సాక్షి, ముంబై: కరోనా పై పోరులో ముందుండి పోరాడుతున్న వారు, రైతులు, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రపంచ రీటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ ఫౌండేషన్ , ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చాయి. ఆరోగ్య సంరక్షణ కార్మికులకు కీలకమైన వ్యక్తిగత రక్షణ పరికరాలను (పీపీఈ), రైతులకు, చిన్నవ్యాపారాలకు అవసరమైన సహాయ సామగ్రిని, నిధులను అందించే సంస్థలకు నిధులు అందివ్వనున్నామని శనివారం ప్రకటించాయి. భారతదేశంల కోవిడ్-19 పోరాటానికి తమ మద్దతు అందిస్తామని, ఇందుకు 38.3 కోట్ల విరాళాలను అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి అదనంగా సుమారు 8 కోట్ల రూపాయలను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ప్రకటించింది. (వాల్‌మార్ట్‌లో 50 వేల ఉద్యోగాలు )
ప్రభుత్వేతర సంస్థలు (ఎన్ జీఓలు) పబ్లిక్ హెల్త్ కేర్ కార్మికులకు పంపిణీ చేయడానికి ఎన్ 95 మాస్క్ లు, మెడికల్ గౌన్లు లాంటి పీపీఈలను అందించడంపై దృష్టి సారించినట్టు ఇరు సంస్థలు సంయుక్తంగా ప్రకటించాయి ఇప్పటికే 3లక్షల మాస్క్ లు, పది లక్షలమెడికల్ గౌన్లను అందించిన సంస్థ బలహీన వర్గాలకు మద్దతు ఇస్తున్న గూంజ్, శ్రీజన్ అనే స్వచ్ఛంద సంస్థకు తాజా 7.7 కోట్లను అదనంగా ఇస్తోంది. ఈ నిధులను రైతులు, గ్రామీణ సూక్ష్మ వ్యాపారాలకు అవసరమైన నిధుల సహాయంతో పాటు ఆహారం మందులు, పరిశుభ్రతకు అవసరమైన వస్తువుల పంపిణీకి ఉపయోగించనున్నారు.భారతదేశంలోని కస్టమర్లు, భాగస్వాములు కరోనాకు తీవ్రంగా ప్రభావితం మయ్యారని, ఈ సమయంలోవారికి తమ మద్దతు వుంటుందని వాల్మార్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు కాథ్లీన్ మెక్ లాఫ్లిన్ పేర్కొన్నారు. ఇలాంటి సమయాల్లో ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థల కృషికి మద్దతు ఇవ్వడానికి మనమందరం కలిసి రావాలన్నారు. కరోనా సంక్షోభంలో బాధితులను ఆదుకునేందుకు తమ బృందం 24 గంటలు కృషి చేస్తోందని, ఈ విషయంలో తమ నిబద్ధతలో భాగంగానే అత్యవసర సహాయక చర్యలపై భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పనిచేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.
చదవండి : క్యూ4లో అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ
Comments
Please login to add a commentAdd a comment