breaking news
Rishab Shetty
-
కాంతార చాప్టర్-1 షూట్.. ఆ సీన్స్ కోసం ఏకంగా!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ కాంతార చాప్టర్-1. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ ఏడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది.ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో కాంతార టీమ్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టి మూవీ షూటింగ్ సహకరించిన అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలిపారు. కుందాపురకు చెందిన ఉవా మెరిడియన్ ఫిల్మ్ స్టూడియో యాజమానులు ఉదయ్ కుమార్ శెట్టి, వినయ్ కుమార్ శెట్టి తమ సినిమా కాంతార చాప్టర్-1 ఎంతో సహకరించారని అన్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కోసం 22 వేల చదరపు అడుగుల ఏసీ సెట్‌ను రూపొందించారని వెల్లడించారు. ఇందులోనే ఇండోర్ సీక్వెన్స్ తెరకెక్కించామని ట్విటర్లో పోస్ట్ చేశారు. తన మూవీకి మద్దతుగా నిలిచిన మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాంతార చాప్టర్-1 మూవీని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. రిషబ్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినిమా ఛావాను అధగమించింది. అంతేకాకుండా కన్నడ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో మూవీగా ఘనత సాధించింది. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. Uday Kumar Shetty and Vinay Kumar Shetty, the dynamic brothers from Kundapura and proud owners of Uva Meridian!. They helped to build a 22,000 sq.ft A/C floor for shooting Kantara Chapter 1, where all of our indoor sequences was shot. We remain thankful for their constant support… pic.twitter.com/hUPGm3F4qy— Rishab Shetty (@shetty_rishab) November 1, 2025 -
కాంతార చాప్టర్-1.. పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 (Kantara Chapter1) బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది.అయితే ఈ మూవీని కేవలం ఇండియన్ భాషల్లో మాత్రమే కాకుండా ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తాజాగా మరో దేశానికి చెందిన భాషల్లో కాంతార చాప్టర్-1ను విడుదల చేస్తున్నారు. స్పానిష్ భాషలోనూ ఈ మూవీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా స్పానిష్ భాషలో కాంతార చాప్టర్-1 ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈనెల 31న కాంతార చాప్టర్-1 థియేటర్లలో సందడి చేయనుందని ట్విటర్లో పోస్ట్ చేశారు మేకర్స్. Una saga divina que comenzó en la India… ahora conquista el mundo. Estreno el 31 de octubre en cines de todo el mundo, en español. 🇪🇸❤️🔥 #KantaraChapter1 Spanish (Española) Trailer out now.▶️ https://t.co/AMQ74XYxpf#Kantara @hombalefilms @KantaraFilm @shetty_rishab… pic.twitter.com/Ww5F82BNxF— Hombale Films (@hombalefilms) October 30, 2025 -
'మహాకాళి'గా భూమి శెట్టి.. ఎవరో తెలుసా..?
టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయూ)తో మరో కన్నడ బ్యూటీ బిగ్ ఛాన్స్ దక్కించుకుంది. పీవీసీయూలో వచ్చిన తొలి సినిమా ‘హనుమాన్’.. ఇదే యూనివర్స్‌లో ‘మహాకాళి’ మూవీ రానుంది. ఫీమేల్ సూపర్ హీరో సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కు ప్రశాంత్ వర్మ కథ అందిస్తుండగా.. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. మహాకాళిగా కనిపించనున్న భూమి శెట్టి (27) గురించి తెలుసుకునేందుకు కొందరు నెటిజన్లు సోషల్‌మీడియాలో వెతుకుతున్నారు.ప్రముఖ నటుడు రిషబ్ శెట్టి జన్మించిన కుందాపుర గ్రామమే భూమి శెట్టిది కూడా.. భాస్కర్, బేబీ శెట్టి దంపతులకు జన్మించిన భూమి కన్నడ, తెలుగు అనర్గళంగా మాట్లాడుతుంది. ఆమె చదువుకునే రోజుల్లో యక్షగానం (నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత) నేర్చుకుంది. కుందాపురలోనే తన పాఠశాల విద్యను భూమి పూర్తి చేసింది. దగ్గర్లోనే ఉన్న ఆర్.ఎన్. శెట్టి పి.యు. కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. తరువాత బెంగళూరులోని AMC ఇంజనీరింగ్ కళాశాల నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రురాలైంది.చిన్నప్పుడే యక్షగానంలో శిక్షణ పొందడంతో రంగస్థలంపై రాణించాలనే ఆసక్తి ఆమెలో ఉండేది. అలా మొదట కన్నడ సీరియల్ కిన్నరితో కెరీర్ ప్రారంభించిన భూమి... తెలుగు సీరియల్ నిన్నే పెళ్లాడతాలో ప్రధాన పాత్రలో మెరిసింది. అలా వచ్చిన పాపులారిటీతో బిగ్ బాస్ కన్నడ సీజన్- 7 టాప్ ఫైవ్‌లో నిలిచింది. బిగ్‌బాస్‌తో వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమా ఛాన్స్ వచ్చింది. కన్నడ చిత్రం ఇక్కత్ (2021)తో హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఏడాదిలో విడుదలైన కింగ్డమ్ చిత్రంలో సత్య దేవ్ సతీమణి గౌరి పాత్రలో కనిపించింది. ఇప్పుడు, మహాకాళితో భూమి శెట్టికి బిగ్ ఛాన్స్ వచ్చింది. View this post on Instagram A post shared by ಭೂMee🐚 (@bhoomi_shettyofficial) -
కాంతార చాప్టర్ 1 ఓటీటీపై షాకింగ్ నిర్ణయం.. అసలు కారణమదే!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా ఈ ఏడాదిలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మొదటి సినిమాగా నిలిచింది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను అధిగమించింది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన ఈ ప్రీక్వెల్.. త్వరలోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకుంటుందని అంతా భావించారు.ప్రస్తుతం థియేటర్లలో కాంతారకు పోటీగా పెద్ద చిత్రాలు కూడా లేకపోవడం కలిసొస్తుందని అనుకున్నారు. కానీ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోన్న టైమ్‌లో ఓటీటీ రిలీజ్ విషయంలో మేకర్స్ ట్విస్ట్ ఇచ్చారు. రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీకి తీసుకు రావడంపై ఫ్యాన్స్ సైతం షాకవుతున్నారు. బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న సమయంలోనే ఓటీటీ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించడం కాంతార అభిమానులను డైలామాలో పడేసింది. ఈ ప్రకటనతో మూవీ వసూళ్లపై ప్రభావం పడుతుందని చాలా మంది ఆడియన్స్ ప్రశ్నించారు. దీంతో తాజాగా ఓటీటీ రిలీజ్‌పై హోంబాలే ఫిల్మ్స్ నిర్మాతల్లో ఒకరైన చలువే గౌడ స్పందించారు. త్వరగానే ఓటీటీకి తీసుకురావడంపై క్లారిటీ ఇచ్చారు.చలువే గౌడ మాట్లాడుతూ..'ఈ సినిమా తమిళం, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం వర్షన్లు మాత్రమే ప్రస్తుతం ఓటీటీలో విడుదలవుంది. అయితే హిందీ వర్షన్ వచ్చేది ఇప్పుడు కాదు. ఎనిమిది వారాల తర్వాత మాత్రమే ఓటీటీకి వస్తుంది. ఎందుకంటే ఈ ఒప్పందం మూడేళ్ల క్రితమే జరిగింది. అందుకే ఇది మా వంతు బాధ్యత. అప్పట్లో పరిస్థితులు భిన్నంగా ఉండేది. కొవిడ్‌కు ముందు అన్ని సినిమాలకు ఎనిమిది వారాల సమయం ఉండేది. ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఓటీటీకి వచ్చినప్పటికీ థియేట్రికల్ రన్ ఇంకా కొనసాగుతుంది. డిజిటల్ రిలీజ్ తర్వాత కూడా కలెక్షన్స్ సాధిస్తుందని నమ్మకముంది. ఓటీటీకి రావడం 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే కలెక్షన్లపై ప్రభావం ఉంటుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.కాగా.. ఈ దీపావళికి థియేటర్లలో థామా, ఏక్ దీవానే కి దేవానియాత్ లాంటి బాలీవుడ్ సినిమాలు ఉన్నప్పటికీ కాంతార చాప్టర్ 1 హిందీ వర్షన్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అక్టోబర్ 2న దసరా కానుకగా విడుదలైంది. -
ఓటీటీకి కాంతార చాప్టర్ 1.. అఫీషియల్ డేట్ వచ్చేసింది
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ మేకర్స్ ఉత్కంఠకు తెరదించారు. అంతా ఊహించినట్లుగానే అక్టోబర్ 31 నుంచే అమెజాన్ ప్రైమ్‌లో అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండనుందని వీడియోను షేర్ చేసింది. హిందీ భాషలో స్ట్రీమింగ్కు సంబంధించి ఎలాంటి ప్రకటనైతే రాలేదు.చాప్టర్ 1 కథేంటంటే?'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ. get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2— prime video IN (@PrimeVideoIN) October 27, 2025 -
'కాంతార 1' కోసం రుక్మిణి ఇంత కష్టపడిందా?
-
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి 'కాంతార-1'
ఈ నెల ప్రారంభంలో రిలీజై బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన సినిమా 'కాంతార 1'. ఇదొచ్చిన తర్వాత పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం థియేటర్లలోకి రాలేదు. దీంతో పలు భాషల్లో ఇప్పటికీ బాగానే ప్రదర్శితమవుతోంది. రెండు మూడు రోజుల క్రితం రూ.800 కోట్ల కలెక్షన్స్ దాటినట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో రూ.1000 కోట్ల మార్క్ త్వరలోనే అందుకుంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో ఓటీటీ గురించి అప్డేట్ వచ్చేసింది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)2022లో రిలీజైన మూవీ అమెజాన్ ప్రైమ్‌లో ఉండగా.. ఈ సినిమా కూడా దీనిలోనే రానుందని సదరు ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది. 'లెజెండ్ కంటిన్యూస్' అని ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. దీనిబట్టి చూస్తే 'కాంతార ఛాప్టర్ 1' కూడా వేగంగానే ఓటీటీలోకి వచ్చేయబోతుందనమాట. అభిమానులు మాత్రం థియేటర్లలో ఉండగానే వచ్చేయడమేంటి? ఇంకొన్నిరోజులు ఆగి వస్తే బాగుంటుంది కదా అని అభిప్రాయపడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ వీకెండ్లోనే అంటే అక్టోబరు 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్స్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముందని.. హిందీ వెర్షన్ మాత్రం కొన్ని వారాల తర్వాత అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్‌కి పండగే అని చెప్పొచ్చు. చూడాలి మరి ఎప్పుడు స్ట్రీమింగ్‌లోకి వస్తుందో?(ఇదీ చదవండి: మహాభారతాన్ని అద్భుతంగా చూపించిన సిరీస్.. ఓటీటీ రివ్యూ)'కాంతార 1' విషయానికొస్తే.. తొలిభాగం ప్రస్తుతంలో జరిగితే ఈసారి మాత్రం శతబ్దాల వెనక్కి వెళ్తుంది. విజయేంద్ర (జయరామ్) బాంగ్రా రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఇతడికి కులశేఖరుడు (గుల్షన్ దేవయ్య) అనే కొడుకు. అతనికి మహారాజ పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకుంటాడు తండ్రి. మందుకొట్టడం తప్ప అసలు పాలన ఏం చెయ్యడు. యువరాజు చెల్లెలు కనకవతి (రుక్మిణి వసంత్). ఈ రాజ్యానికి దగ్గరలోని కాంతార అనే ప్రాంతంలో కొన్ని తెగలు ఉంటాయి.కాంతార తెగకు ప్రత్యర్థులు కడపటి దిక్కువాళ్లు. వాళ్ల మధ్యలో పోరు ఎలా ఉన్నా, ఈ కాంతార తెగలో కొందరు బాంగ్రా రాజ్యానికి వస్తారు. వారి నౌకాతీరాన్ని ఆక్రమించుకుంటారు. ఈ గొడవ వల్ల బాంగ్రా రాజుకి, కాంతార నాయకుడు బెర్మే (రిషబ్)కి గొడవ అవుతుంది. ఈ క్రమంలో కులశేఖరుడు బెర్మే తల్లిని చంపేసి, అతని ఊరిని తగలబెట్టేస్తాడు. తర్వాత ఏమైంది? అసలు విలన్ ఎవరనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. బిగ్ బాస్ 8వ వారం నామినేషన్స్ లిస్ట్)...to become LEGENDARY 🔥 pic.twitter.com/xRh6zFJkS1— prime video IN (@PrimeVideoIN) October 26, 2025 -
'కాంతారా చాప్టర్ 1' మేకింగ్ వీడియో
-
'మాయకర'గా రిషబ్ శెట్టి.. మేకప్ కోసం అన్ని గంటలా! (మేకింగ్ వీడియో)
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి (Rishab Shetty) ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. ఈ మూవీలోని యాక్షన్ సీన్స్ కోసం డూప్ ఉపయోగించకుండా రిషబ్ రిస్క్ చేశారని తెలిసిందే. ఈ మూవీకి ఎంతో కీలకమైన పాత్ర 'మాయకర'గా కూడా రిషబ్‌నే నటించారని ఒక మేకింగ్ వీడియోతో చిత్ర యూనిట్ పంచుకుంది. 'మాయకర' పాత్ర మేకప్ కోసం ఆయన పడిన శ్రమ ఎలాంటిదో చూపించారు. కేవలం మేకప్ కోసమే ఆరు గంటల పాటు శ్రమ పడాల్సి వచ్చిందని తెలిపారు. ఉదయం షూటింగ్ ఉందంటే అర్ధరాత్రి 12:30 నుంచే రిషబ్ మేకప్ పనులు మొదలౌతాయని పేర్కొన్నారు. మాయకర పాత్ర కోసం ఆయన చాలా శ్రమించడం వల్లనే తెరపై గుర్తించలేనంతగా మనకు కనిపించారని చెప్పొచ్చు. -
'కాంతార' రిషభ్ ఇంట్లో ఇన్ని కార్స్ ఉన్నాయేంటి?
మూడేళ్ల క్రితం సెన్సేషన్ సృష్టించి, రీసెంట్గా మరోసారి పాన్ ఇండియా లెవల్లో రచ్చ చేసిన హీరో రిషభ్ శెట్టి. 2022లో వచ్చిన 'కాంతార'తో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. కొన్నాళ్ల క్రితం వచ్చిన 'కాంతార-1'తో మరో బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు. రూ.800 కోట్ల మార్క్ దాటి ప్రస్తుతం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. సరే ఇదంతా పక్కనబెడితే తాజాగా రిషభ్.. కుందాపురలోని తన ఇంట్లో దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు బయటకు రాగా అందులోని ఓ విషయం ఆసక్తికరంగా అనిపించింది.వాటర్ క్యాన్ బిజినెస్‌తో కెరీర్ మొదలుపెట్టిన రిషభ్ శెట్టి.. తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. తొలుత దర్శకుడిగా, తర్వాత హీరోగా పలు సినిమాలు చేశాడు. అయితే 'కాంతార'తో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ చిత్రానికి ప్రీక్వెల్తో వచ్చి మరో సక్సెస్ అందుకున్నాడు. రీసెంట్గా కుటుంబంతో కలిసి దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే రిషభ్ ఇంట్లో ఏకంగా ఐదు ఖరీదైన కార్లు ఉండటం ఇంట్రెస్టింగ్గా అనిపించింది.(ఇదీ చదవండి: మరో సీక్వెల్లో ప్రభాస్.. రెండేళ్లు ఆగాల్సిందే?)రిషభ్ భార్య ప్రగతి శెట్టి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోల్లో వీళ్ల ఇల్లు అంతా క్లియర్‌గా చూడొచ్చు. అలానే ఆడీ క్యూ7, మహీంద్రా థార్, టయోటా వెల్ ఫైర్, జీప్ కంపాస్ ట్రైల్హాక్ తదితర కార్లు కూడా కనిపించాయి. దీంతో రిషభ్ దగ్గర చాలానే కార్లు ఉన్నాయని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. కార్లతో పాటు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టార్ 650 లాంటి కాస్ట్ లీ బైక్స్ కూడా రిషభ్ దగ్గర ఉన్నాయట.రిషభ్ తర్వాత సినిమాల విషయానికొస్తే కొన్నాళ్ల పాటు దర్శకత్వం పక్కనబెట్టబోతున్నాడు. త్వరలో ప్రశాంత్ వర్మ తీయబోయే 'జై హనుమాన్' సెట్స్‌లో అడుగుపెడతాడు. ఇది కాకుండా ఛత్రపతి శివాజీ బయోపిక్, తెలుగులో సితార సంస్థలో ఓ పీరియాడిక్ మూవీ చేయబోతున్నాడు. ఈ మూడు పూర్తయ్యేసరికి 2028 అయిపోవచ్చు. తర్వాతే 'కాంతార ఛాప్టర్ 2' ఉండొచ్చేమో చూడాలి?(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమాలు) ಬೆಳಕಿನ ಈ ಹಬ್ಬ, ಪ್ರೀತಿ ಹಂಚುವ ಸುಂದರ ಕ್ಷಣಗಳು..✨A festival of lights, a lifetime of memories..Grateful for family, love, and laughter this Deepavali..#Deepavali20251/2 pic.twitter.com/wL6WMXzsW4— Pragathi Rishab Shetty (@PragathiRShetty) October 25, 2025 -
ఛావాను బీట్ చేసిన కాంతార చాప్టర్.. ఎన్ని కోట్లు వచ్చాయంటే?
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనం సృష్టిస్తోంది. దసరా కానుకగా థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కేవలం మూడు వారాల్లోనే ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్ మూవీ ఛావాను దాటేసింది.కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రూ.100 కోట్లు సాధించిన రెండో డబ్బింగ్ చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్-2 తర్వాత ఈ రికార్డ్ సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ.818 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే విక్కీ కౌశల్, రష్మిక మందన్నా నటించిన ఛావా (రూ.807 కోట్లు) రికార్డ్‌ను అధిగమించింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ట్విటర్లో పోస్ట్ చేశారు. 2025లో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలిచిందన్నారు. తమిళనాడులోనూ 3వ అత్యధిక వసూళ్లు రాబట్టిన డబ్బింగ్ చిత్రంగా ఘనత సొంతం చేసుకుంది.ఇంగ్లీష్‌లోనూ కాంతార చాప్టర్-1ఈ ప్రీక్వెల్‌కు వస్తున్న ఆదరణ చూసి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మూవీని ఇంగ్లీష్‌లోకి డబ్ చేసి రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాంతార చాప్టర్ 1 ఇంగ్లీష్ వర్షన్ అక్టోబర్ 31 విడుదల చేస్తామని పోస్టర్ పంచుకున్నారు. ఈ మూవీ రన్‌టైమ్ రెండు గంటల 14 నిమిషాల 45 సెకన్లుగా ఉంటుందని వెల్లడించారు. ఇండియన్ భాషల్లో రిలీజైన ఒరిజినల్ రన్‌టైమ్ రెండు గంటల 49 నిమిషాలు కాగా.. ఆంగ్ల వర్షన్లో ఏకంగా 35 నిమిషాలకు తగ్గించారు. ఇప్పటికే పలు రికార్డ్‌లు సాధించిన ఈ చిత్రం మరో ఘనతను సొంతం చేసుకుంది. ఇంగ్లీష్‌లోకి డబ్ చేసిన తొలి ఇండియన్ చిత్రంగా కాంతార చాప్టర్-1 నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. #KantaraChapter1 is now the Highest Grossing Indian Film of 2025.. 🔥 Joining the elite league after #KGF2…#KantaraChapter1 becomes only the 2nd dubbed film to storm past ₹100 Cr in Telugu States!3rd highest Dubbed film in TN..And its worldwide roar now crosses… pic.twitter.com/gCzgfUL8l9— Ramesh Bala (@rameshlaus) October 24, 2025 -
‘కాంతార’పై ఆలస్యంగా స్పందించిన అల్లు అర్జున్..కారణం?
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతార: చాప్టర్ 1(Kantara: Chapter 1) సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. దసరా కానుకగా అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్స్ పరంగా ఇప్పటికే పలు రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 818 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తెలుగులోనూ ఇప్పటికే రూ. 110 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. సినిమా అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా రిషబ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కూడా కాంతార: చాప్టర్‌పై ప్రశంసలు జల్లు కురిపించారు. ఈ సినిమా తనను ఎంతగానో ఆకట్టుకుందని ట్వీట్ చేశాడురిషబ్..వన్‌మ్యాన్ షో‘నిన్న రాత్రి కాంతార చాప్టర్ 1 సినిమా చూశాను. వావ్..ఎంత అద్భుతమైన సినిమా. ఈ మూవీ చూస్తూ నేను ట్రాన్స్‌లోకి వెళ్లిపోయా. రచయితగా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా రిషబ్ శెట్టి వన్‌మ్యాన్ షో అని చెప్పాలి. ప్రతి క్రాప్ట్‌లో ఆయన రాణించారు. రుక్మిణి, జయరామ్, గుల్షన్ దేవయ్యతో పాటు మిగతా నటీనటులంతా చక్కగా నటించారు. టెక్నికల్ టీమ్ పనితీరు అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అజనీష్ సంగీతం, అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ, ధరణి ఆర్ట్ డైరెక్టన్, అరుణ్ రాజ్ స్టంట్స్ చాలా బాగున్నాయి. నిర్మాత విజయ్ కిరంగదూర్, హోంబులే బ్యానర్‌కి శుభాకాంక్షలు’ అని బన్నీ తన ఎక్స్‌లో రాసుకొచ్చాడు.లేట్ ఎందుకు?కాంతార సినిమా అక్టోబర్ 2న విడుదలైన సంగతి తెలిసిందే. రిలీజ్ అయిన వారం రోజులలోపే సినీ ప్రముఖులంతా ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం చాలా లేట్‌గా స్పందించాడు. సూపర్ హిట్ టాక్ వచ్చిన ఓ సినిమాను ఇంత ఆలస్యంగా చూడడానికి గల కారణం ఏంటని నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే..బన్నీ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం ముంబైలో ఓ భారీ సెట్ కూడా వేశారు. అందులోనూ షూటింగ్ జరుగుతుంది. షూటింగ్‌తో బిజీగా ఉండడం వల్లే అల్లు అర్జున్ కాంతార సినిమాను చూడలేకపోయాడు అట. ఇప్పుడు కాస్త ఫ్రీ టైం దొరకడంతో సినిమా చూసి..వెంటనే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.Watched #Kantara last night. Wow, what a mind-blowing film. I was in a trance watching it.Kudos to @shetty_rishab garu for a one-man show as writer, director, and actor. He excelled in every craft.Aesthetic performances by @rukminitweets garu, #Jayaram garu, @gulshandevaiah… pic.twitter.com/qneOccCjvd— Allu Arjun (@alluarjun) October 24, 2025 -
పేరు మార్చుకున్న రిషబ్ శెట్టి.. ఎందుకు? అసలు పేరు ఏంటి?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకటే పేరు హాట్ టాపిక్. కేవలం రెండంటే రెండే సినిమాలతో ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోనయి, జాతీయ అవార్డు సహా కలెక్షన్ల రికార్డులు కూడా అందుకుంటూ ఒక్కసారిగా భారతీయ సినిమా ప్రభంజనానికి కేంద్ర బిందువుగా నిలిచిందా పేరు. ప్రస్తుతం ప్రతీ సినీ అభిమాన ప్రేక్షకుడికీ చిరపరిచితమైన ఆ పేరు రిషబ్ శెట్టి(Rishab Shetty). అయితే నిజానికి అది ఆయన అసలు పేరు కాకపోవడం విశేషం. మన భారతదేశ సంప్రదాయాలు, ఆధ్యాత్మికత, భక్తి, విశ్వాసాలు, దైవ బలం ఇలాంటివి తన కాంతారా, కాంతారా చాప్టర్ 1(kantara: Chapter 1) చిత్రాల ద్వారా బలంగా చాటి చెప్పిన రిషబ్ ఆ సినిమాకు కేవలం కధానాయకుడు మాత్రమే కాదనీ అన్నీ తానే అయి నడిపించిన దర్శకుడు కూడా అనేది మనకు తెలుసు. అయితే కోస్తా కర్ణాటకలోని ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అతను నటుడిగా చిత్ర నిర్మాతగా అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకున్నాడు. ప్రతిభావంతుడైన నట దర్శకుడు రిషబ్ శెట్టి తన సినిమాల ద్వారా ప్రవచించిన ఆధ్యాత్మిక విశ్వాసాలు కేవలం వ్యాపార మెళకువలు అనుకుంటే పొరపాటు. ఆయన తూచ తప్పకుండా నమ్మే, అనుసరించేవి కూడా. అది ఆయన స్వంత ఇంటి అలంకరణ దగ్గర నుంచి ఆయన తన వంటిని అలంకరించుకునే తీరు, వస్త్రధారణలో కూడా అది ప్రస్ఫుటమవుతుంది. ప్రస్తుతం కాంతారా చాప్టర్ 1 విజయాన్ని సవినయంగా స్వీకరిస్తూ ఆస్వాదిస్తున్న రిషబ్ పేరు మార్పు వెనుక కూడా ఆయన నమ్మే జ్యోతిష్యశాస్త్ర ప్రభావం ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. ‘నేను నా పేరు ఎందుకు మార్చుకున్నాననే దాని వెనుక ఓ కథ ఉంది. నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి. అదే పేరుతో సినిమా పరిశ్రమకు ప్రవేశించాను. అయితే సినిమా ఇండస్ట్రీలో తొలి నాళ్లలో నాకు ఎలాంటి విజయం లేదా సినిమాలు రాలేదు‘ అని చెప్పాడు. అదే సమయంలో తనను పేరు మార్చుకోమని అలా చేస్తే విజయాలు, మంచి అవకాశాలు వస్తాయని తన తండ్రి సూచించాడని ఆయన వెల్లడించాడు. అప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పెద్ద స్టార్లు తమ పేర్లు మార్చుకున్నారనే విషయం కూడా తాను విన్నానని చెప్పాడు. దాంతో తాను కూడా అలాగే చేయాలని నిర్ణయించుకున్నానని రిషబ్ శెట్టి తెలిపాడు. పేరు మార్పు తన కెరీర్లో మంచి విజయాన్ని తెస్తుందని తన తండ్రి గట్టిగా నమ్మారని ఆయనే తన పేరును రిషబ్గా మార్చమని సూచించినట్టు వివరించాడు. విశేషం ఏమిటంటే రిషబ్ షెట్టి గా పేరు మార్చిన తండ్రే ప్రశాంత్ షెట్టి అనే పేరు కూడా పెట్టడం. మరో విశేషం రిషబ్ తండ్రి స్వయంగా జ్యోతిష్కుడు కావడం. ఏదేమైనా ప్రతిభా సామర్ధ్యాలకు తోడైన పేరు మార్పు కూడా తనను ఇలా శిఖరాగ్రానికి చేర్చిందని రిషబ్ షెట్టి నమ్ముతున్నాడనేది నిస్సందేహం. -
'కాంతార' హిట్ సాంగ్.. వీడియో వర్షన్ విడుదల
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1). అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 720 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. అయితే, తాజాగా ఈ మూవీ నుంచి రావే ఇక ప్రియ భామిని అనే సాంగ్‌ను విడుదల చేశారు. రిషబ్, రుక్మిణి వసంత్ మధ్య చిత్రీకరించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, చిన్మయి శ్రీపాద ఆలపించారు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం ఇచ్చారు. కాంతార ఛాప్టర్-1 విజయవంతమైన తర్వాత రిషబ్ శెట్టి పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తాజాగా చాముండి బెట్టపై చాముండేశ్వరి ఆలయంలో పూజలు నిర్వహించారు. కాంతార సినిమా విజయంలో కన్నడిగుల పాత్ర చాలా ఉందన్నారు. దైవాన్ని తాను ఎక్కువగానే విశ్వసిస్తానని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మూఢ నమ్మకాలను ప్రోత్సహించానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన తదుపరి చిత్రం ‘జై హనుమాన్’ అని ఆయన వెల్లడించారు. ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన కన్నడ చిత్రాల లిస్ట్‌లో ‘కాంతార -1’ రెండో స్థానంలో ఉంది. రూ.1200 కోట్ల కలెక్షన్లతో ‘కేజీయఫ్ 2’ తొలి స్థానంలో నిలిచింది. -
కాంతార చాప్టర్ 1 బ్లాక్‌బస్టర్ హిట్.. వారణాసిలో ప్రత్యేక పూజలు
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కన్నడ హీరో వారణాసిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు. కాంతార మూవీ తర్వాత పాన్ ఇండియా రేంజ్లో రిషబ్ శెట్టి ఫేమస్ అయిన సంగతి తెలిసిందే.ఈ ఏడాది దసరా కానుకగా కాంతార: చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. కేవలం 16 రోజుల్లోనే రూ. 717 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇప్పటికే పలు స్టార్ హీరోల చిత్రాలను సైతం అధిగమించింది. శాండల్‌వుడ్ చరిత్రలోనే రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. కన్నడ ఇండస్ట్రీలో కేజీఎఫ్-2 మొదటి స్థానంలో ఉంది. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారు. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతమందించారు. -
బాక్సాఫీస్ షేక్ చేస్తున్న కాంతార 1.. ఇప్పటివరకు ఎంతొచ్చిందంటే?
మూడేళ్ల క్రితం ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సినిమా (Kantara Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. కేవలం రూ.15- 20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie) తెరకెక్కించారు. కాంతార లాగే.. కాంతార 1 బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందా? ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? లేదా? అన్న అనుమానాలు ఉండేవి.తెలుగులో రికార్డుఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేసింది కాంతార 1. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వం వహించి హీరోగా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తూ వసూళ్ల ఊచకోత కొనసాగిస్తూనే ఉంది. ఈ రెండు వారాల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.105 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.717.50 కోట్లు కలెక్ట్ చేసి వెయ్యి కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. సినిమాఅలాగే హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాల లిస్టులోనూ చేరిపోయింది. కాంతార విషయానికి వస్తే రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈసినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. A divine storm at the box office 💥💥#KantaraChapter1 roars past 717.50 CRORES+ GBOC worldwide in 2 weeks.Celebrate Deepavali with #BlockbusterKantara running successfully in cinemas near you! ❤️🔥#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere#Kantara… pic.twitter.com/rd92Dch1mS— Hombale Films (@hombalefilms) October 17, 2025The unstoppable divine saga takes over the box office 🔥#KantaraChapter1 crosses 717.50 CRORES+ GBOC worldwide, including a phenomenal 105 CRORES+ from Telugu states in just 2 weeks.Experience the magic of #BlockbusterKantara this Deepavali in cinemas ❤️🔥#KantaraInCinemasNow… pic.twitter.com/dD584CNPMp— Ramesh Bala (@rameshlaus) October 17, 2025చదవండి: నడవలేని స్థితిలో ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. రాఘవతో ఫోటో -
కాంతార చాప్టర్-1 తగ్గేదేలే.. పుష్ప, సలార్ రికార్డ్స్ బ్రేక్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార: చాప్టర్ 1 రెండు వారాలు దాటినా ఏ మాత్రం కలెక్షన్ల జోరు తగ్గడం లేదు. ఇప్పటికే రూ.650 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోన్న ఈ సినిమా తాజాగా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో టాప్-10లో నిలిచింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ చిత్రాలను అధిగమించింది. కేవలం హిందీలోనే రూ.155.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో ప్రభంజనం సృష్టించిన కాంతార మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సలార్(రూ. 152.65 కోట్లు), సాహో(రూ. 145.67 కోట్లు, బాహుబలి-ది బిగినింగ్' (రూ. 118.5 కోట్లు), పుష్ప: ది రైజ్ - పార్ట్ I(రూ. 106.35 కోట్లు) చిత్రాలను దాటేసింది. ఈ జాబితాలో పుష్ప-2 రూ. 812.14 కోట్ల వసూళ్లతో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బాహుబలి-2(రూ. 511 కోట్లు), కేజీఎఫ్ -2 రూ. 435.33 కోట్లు, కల్కి 2898 ఏడీ రూ. 293.13 కోట్లతో ఉన్నాయి. ఈ మూవీ అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. దీపావళి సెలవులు రావడంతో ఈ వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.కాకగా.. ఈ సినిమాను 2022లో వచ్చిన కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రలు పోషించారు,హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ సినిమాలు..పుష్ప -2: రూ. 812.14 కోట్లుబాహుబలి- 2: రూ. 511 కోట్లుకెజిఎఫ్- 2: రూ. 435.33 కోట్లుకల్కి 2898 ఏడీ: రూ. 293.13 కోట్లుఆర్ఆర్ఆర్ : రూ. 272.78 కోట్లురోబో2: రూ 188.23 కోట్లుమహావతార్ నరసింహ: రూ. 188.15 కోట్లుకాంతార చాప్టర్-1: రూ. 155.5 కోట్లుసలార్ - పార్ట్ I: రూ. 152.65 కోట్లుసాహో : రూ. 145.67 కోట్లు -
‘కాంతార చాప్టర్ 1’ దీపావళి బ్లాస్ట్.. కొత్త ట్రైలర్ అదిరింది!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. అక్టోబర్ 2న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 680 కోట్లకు పైగా వసూళ్లను సాధించి పలు రికార్డులను బద్దలు కొడుతోంది. ఇప్పటికీ అత్యధిక థియేటర్స్‌లో రన్ అవుతున్న ఈ చిత్రం నుంచి కొత్త ట్రైలర్(Kantara Chapter 1 Deepavali Trailer)ని రిలీజ్ చేశారు మేకర్స్. దీపావళి కానుకగా నేడు(గురువారం) విడుదలైన ఈ కొత్త ట్రైలర్ సినిమాలోని కీలక సన్నివేశాలన్నింటిని చూపించారు. యాక్షన్ సీన్లను హైలెట్ చేస్తూ ఈ ట్రైలర్‌ని కట్ చేశారు. రిషబ్ శెట్టి స్వీయదర్శకత్వంలో హీరోగా నటించి ఈ చిత్రంలో యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించాడు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. -
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1.. దీపావళికి బిగ్ బ్లాస్ట్.. అదేంటంటే!
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ పలు సూపర్ హిట్ సినిమాలను దాటేసింది. ఇప్పటికే కూలీ, జైలర్, బాహుబలితో పాటు కాంతార రికార్డ్‌ను సైతం బ్రేక్ చేసింది. కన్నడలో అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రాల జాబితాలో రెండోస్థానంలో కొనసాగుతోంది.అయితే ఒకవైపు బాక్సాఫీస్ ప్రభంజనం కొనసాగిస్తుంటే.. తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. దీపావళి పండుగ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం కాంతార చాప్టర్-1 థియేటర్లలో రన్ అవుతోంది. ఇలాంటి సమయంలో ట్రైలర్ ఏంటని సినీ ప్రియులు పెద్ద డైలమాలో పడ్డారు. సినిమా విడుదలై రెండు వారాలు అయ్యాక ట్రైలర్ ఏంటని తెగ చర్చించుకుంటున్నారు. దీపావళి ట్రైలర్ పేరుతో ప్రేక్షకులకు బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రేపు 12 గంటల 7 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. దీంతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి నెలకొంది. ప్రేక్షకులకు ఏదైనా బిగ్ ట్విస్ట్ ఇవ్వనున్నారేమో తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే. The divine roar continues to light up screens worldwide 💥#KantaraChapter1 Deepavali Trailer out Tomorrow at 12:07 PM.Experience the ultimate cinematic celebration of Dharma.#BlockbusterKantara running successfully in cinemas near you! 🔥#KantaraInCinemasNow… pic.twitter.com/1R6xFJR2P9— Hombale Films (@hombalefilms) October 15, 2025 -
కాంతార మరో రికార్డ్.. ఏకంగా రాజమౌళి బాహుబలినే!
రిషబ్ శెట్టి డైరెక్షన్లో వచ్చిన కాంతార చాప్టర్-1 (Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే పలు రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కూలీ, జైలర్, లియో కలెక్షన్స్ రికార్డ్స్ తుడిచిపెట్టేసిన ఈ మూవీ టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ బాహుబలి ది బిగినింగ్ ఆల్‌టైమ్ వసూళ్లను దాటేసింది. కేవలం 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.675 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. త్వరలోనే రూ.700 కోట్ల మార్క్‌ను చేరుకోనుంది.ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో రెండోస్థానం దక్కించుకుంది. ఈ జాబితాలో ఛావా(రూ.808 కోట్లు) మొదటిస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఈ చిత్రానికి రూ.451.90 కోట్ల నికర వసూళ్లు రాగా..రూ.542 కోట్ల గ్రాస్ సంపాదించింది. ఉత్తర అమెరికాలో కాంతారా చాప్టర్ -1.. పదకొండు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల లిస్ట్‌లో 17వ స్థానంలో కొనసాగుతోంది. తాజా వసూళ్లతో సల్మాన్ ఖాన్ సుల్తాన్ (రూ.628 కోట్లు), రాజమౌళి బాహుబలి (రూ.650 కోట్లు)ని అధిగమించింది. ఈ రెండు చిత్రాల కంటే తక్కువ బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా అరుదైన ఫీట్‌ను సాధించడం విశేషం.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబల్ ఫిల్స్మ్ బ్యానర్లో వచ్చిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. -
రిషబ్ శెట్టి నివాసం..విశేషాల ఆవాసం... రేటు ఎంతంటే..?
కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాతో పాటు, కర్ణాటకలోని ఉడిపిలోని కుందాపురలో ఉన్న రూ. 12 కోట్ల విలువైన రిషబ్ శెట్టి భవనం కళ, సంప్రదాయం సంస్కృతి పట్ల ఆయనకున్న ప్రేమను ప్రతిబింబిస్తుంది,ఆ ఇంట్లోని ప్రతీ చోటూ ఒక కధను చెబుతుంది. ఆ ఇంటిలోని పలు చోట్ల కాంతారా సినిమా ప్రభావం కనిపిస్తుండడం ఆసక్తికరం.ఆయన ముత్తాత యాజమాన్యంలోని పూర్వీకుల భూమిపై నిర్మింతమైన ఈ భవనం ఓ క్లాసిక్ గా అభిమానులు పేర్కొంటారు. అది దక్షిణ భారత వాస్తుశిల్పాన్ని ఆధునిక సౌకర్యాలతో నేర్పుగా మిళితం చేయడం దీని విశేషం. ఘనమైన ప్రవేశ ద్వారం ఇత్తడితో కప్పబడిన బర్మా టేకు కలప తలుపు చేతితో లాగే ఆలయ గంటను కలిగి ఉంటుంది, ఇది ఇంట్లో అడుగుపెట్టిన తక్షణమే ఆధ్యాత్మికతో స్వాగతించే వైబ్‌ను అందిస్తుందిలోపలికి అడుగు పెట్టగానే ఈ స్థలం నాలుగు మూలల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది, ఇల్లు సూర్యకాంతి తో చుట్టుముట్టేలా...300 కిలోల గ్రానైట్‌తో నిర్మితమైన తులసికోటతో మన ముందు కొలువు దీరుతుంది. ఇక ఇంటిలో కనపడే యక్షగాన శిరస్త్రాణం, కాంతారా లోని రైఫిల్, యువరాజ్ సింగ్ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ వరకు సావనీర్లు కళలు, క్రీడలు భారతీయ జానపద సంప్రదాయాల పట్ల శెట్టికి ఉన్న ప్రేమను చూపుతాయి.కానీ ఈ భవనంలోని తమ అత్యంత ఆసక్తికరమైన భాగాన్ని శెట్టి ’ఛాంటింగ్ కార్నర్’ అని పిలుస్తారు. ఎవరైనా ఆ ఇంట్లోని ఆ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక నిర్దిష్ట నల్ల రాయిపై ఏడు సెకన్ల పాటు గానీ నిలబడితే, గాలి భూత కోల శ్లోకాలతో నిండిపోతుంది, దాదాపుగా కాంతారా లోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తుచేసే అనుభవాన్ని అందిస్తుంది.ఈ భవనంలో విలాసవంతమైన ప్రైవేట్ స్క్రీనింగ్ గది కూడా ఉంది. ఇటాలియన్ లెదర్ రిక్లైనర్లు, 150–అంగుళాల రిట్రాక్టబుల్ స్క్రీన్ డాల్బీ అట్మోస్ సరౌండ్ సౌండ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. స్థానిక టచ్ ఇస్తూ గదిలోని షాండ్లియర్‌ను మంగళూరు టైల్స్‌తో తయారు చేశారు. కాంతారా నుంచి ఇచ్చిన అటవీ స్ఫూర్తితో సెలియరాయ అని పేరు కలిగిన ప్రొజెక్టర్, ఆ ఇంటి విశేషాలకు మరో వ్యక్తిగత కథ ను జోడిస్తుంది.తమ మూలాలతో కుటుంబానికి ఉన్న సంబంధం వంటగది వరకూ కొనసాగుతుంది. నల్ల రాయి కౌంటర్ ను కొబ్బరి నూనెను ఉపయోగించి పాలిష్ చేస్తుంటారు. కోరి గస్సీ (చికెన్ కర్రీ) వంటి సాంప్రదాయ వంటకాలను వారసత్వంగా వచ్చే వంటశైలులను ఉపయోగించి తయారు చేస్తారు. పై అంతస్తులోని గదిలో 1,200 కంటే ఎక్కువ పుస్తకాలు కలిగిన లైబ్రరీ ఉంది, వీటిలో ఉండే భారతీయ జానపద కథల నుంచి స్టీఫెన్ కింగ్ థ్రిల్లర్ల వరకు, శెట్టి విస్త్రుత సేకరణను పుస్తకాభిరుచిని ప్రతిబింబిస్తాయి.పురాతన కాలం నాటి ఆకర్షణ సంప్రదాయ విశేషాలు ఎన్నో ఉన్నప్పటికీ, ఈ భవనం అత్యాధునిక భద్రతతో పటిష్టంగా ఉంటుంది. ఫేస్ రికగ్నైజేషన్, కెమెరాలు ప్రవేశ ద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి యక్ష అనే రిటైర్డ్ కోస్టల్ పోలీసు శునకం సైతం ఇంటికి కాపలా కాస్తుంటుంది. సందర్శకులు ప్రవేశించే ముందు వారి ఫోన్ లను ఇత్తడి లాకర్లలో జమ చేయాలి ఆసక్తికరంగా, కాంతారా సంభాషణల నుంచి ప్రేరణ పొంది ప్రతి నెలా వైఫై పాస్వర్డ్ మారుతుంటుంది. View this post on Instagram A post shared by PragathiRishabShetty (@pragathirishabshetty) -
'కాంతార'కు అక్కడ భారీ నష్టాలే.. కారణం ఇదే
కన్నడ సినిమా కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికే రూ. 500 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఈ చిత్రం కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. సోమవారం కూడా సుమారు రూ. 20 కోట్లకు పైగానే రాబట్టినట్లు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.675 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. దీంతో బాహుబలి-1 ఫైనల్ కలెక్షన్స్ మార్క్‌ను కాంతార దాటేసింది. అయితే, కాంతారా చాప్టర్ 1 అమెరికాలో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టినప్పటికీ గణనీయమైన నష్టాలను చవిచూసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు, ఈ చిత్రం దాదాపు రూ. 4 మిలియన్ల డాలర్స్ (రూ. 36 కోట్లు) వసూలు చేసింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా తాజాగా మేకర్స్ షేర్ చేశారు. ఈ కలెక్షన్స్ నంబర్ పర్వాలేదనిపించినప్పటికీ బ్రేక్-ఈవెన్ మార్కుకు చాలా దూరంలో ఉంది. ఈ సినిమాను చాలా ఎక్కువ ధరకు అమెరికాలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ చేయడానికి దాదాపు రూ. 8 మిలియన్ల డాలర్స్ అవసరం అవుతుంది. ఆ మార్క్‌ను కాంతార అందుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. దీంతో అమెరికాలో కాంతార నష్టాలు మిగల్చడం తప్పదని సమాచారం.అయితే, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ బెల్ట్‌లో మాత్రం భారీ లాభాల దిశగా కాంతార దూసుకుపోతుంది. దీపావళి సందర్భంగా ఈ వారంలో మరో నాలుగు ప్రధాన సినిమాలు విడుదల కానున్నడంతో కాంతారా చాప్టర్ 1 కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా మరింత తగ్గే ఛాన్స్ ఉంది. ఏదేమైనా మరో మూడు రోజులు మాత్రమే కాంతార సందడి కనిపించనుంది. ఈ ఏడాదిలో ఛావా సినిమా రూ. 800 కోట్ల కలెక్షన్స్‌తో టాప్ వన్‌లో ఉంది. ఇప్పుడు కాంతార కూడా ఆ మార్క్‌ను అందుకోవాలని చూస్తుంది. 2022లో విడుదలైన కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 నిర్మించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
'కాంతార 1'లో ఇంత పొరపాటు ఎలా చేశారు?
ఎంత పెద్ద సినిమా తీస్తున్నప్పుడైనా చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజం. ఒకప్పుడు అంటే సోషల్ మీడియా లేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరుకుతుందా, ట్రోల్ చేద్దామా అని చూస్తుంటారు. రాజమౌళి లాంటి దర్శకులు దీనికి భయపడి ఏళ్లపాటు సినిమాని ఫెర్ఫెక్ట్గా వచ్చే వరకు తీస్తుంటారు. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు 'కాంతార 1'లో చాలా పెద్ద పొరపాటుని నెటిజన్లు బయటపెట్టారు. ఆ సంగతి ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది.2022లో వచ్చిన 'కాంతార' సినిమాని ప్రస్తుతం జరుగుతున్నట్లు తీశారు. రీసెంట్గా థియేటర్లలోకి వచ్చిన 'కాంతార ఛాప్టర్ 1'ని మాత్రం 16వ శతాబ్దంలో జరిగే కథగా తెరకెక్కించారు. అందుకు తగ్గట్లే అడవిలో సెట్ వర్క్ గానీ, పాత్రధారుల కాస్ట్యూమ్స్ గానీ ప్రతిదీ చాలా చక్కగా చూపించారు. కానీ ఒక్కచోట మాత్రం మూవీ టీమ్ దొరికిపోయింది. అందరూ దీన్ని కనిపెట్టకపోవచ్చు గానీ కొందరు నెటిజన్లు మాత్రం తప్పుని పట్టేశారు.(ఇదీ చదవండి: 'కురుక్షేత్ర' రివ్యూ.. ఓటీటీలో అస్సలు మిస్ అవ్వొద్దు)సెకండాఫ్‌లో 'బ్రహ్మకలశ' అనే పాట ఉంటుంది. గూడెంలో ఉండే దేవుడిని రాజు ఉండే చోటుకి తీసుకొచ్చే సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. ఈ పాటలో కాంతార అలియాస్ రిషభ్ శెట్టి తమ దేవుడిని తలపై పెట్టుకుని తీసుకురావడం, తర్వాత స్నానమాచరించి పూజలు చేయడం.. ఇలా అంతా చూపించారు. అయితే అందరూ కలిసి కింద కూర్చుని భోజన చేస్తున్న సన్నివేశంలో మాత్రం ఓ చోట 20 లీటర్ల ప్లాస్టిక్ క్యాన్ కనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు దీన్ని అక్కడి నుంచి తీయడం మర్చిపోయినట్లున్నారు. అది ఇప్పుడు మూవీలో, రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన వీడియో సాంగ్‌లో కనిపించింది.వీడియో సాంగ్‌లో సరిగ్గా 3:06 నిమిషాల ఈ పొరపాటుని మీరు గమనించొచ్చు. దీన్ని మరీ అంతలా ట్రోల్ చేయడం లేదు గానీ ఫన్నీగానే 16వ శతాబ్దంలో వాటర్ క్యాన్ ఎలా వచ్చిందబ్బా అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది.(ఇదీ చదవండి: Bigg Boss 9: వైల్డ్ కార్డ్స్ చేతిలో 'పవర్'.. ఆరోవారం నామినేషన్స్ లిస్ట్) -
కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ జోరు.. జైలర్, లియో రికార్డ్స్ బ్రేక్!
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలను రికార్డ్స్ తుడిచిపెట్టిన ఈ మూవీ అరుదైన మార్క్ చేరుకుంది. ఈ సినిమా రిలీజైన 11 రోజుల్లోనే రూ.600 కోట్ల క్లబ్లో చేరింది. రెండో వారంలోనూ కలెక్షన్స్ పరంగా తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే కన్నడలో కేజీఎఫ్-2 తర్వాత రెండో స్థానంలో కాంతార చాప్టర్-1 నిలిచింది. ఈ వారంలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం మరింత కలిసి రానుంది.కాంతారా చాప్టర్ 1 ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.615 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో రజినీకాంత్ జైలర్(రూ.605 కోట్లు), విజయ్ లియో(రూ.606 కోట్లు) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఘనత సాధించింది. ఈ మూవీకంటే విక్కీ కౌశల్, రష్మిక నటింటిన ఛావా (రూ.808 కోట్లు) తొలిస్థానంలో ఉంది. అయితే త్వరలోనే ఈ రికార్డ్‌ను సైతం బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. దేశవ్యాప్తంగా చూస్తే రూ.439 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా.. రూ.525 కోట్ల గ్రాస్ రాబట్టింది.అంతేకాకుండా ఓవర్సీస్లో అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 2022 బ్లాక్‌బస్టర్ కాంతారకు ప్రీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీని హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. -
కాంతార ఛాప్టర్-1.. క్లైమాక్స్ సీన్ కోసం ఇంతలా కష్టపడ్డారా?
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ రిలీజైన పది రోజుల్లోనే బిగ్ హిట్ సినిమాలను దాటేసింది. ప్రస్తుతం రూ.600 కోట్లకు చేరువలో ఉంది. ఇప్పటికే కూలీ, సైయారా, వార్-2 లాంటి సూపర్ హిట్స్‌ను సైతం దాటేసింది. ఇదే జోరు కొనసాగితే త్వరలోనే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా కనిపిస్తోంది. కాంతార చాప్టర్-1 అక్టోబర్ 2న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా గురించి రిషబ్ శెట్టి ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈ మూవీలోని క్లైమాక్స్ సీన్ కోసం తాను పడిన కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. క్లైమాక్స్ సీన్ షూటింగ్ సమయంలో తన కాలికి వాపు వచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చాలా అలసిపోయాయని రిషబ్ వెల్లడించారు . కానీ ఈ రోజు మా సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే క్లైమాక్స్ లక్షలాది మంది అభిమానం ముందు నా కష్టమంతా చిన్నబోయిందని తెలిపారు. ఇదంతా మేము విశ్వసించే దైవిక శక్తి ఆశీర్వాదం ద్వారా మాత్రమే సాధ్యమైందని సంతోషం వ్యక్తం చేశారు. మాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ సీక్వెన్స్ ఇప్పటివరకు అత్యంత పవర్ఫుల్ సన్నివేశాలలో ఒకటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగాయ.. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందించగా..అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో కనిపించారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార చాప్టర్ 1.. రజినీకాంత్ కూలీ రికార్డ్ బ్రేక్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార ఛాప్టర్-1 రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ సినిమా పదో రోజు కూడా అదే జోరును కొనసాగిస్తోంది. సెకండ్ వీకెండ్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో ఇండియన్ మూవీగా నిలిచింది. పదో రోజు శనివారం ఒక్క రోజే రూ.37 కోట్ల నికర వసూళ్లు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా రూ. 396.65 నెట్ వసూళ్లు రాగా.. రూ.476 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రజనీకాంత్ కూలీ, సైయారా, వార్-2 లాంటి రీసెంట్ హిట్ సినిమాలను అధిగమించింది.మొదటి రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల పరంగా దూసుకెళ్తోంది. ఇదే జోరు కొనసాగితే బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు క్రియేట్ చేయనుంది. అయితే ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ఛావా కంటే వెనకే ఉంది. కాంతారా చాప్టర్ -1 ప్రపంచవ్యాప్తంగా చూస్తే పది రోజుల్లోనే రూ.560 నుంచి రూ.590 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన కూలీ(రూ.518 కోట్లు), టైగర్ జిందా హై (రూ.558 కోట్లు), ధూమ్ 3 (రూ.558 కోట్లు) సైయారా (రూ.570 కోట్లు), పద్మావత్ (కూ.585 కోట్లు), సంజు (రూ.589 కోట్లు) లాంటి లైఫ్‌టైమ్ గ్రాస్ కలెక్షన్స్ కూడా దాటేసినట్లే అవుతుంది. దీంతో ఈ సినిమా త్వరలోనే ఆరు వందల మార్క్ చేరుకునే అవకాశముంది.ఈ మూవీని 2022లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
నా ఫస్ట్ చాయిస్ డైరెక్షన్: రిషబ్ శెట్టి
ఎన్టీఆర్‌గారు నాకు సోదరుడులాంటివారు. మా కుందాపూర్ మూలాలు ఉన్న అబ్బాయి. ఆయన చేసిన సపోర్ట్‌కి రుణపడి ఉంటాను. ఇక ప్రశాంత్ నీల్గారితో ఎన్టీఆర్‌గారు చేస్తున్న సినిమాలో నేను నటిస్తున్నానన్న విషయంపై ప్రస్తుతానికి నేను ‘మ్యూట్’.‘‘భారతదేశం జానపద కథలకు నిలయం. నాకు జానపద కథలు చేయడం అంటే ఇష్టం. ‘కాంతార’ సినిమా కథను నిజాయితీగా చెప్పాలనుకున్నా. అది ప్రేక్షకులకు నచ్చింది’’ అని దర్శక–నిర్మాత–నటుడు రిషబ్ శెట్టి అన్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార:చాప్టర్ 1’. ‘కాంతార’ (2022) సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార:చాప్టర్ 1’ రూపొందింది.విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 2న విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా రూ. 509 కోట్ల వసూళ్లు సాధించి, సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతోందని యూనిట్ పేర్కొంది. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో రిషబ్ శెట్టి చెప్పిన విశేషాలు.⇒ ‘కాంతార’ సినిమాకు ఎలాంటి స్పందన లభించిందో, ‘కాంతార: చాప్టర్ 1’కూ అలాంటి గొప్ప రెస్పాన్సే ప్రేక్షకుల నుంచి లభిస్తోంది ‘కాంతార’ చేసేటప్పుడే ‘కాంతార: చాప్టర్ 1’ గురించిన ఆలోచన ఉంది. ‘కాంతార’ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన చూసి, ‘కాంతార: చాప్టర్ 1’ కథ రాయడం మొదలుపెట్టాను. ⇒ చిన్నప్పట్నుంచి మా ఊరి (కుందాపూర్) కథలు చెప్పాలని ఉండేది. ‘కాంతార’ మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్స్‌ను మా ప్రాంతంలోనే తీసుకోవడం జరిగింది. మేజర్ షూటింగ్‌ని మా ఊర్లో వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లో జరిపాం.⇒ నాలో దర్శకుడు ఉన్నాడు... యాక్టర్ ఉన్నాడు. ఈ రెండింటిలో ఏది ఫస్ట్ అంటే డైరెక్షనే అని చెబుతాను. ⇒ ముంబైలోని ఓ నిర్మాణ సంస్థలో డ్రైవర్‌గా పని చేశాను. ఇప్పుడు మంచి సక్సెస్‌లో ఉన్నాను. ఆర్టిస్టుగా జాతీయ అవార్డు అందుకున్నాను. నా జర్నీలో భాగమైన అందరికీ ధన్యవాదాలు. అలాగే ‘కాంతార’ జర్నీలో, నా జీవితంలో నా భార్య (ప్రగతి శెట్టి) ఇచ్చిన స పోర్ట్‌ను మర్చి పోలేను. ఒకవైపు ‘కాంతార’ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తూనే, మరోవైపు నన్ను, నా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంది. తను డబుల్ రోల్ చేసింది.⇒ ప్రస్తుతం తెలుగులో ఓ పీరియాడికల్ మూవీ, హిందీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ చిత్రాల అనౌన్స్మెంట్ వచ్చాయి. కానీ నా నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘జై హనుమాన్’. -
కాంతార విజయం.. రిషబ్‌కు మరో నేషనల్ అవార్డ్ రావచ్చు: స్టార్ డైరెక్టర్
కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన కాంతారా: చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఇందులో ఆయన నటన చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూనే ఇలా గొప్పగా నటించడం మామూలు విషయం కాదంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం రిషబ్ శెట్టి మాత్రమేనని చెప్పవచ్చు. దీంతో ఏకంగా ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్లో మొదటి వారంలోనే చేరిపోయింది. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ దర్శకుడు అట్లీ కుమార్ కాంతార చాప్టర్ 1పై ప్రశంసలు కురిపించారు. రిషబ్ శెట్టి మరోసారి జాతీయ అవార్డ్ అందుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఇండియా టుడేతో అట్లీ మాట్లాడుతూ.. కాంతార గురించి ఇలా చెప్పారు. 'సినిమా విడుదలైనప్పుడు నేను ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నాను. మొదటి రోజు సినిమా చూడటానికి సుమారు రెండున్నర గంటల పాటు కారులో వెళ్లాను. ఫైనల్‌గా ఫస్ట్ డే సినిమా చూశాను. థియేటర్ నుంచి వచ్చిన వెంటనే రిషబ్‌కు ఫోన్ చేసాను. అతను నాకు మంచి స్నేహితుడు. అతనంటే నాకు చాలా గౌరవం కూడా.. రిషబ్ శెట్టి చిత్రనిర్మాతలతో పాటు దర్శకులకు కూడా ఎంతోమందికి స్ఫూర్తి అని చెప్పగలను. కాంతార కోసం ఎవరూ చేయలేని పని అతను చేశారు. కాంతారలో నటించడమే కాకుండా దర్శకుడిగా పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. మరోకరికి ఇది సాధ్యం కాదని ఒక దర్శకుడిగా నేను చెప్పగలను. ఈ చిత్రంతో రిషబ్ తన నటనకు లేదా దర్శకుడిగా జాతీయ అవార్డ్ అందుకోవాలని ఆశిస్తున్నాను.' అని అట్లీ పేర్కొన్నారు.2022లో విడుదలైన కాంతార చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్‌ను రిషబ్ శెట్టి అందుకున్నారు. అయితే, కాంతార చాప్టర్-1తో మరోసారి రిషబ్ నేషనల్ అవార్డ్ అందుకుంటారని దర్శకుడు అట్లీ పేర్కొన్నారు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్లో అట్లీ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీతో ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ కూడా జాతీయ అవార్డ్ అందుకున్నారు. -
'కాంతార' రూ.500 కోట్లు.. రెండో స్థానంలో రిషబ్
‘కాంతార చాప్టర్ 1’ (Kantara Chapter 1) రూ.500 కోట్ల క్లబ్లో చేరింది. కన్నడ చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల జాబితాలో ఈ మూవీ రెండో స్థానాన్ని దక్కించుకుంది. అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కేవలం మొదటి వారంలోనే రూ. 509 కోట్లు రాబట్టినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈమేరకు ఒక పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. కేవలం ఒక వారంలోనే ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 509 కోట్లు రాబట్టడంతో అభిమానులో పోస్టులు పెడుతున్నారు. రీసెంట్గా విడుదలైన రజనీకాంత్ కూలీ సినిమా జీవితకాల కలెక్షన్స్‌ను కూడా కాంతార చాప్టర్1 అధిగమించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీనికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాలలో రోండో స్థానంలో కాంతార చాప్టర్ 1 ఉంది. అయితే, మొదటి స్థానంలో యష్ నటించిన కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు) ఉంది. కానీ, కేజీఎఫ్ రికార్డ్‌ను కాంతార చేరుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పవచ్చు. సుమారు రూ. 800 కోట్ల ఫైనల్ కలెక్షన్స్‌తో ఈ మూవీ సత్తా చాటే ఛాన్స్ ఉంది. అయితే, కన్నడలో అత్యధికంగా కలెక్షన్స్ రాబట్టిన టాప్ ఫైవ్ చిత్రాలు ఇలా ఉన్నాయి. మొదటి స్థానంలో కేజీఎఫ్ చాప్టర్ 2 (రూ. 1,215 కోట్లు), కాంతార చాప్టర్-1 (రూ. 509 కోట్లు), కాంతార (రూ. 450 కోట్లు), కేజీఎఫ్ చాప్టర్-1 (రూ. 250 కోట్లు), విక్రాంత్ రోణా (రూ. 210 కోట్లు) వరుసగా ఉన్నాయి. -
కాంతార చాప్టర్ 1.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది!
రిషబ్ శెట్టి (Rishab Shetty) డైరెక్షన్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా భారీ బడ్జెట్‌తో కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) తెరకెక్కించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. రిలీజైన మొదటి రోజు నుంచే అద్భుతమైన కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే కాంతార మూవీ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ చిత్రం నుంచి బ్రహ్మ కలశ అనే ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాట థియేటర్లలో కాంతార ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సాంగ్‌కు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అబ్బి ఆలపించారు. వరాహరూపం థీమ్‌తో వచ్చిన ఈ సాంగ్ థియేటర్లలో అభిమానులను అలరించింది. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించారు. A symphony of faith, a celebration of devotion 🔱🔥#Brahmakalasha Video Song from #KantaraChapter1 out now 🎵▶️ https://t.co/wzi1h7ek5l#BlockbusterKantara in cinemas now!#KantaraInCinemasNow #DivineBlockbusterKantara #KantaraEverywhere #Kantara @hombalefilms @KantaraFilm… pic.twitter.com/VKVnnqXmrq— Hombale Films (@hombalefilms) October 8, 2025 -
కాంతార రికార్డ్ బ్రేక్ చేసిన కాంతార.. ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty)స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్-1(Kantara Chapter 1) బాక్సాఫీస్ వద్ద అలరిస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మూడు వందల కోట్ల మార్క్ దాటేసిన ఈ చిత్రం తాజాగా రూ.400 కోట్ల క్లబ్లో చేరింది. ఈ మూవీ రిలీజైన ఆరు రోజుల్లోనే అరుదైన మార్క్ చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.427 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.(ఇది చదవండి: 'నా జీవితం సర్వనాశనం చేశారు'.. బిగ్‌బాస్ సంజనా గల్రానీ ఆవేదన!)కాంతార రికార్డ్ బ్రేక్.. ఈ క్రమంలోనే కాంతార చాప్టర్ 1 ప్రపంచవ్యాప్తంగా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఆరు రోజుల్లోనే కాంతార లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. కేజీఎఫ్- 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ కన్నడ చిత్రంగా నిలిచింది. కాగా.. 2022లో విడుదలైన 'కాంతార' సినిమా రూ.408 కోట్ల ఆల్ టైమ్ వసూళ్లు రాబట్టింది. శాండల్‌వుడ్‌లో కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 ప్రపంచవ్యాప్తంగా రూ.1215 కోట్లతో మొదటిస్థానంలో ఉంది. కాంతార చాప్టర్-1 జోరు చూస్తుంటే వారం రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. కాగా.. ఈ చిత్రం ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడ, హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో రిలీజైన సంగతి తెలిసిందే. -
'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఫ్యామిలీ (ఫొటోలు)
-
కాంతార చాప్టర్-1.. 90 శాతం అక్కడే పూర్తి చేశాం: రిషబ్ శెట్టి
రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్-1. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. సూపర్ హిట్ మూవీ కాంతారకు ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. కర్ణాటకలోని ప్రాచీన కళ భూతకోల ఆధారంగా ఈ సినిమాలను తెరకెక్కించారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తకర విషయం బయటకొచ్చింది. ఈ మూవీ షూటింగ్ రిషబ్ శెట్టి తన సొంత గ్రామంలోనే తెరకెక్కించినట్లు వెల్లడించారు. అంతేకాకుండా దాదాపు 90 శాతం ఎడిటింగ్ తన ఊర్లోనే పూర్తి చేశామని రిషబ్ శెట్టి తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. కాగా.. కర్ణాటకలోని ప్రత్యేక ప్రాంతానికి సంబంధించిన సంస్కృతి, జానపద కథ నిర్మాణం కోసం రిషబ్ శెట్టి తన స్వగ్రామంలోనే ఎక్కువగా ఈ మూవీని చిత్రీకరించినట్లు తెలుస్తోంది.రిషబ్ శెట్టి మాట్లాడుతూ..'ఈ సినిమా దాదాపు 90 శాతం పోస్ట్, ప్రొడక్షన్ పనులన్నీ మా సొంత గ్రామంలోనే జరిగాయి. మేము కేవలం మిగిలిన పదిశాతం పనికోసమే బెంగళూరు, కొచ్చికి వచ్చాం. ఈ సినిమా కోసం ఏకంగా సంగీత దర్శకుడిని కూడా గ్రామానికి తీసుకువచ్చి అక్కడే మొత్తం రికార్డింగ్ పూర్తి చేశాం. సినిమా ఎడిటింగ్‌లో దాదాపు 90 శాతం మా గ్రామంలోనే జరిగింది. మా గ్రామంలోని ప్రజలు పెద్దఎత్తున షూటింగ్ వద్దకు రావడంతో ఒకరకంగా ఫిల్మ్ టౌన్‌గా మారిపోయింది. ప్రతి రోజు కనీసం 100 వాహనాలు షూటింగ్‌కు వచ్చేవి. దాదాపు ప్రతి రోజు వెయ్యిమందిని సెట్లో ఉంచాం. కాంతార కోసమే నేను, నా భార్య, పిల్లలతో కలిసి నా స్వగ్రామానికి వెళ్లా' అని అన్నారు.కాగా.. కాంతార: చాప్టర్ 1 కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు. -
కాంతారపై టీమిండియా స్టార్ ప్రశంసల వర్షం.. రిషబ్ యాక్షన్‌కు ఫిదా
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార చాప్టర్-1(Kantara: Chapter 1) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తోంది. 4 రోజుల్లోనే 300 కోట్లకు పైగా వసుళ్లు చేసింది. ఈ సినిమాపై సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) చేరాడు.రిషబ్ శెట్టి మ్యాజిక్కు రాహుల్ ఫిదా అయిపోయాడు. "ఇప్పుడే కాంతార సినిమా చూశాను. రిషబ్ శెట్టి మరోసారి అద్బుతం సృష్టించాడు. ఈ సినిమా మంగళూరుకు చెందిన అందమైన ప్రజల సంస్కృతిని ప్రతిబింబించిందని" రాహుల్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.2022లో విడుదలై సంచలనం సృష్టించిన కాంతార సీక్వెల్ కూడా తనకు బాగా నచ్చిందని రాహుల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ ఐపీఎల్-2025లో కాంతార సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. రాహుల్ ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భారత తరపున ఆడుతున్నాడు. తొలి టెస్టు అనంతరం విశ్రాంతి లభించడంతో కాంతార సినిమా చూసి ఎంజాయ్ చేశాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. ఇప్పుడు శుక్రవారం నుంచి ఢిల్లీ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు కేఎల్ సన్నద్దం కానున్నాడు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భారత జట్టు రెండు రోజుల పాటు ప్రాక్టీస్‌లో పాల్గోనుంది. రాహుల్ టెస్టు క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. గత పది ఇన్నింగ్స్‌లలో 532 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను భారత్ 2-2తో డ్రా చేసుకోవడంలో రాహుల్ ది కీలక పాత్ర. ఇప్పుడు అదే జోరును విండీస్‌పై కూడా కొనసాగిస్తున్నాడు.చదవండి: ‘వైభవ్ సూర్యవంశీని వెంటనే టీమిండియాలోకి పంపండి’ -
'కాంతార' సెట్స్‌లో రిషబ్‌శెట్టి సతీమణి ప్రగతి (ఫోటోలు)
-
కాంతారలో ఇలా కనిపించిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?
కాంతార ఛాప్టర్–1 చిత్రం అక్టోబర్ 2వ తేదీన విడుదలై వసూళ్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. నటుడు రిషబ్‌శెట్టి కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటి రుక్మిణి వసంత్ కీలక పాత్రను పోషించారు. హోంబలే సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు సంపత్‌రామ్ ఒక ముఖ్య పాత్రను పోషించారు. ఈయన తమిళం, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా నటుడిగా రాణిస్తున్నారు. సలార్, కన్నప్ప, డాకు మహరాజ్, విక్రమ్, నారప్ప, తంగలాన్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన పరిచయమే. తమిళ్లో సుమారు 80కి పైగా సినిమాల్లో ఆయన నటించారు. రిషబ్‌శెట్టి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలోనే సంపత్తో పరిచయం కావడం ఆ నాటి నుంచి వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ కలిసి ఇప్పటికే ఒక సినిమాలో నటించారు.తాజాగా కన్నడంలో రూపొంది తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఆంగ్లం భాషల్లో అనువాదమై విడుదలైన కాంతార ఛాప్టర్–1 చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా నటించారు. దీనిపై ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ చిత్రంలో ముఖ్య పాత్రను పోషించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్రంలో కొండజాతి ప్రజల నాయకుడిగా తక్కువ సన్నివేశాల్లో నటించినా చాలా సంతృప్తిగా ఉందన్నారు. ఈ చిత్రంలో వైవిధ్యభరిత గెటప్‌లో కనిపిస్తాననీ, ఆ గెటప్ కోసం గంటన్నర పాటు మేకప్‌కు సమయం పట్టేదని, అదే విధంగా మేకప్ తీయడానికి గంటకు పైగా సమయం పట్టేదని చెప్పారు. అయినప్పటికీ మంచి విజయం సాధించిన చిత్రంలో నటించే అవకాశం రావడం భాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన నటుడు, దర్శకుడు రిషబ్శెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నటుడు సంపత్‌రామ్ పేర్కొన్నారు. -
కేజీఎఫ్‌ను దాటేసిన కాంతార చాప్టర్-1.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన లేటేస్ట్ మూవీ 'కాంతార: చాప్టర్ 1'. ఈ ఏడాది దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలి మూడు రోజుల్లోనే రూ.235 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.దేశవ్యాప్తంగా చూస్తే కాంతార చాప్టర్-1 నాలుగు రోజుల్లోనే రూ. 232.75 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రిలీజైన నాలుగు రోజుల్లో రూ.300 కోట్ల క్లబ్‌కు చేరువలో ఉంది. తొలి రోజు రూ. 89 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదే జోరు కొనసాగిస్తోంది. ఇలాగే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తే కాంతార: చాప్టర్ 1 రూ. 300 కోట్ల మార్క్ త్వరలోనే అధిగమించనుంది.కాగా.. ఇప్పటికే ఈ సినిమా కన్నడలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో యశ్ నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1ను అధిగమించింది. కాంతార, కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత స్థానంలో ఈ చిత్రం నిలిచింది. కాంతార రూ. 408 కోట్లు సాధించగా.. కేజీఎఫ్-2 రూ. 1,215 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
'కాంతార 1'లో రిషభ్ శెట్టి భార్య కూడా నటించింది.. గుర్తుపట్టారా?
'ప్రతి మగాడి విజయం వెనక ఓ ఆడది ఉంటుంది'.. అందరి విషయంలోనూ అని చెప్పలేం గానీ ఈ సామెత చాలాసార్లు నిజమవుతూ ఉంటుంది. దానికి లేటెస్ట్ ఉదాహరణ 'కాంతార 1'తో మరో పాన్ ఇండియా హిట్ కొట్టిన రిషభ్ శెట్టి. ఎందుకంటే హీరోగా ఇప్పుడు ఇతడు సక్సెస్ అయిండొచ్చు. కానీ ఏ ఫేమ్ లేని టైంలోనే ఇతడిని నమ్మిన ప్రగతి శెట్టి.. తోడునీడలా నిలిచింది. ఇప్పుడు ఫెర్ఫెక్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు. ఇంతకీ వీళ్ల ప్రేమకథ ఏంటి? 'కాంతార 1'లో రిషభ్‌తో పాటు ప్రగతి కూడా నటించిందనే విషయం మీలో ఎందరు కనిపెట్టారు?కన్నడ ఇండస్ట్రీలో 'ఆర్ఆర్ఆర్' (RRR) గురించి తెలియని వాళ్లు ఉండరు. వీళ్లే రక్షిత్ శెట్టి, రిషభ్ శెట్టి, రాజ్ బి శెట్టి. వీరిలో రక్షిత్, రాజ్ బి శెట్టి.. లోకల్ వరకు మాత్రమే గుర్తింపు తెచ్చుకోగా రిషభ్ శెట్టి మాత్రం 'కాంతార' చిత్రాలతో ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. వాటర్ కాన్ బిజినెస్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన రిషభ్ శెట్టి.. ప్రొడక్షన్ బాయ్, క్యారెక్టర్ ఆర్టిస్టు, డైరెక్టర్.. ఇలా ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడివరకు వచ్చాడు. అయితే 2016లో 'కిరిక్ పార్టీ' మూవీతో హిట్ కొట్టిన తర్వాత రిషభ్ గురించి కన్నడ ఇండస్ట్రీలో తెలిసింది.(ఇదీ చదవండి: 'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?)అయితే 'కిరిక్ పార్టీ' సినిమా రావడానికి చాన్నాళ్ల ముందు నుంచే రిషభ్, ప్రగతి ప్రేమించుకున్నారు. ఓ మూవీ ఈవెంట్లో తొలుత వీళ్లిద్దరూ కలసుకోగా.. తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్ అయ్యారు. కొన్నాళ్లకు ప్రేమ విషయాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. అయితే ప్రగతి తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా.. రిషభ్ ఇంకా జీవితంలో సక్సెస్ కాలేదని ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొన్నాళ్లపాటు కష్టపడి పెద్దల్ని ఒప్పించిన తర్వాత 2017లో రిషభ్-ప్రగతి పెళ్లి చేసుకున్నారు. వీళ్లకు రణ్విత్, రాధ్య అని కొడుకు, కూతురు ఉన్నారు.అసలు విషయానికొస్తే.. రిషభ్ శెట్టి హీరోగా చేసిన బెల్ బాటమ్ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసిన ప్రగతి, 2022లో వచ్చిన 'కాంతార'కి కూడా పనిచేసింది. లేటెస్ట్ సెన్సేషన్ 'కాంతార 1'కి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసి ప్రశంసలు అందుకుంటోంది. అయితే ఈ సినిమా ప్రారంభంలో రాజు పక్కన ఓ పిల్లాడిని ఎత్తుకునే ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె ప్రగతినే. అలా ఫస్టాప్‌లో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంటున్న రథం సీన్లోనూ ప్రగతి శెట్టి తన కొడుకుతో కనిపిస్తుంది. కాకపోతే ఒకటి రెండు సెకన్ల పాటు కనిపించే ఆ సీన్‌ని చాలామంది నోటీస్ కూడా చేసి ఉండరు. అలా తన భార్య, పిల్లలతో కూడా రిషభ్ శెట్టి యాక్టింగ్ చేయించేశాడు!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
'కాంతార' దెబ్బతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించిన బిగ్ సినిమా
దసరా సందర్భంగా విడుదలైన కాంతార సినిమా పాన్ ఇండియా రేంజ్లో సత్తా చాటుతుంది. ఈ క్రమంలో బాలీవుడ్ థియేటర్స్ కూడా హౌస్‌ఫుల్ అవుతున్నాయి. దీంతో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ హిందీ సినిమా ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’ (Sunny Sanskari Ki Tulsi Kumari) సరికొత్త ప్లాన్ వేసింది. కాంతారను తట్టుకునేందుకు మేకర్స్‌కు మరోదారి లేకపోవడంతో కీలక నిర్ణయం తీసుకున్నారు.కాంతారతో పోటీ తట్టుకోవడం కష్టమని భావించిన ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి చిత్ర యూనిట్ ఇప్పుడు వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో నిర్మాతలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ద్వారా ప్రకటించారు. ప్రేమికులకు ఈ సీజన్లోన గొప్ప ఆఫర్ అంటూ తెలిపారు. టిక్కెట్లు బుక్ చేసేటప్పుడు వినియోగదారులు ఆఫర్‌ను పొందడానికి SSKTK కోడ్‌ను ఉపయోగించాలని సూచించారు.సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రం కూడా అక్టోబర్ 2న విడుదలైంది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 30 నెట్ కలెక్షన్లు సాధించింది. కాంతార చిత్రానికి క్రేజ్ పెరగడంతో ఈ మూవీ కలెక్షన్స్‌పై ఎక్కువ ప్రభావం చూపింది. దీంతో వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్‌ను ప్రకటించినట్లు తెలుస్తుంది. -
'కాంతార'లో నవ్వించిన ఈ నటుడు ఎలా మరణించాడో తెలుసా?
కాంతార చాప్టర్-1 సినిమా చూసిన వారందరూ నటుడు రాకేశ్ పూజారి (34) (Rakesh Poojary) గురించి ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఆయన గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే, ఆయన ఈ సినిమా షూటింగ్ సమయంలోనే మరణించారు. దీంతో చిత్ర యూనిట్ కూడా ఆ సమయంలో సంతాపం తెలిపింది.ఈ ఏడాది మే 13న రాకేశ్ పూజారి గుండెపోటుతో మరణించారు. కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో తన సన్నిహితులు నిర్వహించిన ఓ మెహందీ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అక్కడ డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చేర్పించేలోపే ఆయన మరణించారు. కన్నడలో ప్రముఖ టెవిలిజన్ షో ‘కామెడీ ఖిలాడిగలు’ సీజన్ 3 విన్నర్‌గా ఆయన నిలిచాడు. దీంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రాకేశ్‌కు చాలా సినిమా ఛాన్సులు దక్కాయి. కన్నడ, తుళు భాషల్లోని పలు సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే, ‘కాంతార చాప్టర్-1’లో తన పాత్ర చిత్రీకరణను పూర్తి చేసిన తర్వాతే ఆయన మరణించారు. ఇప్పుడు ఈ సినిమా చూసిన వారికి రాకేశ్ పూజారి పాత్ర గుర్తిండిపోయేలా ఉండటంతో అతని గురించి ఆరా తీస్తున్నారు. అయితే, రాకేశ్ పూజారి పాత్రకు తెలుగు వాయిస్ డబ్బింగ్ కమెడియన్ బబ్లూ చెప్పారు.కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘కాంతార చాప్టర్ 1’ అక్టోబర్ 2న విడుదలైంది. కేవలం నాలుగురోజుల్లోనే రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల జాబితాలో ఈ చిత్రం చోటు సంపాదించుకుంది. స్వీయ దర్శకత్వంలో రిషబ్‌శెట్టి హీరోగా నటించగా.. రుక్మిణీ వసంత్, గుల్షన్ దేవయ్య కీలక పాత్రలలో కనిపించారు. View this post on Instagram A post shared by Comedian Babloo (@babloo_cheee) -
కాంతార ఛాప్టర్-1.. పంజర్లి లుక్‌లో సందడి చేసిన అభిమాని!
2022లో వచ్చిన కాంతార మూవీ పాన్ ఇండియా రేంజ్లో బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. కన్నడ హీరో రిషబ్ శెట్టి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార ఛాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. కాంతారా మూవీతో కన్నడ హీరో రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది.తాజాగా కాంతారా మూవీ థియేటర్లో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. తమిళనాడులో దిండిగల్‌లో ఈ సంఘటన జరిగింది. రిషబ్ శెట్టి అభిమాని కాంతార చిత్రంలో పంజర్లి దేవత అవతారంలో సందడి చేశారు. పంజర్లి లుక్‌లో థియేటర్లో డ్యాన్స్ చేస్తూ ఆడియన్స్‌ను అలరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. After the screening of Kantara Chapter 1 at a cinema in Dindigul, a fan dressed as a Daiva stunned the audience there.Goosebumps Thank you Divine star @shetty_rishab @hombalefilms for making such a Divine movie #KantaraChapter1 pic.twitter.com/sPd3bNmNHN— ಸನಾತನ (@sanatan_kannada) October 5, 2025 -
‘కాంతార’ కథ వెనుక పెద్ద కథే ఉందిగా!
రిషబ్ శెట్టి(Rishab Shetty ) దర్శకత్వం వహించి, నటించిన ‘కాంతార చాప్టర్ 1’(Kantara: Chapter 1)ఇప్పుడు బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. విడుదలైన తొలి రోజే(అక్టోబర్ 2) ఈ చిత్రం రూ. 89 కోట్ల మేర వసూళ్లను సాధించింది. వీకెండ్‌లోగా రూ. 300 కోట్లు ఈజీగా రాబడుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాంతార మాదిరే ప్రీక్వెల్‌గా వచ్చిన కాంతార చాప్టర్ 1 కూడా సూపర్ హిట్ కావడం పట్ల రిషబ్ శెట్టి ఆనందం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అసలు ఈ కథ రాయాలనే ఆలోచన ఎలా వచ్చిందో వివరించాడు. తన ఊర్లో జరిగిన ఓ గొడవే ఈ సినిమా కథను రాసేలా చేసిందని ఆయన చెప్పారు. ‘20 ఏళ్ల క్రితం మా గ్రామంలో జరిగిన ఓ సంఘటన ‘కాంతార’ కథకు పునాది వేసింది. వ్యవసాయ భూమి కోసం ఒక రైతు, అటవీ శాఖ అధికారి మధ్య ఘర్షణ జరిగింది. అది నాకు ఇద్దరి మనుషుల మధ్య గొడవలా అనిపించలేదు. ప్రకృతిని కాపాడే వారి మధ్య ఘర్షణలా చూశాను. ఈ అంశంతోనే కథను రాయాలనుకున్నాను. మన సంస్కృతి మొత్తం వ్యవసాయం చుట్టూ ఎలా తిరుగుతుందో ఆలోచించడం ప్రారంభించాను. ఈ క్రమంలో గ్రామీణ ప్రజల సంప్రదాయాలపై దృష్టి పెట్టి ‘కాంతార’ కథను రాశాను’ అని రిషబ్ చెప్పుకొచ్చాడు. కాంతార, కాంతార చాప్టర్ 1 కథలు కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతల్లో ప్రసిద్ధి చెందిన భూతకోల నేపథ్యంలో సాగుతుందన్న సంగతి తెలిసిందే. -
గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్ కలెక్షన్స్‌ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు. -
కాంతార ఊచకోత.. రిషబ్ శెట్టి మూవీస్.. తగ్గేదేలే
-
కలెక్షన్ల వర్షం కురిపిస్తోన్న కాంతారా చాప్టర్ 1
-
'కాంతార ఛాప్టర్ 1' తొలిరోజు కలెక్షన్స్ ఎంత?
దసరా సందర్భంగా 'కాంతార ఛాప్టర్ 1' థియేటర్లలోకి వచ్చేసింది. కన్నడలో దీనికి ఎలానూ పోటీ లేదు. తెలుగు, హిందీలోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం థియేటర్లలోకి రాలేదు. ఈ క్రమంలోనే దీనికి పోటీ అనేది లేకుండా పోయింది. దానికి తోడు తొలిరోజు దాదాపు అన్నిచోట్ల హౌస్‌ఫుల్స్ పడ్డాయి. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు మూవీ చూసేందుకు ఎగబడ్డాయి. మరి తొలిరోజు కలెక్షన్స్ ఎంతొచ్చాయి?విడుదలకు ముందు కర్ణాటకలో టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలుగా 'కాంతార 1' నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. తీర్పు వీళ్లకు అనుకూలంగా రావడంతో ధరలు బాగానే పెంచారు. తెలంగాణలో పెంపు లభించలేదు గానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గరిష్ఠంగా రూ.100 వరకు పెంపు లభించింది. అన్ని చేసినా సరే తొలిరోజు కలెక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లు కూడా దాటలేదు.దేశవ్యాప్తంగా తొలిరోజు 1.28 మిలియన్ల టికెట్స్ బుక్ మై షోలో సేల్ అయ్యాయి. ఈ క్రమంలో భారత్ మొత్తం కలిపి రూ.66 కోట్ల వసూళ్లు రాగా.. ప్రపంచవ్యాప్తంగా రూ.89 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో 'ఓజీ', 'కూలీ' తర్వాత ఇది అత్యధికం. ఏమైనా ప్రస్తుత బాక్సాఫీస్ దగ్గర జోష్ చూస్తుంటే వీకెండ్ అయ్యేసరికి లాభాల్లోకి వచ్చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.'కాంతార' విషయానికొస్తే.. మొదటి పార్ట్‌లో హీరో తండ్రి ఎక్కడైతే మాయమవుతాడో సరిగ్గా అక్కడి నుంచే 'కాంతార చాప్టర్ 1' కథ మొదలవుతుంది. 8వ శతాబ్దంలో కాదంబుల రాజ్యానికి ఓ దిక్కులోని కాంతార అనే ప్రాంతం ఉంటుంది. అందులోని ఈశ్వరుడి పూదోటకు అనే దైవిక ప్రదేశముంటుంది. ఆ ప్రాంతాన్ని కాంతార గిరిజన తెగ చాలా జాగ్రత్తగా కాపాడుతుంటారు. అక్కడున్న బావిలో ప్రజలకు ఓ బిడ్డ దొరుకుతాడు. అతనికి బెర్మి (రిషబ్ శెట్టి) అనే పేరు పెట్టి పెంచి పెద్ద చేస్తారు.అయితే కాంతారలోనే ఉండే బెర్మి.. అనుకోని పరిస్థితుల కారణంగా ఓసారి బాంగ్రా రాజ్యానికి వెళ్తాడు. స్వయానా రాజుతోనే కయ్యం పెట్టుకుంటాడు. దీంతో బాంగ్రా రాజు రాజశేఖరుడు (జయరామ్)తో బెర్మికి వైరం ఏర్పడుతుంది. తర్వాత ఏమైంది? ఈ స్టోరీలో యువరాణి కనకావతి(రుక్మిణి వసంత్) సంగతేంటి? ఈశ్వరుడి పూదోటలో ఉన్న దైవ రహస్యం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగిలిన స్టోరీ. -
కాంతార నిజమైన మాస్టర్ పీస్.. ప్రభాస్, సందీప్‌రెడ్డి ఏమన్నారంటే?
కాంతార ఛాప్టర్ 1(Kantra chapter 1)తో రిషబ్ శెట్టి భారీ విజయాన్ని అందుకున్నారు. అక్టోబర్ 2న విడుదలైన ఈ మూవీపై పాన్ ఇండియా రేంజ్లో పాజిటివ్ రివ్యూలే వినిపిస్తున్నాయి. కాంతార చిత్ర యూనిట్‌పై ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయ్యారు. తాజాగా ప్రభాస్(Prabhas ), సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) స్పందించారు. వారు సినిమాపై ప్రశంసలు కురిపించారు. బుక్‌మైషోలో కాంతార టికెట్ల సేల్ భారీగానే ఉంది. పీక్ టైమ్‌లో ప్రతి గంటకు సుమారు 60వేల టికెట్లు అమ్ముడుపోతున్నాయి. 24గంటలకు ఏకంగా 5లక్షలకు పైగానే టికెట్లు అమ్ముడుపోతున్నాయి.దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా కాంతార చాప్టర్1పై ఇలా చెప్పారు. 'కాంతార చాప్టర్ 1 నిజమైన మాస్టర్ పీస్. ఇండియన్ సినిమా ఇంతకు ముందు ఇలాంటి చిత్రాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది ఒక సినిమాటిక్ ప్రభంజనం. స్వచ్ఛమైన భక్తి ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. దీనిని ఎవరూ దాటలేరు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి నిజమైన వన్-మ్యాన్ షో ప్రదర్శించారు. ఈ మూవీని ఒంటి చేత్తో రూపొందించడమే కాకుండా ముందుకు తీసుకెళ్లాడు. కాంతార బీజీఎమ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం చాలా బాగుంది.' అని ఆయన మెచ్చుకున్నారు.కాంతార ఛాప్టర్ 1 మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే ప్రభాస్ ఇలా పోస్ట్ చేశారు. 'కాంతార ఛాప్టర్ 1 బ్రిలియంట్ మూవీ. ఇందులో నటించిన వారందరి ప్రతిభ చాలా బాగుంది. ఈ ఏడాది అతిపెద్ద విజయంగా కాంతార1 నిలుస్తుంది. ఈ సినిమాకు ప్రధాన బలయం రిషబ్ శెట్టి నటన. ఆపై హోంబలే ఫిల్మ్స్ విజయ్ కిరగండూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విజయం సాధించిన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు.' అని ప్రభాస్ తన స్టోరీలో రాశాడు. -
రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1.. ఏ ఓటీటీకి రానుందంటే?
రిషబ్ శెట్టి (Rishab Shetty) స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార చాఫ్టర్-1(Kantara Chapter1). ఈ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. తొలి రోజే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రిలీజైన తర్వాత ఏ ఓటీటీకి రానుందనే విషయంపై ఆసక్తి నెలకొంది.తాజాగా కాంతార ఛాప్టర్-1 ఓటీటీకి సంబంధించిన సినీ ప్రియులు సైతం నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. మేకర్స్ కుదుర్చుకున్న డీల్ ప్రకారం.. ఈ సినిమా ఆరు వారాల తర్వాతే ఓటీటీకి రానుందని టాక్ వినిపిస్తోంది. థియేటర్లలో వచ్చే రెస్పాన్స్ చూసి ఓటీటీ డేట్ రివీల్ చేయనున్నారు. అప్పటి వరకు కాంతార ఫ్యాన్స్ వెయిట్ చేయక తప్పదు. -
'కాంతార 1' రెమ్యునరేషన్స్.. ఈసారి ఎవరికి ఎంత?
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత 'కాంతార' ఫ్రాంచైజీ నుంచి మరో సినిమా థియేటర్లలోకి వచ్చింది. అదే 'కాంతార ఛాప్టర్ 1'. తొలి పార్ట్ కంటే ఈసారి భారీ హంగులు, స్టోరీలో మరిన్ని ఎలిమెంట్స్ జోడించారు. దసరా కానుకగా అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజైంది. అయితే ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ అయితే రాలేదు. కొందరు ప్రేక్షకులు ఆహా ఓహో అంటుండగా.. మరికొందరు మాత్రం ఓకే ఓకే అని అంటున్నారు.మరోవైపు తొలి పార్ట్ కేవలం రూ.15-20 కోట్లతో నిర్మిస్తే ఏకంగా రూ.400 కోట్ల వరకు కలెక్షన్ అందుకుంది. ఇప్పుడు మాత్రం భారీగా బడ్జెట్ పెట్టారు. ఏకంగా రూ.125 కోట్ల వరకు నిర్మాతలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లే ప్రతి సీన్లోనూ రిచ్‌నెస్ కనిపించింది. అడవిలో సెట్ కావొచ్చు, బాంగ్రా రాజ్యం సెట్ కావొచ్చు స్క్రీన్‌పై అద్భుతంగా కనిపించాయి. కంటెంట్‌తో పాటు విజువల్స్, సెట్స్‌కి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు.(ఇదీ చదవండి: Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ)ఈ సినిమా రెమ్యునరేషన్ విషయానికొస్తే తొలి పార్ట్ కోసం హీరో, దర్శకుడిగా చేసినందుకు రిషభ్ శెట్టి అప్పట్లో కేవలం రూ.4 కోట్లు తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. ఈసారి మాత్రం రూపాయి పారితోషికం తీసుకోకుండానే దాదాపు మూడేళ్ల పాటు కష్టపడ్డాడని అంటున్నారు. అలా అని ఫ్రీగా ఏం చేసేయలేదు. రిలీజ్ తర్వాత లాభాల్లో వచ్చే వాటాని తీసుకోవాలని ముందే నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నాడట.సినిమాలో రిషభ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, జయరామ్, గుల్షన్ దేవయ్య లీడ్ రోల్స్ చేశారు. వీళ్లందరికీ తలో రూ.కోటి వరకు రెమ్యునరేషన్ ఇచ్చారని టాక్ నడుస్తోంది. వీళ్లు తప్పితే అందరూ పెద్దగా పేరున్న యాక్టర్స్ అయితే కనిపించలేదు. అయితే సినిమాలో అటు రిషభ్ ఇటు రుక్మిణి వసంత్ యాక్టింగ్ జనాలకు బాగా నచ్చుతోంది. పబ్లిక్ టాక్‌లోనూ ఎక్కువ మంది వీళ్లిద్దరినే మెచ్చుకుంటుండటం విశేషం. (ఇదీ చదవండి: కొడుకుని పరిచయం చేసిన వరుణ్ తేజ్.. పేరు ఏంటంటే?) -
కాంతార 1 టీమ్‌పై 'ఎన్టీఆర్' కామెంట్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మరింత క్రేజ్ దక్కింది. తాజాగా ఈ సినిమా విడుదల సందర్భంగా తారక్ చిత్ర యూనిట్‌ను అభినందించారు. నేడు విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ క్రమంలో కాంతార1 టీమ్‌కు అభినందనలు చెప్పారు.కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార-1 మంచి విజయాన్ని సొంతం చేసుకుందని తారక్ అన్నారు. ముఖ్యంగా రిషబ్‌శెట్టి నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా ఎవ్వరి ఊహకు అందని అద్భుతాన్ని క్రియేట్ చేశాడని కొనియాడారు.. రిషబ్ మీద నమ్మకాన్ని ఉంచి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ వారికి శుభాకాంక్షలు అంటూ తారక్ ఒక పోస్ట్ చేశారు. కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేశారు. దీంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
Kantara Review: 'కాంతార ఛాప్టర్ 1' సినిమా రివ్యూ
మూడేళ్ల క్రితం ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్‌బస్టర్ హిట్ అయిన కన్నడ సినిమా 'కాంతార'. తర్వాత పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేస్తే తెలుగు, హిందీలోనూ సక్సెస్ అయింది. దీనికి ప్రీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రమే 'కాంతార ఛాప్టర్ 1'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. రిషభ్ శెట్టి హీరో కమ్ దర్శకుడు. ఈ మూవీని తొలి భాగం కంటే భారీగా తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. ఈసారి హీరోయిన్గా రుక్మిణి వసంత్ చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తొలి పార్ట్‌కి మించి ఉందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది బాంగ్రా రాజ్యం. దీనికో రాజు. ఓ రోజు ఈశ్వరుని పూదోట అనే ప్రాంతానికి వెళ్తాడు. బ్రహ్మ రాక్షసుడి కారణంగా ఇతడితో పాటు సైన్యం అక్కడ చనిపోతారు. పిల్లాడిగా ఉన్న రాజు కొడుకు రాజశేఖరుడు(జయరామ్) బతికిపోయి తిరిగి రాజ్యానికి వస్తాడు. పెద్దయ్యాక కూడా అటు వైపు వెళ్లే సాహసం చేయడు. ఇదే ఈశ్వరుని పూదోటకు దగ్గరలోని కాంతార అనే చోట జనాలు నివసిస్తుంటారు. వాళ్లకు బెర్మి(రిషభ్ శెట్టి) అనే పిల్లాడు దొరుకుతాడు. పెరిగి పెద్దవుతాడు. మరోవైపు రాజశేఖరుడు కొడుకు కులశేఖరుడు(గుల్షన్ దేవయ్య) కూడా పెద్దయ్యాక యువరాజు అవుతాడు. ఎక్కడో అడవుల్లో ఉండే బెర్మి.. బాంగ్రా రాజ్యానికి ఎందుకు రావాల్సి వచ్చింది? కులశేఖరుడితో వైరం ఏంటి? ఇంతకీ యువరాణి కనకవతి(రుక్మిణి వసంత్) ఎవరు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?2022లో వచ్చిన 'కాంతార'లో క్లైమాక్స్ తప్పితే మిగతా సినిమా అంతా సోసోనే. చివరలో వచ్చే దైవత్వం అనే ఎలిమెంట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. భాష అర్థం కాకపోయినా సరే ప్రేక్షకులు ముగ్దులయ్యారు. దానికి ప్రీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఆ స్థాయిలో ఉందా? అంటే లేదు. తొలి భాగమంతా మెప్పించిందా? అంటే లేదు. తొలి పార్ట్‌తో దీనికి కచ్చితంగా పోలిక వస్తుంది. అందులో అంతా చాలా సహజంగా ఉంటే ఇందులో మాత్రం ప్రతి సీన్లో భారీతనం కనిపించింది. కానీ నేటివిటీ మిస్ అయింది.తొలి పార్ట్‌లో శివ చిన్నతనంలో తండ్రి తప్పిపోవడం అనే పాయింట్ దగ్గర ఈ సినిమా మొదలవుతుంది. ఎక్కడైతే తన తండ్రి తప్పిపోయాడో అక్కడికి వెళ్లి చూస్తుండగా పక్కనే ఉన్న వ్యక్తి దంత కథ అంటూ చెప్పడం మొదలుపెడతాడు. ఈశ్వరుని పూదోట, బాంగ్రా రాజ్యం, కాదంబ రాజ్యం, కడపటి దిక్కువాళ్లు, కాంతార అనే ప్రదేశం.. ఇలా చాలా కొత్త విషయాలు కొత్త మనుషుల్ని పరిచయం చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలో అసలు కథ చెప్పడానికి చాలా టైమ్ తీసుకున్నారు. అడవిలో ఉండే హీరో అతడి మనుషులు బాంగ్రా రాజ్యానికి రావడం, అక్కడ చేసే హంగామాతో ఫస్టాప్ అలా నడిచిపోతుంది. టైగర్ ఎపిసోడ్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్ మొదలయ్యాక స్టోరీ ఎటెటో వెళ్తుంది. అసలు కథ కంటే ఉపకథలు ఎక్కువైపోయాయి. దీంతో మొత్తం గజిబిజి గందరగోళంలా అనిపిస్తుంది. స్క్రీన్‌పై అన్నీ జరుగతుంటాయి కానీ దేనికి కనెక్ట్ కాలేకపోతాం. ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి కూడా టైమ్ పడుతుంది. సరే అయిందేదో అయిపోయిందిలే అనుకుంటే చివరలో మూడో పార్ట్ కూడా ఉందని చెప్పి ముగించారు. అప్పుడొచ్చిన 'కాంతార' స్టోరీ ఎవరైనా సరే సింపుల్‌గా చెప్పడానికి వీలు కుదిరేలా ఉంటుంది. ఇది మాత్రం అస్సలు అలా చెప్పలేరు. సినిమా చూసొచ్చాక ఎవరినానై స్టోరీ ఏంటో చెప్పమని అడగండి. కచ్చితంగా తడబడతారు. అలా ఉంది! అయితే యాక్షన్ సన్నివేశాలు, దానికి తగ్గ సెటప్ బాగుంది. కానీ సెకండాఫ్‌లో వచ్చే యుద్ధం సీన్ చూస్తున్నప్పుడు బాహుబలి ఛాయలు కనిపిస్తాయి.ఎవరెలా చేశారు?రిషభ్ శెట్టి నటన బాగానే ఉంది గానీ తొలి పార్ట్ కంటే డిఫరెన్స్ ఏముందా అని సందేహం వస్తుంది. మిగతా వాళ్లలో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. యువరాణిలా అందంగా ఉంది. ఈమె పాత్రలో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. చివరలో ఈమె పాత్రని ముగించిన తీరు మాత్రం ఆమె ఫ్యాన్స్‌కి అస్సలు మింగుడుపడదు. జయరామ్, గుల్షన్ దేవయ్య.. రాజులుగా బాగానే చేశారు. మిగిలిన వాళ్లలో పెద్దగా తెలిసిన ముఖాలేం లేవు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు రొటీన్. గుర్తుండవు అలానే అర్థం కావు కూడా. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే ఓకే. నటుడిగా ఆకట్టుకున్నప్పటికీ దర్శకుడిగా మాత్రం రిషభ్ శెట్టి ఈసారి మెప్పించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు మాత్రం రిచ్‌గా ఉన్నాయి. మూవీ అంతా చూసిన తర్వాత పాన్ ఇండియా మోజులో పడిపోయి రిషభ్ శెట్టి ఇలాంటి సినిమా తీశాడేంటా అని కచ్చితంగా అనిపిస్తుంది.- చందు డొంకాన -
ఫేస్బుక్లో చాటింగ్.. పేరెంట్స్ వద్దన్నా పెళ్లి.. ‘కాంతార’ హీరో లవ్‌స్టోరీ
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి(Rishab Shetty) మన తెలుగువారికి కాంతార సినిమా ద్వారా దగ్గరవడం మాత్రమే కాదు మన జూనియర్ ఎన్టీయార్‌కు సోదర సమానుడుగా మారడం ద్వారా కూడా మరింతగా మనకు చేరవయ్యాడు. కాంతారా చాప్టర్ 1 ప్రమోషన్లో భాగంగా మన దగ్గర కూడా మన జూనియర్ ఎన్టీయార్ సాక్షిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆ ఈవెంట్లో ఎన్టీయార్, రిషబ్ ల తర్వాత హైలెట్‌గా నిలిచింది రిషబ్ జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి. హీరోయిన్ స్థాయి అందంతో మెరిసిపోయిన ఆమె అంతే అణకువతో కూడిన ప్రసంగం ద్వారా కూడా ఆకట్టుకుంది.ప్రస్తుతం కాంతారా కు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన ప్రగతి శెట్టి(Pragathi Shetty) రిషబ్ శెట్టి ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక సినిమా కార్యక్రమంలో క్యాజువల్‌గా కలిసిన వీరిద్దరూ ఆ తర్వాత ఫేస్బుక్ ఫ్రెండ్స్‌గా మారారు. రోజుల తరబడి చాటింగ్ కొనసాగించారు. వీరి స్నేహాన్ని ప్రేమగా మార్చింది ఫేస్బుక్ అనే చెప్పాలి. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ సినిమాలను ఇష్టపడే సగటు ప్రేక్షకురాలిగా రిషబ్‌కు చేరువైన ప్రగతి ఆ తర్వాత అతనితో ప్రేమలో పడింది. అయితే వీరిద్దరి ప్రేమకధ ప్రారంభమైనప్పుడు రిషబ్ సినిమాల్లో కెరీర్ పరంగా నిలదొక్కుకోలేదు. .దాంతో రిషబ్ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ప్రగతి తల్లిదండ్రుల నుంచి గట్టి వ్యతిరేకత వచ్చింది అయితే, ప్రగతి పట్టు వీడకపోవడంతో... అతి కష్టం మీద వారు ఒప్పుకున్నారు. అలా ఈ జంట 2017లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరు వారికిద్దరు అన్నట్టుగా ప్రస్తుతం ఒక బాబు, పాపలతో వీరిది చక్కని అందమైన సంసారం..సోషల్ మీడియాలో ప్రగతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది తరచుగా తన కుటుంబ జీవితం నుంచి స్నిప్పెట్లను అభిమానులతో పంచుకుంటుంది. రిషబ్ 41 పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఫొటోలు, గత ఫాదర్స్ డే సందర్భంగా తన భర్త, పిల్లలకు ఉన్న అనుబంధం గురించి పెట్టిన పోస్ట్‌లు నెటిజన్స్ నుంచి మంచి స్పందన అందుకున్నాయి. ఐటీ ఉద్యోగినిగా ఉన్న ప్రగతి రిషబ్‌తో పెళ్లి తర్వాత ఫ్యాషన్ పై తన టీనేజి అభిరుచికి సానబెట్టింది. అలా ఆమె సినిమారంగంలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారేందుకు అదే బాటలు వేసింది. ఇప్పటికీ ఫ్యాషన్ తనకు హాబీ మాత్రమే అని చెబుతున్న ప్రగతి... కాస్ట్యూమ్ డిజైనర్ ప్రొఫెషన్లో అనూహ్యంగా రాణిస్తోంది. ప్రేమ నుంచీ పెళ్లి దాకా ఆ తర్వాత కూడా కష్టసుఖాలు అన్నింటినీ సమానంగా పంచుకుంటూ పరస్పరం విజయాలకు కారణమవుతూ సాగుతున్నదీ జంట. సినీ రంగంలో ఉన్న చాలా మందికి స్ఫూర్తిని అందించే దాంపత్యం వీరిద్దరిదీ అనడం నిస్సందేహం. -
ఏపీలో ‘కాంతార: చాప్టర్ 1’ టికెట్ ధరలు పెంపు.. ఎంతంటే?
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించిన ‘కాంతారా ఛాప్టర్-1’(Kantara : Chapter 1) సినిమా టికెట్ ధరలు పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.100 పెంపునకు అనుమతి ఇస్తూ ఉతర్వ్యూలు జారీ చేసింది. దీంతో పాటు ప్రీమియర్స్‌కి కూడా అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 1న రాత్రి 10 గంటలకు ప్రీమియర్స్ షో పడనుంది. దీనికి కూడా ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే అక్టోబర్ 2 నుంచి 11 వరకు సింగిల్ స్క్రీన్లలో రూ. 75, మల్లిప్లెక్స్లలో రూ. 100 పెంచుకునే వెలుసుబాటుని కల్పించింది.కాంతార: చాప్టర్ 1 విషయానికొస్తే.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది. -
కాంతార మేకర్స్ ప్రకటన.. తీవ్ర నిరాశలో ఫ్యాన్స్!
కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం కాంతార చాప్టర్-1. ఈ మూవీని కాంతారకు ప్రీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసేందుకు అంతా సిద్ధమైంది. దీంతో కాంతార మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ఇటీవల హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. తాజాగా ముంబయిలోనూ బిగ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు.(ఇది చదవండి: కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్)అయితే మంగళవారం చెన్నైలో కాంతార చాప్టర్-1 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కరూర్ ఘటన నేపథ్యంలో కాంతార నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దురదృష్టకర సంఘటన కారణంగా రేపు చెన్నైలో జరగాల్సిన ప్రమోషనల్ ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటనతో ప్రభావితమైన వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అభిమానులకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు. సరైన సమయంలో తమిళనాడు ప్రేక్షకులను కలవడానికి మేము ఎదురుచూస్తున్నామని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. Due to the recent unfortunate incident, we are cancelling the #KantaraChapter1 promotional event in Chennai tomorrow.Our thoughts and prayers are with those affected. Thank you for your understanding, we look forward to meeting our audience in Tamil Nadu at a more appropriate… pic.twitter.com/ROhmiu6glR— Hombale Films (@hombalefilms) September 29, 2025 -
ఈసారి సంక్రాంతి క్లాష్.. అంతకు మించి
-
'బాయ్‌కాట్ కాంతార'.. దీని వెనక ఎవరున్నారు? ఇప్పుడే ఎందుకిలా?
ఉన్నట్టుండి సడన్‌గా 'కాంతార ఛాప్టర్ 1' సినిమాపై సోషల్ మీడియాలో నెగిటివిటీ కనిపిస్తోంది. 'బాయ్ కాట్ కాంతార' అంటూ ఏకంగా ఓ హ్యాష్ ట్యాగ్ సృష్టించి హడావుడి చేస్తున్నారు. తెలుగు చిత్రాలని కర్ణాటకలో ఆదరించట్లేదు మనమెందుకు ఆ చిత్రాల్ని ఎంకరేజ్ చేయాలి? హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే సదరు హీరో తెలుగులో మాట్లాడలేదు ఇంత పొగరా? అని రకరకాల కారణాలు చెప్పి మూవీపై వ్యతిరేకత పెంచే పనిచేస్తున్నారు కొందరు. ఇంతకీ అసలేం జరుగుతోంది? దీని వెనక ఎవరున్నారు?రిషభ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో రిలీజై బ్లాక్‌బస్టర్ అందుకున్న చిత్రానికి ఇది ప్రీక్వెల్. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ట్రైలర్ విడుదల చేయగా మిశ్రమ స్పందన వచ్చింది. అయినా సరే ఈ మూవీపై హైప్ బాగానే ఉంది. కానీ ఉన్నట్టుండి సడన్‌గా దీనిపై వ్యతిరేకత కనిపిస్తుంది. అయితే దీని వెనక ఓ తెలుగు హీరో ఫ్యాన్స్ ఉన్నారా అనే సందేహం కలుగుతోంది.(ఇదీ చదవండి: Bigg Boss 9: ప్రియ ఎలిమినేట్.. ఎంత సంపాదించిందంటే?)ఎందుకంటే మొన్నీమధ్య కర్ణాటకలో ఓ తెలుగు మూవీ రిలీజ్ అయింది. కానీ బెంగళూరులోని ఓ థియేటర్ బయటున్న సదరు సినిమా పోస్టర్స్‌ని కొందరు వ్యక్తులు చించేశారు. మరోవైపు తొలిరోజు తర్వాత నుంచి తెలుగు రాష్ట్రాల్లో సదరు చిత్రానికి ఏమంత చెప్పకోదగ్గ వసూళ్లు రావటం లేదు. తొలిరోజు ఘనంగా ఇన్ని కోట్ల రూపాయల కలెక్షన్ అని పోస్టర్ రిలీజ్ చేసిన నిర్మాణ సంస్థ.. రెండో రోజు నుంచి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. చూస్తుంటే అభిమానులు తప్పితే సగటు ప్రేక్షకుడు ఆ సినిమాని చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపించట్లేదా అనిపిస్తుంది. ఇప్పుడు గానీ 'కాంతార 1' రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంటే ఆ మూవీని జనాలు మరిచిపోవడం గ్యారంటీ!మరి కారణం ఇదేనో ఏమో తెలీదు గానీ 'బాయ్ కాట్ కాంతార' అని కావాలనే ట్రెండ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. అయినా సినిమా బాగుంటే ఆడుతుంది లేదంటే ప్రేక్షకుల తిరస్కరణకు గురవుతుంది. కానీ అంతకంటే ముందే ఏదో మనసులో పెట్టుకుని 'కాంతార'ని టార్గెట్ చేస్తున్నట్లే కనిపిస్తుంది! చెప్పాలంటే తమిళనాడులోనూ తెలుగు చిత్రాలకు పెద్దగా ఆదరణ ఉండదు. చేస్తే తమిళ డబ్బింగ్ చిత్రాలకు కూడా ఇలా ట్రెండ్ చేయాలి కదా! కానీ ఈ మధ్య కాలంలో అలాంటివే కనిపించలేదు. మరి కేవలం 'కాంతార'నే ఎందుకు టార్గెట్ చేసినట్లు? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలు.. ఆ మూడు మాత్రం) -
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (ఫొటోలు)
-
కాంతార చాప్టర్ 1 లాంటి సినిమా చేయడం సులభం కాదు: ఎన్టీఆర్
‘‘నన్ను ఉడిపి కృష్ణుడు గుడికి తీసుకుని వెళ్లాలని ఎప్పట్నుంచో మా అమ్మగారి ఆకాంక్ష. రిషబ్ సార్ లేకపోయి ఉంటే ఆ దర్శన భాగ్యం కలిగి ఉండేది కాదు. థ్యాంక్స్ చెప్పి, మా మధ్య దూరాన్ని పెంచలేను. మా అమ్మగారి ఆకాంక్షను నెరవేర్చినందుకు ఐ లవ్ యూ సార్. ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కోసం రిషబ్ ఎంత కష్టపడ్డారో చూశాను. ఈ సినిమా చేయడం అంత సులభం కాదు. రిషబ్ అరుదైన దర్శక–నటుడు. ఆయనలోని డైరెక్టర్ అతన్ని డామినేట్ చేస్తాడా? లేక యాక్టర్ డామినేట్ చేస్తాడా? అనే ఆలోచన నాకు ఉండేది. కానీ సినిమాలోని 24 క్రాఫ్ట్స్‌ని రిషబ్ డామినేట్ చేస్తారు’’ అని ఎన్టీఆర్ అన్నారు.రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్ 1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈ అక్టోబరు 2న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో విడుదల కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ మాట్లాడుతూ– ‘‘మాములుగా ప్రతిసారీ అరిచినట్లుగా ఈసారి మాట్లాడలేను.కొంచెం నొప్పిగా (ఈ మధ్య స్వల్ప గాయం అయింది) ఉంది. నాకు తెలిసి నా వయసు మూడేళ్లో, నాలుగేళ్లో అయ్యింటుంది. అప్పుడు మా అమ్మమ్మ నన్ను కూర్చోబెట్టి, కుందాపూర్ దగ్గరే మా ఊరు... అంటూ చిన్నప్పుడు ఆమె విన్న కొన్ని కథలు చెప్పింది. ఈ కథ నిజమేనా? ఇది జరిగి ఉంటుందా? అని అర్థమయ్యేది కాదు. కానీ ఆ కథలు ఆసక్తిగా ఉండేవి. ఒక్కసారైనా ఈ గుళిగ ఆట అనేది ఏంటి? ఈ బింజురుళి అంటే ఏమిటో చూడాలని నా చిన్నప్పుడే నాటుకుపోయింది. కానీ ఏ రోజూ అనుకోలేదు. నేను విన్న ఆ కథల నుంచి, నేను విన్న ఆ కథల గురించి ఒక దర్శకుడు ఒక సినిమా తీస్తాడని. ఆ దర్శకుడు ఎవరో కాదు... నా సోదరుడు రిషబ్ శెట్టి. నేను విన్న కథలను సిల్వర్ స్క్రీన్‌పై చూసినప్పుడు నాకు మాటలు రాలేదు.కథ తెలిసి నేనే ఇలా అయిపోతే ఈ కథ కొత్తగా తెలిసినవాళ్లు ఏమయ్యారో అదే ‘కాంతార 1’ సినిమా రిజల్ట్. ఈ ‘కాంతార: చాప్టర్ 1’ గొప్ప బ్లాక్‌బస్టర్ చిత్రంగా భారతీయ సినిమా చరిత్రలో ప్రస్ఫుటంగా కనపడాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఈ సినిమాను అక్టోబరు 2న థియేటర్స్‌లో చూడండి. రిషబ్ కష్టాన్ని ఆశీర్వదించి, ‘కాంతార: చాప్టర్ 1’ను విజయం బాటవైపు నడిపిస్తారని ఆశిస్తున్నాను’’ అని అన్నారు. ‘‘ఎన్టీఆర్‌గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక బ్రదర్ ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాను మీరందరూ థియేటర్స్‌లో చూసి, ఆశీర్వదించి, పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు రిషబ్ శెట్టి.హోంబలే ఫిలింస్ సహ వ్యవస్థాపకుడు చలువే గౌడ మాట్లాడుతూ– ‘‘‘కాంతార: చాప్టర్ 1’ మన సంస్కృతి, నమ్మకాలు, కథలు, మూలాలకు నివాళి’’ అని చె΄్పారు. ‘‘ఈ సినిమా చూసిన ఓ నలుగురు పెద్దవాళ్లు ‘ఈ సినిమా స్పెల్‌బౌండ్’ అని చె΄్పారు. ‘కాంతార: చాప్టర్ 1’ పెద్ద చిత్రం అవుతుంది. ఇక వచ్చే నెల ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఈ సినిమా నెక్ట్స్ లెవల్లో ఉంటుంది’’ అని మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్ పేర్కొన్నారు. ‘‘కాంతార’ సినిమాల కోసం రిషబ్ ఐదేళ్ళుగా కష్టపడుతున్నారు’’ అని కాస్ట్యూమ్ డిజైనర్, రిషబ్ భార్య ప్రగతి అన్నారు. ‘‘కాంతార: చాప్టర్1’ తెలుగు వెర్షన్లోనూ రెండు పాటలు రాశాను’’ అని చెప్పారు రాంబాబు గోసాల. మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, ప్రోడక్షన్ డిజైనర్ బంగ్లన్ తదితరులు పాల్గొన్నారు. -
నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్
కొన్నిరోజుల క్రితం ఈ యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే ప్రమాదం ఏం లేదని ఆయన టీమ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత పెద్దగా బయటకు రాని ఎన్టీఆర్.. ఇప్పుడు 'కాంతార 1' కోసం వచ్చాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు.రిషభ్ శెట్టి నటించిన ఈ సినిమా.. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బెంగళూరు, కొచ్చిలో ప్రెస్ మీట్స్ జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకకు సింపుల్‌గా వచ్చిన కూర్చునేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. భుజం దిగువన చేయి పెడుతూ నొప్పిని ఫీలవుతున్నట్లు కనిపించాడు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్) ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే 'కాంతార 1' చిత్రంలోనూ తారక్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని గతంలో రూమర్స్ లాంటివి వచ్చాయి. కాకపోతే ఇవి నిజమా లేదా అనేది తెలియదు. అలానే రిషభ్ శెట్టి అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. బహుశా ఆ కారణం వల్లనో ఏమో గానీ నొప్పి ఇబ్బంది పెడుతున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. దీన్ని త్వరగానే ముగించేశారు కూడా!2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ తీశారు. అప్పుడొచ్చిన సినిమాలో ప్రస్తుతం ఏం జరిగిందనే విషయాన్ని చూపించారు. ఈసారి మాత్రం గతంలో అసలేమేం జరిగింది? అనేది చూపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైంది. అయితే ట్రైలర్లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది కానీ స్టోరీ పరంగా పెద్దగా రివీల్ చేయలేదు. మరి థియేటర్లలో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి)Man of Masses @tarak9999 arrives at grand pre-release event of #KantaraChapter1 🔥 pic.twitter.com/FKJjIQwmFT— Telugu Film Producers Council (@tfpcin) September 28, 2025 -
'కాంతార' రిలీజ్‌కి రెడీ.. ప్రముఖ దేవాలయంలో రిషభ్ ఫ్యామిలీ (ఫొటోలు)
-
కాంతార ప్రీక్వెల్.. 'వరాహరూపం' లాంటి సాంగ్ విడుదల
రిషబ్ శెట్టి (Rishab Shetty) హీరోగా నటించిన కన్నడ చిత్రం ‘కాంతార’ (kantara). ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే 'వరాహరూపం' సాంగ్ భారీగా ఆదరణ పొందింది. ఇప్పుడు ఇదే చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార:చాప్టర్1' లో కూడా ఇలాంటి పాటనే మేకర్స్ చేర్చారు. 'బ్రహ్మ కలశ' అంటూ శివుడి గురించి భక్తితో ఆరాధించేలే సాంగ్ ఉంది. తాజాగా విడుదలైన ఈ పాటను కృష్ణకాంత్ రచించగా అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. అబ్బి వి ఆలపించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
Kantara Chapter 1: కసరత్తుల నుంచి కలరియపట్టు దాకా...
గత 2022లో విడుదలైన కాంతారా సినిమాతో రిషబ్ శెట్టి సినిమా విజయాలలో నటీనటుల భాగస్వామ్యానికి సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. భారతీయ సంస్కృతి ఆచారాల ఆధారంగా ఆకర్షణీయమైన కథను ఎలా రూపొందించవచ్చో చెబుతూ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు ఆయనే హీరో. రచయిత దర్శకుడు కూడా కావడం గమనార్హం. తాజాగా రిషబ్ తన శ్రమకు తగిన ఫలితంగా జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నాడు. మరోవైపు కాంతారా 2022లో జరిగిన 70వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా కూడా జాతీయ అవార్డును అందుకున్నాడు.చేసే పనిమీదే మనసును లగ్నం చేసేవారిని అపజయాలు మాత్రమే కాదు భారీ విజయాలు కూడా ఆపలేవు. అందుకే రిషబ్ అంకితభావం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్ కాంతారా సీక్వెల్ రూపకల్పనలోనూ కనిపిస్తూనే ఉంది. కాంతారా చిత్రాల సాక్షిగా ఆ పాత్రలో ఇమిడిపోయేందుకు తనను తాను చెక్కుకున్న శిల్పిలా మారాడు.. రిషబ్. కాంతారా సిరీస్ కోసం ఆయన నేర్చుకున్న కొన్ని నైపుణ్యాలను పరిశీలిస్తే కళ కోసం ప్రాణం పెట్టడం అంటే ఏమిటో అర్ధమవుతుంది.భూత కోలాదక్షిణ కర్ణాటక, ఉడిపి సమీప ప్రాంతాల్లో తులు మాట్లాడే వారు సంప్రదాయంగా భూత కోలా, భూత ఆరాధన పేర్లతో తమను కాపాడే ఆత్మలను ఆరాధిస్తారు. ఈ సందర్భంగా వస్త్రధారణతో పాటు వారు చేసే నృత్యం, అరుపులు కూడా సంక్లిష్టంగా ఉంటాయి. కాంతారా సినిమాలో రిషబ్ స్వయంగా భూత కోలా ను నేర్చుకుని మరీ ప్రదర్శించాడు. అందుకే ఆ సినిమాలో అత్యంత గుర్తుండిపోయే సన్నివేశాల్లో ఒకటిగా ఆ నృత్యం మారింది.బుల్ రేస్ (కంబాల)కర్ణాటక కోస్తా ప్రాంతాల్లో వ్యవసాయ సీజన్ ముగిశాక సంప్రదాయంగా నిర్వహించే కంబాల రేసు కూడా కాంతారాలో హైలెట్. చిత్రీకరణ సమయంలో రిషబ్ ఇరవై నాలుగు గంటలకు పైగా ఎద్దులతో పరుగెత్తుతూనే ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అతని నటనలోని ఆ సన్నివేశాన్ని ఎప్పటికీ మరచిపోలేని కొత్త శిఖరాలకు తీసుకెళ్లింది.కలరిపయట్టుప్రపంచంలోని పురాతన యుద్ధ కళలలో ఒకటైన కేరళకు చెందిన కలరిపయట్టును కూడా రిషబ్ అభ్యసించాడు. తెరపై అతని రూపం, పోరాటాలు∙వాస్తవికంగాగా ఉండేలా చూసుకోవడానికి, ఆ పోరాట కళను నేర్చుకోవడానికి ఆయన ఒక సంవత్సరం పాటు కష్టతరమైన శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాడు.ట్రాన్స్ఫార్మేషన్..జిమ్‌లో వర్కవుట్స్ చేస్తే వ్యాయామం అంటారు కానీ తన రూపాన్ని పూర్తిగా మార్చుకుంటే వ్యాయామ పరిభాషలో ట్రాన్స్‌ఫార్మేషన్‌గా పేర్కొంటారు. తదుపరి రానున్న కాంతారా చాప్టర్ 1 కోసం తన శరీరాన్ని కఠినమైన కసరత్తులతో చెక్కుకున్నాడు. తొలి భాగానికి పూర్తి విరుద్ధంగా అనూహ్యమైన రీతిలో రిషబ్ కనిపిస్తాడు.గుర్రపు స్వారీతన పాత్రను పండించేందుకు రిషబ్ మరో నైపుణ్యాన్ని జోడించాడు. రానున్న కాంతారా చాప్టర్ 1లోని యాక్షన్ సన్నివేశాలకు వాస్తవికత అద్దేందుకు ఆయన గుర్రపు స్వారీని నేర్చుకున్నాడు.సాంప్రదాయ ఆచారాలను నేర్చుకోవడం మరియు పురాతన యుద్ధ కళలను నేర్చుకోవడం వంటి రిషబ్ శెట్టి అంకితభావం, కాంతారా ఎందుకు ఒక సంచలనం అయ్యిందో మరియు కాంతారా చాప్టర్ 1 ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలుగా ఎందుకు నిలిచిందో చూపిస్తుంది. రిషబ్ తన అసాధారణ ప్రతిభ మరియు సజనాత్మక విధానంతో కథను రీమేక్ చేస్తూనే ఉన్నాడు. -
కాంతార కోసం వస్తున్న ఎన్టీఆర్.. జోష్‌లో ఫ్యాన్స్
‘కాంతార:చాప్టర్1’ (Kantara Chapter 1) ట్రైలర్ దుమ్మురేపుతుంది. పాన్ ఇండియా రేంజ్లో ఏకంగా 150 మిలియన్ల వ్యూస్ దాటేసింది. అక్టోబర్ 2న ఈ సినిమా విడుదల కానున్నడంతో ప్రమోషన్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ జోరు పెంచింది. కన్నడ ప్రాంతీయ చిత్రంగా విడుదలైన కాంతార తెలుగులో కూడా భారీ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ప్రీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ రావడం విశేషం.ఎన్టీఆర్, రిషబ్ శెట్టి మధ్య స్నేహబంధం ఉంది. ఇటీవల, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకలోని ఉడిపిని సందర్శించినప్పుడు రిషబ్ శెట్టి వారికి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 28న జరిగే కాంతార ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. హైదరాబాద్‌లోని జెఆర్సీ కన్వెన్షన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి సంబంధించిన ఒక పోస్టర్‌ను చిత్ర మేకర్స్ విడుదల చేశారు.కాంతార చాఫ్టర్ 1లో రిషబ్ శెట్టి నటిస్తూనే దర్శకత్వం కూడా వహించారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌ను కూడా విడుదల చేస్తున్నారు. దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్లలో ‘కాంతార: చాప్టర్1’ను విడుదల చేయనున్నారు. -
ట్విస్ట్ ఇచ్చిన రిషబ్ శెట్టి
-
కాంతార చూడాలంటే మందు, ముక్క జోలికి వెళ్లకూడదంటూ పోస్ట్!
ఈ ఏడాది సినీజనం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో కాంతార ప్రీక్వెల్ ఒకటి. 2022లో వచ్చిన కాంతార మూవీ సంచలన విజయాన్ని అందుకుంది. దీనికి ప్రీక్వెల్‌గా వస్తోంది కాంతార: చాప్టర్ 1 (Kantara: Chapter 1 Movie). రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా అద్భుతమైన స్పందన వస్తోంది.కాంతార చూడాలంటే..అయితే కాంతార చూడాలంటే కొన్ని నియమాలు పాటించాలంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మద్యం సేవించకూడదు, సిగరెట్ తాగకూడదు, మాంసం తినకూడదు. కాంతార చూసేవరకు వీటిని కచ్చితంగా ఫాలో అవండి అన్నది ఆ పోస్ట్ సారాంశం. అయితే అది ఫేక్ ప్రచారమని కొట్టిపాడేశాడు రిషబ్ శెట్టి (Rishab Shetty). బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఒకరి అలవాట్లను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. ఎవరిష్టం వారిది. డిలీట్ చేశారుకొందరు ఫేక్ పోస్ట్ సృష్టించిన విషయం మా దృష్టికి వచ్చింది. అది చూడగానే నేను షాకయ్యాను. వెంటనే దాన్ని నిర్మాతల గ్రూప్‌కు పంపించాను. ఆ పోస్ట్ చూశాక వెంటనే స్పందించలేకపోయాం. సినిమా పేరు ట్రెండింగ్‌లో ఉండటంతో పాపులారిటీ కోసం, వ్యూస్ కోసం ఇలాంటి పనులు చేస్తుంటారు. ఆ ఫేక్ పోస్ట్ చేసినవారు దాన్ని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారు అని రిషబ్ శెట్టి తెలిపాడు.చదవండి: బిగ్‌బాస్‌కు వద్దన్నాం.. మీరే ఓట్లేశారు.. మరిప్పుడెందుకు ట్రోలింగ్? -
'ఓజీ'ని డామినేట్ చేసిన రిషబ్‌శెట్టి
టాలీవుడ్లో కేవలం వారం గ్యాప్‌లోనే రెండు భారీ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ ఓజీ, అక్టోబర్ 2న రిషబ్‌శెట్టి నటించిన కాంతార: చాప్టర్-1 విడుదల కానున్నాయి. అయితే, ఇప్పటికే ఈ రెండు చిత్రాల ట్రైలర్లు విడులయ్యాయి. కానీ, యూట్యూబ్‌లో వ్యూస్ పరంగా కాంతార జోరు కనిపిస్తుంది. టాలీవుడ్లో భారీ ఫ్యాన్ బేస్ ఉన్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్ కంటే.. పరాయి ఇండస్ట్రీ హీరో రిషబ్‌శెట్టి నటించిన కాంతారనే వ్యూస్ పరంగా దూసుకుపోతుంది.ఓజీ తెలుగు ట్రైలర్ కేవలం 10 మిలియన్ల వ్యూస్‌ను మాత్రమే ఇప్పటి వరకు తెచ్చుకుంది. అయితే, కాంతార: చాప్టర్-1 తెలుగు వర్షన్ ట్రైలర్ ఏకంగా 15 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. దీంతో మలయాళ హీరో రిషబ్‌శెట్టి.. ఓజీని పూర్తిగా డామినేషన్ చేశారంటూ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. తెలుగులో ఎంతో క్రేజ్ ఉందని చెబుతున్న పవన్ కల్యాణ్ సినిమా ట్రైలర్‌కు కేవలం 10 మిలియన్ల వ్యూస్ మాత్రమే రావడం ఏంటి అంటూ నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. కాంతార ట్రైలర్ అన్ని భాషలలో కలిపి110 మిలియన్ల వ్యూస్ దాటేసింది.'హరి హర వీరమల్లు' ట్రైలర్‌కు 48 మిలియన్ల వ్యూస్ ఒక్కరోజులోనే వచ్చినట్లు అప్పుడు ప్రకటించారు. ఇదే ఇండస్ట్రీ రికార్డ్ అంటూ పోస్టర్ కూడా విడుదల చేశారు. కానీ, ఓజీకి వచ్చేసరికి ఇలా కావడం ఏంటి అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. వీరమల్లు ట్రైలర్ వ్యూస్ కోసం బాట్స్ ఉపయోగించారని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాస్తవంగా వీరమల్లు సినిమా కంటే ఓజీకే మొదటి నుంచి కాస్త క్రేజ్ ఎక్కువగా ఉంది. మరి ఇప్పుడు ట్రైలర్ విడుదలయ్యాక కేవలం 10 మిలియన్ల వ్యూస్‌కు మాత్రమే పడిపోవడం ఏంటి అంటూ పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. -
కాంతార ప్రీక్వెల్.. అంచనాలకు తగ్గట్లుగానే బిగ్ ప్లాన్!
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్ చిత్రం కాంతార చాప్టర్-1(Kantara Chapter 1). పాన్ ఇండియా హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. (ఇది చదవండి: 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్)అయితే అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే మేకర్స్ సైతం ఫుల్‌గా ప్రిపేర్ అయ్యారు. ఈ ప్రీక్వెల్ మూవీ కోసం ఇప్పటికే బిగ్ ప్లాన్ సిద్ధం చేశారు. కాంతార ప్రీక్వెల్‌ను దేశవ్యాప్తంగా దాదాపు 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌లోనూ రిలీజ్ కానుంది. అంతే కాకుండా దక్షిణ అమెరికాలో ఫస్ట్ పార్ట్‌కు ఆదరణ దక్కడంతో.. ఇప్పుడు ప్రీక్వెల్‌ను స్పానిష్‌లో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్‌తో బిజీ అయిపోయారు. ప్రస్తుతం రిషబ్‌శెట్టి పోస్ట్ ప్రొడక్షన్పనుల్లో బిజీగా ఉన్నారు. సంగీత దర్శకుడు అజనీష్ లోకనాథ్ సంగీతానికి ఫైనల్ టచ్ ఇస్తున్నారు. -
107 మిలియన్ వ్యూస్.. ‘కాంతార: చాప్టర్ 1’ ఖాతాలో సరికొత్త రికార్డు!
2022లో రికార్డు సృష్టించిన ‘కాంతర’ చిత్రానికి ప్రీక్వెల్‌గా రాబోతున్న చిత్రం కాంతార: చాప్టర్ 1(Kantara Chapter 1 ). తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో ప్రభాస్, హిందీలో హృతిక్, మలయాళంతో పృ థ్విరాజ్, తమిళ్లో శివకార్తికేయన్ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత ఆ అంచనాలు మరింత పెరిగిపోయాయి. ట్రైలర్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తూ ప్రేక్షకులుని కాంతారా ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. ఇక ఈ ట్రైలర్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. 24 గంటల వ్యవధిలో ఈ ట్రైలర్ అన్ని భాషలు కలిపి 107 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో పాటు 3.4 మిలియన్ లైక్స్ సాధించి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ మూవీలొ రిషబ్ శెట్టి సరసన యువరాణి పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడిగా రిషబ్ శెట్టి ఒక దృశ్య కావ్యంలా తీర్చిదిద్దుతున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. హోంబలే ఫిలింస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అక్టోబర్ 2న కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.𝟏𝟎𝟕𝐌+ 𝐕𝐢𝐞𝐰𝐬 & 𝟑.𝟒𝐌+ 𝐋𝐢𝐤𝐞𝐬 𝐢𝐧 𝟐𝟒 𝐡𝐨𝐮𝐫𝐬…🔥The Trailer of #KantaraChapter1 takes the internet by storm, igniting massive excitement everywhere.Watch #KantaraChapter1Trailer now – https://t.co/YVnJsmn7VxIn cinemas #KantaraChapter1onOct2 ✨#Kantara… pic.twitter.com/WyjLETiGsX— Hombale Films (@hombalefilms) September 23, 2025 -
హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్
కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. అక్టోబరు 02న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అయితే టికెట్ రేట్ల విషయమై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చిత్ర నిర్మాతలు హైకోర్టుని ఆశ్రయించారు. గత కొన్నిరోజులుగా ఈ కేసు విషయమై వాదనలు నడిచాయి. ఇప్పుడు నిర్మాతలకు అనుకూలంగా తీర్పు వెలువడింది.కర్ణాటకలోని టికెట్ రేట్లని ప్రభుత్వం నిర్ణయిస్తూ కొన్నిరోజుల క్రితం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఏ థియేటర్లోనైనా సరే రూ.200 కంటే ఎక్కువ ధరకు టికెట్ అమ్మకూడదని ఆదేశాలు జారీ చేశారు. 'కాంతార'కి ఇదే అమలు చేస్తే పెట్టిన బడ్జెట్ తిరిగి రావడం కష్టమవుతుంది. దీంతో నిర్మాతలు హైకోర్ట్‌కు వెళ్లారు. టికెట్ ధరల్లో వెసులుబాటు కల్పించాలని పిటిషన్ వేశారు. దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వ రూల్‌ని తాత్కాలికంగా హోల్ట్‌లో పెట్టింది. టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు నిర్మాతలకు కల్పించింది.(ఇదీ చదవండి: 'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)ఈ క్రమంలోనే 'కాంతార' టికెట్ రేట్ల విషయంలో లైన్ క్లియర్ అయింది. ఫలితంగా కర్ణాటకలో భారీ రేట్లు ఉండబోతున్నాయి. తమిళనాడులో ఎలానూ రూ.200 లోపే టికెట్ ధర ఉంటుంది. మరి తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ మూవీకి పెంపు ఏమైనా తీసుకొస్తారా? లేదంటే ఉన్న రేట్లకు టికెట్స్ అమ్ముతారా అనేది చూడాలి?'కాంతార' తొలి భాగానికి ప్రీక్వెల్‌గా ఈ సినిమాని తీశారు. ఈసారి భారీ ఎత్తున మూవీని తెరకెక్కించారు. ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, భక్తి, యుద్ధాలు తదితర అంశాలు ఉన్నాయి. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. ఇతడికి జోడీగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.(ఇదీ చదవండి: ఈ హీరోలు అసలెక్కడున్నారు? సినిమాలు ఎందుకు చేయట్లేదు?) -
'కాంతార' షూట్లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి
కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'కాంతార ఛాప్టర్ 1'. 2022లో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు. ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇందులో టీమ్ అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు. హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి.. సినిమా గురించి మాట్లాడాడు. అలానే 'కాంతార 1' చూడాలంటే మందు, సిగరెట్, మద్యం సేవించకుండా రావాలని చెప్పి వైరల్ అవుతున్న పోస్టర్‌పైన స్పందించాడు.'కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ. తొలి భాగానికి రెండేళ్లు, ప్రీక్వెల్ కోసం మూడేళ్లు. ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను. అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది. మా టీమ్‌కి గత మూడు నెలలుగా సరైన నిద్ర లేదు. ఎందుకంటే పని జరుగుతూనే ఉంది. ప్రతిఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు. చెప్పాలంటే షూటింగ్లో నేను కూడా 4-5 సార్లు చనిపోవాల్సిన వాడిని. కానీ ఆ దైవమే నన్ను రక్షించింది' అని రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: నామినేషన్స్‌లో ఆరుగురు.. రీతూని మోసం చేసిన పవన్)'కాంతార' తొలి భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు. స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది. అలానే శివ(రిషభ్) తండ్రి కాంతార, అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ డ్రాప్‌తో ప్రీక్వెల్ తీశారు. ఈసారి స్నేహం, నమ్మకద్రోహం, యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్లో చూపించారు. బ్యౌక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈసారి రిషభ్ శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది. గుల్షన్ దేవయ్య విలన్‌గా చేశాడు.ఇకపోతే 'కాంతార 1' సరికొత్త రికార్డ్ సృష్టించింది. 12 గంటల్లోపే అన్ని భాషాలు కలిపి 55 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. మంగళవారం మధ్యాహ్నం వస్తే 24 గంటలు పూర్తవుతుంది. అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్‌తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది. మరోవైపు ఈ సినిమా చూడాలంటే మందు, సిగరెట్, మద్యం తాగకుండా రావాలని వైరల్ అవుతున్న పోస్టర్ ఫేక్ అని రిషభ్ శెట్టి ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో క్లారిటీ ఇచ్చాడు. తొలుత ఇది చూసి షాకయ్యానని, నిర్మాణ సంస్థని అడిగితే అది ఫేక్ పోస్టర్ అని క్లారిటీ ఇచ్చారని, దాని గురించి మాట్లాడలనుకోవట్లేదని అన్నాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు రొమాంటిక్ సినిమా)"#KantaraChapter1: We haven't slept properly for 3 months because of continuous work🫡👏. Everyone supported it as like their own film♥️. In fact, if I count, I was about to die 4 or 5 times during shoot, the divinity we trust saved me🛐♥️"- #RishabShetty pic.twitter.com/8pufSUj7ZI— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025"#KantaraChapter1: I got shocked when I saw no smoking, no alcohol, and no meat Poster😳. In fact I cross checked with the production too🤝. Someone has fakely posted it to get popularity, we don't even want to react for that fake poster❌"- #RishabShettypic.twitter.com/I89jj7y7GP— AmuthaBharathi (@CinemaWithAB) September 22, 2025 -
'కాంతార' సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే..?
కాంతార ప్రపంచంలోకి వెళ్లేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇదే క్రమంలో ఈ సినిమా సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. 2022లో విడుదలైన 'కాంతార' చిత్రానికి ప్రీక్వెల్‌గా 'కాంతార చాప్టర్1' తెరకెక్కింది. ఇందులో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూనే దర్శకుడిగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమాని హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ చిత్రం అక్టోబరు 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.కాంతార చాప్టర్1 చిత్రానికి U/A 16+సర్టిఫికెట్‌ను సెన్సార్ బోర్డు జారీ చేసింది. 2 గంటల 48 నిమిషాల రన్ టైమ్‌తో ఉన్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. అయితే, సెన్సార్‌లో 16 ప్లస్ మాత్రమే అని మెన్షన్ చేయడంతో చిన్నపిల్లలకు ఈ సినిమా చూసే అవకాశం లేదని చెప్పవచ్చు. ఐనాక్స్, పీవీఆర్ వంటి మల్టిఫ్లెక్స్‌లలో చిన్నపిల్లలకు ఎంట్రీ కాస్త కష్టంగానే ఉంటుందని చెప్పవచ్చు.తాజాగా విడుదలైన ట్రైలర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండటంతో సినిమాపై బజ్ క్రియేట్ అయింది.హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌తో ‘సలార్’ మూవీ చేసిన ప్రభాస్ ఇప్పుడు కాంతార కోసం తనవంతుగా చేతులు కలిపారు. ఈ మూవీ తెలుగు ట్రైలర్‌ను డార్లింగ్ విడుదల చేశారు. తమిళ్ శివ కార్తికేయన్, హిందీలో హృతిక్ రోషన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో ట్రైలర్ లాంచ్ చేయించి పాన్ ఇండియా మార్కెట్‌ను ఆకర్షించారు. ‘కాంతార’ సినిమా లాగే ఈ కథ కూడా అడవిని నమ్ముకుని జీవించే గిరిజన తెగ చుట్టూ తిరుగుతుంది. మట్టిపై వాళ్లకున్న మమకారంతో పాటు వాళ్ల సంప్రదాయాలు కనిపించనున్నాయి. అక్కడి తెగను అణగదొక్కి వాళ్ల సంపదను దోచుకోవాలనుకునే దురాశపరుడైన రాజును ఎలా ఎదొర్కొన్నారనే అంశాలు ట్రైలర్లో కనిపించాయి. -
ప్రభాస్ చేతుల మీదుగా 'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ విడుదల
-
'కాంతార' ట్రైలర్ రిలీజ్.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
'కాంతార ఛాప్టర్ 1' ట్రైలర్ రిలీజ్
2022లో ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ వసూళ్లు అందుకున్న సినిమా 'కాంతార'. దీని ప్రీక్వెల్‌ని 'కాంతార ఛాప్టర్ 1' పేరుతో తీశారు. రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించగా.. హొంబలే ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. అక్టోబరు 02న మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: 'చిన్నారి పెళ్లికూతురు'కి ఇప్పుడు నిజంగానే పెళ్లి)ట్రైలర్ చూస్తుంటే ఈసారి భారీతనం కనిపిస్తోంది కానీ ఓకే ఓకే అనిపించింది. రిషభ్ శెట్టి స్క్రీన్ ప్రెజెన్స్.. రుక్మిణి వసంత్ అందం ఎలివేట్ అయ్యాయి. విలన్ పాత్రలో గుల్షన్ దేవయ్య ఆకట్టుకునేలా కనిపించాడు. 'కాంతార' తొలి భాగంలో ప్రస్తుతం ఏం జరిగిందా అనే డ్రామాని సింపుల్‌గా చూపించారు. ఈసారి మాత్రం రాజులు, యుద్ధాలు, రాజకుమారితో హీరో ప్రేమలో పడటం ఇలా అన్ని కూడా భారీగానే సెటప్ చేశారు. మరి 'కాంతార' ఈసారి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 27 సినిమాలు) -
ట్రైలర్ రెడీ
రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటించగా, గుల్షన్ దేవయ్య, జయరాం ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హోంబలే ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్‌ను రేపు (సెప్టెంబరు 22) రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించి, ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను ప్రభాస్, హిందీ ట్రైలర్‌ను హృతిక్ రోషన్, తమిళ ట్రైలర్‌ను శివకార్తికేయన్, మలయాలం ట్రైలర్‌ను పృథ్వీరాజ్ సుకు మారన్లు డిజిటల్‌గా విడుదల చేయనున్నారు.‘‘ఈ సినిమా కోసం 3వేలమంది ప్రజలు, 500 మంది యోధులు పాల్గొన్న ఓ భారీ యుద్ధ సన్నివేశాన్ని తెరకెక్కించాం. ఇందుకోసం 25 ఎకరాల స్థలంలో ఓ పట్టణాన్ని నిర్మించి, దాదాపు 50 రోజుల పాటు షూటింగ్ చేశాం. భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఈ యుద్ధ సన్నివేశం ఒకటిగా నిలుస్తుంది.‘కాంతార’ (‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం తెరకెక్కింది) విజయాన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ రాజీ పడటం లేదు. ఆడియన్స్‌కు థియేటర్స్‌లో గొప్ప అనుభూతిని ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళ, తమిళ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో ‘కాంతార: ఛాప్టర్ 1’ చిత్రం అక్టోబరు 2న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. -
పాన్ ఇండియా షేక్..! ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పిచ్చెక్కించే అప్డేట్
-
కోర్ట్ని ఆశ్రయించిన 'కాంతార' నిర్మాతలు?
మరో రెండు వారాల్లో 'కాంతార' కొత్త సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఇంతవరకు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మిగతా అన్నీ పనులు పూర్తయినప్పటికీ సొంత రాష్ట్రంలోనే ఓ సమస్య ఇబ్బందిగా మారింది. దీంతో నిర్మాతలు ఇప్పుడు కోర్టుని ఆశ్రయించారని టాక్. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఏంటి విషయం?రీసెంట్‌గానే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం.. సినిమా టికెట్స్ విషయమై సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టికెట్ ధరలు తగ్గించేసింది. మల్టీప్లెక్స్‌ల్లో గరిష్ఠ టికెట్ ధర రూ.236 మాత్రమే ఉంది. ఇంతకంటే పెంచడానికి వీలు లేదని తీర్మానించింది. దీన్ని ఇప్పటికే అమలు చేస్తున్నారు కూడా. చిన్న బడ్జెట్ మూవీస్‌కి దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ 'కాంతార' లాంటి చిత్రానికి పెట్టిన బడ్జెట్ తిరిగి రావాలంటే టికెట్ ధరలు పెంచాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ విషయమై నిర్మాతలు హొంబలే ఫిల్మ్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అరుంధతి రీమేక్‌లో శ్రీలీల.. 'మెగా' డైరెక్టర్!)టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని 'కాంతార' నిర్మాతలు రిట్ పిటిషన్ వేసినట్లు సమాచారం. ఒకవేళ ఇది వర్కౌట్ అయితే.. వీళ్లతో పాటు భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలకు మార్గం సుగమమం అవుతుంది. లేదంటే 'కేజీఎఫ్' రికార్డులు కాదుకదా రూ.1000 కోట్ల మార్క్ కూడా దాటడం కష్టమైపోతుంది. అలానే కర్ణాటకలో తక్కువ రేట్, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ధర పెడితే మాత్రం కచ్చితంగా విమర్శలు వస్తాయి. మరి ఈ పిటిషన్‌పై ఫలితం ఏమొస్తుందో చూడాలి?దసరా కానుకగా అక్టోబరు 2న 'కాంతార: ఛాప్టర్ 1' థియేటర్లలోకి రానుంది. తొలి పార్ట్ సింపుల్‌గా రూ.15-20 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో రెండో భాగాన్ని కళ్లు చెదిరే బడ్జెట్ పెట్టారు. అలానే రుక్మిణి వసంత్ లాంటి నటుల్ని సినిమాలో భాగం చేశారు. మరి ఈసారి 'కాంతార' ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో?(ఇదీ చదవండి: మాస్క్ మ్యాన్ కాదు టార్చర్ మ్యాన్.. ఉతికారేసిన తనూజ!) -
కాంతార ప్రీక్వెల్... రంగంలోకి నేషనల్ అవార్డ్ సింగర్!
కన్నడ ఇండస్ట్రీలో నుంచి బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార. ఈ సినిమాను రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రం కర్ణాటకలోనే కాకుండా అన్ని దేశవ్యాప్తంగా అనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని హోంబలే సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా ఆ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతారా చాప్టర్– 1 పేరుతో అత్యంత భారీ బడ్జెట్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తయిన ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక పాటను ఇటీవల రికార్డ్ చేశారు.ఈ సాంగ్‌ను జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత నటుడు, గాయకుడు దిల్జిత్ దోసాంజ్ పాడడం విశేషం. ఈ సందర్భంగా ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాంతార వంటి అద్భుతమైన చిత్రాన్ని రూపొందించిన తన సోదరుడు రిషబ్ శెట్టికి తన ప్రణామాలు అని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తనకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. అదేమిటి అన్నది ఇప్పుడే చెప్పలేనని అయితే వారాహరూపం అనే పాట ధ్వనిస్తున్నప్పుడు మాత్రం ఆనందభాష్వాలు వచ్చాయన్నారు. ఇకపోతే త్వరలో తెరపైకి రానున్న కాంతార చాప్టర్ –1 లో పాడిన అనుభవం మరువలేనిదన్నారు.ఈ సందర్భంగా ఈ చిత్ర సంగీత దర్శకుడు బి. అజనీష్ లోకనాథ్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అని అన్నారు. ఒక్క రోజులోనే ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నట్లు చెప్పారు. దీంతో నటుడు దర్శకుడు రిషబ్ శెట్టి, గాయకుడు దిల్జిత్ దోసాంజ్, హోంబలే ఫిల్మ్స్ కాంబోలో రూపొందిన ఈ చిత్ర ఆల్బమ్‌పై ఆసక్తి నెలకొంది. కాగా ఈ చిత్రం అక్టోబర్ రెండో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. Excited to join hands with @diljitdosanjh for the Kantara album 🙏✨By Shiva’s grace, everything fell into place. Much love, Paji ❤️🔥Another Shiva bhakt meets Kantara.#KantaraChapter1 #KantaraChapter1onOct2 pic.twitter.com/44ya4cyL8S— Rishab Shetty (@shetty_rishab) September 12, 2025 -
కాంతార ప్రీక్వెల్.. ఆ రాష్ట్రంలో విడుదలకు నో!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కాంతార చాప్టర్-1 పేరుతో ఈ మూవీని తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లో సందడి చేసేందుకు రెడీ అయిపోయింది.అయితే రిలీజ్ తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఈ మూవీకి అడ్డంకులు ఎదురువుతున్నాయి. కేరళలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని ఎగ్జిబిటర్స్ యూనియన్ ప్రకటించింది. ఈ సినిమాను కేరళలో రిలీజ్ చేస్తున్న సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తో లాభాల వాటాపై డీల కుదరకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా రిలీజైన మొదటి రెండు వారాలు లాభాల్లో 55 శాతం వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. అయితే ఇందుకు పృథ్వీరాజ్ సుకుమారన్‌కు చెందిన పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ నిరాకరించింది. దీంతో కేరళలో సినిమా ప్రదర్శనను నిలిపిస్తున్నట్లు యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఈ ప్రకటనతో కాంతార ప్రీక్వెల్ వీక్షించాలనుకున్న మలయాళీలకు నిరాశే తప్పేలా లేదు.మలయాళ సినిమాలు ఇతర రాష్ట్రాల్లో రిలీజైనప్పుడు కేవలం 40 శాతం లాభాల వాటా మాత్రమే పొందుతున్నామని ఎగ్జిబిటర్ల యూనియన్ అధ్యక్షుడు విజయకుమార్ అన్నారు. మలయాళ చిత్ర నిర్మాతలకు అంత వాటా రానప్పుడు.. ఈ పంపిణీదారులు ఎందుకు అంత మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. వారి నుంచి ఈ విషయంలో చొరవ తీసుకోకపోతే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోబోమని ఎగ్జిబిటర్ల యూనియన్ పేర్కొంది. కాగా.. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, జయరామ్, రాకేష్ పూజారి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. -
ప్లాన్ వరల్డ్
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. నిన్న మొన్నటి వరకు తెలుగు హీరోలు, దర్శక–నిర్మాతలు పాన్ ఇండియా మంత్రం జపించారు. ఇప్పుడు పాన్ వరల్డ్’ అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీ భాషల్లోనూ తెలుగు సినిమాలను రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌లో ఉన్న చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.తెలుగు సినిమా హీరోలు, దర్శక–నిర్మాతలే కాదు.. బాలీవుడ్, కన్నడ వంటి సినీ పరిశ్రమలు కూడా హాలీవుడ్ మార్కెట్‌పై దృష్టి సారించాయి. భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్, రావణుడిగా యశ్ నటిస్తున్నారు. కాగా ‘రామాయణ’ సినిమా రెండు భాగాలను దాదాపు 4 వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూ పొందిస్తున్నామని, హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం ఈ సినిమా తీసి పోదని ఈ చిత్రనిర్మాత నమిత్ మల్హోత్రా ఓ సందర్భంలో తెలిపారు.అలాగే విదేశీ ప్రేక్షకులు సైతం మెచ్చుకునేలా ‘రామాయణ’ సినిమాను తీస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ‘రామాయణ’ సినిమాను విదేశీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లుగా ఆయన పరోక్షంగా వెల్లడించారు. ‘రామాయణపార్ట్ 1’ చిత్రం వచ్చే ఏడాది దీపావళికి, ‘రామాయణపార్ట్ 2’ చిత్రం ఆపై వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానున్నాయి.ఇంకా రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’, యశ్ ‘టాక్సిక్’ చిత్రాలు కొన్ని భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్ వెర్షన్స్‌ను కూడా రిలీజ్ చేయనున్నాయి. ఈ విధంగా విదేశీ మార్కెట్‌పై భారతీయ ఫిల్మ్‌మేకర్స్ దృష్టి పెట్టారు. ఇక ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం ఈ అక్టోబరు 2న విడుదల కానుండగా, ‘టాక్సిక్’ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న విడుదల కానుంది.అవతార్‌ను మించి..! హాలీవుడ్లో ప్రంపచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలుగా చెప్పుకునే ‘అవతార్’, ‘అవెంజర్స్’ వంటివి దాదాపు వంద దేశాల్లో విడుదలయ్యాయి. అలాంటిది హీరో మహేశ్‌బాబు, దర్శకుడు రాజమౌళి కాంబినేషన్లోని ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్) మాత్రం అంతకు మించి, 120కిపైగా దేశాల్లో రిలీజ్ అయ్యేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ హాలీవుడ్ సినిమాలకు ఏ మాత్రం తీసి పోదని.ఇంకా చెప్పాలంటే... హాలీవుడ్ చిత్రాలకే పోటీగా నిలుస్తున్న సినిమా ఇది. పైగా ఈ సినిమా అప్డేట్స్కి కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి. ఈ ‘ఎస్ఎస్ఎమ్బీ29’ సినిమా ఫస్ట్ లుక్‌ను ‘టైటానిక్, అవతార్’ వంటి మూవీస్‌ని డైరెక్ట్ చేసిన జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా రిలీజ్ చేసేందుకు రాజమౌళి అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది.నవంబరులో తన సినిమా ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్స్‌లో భాగం దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఇండియాకు రానున్నారని, ఈ సందర్భంగా ఆయన చేతుల మీదుగా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేయించేలా రాజమౌళి ఏర్పాట్లు చేస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. ఇలా చేస్తే ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ రీచ్ గ్లోబల్ స్థాయిలో ఉంటుందన్నది టీమ్ ఆలోచనగా తెలుస్తోంది. ⇒ ఇక ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కెన్యాలో జరుగుతోంది. ఈ చిత్ర హీరో మహేశ్బాబుతోపాటుగా ఇతర ప్రధాన తారాగణం ప్రియాంకా చో్రపా, పృథ్వీరాజ్ సుకుమారన్పాల్గొంటుండగా ఆఫ్రికా అడవుల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్లు అని, ఈ సినిమాకు ‘జెన్ –63’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారని, దాదాపు 20కిపైగా భాషల్లో ఈ సినిమాను అనువదించి, 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇంకా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్ వంటి హాలీవుడ్ నటులు కూడా కనిపిస్తారని, ఇందుకు సంబంధించి ఓ ప్రముఖ హాలీవుడ్ యాక్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.ఫారిన్ స్పిరిట్ ప్రభాస్ ది ఇంటర్నేషనల్ హీరో కటౌట్. ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి, కల్కి2898 ఏడీ’ వంటి చిత్రాలు జపాన్ దేశంలో విడుదలై, అక్కడి ప్రేక్షకులను అలరించాయి. ఇక ప్రభాస్ హీరోగా నటించనున్న చిత్రాల్లో ‘స్పిరిట్’ కూడా ఒకటి. ‘అర్జున్ రెడ్డి, యానిమల్’ చిత్రాల ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.యూవీ క్రియేషన్స్, టీ–సిరీస్, భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలోనే ‘స్పిరిట్’ను భారతీయ భాషలతోపాటు ఇంగ్లిష్, చైనా, జపాన్, కొరియా భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. దీంతో ‘స్పిరిట్’ చిత్రం ఇంటర్నేషనల్ లెవల్లో రిలీజ్ కానుంది. ఇంకా ‘స్పిరిట్’ సినిమా చిత్రీకరణ మొదలు కాలేదు. రిలీజ్ సమయానికి ‘స్పిరిట్’ మరిన్ని విదేశీ భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశాలు లేక పోలేదు.ఇక ఈ చిత్రంలో తొలిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటించనున్నారు. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈపాటికే మొదలు కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతోంది. కాగా ఈ సినిమాలోని ఓ మేజర్ షూటింగ్ షెడ్యూల్‌ను మెక్సికోలో ప్లాన్ చేసినట్లుగా ఈ చిత్రదర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల ఓ సందర్భంలో వెల్లడించిన విషయం గుర్తుండే ఉంటుంది.ఇంకా ఈ చిత్రంలో సౌత్ కొరియన్ నటుడు డాన్ లీ విలన్‌గా నటించనున్నారనే టాక్ వినిపిస్తోంది. డాన్ లీతో తెలుగు నటుడు శ్రీకాంత్ ఉన్న ఫొటోలు ఇంటర్ నెట్లో వైరల్ అయ్యాయి. దీంతో..‘స్పిరిట్’ చిత్రంలో డాన్ లీ, శ్రీకాంత్ ఏమైనా భాగం అయ్యారా? అనే టాక్ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.గ్లోబల్ డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూ పొందుతున్న సినిమా ‘డ్రాగన్’. ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రుక్మిణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. మలయాళ నటుడు టొవినో థామస్ విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ సమయంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వచ్చాయి. ఈ సినిమాను దాదాపు 15 దేశాల్లో చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేశారన్నది ఆ వార్తల సారాంశం. ఇందుకు తగ్గట్లుగానే ఈ ‘డ్రాగన్’ కోసం ఇంటర్నేషనల్ కనెక్ట్విటీ ఉండే ఓ ప్రపంచాన్ని ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది.అంతేకాదు... ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్స్ నవంబరులో ప్రారంభం అవుతాయట. మరి... ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న స్టోరీని రెడీ చేసుకుని, ఇంటర్నేషనల్ లొకేషన్స్‌లో చిత్రీకరణకు ప్లాన్ చేసినప్పుడు, ఇంటర్నేషనల్ రేంజ్ రిలీజ్‌ను కూడా ప్లాన్ చేయకుండా ఉంటారా? ‘డ్రాగన్’ టీమ్ ఈ దిశగా ఆలోచిస్తోందట. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.ఇదిలా ఉంటే... ‘ఆర్ఆర్ఆర్’ (ఇందులో రామ్‌చరణ్ మరో హీరో) చిత్రంలో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. ఈ సినిమా ఆస్కార్ క్యాంపైన్ ప్రమోషన్స్‌లో ఉత్సాహంగాపాల్గొన్నారు ఎన్టీఆర్. ఈ విధంగా ప్రపంచవ్యాప్త సినిమా ఆడియన్స్‌కు ఎన్టీఆర్ గురించి ఓ అవగాహన ఉంది.ఇంటర్నేషనల్ పెద్ది స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలకు ఓ సౌలభ్యం ఉంటుంది. భాష అర్థం కాక పోయినా గేమ్, ఇందులోని స్ట్రాటజీస్ ఏ భాషవారికైనా కనెక్ట్ అవుతాయి. హిందీలో ‘మేరికోమ్, భాగ్ మిల్కా సింగ్, చక్ దే ఇండియా’ వంటి సినిమాలు వచ్చినప్పుడు ఇక్కడి తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమాలను హిందీ భాషలోనే చూసి, ఈ చిత్రాలను సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ కూడా ఇదే చేయనుందట. కాక పోతే ఇంటర్నేషనల్ లెవల్లో. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పీరియాడికల్ మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా ఈ సినిమాకు దర్శకుడు.ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా జగపతిబాబు, దివ్యేందు శర్మ, శివరాజ్‌కుమార్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ మైసూర్లో జరుగుతోంది. రామ్చరణ్పాల్గొంటుండగా ఓపాటతోపాటు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా రామ్‌చరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 27న విడుదల కానుంది.కాగా ఈ సినిమాను గ్లోబల్ స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. మంచి ఎమోషన్స్ ఉన్న స్పోర్ట్స్ డ్రామా కాబట్టి యూనివర్సల్ అప్పీల్ ఉంటుందని టీమ్ భావిస్తోందట. ఈ దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టిందట టీమ్. ఇక ‘ఆర్ఆర్ఆర్’ (ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరో హీరో) చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా రామ్‌చరణ్‌కు క్రేజ్ వచ్చింది. ఈ సినిమా ఆస్కార్ ప్రమోషన్స్‌లోనూ రామ్‌చరణ్ ఉత్సాహంగాపాల్గొన్నారు. ‘ఆర్ఆర్ఆర్’లో రామ్‌చరణ్ పెర్ఫార్మెన్స్ను కొందరు హాలీవుడ్ దర్శకులు మెచ్చుకున్నారు. ఇదంతా ‘పెద్ది’ సినిమాను ఇంటర్నేషనల్ ఆడియన్స్‌కు దగ్గర చేయడంలో ఉపయోగపడుతుందని టీమ్ భావిస్తోందని ఫిల్మ్‌నగర్ భోగట్టా.హాలీవుడ్ అసోసియేషన్ ‘పుష్ప’ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ బాగా పెరిగింది. ‘పుష్ప:ది రూల్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత హీరో అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి తమిళ దర్శకుడు అట్లీ డైరెక్టర్. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టింది.హాలీవుడ్లో ‘అవతార్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, డ్యూన్, జురాసిక్ వరల్డ్’ వంటి సినిమాల ప్రమోషన్స్‌లో క్రీయాశీలకంగా వ్యవహరించిన హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అల్లు అర్జున్–అట్లీ టీమ్ అసోసియేట్ అయ్యేందుకు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగానే ‘కనెక్ట్ మాబ్ సీన్’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రియేటివ్ కంటెంట్ అలెగ్జాండ్రా ఈ. విస్కోంటి ఇటీవల ముంబై వచ్చి, అల్లు అర్జున్–అట్లీ అండ్ టీమ్‌ని కలిసి మాట్లాడారు. ‘కనెక్ట్ మాబ్ సీన్’తో అసోసియేషన్ దాదాపు ఓకే అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ⇒ కాగా ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. అల్లు అర్జున్‌తోపాటు ఈ చిత్రంలోని కీలక తారాగణంపాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. కథ రీత్యా ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్‌కు స్కోప్ ఉందని, దీపికా పదుకోన్ ,మృణాల్ ఠాకూర్ కన్ఫార్మ్ అయ్యారని, మిగతా హీరోయిన్స్‌గా జాన్వీ కపూర్, ఆలియా.ఎఫ్, భాగ్యశ్రీ బోర్సే వంటివారు కనిపించే అవకాశం ఉందనే టాక్ తెరపైకి వచ్చింది.ఇంకా ఈ చిత్రంలో రమ్యకృష్ణ, యోగిబాబు, విజయ్ సేతుపతి వంటి వారు ఇతర కీలకపాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు... ఈ చిత్రంలో అల్లు అర్జున్ నాలుగుపాత్రల్లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. తాత – తండ్రి–ఇద్దరు కొడుకులపాత్రల్లో అల్లు అర్జున్ కనిపిస్తారట. ఇక అల్లు అర్జున్ కెరీర్‌లోని ఈ 22వ సినిమా 2027 ఆగస్టులో రిలీజ్ కానుందనే ప్రచారం జరుగుతోంది.ది ప్యారడైజ్ ‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత నాని–దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూ పొందుతున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదల కానుంది. కాగా ‘ది ప్యారడైజ్’ సినిమాను కొన్ని భారతీయ భాషలతోపాటు స్పానిష్, ఇంగ్లిష్ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.ఇందుకు తగ్గట్లుగానే హాలీవుడ్ ప్రముఖ మార్కెటింగ్ ఏజెన్సీ ‘కనెక్ట్ మాబ్ సీన్’ సంస్థతో ఇటీవల చర్చలు జరిపారు మేకర్స్. అంతేకాదు... ‘ది ప్యారడైజ్’ సినిమా ఇంటర్నేషనల్ వెర్షన్ రిలీజ్ కోసం ఓపాపులర్ హాలీవుడ్ యాక్టర్‌తో అసోసియేట్ కావాలనుకుంటున్నారు మేకర్స్. ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టారు. త్వరలోనే ఈ విషయంపై మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.వీరే కాదు.. మరికొంతమంది తెలుగు హీరోలు కూడా తమ మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయిలో పెంచుకునేందుకు ఇప్పట్నుంచే వ్యూహ రచనలు చేస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. – ముసిమి శివాంజనేయులు -
టార్గెట్ @ 1000కోట్ల.. అందరి చూపు కాంతారా వైపే
-
కాంతార ప్రీక్వెల్.. మరో స్టార్ నటుడు అరంగేట్రం!
కాంతార మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ముందు పెద్దగా పరిచయం లేని ఆయన.. ఈ ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ మూవీలో కులశేఖర పాత్రలో మెప్పించనున్నారు. దాదాపు ఏడు భాషల్లో గుల్షన్ దేవయ్య పోస్టర్ రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుల్షన్ దేవయ్య శాండల్‌వుడ్ అరంగేట్రం చేయనున్నారు.ఈ చిత్రంలో మరో నటి రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె రోల్ రివీల్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
కాంతార 2లో ఎన్టీఆర్ ఎంట్రీ?
-
కాంతార కంబళ దున్న మృతి
కన్నడ హిట్ సినిమా కాంతారలో నటుడు రిషబ్ శెట్టితో కలిసి నటించిన దున్నపోతు అప్పు కన్నుమూసింది. ఇది కరావళి భాగంలో అనేక కంబళ పోటీలలో పాల్గొని పతకాలను గెల్చుకుంది. బెంగళూరులో జరిగిన కంబళ పోటీలలో ప్రథమస్థానంలో నిలిచింది. కంబళ దున్నలను యజమానులు తమ కుటుంబసభ్యులుగా భావిస్తారు. మంచి ఆహారంతో పాటు సకల వసతులుకల్పిస్తారు. దీని పేరు అప్పు కాగా, కాంతార సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. రిషబ్‌తో కలిసి అనేక సన్నివేశాలలో కనిపిస్తుంది. వయోభారంతో మరణించడంతో యజమానులు, అభిమానులు విషాదానికి లోనయ్యారు. శనివారం ఘనంగా అంత్యక్రియలు జరిపించారు. -
వరలక్ష్మీ వ్రతంలో కన్నడ స్టార్స్.. దంపతులుగా పూజలు (ఫోటోలు)
-
'కాంతార'లో కనకావతి
వరమహాలక్ష్మి పండగ సందర్భంగా కనకావతిగా కనిపించారు రుక్ష్మిణి వసంత్. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార: చాప్టర్1’. ఈ చిత్రంలో కనకావతి పాత్రలో హీరోయిన్ రుక్మిణీ వసంత్ నటించినట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్.హోంబలే ఫిలిమ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానుంది. ఇక రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘కాంతార’ (2022)కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ రూపొందిన సంగతి తెలిసిందే. -
కాంతార 3లో జూనియర్ ఎన్టీఆర్?
సినిమా బాలేకపోతే ఎంత ప్రచారం చేసినా జనాలు అస్సలు పట్టించుకోరు. అదే కంటెంట్ నచ్చితే మాత్రం భాషతో సంబంధం లేకుండా ఎగబడి చూస్తారు. 2022లో వచ్చిన కాంతార (Kantara Movie) అనే కన్నడ సినిమా ఇందుకు నిలువెత్తు ఉదాహరణ. దాదాపు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంతార బ్లాక్‌బస్టర్ హిట్నిర్మాతలు సినిమా హిట్టని ఊహించుంటారు కానీ ఇలా వందల రెట్ల లాభాలు వస్తాయని మాత్రం కలలో కూడా ఊహించి ఉండరు. ఈ సినిమాను రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో ప్రధాన పాత్రలో నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబలే ఫిలింస్ బ్యానర్ నిర్మించింది. ఈ బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రానికి ప్రీక్వెల్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! కాంతార 3లో తారక్?ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. అంటే ఇది ఫస్ట్ పార్ట్ కాగా, ఇప్పటికే రిలీజైంది రెండో పార్ట్ అన్నమాట! తాజాగా ఓ ఆసక్తికర విషయం ఫిల్మీదునియాలో చక్కర్లు కొడుతోంది. రిషబ్ శెట్టి కాంతార 3 కూడా తెరకెక్కించే ప్లాన్‌లో ఉన్నాడని, అందులో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా భాగం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. మరి ఇదెంతవరకు నిజమన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ కనక నిజమైతే అభిమానులకు మాత్రం పండగే! సినిమా..ప్రస్తుతం ఎన్టీఆర్.. వార్ 2 మూవీతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో తారక్ కీలక పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి డ్రాగన్ టైటిల్ పరిశీలిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ పౌరాణిక సినిమా కూడా చేయనున్నాడు. దేవర 2 కూడా లైన్లోనే ఉంది.చదవండి: AI క్లైమాక్స్.. ఆత్మను చంపేశారు: ధనుష్ ఆగ్రహం -
వెండితెరపై హిస్టరీ రిపీట్!
వెండితెరపై హిస్టరీ రిపీట్ అవుతోంది. అవును... వందల సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలను వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. ఇందుకోసం స్టార్ హీరోలు రంగంలోకి దిగారు. భారీ బడ్జెట్లతో నిర్మాతలు, సూపర్ టేకింగ్‌తో దర్శకులు తీస్తున్న ఆ సినిమాల వివరాలు, ఆ చారిత్రక సంఘటనల విశేషాలను తెలుసుకుందాం.మాస్ కాదు... ఫ్యాంటసీ ‘వీరసింహారెడ్డి’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో సినిమా రానుంది. అయితే ఈ సారి ఓ చారిత్రక కథను సిద్ధం చేశారు గోపీచంద్ మలినేని. బాలకృష్ణ హీరోగా నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని, ఈ హిస్టారికల్ డ్రామాలో మరో హీరోకి కూడా స్కోప్ ఉందని ఫిల్మ్‌నగర్ సమాచారం. ఈ సినిమాలో రెండో హీరోగా వెంకటేశ్ నటిస్తారని తెలిసింది. అలాగే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమా తర్వాత హీరో బాలకృష్ణ–దర్శకుడు క్రిష్ కాంబినేషన్లో మరో సినిమా రానుందని, ఇది హిస్టారికల్ డ్రామా అనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.తండ్రీకొడుకుల ఎమోషన్ ‘ఎల్2: ఎంపురాన్, తుడరుమ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల సక్సెస్‌తో ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నారు మలయాళ హీరో మోహన్‌లాల్. అలాగే మోహన్‌లాల్ నటించిన మరో రెండు సినిమాలు ‘వృషభ, హృదయపూర్వం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కాగా ‘వృషభ’ సినిమా హిస్టారికల్ మూవీ అని ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ స్పష్టం చేస్తోంది. తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 16న రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమాకు నందకిశోర్ దర్శకత్వం వహించారు. శోభా కపూర్, ఏక్తా ఆర్. కపూర్, సీకే పద్మకుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్. వ్యాస్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా ఈ సినిమాను నిర్మించారు.సైనికుడి పోరాటం బ్రిటిష్ పరిపాలన కాలంలో ఓ సైనికుడి వీరోచిత పోరాటం, త్యాగం, ప్రేమ... వంటి అంశాలతో ఓ హిస్టారికల్ డ్రామా సినిమా రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తారు. హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిపాత్రలో నటిస్తున్నారని, 1940 నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది.భాగ్యనగరం, నైజాంలో రజాకార్ల ఆకృత్యాలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుందట. ఈ చిత్రం షూటింగ్ సగానికిపైగా పూర్తయిందని తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ ఇతర ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు.బెంగాల్లో డ్రాగన్ హీరో ఎన్టీఆర్–దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ‘డ్రాగన్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) సినిమా రానుంది. ఇది హిస్టారికల్ డ్రామా మూవీ అని తెలిసింది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రధానంగా ఈ సినిమాలో బెంగాల్, బంగ్లాదేశ్‌ల నేపథ్యం కనిపిస్తుందట. 1850 టైమ్‌లైన్‌లో ఈ సినిమా మేజర్ కథనం ఉంటుందనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా కాన్సెప్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఈ విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తోంది.అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రుక్ముణీ వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారని, విలన్‌గా మలయాళ నటుడు టోవినో థామస్ కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై కల్యాణ్ రామ్, కొసరాజు హరికృష్ణ, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలుత ఈ సినిమాను 2026 జనవరి 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ... ఆ తర్వాత 2026 జూన్ 25కు విడుదలను వాయిదా చేశారు. ఈ సినిమాకు రవిబస్రూర్ సంగీతం అందిస్తున్నారు.రాయలసీమ నేపథ్యంలో... రాయలసీమలో జరిగిన కొన్ని చారిత్రక సంఘటనలతో హీరో విజయ్ దేవరకొండ ఓ హిస్టారికల్ సినిమా చేస్తున్నారు. 2018లో విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ రూపంలో ఓ హిట్ అందించిన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకుడు. అతి త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కొద్ది రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను రెడీ చేస్తున్నారు మేకర్స్.1854–1878 మధ్య కాలంలో రాయలసీమలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా, ఇప్పటివరకు ఎవరూ వెండితెరపై చెప్పని ఓ సరికొత్తపాయింట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా మేకర్స్ ఆల్రెడీ తెలిపారు. విజయ్ దేవరకొండ సరసన రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇదే నిజమైతే... ‘గీతగోవిందం, డియర్ కామ్రేడ్’ చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ–రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నట్లవుతుంది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, భూషణ్‌కుమార్, క్రిషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.రాజుల కథ హీరో నిఖిల్ రెండు హిస్టారికల్ సినిమాలు చేస్తున్నారు. అందులో మొదటిది ‘స్వయంభూ’. ‘బాహుబలి’ తరహా మాదిరి రాజుల కాలం నాటి కల్పిత కథతో ‘స్వయంభూ’ సినిమా కథనం ఉంటుంది. సంయుక్త, నభా నటేశ్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రారంభం కానుందని తెలిసింది. ఠాగూర్ మధు సమర్పణలో ఈ భారీ బడ్జెట్ సినిమాను భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీపై ఓ స్పష్టత రానుంది. అలాగే నిఖిల్ హీరోగా చేస్తున్న మరో సినిమా ‘ది ఇండియా హౌస్’. 1905 నేపథ్యంలో కొన్ని వాస్తవ చారిత్రక సంఘటనల ఆధారంగా రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల సెట్స్‌లో జరిగిన ఓ చిన్న ప్రమాదం కారణంగా ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా వాయిదా పడింది.రామ్‌చరణ్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి. మెగా పిక్చర్స్ సంస్థలు నిర్మిస్తున్న ‘ది ఇండియా హౌస్’ సినిమాలో సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్ ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా 2026 చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. 1905లో లండన్‌లో జరిగిన కొన్ని సంఘటనలు భారతదేశ స్వాతంత్య్రంపై ఏ విధంగా ప్రభావితం చూపాయి అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందట. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సవార్కర్‌కు చెందిన సంఘటనలు కూడా ఈ సినిమాలో హైలైట్‌గా ఉంటాయట.గోపీచంద్ శూల ప్రేక్షకులను ఏడో శతాబ్దంలోకి తీసుకుని వెళ్లనున్నారు గోపీచంద్. ‘ఘాజీ, అంతరిక్షం’ వంటి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో ఓ హిస్టారికల్ వార్ డ్రామా చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో గోపీచంద్ వారియర్‌గా నటిస్తున్నారు. కశ్మీర్లో ఓ లాంగ్ షూటింగ్ షెడ్యూల్‌ను ఆ మధ్య పూర్తి చేశారు. ఈ సినిమా ఏడో శతాబ్దం నేపథ్యంలో సాగుతుందని, ఇప్పటివరకు చరిత్రలో ఎవరూ టచ్ చేయని ఓపాయింట్తో తాము ఈ సినిమా చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. గోపీచంద్ కెరీర్‌లోని ఈ హిస్టారికల్ సినిమాను భారీ బడ్జెట్‌తో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాకు ‘శూల’ అనే టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా 2026 ద్వితీయార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇలా హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.శతాబ్దాల క్రితంనాటి కథలు కాదు... కానీ సెమీ పీరియాడికల్ సినిమాలు (50–60 సంవత్సరాల క్రితం నేపథ్యంలో) మరికొన్ని ఉన్నాయి. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’, ‘దసరా’ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లోని ‘దిప్యారడైజ్’, దుల్కర్ సల్మాన్ ‘కాంత’, ఆది సాయికుమార్ ‘శంబాల’, రోషన్ మేకా ‘చాంపియన్’... ఈ కోవకి చెందిన సినిమాలే. కాంతార ప్రీక్వెల్ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా మూడు హిస్టారికల్ సినిమాల్లో రిషబ్ శెట్టి నటించడం విశేషం. అది కూడా ఈ సినిమాల వరుసగా చేయడం అంటే చిన్న విషయం కాదు. పీరియాడికల్ కథలపై కన్నడ నటుడు–దర్శక–హీరో రిషబ్ శెట్టి ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లుగా ఉన్నారు. రిషబ్ వరుసగా శతాబ్దాల క్రితం నాటి కథలతో సినిమాలు చేస్తున్నారు. రిషబ్ శెట్టి హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో రూపొందిన తాజా సినిమా ‘కాంతార: చాఫ్టర్ 1’. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్‌గా రానుంది.‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలై 1970లో జరిగే కొన్ని సన్నివేశాలతో కొనసాగుతుంది. అయితే ప్రధానంగా 1990 బ్యాక్‌డ్రాప్‌లో మేజర్ సినిమా కథనం సాగుతుంది. ‘కాంతార’ సినిమా కథ 1847లో మొదలైంది కనుక ‘కాంతార’ ప్రీక్వెల్ ఇంకా ముందు జరిగిన కథగా ఉంటుంది. ఈ ప్రకారం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ్ర΄÷డక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. తిరుగుబాటుదారుడి కథ: ‘జై హనుమాన్’ సినిమా తర్వాత రిషబ్ శెట్టి తెలుగులో మరో సినిమా చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనున్న ఈ సినిమాకు అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తారు.18వ శతాబ్దంలో భారత్‌లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం నేపథ్యంలో ఈ సినిమా చేయనున్నారు రిషబ్ శెట్టి. ఈ ఫిక్షనల్ హిస్టారికల్ డ్రామాలో రిషబ్ శెట్టి హీరోగా నటిస్తారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసిన యోధుడు: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా తెరకెక్కనుంది. ఈ బయోపిక్కు సందీప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ హిస్టారికల్ డ్రామా 1630– 1680 మధ్యకాలంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మొఘల్ సామ్రాజ్యాన్ని సవాల్ చేసి అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఓ యోధుడి కథగా ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ సినిమా రానుందని, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఏకకాలంలో 2027 జనవరి 21న రిలీజ్ చేస్తామని ఈ చిత్ర సంగీత దర్శకుడు సందీప్ రాజ్ ఆ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఇలా.. రెండు సంవత్సరాల వ్యవధిలో మూడు హిస్టారికల్ డ్రామా కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు రిషబ్ శెట్టి. – ముసిమి శివాంజనేయులు -
'కాంతార' రిషభ్ శెట్టి మరో తెలుగు సినిమా
'కాంతార' మూవీతో సంచలనం సృష్టించిన కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ చేస్తున్న ఇతడు.. తర్వాత ప్రశాంత్ వర్మ తీసే 'జై హనుమాన్' చేస్తాడు. దీని తర్వాత ఓ హిందీ మూవీ లైన్లో ఉంది. ఇప్పుడు వీటితో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ తీసే సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: చెత్త సినిమాలు తీసిన మీకు తెలియదా? పవన్ పై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం)18వ శతాబ్దంలో భారత్‌లోని అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్‌లో ఓ తిరుగుబాటుదారుడి కథతో ఈ సినిమాని తీయబోతున్నారు. ఈ క్రమంలోనే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలోనూ దీన్ని ఒకేసారి తీస్తారు. అనంతరం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: 'కింగ్డమ్' విలన్.. ఇప్పటికీ రోడ్డుపై ఇడ్లీ కొట్టు) -
'కాంతార' ప్రీక్వెల్ మేకింగ్ వీడియో HD (ఫొటోలు)
-
వరల్డ్ ఆఫ్ 'కాంతార' మేకింగ్ వీడియో
-
జర్నీ మొదలైంది.. 'వరల్డ్ ఆఫ్ కాంతార' వీడియో రిలీజ్
2022లో వచ్చిన కన్నడ సినిమా 'కాంతార'.. దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీ ప్రీక్వెల్ తీయాలని నిర్ణయించారు. అలా దాదాపు మూడేళ్ల నుంచి షూటింగ్ సాగుతూనే ఉంది. ఇప్పుడు అది ఎట్టకేలకు పూర్తయింది. ఈ క్రమంలోనే కొత్త అప్డేట్ వచ్చేసింది. 'వరల్డ్ ఆఫ్ కాంతార' పేరిట ఓ మేకింగ్ వీడియోని కూడా రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 26 సినిమాలు)'కాంతార-1' మూవీ ఎలా ఉండబోతుంది? సెట్స్ ఎలా ఉండబోతున్నాయనేది ఈ వీడియోలో చూచాయిగా చూపించారు. తొలి భాగంతో పోలిస్తే ఈసారి సెట్స్, గ్రాండియర్ కాస్త ఎక్కువగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నా ఉరు, అక్కడి సంప్రదాయాలని చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాని తీశానని, దీనికోసం మూడేళ్లపాటు కష్టపడ్డామని దాదాపు 250 రోజుల పాటు షూటింగ్ జరిపామని హీరో కమ్ డైరెక్టర్ రిషభ్ శెట్టి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబరు 2న మూవీ థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: ఇంట్లోనే ఉపాసన బర్త్ డే సెలబ్రేషన్స్.. చరణ్ పోస్ట్) -
'కాంతార' చుట్టూ మరణాలు.. రిషబ్‌కు అర్చకుల సూచన
రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా కాంతార ఎంత హిట్ అయ్యిందో తెలియనిది కాదు, చిన్న బడ్జెట్‌తో తీస్తే కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. దేశంలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ చిత్రానికి కాంతార: చాప్టర్ 1 పేరుతో పార్ట్ 2 తీస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ అనుకున్నట్లు సాగడం లేదు. ప్రారంభం నుంచి అడుగడుగునా అడ్డంకులు, అవరోధాలు ఈ సినిమాకు ఎదురవుతున్నాయి. జూనియర్ ఆర్టిస్టు కపిల్, నటుడు రాకేశ్ పూజారి, మిమిక్రీ కళాకారుడు నిజు వీకే ఈ సినిమాలో నటిస్తూ, ఆకస్మికంగా మరణించారు. ఇంతలో శనివారం రాత్రి షూటింగ్ చేస్తున్న పడవ మునిగిపోయింది.ఆర్టిస్టుల ఆకస్మిక మరణాలు● కేరళకు చెందిన ఎంఎఫ్ కపిల్ జూనియర్ ఆర్టిస్టుగా ఈ కాంతారా చాప్టర్ 1లో నటిస్తూ ఉండేవాడు. ఉడుపి జిల్లా కొల్లూరు వద్ద ఉన్న సౌప ర్ణికా నదిలో కపిల్ ఈత కొడుతూ నది లో మునిగి చనిపోయాడు. మే 6న సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది.● కామెడి కిలాడిగళు ద్వారా పేరు పొందిన రాకేశ్ పూజారి మంచి హాస్యనటుడు. ఈ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే మే 12న ఉడుపిలో ఓ పెళ్లి వేడుకలో గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. హీరో రిషబ్ శెట్టి ఆయన అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని రాకేశ్ ఆత్మీయులు ఆవేదన వ్యక్తం చేశారు.● సరిగ్గా నెలరోజులకు జూన్ 12న కాంతార చాప్టర్ 1లో నటిస్తున్న కేరళకు చెందిన మిమిక్రీ కళాకారుడు నిజు వికే మరణించాడు. ఆగుంబే హోం స్టేలో నిజు విశ్రాంతి తీసుకుంటూ గుండెపోటుతో తనువు చాలించారు.ప్రమాదాలు సైతం● గతేడాది నవంబర్‌లో కొల్లూరు మార్గంలో షూటింగ్ సభ్యులతో వెళుతున్న బస్సు పల్టీ కొట్టింది. 20 మంది జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారు. ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు.● కాంతార చాప్టర్ 1 సినిమా కోసం కుందాపుర వద్ద భారీ సెట్ ఒకటి వేశారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సెట్లను నిర్మించారు. అయితే సుడిగాలుల కారణంగా సెట్ ధ్వంసం అయి ఆస్తి నష్టం కలిగింది.● హాసన్‌జిల్లా హెరూరు గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో గోమాళ స్థలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు వివాదం రాజుకుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అడవులను నాశనం చేస్తున్నారని, పేలుళ్లు జరిపారని గ్రామస్తులు ధర్నా చేశారు. అటవీ శాఖాధికారులు కూడా తనిఖీ చేశారు.రిషబ్‌కు అర్చకుల సూచనరిషబ్ శెట్టి కొన్ని రోజుల క్రితం కద్రి బారైబెల్ వారాహి పంజుర్లి , జారందాయ దైవం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సమయంలో రిషబ్ శెట్టికి అర్చకులు హెచ్చరికలు ఇచ్చినట్లు తెలిసింది. నీ కార్యం సఫలం కాకుండా పాడు చేసేందుకు పథకాలు నడుస్తున్నాయి అని పేర్కొన్నట్లు ప్రచారం సాగుతోంది. కాగా, సినిమాను ఎలాగైనా అక్టోబర్ 2న విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమా కష్టాలు అంతటా హాట్ టాపిక్ అయ్యాయి. -
కాంతార షూటింగ్ సెట్లో ప్రమాదం.. నిర్మాణ సంస్థ క్లారిటీ!
రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1 సెట్లో ప్రమాదం జరిగిందని వస్తున్న వార్తలపై చిత్ర నిర్మాణ సంస్థ స్పందించింది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందని.. 30 మంది కళాకారులతో ప్రయాణిస్తున్న పడవ మునిగిపోయిందని మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ క్లారిటీ ఇచ్చింది. తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ ఈ అంశంపై మాట్లాడారు.ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 షూటింగ్ కర్ణాటకలోని మాణి జలాశయం వద్ద జరుగుతోంది. ఈ సినిమా సెట్లో ప్రమాదం చోటు చేసుకుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. చిత్రీకరణలో భాగంగా జలాశయం వద్ద తాము సెట్ వేశామని.. అయితే వీపరీతమైన గాలి వీయడంతో అది పాడైపోయిందని వెల్లడించారు. ఈ ఘటన జరిగినప్పుడు సెట్లో నటీనటులు కానీ.. సిబ్బంది లేరన్నారు. ఈ రోజు యథావిధిగా షూటింగ్ జరుగుతున్నట్లు వెల్లడించారు. షూటింగ్ జరిగే ప్రాంతంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామన్నారు. గజ ఈతగాళ్లు, స్కూబా డైవర్స్ సమక్షంలోనే మూవీ షూట్ చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రకటనలో ఉదయం నుంచి వస్తున్న రూమర్స్‌కు నిర్మాణ సంస్థ చెక్ పెట్టేసింది.(ఇది చదవండి: 'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో)కాగా.. 2022లో సూపర్ హిట్‌గా నిలిచిన కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హీరో రిషభ్ శెట్టి దర్శకత్వంలోనే తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు. -
'కాంతార'ని వెంటాడుతున్న శాపం? ఈసారి ఏకంగా హీరో
'కాంతార' సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్‌కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.(ఇదీ చదవండి: మోహన్ బాబు 'పెద్ద' కోరిక.. మోహన్ లాల్ ఫన్నీ కౌంటర్)కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ 'కాంతార 1'. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలో మస్ట్ వాచ్ థ్రిల్లర్.. నరాలు తెగే ఉత్కంఠ.. 'స్టోలెన్' రివ్యూ) -
కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. ఎందుకిలా జరుగుతోంది?
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ కాంతార (Kantara Movie). 2022లో విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. సుమారు రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. భారీ సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి మేకర్స్ ప్రీక్వెల్ (కాంతార: చాప్టర్ 1) ప్రకటించారు.అయితే ఏ ముహూర్తాన కాంతార 1 ప్రకటించారో కానీ అప్పటినుంచి ఏదో ఒక అడ్డంకులు, విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంతార నటుడు, మలయాళ మిమిక్రీ ఆర్టిస్ట్ కళాభవన్ విజు (43) గుండెపోటుతో మరణించాడు. తీర్థహళ్లిలో చిత్రయూనిట్‌తో బస చేసిన అతడికి బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వచ్చింది. ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే కన్నుమూశాడు. ఇతడు మాలికాపురం, మార్కో వంటి పలు చిత్రాల్లో నటించాడు. 25 ఏళ్లుగా మిమిక్రీ రంగంలో రాణిస్తున్నాడు.గతంలో..షూటింగ్ ప్రారంభించిన కొత్తలో కర్ణాటకలోని ముడూరులో 20 మంది జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకసారేమో తీవ్రమైన గాలివాన వల్ల భారీ సెట్ కూలిపోయింది. ఇటీవల మలయాళ జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశాత్తూ నదిలో మునిగి విగతజీవిగా తేలాడు. ఆ తర్వాత కన్నడ నటుడు, హాస్య నటుడు రాకేశ్ పూజారి (33) గుండెపోటుతో మరణించాడు. ఇప్పుడు కళాభవన్ కన్నుమూశాడు. ఈ వరుస విషాదాలు కాంతార చిత్రయూనిట్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.అడవిలో పేలుళ్లుఅయితే నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ఆరోపణలు వచ్చాయి. అడవిలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని, పేలుళ్లతో ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ విషయం అక్కడి అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె దృష్టికి రాగా.. తక్షణమే షూటింగ్ ఆపేయాలని అధికారులను ఆదేశించారు.ఇకపోతే పంజుర్లి దేవుడి ఆగ్రహంతోనే ఇలా జరుగుతోందన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. కాంతార సినిమాతోనే పంజుర్లి దేవుడు గురించి వెలుగులోకి వచ్చింది. పంజుర్లి అంటే పంది. చెడు చేసేవారిని శిక్షించి, మంచిని ఆశీర్వదించే భగవంతుడే పంజుర్లీ అని నమ్ముతారు.చదవండి: మా అక్కను పెళ్లి చేసుకుంటే 1+1 ఆఫర్.. అవాక్కైన హీరో -
'కాంతార' షూటింగ్ లో మరో అపశృతి
'కాంతార' పేరు చెప్పగానే సదరు సినిమాలోని క్లైమాక్సే మీకు గుర్తొస్తుంది కదా? ఎందుకంటే 2022లో రిలీజైన ఈ చిత్రం.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు. చాన్నాళ్లుగా షూటింగ్ చేస్తున్నారు. ఇదివరకే ప్రమాదాలు చోటుచేసుకోగా ఇప్పుడు మరో అపశృతి జరిగింది.కన్నడ హీరో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కాంతార చాప్టర్ 1'. ఇదివరకే వచ్చింది రెండో పార్ట్ కాగా.. చిత్రీకరణ జరుపుకొంటున్నది తొలి పార్ట్. ఏ క్షణాన షూటింగ్ మొదలైందో గానీ ఏదో ఓ ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఒకటి రెండు కాదు చాలానే ప్రమాదాలు, ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.(ఇదీ చదవండి: పవన్ 'హరిహర వీరమల్లు'.. అంతా ఓటీటీ దయ!)తాజాగా జరిగిన సంఘటన గురించి చెప్పుకొంటే.. ఉడుపి జిల్లా కొల్లూరులో దగ్గర షూటింగ్ చేస్తున్నారు. ఈ మూవీ జూనియర్ ఆర్టిస్ట్ గా కేరళకు చెందిన కపిల్ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం చిత్రీకరణ పూర్తవడంతో దగ్గరలోని సౌపర్ణిక నదిలో ఈతకు దిగాడు. లోతు ఎక్కువుండేసరికి నీట ముగిని చనిపోయాడు. దీంతో విషాదం నెలకొంది.అంతకు ముందు కూడా 'కాంతార' టీమ్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. కొన్నిరోజుల క్రితం కొల్లూరులో జూనియర్ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్ బోల్తా పడింది. ఈ ఘటనలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓసారి పెద్ద గాలివానకు భారీ ఖర్చుతో నిర్మించిన సెట్ ధ్వంసమైంది. అలానే కొన్నిరోజుల క్రితం పంజుర్లీ దేవర హీరో,డైరెక్టర్ రిషభ్ శెట్టిని హెచ్చరించింది. నువ్వు ప్రమాదంలో ఉన్నావ్, నీ చుట్టుపక్క వాళ్ల దగ్గరనుంచి నుంచే ఇది పొంచి ఉందని చెప్పుకొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే అసలేం జరుగుతుందా అని సందేహాలు వస్తున్నాయి.(ఇదీ చదవండి: మహేశ్ ఇంట్లో మరో హీరో రెడీ.. అన్నీ ఫిక్స్!) -
నీ చుట్టూ శత్రువులు.. 'కాంతార' హీరోపై పంజర్లి ఆగ్రహం
ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చి పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ సృష్టించిన సినిమా 'కాంతార'(Kantara Movie) . కేవలం రూ.15 కోట్లతో తీస్తే రూ.400 కోట్ల మేర కలెక్షన్స్ వచ్చాయి. ప్రస్తుతం దీని ప్రీక్వెల్ తీస్తున్నారు. అక్టోబరు 2న రిలీజ్. అయితే షూటింగ్ విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఓ అడ్డంకి వస్తూనే ఉంది. ఈ క్రమంలో హీరో-డైరెక్టర్ రిషభ్ శెట్టి(Rishab Shetty).. పంజర్లి దేవతని దర్శించాడు.(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా)సినిమాలో చూపించినట్లే కర్ణాటకలో పలు ప్రాంతాల్లో నిజంగానే జరుగుతూ ఉంటాయి. తాజాగా మంగళూరులోని పంజుర్లి దేవస్థానాన్ని రిషభ్ శెట్టి సందర్శించగా.. షాకింగ్ అనుభవం ఎదురైంది. పంజుర్లి పూనిన పూజరి మాట్లాడుతూ.. 'నీ చుట్టూ చాలామంది శత్రువులు ఉన్నారు. భారీ కుట్రకు తెరతీశారు. కానీ నువ్వు నమ్మిన దేవుడు నిన్ను కచ్చితంగా కాపాడుతాడు' అని చెప్పుకొచ్చారు.కాంతార తీస్తున్నప్పుడు పెద్దగా ఇబ్బందులు రాలేదు గానీ కొన్నిరోజుల క్రితం బెంగళూరుకి దగ్గర్లో ప్రీక్వెల్ షూటింగ్ చేస్తుండగా.. పర్యావరణానికీ హాని చేస్తున్నారని అటవీశాఖ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ టైంలో పేలుడు పదార్థాలు ఉపయోగించారని ఫిర్యాదులు వచ్చాయి. ఓ యాక్సిడెంట్ జరగ్గా.. పలువురు యూనిట్ సభ్యులకు గాయాలయ్యాయి. ఇలా ఏదో ఓ సమస్య వస్తుండటంతోనే తాజాగా పంజుర్లిని రిషభ్ కలిశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ యాక్షన్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Udayavani (@udayavaniweb) -
కాంతార ప్రీక్వెల్ విడుదల వాయిదా.. స్పందించిన టీమ్
కాంతార మూవీతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి. 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమాతో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే కాంతార చాప్టర్ 1ను ప్రేక్షకుల ముందుకు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అక్టోబర్ 2వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని డేట్ కూడా రివీల్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రూమర్స్ వినిపిస్తున్నాయి. కాంతార చాప్టర్-1 సినిమా విడుదల మరింత ఆలస్యం కానుందని శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా ఈ మూవీ వాయిదా పడుతుందా? అని ప్రశ్నించాడు. దీనికి కాంతార టీమ్ స్పందించింది.ఎట్టి పరిస్థితుల్లో కాంతార చాప్టర్ -1 మూవీని వాయిదా వేసేది లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దని సూచించింది. ముందు అనుకున్నట్లుగానే అక్టోబర్ 02వ తేదీ 2025న థియేటర్లలో విడుదల అవుతుందని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను షేర్ చేసింది.కాగా.. ఇటీవల 500 మంది యోధులతో ఓ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ ఫైట్ సీక్వెన్స్‌లో దాదాపు 3 వేల మంది భాగమయ్యారు. దీని కోసం రిషబ్ శెట్టి మూడు నెలల పాటు గుర్రపు స్వారీ, కలరి, కత్తియుద్ధం నేర్చుకున్నారు. దాదాపు 50 రోజుల పాటు చిత్రీకరించిన ఈ భారీ సన్నివేశాన్ని కర్ణాటకలోని పర్వతా ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2022 చిత్రానికి ప్రీక్వెల్‌గా వస్తోన్న ఈ సినిమా బనవాసికి చెందిన కదంబరాజుల కాలంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Kantara (@kantarafilm) -
నేను చెడ్డ నటుడిని కాదు, కాంతారలో ఛాన్స్ ఇవ్వండి: మోహన్‌లాల్
కన్నడ హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కాంతార. రిషబ్ హీరోగా, దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా 2022లో రికార్డులు సృష్టించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు, ఉత్తమ నటుడు, ఉత్త పాపులర్ ఫిలిం విభాగంలో రెండు జాతీయ అవార్డులు అందుకుంది.కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్?ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్ 1 తెరకెక్కుతోంది. ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 2న విడుదల కానుంది. అయితే ఈ ప్రీక్వెల్‌లో మలయాళ స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) కీలక పాత్రలో నటించనున్నట్లు ఆ మధ్య ఓ రూమర్ తెగ వైరల్ అయింది. తాజాగా ఈ రూమర్‌పై మోహన్‌లాల్ స్పందించాడు. దయచేసి నన్ను కాంతార సినిమాలో భాగం చేయమని మీరే అడగండి. నాకు ఒక పాత్ర ఇవ్వండి. నాకు తెలిసి నేనేమీ చెడ్డ నటుడిని కాదు అని సరదాగా వ్యాఖ్యానించాడు.ఎంపురాన్ సినిమాతో మరో హిట్ఇకపోతే మోహన్‌లాల్ హీరోగా నటించిన ఎల్2: ఎంపురాన్ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ హిట్ మూవీ లూసిఫర్ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టింది.చదవండి: హీరామండి తర్వాత అవకాశాలు రావట్లేదు: అదితిరావు హైదరి -
ఛావా ప్రభంజనం.. శివాజీ సినిమా వస్తే ఏమైపోతారో?
మహారాజ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఛావా సినిమా (Chhaava Movie) బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకుంటున్నారు. ఇది కదా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర.. భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన ఘనత అంటూ ఉప్పొంగిపోతున్నారు. నేడు (ఫిబ్రవరి 19) శివాజీ మహారాజ్ 395వ జయంతి.శివాజీ బయోపిక్ఈ సందర్భంగా శివాజీ జీవిత కథపై తీస్తున్న బయోపిక్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'కాంతార'తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. దీనికి ఛత్రపతి శివాజీ మహారాజ్ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో భవానీ దేవి ముందు శివాజీ కత్తితో నిలబడి ఉన్నాడు. పోస్టర్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. 2027లో రిలీజ్సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2027 జనవరి 21న విడుదల కానుంది. రవి వర్మ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా రేసుల్ సంగీతం అందించనున్నాడు. ఛావా సినిమాతో విక్కీ కౌశల్ పేరు మార్మోగిపోతోంది. తన కెరీర్లోనే ఇదొక మాస్టర్‌పీస్‌గా మిగిలిపోనుంది. రిషబ్‌కు కూడా శివాజీ అతడి జీవితంలోనే బెస్ట్ సినిమాగా నిలవనుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by SANDEEP SINGH (@officialsandipssingh) చదవండి: సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి -
రిషబ్ శెట్టి, ప్రగతిల పెళ్లిరోజు.. ప్రత్యేకమైన ఫోటోలు షేర్ చేసిన జోడి
-
కాంతారగడ
యశవంతపుర: హిట్ మూవీ, జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన కాంతారకు, అలాగే నటుడు రిషభ్ శెట్టి, దర్శక నిర్మాతలకు చిక్కొచ్చిపడింది. నియమాలను ఉల్లంఘించి అటవీ ప్రాంతంలో కాంతార–2 (చాప్టర్ 1) సినిమా చిత్రీకరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హాసన్ జిల్లా సకలేశపుర తాలూకా గవిగుడ్డలో కాంతార–2 యూనిట్ సినిమా షూటింగ్ చేస్తోంది. అటవీ ప్రాంతంలో పెద్ద మంటలు వేసి షూటింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు కొందరు యసలూరు ఠాణాలో ఫిర్యాదు చేశారు. పేలుళ్లు కూడా జరుపుతున్నారని, దీని వల్ల ఏనుగులు బెదిరిపోయి గ్రామాల మీదకు వస్తున్నాయని ఆరోపించారు. ప్రశి్నస్తే షూటింగ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు చెప్పారు. కావాలంటే మరోచోటుకు వెళ్లి చిత్రీకరణ చేసుకోవాలని, ఇక్కడ మాత్రం వద్దని గ్రామస్తులు కూడా గళమెత్తారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తాను కోర్టులకైనా వెళతామని చెప్పడం గమనార్హం. షూటింగ్ అనుమతులు ఇలా జిల్లా యసళూరు విభాగం శనివార సంత అనే చోట హేరూరు గ్రామంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో జనవరి 3 నుంచి 15 వరకు తాత్కాలిక సెట్టింగ్‌ల నిర్మాణానికి, 15 నుంచి 25 వరకు షూటింగ్ చిత్రీకరణకు నియమాలతో అనుమతులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హాసన్ ఎసీఎఫ్ మధు, ఆర్ఎఫ్ఒ కృష్ణలు పరిశీలించా. గత 10 రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. అటవీ ప్రాంతంలోకి వందలాది మంది వస్తూ పోతూ ఉన్నారు. అనుమతులు తీసుకున్న ప్రాంతాలలో కాకుండా ఇతర ప్రాంతాలలో షూటింగ్ జరుగుతోందని కూడా ఆరోపణలు రావడంతో అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. నిజమైతే రద్దు చేయాలి: మంత్రి ఖండ్రేఈ నేపథ్యంలో అక్కడ కాంతార సినిమా షూటింగ్‌ను రద్దు చేయాలని అటవీశాఖ మంత్రి ఈశ్వర ఖండ్రె అధికారులను ఆదేశించారు. వన్యజీవులు, ప్రకృతికి హాని జరుగుతుంటే తక్షణం షూటింగ్‌ను బంద్ చేయాలని చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రకృతి పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శికి మంత్రి ఈశ్వరఖండ్రె లేఖ రాశారు. చిత్ర నిర్వాహకులు అడవిలో ఉవ్వెత్తున మంటలను వేసి షూటింగ్ చేయడం, పేలుళ్లు జరిపినట్లు తెలిసిందని మంత్రి ఖండ్రే లేఖలో పేర్కొన్నారు. దీని వల్ల అక్కడ వన్యజీవులు, చెట్లుచేమలకు ముప్పు వస్తుందని పత్రికలలో వార్తలు వచ్చాయని, ఇదే నిజమైతే తక్షణం షూటింగ్‌ను రద్దు చేయాలని సూచించారు. ఈ పరిణామాలతో షూటింగ్ కొనసాగడం అనుమానంగా ఉంది. -
యువకుడిపై దాడి.. చిక్కుల్లో కాంతార మూవీ టీమ్..!
కాంతార మూవీతో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty). 2022లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడమే కాదు.. దేశవ్యాప్తంగా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. దీంతో రిషబ్ శెట్టి ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంతార మూవీ టీమ్ చిక్కుల్లో పడింది. ఈ సినిమా షూటింగ్ వల్ల అటవీ ప్రాంతం నాశనం అవుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కర్ణాటకలోని గవిగుడ్డ అటవీ ప్రాంతంలో కాంతారా చాప్టర్-1 చిత్రీకరణ జరుగుతోంది. దీంతో స్థానికులతో పాటు జిల్లా పంచాయతీ మాజీ సభ్యులు ఆందోళనకు దిగారు. అడవుల్లో పేలుడు పదార్థాల వినియోగిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో గవిగుడ్డ, హేరురు గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో రహస్యంగా చిత్రీకరణ చేయడంపై స్థానికులు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గడ్డి మైదానంలో చిత్రీకరణకు అనుమతి తీసుకుని.. అటవీ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.స్థానిక నేతల సీరియస్సినిమా చిత్రీకరణ వల్ల జంతువులు, పక్షులకు హాని కలుగుతోందని జిల్లా పంచాయతీ మాజీ సభ్యుడు సన్న స్వామి ఆరోపించారు. ఇప్పటికే అడవి ఏనుగుల దాడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అడవులను రక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మరింత నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన హెచ్చరించారు.చిత్రబృందంతో వాగ్వాదం..అడవుల్లో పేలుడు పదార్ధాల వినియోగంపై స్థానికులు చిత్ర బృందం సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గొడవలో స్థానికుడైన హరీష్ అనే యువకుడిపై సిబ్బంది దాడి చేయగా గాయాలైనట్లు సమాచారం. అతన్ని వెంటనే సమీపంలోని సకలేష్‌పూర్‌లోని క్రాఫోర్డ్ ఆసుపత్రిలో చేర్పించారు.ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంతార మూవీ చిత్రీకరణను వేరే ప్రదేశానికి మార్చాలని.. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే స్థానికంగా యెసలూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.కాగా.. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో కాంతారా: చాప్టర్ 1 తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని కేజీఎఫ్ మేకర్స్, హోంబలే ఫిల్మ్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. 2022లో వచ్చిన కాంతార అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును గెలుచుకున్నాడు. -
రిషబ్ శెట్టి పోస్ట్.. రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహం!
శాండల్‌వుడ్ స్టార్ రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన కాంతార బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-2 పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రిషబ్ శెట్టి చేతిలో త్రిశూలం పట్టి ఉగ్రరూపం దాల్చిన శివుడిలా కనిపించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం దాదాపు 7 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.అయితే రిషబ్ శెట్టి తాజాగా చేసిన ట్వీట్ సరికొత్త వివాదానికి దారితీసింది. ఎనిమిదేళ్ల క్రితం విడుదలైన కిరిక్ పార్టీ సినిమాను ఉద్దేశించి రిషబ్ పోస్ట్ పెట్టారు. 8 ఏళ్ల కిందట మొదలైన ఈ ప్రయాణం హృదయాలను హత్తుకునే ఎన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకంగా మార్చిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు అంటూ ట్విటర్లో రాసుకొచ్చారు. ఈ చిత్రానికి రిషబ్ శెట్టి డైరెక్షన్లోనే తెరకెక్కించారు.అయితే ఈ సినిమాతో పుష్ప భామ రష్మిక మందన్నా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే తాజా పోస్ట్‌లో రిషబ్ ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇది చూసిన నెటిజన్స్ ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక లేకపోతే చెత్త సినిమాగా మారేదని ఓ నెటిజన్ విమర్శించాడు. అంతేకాకుండా రిషబ్ షేర్ చేసిన ఫోటోలు రష్మిక లేకపోవడం ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్‌కు విపరీతమైన కోపం తెప్పించింది. కావాలనే ఆమె పేరును, ఫోటోను పెట్టలేదని కొందరు అభిమానులు మండిపడ్డారు. రిషబ్ పోస్ట్‌లో తన సోదరుడు రక్షిత్ పేరును మాత్రమే ప్రస్తావించడంపై నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. కాగా.. 2016లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ಕಿರಿಕ್ ಪಾರ್ಟಿ ನಮ್ಮ ಜೀವನದ ಭಾಗವಾಗಿ 8 ವರ್ಷಗಳು ಕಳೆದಿವೆ, ಅನೇಕ ಸುಂದರ ನೆನಪುಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಈ ಪಯಣವನ್ನು ಅರ್ಥಪೂರ್ಣವನ್ನಾಗಿಸಿವೆ.ನಿಮ್ಮ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. 8 years ago, a journey began that touched hearts and created countless memories.Here’s to your love and support… pic.twitter.com/67ehO9dnOz— Rishab Shetty (@shetty_rishab) December 30, 2024 -
ఛత్రపతి శివాజీగా పాన్ ఇండియా హీరో.. పోస్టర్ విడుదల
కన్నడ హీరో రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలనే ఎంపిక చేసుకుంటున్నారు. ఛత్రపతి శివాజీ జీవిత చరిత్ర ఆధారంగా రానున్న చిత్రం 'ఛత్రపతి శివాజీ మహారాజ్'. భారీ బడ్జెట్ తెరకెక్కను ఈ చిత్రాన్ని ఒక పోస్టర్‌తో తాజాగా రిషబ్ ప్రకటించారు. సందీప్ సింగ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.శివాజీ మహారాజ్‌గా రిషబ్ శెట్టి నటించనున్న ఈ చిత్రం మొదటి పోస్టర్‌ను దర్శకుడు సందీప్ సింగ్ షేర్ చేశారు. 'ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇది అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధున్ని గౌరవించటానికి నిర్మిస్తున్నాం. యుద్ధ రంగంలో శక్తివంతమైన మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రతిఘటన స్ఫూర్తిని, స్వపరిపాలన కోసం పోరాడిన మరాఠ యోధుడు శివాజీ. అతని జీవితం, వారసత్వం భారతీయ చరిత్రలో చెరగని ముద్రను మిగిల్చాయి' అని ఆయన గుర్తుచేసుకున్నారు. శివాజీ అన్‌టోల్డ్ స్టోరీతో ప్రేక్షకులకు తాము చూపించబోతున్నట్లు ఆయన అన్నారు.కాంతార సినిమా తర్వాత రిషబ్ శెట్టి మార్కెట్ పాన్ ఇండియా రేంజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఆయన చేతిలో అన్నీ భారీ సినిమాలే ఉన్నాయి. కాంతార ప్రీక్వెల్తో పాటు జై హనుమాన్ సినిమా కూడా ఉంది. ఇప్పుడు 'ఛత్రపతి శివాజీ మహారాజ్' వంటి బిగ్ ప్రాజెక్ట్‌లో ఆయన భాగమైనందుకు ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 2025,2026,2027 ఇలా వరుసగా రిషబ్ శెట్టి సినిమాలు విడుదల కానున్నాయి.Our Honour & Privilege, Presenting the Epic Saga of India’s Greatest Warrior King – The Pride of Bharat: #ChhatrapatiShivajiMaharaj. #ThePrideOfBharatChhatrapatiShivajiMaharajThis isn’t just a film – it’s a battle cry to honor a warrior who fought against all odds, challenged… pic.twitter.com/CeXO2K9H9Q— Rishab Shetty (@shetty_rishab) December 3, 2024 -
'కాంతార' యూనిట్ ప్రయాణిస్తున్న బస్సు బోల్తా
'కాంతార' సినిమా యూనిట్ సభ్యలకు ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా షూటింగ్‌ను మేకర్స్ ఆపేశారు. కన్నడ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన కాంతార1 భారీ విజయం సాధించడంతో ఇప్పుడు దానికి ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కర్ణాటకలో జరుగుతుంది. అయితే, చిత్ర యూనిట్‌కు ప్రమాదం జరగడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.నవంబర్ 24న రాత్రి షూటింగ్ పూర్తి చేసుకుని సుమారు 20 మంది సభ్యులతో ప్రయాణిస్తున్న మినీ బస్సుకు ప్రమాదం జరిగింది. కర్ణాటకలోని జడ్కల్లో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు ఆరుగురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. జడ్క్ల్లోని మూడూరు నుంచి కొల్లూరుకు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తాత్కాలికంగా కాంతార షూటింగ్‌ను ఆపేశారు.డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫోన్ చూస్తూ బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో ఉన్న ఒక ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే కొందరు డ్రైవర్‌పై చేయి చేసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన 'కాంతార' సినిమాకు ప్రీక్వెల్‌గా రిషభ్ స్వీయ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ దీనిని నిర్మిస్తున్నారు. 2025 అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. -
రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్.. గ్లింప్స్ అదిరిపోయింది!
కన్నడ స్టార్ రిషబ్ శెట్టిని పాన్ ఇండియా రేంజ్లో నిలబెట్టిన చిత్రం కాంతార. కన్నడలో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. కాంతార: చాప్టర్-1 పేరుతో స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీఎత్తున నిర్మిస్తున్నారు.తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. దాదాపు కాంతార రిలీజైన రెండేళ్ల తర్వాత ప్రీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల కాంతార పార్ట్-1 రిలీజ్ డేట్‌ను కూడా రివీల్ చేశారు. వచ్చే ఏడాది గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ చిత్రానికి అజనీశ్ లోక్‌నాథ్ సంగీతమందిస్తున్నారు. Step into the sacred echoes of the past 🔥#KantaraChapter1 - Worldwide Grand Release on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓.Watch the First Look Teaser ▶️ https://t.co/8cGsjMKXA7#KantaraChapter1onOct2 #Kantara @shetty_rishab @VKiragandur @hombalefilms @HombaleGroup @ChaluveG… pic.twitter.com/vBctAk2Zgs— Hombale Films (@hombalefilms) November 18, 2024 -
'కాంతార 1' రిలీజ్ డేట్ వచ్చేసింది... ఇంత ఆలస్యంగానా?
కాంతార.. అప్పట్లో ఈ సినిమా సృష్టించిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. కన్నడ స్టార్ రిషభ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో పాటు ఏకంగా జాతీయ అవార్డు సైతం గెలిచింది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీకి ప్రీక్వెల్ రెడీ అవుతోంది.రిషబ్ స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీ ప్రకటించారు. వచ్చే ఏడాది అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1’ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్లో రిషబ్ ఓ చేతిలో త్రిశూలం, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని కనిపించారు.ఇకపోతే ‘కాంతార చాప్టర్ 1’ కోసం నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ప్రత్యేకంగా సిద్ధమయ్యాడు. కేరళలో ఉద్భవించిన పురాతన యుద్ధ కళలలో ఒకటైన కలరిపయట్టులో కఠినమైన శిక్షణ పొందారు. వచ్చే ఏడాది దసరాకు కాంతార 1 ముందుగానే టికెట్ బుక్ చేసుకుంది. మరి ఈ మూవీ ఈసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!చదవండి: సమంత యాడ్ వీడియో వైరల్.. గుర్తుపట్టలేకున్న ఫ్యాన్స్ -
రాముడిగా మహేష్.. రావణుడిగా రానా ..!
-
ప్రశాంత్ వర్మ మరో సర్ప్రైజ్.. ఏకంగా బాహుబలి హీరోతో!
ఈ ఏడాది బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఆయన తెరకెక్కించిన హనుమాన్ సంక్రాంతికి రిలీజై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ సక్సెస్‌తో సీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ వర్మ.జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేశారు. ఇటీవల దీపావళి సందర్భంగా ఆయన లుక్‌ను రివీల్ చేశారు. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇటీవల విడుదలైన జై హనుమాన్ థీమ్ సాంగ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.అయితే తాజాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. జై జై హనుమాన్ అని క్యాప్షన్ ఇస్తూ రిషబ్‌శెట్టి, రానా దగ్గుబాటి, ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌ను ట్యాగ్ చేశాడు. ఈ ఫోటోలో టాలీవుడ్ హీరో రానా కూడా ఉన్నారు. ఇది చూసిన నెటిజన్స్.. రానా కూడా జై హనుమాన్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారా? అనే డౌటానుమానం మొదలైంది.ఇప్పటికే రిషబ్ శెట్టిని హనుమాన్‌గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ.. ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. రానాను కూడా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఆయన రేంజ్‌కు తగినట్లు పవర్ఫుల్ రోల్ అయి ఉంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో రానా నటిస్తున్నారా? లేదా? అన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. JAI JAI HANUMAN !! 💪🏽✊🏽😊@shetty_rishab @RanaDaggubati @ThePVCU pic.twitter.com/wwxwOndnr2— Prasanth Varma (@PrasanthVarma) November 4, 2024 -
ఏకంగా 20 చిత్రాల్లో.. రిషబ్ శెట్టి కంటే ముందు హనుమాన్‌గా నటించిన నటులెవరో తెలుసా?
హనుమాన్ను కేవలం దైవంగానే కాదు.. పిల్లల దృష్టిలో సూపర్ హీరోగానూ వెండి తెర ఆవిష్కరించింది. ప్రశాంత్ వర్మ ‘హను-మాన్’ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ చిత్రంలో కన్నడ నటుడు, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ లుక్ రివీల్ చేశారు. అయితే..గతంలోనూ కొందరు నటులు వెండి తెరపై హనుమంతుడి అవతారంలో ఆడియొన్స్‌ను మెప్పించే ప్రయత్నమూ చేశారు. వాళ్లెవరంటే..దేవ్‌దత్తా నాగేఆదిపురుష్(2023).. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను రాముడి(రాఘవ)గా చూపించిన ప్రయత్నం. అయితే ఆకట్టుకోని విజువల్స్, పైగా కంటెంట్ విషయంలోనూ ఆ చిత్రం తీవ్ర విమర్శలు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంది. ఈ చిత్రంలో మరాఠీ నటుడు దేవ్‌దత్తా నాగే.. హనుమంతుడి(భజరంగ్) పాత్రలో నటించాడు. కానీ, ఆ క్యారెక్టర్ కూడా ఇంటర్నెట్లో నవ్వులపాలవ్వడంతో ఆయన కష్టం వృథా అయ్యింది.ఏ. జనార్ధన రావుతెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆంజనేయస్వామి పాత్రలకు రిఫరెన్స్‌గా ఈయన్ని చూపిస్తుంటారు. ఏకంగా 20 చిత్రాల్లో ఆ పాత్రలో నటించారాయన. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పుట్టిన జనార్ధన రావు.. 1955లో మిస్టర్ ఇండియా టైటిల్ దక్కించుకున్నారు. కమలాకర కామేశ్వర రావు తీసిన వీరాంజనేయ (1968)చిత్రంలో తొలిసారి ఆయన హనుమాన్ పాత్రలో నటించారు. అయితే తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్ని మెప్పించారు. ఆ ప్రభావంతో దాదాపు రెండున్నర దశాబ్దాలపాటు హనుమంతుడి పాత్రల విషయంలో ఆయనకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు దర్శకనిర్మాతలు. అలా.. శ్రీ రామాంజనేయ యుద్ధం, సంపూర్ణ రామాయణం, శ్రీ కృష్ణ సత్య, ఎన్టీఆర్ సూపర్‌మేన్.. చిత్రాలు ఈనాటికి ఆయన హనుమంతుడి రూపాన్ని ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా చేశాయి. రాజనాలతెలుగు విలన్లలో అగ్రతాంబూలం అందుకున్న తొలి నటుడు.. బహుశా ఇంటి పేరునే స్క్రీన్ నేమ్‌గా మార్చుకున్న తొలి నటుడు కూడా ఈయనేనేమో!(రాజనాల కాళేశ్వర రావు). అయితే 1400కి పైగా అన్ని రకాల జానర్ చిత్రాల్లో నటించిన రాజనాల.. హనుమాన్‌గా కనిపించిన ఒకే ఒక్క చిత్రం ‘శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం’(1972). కానీ, ఆ పాత్రలో మరిచిపోలేని అభినయం కనబర్చారాయన.దారా సింగ్మల్లు యోధుడిగానే కాదు.. ఇటు నటుడిగా, దర్శకుడిగా.. అటు రాజకీయాల్లోనూ రాణించారీయన. ప్రొఫెషనల్ రెజ్లింగ్‌లో ఏళ్ల తరబడి రాణించిన దారా సింగ్.. ఆ తర్వాత సినీ రంగం వైపు అడుగులేశారు. భజరంగబలి(1976) చిత్రంలో తొలిసారి హనుమాన్‌గా అలరించి.. ఆ తర్వాత రామానంద సాగర్ ‘రామాయణ్’లో హనుమాన్ క్యారెక్టర్లో జీవించి.. భారతీయ బుల్లితెర చరిత్రలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారాయాన. చిరంజీవిఆంజనేయ స్వామికి కొణిదెల శివశంకర్ వరప్రసాద్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలో ఓ ఫైట్ పోర్షన్లో హనుమాన్‌గా అలరించారాయన. అంతేకాదు.. హనుమాన్(2005) యానిమేటెడ్ చిత్రంలో ఆ పాత్రకు తెలుగు వెర్షన్లో వాయిస్ ఓవర్ కూడా అందించారు.నిర్భయ్ వాద్వాతెలుగులో జనార్ధన రావుకు ఎలాగైతే హనుమాన్ క్యారెక్టర్లు గుర్తింపు తెచ్చి పెట్టాయో.. హిందీ టీవీ సీరియల్స్‌లో ఈ యువ నటుడికి అదే విధంగా ఆ పాత్ర మంచి గుర్తింపు ఇచ్చింది. సంకట మోచన్ మహాబలి హనుమాన్(2015-17)లో తొలిసారి హనుమంతుడి పాత్రలో నటించిన నిర్భయ్‌కు.. ఆ తర్వాత మరో రెండు సీరియల్స్‌లోనూ ఆ రోల్ దక్కింది. ఈ ఏడాది ప్రారంభమైన శ్రీమద్ రామాయణ్‌లోనూ ఆయన హనుమాన్ రోల్లోనే నటిస్తున్నారు.ప్రశాంత్ శెట్టిప్రశాంత్ శెట్టి.. ఈ పేరు పెద్దగా ఎవరికీ పరిచయం లేకపోవచ్చు. రిషబ్ శెట్టిగా అప్పటిదాకా కన్నడ ఆడియొన్స్‌ను మాత్రమే అలరిస్తూ వచ్చిన ఈ మల్టీ టాలెంట్ పర్సన్(నటుడు, స్క్రీన్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్).. కాంతారతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకట్టుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో కాంతారను తీసి.. జాతీయ అవార్డుతో పాటు ఫిల్మ్‌ఫేర్, కర్ణాటక స్టేట్ ఫిల్మ్ అవార్డులనూ దక్కించుకున్నాడు. బహుశా ఆ గుర్తింపే ఆయనకు జై హనుమాన్‌లో హనుమాన్ క్యారెక్టర్ దక్కడానికి ఓ కారణం అయ్యి ఉండొచ్చు కూడా!.ಕನ್ನಡ ನೆಲದ ವರಸುತ ಆಂಜನೇಯನ ಆಶೀರ್ವಾದದೊಂದಿಗೆ ಭಾರತ ಇತಿಹಾಸದ ಸರ್ವಶ್ರೇಷ್ಠ ಭಾವವೊಂದನ್ನು ತೆರೆಯ ಮೇಲೆ ತರಲಿದ್ದೇವೆ.ನಿಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿ ಬೆಂಬಲ ಆಶೀರ್ವಾದ ಎಂದಿನಂತೆ ಸದಾ ಇರಲಿ - ಜೈ ಹನುಮಾನ್A vow from the Tretayuga, bound to be fulfilled in the Kaliyuga🙏We bring forth an epic of loyalty, courage and… pic.twitter.com/Zvgnt1tGnl— Rishab Shetty (@shetty_rishab) October 30, 2024ఇంకా ఎవరైనా నటీనటులను మరిచిపోయి ఉంటే.. వాళ్లు ఏ భాషకు చెందిన వాళ్లైనా సరే కామెంట్ సెక్షన్లో వాళ్ల పేర్లను మీరు తెలియజేయొచ్చు. -
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్‌కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
జై హనుమాన్ ఫస్ట్ లుక్.. సర్ప్రైజ్ అదిరిపోయిందిగా!
హనుమాన్తో సూపర్ హిట్ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.ఇప్పటికే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జైహనుమాన్ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్ అద్భుతంగా సెట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు In the spirit of Diwali and the guiding light of the divine ✨Honoured to be teaming up with the National Award-winning actor @shetty_rishab sir and the prestigious @MythriOfficial to bring our grand vision #JaiHanuman 🙏🏽Let’s begin this DIWALI with the holy chant JAI HANUMAN… pic.twitter.com/i2ExPsflt2— Prasanth Varma (@PrasanthVarma) October 30, 2024 -
హనుమాన్ సీక్వెల్ లో కాంతారా రిషబ్ శెట్టి
-
జై హనుమాన్‌లో ‘కాంతార’ హీరో!
‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించే అవకాశం ఉందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. తేజా సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హనుమాన్’. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘జై హనుమాన్’ సినిమాలో ఎవరు హీరోగా నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. (చదవండి: నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్)చిరంజీవి, రామ్‌చరణ్ వంటి స్టార్స్‌ను పరిశీలిస్తున్నట్లుగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన చైతన్య చెప్పారు. అయితే తాజాగా ఈ సినిమాలో కన్నడ హీరో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ప్రస్తుతం ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్తో బిజీగా ఉన్నారు రిషబ్ శెట్టి. మరి... ‘జై హనుమాన్’ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారనే వార్త నిజమేనా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. -
ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్లవైపు మళ్లాయి: నటుడు మిథున్ చక్రవర్తి
‘‘నా చర్మపు రంగు నలుపుగా ఉండటం అనేది నా కెరీర్ ఆరంభంలో పెద్ద సవాల్‌లా అనిపించింది. నల్లగా ఉన్నవారు నటులుగా ఇండస్ట్రీలో నెగ్గుకురావడం కష్టమన్నట్లు కొందరు మాట్లాడారు. ఇండస్ట్రీ నుంచి వెనక్కి వెళ్లమని కూడా సలహా ఇచ్చారు. ఒకానొక దశలో నా చర్మపు రంగును మార్చమని ఆ దేవుణ్ణి ప్రార్థించాను. ఆ తర్వాత అసలు నేనేం చేయగలను? నా బలం ఏంటి? అని ఆలోచించాను. నేను బాగా డ్యాన్స్ చేయగలనని నా బలం తెలుసుకున్నాను.మంచి డ్యాన్సర్ కావాలనుకున్నాను. అప్పుడు ప్రేక్షకుల కళ్లు నా కలర్ మీద నుంచి కాళ్ల వైపు మళ్లుతాయని అనుకున్నాను. ప్రేక్షకులు నా డ్యాన్స్‌ను అభిమానించడం ప్రారంభించారు. ఈ క్రమంలో వారు నా కలర్‌ను మర్చిపోయారు. నేనో సెక్సీ డ్యాన్సర్‌గా, డస్కీ బెంగాలీ బాబుగా పేరు సంపాదించుకున్నాను’’ అని ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం స్వీకరించిన అనంతరం ఒకింత ఉద్వేగంగా మాట్లాడారు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి. దేశ రాజధాని ఢిల్లీలో 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం జరిగింది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు పురస్కారాలు అందజేశారు. 2022 సంవత్సరానికిగాను ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం ‘ఆట్టమ్’ (మలయాళం), ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి (కాంతార–కన్నడ), ఉత్తమ నటీమణులుగా నిత్యా మీనన్ (తిరుచిత్రంబలం–తమిళ్), మానసీ పరేఖ్ (కచ్ఎక్స్ప్రెస్–గుజరాతీ) అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు ‘కార్తికేయ 2’కు దక్కింది. నిర్మాత అభిషేక్ అగర్వాల్ అవార్డు స్వీకరించగా, చిత్రదర్శకుడు చందు మొండేటి, హీరో నిఖిల్ కూడా హాజరయ్యారు. ‘΄పొన్నియిన్ సెల్వన్– 1’కు గానూ ఉత్తమ సంగీతం (నేపథ్య సంగీతం) విభాగంలో ఏఆర్ రెహమాన్ అవార్డు అందుకున్నారు. ఈ వేడుకకు వివిధ భాషల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ వేదికపై ఇంకా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ – ‘‘ఇప్పటికి మూడు జాతీయ అవార్డులు అందుకున్నాను. తొలి అవార్డు (‘మృగయా’) అందుకున్నప్పుడే నేను చాలా సాధించాననుకున్నాను. ‘మృగయా’ సినిమా స్క్రీనింగ్‌కి వెళ్లినప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్... అతను ఈ లోకంలో లేడు కాబట్టి పేరు చెప్పను. అతను ‘ఈ సినిమా చాలా బాగుంది. నువ్వు అద్భుతమైన నటుడివి. కానీ ఇలాంటి బట్టలతో నువ్వు ఎలా కనిపిస్తున్నావో తెలుసా?’ అంటే నేను నిర్ఘాంతపోయాను.నేను ఆయన ముందు నగ్నంగా నిలబడ్డానా? అనిపించింది. వెంటనే ఆయన ‘మృగయా’లో నేను చేసిన ఆదివాసీ పాత్ర గురించి చెప్పినట్లు పేర్కొన్నారు. నేను నా తొలి జాతీయ అవార్డు అందుకున్న తర్వాత హాలీవుడ్ యాక్టర్ అల్ పచీనో అంతటి ప్రతిభ నాలోనూ ఉందనుకున్నాను. అకస్మాత్తుగా నా తీరు మారిపోయింది. కొందరు నిర్మాతలతో దురుసుగా ప్రవర్తించాను. నన్ను నేను అల్ పచీనో అనుకుం టున్నానని నిర్మాతలు గ్రహించలేకపోయారు. ఓ సందర్భంలో ఒక నిర్మాతకు కథను నా ఇంటికి పంపాలన్నాను. అతను వెంటనే లేచి నా చెంప చెళ్లుమనిపించాడు. అప్పట్నుంచి నన్ను నేను ఓ అల్ పచీనోలా ఊహించుకోవడం మానేశాను. నాదే తప్పని గ్రహించాను. నా తీరు మార్చుకున్నాను’’ అన్నారు.మంచి మార్పు తీసుకురావాలన్నదే...: రిషబ్ శెట్టిప్రతి సినిమా ప్రభావం ప్రేక్షకుల పై ఉంటుంది. అందుకే ప్రజల్లో, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే సినిమాలు తీయాలన్నది నా ఉద్దేశం.కష్టానికి ప్రతిఫలం దక్కింది: నిత్యా మీనన్ చిత్రపరిశ్రమలో దాదాపు 15 ఏళ్ల కష్టం నాది. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ అవార్డు. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి దీన్ని బాధ్యతగా చూడకుండా సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం ఇది. ‘తిరుచిత్రంబలం’ బృందానికి, నా సహ నటులకు ఈ అవార్డుని అంకితం ఇస్తున్నాను. ఇదే ఉత్సాహంతో మంచి దర్శకులు, రచయితలతో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాను. సినిమాకి సరిహద్దులు లేవు: ఏఆర్ రెహమాన్ సినిమాకి ప్రాంతం, భాష అంటూ ఎలాంటి సరిహద్దులు లేవు. నేను అందుకున్న ఏడో జాతీయ అవార్డు ఇది. సంతోషంగా ఉంది. ఈ అవార్డు నాకు వచ్చేందుకు కారకులైన ఫిల్మ్ మేకర్స్‌కి, ముఖ్యంగా డైరెక్టర్ మణిరత్నంగారికి ధన్యవాదాలు. -
70వ జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు నుంచి ఒక్కటే
భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. 70వ నేషనల్ సినీ అవార్డ్స్ ప్రదానోత్సవం.. న్యూ ఢిల్లీలోని విజయ్ భవన్లో జరుగుతోంది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము.. విజేతలకు అవార్డులని ప్రకటించారు. ఈ వేడుకకు దాదాపు అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, ప్రముఖులు హాజరయ్యారు.తెలుగు నుంచి 'కార్తికేయ 2'కి ఉత్తమ ప్రాంతీయ చిత్ర కేటగిరీలో పురస్కారం దక్కింది. దర్శకుడు చందు మొండేటి దీన్ని అందుకున్నారు. 'తిరు' చిత్రానికి ఉత్తమ నటిగా నిత్యా మీనన్, 'కాంతార' మూవీకి గానూ ఉత్తమ నటుడిగా రిషభ్ శెట్టి అవార్డులు అందుకున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రదానం చేశారు. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి అవార్డ్ ఇవ్వాలి. కానీ లైంగిక ఆరోపణల కేసు కారణంగా దీన్ని రద్దు చేశారు.ఎవరెవరికి ఏ విభాగాల్లో అవార్డులు? ఉత్తమ చిత్రం: ఆట్టమ్ (మలయాళం) ఉత్తమ నటుడు: రిషబ్ శెట్టి (కాంతార) ఉత్తమ నటి: నిత్యా మేనన్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్‌ప్రెస్ - గుజరాతి) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా: బ్రహ్మాస్త్ర - పార్ట్ 1ఉత్తమ దర్శకుడు: సూరజ్ బర్జాత్యా (ఉంచాయి - హిందీ) బెస్ట్ కొరియోగ్రాఫర్: జానీ మాస్టర్ (తిరుచిత్రాంబళం - తమిళం, తెలుగులో తిరు), సతీశ్ కృష్ణన్ ఉత్తమ సహాయ నటుడు: పవర్ రాజ్ మల్హోత్రా (ఫౌజా - హరియాన్వి) ఉత్తమ సహాయ నటి: నీనా గుప్తా (ఉంచాయి- హిందీ)ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ : అర్జిత్ సింగ్ (కేసరియా) - బ్రహ్మాస్త్ర ఉత్తమ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : బొంబాయి జయశ్రీ (సౌది వెళ్లక్క సీసీ 225/2009- మలయాళం)ఉత్తమ సంగీతం (పాటలు): ప్రీతమ్ (బ్రహ్మస్త్ర -హిందీ)ఉత్తమ సంగీతం (నేపథ్యం): ఏఆర్ రెహమాన్ (పొన్నియిన్ సెల్వన్ - 1 తమిళం)ఉత్తమసినిమాటోగ్రఫీ: రవి వర్మన్ (పొన్నియిన్ సెల్వన్ పార్ట్ - 1 తమిళం) ఉత్తమ సౌండ్ డిజైన్: ఆనంద్ కృష్ణమూర్తి (పొన్నియిన్ సెల్వన్ - 1) ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: శ్రీపాథ్ (మాలికాపురం - మలయాళం)ఉత్తమ స్క్రీన్‌ప్లే: ఆనంద్ ఏకార్షి (ఆట్టం- మలయాళం)ఉత్తమ ఎడిటింగ్: మహేష్ భువనేండ్ (ఆట్టం) ఉత్తమ యాక్షన్ డైరక్షన్: అన్బరివు (కేజీఎఫ్- 2)ఉత్తమ మేకప్: సోమనాథ్ కుందు (అపరాజితో- బెంగాళీ)ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: నిక్కి జోషి (కచ్ ఎక్స్‌ప్రెస్- గుజరాతీ) ఉత్తమ మాటల రచయిత: అర్పితా ముఖర్జీ, రాహుల్ వి చిట్టెల (గుల్మోహర్)ఉత్తమ ప్రాంతీయ సినిమాలుఉత్తమ ప్రాంతీయ చిత్రం: కార్తికేయ -2 (తెలుగు)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: కేజీఎఫ్ 2 (కన్నడ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం: పొన్నియిన్ సెల్వన్ - 1 (తమిళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : గుల్మొహర్ (హిందీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : సౌది వెళ్లక్క సీసీ 225/2009 (మలయాళం)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : కబేరి అంతర్దాన్ (బెంగాళీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : వాల్వీ (మరాఠీ)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : దమన్ (ఒడియా)ఉత్తమ ప్రాంతీయ చిత్రం : బాగీ డి దీ (పంజాబీ)జాతీయ ఉత్తమ నాన్ ఫీచర్ సినిమాలుఉత్తమ షార్ట్ ఫిల్మ్: ఉన్యుత (వాయిడ్) - అస్సామీఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: అయేనా (అద్దం)- హిందీ/ ఉర్దూఉత్తమ డాక్యుమెంటరీ ఫిల్మ్: మర్మర్స్ ఆఫ్ ది జంగిల్ (మరాఠీ)ఉత్తమ యానిమేషన్ సినిమా: ఏ కోకోనట్ ట్రీ (సైలెంట్)ఉత్తమ దర్శకులు: మిరియం చాండీ మినాచెరీ (ఫ్రమ్ ది షాడో- బెంగాళీ/హిందీ/ ఇంగ్లిష్)ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ : బస్తి దినేశ్ షెనోయ్ (ఇంటర్మిషన్ - కన్నడ)ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్: విశాల్ భరద్వాజ్ (ఫుర్సత్- లీజర్/ హిందీ)ఉత్తమ క్రిటిక్: దీపక్ దుహా (హిందీ) ఉత్తమ బుక్ ఆన్ సినిమా: రచయితలు: అనిరుద్ధ భట్టాచార్జీ, పార్థివ్ ధార్ కిషోర్ కుమార్ (ది అల్టిమేట్ బయోగ్రఫీ - ఇంగ్లిష్) ఉత్తమ సినిమాటోగ్రీఫీ: సిద్ధార్థ్ దివాన్ -మోనో నో అవేర్ (హిందీ - ఇంగ్లీష్) -
రిషబ్ శెట్టి తండ్రిగా మోహన్ లాల్.. కాంతారా 2 నుంచి లేటెస్ట్ అప్డేట్..
-
కాంతార ప్రీక్వెల్‌లో మోహన్‌లాల్.. ఆ పాత్ర చేయనున్నాడా?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ గ్లింప్స్, టీజర్ కూడా విడుదల చేశారు. కన్నడ చిత్రసీమకు కొత్త ఇమేజ్ను కాంతారా ఒక్కసారిగా మార్చేసింది. దీంతో కాంతార ప్రీక్వెల్పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే తాజాగా కాంతార చాప్టర్-1కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రిషబ్ శెట్టి తండ్రిగా ఆయన నటిస్తారని లేటేస్ట్ టాక్. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో రిషబ్ శెట్టిని మోహన్‌లాల్ కలుసుకున్నారు. ఆయన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరలయ్యాయి. అదే సమయంలో వీరి మధ్య కాంతార గురించే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాంతారా: చాప్టర్-1 లో మోహన్‌లాల్ పాత్రపై గత రెండు రోజులుగా శాండల్‌వుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదే గనుక నిజమైతే ఇక అభిమానులకు పండగే.(ఇది చదవండి: 'కాంతార చాప్టర్ 1' ఫస్ట్ లుక్ వీడియో.. రిషబ్ శెట్టి ఉగ్రరూపం)కాగా.. రిషబ్ శెట్టి తెరకెక్కిస్తోన్న కాంతార చాప్టర్- 1 ప్రస్తుతం నాలుగో షూటింగ్ షెడ్యూల్ వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రారంభంలో థియేటర్లలోకి సందడి చేయనుంది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార హీరోగా రిషబ్ శెట్టి కాదు.. ఫస్ట్ అనుకున్నది ఎవరంటే?
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఆయన స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతార భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు జాతీయ అవార్డును సైతం తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రిషబ్ ఈ మూవీ ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే టీజర్ కూడా విడుదల చేశారు.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రిషబ్ శెట్టి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కాంతార మూవీకి మొదట హీరోగా తాను చేయాలని అనుకోలేదని తెలిపారు. ఈ చిత్రంలో శివ పాత్రను పోషించడానికి శెట్టి మొదటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు. రాజ్‌కుమార్‌కు ఈ స్క్రిప్ట్‌ను వినిపించినప్పుడు ఎంతో ఉత్సాహంగా విన్నారని.. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్‌ను చేయలేకపోయాడని రిషబ్ వివరించారు. ఓ రోజు నాకు ఫోన్ చేసి నా కోసం ఎదురు చూస్తే సినిమా ఏడాది ఆలస్యం కావొచ్చని నాతో అన్నారని తెలిపారు. అయితే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఊహించని విధంగా అక్టోబర్ 29, 2021న బెంగళూరులో గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మరణానికి రెండు రోజుల ముందు కలుసుకున్నానని రిషబ్ గుర్తు చేసుకున్నారు. తన సినిమా కాంతార గురించి ఆయన ఆరా తీశారని చెప్పుకొచ్చారు. సినిమా పట్ల రాజీ పడవద్దని నాకు సూచించారు. షూట్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలను రాజ్‌కుమార్‌కు చూపించినట్లు వెల్లడించారు. ఫోటోలు చూసిన రాజ్‌కుమార్ చాలా సంతోషంగా వ్యక్తం చేశారని.. నీ సినిమా చూడటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానని చెప్పాడని రిషబ్ శెట్టి తెలిపారు. -
ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు
-
పురాతన ఆలయంలో ఎన్టీఆర్ దంపతుల పూజలు.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటకలో బిజీగా ఉన్నారు. తన ఫ్యామిలీతో కలిసి ప్రముఖ ఆలయాలను సందర్శిస్తున్నారు. ఇటీవల అమ్మతో కలిసి ప్రముఖ శ్రీకృష్ణుని ఆలయాన్ని దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సైతం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తన తల్లి షాలిని, భార్య లక్ష్మిప్రణతీ కూడా వెంట ఉన్నారు. ఈ ఆలయం దర్శనంతో తన తల్లి కల నెరవేరిందని జూనియర్ వెల్లడించారు.తాజాగా తన కుటుంబంతో కలిసి మరో ప్రముఖ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాంతార రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్‌నీల్ దంపతులతో కలిసి ఎన్టీఆర్, ప్రణతీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అడవుల్లోని ఉన్న గుహల్లో ఉన్న మూడగల్లులోని కేశవనాథేశ్వర ఆలయాన్ని సందర్శించటారు. అక్కడే ఉన్న ఆలయ గుహల్లో ఎన్టీఆర్ నడుచుకుంటూ వెళ్తున్న వీడియోను రిషబ్ శెట్టి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.తండ్రి జయంతిని స్మరించుకుంటూ..ఇవాళ నందమూరి హరికృష్ణ 68వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తండ్రిని స్మరించుకున్నారు. ఆయన ఫోటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. మీ 68వ జయంతి న మిమ్మల్ని స్మరించుకుంటూ... pic.twitter.com/yIi5pgFMQI— Jr NTR (@tarak9999) September 2, 2024 ಮೂಡುಗಲ್ಲು ಕೇಶವನಾಥೇಶ್ವರನ ದರ್ಶನ ಪಡೆದಾಗ.. ✨🙏🏼A blessed journey to Keshavanatheshwara Temple Moodagallu ✨🙏🏼@tarak9999 #PrashanthNeel pic.twitter.com/SWfP2TAWrk— Rishab Shetty (@shetty_rishab) September 2, 2024 -
కర్ణాటక దేవాలయాల్లో ఎన్టీఆర్ ప్రత్యేక పూజలు
జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కర్ణాటక పర్యటనలో ఉన్నాడు. కుటుంబంతో కలిసి మంగళూరు వెళ్లిన తారక్.. అక్కడ ఉన్న ప్రముఖ దేవాలయాలను సందర్శిస్తున్నాడు. తారక్‌తో పాటు అతడి వెంట 'కాంతార' ఫేమ్ నటుడు రిషబ్ శెట్టి, 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు.(ఇదీ చదవండి: బిగ్ బాస్ 8 ఫైనల్ లిస్ట్ ఇదే.. వీళ్లు పక్కా!)శనివారం సాయంత్రం తన అమ్మ కోరిక మేరకు ఉడిపిలోని శ్రీకృష్ణ మఠంను దర్శించుకున్న తారక్.. ఆదివారం కొల్లురులోని మూకాంబిక అమ్మవారి ఆలయానికి వెళ్లాడు. ఉదయం పంచెకట్టులో ఆలయానికి వెళ్లిన తారక్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించాడు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తారక్‌తో పాటు రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా మూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.'దేవర' సినిమా చేసిన తారక్.. సెప్టెంబరు 27న థియేటర్లలో ఈ సినిమాతో పలకరించనున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో కలిసి పనిచేస్తాడు. కొన్నిరోజుల క్రితం పూజా కార్యక్రమంతో ప్రాజెక్ట్ లాంచ్ అయింది. ఇక నవంబరులో షూటింగ్ ప్రారంభించనున్నారు. డిసెంబర్ నుంచి తారక్ షూట్లో పాల్గొంటాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టితో కలిసి కర్ణాటకలోని దేవాలయాల్ని ఎన్టీఆర్ సందర్శించడం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: అభిమానులను ఉద్దేశిస్తూ చిరంజీవి ట్వీట్) -
మా అమ్మ కల నెరవేరింది : ఎన్టీఆర్
‘‘మా అమ్మ (శాలినీ) స్వగ్రామం కుందాపురానికి నన్ను తీసుకొచ్చి ఉడుపి శ్రీకృష్ణ ఆలయంలో దర్శనం చేసుకోవాలనేది ఆమె చిరకాల కల.. అది ఎట్టకేలకు నెరవేరింది’’ అన్నారు హీరో ఎన్టీఆర్. కర్ణాటకలోని ప్రసిద్ధి చెందిన ఉడుపిలోని శ్రీకృష్ణ ఆలయాన్ని ఎన్టీఆర్ శ్రావణ శనివారం సందర్భంగా దర్శించుకున్నారు. ఆయన వెంట తల్లి శాలినీ, భార్య లక్ష్మీ ప్రణతి, కన్నడ హీరో రిషబ్ శెట్టి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ప్రముఖ వాగ్గేయకారుడు భక్త కనకదాసు దర్శించుకున్న కనక కిటికీ ద్వారా అందరూ నల్లనయ్య (శ్రీ కృష్ణుడు) విగ్రహాన్ని దర్శించారు.దర్శనం అనంతరం ఆలయం ఎదుట తన తల్లితో కలిసి దిగిన ఫొటోలను ఎన్టీఆర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి... ‘‘ఉడుపి శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించడంతో అమ్మ (శాలినీ) కల ఎట్టకేలకు నెరవేరింది. అమ్మ పుట్టినరోజు సెప్టెంబర్ 2. ఆమె బర్త్‌డేకి రెండు రోజుల ముందు ఈ ఆలయాన్ని దర్శించడం ఆమెకు నేనిచ్చిన అత్యుత్తమ బహుమతి.విజయ్ కిరగందూర్ సార్‌కి (హోంబలే ఫిలింస్ అధినేత) థ్యాంక్స్. నా ప్రియ మిత్రుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి రావడం సంతోషంగా ఉంది. అలాగే నా ప్రియ మిత్రుడు రిషబ్ శెట్టి కూడా నాతో వచ్చి ఈ క్షణాలను మరింత ప్రత్యేకంగా మార్చారు’’ అంటూ తన ఆనందం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘దేవర’ మొదటి భాగం ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. -
అమ్మ చిరకాల కోరిక తీర్చిన ఎన్టీఆర్
జూ.ఎన్టీఆర్ మళ్లీ చాలారోజుల తర్వాత కుటుంబం గురించి పోస్ట్ పెట్టాడు. ఎప్పటిలా భార్య గురించి కాకుండా తల్లి గురించి, ఆమెకు ఎప్పటినుంచో ఉన్న కోరిక గురించి చెప్పాడు. ఇదే పోస్టులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్, 'కాంతార' హీరో రిషభ్ శెట్టి గురించి ప్రస్తావించాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎన్టీఆర్ తల్లి పేరు శాలిని. ఆమెది కర్ణాటకలోని కుందపుర అనే ఊరు. గతంలో పలు సందర్భాల్లో తారక్ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే కొడుకుని తన సొంతూరికి తీసుకెళ్లాలని ఎప్పటినుంచో ఈమె అనుకుంటోందట. తాజాగా ఈ విషయాన్ని ఎన్టీఆర్ బయటపెట్టాడు. ఇన్ స్టాలో క్యూట్ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: షాకింగ్ ఆరోపణలు.. నిజం కాదని తేల్చిన నటి రేవతి)'తన సొంతూరు కుందపురకి నన్ను తీసుకొచ్చి, ఉడుపిలోని శ్రీకృష్ణ మఠం దర్శనం చేయించాలనేది మా అమ్మకు చిరకాల కోరిక. అది ఇన్నాళ్లకు నెరవేరింది. ఆమె కల నిజమైంది. సెప్టెంబరు 2న అమ్మ పుట్టినరోజు. ఆమె కోరికని నిజం చేయడం ఆమెకి ఇచ్చే పెద్ద గిఫ్ట్. దీన్ని సాధ్యమయ్యేలా చేసిన మై డియర్ ఫ్రెండ్ ప్రశాంత్ నీల్, విజయ్ కిరగందూర్‌కి థ్యాంక్యూ. అలానే రిషభ్ శెట్టికి స్పెషల్ థ్యాంక్స్. అతడి మాతో పాటు వచ్చి దీన్ని మరింత ప్రత్యేకం చేశాడు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్ కూడా శ్రీ కృష్ణుడి మఠం దర్శనం చేసుకున్న 'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టిది కూడా కుందపుర ఊరే. గతంలో ఇదే విషయాన్ని చెప్పాడు. అలానే తాను ఎన్టీఆర్‌కి పెద్ద ఫ్యాన్ అని కూడా అన్నాడు. ఇకపోతే తారక్ ప్రస్తుతం 'దేవర' చేస్తున్నాడు. ఇది సెప్టెంబరు 27న రిలీజ్ కానుంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా చేస్తాడు. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఏఆర్ రెహమాన్ కూతురికి విచిత్రమైన కష్టాలు) View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
హిందీ సినిమాలు భారత్‌ను నెగెటివ్‌గా చూపిస్తున్నాయి: కాంతార హీరో
రెండేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టికి ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఇతడి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ మూడే నాకు గర్వకారణంఓ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్.. మన దేశాన్ని నెగెటివ్‌గా చూపిస్తున్నాయి. అలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయం. నా వరకైతే దేశం, నా రాష్ట్రం, నా భాష.. ఈ మూడింటినీ చూసి గర్వంగా ఫీల్ అవుతుంటాను. వీటిని ప్రపంచానికి పాజిటివ్‌గా చూపించాలని నమ్ముతాను. అందుకోసం నావంతు ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నాడు.అది తప్పు కాదా?ఇది చూసిన జనాలు.. హీరో వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అదెప్పటినుంచో అలాంటి సినిమాలే ఎక్కువగా తీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. నీ సినిమాల్లో అశ్లీలత లేనట్లే మాట్లాడుతున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతదాకా ఎందుకు? కాంతార సినిమాలో హీరోయిన్ నడుము గిల్లలేదా? అది తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ఆ సీన్స్ ఆపేయండి..ఈయన ఒక్క సినిమా హిట్ కొట్టి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్బర్గ్లా ఫీలవుతున్నాడు. కాంతారకు అనవసరంగా హైప్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూశాక మళ్లీ చూడాలన్న ఆసక్తే రాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము గిల్లే సన్నివేశాలు ఆపేయండి.. చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. అవి ఆపేశాక నీతులు చెప్పండి అని మరో వ్యక్తి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ సినిమా చేస్తున్నాడు. -
ఆ అవార్డుకు రిషబ్ శెట్టి అర్హుడు: అల్లు అర్జున్
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డుకు ఎంపికైన రిషబ్ శెట్టి, ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన నిత్యామీనన్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు‘నేషనల్ అవార్డు విన్నర్స్ అందరికి నా హృదయ పూర్వక అభినందనలు. రిషబ్ శెట్టి ఉత్తమ నటుడు అవార్డుకు అర్హుడు. అలాగే నా చిరకాల స్నేహితురాలు నిత్యా మేనన్ ఉత్తమ నటిగా అవార్డును సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. జాతీయ అవార్డులు గెలుపొందిన అందరికీ నా శుభాకాంక్షలు. నిఖిల్, చందు మొండేటిలకు ప్రత్యేక అభినందనలు. ‘కార్తికేయ2’ విజయం సాధించినందుకు ఆ టీమ్ అందరికీ శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ఎక్స్‌లో రాసుకొచ్చాడు.అవార్డు బాధ్యత పెంచింది : చందూ మెండేటి‘‘మా సినిమాకి జాతీయ అవార్డు రావడం మా బాధ్యతని మరింత పెంచింది. ‘కార్తికేయ 2’ తర్వాత ‘కార్తికేయ 3’పై అంచనాలు ఎంతలా పెరిగాయో తెలుసు. ఆ అంచనాలకు తగ్గట్టుగా ‘కార్తికేయ 3’ ఉంటుంది’’ అని డైరెక్టర్ చందు మొండేటి అన్నారు. నిఖిల్ సిద్ధార్థ్, అనుపమా పరమేశ్వరన్ జోడీగా చందు మొండేటి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన చిత్రం ‘కార్తికేయ 2’. ప్రాంతీయ విభాగంలో ఉత్తమ చిత్రం అవార్డును సాధించిన సంగతి తెలిసిందే. -
జాతీయ అవార్డ్.. హీరో పునీత్ - వాళ్లకు అంకితం: రిషబ్ శెట్టి
కేంద్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు అద్భుతాలు చేశాయి. కన్నడ సినిమా 'కాంతార'కి గానూ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అవార్డ్ రావడంపై రిషబ్ స్పందించాడు. దివంగత హీరో పునీత్‌పై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)తనకు వచ్చిన జాతీయ అవార్డుని రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు రిషబ్ శెట్టి పేర్కొన్నాడు. జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశాడు.హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార' సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. కేవలం రూ.15 కోట్లు పెడితే ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఇందుకు గానూ రిషబ్.. ఉత్తమ నటుడిగా నిలవడం కన్నడ సినిమా రేంజ్‌ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
జాతీయ సినిమా అవార్డ్‌తో పాటు ఏమేం ఇస్తారు?
జాతీయ అవార్డులనీ ప్రకటించారు. తెలుగు నుంచి 'కార్తికేయ 2' ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు తమిళ, మలయాళ సినిమాలు ఈసారి మంచి దూకుడు చూపించాయి. అయితే అవార్డ్ విజేతలు ఎవరనేది తెలిసిపోయింది. మరి వాళ్లకు పురస్కారంతో పాటు ఏమేం ఇస్తారో తెలుసా?(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)జాతీయ సినీ అవార్డు విజేతలకు స్వర్ణ కమలం, రజత కమలంతో పాటు నగదు బహుమతి ఇస్తారు. అలానే గుర్తింపుగా ప్రశంస పత్రాలను బహుకరిస్తారు. జ్యూరీ అభినందనల అందుకున్న సినిమాలకు మాత్రం సర్టిఫికేట్ మాత్రమే దక్కుతుంది. జ్యూరీ స్పెషల్ విజేతలకు ప్రశంస పత్రంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది.తాజాగా ప్రకటించిన నేషనల్ అవార్డ్ విన్నర్స్‌లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ పాపులర్ చిత్రం, ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ విభాగాలకు మాత్రం రూ.3 లక్షల డబ్బు.. మిగిలిన అందరూ విజేతలకు మాత్రం రూ.2 లక్షల నగదు లభిస్తుంది. (ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
అభిమానితో ప్రేమ.. రిషబ్ శెట్టి విజయంలో కీలక పాత్ర ఆమెదే
నేషనల్ అవార్డ్ విన్నర్ స్థాయికి చేరుకున్న కన్నడ హీరో విజయం వెనక ఎవరున్నారా..? అని అందరిలో మెదిలే ప్రశ్న. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందని చెబుతూ ఉంటారు కదా.. అలా రిషబ్ విజయంలో క్రెడిట్ అంతా తన భార్య ప్రగతికే దక్కుతుందని ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఈ విధంగా రిషబ్ ప్రేమను భార్యపై చాటారు. రిషబ్‌కు ప్రధాన బలం తన భార్య, ఇద్దరు పిల్లలే అంటూ ఉంటారు. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరంగా కూడా రిషబ్‌కు ఆమె తోడుగా ఉంటుంది. వారిద్దరి ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం.అభిమానితో ప్రేమసాధారణంగా హీరోలు తమ ఇండస్ట్రీలోని పరిచయమున్న వారితో ప్రేమలో పడట సహజం. కానీ అభిమానితో ప్రేమలో పడటం అంటే చాలా అరుదు. కానీ రిషబ్ శెట్టి జీవితంలో అదే జరిగింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన అమ్మాయితో ఆయన ప్రేమలో పడ్డారు. రక్షిత్‌శెట్టి హీరోగా ‘రిక్కీ’ అనే సినిమాను రిషబ్ శెట్టి తెరకెక్కించారు. ఆ చిత్ర విజయోత్సవ కార్యక్రమంలో అందరూ హీరోతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అయితే, ఆ సమయంలో ఆ అందమైన అమ్మాయి మాత్రం ఆ చిత్ర దర్శకుడు రిషబ్ శెట్టిని చూస్తూ అలానే ఉండిపోయింది. దానిని గమనించిన రిషబ్.. తనను ఎక్కడో చూశానే అనుకుంటూ పలకరించాడు. ఆ అమ్మాయి తన గ్రామం కెరాడికి చెందిన అమ్మాయేనని గుర్తించాడు. అప్పటికే వారిద్దరికీ ఫేస్బుక్లో పరిచయం ఉంది. అలా ప్రగతితో ప్రేమలో పడిపోయిన రిషబ్ 2017లో పెళ్లి చేసుకున్నాడు. ప్రగతి ఇంట్లో వీరి పెళ్లికి మొదదట ఒప్పుకోలేదు. రిషబ్ జీవితంలో ఇంకా స్థిరపడలేదని వద్దని చెప్పారు. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించింది. ఐటీ నేపథ్యమున్న ప్రగతి బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ’లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసింది. పెళ్లయ్యాక పూర్తిగా సినిమా రంగంపైనే తన దృష్టిపెట్టింది. చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె ‘కాంతార’ సినిమాకు కూడా పనిచేసింది. ‘కాంతార’లో ప్రారంభ సన్నివేశంలో రాణి పాత్రలో ప్రగతి నటించింది. ప్రస్తుతం రిషబ్ పలు సినిమాలు నిర్మించడంతో పాటు డైరెక్షన్ చేసే స్థాయికి చేరుకున్నాడు. ప్రగతి కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిత్రపరిశ్రమలో రాణిస్తుంది. తన భర్త విజయంలో కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్‌కు అవార్డ్ దక్కడంలో ప్రగతి పాత్ర చాలా కీలకం అని చెప్పవచ్చు. -
క్లాప్ బాయ్ నుంచి నేషనల్ అవార్డ్ విన్నర్‌గా.. 'రిషబ్ శెట్టి' ప్రయాణం
కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు పాపులర్ అయింది. కాంతార మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించుకున్నారు రిషబ్ శెట్టి. కన్నడలో విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్‌తో అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్‌ను శాసించింది. కాంతార అద్భుతమైన విజయంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా కీలకం. 2010లో సినీరంగంలోకి అడుగుపెట్టి సైడ్ క్యారెక్టర్లు చేస్తూ 2016లో రికి, కిరీక్ పార్టీ సినిమాలకు దర్శకతం వహించాడు. సాధారణ కుటుంబంలో జన్మించిన రిషబ్ శెట్టి తాజాగ విడుదలైన 70వ జాతీయ ఉత్తమ నటుడిగా (కాంతార) అవార్డు అందుకునే స్థాయికి చేరుకున్నారు. అసలు రిషబ్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి? సినిమాల్లోకి రాకముందు ఆయన ఏం చేశారు? అనే విషయాలు తెలుసుకుందాం.కర్ణాటకలోని కెరాడి అనే మారుమూల గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో రిషబ్ జన్మించారు. తన తండ్రి భాస్కర శెట్టి జ్యోతిష్కుడు కాగా అమ్మ రత్నావతి. కుటుంబంలో అందరికంటే చిన్నవాడు రిషబ్. ఆయనకు అక్క, అన్నయ్య ఉన్నారు. సినిమాల్లో అరంగేట్రానికి ముందు అనేక ఉద్యోగాలు రిషబ్ శెట్టి చేశారు. తన అవసరాల కోసం నాన్నను ఎప్పుడూ డబ్బు అడగలేదని గతంలో ఓ ఇంటర్వ్యూ ద్వారా వెల్లడించారు.ఇండస్ట్రీలో మొదట క్లాప్ బాయ్‌గా తన జర్నీని ప్రారంభించిన రిషబ్ ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.ఇండస్ట్రీలో పరిచయాలు లేకుండానే..తన సినీ ప్రస్థానం గరించి రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. 'నేను నటుడిని కావాలనుకున్నా. కానీ పరిశ్రమలో నాకు ఎటువంటి పరిచయాలు లేవు. ఎలా అప్రోచ్ అవ్వాలనేది నా ఆలోచన. అందుకే నేను ఒక కన్నడ నటుడి కథను చదివా. అతను అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి.. హీరోగా ఎలా మారాడనే దాని గురించి చదివాను. నా చదువు తర్వాత ఫిల్మ్ మేకింగ్‌పై షార్ట్‌టర్మ్ కోర్సు చేశా. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి.. ఏడేళ్ల తర్వాత నటన వైపు మొగ్గు చూపా.' అని అన్నారు.(చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)కూలీ పనులకు కూడా వెళ్లేవాడురిషబ్ శెట్టి నటుడిగా అరంగేట్రానికి ముందు చాలా పనులు చేశాడు. చిన్నతనంలో బాగా అల్లరి చేస్తున్న రిషబ్ పై చదువుల కోసం తన గ్రామం నుంచి బెంగుళూరుకు మకాం మార్చాడు. డిగ్రీ చదివేటప్పుడు సినిమా చూసేందుకు నాన్నను డబ్బులు అడగలేక.. కూలీ పనులకు వెళ్లేవాడు. 2004 నుంచి 2014 వరకు తన మొదటి డైరెక్షన్ చేసేవరకు 10 ఏళ్లపాటు వాటర్ క్యాన్లు అమ్మడం, రియల్ ఎస్టేట్, హోటల్స్‌లో పనిచేశారు. అలా తన గమ్యాన్ని చేరుకునేందుకు ఎంతో కష్టపడ్డారు.సినీ ఇండస్ట్రీలో రిషబ్ శెట్టి ప్రయాణంచదువుకునే సమయంలోనే రిషబ్‌కు సినిమాలు అంటే పిచ్చి. ఆ సమయంలోనే అవకాశాల కోసం ప్రయత్నించారు. కానీ అక్కడ పరిచయాలు లేకపోవడంతో సినీ పరిశ్రమలో క్లాప్ బాయ్, స్పాట్ బాయ్‌గా పనిలో చేరారు. ఆపై అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తుగ్లక్ అనే చిత్రంలో తన మొదటి పాత్రను పోషించారు. 2016లో రక్షిత్ శెట్టి హీరోగా రిషబ్ తొలి దర్శకత్వం వహించిన చిత్రం రికీ విడుదలై బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ అందుకుంది. ఆపై అదే ఏడాది దర్శకత్వ వహించిన మరో చిత్రం కిరిక్ పార్టీ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో ఆయన పేరు ఒక్కసారిగా మారుమ్రోగిపోయింది.‘కాంతార’ ప్రభంజనంచిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. 2022 సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. అక్కడ కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. కేవలం రూ. 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగులో సుమారు రూ. 75 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. కాంతార చిత్రంలో రిషబ్ ప్రధాన కథానాయకుడిగా నటించిడమే కాకుండా డైరెక్షన్ కూడా చేశారు. ఇప్పుడు 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో రిషబ్ శెట్టి సత్తా చాటారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. 2018లో రిషబ్ దర్శకత్వం వహించిన సర్కారీ హిరియ ప్రాథమిక షాలే, కాసరగోడు (Sarkari Hi. Pra. Shaale, Kasaragodu) సినిమాకుగాను జాతీయ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. ఉత్తమ బాలల చిత్రంగా 66వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఎంపికైంది. -
'నేషనల్ అవార్డ్స్.. రేసులో స్టార్ హీరో
70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం నేడు సాయింత్రం ప్రకటించనుంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 28 భాషల్లో విడుదలైన 300కు పైగా చిత్రాల నుంచి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులను ప్రకటించనుంది. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ నేడు (ఆగష్టు 16) జాతీయ అవార్డు అందుకోనున్న వారి జాబితా మాత్రం విడుదల అవుతుందని సమాచారం ఉంది.ఎంపిక విధానం2022కు సంబంధించిన ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి జాతీయ అవార్డ్స్‌ను అందిస్తారు. ఈ అవార్డుల ప్రదానోత్సవం వాస్తవానికి 3 మే 2023న నిర్వహించబడుతుందని అందరూ భావించారు. కరోనా తర్వాత ఈ అవార్డులకు సంబంధించిన షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. దీంతో 2022కు సంబంధించిన సినిమాలకు నేడు విన్నర్స్ జాబితా విడుదల అవుతుంది. ఇదే ఏడాది అక్టోబర్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డ్స్‌ను వారు అందుకుంటారు. 1 జనవరి 2022 నుంచి 31 డిసెంబర్ 2022 మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ద్వారా ధృవీకరించబడిన ఫీచర్, నాన్-ఫీచర్ ఫిల్మ్‌లు మాత్రమే ఈ అవార్డుల పోటీకి అర్హత పొందాయి.ఉత్తమ హీరో రేసులో ఎవరున్నారు..?70వ జాతీయ అవార్డు వేడుకలో ఉత్తమ హీరోగా ఎంపిక అయింది ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. అయితే, మమ్ముట్టి, రిషబ్ శెట్టి, విక్రాంత్ మాస్సే మధ్యే పోటీ ఎక్కువగా ఉంది. సైకలాజికల్ థ్రిల్లర్ రోషాక్, నాన్ పకల్ నేరత్తు మయక్కం అనే రెండు సినిమాలతో మమ్ముట్టి టాప్‌లో ఉన్నారు. కాంతార సినిమాతో రిషబ్ శెట్టి ఉంటే... 12th ఫెయిల్ సినిమా ద్వారా విక్రాంత్ మాస్సే తర్వాతి స్థానంలో ఉన్నారు. బాలీవుడ్ నుంచి పోటీలు ఉన్న ఏకైక హీరోగా ఆయన రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈసారి కూడా సౌత్ ఇండియా హీరోకే అవార్డ్ దక్కుతుందని తెలుస్తోంది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో అల్లు అర్జున్ (పుష్ప) ఉత్తమ హీరోగా అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. -
'కాంతార' హీరో ఎమోషనల్ పోస్ట్.. ఆనందం పట్టలేక!
'కాంతార' ఫేమ్ హీరో రిషబ్ శెట్టి ఆనందాన్ని ఆపుకోలేకపోయాడు. దాదాపు 24 ఏళ్ల తర్వాత తన కల నిజమైందని చెబుతూ తెగ ఎగ్జైట్ అయిపోయాడు. తమిళ హీరో విక్రమ్‌ని కలుసుకున్న సందర్భంగా ఇదంతా చెప్పుకొచ్చాడు. ఇంతకీ అసలు వీళ్లు ఎక్కడ కలుసుకున్నారు? రిషబ్ ఇంకేమన్నాడు?(ఇదీ చదవండి: వయనాడ్ బాధితులకు ప్రభాస్ భారీ విరాళం.. ఎన్ని కోట్లంటే?)'నటుడిగా నేను కెరీర్ ప్రారంభించడానికి విక్రమ్ స్ఫూర్తి. ఆయన్న కలవడం నా 24 ఏళ్ల కల. ఈ రోజు నా దేవుడిని కలిశాను. ప్రస్తుతం ఈ భూమ్మీద అదృష్టవంతుడిని నేనే అనిపిస్తోంది. నాలాంటి ఎంతోమంది ఆర్టిస్టుల్లో ఆయన స్ఫూర్తి నింపుతున్నారు. ఈ విషయంలో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. లవ్ యూ విక్రమ్ సర్' అని రిషబ్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టి భావోద్వేగానికి లోనయ్యాడు.విక్రమ్ నటించిన 'తంగలాన్' ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ జరగ్గా.. తాజాగా బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలోనే రిషబ్.. విక్రమ్‌ని కలిశాడు. తన సంతోషాన్ని ఫొటోలు, పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నాడు.(ఇదీ చదవండి: బంగ్లాదేశ్ అల్లర్లలో విషాదం.. యంగ్ హీరోని కొట్టి చంపారు!) View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
కాంతార 2 రిలీజ్ డేట్ లాక్..
-
శాండల్‌వుడ్ హీరో దర్శన్.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు!
ఇటీవల ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సినీ ఇండస్ట్రీ మోస్ట్ పాపులర్ తారల లిస్ట్‌ను ప్రకటిస్తోంది. టాలీవుడ్‌తో పాటు కన్నడ, మలయాళం, తమిళ స్టార్స్‌లో జూన్ నెలకు సంబంధించి ఎక్కువ క్రేజ్ ఉన్న హీరోలు, హీరోయిన్ల జాబితాను వెల్లడించింది. ఇటీవల ప్రకటించిన తెలుగు హీరోల జాబితాలో ప్రభాస్ మొదటిస్థానంలో నిలిచారు.తాజాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించింది. శాండల్‌వుడ్‌లో మొదటిస్థానంలో కేజీఎఫ్ స్టార్ యశ్ నిలిచారు. ఆ తర్వాత వరుసగా సుదీప్ కిచ్చా, రక్షిత్ శెట్టి, దర్శన్, రిషబ్ శెట్టి ఉన్నారు. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి పుష్ప భామ రష్మిక మందన్నా టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆమె తర్వాత రచిత రామ్, రాధిక పండిట్, రమ్య, ఆషిక రంగనాథ్ వరుస స్థానాలు ఆక్రమించారు.అయితే మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్ లిస్ట్‌లో కన్నడ హీరో దర్శన్ కూడా నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో జరిగిన ఓ అభిమాని హత్యకేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన జాబితాలో నాలుగోస్థానంలో నిలిచారు. కాగా.. తన ప్రియురాలికి అసభ్య సందేశాలు పంపించాడంటూ దర్శన్ అతన్ని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Ormax Stars India Loves: Most popular female Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/72De2ze5MK— Ormax Media (@OrmaxMedia) July 17, 2024Ormax Stars India Loves: Most popular male Kannada film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/NYPwHgPNUC— Ormax Media (@OrmaxMedia) July 17, 2024 -
రిషబ్ శెట్టి బర్త్‌డే స్పెషల్.. ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
-
కల్కి బుజ్జితో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. ఈ ఫోటోలు చూశారా? (ఫొటోలు)
-
పవర్ కపుల్ స్వీట్ మెమరీస్ : రిషబ్ శెట్టి చేతికి కల్కి ‘బుజ్జి’ (ఫొటోలు)
-
బుజ్జి కారును నడిపిన కాంతార హీరో.. వీడియో వైరల్
ప్రభాస్ -నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న సైన్స్ ఫిక్షన్ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. దీంతో ఈ చిత్రంపై పాన్ ఇండియాతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాలో బుజ్జి అనే కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా బుజ్జిని ప్రధాన నగరాల్లో తిప్పుతున్నారు.తాజాగా బుజ్జి కారును కాంతార హీరో రిషబ్ శెట్టి నడిపారు. బుజ్జి కారును డ్రైవ్ చేసి ప్రశంసల్లో ముంచెత్తారు. దీనికి సంబంధించిన వీడియోను కల్కి నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్విటర్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. బుజ్జి కారును ఇప్పటికే పలువురు సినీతారలు డ్రైవ్ చేశారు. ఈ సినిమా ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే కల్కి టికెట్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. KALKI X KANTARA 🔥@shetty_rishab gets his hands on #Bujji.#Kalki2898AD pic.twitter.com/IvIHuxGO6y— Vyjayanthi Movies (@VyjayanthiFilms) June 24, 2024 -
కాంతార హీరో ఇంట్లో శుభకార్యం.. ఫోటోలు షేర్ చేసిన నటుడు!
కాంతారా మూవీతో స్టార్డమ్ సొంతం చేసుకున్న కన్నడ హీరో రిషబ్ శెట్టి. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన కాంతార బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. దేశవ్యాప్తంగా సినీ ప్రియుల నుంచి విశేషమైన ఆదరణ దక్కించుకుంది. దీంతో రిషబ్ కాంతార ప్రీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇటీవలే ఆయన మలయాళ స్టార్ మోహన్‌లాల్‌ను కలిశారు. దీంతో ఆయన కాంతార-2 కోసమే మోహన్‌లాల్‌ను కలిశాడని వార్తలొచ్చాయి. కాంతార 2 విషయానికొస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా రిషబ్ శెట్టికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడీయాలో యాక్టివ్‌గా ఉండే రిషబ్ ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తాజాగా తన కూతురు రాధ్యకు అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు రిషబ్ దంపతులు. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రముఖ శ్రీ శారదాంబ ఆలయంలో తమ ముద్దుల కూతురికి అక్షర అభ్యాసం పూర్తియిందంటూ రిషబ్ రాసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
కర్ణాటకలో తాజాగా పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. స్టేట్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధి ఫోటోను పాన్ ఇండియా స్టార్హీరో రిషబ్ శెట్టి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ విజయం ఎంతో మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్ఎస్ఎల్సీ పరీక్షా ఫలితాల్లో దుమ్మురేపింది. అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ఏకంగా 625/625 మార్కులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆమె తండ్రి బసప్ప ఒక రైతు. తల్లి గృహిణి. ఆమె సాధించిన మార్కులతో వారి కుటుంబంలో పండుగ వాతావరణం ఉంది. అంకిత ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసింది. భవిష్యత్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి ఆపై ఐఏఎస్ కావాలనేది తన టార్గెట్ అని ఆమె తెలిపింది. అంకిత విజయం పట్ల కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి శుభాకాంక్షలు తెలిపాడు. ఆమె తల్లిదండ్రుల ఫోటోను ఆయన షేర్ చేశారు. ఈ ఏడాది ఫలితాల్లో ఏడుగురు విద్యార్థులు 624 మార్కులు సాధించారని అక్కడి ప్రభుత్వం వెళ్లడించింది. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాన్నాళ్లు కష్టపడి డైరెక్టర్ అయ్యాడు. హిట్ కొట్టాడు. అలా అటు నటుడిగా ఇటు దర్శకుడిగా అడపాదడపా మూవీస్ చేశాడు. కానీ రెండేళ్ల క్రితం ఓ మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఎంతలా అంటే ప్రాంతీయ హీరో కాస్త పాన్ ఇండియా హీరో అయ్యేంతలా. కోట్లాదిమంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. మరి ఇంతలా చెప్పాం కదా.. ఇతడు ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?(ఇదీ చదవండి: తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా)పైన ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి పేరు రిషభ్ శెట్టి. హా అవును మీరు ఊహించింది కరెక్టే. 'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించాడు. రూ.15 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తీయగా.. ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీనిబట్టి ఈ మూవీ ఏ రేంజ్ హిట్ అయ్యిందో మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. ప్రస్తుతం 'కాంతార' ప్రీక్వెల్ తీస్తూ బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది రిలీజ్ ఉండొచ్చు.రిషభ్ శెట్టి విషయానికొస్తే.. కర్ణాటకలోని కుందాపుర అనే ఊరిలో పుట్టాడు. జూ.ఎన్టీఆర్ అమ్మది కూడా ఈ ఊరే. అందుకేనేమో తారక్ అంటే రిషభ్ శెట్టి చాలా ఇష్టం. ఈ విషయాన్ని పలుమార్లు చెప్పాడు కూడా. 2012 నుంచి శాండల్ వుడ్లో ఉన్న రిషభ్ శెట్టి.. 'కాంతార' మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఇక ఫ్యామిలీ విషయానికొస్తే.. ప్రగతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 'కాంతార'తో సంచలన హిట్ కొట్టిన ఇతడు.. ప్రీక్వెల్తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడో?(ఇదీ చదవండి: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!) -
ప్రశాంత్ నీల్ ఇంట్లో జూ ఎన్టీఆర్, రిషబ్ శెట్టి.. కారణం ఇదే
సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా కలిశారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన తారక్.. దేవర షూట్ కోసం ఎక్కడికైనా వెళ్తున్నారా అని అనుకున్నారు అందరూ.. కానీ ప్రశాంత్ నీల్ ఇంట్లో మార్చి 1న ఏదో శుభకార్యం ఉండగా తన సతీమణితో కలిసి ఆయన అక్కడకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వారితో పాటుగా మైత్రీ మూవీ మేకర్స్ అధినేత యలమంచిలి రవి శంకర్ కూడా ఉన్నారు. ప్రశాంత్ నీల్ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు) ప్రశాంత్ నీల్ ఇంట్లో జరుగుతున్న ఒక కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తన సతీమణి లక్ష్మీ ప్రణతితో పాటుగా వెళ్లారు. అదే కార్యక్రమానికి 'కాంతార' హీరో రిషబ్ శెట్టి కూడా తన సతీమణి ప్రగతితో రావడం జరిగింది. అక్కడ వారందరూ కలిసి దిగిన గ్రూప్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తారక్‌తో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం కనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. 'కాంతారా', 'కేజీఎఫ్' సిరీస్‌లను హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అలా ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఇప్పుడు ఈ ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఫోటోపై అభిమానులు భారీగా లైకులతో క్లిక్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్- జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో రిషబ్ శెట్టి కూడా నటించనున్నారా అనే ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. -
Jr NTR Photos: ప్రశాంత్ నీల్ ఇంట్లో సందడి చేసిన జూ ఎన్టీఆర్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
గర్ల్ ఫ్రెండ్ అంటూ విష్ చేసిన కాంతార హీరో.. వీడియో వైరల్!
కాంతార మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఆ ఒక్క సినిమాతో అతనిపేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా రిలీజైన కాంతారకు సినీ ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కన్నడలో స్థానిక భూత కోలా క్రీడ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాంతార సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ప్రీక్వెల్ రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే 'కాంతారా చాప్టర్- 1' ఫస్ట్ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ చిత్రం విడుదల కానుంది. అయితే తాజాగా రిషబ్ తన భార్య ప్రగతి పుట్టినరోజు సందర్భంగా స్పెషల్‌గా విష్ చేశారు. తన ఫ్యామిలీతో కలిసి ఉన్న క్షణాలను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. బర్త్ డే రోజు తన భార్య ప్రగతికి గుర్తుండిపోయేలా శుభాకాంక్షలు తెలిపారు. రిషబ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'నా బర్త్ డే గర్ల్‌ఫ్రెండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఆనందం ఒక వరంలా ఉండనివ్వండి. ఈ బంధం చిరస్థాయిగా నిలిచిపోనివ్వండి. మీ ఆయురారోగ్యాలు, మా ఆప్యాయత ఎల్లప్పుడూ పెరుగుతూనే ఉంటాయి.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. వీరిద్దరి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. View this post on Instagram A post shared by Rishab Shetty (@rishabshettyofficial) -
పాఠశాలను దత్తత తీసుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి
-
పుట్టిన ఊరు రుణం తీర్చుకునేందుకు రిషబ్ శెట్టి అడుగులు
నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి 'కాంతార'తో యావత్తు సినీ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. ఆ సినిమా ఘనవిజయం తర్వాత ఆయన పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. మొదటి భాగం హిట్ కొట్టడంతో 'కాంతార ఏ లెజెండ్: ఛాప్టర్ 1' ప్రీక్వెల్ కూడా త్వరలో రానుంది. 54వ 'ఇఫి' వేడుకలో 'కాంతార'కు సిల్వర్ పీకాక్ అవార్డు దక్కింది. ఈ పురస్కారం దక్కించుకున్న తొలి కన్నడ చిత్రం ఇదేనని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఈ సినిమా విజయంతో ఆయన ఒక పౌండేషన్‌ను ఏర్పాడు చేశాడు. ఇందులో భాగంగ తన సొంత గ్రామానికి తనకు చేతనైన సాయం చేయాలని ముందుకు వచ్చాడు. దక్షిణ కర్ణాటకలోని కెరటి గ్రామానికి చెందిన వ్యక్తి రిషబ్ శెట్టి. సినిమా వల్ల ప్రస్తుతం ఆయన ఉన్నత స్థాయిలో ఉన్నాడు. దీంతో తను పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. శెట్టి ఫౌండేషన్ ద్వారా తన సొంత గ్రామంలో ఉండే పాఠశాలకు సహాయాన్ని అందించాడని సమాచారం. కర్ణాటకలోని ప్రభుత్వ పాఠశాలన్నింటిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడట. దీని ద్వారా కనీస అవసరాలే లేని కన్నడ పాఠశాలలను ఎలా అభివృద్ధి చేయాలి వంటి ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నాడట. ఇందులో మరికొందరిని భాగస్వామ్యం చేసేందుకు ఆయన చూస్తున్నారట. ఇందులో భాగంగా తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలను తాజాగా రిషబ్ సందర్శించారు. పాఠశాలను దత్తత తీసుకోవడంపై ఆయన ప్రాథమిక చర్చ జరిపారు. అంతేకాకుండా ప్రస్తుత విద్యార్థులు, ఉపాధ్యాయులతో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం పాఠశాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారని సమాచారం. త్వరలో ఆయన ఈ విషయంపై క్లారటీ ఇస్తారని తెలుస్తోంది. -
'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!
సాధారణంగా ఓ సినిమా తీస్తున్నారంటే చాలామంది యువనటీనటులు.. అందులో ఛాన్స్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ అలాంటి ఓ పాన్ ఇండియా మూవీ కోసం ఏకంగా ప్రముఖ హీరోయినే ప్రయత్నిస్తే? అవును మీరు సరిగానే విన్నారు. ప్రస్తుతం 'కాంతార' మూవీకి ప్రీక్వెల్ తీసే పనిలో హీరో రిషభ్ శెట్టి బిజీగా ఉన్నాడు. ఇలాంటి టైంలో క్రేజీ హీరోయిన్.. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని బతిమాలాడుకుంది. ఏంటి విషయం? కన్నడ హీరో రిషభ్ శెట్టిని.. రాత్రికి రాత్రే పాన్ ఇండియా స్టార్‌ని చేసి మూవీ 'కాంతార'. విలేజ్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమా గతేడాది దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్ తీస్తున్నారు. మొన్నీమధ్యే పోస్టర్ రిలీజ్ చేయగా, తెగ వైరల్ అయిపోయింది. (ఇదీ చదవండి: లక్కీ హీరోయిన్ కోసం నిర్మాతగా మారిన 'జైలర్' డైరెక్టర్) ఛాన్స్ అడుక్కుంది అయితే 'కాంతార-1' సినిమాలో తనకు ఓ ఛాన్స్ ఇవ్వాలని.. ఎక్స్ (ట్విట్వర్) వేదికగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పోస్ట్ పెట్టింది. 'రిషభ్ శెట్టి, హోంబలే ఫిల్మ్స్.. కాంతార చాప్టర్-1 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని నాకు తెలిసింది. ఈ ప్రాజెక్టులో భాగం కావాలని నాకు ఆశగా ఉంది. ఈ మధ్య విడుదలైన 'మంగళవారం'లో నా యాక్టింగ్‌ని అందరూ ప్రశంసించారు. మీరు కాస్త టైం కేటాయించి నా సినిమా చూస్తే మీకు కృతజ్ఞతలు చెప్పుకొంటాను. ఈ ప్రాజెక్ట్ కోసం ఆడిషన్ ఇవ్వడానికి ఏం చేయాలో దయచేసి చెప్పండి. నా పేరు రీపోస్ట్ చేస్తూ సహకరించే అభిమానులు థ్యాంక్స్' అని పాయల్ రాసుకొచ్చింది. మరి పాయల్ కోరుకున్నట్లు.. 'కాంతార-1' హీరో గానీ మూవీ యూనిట్ గానీ ఈ ట్వీట్ చూసి, ఛాన్స్ ఇస్తే మాత్రం పాయల్ ని అదృష్టం వరించినట్లే. చూద్దాం మరి ఈ బ్యూటీ అనుకున్నది జరుగుతుందో లేదో? (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) @shetty_rishab @hombalefilms I've learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Magalavaaram, has garnered significant praise for my performance. I would appreciate if you could spare some time to… — paayal rajput (@starlingpayal) December 12, 2023 -
నెట్టింట్లో వైరల్ అవుతున్న 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఫ్యామిలీ ఫోటోలు


