3.1 కోట్ల కస్టమర్ల డేటాను విక్రయించిన ఉద్యోగి
సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ ఆరోపణ
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 3.1 కోట్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన పాలైనట్టు యూకే కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ ఆరోపించారు. కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి 3.1 కోట్ల కస్టమర్లకు సంబంధించి మొబైల్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను విక్రయించినట్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడో పక్షం నుంచి మోసపూరిత చర్యలకు (ఉల్లంఘైన డేటా ఆధారంగా) అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు స్టార్ హెల్త్ సంస్థ ఈ మెయిల్ ద్వారా హెచ్చరించడం ఉల్లంఘన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
యూకేకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ షెంజెన్ అనే హ్యాకర్ స్టార్ హెల్త్ నుంచి పొందిన డేటాను వెబ్‌సైట్‌లో పెట్టినట్టు ప్రకటించారు. ‘‘స్టార్ హెల్త్ ఇండియా కస్టమర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి సున్నితమైన డేటాను లీక్ చేస్తున్నాను. ఈ డేటాను నాకు నేరుగా విక్రయించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీదే ఇందుకు బాధ్యత’’అంటూ షెంజెన్ పోస్ట్‌ను పార్కర్ ప్రస్తావించారు. టెలీగ్రామ్ బోట్‌లను సృష్టించడం ద్వారా 2024 జూలై నాటికి 3,12,16,953 మంది కస్టమర్ల డేటాను, 57,58,425 క్లెయిమ్‌ల డేటాను హ్యాకర్ పొందినట్టు చెప్పారు. డేటా లీకేజీకి గాను 1,50,000 డాలర్ల డీల్ కుదిరినట్టు కూడా పార్కర్ తెలిపారు.
అప్రమత్తత..
స్టార్ హెల్త్ ఉద్యోగులమని చెబుతూ ప్రస్తుత పాలసీని నిలిపివేయండనే చర్యలకు థర్డ్ పారీ్టలు పాల్పడొచ్చంటూ స్టార్ హెల్త్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ తరహా మోసపూరిత చర్యలు వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించడంతోపాటు, దీర్ఘకాలంలో పాలసీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. క్లెయిమ్‌ల డేటాను అనధికారికంగా పొందినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు మెయిల్స్ కూడా వచి్చనట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు కంపెనీ సమాచారం ఇచి్చంది. ఐఆర్‌డీఏఐ నిబంధనలకు అనుగుణంగా తగిన సైబర్ భద్రతా వ్యవస్థలు, నియంత్రణలను అమలు చేస్తున్నామని, దీనిపై మళ్లీ తాజా సమాచారం విడుదల చేస్తామని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment