రెండేళ్ల క్రితం వచ్చిన కాంతార మూవీ బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.400 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టికి ఇటీవలే ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఇతడి పేరు నేషనల్ వైడ్ మార్మోగిపోతోంది. ఇలాంటి సమయంలో రిషబ్ శెట్టి బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఆ మూడే నాకు గర్వకారణం
ఓ మీడియాతో మాట్లాడుతూ.. భారతీయ చిత్రాలు.. ముఖ్యంగా బాలీవుడ్ మూవీస్.. మన దేశాన్ని నెగెటివ్‌గా చూపిస్తున్నాయి. అలాంటి చిత్రాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయం. నా వరకైతే దేశం, నా రాష్ట్రం, నా భాష.. ఈ మూడింటినీ చూసి గర్వంగా ఫీల్ అవుతుంటాను. వీటిని ప్రపంచానికి పాజిటివ్‌గా చూపించాలని నమ్ముతాను. అందుకోసం నావంతు ప్రయత్నిస్తున్నాను అని పేర్కొన్నాడు.
అది తప్పు కాదా?
ఇది చూసిన జనాలు.. హీరో వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అదెప్పటినుంచో అలాంటి సినిమాలే ఎక్కువగా తీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. నీ సినిమాల్లో అశ్లీలత లేనట్లే మాట్లాడుతున్నావంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతదాకా ఎందుకు? కాంతార సినిమాలో హీరోయిన్ నడుము గిల్లలేదా? అది తప్పు కాదా? అని ప్రశ్నిస్తున్నారు.
ఆ సీన్స్ ఆపేయండి..
ఈయన ఒక్క సినిమా హిట్ కొట్టి హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పిల్‌బర్గ్‌లా ఫీలవుతున్నాడు. కాంతారకు అనవసరంగా హైప్ ఇచ్చారు. దాన్ని ఒకసారి చూశాక మళ్లీ చూడాలన్న ఆసక్తే రాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. సౌత్ సినిమాల్లో హీరోయిన్ల నడుము గిల్లే సన్నివేశాలు ఆపేయండి.. చూడటానికి చాలా అభ్యంతరకరంగా ఉంది. అవి ఆపేశాక నీతులు చెప్పండి అని మరో వ్యక్తి ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార ప్రీక్వెల్ సినిమా చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment