లాక్‌డౌన్ వల్ల ఎంతోమంది జీవితాలు రోడ్డున పడ్డాయి. బయటకు రంగులమయంగా కనిపించే ఇండస్ట్రీ మీద కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. షూటింగ్‌లు జరిగేతే కానీ పట్టెడన్నం దొరకని చిన్నాచితకా సినీకార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటివారిని ఆదుకునేందుకు రంగం సిద్ధం చేశాడు కన్నడ స్టార్ యశ్. కన్నడ చిత్రపరిశ్రమలోని సినీకార్మికుల కోసం నేనున్నానంటూ ముందుకు వచ్చాడు. మూడు వేల మంది కార్మికులకు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు 1.5 కోట్లు విరాళంగా ఇస్తూ మంచి మనసు చాటుకున్నాడు.
"కరోనా వైపరీత్యం వల్ల కన్నడ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. చిత్రరంగంలోని 21 విభాగాలకు చెందిన మూడు వేలమందికి తలా 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది నేను ఆర్జించిన సంపాదనలో నుంచి ఇస్తున్నాను. ఈ చిన్నపాటి ఆర్థిక సాయం వారికి శాశ్వత పరిష్కారం చూపించకపోవచ్చు. కానీ మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్మకంతో ఉందాం" అంటూ ఓ ప్రకటన విడుదల చేశాడు. యశ్ తీసుకున్న నిర్ణయాన్ని అభిమానులు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నావ్ అంటూ కీర్తిస్తున్నారు.
#togetherwestand #humanity pic.twitter.com/46FYT9pThz
— Yash (@TheNameIsYash) June 1, 2021
చదవండి: KGF Chapter 2 : అరుదైన రికార్డు సాధించిన ‘రాఖీ భాయ్’
Comments
Please login to add a commentAdd a comment