Opposition Leaders Allege Leak Of Personal Info From Cowin, Details Inside - Sakshi
Sakshi News home page

టీకా వేయించుకున్నారా? డాటా లీక్

Published Mon, Jun 12 2023 3:01 PM | Last Updated on Mon, Jun 12 2023 4:40 PM

Opposition Leaders Allege Leak Of Personal Info From Cowin - Sakshi

కొవిన్ యాప్‌లో పౌరుల వ్యక్తిగత సమాచారం లీక్ ‍అయిందని టీఎంసీ నేత సాకేత్ గోఖలే ఆరోపించారు. ఇది మోదీ ప్రభుత్వం అతి పెద్ద గోప్యతా ఉల్లంఘన అని అన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నవారి వ్యక్తిగత వివరాలు బహిరంగంగా లభ్యమవుతున్నాయని ఆరోపించారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే, కాంగ్రెస్ నేత చిదంబరం సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. టీకా పొందినవారి వ్యక్తిగత వివరాలు ఇక టెలిగ్రామ్‌లో లభ్యమయ్యేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

బాధ్యులెవరు?
'కొవిడ్ టీకా తీసుకున్నప్పుడు ఆధార్, ఫోన్ నెంబర్లు,పాస్‌పోర్టు వివరాలు,ఓటర్ ఐడీతో సహా కుటుంబ వివరాలు అన్ని నమోదు చేశారు. దేశంలో ప్రముఖ వ్యక్తుల వివరాలు కూడా అందులో ఉన్నాయి. కొవిన్ డేటా వివరాలు ఎలా బయటకు వచ్చాయి? ఎవరు ఇందులో పాలుపంచుకున్నారు? ప్రజల ముందు ఈ విషయాన్ని ఎందుకు దాస్తున్నారు?' అని సాకేత్ గోఖలే కేంద్రాన్ని ప్రశ్నించారు. 

ఈ వ్యవహారంపై స్పందించిన సుప్రియా సూలే.. 'ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఎట్టిపరిస్థితుల్లో క్షమార్హం కాని నేరం' అని ఆమె అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు.

అదేం లేదు..
కొవిన్ యాప్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు లేవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టీకా తీసుకునే సమయంలో కేవలం వ్యాక్సిన్ తీసుకునే తేదీని మాత్రమే సేకరించినట్లు తెలిపారు. ప్రతిపక్ష ఆరోపణలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దర్యాప్తు చేస్తోందని వెల్లడించారు. 

ఇదీ చదవండి:వీడియోలెందుకు తీస్తున్నావ్‌.. భారత్‌లో విదేశీయుడికి చేదు అనుభవం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement