Rishab Shetty Kantara Movie Beats Karthikeya 2 With Record Collections, Deets Inside - Sakshi
Sakshi News home page

Kantara Movie Collections: కాంతార మరో రికార్డ్.. ఆ జాబితాలో ఏడో చిత్రంగా..!

Published Fri, Nov 4 2022 6:10 PM | Last Updated on Fri, Nov 4 2022 7:10 PM

Rishab Shetty Movie Kantara Creates Another Record In Bollywood - Sakshi

రిషబ్‌శెట్టి దర్శకుడిగా, హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ 'కాంతారా'. ఈ చిత్రం అన్ని భాషల్లోనూ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.  తాజాగా బాలీవుడ్‌లోనూ రిలీజైన ఈ సినిమా మరో రికార్డును సాధించింది. హిందీలో డబ్బింగ్ అయిన సినిమాల్లో అత్యధిక గ్రాస్‌ వసూళ్లు సాధించిన ఏడో చిత్రంగా నిలిచింది. బాలీవుడ్‌లో ఇప్పటి దాకా రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు ప్రముఖ ట్రేడ్‌ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్ చేశారు. మొదటి రెండు వారాల కంటే.. మూడో వారం అత్యధిక కలెక్షన్లు సాధించినట్లు వెల్లడించారు. 

ఈ ఏడాది విడుదలైన డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'కాంతార' నిలిచింది. టాలీవుడ్ హీరో నిఖిల్ చిత్రం 'కార్తికేయ2' కలెక్షన్ల రికార్డును అధిగమించింది. ఇతర భాషల్లో తెరకెక్కిన చిత్రాలు బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన జాబితాలో ‘బాహుబలి2’ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాత ‘కేజీయఫ్2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘2.ఓ’, ‘బాహుబలి’, ‘పుష్ప’ సినిమాలు ఉన్నాయి. అన్ని భాషల్లో కలిపి ‘కాంతార’ రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళ్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement