ఛత్రపతి శివాజీగా పాన్‌ ఇండియా హీరో.. పోస్టర్‌ విడుదల | Rishab Shetty Next Project 'The Pride Of Bharat: Chhatrapati Shivaji Maharaj' Announced | Sakshi
Sakshi News home page

ఛత్రపతి శివాజీగా పాన్‌ ఇండియా హీరో.. పోస్టర్‌ విడుదల

Published Tue, Dec 3 2024 1:23 PM | Last Updated on Tue, Dec 3 2024 1:33 PM

Rishab Shetty Next Project 'The Pride Of Bharat: Chhatrapati Shivaji Maharaj' Announced

కన్నడ హీరో రిషబ్‌ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్‌ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు.   ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌'. భారీ బడ్జెట్‌ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్‌తో తాజాగా  రిషబ్‌ ప్రకటించారు. సందీప్‌ సింగ్‌ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్‌ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం.  యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని,  స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్‌టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.

కాంతార సినిమా తర్వాత రిషబ్‌ శెట్టి మార్కెట్‌ పాన్‌ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్‌తో పాటు జై హనుమాన్‌ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్‌' వంటి బిగ్‌ ప్రాజెక్ట్‌లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్‌ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement