senior employees
-
స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్
న్యూఢిల్లీ: స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 3.1 కోట్ల కస్టమర్ల వ్యక్తిగత డేటా ఉల్లంఘన పాలైనట్టు యూకే కేంద్రంగా పనిచేసే సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ ఆరోపించారు. కంపెనీకి చెందిన ఓ సీనియర్ ఉద్యోగి 3.1 కోట్ల కస్టమర్లకు సంబంధించి మొబైల్ నంబర్లు, చిరునామా తదితర వివరాలను విక్రయించినట్టు సంచలన విషయాన్ని బయటపెట్టారు. మూడో పక్షం నుంచి మోసపూరిత చర్యలకు (ఉల్లంఘైన డేటా ఆధారంగా) అవకాశం ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలంటూ కస్టమర్లకు స్టార్ హెల్త్ సంస్థ ఈ మెయిల్ ద్వారా హెచ్చరించడం ఉల్లంఘన ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. యూకేకు చెందిన సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు జేసన్ పార్కర్ షెంజెన్ అనే హ్యాకర్ స్టార్ హెల్త్ నుంచి పొందిన డేటాను వెబ్సైట్లో పెట్టినట్టు ప్రకటించారు. ‘‘స్టార్ హెల్త్ ఇండియా కస్టమర్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లకు సంబంధించి సున్నితమైన డేటాను లీక్ చేస్తున్నాను. ఈ డేటాను నాకు నేరుగా విక్రయించిన స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీదే ఇందుకు బాధ్యత’’అంటూ షెంజెన్ పోస్ట్‌ను పార్కర్ ప్రస్తావించారు. టెలీగ్రామ్ బోట్లను సృష్టించడం ద్వారా 2024 జూలై నాటికి 3,12,16,953 మంది కస్టమర్ల డేటాను, 57,58,425 క్లెయిమ్‌ల డేటాను హ్యాకర్ పొందినట్టు చెప్పారు. డేటా లీకేజీకి గాను 1,50,000 డాలర్ల డీల్ కుదిరినట్టు కూడా పార్కర్ తెలిపారు. అప్రమత్తత.. స్టార్ హెల్త్ ఉద్యోగులమని చెబుతూ ప్రస్తుత పాలసీని నిలిపివేయండనే చర్యలకు థర్డ్ పారీ్టలు పాల్పడొచ్చంటూ స్టార్ హెల్త్ తన కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఈ తరహా మోసపూరిత చర్యలు వ్యక్తిగత సమాచారానికి ముప్పు కలిగించడంతోపాటు, దీర్ఘకాలంలో పాలసీ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తాయని హెచ్చరించింది. క్లెయిమ్‌ల డేటాను అనధికారికంగా పొందినట్టు గుర్తు తెలియని వ్యక్తి నుంచి తమకు మెయిల్స్ కూడా వచి్చనట్టు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు కంపెనీ సమాచారం ఇచి్చంది. ఐఆర్డీఏఐ నిబంధనలకు అనుగుణంగా తగిన సైబర్ భద్రతా వ్యవస్థలు, నియంత్రణలను అమలు చేస్తున్నామని, దీనిపై మళ్లీ తాజా సమాచారం విడుదల చేస్తామని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రకటించింది. -
ఉద్యోగికి యాపిల్ అపూర్వ బహుమతి! స్వయంగా టిమ్‌కుక్...
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ యాపిల్ తమ ఉద్యోగికి అపూర్వ బహుమతి అందించింది. సంస్థలో పదేళ్లు పూర్తి చేసుకున్న ఓ ఉద్యోగి ప్రత్యేకమైన బహుమతి అందుకున్నారు. ఓ వైపు ఆర్థిక మందగమనం కారణంగా అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో ఓ ఉద్యోగి సేవలను గుర్తించి యాపిల్ బహుమతి పంపించడంపై అభినందనలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగికి వచ్చిన బహుమతిని డాంగిల్బుక్ప్రో అనే యూట్యూబర్ అన్‌బాక్స్ చేశాడు. అందులో ఏమేమి వచ్చాయో చూపించాడు. సాధారణంగా యాపిల్ సంస్థ తమ ఉద్యోగులకు క్రిస్టల్‌తో తయారు చేసిన అవార్డులు పంపిస్తుంది. కానీ ఈ ఉద్యోగికి అల్యూమినియంతో తయారు చేసిన భారీ పెట్టె లాంటి బహుమతిని పింపించింది. దీనిపై ప్రకాశమంతమైన యాపిల్ లోగో ఉంది. దీంతో పాలిషింగ్ వస్త్రం కూడా ఉంది. ముఖ్యంగా కంపెనీ సీఈవో టిమ్‌కుక్ స్వయంగా సంతకం చేసిన నోట్ సైతం పంపించడం గమనార్హం. ఉద్యోగి పదేళ్ల సర్వీస్‌ను సూచిస్తూ బహుమతిపై 10 సంఖ్యను జోడించడం ప్రత్యేకతగా నిలిచింది. పెద్దగా ఉద్యోగులను తొలగించని అతికొద్ది కంపెనీల్లో యాపిల్ ఒకటి. గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్దపెద్ద సంస్థలు లేఆఫ్స్ పేరుతో వేలాదిగా ఉద్యోగులను తొలగించడం తెలిసిందే. ఇదే కాక ఆయా సంస్థల్లో ఏళ్లుగా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగులకు సైతం జీతాలు తగ్గించడం వంటి చర్యలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సేవలను గుర్తించి బహుమతులు పంపించిన యాపిల్ సంస్థను పలువురు అభినందిస్తున్నారు. (ఇదీ చదవండి: రూ.14 వేలకే ఐఫోన్14.. యాపిల్ బంపర్ ఆఫర్!) -
సుమారు 5 వేలమంది సీనియర్లకు షాకిచ్చిన ఈ కామర్స్ దిగ్గజం
సాక్షి,ముంబై: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్‌గా లేఫ్స్ ఆందోళనల మధ్య ఉద్యోగుల జీతాల పెంపుపై ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ కంపెనీలు తమ లాభదాయకతను పెంచుకోవడానికి ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ వార్షిక వేతనాల పెంపును కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది, అంటే ఈ ఏడాది దాదాపు 5వేల మంది సీనియర్ సిబ్బంది వేతనాల్లో ఎటువంటి పెంపుదల ఉండదు. కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే బేసిక్ జీతాల పెంపును పరిమితం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా సుమారు 5000 ఉద్యోగులకు ప్రభావితం కానున్నారని సమాచారం. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరి 22 మెయిల్లో గ్రేడ్ 10 అంతకంటే ఎక్కువ ఉన్నవారి వేతనాల్లో ఎలాంటి పెంపుదల ఉండదని పేర్కొంది. అయితే సంస్థ ఉద్యోగుల కోసం బోనస్ చెల్లింపులు ,ద్యోగుల స్టాక్ ఆప్షన్ కేటాయింపులు ప్లాన్ ప్రకారం ఉంటాయని స్పష్టం చేసింది. -
APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ)లో 55 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మూసివేసిన ‘స్టాఫ్ బినవొలెంట్ త్రిఫ్ట్ (ఎస్బీటీ) ఫండ్’ను తిరిగి కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో ఎస్బీటీ ఫండ్‌ను ఏళ్లపాటు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా/రిటైరైనా ఆ నిధి నుంచి రూ.1.50 లక్షల చొప్పున చెల్లించేవారు. కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎస్బీటీ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్’ (ఏపీజీఎల్ఐ) అమల్లోకి వచ్చింది. కాగా, ఏపీజీఎల్ఐ 55 ఏళ్లలోపు ఉద్యోగులకే వర్తిస్తుంది. దాంతో ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం గతంలో ఉన్న అమలు చేసిన ఎస్బీటీ ఫండ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం కొత్త ఎస్బీటీ ఫండ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఫండ్ 2021 డిసెంబర్ నాటికి 55 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వర్తిస్తుంది. ఆ ఉద్యోగుల నుంచి నెలకు రూ.100 చొప్పున కంట్రిబ్యూషన్ వసూలు చేస్తారు. ఈ మేరకు రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ -
కరోనాలోను సీనియర్లకు భారీ వేతనాలు: సర్వే
బెంగుళూరు: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. సీనియర్లు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని ఇటీవల కొన్ని సర్వేలు తెలిపాయి. కానీ, గత మూడు నెలలుగా కంపెనీలు సీనియర్ లెవల్ ఉద్యగులకు భారీగా వేతనాలు పెంచారని సిక్కి అనే సర్వే సంస్థ తెలిపింది. 72 శాతం కంపెనీలు 8నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్న ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం 28 శాతం మంది జూనియర్ ఉద్యోగులకే సంస్థలు ప్రాధాన్యమిస్తున్నాయి. మరోవైపు సిక్కి టాలెంట్ సంస్థ ముంబై, పుణే, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర నగరాలలో ఐటీ నిపుణులు, ప్రముఖ కంపెనీలను విశ్లేషించి సిక్కి సంస్థ ఈ సర్వేను వెల్లడించింది. అయితే సిక్కి సర్వేలో ఎనలిస్ట్, ఇంజనీర్, టెస్టర్, డెవలపర్ తదితర విభాగాలకు సంబంధించిన నిపుణులను సంప్రదించినట్లు తెలిపారు. అయితే కరోనా వైరస్ ప్రారంభంలో ప్రాజెక్టులు లేక కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు ఎక్కువ జీతాలు చెల్లించలేక ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. కానీ ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడాని కంపెనీలు సీనియర్ ఉద్యోగులకు భారీ వేతనాలు ఇస్తున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: హైదరాబాద్‌లో 6.6 లక్షల మందికి కరోనా.. వచ్చింది.. పోయింది! -
200మంది సీనియర్లపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారీ ఎత్తున సీనియర్లకు ఉద్వాసన చెప్పింది. నైపుణ్యకొరత, కొత్త టెక్నాలజీలకు అప్డేట్ కాని కారణంగా కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ డైరెక్టర్లు, ఆపైస్థాయి ఉద్యోగులను ఇంటికి పంపించింది. నూతన సాంకేతిక అవసరాల కనుగుణంగా కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా రెండువందలమంది సీనియర్ ఉద్యోగులను కాగ్నిజెంట్ తొలగించింది. వీరికి మూడునుంచి నాలుగు నెలల జీతాలు చెల్లించింది. ఆగస్టులో పూర్తయిన ఈ ప్రక్రియకోసం కంపెనీకి 35 మిలియన్ డాలర్లను వెచ్చించినట్టు సమాచారం. కంపెనీ లేదా దాని డైరెక్టర్లు, ఇతర అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదనే ఒప్పందంపై బాధిత ఉద్యోగులు సంతకం చేసినట్టు తెలుస్తోంది. -
సీనియర్లను ఇంటికి పంపేస్తున్న కాగ్నిజెంట్
అంతర్జాతీయ ప్రముఖ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ సీనియర్లను ఇంటికి పంపేస్తుంది. సీనియర్ స్థాయి ఉద్యోగాలపై వేటు వేయాలని చూస్తున్నట్టు కాగ్నిజెంట్ ప్రకటించింది. సీనియర్లపై వేటు వేయాలని చూస్తున్న ఈ కంపెనీ, ఆ స్థానాల్లో మరింత మంది జూనియర్లకు చోటు కల్పించనున్నట్టు కూడా తెలిపింది. గురువారం ప్రకటించిన కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో విశ్లేషకుల అంచనాలను కాగ్నిజెంట్ చేరుకోలేకపోయింది. ఈ ఫలితాల ప్రకటన నేపథ్యంలోనే కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి ఉద్యోగులపై వేటు వేస్తున్నట్టు తెలిసింది. న్యూజెర్సీ ప్రధాన కార్యాలయంగా ఉన్న కాగ్నిజెంట్‌లో ఈ రెండో క్వార్టర్లో అట్రిక్షన్ రేటు 22 శాతానికి పైగా ఉందని వెల్లడైంది. 2017లో 4000 వేల మంది ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపేసిందని, అంతేకాక 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు కూడా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్‌ను ఆఫర్ చేసినట్టు పేర్కొంది. సీనియర్లను కాగ్నిజెంట్ టార్గెట్ చేసిందని, ఇది కేవలం వాలంటరీ మాత్రమే కాదని, ఇది మరింత ఇన్వాలంటరీ(బలవంతం పంపించేయడం) అని కాగ్నిజెంట్ అధ్యక్షుడు రాజ్ మెహతా ఓ ఆంగ్ల ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ఈ సారి లేఆఫ్‌లో ఎంతమంది సీనియర్ స్థాయి ఉద్యోగులును టార్గెట్ చేశారో ఆయన బహిర్గతం చేయలేదు. ఇది గ్లోబల్ ప్రక్రియ అని, ప్రత్యేక ప్రాంతాన్ని, ప్రత్యేక దేశాన్ని తాము టార్గెట్ చేయలేదని మాత్రం చెప్పారు. కాగ, సీనియర్లపై వేటు వేస్తున్న ఈ కంపెనీ జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటుంది. మరింత మంది జూనియర్లకు తన కంపెనీలో చోటు కల్పిస్తోంది. జూనియర్ స్థాయి ఉద్యోగులను పెంచుకుంటున్న ఈ కంపెనీకి, ఈ క్వార్టర్లో హెడ్‌కౌంట్ కూడా పెరిగింది. రెండో క్వార్టర్లో 7500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తీసుకుని ఉద్యోగుల సంఖ్యను 2,68,900కు చేర్చుకుంది. మూడో క్వార్టర్లో జూనియర్ స్థాయి ఉద్యోగులకు ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టనున్నామని ఫలితాల ప్రకటన తర్వాత కాన్ఫరెన్స్‌లో కాగ్నిజెంట్ సీఎఫ్ఓ కరెన్ మెక్లాగ్లిన్ తెలిపారు. సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఈ ప్రమోషన్లు నాలుగో క్వార్టర్లో ఉంటాయన్నారు. ప్రమోషన్లను, వేతన పెంపును చేపట్టడానికి తమకు మంచి మార్జిన్లు నమోదవడం గుడ్‌న్యూస్ అని మెహతా చెప్పారు. ఈ రెండో క్వార్టర్లో కాగ్నిజెంట్ రెవెన్యూలు 4.01 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గతేడాది నుంచి ఇవి 9.2 శాతం పెంపు. -
రిక్రూటర్లకు వారే అతిపెద్ద సవాల్
ముంబై : కంపెనీల్లో ఉద్యోగులను నియమించుకోవాలంటే రిక్రూటర్లకు తల ప్రాణం తోకకు వస్తోంది. సీనియర్ స్థాయి ఉద్యోగుల నియమించుకునేటప్పుడైతే, ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంటుంది. రిక్రూటర్లకు ప్రస్తుతం సీనియర్ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడం అతిపెద్ద సవాల్‌గా నిలుస్తుందని, ఈ అభ్యర్థులు ప్రస్తుత వేతనానికి 20 నుంచి 40 శాతం పెంపు కోరుకుంటున్నారని ఓ అధ్యయనం వెల్లడించింది. మెజార్టీ సీనియర్ స్థాయి ఉద్యోగులు, తమ ప్రస్తుత వేతనానికి 20 శాతం నుంచి 40 శాతం పైగా పెంపు ఉంటేనే ఉద్యోగ మార్పును పరిగణలోకి తీసుకుంటున్నారని సీఐఈఎల్ నిర్వహించిన టాలెంట్ మార్కెట్‌పై ఏడాది సర్వే వెల్లడించింది. ఇది భవిష్యత్తులో ఉద్యోగవకాశాల విశ్వసనీయతపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. ప్రతిభావంతులను ఆకర్షించుకోవడం కూడా రిక్రూటర్లకు అతిపెద్ద సవాల్ అని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో, పలు రంగాల్లో వివిధ స్థాయిలోని 107 ఎగ్జిక్యూటివ్‌లపై ఈ సర్వే నిర్వహించింది. కేవలం సీనియర్ ఉద్యోగులను నియమించుకోవడమే కాక, రిక్రూటర్లకు ఎంప్లాయర్ బ్రాండింగ్ కూడా సవాల్‌గా నిలుస్తుందని సర్వే బహిర్గతం చేసింది. 35 శాతం మంది దీన్ని పరిగణలోకి తీసుకుంటున్నారన్నారు. ఎంట్రీ లెవల్, మధ్య స్థాయి వారికి కొత్త ఉద్యోగవకాశాలు చూడటం, వేతనాలు, ప్రయోజనాలు వంటివి అత్యంత ముఖ్యమైన కారకాలు కాగ, సీనియర్ స్థాయి వారికి వేతనం, ఇతరాత్ర ప్రయోజనాలు రెండో అతిపెద్ద కారకాలని సర్వే పేర్కొంది. కొత్త ఉద్యోగాలు వెతుకోవడానికి మరో ముఖ్యమైన అంశం మేనేజర్లతో సంబంధాలని కూడా తెలిపింది. కెరీర్లో వెదకడం కోసం కూడా ఉద్యోగం మారుతున్నట్టు చెప్పింది. -
సీనియర్ స్థాయి ఉద్యోగా? బ్యాడ్‌న్యూసే..!
న్యూఢిల్లీ : దేశీయ ఐటీ ప్రొఫెషినషల్స్‌కు గడ్డు కాలం మరింత పెరుగుతోంది. వచ్చే ఆరు నెలలు కూడా ఐటీ ప్రొఫిషనల్స్‌కు ఉద్యోగవకాశాలు తగ్గిపోనున్నాయని తాజా రిపోర్టులు వెల్లడించాయి. ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావంతో సంప్రదాయ ఉద్యోగాలకు భారీ మొత్తంలో ఆటంకం కలుగనున్నట్టు తెలిపాయి. ఎక్స్పెరిస్ ఐటి - మ్యాన్ పవర్ గ్రూప్ ఇండియా మంగళవారం విడుదల చేసిన ఎక్స్పెరిస్ ఐటీ ఎంప్లాయ్మెంట్ అవుట్‌లుక్ సర్వే ప్రకారం 2017 అక్టోబర్ నుంచి 2018 మార్చి మధ్యలో కూడా ఐటీ నియామకాలు తగ్గిపోనున్నాయని తెలిసింది. అంతేకాక సీనియర్ స్థాయిలో లేఆఫ్స్ అధికంగా ఉండనున్నాయని సర్వే వెల్లడించింది. ఇటీవల అంతర్జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 400 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వాలంటరీ సెపరేషన్ ప్యాకేజీని అంగీకరించిందని తెలిపింది. గత కొన్ని నెలల క్రితమే డైరెక్టర్లకు, అసోసియేట్ వీపీలకు, సీనియర్ వీపీలకు ఈ ప్రొగ్రామ్‌ను ఆఫర్ చేసింది. క్యాప్‌జెమిని కూడా 35 మంది వీపీ, ఎస్వీపీలు, డైరెక్టర్లు, సీనియర్ డైరెక్టర్లను కంపెనీని వీడాలని ఆదేశించింది. ఇన్ఫోసిస్ కూడా జాబ్ లెవల్ 6, ఆపై స్థాయి ఉద్యోగులు(గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్ ఆర్కిటెక్ట్స్, హైయల్ లెవల్స్) వెయ్యి మందిని కంపెనీని వీడాలని ఆదేశాలు జారీచేసినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. 10 నుంచి 20 ఏళ్ల అనుభవమున్న మధ్య, సీనియర్ లెవల్ స్థాయి ప్రొఫెషనల్స్‌పై ఈ ప్రభావం అధికంగా ఉంటుందని, పెద్దపెద్ద ఐటీ కంపెనీలు వీరిని ఇంటికి సాగనంపడానికి లేఆఫ్స్ ప్రక్రియను చేపడుతున్నాయిని సర్వే తెలిపింది.. కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే సీనియర్ స్థాయి ఉద్యోగులను నియమించుకోవడానికి మొగ్గుచూపుతున్నాయని వివరించింది. 0-5 ఏళ్ల అనుభవమున్న అభ్యర్థులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడిందని చెప్పింది. సీనియర్ స్థాయిల్లో ఉద్యోగుల లేఆఫ్స్‌కు ప్రధాన కారణం బయట వ్యక్తులను నియమించుకోవడం కంటే అంతర్గతంగానే ఖాళీలను పూరించుకోవడమైతే, మరో కారణం ఆటోమేషన్ అని తెలిసింది.. -
టెక్ మహింద్రా ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
బెంగళూరు : పెరుగుతున్న వీసా వ్యయాలు, క్లయింట్ల నుంచి వస్తున్న సర్వీసు ధరల తగ్గింపు డిమాండ్లు టెక్ కంపెనీల ఉద్యోగులకు గండికొడుతోంది. వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలను అడియాసలు చేస్తూ టెక్ మహింద్రా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరేళ్ల కంటే ఎక్కువ అనుభవమున్న ఉద్యోగుల అప్రైజల్ సైకిల్‌ను నిలిపివేస్తున్నట్టు కంపెనీ పేర్కొంది. కంపెనీ మేనేజ్మెంట్ సమీక్ష సందర్భంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎల్ రవిచంద్రన్ నేతృత్వంలో మరో ముగ్గురు టెక్ ఉద్యోగులు పాల్గొన్న వెబీనార్‌లో ఈ విషయాన్ని తెలిపారు. టీమ్ లీడర్లు, ఆపై స్థాయి వారు దీనికి ప్రభావితవంతులవుతారని వారు పేర్కొన్నారు. వేతన పెంపును ఆశిస్తున్న వారు కనీసం మరో రెండు త్రైమాసికాలైనా వేచిచూడాలని పేర్కొన్నారు. దీన్ని ధృవీకరించిన టెక్ మహిద్రా, అప్రైజల్స్‌ను నిరవధికంగా వాయిదా వేయడం లేదని తెలిపింది. మేనేజ్మెంట్ సమీక్ష అనంతరం పెంపు గురించి ప్రభావిత ఉద్యోగులకు తాము తెలిపామని చెప్పింది. మూడో క్వార్టర్లో తమ ప్రదర్శనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోలేదని, మేనేజ్మెంట్ సమీక్షలో భాగంగా ఇది చర్చకు వచ్చినట్టు టెక్ మహింద్రా అధికార ప్రతినిధి తెలిపారు. టెక్ మహింద్రకు మూడో క్వార్టర్లో రెవెన్యూ 4 శాతం మేర పెరిగింది. ఇతర ఉద్యోగుల పరిహారాలను మార్చిలో జరుగబోయే సమీక్షలో నిర్ణయిస్తామని, కానీ జూలై నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయన్నారు. టెక్ కంపెనీలకు ఆందోళనకరంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, క్లయింట్ల నుంచి వస్తున్న ధరల తగ్గింపు డిమాండ్లు ఉద్యోగుల వేతనాలకు గండికొడుతున్నట్టు తెలుస్తోంది. అనుభవమున్న వారికి ఎక్కువ వేతనాలు ఇవ్వడం కంటే, కొత్తగా వస్తున్న ప్రతిభావంతులైన వారికి వెచ్చించాలని కంపెనీ యోచిస్తున్నట్టు సమాచారం.