ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో? | Rishab Shetty Starrer The Pride of Bharat Chhatrapati Shivaji Maharaj Movie Poster Out | Sakshi
Sakshi News home page

ఛావాతో ఓ మెట్టు ఎక్కేసిన బాలీవుడ్‌ హీరో.. మరి రిషబ్‌శెట్టి?

Published Wed, Feb 19 2025 3:15 PM | Last Updated on Wed, Feb 19 2025 3:26 PM

Rishab Shetty Starrer The Pride of Bharat Chhatrapati Shivaji Maharaj Movie Poster Out

మహారాజ్‌ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా (Chhaava Movie) బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకుంటున్నారు. ఇది కదా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర.. భవిష్యత్‌ తరాలకు తెలియజేయాల్సిన ఘనత అంటూ ఉప్పొంగిపోతున్నారు. నేడు (ఫిబ్రవరి 19) శివాజీ మహారాజ్‌ 395వ జయంతి.

శివాజీ బయోపిక్‌
ఈ సందర్భంగా శివాజీ జీవిత కథపై తీస్తున్న బయోపిక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. 'కాంతార'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్‌ శెట్టి (Rishab Shetty) ఈ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌లో భవానీ దేవి ముందు శివాజీ కత్తితో నిలబడి ఉన్నాడు. పోస్టర్‌ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. 

2027లో రిలీజ్‌
సందీప్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. రవి వర్మ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా రేసుల్‌ సంగీతం అందించనున్నాడు. ఛావా సినిమాతో విక్కీ కౌశల్‌ పేరు మార్మోగిపోతోంది. తన కెరీర్‌లోనే ఇదొక మాస్టర్‌పీస్‌గా మిగిలిపోనుంది. రిషబ్‌కు కూడా శివాజీ అతడి జీవితంలోనే బెస్ట్‌ సినిమాగా నిలవనుందని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement