది(గరిష్టంగా నలుగురు) రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ‘యాడ్ మోర్’ ఆప్షన్ ఎంచుకోవాలి. వారి వివరాలు నమోదు చేయాలి. 9. ‘షెడ్యూల్ అపాయింట్మెంట్’ బటన్ నొక్కాలి. 10. రాష్ట్రాలు, జిల్లాల వారీగా టీకా అందజేసే వ్యాక్సినేషన్ కేంద్రాల సమాచారంతోపాటు ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్లాట్లు తేదీలు, సమయం వారీగా కనిపిస్తాయి. 11. ఒక స్లాట్‌ను ఎంచుకొని, ‘బుక్’ బటన్‌పై నొక్కాలి. 12. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్తో కూడిన సందేశం ఫోన్‌కు వస్తుంది. 13. వ్యాక్సినేషన్ కంటే ముందు వరకూ అపాయింట్మెంట్ను రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అంటే తేదీ, సమయం మార్చుకోవచ్చు. ఇందుకోసం అదే ఫోన్ నంబర్‌తో పోర్టల్‌లో మళ్లీ లాగిన్ కావాలి. 14. టీకా తీసుకున్న తర్వాత రిఫరెన్స్ ఐడీ వస్తుంది. దీనిద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. ఆరోగ్య సేతు యాప్ ద్వారా... కరోనా టీకా తీసుకోవడానికి ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా అపాయింట్మెంట్ పొందవచ్చు. 1. మొబైల్ ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. 2. యాప్ ఓపెన్ చేసి, కో–విన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. 3. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. 4. ఫోన్ నెంబర్, తర్వాత ఓటీపీ ఎంటర్ చేయాలి. వెరిఫై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 5. రిజిస్ట్రేషన్ ఆఫ్ వ్యాక్సినేషన్ పేజీలోకి వెళ్లాలి. దీనితర్వాత కో–విన్ 2.0 పోర్టల్‌లోని ప్రక్రియనే యథాతథంగా అనుసరిస్తూ ముందుకెళ్లాలి. పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ కో–విన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కాగా, మధ్యాహ్నం ఒంటి గంట వరకు 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ‘‘కరోనా టీకా కోసం కో–విన్ పోర్టల్ (www.cowin.gov. in) ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అపాయింట్మెంట్ పొందాలి. రిజిస్ట్రేషన్ల కోసం కో–విన్ యాప్ అంటూ ఏదీ లేదు. ప్లేస్టోర్‌లో ఉన్న కో–విన్ యాప్ కేవలం అడ్మినిస్ట్రేటర్ల కోసమే. పోర్టల్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా, ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. టీకా తీసుకునే సమయం వరకూ లబ్ధిదారులు పోర్టల్‌లో నమోదు చేసిన వివరాల్లో మార్పులు చేసుకోవచ్చు, తొలగింవచ్చు. టీకా తీసుకున్న తర్వాత రికార్డు మొత్తం లాక్ అవుతుంది. వివరాలను మార్చడానికి వీలుండదు’’ అని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సూచించింది. -
కోవిన్ 2.0 రెడీ.. వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోండిలా!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ కోవిన్ యాప్‌ను కేంద్ర ప్రభుత్వం ఆధునీకరించింది. కోవిన్-2.0ను సిద్ధం చేసింది. దానిని జీపీఎస్‌కు అనుసంధానం చేసింది. దీంతో టీకా లబ్ధిదారులు వ్యాక్సిన్ కేంద్రాలు తమకు సమీపంలో ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని వెళ్లేందుకు వీలవుతుంది. గూగుల్ మ్యాప్ ద్వారా ఎలాగైతే మనం అవసరమైన చోటకు వెళ్తామో, కోవిన్ యాప్ ద్వారా మనకు సమీపంలో ఉన్న టీకా కేంద్రానికి వెళ్లడానికి అది అవకాశం కల్పిస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచి ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం కోవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే టీకా వేస్తారు. టీకా కేంద్రాలకు నేరుగా వచ్చి అక్కడికక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని వ్యాక్సిన్ వేయించుకునే పద్ధతి ప్రస్తుతానికి లేదు. వారం రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ మొదలయ్యాక టీకా కేంద్రంలో నమోదు కార్యక్రమం చేపడతామని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. అందువల్ల అప్పటివరకు ఆన్లైన్లోనే నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం 60 ఏళ్లు పైబడినవారు, 45-59 ఏళ్ల వయస్సులో ఉన్న దీర్ఘకాలిక రోగులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి. ఎలా నమోదు చేసుకోవాలి? ‘కోవిన్.జీవోవీ.ఇన్’ వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో లబ్ధిదారులు పేరు, తమ 10 అంకెల మొబైల్ నంబర్ లేదా ఆధార్ నంబర్‌ను రిజిస్టర్ చేసుకోవాలి. అనంతరం వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని కూడా అందులో నమోదు చేయాలి. 45-59 ఏళ్ల వయస్సువారు ఎంబీబీఎస్ డాక్టర్ ఇచ్చిన దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన సర్టిఫికెట్‌ను కూడా అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగిశాక, వ్యాక్సిన్ వేయించుకునే తేదీ, సమయం, టీకా కేంద్రం వంటి వివరాలు వస్తాయి. అనంతరం మొబైల్ నంబర్‌కు లింక్ వస్తుంది. ఆ లింక్‌ను లబ్ధిదారులు టీకా కేంద్రంలో చూపించడంతో పాటు గుర్తింపు కార్డులను చూపించి వ్యాక్సిన్ పొందొచ్చు. కోవిన్ 2.0 యాప్ ద్వారా కూడా ఈ విధంగా నమోదు చేసుకోవచ్చు. లబ్ధిదారులు తప్పనిసరిగా తమ వెంట ఫొటో, బర్త్ సర్టిఫికెట్, ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తీసుకెళ్లాలి. చదవండి: తెలంగాణలో అంచనాలకు మించి అప్పులు గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ గుడ్‌న్యూస్ -
టీకా ధర రూ.250, కో–విన్ యాప్ డౌన్లోడ్ ఇలా..
సాక్షి, న్యూఢిల్లీ/అహ్మదాబాద్: దేశంలో రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మార్చి 1 నుంచి ప్రారంభం కానుంది. 60 ఏళ్లకు పైగా వయసున్న, 45 ఏళ్లకు పైగా వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారికి కరోనా టీకా ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము చెల్లించి టీకా పొందవచ్చు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని అధికార వర్గాలు శనివారం తెలిపాయి. అంతకుమించి వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశాయి. ఇందులో టీకా డోసు ధర రూ.150 కాగా, సర్వీసు చార్జీ రూ.100 ఉంటుంది. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ఇదే ధర అమల్లో ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తెలియజేసినట్లు వెల్లడించారు. ఒక్కొక్కరు రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటళ్లలో రెండు డోసులకు గాను మొత్తం రూ.500 చెల్లించాలి. రెండో దశ వ్యాక్సినేషన్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా ధరపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, అధికారులతో మాట్లాడారు. ఆన్–సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కోవిడ్–19 వ్యాక్సినేషన్ సెంటర్లుగా పనిచేస్తూ కరోనా వ్యాక్సిన్ అందజేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వివరాలను కో–విన్ 2.0 పోర్టల్, ఆరోగ్య సేతు యాప్‌లో పొందుపర్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఆయా కేంద్రాల్లో లబ్ధిదారులకు ఏ రోజు, ఏ సమయంలో వ్యాక్సిన్ ఇస్తారన్న సమాచారం ఇందులో ఉంటుందని పేర్కొంది. లబ్ధిదారులు కో–విన్ 2.0 పోర్టల్ లేదా ఆరోగ్య సేతు యాప్ ద్వారా ముందుగా అపాయింట్మెంట్ పొందాలని సూచించింది. వారు తమకు అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంచుకోవచ్చని వివరించింది. ఆన్–సైట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ఉందని గుర్తుచేసింది. అంటే సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లి, అప్పటికప్పుడు పేరు నమోదు చేసుకొని, టీకా పొందవచ్చు. 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసుండి వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఆర్ఎంపీ సంతకం చేసిన ధ్రువపత్రాన్ని సమర్పించాలి. అలాగే మార్చి 1 నుంచి కో–విన్ 2.0 పోర్టల్ ద్వారా ముందస్తు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆరోగ్య ఉప కేంద్రాల్లోనూ టీకా ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనలో చేరిన 10,000 ప్రైవేట్ ఆస్పత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో(సీజీహెచ్ఎస్)లో చేరిన 600కి పైగా ఆసుపత్రులతోపాటు రాష్ట్ర ఆరోగ్య బీమాలో భాగంగా ఉన్న ఆసుపత్రుల్లో కరోనా టీకా అందజేస్తారు. రెండో దశలో టీకా అందించే అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల జాబితాను ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో పాటు జాతీయ ఆరోగ్య అథారిటీ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. వీటికి అదనంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, సబ్ డివిజనల్ ఆసుపత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లుగా ఉపయోగించుకుంటారు. కో–విన్లో రిజిస్ట్రేషన్‌తో టీకా వ్యాక్సినేషన్ రెండో దశ మార్చి ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది. టీకా వేయించుకునే వారు కో–విన్ యాప్ ద్వారా ముందుగా పేరు నమోదు చేయించుకోవచ్చు. లేదా నేరుగా కోవిడ్–19 వ్యాక్సినేషన్ కేంద్రా(సీవీసీ)లకు వెళ్లి పేరు రిజిస్టర్ చేయించుకుని టీకా వేయించుకోవచ్చునని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కో–విన్ యాప్‌తోపాటు ఆరోగ్య సేతు వంటి ఐటీ అప్లికేషన్ల ద్వారా పేర్లను ముందుగా నమోదు చేసుకోవచ్చు. టీకా సెషన్ ప్రాంతంలోకి లబ్ధిదారులు నేరుగా వెళ్లి రిజిస్టర్ చేయించుకోవచ్చు. కో–విన్ యాప్ 2.0 కొత్త వెర్షన్ నేడో రేపో విడుదల కానుంది. దీన్లో టీకా సెషన్ ప్రాంతం, సమయాన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. లబ్ధిదారులు కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాల్లో ఏది కావాలో ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండదు. లబ్ధిదారులు తమ సొంత రాష్ట్రం కాకుండా వేరే ప్రాంతంలోనూ టీకా వేయించుకునేందుకు వీలుంది. 60 ఏళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డును, 45 ఏళ్లు పైబడి ఇతర వ్యాధులతో బాధపడే వారు మెడికల్ సర్టిఫికెట్లను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 45 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వ్యాధుల బాధితులకు సంబంధించి 20 రకాల ఆరోగ్య పరిస్థితులను కేంద్రం గుర్తించింది. ఇందులో గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితరాలున్నాయి. డౌన్లోడ్ ఎలా? కో–విన్ యాప్ 2.0 వెర్షన్‌ను సోమవారం నుంచి గూగుల్ ప్లే స్టోర్ నుంచి గానీ యాపిల్ ప్లే స్టోర్ నుంచి గానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో యూజర్ అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, బెనిఫిషియరీ మాడ్యూల్, బెనిఫిషియరీ ఎక్నాలెడ్జ్మెంట్, స్టేటస్ అప్డేట్ అనే మాడ్యూళ్లున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితాలో లేని వారు పేరు నమోదుకు రిజిస్ట్రేషన్ మాడ్యూల్‌లోని సెల్ఫ్ రిజిస్ట్రేషన్‌లో ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి దాదాపు పది ధ్రువీకరణల్లో ఏదేని ఒకటి అప్లోడ్ చేయాలి. మొబైల్ ఫోన్ నంబర్ రిజిస్టర్ చేశాక లబ్ధిదారులకు ఓటీపీ అందుతుంది. దీనిద్వారా అకౌంట్ క్రియేట్ అవుతుంది. టీకా తీసుకున్న తర్వాత ఎక్నాలెడ్జ్మెంట్ అందుతుంది. -
టీకా కోసం.. ‘కోవిన్’లో రిజిస్ట్రేషన్ ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి 50 ఏళ్లు పైబడిన, ఆ లోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కరోనా టీకా వేసేందుకు పేర్ల నమోదుపై గందరగోళం నెలకొంది. వారి పేర్లను కోవిన్ యాప్‌లో నమోదు చేసే ప్రక్రియ ఇప్పటికీ మొదలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కోవిన్ యాప్‌లో పేర్లు నమోదు చేసుకున్నాకే టీకా వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకా వేస్తున్నారు. త్వరలో రెండో డోసు మొదలుకానుంది. ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే 50 ఏళ్లు పైబడిన, 50 ఏళ్ల లోపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్ వేయనున్నారు. లబ్ధిదారుల గుర్తింపు సవాల్... రాష్ట్రంలో దాదాపు 80 లక్షల మందికి మొదటి విడత టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందులో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది దాదాపు 3 లక్షల మందిని గుర్తించారు. ఇక పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ఇతర ఫ్రంట్‌లైన్ కార్మికులు దాదాపు 2 లక్షల మంది ఉంటారు. వారికి వ్యాక్సినేషన్ జరుగుతోంది. వారు కాకుండా మిగిలిన వారంతా 50 ఏళ్లు పైబడిన వారు, ఆలోపు వయసుగల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు. అంటే 75 లక్షల మందికి వచ్చే నెల నుంచి టీకా వేయాల్సి ఉంది. కానీ వారి జాబితా తయారీపై ఇప్పటివరకు ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించలేదు. కోవిన్ యాప్‌లో పేర్లు ఎలా నమోదు చేయాలో మార్గదర్శకాలను కేంద్రం పంపించలేదు. వారిని గుర్తించడం అత్యంత సంక్లిష్టమైన వ్యవహారమని వైద్య, ఆరోగ్య వర్గాలు అంటున్నాయి. ఈ సమస్యలను అధిగమించి జాబితా ఎలా తయారు చేయాలో కూడా అధికారులకు స్పష్టత లేదు. సులభతరం అన్నప్పటికీ... వ్యాక్సిన్ లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కేంద్రం సులభతరం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గతంలో పేర్కొన్నారు. కోవిన్ యాప్‌లో పేర్లను ఎవరికి వారు రిజిస్ట్రేషన్న్ చేసుకోవాలని మొదట్లో సూచించారు. అలాగే పీహెచ్‌సీలు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీ–సేవ కేంద్రాల్లో లబ్ధిదారులు పేర్లను నమోదు చేసుకోవచ్చన్నారు. అందుకోసం పీహెచ్‌సీల్లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఆ ప్రక్రియను ఇంకా ప్రారంభించలేదు. 50 ఏళ్లు పైబడిన వారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని, ఆ పత్రం లేనివారు ఓటర్ గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ వంటివి తెస్తే యాప్‌లో అప్లోడ్ చేసి వారి పేర్లను నమోదు చేస్తామని అధికారులు చెబుతున్నారు. -
ఏ టీకా అనేది మన ఇష్టం కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్ యాప్‌లో ఇప్పటికే కోటి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుందని వెల్లడించింది. అంటే ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 16.5 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉచితం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.5 అవుతుంది. 55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కరోనా టీకాల చేరవేత ఊపందుకుంది. విమానాల్లో తొలుత ప్రధాన నగరాలకు, అక్కడి నుంచి ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు జాగ్రత్తగా, వేగంగా చేరవేస్తున్నారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారు. -
కో-విన్ నకిలీ యాప్‌ల హల్చల్, కేంద్రం హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారికి అంతానికి గాను అతి త్వరలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ అందుబాటులోకి రానున్న సమయంలో కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన చేసింది. ‘కో-విన్’ పేరుతో నకిలీ, అక్రమ యాప్‌లు యాప్‌లో స్టోర్‌లో ఉన్నాయని అప్రమత్తంగా ఉండాలని బుధవారం సూచించింది. సదరు యాప్‌ల మాయలోపడి వ్యక్తిగత డేటాను, ఇతర సమాచారాన్ని పంచుకోవద్దని తెలిపింది. అలాంటి యాప్‌లను డౌన్లోడ్ చేయవద్దని తీవ్రంగా హెచ్చరించింది. (వ్యాక్సిన్ వచ్చేసింది : రిజిస్ట్రేషన్ ఎలా?) వ్యాక్సిన్ పొందేందుకు కేంద్రం ప్రభుత్వం కోవిన్ పేరుతో సరికొత్త యాప్‌ను తీసుకురానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారిక ప్లాట్‌ఫారమ్‌కు సరిపోలిన నకిలీ యాప్‌లతో అక్రమార్కులు అప్పుడే తమ పని మొదలు పెట్టేశారన్న మాట. కోవిన్ పేరుతో ప్లే స్టోర్‌లో ఇప్పటికే 3 యాప్స్ ఉన్నాయి. వీటిని ఇప్పటికే 10వేల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ కో-విన్ యాప్ ను అధికారికంగా ఆవిష్కరించినపుడు, విస్తృత సమాచారాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. కాగా సీరం రూపొందిస్తున్న కోవీషీల్డ్, భారత్‌బయోటెక్ ఉత్పత్తి చేస్తున కోవాగ్జిన్ వ్యాక్సీన్ల దేశంలో అత్యవసర వినియోగానికి గాను ప్రభుత్వం ఆదివారం ఆమోదం తెలిపింది. అయితే తొలి దశలో ఫ్రంట్‌లైన్ కార్మికులకు వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కోసం డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోవిన్‌ను ప్రవేశపెట్టింది. అలాగే ఈ టీకా ప్రక్రియ కోసం ఫ్రంట్‌లైన్ సిబ్బంది నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే సామాన్య ప్రజానీకానికి ఈ యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదు. Some apps named "#CoWIN" apparently created by unscrupulous elements to sound similar to upcoming official platform of Government, are on Appstores. DO NOT download or share personal information on these. #MoHFW Official platform will be adequately publicised on its launch. — Ministry of Health (@MoHFW_INDIA) January 6, 2021