![Nearly 5000 of Flipkart senior staff wont get any pay hike this year - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/23/Flipkart.jpg.webp?itok=y8CkmSpv)
సాక్షి,ముంబై: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. గ్లోబల్‌గా లేఫ్స్ ఆందోళనల మధ్య ఉద్యోగుల జీతాల పెంపుపై ఫ్లిప్‌కార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. టెక్ కంపెనీలు తమ లాభదాయకతను పెంచుకోవడానికి ఖర్చులను తగ్గించుకుంటున్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ వార్షిక వేతనాల పెంపును కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది, అంటే ఈ ఏడాది దాదాపు 5వేల మంది సీనియర్ సిబ్బంది వేతనాల్లో ఎటువంటి పెంపుదల ఉండదు.
కేవలం 70 శాతం మంది ఉద్యోగులకు మాత్రమే బేసిక్ జీతాల పెంపును పరిమితం చేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితంగా సుమారు 5000 ఉద్యోగులకు ప్రభావితం కానున్నారని సమాచారం. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఫిబ్రవరి 22 మెయిల్‌లో గ్రేడ్ 10 అంతకంటే ఎక్కువ ఉన్నవారి వేతనాల్లో ఎలాంటి పెంపుదల ఉండదని పేర్కొంది. అయితే సంస్థ ఉద్యోగుల కోసం బోనస్ చెల్లింపులు ,ద్యోగుల స్టాక్ ఆప్షన్ కేటాయింపులు ప్లాన్ ప్రకారం ఉంటాయని స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment