chatrapati shivaji
-
శివాజీపై వ్యాఖ్యల దుమారం.. నితిన్ గడ్కరీ ఏమన్నారంటే?
ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా మహారాష్ట్ర రాజకీయం మరోసారి వేడెక్కింది. శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. దీంతో, సీఎం ఏక్నాథ్ షిండే అనుకూల ఎమ్మెల్యేలు సైతం గవర్నర్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు. షిండే వర్గం-బీజేపీ కూటమిలో ప్రకంపనలు రేపుతున్నాయి. అంతటితో ఆగకుండా గవర్నర్‌ను బదిలీ చేయాలనే డిమాండ్ తెరమీదకు తెస్తున్నారు. ఈ క్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. బీజేపీ మిత్రపక్ష నేత, సీఎం ఏక్నాథ్ షిండే తీరును గడ్కరీ సోమవారం తప్పుబట్టారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ.. శివాజీ మహారాజ్ మాకు దేవుడు. మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ఆయనను పూజిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, గడ్కరీ వ్యాఖ్యలతోనైనా మహారాష్ట్రలో ఈ పొలిటికల్ ప్రకంపనలకు తెరపడుతుందో లేదో చూడాల్సిందే. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. మహారాష్ట్రలో చాలా మంది ఆరాధ్య నాయకులు ఉన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ పాతకాలం నాటి ఆరాధ్య దైవం. ఇప్పుడు బీఆర్ అంబేద్కర్, నితిన్ గడ్కరీ ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలపై శివసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు కూడా గవర్నర్‌పై ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. -
శివాజీపై తీవ్ర వ్యాఖ్యలు.. సీఎం షిండే వర్గంలో చిచ్చుపెట్టిన గవర్నర్!
మహారాష్ట్ర రాజకీయం రసవత్తరంగా మారింది. ఛత్రపతి శివాజీపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్‌గా సంచలనంగా మారాయి. గవర్నర్ వ్యాఖ్యలను ఉద్ధవ్ థాక్రే వర్గం, శివసేన నేతలు తప్పుబడుతున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేపై ఆయన వర్గానికే చెందిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, గవర్నర్ కోష్యారీ వ్యాఖ్యలపై శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గైక్వాడ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ను తక్షణమే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. కోష్యారీ గతంలో కూడా ఇలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. ప్రపంచలోని మరే ఇతర వ్యక్తితోనూ పోల్చలేరని అన్నారు. మహారాష్ట్ర చరిత్ర తెలియని వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ పార్టీకి, సీనియర్ నేతలకు ఇక్కడి చరిత్ర తెలిసినట్టు లేదని చురకలు అంటించారు. ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుని గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేయడంతో మహారాష్ట్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. Shiv Sena MLA Sanjay Gaikwad of Chief Minister Eknath Shinde's faction on Monday demanded that Maharashtra Governor Bhagat Singh Koshyari be shifted out of the state for his recent remarks about Chhatrapati Shivaji Maharaj.https://t.co/bvMkSHjnQS — Economic Times (@EconomicTimes) November 21, 2022 ఇక, అంతకుముందు.. గవర్నర్ వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఖండించారు. గవర్నర్‌ను తక్షణమే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అసలు షిండే మహారాష్ట్ర బిడ్డేనా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్ వెంటనే రాజీనాయాలన్నారు. ఈ ఏడాది వ్యవధిలో గవర్నర్ కోష్యారీ నాలుగుసార్లు ఛత్రపతి శివాజీని అవమానిస్తూ వ్యాఖ్యలు చేశారన్నారు రౌత్. అయినా మహారాష్ట్ర ప్రభుత్వ మౌనంగానే ఉందంటూ విరుచుకుపడ్డారు. అయితే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఔరంగాబాద్‌లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరాఠ్వాడా విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ.. శివాజీ మహారాజ్ పాత విగ్రహం అయిపోయాయని, ఇప్పుడూ మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ నితిన్ గడ్కరీ వంటి వారెందరో అందుబాటులో ఉన్నారని వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనుదుమారం రేపాయి. -
రన్ వేకు దూరంగా ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: నిసర్గ తుఫాను నేపథ్యంలో కురిసిన వర్షం కారణంగా ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో రన్ వై మీద వరద నీరు చేరుకుంది. గురువారం బెంగుళురు నుంచి వచ్చిన ఫెడెక్స్ కార్గో విమానం రన్ వే నుంచి దూరంగా ల్యాండ్ అయింది. ఈ విమానానికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, విమాన కార్యకలాపాలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు పేర్కొన్నారు. దీంతో ముంబై ఎయిర్ పోర్టుకు వచ్చే పలు విమానాల రాకపోకలను నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. తుపాన్ కారణంగా ముంబైకి ఎయిర్ పోర్టుకు వచ్చే మొత్తం 19 విమానాల రాక పోకలను నిలిపి వేస్తున్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు. నిసర్గ తుపాన్ ముందు జాగ్రత్త చర్యగా ఎయిర్‌పోర్టును రాత్రి 7గంటల వరకు మూసివేశారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. -
మిసెస్ శివాజీ
కెరీర్లో మంచి సినిమాలు చేస్తున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమయ్యారు జెనీలియా. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమించి పెళ్లాడారామె. వివాహం తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ రితేష్ దేశ్‌ముఖ్ నటించి, నిర్మించే సినిమాల్లో సరదాగా అతిథి పాత్రల్లో మెరుస్తుంటారు. రితేష్ నటించిన ‘లాయి బహారీ, మౌళి’ సినిమాల్లో తళుక్కున మెరిశారు జెనీలియా. ప్రస్తుతం ఓ పూర్తి స్థాయి పాత్రతో తన కమ్‌బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారట. మహారాష్ట్ర యోధుడు ఛత్రపతి శివాజీ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఇందులో రితేష్ టైటిల్ రోల్ చేయనున్నారు. ఈ సినిమాలో శివాజీ భార్య పాత్రలో కనిపించనున్నారట జెనీలియా. నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. -
ఛత్రపతి శివాజీగా రితేష్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జయంతి బుధవారం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శివాజీ జీవితం ఆధారంగా మూడు భాగాల సినిమాను ప్రకటించారు బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్. మరాఠీ చిత్రం ‘సైరాట్’ ఫేమ్ నాగ్‌రాజ్ మంజులే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అజయ్–అతుల్ సంగీతాన్ని సమకూర్చనున్నారు. మొదటి భాగానికి ‘శివాజీ’, రెండో భాగానికి ‘రాజా శివాజీ’, మూడో భాగానికి ‘ఛత్రపతి శివాజీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. మొదటి భాగం 2021లో విడుదల కానుంది. ‘‘శివాజీ జయంతికి ఈ సినిమాను ప్రకటించడం సంతోషంగా ఉంది’’ అన్నారు చిత్రబృందం. సుమారు నాలుగైదు భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
మోదీ నవ శివాజీ అంటూ పుస్తకం
ముంబై: ‘ఇప్పటి శివాజీ – నరేంద్ర మోదీ’ పేరుతో విడుదలైన పుస్తకం మహారాష్ట్రలో వివాదస్పదమైంది. ఇది మహారాజు ఛత్రపతి శివాజీని అవమానించడమేనని, బీజేపీలో ఉన్న శివాజీ వారసులు దీనిపై తమ అభిప్రాయమేమిటో చెప్పాలని సోమవారం శివసేన నేత సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివాజీని మోదీతో పోల్చడం ద్వారా ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ శివసేన పార్టీ కార్యకర్త దిన్కర్ జగ్దాలే.. పుస్తక రచయిత జయ్ భగవాన్ గోయల్‌పై సోలాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. సోలాపూర్‌లో ఈ పుస్తకంపై నిరసన కూడా జరిగింది. ఈ కేసుకు సంబంధించిన న్యాయపర అంశాలను పరిశీలిస్తున్నందున దరఖాస్తు అందినా, కేసు ఇంకా నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. మోదీ బూట్లు నాకే కొందరు వ్యక్తులు ఇలాంటి పుస్తకాలు రాసి లాభం పొందాలని చూస్తున్నారని సంజయ్‌రౌత్ మండిపడ్డారు. ఈ పుస్తకంతో తమకే సంబంధంలేదని బీజేపీ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. తమకు మోదీ అంటే గౌరవమేనని, అయితే శివాజీతో పోల్చడం అంగీకరించబోమని స్పష్టంచేశారు. శివాజీ వారసులైన బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఛత్రపతి సాంబాజి రాజే, ఇటీవలే బీజేపీలో చేరిన సతారా మాజీ ఎంపీ ఉదయాంజె భోసాలేలు ఈ పుస్తకంపై తమ వైఖరి తెలియజేయాలని కోరారు. ఈ అంశంపై తమ పార్టీ స్పష్టమైన వైఖరి కలిగి ఉందని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా తనకు చెప్పినట్లు ఆయన వెల్లడించారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలనేది తమ పార్టీ వైఖరి అని తెలిపారు. అయితే పుస్తకంలో వివాదాస్పద విషయాలను తిరిగి రాయడానికి సిద్ధంగా ఉన్నానంటూ రచయిత గోయల్ మీడియాతో చెప్పారు. -
విమాన సేవలకు అంతరాయం
ముంబై: భారీ వర్షాలతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రమంలో తాత్కాలికంగా సేవలను నిలిపివేశారు. విమానాల రాకపోకలకు వాతావరణం అనుకులంగా లేకపోవడంతో సేవలను కాసేపు ఆపేసినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా వాతావరణంలో ఊహించని మార్పులు వస్తుండటంతో విమాన సేవలకు అంతరాయం కలిగింది. ఈ ఉదయం 9:15 గంటల నుంచి వాతావరణం మాట మాటికి మారుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో సేవలను కొనసాగించడం సాధ్యం కాదని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు విమాన సర్వీసులేవీ రద్దు చేయలేదని, మూడు విమానాలను మాత్రమే దారి మళ్లించినట్టు తెలిపారు. విమాన సంస్థలు ప్రయాణికులకు ఎప్పటికప్పడు సమచారం అందించాలని, అలాగే ప్రయాణికులు వారికి సంబంధించిన విమానాల వివరాలు అడిగి తెలుసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేసినట్లు స్పైస్ జెట్ ట్విటర్లో పేర్కొంది. -
విమానం నుంచి పడిపోయిన ఎయిర్ హోస్టెస్
ముంబై : బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానం నుంచి పడిపోవడంతో ఓ మహిళా ఎయిర్ హోస్టెస్(53)కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చోటు చేసుకుంది. ముంబై నుంచి ఢిల్లీ వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఏఐ 864 ఎయిరిండియా విమానంలో పనిచేస్తున్న సదరు ఎయిర్ హోస్టెస్ డోర్‌ను క్లోస్ చేసే క్రమంలో విమానంలోంచి పడిపోయినట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం చికిత్సం కోసం ఆ ఎయిర్ హోస్టెస్‌ను నానావతి ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావాల్సివుంది. -
ముంబైకి విమానంలో వెళ్లేవారికి గమనిక
ముంబై: విమానంలో ముంబై నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి, ఇతర ప్రాంతాల నుంచి ముంబైకి వచ్చే వారికి ముఖ్య గమనిక. ఏప్రిల్ 9, 10 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాలు రద్దయ్యాయి. రన్‌వేపై ఉన్న రబ్బర్ డిపాజిట్స్‌ను తొలగించడంలో భాగంగా ఈ సమయాల్లో విమానాల అనుమతిని నిలిపేస్తున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. పూర్తిగా కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంతో పలు విమానయాన సంస్థలు విమాన సర్వీసులను రద్దు చేసి రీషెడ్యూల్ చేశాయి. ఈ రెండు తేదీల్లో విమానయాణం చేసే ప్రయాణికులు సమయ మార్పుల గురించి తమ ఎయిర్‌లైన్స్ వెబ్సైట్లలో తెలుసుకోవాలని సూచించారు. చత్రపతి శివాజీ మహరాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు గతంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఇండియా(ఏఏఐ) ఆధీనంలో ఉండేది. 2006 నుంచి పీపీపీ పద్ధతిలో ముంబై ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు ప్రైవేటు లిమిటెడ్, జీవీకే-లెడ్ కన్సార్టియం, ఏఏఐలు కలిసి ఎయిర్‌పోర్టును నిర్వహణను చూస్తున్నాయి. 75 ఏళ్ల క్రితం సింగిల్ ఇంజిన్ కలిగిన ఒకే విమానంతో ఎయిర్‌పోర్టు ప్రారంభమైంది. ప్రస్తుతం 867 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. సంవత్సరానికి 4.52 కోట్ల మంది ఈ ఎయిర్‌పోర్టు ద్వారా ప్రయాణం చేస్తున్నారు. సింగిల్ రన్‌వే పై ఒకే రోజు 935 విమానాలు రాకపోకలు సాగించడం చత్రపత్రి శివాజీ ఇంటర్నేషనల్ సాధించిన ప్రపంచ రికార్డు. -
శివాజీ పరిపాలన-రెవెన్యూ విధానం
1674, జూన్ 16న పట్టాభిషక్తుడైన శివాజీ.. ఛత్రపతి అనే బిరుదును స్వీకరించాడు. తన రాజ్యానికి ‘స్వరాజ్’ అని నామకరణం చేశాడు. సైన్యాన్ని నడపడంలోనూ, గెరిల్లా యుద్ధాలు చేయడంలోనూ శివాజీ అసమాన ప్రతిభను కనబరిచాడు. పరిపాలనలో ప్రజా సంక్షేమానికి బాటలు పరిచాడు. ఇందుకోసం మంచి పరిపాలన వ్యవస్థను ఏర్పాటు చేశాడు. పరిపాలనలో తనకు సహకరించడానికి ఎనిమిది మంది మంత్రులను నియమించుకున్నాడు. వారిని ‘అష్ట ప్రధానులు’గా పిలిచేవారు. పీష్వా: అష్ట ప్రధాన వ్యవస్థలో పీష్వా అత్యంత ప్రధానమైన వ్యక్తి. ఇతనిది ప్రధానమంత్రి హోదా. చక్రవర్తి తర్వాత స్థానం అతనిదే. రాజ శాసనాలపై పీష్వా అధికార ముద్ర ఉండేది. అమాత్య: ఇతడ్ని మజుందార్ అని కూడా వ్యవహరించేవారు. ఆర్థిక శాఖకు అధినేత. స్వరాజ్ ఆదాయ వ్యయాలన్నీ ఈయన అధీనంలోని ముఖ్య అధికారులు, ఉద్యోగులు చూసుకొనేవారు. మంత్రి: రాజ దర్బారుకు సంబంధించిన కార్యకలాపాలు, ఆస్థాన వ్యవహారాలను నిర్వహించడం, ముఖ్య సమావేశాలను ఏర్పాటు చేయడం ఇతని విధి. సచివ: చక్రవర్తి తరఫున ఉత్తరాలను, అధికార ప్రకటనలను రాసి రాష్ట్రాల అధికారులకు, సామంత రాజులకు అందజేయడం ఇతని విధి. సుమంత్: ఇతడు విదేశాంగ శాఖ అధినేత. ఇతర రాజ్యాలతో సంబంధాలు, యుద్ధాలు, ఒప్పందాలు తదితర అంశాల్లో చక్రవర్తికి సలహాలిచ్చేవారు. సేనాపతి: సైనిక బలగాల అధిపతి. సైనికుల నియామకం, శిక్షణ మొదలైన విధులు నిర్వర్తించేవారు. పండిత్ రావ్: మత వ్యవహారాల శాఖ మంత్రి. న్యాయాధీశ్: స్వరాజ్‌లో ఉన్నత న్యాయాధికారి. రెవెన్యూ విధానం రైతు సంక్షేమాన్ని, ప్రజాహితాన్ని దృష్ట్టిలో పెట్టుకొని శివాజీ భూమిశిస్తు, రెవెన్యూ విధానాన్ని రూపొందించాడు. భూమిశిస్తు శాఖలో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు నగదు రూపంలో జీతభత్యాలు చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టాడు. మొత్తం ఫలసాయంలో ఐదింట రెండో వంతును(2/5) భూమిశిస్తుగా నిర్ణయించాడు. భూమి శిస్తును ధన రూపంలో, ధాన్య రూపంలో చెల్లించవచ్చు. జాగీర్దారీ పద్ధతిని రద్దు చే శాడు. కరువు కాటకాల సమయంలో రైతులకు విత్తనాలు, పశువులను కొనడానికి రుణాలిచ్చేవారు. రైతాంగానికి సులభ వాయిదా పద్ధతిపై రుణాలిచ్చే సౌకర్యం కల్పించారు. మహారాష్ర్ట ప్రజలు దోపిడీ, దండయాత్రలకు గురి కాకుండా ఉండేందుకు కొన్ని ప్రాంతాల్లో చౌత్ (1/4) అనే పన్నును విధించారు. ఇది జిల్లా ఆదాయంలో నాల్గో వంతు ఉండేది. శివాజీ గౌరవార్థం సర్దేశ్ముఖ్ అనే పన్ను విధించారు. ఇది జిల్లా ఆదాయంలో పదోవంతు ఉండేది. ప్రభుత్వ కోశాగారానికి వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ భాగం ప్రజాహితానికి వ్యయం చేసేవారు. లార్డ కారన్ వాలీస్ (1786-93) శాశ్వత భూమిశిస్తు విధానం: లార్డ కారన్ వాలీస్ 1786లో గవర్నర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇతడ్ని భారతదేశానికి పంపేటప్పుడు రాజ్య విస్తరణ జోలికి వెళ్లవద్దని, పరిపాలనా వ్యవస్థ మీద ముఖ్యంగా భూమిశిస్తు సంస్కరణలపై దృష్టి పెట్టాలని ఇంగ్లండ్ ప్రభుత్వం ఆదేశించింది. లార్డ కారన్ వాలీస్ గవర్నర్ జనరల్ అయ్యే నాటికి జమిందారులు భూమిశిస్తును వసూలు చేసి అందులో తమ వాటా పోగా మిగిలింది ప్రభుత్వానికి చెల్లించేవారు. ఈ పద్ధతిలో ఏ ఏడాదికి ఆ ఏడాదే శిస్తు నిర్ణయమయ్యేది. అందుకే దీన్ని తాత్కాలిక పద్ధతిగా పేర్కొనేవారు. ఈ రకమైన భూమిశిస్తు వల్ల ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కచ్చితత్వం ఉండేది కాదు. ఈ లోపాలను సరిదిద్దడానికి 1793లో (జమిందారీ) శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు. వేలంపాటలో ఎక్కువ పాట పాడిన వ్యక్తులకు రైతుల నుంచి శిస్తు వసూలు చేసే అధికారం కల్పించారు. వీరినే జమిందారులుగా పేర్కొన్నారు. వేలం పాట వ్యవధి 25 నుంచి 30 సంవత్సరాలు ఉండేది. జమిందారీ పద్ధతి రూపశిల్పి అప్పటి రెవెన్యూ బోర్డు అధ్యక్షుడు సర్ జాన్ షోర్. భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కచ్చితంగా ఉండేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీన్ని మొదటగా బెంగాల్, బిహార్, ఒడిశా, వారణాసి తదితర ప్రాంతాలతోపాటు మద్రాస్‌లో ఉన్న ఆంధ్ర ప్రాంతంలోనూ ప్రవేశపెట్టారు. ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రాబల్యం ఉన్న బలమైన జమిందారీ వర్గం ప్రభుత్వానికి విధేయంగా ఉండే పరిస్థితులు ఏర్పడ్డాయి. జమిందార్ల ఆదాయం పెరగడంతో విలాస జీవితానికి, వ్యసనాలకు అలవాటుపడ్డారు. దీంతో రైతు సంక్షేమాన్ని, వ్యవసాయాభివృద్ధిని అశ్రద్ధ చేయడంతో రైతాంగం అనేక ఇబ్బందులకు గురైంది. విలియం బెంటింక్ (1828-35) విలియం బెంటింక్ గవర్నర్ జనరల్ పదవి చేపట్టే నాటికి అధిక వ్యయాల కారణంగా ప్రభుత్వం అప్పుల్లో ఉంది. దీంతో ఆయన ఖర్చులను తగ్గించేందుకు చర్యలు చేపట్టాడు. సైనికుల భత్యాలను తగ్గించాడు. సైన్య, న్యాయ శాఖ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాడు. బెంగాల్, మద్రాస్, బొంబాయి రాష్ట్రాల్లోని అదనపు సైన్యాన్ని తగ్గించాడు. నల్ల మందు వ్యాపారాన్ని క్రమబద్ధం చేశాడు. ఎక్కువ వేతనాలు పొందే ఇంగ్లండ్ వారికి బదులు తక్కువ వేతనాలకు భారతీయులను ఉన్నత పదవుల్లో నియమించాడు. ఈ సంస్కరణల ఫలితంగా ఒక మిలియన్ పౌండ్ల్ల లోటు పూడ్చడమే కాకుండా, ఒక మిలియన్ పౌండ్ల మిగులును సాధించాడు. మహళ్వారీ పద్ధతి 1833లో విలియం బెంటింక్ ఈ పద్ధతిని ప్రవేశపెట్టాడు. దీని రూపకర్త హాల్డ్ మెకంజే. ఈ విధానం ప్రకారం ఒక గ్రామంలోని భూమి అంతా ఆ గ్రామస్తులకు చెందిన ఆస్తిగా భావించి భూమికి సంబంధించిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆ గ్రామం మొత్తానికి ఉమ్మడిగా శిస్తు విధించేవారు. గ్రామపెద్ద లంబార్దార్ శిస్తును వసూలు చేసేవాడు. శిస్తును వసూలు చేసినందుకు బ్రిటిష్ ప్రభుత్వం అతనికి 5 శాతం (పంచోత్రా) కమీషన్ ఇచ్చేది. ఈ పద్ధతి ఉత్తరప్రదేశ్, ఔద్, పంజాబ్ తదితర ప్రాంతాల్లో అమల్లో ఉండేది. థామస్ మున్రో రైత్వారీ పద్ధతి 1792లో సేలం జిల్లాలోని బారామహల్ ప్రాంతంలో నాటి కలెక్టర్ కెప్టెన్ రీడ్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు. కానీ ఇది ప్రచారంలోకి రాలేదు. కెప్టెన్ రీడ్‌కు సహాయ కలెక్టర్ అయిన థామస్ మున్రో 1800లో దత్త మండలాలకు కలెక్టర్ అయిన తర్వాత ఈ పద్ధతిని విజయవంతంగా అమలు చేశాడు. మద్రాసు, బొంబాయి, అస్సాం తదితర ప్రాంతాల్లో ఈ పద్ధతిని అమలు చేశాడు. ఈ విధానంలో ప్రభుత్వానికి, రైతులకు ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. మధ్యవర్తులు లేని విధానం కావడం వల్ల దీన్ని భూస్వామ్య పద్ధతుల్లో మేలైందిగా పేర్కొనవచ్చు. బ్రిటిష్ - ఆర్థిక విధానాలు ప్లాసీ యుద్ధం (1757) వరకు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ కేవలం ఒక వర్తక సంఘంగా మాత్రమే వ్యవహరించేది. ఇంగ్లండ్‌లో తయారైన పారిశ్రామిక ఉత్పత్తులను మన దేశంలో అమ్మేవారు. మనదేశంలో కుటీర పరిశ్రమల్లో తయారైన కళాత్మక వస్తువులను ఇంగ్లండ్, ఐరోపా దేశాల్లో అధిక ధరలకు విక్రయించి మంచి లాభాలను గడించేవారు. ఈస్టిండియా కంపెనీ, వారి వ్యాపార కార్యకలాపాలు మనదేశ వస్తువుల ఉత్పత్తికి ఊతమిచ్చాయి. దీంతో బ్రిటిష్ ఉత్పత్తిదారులు కోపంతో రగిలిపోయారు. మనదేశ వస్తువుల దిగుమతులపై అనేక ఆంక్షలు విధించేందుకు వీలుగా బ్రిటిష్ పార్లమెంటులో అనేక చట్టాలు తీసుకువచ్చారు. అయినప్పటికీ మనదేశ వస్తువులకు 18వ శతాబ్దం మధ్యభాగం వరకు ఇంగ్లండ్‌లో మంచి గిరాకీ ఉండేది. ఈస్టిండియా కంపెనీ మనదేశంలో క్రమేపీ రాజ్య విస్తరణలో ఆసక్తి చూపడం వల్ల, 1757తర్వాత వారి వ్యాపార సరళిలో మార్పు వచ్చింది. కంపెనీ తన రాజకీయ, సైనిక శక్తిని ఉపయోగించి మన ఉత్పత్తులను తక్కువ ధరలకు బ్రిటిష్ వర్తకులకు మాత్రమే అమ్మేలా నిర్బంధ చర్యలకు పూనుకుంది. 18వ శతాబ్దం మధ్య భాగంలో ఇంగ్లండ్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం మూలంగా వస్తూత్పత్తిలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. మనదేశ వ్యాపారంలో ఈస్టిండియా కంపెనీకి మాత్రమే ఉన్న గుత్తాధిపత్య అధికారాన్ని 1813లోని చార్టర్ చట్టం ద్వారా తొలగించారు. దీంతో ప్రతి బ్రిటిష్ పౌరుడు మనదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. భారతదేశం.. ఇంగ్లండ్ పాలనలో ఉన్నందుకు వారి అవసరాలకు అనుగుణంగా మన ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకున్నారు. మనదేశాన్ని ఒక వలస రాజ్యంగా మార్చడం వల్ల, వారి ఆర్థిక విధానాల మూలంగా మన చేనేత, కళాత్మక చేతివృత్తులు ధ్వంసమయ్యాయి. మనదేశ సంపదను వీలైంత మేరకు ఇంగ్లండ్ కొల్లగొట్టింది. దాదాపు రెండు శతాబ్దాలపాటు తిరుగులేని రాజ్యాధికారం చెలాయించి, దేశ సంపదను కొల్లగొట్టి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. బ్రిటిష్ వారి కంటే ముందు మనదేశాన్ని ఆక్రమించి పాలించిన విదేశీయులు మనదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని గుర్తించారు. భారత, ఆర్థిక, రాజకీయ జీవన స్రవంతిలో భాగమై పరిపాలన కొనసాగించారు. అయితే బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నడూ మనదేశ జీవనంలో అంతర్భాగం కాలేదు. అక్కెనపల్లి మీనయ్య ఎకనామిక్స్ (హెచ్‌వోడీ)- రిటైర్డ్ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నల్లగొండ -
విడిపోయిన లోకల్రైలు బోగీలు
మోటర్‌మెన్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి కల్యాణ్ బయలుదేరిన లోకల్ రైలు మధ్య కప్లింగ్ ఊడి బోగీలు విడిపోయాయి. అయితే మోటార్‌మెన్ (డ్రైవర్) అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం దీవా-కోపర్ స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. దీనివల్ల దాదాపు గంటకుపైగా లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. సాయంత్రం విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనేకమంది రైలు దిగి కాలినడకన వెళ్లిపోయారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో దీవా స్టేషన్ నుంచి లోకల్ రైలు కల్యాణ్ దిశగా బయలుదేరింది. కొంత దూరం వెళ్లగానే ఏడో బోగీ, ఎనిమిదో బోగీ మధ్యనున్న కప్లింగ్ ఊడింది. అప్పటికీ రైలు వేగం పుంజుకోలేదు. ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లిపోయింది. వెనకా ఉన్న ఐదు బోగీలు కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. చీకటి కారణంగా రైలులో ఉన్న ప్రయాణికులకు అసలేం జరిగిందో తెలియలేదు. బయటకు తొంగి చూడగా కప్లింగ్ ఊడిపోవడంతో ఏడు బోగీలతో రైలు ముందుకు వెళ్లినట్లు గుర్తించారు. ఐదు బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులు కిందికి దిగేశారు. ఈ విషయాన్ని గుర్తించిన మోటార్‌మెన్ వెంటనే రైలును ఆపాడు. తర్వాత విడిపోయిన ఐదు బోగీలను కారుషెడ్డుకు తరలించారు. అప్పటికే వెనకాల వచ్చిన రైళ్లన్నీ ట్రాక్‌పై నిలిచిపోయాయి. కొన్ని లోకల్ రైళ్లను వీలున్న చోట దారి మళ్లించి ఫాస్ట్ ట్రాక్ మీదుగా నడిపారు. రైళ్లను పునరుద్ధరించడానికి అధికారులు కష్టపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత రైళ్లన్నీ షెడ్యూల్ ప్రకారం నడిచాయి.