
ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రదీప్ రాజ్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కోవిడ్‌తో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత పదిహేనేళ్లుగా ఆయన మధుమేహంతో కూడా బాధపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య, ఇద్దరు పిల్లులున్నారు.
ప్రదీప్ రాజ్ మరణ వార్త తెలిసి సినీ ప్రముఖులు సహా పలువురు నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా కన్నడ సూపర్‌స్టార్ యశ్‌తో కలిసి ఆయన 'కిచ్చ', 'కిరాతక' వంటి సినిమాలను రూపొందించారు. అంతేకాకుండా ఈ ఏడాది కిరాతక-2 చిత్రానికి సంబంధించిన సన్నాహకాలు కూడా మొదలుపెట్టారు. ఇంతలోనే కోవిడ్ బారిన పడి ఆయన మరణించడం కన్నడ సినీ వర్గాల్లో విషాదాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment