sandalwood
-
జాలిరెడ్డి పెళ్లిలో అరుదైన సన్నివేశం.. గడ్డం పట్టుకుని మరి..!
పుష్ప సినిమాలో జాలిరెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు డాలీ ధనంజయ (Daali Dhananjaya). ఇటీవలే ఆయన వివాహబంధంలో అడుగుపెట్టారు. తన ప్రియురాలు డాక్టర్ ధన్యతను పెళ్లాడారు. మైసూరులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేదికపై మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. వీరి పెళ్లికి శాండల్‌వుడ్ సినీతారలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ సైతం జాలిరెడ్డి పెళ్లికి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ భారీ వెడ్డింగ్ వేడుకకు దాదాపు 30 వేల మందికి పైగానే హాజరయ్యారు.అయితే తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఈ పెళ్లి వేడుకలో డాలీ ధనుంజయకు తన భార్య కాళ్లు మొక్కుతూ కనిపించింది. ఇందులో డాలీ ధనుంజయ వద్దని చెబుతున్నప్పటికీ వినకుండా గడ్డం పట్టుకుని మరీ భర్త పాదాలను నమస్కరించింది. ఆ తర్వాత వెంటనే తను కూడా భార్య పాదాలకు మొక్కారు. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ వీడియోను షేర్ చేయడంతో ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.(ఇది చదవండి: పెళ్లి తర్వాత క్షమాపణలు చెప్పిన జాలిరెడ్డి దంపతులు) కాగా.. కన్నడలో హీరో కమ్ విలన్‌గా చాలా సినిమాల్లో ధనంజయ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. అక్కడి ఫ్యాన్స్ ఇతడిని ముద్దుగా డాలీ అని పిలుస్తారు. ఇతడి యాక్టింగ్ నచ్చి డైరెక్టర్ సుకుమార్ తన 'పుష్ప'లో జాలీరెడ్డి రోల్ ఇచ్చారు. తనదైన స్లాంగ్‌తో ఫెర్ఫెక్ట్ విలనిజం చూపించాడు. డిసెంబర్లో రిలీజైన పుష్ప-2 ది రూల్ సీక్వెల్లోనూ ఆయన కనిపించారు. అయితే, పుష్ప పార్ట్-1లో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాగా.. డాలీ ధనుంజయ్ ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు. ఇక డాలీ ధనుంజయ్ సతీమణి ధన్యతా విషయానికొస్తే.. చిత్రదుర్గ ప్రాంతానికి చెందిన ఈమె డాక్టర్. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. స్నేహంతో మొదలైన వీరి పరిచయం..ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లితో ఒక్కటి అయ్యారు.Men in love 🤌🏻✨!!!#DaaliDhananjay #DaaliDhanyata #DaaliDhanyata #kfi pic.twitter.com/KXc7gqwTIa— MASS (@Thalassophilee6) February 16, 2025 -
ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?
మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా (Chhaava Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకుంటున్నారు. ఇది కదా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర.. భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఘనత అంటూ ఉప్పొంగిపోతున్నారు. నేడు (ఫిబ్రవరి 19) శివాజీ మహారాజ్ 395వ జయంతి.శివాజీ బయోపిక్ఈ సందర్భంగా శివాజీ జీవిత కథపై తీస్తున్న బయోపిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'కాంతార'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో భవానీ దేవి ముందు శివాజీ కత్తితో నిలబడి ఉన్నాడు. పోస్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. 2027లో రిలీజ్సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. రవి వర్మ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా రేసుల్ సంగీతం అందించనున్నాడు. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ పేరు మార్మోగిపోతోంది. తన కెరీర్లోనే ఇదొక మాస్టర్‌పీస్‌గా మిగిలిపోనుంది. రిషబ్‌కు కూడా శివాజీ అతడి జీవితంలోనే బెస్ట్ సినిమాగా నిలవనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by SANDEEP SINGH (@officialsandipssingh) చదవండి: సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి -
జీవితంలో పెళ్లే చేసుకోనన్న జాలిరెడ్డి.. ఇప్పుడేకంగా లవ్ మ్యారేజ్
బ్లాక్‌బస్టర్ పుష్ప మూవీలో జాలిరెడ్డిగా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ నటుడు ధనంజయ (Daali Dhananjaya) మరికొద్ది గంటల్లో పెళ్లిపీటలెక్కనున్నాడు. ప్రియురాలు డాక్టర్ ధన్యతతో కలిసి ఏడడుగులు వేయనున్నాడు. ఇప్పటికే పెళ్లి పనులు జోరందుకున్నాయి. ఇటీవల హల్దీ సెలబ్రేషన్స్ జరగ్గా తాజాగా ధనుంజయను పెళ్లికొడుకుగా, ధన్యతను పెళ్లికూతురిగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా ఆమె కాలికి మెట్టెలు తొడిగాడు.పెద్ద ఎత్తున వివాహ వేడుక!కర్ణాటకలోని మైసూరులో శనివారం (ఫిబ్రవరి 15న) రాత్రి రిసెప్షన్ జరగనుంది. బంధుమిత్రులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 16న) వీరి వివాహం జరనుంది. ఈ వేడుకకు దాదాపు 30 వేల మంది వస్తారని అంచనా! కాగా ధనంజయ్- ధన్యత గతేడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ధనంజయ.. అసలు పెళ్లే చేసుకోనని ఇంట్లో తెగ సతాయించేవాడట! దీంతో అతడ్ని ఎలా ఒప్పించాలా? అని తెగ టెన్షన్ పడిపోయానంటోంది నటుడి తల్లి సావిత్రమ్మ. పెళ్లి చేసుకోమని ఐదేళ్లుగా వెంటపడ్డానని.. ఎట్టకేలకు ఆ శుభకార్యం జరుగుతుండటం సంతోషంగా ఉందని పేర్కొంది.పెళ్లికూతురు ఎవరంటే?ధన్యత చిత్రదుర్గకు చెందిన అమ్మాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌గా పని చేస్తోంది. ధనంజయ్ విషయానికి వస్తే.. ఇతడు కన్నడలో హీరోగా, విలన్‌గా పలు సినిమాలు చేశాడు. పుష్ప మూవీతో తెలుగువారికి దగ్గరయ్యాడు. ప్రస్తుతం కన్నడలో ఉత్తరకాండ చేస్తున్నాడు. ఈయన నటుడు మాత్రమే కాదు పాటల రచయిత కూడా! కన్నడలో పదికి పైగా పాటలు రాశాడు.చదవండి: పెళ్లి, పిల్లలు వద్దంటేనే సినిమా ఛాన్స్..: హీరోయిన్ -
ఓటీటీకి కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శాండల్‌వుడ్ స్టార్ కిచ్చా సుదీప్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మ్యాక్స్. గతేడాది డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో హనుమాన్ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. టాలీవుడ్ నటుడు సునీల్ ఈ మూవీతో కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జీ5 వేదికగా ఓటీటీలో అందుబాటులోకి రానుంది. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కిచ్చా సుదీప్ యాక్షన్ సీన్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కాగా.. ఈ సినిమాను వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మించారు.మ్యాక్స్ కథేంటంటే..సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
గొర్రెల కాపరిగా కొనసాగుతా.. నాకదే ఇష్టం!: బిగ్‌బాస్ విన్నర్
రైతుబిడ్డ బిగ్‌బాస్ ట్రోఫీ గెలవడం విశేషమనే చెప్పాలి. ఈ అరుదైన ఘనతను తెలుగు బిగ్‌బాస్ షోలో పల్లవిప్రశాంత్ సాధించగా ఇటీవల కన్నడ బిగ్‌బాస్ షోలోనూ ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్ విజేతగా రైతుబిడ్డ, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ హనుమంత (Hanumantha Lamani) నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా షోలో అడుగుపెట్టిన అతడు అందరి మనసులు గెలుచుకుని బిగ్‌బాస్ ట్రోఫీ అందుకున్నాడు. రూ.50 లక్షల ప్రైజ్‌మనీతో పాటు లగ్జరీ కారును సైతం సొంతం చేసుకున్నాడు.గొర్రెలు మేపడమే ఇష్టంఅరకోటి అందుకున్న హనుమంత.. తనకు గొర్రెలు మేపడమే ఇష్టమని అంటున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. గొర్రెల్ని మేపడానికి వెళ్లడం నాకెంతో ఇష్టం. అప్పుడు నా వెంట ఎవరూ లేరు. ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ పోయాను. ఇప్పుడది గుర్తు చేసుకుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఈ పనిని వదిలేయలేను. బిగ్‌బాస్ విషయానికి వస్తే.. బిగ్‌బాస్ హౌస్‌ను చాలా మిస్ అవుతున్నాను. భగవంతుడి ఆశీస్సులున్నాయిఅక్కడ ట్రోఫీ గెలిచానంటే అది నా గెలుపు మాత్రమే కాదు. కర్ణాటక ప్రజల విజయం. వారు ఓటేయడం వల్లే నేను గెలిచాను. అలాగే నేను ఎంతగానో ఆరాధించే హనుమంతుడి ఆశీర్వాదాలు నాపై బలంగా ఉన్నాయి. ప్రతి శనివారం ఆంజనేయుడి గుడికి వెళ్లి పాటలు పాడేవాడిని. అందుకే ఈ రోజు నేనిక్కడున్నాను.ఎవర్ని తీసుకొస్తే వారినే..పెళ్లి విషయానికి వస్తే.. అమ్మానాన్న ఎవర్ని ఎంపిక చేస్తే వారినే వివాహం చేసుకుంటాను. నా పెళ్లికి అందర్నీ ఆహ్వానిస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే హనుమంతు.. ఈ షో కంటే ముందు సంగీతంతో పరిచయం లేకపోయినా కన్నడ సరిగమప షో 15వ సీజన్లో పాల్గొన్నాడు. తన గాత్రంతో అందర్నీ మైమరిపించి షో రన్నరప్‌గా నిలిచాడు. View this post on Instagram A post shared by 🧿ಹನುಮಂತ ಲಮಾಣಿ🧿 (@hanumantha_lamani_official_) చదవండి: ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను -
'నా మనసుకు ఇంకా గాయం..' మహాకుంభమేళాలో పవిత్ర గౌడ
అభిమాని రేణుకాస్వామి హత్య కేసు నిందితులు హీరో దర్శన్ (Darshan), అతడి ప్రేయసి, నటి పవిత్రగౌడ (Pavithra Gowda) ఆలయాల బాటపట్టారు. దైవభక్తిలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. తాజాగా పవిత్రగౌడ మహాకుంభమేళాకు వెళ్లింది. మౌని అమావాస్య రోజు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆశీర్వాదం..ఎంతో పవిత్రమైన మౌని అమావాస్య రోజు మహాకుంభమేళా (Mahakumbh 2025)లో స్నానం ఆచరించడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాను. నెగెటివ్ ఎనర్జీ నుంచి నాకు స్వేచ్ఛ లభించిందని నమ్ముతున్నాను. హరహర మహాధేవ్ అని క్యాప్షన్ జోడించింది. ఒకరి కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం స్వేచ్ఛగా తిరుగుతున్నావా? అంటూ నెటిజన్లు నటిని తిట్టిపోస్తూనే ఉన్నారు. దీంతో ఆమె మరో పోస్ట్ పెట్టింది.మరింత బాధ, శోకం..మతానికి, అన్యాయానికి జరిగిన సంఘర్షణలో మతమే గెలుస్తుంది. ఒకవేళ మొదట అన్యాయం విజయం సాధించినా చివరకు గెలిచేది మాత్రం మతమే! నన్ను తిడుతూ, నన్ను బాధపెడుతున్న న్యూస్ ఛానల్స్, సోషల్ మీడియా సైట్స్‌కు థాంక్స్. హద్దులు మీరుతూ మీరు చేస్తున్న కామెంట్లు నా మనసును మరింత బాధకు గురి చేస్తున్నాయి. ఇంకా శోకంలోకి నెట్టేస్తున్నాయి అని రాసుకొచ్చింది. View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official) View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithragowda777_official)చదవండి: సన్యాసిగా మారిన హీరోయిన్‌పై బహిష్కరణ వేటు -
సారీ.. మీ అవార్డ్ నాకొద్దు.. క్షమాపణలు చెప్పిన కిచ్చా సుదీప్
శాండల్‌వుడ్ హీరో కిచ్చా సుదీప్‌ను ప్రతిష్టత్మక అవార్డ్ వరించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఉత్తమ నటుడిగా పురస్కారం ప్రకటించింది. ఉత్తమ నటుడి కేటగిరీ కిచ్చా సుదీప్‌కు అవార్డ్ దక్కింది. ఈ ఘనత దక్కడం పట్ల హీరో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం, జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు.కిచ్చా సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' ఉత్తమ నటుడి కేటగిరీ కింద రాష్ట్రస్థాయి అవార్డును అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ గౌరవం కల్పించిన జ్యూరీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చాలా సంవత్సరాలుగా అవార్డులు అందుకోవడం ఆపివేయాలని నిర్ణయించుకున్నా. వివిధ వ్యక్తిగత కారణాల వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నా. కానీ ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉన్నా. చాలా మంది టాలెంటెడ్ నటీనటులు ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఇస్తే నా కంటే చాలా ఎక్కువగా అభినందిస్తారు. వారిలో ఒకరు దానిని స్వీకరించడం నాకు మరింత సంతోషాన్నిస్తుంది. ఎలాంటి అవార్డులు ఆశించకుండా అభిమానులను అలరించడమే నా ధ్యేయం.' అని పోస్ట్ చేశారు.అవార్డ్‌కు ఎంపిక చేసినందుకు ప్రతి జ్యూరీ సభ్యునికి కృతజ్ఞతలు.. ఎందుకంటే నా ప్రతిఫలానికి దక్కిన గుర్తింపని కిచ్చా సుదీప్ పోస్ట్ చేశారు. నా నిర్ణయం ఏదైనా నిరాశ కలిగించినందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు రాసుకొచ్చారు. మీరు నా అభిప్రాయాన్ని గౌరవిస్తారని.. నేను ఎంచుకున్న మార్గంలో మద్దతు ఇస్తారని విశ్వసిస్తున్నా అంటూ ట్వీట్ చేశారు. నా కృషిని గుర్తించి ఈ అవార్డుకు నన్ను పరిగణనలోకి తీసుకున్నందుకు జ్యూరీ సభ్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా.. కిచ్చా సుదీప్ కేవలం శాండల్వుడ్లోనే కాదు.. టాలీవుడ్‌లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. రాజమౌళి ఈగ మూవీతో తెలుగులో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. కిచ్చా సుదీప్ చివరిసారిగా మ్యాక్స్ చిత్రంతో అభిమానులను అలరించారు.Respected Government of Karnataka and Members of the Jury, It is truly a privilege to have received the state award under the best actor category, and I extend my heartfelt thanks to the respected jury for this honor. However, I must express that I have chosen to stop receiving…— Kichcha Sudeepa (@KicchaSudeep) January 23, 2025 -
ప్రతి హీరో చివర్లో బోర్ కొట్టేస్తాడు.. రిటైర్మెంట్పై కిచ్చా సుదీప్
స్టార్ హీరో కిచ్చా సుదీప్ (Kichcha Sudeep).. కన్నడవారికే కాదు, తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకూ సుపరిచితులు. ఏళ్ల తరబడి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న ఆయన రిటైర్మెంట్ గురించి మాట్లాడాడు. ఓ ఇంటర్వ్యూలో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ.. నేనేమీ సినిమాలు చేసి అలిసిపోలేదు. కానీ ఒకానొక దశకు వచ్చాక రిటైర్మెంట్ తీసుకోక తప్పదేమో! జీవితాంతం హీరోగా చేయలేంనేనే కాదు, ప్రతి హీరో కూడా చివర్లో బోర్ కొట్టేస్తాడు. జీవితాంతం హీరోగా చేయలేం. ఒక హీరోగా నేను ఎప్పుడూ సెట్‌కు ఆలస్యంగా వెళ్లను. నాకోసం ఎవరూ వెయిట్ చేయకుండా చూసుకుంటాను. రేపు పొద్దున నేను సహాయక పాత్రలు చేసినప్పుడు కూడా ఎవరి కోసమో ఎదురుచూస్తూ కూర్చోలేను. అలా అని సహాయక పాత్రలు నాకు చేయాలని లేదు. రిజెక్ట్ చేస్తున్నా..ఇప్పుడు నాకు వస్తున్న చాలా సినిమాలను తిరస్కరిస్తున్నాను. స్క్రిప్టు బాగోలేక కాదు, ఇప్పుడు ఈ వయసులో అలాంటి సినిమాలు చేయలేడం ఇష్టం లేక రిజెక్ట్ చేస్తున్నాను. రిటైర్మెంట్ అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీనే వదిలేసి వెళ్లిపోతాననుకునేరు. అలా ఏం కాదు, హీరోగా, విలన్‌గా ఇక చేసింది చాలు అనిపించినప్పుడు దర్శకుడిగానో, నిర్మాతగానో సెటిలైపోతాను అని చెప్పుకొచ్చాడు.కిచ్చా సుదీప్ కెరీర్..సుదీప్ 1997లో వచ్చిన తయవ్వ సినిమాతో వెండితెరపై మెరిశాడు. 2000వ సంవత్సరంలో వచ్చిన స్పర్శ చిత్రంతో హిట్ అందుకున్నాడు. 2003లో వచ్చిన హుచ్చ బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఇందులో సుదీప్ కిచ్చ రోల్లో మెరిశాడు. అప్పటినుంచి సుదీప్ కాస్తా కిచ్చా సుదీప్ అయ్యాడు. కన్నడలో హీరోగా వరుస సినిమాలు చేసుకుంటూ పోయిన ఆయన 2008లో ఫూంక్ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టాడు.(చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)తెలుగు, తమిళ, హిందీ భాషల్లోనూ..2010లో వచ్చిన రక్త చరిత్ర 1, రక్త చరిత్ర 2తో అటు హిందీ, ఇటు తెలుగులో సెన్సేషన్ అయ్యాడు. అయితే తెలుగువారిని తన నటనతో కట్టిపడేసింది మాత్రం ఈగ మూవీతోనే. 2012లో వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు అప్పటికీ, ఇప్పటికీ.. ఎప్పటికీ మర్చిపోలేరు. ఈగ మూవీ తమిళంలోనూ రిలీజవడంతో అక్కడివారికీ దగ్గరయ్యాడు. తమిళ పులి చిత్రంలో విలన్‌గా నటించాడు. బాహుబలి, సైరా నరసింహా రెడ్డి, విక్రాంత్ రోణ, కబ్జా,.. ఇలా పలు సినిమాలు చేశాడు. దర్శకుడిగా..చివరగా మ్యాక్స్ మూవీ (Max Movie)లో నటించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం బిల్లా రంగ బాషా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కిచ్చా సుదీప్ నటుడు మాత్రమే కాదు దర్శకుడు, రచయిత, నిర్మాత, సింగర్ కూడా! ఈయన డైరెక్షన్లో మై ఆటోగ్రాఫ్, వీర మదకరి, జస్ట్ మాత్ మాతల్లి, కెంపె గౌడ, మాణిక్య చిత్రాలు రూపుదిద్దుకున్నాయి. బిగ్‌బాస్‌కు దూరం!కన్నడ బిగ్‌బాస్ షో (Bigg Boss Reality Show) ఆరంభం నుంచి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓటీటీ వర్షన్‌తో పాటు పదకొండు బిగ్‌బాస్ సీజన్లకు ఈయనే వ్యాఖ్యాతగా పని చేశాడు. అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం తాను హోస్టింగ్ చేయబోనని ప్రకటించాడు. దీంతో సుదీప్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వస్తున్నంత ఆదరణ, ప్రాధాన్యత కన్నడలో రావడం లేదని, తన కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడంతోనే ఈ రియాలిటీ షో నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.చదవండి: గేమ్ ఛేంజర్ మూవీకి నా మనసులో ప్రత్యేక స్థానం: రామ్ చరణ్ -
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్.. ఘనంగా సీమంతం
హీరోయిన్ హరిప్రియ (Hariprriya) త్వరలోనే తల్లి కాబోతోంది. ఈ క్రమంలో నటుడు వశిష్ట సింహ భార్య సీమంతం వేడుకను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేశాడు. తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను ఈ దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహ 2023లో పెళ్లి చేసుకున్నారు.ఎవరీ హరిప్రియ?హరిప్రియ కర్ణాటకవాసి. విద్యాభ్యాసం పూర్తయిన వెంటనే క్లాసికల్ డ్యాన్స్‌పై ఆసక్తితో భరతనాట్యం నేర్చుకుంది. అలా ఎన్నో ప్రోగ్రామ్స్‌కు హాజరయ్యేది. తను 12వ తరగతి చదువుతున్న సమయంలో తన డ్యాన్స్ స్టిల్స్ దర్శకుడు రిచర్డ్ కాస్టెలినో కంటపడ్డాయి. వెంటనే ఆమెను సినిమా కోసం సంప్రదించడం.. ఇంట్లో ఒప్పుకోవడంతో బడి అనే తుళు చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. మనసుగుల మత్తు మధుర చిత్రంతో కన్నడ వెండితెరకు హీరోయిన్‌కు పరిచయమైంది.(చదవండి: హీరోయిన్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. డైరెక్టర్‌పై మహిళా కమిషన్ ఆగ్రహం)తెలుగులోనూ హీరోయిన్గా..యష్ సరసన నటించిన 'కళ్ళర సంతె'తో క్రేజ్ తెచ్చుకుంది. శివరాజ్‌కుమార్ 'చెలువెయె నిన్నే నోడలు' మూవీతో సెన్సేషన్ అయింది. ఉగ్రం, నీర్ దోసె, బెల్ బాటమ్, బిచ్చుగత్తి: చాప్టర్ 1 వంటి చిత్రాలతో అలరించింది. తకిట తకిట చిత్రంతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహ, అలా ఇలా ఎలా అనే సినిమాలతో మెప్పించింది. తమిళంలోనూ రెండుమూడు మూవీస్‌లో నటించింది. ప్రస్తుతం కన్నడలో బెల్ బాటమ్ 2, హ్యాపీ ఎండింగ్, లగామ్ సినిమాలు చేస్తోంది.కేజీఎఫ్ మూవీలో విలన్‌గా..వశిష్ట (Vasishta N Simha) విషయానికి వస్తే ఇతడు కూడా కర్ణాటకవాసే! రుద్ర తాండవ, ఎలోన్, నాన్ లవ్ ట్రాక్, ముఫ్టీ, టగారు, ఉపేంద్ర మట్టె బా, 8 ఎమ్ఎమ్ బుల్లెట్ వంటి చిత్రాల్లో నటించాడు. కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ తెచ్చుకున్నాడు. తెలుగులో నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్, డెవిల్: ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్, యేవమ్, సింబా చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం ఓదెల రైల్వే స్టేషన్ సీక్వెల్లో నటిస్తున్నాడు. ఇతడు నటుడు మాత్రమే కాదు సింగర్ కూడా! తెలుగులో కిరాక్ పార్టీ మూవీలో ఓ సాంగ్ పాడాడు. కన్నడలో పలు చిత్రాల్లో పాటలు ఆలపించాడు.అలా మొదలైన ప్రేమకథఈ ఇద్దరికీ ఎలా ముడిపడిందో హరిప్రియ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ‘నా దగ్గర రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో ఒకటి చనిపోవడంతో మిగతాది ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట నాకు ఓ కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన పప్పీతో నా కుక్కపిల్ల కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. అలాగే మా మధ్య ప్రేమ కూడా పెరిగింది’ అని తన ప్రేమ కహానీ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vasishta N Simha (@imsimhaa) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) చదవండి: మళ్లీ ‘దంచిన’ బాలయ్య.. పార్టీలో హీరోయిన్‌తో ఆ స్టెప్పులు! -
తల్లి కాబోతున్న సింగిల్ టేక్ హీరోయిన్.. బాలకృష్ణ సినిమాతో గుర్తింపు
కన్నడ నటుడు వశిష్ఠ ( Vasishta N. Simha), హీరోయిన్ హరిప్రియ (Haripriya) తల్లిదండ్రులు కాబోతున్నారు. రెండేళ్ల క్రితం వారు ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితుల మధ్య చాలా సింపుల్‌గా వారు ఒక్కటయ్యారు. కన్నడలో స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న సమయంలోనే ఆమె ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె తమిళ్, తెలుగులో కూడా అనేక చిత్రాల్లో మెప్పించింది.నటి భూమిక భర్త భరత్ ఠాకూర్ నిర్మించిన ‘తకిట తకిట’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు హరిప్రియ పరిచయమైంది. ఆ తర్వాత నానితో పిల్ల జమీందార్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో హరిప్రియకు వరుస అవకాశాలు వచ్చాయి. అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా చిత్రాల తర్వాత ఏకంగా బాలకృష్ణతో నటించే అవకాశం కొట్టేసింది. ‘ జై సింహా’లో (Jai Simha) బాలయ్య సరసన నటించి తెలుగు వారిని కూడా మెప్పించింది. ఆ సినిమా తర్వాత తెలుగులో ఆమె సినిమాలు చేయలేదు. కానీ, కన్నడలో మాత్రం వరుస సినిమాలతో దూసుకెళ్లింది.ఇద్దరినీ కలిపిన కుక్క పిల్లహరిప్రియ గతంలో రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి, శ్రీమురళి వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తన సహచర నటుడు వశిష్ట సింహతో ప్రేమలో పడింది. ఓ కుక్కపిల్ల కారణంగా తాను వశిష్టతో ప్రేమలో పడిపోయానని గతంలో ఆమె ఇలా చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ఇదే జరిగితే దంగల్ రికార్డ్‌ను 'పుష్ప' కొట్టేస్తాడు.. బన్నీకి గోల్డెన్ ఛాన్స్)‘నా దగ్గర లక్కీ, హ్యాపీ అనే రెండు కుక్క పిల్లలు ఉండేవి. వాటిలో లక్కీ అనే కుక్క చనిపోయింది. దీంతో హ్యాపీ ఒంటరైపోయింది. అలాంటి సమయంలో వశిష్ట సింహం నాకు ఓ కుక్కపిల్లను బహుమతిగా ఇచ్చాడు. దాని పేరు క్రిస్టల్. కొత్తగా వచ్చిన క్రిస్టల్‌తో హ్యాపీ కలిసిపోయింది. ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. అయితే క్రిస్టల్‌ని బహుమతిగా ఇచ్చినప్పుడు.. వశిష్ట ఓ సందేశాన్ని కూడా పంపించాడు. క్రిస్టల్ పొట్టపై గుండె ఆకారంలో ఓ మచ్చ ఉంది. క్రిస్టల్‌తో పాటు ఆ మచ్చ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో పాటు మా మధ్య ప్రేమ కూడా పెరిగింది. అలా మా ప్రేమకు క్రిస్టల్ కారణమైంది’ అని హరిప్రియ తన ప్రేమ కహానిని చెప్పుకొచ్చింది.వశిష్ఠ కూడా మరెవరో కాదు… కన్నడ నుంచి రిలీజ్ అయిన సూపర్ డూపర్ హిట్ మూవీ 'కేజీఎఫ్'లో ఆయన విలన్‌గా నటించాడు. కన్నడలో ఆర్య లవ్, రాజా హులి, రుద్ర తాండవలో మెప్పించాడు. ఆ తర్వాత తెలుగులోనూ ‘నయీమ్ డైరీస్, నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్ వంటి సినిమాల్లో చాలా కీలక పాత్రలు పోషించాడు. హరిప్రియ కూడా కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉగ్రమ్ సినిమాతో పాటు రన్న, రికీ, నీర్ దోసె, భర్జరి, సంహారా, లైఫ్ జోతే ఓంద్ సెల్ఫీ, బెల్ బాటమ్ చిత్రాలతో గుర్తింపు పొందింది. అలా ఇద్దరూ కన్నడ, తెలుగు పరిశ్రమలో గుర్తంపు తెచ్చుకోవడం వల్ల వారికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.బాలయ్యను మెప్పించిన హరిప్రియనందమూరి బాలకృష్ణ నటించిన జై సింహా సినిమా 2018 సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. సినిమా వేడుకలో భాగంగా బాలయ్య మాట్లాడుతూ హరిప్రియపై ప్రశంసలు కురిపించారు. జై సింహా సినిమాలో ఆమె చాలా కీలకమైన పాత్ర చేశారని బాలయ్య చెబుతూనే.. ఒక సీన్లో ఆమె అద్భుతంగా మెప్పించారని తెలిపారు. ఆ సీన్ చేయాలంటే మరోక నటికి ఒకరోజు పట్టవచ్చని తెలిపారు. హరిప్రియ సింగిల్ టెక్ ఆర్టిస్ట్ అని కూడా ఆయన పొగిడారు. బాలయ్య నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ప్రశంసలు అందుకున్న నటి హరిప్రియ మాత్రమేనని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
మా అమ్మ ఎవర్నీ గాయపర్చలేదు, ఈ భారం మోయలేకున్నా!: పవిత్ర కూతురు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ (Darshan), అతడి ప్రియురాలు పవిత్ర గౌడ (Pavithra Gowda) కొన్ని నెలలపాటు జైలు జీవితం గడిపారు. కొద్ది రోజుల క్రితమే ఇద్దరూ బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఆ సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటికీ వీరిద్దరిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంది. దీనిపై పవిత్ర గౌడ కూతురు ఖుషి గౌడ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. ఇలాంటి పోస్ట్ ఒకటి పెట్టాల్సి వస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ మీ మాటలు మా మనసుకు గాయం చేస్తున్నాయి. దాన్ని అలాగే వదిలేయలేకపోతున్నాను.మీకేం తెలుసు?అర్థం పర్థం లేకుండా, మీకు మీరే అన్నీ నిర్ధారించేసుకుంటూ మా అమ్మ గురించి క్రూరంగా మాట్లాడుతున్నారు. అవి నా మనసును ఎంత బాధిస్తున్నాయో మీకేం తెలుసు? తను పడ్డ కష్టాలు, చేసిన త్యాగాలు మీకు తెలియదు. మీ సూటిపోటి మాటలపై తను నిశ్శబ్ధంలోనే పోరాటం చేస్తోంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం కుప్పకూలిపోతుంటే కూడా ధైర్యంగా నిలబడింది. మా అమ్మే నా ప్రపంచం, బలం, ఇన్స్పిరేషన్. తను నాకు అమ్మ మాత్రమే కాదు నాన్న కూడా! నా జీవితంలో అన్ని పాత్రలు తనే పోషించింది. ఆవిడే నా సర్వస్వం.(చదవండి: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హీరోయిన్ డుమ్మా.. ఎందుకంటే?)అదే నన్నింకా బాధిస్తోంది!మా అమ్మ.. ప్రేమ, త్యాగానికి నిలువెత్తు నిదర్శనం. తన గురించి నేనెంత చెప్పినా తక్కువే! ఆవిడ గురించి తెలుసుకోకుండా తప్పుగా మాట్లాడటం అన్యాయం, దారుణం. నన్నింకా బాధిస్తుందేంటో తెలుసా? ఇప్పటికీ తనను ద్వేషిస్తున్నారు. తను అంత బాధ (జైలు జీవితం) అనుభవించినా కూడా ఇప్పటికీ తనను కాల్చుకు తింటున్నారు. నేను టీనేజర్‌ను. మీ అసహ్యకరమైన కామెంట్లు నన్నెంత బాధిస్తున్నాయో తెలుసా! మా అమ్మను దోషిగా నిలబెట్టారు. ఈ భారాన్ని నేను మోయలేకున్నాను.మా అమ్మ హీరోమా అమ్మ ఎప్పుడూ ఎవరినీ గాయపర్చలేదు. ఒక్కసారి కూడా తను ఎవర్నీ బాధపెట్టలేదు. పైగా తన సొంత ఖర్చులతో వేరేవారి బాగోగులు కూడా చూసుకునే మంచి మనిషి. అలాంటి తనపై మనసు లేని మనుషులు ఇంకా బురద చల్లాలని ప్రయత్నిస్తూనే ఉన్నారు. బాధగా ఉంది. తనకిలాంటి పరిస్థితి వచ్చినందుకు మరింత బాధగా ఉంది. మా అమ్మ ఉత్తమురాలు. ఏం జరిగినా నేను తన వెంటే ఉంటాను. దయచేసి ముందూవెనకా ఆలోచించి మాట్లాడండి. మా అమ్మ నాకు హీరో.. దాన్నెవరూ మార్చలేరు అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది.అభిమాని హత్యకాగా పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కారణంతో కర్ణాటకకు చెందిన రేణుకాస్వామి (Renuka Swamy Murder Case)ని హీరో దర్శన్ చంపారంటూ ఆరోపణలు వచ్చాయి. ఈమేరకు కొన్ని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు గతేడాది జూలైలో దర్శన్, పవిత్రగౌడను అరెస్టు చేశారు. ఇటీవలే వీరు బెయిల్‌పై బయటకు వచ్చారు.చదవండి: టీవీలో నాన్నను చూసి మురిసిపోయిన క్లీంకార..వీడియో వైరల్ -
రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్'.. రిలీజ్‌కు ముందే షాక్!
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గేమ్ ఛేంజర్. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. గురువారం టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. రిలీజైన గేమ్ ఛేంజర్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. గేమ్ ఛేంజర్‌లో రామ్ చరణ్ డైలాగ్స్ ఫ్యాన్స్‌కైతే గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ మూవీ సినీ ప్రియులను అలరించనుంది.రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి నాలుగు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా ప్రమోషన్స్ చేయనున్నారు. ఏపీలోని రాజమండ్రిలో జనవరి 4న భారీస్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. నిర్మాత దిల్ రాజు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.అయితే గేమ్ ఛేంజర్ టీమ్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉండగా.. అక్కడ మాత్రం ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. కర్ణాటకలో సినిమాకు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. దీంతో అక్కడి ఫ్యాన్స్ కొందరు సినిమా పోస్టర్లపై స్ప్రే కొడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో ఎస్జే సూర్య, సముద్రఖని, శ్రీకాంత్, జయరాం కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాపై మొదటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Great India (@greatindiatelugu) -
రిషబ్ శెట్టి పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!
శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్‌లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024 -
క్యాన్సర్ నుంచి కోలుకున్నా.. త్వరలోనే మీ ముందుకు వస్తా: శివరాజ్ కుమార్
శాండల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఇటీవల విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. వైద్య చికిత్స కోసం ఆయన అమెరికా చేరుకున్నారు. అక్కడికి వెళ్లేముందు అభిమానులకు సందేశం ఇచ్చారు. త్వరలోనే తిరిగి వస్తానన ఫ్యాన్స్‌తో చెప్పారు.ఇటీవల నాన్నకు క్యాన్సర్‌కు సంబంధించిన సర్జరీ పూర్తయిందని ఆయన కూతురు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. శివరాజ్ కుమార్ కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపింది. త్వరలోనే అభిమానులతో నాన్న మాట్లాడతారని పేర్కొంది. కాగా.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం మియామీ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయనకు శస్త్ర చికిత్స నిర్వహించారు.తాజాగా శివరాజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. తన భార్యతో కలిసి ఆయన మాట్లాడారు. తాను క్యాన్సర్ నుంచి కోలుకున్నట్లు వెల్లడించారు. మీ అందరి అభిమానం వెలకట్టలేనిదని శివరాజ్ కుమార్ అన్నారు. న్యూ ఇయర్ వేళ ఫ్యాన్స్‌ను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా అందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.శివరాజ్ కుమార్ మాట్లాడుతూ..'క్యాన్సర్ ఉందని తెలిసిన తర్వాత ఎవరికైనా భయం ఉంటుంది. ఆ భయం దూరం చేసేందుకు నా భార్య గీత, అభిమానులు ఎంతో సహకరించారు. వారందరికీ రుణపడి ఉంటా. నేను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డాను. కీమో థెరపీ చేయించుకుంటూనే '45' సినిమా షూటింగ్ పూర్తి చేశా. ఈ ప్రయాణంలో వైద్యులు అందించిన సహకారం మర్చిపోలేను' అని అన్నారు.కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. అంతేకాకుండా కన్నడలో పలు సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించారు. #ShivarajKumar spoke after his surgery, explaining what had happened and expressing gratitude to all those who helped him to win this situation pic.twitter.com/NU41k5mLUD— Yogitha RJ (@iamyogitharj) January 1, 2025 -
లైంగిక వేధింపులు.. కన్నడ నటుడు అరెస్ట్
ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు చరిత బాలప్పను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి చేసిన ఆరోపణలతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 29 ఏళ్ల నటికి 2017లో బాలప్పతో పరిచయం ఏర్పడింది. పైకి మంచివాడిగా నటించిన బాలప్ప ఆమెను ప్రేమించాడు. నటి కూడా తిరిగి ప్రేమించాలని వెంటపడ్డాడు. బలవంతపెట్టాడు. అలా ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు.బెదిరింపులుఅయితే తనకు డబ్బు కావాలని, అడిగినంత ఇవ్వకపోతే ప్రైవేట్ ఫోటోలు వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించాడు. నటి ఒంటరిగా ఉంటోందని తెలుసుకుని ఆమె ఇంటికి వెళ్లి నానా రచ్చ చేశాడు. ఈ విషయాలను బయటపెడితే తనకున్న ధనబలంతో, రాజకీయ నాయకుల అండతో నటిపైనే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని హెచ్చరించాడు. చంపడానికి కూడా వెనకాడనని బెదిరించాడు. దీంతో నటి పోలీసులను ఆశ్రయించింది. వారు బాలప్పను అరెస్ట్ చేసి విచారణ మొదలుపెట్టారు. కాగా సదరు నటికి ఇదివరకే విడాకులవగా ఒంటరిగా నివసిస్తోంది.చదవండి: Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా వీడియో సాంగ్ రిలీజ్ -
దీని గురించి ఎవరూ మాట్లాడరేంటి?: ఉపేంద్ర
కన్నడ స్టార్ ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం యూఐ. లహరి ఫిలింస్, వీనస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలైంది. ఉపేంద్ర చెప్పినట్లుగానే ప్రేక్షకులు ఓ కొత్త సినిమాను ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఇక సినిమా ప్రారంభంలో కొన్ని చిత్రవిచిత్ర డైలాగులు స్క్రీన్‌పై దర్శనమిస్తాయి. అందులో.. 'తెలివైనవాళ్లు తెలివితక్కువవాళ్లుగానే కనిపిస్తారు. కానీ తెలివి లేనివాళ్లు మాత్రం పైకి తెలివైనవాళ్లుగా కనిపించేందుకు ప్రయత్నిస్తారు' అన్న డైలాగ్ కూడా ఉంది.ఇప్పుడిది అవసరమా?దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఉపేంద్ర సోషల్ మీడియాలో షేర్ చేశాడు. థియేటర్లో సినిమా వీక్షించిన ఏ ఒక్కరూ దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించాడు. ఇందుకు ఓ వ్యక్తి స్పందిస్తూ.. ఇప్పుడిది అవసరమా సర్? మీ సినిమా అందరి కంట్లో పడింది. అందుకు సంతోషించండి అని కామెంట్ చేశాడు. మరికొందరేమో.. 'మేము అంత ఇంటెలిజెంట్ కాదు సర్..', 'అసలు యూఐ సినిమాను థియేటర్లో చూడనివారు నిజమైన మేధావులు..', 'అక్కడ కనిపిస్తున్న డైలాగ్‌లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది' అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అబ్బో.. ఇలాంటి డైలాగులకు కొదవే లేదుయూఐ సినిమాలో ఇలాంటి వింతలు విశేషాలు చాలానే ఉన్నాయి. నువ్వు మేధావివైతే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్లిపో.. తెలివితక్కువవాడితైనే సినిమా అంతా చూడు.. వంటి వింత కొటేషన్లు దర్శనమిస్తాయి. రేష్మ నానయ్య, సన్నీలియోన్, జిష్షు సేన్‌గుప్తా, నిధి సుబ్బయ్య, మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.19 కోట్ల మేర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. Why is no one talking about this that was seen on screen ? ! pic.twitter.com/ZzrOJJsuUK— Upendra (@nimmaupendra) December 23, 2024 చదవండి: జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు సాయం చేయలేదు.. అభిమాని తల్లి ఆవేదన -
బిగ్‌బాస్ షోకు గౌరవం దక్కట్లేదు.. అందుకే హోస్టింగ్‌కు గుడ్‌బై
కన్నడలో బిగ్‌బాస్ రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి హీరో కిచ్చా సుదీప్ హోస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. పదేళ్లు విజయవంతంగా హోస్టింగ్ చేస్తున్న ఆయన పదకొండో సీజన్‌ను కూడా తనే నడిపిస్తున్నాడు. అయితే ఇకమీదట రాబోయే సీజన్స్‌కు తాను హోస్ట్‌గా చేయనని, ఇదే తన చివరి బిగ్‌బాస్ సీజన్ అని అక్టోబర్‌లో ప్రకటించాడు.మనసుకు అనిపించింది చెప్పాఅందుకు గల కారణాన్ని తాజాగా బయటపెట్టాడు. ఓ ఇంటర్వ్యూలో సుదీప్ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌కు గుడ్‌బై చెప్తున్నానంటూ ట్వీట్ చేసిన రోజు చాలా అలిసిపోయి ఉన్నాను. అప్పుడు నా మనసుకు అనిపించింది చెప్పాను. అంతర్గత లోటుపాట్లు కూడా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం. ఆరోజు గనక ఆ ట్వీట్ చేయకపోయుంటే తర్వాత నా ఆలోచనలు, అభిప్రాయాలు మారేవేమో!ఆలోచన వచ్చిన వెంటనే..అందుకే నాకు బిగ్‌బాస్‌ను వదిలేయాలన్న ఆలోచన వచ్చిన వెంటనే ట్వీట్ చేశాను. ఆ మాటపై ఉండాలని నాకు నేను చెప్పుకున్నాను. కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న ప్రతిఒక్కరి కోసం నేను కష్టపడాల్సిన పనిలేదనిపించింది. అక్కడ ఎంత కష్టపడ్డా పెద్దగా ఫలితం ఉండట్లేదు, అలాంటప్పుడు అంతే శ్రమ నా సినిమాలపై పెట్టుంటే బాగుండనిపించింది. కన్నడ బిగ్‌బాస్‌కు..మిగతా భాషల్లో బిగ్‌బాస్‌కు వచ్చిన గుర్తింపు, ఆదరణ కన్నడ బిగ్‌బాస్‌కు రావట్లేదు. మిగతా షోలతో మా షోను పోల్చి చూస్తే దీనికి మరింత గౌరవం రావాలి అని చెప్పుకొచ్చాడు. కాగా ఈగ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప్ ప్రస్తుతం మ్యాక్స్ సినిమాలో నటించాడు. ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది. Thank you all for the great response shown towards #BBK11.The TVR (number) speaks in volumes about the love you all have shown towards the show and me.It's been a great 10+1 years of travel together, and it's time for me to move on with what I need to do. This will be my last… pic.twitter.com/uCV6qch6eS— Kichcha Sudeepa (@KicchaSudeep) October 13, 2024 చదవండి: Bigg Boss Telugu 8: ఆ రెండూ జరగకపోయుంటే ఫినాలే వేరేలా ఉండేది! -
క్రిస్మస్ బరిలో పాన్ ఇండియా చిత్రం.. రాబిన్‌హుడ్‌కు పోటీ తప్పదా?
రాజమౌళి ఈగ మూవీతో టాలీవుడ్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోణ తర్వాత సుదీప్ చేస్తోన్న చిత్రం కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు విజయ్ కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ అనౌన్స్మెంట్ వీడియోను షేర్ చేశారు. ఈ విషయాన్ని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. డిసెంబర్ 25న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సుదీప్ తన ట్వీట్లో రాస్తూ..' నిరీక్షణ ఇంకా ఉంది. ఫైనల్‌గా రిలీజ్ డేట్ ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే మీ ప్రోత్సాహానికి, సహనానికి నా ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. అయితే అదే రోజున టాలీవుడ్ మూవీ రాబిన్‌హుడ్ కూడా రిలీజవుతోంది. దీంతో బాక్సాఫీస్ వద్ద నితిన్‌తో పోటీ పడనున్నాడు కిచ్చా సుదీప్.కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తున్నారు. హనుమాన్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు.It's been quite a wait. Finally happy to announce the release date.Thanks for the unlimited patience shown by all you friends out there and the consistent encouragement.🤗❤️#MaxTheMovie hits the theaters this Dec 25th.https://t.co/car6H2hmEb— Kichcha Sudeepa (@KicchaSudeep) November 27, 2024 -
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
'కాంతార 1' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఇంత ఆలస్యంగానా?
కాంతార.. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం గెలిచింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది.రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రిషబ్ ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపించారు.ఇకపోతే ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో కఠినమైన శిక్షణ పొందారు. వచ్చే ఏడాది దసరాకు కాంతార 1 ముందుగానే టికెట్ బుక్ చేసుకుంది. మరి ఈ మూవీ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!చదవండి: సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్ -
విజయ్ సినిమాలో రోల్.. ఎందుకు వెనక్కి తగ్గారో తెలీదు: శివరాజ్ కుమార్
ది గోట్ సూపర్ హిట్ తర్వాత విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం దళపతి69. ఈ సినిమాకు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నికల పోటీకి ముందు విజయ్ కెరీర్లో ఇదే చివరి చిత్రం కానుంది. అయితే ఈ మూవీలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ విపిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఈ వార్త తెగ వైరలవుతోంది.అయితే ఈ వార్తలపై తాజాగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ స్పందించారు. దళపతి69 మూవీ డైరెక్టర్‌తో తాను మాట్లాడిన మాట వాస్తవమేనని తెలిపారు. దర్శకుడు హెచ్ వినోద్ బెంగళూరులో తనను వ్యక్తిగతంగా కలిశాడని.. అంతేకాకుండా నా పాత్రకు సంబంధించి వివరించాడని పేర్కొన్నారు. ఈ చిత్రంలో అదొక అద్భుతమైన రోల్ అని అన్నారు.అయితే మళ్లీ కొద్ది రోజుల తర్వాత వినోద్ మరోసారి తనతో భేటీ అయ్యారని శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఈ రోల్ ప్రస్తుతానికి వర్కవుట్ కాదని వివరించారని.. మీకోసం భవిష్యత్తులో మరో ఆఫర్‌తో వస్తానని చెప్పాడని శివరాజ్ అన్నారు. అయితే అసలేం జరిగిందో.. ఆఫర్‌ను ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో కారణాలు మాత్రం తెలియదన్నారు. ఈ ఆఫర్ రాకపోయినప్పటికీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఇబ్బంది లేదని శివరాజ్ కుమార్ తెలిపారు. కాగా.. ఇవాళ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బైరాతి రనగల్ థియేటర్లలో విడుదలైంది.కాగా.. శివరాజ్ కుమార్‌కు కన్నడ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా పేరుంది. శాండల్‌వుడ్‌తో పాటు తమిళ సినిమాలలో అనేక చిత్రాలలో నటించారు. మరోవైపు రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న మూవీలో శివరాజ్ కుమార్ కనిపించనున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు కన్నప్పలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వీటితో పాటు కన్నడ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం శస్త్రచికిత్స కోసం వచ్చేనెల డిసెంబర్లో యుఎస్ వెళ్తున్నట్లు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ఆ తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకుంటున్నట్లు వివరించారు. జనవరి 2025లో ఇండియాకు తిరిగి వచ్చాక సినిమాల్లో నటిస్తానని తెలిపారు. -
అవును, విడిపోయాం: బ్రేకప్‌పై బిగ్‌బాస్ బ్యూటీ క్లారిటీ
కన్నడ నటి, బిగ్‌బాస్ బ్యూటీ జయశ్రీ ఆరాధ్య ప్రియుడు స్టీవెన్‌తో విడిపోయిందని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. చివరకు ఇదే నిజమని నటి ధృవీకరించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.లోన్ తీసుకుని ప్రారంభించా..'నేను, నా బాయ్‌ఫ్రెండ్ విడిపోయాం. ఇక మీదట ద గ్లామ్ రూమ్ మేకప్ క్లినిక్‌కు సంబంధించి ఏ వివరాలకైనా నన్ను, నా టీమ్‌ను మాత్రమే సంప్రదించండి. ఈ మేకప్ క్లినిక్ కోసం ఎవరితోనూ నేను చేయి కలపలేదు. బ్యాంకులో లోన్ తీసుకుని సొంతంగా మొదలుపెట్టాను. ఆ అప్పు నేనే తీర్చుకుంటాను. నాపై ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ థాంక్యూ' అని రాసుకొచ్చింది.సినిమాలు, రియాలిటీ షోలతో ఫేమస్కాగా ఆరాధ్య, స్టీవెన్ విడిపోయి సుమారు నెలరోజులు కావస్తోందట. వీళ్లిద్దరూ చివరిసారిగా రాజా రాణి అనే రియాలిటీ షోలో కలిసి పాల్గొన్నారు. కొంతకాలం పాటు సహజీవనం కూడా చేశారు. ఇకపోతే జయశ్రీ ఆరాధ్య కన్నడలో బెంగళూరు బాయ్స్, పుట్టరాజు: లవర్ ఆఫ్ శశికళ, ధరణి మండల మధ్యదూళిగ వంటి పలు చిత్రాల్లో నటించింది. కన్నడ బిగ్‌బాస్ ఓటీటీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. View this post on Instagram A post shared by Jayshree Aradhya (@jayshreearadhya) చదవండి: కంగనా రనౌత్ ఇంట విషాదం.. తనే మా ఇన్స్పిరేషన్! -
మొదట భయపడ్డా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా: కన్నడ స్టార్ హీరో
కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ నెట్టింట పలు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అది నిజమేనని ధృవీకరించాడు శివరాజ్‌కుమార్. భైరతి రణగల్ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న ఆయన తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడాడు.చికిత్స తీసుకుంటున్నా..'నేను కూడా మనిషినే కదా.. నాకు సమస్యలు వస్తుంటాయి. అలా ఓ అనారోగ్య సమస్య ఎదురైంది. మొదట దాని గురించి తెలిసి భయపడ్డాను. తర్వాత ధైర్యం తెచ్చుకుని పోరాడుతున్నాను.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నాను. చికిత్సలో భాగంగా ఇప్పటికే నాలుగు సెషన్లు పూర్తయ్యాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను' అని తెలిపాడు. అయితే ఆయన దేని వల్ల సతమతమవుతున్నాడన్న విషయాన్ని మాత్రం బయటపట్టలేదు. ఇంకో రెండు సెషన్ల తర్వాత ఆయన అమెరికాలో సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తోంది.సినిమాకాగా శివరాజ్‌కుమార్ గతేడాది జైలర్ మూవీలో అతిథి పాత్రలో అదరగొట్టాడు. ప్రస్తుతం అతడు నటించిన భైరతి రణగల్ మూవీ నవంబర్ 15న విడుదల కానుంది. రాహుల్ బోస్, చాయా సింగ్, దేవరాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం కన్నడతో పాటు హిందీ, తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇది శివరాజ్‌కుమార్ సూపర్ హిట్ మూవీ మఫ్టీకి ప్రీక్వెల్‌గా వస్తోంది.చదవండి: Urfi Javed: తృప్తికి డ్యాన్సే రాదు.. క్లాసులకు వెళ్లి నేర్చుకోవచ్చుగా! -
హీరో దర్శన్ నుంచి ప్రాణహాని.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఫిర్యాదు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ఇటీవలే మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చాడు. కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో సర్జరీ చేయించుకోనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా దర్శన్‌పై మరో కన్నడ నటుడు, బిగ్‌బాస్ ఫేమ్, లాయర్ జగదీష్ సంచలన ఆరోపణలు చేశాడు. దర్శన్, అతడి అభిమానుల నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బెదిరింపు కాల్స్దర్శన్కు వ్యతిరేకంగా మాట్లాడినందుకు అతడి అభిమానులు తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. దాదాపు వెయ్యి బెదిరింపు కాల్స్ వచ్చాయని పేర్కొన్నాడు. ఇదంతా చేస్తున్నది అభిమానులే అయినా.. దీని వెనక ఉన్నది మాత్రం కచ్చితంగా హీరో దర్శనే అని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం దర్శన్ బెయిల్‌పై బయట ఉన్న కారణంగా తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరాడు.చదవండి: మమ్మల్ని చిత్రవధ చేసింది.. నటిపై సవతి కూతురి ఆరోపణలు -
'బఘీర' మూవీ రివ్యూ
టైటిల్: బఘీరనటీనటులు: శ్రీ మురళి, రుక్మిణి వసంత్, అచ్యుత్, గరుడ రామ్, ప్రకాశ్ రాజ్ తదితరులుదర్శకుడు: డాక్టర్ సూరినిర్మాతలు: హోంబలే ఫిలింస్సంగీత దర్శకుడు: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ: అర్జున్ శెట్టివిడుదల: 31 అక్టోబర్, 2024ప్రశాంత్ నీల్ తొలి సినిమా ఉగ్రం హీరో శ్రీ మురళి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బఘీర. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ చిత్రంతో డాక్టర్ సూరి డైరెక్టర్‌గా పరిచయమవుతున్నారు. దీపావళి కానుకగా కన్నడతో పాటు తెలుగులో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథవేదాంత్ (శ్రీ మురళి)కి చిన్నప్పటి నుంచే ప్రజలను కాపాడే ఒక సూపర్ హీరో కావాలని కోరుకుంటాడు. సూపర్ హీరోలకు పవర్ ఉంది కాబట్టి వాళ్లు జనాన్ని కాపాడుతున్నారు కానీ ఏ పవర్ లేకపోయినా పోలీసులు కూడా జనాన్ని కాపాడుతున్నారని తల్లి చెప్పడంతో వేదాంత్ కష్టపడి చదివి ఐపీఎస్ ఆఫీసర్ అవుతాడు. కొన్నాళ్లపాటు సిన్సియర్ పోలీసాఫీసర్‌గా పని చేస్తాడు. కానీ పై నుంచి ఒత్తిళ్లు ఎక్కువవుతాయి. తనకు పరిమితులు విధిస్తారు. అంతేకాదు, తన పోలీసు ఉద్యోగం కోసం తండ్రి రూ.50 లక్షలు లంచం ఇచ్చాడని తెలిసి కుంగిపోతాడు. తన స్టేషన్ ముందు జరిగిన ఓ ఘటన వల్ల అతడు బఘీరగా అవతారమెత్తుతాడు. రాత్రిపూట బఘీరగా మారి క్రిమినల్స్‌ను వేటాడుతుంటాడు. అలా బఘీరకి జనాల్లో మంచి క్రేజ్ వస్తుంది. ఓ క్రిమినల్ రానా( గరుడ రామ్) అన్ని వ్యాపారాలకు బఘీర అడ్డొస్తాడు. ఈ ప్రయాణంలో బఘీరకు ఎదురైన సవాళ్లేంటి? వేదాంతే బఘీర అని సీబీఐ పసిగడుతుందా? వేదాంత్ ప్రేమకథ సుఖాంతమైందా? లాంటి విషయాలు తెరపై చూడాల్సిందే!విశ్లేషణప్రశాంత్ నీల్ నుంచి వచ్చే సినిమాల్లో భారీ యాక్షన్ ఉంటుంది. బఘీర కూడా ఆ కోవకు చెందినదే.. కాకపోతే కేజీఎఫ్‌లో అమ్మ సెంటిమెంట్, సలార్‌లో స్నేహం.. బాగా పండాయి. అలాంటి ఓ బలమైన ఎమోషన్ ఈ సినిమాలో పండలేదు. ప్రజల్ని నేరస్థుల బారి నుంచి రక్షించేందుకు హీరోలు ముసుగ వేసుకుని సూపర్ హీరోలా మారడం ఇదివరకే చాలా సినిమాల్లో చూశాం. కాకపోతే ఈ మూవీలో హీరో పోలీస్ కావడం.. పోలీస్‌గా ఏదీ చేయలేకపోతున్నానన్న బాధతో సూపర్ హీరోగా మారడం కొత్త పాయింట్.ఆరంభ సన్నివేశాలు ఆసక్తికరంగా మొదలవుతాయి. అయితే హీరో లవ్ ట్రాక్ కథకు స్పీడ్ బ్రేకులు వేస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. హీరో బఘీరగా మారాక కథనం మరింత రంజుగా మారుతుంది. ఇంటర్వెల్ సీన్.. సెకండాఫ్‌పై అంచనాలు పెంచేస్తుంది. సిబిఐ ఆఫీసర్‌గా ప్రకాష్ రాజ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. ఈ బఘీర ఎవరు? అని తెలుసుకునేందుకు ప్రకాష్ రాజ్ పడే తిప్పలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలా ఉన్నాయి. అయితే క్లైమాక్స్ వరకు హీరోకు, విలన్‌కు మధ్య బలమైన ఫైట్ ఉండదు. క్లైమాక్స్ కొత్తగా ఏమీ ఉండదు.ఎవరెలా చేశారంటే?వేదాంత్ అనే ఐపీఎస్ అధికారిగా, సూపర్ హీరో బఘీరగా శ్రీ మురళి రెండు షేడ్స్ లో నటిస్తూ ఆకట్టుకున్నాడు. రుక్మిణి వసంత్ పాత్రకు కథలో ప్రాధాన్యతే లేదు. ప్రకాష్ రాజ్, అచ్యుత్ కుమార్, గరుడ రామ్, రంగనాయనా వంటివాళ్లు స్క్రీన్ మీద చేసిన మ్యాజిక్ భలే అనిపిస్తుంది.టెక్నికల్ వాల్యూస్ విషయానికి వస్తే కథ రొటీన్ కావడంతో సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడా కొత్తదనం ఫీలింగ్ రాదు. ఎందుకంటే ఏ సీన్ చూసినా ఎక్కడో చూశానే అనే ఫీలింగ్ కలుగుతుంది. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి తగ్గట్టుగా ఉంది. ఏజే శెట్టి సినిమాటోగ్రఫీ సినిమాకు ఆకర్షణగా నిలిచింది.(కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)రేటింగ్: 2.75 /5 -
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్‌కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
కన్నడ స్టార్ దర్శన్ కు మధ్యంతర బెయిల్
-
సంపాదన గురించి అడగదు, కానీ ఒక్క ప్రశ్న మాత్రం..: యష్
కేజీఎఫ్ సినిమాతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం ఇతడు టాక్సిక్ : ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. అలాగే భార్య రాధికతో తన అనుబంధం ఎలా ఉంటుందన్నది వెల్లడించాడు.నా అదృష్టంరాధిక నా జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం. తనే నా బలం. ఎప్పుడూ నాకు సపోర్ట్‌గా నిలబడుతుంది. నన్ను ఎంతగానో అర్థం చేసుకుంటుంది. మొదట తనను స్నేహితురాలిగా చూశాను. తర్వాత భార్యగా స్వీకరించాను. నాకు ఏది నచ్చుతుంది? ఏంటనేది అన్నీ తనకు బాగా తెలుసు. అలాగే ఏదైనా సినిమా చేసినప్పుడు నా రెమ్యునరేషన్ ఎంత? ఫలానా మూవీ వల్ల ఎంత డబ్బు వస్తుంది? ఎంత సంపాదిస్తున్నావ్? వంటి ప్రశ్నలు వేయదు.ఒకే ఒక్కే ప్రశ్నకేవలం ఒకే ఒక్కే ప్రశ్న అడుగుతుంది.. నువ్వు సంతోషంగానే ఉన్నావు కదా అని! తనతో, కుటుంబంతో గడిపేందుకు కొంత సమయం కేటాయించమని చెప్తూ ఉంటుంది. కానీ ఆ టైమే నాకు పెద్దగా దొరకదు. అయినా సరే నావంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నా ప్యాషన్ (సినిమా) కోసం ఏం చేయడానికైనా వెనుకాడను. ఈ విషయంలో ఫ్యామిలీ కూడా నాకు అండగా ఉంటుంది. కాకపోతే ఇంకా ఎన్ని రోజులు దూరంగా ఉంటావు? ఇంటికి ఎప్పుడు తిరిగొస్తావు? అని అడుగుతూ ఉంటారంతే అని చెప్పుకొచ్చాడు.ప్రేమ కహానీకాగా యష్, రాధిక 'నందగోకుల' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం తర్వాత ఫ్రెండ్షిప్గా, అనంతరం ప్రేమగా మారింది. మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి, శాంతు స్ట్రెయిట్ ఫార్వర్డ్, మొగ్గిన మనసు, డ్రామా వంటి చిత్రాల్లోనూ కలిసి యాక్ట్ చేశారు. 2016లో యష్-రాధిక పెళ్లి చేసుకోగా వీరికి ఆర్య, యాత్రవ్ అని పిల్లలు జన్మించారు.చదవండి: 'అతను ఒక పవర్‌హౌస్'.. మంచువిష్ణు స్పెషల్ విషెస్! -
అర్జున్ డైరెక్షన్లో కొత్త చిత్రం.. హీరోగా ఎవరంటే?
టాలీవుడ్ హీరో అర్జున్ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయనున్నారు. సీతా పయనం పేరుతో మూడు భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర మేనల్లుడు నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం ఒకేసారి విడుదల కానుంది. శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ చివరిసారిగా ప్రేమ బరహా అనే తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు.కాగా.. యాక్షన్ కింగ్‌గా పేరు తెచ్చుకున్న అర్జున్ సర్జా తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో నటించారు. కన్నడకు చెందిన అర్జున్ భాషతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్నారు. గతంలో దర్శకత్వం వహించిన సేవాగన్ (1992), జై హింద్ (1994),తాయిన్ మణికోడి (1998) లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయి. హీరోగానే కాకుండా, దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా పలు సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు అర్జున్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. View this post on Instagram A post shared by 𝙉𝙄𝙍𝙍𝘼𝙉𝙅𝘼𝙉 (@niranjansudhindra) -
టాక్సిక్ ఆగిపోయిందా..? రాకీ భాయ్ ఫ్యాన్స్ కు టెన్షన్..
-
కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిషబ్ శెట్టిని మోహన్‌లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్-1 లో మోహన్‌లాల్ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం)కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
బిగ్‌బాస్ ఎంట్రీపై నటి క్లారిటీ.. నాకు నేనే బాస్ అంటూ..
బిగ్‌బాస్ రియాలిటీ షో త్వరలో మొదలుకాబోతోంది. అవును, తమిళంలో బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్, హిందీలో 18వ సీజన్, కన్నడలో 11వ సీజన్ ప్రారంభానికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీల ఎంపిక ఓ కొలిక్కి రాగా సంబంధం లేని తారల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. వారిలో నటి హరిప్రియ ఒకరు.బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీఈమె కన్నడ బిగ్‌బాస్ 11వ సీజన్లో అడుగుపెడుతోందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. తాను ఏ రియాలిటీ షోలనూ పాల్గొనడం లేదంటూ పుకార్లకు చెక్ పెట్టింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చింది. నేను నా ఇల్లు దాటి ఎక్కడికీ వెళ్లడం లేదు. నాకు నేనే బాస్ అని రాసుకొచ్చింది. ఇకపోతే కన్నడ బిగ్‌బాస్ 11వ సీజన్ రేపటి (సెప్టెంబర్ 29) నుంచే ప్రారంభం కానుంది.సినిమా..కన్నడలో అనేక సినిమాలు చేసిన హరిప్రియ తకిట తకిట, పిల్ల జమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా, గలాట, జై సింహా, అలా ఇలా ఎలా వంటి పలు చిత్రాల్లో నటించింది.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
శాండల్‌వుడ్‌లో ‘శ్వా’ ఏర్పాటు కావాలి: సంజనా గల్రానీ
చలన చిత్రపరిశ్రమలో మహిళల భద్రత, సమాన గౌరవం, పని హక్కు వంటి అంశాలపై నటి సంజనా గల్రానీ కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆర్టిస్టు అసోసియేషన్‌తో కలిసి ఈ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ పని చేయాలి. ఓ నటికి ఉండాల్సిన కనీస హక్కులు గురించిన చర్చ జరగాలి. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల నిర్వహణ జరగాలి. ప్రస్తుతం తోటి పరిశ్రమల్లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి బ్లాక్ మార్క్స్ కన్నడ ఇండస్ట్రీపై పడకూడదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను.కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టిస్టు అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ అసోసియేషన్ల విలువైన సలహాలతో ‘శాండిల్‌వుడ్ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్’ (ఎస్డబ్ల్యూఏఏ – ‘శ్వా’) ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఈ ‘శ్వా’పై కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి’’ అని సంజన ఆ లేఖలో రాసుకొచ్చారు.అలాగే ఈ లేఖను పరిశీలించవలసినదిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, హోం మినిస్టర్ పరమేశ్వర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ లక్ష్మీ హెబ్బాల్కర్లను అడ్రస్ చేశారు సంజన. అలాగే సెట్స్‌లో నటీమణులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక క్యారవేన్ ఉండాలని, ఓ గది అయినా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని, రాత్రి షూట్ సమయంలో సరైన పరిస్థితులు ఉండాలని... ఇవన్నీ ‘శ్వా’కి ప్రాథమిక నియమాలుగా ఉండాలంటూ మరికొన్ని నియమాలను కూడా స్పష్టం చేశారు సంజన. -
ఓటీటీకి సూపర్ హిట్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన చిత్రం 'శాకాహారి'. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. కన్నడలో సూపర్‌హిట్‌గా నిలిచిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది.ఈనెల 24 నుంచి ఆహా స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ ప్రకటించారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు గొప్పరాజు రమణ ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పారు. ఓటీటీ ప్రియులను మెప్పించేందుకు వచ్చేస్తోంది. ఈ చిత్రంలో గోపాలకృష్ణ దేశ్ పాండే .. వినయ్ .. నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. Crime, emotions, and unexpected turns - #Shakhahaari has it all! Premiering on aha on Aug 24. pic.twitter.com/oortLZG2nH— ahavideoin (@ahavideoIN) August 21, 2024 -
కోట్ల అప్పు వల్లే ప్రాణాలు తీసుకున్న దర్శకుడు?
కన్నడ బుల్లితెర దర్శకుడు వినోద్ దొండే మరణవార్త టీవీ ఇండస్ట్రీలో విషాదం నింపింది. జూలై 20న ఆయన తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 20 ఏళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తున్న ఆయన అశోక్ బ్లేడ్ అనే సినిమాతో వెండితెరపైనా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. సినిమా షూటింగ్ 90 శాతం వరకు పూర్తయింది. కానీ అంతలోనే ఆయన ప్రాణాలు తీసుకోవడం అందరినీ కలవరపరిచింది. పెరిగిపోయిన బడ్జెట్తొలి సినిమా కోసం చేసిన అప్పులే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ విషయాన్ని సినీ నిర్మాత వర్ధన్ హరి వెల్లడించాడు. వర్ధన్ మాట్లాడుతూ.. '1970 బ్యాక్‌డ్రాప్‌లో అశోక బ్లేడ్ సినిమా తీస్తున్నాం. సతీశ్ నినాశం హీరోగా నటిస్తున్నాడు. ఇది వినోద్ డ్రీమ్ ప్రాజెక్ట్. గతేడాది మేలో షూటింగ్ ప్రారంభించాం. నిజానికి 45 రోజులే అనుకున్నాం. కానీ 87 రోజుల వరకు షూటింగ్ జరిగింది. రూ.1.5 కోట్లు బడ్జెట్ అనుకున్నాం. అది కూడా పెరుగుతూనే వస్తోంది. మళ్లీ ఇప్పుడు కొన్ని సన్నివేశాలను, ఓ పాటను, ఫైట్ సీన్‌ను రీషూట్ చేయాలనుకున్నాం. రూ.3 కోట్ల అప్పుఇదంతా చేయాలంటే ఎక్కువ డబ్బు కావాలి. దాని గురించి వినోద్ ఎక్కువగా కంగారుపడ్డాడు. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టేశాం.. ఇప్పుడెలా అని తనలో తానే మథనపడ్డాడు. మేము ఇంకో నిర్మాతను కలిసి సాయం కోరగా ఆయన సానుకూలంగా స్పందించాడు. అలా దీనికి పరిష్కారం కనుగొన్నాం. ఆ మీటింగ్ తర్వాత జూలై 19న రాత్రి వినోద్‌ను ఇంటి దగ్గర దిగబెట్టాను. కానీ తర్వాతిరోజే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు' అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం కోసం వివేక్ రూ.3 కోట్ల అప్పు తీసుకున్నాడు.చదవండి: ప్రభాస్ కల్కి మరో ఘనత.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్! -
పెళ్లికి రమ్మని ఆహ్వానించా.. దర్శన్ అమాయకుడు.. నిరపరాధిగా తిరిగొస్తాడు!
చిత్రదుర్గకు చెందిన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. పరప్పన అగ్రహార జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను దర్శక నటుడు తరుణ్ సుధీర్ శుక్రవారం కలిశాడు. కొన్ని రోజుల్లో తన వివాహానికి ముహూర్తం పెట్టినందున పెళ్లికి రమ్మని ఆహ్వానించడానికి జైలుకు వెళ్లినట్లు తెలిపాడు.అనారోగ్యం?తరుణ్ మాట్లాడుతూ.. 'దర్శన్ ఎప్పటిలాగే చిరునవ్వుతో పలకరించాడు. అయితే కొన్నిరోజులుగా ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేనట్లుంది. ఇప్పుడు కాస్త కోలుకున్నాడు. ఆయన అరెస్ట్ అయినప్పటి నుంచి మనమంతా కూడా ఏదో కోల్పోయినట్లుగా బలహీనమైపోయినట్లే అనిపిస్తోంది.పెళ్లికి ఆహ్వానంనా పెళ్లి కుదిరిన సంగతి దర్శన్‌కు తెలుసు. వెడ్డింగ్‌కు ఆహ్వానించడానికి వెళ్లాను. తన కోసం పెళ్లి వాయిదా వేసుకోవడం లాంటి పిచ్చి పనులు చేయొద్దని హెచ్చరించాడు. ఆయన ఏ పాపం చేయలేదని నేనిప్పటికీ నమ్ముతున్నాను. త్వరలోనే తను నిరపరాధిగా తిరిగొస్తాడు. నా పెళ్లికి హాజరవుతాడు అని చెప్పుకొచ్చాడు.కాంబినేషన్లో రెండు సినిమాలుకాగా తరుణ్, నటి సోనాల్ మాంటెరియోను వివాహం చేసుకోబోతున్నాడు. వీరి పెళ్లి వేడుకలు ఆగస్టు 10, 11 రోజుల్లో జరగనున్నాయి. ఇకపోతే తరుణ్ సుధీర్ దర్శకుడిగా.. దర్శన్‌తో కాటేర, రాబర్ట్ చిత్రాలు చేశాడు. వీరి కాంబినేషన్లో సింధూర లక్ష్మణ అనే చారిత్రాత్మక ప్రాజెక్టు రానున్నట్లు ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి.సంచలనంగా రేణుకాస్వామి హత్య కేసుహీరో దర్శన్ పదేళ్లుగా నటి పవిత్రగౌడతో ప్రేమాయణం నడిపిస్తున్నాడు. ప్రియురాలిపై అనుచిత కామెంట్లు చేశాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని దర్శన్ గ్యాంగ్ అతడిని దారుణంగా చంపేశారు. ఈ కేసులో దర్శన్, పవిత్ర గౌడ సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలే న్యాయస్థానం.. వీరి జ్యుడీషియల్ కస్టడీని ఆగస్టు 1 వరకు పొడిగించింది.చదవండి: 2024 OTT ఫస్టాఫ్: ఎక్కువమంది చూసిన సిరీస్, సినిమాలివే! -
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు. గురువారంనాడు హైకోర్టులో వీటిపై విచారణ సాగింది. ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు, చదవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయితే దర్శన్ ఎవరినీ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.దర్శన్ అండ్ గ్యాంగ్‌కు కస్టడీ పొడిగింపు ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనల తరువాత కస్టడీని పొడిగించారు.చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ -
విలన్‌గా సునీల్ ఎంట్రీ.. టీజర్ అదిరిపోయింది!
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్లో సుదీప్ డిఫరెంట్ లుట్లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.MAX Takes Charge! 💥👿🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024 -
కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి డెవిల్ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన మిలన ప్రకాశ్‌కు పోలీసులు మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారంనాడు ప్రకాశ్ విజయనగర ఏసీపీ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని శనివారం పోలీసులు ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చారు. రేణుకాస్వామి హత్య తరువాత హీరో దర్శన్ మైసూరులో డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ అంశాలపై సమాచారం కోసం ప్రకాశ్‌ను విచారించారు. 66 వస్తువుల సీజ్ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్ఫోన్లో కలిపి మొత్తం 66 వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. రేణుకాస్వామి దుస్తులు, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, దాడికి వాడిన వస్తువులు తదితరాలను సేకరించారు.కరావళి నుంచి దర్శన్ ఔట్?పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న దర్శన్‌కు మరో షాక్ తగిలింది. కొత్తగా నిర్మిస్తున్న కరావళి సినిమా నుంచి దర్శన్‌ను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న కరావళిలో దర్శన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన పోస్టర్లో దర్శన్ కనిపించలేదు. దర్శన్ స్థానంలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది దర్శన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. -
డిప్రెషన్లో దర్శన్ భార్య.. ఎప్పుడూ భర్త కోసమే తపించేది!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడ కోసం తన గ్యాంగ్‌తో కలిసి రేణుకాస్వామిని చంపేశాడన్న ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో అందరూ దర్శన్‌ను తప్పుపడుతుండగా ఆయన అభిమానులు మాత్రం హీరోను వెనకేసుకొస్తున్నారు.డిప్రెషన్దర్శన్ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరుగని అతడి సతీమణి విజయలక్ష్మి ఇబ్బందులు పడుతోందంటోంది సింగర్ షమిత మల్నాడ్. ఆమె మాట్లాడుతూ... జరిగిన సంఘటన వల్ల విజయలక్ష్మి డిప్రెషన్‌కు లోనవుతోంది. బయటకు మాత్రం ధైర్యంగా ఉంటోంది. ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న మమ్మల్ని సముదాయిస్తోంది. ఏం జరగదు.. కంగారు పడకూడదని అటు మాకు, ఇటు అభిమానులకు ధైర్యం చెప్తోంది. అయినా తను ఈ ఒత్తిడి నుంచి త్వరగానే బయటపడుతుంది. తను చాలా స్ట్రాంగ్ మహిళ.. ఈ పరిస్థితిలో తన కుమారుడిని ఎలా చూసుకోవాలి? అటు దర్శన్‌కు ఎలా ధైర్యం చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెలా ధైర్యంగా నిలబడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మాది 20 ఏళ్ల స్నేహం. ఇన్నేళ్లలో తను ఎప్పుడూ కుమారుడికి, భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. తన కుటుంబాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం కానివ్వదు అని షమిత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan)చదవండి: మామూలు ఖైదీగానే దర్శన్ -
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
ఎంతోమంది దర్శన్‌ను మోసం చేశారు.. ఆయనెవర్నీ మోసగించలేదు
బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసుల దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే కన్నడ హీరో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర సహా మొత్తం 17 మంది పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రియురాలికి అశ్లీల సందేశాలు పంపాడన్న కోపంతో అభిమాని రేణుకాస్వామిని చంపిన దర్శన్‌పై జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు.తిడతారని తెలుసుఅయితే కొందరు మాత్రం దర్శన్నే వెనకేసుకొస్తున్నారు. తాజాగా నటి సోను గౌడ ఆ జాబితాలోకి చేరింది. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడు నన్ను ఎంతోమంది తిడతారని నాకు తెలుసు. కానీ ఒక్కసారి అభిమానం పెంచుకున్నాక అది ఎల్లప్పటికీ అలాగే ఉంటుంది. నేను దర్శన్‌కు అభిమానిని. ఆయన వల్ల లాభం పొందిన ఎంతోమంది ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. చాలామంది ఆయన్ను మోసం చేశారు కానీ ఆయన ఎన్నడూ ఇతరుల్ని మోసగించలేదు.అమాయకుల జీవితం జైల్లో..ఏ పాపం చేయకపోయినా నన్ను కూడా ఓసారి జైల్లో వేశారు. నేను మాట్లాడాల్సిన సమయం వచ్చిందనే పెదవి విప్పాను. ఎవరో ఏదో అనుకుంటారని నేను భయపడను. చాలామంది అమాయకుల జీవితం కూడా జైల్లోనే గడిచిపోతుంది. నిజంగా తప్పు చేసినవారికి తప్పకుండా శిక్ష పడాల్సిందే! దర్శన్‌కు తమ్ముడిని, అన్నను, అంకుల్‌ను అంటూ చెప్పుకుతిరిగినవారంతా ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు.అదే ఆయన్ను కాపాడుతుందిపరిస్థితులు ఎలా ఉన్నా సరే దర్శన్‌కు సపోర్ట్ చేయడం నా బాధ్యత. దర్శన్ చిత్తశుద్ధే ఆయన్ను కాపాడుతుంది అని చెప్పుకొచ్చింది. కాగా సోను శ్రీనివాస గౌడ.. కన్నడ బిగ్‌బాస్ ఓటీటీలో పాల్గొంది. ఆ మధ్య ఎనిమిదేళ్ల చిన్నారిని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచింది. నిబంధనలు పాటించకుండా చిన్నారిని దత్తత తీసుకోవడంతో పాటు, ఆ పాపను పబ్లిసిటీ కోసం వాడుకుంటోందని పోలీసులు సోనును అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం నటి బెయిల్‌పై బయటకు వచ్చింది.చదవండి: కల్కి మూవీ.. ఇంతలా అరిచి ఎన్నాళ్లయిందో: రేణు దేశాయ్ -
పోలీసుల సమక్షంలో మేకప్.. మరో వివాదంలో పవిత్ర గౌడ్
-
రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్‌కు యాంకర్ సపోర్ట్
స్క్రీన్‌పై హీరోగా మెప్పించే దర్శన్ నిజ జీవితంలో మాత్రం కరడుగట్టిన విలన్‌గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న నెపంతో తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా చంపాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఒక్కసారి ఆ బంధంలో..ఈ కేసు విషయంలో అందరూ దర్శన్‌ను దుమ్మెత్తిపోస్తుండగా యాంకర్ హేమలత మాత్రం హీరోకు మద్దతుగా నిలబడింది. ఇక నా వల్ల కావడం లేదు. ఎవరు ఏమైనా అనుకోని.. ఒకరిపై మనం పెంచుకున్న ప్రేమకు, స్నేహానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఒక్కసారి స్నేహం అనే బంధంలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటకు రాలేము. అప్పుడు, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని వదిలేయాలని అనుకోము. ఆ గౌరవం అలాగే..జరిగిన ఘటన గురించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మీ(దర్శన్) మీద ఉన్న ప్రేమ, గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టుకు దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోను జత చేసింది.చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా? -
రేణుకాస్వామి.. నాక్కూడా అసభ్య సందేశాలు పంపాడు: నటి
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఊచలు లెక్కపెడుతున్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడకు అసభ్య సందేశాలు పంపాడన్న కోపంతో దర్శన్, అతడి గ్యాంగ్ రేణుకాస్వామిని దారుణంగా కొట్టి చంపారు. అశ్లీల ఫోటోలు పంపడం రేణుకాస్వామి చేసిన తప్పయితే.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అతడి ప్రాణాలు తీయడం దర్శన్ గ్యాంగ్ చేసిన ఘోర తప్పిదం.ఎవరికీ సపోర్ట్ చేయడం లేదుఅయితే రేణుకాస్వామి తనక్కూడా అసభ్య ఫోటోలు పంపాడంటోంది కన్నడ నటి చిత్రల్ రంగస్వామి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన వీడియోలో నటి మాట్లాడుతూ.. 'ప్రస్తుతం దేని గురించి చర్చ జరుగుతుందో అందరికీ తెలిసిందే! ఆ విషయంలో అంతా బాధగానే ఉన్నారు. రేణుకాస్వామి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ కేసు విషయంలో నేను ఎవరికీ సపోర్ట్ చేయడం లేదు. కానీ రేణుకాస్వామి చాలామందికి అశ్లీల మెసేజ్‌లు పంపాడన్నది మాత్రం వాస్తవం. పోలీస్ స్టేషన్లోనూ తనపై కేసు నమోదైంది.పనికిమాలిన మెసేజ్లుఅలాగే అతడు గౌతమ్ అనే ఫేక్ అకౌంట్‌తో చాలామందికి పనికిమాలిన మెసేజ్‌లు చేసేవాడు. ఆ స్క్రీన్షాట్లను నేనిప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తే బాగోదు. కాబట్టి అవి పోస్ట్ చేయడం లేదు. దుస్తుల్లేకుండా ఫోటో లేదా అశ్లీలమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుంటే నేనైతే బ్లాక్ చేసేదాన్ని. కానీ ఇక్కడ ఆశ్చర్యమేంటంటే.. నా ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లాక్ చేసిన లిస్టులో ఆల్రెడీ ఇతడి అకౌంట్ కూడా ఉంది. చాలారోజులుగా మౌనంగానే ఉన్నాను. జరుగుతున్న పరిణామాలను చూసి పెదవి విప్పాలనుకున్నాను' అని చిత్రల్ పేర్కొంది. కాగా చిత్రల్ రంగస్వామి బాడీ బిల్డర్. పలు సినిమాల్లో నటించింది. కన్నడ బిగ్‌బాస్ 10వ సీజన్లోనూ పాల్గొంది.చదవండి: థర్డ్ హ్యాండ్ కారు.. వర్షం వస్తే కారులో వాటర్ లీకేజీ.. -
పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే..
చందన్ శెట్టి, నివేదిత గౌడ.. కన్నడ బిగ్‌బాస్ రియాలిటీ షోలో వీళ్లిద్దరూ కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చాక భార్యాభర్తలయ్యారు. 2020 ఫిబ్రవరి 6న ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కరోనాను సైతం లెక్క చేయకుండా సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. కానీ ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయారు. ఇకపై నీకు, నాకు ఏ సంబంధమూ లేదంటూ విడాకులు తీసుకున్నారు.నో 'ఇగో'తాజాగా ఓ ఇంటర్వ్యూలో చందన్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నాకు ఎటువంటి ఇగో లేదు. కాకపోతే డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టే అలవాటు ఉండేది. అలాంటప్పుడే కరోనా నాకు గుణపాఠం నేర్పింది. డబ్బును ఎలా వాడాలో తెలిసొచ్చేలా చేసింది. అప్పటివరకు పైసా అంటే లెక్క లేకుండా పోయింది. నేను చేసిన ప్రాజెక్టులు సక్సెస్ అవుతున్న సమయంలో ఈ మహమ్మారి వచ్చింది. అలా కోవిడ్ టైంలోనే నా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి వేడుకల కోసం దాదాపు రూ.50-60 లక్షలు ఖర్చు పెట్టాను. తెలిసొచ్చిందిఉన్నదంతా ఖర్చయ్యాక డబ్బు అవసరం తెలిసొచ్చింది. మళ్లీ చాలా కష్టపడ్డాను. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కాను. ఎప్పుడేమవుతుందో తెలియని అయోమయంలో ఉండేవాడిని. నేను కంపోజ్ చేసిన ఏ పాట హిట్టవుతుందో? ఏది ఫ్లాప్ అవుతుందో? అని భయంభయంగా ఉండేది. ఒకటి మాత్రం నిజం.. జీవితంలో నెక్స్ట్ ఏం జరుగుతుందనేది ఎవరూ అంచనా వేయలేరు' అని చెప్పుకొచ్చాడు.చదవండి: అందరూ ఏడిపించారు.. పేరు మార్చుకోక తప్పలేదు: అడివి శేష్ -
దర్శన్ కేసు.. హత్య తర్వాత అతను ఏం చేశాడంటే?
కన్నడ హీరో దర్శన్ కేసు శాండల్‌వుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు దర్యాప్తులో సంచలన విషయాలు బయటికొస్తున్నాయి. తాజాగా దర్శన్ భార్య విజయలక్ష్మిని సైతం పోలీసులు విచారించారు. ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. ఆమె ఉంటున్న ఫ్లాట్‌లో దర్శన్ షూస్ గుర్తించిన పోలీసులు.. కీలక ఆధారాలు సేకరించారు. ఇద్దరూ విడివిడిగానే ఉంటున్నప్పటికీ ఆమె నివాసంలో దర్శన్ బూట్లు కనిపించడంతో ఆమెను ప్రశ్నించారు.అయితే తాజాగా పోలీసుల దర్యాప్తులో మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. రేణుకాస్వామి హత్యం అనంతరం దర్శన్ తన భార్య విజయలక్ష్మి ఉంటున్న ఫ్లాట్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత అక్కడే భార్యతో కలిసి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత దర్శన్ మైసూరుకు వెళ్లిపోయాడు. అయితే ఈ కేసులో ఆయన భార్యను దాదాపు ఐదుగంటల పాటు విచారించిన పోలీసులు ఆమె పేరును సాక్షిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈనెల 9న బెంగళూరులో రేణుకాస్వామి అనే అభిమాని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో హీరో దర్శన్‌తో పాటు అతని ప్రియురాలు పవిత్ర గౌడ, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. -
దర్శన్ నా గురువు.. ఆయన ఇలా చేశారంటే..: హీరోయిన్
కొద్దిరోజులుగా హీరో దర్శన్ పేరు మారుమోగిపోతోంది. తనేదో మంచి పని చేసినందుకు కాదు.. తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి క్రూరంగా చంపినందుకు! జూన్ 11న రేణుకాస్వామి హత్య జరగ్గా.. ఈ కేసులో దర్శన్, అతడి ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు పలువురినీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారం గురించి కన్నడ హీరోయిన్ రచితా రామ్ తాజాగా స్పందించింది. ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. దర్శన్.. గురువుదర్శన్.. నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఆయన నాకు గురువులాంటివారు. నేనేదైనా తప్పు చేస్తే సరిదిద్దుతూ సలహాలు ఇచ్చే వ్యక్తి ఇలాంటి కేసులో భాగమయ్యారంటే నమ్మలేకపోతున్నాను. పోలీసులు నిజాన్ని వెలికితీస్తారని ఆశిస్తున్నాను. మీడియా కూడా పక్షపాతం లేకుండా వ్యవహరిస్తుందని భావిస్తున్నాను. న్యాయం గెలుస్తుందిరేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలి. అతడి కుటుంబం ధైర్యాన్ని కూడదీసుకోవాలి. ఈ కేసులో న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నాను అని రాసుకొచ్చింది. కాగా రచితా రామ్ తొలి సినిమా బుల్బుల్. ఈ మూవీలో దర్శన్ హీరోగా, రచిత హీరోయిన్గా నటించింది. వీరిద్దరూ అంబరీష, జగ్గు దాదా, అమర్, క్రాంతి చిత్రాల్లో కలిసి యాక్ట్ చేశారు. కన్నడలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో 'సూపర్ మచ్చి' మూవీతో పలకరించింది. View this post on Instagram A post shared by Rachitaa Ram (@rachita_instaofficial)చదవండి: షారూఖ్ ఖాన్‌కు యాటిట్యూడ్? బిగ్‌బీని తక్కువ చేసి.. -
దర్శన్ రాక్షసుడు.. శాఖాహారి నటితో నాన్‌వెజ్ తినిపించాడు!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్‌ను కఠినంగా శిక్షించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. కన్నడ బిగ్‌బాస్ 9వ సీజన్ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి సైతం హీరోను ఎట్టి పరిస్థితిలోనూ వదిలిపెట్టకూడదని కోరుతున్నాడు. దర్శన్ తన గ్యాంగ్‌తో కలిసి శాఖాహారి అయిన రేణుకాస్వామి నోట్లో బలవంతంగా మాంసం ముక్కలు కుక్కి, విచక్షణారహితంగా దాడి చేసి చంపేసిన సంగతి తెలిసిందే! అయితే గతంలోనూ దర్శన్ శాఖాహారి అయిన ఓ నటితో మాంసం తినిపించాడని ప్రశాంత్ ఆరోపించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు.అతడు హీరో కాదుదర్శన్ హీరో కాదు కేవలం నటుడు మాత్రమే! అతడు చేసిన దారుణాలు ఎన్నో ఉన్నాయి. రేణుకాస్వామి తాను శాఖాహారి అని చెప్తున్నా వినకుండా ఈ రౌడీ బాస్ బలవంతంగా మాసం తినిపించాడు. మూడేళ్ల క్రితం ఇలాంటి సంఘటనే జరిగింది. దర్శన్‌తో షూటింగ్ చేస్తున్న ఓ కన్నడ నటి శాఖాహారం తెప్పించమని అడిగింది. రాక్షసుడుఆమె పూర్తిగా వెజిటేరియన్. అయినా సరే తన మాటల్ని లెక్క చేయలేదు. దర్శన్ ఆదేశించడంతో అక్కడున్న వాళ్లు భోజనంలో నాన్‌వెజ్ కలిపి తీసుకొచ్చారు. అది తెలియక నటి భోజనం చేస్తుండగా అతడు దుర్యోధనుడిలా పగలబడి నవ్వాడు. దర్శన్ మనిషి కాదు నరరూప రాక్షసుడు. అలాంటివారికే ఇలాంటి ఆలోచనలు వస్తాయి అని ఫేస్బుక్లో రాసుకొచ్చాడు. గత కొన్ని రోజుల క్రితం దర్శన్ గురించి మరో పోస్ట్ కూడా షేర్ చేశాడు.రౌడీ బాస్..'కన్నడ సినిమా ఇండస్ట్రీలోని ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ నా స్నేహితుడు. అతడు ఓ టీవీ రియాలిటీ షోకి జడ్జిగా వ్యవహరించాడు. రెండేళ్ల క్రితం గుండెపోటుతో చనిపోయాడు. ఆ గుండెపోటుకు కారణం ఈ రౌడీ బాసే (డీ బాస్ ఇప్పుడు రౌడీ బాస్ అయ్యాడు)! ఈ ఆరడుగుల మృగం తనను మానసికంగా వేధించాడు.. బెదిరింపులకు పాల్పడ్డాడు. దానివల్లే ఆయన మరణించాడు' అని పేర్కొన్నాడు.చదవండి: తెలుగు సినిమాల్లో నటించకపోవడానికి కారణం ఇదే: విజయ్ సేతుపతి -
ఆ సినిమాలను తీసుకోని ఓటీటీలు.. అదే కారణమా?
777 చార్లీ, సప్త సాగరాలు దాటి వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన శాండల్‌వుడ్ హీరో, డైరెక్టర్ రక్షిత్ శెట్టి. తాజాగా ఆయన ఓటీటీలోనూ ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన నిర్మాతగా తెరకెక్కించిన ఏకం వెబ్ సీరిస్ త్వరలోనే విడుదల కానుంది. ఈ సిరీస్ రిలీజ్ చేసేందుకు దాదాపు మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఏ ఓటీటీ వేదికలు కూడా ముందుకు రావడం లేదు. దీంతో రక్షిత్ శెట్టి ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ సినిమాలకు విలువ లేదా అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు.రక్షిత్ శెట్టి తన ట్వీట్లో రాస్తూ..'జనవరి 2020లో ఏకమ్ సిరీస్ రిలీజ్ చేద్దామనుకున్నాం. కన్నడలో వెబ్ సిరీస్‌కి అదే సరైన సమయం అనిపించింది. ఆ తర్వాక కరోనా మహమ్మారి అంతా తలకిందులైంది. దీంతో మే ఏకం సిరీస్ వాయిదా వేసుకున్నాం. అక్టోబర్ 2021లో ఏకమ్ ఫైనల్ కాపీ చూశాను. అది చూసి థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత దాన్ని ప్రపంచానికి చూపించడానికి రెడీ అయ్యాను. కానీ గత రెండేళ్లలో ఏకం సిరీస్ కోసం మేము ప్రయత్నించని ఓటీటీ లేదు. ప్రతిసారీ మాకు నిరాశే ఎదురైంది. ఏదేమైనా కంటెంట్ సత్తాను నిర్ణయించే హక్కు ప్రేక్షకులకు మాత్రమే ఉందని నమ్మాను. అందుకే మా సొంత వేదికపై తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ఇది ఒక ప్రయత్నం మాత్రమే. దీనిని అందరు గుర్తించి మెచ్చుకోవాలి.' అని రాసుకొచ్చారు. అయితే కన్నడ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు ఎదురవ్వడం మొదటిసారి కాదని రక్షిత్ శెట్టి అన్నారు. కన్నడ పరిశ్రమ కంటెంట్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఎందుకు తీసుకోవడం లేదన్న విషయంపై కన్నడ డైరెక్టర్ అనూప్ భండారి మాట్లాడారు. 2022కి ముందు కన్నడ కంటెంట్ కొనుగోలు చేయడంలో విముఖత ఉన్న మాట నిజమే.. కానీ.. ఆ ఏడాది నుంచే కన్నడ సినిమాకు మంచి గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలతో కన్నడ చిత్ర పరిశ్రమకు గుర్తింపు దక్కిందన్నారు.అయితే కన్నడ సినిమా కంటెంట్‌పై ఉన్న నమ్మకం కొంతవరకు కోల్పోయామని గతంలోనే సప్త సాగరాలు దాటే ఎల్లో మూవీ దర్శకుడు హేమంత్ రావు అన్నారు. కన్నడ కంటే మలయాళం, హిందీ, తమిళ, తెలుగు కంటెంట్‌కే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. కన్నడ కంటెంట్‌ను ఎందుకు కొనుగోలు చేయడం లేదో అర్థం కావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తెలుగు సినిమా కర్ణాటకతో పాటు మలయాళంలో కూడా మంచి బిజినెస్ చేస్తుందని ఆయన అన్నారు. ఈ విషయంలో ఒక్క శాండల్‌వుడ్‌లో మాత్రమే వెనక ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. కర్ణాటకలో తెలుగు సినిమాలకు వస్తున్న కలెక్షన్స్ కన్నడ చిత్రాలకు రావడం లేదని వెల్లడించారు. -
సంక్షోభంలో శాండల్‌వుడ్
సాక్షి, బెంగళూరు: కన్నడ చలనచిత్ర పరిశ్రమ శాండల్‌వుడ్ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు ప్రేక్షకులు థియేటర్లకు ముఖం చాటేస్తుండడంతో వాటిని మూసేయాల్సిన దుస్థితి తలెత్తింది. మరోవైపు నటీనటుల జీవితాల్లో సంక్షోభాలు ఏర్పడుతున్నాయి. హీరో హీరోయిన్లే కాకుండా కొన్ని సినీ నిర్మాణ సంస్థలు, నిర్మాతలు పలు వివాదాల్లో చిక్కుకుంటూ శాండల్‌వుడ్‌కు ఏమైంది అనేలా తయారయ్యారు. హత్యలు, విడాకులు, కుమ్ములాటలతో చందనసీమ నలిగిపోతోంది. ఒకప్పుడు కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్, రెబెల్ స్టార్ అంబరీష్, సాహససింహ విష్ణువర్ధన్, శంకర్‌నాగ్ వంటి మహామహులతో విరాజిల్లిన శాండల్‌వుడ్ ఇప్పుడు సంక్షోభాన్నే చవిచూస్తోంది.థియేటర్లు వెలవెలఈ ఏడాది ప్రారంభం నుంచి కన్నడ కళాకారులు, సాంకేతిక నిపుణులు వ్యక్తిగత జీవితాలతో పాటు అనేక నెగెటివ్ వార్తలతో చిత్రపరిశ్రమ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గడిచిన ఆరునెలల్లో వందకు పైగా సినిమాలు విడుదల కాగా అందులో భారీ స్థాయిలో హిట్ అయిన సినిమా ఒక్కటీ లేకపోవడం చందనవనాన్ని కలవరపరుస్తోంది. అంతేకాకుండా నేటితరం ప్రేక్షకులు థియేటర్లకే రావడం లేదు. అలాగే సినిమాలను ఏ టీవీ చానెల్ కానీ, ఓటీటీ సంస్థలు కానీ కొనుగోలు చేయడం లేదని కన్నడ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులి మీద పుట్రలా దర్శన్ వంటి బడా హీరోలు హత్య కేసుల్లో ఇరుక్కోవడంతో చిత్రపరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. రేణుకాస్వామి అనే వ్యక్తి హత్య కేసులో చాలెంజింగ్ స్టార్, నటుడు దర్శన్, నటి పవిత్ర, మరో 12 మందికి పైగా అనుచరులు అరెస్టు అయ్యారు. ఒక స్టార్ నటుడు హత్య కేసులో భాగం కావడం ఇంతవరకు జరగలేదు.గోవాలో నిర్మాతల గొడవఇటీవల కన్నడ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ఎన్ఎం సురేశ్‌తో పాటు తదితర చిత్రరంగ ముఖ్యులు గోవాకు వెళ్లారు. కొందరు అక్కడ గొడవ పడ్డారు. ఈ గొడవలో నిర్మాత గణేశ్‌పై దాడి కూడా జరిగింది.కాపురాల్లో కలతలుశాండల్వుడ్లోని ప్రముఖులు ఇటీవల ఒక్కొక్కరే విడాకుల పేరుతో రచ్చకెక్కుతున్నారు. రియాల్టీ షో కలసికట్టుగా కనిపించిన చందన్ శెట్టి–నివేదిత ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ చకచకా తమ నిజజీవితంలో అడుగులు వేశారు. అయితే మూణ్నాళ్ల ముచ్చటే అన్నట్లు పెళ్లి అయిన మూడేళ్లకే వీరిద్దరూ విడిపోతామని కోర్టును ఆశ్రయించడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఇద్దరికీ పొసగక విడాకులకు సిద్ధమయ్యారు. కన్నడ కంఠీరవ దివంగత నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ కుటుంబంలో కూడా విడాకుల ఉదంతం వెలుగు చూసింది. కొన్నేళ్ల క్రితం ప్రేమించి, ఇంట్లో పెద్దలను ఒప్పించి యువ రాజ్‌కుమార్, శ్రీదేవీ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి మధ్య కలతలు రావడంతో విడిపోతామని శ్రీదేవి ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో పెద్ద ఇంటిగా పేరుగాంచిన రాజ్‌కుమార్ కుటుంబంలో విడాకుల పేరు వినిపించడం కలకలం రేపింది. మరో స్టార్ నటుడు దునియా విజయ్ సంసారంలో కూడా అలజడులతో సాగుతోంది. ఇటీవల ఆయన దాఖలు చేసిన విడాకులు కేసును న్యాయస్థానం కొట్టివేసింది. మొదటి భార్య నాగరత్నకు విడాకులు ఇవ్వకుండానే కీర్తి గౌడను దునియా విజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు. -
'ఒకరిని కొట్టి చంపే హక్కు నీకెక్కడిది' దర్శన్‌పై నటి ఆగ్రహం
లక్షలాది మంచి అభిమానులను సంపాదించుకున్న హీరో దర్శన్ సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. సినిమాలో మంచి పాత్రలు చేసే ఆయన నిజ జీవితంలో విలన్‌గా మారాడు. తన ప్రేయసి పవిత్రపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని తన అభిమాని, ఫార్మా ఉద్యోగి రేణుకా స్వామిని దారుణంగా చంపాడు. చిత్రదుర్గ్ దర్శన్ ఫ్యాన్ క్లబ్ కన్వీనర్ రాఘవేంద్ర (రఘు)తో కలిసి బెల్ట్, కర్రలతో బాది, గోడకేసి కొట్టి చంపి, తర్వాత బాడీని మురికి కాలువలో పడేశారని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు.కొట్టి చంపే హక్కు నీకెక్కడిది?తాజాగా ఈ వ్యవహారంపై నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన(రమ్య) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరిచ్చారు? ఎవరైనా మనల్ని ఎక్కువగా ఇబ్బందిపెడితే వారి అకౌంట్ బ్లాక్ చేయాలి. అయినా అదేపనిగా ట్రోల్ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేకానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారా? ఒక మనిషిని కొట్టి చంపే అధికారం ఎవరికీ లేదు. ఈ కేసును డీల్ చేస్తున్న పోలీసులను తప్పకుండా ప్రశంసించాల్సిందే! తీర్పు వచ్చేవరకు ఆగండిమీరు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా పారదర్శకంగా విచారణ చేపడతారని ఆశిస్తున్నాను. ప్రజల్లో చట్టంపై నమ్మకాన్ని పెంపొందిస్తారని భావిస్తున్నాను అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. మరోవైపు హీరోయిన్ సంజన గల్రానీ.. దర్శన్‌ను వెనకేసుకొచ్చింది. సెలబ్రిటీలపై ఏవైనా ఆరోపణలు వచ్చాయంటే చాలు వెంటనే తప్పు చేశారని నమ్మేస్తారు. ఇంకా విచారణ జరుగుతోంది. అప్పుడే తుది నిర్ణయానికి వచ్చేయకండి అని పేర్కొంది.ఆ కారణం వల్లేకాగా దర్శన్‌కు విజయలక్ష్మి అనే భార్య ఉంది. ఇల్లాలిని పట్టించుకోకుండా నటి పవిత్రగౌడతో రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. దాదాపు పదేళ్లుగా పవిత్రతో కలిసుంటున్నాడు. భార్యను వదిలేసి ప్రియురాలితో తిరగడం అతడి అభిమాని రేణుకాస్వామికి నచ్చలేదు. ఆ కోపంతోనే పవిత్రకు అసభ్యంగా మెసేజ్‌లు పెట్టడం ప్రారంభించాడు. ఇది తారా స్థాయికి చేరడంతో పవిత్ర.. దర్శన్‌కు ఫిర్యాదు చేసింది. అతడు మందలించాల్సింది పోయి ఏకంగా అభిమాని ప్రాణాలే తీయడం శోచనీయం.చదవండి: సుశాంత్.. నువ్వు బతికే ఉన్నావ్..! -
అక్రమ సంబంధం వద్దన్నందుకు అభిమానిని చంపిన నటుడు
-
సినిమాను మించిన ట్విస్ట్‌లు.. దర్శన్ కేసులో విస్తుపోయే నిజాలు!
ఇటీవలే కాటేరా మూవీతో హిట్ కొట్టిన శాండల్‌వుడ్ హీరో దర్శన్ పేరు ప్రస్తుతం ఎక్కడ చూసినా మార్మోగిపోతోంది. తన అభిమాని అయిన రేణుకాస్వామిని(28) హత్య చేసినట్లు ఆయనపై ఆరోపణలు రావడం కన్నడ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఈ కేసులో మరో నటి, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు ఇదంతా చూస్తుంటే ఓ క్రైమ్ సినిమాను తలపించేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరో వైపు అసలు పవిత్ర గౌడ ఎవరు? అని తెగ ఆరా తీస్తున్నారు. అసలు ఆమెకు, దర్శన్‌కు మధ్య రిలేషన్ ఏంటని శాండల్‌వుడ్‌లో చర్చించుకుంటున్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకున్నారా? లేదా సహజీవనం చేస్తున్నారా? అన్న విషయాలపై నెట్టింట తెగ వెతికేస్తున్నారు.నటిగా ఎంట్రీ ఇచ్చి...మొదట టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పవిత్ర సినిమాల్లోనూ నటించింది. 2016లో 54321 అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కన్నడలో సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రెడ్ కార్పెట్ స్టూడియో 777 పేరిట ఒక బొటిక్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అయితే ఇటీవలే ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన వీడియో కలకలం సృష్టించింది. మా బంధానికి పదేళ్లు అంటూ దర్శన్‌తో ఉన్న ఫోటోలను పవిత్ర పంచుకుంది.దర్శన్‌కు పెళ్లి.. పవిత్ర గౌడతో సహజీవనంమరోవైపు ఈ కేసులో పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. హీరో దర్శన్‌కు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తున్నాడు. వీరిద్దరి రిలేషన్ వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని అశ్లీల సందేశాలు పోస్ట్ చేేసినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని దర్యాప్తులో వెల్లడైంది. హత్య అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు రూ.30 లక్షలు ఇస్తానని దర్శన్ తమకు ఆఫర్ ఇచ్చాడని ముగ్గురు నిందితులు వెల్లడించారు. -
కేజీఎఫ్ హీరో సూపర్ హిట్ చిత్రం.. తెలుగులో రిలీజ్ ఎప్పుడంటే?
కేజీఎఫ్ హీరో యశ్, షీనా జంటగా నటిస్తోన్న చిత్రం రాజధాని రౌడీ. ఈ సినిమా కేవీ రాజు దర్శకత్వంలో తెరకెక్కించారు. డ్రగ్స్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సంతోష్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సంతోశ్ కుమార్ మంచి సందేశం ఇచ్చేలా ఈ మూవీని నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మూవీ నిర్మాత సంతోష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.సంతోష్ కుమార్ మాట్లాడుతూ..'మాదకద్రవ్యాలు, మద్యపానంతో నలుగురు యువకులు తమ జీవితాల్ని ఎలా నాశనం చేసుకున్నారు అనే కథే రాజధాని రౌడీ చిత్రం. వినోదానికి, సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ, ఆలోచన రేకెత్తించే ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్‌గా అద్భుతమైన నటన ప్రదర్శించారు. ముమైత్ ఖాన్ తన అందాలతో కనువిందుచేస్తారు. అర్జున్ జన్య అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. తెలుగు ప్రేక్షకులందరు ఈ చిత్రాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నా' అని అన్నారు. -
బిగ్‌బాస్ షోలో లవ్, పెళ్లి.. నాలుగేళ్లకే విడాకులు!
బిగ్‌బాస్ షోలో చూపించే లవ్ అంతా ఉట్టిదే అని చాలామంది అంటుంటారు. కానీ తమ ప్రేమ నిజమైనదని, అగ్నిలాగ స్వచ్ఛమైనదంటూ కన్నడ బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ చందన్ శెట్టి, నివేదిత గౌడ నిరూపించారు. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక పెళ్లి చేసుకున్నారు. 2020 ఫిబ్రవరి 26న ఎంతో గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. హనీమూన్‌కు నెదర్లాండ్‌కు వెళ్లి వచ్చారు.ట్విస్ట్ ఇచ్చిన జంటసోషల్ మీడియాలోనూ తరచూ జంటగా ఉన్న పిక్స్ షేర్ చేస్తూ ఉండేవారు. ఇంత అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు కలకాలకం కలిసుంటారనుకున్న అభిమానులకు వీరు పెద్ద ట్విస్టే ఇచ్చారు. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయించుకున్నారట! బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు సైతం దరఖాస్తు చేశారని ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై ఇంతవరకు చందన్, నివేదిత గౌడ స్పందించనేలేదు.బిగ్‌బాస్ షోలో..కాగా చందన్ శెట్టి రైల్వే చిల్డ్రన్, జోష్లే, పొగరు, చూ మంతర్ వంటి కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సొంతంగా పాటలు కూడా వదిలేవాడు. కన్నడ బిగ్‌బాస్ ఐదో సీజన్లో విజేతగా నిలిచాడు. ఇదే సీజన్లో నివేదిత కూడా పార్టిసిపేట్ చేసింది. మొదట ఫ్రెండ్సయిన వీరు తర్వాత రిలేషన్లోకి దిగారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్లు జంటగా నటించిన క్యాండీ క్రష్ సినిమా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. -
సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన హిట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
నా సామిరంగ సినిమాతో తెలుగువారి మనసు దోచేసింది ఆషిక రంగనాథ్. ప్రస్తుతం తెలుగులో విశ్వంభర సినిమా చేస్తోంది. ఈమె చివరగా O2 అనే కన్నడ సినిమాలో కనిపించింది. ఇందులో డాక్టర్ శ్రద్ధగా మెప్పించింది. మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీకి రాఘవ్ నాయక్ - ప్రశాంత్ రాజ్ ద్వయం దర్శకత్వం వహించారు. డైరెక్టర్ రాఘవ్ నాయక్ సినిమాలోనూ ముఖ్య పాత్రలో నటించారు. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తాజాగా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి కేవలం కన్నడ వర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: విశ్వక్ సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' ట్విటర్ రివ్యూ -
సీరియల్లో హెల్మెట్ లేకుండా స్కూటీ నడిపిన నటి.. ఫైన్ కట్టాల్సిందే!
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు నిబంధనలు పాటించకుంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తారు. సామాన్యులైనా, సెలబ్రిటీలైనా అందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇక్కడ మాత్రం కాస్త విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కన్నడ సీరియల్లో ఓ నటి హెల్మెట్ పెట్టుకోకుండా స్కూటీ నడపడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇంతకీ అదేం సీరియల్? ఎవరు ఫిర్యాదు చేశారు? పోలీసుల రియాక్షనేంటో చూసేద్దాం..హెల్మెట్ లేకుండా..కన్నడలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో సీతారామ ధారావాహిక ఒకటి. ఈ సీరియల్లోని ఓ ఎపిసోడ్లో నటి వైష్ణవి గౌడ స్కూటీ నడిపింది. అయితే హెల్మెట్ లేకుండా రోడ్డుపై దర్జాగా వెళ్లిపోయింది. ఇది చూసిన జయప్రకాశ్ అనే వ్యక్తి ఈ సీన్‌ను లైట్ తీసుకోలేదు. సెలబ్రిటీలను చూసి జనాలు కూడా చెడిపోతారని.. సమాజానికి తప్పుడు సందేశం పంపిన నటి వైష్ణవిపై, సీరియల్ డైరెక్టర్‌పై, సదరు ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.బండి యజమానికి సైతం ఫైన్దీనిపై స్పందించిన పోలీసులు ఈ సీన్ చిత్రీకరణ బెంగళూరులోని నందిని లే అవుట్లో షూట్ చేసినట్లుగా గుర్తించారు. వైష్ణవితో పాటు, ఆమె వాడిన బండి యజమానికి రూ.500 చొప్పున చలానా విధించారు. ఇది జరిగి ఐదారు రోజులు కావస్తోంది. ఈ ఘటనపై సీతారామ సీరియల్ ప్రొడక్షన్ మేనేజర్ స్పందిస్తూ.. ఇక మీద రాబోయే ఎపిసోడ్లలో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.చదవండి: భర్త కోసం స్పెషల్ పోస్ట్.. ఆ క్యాప్షన్ అర్థం అదేనా? -
తల్లితో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా నటుడిపై దాడి.. తీవ్రగాయాలు
కన్నడ నటుడు చేతన్ చంద్రకు చేదు అనుభవం ఎదురైంది. గుడికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు గుంపుగా వచ్చి నటుడిపై దాడి చేశారు. అతడి కారును సైతం ధ్వంసం చేశారు. ఈ ఘటన బెంగళూరులోని కగ్గలిపురలో ఆదివారం చోటు చేసుకుంది. నటుడు సోషల్ మీడియాలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 12న మాతృదినోత్సవం సందర్భంగా నటుడు చేతన్ చంద్ర తన తల్లిని తీసుకుని గుడికి వెళ్లాడు. నటుడిపై దాడితిరుగు ప్రయాణమైన సమయంలో ఓ వ్యక్తి తనను ఫాలో చేయడమే కాక కార్ డ్యామేజ్ చేశాడు. ఇదేంటని వెళ్లి ప్రశ్నించగా.. వెంటనే 20 మంది అక్కడికి చేరుకుని నటుడిపై దాడికి దిగారు. రక్తం వచ్చేలా చితకబాదారు. ముక్కు పగలగొట్టారు. పోలీసులకు ఫిర్యాదు చేసేలోపు ఆ దుండగులు మళ్లీ నటుడి కారు దగ్గరకు చేరుకుని దాన్ని ధ్వంసం చేశారు. ఆ గ్యాంగ్‌లో ఓ మహిళ కూడా ఉంది.న్యాయం కావాలితనకు జరిగిన అన్యాయాన్ని చేతన్ సోషల్ మీడియాలో వెల్లడించాడు. ఇది చాలా భయంకరమైన సంఘటన.. నాకు న్యాయం కావాలి అంటూ గాయాలతో ఉన్న వీడియోను షేర్ చేశాడు. తాగిన మత్తులో ఉన్న వ్యక్తి.. నటుడి కారును చేజ్ చేయాలని ప్రయత్నించే క్రమంలో ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.నిందితుడు అరెస్ట్చేతన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు. మిగతా నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు. కాగా చేతన్ 'సత్యం శివం సుందరం' అనే సీరియల్లో నటించాడు. 'ప్రేమిజం', 'రాజధాని', 'జరాసంధ', 'కుంభ రాశి', ప్లస్', 'బజార్'.. ఇలా తదితర కన్నడ చిత్రాల్లో నటించాడు. View this post on Instagram A post shared by Chetan Chanddrra (@chetan_chanddrra) -
డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
అన్నీ ఎప్పుడూ ఒకేలా ఉండవు.. అవి మనసులైనా, మనుషులైనా! ఒకప్పుడు అందంతో, నటనతో ఊదరగొట్టిన ఎంతోమంది తారలు ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పైన కనిపిస్తున్న నటి కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. ఆమె తండ్రి గౌరీశంకర్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్.. తల్లి మమతా రావ్ కన్నడలో హీరోయిన్. సినీ బ్యాక్‌గ్రౌండ్ బాగానే ఉన్న ఈమెను ఇప్పటికైనా గుర్తుపట్టారా? తన పేరు రక్షిత.తొలి చిత్రంతోనే హిట్2002లో అప్పు సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాను తెలుగులో ఇడియట్గా, తమిళంలో ధమ్‌గా రీమేక్ చేశారు. ఈ రెండుచోట్లా రక్షితే కథానాయిక. ఈ మూవీ విజయం సాధించడంతో తెలుగులో పెళ్లాం ఊరెళితే.., నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు.. ఇలా అనేక సినిమాల్లో నటించింది.సినిమాలకు గుడ్బైకన్నడలో స్టార్ హీరోయిన్గా వెలుగొందింది. 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంది. తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పేసి నిర్మాతగా మారింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పెళ్లినాటి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 'కొన్నిచోట్ల మామయ్యే పెళ్లికూతుర్ని మండపానికి తీసుకెళ్తుంటాడు. అలా నన్ను కూడా మా మామయ్య తీసుకెళ్లాల్సి ఉంది. ఆ రోజు అంతా రెడీ అయ్యాం.నో ఎంట్రీసమయానికి ఆయన కనిపించలేదు. తీరా ఆయన బయట ఏదో పనిమీద వెళ్లాడని తెలిసింది. తిరిగి వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డులు ఆయన్ను లోనికి అనుమతించలేదు. నేను ఆమె మామయ్యను.. వెళ్లనివ్వండి అని చెబుతున్నా వాళ్లు వినిపించుకోలేదు. ఆయన ఎలాగోలా లోపలికి వచ్చేసరికే పెళ్లి తంతు దాదాపు పూర్తయింది. ఇప్పటికీ ఇది గుర్తు చేసుకుని నవ్వుకుంటుంటాం' అని రక్షిత చెప్పుకొచ్చింది.చదవండి: ఆ వివాదంతో వార్తల్లో.. గుడ్‌న్యూస్ చెప్పిన సీరియల్ జంట -
తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్.. భార్యతో కలిసి గుడ్‌న్యూస్ చెప్పిన హీరో
ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.తెలుగువారికి సుపరిచితుడే!చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.చందన్‌పై బ్యాన్అయితే ఈ సీరియల్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇటీవలే కొత్త బిజినెస్కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by K A V I T H A (@iam.kavitha_official) -
అక్కడ అదృష్టం పరీక్షించుకోనున్న హీరోయిన్!
బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రవేశించి ఆరంభంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నారు ఐశ్వర్య రాజేశ్. ఇప్పుడు కోలీవుడ్‌లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్నారు. కాక్కాముట్టై చిత్రం ఐశ్వర్య రాజేష్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ చిత్రంలో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించారు. అలాగే ధనుష్ కథానాయకుడిగా నటించిన వడచెన్నై చిత్రంలో బోల్డ్ పాత్రలో నటించి పేరు తెచ్చుకున్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలూ చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ నటిస్తూ బహుభాషా కథానాయికగా పేరు తెచ్చుకున్నారు.తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. కన్నడంలో సూపర్‌స్టార్ శివరాజ్ కుమార్, బాలి ధనుంజయ కలిసి నటిస్తున్న ఉత్తరాఖాండ అనే భారీ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. ఇందులో ఆమె నటుడు బాలి ధనుంజయకు జంటగా దుర్గి అనే ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ చిత్రాన్ని రోహిత్ పడకి దర్శకత్వంలో కేఆర్జీ స్టూడియోస్ పతాకంపై కార్తీక్‌గౌడ, యోగి జి రాజ్ కలిసి నిర్మిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం బీజాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కాగా ఐశ్వర్య రాజేష్ జీవి ప్రకాష్‌కుమార్‌తో కలిసి నటించిన డియర్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. ప్రస్తుతం తమిళంలో కరుప్పర్ నగరం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగా చిత్రాలతో పాటు మలయాళంలో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) చదవండి: -
పెళ్లై రెండేళ్లు.. పిల్లలు పుట్టాలంటే ముందు ఆ కండీషన్!
పెళ్లైన ప్రతి జంటకు ఎదురయ్యే ప్రశ్న.. ఏమైనా విశేషం ఉందా? అని! ఒకప్పుడు డజను కొద్దీ పిల్లల్నీ కనేవారు.. కానీ ఇప్పుడు సంతానం కోసం ఎన్నో పాట్లు పడుతున్నారు. మొన్నటివరకు ఇద్దరు ముద్దు అనుకునేవారు కూడా ఒక్కరు చాలని భావిస్తున్నారు. మరికొందరైతే లైఫ్‌లో సెటిలయ్యాకే పిల్లల గురించి ఆలోచిస్తామంటున్నారు. కానీ ఇక్కడ చెప్పుకునే జంట మాత్రం ఓ కండీషన్ పెట్టుకుని మరీ ఇప్పట్లో పిల్లలు వద్దనుకుంటున్నారట! కండీషన్ కన్నడ బుల్లితెర జంట లావణ్య- శశి హెగ్డే కన్నడ సీరియల్స్ ద్వారానే ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారి తీయగా ఇద్దరూ రెండేళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నారు. అయితే అందరి జంటలకూ మాదిరే ఈ జంటకు కూడా పిల్లల్ని ఎప్పుడు కంటారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి లావణ్య బదులిస్తూ.. 'నేను, నా భర్త ఇప్పటివరకు హనీమూన్‌కు వెళ్లనేలేదు. రెండుసార్లు ప్లాన్ చేసుకుని వెళ్లడమే ఆలస్యం అనుకున్న సమయంలో బంధువులు చనిపోవడంతో ఆగిపోవాల్సి వచ్చింది. బ్రో అని పిలిచి.. హనీమూన్‌కు వెళ్లాకే పిల్లల గురించి ఆలోచిద్దామని నా భర్త కండీషన్ పెట్టాడు. అలాగే నేనూ ఓ కండీషన్ పెట్టాను. నన్ను హనీమూన్‌కు మనాలీయో లేదంటే విదేశాలకో తీసుకెళ్లిన తర్వాతే పిల్లల్ని ప్లాన్ చేద్దామన్నాను. జూన్‌లో హనీమూన్‌కు వెళ్లబోతున్నాం' అని నటి చెప్పుకొచ్చింది. కాగా రాజారాణి సీరియల్ సెట్స్‌లో వీరి పరిచయం బలపడింది. ఈ సీరియల్లో లావణ్య.. శశిని బ్రో అని పిలిచేది. తర్వాత అతడే భర్త అవడం విశేషం! చదవండి: చెల్లితో హీరోయిన్ రీల్.. నెట్టింట ట్రోలింగ్ -
హీరోయిన్‌తో సీక్రెట్ పెళ్లి?
తమిళ నటుడు దర్శన్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. ఇగ్లూ హీరోయిన్ అంజు కురియన్‌తో దర్శన్ పెళ్లిపీటలపై కూర్చున్నాడు. కొందరు నిజంగానే వారికి పెళ్లయిపోయిందని భావిస్తున్నారు. ఈ మేరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఏదైనా యాడ్‌లో భాగంగానే ఈ పెళ్లి జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు. వాణిజ్య ప్రకటనలో భాగంగా వీరిద్దరూ పెళ్లి గెటప్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ వెడ్డింగ్ రూమర్స్ గురించి అటు దర్శన్, ఇటు అను ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. కాగా దర్శన్.. కనా అనే క్రికెట్ మూవీలో కీలక పాత్రలో నటించి ఫేమస్ అయ్యాడు. తునివు (తెగింపు), అయలాన్ చిత్రాల్లోనూ మెరిశాడు. అను కురియన్ విషయానికి వస్తే.. నేరం అనే సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. ఓజ్లర్ మూవీలో చిన్న పాత్రలో మెరిసింది. చదవండి: ఛాతీలో నొప్పి.. ప్రముఖ నటుడికి ఆంజియోప్లాస్టీ -
'పిల్లలను కనాలని లేదు.. ఎందుకంటే?'.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!
ప్రముఖ కన్నడ నటి, హీరోయిన్ హితా చంద్రశేఖర్ సంచలన కామెంట్స్ చేశారు. పిల్లల్ని కనడంపై ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. కన్నడ నటుడు సిహి కహీ చంద్రు కుమార్తె అయిన ముద్దుగుమ్మ 2019లో బాల నటుడిగా పేరు తెచ్చుకున్న కిరణ్ శ్రీనివాస్‌ను పెళ్లాడింది. పెళ్లయి ఇప్పటికీ నాలుగున్నరేళ్లు కావొస్తున్నప్పటికీ పిల్లలు లేరు. అయితే బంధుమిత్రుల నుంచి మనవడిని ఎప్పుడు ఇస్తావ్? అనే ప్రశ్నలు మాత్రం తలెత్తున్నాయనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ షోలో పాల్గొన్న హిత చంద్రశేఖర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. హితా మాట్లాడుతూ.. "ఫస్ట్ నాకు పిల్లలను కనాలని లేదు. కిరణ్, నేను స్నేహితులుగా ఉన్నప్పుడే ఈ విషయం గురించి మాట్లాడుకున్నాం. అతను కూడా సానుకూలంగా స్పందించారు. మాకు పిల్లలు ఎందుకు కావాలి? నాకు అందరిలా పిల్లలు కనాలని ఏం అనిపించడం లేదు. ప్రస్తుతం ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులను చూస్తున్నాయో నాకు తెలుసు. అలాంటి పరిస్థితిలో ఇంకో బిడ్డను ఈ లోకంలోకి తీసుకురావాలా? అన్నది నా ఆలోచన. కిరణ్‌కి కూడా అలాగే అనిపించింది" అని చెప్పుకొచ్చింది. అనంతరం మాట్లాడుతూ..'మాతృత్వాన్ని ఆస్వాదించాలంచే మనమే పిల్లలను కనాల్సిన అవసరం లేదు. ఓ కుక్కపిల్లని కూడా మన సొంత బిడ్డలాగా పెంచుకోవచ్చు. మనకు వృద్ధాపం వచ్చినప్పుడు మనల్ని ఎవరు చూసుకుంటారు. మన చివరి రోజుల్లో ఎవరు చూసుకుంటారని చాలా మంది అంటుంటారు. నాకు దాని గురించి ఏ మాత్రం బాధ లేదు" అని తెలిపింది. అంతే కాకుండా ఈరోజు ఎంత మంది తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారు? అని హితా ప్రశ్నించింది. ప్రస్తుత సమాజంలో కొడుకు, కూతుళ్లు అమెరికాలో ఉంచే వారి తల్లితండ్రులు ఎక్కడో ఒకచోట ఉంటున్నారు. కేవలం ఆ ఇద్దరు దంపతులు మాత్రమే కలిసి ఉంటున్నారు.. అలాంటప్పుడు పిల్లలు ఉన్నా ఏం లాభం అనే ప్రశ్న తలెత్తుతుందని హిత అన్నారు. ఇక్కడ పిల్లలను కనొద్దని నేను చెప్పట్లేదు.. కానీ ఇది నా నిర్ణయం అని మాత్రమే చెబుతున్నానని తెలిపారు. ఈ విషయంలో మా తల్లిదండ్రులు నాకు సపోర్ట్‌గా ఉన్నారని పేర్కొన్నారు. కాగా.. హితా చంద్రశేఖర్ శాండల్‌వుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. View this post on Instagram A post shared by Hitha Chandrashekar K (@thehithaceee) -
సడన్‌గా ఓటీటీకి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలు వచ్చాక కొత్త కొత్త సినిమాలు చూసేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలను ఓటీటీలు అందిస్తున్నాయి. ఏ భాష సినిమా అయిన డబ్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గతంలో కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి రెండు పార్టులుగా వచ్చి సక్సెస్ సాధించింది. ప్రేమకథగా వచ్చిన ఈ సిరీస్‌కు అభిమానుల నుంచి ఆదరణ దక్కించుకుంది తాజాగా మరో కన్నడ ప్రేమకథ సినిమా ఓటీటీకి వచ్చేసింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కథగా తెరకెక్కించిన ఒండ్రు సరళ ప్రేమ కథె చిత్రం సడన్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో వినయ్ రాజ్‌కుమార్, మల్లికా సింగ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 8న రిలీజైన ఈ మూవీ మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఈ చిత్రం కన్నడ భాషలోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాను తెలుగు డబ్బింగ్లో తీసుకోస్తారో లేదో ఇంకా తెలియాల్సి ఉంది.ఈ చిత్రానికి సునీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో స్వస్తిష్ట, రాజేశ్ నటరంగ, అరుణ్ బలరాజ్, సాధు కోకిల, కార్తిక్ మహేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీని రామ్ మూవీస్ పతాకంపై మైసూర్ రమేశ్ నిర్మించగా.. వీర్ సామ్రాట్ సంగీతం అందించారు. -
ఒకప్పుడు ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఐఏఎస్‌గా..
సినిమాల మీద పిచ్చితో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినవాళ్లను చూశాం.. అలాగే ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సినిమాలు వదిలేసి రోడ్డునపడ్డవాళ్లమూ చూశాం.. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ మహిళ మాత్రం చిన్న వయసులో సినిమాలు చేసింది. ఆ తర్వాత చదువుపై దృష్టి పెట్టి ఐఏఎస్ సాధించింది. బాలనటిగా బోలెడు సినిమాలు.. ఆవిడే హెచ్ఎస్ కీర్తన.. బాల్యంలో నటనతో అందరినీ కట్టిపడేసింది. అటు బుల్లితెర, ఇటు వెండితెర.. రెండింటిపైనా తళుక్కుమని మెరిసింది. కన్నడలో సీరియల్స్‌తో పాటు సినిమాలు చేసింది. కర్పూరద గోంబే, గంగ-యమున, ముద్దిన అలియ, ఉపేంద్ర, ఎ, కనూర్ హెగ్గడటి, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఓ మల్లిగె, లేడీ కమిషనర్, హబ్బ, డోరె, సింహాద్రి, జనని, చిగురు, పుతని ఏజెంట్.. ఇలా పలు చిత్రాల్లో బాలనటిగా మెప్పించింది. ఆరో ప్రయత్నంలో.. రానురానూ తనకు చదువుపై మక్కువ ఎక్కువైంది. ఎలాగైనా ఐఏఎస్ అవ్వాలనుకుంది, ప్రజలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం దేశంలోనే అతి క్లిష్టమైన పరీక్షల్లో ఒకటైన యూపీఎస్సీ ఎగ్జామ్ రాసింది. కానీ ఫెయిలైంది. అయినా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. వరుసగా రాస్తూనే ఉంది. అలా ఆరోసారి(2020లో) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆలిండియా లెవల్లో 167వ ర్యాంకు సంపాదించింది. కర్ణాటకలోని మాండ్యా జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా అపాయింట్ అయింది. రెండేళ్లు ఆ పని చేశాక ఐఏఎస్ అయితే దీనికంటే ముందు 2011లో ఆమె కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామ్(KAS) కూడా రాసింది. ఈ పరీక్షలో పాస్ అవడంతో పాటు ఉద్యోగం కూడా సాధించింది. రెండేళ్లపాటు కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిణిగా సేవలందించింది. ఆ తర్వాత ఐఏఎస్ జాబ్ కొట్టింది. మొదటి ప్రయత్నంలోనే ఫెయిలయ్యామని చతికిలపడేవారికి కీర్తన స్టోరీ ఒక ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు! చదవండి: చులకన, వేధింపులు.. చాలా ఏళ్లు బాధపడ్డా.. ఇకపై అస్సలు ఊరుకోను! -
ఘనంగా హీరోయిన్ సీమంతం.. సోషల్ మీడియాలో వైరల్!
కన్నడ భామ ఆదితి ప్రభుదేవా శాండల్‌వుడ్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడలో ధైర్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించింది. బ్రహ్మచారి, ఓల్డ్ మాంక్, సింగ, తోతాపురి చాప్టర్ -1 లాంటి చిత్రాలతో శాండల్‌వుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో బిజీగా ఉండగానే.. 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. వ్యాపారవేత్త యషాస్ను వివాహం చేసుకుంది. అయితే ఇటీవల కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే అభిమానులకు గుడ్ న్యూస్ కూడా చెప్పింది. తాను గర్భం ధరించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది ముద్దుగుమ్మ. తన భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలిపారు. తాజాగా ఆదితి ప్రభుదేవా సీమంతం వేడుక ఘనంగా జరిగింది. బెంగళూరులోని ఆమె నివాసంలో బేబీ షవర్ కార్యక్రమం గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకలో బంధువులు, సన్నిహితులు పాల్గొన్నారు. శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు నటీనటులు కూడా హాజరై కాబోయే తల్లిదండ్రులను ఆశీర్వదించారు. View this post on Instagram A post shared by Yashas Chandrakant Patla (@yashas.patla) View this post on Instagram A post shared by ADITI PRABHUDEVA (@aditiprabhudeva) -
స్టార్ హీరో ట్వీట్‌కు సచిన్ రిప్లై.. అదేంటో తెలుసా!
కన్నడ స్టార్ సుదీప్ తెలుగువారికి కూడా సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాతో తెలుగువారికి మరింత దగ్గరయ్యాడు. ప్రస్తుతం తమిళం, కన్నడ సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. గతేడాది కబ్జా సినిమాతో అలరించిన కిచ్చా.. ప్రస్తుతం మ్యాక్స్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అయితే తాజాగా నెటిజన్ల్తో ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. ట్విటర్ వేదికగా ఆస్క్ కిచ్చా అనే సెషన్లో పాల్గొన్నారు. ఈ సెషన్‌కు హాజరైన పలువురు నెటిజన్స్ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. ఇటీవల సచిన్‌ను కిచ్చా సుదీప్ కలిశారు. ఈ సందర్భంగా ఆ ఫోటోను షేర్ చేసిన నెటిజన్.. కిచ్చాను ఇలా అన్నారు. సచిన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. అన్న ఈ ఫోటో గురించి ఒక్కమాటలో చెప్పండి.. సచిన్‌ను కలిసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది' అని అడిగాడు. దీనికి సుదీప్ రిప్లై ఇచ్చారు. ఈ ఫోటోను చూస్తే 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ.. ఇది నా జీవితంలో మధురమైన జ్ఞాపకం' అంటూ బదులిచ్చారు. అయితే ఈ ట్వీట్ చూసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సైతం కిచ్చా సుదీప్ రిప్లై ఇచ్చారు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు తీసిన మన ఫోటో ఎంతో అద్భుతంగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, జీవితంలో ఆనందం ఉండాలని కోరుకుంటున్నా' అంటూ సచిన్ ట్వీట్ చేశారు. ఇది చూసిన కన్నడ స్టార్ హీరో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరోకు సచిన్ రిప్లై ఇచ్చారంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఈ ట్వీట్‌కు కన్నడ స్టార్ హీరో సుదీప్ సైతం స్పందించారు. 'వావ్.. నేను ఇది ఊహించలేదు... మీరు నాకు మరో మరపురాని క్షణాన్ని అందించారు సార్' అంటూ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. This pic is just looking like a wowwwwwwwww... 😁 One fond memory my friend . https://t.co/y4C1a0LkPi — Kichcha Sudeepa (@KicchaSudeep) January 16, 2024 It was lovely meeting you. Aur uss din kisine hamara ye photo bhi kitna acha KICHCHA tha. Always wishing you good health and happiness in life. 😊 https://t.co/D3o1ZvwOUM — Sachin Tendulkar (@sachin_rt) February 2, 2024 Woaaa!!! ♥️♥️.. Didn't expect this ... You jus gifted me another memorable moment... Mch luv and wshs always @sachin_rt sir. https://t.co/tWXaV8Givs — Kichcha Sudeepa (@KicchaSudeep) February 2, 2024 -
నేను రామభక్తుడిని.. అయోధ్యలోనే నా పెళ్లి..: నటుడు
పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరిపేందుకు జనాలు ఏమాత్రం వెనుకాడటం లేదు. కొందరైతే తమ స్థోమతకు మించి అప్పు చేసి మరీ పెళ్లిళ్లు చేస్తున్నారు. సామాన్య జనాలే ఇలా ఉంటే సెలబ్రిటీల సంగతి చెప్పనక్కర్లేదు. హల్దీ దగ్గరి నుంచి రిసెప్షన్ వరకు అంతా ఘనంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అంతేకాదు తమ స్వస్థలాలలో కాకుండా ఏదైనా ప్యాలెస్‌లోనో లేదంటే వేరే దేశంలోనో వివాహం చేసుకుంటున్నారు. ఇందుకోసం కోట్లు గుమ్మరించడానికి కూడా వెనుకాడటంలేదు. రామభక్తుడిని.. అందుకే.. అయితే కన్నడ నటుడు రామ గౌడ మాత్రం అక్కడో, ఇక్కడో ఎందుకు అయోధ్యలోనే పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నటుడు రామ గౌడకు ఐశ్వర్య అనే అమ్మాయితో సోమవారం (జనవరి 22న) నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాలు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇకపోతే ఈ మధ్యే అయోధలో రామమందిరం ప్రారంభం కావడంతో ఆ ప్రదేశంలోనే వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు అరుణ్. దీని గురించి అతడు మాట్లాడుతూ.. 'నేను రామభక్తుడిని. అందుకే అయోధ్యలో ఆ రాములవారి సమక్షంలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. యాక్టింగ్‌తో పాటు బిజినెస్ మేమిద్దరం పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. కెరీర్లో స్థిరపడ్డాకే జీవితంలో ముందడుగు వేయాలనుకున్నాం. ఇప్పుడా సమయం వచ్చిందని భావిస్తున్నాం. ఇన్నాళ్లకు పెళ్లికి సిద్ధపడటంతో మా కుటుంబసభ్యులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఐశ్వర్య చాలా నిజాయితీగా ఉంటుంది. ఎంతో అర్థం చేసుకుంటుంది. నాకంటూ ఓ రెస్టారెంట్ బిజినెస్ కూడా ఉంది. అటు సినిమాలు, ఇటు బిజినెస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాను. ఆరు నెలల్లో దర్శకుడిగా ఓ సినిమా తీయబోతున్నాను. దాని తర్వాత అంటే ఈ ఏడాది చివర్లో మేము అయోధ్యలో పెళ్లి చేసుకుంటాం' అని చెప్పాడు. చదవండి: బామ్మ మరణంతో బాధలో కూరుకుపోయా.. అర్థం చేసుకుని.. మిల్కీబ్యూటీ ఇలా మారిపోయిందేంటి? ఇదంతా దాని కోసమేనా? -
హీరో భార్యకు ఇచ్చిపడేసిన హీరోయిన్.. మాది పవిత్ర బంధమంటూ..
కన్నడ స్టార్ హీరో దర్శన్, హీరోయిన్ పవిత్ర గౌడ ప్రేమలో ఉన్నారని ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అది నిజమే అన్నట్లుగా దర్శన్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలన్నింటినీ ఒక చేట చేర్చి దాన్ని వీడియోగా ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. పదేళ్ల రిలేషన్.. ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలని రాసుకొచ్చింది. ఇంకేముంది.. దర్శన్ భార్య విజయలక్ష్మికి ఒళ్లు మండిపోయింది. తన భర్తతో కనిపించొద్దని సెట్‌కు వెళ్లి మరీ హీరోయిన్ పవిత్రకు వార్నింగ్ ఇచ్చిందని, అవసరమైతే కేసు కూడా పెడతానని బెదిరించినట్లు తెలుస్తోంది. ఖుషి దర్శన్ కూతురు కాదు దీనిపై పవిత్ర సోషల్ మీడియా వేదికగా ఓ లేఖ షేర్ చేసింది. 'నా పేరు పవిత్ర గౌడ. గతంలో నేను సంజయ్ అనే వ్యక్తిని పెళ్లాడాను. మా ఇద్దరికీ కలిగిన సంతానమే ఖుషి. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల సంజయ్‌కు విడాకులిచ్చాను. నేను ఎప్పుడూ ఎక్కడా ఖుషి.. దర్శన్ కూతురని చెప్పలేదు. అయితే దర్శన్, నేను పదేళ్లుగా ప్రేమించుకుంటున్నాం. ఈ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. కానీ మా మధ్య ప్రేమ, కేరింగ్ మాత్రం అలాగే ఉన్నాయి. మా రిలేషన్‌ను తను అంగీకరించింది ఇంకా చెప్పాలంటే దర్శన్ భార్య విజయలక్ష్మికి మా గురించి అంతా తెలుసు. చాలాసార్లు ఫోన్లో కూడా మాట్లాడాను. మేమిద్దరం కలిసి ఉంటున్నందుకు తనకెలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. సరైన సమయం వచ్చినప్పుడు అందుకు తగిన ఆధారాలు చూపిస్తాను. అలాగే నా మొదటి పెళ్లికి సంబంధించిన విడాకుల పత్రాలు కూడా చూపిస్తాను. అవమానిస్తున్నారు విజయలక్ష్మి నా గురించి చెడుగా పోస్టులు పెడుతుంటే బాధేస్తోంది. చాలామంది నన్ను, నా కూతురు ఖుషిని తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు. మానసికంగా వేధిస్తున్నారు. నన్ను ప్రేమిస్తున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలనుకుంటున్నాను. ఎవరైనా నన్ను ఇబ్బందులకు గురి చేస్తే కోర్టుకు వెళ్లడానికి కూడా వెనుకాడను' అని వార్నింగ్ ఇచ్చింది. మరి ఈ వివాదంపై దర్శన్ ఏమని స్పందిస్తాడో చూడాలి! View this post on Instagram A post shared by 𝙋𝙖𝙫𝙞𝙩𝙝𝙧𝙖 𝙂𝙤𝙬𝙙𝙖 (@pavithra_gowda_7) చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే.. -
అమ్మను బతికించుకుందామనుకున్నా.. ఆస్పత్రికి తెలిసి తెల్లారేసరికి..
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి క్రేజ్ తెచ్చుకుంది నటి లతాశ్రీ. ఈమె అసలు పేరు పద్మలత. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మొదట శ్రీలతగా, తర్వాత లతా శ్రీగా మార్చుకుంది. తెలుగు, కన్నడ భాషల్లో హీరోయిన్గా చేసిన ఆమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. ఈమెకు నాగశౌర్య మేనల్లుడు అవుతాడు. తాజాగా ఈ నటి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. అందరిముందే తిట్టాడు లతా శ్రీ మాట్లాడుతూ.. 'హీరోయిన్గా తెలుగులో నా తొలి సినిమా మన్మథ సామ్రాజ్యం. కన్నడలో హీరోయిన్గా ఎక్కువ అవకాశాలు వచ్చేవి. కానీ అమ్మ తెలుగు ఇండస్ట్రీకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేది. అలా ఇక్కడ మొదట్లో హీరోయిన్గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేశాను. కానీ ఎన్నడూ నా పాత్రలకు నేను డబ్బింగ్ చెప్పలేదు. మలయాళంలో మమ్ముట్టితో నటించే ఛాన్స్ వచ్చింది. అయితే సెట్స్‌లో డైరెక్టర్ నా నటనకు వంకలు పెట్టాడు. అందరిముందే తిట్టడంతో ఏడ్చేశాను. నన్ను ఇబ్బందిపెట్టడంతో సినిమా నుంచి బయటకు వచ్చేశాను. మళ్లీ మలయాళ సినిమాల జోలికి పోలేదు. జిమ్ ట్రైనర్‌తో ప్రేమ, పెళ్లి ఆ రోజుల్లో ఉదయం పూట ఏరోబిక్స్‌కు వెళ్లేదాన్ని. అక్కడ ఉండే జిమ్ ట్రైనర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఏడాదిపాటు ప్రేమించుకున్నాం. ఆ సమయంలో సినిమా ఛాన్సులు రిజెక్ట్ చేశాను. అమ్మకు అసలు విషయం లీకవడంతో కోపంతో ఒక్కటిచ్చింది. ఇద్దరింట్లో ఒప్పుకోలేదు. వాళ్ల నాన్న డిప్యూటీ కలెక్టర్. బాగా చదువుకున్న కుటుంబం. కానీ అమ్మకు ఇష్టం లేక నన్ను ఢిల్లీ పంపించేసింది. చివరకు ఎలాగోలా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అమ్మ చాలా స్ట్రిక్ట్‌గా ఉండేది. పెళ్లయ్యాక కూడా తను మాతోనే ఉంది. ఓరోజు విజయవాడ వెళ్లిన అమ్మకు అక్కడ గుండెపోటు వచ్చింది. అప్పుడు అమ్మ వెంట అన్నయ్య, నేను ఎవరమూ లేము. అమ్మ కోలుకున్నా ఐసీయూలోనే.. ఛాతీలో నొప్పిగా ఉన్నా అదే తగ్గిపోతుందని ఊరుకుంది. రాత్రంతా ఆ నొప్పి భరించింది. తెల్లవారినా నొప్పి తగ్గకపోవడంతో అన్నయ్యకు ఫోన్ చేసింది. అప్పుడు అన్నయ్య వెంటనే తనను ఆస్పత్రిలో చేర్పించాడు. అమ్మను ఐసీయూలో చేర్చారు. విషయం తెలియగానే నేను షిరిడీ నుంచి విజయవాడ వెళ్లిపోయాను. అమ్మ నన్ను చూడగానే కోలుకుంది. మామూలు మనిషైపోయింది. బాగానే మాట్లాడింది. అయినా సరే ఆస్పత్రి వైద్యులు డబ్బుల కోసం తనను ఐసీయూలోనే ఉంచారు. మాట్లాడటానికి వీల్లేకుండా నోట్లో పైప్ పెట్టారు. ఓరోజు సడన్‌గా కోమాలోకి వెళ్లిపోయిందని చెప్పారు. బతకడం కష్టమన్నారు. కానీ రెండు రోజుల్లో మళ్లీ కోలుకుంది. ఆస్పత్రి వాచ్మెన్ మాటలతో షాక్ 18 రోజులపాటు తనను ఐసీయూలో నుంచి బయటకు రానివ్వలేదు. హైదరాబాద్‌కు తీసుకెళ్తామన్నా ఒప్పుకోలేదు. ఒకరోజు ఆ ఆస్పత్రి వాచ్మెన్.. 'చూస్తే చదువుకున్నవాళ్లలా ఉన్నారు. ఈ ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారు? ఇక్కడ డబ్బులు గుంజుతారు, కానీ సరైన ట్రీట్మెంట్ ఇవ్వరు. బతికుండగానే చంపేస్తారు' అని చెప్పాడు. భయంతో ఆ ప్రాంతంలో ఉండే నటి జయలలితకు ఫోన్ చేశాను. ఆమె సాయంతో ఆ ఆస్పత్రి నుంచి వేరే హాస్పిటల్‌కు మార్చడానికి సిద్ధమయ్యాము. షిఫ్ట్ చేద్దామనుకునేలోపు చంపేశారు అయితే దీన్ని సీక్రెట్‌గా ఉంచమన్నారు. కానీ ఇంతలో ఈ విషయం అమ్మ ఉన్న ఆస్పత్రి మేనేజ్మెంట్కు తెలిసింది. వేరే హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తున్నారా? అని అడిగారు. లేదని అబద్ధం చెప్పాను. ఆ మరుసటిరోజే అమ్మ చనిపోయింది. ఆస్పత్రి వైద్యులే తనను బతికుండగానే చంపేశారు. ఆమె చనిపోయాక ఏడాదిన్నరపాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. డబ్బులకోసం ఒక మనిషి ప్రాణాలు తీయడం చాలా దారుణం' అని ఎమోషనలైంది లతా శ్రీ. చదవండి: నా తల్లి ముందే అలాంటి బూతులు విన్నాను.. ఆపై తేజూను తీసుకెళ్తామంటూ..: అమర్ -
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా జోరు.. నాలుగు రోజుల్లోనే రికార్డ్!
శాండల్‌వుడ్ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, ఆరాధనా రామ్ జంటగా నటించిన చిత్రం కాటేరా. తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. మొదటి నాలుగు రోజుల్లోనే రూ.77 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతోంది. డిసెంబర్ 29న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మొదటి రోజే కూ. 19.79 కోట్లు, రెండో రోజు కూ.17.35 కోట్ల వసూళ్లు రాబట్టింది. వరుసగా మూడో రోజు ఏకంగా రూ.20.94 కోట్ల కలెక్షన్స్ సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.58 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన కాటేరా.. న్యూ ఇయర్ రోజు సైతం రూ.18.26 కోట్లు వసూలు చేసింది. దీంతో ఓవరాల్‌గా నాలుగు రోజుల్లోనే రూ.77.6 కోట్లు రాబట్టింది. వీకెండ్ తర్వాత సోమవారం కూడా కాటేరా కలెక్షన్స్ ఏమాత్రం తగ్గలేదు. కాగా.. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. కాటేరా మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం సోమవారం బెంగళూరులో సక్సెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ చిత్రాన్ని కేవలం కన్నడ భాషలోనే రిలీజ్ చేశారు. .@dasadarshan 's #Kaatera remains unstoppable at the box office, enjoying a substantial #NewYear2024's boost with a gross collection of Rs 18.26 crore on #Jan1, bringing the total to an impressive Rs 77.6 crore in 4 days. @TharunSudhir @RocklineEnt @jadeshaakhampi #Maasthi… pic.twitter.com/1WQeQL1Yok — A Sharadhaa (@sharadasrinidhi) January 2, 2024 This is huge for 3rd day 💥 Official announcement from team itself 🔥#Kaatera 3rd day collection: 20.94 cr Overall collection from 3 days: 58.8 cr💥 Film crossed 50 cr+ in just 3 days ❤️ Inching towards 💯 cr🔥#Dboss @dasadarshan 👑#BossOfSandalwood #KaateraBORampage pic.twitter.com/RgHsbrbhIP — ಕೃಷ್ಣ❤️ KAATERA 29th DEC (@JacksparrowD60) January 1, 2024 -
పాఠశాలను దత్తత తీసుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి
-
యష్ టాక్సిక్ మూవీ స్టోరీలో బిగ్ ట్విస్ట్..!
-
'కరావళి' ప్రోమో అదిరిపోయిందంతే!
డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ ‘కరావళి’ సినిమాతో అందరినీ పలకరించబోతున్నారు. ‘అంబి నింగే వయసైతో’ అనే కన్నడ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు గురుదత్త గాణిగ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. వీకే ఫిలింస్ బ్యానర్‌తో కలిసి గురుదత్త గాణిగ ఫిలిం బ్యానర్ మీద గురుదత్త గాణిగ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కరావళి అనే గ్రామంలో కంబళ పోటీల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ఈ 40వ సినిమా ఫస్ట్ లుక్, ప్రోమోలను సోమవారం విడుదల చేశారు. ప్రజ్వల్ దేవరాజ్ ఇందులో ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించారు. మహిషా అవతారం అన్నట్టుగా అలా మహిషం మీద కదిలి వచ్చే సీన్ చూస్తే గూస్బంప్స్ రావాల్సిందే. ఓ వైపు గేదె ప్రసవం, మరో వైపు హీరో జననం.. ఈ రెండింటికి ఏదో లింక్ ఉన్నట్టుగా చూపించడం.. చివరకు హీరో కాస్తా మహిషాసురుడు అయ్యాడన్నట్టుగా వెరైటీ గెటప్‌లో కనిపించే షాట్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియాకు పర్ఫెక్ట్ సబ్జెక్ట్ అన్నట్లుగా కనిపిస్తోంది. విజువల్స్, ఆర్ఆర్ కూడా అదే రేంజులో ఉన్నాయి. మా భాష, సంస్కృతి, ఆచార సంప్రదాయాలు, మూలల్లోంచి కథలు తీసుకుని తెరపై ఆవిష్కరించాలని అనుకుంటున్నామని దర్శక నిర్మాత గురుదత్త గాణిగ తెలిపారు. ఈ చిత్రానికి సచిన్ బస్రూర్ సంగీతం అందిస్తుండగా.. అభిమన్యు సదానందన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. చదవండి: ప్రియాంకకు సపోర్ట్ చేయను.. గీతూ ప్రశ్నలకు సమాధానాలు దాటేసిన శోభ -
లేటు వయసులో పెళ్లి చేసుకున్న దండుపాళ్యం హీరోయిన్
హీరోయిన్ పూజా గాంధీ లేటు వయసులో పెళ్లి చేసుకుంది. 40 ఏళ్ల వయసులో ఓ ఇంటికి కోడలిగా వెళుతోంది. దండుపాళ్యం సినిమాతో తెలుగువారికి దగ్గరైన ఈ బ్యూటీ బిజినెస్మెన్ విజయ్ ఘోర్పడేను పెళ్లాడింది. బుధవారం(నవంబర్ 29) నాడు బెంగళూరులో వీరి వివాహం జరిగింది. పెద్దగా హంగూ ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా పూజా గాంధీ.. ఖత్రోన్ కె ఖిలాడీ అనే హిందీ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టింది. బెంగాలీ, తమిళ భాషల్లోనూ నటించినా కన్నడ ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు పొందింది. ముక్కంటి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హీరోయిన్ తగ్గేదేలే సినిమాలోనూ నటించింది. కన్నడ దండుపాళ్యం సినిమా తెలుగులో డబ్ అవగా ఈ మూవీ హీరోయిన్‌కు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. కాగా పూజాకు 2012లో పారిశ్రామికవేత్త ఆనంద్ గౌడతో నిశ్చితార్థం జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ నిశ్చితార్థం పెళ్లి వరకు వెళ్లకుండానే ఆగిపోయింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత విజయ్ను పెళ్లాడి వైవాహిక బంధంలో అడుగుపెట్టింది పూజా గాంధీ. చదవండి: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీకి.. వాళ్లే శాశ్వతంగా దూరమయ్యారంటూ నరేశ్ ఎమోషనల్ -
ఓటీటీలు అలా చేయడం మంచిది కాదు: రిషబ్ శెట్టి కామెంట్స్ వైరల్
కన్నడ హీరో, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ప్రస్తుతం కాంతార సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా ఆయన గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఇఫి) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటీటీలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్ఎఫ్డీసీ ఫిల్మ్ బజార్‌లాంటి వేడుకల్లో ప్రదర్శితమైతే కన్నడ చిత్రాలకు రెవెన్యూ వచ్చేదని.. కొవిడ్ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరగడంతో ఆ పరిస్థితి లేదని అన్నారు. అలాగే కన్నడలో తెరకెక్కిన ఓ కమర్షియల్ సినిమా సక్సెస్ కాకపోతే ఓటీటీ సంస్థలు తిరస్కరించడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు. తనకు కన్నడ చిత్ర పరిశ్రమను వీడే ఉద్దేశం లేదని తెలిపారు. రిషబ్ మాట్లాడుతూ..' కాంతార సూపర్ హిట్ తర్వాత నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. వాటిని నేను తిరస్కరించా. కన్నడ ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు. ప్రస్తుతం కాంతార ఏ లెజెండ్: చాప్టర్ 1 పైనే దృష్టి సారించాం. కాంతార తీసే సమయంలోనే ప్రీక్వెల్ ఆలోచన వచ్చింది. మూవీ హిట్ కావడంతో ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించుకున్నా' అని అన్నారు. కాగా.. ఇఫి వేడుకల్లో కాంతారకు సిల్వర్ పీకాక్(స్పెషల్ జ్యూరీ అవార్డ్) దక్కింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 Dedicating #IFFI54 'Special Jury Award' to ever inspiring Shankar Nag sir. ನಮ್ಮೆಲ್ಲರ ಸ್ಫೂರ್ತಿ ಶಂಕರ್ ನಾಗ್ ಅವರಿಗೆ ಈ ಪ್ರಶಸ್ತಿ ಅರ್ಪಣೆ. pic.twitter.com/ZLFlNIPE6u — Rishab Shetty (@shetty_rishab) November 28, 2023 -
'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం
కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్‌ని అందించిన చిత్రం ‘కాంతారా’. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమా ఇండియా అంతటా హిట్ అయ్యింది. విడుదలైన ఐదు భాషల్లో సినిమా కలెక్షన్లలో రికార్డులు సృష్టించింది.హోంబలే ఫిలింస్ నిర్మించిన 'కాంతారా' భారతదేశ వ్యాప్తంగా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ విజయం కారణంగానే రిషబ్ శెట్టి కాంతారాను సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడు. తాజాగా 'కాంతారా చాప్టర్ 1' ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో సుమారు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms)